transfers
-
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.అక్టోబర్‌లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్‌తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్‌లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్పై తాము చెప్పిన విధంగా వర్క్‌లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్‌ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. -
జీవో 317 బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా జీవో–317 కింద గతంలో కొత్త లోకల్ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌజ్ కేటగిరీ, పరస్పర బదిలీలు, అనారోగ్య కారణాల కింద వేరే లోకల్ కేడర్లకు మళ్లీ బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బదిలీలను డిసెంబర్ 31లోగా పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత లోకల్ కేడర్ల నుంచి కొత్త లోకల్ కేడర్లకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది. ఈ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని సుదూర ప్రాంతాల్లోని కేడర్లకు వెళ్లిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో జీవో–317, జీవో–56 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు తాజాగా మూడు కేటగిరీల కింద కేడర్ మార్పునకు అనుమతిచ్చింది. ఇక భార్యాభర్తలు ఒకేచోట! రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే భార్యాభర్తలను ఒకవేళ వే ర్వేరు లోకల్ కేడర్లకు కేటాయిస్తే కేడర్ మార్పును కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకా శం కల్పిస్తామని జీవో–317లో ప్రభుత్వం పేర్కొంటోంది. పాలనావసరాలు, ఖాళీలకు లోబడి భార్యాభర్తలిద్దరినీ ఒకే కేడర్‌కు కేటాయిస్తామని హామీ ఇ చ్చింది. కొన్ని శాఖల్లో దీన్ని అమలు చేయలేదు. చాలామంది ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద కేడర్ మార్పుకు దరఖాస్తు చేసుకున్నా పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రివర్గం ఈ అంశాన్ని పరిశీలించి ఖాళీలకు లోబడి గరిష్టంగా సాధ్యమైనంత వరకు కేడర్ మార్పునకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, సిఫార్సులను సేకరించి డిసెంబర్ 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి పరస్పర బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ.. ఒకే శాఖలో ఒకే కేటగిరీ పోస్టులను కలిగిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు లోకల్ కేడర్లలో పనిచేస్తుంటే వారిని ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 1 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా మళ్లీ కొత్తగా పరస్పర బదిలీలకు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్ (po2018mutualtransfers. telangana.gov.in) ను రూపొందించింది. ఎప్పటిలోగా ఈ బదిలీలను పూర్తి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఒకే యాజమాన్యం కింద ఒకే కేటగిరీ పోస్టులో ఉండి ఒకే సబ్జెక్టును ఒకే మీడియంలో బోధిస్తున్న ఉపాధ్యాయు లు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీకి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానికసంస్థల పాఠశాలల్లోని బోధనేతర ఉద్యోగులను పరస్పర బదిలీల్లో భాగంగా మరో లోకల్ కేడర్ పరిధిలోని సంబంధిత జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల్లోని పాఠశాలలకు మాత్రమే బదిలీ చేస్తామని తెలిపింది. పరస్పర బదిలీల కింద వచ్చే ఉద్యోగులను కొత్త లోకల్ కేడర్ సీనియారిటీ జాబితాలో చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంకును కేటాయిస్తామని స్పష్టం చేసింది.అనారోగ్య కారణాల కిందబదిలీలకు పచ్చజెండా.. ఆరోగ్య కారణాల కింద ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ కోరుతూ ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల కార్యదర్శులు పరీక్షించి అర్హులైన ఉద్యోగుల కేడర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 70 శాతం, ఆపై వైకల్యం కలిగిన ఉద్యోగులు, కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు ఉద్యోగులు, కేన్సర్ బాధిత ఉద్యోగులు, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయం మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు కేడర్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అవకాశం కల్పించాలని కోరింది. మానసిక వైకల్యంగల పిల్లలు కలిగిన ఉద్యోగులను వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది. డిసెంబర్ 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని కోరింది. -
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరిట శుక్రవారం విడుదలయ్యింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆ డీఎస్పీలను ఆర్డర్ కాపీల్లో ఆదేశించారు.ఇదీ చదవండి: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్ -
విద్యాశాఖలో భారీగా మార్పులు!
సాక్షి, అమరావతి: విద్యాశాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతోపాటు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులను సైతం మార్చనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో), ఆర్జేడీలకు కూడా స్థానచలనం కల్పించనున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రితమే వివరాలు తీసుకున్న విద్యాశాఖ మంత్రి కార్యాలయం... అధికారుల మార్పుపై తుది ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిని పదో తరగతి పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు) డైరెక్టర్‌గా బదిలీ చేస్తారని తెలిసింది. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న దేవానందరెడ్డిని ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా బదిలీ చేస్తారని సమాచారం. అలాగే కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్‌లలో ఒకరిని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ గంగాభవానీలను సమగ్ర శిక్షకు బదిలీ చేస్తారని సమాచారం. మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌గా ఇంటర్ విద్యలో పని చేస్తున్న శ్రీనివాసరావును, ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్రావును ఇంటర్ విద్యకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. వీరితోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం బదిలీ చేయనున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా డీఈవో తప్ప మిగిలిన 25 జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆరు నెలల క్రితమే మార్చారు. అయినా ఇప్పుడు మరోసారి వీరందరికీ స్థానచలనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. -
ఆమ్రపాలికి షాక్.. 9 మంది ఏఐఎస్‌లు ఏపీకి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీ కేడర్‌కు బదులుగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలన్న ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. వారిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన ఐదుగురు తెలంగాణలో పనిచేస్తున్నారు. అదేవిధంగా తమను తెలంగాణ కేడర్‌కు బదులు ఏపీ కేడర్‌కు కేటాయించాలన్న మరో ముగ్గురు ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తులనూ తిరస్కరించింది.తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రిలీవ్ చేయడంతోపాటు ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు షంషేర్ సింగ్ రావత్, జి.అనంతరాము ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తూ తమను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించి వారిద్దరినీ ఏపీలోనే కొనసాగాలని ఆదేశించింది. మిగిలిన వారంతా ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రానికి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది. వివాదం నేపథ్యం ఇది... రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏఐఎస్ అధికారుల కేటాయింపులను కేంద్రం చేపట్టింది. ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం. ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి. సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిష్త్, అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఆయా ఐఏఎస్, ఐపీఎస్‌లు గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వారి వాదనలు విన్న ట్రిబ్యునల్.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పుతో మారిన పరిస్థితి.. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో 2017, 2018లో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. సోమేశ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు... ఆ కేటాయింపును రద్దు చేస్తూ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలని 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది.. ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసులను సమర్ధించింది.. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్న సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.ఈ తీర్పును నాటి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకూ వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపులపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత సర్వీసు, మిగిలిన సర్వీసుతోపాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొని గతంలో జరిపిన తుది కేటాయింపులపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వివాదంపై నిర్ణయం తీసుకొనే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది.ఆ అధికారుల విజ్ఞప్తులపై కేంద్రం నిర్ణయం తీసుకొనే వరకు వారందరినీ ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ అధికారుల తుది కేటాయింపులపై పునఃపరిశీలన కోసం హైకోర్టు ఆదేశాల మేరకు డీవోపీటీ శాఖ మాజీ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ దీపక్ ఖండేకర్‌తో ఆ శాఖ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా అధికారుల నుంచి కమిటీ వినతిపత్రాలను స్వీకరించడంతోపాటు వారితో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరిస్తూ డీవోపీటీకి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను డీవోపీటీ ఆమోదించింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారులు 1..మల్లేల ప్రశాంతి 2. వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి 3. ఎ.వాణీ ప్రసాద్, ముఖ్యకార్యదర్శి, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ 4. డి.రోనాల్డ్ రోస్, ఇంధన శాఖ కార్యదర్శి 5. కాటా ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలంగాణకు కేటాయించాలన్న విజ్ఞప్తి తిరస్కరించడంతో ఏపీలోనే కొనసాగనున్న ఐఏఎస్ అధికారులు.. 1. షంషేర్ సింగ్ రావత్, స్పెషల్ సీఎస్, ఏపీ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు) 2.జి.అనంతరాము, స్పెషల్ సీఎస్, ఏపీ అటవీ శాఖ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు 1.అంజనీకుమార్, డీజీ, రోడ్ సేఫ్టీ ఆథారిటీ 2. అభిలాష భిస్త్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏపీ నుంచి తెలంగాణకు రానున్న ఐఏఎస్ అధికారులు... 1.శివశంకర్ లోతేటి – వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ 2. శ్రీజన, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ 3. సి.హరికిరణ్ -
ముగ్గురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, అమరావతి: పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ముగ్గురు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను ధర్మవరం కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వి.మల్లికార్జునను ప్రొద్దుటూరుకు మార్చారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు కమిషనర్‌గా ఉన్న జి.రఘునాథరెడ్డిని బాపట్ల కమిషనర్‌గా నియమించారు. ఈ స్థానంలో పనిచేస్తున్న వి.నిర్మల్ కుమార్‌ను కేంద్ర ఆరి్థక శాఖ (సీసీఏఎస్)కు పంపారు. -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
కాసులిస్తేనే నచ్చిన చోటు
రాష్ట్రంలో అధికారికంగా బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసినప్పటికీ పరిశ్రమల శాఖలో కీలక పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తికాలేదు. పైసలు ఇస్తేనే బదిలీ ఆర్డర్లు ఇస్తామంటూ కీలకస్థాయి అధికారి బేరం పెట్టడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. జనరల్ మేనేజర్ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల బదిలీల వరకు ఎన్నడూ లేనివిధంగా గడువు ముగిసినా ఆర్డర్లు జారీ చేయకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడిగిన మొత్తం చెల్లించిన వారికి నచ్చిన చోటకు బదిలీ చేస్తూ పాత తేదీ (బ్యాక్ డేట్)తో ఉత్తర్వులు ఇస్తామంటూ ఉద్యోగులతో నేరుగా బేరాలు సాగిస్తుండటంతో జిల్లాస్థాయి అధికారులు లబోదిబోమంటున్నారు. పిల్లల చదువుల నిమిత్తం ఎప్పటినుంచో బదిలీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆర్డరు కాపీని తొక్కిపెట్టారంటూ ఒక ఉద్యోగి వాపోయారు. ఈ విధంగా పైస్థాయి అధికారి నేరుగా జిల్లాస్థాయి అధికారులకు ఫోన్లు చేసి అడగడం ఇప్పటివరకు ఎప్పుడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసారి నేరుగా ఆయనే ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. సాక్షి, అమరావతిగృహ నిర్మాణ శాఖలో కాసుల పంట గృహ నిర్మాణ శాఖలో సాధారణ బదిలీలు కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండించాయి. సీనియారిటీ, స్పౌజ్ వంటి నిబంధనలను పక్కనపెట్టి రాజకీయ సిఫార్సులు, వసూళ్లకు పెద్దపీట వేశారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. తన ఓఎస్డీ ద్వారా కీలక ప్రజాప్రతినిధి వసూళ్లకు తెరలేపారు. ఓఎస్డీ నేరుగా డీఈ, ఈఈ, ఎస్ఈలకు ఫోన్లు చేసి వసూళ్ల వ్యవహారం చక్కబెట్టినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆపైన ముట్టచెప్పిన వారికే కోరిన స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు, డబ్బు ఇవ్వని వారికి అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టింగ్ కావాల్సిన చోట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు తీసుకోవడం కోసం అక్కడ కూడా రూ.లక్షల్లోనే ఉద్యోగులు ముట్టజెప్పారు. రాజకీయ సిఫార్సులు, డబ్బు చెల్లించిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడం కోసం ఏడాది, రెండేళ్ల క్రితం నియమించిన వారిని వేరే చోటకు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఆదివారంలోగా బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే, సిఫార్సులు, వసూళ్ల ఆధారంగా కోరుకున్న చోట ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో సోమవారానికి తుది జాబితా గృహ నిర్మాణ శాఖకు అందినట్టు తెలిసింది. పోరుబాటలో ఇంధన శాఖ ఉద్యోగులు! విద్యుత్ సంస్థల్లో బదిలీలకు ముందే సిఫారసు లేఖలు ఇచ్చిన వైనం బయట పడటంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు కనీస అర్హత ఉన్నవారికే సిఫారసులను అన్వయించేలా తీవ్రంగా కసరత్తు చేశారు. అయినప్పటికీ.. తాము అనుకున్న విధంగానే బదిలీలు జరగాలని, తమ సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని కూటమి నేతలు పట్టుబట్టారు. ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ వారిని ప్రతిపాదించడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో 22వ తేదీకే పూర్తవ్వాల్సిన బదిలీలు 23న కూడా కొనసాగాయి. డిస్కంలలో జూనియర్ లైన్మెన్ స్థాయి నుంచి డిప్యూటీ ఇంజనీర్ స్థాయి వరకూ వందల మందిని బదిలీ చేశారు.రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. బీసీ, ఓసీ సంఘాల నేతలకు బదిలీ నుంచి మినహాయింపు (ప్రొటెక్షన్) ఇవ్వలేదు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు రెండు సంఘాల ఉద్యోగులు సోమవారం ప్రకటించారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్‌లు కట్టబెట్టారు. పోస్టింగ్‌ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్‌లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్‌లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్‌కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్‌లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్‌ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్‌ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్‌కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్‌కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్‌కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్‌లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్‌ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
మేము చెప్పినట్లు జరగాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో తాము చెప్పినట్లే బదిలీలు జరగాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో గడువు ముగిసినప్పటికీ గత్యంతరం లేక పాత తేదీలతో అధికారులు బదిలీలు చేస్తున్నారు. ఈ శాఖలో బదిలీలకు ముందే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు నేతల సిఫారసులు ఉన్నప్పటికీ, కనీస అర్హత ఉన్న ఉద్యోగుల బదిలీలలనే ఆమోదించారు. ఆ మేరకు కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. అలాగే రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా తృప్తి పడని కొందరు నేతలు ఇంకా ఒత్తిళ్లు తేవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు వారిచ్చిన బదిలీలను సైతం పాత తేదీలతో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బదిలీలకు ఈ నెల 22వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌లో ఆరుగురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త పోస్టింగ్‌లతో మంగళవారం మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీ దేవాదాయ శాఖలో భారీ బదిలీలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం రత్నరాజును డిప్యూటీ ఈవోగా నియమించారు. అలాగే మహానందీశ్వర స్వామి దేవస్థానం డీసీ శోభారాణికి.. ఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న విజయ రాజును కర్నూల్ ఉరుకుండ నరసింహ ఎర్రన్న స్వామివారి దేవస్థానానికి డీసీ & ఈవోగా నియమించారు.శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం డీసీ, ఈవో డీవీఎల్ రమేష్ బాబును కాకినాడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు మొత్తం 15 మందికి పోస్టింగ్‌లతో పాటు బదిలీలు జారీస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణ(ఐఏఎస్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదీ చదవండి: దుష్ప్రచారంలో దిట్ట -
పంచాయతీరాజ్‌లో భారీగా బదిలీలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పంచాయతీరాజ్ శాఖలోని కీలకస్థానాల్లో ఉన్న దాదాపు 200మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు అయినా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 12 జీవోలను జారీ చేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ప్రతిపాదనలు కొనసాగుతుండగా.. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో 13 ఉమ్మడి జిల్లాల జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవో స్థానాల్లో ప్రభుత్వం కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.రాష్ట్రంలో మొత్తం 26 విభజిత జిల్లాలు ఉండగా.. అందులో 25 జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు)గా, 22 జిల్లాల్లో డ్వామా పీడీలుగా కొత్త వారిని నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ స్థాయిల్లో ఇద్దరు డీఎల్డీవోలను నియమించింది. ఏడు జిల్లాలో డీఆర్డీఏ అధికారులుగా కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరు కాకుండా రాష్ట్రమంతటా వివిధ ప్రాంతాల్లో పనిచేసే 49 మంది డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల(డీఎల్డీవో)ను బదిలీ చేసింది. ఇంజనీరింగ్ శాఖలో..పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో పలువురు ఇంజనీరింగ్ అధికారులకు పదోన్నతులు కల్పించడంతో పాటు భారీగానే బదిలీలు చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ల (ఎస్ఈ)కు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)గా పదోన్నతులు కల్పించి, ఒకరిని ఈఎన్సీ కార్యాలయంలోనూ, మరొకరిని రాష్ట్ర సచివాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోనే 12 మంది ఈఈలకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు (ఎస్ఈ)గా పదోన్నతులు కల్పించి, వారిలో తొమ్మిది మందిని వివిధ జిల్లాల ఎస్ఈలుగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరితో పాటు 26 మంది ఈఈలను కూడా బదిలీ చేసింది. మరో ఆరుగురు డిప్యూటీ ఈఈలకు ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్డబ్ల్యూఎస్లోనూ ముగ్గురు ఎస్ఈలు, ఎనిమిది మంది ఈఈలను వేర్వేరు స్థానాల్లో ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖలో 13 మందికి స్థానచలనంఅటవీ శాఖలో 13 మంది రాష్ట్ర కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ కన్సర్వేటర్గా పనిచేస్తున్న ఎం.శామ్యూల్‌ను అనకాపల్లి డీఎఫ్‌వోగా, కృష్ణాజిల్లా డీఎఫ్‌వోగా ఉన్న కె.రాజశేఖరరావును ప్రకాశం సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. మరికొందరు డీఎఫ్‌వోలను బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వగా, కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వాణిజ్యపన్నుల శాఖలో... వాణిజ్యపన్నుల శాఖలో కమిషనర్‌గా ఉన్న కె.రవిశంకర్‌కు చీఫ్ కమిషనర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, మరో కమిషనర్ డి.రమేష్‌కు విజయవాడ అప్పిలేట్ అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ముగ్గురు అడిషనల్ కమిషనర్లతోపాటు ఏడుగురు జేసీలు, 14 డీసీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.అర్ధరాత్రి కూడా బదిలీల తంతు బదిలీలకు ఆదివారం ఆఖరి రోజు కావడంతో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జోన్–1 పరిధిలో 124 మందిని బదిలీ చేస్తూ రెండు ఉత్తర్వులు, పెద్ద ఆలయాల్లో ఆరుగురు ఇంజనీరింగ్ అధికారుల బదిలీకి సంబంధించి ఒక ఉత్తర్వు ఇచ్చారు. -
నచ్చిన వారికి మెచ్చిన చోటు!
వరంగల్ స్థానికత కలిగిన ఓ సబ్ రిజిస్ట్రార్ మెదక్‌లో పనిచేస్తుండేవారు. ఆయన 317 జీవో కింద మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లారు. ఆ సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో తనను స్పౌజ్ కోటా కింద పరిగణనలోకి తీసుకుని స్టేషన్ కేటాయించాలని, లేదంటే తనకు స్టేషన్ అవసరం లేదని, చిట్స్కయినా, ఆడిట్కయినా పంపాలని ఆ సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానానికి 100 కిలోమీటర్ల అవతలకు బదిలీ చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి అదే జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులోని నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తనను స్పౌజ్ కోటా కింద పరిగణనలోకి తీసుకుని తగిన స్థానం ఇవ్వాలని సదరు సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆయన్ను హైదరాబాద్‌కు మరింత దగ్గరగా బదిలీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ల యూనియన్ పేరుతో చెలామణి అవుతున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లకు వరుసగా మూడోసారి ఫోకల్ పోస్టింగులిచ్చి ఏ గ్రేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బదిలీ చేశారు. ఏసీబీ ట్రాప్ రికార్డులు కూడా పట్టించుకోకుండా కావాల్సిన స్థానానికి బదిలీ చేయడం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల్లో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు అధికారుల కనుసన్నల్లో ఈ బదిలీల తంతు జరిగిందని, బదిలీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు విని్పస్తుండగా, తాజాగా నిఘా వర్గాల నివేదికతో బదిలీలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. ఆప్షన్లు ఒకచోటుకు పెడితే మరో చోటుకు బదిలీ చేశారని, సింగిల్ డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను పంపి, జిల్లా కేంద్రాల్లో సీనియర్ అసిస్టెంట్లతో సరిపెట్టారని, స్పౌజ్ కేసులను పట్టించుకోలేదని, జీరో సరీ్వసు అంటూ అందరినీ బదిలీ చేస్తామని చెప్పి చివరకు పరిపాలనా అవసరాలంటూ పది స్టేషన్ల వరకు బదిలీలు చేయలేదని పలువురు సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు.తమకు నచ్చిన వారికి మాత్రం వరుసగా మూడోసారి ఫోకల్ పోస్టింగులు ఇచ్చారని, చార్మినార్ జోన్ పేరుతో కొందరు సబ్ రిజిస్ట్రార్లను ఏ గ్రేడ్ స్టేషన్ల చుట్టూనే తిప్పుతున్నారని, ఇందుకోసం డబ్బులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. డీఐజీల స్థాయిలో సిద్ధమైన జాబితాకు, విడుదలైన బదిలీల జాబితాలకు పొంతన లేకుండా పోయిందని, ఆ ఇద్దరు అధికారులు చక్రం తిప్పి తమ ఇష్టారాజ్యంగా పేర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పైరవీలకు అస్కారమివ్వకుండా రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులకు బాధ్యత అప్పగిస్తే, అడ్డగోలుగా బదిలీలు చేసి అంతా బాగానే జరిగినట్టు ఆయన్ను నమ్మించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. బదిలీలకు కొద్దిరోజుల ముందే వచ్చిన కమిషనర్‌ను కూడా బురిడీ కొట్టించి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.ఆప్షన్లు ఎందుకు అడిగినట్టో..? సాధారణ బదిలీల్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్లను ఆప్షన్లు అడిగారు. ఈ ఆప్షన్ల వారీగా వారి ప్రాధాన్యతలను తెలుసుకోవడం ఎప్పుడూ జరిగే ప్రక్రియే. కాగా సబ్ రిజిస్ట్రార్లందరూ తమ అభీష్టం మేరకు ఆప్షన్లు ఇచ్చి ఆయా స్టేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. తీరా బదిలీల జాబితా చూస్తే ఆప్షన్లు ఇచ్చిన స్టేషన్లకు, తమను బదిలీ చేసిన స్టేషన్‌కు అసలు పొంతన లేకపోవడంతో విస్తుపోవడం బాధిత సబ్ రిజిస్ట్రార్ల వంతయింది. నోడల్ జిల్లా రిజిస్ట్రార్లుగా జూనియర్ అసిస్టెంట్లు! రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు జిల్లా రిజిస్ట్రార్లు లేరు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా రిజిస్ట్రార్లు పనిచేస్తుండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే సబ్ రిజిస్ట్రార్లు నోడల్ జిల్లా రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి జిల్లా కేంద్రాలకు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా పంపడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు జిల్లా కేంద్రాలతో పాటు, కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన మరో జిల్లా కేంద్రానికి బదిలీల తర్వాత కూడా ఇన్చార్జులే సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగుతుండగా, రోజుకు ఒకటో, రెండో డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు మాత్రం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను పంపారనే విమర్శలు ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్లుగా సన్నిహితులు! బదిలీల్లో అక్రమాలు, అన్యాయాల మాట అటుంచితే.. సాధారణ బదిలీల గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీగా ఉన్న ఏడెనిమిది కార్యాలయాలకు తమకు నచ్చిన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను పంపడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రం, హైదరాబాద్ తూర్పు దిక్కున అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే స్టేషన్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇంకో స్టేషన్‌తో పాటు ఖాళీగా ఉన్న స్టేషన్లకు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్‌పై పంపారని, వీరంతా బదిలీల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన అధికారులకు సన్నిహితులేననే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. సబ్ రిజిస్ట్రార్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్ల విషయంలోనూ ఇష్టారాజ్యంగా బదిలీలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. -
బదిలీకి లేఖ.. దండుకోవడమే ఇక
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీల ప్రజాప్రతినిధులు అందినకాడికి దండుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు వారికి రూ. లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఆ కోవలోనే విద్యుత్ శాఖలో కూడా భారీగా డబ్బులు చేతులు మారాయి. అర్హతను, నిబంధనలను బట్టి చేయాల్సిన బదిలీల్లో రాజకీయ నేతల సిఫారసు లేఖలే రాజ్యమేలుతున్నాయి. ఏ ఉద్యోగిని కదపాలన్నా, ఎక్కడికి బదిలీ చేయాలన్నా, ఉన్నచోటనే ఉంచాలన్నా.. ఈ లేఖా్రస్తాన్ని సంధిస్తే చాలు పనైపోతోంది. ఇందుకోసం ఒక్కో పోస్టుకు దాని ప్రాధాన్యతను బట్టి రూ.5 లక్షల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకూ ఉద్యోగులు సమర్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగుల బదిలీలకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన సిఫారసు లేఖలు, వాటి ఆధారంగా విద్యుత్ సంస్థలు తయారు చేసిన రాజకీయ బదిలీల జాబితాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తమ మాట వినని వారిని వేధించడం, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు వంటి చర్యలను చూస్తున్న ఉన్నతాధికారులకు ఆ పారీ్టల నేతలు చెప్పింది చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. తమకు అనుకూలురైన వారిని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కిస్తోంది. విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించిన ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న చంద్రానికి మాత్రం ఏపీసీపీడీసీఎల్లోనూ అదే స్థానాన్ని కట్టబెట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఆయనకు సత్సంబంధాలు ఉండటంతోనే రెండు డిస్కంలలో ఒకే పోస్టులో కొనసాగుతున్నారు. ఇక బదిలీల కోసం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన ఉద్యోగుల పేర్లతో ప్రత్యేకంగా జాబితాలను సీఎండీలు తయారు చేయించారు. ఆ జాబితాలు దగ్గర పెట్టుకుని బదిలీల ప్రక్రియను జరిపిస్తున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని వారు, ఎవరి నుంచీ రాజకీయ సిఫారసులు తీసుకుని రాలేని వారు దీనివల్ల బలైపోతున్నారు. వారిని అప్రా«దాన్య పోస్టుల్లోకి, ప్రాంతాలకు బదిలీ చేసేస్తున్నారు.ఇవిగో సాక్ష్యాలు » ఏలూరు సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఏఈఈ) రాజమండ్రి డి7 సెక్షన్‌కు బదిలీ కోసం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీకి ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిఫారసు చేశారు. » విశాఖ సర్కిల్లో ఓ ఏఈఈని రాజమండ్రి సర్కిల్లోని గోపాలపట్నం రూరల్ సెక్షన్‌కు బదిలీ చేయాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సిఫారసు చేశారు. » మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓ ఏఈని ఏలూరు సర్కిల్ నుంచి రాయవరం బదిలీ చేయమని చెప్పారు. » రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ ఏలూరు సర్కిల్ నుంచి ఓ ఏఈఈని సంపత్‌నగరం పంపమన్నారు. n ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఓ ఏఈని రాజమండ్రి సర్కిల్ నుంచి ఏలూరు సర్కిల్‌కు బదిలీ చేయాలని సిఫారసు చేశారు. » ఏలూరు సర్కిల్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ)ని కొయ్యలగూడెం సబ్ డివిజన్‌కు మార్చాల్సిందిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సీఎండీకి లేఖ ఇచ్చారు.ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలలో జరుగుతున్న బదిలీలు మొత్తం ఇదే విధంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగానే జరుగుతున్నాయి. (ఆ ఉద్యోగుల పేర్లు, వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల పేర్లతో సహా ‘సాక్షి’ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారి ఉద్యోగ భద్రత దృష్ట్యా ఆ వివరాలను ప్రచురించడం లేదు.)మేమెందుకు తగ్గాలి?బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీసీపీడీసీఎల్‌కు కొత్త సీఎండీని నియమించినా ఇటీవల బదిలీపై వచ్చిన ఉన్నతాధికారే మొత్తం బదిలీల ప్రక్రియను చూస్తున్నారు. ఈ డిస్కం పరిధిలో ఓ ఎమ్మెల్యేకి మరో ఉన్నతాధికారి స్వయంగా డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో ఓ ఉన్నతాధికారి పశి్చమ గోదావరి జిల్లాలో ఉన్న ఓ ఉద్యోగి సాయంతో సొంత వారి చేత వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నారు.రాజమండ్రికి చెందిన ఓ యూనియన్ నేత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నారు. ఇక ఏపీఎస్పీడీసీఎల్లో ఓ ఉన్నతాధికారికి మూడు డిస్కంలతో అనుబంధం ఉండటంతో ప్రజాప్రతినిధులకు అనుగుణంగా వాటిని నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు సామాజిక సమీకరణాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగులకూ బదిలీలు!
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రభుత్వ పాలనను అత్యంత చేరువ చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన విషయం విదితమే. అయితే ప్రస్తుత చంద్రబాబునాయుడి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సైతం రంగం సిద్ధం చేసింది. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా వివిధ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకేచోట ఐదేళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా ఐదేళ్లు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. అయితే, నిర్ణీత నిబంధనల మేరకు బదిలీ కావాలని కోరుకునే వారికి బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు.. అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా బదిలీ చేసే అవకాశం ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.మార్గదర్శకాలివే.. » బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల 27లోగా దరఖాస్తులు చేసుకోవాలి » దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఈ నెల 29, 30 తేదీలో ఆఫ్‌లైన్ (వ్యక్తిగతంగా హాజరయ్యే విధానం)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిక్వెస్టు బదిలీల ప్రాధాన్యత క్రమం.. » మొదట దివ్యాంగులకు, మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో కనీసం రెండేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్య, భర్తలకు, పరసర్ప అంగీకార బదిలీలకు క్రమ పద్ధతిలో వీలు కల్పించనున్నారు. » గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఉద్యానవన అసిస్టెంట్లు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, మహిళా పోలీసు ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్లు బదిలీల అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు.» విలేజీ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జేడీలు, సెరికల్చర్ అసిస్టెంట్లకు జిల్లా సెరికల్చర్ అధికారులు, ఏఎన్ఎంలకు జిల్లా డీఎంహెచ్‌వో, ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కంల ఎస్ఈ అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు బదిలీల అ«దీకృత అధికారులుగా ఉంటారు. » 50 ఏళ్ల లోపు వయస్సు ఉద్యోగులనే గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు. » ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకుని, నిరీ్ణత తేదీలో కౌన్సెలింగ్‌కు హాజరు కాని పక్షంలో ఆ ఉద్యోగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
‘పటమట’ పాట.. రూ.2 కోట్ల పైమాట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. లావాదేవీలు, ఆదాయం ఎక్కువగా వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పోస్టులపైన అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. ఆ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చేందుకు ధర నిర్ణయించి వేలం పాట పెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ పాటలో ఎవరెక్కువ మొత్తం చెల్లిస్తారో వారిని ఆయా పోస్టుల్లో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా.. నిబంధనలతో సంబంధం లేకుండా సబ్ రిజిస్ట్రార్లంతా బదిలీలకు ఆప్షన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనధికారిక ఆదేశాలు అందడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెసెంజరు ద్వారా ఉత్తర్వులు అందించి, రిక్వెస్ట్ ఫారాలను వాట్సప్‌లో పంపారు. బదిలీ అభ్యర్థనలను శుక్రవారం మధ్యాహ్నంలోపు పూర్తిచేసి పంపాలని షరతు విధించారు. వారు బదిలీ కోరుకుంటున్న స్థానాల ఆప్షన్లతోపాటు గతంలో వారు పనిచేసిన సెంటర్లు, వారిపై ఉన్న కేసులు, సర్వీసు తదితర వివరాలన్నింటినీ ఫామ్‌లో పూర్తిచేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బంది ఇది తప్పక పాటించాలని ఆదేశించారు. అయితే, ఇది ఎవరు జారీచేశారో ఆ ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్హం. అసలు బదిలీ స్థానాలు గుర్తించకుండా, ఎవరు బదిలీలకు అర్హులో తేల్చకుండా ఆప్షన్లు ఇవ్వాలని సూచించడం బలవంతపు బదిలీలకు ఒత్తిడి చేయడమేనని ఆ శాఖలో గగ్గోలు మొదలైంది. డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ..ఎక్కువ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు, అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ ఏర్పడింది. దీనిని అసరాగా చేసుకుని, చినబాబు కనుసన్నల్లోనే నడిచే టీం ఈ పోస్టులకు «ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది.» ఇందులో మొదటి స్థానంలో విజయవాడ పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు స్టాండర్డ్ ధర రూ.2 కోట్లుగా నిర్ణయించి, అంతకంటే ఎక్కువ ఇచ్చుకునే వారికే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఈ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పోస్టుకోసం గుణదల, కంకిపాడు, రావులపాలెం సబ్రిజిస్ట్రార్లతో పాటు, ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్, ఐజీకి సన్నిహితంగా ఉండే వారూ పోటీపడుతున్నట్లు సమాచారం. » ఇక రెండవ వరుసలో గాంధీనగర్, గన్నవరం, కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు రూ.కోటికి పైగా ధర పలుకుతున్నాయి. ఈ జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరి, నల్లపాడు, గుంటూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.» అలాగే, విజయవాడ పరిధిలోని నున్న, గుణదల, ఇబ్రహీంపట్నం, నందిగామ, బాపులపాడు సబ్ రిజిస్ట్రార్ పోస్టులూ రూ.70 లక్షల వరకు పలుకుతున్నాయి.» విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఇప్పటికే లోపాయకారీగా వేలం పాట జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది... ఇలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా ధరలు ఫిక్స్ చేసి బదిలీల బేరసారాలకు తెరలేపారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రిని కూడా డమ్మీచేసి, ఈ బదిలీల వ్యవహారాలను చినబాబే నేరుగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్గదర్శకాలకు భిన్నంగా ‘చిన్నబాబు’ పెద్ద స్కెచ్..నిజానికి.. ఉద్యోగుల సాధారణ బదిలీలకు వీలుగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకనుగుణంగా ఆయా శాఖలు మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శకాలిచ్చి బదిలీలు జరపాల్సి వుంది. కానీ, రిజస్ట్రేషన్ల శాఖలో ఈ మార్గదర్శకాలు ఇంకా జారీకాలేదు. అయినా, సబ్ రిజిస్ట్రార్లు తాము బదిలీ కోరుకునే స్థానాలకు సంబంధించిన ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. వీటిని అడ్డంపెట్టుకుని ‘చినబాబు’ టీం పెద్ద స్కెచ్ వేస్తోంది. డిమాండ్ ఉన్న పోస్టుల పేరుతో భారీగా దండుకునేందుకే అందరినీ దరఖాస్తు చేసుకోవాలని అనధికారికంగా ఆదేశాలిచ్చింది. తద్వారా తమకు కావల్సిన వారిని ఎంపిక చేసుకోవడం, కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఎవరు రేసులో ఉన్నారో తెలుసుకోవడానికే కౌన్సిలింగ్ ముందు ఈ సందేశాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ఆప్షన్లు అడగలేదని, కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిపేటప్పుడు ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు. -
జలమండలిలో కొత్తనీరు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం తర్వాత జలమండలి యంత్రాంగంలో కొత్త నీరు వచ్చి చేరింది. ప్రధాన కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన కీలక ఉన్నతాధికారుల పదవీ విరమణ, బదిలీలతో కొత్తవారికి అవకాశం లభించింది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జనరల్ మేనేజర్ల వరకు కొత్తవారు బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, రెండు రోజులు క్రితం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరో ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే కీలక విభాగాల ఇద్దరు డైరెక్టర్లు పదవీ విరమణ చేయగా, మరో డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సుంకిశాల ఘటనలో మరో ప్రాజెక్టు డైరెకర్లపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సీజీఏ, జీఎం, డీజీఎం స్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలగడంతో యంత్రాంగంలో కొత్తదనం వచ్చింది. అంతా అస్తవ్యస్తమే.. మహా నగరంలో తాగునీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్ర స్థాయి పరిస్థితి అధ్వానంగా మారింది. తాగునీటి సరఫరాలో అడుగడుగునా లీకేజీలు, లోప్రెషర్, కలుíÙత నీటి సరఫరా, లైన్మెన్ల చేతివాటం, నల్లా అక్రమ కనెక్షన్లు, ఎక్కడపడితే అక్కడ పొంగిపొర్లే మురుగు, పగిలిన మ్యాన్‌హోళ్ల వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఫిర్యాదు చేస్తే కానీ స్పందించని పరిస్థితి నెలకొంది. అడుగడుగు చేతివాటంతో బోర్డుకు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తాగునీటి సరఫరా, సీవరేజ్ చార్జీల బకాయిలు కూడా పెద్దఎత్తున పేరుకుపోయాయి. అంతా ఇష్టానుసారమే.. జలమండలిలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పనితీరు ఇష్టానుసారంగా మారింది. ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్లలో సైతం కనీస సమయపాలన లేకుండా పోయింది.అంతా ఫీల్డ్ విజిట్ అంటూ మధ్యాహ్నం వరకు ఆఫీస్‌లలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సాధారణ బదిలీలు జరగడంతో సర్కిల్. డివిజన్, సబ్డివిజన్లలో సైతం కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఇప్పటికైనా బోర్డు పాలన యంత్రాంగంతోపాటు సిబ్బంది పనీతీరులో మార్పు వచ్చేనా అనే చర్చ సాగుతోంది. -
పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం
నంద్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం నడుస్తోంది. కూటమి నేతల్లో ప్రభుత్వం ఏర్పాటు నుంచి అధికార దర్పం ప్రదర్శించడం మరీ ఎక్కవైపోయింది. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నందికొట్కూరులో నంద్యాల ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోస్టింగ్ ల రగడ నెలకొంది. పోలీసులు బదిలీల్లో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయింది. మొన్న నందికొట్కూరు సర్కిల్ సీఐ పోస్టింగ్ లో నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగ్గా.. ఇవాళ జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. అయితే.. ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేపించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమర్రి పీఎస్ ఎస్ఐగా ఎవరివారే సిఫార్సు చేసిన వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలంటున్న పట్టుపట్టారు ఇద్దరు. పోలీస్ ఉన్నతాధికారులు డీఓలు వేయడం, వెంటనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల సిఫార్సులకు నాలుగు సింహలు తలోగుతుండగా.. అధికారుల తీరుతో సర్కిల్ పోలీస్ సిబ్బంది నలిగిపోతున్నారు. -
రక్షణ కార్యదర్శిగా రాజేష్ సింగ్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్ సింగ్ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు గిరిధర్ స్థానంలో రాజేష్‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోకాట్ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. -
AP: ఉద్యోగుల బదిలీల విధివిధానాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం బుధవారం(ఆగస్టు14) విడుదల చేసింది.బదిలీల జీవో గురువారం విడుదల కానుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 31 వరకు 16 రోజుల్లో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
‘పని సర్దుబాటు’ నిర్ణయాన్ని పునరాలోచించాలి
సాక్షి, అమరావతి: జీవో 117 ప్రకారం పనిసర్దుబాటు ద్వారా బదిలీలు జరపాలని ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీటీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోర్ల సుధాకర్, కాళింగిరి కుమార్ విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117ను రద్దు చేయాలని కోరుతున్నా, అదే జీవోతో పని సర్దుబాటు చేస్తే పాఠశాల విద్య మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే జీవో 117, 128 ప్రకారం పనిసర్దుబాటు కోసం ఏఏ కేడర్లలో ఎంతమంది అవసరమో అంతమందిని సర్దుబాటు చేయాల్సిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ ఉత్తర్వుల ప్రకారం 98 కంటే తక్కువ రోల్ ఉన్న పాఠశాలలకు గతేడాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించలేదని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి, రమణయ్య తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటు బదిలీలు ఏక పక్షంగా చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. -
పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 మంది మున్సి పల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధి కారులకు స్థానచలనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. -
కొలిక్కిరాని గురుకుల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎటూ తేలకపోతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అత్యధికంగా రెగ్యులర్ టీచర్లున్న ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో టీచర్ పదోన్నతుల ప్రక్రియను నిర్వహిస్తూనే.. సమాంతరంగా బదిలీలనూ చేపట్టారు. కానీ కొన్ని గురుకుల పాఠశాలల్లో శాంక్షన్డ్ పోస్టులు, వర్కింగ్ కేటగిరీ సరితూగక పోవడంతో సొసైటీ అధికారులు.. పాఠశాలల వారీగా పోస్టుల మంజూరు లెక్కలను పరిశీలించారు.ఈ సొసైటీ పరిధిలో జీఓ 317 కింద చేసిన కేటాయింపులు కూడా పొంతన లేకుండా ఉన్నాయని గుర్తించి.. ఆ మేరకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులను డిస్లొకేట్ చేస్తూ కొత్త చోట్ల నియమించారు. ఆ ఉద్యోగులు, బదిలీల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. అప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ చాలావరకు పూర్తయినా.. కోర్టు స్టే నేపథ్యంలో పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ఉద్యోగులంతా పాతస్థానాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈనెలాఖరుతో ముగుస్తుంది. తర్వాత నిషేధం అమలవుతుంది. ఆలోపు పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయా? లేదా? అని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకుల పరిధిలో.. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో కేటాయింపులపై ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మైనార్టీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల సంఖ్య తక్కువే. అన్నీ కొత్త గురుకులాలు కావడం, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులంతా కొత్తవారే కావడంతో సులువుగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని భావించారు. కానీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం, నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ గందరగోళంగా మారింది.బదిలీల ప్రక్రియలో తప్పులు కూడా ఇబ్బందిగా మారా యి. కొన్ని గురుకుల పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి రెండు పోస్టులు మాత్రమే ఉంటే అక్కడ అదే సబ్జెక్ట్ వారు ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు. మరికొందరికి ఎంచుకున్న ఆప్షన్‌కు బదులు ఇతర చోట పోస్టింగ్ ఇవ్వడం వంటివీ చోటు చేసుకున్నాయి. -
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
ఎస్సీ గురుకులాల్లో ‘డిస్ లొకేటెడ్’ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్ ఈఐఎస్) పరిధిలో జరుగు తున్న ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ గందర గోళంగా మారింది. ఈ సొసైటీ పరిధిలోని పలు కేడర్లలోని ఉద్యోగులకు ఓవైపు పదోన్న తులు కల్పిస్తూనే.. మరోవైపు బదిలీల ప్రక్రియ నిర్వహించేలా సొసైటీ కార్యాచరణ రూ పొందించి అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో బదిలీ లు, పదోన్నతులకు అర్హత పొందిన ఉద్యోగుల జాబి తాను ప్రకటించారు. జీఓ 317 అమలులో భాగంగా పలు వురు ఉద్యోగులను వారు పని చేస్తున్న పరిధిని డిస్లొకేట్ చేస్తూ కొత్తగా జోన్లు, మల్టీజోన్లు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. డిస్‌లొకేటెడ్ జాబితాలో ఉన్న ఉద్యోగులు తక్షణమే బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావా లని, లేకుంటే ఖాళీ ల లభ్యతను బట్టి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో డిస్‌లొకేటెడ్ జాబితాలో ఉన్న ఉద్యోగులు సొసైటీ కార్యాయా నికి చేరుకోవడం.. వారిని డిస్‌లొకేటెడ్ జాబితా లోకి తీసుకు రావడంపై ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి మొదలైన ఈ పరిస్థితి మంగళవారం కూడా కొనసాగడంతో డీఎస్ఎస్ భవన్ గురుకుల టీచర్లతో కిక్కిరిసిపోయింది.తారుమారుపై గరంగరం.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నూతన జోనల్ విధా నం అమల్లోకి రావడంతో ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాయి. గురుకుల సొసైటీలు కూడా ఆ దిశగా కసరత్తు చేసి 2022 సంవత్సరంలో ఉద్యోగులకు జోన్లు, మల్టీ జోన్ల కేటాయింపు చేప ట్టాయి. కానీ విద్యాసంవత్సరం మధ్యలో బోధన, అభ్యసన కార్య క్రమాలకు ఇబ్బందులు తలెత్తు తాయనే భావనతో కేటాయింపుల ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టాయి. ప్రస్తుతం గురుకులాలకు కొత్త ఉద్యోగులు వస్తుండడంతో సీనియర్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడుతుండగా... జీఓ 317 కింద డిస్ లొకేటెడ్ అయిన ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టేందుకు సొసైటీ చర్యలు మొదలు పెట్టింది. కానీ డిస్‌లొకేడెట్ జాబితాలో ఉన్న ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యోగుల కేటాయింపు సమయంలో తామిచ్చిన ఆప్షన్లకు భిన్నంగా తాజాగా కేటాయింపులు జరిపారని, మరోవైపు సంబంధం లేని జోన్లు ఇవ్వడంతో తమతోపాటు పిల్లల భవిష్యత్ తారు మారు అవుతుందని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి మినహాయింపు ఇచ్చిన సొసైటీ మిగతా ఉద్యోగులకు స్థానచలనం కల్పించింది. ప్రిన్స్‌పాల్, జూనియర్ లెక్చరర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ కేటగిరీలో దాదాపు పదోన్నతులు పూర్తి కాగా, ఆయా కేటగిరీల్లో బదిలీలు సైతం దాదాపు పూర్తి చేసినట్టు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులు చెబుతున్నారు.మూడు రోజుల్లో మిగతా కేటగిరీల్లో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రిన్సిపాల్, జేఎల్, పీజీటీ కేటగిరీల్లో మెజారిటీ శాతం బది లీలు పూర్తి చేసిన సొసైటీ... టీజీటీ, లైబ్రేరియన్, డిగ్రీ కాలేజీ టీచింగ్ స్టాఫ్‌తోపాటు సొసైటీ పరిధిలోని నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాల్సి ఉంది. బదిలీల ప్రక్రియ ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. కానీ ఆలోపు అన్ని కేట గిరీల్లో బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. ఎక్కువ కేటగిరీలు ఉండడంతో రాత్రింబవళ్లు పూర్తి చేసేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. గతవారం రోజులుగా పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి పొద్దు పోయేవరకు కూడా సొసైటీ అధికారులు బదిలీలు, పదోన్నతుల కసరత్తు సాగిస్తుండడం గమనార్హం. -
జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ..
జనగామ: జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకేచోట నాలుగేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. రెండేళ్ల సర్వీసు కాలంలో కొంతమంది ట్రాన్స్‌ఫర్‌కు ఆప్షన్ ఇచ్చుకున్నారు.బదిలీల సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకు న్న సమయంలో జీఓలో పొందు పరిచిన నిబంధన ల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో (స్పౌజ్) ఒకరిని మాత్రమే బదిలీ చేస్తారు. 70శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం, మానసిక దివ్యాంగులు, పిల్లలు కలిగి ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ సమయంలో కొంత సడలింపు ఇచ్చారు.ఉద్యోగి లేదా ఆయన భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ సంబంధిత వైద్య పరీక్షల సమయంలో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీలకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యా న, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ తదితర ఉన్నతాధికా రుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.బదిలీలకు 256 మంది ఆప్షన్..జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఓఎస్, నైట్ వాచ్‌మన్, ఎంఎన్ఓ, పంచాయతీ కార్యదర్శి, మెసెంజర్, రికార్డు అసిస్టెంట్, వాచ్‌మన్, ఫైర్‌మన్, థియేటర్ అసిస్టెంట్, వాటర్ మెన్, స్వీపర్ తదితరులు డిపార్ట్మెంట్ వారీగా 788 మంది ఉన్నారు.ఇందులో 256 మంది బదిలీ కోసం ఆప్షన్లు ఇవ్వగా.. అన్ని కేటగిరీల్లో 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకేచోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న(తప్పనిసరి) 233 మంది ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్ ఇవ్వగా.. జీఓ నిబంధనల మేరకు రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న 23 మంది సైతం ట్రాన్స్ఫర్లు కోరుకున్నారు.కలెక్టరేట్లో బదిలీ కేటాయింపులుజిల్లా స్థాయి సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ ఏఓ రవీందర్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీపీఓ అనిల్‌కుమార్, డీఈఓ రాము, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీటీఓ నర్సింహారెడ్డి తదితరుల ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు బదిలీల ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్ 1,2,3 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మినహా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి కాగా.. ఈనెల 20వ తేదీ వరకు ఆర్డర్ కాపీలను అందించనున్నారు.ఇదిలా ఉండగా.. జిల్లా పంచాయతీ శాఖలో సీనియర్ పంచాయతీ, జూనియర్ కార్యదర్శులు 281 మంది ఉండగా.. 162 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. ఇందులో 95 మంది ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. జీఓ నిబంధనలను అనుసరించి 40శాతం మాత్రమే బదిలీలు చేయాలి.. దీంతో 74 మందికి అవకాశం రానుంది. ఇందులో 65 మంది సీనియర్లు, 9 మంది జూనియర్లు మరోచోటకు వెళ్లనున్నారు. వీరి బదిలీలను నేడు(మంగళవారం) చేపట్టనున్నారు. -
కక్ష సాధింపు తీరు.. ఇదెక్కడి పాలన చంద్రబాబు..?
-
ఏపీలో 37 మంది ఐపీఎస్ ల బదిలీ
-
ఎన్జీ రంగా వర్సిటీలో రాజకీయ బదిలీలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్షసాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. చివరికి చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాల పైనా పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు, కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు. మరీ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లుగా పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం (ఆంగ్రూ)లో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పని చేసిన వారిని బదిలీ చేస్తుంటారు. ఇప్పుడు ఆంగ్రూలో సంబంధిత శాఖామంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బందే లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.ఆంగ్రూ చరిత్రలోనే తొలిసారియూనివర్సిటీలో హెచ్‌వోడీలనే కాదు.. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నిబంధనలకు పాతరేసి మరీ ఇష్టానుసారం బదిలీ చేస్తుండటంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చివరికి పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను కూడా వదిలి పెట్టలేదు. ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాల్లోనే 102 మందిని బదిలీ చేశారు. ఇంత మందిని ఒకేసారి బదిలీ చేయడం ఆంగ్రూ చరిత్రలో ఇదే తొలిసారి అని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 38 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ డీన్స్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు యూనివర్శిటీ ఆఫీసర్లు, ముగ్గురేసి చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లతో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేశారు. మరికొంత మందిని బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నిబంధనలకు పాతరేసి..సర్వీస్ రూల్స్‌ను సైతం బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీలు చేస్తున్నారని అధ్యాపకులు వాపోతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నఫళంగా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా శాస్త్రవేత్తలు, అధికారుల కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా బదిలీ చేస్తున్నారని వాపోతున్నారు. తిరుపతి ఎస్వీ అగ్రి కల్చరల్ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న 15 మంది అధ్యాపకులు, శాస్త్రవే త్తలను 300 నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న పరిశోధన కేంద్రాలు, కళాశాలలకు బదిలీ చేశారని, పైగా వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి బదిలీ చేసిన స్థానాలలో చేరాలని ఆదేశించారని తెలిపారు. గతంలో బదిలీ చేయాలని బతిమిలాడినా పట్టించుకోని వర్శిటీ ఉన్నతాధికారులు ఇప్పుడు ఎడాపెడా బదిలీలు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు మౌఖికంగా ఆదేశించిన వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బదిలీలు చేస్తున్నారని, ఆ స్థానాల్లో నేతలకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలను ఇష్టానుసారం బదిలీ చేయడం వలన ఆ ప్రభావం పరిశోధనలపై పడుతుందని చెబుతున్నారు. పవిత్రమైన విద్యాలయాల్లో మితివీురిన రాజకీయజోక్యం సరికాదని విద్యా నిపుణులు హితవు పలుకుతున్నారు. -
ఏపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న బదిలీలు
-
TG: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేసింది. మొత్తం 28 మంది పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణపరిపాలన శాఖ సోమవారం(జూన్17) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
త్వరగా మార్చేద్దాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కీలక స్థానాల్లో తమకు అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐజీలు, డీఐజీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇలా అందరినీ త్వరిత గతిన బదిలీలు చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు సన్నితంగా వ్యవహరించిన అధికారులందరినీ గుర్తించాలని, అలాంటి అధికారులు తమకు అవసరం లేదని.. ఎవరెవరు ఏం చేశారో వివరాలు సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో మన కోసం (టీడీపీ) పని చేసిన వారిని గుర్తించాలని, అలాంటి వారు రిటైర్ అయినప్పటికీ మరో రకంగా తెచ్చుకుందామని అన్నట్లు సమాచారం. రాజధాని అమరావతిని త్వరతగతిన అభివృద్ధి చేయడం తమ ప్రథమ లక్ష్యం అని, ఇందుకోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.ఇందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తిరిగి అమలు చేసే విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేసిన ముఖ్య అధికారులను పిలిపిస్తే, తానే స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే గతంలో తాను సీఎంగా ఉండగా తన కార్యాలయంలో పనిచేసిన ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజమౌళిని మళ్లీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఇలాంటి మరికొందరు అధికారులతోపాటు రాష్ట్రంలోనే వివిధ శాఖల్లో ఉన్న తమకు అనుకూలమైన వారిని పిలిపించుకుని మాట్లాడి.. వారికి ఏ పోస్టింగులు ఇవ్వాలనే దానిపై సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. వాళ్లను పంపించేద్దాం టీడీపీకి సహకరించని అధికారులను గుర్తించి, వారిని బదిలీ చేయించే విషయంపై కూడా చంద్రబాబు సీఎస్, డీజీపీతో చర్చించినట్లు సమాచారం. వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశారని ఇప్పటికే కొంత మందిని గుర్తించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ముఖ్య అధికారులందరినీ త్వరగా గుర్తిస్తే.. వారిని బదిలీ చేయడం లేక సెంట్రల్ సర్విసులకు వెళ్లి పోండని చెప్పడం.. లేక ఇక్కడే ఉంటే అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేద్దామని వివరించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరెవరు ఎలా పని చేశారో తనకు తెలుసని, అయినప్పటికీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్‌ల తర్వాతే అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఉపక్రమిద్దామని సీఎం అన్నట్లు తెలిసింది. -
తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు
-
AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
సాక్షి,విజయవాడ: ఏపీలో ఇటీవల సస్పెండ్ చేసిన పలువురు పోలీసుల స్థానంలో కొత్త వారిని ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావులకు పోస్టింగ్ ఇచ్చింది.పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేష్ బాబు, ఎస్బీ సీఐ2గా యు శోభనన్బాబు, కారంపూడి ఎస్సైగా కె.అమీర్, నాగార్జునసాగర్ ఎస్ఐగా ఎం.పట్టాభిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు ఆయా ప్రాంతాల్లోని పలువురు పోలీసులను బాధ్యులను చేస్తూ ఈసీ వారిని సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తోంది. -
తెలంగాణ అధికారుల బదిలీ
-
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్‌కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్‌ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్‌ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్‌ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్‌ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
పంజాబ్, అస్సాం జిల్లాల పోలీసు చీఫ్‌ల బదిలీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ)మరికొందరు అధికారులకు స్థానచలనం కల్పించింది. తాజాగా అస్సాం, పంజాబ్‌ల్లోని జిల్లా పోలీసు చీఫ్‌లను బదిలీ చేసింది. పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లలో పనిచేసే అయిదుగురు నాన్ కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు(డీఎంలు), 8 మంది పోలీస్ సూపరింటెండెంట్ల(ఎస్పీలు)ను సైతం బదిలీ చేసింది. జిల్లా స్థాయిలో ప్రధానమైన పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు కాని నాన్–క్యాడర్ అధికారులను నియమించడంపై ఈసీ కఠినమైన వైఖరిని తీసుకుంది. -
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్‌సభ సెగ్మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్‌సభ ఎన్నికలకు ఆర్‌ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్‌సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ గురువారం నుంచి ఆరంభం కానుంది. కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరికొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దృష్ట్యా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభుత్వం రేషనలైజేషన్ ఉద్యోగుల సర్దుబాటుకు పూనుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయగా.. జిల్లాలో సర్దుబాటు ప్రక్రియకు సంబంధి«ంచిన తేదీల వారీగా షెడ్యూల్‌ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ ధ్యాన్‌చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు ఇలా.. ♦ గురువారం (22వ తేదీ)కల్లా జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు.. 8 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందిస్తారు. ♦ ఈ నెల 24వ తేదీకల్లా 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగి రి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు. ♦ ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పనిచేసే అవకాశం ఉన్నంతవరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు. ♦ సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి, సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపడతారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వా ర్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సర్దుబాటు ప్రక్రియలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు స్థానచలనం కలిగే పరిస్థితి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ♦ మరోవైపు సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే.. ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయా ల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పిస్తారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగానూ, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవ కాశం కల్పించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏకంగా 62 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీ ఆఫీస్‌లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్‌లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు బదిలీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
TS: రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాసం -
ఎన్నికల నిబంధనల మేరకే ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసుల నిస్వార్థ సేవలను, ప్రతిష్టను దెబ్బతీసేలా ఎల్లో మీడియా రాసిన కథనాలను తీవ్రంగా ఖండించింది. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించింది. పోలీసు అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్యకాదని హితవు పలికింది. పదేపదే బాధ్యతారాహిత్య కథనాలు ప్రచురిస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన అవసరాలకు తగ్గట్లుగా ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు చేసుకునే అధికారం ఉంటుందని స్పష్టంచేసింది. -
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ జరిగింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు బదిలీ కాగా, సుధీర్‌బాబును హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా నియమించారు. ఇక రాచకొండ సీపీగా తరుణ్జోషిని నియమించారు. రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ సౌత్‌వెస్ట్ డీసీపీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. -
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్‌గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్‌కుమార్‌కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్‌లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
బదిలీలు లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్: సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులను మార్చారు. ఇటు ప్రభుత్వ, అటు పోలీస్ యంత్రాంగంలోని సీనియర్ అధికారుల్లో కొందరికి స్థానచలనం కలిగించారు. మరికొందరు ఐఏఎస్ అధికారులు, ఒకట్రెండు జిల్లాల కలెక్టర్ల మార్పు కూడా జరిగింది. దీంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన ఉంటుందని, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధించిన ముఖ్యమైన బదిలీలుంటాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అలాంటి ఆలోచన లేదని, పలు కారణాల రీత్యా మరో మూడు నెలల తర్వాతే పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందనే సంకేతాలందుతున్నాయి. ప్రస్తుతానికి తప్పనిసరి బదిలీలకు మాత్రమే పరిమితం కావాలని, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి రావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతే భారీస్థాయిలో బదిలీలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఆరంభ దశలోనే ‘ప్రజాపాలన’ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డితో సహా ఏఐసీసీ కీలక నేతలు పలుమార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే గత నెల 28న ‘ప్రజాపాలన’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొని, గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియతో ముందుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాగాన్ని బదిలీ చేయడం అవసరం లేదనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత, వచ్చిన అన్ని దరఖాస్తులను మదింపు చేయాలి. వీటి ఆధారంగా రేషన్‌కార్డుల పంపిణీ నుంచి 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ వరకు మార్గదర్శకాలు రూపొందించాలి. దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం మరో నెలకు పైగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి వస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మార్చి 15 వరకు (100 రోజుల్లో) ఈ ఆరు గ్యారంటీలు అమలు ప్రారంభించాలి. దీంతో ఇప్పుడు బదిలీలు చేస్తే కొంత గందరగోళానికి తావిస్తాయనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం. ఈసీ ఏం చేస్తుందో? రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోయినా ఓటరుజాబితా సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈనెల 6 వరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాలి. అనంతరం సవరణలు చేపట్టి వచ్చే నెల 8న పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి. మరోవైపు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు చేపట్టాలన్నా, ఎన్ని కల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలి. మరోవైపు ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఎప్పుడైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఈలోపు కలెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బదిలీలు చేయాల్సి ఉంటుంది. దీంతో కలెక్టర్ల బదిలీల గురించి కూడా సీఎం రేవంత్ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు కూడా ఉండవని, అవసరమైతేనే కొన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్‌కు సమాచారమిచ్చి ఈసీ అనుమతి మేరకు బదిలీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలు ముగిశాకే.. అన్ని స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప లోక్‌సభ ఎన్నికలు ముగిసేంతవరకు ప్రభుత్వ యంత్రాంగ బదిలీలుండవని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఆ పార్టీ పెద్దలు సంకేతాలిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఇదే విషయాన్ని ఓ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు బదిలీలు చేయలేం కానీ, మొండి ఘటాలను మాత్రం వదిలించుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో సఖ్యత లేదనే ముద్ర ఉన్న అధికారులకు అడపాదడపా స్థానచలనం కలగవచ్చని, గత ప్రభుత్వానికి అంటకాగారనే ముద్ర ఉన్న అధికారులను కూడా బదిలీ చేయొచ్చని అంటున్నారు. -
ఉద్యోగాలు.. బదిలీలు
లక్డీకాపూల్: ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి అర్జీల వరద కొనసాగుతోంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా, వాటిని కంప్యూటరైజ్డ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగానికి ప్రభుత్వం బాధ్యతలప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పె రుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీపై స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలివచ్చారు. స్పౌజ్ ఫోరం ప్రతినిధు లు వివేక్, నరే‹శ్, అర్చన, సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోని అశాస్త్రీయ విధానా లవల్ల భర్త ఒకచోట, భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు. మహిళా సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈఈ గ్రూప్–4 ఫలితాలను విడుదల చే యాలని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వాని కి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు నాగులు సాయికిరణ్, పవన్, శరత్ మీడియా తో మాట్లాడుతూ.. హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నెం.7593ను ప్రకారం డాక్యు మెంట్ వెరిఫికేషన్ జాబితాను పదిహేను రోజు ల్లో విడుదల చేయాలని కోరారు. నా భర్త ఉద్యోగం ఇవ్వండి విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన జెన్కో ఉద్యోగి సదానందన్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుని భార్య వందన సదానందన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదనీ, ఇప్పటికైనా భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ
-
భారీగా ఐఏఎస్ బదిలీలు
-
ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్‌గా ధ్యాన్‌చంద్ర విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్‌గా టీఎస్ చేతన్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా జె. శివ శ్రీనివాస్ తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా శుభం బన్సాల్ విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవోగా మాధవన్ మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్‌గా ఎస్ఎస్ శోభిక సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కె.కార్తీక్ పాడేరు సబ్ కలెక్టర్‌గా పెద్దిటి ధాత్రిరెడ్డి పెనుకొండ సబ్ కలెక్టర్‌గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ కందురకూరు సబ్ కలెక్టర్‌గా గొబ్బిల విద్యాధరి తెనాలి సబ్‌కలెక్టర్‌గా ప్రకార్ జైన్ మార్కాపురం సబ్ కలెక్టర్‌గా రాహుల్ మీనా ఆదోని సబ్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ వర్మ రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ఎస్.ప్రశాంత్‌కుమార్‌లు నియమితులయ్యారు. -
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
-
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్‌బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
హైదరాబాద్ సీపీ రేసులో నలుగురి పేర్లు
హైదరాబాద్: హైదరాబాద్‌లో సీపీ కోసం నలుగురి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీపీ రేసులో సందీప్ శాండిల్యా, వీవీ శ్రీనివాస్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డిలతో కూడిన జాబితాను సీఈసికి సర్కార్ పంపించింది. 17 మంది అడిషనల్ డీజీల పేర్లను కూడా ప్రభుత్వం సీఈసికి ప్రభుత్వం సూచించింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రానున్న ఆదేశాలు రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ -
రేపట్నుంచి స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అనుమతించారు. అయితే, మల్టీజోన్–2 పరిధిలో కోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు బదిలీలు చేపట్టడం లేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లకు మాత్రం బదిలీలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం మంగళవారం ఆదేశించింది. -
త్వరలో ఇంటర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి అధ్యాపక సంఘాల నేతలు గత కొంతకాలంగా బదిలీల కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల విద్యలో బదిలీలు చేపట్టడం, ఈ వ్యవహారం కోర్టు స్టేతో ఆగిపోవడం తెలిసిందే. తాజాగా స్పౌజ్ కేసులను పరిశీలించిన కోర్టు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కాలేజీ సిబ్బందినీ బదిలీ చేయాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యామంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవల ఇంటర్, కాలేజీ విద్య ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు బదిలీల ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లేక ఐదేళ్లు: 2018 జూన్ నెలాఖరులో సాధారణ బదిలీలు చేపట్టారు. అప్పటి మార్గదర్శకాలను అనుసరించి 500 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2016–17లో జూనియర్ లెక్చరర్స్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ విధంగా పదోన్నతులు రావడంతో 2018లో జరిగిన బదిలీల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన సర్వీస్ లేకపోవడంతో వారికి బదిలీ అవకాశం రాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 317 జీవో అమలు చేశారు. పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటూ, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలేజీ అధ్యాపక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. తాజా నిర్ణయం వల్ల 6 వేల మందికిపైగా న్యాయం జరుగుతుంది. మార్గదర్శకాలపై కసరత్తు: బదిలీలు చేపట్టాలనే యోచన చేసిన నేపథ్యంలో మార్గదర్శకాలపై కూడా స్పష్టత ఉండాలని విద్యాశాఖ కార్యదర్శి అధికారులకు సూచించినట్టు సమాచారం. 317 జీవో తర్వాత ఏర్పడిన పరిస్థితులు, ఎన్ని సంవత్సరాలను కనీస, గరిష్ట అర్హతగా తీసుకోవాలనే అంశాలపై అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. స్పౌజ్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి జాబితాను, ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశాలపై వివరాలు తెప్పిస్తున్నారు. వచ్చేవారం బదిలీలపై స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. -
పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విద్యాశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. కొన్నేళ్లు గా ఎదురుచూస్తున్న టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొన్ని నెలల క్రితం విధించిన స్టేకి హైకోర్టు బుధవారం సడలింపు ఇచ్చింది. దీంతో తక్షణమే ప్రక్రియను మొదలుపెట్టాలని విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే విధివిధానాలపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన డేటా, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎనిమిదేళ్లుగా నోచుకోని పదోన్నతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, దాదాపు 6 వేల మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత ప్రమోషన్ల వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2021లో బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా కోవిడ్ దృష్ట్యా ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు బదిలీలు చేపట్టడం అనేక వివాదాలకు దారితీసింది. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో 6,362 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. 7,141 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. ఇందులో 30 శాతం నేరుగా టీఆర్టీ ద్వారా భర్తీ చేయనుండగా, 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. హెచ్ఎం పోస్టులు 1,947 ఖాళీలుండగా, ఇందులో పదోన్నతులతో భర్తీ చేసేందుకు 1,367 మంది అర్హులని లెక్కతేల్చారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల పోస్టులు 2,043 ఖాళీలుంటే, 1,942 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇతరత్రా కలుపుకొంటే మొత్తం 10,352 మంది టీచర్లకు పదోన్నతులు లభించే వీలుంది. బదిలీలకు 50 వేల మంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో సాధారణ బదిలీలు చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసే హెచ్ఎంలు, 8 ఏళ్లుగా ఒకేచోట పనిచేసే టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. 2018లో 78 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 48 వేల మందికి బదిలీలు జరిగాయి. గత జనవరిలో బదిలీల షెడ్యూల్ ఇవ్వగా.. 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా షెడ్యూల్ ఇస్తే 8 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగే అవకాశముంది. వీరిలో సీనియారిటీ, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికన 50 వేల మంది బదిలీ అయ్యే వీలుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు? ఆన్‌డ్యూటీ తీసుకునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సరీ్వస్ పాయింట్లపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా షెడ్యూల్లో ఈ పాయింట్లను తొలగించాల్సి ఉంది. దీంతో గత జనవరిలో మొదలు పెట్టిన బదిలీల ప్రక్రియలో మార్పులు చేసి ప్రభు త్వం కొత్త షెడ్యూల్ ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా సరీ్వసు పాయింట్లు ఇస్తారు. దీంతోపాటే సరీ్వస్‌ను బట్టి కొన్ని పాయింట్లు ఇస్తారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జిల్లాల వారీగా సీనియారిటీ, సబ్జెక్టుల వారీగా సీనియారిటీని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, షెడ్యూల్ మాత్రం వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. టీఆర్టీకి పోస్టులు పెరుగుతాయా? విద్యాశాఖలో 22 వేల ఖాళీలుంటే, ప్రభుత్వం కేవలం 5,089 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా పదోన్నతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త ఖాళీలు వెల్లడయ్యే వీలుంది. మొత్తం 10 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఐదువేలతో కలుపుకొంటే మొత్తం 15 వేలకుపైగా నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మోక్షం కల్పించండి: ఉపాధ్యాయ సంఘాలు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తక్షణమే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు. ఏళ్ల తరబడి టీచర్లు బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. ఉపాధ్యా సంఘాల నేతలు పది ప్రత్యేక పాయింట్లు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఎస్టీయూ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్‌రెడ్డి కోరారు. -
రాజకీయ నేతలకు అనుకూలంగానే పోలీసు బదిలీలు.. ట్రాన్స్‘ఫర్’పై ఈసీ దృష్టి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పోలీస్‌శాఖలో భారీఎత్తున జరిగిన బదిలీలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లాంగ్ స్టాండింగ్‌గా వివిధ శాఖల్లో ఉన్న అధికారుల బది లీకి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పోలీస్‌శాఖ విషయానికి వచ్చేసరికి కొందరు రాజకీయనేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విషయం ఈసీ దృష్టికొచ్చింది. ఇలా కొత్త స్థానాల్లోకి వచ్చిన వారితో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం సాధ్యం కాదనే భావనలో ఉంది. ఈ వ్యవహారంపై మాజీ ఐపీఎస్‌లతో పాటు నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోడ్ అమలులోకి వస్తుంది. ఆపై ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనేక స్థానాలు ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈసారి గతానికి భిన్నంగా ఎందుకంటే... పోలీసు విభాగంలో బదిలీలు సర్వసాధారణం. నిర్ణీత కాలపరిమితితో బదిలీలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బదిలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఒకే పోస్టులో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న అధికారులతోపాటు, భారీ సంఖ్యలో పదోన్నతుల నేపథ్యంలో నాన్‌కేడర్ ఎస్పీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు భారీ సంఖ్యలో అధికారులకు స్థానచలనం తప్పలేదు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి స్టేషన్ హౌస్ఆఫీసర్లుగా ఉండే ఎస్ఐ పోస్టుల నుంచి నాన్‌కేడర్ ఎస్పీల వరకు అన్నింటిలోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైంది. ఓ అధికారి సమర్థత ఆధారంగా కాకుండా ఆయనకు ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడి రాజకీయ నాయకులు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా పోస్టింగ్ లభించింది. ఫోకల్ పోస్టులుగా పిలిచే శాంతిభద్రతల విభాగంతోపాటు మరికొన్ని కీలక వింగ్స్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పోస్టుల్లో బదిలీల బంతాట తమ సామాజికవర్గం కాదనో, విధేయులుగా ఉండరనో, ముక్కుసూటి అధికారులని భావించిన వారి బదిలీల విషయంలో బంతాట తప్పలేదు. పోస్టింగ్ వచి్చనవారు, ఆ పోస్టులో చేరకుండా, చేరినా ఆ సీట్లలో కూర్చోకుండా, కూర్చున్నా ఒక్కరోజు కూడా విధులు నిర్వర్తించకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్దస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పిస్తూ కొత్తగా వచి్చన అధికారులూ బదిలీ అయ్యేలా చేసి తమ పంతం నెగ్గించుకున్నారు. ప్రత్యేక బృందాలతో వివరాల సేకరణ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గత నెలలో హైదరాబాద్‌కు వచి్చన ఎన్నికల సంఘం అధికారులు పోలీసు సహా వివిధ విభాగాలతో భేటీ అయ్యారు. పోలీస్‌శాఖలో రాజకీయ నేతల సమ్మతి, సిఫార్సు ఆధారంగా పోస్టుల్లోకి వచి్చన వారి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై ఉంటుందని ఈసీ గుర్తించింది. దీనిపై వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వీటిలో మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు నిఘా వర్గాలకు చెందిన వారు ఉంటారని సమాచారం. రాష్ట్రంలో వివాదాస్పదమైన బదిలీల్లో కొన్ని... – మహబూబాబాద్ జిల్లాలోని ఓ డివిజన్లో ముగ్గురు డీఎస్పీలు నాలుగుసార్లు బదిలీ అయ్యారు. ఇవి కేవలం పక్షం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. – నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ డీఎస్పీ పోస్టింగ్ వివాదాస్పదమైంది. అక్కడకు వచ్చిన అధికారిని కొన్ని రోజుల్లో మార్చేశారు. ఆయన స్థానంలో అక్కడే ఇన్స్పెక్టర్గా పనిచేసి, ఇటీవలే పదోన్నతి పొంది, రేంజ్‌కు వెళ్లిన అధికారిని తీసుకొచ్చారు. – నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారి ఏడాది క్రితమే డీఎస్పీగా ఓ డివిజన్లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ మధ్య విభేదాలతో ఈయన బదిలీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పట్టుపట్టి మరీ తనకు అనుకూలమైన పాత అధికారినే తెచ్చుకున్నారు. – హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు అనేక పోస్టింగులు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ రాజకీయ ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించలేకపోయారు. చివరకు ఈయన బదిలీ కాగా, నేతలను అనుకూలమైన వ్యక్తికే పోస్టింగ్ వచ్చింది. – వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఓ ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి తన పలుకుబడితే అదే సబ్‌డివిజన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌కు మారారు. స్థానిక నేతల అండదండలతోనే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. -
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది వెయిటింగ్లో ఉన్న అధికా రులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సీని యర్ ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, శైలజా రామయ్యర్‌ల సేవలను ఎంసీఆర్ హెచ్ఆర్డీ, యువజన సర్వీసుల శాఖలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వెయిటింగ్లో ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇవ్వగా, 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్‌ను యు వజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శాట్స్ ఎండీగా, ఆర్కి యాలజీ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్య తలు అప్పగించింది. అలాగే వెయిటింగ్లో ఉన్న అధికారులు హరిచందన, వర్షిణి, హై మావతి, నిఖిల, సత్యశారదాదేవి, అరుణ శ్రీలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంకా ఆలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అదే విధంగా ములుగు అద నపు కలెక్టర్‌గా ఉన్న ఇల త్రిపాఠికి అదే జిల్లా కలెక్టర్‌గా, సిద్దిపేట అదనపు కలెక్టర్ ము జమిల్ఖాన్కు పెద్దపల్లి కలెక్టర్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ దురిశెట్టికి హైదరాబాద్ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి కలెక్టర్‌గా ఉన్న సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించింది. జగిత్యాల అద నపు కలెక్టర్‌గా ఉన్న మంద మకరందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ప్రభు త్వం మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లను ఈసారి బదిలీ చేయడం గమనార్హం -
తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్‌గా లోకేశ్ జైశ్వాల్, హరితహారం పీసీసీఎఫ్‌గా సువర్ణ, అటవీ ఉత్పత్తుల చీఫ్ కన్జర్వేటర్‌గా రామలింగం, జూపార్కుల సంచాలకులుగా వీఎస్ఎన్వీ ప్రసాద్ నియామకం అయ్యారు. భద్రాద్రి డీఎఫ్‌వో లక్ష్మణ్ రంజిత్ నాయక్ అటవీ అభివృద్ధి సంస్థకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వోగా కిష్ట గౌడ్ నియామకం అయ్యారు. ఇది కూడా చదవండి: బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఇలా చేశాను.. కేటీఆర్ కొడుకు హిమాన్షు -
మీ సాయం కోరే చిన్నారులం
సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు. బోనాలతో ప్రత్యేక ర్యాలీ.. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు. -
నిజామాబాద్ జిల్లా పోలీసుల్లో రాజకీయ బదిలీలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల బదిలీలకు రాజకీయ రంగు పట్టుకుంది. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గం ప్రజాప్రతినిధి అనుగ్రహం ఉన్నా, బదిలీ ఎప్పుడు జరుగుతుందోనని ఎస్సైలు, సీఐలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరిలో నిజామాబాద్ ఏసీపీగా పని చేసిన వెంకటేశ్వర్ రెండేళ్లు కాకుండానే బదిలీ పై వెళ్లడంతో అప్పుడు పోలీస్‌వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫా ర్సు లేఖలతో వచ్చినా పూర్తికాలం పని చేస్తామా లేదా అనే సందేహాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, సీఐలు, ఏసీపీల బదిలీలు పరంపర కొనసాగుతునే ఉన్నాయి. పోలీస్‌శాఖలో రాజకీయరంగు పులుమడంతో జిల్లాలో పోలీసులకు గుర్తింపు లేకుండాపోతుంది. జిల్లా పోలీస్‌శాఖలో ఎస్సైలు, సీఐలను కొందరు ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఎన్నికల బదిలీలు ఉండగా జిల్లాకు కొన్ని రోజుల క్రితం వచ్చిన సీఐలు బదిలీలు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధిని కలిస్తే చాలు.. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు జరిగే కార్యక్రమాలకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు తమ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు కాకుండా వేరే నియోజకవర్గ ప్రతినిధిని కలిస్తే చాలు ఆ పోలీస్ అధికారి పోస్టు ఉంటుందా? ఊడుతుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారికి చోటుచేసుకుంది. సదరు అధికారికి పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చే వరకు తెలియకపోవడం శోచనీయం. ఈ పోలీస్ అధికారి పరిధిలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓ కార్యక్రమంలో సదరు ప్రజాప్రతినిధి వచ్చిన సమయంలో భద్రత కల్పించడంతో వారం తర్వాత బదిలీ వెలువడటం కొసమెరుపు. ఈక్రమంలో ఫిబ్రవరి నుంచి ఏసీపీతోపాటు సీఐ పలువురు బదిలీ అయ్యారు. ఎన్నికల కోసమే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా లో పోలీసుశాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడం, తమకు సహకరించడం లేదనే సాకుతో బదిలీలు చేయడం జిల్లాలో కొనసాగుతునే ఉంది. కానీ పోలీస్‌శాఖ బదిలీల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పోలీసులు పనిచేయడంలో ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే జిల్లా పోలీస్‌కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈక్రమంలో వచ్చే నెలలో పోలీస్‌శాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతోంది. -
పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు!
