41 మంది డీఎస్పీల బదిలీ | DGP Anjani Kumar Transfers 41 DSPs In Telangana | Sakshi
Sakshi News home page

41 మంది డీఎస్పీల బదిలీ

Published Sun, Jan 29 2023 12:37 AM | Last Updated on Sun, Jan 29 2023 3:01 PM

DGP Anjani Kumar Transfers 41 DSPs In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌–సివిల్‌ (డీఎస్పీ)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు (పీఈబీ) సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, ఈ పోస్టింగ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని శనివారం డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే పెద్దసంఖ్యలో ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఇక వచ్చేనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రబడ్జెట్‌ సమర్పణ, వచ్చేనెల 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తర్వాతే పెద్ద ఎత్తున పలు స్థాయిల్లోని ఐఏఎస్‌ అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement