Deputy Superintendent of Police (DSP)
-
20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరిట శుక్రవారం విడుదలయ్యింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆ డీఎస్పీలను ఆర్డర్ కాపీల్లో ఆదేశించారు.ఇదీ చదవండి: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్ -
గుప్తనిధి, బంగారం అంటూ రూ. 17 లక్షలు స్వాహా చేసిన డీస్పీ సారు!
కామారెడ్డి క్రైం: ఎవరైనా మోసం చేస్తే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. అయితే బాధితు లకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే దొంగ బంగారం పేరిట డబ్బులు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన డీఎస్పీ మదన్‌లాల్ ఏడు నెలల క్రితం కామారెడ్డి డీసీఆర్బీ విభాగానికి బదిలీపై వచ్చాడు. జిల్లా పోలీస్ కార్యాలయానికి సమీపంలోని ఓ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని నివసిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన వ్యక్తికి తవ్వకాల్లో గుప్త నిధులు లభించాయని, రూ.6 లక్షలకే కిలో చొప్పున బంగారాన్ని ఇప్పిస్తానని నమ్మించాడు. తాను పోలీసునని, అంతా చూసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు వ్యక్తి.. రూ. 17 లక్షలకుపైగా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు 15 రోజుల క్రితం జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించాడు. దీంతో ఈనెల 6న డీఎస్పీ మదన్‌లాల్‌ను ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అంతేకాకుండా దేవునిపల్లి ఠాణా లో ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు జరిగిన ఘ టనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రాష్ట్ర అధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో డీఎస్పీ మదన్‌లాల్‌ను సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో డీఎస్పీతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా గతంలో సదరు డీఎస్పీ పనిచేసిన ఇతర చోట్ల కూడా ఫిర్యాదులు ఉన్నాయని సమాచారం. జిల్లాకు వచ్చిన తర్వాత కూడా మాయమాటలు చెప్పి చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్
టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (డీఎస్పీ) నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్ సిరాజ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్-2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రూప్-1 ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. తనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.30 ఏళ్ల సిరాజ్ 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సిరాజ్ టీ20 వరల్డ్‌కప్-2024తో పాటు అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో విశేషంగా రాణించాడు. సిరాజ్ తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేశాడు.సిరాజ్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 28 టెస్ట్‌లు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇందులో 161 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ అందరూ బౌలర్లలా కాకుండా ఆల్ ఫార్మాట్ బౌలర్‌గా రాటుదేలాడు. ఐపీఎల్ ద్వారా సిరాజ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సిరాజ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడతాడు. ఐపీఎల్లో అతను 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. చదవండి: చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ -
చంద్రగిరి DSPపై వేటు
-
చంద్రగిరి DSPపై వేటు
-
ట్యాపింగ్‌కు సహకరించిందెవరు? ప్రణీత్‌రావుపై ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును మూడోరోజు మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తోంది. ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఎస్బీఐ అధికారులు ఎవరెవరు సహకరించారన్నదానిపై పోలీసులు ప్రణీత్ నుంచి కూపీ లాగుతున్నారు. సహకరించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు ఎక్కడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్‌లు దొరికిన తర్వాత వాటి నుంచి డేటా పునరుద్ధరిస్తే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కీలక విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చెప్పిన నెంబర్లు మాత్రమే ప్రణీత్‌రావు ట్యాప్ చేయలేదని.. పలువురు రాజకీయ నేతలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన నెంబర్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బేగంపేట ఎస్ఐబీలోని కీలకమైన లాగర్ రూంను ఇందుకు వినియోగించుకున్నారని.. అలాగే అక్కడి సిబ్బందిని ప్రమోషన్ ఆశ చూపించి రహస్యాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డట్లు తేలింది. ప్రస్తుతం ప్రణీత్‌రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న స్పెషల్ టీం.. అతని డైరీలో దొరికిన వందల నెంబర్లపై ప్రశ్నలు గుప్పిస్తూ మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది. ఇదీ చదవండి.. ఇబ్రహీంపట్నంలో పరువు హత్య -
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏకంగా 62 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీ ఆఫీస్‌లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్‌లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు బదిలీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
చిన్న వివాదం.. ఆ డీఎస్పీ ప్రాణం తీసింది!
ఛండీగఢ్: చిన్న వివాదం పంజాబ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఓ ఆటోడ్రైవర్‌తో గొడవ కారణంగానే ఆయన ప్రాణం పోయింది. అయితే.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు జలంధర్ పోలీసులు. అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారి(డీఎస్పీ స్థాయి) దల్బీర్ సింగ్ డియోల్ (54)హత్యకు గురికావడం పంజాబ్‌లో అలజడి రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ ఆటో డ్రైవర్ అని, అతనితో దల్బీర్ వాగ్వాదానికి దిగడమే హత్యకు కారణమైందని చివరకు పోలీసులు నిర్ధారించారు. ఏం జరిగిందంటే.. దల్బీర్ సింగ్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపాలని సదరు ఆటో డ్రైవర్‌ను కోరారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణగా మారే క్రమంలో.. దల్బీర్ దగ్గర ఉన్న సర్వీస్ తుపాకీని లాక్కుని ఆ డ్రైవర్ కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపై జలంధర్ నగర శివారులో ఓ కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు జుగల్ కిషోర్ అనే పోలీసాధికారి ఆ మృతదేహాన్ని మొదటగా గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు మొదలైంది. ఛేదించారిలా.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఓ ఆటోను గుర్తించారు. దాని నెంబర్ ప్లేట్ ఆధారంగా.. అక్కడి నుంచి ఉన్న మూడు దారుల్లో ట్రేస్ చేసే యత్నం చేశారు. అదే సమయంలో ఆ కాలువకు దగ్గర్లోని టవర్‌కు వచ్చిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగానూ సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. చివరకు నిందితుడిని ఆటో డ్రైవర్ విజయ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆసియా క్రీడల్లో దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అందుకే 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు. -
తిరుమల: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 1,805వ మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చదవండి: ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్‌పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్‌ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్‌లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్‌లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్‌లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్‌కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్ పాటలు, వీడియోలు
సాక్షి,హైదరాబాద్: పోలీసు నినాదం గతి తప్పింది. మహిళలకు రక్షణకుకల్పించాల్సిన పోలీసే వేధింపులకు గురి చేశాడు. సమస్య ఉందని ఆశ్రయించిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) డీఎస్పీ కిషన్ సింగ్జీపై చైతన్యపురి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్గదర్శి కాలనీకి చెందిన మహిళ (48) తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డి్రస్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. 2020లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో సీఐడీ డీఎస్పీ కిషన్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శిక్షణ తరగతులకు హాజరుకావాలని అతను ఆమెకు సూచించాడు. సీనియర్ పోలీసు అధికారి కావటంతో అంగీకరించిన బాధితురాలు.. తన ఫోన్ నంబరును పోలీసు అధికారికి ఇచి్చంది. అప్పటి నుంచి ఆ పోలీసు ఉన్నతాధికారి ఆమె వాట్సాప్ నంబరుకు రొమాంటిక్ హిందీ పాటలు, సెన్సార్ చేయని వీడియోలను పంపించడం మొదలుపెట్టాడు. శిక్షణ తరగతులకు చీర కట్టుకోవాలని రావాలంటూ ఒత్తిడికి గురి చేసేవాడని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సాయం కోసం వెళితే.. కిషన్‌సింగ్ ప్రవర్తన బాగా లేకపోవటంతో ఫోన్ కాల్స్‌కు, వీడియోలకు ఏడాది పాటు స్పందించడం మానేసింది. కొన్ని నెలల క్రితం హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం బాధితురాలు సదరు సీఐడీ పోలీసు అధికారిని సంప్రదించింది. దీన్ని ఆసరా చేసుకున్న అతను.. తనతో చనువుగా ఉండాలని, తనను కౌగిలించుకోవాలని పట్టుబట్టాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయనని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు.. చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు కిషన్‌సింగ్‌పై 354 (డి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుని మరిన్ని వివరాలు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి (చదవండి: బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి) -
41 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–సివిల్ (డీఎస్పీ)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు (పీఈబీ) సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, ఈ పోస్టింగ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని శనివారం డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే పెద్దసంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఇక వచ్చేనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రబడ్జెట్ సమర్పణ, వచ్చేనెల 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తర్వాతే పెద్ద ఎత్తున పలు స్థాయిల్లోని ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
Fact Check: బైక్‌పై బాలుడి మృతదేహం వార్తల్లో అసలు వాస్తవం ఇదీ..
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్‌లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు. ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం' -
వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ
చెన్నై: మోస పోయిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. తప్పు చేసిన వారిని శిక్షించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్లది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఓ ఉన్నత అధికారి నీచానికి దిగజారారు. తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్‌లో పంపి రాక్షస ఆనందం పొందాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడినట్లు డీఎస్పీ కామ క్రీడల వ్యవహారం అతన్ని చిక్కుల్లో పడేసింది. ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులకు రాసిన లేఖలో.. తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్‌ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది. చదవండి: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసిన యువకుడు.. ఇద్దరిని ఇంటికి పిలిపించి.. -
నల్గొండ జిల్లా: బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం
-
Manisha Ropeta: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్
దాయాది దేశం పాకిస్తాన్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ హిందువులకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని చిన్నచూపు చూస్తారు. కానీ, తాజాగా ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్లో సంచలనం క్రియేట్ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన హిందూ మహిళ మనీషా రోపేటా(26) రికార్డులు బ్రేక్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుందన్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా, ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ చెందిన మనీషా.. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. పాకిస్తాన్లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా...యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ -
తెలంగాణ: డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. అభ్యర్థుల ఎత్తును 167 సెం.మీ నుంచి 165 సెం.మీకు తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ డిమాండ్‌కు తలొగ్గి.. ఇప్పుడు ఎత్తు తగ్గించి నిరుద్యోగులకు ఊరట ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చదవండి👉తెలంగాణ పోలీస్ నియామక అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్ -
బాక్సర్ లవ్లీనాకు బంపరాఫర్.. డీఎస్పీగా ఉద్యోగం, అదనంగా నెలకు రూ.లక్ష
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్ చేరారు. అయితే వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్తో జరిగిన సెమీస్‌లో ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు కోటి రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు. నెలవారీ జీతంతోపాటు లవ్లీనాకు బాక్సింగ్ ట్రైయినింగ్ ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. దాంతోపాటు పంజాబ్‌లోని పటియాలలో కోచింగ్ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌తో గువాహటిలోనే ట్రయినింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలిస్ శాఖకు కృతజ్ఞతలు చెప్పిన లవ్లీనా.. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమేనని అన్నారు. (చదవండి: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి రజని) -
శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం
తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. ఈ ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) శుక్రవారం (భారత కాలమాన ప్రకారం) పీస్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఉన్నత విద్యనభ్యసించి పోలీసుగా... హైదరాబాద్‌కు చెందిన సీతారెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. నగరంలోనే వివిధ యూనివర్శిటీల్లో ఎంఏ (ఇంగ్లీష్), ఎంఏ (సైకాలజీ), ఎంఈడీ, సైబర్ క్రైమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో సబ్–ఇన్స్పెక్టర్గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్, డీఎస్పీ హోదాల్లో నల్లగొండ టూ టౌన్, జీడిమెట్ల, సరూర్‌నగర్ ఉమెన్, పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పని చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా సీతారెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. రెండోసారి ఈ దళంలో పని... అంతర్గత ఘర్షణలతో అతలాకుతలం అవుతున్న సూడాన్, తైమోర్ తదితర దేశాల్లో శాంతి పరిరక్షణకు, అక్కడి పోలీసు విభాగానికి శిక్షణ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ శాంతి పరిరక్షక దళాన్ని వినియోగిస్తోంది. వివిధ దేశాలకు చెందిన పోలీసు విభాగాల నుంచి ఏడాది సమయం పని చేయడానికి అధికారులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో పాటు డ్రైవింగ్, షూటింగ్ వంటి పోటీలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికే దళంలో పని చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి మొత్తం 29 మందికి ఈ అవకాశం దక్కగా... వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సీతారెడ్డికే ఈ అవకాశం దక్కింది. ఇలా ఐక్యరాజ్య సమితి దళంలోకి ఈమె ఎంపిక కావడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండుసార్లు ఎంపికైన వాళ్లు ఇంకెవరూ లేరు. జూలై నుంచి జూబాలో విధులు... యూఎన్ శాంతిపరిరక్షక దళంలో పని చేయడానికి సీతారెడ్డి ఈ ఏడాది జూలై 19న సౌత్ సూడాన్ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడి జూబా ప్రాంతంలో ఉన్న పోలీసు ట్రై నింగ్ అండ్ సెన్సిటైజేషన్ యూనిట్లో పోలీసు అడ్వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేస్తూ ఎలాంటి ప్రతికూల రిమార్క్స్ లేని వారిని ఎంపిక చేసిన యూఎన్ శుక్రవారం పీస్ మెడల్, సర్టిఫికెట్ అందించింది. వీటిని అందుకున్న వారిలో సీతారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘సూడాన్ పోలీసుల్లో శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం మా విధి. పూర్తి ప్రతికూల వాతావరణంలో పని చేయడం కొత్త అనుభవాలను నేర్పిస్తోంది. యూఎన్ మార్గదర్శకాల ప్రకారం వారికి నేర్పడంతో పాటు ఎన్నో కొత్త అంశాలను ఇక్కడ నేర్చుకోగలుగుతున్నా’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సభ్యురాలిగా సీతారెడ్డి (ఎడమనుండి రెండవ వ్యక్తి) – శ్రీరంగం కామేష్ ,సాక్షి సిటీ బ్యూరో -
తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్! -
స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ
జైపూర్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో రిసార్ట్‌పై పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పోలీస్ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్‌లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీ హీరాలాల్ సైనీ. జైపూర్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఆయన జూలై 13వ తేదీన ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌కు వెళ్లాడు. రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ఇద్దరూ ఆడుకుంటున్నారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరూ సన్నిహితంగా కలిశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కానిస్టేబుల్ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంది. ఆ వీడియోలో ఇద్దరూ జలకాలాడుతూ మైకంలో మునిగి తేలుతున్నట్లు ఉంది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. వెంటనే రిసార్ట్‌పై దాడి చేసి ఆ అధికారితో పాటు కానిస్టేబుల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కన్న కొడుకు (6) కళ్లెదుటే ఆ కానిస్టేబుల్‌తో ఆయనతో సన్నిహితంగా మెలగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరినీ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. నాగౌర్ జిల్లాలోని చిట్టావా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ భర్త ఫిర్యాదు చేశాడు. చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం -
భారీ నగదుతో పరుగులు తీసిన డీఎస్పీ.. విషయం ఏంటంటే..
తిరువొత్తియూర్: తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షల నగదుతో డీఎస్పీ పరుగులు తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుచి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ కేంద్రం ఉంది. ఇక్కడ గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేస్తుండగా, కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తాడు. ఇది చూసిన పోలీసులు అతన్ని వెంబడించి.. పట్టుకున్నారు. విచారణలో పరిగెత్తిన వ్యక్తి డీఎస్పీ అని స్నేహితులతో కలిసి రూ. 11 లక్షల నగదును తీసుకొని తిరుచ్చికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం అతను మాట్లాడుతూ... తనిఖీ కేంద్రంలో మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి.. విజిలెన్స్ అధికారులు అనుకొని నగదుకు తగిన ఆధారాలు లేకపోవడంతో పరిగెత్తినట్లుగా తెలిపాడు. దీంతో డీఎస్పీ తో పాటు.. అతని స్నేహితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శునకం నోటిలో పసికందు తల -
వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా
గాంధీనగర్: పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తమే గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. చదవండి: భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్ శాఖ).. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్ల నిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలైట్‌గా నిలిచింది. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేయడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లల్లో అసలుసిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే -
లవ్లీనాకు భారీ ప్రోత్సాహకాలు: డీఎస్పీ ఉద్యోగం.. రూ. కోటి నజరానా
డిస్పూర్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్‌కు అసోం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు ప్రకటించింది. లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేయడంతో పాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లవ్లీనాకు గురువారం గౌహతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం బాక్సర్ లవ్లీనాను రాష్ట్ర పోలీసుశాఖలో డీఎస్పీగా చేరమని అభ్యర్థించారు. అంతేకాక ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అలానే లవ్లీనా కోచ్‌కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం. అలానే అసోంలోని గోలాఘాట్ జిల్లాలోని సౌపాతర్‌లో లవ్లీనా బోర్గోహెయిన్ పేరు మీద రూ. 25 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు హిమంత శర్మ తెలిపారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ స్వయంగా గౌహతి విమాన్రాశయం చేరుకుని లవ్లీనాకు స్వాగతం పలికారు. అనంతరం బాక్సర్ భారీ కటౌట్లతో అలంకరించిన బస్సులో లవ్లీనాను ఎక్కించుకుని సిటీ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లవ్లీనాకు సన్మానం జరిగింది. సాయంత్రం లవ్లీనా.. గవర్నర్ జగదీష్ ముఖిని కూడా కలిసే అవకాశం ఉంది. -
ఏపీలో 22 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం -
బిహార్ : తొలిసారి డీఎస్పీగా ముస్లిం యువతి
పట్నా: బిహార్ రాష్ట్రం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనుకబడి ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, కొన్ని ముస్లిం కుటుంబాలలో మహిళల విద్యపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్1 సర్వీస్‌లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తానా అనే యువతి చరిత్రను సృష్టించింది. ఆమె తాజాగా, ప్రకటించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికైంది. అయితే, బిహార్ రాష్ట్రంలో, ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్‌ను సాధించిన తొలి యువతి కూడా రజియానే. దీంతో ఇప్పుడిమే వార్తల్లో నిలిచింది. కాగా, రజియాతో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. రజియా తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అన్సారీకి 7 గురు సంతానం. వీరిలో రజియా అందరికన్నావయసులో చిన్నది. ఆమెకు ఒక అన్నయ్య .. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్‌ను జోధ్‌పూర్‌లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైన ప్రభుత్వ సర్వీస్ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్‌ను ప్రారంభించింది. ఉద్యోగం చేస్తునే మిగతా సమయంలో ప్రిపరేషన్ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మానాన్న గారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయను కలను, నా ఆశయాన్ని పూర్తిచేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాలలో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికే తాను, కోవిడ్ బారిన పడి కోలుకున్నానని చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. చదవండి: Shocking: స్టోర్‌లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ.. -
చావు అంచున డీఎస్పీ.. చచ్చాక పరిహారం ఎందుకంటూ వీడియో
పంజాబ్‌లో సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేసింది. నా ట్రీట్మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. ఛంఢీఘడ్: డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్ సింగ్‌కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్స్‌గ్రేషియాపై విమర్శలు డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు. ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు. Grateful to Punjab CM @capt_amarinder for supporting the treatment of DSP Harjinder Singh, after his recovery from #COVID...1/2 — DGP Punjab Police (@DGPPunjabPolice) June 2, 2021 మూడువారాల తర్వాత.. ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్ సింగ్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్‌కు డిపార్ట్మెంట్ తరపున లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు. చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు -
పాక్‌లో హిందూ డిఎస్పీ
కొద్ది రోజుల క్రితం వరకు మనీషా రూపిత కరాచీలోని జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్లో వైద్యురాలు. ఇప్పుడు ఆమె సిం«ద్ ప్రావిన్సులోని జకోబాబాద్ జిల్లా డిఎస్పీ! ‘డీఎస్పీలు వస్తుంటారు పోతుంటారు’ అనుకోవచ్చు. ఇక్కడ అలా అనుకోడానికి లేదు. పాకిస్తాన్‌లోనే తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత! అయితే.. సర్వీస్ కమిషన్ విజేతగా సింద్ ప్రావిన్స్‌లోని హిందూ మహిళలకు తననొక ప్రతినిధిగా రూపిత భావించడం లేదు. సింద్ గ్రామీణ మహిళలందరికీ తన విజయం ఒక ప్రేరణ అవాలని మాత్రమే కోరుకుంటున్నారు! ‘సింద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ (ఎస్పీఎస్సీ) పరీక్షలో ర్యాంక్ సంపాదించి, ఈ ఘనతను సాధించారు రూపిత. మొదట ఆమె ‘సెంట్రల్ సుపీరియర్ సర్వీసు’ (మన దగ్గర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రాశారు. అదొక్కటే అత్యున్నతస్థాయి ఉద్యోగాలకు మార్గం అనుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు.. సిం«ద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ర్యాంకు సాధించినా కూడా డైరెక్టు నియామకాలు ఉంటాయని తెలిసింది. పట్టుపట్టి బుక్స్ ముందు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు డీఎస్పీ సీట్లో కూర్చోబోతున్నారు. నియామక ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు చేపట్టడమే తరువాయి! మనీషా రూపిత, పాక్ పోలీస్ దళం ఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడై, ర్యాంకు సాధించి, డీఎస్పీ అయ్యాక గానీ రూపిత పాకిస్తాన్‌లోనే మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ అన్న సంగతి ఎవరి దృష్టికీ రాలేదు. పాకిస్తాన్లో కపిల్ దేవ్ అనే ఒక హక్కుల కార్యకర్త ‘ప్రథమ’ అనే ప్రత్యేకత కలిగిన ఈ నియామకం గురించి తన ట్విట్టర్లో వెల్లడించడంతో రూపితకు అభినందనలు మొదలయ్యాయి. ‘‘పాకిస్తాన్‌లోని హిందువులందరికీ ఇది గర్వకారణం’’ అని ఆయన ట్వీట్ చేశారు. రూపిత జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్లో మెడికల్ థెరపీ డాక్టర్‌గా పని చేస్తున్న రూపిత కు కంబైండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (సి.సి.ఇ) అయిన ఎస్పీఎస్సీ రాసి గవర్నమెంట్లో డైరెక్ట్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్‌గా సేవలు అందిస్తూనే సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ‘‘అయితే ఇదేమీ అంత తేలికైన ప్రయాణం కాదు. 2007 నాన్నగారు చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయాం. అయినా అమ్మ మా చదువును మాన్పించలేదు’’ అంటారు రూపిత. ఫీజులు, సర్వీస్ కమిషన్ పరీక్ష పుస్తకాలు కొనడం కోసం ఆమె ట్యూషన్ లు చెప్పారు. ‘‘గెలిచింది నేనే అయినా గెలిపించింది మా అమ్మే. ఆమె కలను నేను నెరవేర్చగలిగాను. అదే నా సంతోషం’’ అంటున్నారు రూపిత. తన విజయం సింద్‌లోని గ్రామీణ మహిళలందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. -
డీఎస్పీగా హిమా దాస్ నియామకం
డిస్పూర్: భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పదవిలో నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమా దాస్‌కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నియామక పత్రాలు అందజేశారు. 2018లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Welcome Aboard! Heartiest Congratulations to @HimaDas8 and all 597 newly selected Sub Inspectors of Assam Police. Together, we'll write a new saga of people friendly policing in the State, to serve the citizens of Assam.@CMOfficeAssam @DGPAssamPolice#SIsRecruitment pic.twitter.com/KBeFUGHLuW — Assam Police (@assampolice) February 26, 2021 -
డీఎస్పీగా హిమదాస్
భారత యువ అథ్లెట్ హిమ దాస్‌ను ప్రోత్సహిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఈ అమ్మాయి ప్రస్తుతం 400 మీటర్ల పరుగు జూనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కూడా. -
స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు
గౌహతి: స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. లీస్, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి విలేకరులకు తెలిపారు. అసోం పోలీస్ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్‌ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4*400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్స్‌లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఏదైనా ఫార్మాట్లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది. -
కామారెడ్డి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
-
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచించారు. చదవండి: ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు చదవండి: కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు! -
వైద్య వృత్తిని వదిలి డీఎస్పీగా..
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఆయన ఒక డాక్టర్.. గిరిజనుల సమస్యలకు చలించిపోయారు.. వైద్యవృత్తిని నిర్వహిస్తూనే వారి సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.. ఈ సమయంలో గిరిజనులు చూపించిన ఆప్యాయతతో వైద్య వృత్తి నుంచి అడ్మినిస్ట్రేటివ్ వైపు మరిలారు.. పాలనా విభాగంలో ఉంటే మరిన్ని సమస్యలు పరిష్కరించవచ్చనే తలంపుతో గ్రూప్–1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. వైద్యుడిగా పేర్గాంచి.. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బి.రవికిరణ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన డీఎస్పీగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు. వృత్తిరీత్యా ఈయన డాక్టర్. 2002–2008లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2010లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. అక్కడ 2014 వరకు విధులు నిర్వహించి, తర్వాత అదే జిల్లా అక్కులపేట పీహెచ్‌కీ బదిలీ అయ్యారు. వైద్యాధికారిగా పీహెచ్‌సీని ఆధునీకరించారు. కార్పొరేట్ ఆస్పత్రి స్థాయిలో పీహెచ్‌సీని మార్పు చేసి వైద్య సేవలు అందించారు. 2016, 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆస్పత్రి, ఉత్త వైద్యులుగా రవికిరణ్ పురస్కారాలు అందుకున్నారు. 2017, 2018లో విశాఖలో పనిచేశారు. బీజం పడిందిలా.. రవికిరణ్ అక్కులపేట పీహెచ్సీలో పనిచేస్తుండగా గిరిజనుల సమస్యలు గుర్తించారు. అల్లిపల్లిగూడెం గిరిజనులు, గిరిజనే తరులు మధ్య భూవివాదాలు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. అప్పుడే ఆయనకు అడ్మినిస్ట్రేటర్ కావాలనే ఆలోచన వచ్చింది. 2016లో గ్రూప్–1కు రాయగా 2017 ఫలితాలు వచ్చాయి. రవికిరణ్ 12వ ర్యాంకు సాధించారు. దీంతో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యం సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయం అని డీఎస్పీ రవికిరణ్ అన్నారు. తాను చేపట్టాల్సిన పనులపై విజన్ ఉందని, ప్రధానంగా సైబర్, ఆర్థిక నేరాలు, బాలలు, స్త్రీల వేధింపుల కేసులపై దృష్టి, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో సబ్‌డివిజన్‌లో శాంతిభద్రత పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామన్నారు. యువతను సామాజిక సేవ, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పిస్తామన్నారు. సీఎం పిస్టల్ అందుకుంటూ.. డీఎస్పీగా ఎంపికైన రవికిరణ్ 2018లో అనంతపురంలో శిక్షణ పొందారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సీఎం పిస్టల్ అవార్డును అందుకున్నారు. శిక్షణలో ఆల్‌రౌండర్‌గా నిలిచి హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా పురస్కారం పొందారు. అథ్లెటిక్స్‌లో రాణించి.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన రవికిరణ్ తండ్రి రాధాకృష్ణ, తల్లి విజయకుమారి. ఆయన భార్య విశాఖలోని మెప్మా జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. రవికిరణ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవికిరణ్ ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో అథ్లెటిక్స్‌లో రాణించారు. లాంగ్ జంప్, హైజంప్, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో 73 వరకు పతకాలు సాధించారు. మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు. -
ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి: శ్రావణి
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండడంతోపాటు.. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయమని పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి అన్నారు. కృషి.. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. 2018 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలుత కృష్ణా జిల్లా బందర్ సబ్‌డివిజన్ ఇన్చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రావణి ఈ నెల 19న పాలకొండ పోలీస్ సబ్‌డివిజన్ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు. – పాలకొండ రూరల్ సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? డీఎస్పీ: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు. సాక్షి: పోలీస్ శాఖను ఎంచుకోవడంలో ఉద్దేశం? డీఎస్పీ: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించాను. సాక్షి: భవిష్యత్ లక్ష్యాలు? డీఎస్పీ: ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్‌లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా. సాక్షి: పాలకొండలో తొలి పోస్టింగ్ కదా.. ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు? డీఎస్పీ: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్‌డివిజన్‌లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరి ష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలి గేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా. సాక్షి: ఈ సబ్‌డివిజన్‌లో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాలున్నాయి. మావోల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎస్పీ: సరిహద్దు గ్రామాల వద్దగల చెక్ పోస్టులు మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. గస్తీ, ముందస్తు సమాచార సేకరణపై దృష్టిసారిస్తా. మా పరిధిలో గల పోలీస్ స్టేషన్లను పరిశీలించి, లోపాలు గుర్తించి ఉన్నతాధికారుల సూచనలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసి మావోయిస్టుల ప్రభావం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం లేదు. సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు? డీఎస్పీ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం. సాక్షి: నేటితరం యువతకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు? డీఎస్పీ: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషిచేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు. -
నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ
సాక్షి, ప్రొద్దుటూరు: ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసా యం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే.. రైతు కుటుంబం నుంచి... విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న శంకర్రావు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. మా ఊళ్లోని ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను. విజయవాడలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశా ను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను, గ్రూప్స్‌లో మంచి ర్యాంక్ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందాను. డి్రస్టిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా వైఎస్సార్ జిల్లాలోనే చేశాను. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించా ను. అందువల్ల జిల్లాపై మంచి అవగాహన ఉంది. చట్టపరిధికి లోబడి పని చేస్తా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్‌డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటాను అని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయింది వీరే కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్ బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్ సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి పంజాగుట్ట ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్ శంషాబాద్ ఏసీపీగా భాస్కర్ బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ -
'ఆట కంటే డ్యూటీనే కష్టంగా ఉంది'
హిసార్ : 'క్రికట్ కంటే నాకు ఈ పోలీస్ డ్యూటీనే కష్టంగా ఉందంటూ' 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. జోగిందర్ శర్మ క్రికెట్‌కు దూరమైన తర్వాత హర్యానాలోని హిసార్ జిల్లా డీఎప్పీగా విధుల నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగిందర్ కూడా అందరి పోలీసుల్లాగే డీఎస్పీగా కరోనా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు. ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికి తాను దేశం కోసమే సేవ చేస్తుండడంతో బాధ అనేది లేదని పేర్కొన్నాడు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ అవసరమా?) 'పొద్దున ఉదయం 6గంటలకు లేవడంతో నా డ్యూటీ మొదలవుతుంది. రోజూ ఉదయం 9గంటలకు డ్యూటీ నిమ్మిత్తం వెళ్లి రాత్రి 8గంటల తర్వాత కూడా ఎమర్జెన్సీ కాల్స్ ఉండడంతో 24 గంటల పాటే విధులు నిర్వహిస్తున్నా. నా పరిధిలో హిసార్ జిల్లా రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీరోజు చెక్‌పోస్ట్ వద్ద నిలబడి బస్ డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.. అవసరం ఉంటేనే బయటికి రండి అని సూచిస్తున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో దేశంలో లాక్డౌన్ ఉండడంతో యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలి నడకన వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. నేను నా టీంతో కలిసి వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలిస్తున్నాం. ఇదంతా కష్టంగా అనిపిస్తున్నా దేశంకోసమే చేస్తున్నాననుకొని సరిపెట్టుకుంటున్నా. నా కుటుంబంతో కలిసి రోహ్తక్లో నివసిస్తున్న నాకు హిసార్ ప్రాంతం 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా.. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.(నెట్వర్క్ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్ పాట్లు!) 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే. జోగిందర్ శర్మ టీమిండియా తరపున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 6వేలకు పైగా చేరుకోగా, మృతుల సంఖ్య 206కు చేరింది. -
కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు
సాక్షి, కొత్తగూడెం: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని కొత్తగూడెం డీఎస్పీ క్వారైంటన్లో పెట్టకుండా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది. అయితే, లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది. (చదవండి: బయటకు వచ్చే సాహసం చెయ్యొద్దు: సీపీ సజ్జనార్) సర్కార్ కొరడా.. క్వారంటైన్లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లఘించిన 60 మందిపై 1897 ఎపిడెమిక్ డిజీజ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్లనుంని బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది. (చదవండి: తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు: ఈటల) -
మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీఎస్పీ
సాక్షి, గుంటూరు: రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల ముసుగులో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వారి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. నిన్న(గురువారం) రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తే డ్రోన్ ఆపరేట్ చేశామని పేర్కొన్నారు. అయితే డ్రోన్‌ను కిందకు దించే సమయంలో ఆపరేటర్‌పై దాడి చేసి డ్రోన్‌ను ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ల ద్వారా మహిళలు స్నానం చేసే విజువల్స్‌ను పోలీసులు తీసుక్నునారంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాశారన్నారు. అంతేగాక గతంలో కూడా ఓ మహిళను కాలితో తన్నినట్లు తప్పుడు వార్తలు రాశాని తెలిపారు. ఇక రైతులను రెచ్చగొడుతున్న జేఎసీ నాయకుడు పువ్వాడ సుధాకర్‌ను అరెస్టు చేసే పయత్నం చేశామని, కానీ మహిళా రైతులు అడ్డుపడటంతో అరెస్ట్ చేయలేకపోయామన్నారు. హోంమంత్రి, డీజీపీలు సచివాలయానికి వస్తుంటే ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టిన వారిపై కేసు పెట్టామన్నారు. ఎమ్మెల్యే రోజాను కూడా అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతులు తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. -
నన్ను మరో జైలుకు పంపండి
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దవీందర్ సింగ్ తనను మరో జైలుకు మార్చాలంటూ.. జమ్మూలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించారు. తను గతంలో అరెస్ట్ చేసిన పులువురు ఉగ్రవాదులు కోట్బాల్వాల్ జైలులో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారితో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు. తనను కోట్బాల్వాల్ జైలు నుంచి హీరానగర్ జైలుకు పంపించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని దవీందర్ అభ్యర్థించారు. కాగా దవీందర్ అభ్యర్థనకు కోర్టు అనుమతిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్! ఇక పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్‌ను.. దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ 15 రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దవీందర్‌ను రిమాండ్‌కి పంపించింది. కాగా డీఎస్పీ దవీందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ జనవరి 11న పోలీసులకు చిక్కిన విషయం విదితమే. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయించి కల్పించినందుకు పోలీసులు దవీందర్ సింగ్‌ను ఆరెస్ట్ చేశారు. -
ఉగ్ర ఖాకీ!
చుట్టూ ఉన్న వాస్తవాలను గమనిస్తూ, తమ ఊహాశక్తికి పదనుపెట్టి, ఆ వాస్తవాలకు కాల్పనికత జోడిస్తారు సృజనాత్మక రచయితలు. కానీ ఒక్కోసారి వాస్తవం కాల్పనికతను మించిపోతుంది. ఎవరి ఊహలకూ అందనంత దిగ్భ్రాంతికరంగా వుంటుంది. జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తూ, గత ఆగస్టు 15న రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా పొందిన డీఎస్పీ దేవిందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ శుక్రవారం పోలీసులకు చిక్కిన ఉదంతం ఇటువంటిదే. నవీద్ బాబా ఇటీవలికాలంలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటివారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలోని తన ఇంట్లో ఆశ్రయమివ్వడం ఊహకందదు. పంజాబ్‌లో మిలిటెన్సీ తీవ్రంగా వున్నప్పుడు కూడా ఉగ్రవాదులకు కొందరు పోలీసు అధికారులు సహకరించిన వైనం బట్టబయలైంది. కానీ ఆ ఉదంతాలకు లేని ప్రాముఖ్యత ఇప్పుడు దీనికి రావడానికి ముఖ్యమైన కారణం వుంది. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన అఫ్జల్ గురు అప్పట్లో తన న్యాయవాది సుశీల్‌కుమార్‌కు రాసిన లేఖలో తొలిసారి దేవిందర్ పేరు ప్రసావించాడు. తనను ఈ రొంపిలోకి లాగింది ఆయనేనని ఆ లేఖలో అఫ్జల్ గురు నేరుగా చెప్పాడు. కానీ అప్పట్లో అతని మొర ఆలకించినవారు లేరు. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం అఫ్జల్ గురును దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. 2005 ఆగస్టులో అతని ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయగా, 2013 ఫిబ్రవరి 9న అతన్ని ఉరితీశారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగాక న్యాయ ప్రక్రియంతా ముగిసి ఉరిశిక్ష ఖరారు కావడానికి నాలుగేళ్ల సమయం పడితే, అతని క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి మన రాజకీయ నాయకత్వానికి దాదాపు ఎనిమిదేళ్ల వ్యవధి కావలసివచ్చింది! దురదృష్టమేమంటే... ఏ దశలోనూ అతను ప్రస్తావించిన దేవిందర్పై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటో ఎవరూ పట్టించు కోలేదు. అఫ్జల్ గురు అఫిడవిట్లో దేవిందర్ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడు బాధ్యతగల ప్రభుత్వం లోతుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదన్నది కీలకమైన ప్రశ్న. ఏ నేరంలోనైనా సంశయానికి తావులేని స్థాయిలో ప్రమేయం ఉన్నదని రుజువైనప్పుడే నిందితుడికి న్యాయస్థానాలు శిక్ష విధి స్తాయి. ఉరిశిక్ష విధించినప్పుడైతే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. అఫ్జల్ విషయంలో అది జరగలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఎందుకంటే పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి పాల్పడి, భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన మహమ్మద్‌ను కశ్మీర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిందీ, అతను పాత కారు కొనుక్కోవడానికి సాయపడిందీ అఫ్జలే. అతనితోపాటు తాను కూడా ఆ కారులో ప్రయాణించి ఢిల్లీలోనే వేర్వేరు వ్యక్తులను కలిశామని కూడా అఫ్జల్ అంగీకరించాడు. ఆ పాత కారులోనే ఉగ్రవాదులు పార్లమెంటుకొచ్చి దాడి చేశారు. అందులో పాల్గొన్న అయిదుగురు ఉగ్ర వాదులూ మరణించగా, కారు నంబర్ ఆధారంగా దాన్ని కొన్నదెవరో పోలీసులు తెలుసు కోగలిగారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు అదనంగా అఫ్జల్ ఇంకేమి చెప్పాడన్నది అలావుంచితే, ఉరిశిక్ష పడ్డాక అతను దేవిందర్ పేరును ప్రస్తావించి, ఆయన తనను చిత్రహింసలకు గురిచేశాడని, చివరకు మహమ్మద్‌ను పరిచయం చేసి, అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లమన్నాడని అఫ్జల్ గురు ఆరోపిం చాడు. అతను మరో ముఖ్య విషయం చెప్పాడు. మహమ్మద్‌ను కశ్మీర్ వాసిగా దేవిందర్ పరిచయం చేసినా, అతని ముఖకవళికలు అలా అనిపించలేదని, అతనికి కశ్మీరీ భాష కూడా రాదని, కానీ విధిలేక ఆ అధికారి చెప్పినట్టల్లా చేశానని తెలిపాడు. అప్పట్లో కశ్మీర్ పోలీసులు ఈ ఆరోపణను కొట్టిపారేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అఫ్జల్ నాటకమాడుతున్నాడని చెప్పారు. అఫ్జల్ నేర ప్రమేయంపై వారికి నమ్మకం ఏర్పడటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కానీ ఒక నిందితుడు అంత వివరంగా దేవిందర్ గురించి చెబుతున్నప్పుడు కాస్తయినా సంశయం కలగొద్దా? ఇది అఫ్జల్ కోసం కాదు...తమలో ఒకడిగా వున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు వాటి నిజానిజాలు నిర్ధారించడం అత్యవసరమని అనిపించలేదా? పోనీ ఇలా ఒక అధికారిపై ఆరోపణలు రావడం కశ్మీర్లో మొదటి సారి కావచ్చునేమోగానీ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ వంటిచోట్ల అంత క్రితం బయటపడలేదా? సైన్యంలో పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడినవారిని పట్టుకున్న ఉదం తాలు లేవా? ఏ ఉద్దేశంతో అప్పట్లో దేవిందర్‌సింగ్ పాత్రపై దర్యాప్తు చేయలేదన్నది ఇప్పుడు తేల వలసివుంది. అలా దర్యాప్తు చేసివుంటే, ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడేవి. వందల మంది ప్రాణాలు కాపాడటం, ఆస్తుల విధ్వంసాన్ని నివారించడం సాధ్యమయ్యేది. అఫ్జల్ ప్రస్తావించడానికి చాలా ముందే దేవిందర్‌సింగ్ వివాదాస్పద అధికారిగా ముద్ర పడ్డాడు. మిలిటెన్సీని సమర్థవంతంగా అదుపు చేసినందుకు ఆరేళ్ల వ్యవధిలో ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా ఎదిగాడు. కానీ తన పరిధిలో లాకప్ మరణాలు జరగడంతో మళ్లీ వెనక్కు పంపారు. అనంతరకాలంలో చాలా త్వరగానే కోల్పోయినదాన్ని సాధించుకున్నాడు. అఫ్జల్‌ను ప్రశ్నించడం, చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దేవిందర్ అంగీకరించాడు. ఏ ఉగ్రవాద ఘటనైనా స్థానికంగా వుండేవారి తోడ్పాటులేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు ఎటూ పార్లమెంటు దాడి కేసులో తిరిగి దర్యాప్తు జరుగుతుంది. ఇన్నేళ్లుగా దేవిందర్ సింగ్ ఎలాంటి ఘోరాలకు ఒడిగట్టాడో తేలుతుంది. కనీసం ఇకముందైనా నేరాల దర్యాప్తునకు, ముఖ్యంగా ఉగ్ర వాద నేరాల దర్యాప్తునకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలేమిటో, సూక్ష్మ స్థాయి అంశాలపై సైతం ఎంత తీక్షణమైన దృష్టి సారించాలో, ఎందుకు సారించాలో మన దర్యాప్తు విభాగాలు గ్రహిం చగలిగితే అది దేశ భద్రతకు ఎంతగానో మేలుచేస్తుంది. -
‘వర్షిత హత్య కేసులో రీకన్స్ట్రక్షన్’
చిత్తూరు, మదనపల్లె: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేతనగర్ కల్యాణ మండపంలో ఇటీవల జరిగిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసును రీకన్స్ట్రక్షన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రవిమనో హరాచారి తెలిపారు. సోమవారం ఆయన వర్షిత పోస్టుమార్టం విషయమై స్థానిక జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. హత్యాచారం కేసులో నిందితుడిపై ఆధారాలు బలంగా ఉన్నాయన్నారు. నిందితునికి కఠిన శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పోర్టుమార్టం నివేదికలు రావడంతో కేసుకు మరింత బలం చేకూరిందన్నారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన తీర్పు వచ్చేలా చూస్తామన్నారు. డీఎస్పీ వెంట మదనపల్లె రూరల్ సీఐ అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు. చదవండి: వర్షిత కేసు; ‘నిందితుడిని ఉరి తీయాలి’ చదవండి: వర్షిత హంతకుడు ఇతడే! -
అవినీతి నిర్మూలనెట్లా?
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో కేవలం మూడంటే మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2015 సంవత్సరం కంటే ముందు కరీంనగర్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఏసీబీ పనిచేసేది. అప్పట్లో డబుల్ డిజిట్లో కేసులు నమోదు కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ ఏసీబీ అప్‌గ్రేడ్ అయి డీఎస్పీ పోస్టు కేటాయించిన తర్వాత వరుస సంవత్సరాల్లో కేసులు కేవలం ఇతని పేరు గణపతివార్ వెంకట్రాజు. బేల మండలం సాంగిడి గ్రామం. 2013 సంవత్సరంలో ఓ అధికారి అవినీతిపై ఏసీబీని ఆశ్రయించి అతన్ని పట్టించేలా చేశాడు. ఈ కేసు తర్వాత రాజుపై భూ సంబంధిత వ్యవహారంలో ఓ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసు నమోదైంది. దీనిపై ఐదేళ్ల పాటు పోరాడి దాని నుంచి బయట పడ్డాడు. ఇతనికి సహాయపడ్డ ఓ న్యాయవాదిపై కూడా కేసు నమోదైంది. బాధితుడి తల్లిదండ్రులను కూడా ఓ కేసులో ఇరికించారు. అవినీతికి పాల్పడిన ఒక్క అధికారిని ఏసీబీకి పట్టిస్తే తనకు ఇన్ని శిక్షలా అని ఆయన మదనపడే పరిస్థితి. సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ డీఎస్పీ పోస్టు భర్తీ చేయకపోవడం, కరీంనగర్ డీఎస్పీకే ఆదిలాబాద్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. గత ఐదారు నెలలుగా ఆయన ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక పైన పేర్కొన్నట్లు ఎవరైన బాధితుడు అవినీతికి వ్యతిరేకంగా అధికారులపై ఏసీబీని ఆశ్రయించిన తర్వాత జరుగుతున్న పరిణామాలకు కూడా బాధితుడి పరంగా ఎలాంటి స్వాంతన లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. ∙ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ శాఖ కార్యాలయంలో ప్రస్తుతం కరీంనగర్ డీఎస్పీ ఇన్చార్జిగా ఉండగా, సీఐలుగా ప్రశాంత్, నర్సింహ వ్యవహరిస్తున్నారు. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. నలుగురు కానిస్టేబుల్ పోస్టులకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. మూడు హోంగార్డు పోస్టులకు ముగ్గురు పనిచేస్తున్నారు. 2015లో ఆదిలాబాద్ ఏసీబీని అప్‌గ్రేడ్ చేస్తూ డీఎస్పీ పోస్టు కేటాయించారు. మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాలో దీని పరిధి విస్తరించి ఉంది. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలోనూ వెనకబడడం కూడా కేసులు పెరగకపోవడానికి ఓ కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. డిసెంబర్లో ఏసీబీ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు మినహాయిస్తే ఏడాది పొడవున ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. దీంతో శాఖ పరమైన ప్రభావం కనిపించదు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ 2018 యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసుల్లో అదనంగా కొన్ని అంశాలను జోడించడం జరిగింది. దాని ప్రకారం లంచం డిమాండ్ చేసినట్లు రికారి్డంగ్ ఉన్న ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకొని నిఘా పెట్టే ఆస్కారం ఉంది. ప్రభుత్వ శాఖలో ఒక వ్యవహార నిర్వహణకు సంబంధించి ఎవరైన వ్యక్తికి, అధికారికి మధ్యవర్తిత్వం వహిస్తే అతనిపై కూడా కేసు నమోదు చేసే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ శాఖల వ్యవహారంలో అధికారులు లాడ్జి, హోటళ్లలో గదులు అరేంజ్ చేయమని, విందు ఇవ్వమని చెప్పడం కూడా నేరమే. అలాగే వాహనం ఏర్పాటు చేయాలనడం కూడా నేరం కిందికే వస్తుంది. పని జరిగిన కొంత కాలం తర్వాత కూడా లంచం డిమాండ్ చేయడం నేరమే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీని ఆశ్రయించవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఇలా చట్టంలో అనేక అంశాలు జోడించినప్పటికీ బాధితులు ముందుకు రాకపోవడం, కేసులు పెరగకపోవడం గమనించదగ్గ విషయం. అవినీతిపై ఫిర్యాదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టోల్‌ఫ్రీ నం.1064 ఏర్పాటు చేశాం. దీనికి కాల్చేసి ఫిర్యాదు చేసిన పక్షంలో పైస్థాయిలోనూ వివరాలు నమోదవుతాయి. తద్వారా జిల్లా స్థాయిలో ఏసీబీ అధికారులు కేసుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది. గోప్యంగా ఉంచుతాం.. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచి అవినీతి అధికారిపై నిఘా ఉంచి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేస్తాం. ఫిర్యాదు వస్తే కేసులు నమోదు చేయడానికి మేము సిద్ధమే. – భద్రయ్య, ఇన్చార్జి డీఎస్పీ, ఏసీబీ, ఆదిలాబాద్ -
కొత్త డీఎస్పీలకు జీతాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం ఎదురు చూశారు... ఎట్టకేలకు పదోన్నతి పొందారు... పక్షంలో పోస్టింగ్ అనుకున్నారు... రెండు నెలలుగా కనీసం జీతాలు కూడా లేకుండా పని చేస్తున్నారు... ఆగస్టులో ఇన్స్పెక్టర్ నుంచి పదోన్నతి పొందిన డీఎస్పీల పరిస్థితి ఇది. ఇప్పటి వరకు పోస్టింగ్స్ లేకపోవడంతో వీరికి జీతాలు చెల్లించడానికి సాంకేతిక అంశాలు అడ్డు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 68 మంది డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కొత్తగా డీఎస్పీలు అయిన వాళ్ళు కేవలం 14 మంది మాత్రమే. మిగిలిన 39 మంది డీఎస్పీలు ఇంకా ఎదురు చూస్తున్నారు. పోలీసు విభాగంలో జీతాల చెల్లింపు అధికారి ఆధారంగా కాకుండా పోస్టు ఆధారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏ పోస్టు కేటాయించాలన్నా, సృష్టించాలన్నా దానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఓ అధికారి ఏ పోస్టులో పనిచేస్తుంటే దానికి సంబంధించిన జీతం ఆయనకు అందుతుంది. ఆగస్టు వరకు ఇన్స్పెక్టర్లుగా వివిధ పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన 53 మందికి ఆ నెల 29న పదోన్నతులు వచ్చాయి. వీరిలో 1995తో పాటు 1996 బ్యాచ్‌కు చెందిన వారూ ఉన్నారు. అప్పటివరకు ఆయా ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్హెచ్ఓ), ప్రత్యేక విభాగాల్లోని పోస్టుల్లో పనిచేసిన వీరిని పరిపాలన పరమైన కారణాల నేపథ్యంలో ఎటాచ్మెంట్ పద్ధతితో అక్కడే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండి, ఆ తర్వాత పోస్టింగ్స్ వస్తాయని అధికారులు భావించారు. అయితే ఆ తర్వాత వరుసగా దసరా, ఆర్టీసీ సమ్మె వంటివి రావడంతో వీళ్ళంతా ఎటాచ్మెంట్ మీదే కొనసాగుతున్నారు. దీంతో ఇన్స్పెక్టర్ పోస్టులో వీళ్ళు లేకపోవడం, డీఎస్పీగా పోస్టింగ్ రాకపోవడంతో జీతాలు చెల్లించడానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో సెప్టెంబర్ నెల జీతాలు అందని వీరికి అక్టోబర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో ఇన్స్పెక్టర్లుగా వేరే అధికారుల్ని నియమించారు. దీంతో ఆ పోస్టు కూడా పోయి కేవలం సూపర్ వైజింగ్ ఆఫీసర్లుగా మారిపోయారు. శుక్రవారం 68 మంది డీఎస్పీల బదిలీలు జరిగినా వీరిలో 14 మంది మాత్రమే పదోన్నతి పొందిన అధికారుల్లో ఉన్నారు. మిగిలిన వారంతా గతం నుంచి డీఎస్పీలుగా పనిచేస్తున్న వారే. దీంతో ఆగస్టులో పదోన్నతి పొందిన వారిలో ఇంకా 39 మందికి పోస్టింగ్స్ దక్కలేదు. ఇలా జీతాలకు దూరంగా ఉన్న అధికారులకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ చేరి పాత జీతం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చిన 14 మందికీ అక్టోబర్ నెలలో జీతం అందే అవకాశం లేదు. వీరికంటే ఆలస్యంగా ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన సబ్–ఇన్స్పెక్టర్లకు కొన్ని రోజుల్లోనే పోస్టింగ్స్ రావడంతో జీతం ఇబ్బంది తప్పింది. మరోపక్క దాదాపు ఆరు నెలల క్రితం పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు సైతం పోస్టింగ్స్ లేకుండా ఉన్నారు. ఫలితంగా అదనపు డీజీగా పదోన్నతి పొందిన వారు ఐజీ పోస్టులు, డీఐజీగా పదోన్నతి పొందిన వారు ఎస్పీ పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరికి జీతాల చెల్లింపులో ఇబ్బంది లేదని, తమకు మాత్రం జీతాలు కూడా అందట్లేదని కొత్త డీఎస్పీలు వాపోతున్నారు. చదవండి: 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం -
68 మంది డీఎస్పీలకు స్థాన చలనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వారు నేరుగా చీఫ్ ఆఫీసర్‌కు రిపోర్టు చేయాలని సూచించారు. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
డోన్ రూరల్ : గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఖాదబాషా అన్నారు. మండల పరిధిలోని కోట్లవారిపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో సోమవారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మట్కా, పేకాట, మద్యం వంటి వాటికి గ్రామ ప్రజలు దూరంగా ఉండాలన్నారు. గొడవలు సృష్టిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పారు. గ్రామాలల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హోటల్, దుకాణాల వారు తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ.మధుసుధన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫెయిలే జీవితాన్ని మార్చేసింది
అపజయమే విజయానికి సోపానమంటారు పెద్దలు. అది నిజమేనని నిరూపించారు శివకుమార్ గౌడ్. ఈయనెవరనేదేనా మీ సందేహం. మన జిల్లాకు చెందిన వ్యక్తే. మొదట్లో పరీక్షల్లో ఫెయిలైనా ఆ అపజయాన్నే విజయానికి పునాదిగా మార్చుకుని సక్సెస్ బాట పట్టారు. అంతటితోనే ఆగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఉన్నతస్థాయిలో నిలబడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు పరీక్షల్లో తప్పామని కుంగిపోకుండా గుండె నిబ్బరంతో విజయం కోసం తపించాలని శివకుమార్ గౌడ్ పిలుపునిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి : పరీక్ష తప్పితే కుంగిపోనవసరం లేదు.. పట్టుదలతో చదివితే సక్సెస్ కావచ్చు.. ఉన్నతస్థాయికి ఎదగొచ్చునని రుజువు చేశారు శివకుమార్‌గౌడ్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన శివకుమార్‌గౌడ్ పదో తరగతి వరకు సొంత ఊల్లోనే చదివాడు. ఇంటర్మీడియట్ చదివేందుకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాడు. 1987–89లో స్థానిక జీవీఎస్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివిన శివకుమార్ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌లో ఫెయిలయ్యాడు. అప్పుడు 150 మార్కులకు 53 మార్కులు వస్తే పాస్ అవుతారు. అయితే ఆయనకు 43 మార్కులు మాత్రమే వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యానని కుంగిపోలేదు. కసితో చదివాడు. సప్లిమెంటరీలో రాసి పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అప్పుడు 643 మార్కులతో ఎంపీసీలో క్లాస్ సెకండ్‌గా, కాలేజీలో థర్డ్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఏ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఆయన్ను ఇబ్బంది పెట్టిందో దాని మీదే ఎక్కువ దృష్టి సారించాడు. డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ సబ్జెక్టును ఎంచుకున్నాడు. 1989–1992 సంవత్సరంలో ఆయన మ్యాథ్స్‌కు సంబంధించి నాలుగు పేపర్లు రాశాడు. రెండింటిలో 150 మార్కులకు 150 మార్కులు, ఒకదానిలో 139, మరొకదానిలో 142 మార్కులు సాధించి కాలేజీలో మంచి గుర్తింపు పొందాడు. 89 శాతం మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. 1992–94లో ఉస్మానియా పరిధిలోని నిజాం కాలేజీలో ఆయన పీజీలో 90 శాతం మార్కులు సాధించి యూనివర్సిటీలో నాలుగో ర్యాంకు సాధించాడు. 1994–96లో నాగార్జన సాగర్‌లో బీఈడీ చదివారు. అక్కడా ఏడో ర్యాంకు సాధించారు. 1996లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైన శివకుమార్‌గౌడ్ 2002 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 2002లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై 2012 వరకు రామారెడ్డి, కామారెడ్డి కాలేజీల్లో పని చేశాడు. లెక్చరర్‌గా పని చేస్తూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. 2008లో అప్లయి చేసిన ఆయ న 2011లో జరిగిన పరీక్షలో నెగ్గాడు. 2012లో ఆయనకు జైళ్ల శాఖ డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్‌లో తరువాత కరీంనగర్లో ఆ తరువాత మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ మార్కులే గ్రూప్–1 సక్సెస్‌కు కారణం.. శివకుమార్‌గౌడ్ గ్రూప్–1లో సక్సెస్ కావడానికి మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులే కారణం కావడం విశేషం. ఇంటర్లో ఏ సబ్జెక్టులో అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో, తరువాత అదే సబ్జెక్టు ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. గ్రూప్–1 ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. అందులో శివకుమార్‌గౌడ్‌కు 143 మార్కు లు వచ్చాయి. అన్ని మార్కు లు రావడం కారణంగానే గ్రూప్–1 ఉద్యోగం వచ్చిం దని చెబుతారు శివకుమార్‌గౌడ్. విద్యార్థులు కుంగిపోవద్దు.. గెలుపు ఓటములు అనేవి సహజం. టెన్త్, ఇంటర్లో ఫెయిల య్యాన ని కుంగిపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. ఫెయిలైన సబ్జెక్టుకు సం బంధించి మరింత కసితో చదివితే సక్సెస్ కావొచ్చు. ఫెయిల్ అయినవారంతా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరూ మిగలరు. ధైర్యంగా చదవాలి. ముందుకు సాగాలి. ఫెయిలై సక్సెస్ అయిన వ్యక్తుల్లో నేనొకరిని. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. – శివకుమార్‌గౌడ్, సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ -
బుక్కయిన మహిళల టీ20 కెప్టెన్..!
భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన హర్మన్‌ప్రీత్ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతల చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె ఆ ఉద్యోగం కొల్పోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని పోలీసుల వెరిఫికేషన్‌లో తెలింది. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారించిన పోలీసులు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ను ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పంజాబ్ డీజీపీ ఎంకే తివారీ ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ‘హర్మన్‌ప్రీత్ తాను మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ అందజేసింది. కానీ వెరిఫికేషన్‌లో ఆ యూనివర్సిటీ అధికారులు హర్మన్‌ప్రీత్ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ రిజిస్ర్టేషన్ నంబర్ తమ రికార్డులో లేదని తెలిపారు. ఈ నివేదికను సంబంధిత శాఖలకు అందజేశామ’ని తెలిపారు. తర్వాత స్పందిస్తాను : హర్మన్‌ప్రీత్ దీనిపై హర్మన్‌ప్రీత్ వివరణ కోరగా.. ‘అలాంటిది ఎం జరగలేదు. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతాను’ అని తెలిపారు. -
ఎక్కడి డీఎస్పీలు అక్కడే!
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నలుగుతున్న డీఎస్పీ సీనియారిటీపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ మధ్యేమార్గానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియారిటీపై పట్టువిడవకుండా వ్యవహరిస్తున్న ప్రమోటీ, డైరెక్ట్ రిక్రూట్ అధికారులకు సమన్యాయం చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. విభజన సమస్యలపై ఇటీవల జరిగిన భేటీలో డీఎస్పీల పంపకాలు, ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ సమస్య, పరిష్కారాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు చర్చించినట్లు తెలిసింది. తుది కేటాయింపులు జరిగితేనే.. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని డీఎస్పీలు ఇక్కడే పనిచేసేలా, ఏపీలోని అధికారులు అక్కడే ఉండేలా ఇరు ప్రభుత్వాలు ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే కమలనాథన్ కమిటీ చేసిన తాత్కాలిక కేటాయింపులను తుది కేటాయింపులుగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చేలా చూడాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కేంద్రానికి విన్నవించబోతున్నారు. తాత్కాలిక అలాట్మెంట్ కింద ఇప్పటికే 95 శాతం అధికారులు వారి వారి రాష్ట్రాలకు పరస్పర ఒప్పందంతో వెళ్లారు. దీంతో తుది కేటాయింపులు జరిగితేనే పూర్తి స్థాయి, కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతులు, సీనియారిటీ సమస్యలు తీరనున్నట్లు పోలీసు శాఖ భావిస్తోంది. ఎక్కడికక్కడే సీనియారిటీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సీనియారిటీ జాబితా పొరపాట్లపై ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా రూపొందించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. దీనిపై రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు మూడేళ్లు కసరత్తు చేసినా కొలిక్కి రాలేదు. దీంతో తెలంగాణ, ఏపీకి వేర్వేరుగా ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా రూపొందించుకోవాలని ఇరు రాష్ట్రాల పోలీసు పెద్దలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ప్రజల భయం పోగొట్టేందుకే కార్డన్ సెర్చ్
నవాబుపేట: ప్రజల్లో భయాన్ని పోగొట్టి పోలీసులపై నమ్మకాన్ని కల్పించేందుకు కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని వికారాబాద్ డీఎస్పీ శిరీష అన్నారు. మండల పరిధిలోని మైతాప్‌ఖాన్‌గూ డ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ శి రీష ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ఇళ్లు, కిరాణం షా పులు, ఫాస్టుఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వ హించారు. తనిఖీలో 3,080 గుట్కా ప్యాకెట్లు, 148 మద్యం బాటిళ్లు, పత్రాలు లేని ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అనుమానిత వ్య క్తులు సంచరిస్తే వెంటనే 100కు డయ ల్ చేసి సమాచారం అంది ంచాలన్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలు చేపడితే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమం లో సీఐలు శ్రీనివాస్, వెంకట్రామయ్య, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, వికారాబాద్ టౌన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. శంషాబాద్‌లో విస్తృతంగా కార్డన్ సర్చ్ శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్‌నగర్, ఖాజీగల్లి, కోమటి బస్తీల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ పీ.వీ.పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ అశోక్‌కుమార్, ఐదు గురు సీఐలు, 200 మంది కానిస్టేబుళ్లతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 100 బైక్‌లు, 20 ఆటోలు, ఐదు కార్లు, మూడు డీసీఎంలతో పాటు 15 మంది రౌడీషీటర్లు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తరలించారు. తనిఖీల్లో ఆర్జీఐఏ సీఐ మహేష్, శంషాబాద్ సీఐ కృష్ణప్రసాద్ తదితరులున్నారు. -
మావోల పోరాటంతో ప్రజలకు ఒరిగేదేం లేదు..
గూడెంకొత్తవీధి : ప్రజా ఉద్యమాల పేరిట మావోయిస్టులు చేస్తున్న పోరాటంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చింతపల్లి డీఎస్పీ అనిల్ పులిపాటి అన్నారు. ఆదివారం మండలంలోని జర్రెల పంచాయితీ కేంద్రంలో ఉచిత మెగా వైద్యశిబిరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరిట దారుణంగా హతమారుస్తున్నారని అన్నారు. పోలీసుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన్యంలోని చేయూత, ఉజ్వల, భవిత, రైతు నేస్తం, ముందడుగు వంటి కార్యక్రమాలతో గిరిజనులతో మమేకమవుతున్నట్టు చెప్పారు. తమశాఖ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అదనపు డీఎస్పీ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ గిరిజన యువతకు స్వయం ఉపాధి సూచించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారించడానికి పోలీసుశాఖ తగిన సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. జర్రెల మాజీ సర్పంచ్, 2016లో మావోయిస్టుల చేతిలో మృతి చెందిన సాగిన వెంకటరమణ తల్లిదండ్రులకు బట్టలు, సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో 600 మంది రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశా రు. చింతపల్లి, జీకేవీధి సీఐలు చంద్రశేఖర్, నారాయణరావు, ఎస్బీఎఫ్ సీఐ వెంకటరావు, బీఎస్ఎఫ్ ఏసీ ఉపేంద్రోసింగ్, జీకేవీధి, చింతపల్లి ఎస్ఐలు చంద్రశేఖర్, రమేష్ పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
భామిని: ఎస్టీ వివాహితను మోసగించాడన్న ఫిర్యాదుపై పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి దర్యాప్తు చేశారు. భామిని మండలం చిన్నదిమిలి కాలనీలో డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. వివాహిత ఎడ్ల పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నదిమిలి కాలనీకి చెందిన యువకుడు టి.మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు, వీఆర్ఓ కె.బాలరాజు, వార్డు సభ్యులు ఎ.యశోద, గ్రామస్తులు ఉన్నారు. -
ఇంకా మంటలు అదుపులోకి రాలేదు : డీఎస్పీ
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్ రబ్బరు పరిశ్రమలో సంభవించిన ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి 6 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఈదురు గాలులు తోడవడంతో సిబ్బంది వాటిని అదుపు చేయలేక పోతున్నారు. దీనిపై డీఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటలను అగ్ని ప్రమాదంకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఇప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదని, మరో మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదన్నారు. ఈ ప్రమాదం శాట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
పిచ్చి వేషాలేస్తేడిస్మిస్ అవుతావ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘‘ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్. పద్ధతిగా నడుచుకో. లేదంటే ఏకంగా డిస్మిస్ అయ్యి జైలుకు పోతావు’’ జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్‌ను తెలంగాణకు చెందిన సీఐడీ డీఎస్పీ బెదిరింపుతో అన్న మాటలివి. ఈ బెదిరింపులపై సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు యంత్రాంగం ముందుకు రాకపోగా మూడు రోజుల్లోనే రెండు ప్రాంతాలకు అతన్ని బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. దెందులూరులో తెలుగుదేశం నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్న విషయంపై కానిస్టేబుల్ మధు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులను ఎస్పీ వద్దకు పంపారు. వారి ఫిర్యాదుతో కనీసం విచారణ చేయకుండా కానిస్టేబుల్ మధును వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు. గతంలో ఇతనిపై చింతమనేని ప్రభాకర్ దాడికి దిగారు. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న ఇతనిపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. ప్రభాకర్‌పై పెట్టిన కేసును ఫాల్స్ కేసు కింద తీసేసిన పోలీసులు.. కానిస్టేబుల్‌పై కేసును కొనసాగిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు. 2014లో ఇంటి స్థలం విషయంలో ఇతనికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో వివాదం జరిగింది. అప్పట్లో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దెందులూరులో ఎంపీటీసీ సభ్యుడు ఇరిగేషన్ పంట బోదెలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దానిపై కానిస్టేబుల్ మధు జిల్లా కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దార్‌కు మీ కోసంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు కానిస్టేబుల్ మధుపై కక్షసాధింపు చర్యలు ప్రారంభం అయ్యాయి. సదరు తెలుగుదేశం నాయకుని బంధువైన తెలంగాణకు చెందిన డీఎస్పీ రంగంలోకి దిగారు. తెలంగాణ సీఐడీ డీఎస్పీ బెదిరింపులు కానిస్టేబుల్ మధు కథనం ప్రకారం... రెండురోజుల క్రితం ఆంధ్రా సీఐడీ డీఎస్పీని అంటూ ఒక అధికారి ఫోన్ చేశారు. మొదట ఆ వ్యక్తి ఏ స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ నువ్వు అంటూ ప్రస్తావించి తరువాత ఏంటి నీ ఓవర్‌యాక్షన్.. డిస్మిస్ అయ్యి జైలుకి పోతావ్, ఉరిపోసుకుని చస్తావ్ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. నీకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అసలు నీకు ఉద్యోగం లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆఖరికి ఉరిపోసుకుని చస్తావంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురైన మధు తనను ఇలా వేధించే బదులు చంపించేయండంటూ బదులిచ్చాడు. మీ ఎస్పీతో మాట్లాడి నీ సంగతి తేలుస్తానంటూ ఫోన్ పెట్టేశారు. అది జరిగిన రోజు సాయంత్రమే దెందులూరుకు చెందిన తెలుగుదేశం నాయకులు, అతని బంధువులు జిల్లా ఎస్పీని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు. మొబైల్ పోలీస్ నుంచి బదిలీ దీంతో కొంత కాలంగా దెందులూరు జాతీయ రహదారిపై మొబైల్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న మధుని, బీటు మార్చారు. మరుసటి రోజే మళ్లీ ఉన్నతాధికారులు తాడేపల్లిగూడెంలో జాయిన్ అవ్వమని ఆదేశాలు జారీచేశారు. తనను బెదిరించిన అధికారిపై కానిస్టేబుల్ మధు దెందులూరు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ తీసుకోలేదు. సీఐతో మాట్లాడమని చెప్పడంతో ఆయన సీఐకి ఫోన్ చేశారు. సదరు సీఐ కూడా నీ పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ చేసి ఫోన్ పెట్టేశారు. కాని ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో మధు ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తన సమస్యను ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని కానిస్టేబుల్ మధు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం
కణేకల్లు : ఓ ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. ప్రయాణికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం చేరవేయడంతో 45 నిమిషాల్లోనే కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వివరాల్లోకెళితే.. రాయదుర్గానికి చెందిన యువతి కణేకల్లు మండలం ఆలూరులోని ప్రైవేట్ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. విధినిర్వహణలో భాగంగా గురువారం ఉదయం 7గంటలకు రాయదుర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. సరిగ్గా 7.40గంటలకు ఆలూరు వద్ద బస్సు దిగి స్కూలు వద్దకు నడుచుకుంటూ వెళుతోంది. కణేకల్లులోని ద్విచక్రవాహన షో రూం యజమాని ముగ్గురు స్నేహితులతో కలిసి ఏపీ31 సీజే 2349 నంబర్ గల ఇన్నోవా కారులో వచ్చి టీచరును బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నారు. నన్ను కాపాడండి అంటూ ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంకా ముందుకు కదలని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు గమనించి వచ్చేలోపు కారు స్పీడుగా వెళ్లిపోయింది. వెంటనే జరిగిన విషయాన్ని ఎస్ఐ రామరావుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఆయన సమీపంలోని బెళుగుప్ప, రాయదుర్గం, కళ్యాణదుర్గంతోపాటు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లనూ అప్రమత్తం చేశారు. దుండగులు కణేకల్లువైపు వచ్చి షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద కుడివైపున కొత్తపల్లి మీదుగా వెళ్లారు. కళ్యాణదుర్గం వెళ్లే అవకాశముండటంతో అక్కడి పోలీసులు వాహనానికి ఎదురుగా వచ్చారు. అంతలోనే రాయదుర్గం ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వాహనాన్ని ఛేజ్ చేయగా.. రమనేపల్లి వద్ద దుండగులు పట్టుబడ్డారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ రామరావులు ఘటనస్థలానికెళ్లిన దుండగులను అదుపులో తీసుకున్నారు. అక్కడే గంటన్నర సేపు విచారణ చేపట్టారు. అనంతరం కణేకల్లు పోలీసుస్టేషన్‌కు బాధితురాలిని, కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని తీసుకొచ్చారు. కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ క్లీన్చిట్ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ది కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ వెంకటరమణ క్లీన్చిట్ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్.. సదరు అబ్బాయి ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే అబ్బాయికి ఇదివరకే పెళ్లయ్యిందని, భార్యకు విడాకులిస్తున్నాడని తెలిపారు. రెండో పెళ్లి చేసుకునే విషయమై మాట్లాడేందు కోసమే టీచర్‌ను కారులో తీసుకెళ్లాడని చెప్పారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదంటూ టీచర్ కూడా చెప్పడంతో కేసును ఇంతటితో క్లోజ్ చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇరువురి స్టేట్మెంట్లు రికార్డు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్లను ఇళ్లకు పంపారు. భారీ ప్యాకేజీ! కిడ్నాప్ ఘటన విషయమై ఓ మంత్రి సోదరుడు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. కిడ్నాప్ చేసినోడు తమకు కావల్సిన వాడేనని కేసుల్లాంటివి లేకుండా చూడాలని హకుం జారీ చేసినట్లు తెల్సింది. అంతేకాక ఈ కేసులో హెల్ప్ చేసిన పోలీసులకు మంత్రి సోదరుడు కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని నుంచి భారీ ప్యాకేజీ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐ రామరావును వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు. -
ప్రజలను రక్షించేందుకే పోలీసులు
మెదక్‌రూరల్: ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి గ్రామంలో ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతీ ఇంటిని తనిఖీ చేసి వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకే పోలీసులు ఉన్నారన్నారు. పోలీసులు అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తెలియజేయాలని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఇంటింటికీ తనిఖీలు చేస్తామని అనుమానితులుగా ఎవరు కనిపించినా, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు ఉన్నా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. వాహనాల పత్రాలు తీసుకొస్తే యజమానులకు వాహనాలను అప్పగిస్తామని, లేని పక్షంలో కోర్టుకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్‌లో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 12 మంది ఏఎస్ఐలు, 42 కానిస్టేబుల్స్, 50 మంది ట్రైనింగ్ సిబ్బంది.. మొత్తం 125 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రామకృష్ణ, భాస్కర్, రవీందర్‌రెడ్డి, మెదక్ రూరల్ ఎస్ఐ లింబాద్రి, సందీప్ తదితరులు ఉన్నారు. -
కత్తిపోట్లతో ఎస్పీ ఆఫీసుకు.
అనంతపురం సెంట్రల్ : కత్తిపోట్లకు గురైన బాధితుడు తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. యాడికి మండలం రాయలచెరువులో ఉదయం 7 గంటల సమయంలో శ్రీరామ్‌ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే రాజేష్ (35)పై హత్యాయత్నం జరిగింది. సొంత బావ (అక్క భర్త) రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్‌ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించా లని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అక్కడికి సకాలంలో చేరుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ వెంటనే హాస్పటల్‌కు డీఎస్పీ ఆదేశాలతో క్షతగాత్రుడిని కుటుంబ సభ్యు లు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎవరైతే మాకేంటి?
ధర్మవరం : ‘ఎవరైతే మాకేంటి.. దారి వదిలేది లేదు..లెక్క చేసేది లేదు..ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీ టిప్పర్ డ్రైవర్లు పట్టణంలో హల్చల్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు..ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ రామవర్మ తమ వాహనంలో రోడ్డుపై వెళ్తున్నారు. మార్గం మధ్యలో సెల్ఫోన్లో మాట్లాడుతూ వరదాపురం సూరి కంపెనీ అయిన నితిన్‌సాయి కనస్ట్రక్షన్ (ఎన్ఎస్సీ)కి చెందిన టిప్పర్లు రోడ్డుపై వేగంగా నడుపతున్నారు. డీఎస్పీ వాహనానికి సైడ్ ఇవ్వకుండా ర్యాష్ డ్రైవింగ్ చేశారు. పోలీస్ సైరన్ మోగించినప్పటికీ దారి వదలకుండా కొంతదూరం అలాగే వెళ్లారు. విసుగెత్తిన డీఎస్పీ గాంధీనగర్ అండర్‌బ్రిడ్జి వద్దకు వెళ్లగానే టిప్పర్లను ఓవర్టేక్ చేసి అటకాయించారు. టిప్పర్లను రోడ్డుపై నిలిపి వేసి డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు డ్రైవర్లు ‘ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి. తక్షణం టిప్పర్లను వదలండి’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆగ్రహించిన డీఎస్పీ రోడ్డుపైనే టిప్పర్లను ఆపి తమదైన శైలిలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. చివరకు ఎమ్మెల్యే జోక్యంతో వ్యవహారం సద్దుమనిగనట్లు తెలిసింది. ఈ విషయమై డీఎస్పీని సాక్షి వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. -
ఉలిక్కిపడిన మక్తల్
మక్తల్ : మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 7 గం టల నుంచి దాదాపు 9 గంటల వరకు పోలీసు బృందాలు ఇళ్లలోకి వచ్చి తనిఖీలు చేపట్టడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 26 వాహనాలు, 20 తులాల బంగారం, 9 కిలోల వెండిని స్వా ధీనం చేసుకున్నారు. అలాగే గుట్కాలు, జీపులను స్వాధీనపరుచుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంట, రాఘవేంద్రకాలనీల్లో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టణంలో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతు న్న పలువురు వ్యక్తుల ను అదుపులోకి తీ సుకుని వేలిముద్రలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజల రక్షణే ధ్యేయం.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో పేట డీఎస్పీ శ్రీధర్ మా ట్లాడుతూ ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ప్ర ధాన లక్ష్యమన్నారు. కొత్తగా ఎవరైనా వ్య క్తులు ఇళ్లలో అద్దెకు వచ్చినా వారికి సం బంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆభరణాలకు సంబం ధించి యజమానులు సరైన పత్రాలు చూ యించి తీసుకెళ్లాలన్నారు. విడతల వారీ గా అన్ని ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపడు తామన్నారు. తనిఖీల్లో సీఐ వెంకట్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రామకృష్ణ, మరో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 141 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కాటారం : జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు రామిళ్ల కవిత(35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాటారం మండలం కొత్తపల్లిలో ఈ నెల 11 అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రామిళ్ల కవితను దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన విషయం విధితమే. కాగా కవిత హత్యకు అసలు కారణం వివాహేతర సంబ ంధమే అని పోలీసులు తేల్చారు. తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కవితను పలుమా ర్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో విరక్తి చెంది పథకం ప్రకారం ఓ భార్య కాంట్రాక్ట్ మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు కాటారంకు చెందిన రామిళ్ల మల్లయ్యకు గత 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీజ, శిరిణి కూతుర్లు ఉన్నారు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత పదేళ్లుగా విడిపోయి కవిత తన తల్లిగారి ఊరైన కొత్తపల్లిలో కూతుర్లతో కలిసి జీవనం సాగిస్తుంది. గత రెండేళ్లుగా టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కవితకు దూరపు బంధువు వరుసకు బావ అయిన ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరుచు ఇరువురు కలుస్తుండడంతో విషయం కాస్తా సాగర్ భార్య సుజాతకు తెలియడంతో వారిద్దరిపై నిఘా పెంచింది. గత ఏడాది కవిత–సాగర్లు కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సుజాత పద్ధతి మార్చుకోవాలని కవితను తీవ్రంగా మందలించింది. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో పాటు పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. ఇదంతా జరిగినప్పటికీ కవిత–సాగర్ల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో తన భర్త ఎక్కడ దూరమవుతాడో తన పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర మనోవేదనకు గురైన సుజాత తన పిల్లలతో కలిసి పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది. హత్యకు ప్లాన్ జరిగిందిలా.. గత కొంత కాలంగా సాగర్–సుజాత ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వెంకటాపూర్ మండల పెద్దాపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్‌కు తన బాధను చెప్పుకొని సుజాత కన్నీరుమున్నీరయింది. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని నీ జీవితాన్ని నాశనం చేస్తున్న కవితను అడ్డుతప్పిస్తే ఎలాంటి గొడవ ఉండదని అది నేను చూసుకుంటానని రజనీకాంత్ సుజాతకు భరోసా కల్పించాడు. కవితను హత్య చేయించాలని నిర్ణయానికి వచ్చిన సుజాత రజనీకాంత్ సాకారం కోరుతుంది. గతంలో ప్రజాప్రతిఘటన కొరియర్‌గా పని చేసిన రజనీకాంత్ పెద్దాపూర్ గ్రామానికి చెందిన నిషేధిత పీపీజీ కొరియర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పని చేసిన కన్నూరి కుమారస్వామిని సంప్రదించాడు. కుమారస్వామి కవితను చంపేందుకు ఒప్పుకోవడంతో సాగర్ భార్య సుజాతతో రజనీకాంత్ ఫోన్లో మాట్లాడించి రూ.5లక్షలకు సుపారి మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉండి విభేధాలతో దూరమైన కొత్తపల్లి మాజీ ఉపసర్పంచ్ చిట్యాల చంద్రయ్య ద్వారా కవిత కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న సుజాత సమాచారాన్ని కుమారస్వామికి చేరవేస్తూ వచ్చింది. కవితను హత్య చేసేందుకు రజనీకాంత్, కుమారస్వామి, బస్వరాజుపల్లికి చెందిన కుక్కుమూడి అశోక్, పందికుంటకు చెందిన దుప్పటి మోహన్ అలియాస్ చింటూ, మాడుగుల జగదీశ్, హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆత్కూరి రాజుతో కలిసి ఫిబ్రవరి నెల నుంచి పలుమార్లు కొత్తపల్లికి వచ్చి కవిత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. మార్చి 11 అర్థరాత్రి అశోక్, రజనీకాంత్, మలుగు మండలం పందికుంటకు చెందిన నూనుగంటి చిరంజీవి అలియాస్ అభిలాష్‌తో కలిసి భూపాలపల్లిలో చేతి గ్లౌజులు, మంకీ క్యాప్స్, కిచెన్ నైఫ్స్ కొనుక్కొని కొత్తపల్లికి చేరుకున్నారు. కవిత తన ఇంట్లో పెద్ద కూతురు శ్రీజతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనక గల తలుపులు లేని కిటీకి నుంచి అశోక్, చిరంజీవి మంకీ క్యాప్‌లు ధరించి ఇంట్లోకి వెళ్లగా రజనీకాంత్ ఇంటి బయట కాపలగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కలిసి నిద్రిస్తున్న కవితను తమ వెంట తెచ్చుకున్న కత్తులతో కవిత ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా పక్కనే నిద్రిస్తున్న శ్రీజ నిద్రలేచి కేకలు వేయబోగా దుండగులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత ముఖం, గొంతుపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురైన కవిత అక్కడికక్కడే మృతి చెందింది. కవిత మృతి చెందినట్లు నిర్థారించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, నరేశ్, రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం ద్వారా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కాల్ డేటా, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు కూతురు శ్రీజ చెప్పిన వివరాలను తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చివరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య మిస్టరీ వీడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఏడుగురు నిందితులు సుజాత, రజనీకాంత్, కుమారస్వామి, అశోక్, మోహన్, చంద్రయ్య, జగదీష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాగా హత్యలో పాల్గొన్న మరో నిందితుడు చిరంజీవి, హత్యతో సంబంధం ఉన్న రాజులు పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, రాజు, నరేశ్‌లను ఈ సందర్భంగా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
బీమా కోసం భర్తను హత్య చేయించిన భార్య
సాక్షి, కర్నూలు : బీమా మొత్తం కోసం భర్తనే హత్య చేయించిన భార్య ఉదంతమిది. హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం కర్నూలులో డీఎస్పీ ఖాదర్‌బాషా, తాలూకా సీఐ నాగరాజుయాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య రమాదేవి, ఆయన బావమరిది రమేష్ కలిసి హైదరాబాద్‌లో ఉంటూ ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు. రమాదేవికి చోలవీడు సర్పంచు మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రమాదేవి, మధుసూధన్‌రెడ్డి, రమేష్, ఆయన భార్య శివప్రణీత కలిసి శ్రీనివాసులును హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు. భర్తతో కాపురం చేయటం ఇష్టంలేని రమాదేవి, డబ్బుపై దురాశగల రమేష్, శివప్రణీత దంపతులు కలిసి శ్రీనివాసులు చేత తెలివిగా బీమా చేయించి, వాటిపై రుణాలు పొందారు. ఈ మేరకు ఆయనపై వేర్వేరు చోట్ల బీమా చేయించారు. అతన్ని చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే రూ.2కోట్ల దాకా బీమా మొత్తం వస్తుందని వారు అంచనా వేశారు. ఈ మేరకు శ్రీనివాసులుకు మాయమాటలు చెప్పి రమేష్ తన వద్ద పనిచేసే రమణ, మొయిన్‌బాషలతో తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు. జనవరి 25వ తేదీన వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓర్వకల్లు సమీపంలో ఆపి రోడ్డుపై మాట్లాడుతున్నట్లు నటించారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీని గమనించి దాని కిందకు శ్రీనివాసులును తోసేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మొయిన్‌బాషా గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శ్రీనివాసులును గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాసులు మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రమణ, మొయిన్‌బాషాను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, శ్రీనివాసులు భార్య రమాదేవి, బావ మరిది రమేష్, మధుసూదన్‌రెడ్డి, శివప్రణీత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
-
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : ఢిల్లీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన నలుగురిని ప్రొద్దుటూరు రూరల్, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 250 కిలోల 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. రూరల్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్, చాపాడు ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలసి మంగళవారం మైదుకూరు రోడ్డులోని మీనాపురం క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో మైదుకూరు వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు వాహనం ఆపకుండా పోలీసులను గుద్ది చంపే ప్రయత్నం చేశారు. తర్వాత వాహనాన్ని పోలీసులు వెంబడించగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో చుట్టుముట్టిన పోలీసులు అనంతరపురం జిల్లా, నార్పల మండలం, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ తిరుపాలరెడ్డి, కమలాపురం మండలం, కొండాయపల్లి గ్రామానికి చెందిన చెప్పలి గంగాధర్, బి.మఠం మండలం, రేకులకుంట గ్రామానికి చెందిన పెద్దపోతు వెంకటస్వామిలను అరెస్ట్ చేశారు. స్కార్పియోలో ఉన్న 102 కిలోలు కలిగిన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాపాడు స్టేషన్ పరిధిలోని అల్లాడుపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. మైదుకూరు వైపు నుంచి వస్తున్న కారును ఆపగా అందులో ఉన్న చాపాడు మండలం, ఖాదర్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ సింపతి ఫకృద్ధీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ఉన్న 148 కిలోల 8 చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరికి తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఏపీలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్ఐలు, సిబ్బందికి డీఎస్పీ ప్రశంసలు ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలతో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఏఎస్ఐలు అహ్మద్, నారాయణ, కానిస్టేబుళ్లు మధుసూదన్‌రెడ్డి, సుబ్బయ్య, లక్ష్మీపతిరెడ్డి, శంకర్, కమాల్‌బాషా, ఖాదర్, వెంకటసుబ్బయ్యలను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానని డీఎస్పీ పేర్కొన్నారు. -
బైక్‌ను వెంబడించిన పోలీసులు.. గర్భిణి మృతి..!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి హైవేపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదని బైక్‌పై వెళ్తున్న దంపతులను పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి గర్భిణి జారిపడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. వివరాలివి.. గణేష్ సర్కిల్ వద్ద పోలీసులు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పలువురు పోలీసులకు గాయపడ్డారు. పరిస్థితి మితిమిరడంతో డీఎస్పీ అక్కడికి చేరుకున్నాడు. చర్చలకు వచ్చిన డీఎస్పీపై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. రోడ్డుపై బైఠాయించడంతో బారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. పోలీసుల చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. రోజు మాదిరే పోలీసులు హైవేపై చేకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తిరుచ్చి రేంజ్ డీఐజీ నేతృత్వంలో విచారణ మొదలెట్టామన్నారు. దీనికి కారణమైన ఇన్స్పెక్టర్ను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి చెప్పారు. -
ఉచిత శిక్షణకు మంచి స్పందన
వికారాబాద్ అర్బన్: పోలీసు ఉద్యోగాల కోసం ఇచ్చే ఉచిత శిక్షణకు మంచి స్పందన వస్తోందని వికారాబాద్ డీఎస్పీ శిరీష తెలిపారు. సోమవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన అభ్యర్థుల ఎంపికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సహకారంతో ఎస్పీ అన్నపూర్ణ ఆదేశంతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం అన్ని ఠాణాల్లో శిక్షణ తీసుకునే అభ్యర్థుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తాము ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన అభ్యర్థుల నుంచి వస్తోందని చెప్పారు. సోమవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో 295మంది యువకులు, 51మంది యువతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 7వ తేదీ వరకు అవకాశం ఉండటంతో దరఖా స్తు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులకు అప్పటికప్పుడు ఎత్తు, సర్టిఫికెట్లను పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఎంపికైన అభ్యర్థులు 8న తమ తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు. బషీరాబాద్(తాండూరు): కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడానికి నిరుద్యోగ యువకులు బారులు తీరారు. సోమవారం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో యువకులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు బషీరాబాద్ మండలంలో 30 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి మొదటగా పోలీసులు శరీర కొలతలు తీసుకున్నారు. అర్హులైన యువకుల పేర్లను ఎస్పీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది రాంచందర్, శ్రీనివాస్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిగి పీఎస్‌లో 110 దరఖాస్తులు పరిగి: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పరిగి పోలీస్ స్టేషన్లో మొదటిరోజు సోమవారం 110 మంది యువకులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ముందస్తుగా ఛాతీ, ఎత్తు కొలతలు పరిశీలించిన తర్వాతే దరఖాస్తులు తీసుకున్నారు. ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ రోజంతా కొనసాగింది. శిక్షణ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తెలిపారు. శిక్షణ ఇచ్చిన తర్వాత శారీరక కొలతలు సరిపోకపోతో అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండటంతో పాటు సమయం వృథా అవుతుందని, అందుకే ముందస్తుగానే కొలతలు పరిశీలించి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. -
డీఎస్పీగా మహిళా టీ20 కెప్టెన్
ఛండీగర్ : భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసుగా కొత్త బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) నుంచి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేష్ అరోరాలు హర్మన్ ప్రీత్ కౌర్ యూనిఫాంకు స్టార్లను పిన్ చేసి నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ''యంగ్ క్రికెటర్ హర్మన్ ప్రీత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పడంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం. హర్మన్ ప్రీత్ పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హర్మన్ ప్రీత్ మాకు ఎంతో గర్వకారకంగా నిలిచింది. ఆమె ఇలానే కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నా. నా శుభాకాంక్షలు ఆమెతో ఎప్పటికీ ఉంటాయి'' అని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావడంతో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే పశ్చిమ రైల్వేతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో రిలీవ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయినా వెళ్లాలనుకుంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వేతనం రూ.27 లక్షలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యం చేసుకుని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. ముఖ్యమంత్రి లేఖతో దిగివచ్చిన రైల్వే, హర్మన్ ప్రీత్‌తో కుదుర్చుకున్న బాండ్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఆమె నేడు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. Proud to join DGP Suresh Arora in pinning the stars on the uniform of this young cricketer @ImHarmanpreet as she takes over as DSP in @PunjabPolice. This lady has done us proud and I’m confident she’ll continue to do so. My best wishes are with her. pic.twitter.com/0yuDOdr6j7 — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2018 -
డీఎస్పీగా హర్మన్‌ప్రీత్
చండీగఢ్: భారత మహిళా టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీసు శాఖలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 1న ఆమె డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనుంది. రైల్వే ఉద్యోగి అయిన ఆమె ఇదివరకే డీఎస్పీ కావాల్సింది. కానీ తమతో కనీస ఒప్పంద ప్రమాణం (ఐదేళ్ల బాండ్) గడువు పూర్తికాకపోవడంతో భారతీయ రైల్వే సంస్థ... ఆమె గతేడాదే రాజీనామా చేసినప్పటికీ రిలీవ్ చేయలేదు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వయంగా రైల్వే మంత్రిత్వశాఖతో మాట్లాడి ఇంతకుముందు కుదుర్చుకున్న నియామక ఒప్పందాన్ని సడలించి రిలీవ్ చేయాలని కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ తాజాగా హర్మన్‌ప్రీత్‌ను రిలీవ్ చేయడంతో త్వరలోనే డీఎస్పీ కానుంది. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం అమరీందర్ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ రాష్ట్ర పోలీస్ శాఖలో చేరనున్న హర్మన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఆమె దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో పాల్గొంటోంది. -
అబల చెంతకు సబల
వేధింపులపై నోరు మెదిపితే, ఇదేంటని ప్రశ్నిస్తే, నలుగురికీ తెలిస్తే, అమ్మో ఆడపిల్లలం.. హద్దుల కోట దాటకూడదు.. గుండెల్లో వేదన బయటకురాకూడదు. హింసిం చడం మగాళ్ల జన్మహక్కు.. భరించడం ఆడాళ్ల విధి రాత..ఇదీ నేటి సమాజంలో మహిళల దుస్థితి. ఇలాంటి వారి కోసమే నేనున్నా నంటూ వస్తోంది ‘సబల’ . అన్ని వర్గాల మహిళ రక్షణ కొంగై మిమ్మల్ని కాపాడనుంది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సబలను ప్రాజెక్టు నోడల్ అధికారి స్థాయిలో తెనాలి డీఎస్పీ ఎం స్నేహిత ముందుకు నడిపించనున్నారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్టు వివరాలను ఆమె వెల్లడించారు. గుంటూరు, తెనాలి: రోడ్డుపై యువతిని ఎవరైనా కామెంట్ చేస్తే తలొంచుకుని వెళుతుంది. ఇంట్లో మహిళలు ‘నా భర్తే కదా కొట్టాడు’ అని ఊరుకుంటారు. దీంతో కొట్టటం తన హక్కు అన్న భావన మగాళ్లలో వస్తుంది. మొదట్లోరనే ప్రశ్నిస్తే, పోలీసులను ఆశ్రయిస్తే సమస్య తెగేదాకా వెళ్లకుండా ఉంటుంది. వీరి కోసమే ‘సబల’ ప్రారంభించామని ప్రాజెక్టు నోడల్ అధికారి, తెనాలి డీఎస్పీ స్నేహిత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు సాక్షికి ఆమె వెల్లడించారు. ఇలాంటి వారి కోసమే ‘సబల’ ప్రాజెక్టు ఫిర్యాదు చేస్తున్న మహిళల శాతం పెరిగినా చైతన్యస్థాయి మెరుగుపడాలి. ఇంకా నోరువిప్పలేని వారి కోసం జిల్లాలో ‘సబల’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జిల్లా ఎస్పీ అప్పలనాయుడు ఆలోచనతో రెండు నెలలుగా పైలెట్ ప్రాజెక్టుగా రహస్యంగా అమలు చేస్తున్నాం. మహిళా కానిస్టేబుళ్లు కాలేజీ విద్యార్థులు, పని చేసే కూలీలు, ఉద్యోగినులు, గృహిణులను కలుస్తూ వారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాన్ని పూసగుచ్చితే ఫిర్యాదు తీసుకుని అందుకు పాల్పడినవారి పీచమణుస్తున్నాం. మహిళల నుంచి స్పందన బాగుంది. హాస్టల్లో ఉండే విద్యార్థినిని తన స్నేహితుడు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. అనుకోకుండా ఆ ఫోను తీసిన రూమ్మేట్కూ ఆ బాధ తప్పలేదు.‘సబల’కు చెప్పటంతో అతడిని అరెస్టు చేశాం. ‘సబల’ను నెలాఖరుకు అధికారికంగా ప్రారంభించబోతున్నాం. ముగ్గురం ఆడపిల్లలమే... తూర్పుగోదావరి జిల్లా మాది. కాకినాడ దగ్గర తాళ్లరేవులో మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇద్దరు చెల్లెళ్లూ ఇంకా చదువుతున్నారు. అంతా ఆడపిల్లలే అని వారెప్పుడూ విచార పడింది లేదు. మరింతగా ఖర్చు పెడుతూ ఎక్కువగా చదివించారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చదువులంటారు...పెళ్లిళ్లు చేయకుండా’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. ఓపికగా చదివించారు. డిగ్రీ తర్వాత నుంచి గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ పీజీ, ఎంఫిల్ చేశాను. 2012లో గ్రూప్–1లో సెలక్టయ్యాను. పీహెచ్డీ కూడా చేయబోతున్నా. సమయం సరిపోవటం లేదు. నిశ్వబ్దాన్ని వీడితేనే న్యాయం.. వేధింపులు, హింసకు గురైన మహిళలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతే న్యాయం జరగదు. అన్యాయంపై నిశ్శబ్దాన్ని వీడా. గొంతు పెగల్చుకొని ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దోషులకు దండనతోనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. మరొక మగాడు ఆ నేరానికి పాల్పడేందుకు భయపడతారు. మహిళలపై ఆగడాలకు వారి మౌనం కూడా దారితీస్తోందని చెప్పటానికి నేను సంకోచించను. ఆవారాగా తిరిగే ఓ యువకుడు నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయిదో అమ్మాయి మైనరు. అయినా ధైర్యంగా నోరు విప్పింది. కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. మొదటి బాధితురాలే నిశ్శబ్దాన్ని వీడినట్టయితే ముందు నలుగురూ అతడి బారిన పడేవారు కాదు కదా! ‘షీ టీమ్లోమూడేళ్లలో 2 వేల కేసులు గ్రూప్–1లో నెగ్గి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక తొలి పోస్టింగ్ సైబరాబాద్‌లో ఇచ్చారు. అక్కడ షీ టీమ్స్‌లో పని చేశాను. రోడ్లపై డెకాయ్ ఆపరేషన్లు చేస్తూ ఆడవాళ్లపై వేధింపులు/హింసకు పాల్పడే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ‘షీ’ విధి. ఇందులో మూడేళ్లు పని చేసిన నేను రెండు వేల వరకు కేసులు నమోదు చేయగలిగా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘సబల’కు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నాను. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి నుంచి జాగ్రత్తగా సమాచారం తీసుకోవాలనే ఉద్దేశంతో సబల రూపకల్పన జరిగింది. -
చోరీలే అతడి పని
కామారెడ్డి క్రైం: జల్సాల కోసం తేలికగా డబ్బు సంపా దించేందుకు చోరీలను ఎంచుకున్నాడు ఓ యువకుడు. ఎన్నిసార్లు జైలుకెళ్లినా అతడిలో మార్పు రాలేదు. బయటకు రాగానే తిరిగి చోరీలు చేస్తూనే ఉంటా డు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటాడు. ఇటీవల నాలుగు తాళం వేసిన ఇండ్లలో చోరీలు చేసినన కేసుల్లో నిందితుడైన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన గోత్రాల నాగరాజును రామారెడ్డి, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ ప్రసన్నరాణి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే 25 చోరీ కేసులు ఉన్నాయి.కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో ఈజీ మనీ కోసం నాగరాజు చోరీలు చేశాడు. గతేడాది జూలైలో కామారెడ్డి పరిసరా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అరెస్టు అయ్యాడు. నవంబర్ 17న జైలు నుంచి విడుదలైన అతడు మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. రామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పల్వాయిలో రెండు, గిద్ద గ్రామంలో ఒకటి, ఇందల్వాయి మండలం గన్నారంలో ఒక తాళం వేసిన ఇంట్లో చోరీలు చేశాడు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం చోరీ చేసిన సొత్తును కామారెడ్డిలో విక్రయించేందుకు బైక్‌పై వెళ్తుండగా రామారెడ్డి ఎస్ఐ కే.వినయ్‌కుమార్, సీసీఎస్ ఎస్ఐ పెంటయ్య ఆధ్వర్యంలో రామారెడ్డికి సమీపంలో వాహనాలు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి 11.5 తులాల బంగారం, 13 తులాల వెండి, ఒక సెల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ రూ.2లక్షల 53 వేలు ఉంటుందన్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్ సీఐ భిక్షపతి, సీసీఎస్ సీఐ రాజశేఖర్, రామారెడ్డి, సీసీఎస్ ఎస్ఐలు వినయ్‌కుమార్, పెంటయ్య, ఏఎస్ఐలు సంతోష్‌రెడ్డి, ఉస్మాన్, సంజీవరావు, పీసీలు శంకర్, రమేశ్, రాంచందర్, గణేష్, నరేష్‌ను ఆమె అభినందించారు. -
డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోట్లు?
వేలూరు : లంచం కేసులో పట్టుబడి కటకటాల పాలైన ఆంబూరు డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోటి అని వదంతులు వ్యాపించాయి. వేలూరు జిల్లా ఆంబూరు డీఎస్పీ ధనరాజ్, ఎస్ఐ లూర్దు జయరాజ్ ఇసుక క్వారీ నడుపుతున్న వ్యక్తి వద్ద రూ.1.45 లక్షలు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంబూరు డీఎస్పీ ఇసుక అక్రమ రవాణా, నాటుసారా, కట్ట పంచాయితీ చేసే ముఠా సభ్యుల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకోవడం వీటికి ఆయా స్టేషన్లలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్ల ద్వారా నగదును తీసుకుంటున్నట్లు వదంతులు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు డీఎస్పీ ధనరాజ్, ఎస్ఐలను గురువారం రాత్రి 12 గంటల వరకు రహస్యంగా విచారణ జరిపి న్యాయమూర్తి రాజు ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించడంతో వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ ధనరాజ్ గతేడాది విరుదనగర్ జిల్లా నుంచి బదిలీపై ఆంబూరుకు వచ్చారు. విరుదునగర్‌లో పనిచేసిన సమయంలోనే నాటు సారా అక్రమరవాణ దారులు, కిడ్నాపర్ల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకునే వాడని అనంతరం ఆంబూరులోని ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియా వద్ద ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని వేధింపులకు గురి చేసే వాడని ఇవ్వకుంటే కేసులు నమోదు చేసే వాడని తెలిసింది. ఈ మామూళ్లు ఇవ్వడంతోనే ఇసుక మాఫియా ముఠా సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించే వారని తెలిసింది. డీఎస్పీ లంచం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న ఆంబూరు వాసులు పోలీస్‌స్టేషన్ ఎదుట బాణసంచా పేల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. -
ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. తూప్రాన్ సబ్‌డివిజన్‌లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
సిరిసిల్లక్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోరీ ల్లో నిందితుడిగా ఉన్న అంతర్జిల్లా దొంగను ఆది వారం రాజన్న సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ నరహరి వివరాలు వెల్లడించారు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామావత్ శంకర్ గతేడాది జన వరి నుంచి ఇప్పటి వరకు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఆరు దొంగతనాలు, గంభీరావుపే ట మండలంలో రెండు దొంగతనాలు చేశాడు. వేములవాడలోని ఒక షాపులో చోరీచేసే ప్రయత్నంలో పోలీస్ జీపు అటువైపుగా వెళ్లడాన్ని గమనించి పరారయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్‌లో పట్టుకున్నారు. దొంగను అరెస్టు చేసిన సీసీఎస్ సీఐ బన్సీలాల్, ముస్తాబాద్ ఎస్సై ప్రవీణ్, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, సీసీఎస్ ఎస్సై ఉపేందర్‌ను డీఎస్పీ నరహరి అభినందించారు. గల్ఫ్ ఏజెంట్...p సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటలో గల్ఫ్ పంపిస్తానని మోసం చేసేందుకు ప్రయత్నించిన నకిలీ ఏజెంట్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. మాదం కరుణాకర్ ఎలా ంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంటుగా చలామణి అవుతున్నాడు. అతడివద్ద నుంచి ఏడు పాస్‌పోర్టులు, నాలు గు చెక్కులు, మెడికల్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
డబ్బుల కోసమే హత్య
తూప్రాన్ : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత నెల 28న ఓ గుర్తుతెలియని మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌పోన్ ఆధారంగా మహిళను హత్య చేసిన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామానికి చెందిన చంద్రకళ(45) గత నెల 28న శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురవగా మృతదేహం లభించిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గురైన మహిళ వద్ద పడి ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. హత్యకు గురైన చంద్రకళ ఆటోడ్రైవర్లు, తెలిసిన వ్యక్తుల వద్ద విచ్చలవిడిగా తిరిగే మహిళ అని అన్నారు. ఇదే క్రమంలో గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవితో పరిచయం ఉన్న చంద్రకళకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రూప్సింగ్(70) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను మచ్చిక చేసుకొని గతంలో పలుమార్లు చంద్రకళతో సహవాసం చేసినట్లు తెలిపారు. గత నెల 27న చంద్రకళకు ఫోన్ చేసి నర్సాపూర్‌కు రప్పించారు. అక్కడి నుంచి రవి ఆటోలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చంద్రకళను తీసుకువచ్చారు. అనంతరం రవి ఆటోలో వెళ్లిపోగా నిందితుడు రూప్సింగ్ చంద్రకళను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కర్రతో తలపై బాది చంద్రకళను హత్య చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. హత్య చేసి మృతురాలి వద్ద డబ్బులు, నగల కోసం వెతికగా ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి రూప్సింగ్ వెళ్లిపోయినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా హంతకుడు రూప్‌సింగ్‌ను గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు పాత నేరస్తుడే చంద్రకళను హత్య చేసిన నిందితుడు పాత నేరస్తుడని డీఎస్పీ చెప్పారు. 1998 సంవత్సరంలో వర్గల్ మండలం నాచారంలో ఓ మహిళ హత్య కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే తన సొంత అత్తను 2010లో హత్య చేసిన కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ లింగేశ్వర్‌రావు, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్‌రావు, స్థానిక ఎస్సై శేఖర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డి, సిబ్బంది మంగ్యానాయక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
విషాదం: డీఎస్పీ తలలోంచి దూసుకెళ్లిన బుల్లెట్..
సాక్షి, చంఢీగఢ్: ప్రమాదవశాత్తూ సర్వీస్ రివాల్వర్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఓ డీఎస్పీ ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. ఐజీ ముఖ్విందర్ సింగ్ కథనం ప్రకారం.. జైతూలోని యూనివర్సిటీ కాలేజీలో నేడు (సోమవారం) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మోరల్ పోలీసింగ్ మీద విద్యార్థులు ఆందోళన చేస్తూ.. పోలీసుల నుంచి మాకు, సామాన్యులకు స్వాతంత్ర్యం కావాలంటూ విద్యార్థులు గట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని సమాచారం అందుకున్న పంజాబ్‌కు చెందిన డీఎస్పీ బల్జీందర్ సింగ్ సంధు వర్సిటీకి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ బల్జీందర్ సింగ్ విద్యార్థులను హెచ్చరించారు. కానీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ఆందోళనను ఉధృతం చేశారు.ఈ క్రమంలో అక్కడ తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందని, పోలీసులు గమనించేసరికి డీఎస్పీ తలలొంచి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు.అదే బుల్లెట్ మరో పోలీసును తీవ్రంగా గాయపరించింది. వీరిని చికిత్స నిమిత్తం ఫరీద్‌కోట్‌లోని గురు గోవింద్ సింగ్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. డీఎస్పీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందారని నిర్ధారించారు. బుల్లెట్ గాయమైన మరో పోలీసుకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సర్వీస్ రివాల్వర్‌ను డీఎస్పీ పేల్చారా.. లేక విద్యార్థులు వినియోగించారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఐజీ ముఖ్విందర్ సింగ్ వివరించారు. -
చిక్కిన సేవా‘చీట్’ ఫండ్ యజమాని ?
కోదాడ : వందల మంది చిట్టీ సభ్యులను నిండా ముంచి బోర్డు తిప్పేసిన కోదాడలోని సేవా చిట్‌ఫండ్ నిర్వాహకుడు కోటేశ్వరరావును పోలీసులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టుకు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని కోదాడ స్టేషన్‌కు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకున్న బాధితులు వందల మంది స్టేషన్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ చట్ట పరిధిలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అతని వద్ద ఎంత మంది చిట్టీలు కట్టారు, ఎంత మందికి చెల్లించాలనే విషయాన్ని సేకరిస్తున్నామని, బాధితులు కూడా తమ వద్ద ఉన వివరాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ.12 కోట్లు సేవాచిట్ ఫండ్ సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ. 12 కోట్ల వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 524 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది కాక తెలిసిన వారి నుంచి వడ్డీలకు తెచ్చింది ఇంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. ఇది సివిల్ వ్యవహారం కాబట్టి వడ్డీ డబ్బుల విషయంలో పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదు. కేవలం చిట్ సభ్యుల డబ్బుల విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులందరిపై కేసులు? సేవాచిట్ ఫండ్ విషయంలో పోలీసులు ఒక్క నిర్వాహకుడిపై కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇది చూసి మరే ఇతర చిట్టీల నిర్వాహకుడు.. సభ్యులను ఇబ్బంది పెట్టకుండా భయపడే విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అతని పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. చిట్ నిర్వహణలో అతనికి తోడుగా ఉన్న తమ్ముడు రమేష్, సహాయపడిన మరో ఇద్దరితో పాటు కోటేశ్వరరావు భార్య, కుమారుడు, కుమార్తెల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలిసింది పలువురు ఏజెంట్లపై కూడా... సేవా చిట్‌ఫండ్‌లో సభ్యులను చేర్పించిన ఏజెంట్లపై కూడా పోలీసులు కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. 10 మంది ఏజెంట్లు సభ్యులను చేర్పించడంలో తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడ కుండా కేవలం కమీషన్ కోసం అమాయకులను చిట్టీలలో చేర్పించడం నేరం కాబట్టీ వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని సమాచారం. కోటేశ్వరరావు పలురకాల వ్యాధులతో బాధపడుతుండడంతో ఆయనను వీలైంత త్వరగా కోర్టుకు రిమాండ్ చేసి ఆ తరువాత కోర్టు అనుమతితో మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా విచారిస్తున్నాం సేవా చిట్‌ఫండ్ నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులందరి పైన ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా రిజిస్టర్ ఉన్న చిట్‌ఫండ్ కంపెనీలలో మాత్రమే చేరాలని కోరారు. కోదాడలో ఉన్న ఇతర చిట్‌ఫండ్ సంస్థల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ కేసు కొలిక్కి వచ్చిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు. -
నన్ను రిలీవ్ చేయండి: మహిళా క్రికెటర్
చండీగఢ్:గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కొత్త ఉద్యోగం కష్టాలు తప్పడం లేదు. ఆ ప్రపంచ కప్ తర్వాత పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగ హోదాను కల్పించినప్పటికీ, ఇప్పటికీ ఆమె కొత్త ఉద్యోగంలో చేరలేకపోయింది. అందుకు కారణం తన పాత ఉద్యోగం చేస్తున్న వెస్ట్రన్ రైల్వే నుంచి ఇంకా రిలీవ్ లెటర్ రాకపోవడమే. మూడు సంవత్సరాల క్రితం హర్మన్ ప్రీత్ కౌర్ వెస్ట్రన్ రైల్వేలో ఆఫీస్ సూపరిండెంట్ ఉద్యోగిగా చేరింది. ఆ సందర్భంగా ఐదేళ్ల బాండ్‌పై సంతకం చేసింది. మూడేళ్లు మాత్రమే పూర్తవ్వడంతో హర్మన్‌కు రైల్వే అధికారులు రిలీవింగ్ లెటర్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఆమె తనకు రిలీవ్ చేయాలంటూ మరోసారి విజ్ఞప్తి చేసింది. అప్పుడే డీఎస్పీ గా ఉద్యోగం చేయడానికి వీలువుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఆమె డీఎస్పీ ఉద్యోగంలో చేరుతుందని అమరీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
చనిపోయిన డీఎస్పీ ట్రాన్స్ఫర్..!
-
అవునా... చనిపోయిన డీఎస్పీ ట్రాన్స్ఫర్..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. అనంతపురం జిల్లా కదిరి, గాన్లపెంట గ్రామానికి చెందిన డేరంగుల రామాంజనేయులు ఆరు నెలల కిందట చనిపోయారు. తిరుమల ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు.. అనారోగ్య సమస్యలతో ఆరు నెలల కిందట మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీ ఉత్తర్వులలో కొన్ని నెలల కిందట చనిపోయిన రామాంజనేయులు పేరు ఉంది. ఆయనను తిరుమల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కు బదిలీ చేయడంతో పాటు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చనిపోయిన వ్యక్తిని బదిలీ చేయడం చర్చనీయాంశం కావడంతో నాలుక్కరుచుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ తప్పును కప్పిపుచ్చే యత్నం చేశారు. క్లరికల్ మిస్టేక్ అంటూ వివరణ ఇస్తూ.. బదిలీ జాబితా నుంచి రామాంజనేయులు పేరును తొలగించేశారు. ముందు బతికున్నవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని, పద్ధతిలో బదిలీ చేయాలంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.