సాక్షి, అమరావతి : కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది. గతంలో అర్థరాత్రి వరకు సాగే బదిలీ ప్రక్రియలో ఎంతో గందరగోళం నెలకొనేది. కానీ, ఈసారి టెక్నాలజీని ఉపయోగించి చేపట్టిన ఈ ప్రక్రియతో ఇంటి నుంచి లేదా ఇంటర్నెట్ పాయింట్ నుంచి బదిలీ ధ్రువపత్రం తీసుకుని కొత్త స్కూల్లో చేరుతున్నారని, వేలాది టీచర్ల ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. 45వేల ప్రభుత్వ స్కూళ్లలోని 41 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవుల్లో, ఎక్కడి వారు అక్కడే ఉంటూ, ఎవరి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా నిర్వహించిన చారిత్రాత్మక కౌన్సిలింగ్ అని పేర్కొంటూ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖకు ఆయా సంఘాలు కితాబిచ్చాయి. ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు సంఘాల మధ్య తరచూ చోటుచేసుకునే ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో.. ‘అర్థరాత్రుళ్లు ఆగిపోయే కౌ న్సెలింగ్ లేదు.. ఎక్కడా డీఈఓ కార్యాలయాల ముందు ఉపాధ్యాయుల పడిగాపులు లేవు.. ఆమ్యామ్యా లు ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే వేధింపుల్లేవు.. ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకుని, ఇంట్లో నుంచే బదిలీ ఆర్డర్ పుచ్చుకుని, కొత్త స్కూళ్లల్లో చేరిన వేలాది ఉపాధ్యాయులందరూ టెక్నాలజీకి మనసులోనే నమస్కరిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన పాఠశాల విద్యాశాఖదే. బదిలీల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిన ప్ర భుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యా ప్రయోజనాలకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని పంపించింది’ అంటూ డెమోక్రటిక్ పీఆరీ్టయూ ఏపీ టీచర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం -
గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారి దరఖాస్తులు, వాటితోపాటు సమర్పించే వైద్యుల సర్టిఫికెట్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. జిల్లాలో బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గురువారం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇలా ఉంది. జిల్లాలో బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తుల పరిశీలనకు తుది గడువు : జూన్ 10 కేటాయించిన మండలాలు,మున్సిపాలిటీలు, తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన : జూన్ 12 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ : జూన్ 14, 15 కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తులను సంబంధిత జిల్లాకు పంపేందుకు గడువు: జూన్ 9 జిల్లా అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ: జూన్ 10 రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి దరఖాస్తులు కార్యదర్శికి సమర్పణ: జూన్ 13 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ 14, 15 కౌన్సెలింగ్‌పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి చదవండి: Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి -
బదిలీలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూపరిపాలన (ల్యాండ్ రెవెన్యూ) శాఖ పరిధిలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధముండే అధికారుల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించిన మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారుల (ఆర్డీవో) బదిలీలు జరిగాయి. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవోల బదిలీలకు సర్వం సిద్ధమైందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతుండటంతో.. ఈ కార్యక్రమాలు ముగిశాక బదిలీలు ఉంటాయని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. తహసీల్దార్ల బదిలీలపై కొంత కసరత్తు జరిగిందని.. సీఈసీ ఆదేశించిన విధంగా జూలై నెలాఖరుకల్లా ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అంటున్నాయి. 70 శాతం తహసీల్దార్లకు బదిలీ! గత లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీలు జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరినవారు, 317 జీవో ద్వారా స్థానికత ప్రాతిపదికన సర్దుబాటైనవారు మినహా 70% తహసీల్దార్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో తహసీల్దార్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో)గా పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యే అధికారులను అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు.. అదే స్థానాల్లో పనిచేయించుకోవాలని, అనివార్యంగా బదిలీ చేయాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు మేరకు అవసరమైతే దశాబ్ది ఉత్సవాల తర్వాత బదిలీలు ఉంటాయని.. లేదంటే అక్టోబర్ 4 వరకు ఆగాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. పదోన్నతులిస్తేనే సజావుగా ఎన్నికల విధులు రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తేనే ఎన్నికల విధుల నిర్వహణ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా విధులు నిర్వహించడం కోసం 119 మంది డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) స్థాయి అధికారులు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 74 మంది డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే డివిజన్లలో పనిచేస్తున్నారు. ఇందులోనూ 19 ఖాళీలున్నాయి. అయితే ఈ 19 ఖాళీలకుగాను 19 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరిండెంట్లకు పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 14 మంది డిప్యూటీ కమిషనర్లు కూడా రిటర్నింగ్ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిని కలిపినా మరో 50 మంది వరకు ఆర్వోల కొరత ఉంటుంది. ఇక డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న పలువురు ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వారిని రిటర్నింగ్ అ«ధికారులుగా నియమిస్తే.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా దాదాపు ఏడాది పాటు ఆయా శాఖల్లో పనులకు ఆటంకం కలగనుంది. ఈ క్రమంలో తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా రిటర్నింగ్ అధికారుల కొరత ఏర్పడకుండా ఉంటుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అంటోంది. 19 మందికి ఆర్డీవోగా పదోన్నతులు రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్లు కె.మహేశ్వర్, ఎం.సూర్యప్రకాశ్, మురళీకృష్ణ, కె.మాధవి, ఎల్.అలివేలు, బి.శకుంతల, కె.సత్యపాల్‌రెడ్డి, వి.సుహాసిని, భూక్యా బన్సీలాల్, బి.జయశ్రీ, ఎం.శ్రీనివాసరావు, డి.దేవుజా, డి.ప్రేమ్‌రాజ్, ఉప్పల లావణ్య, డి.చంద్రకళ పదోన్నతులు పొందారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బదిలీలకు సీఎం జగన్ ఆమోదం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే.. -
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు. కాగా, బదిలీలపై బ్యాన్ ఉపసంహరిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా చదవండి: భూమా అఖిలప్రియకు బిగ్ షాక్! -
AP: 50 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల బదిలీల వివరాలు -
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి (చదవండి: బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి) -
కర్ణాటకలో ఐఏఎస్ vs ఐపీఎస్
-
తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్ నికోలస్, కోరం అశోక్ రెడ్డి, బడుగు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు. ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే! -
గూడు చెదిరి.. గుండె పగిలి..
ఖమ్మం: శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో.. దుండగుల బారి నుంచి సమాజాన్ని కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజారక్షణ కోసం పరి తపిస్తూ.. ఓ వైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో దంపతులిద్దరూ కూడా సేవలందించేవారున్నారు. అలాంటి వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఉద్యోగం ఉందన్న ఓ ఆశ తప్పితే వారి జీవితంలో సుఖసంతోషాలు కరువై నరకయాతన అనుభవిస్తున్నారు. భర్త ఒకచోట.. భార్య మరోచోట.. వారి పిల్లలు ఇంకోచోట.. ఇలా గూడు చెదిరిన పక్షుల వలె స్పౌజ్ పరిధిలోని కానిస్టేబుళ్లు కన్నీళ్లను దిగమింగుకుని విధులకు హాజరవుతున్నారు. కుటుంబం, విధులు అనే రెండింటి మధ్య తల్లడిల్లుతూ ఆగమ్యగోచరంగా మారిన తమ తలరాత ఎప్పుడు మారుతుందోనంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. 317 జీఓతో చెల్లాచెదురు తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2021లో తీసుకొచ్చిన 317 జీఓ పోలీస్ శాఖలో ఒకే జిల్లాలో పనిచేసుకుంటున్న దంపతులకు శాపంగా మారిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు చెరో జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి ఆలనా, పాలన, చదువు, ఇలా ప్రతిదీ కష్టంగా మారడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలంటే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరూ పోలీసులే.. కానీ.. ఉద్యోగమున్నా అటు పిల్లలను చూసుకోలేక, ఇటు కుటుంబాన్ని పట్టించుకోక దంపతులిద్దరూ బాధను దిగమింగుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్నా సంతోషం కరువైందని, కుటుంబం దగ్గరగా లేకపోవడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కనీసం కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కరుణ చూపి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. పిల్లల భవిష్యత్‌ను అర్థం చేసుకుని తమకొక దారిచూపాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల మాదిరి కరుణ చూపండి.. క్రమబదీ్ధకరణ సమయంలో ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో ఉంచి దంపతులైన ఉద్యోగుల బదిలీలను నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. గత నెల 26న విద్యాశాఖ 13 జిల్లాల్లోని దంపతులైన ఉపాధ్యాయులను (స్పౌజ్) ఒకే జిల్లాకు బదిలీ చేసింది. అయితే ఎస్జీటీల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్పౌజ్ పరిధిలోని ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని పోలీసులు ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో స్పౌజ్ కింద పనిచేసే వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఉంటారు. బదిలీ అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకొని సంవత్సరం దాటినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇబ్బంది ఉందని సిక్ లీవ్, ఎర్న్ లీవ్స్ అడిగినప్పటికీ బందోబస్తు ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో సెలవులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అసలే సెలవులు లేని ఉద్యోగం, పిల్లలను చూసుకునేందుకు ఒక పూట అనుమతి తీసుకుని ఇంటికి బయలు దేరినా మార్గమధ్యలో ఎమర్జెన్సీ డ్యూటీ అని ఫోన్ వస్తే కుటుంబాన్ని చూడకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉందని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు మినహా మిగతా ఉద్యోగులకు తమకేమైనా సమస్య వస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. యూనిఫాం వేసుకున్న రోజే వారు ఆ హక్కును కోల్పోతారు. ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో భార్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇటీవల రెండు సంవత్సరాలు వయసు కలిగిన చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచి్చంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విధి నిర్వహణలో ఉండడం, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగైదు గంటల తర్వాత వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచి్చంది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేరి్పంచలేక, మరోవైపు విధులను వదిలేసి రాలేక వారు నరకయాతన అనుభవించారు. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్‌లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
41 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–సివిల్ (డీఎస్పీ)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు (పీఈబీ) సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, ఈ పోస్టింగ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని శనివారం డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే పెద్దసంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఇక వచ్చేనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రబడ్జెట్ సమర్పణ, వచ్చేనెల 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తర్వాతే పెద్ద ఎత్తున పలు స్థాయిల్లోని ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
Telangana: తొలుత ఎస్ఏలు.. తర్వాత ఎస్జీటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదల కానుంది. షెడ్యూల్ వెలువడినప్పటికీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు మాత్రం కొంత సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాల్లో అనేక సందేహాలు, ఆందోళనలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం చూపించే ముందుకెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పౌజ్ కేసులకు పరిష్కారం తీవ్ర వివాదం రేపుతున్న స్పౌజ్ కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు 2,100 మంది వరకూ ఉన్నారు. వీరంతా తమను ఒకే ప్రాంతానికి మార్చాలని ఆందోళనలకు దిగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బదిలీల్లో 675 మందికి మాత్రమే అవకాశం కల్పించడంతో ఇటీవల పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం 1,600 మందిని ప్రస్తుత బదిలీల్లో చేర్చి, ఇంకా మిగిలిన వారిని డిప్యుటేషన్ ద్వారా కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఖాళీలపై స్పష్టత ఉండదని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలావుండగా హెచ్ఎంలు ఒకే స్థానంలో పని చేయడానికి సంబంధించిన కాలపరిమితిని 5 నుంచి 8 ఏళ్ళకు పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టీచర్లు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై మిగతా వారిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. డిమాండ్ల సాధనకు టీచర్ల ఆందోళనలు – ముందస్తుగా అదుపులోకి నేతలు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అమలు చేసిన 317 జీవో వివాదాస్పదంగా మారుతోంది. సీనియారిటీ లేకపోవడంతో స్థానికేతర జిల్లాలకు వెళ్ళిన టీచర్లు బదిలీలకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. బదిలీలకు కనీసం రెండేళ్ళ సర్వీస్ నిబంధన సరికాదంటున్నారు. జీరో సర్వీస్‌ను మార్గదర్శకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఆందోళనలు నిర్వహిస్తున్న 317 జీవో బాధిత ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి చేపట్టారు. ఇంకోవైపు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు (స్పౌజ్‌లు) ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని ఆందోళన బాట పట్టారు. ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని స్థానికేతర్లుగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు రాబోయే బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి, వారు కోరుకున్న స్థానిక జిల్లాల్లోని ఖాళీల ఆధారంగా బదిలీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. కాగా ఆందోళన చేస్తున్న స్పౌజ్ టీచర్లను ఉద్దేశించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ‘టీచర్లా–రౌడీలా’అంటూ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) అధ్యక్షుడు సదానందం గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో బాధిత టీచర్లు పిలుపునిస్తే ఏ సంబంధం లేని యూఎస్పీసీ, డీటీఎఫ్ సంఘాల నేతలను అరెస్టు చేయడంపై డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖాళీలు 21 వేలపైనే.. ప్రమోషన్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏలు) పదోన్నతులు పొందే వీలుంది. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1,944 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. వీటిని స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తారు. ఇప్పటికే ఖాళీగా ఉన్నవి, పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యేవి కలుపుకొంటే మొత్తం 7,111 వరకూ ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. వీటిల్లో ఎస్జీటీల ద్వారా 70 శాతం భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా డీఎస్సీ ద్వారా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎస్జీటీ పోస్టులు 9 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. పదోన్నతులు పొందే వారిని కలుపుకొంటే మరో 5 వేల వరకూ కొత్త ఖాళీలు ఏర్పడతాయి. ఇలా మొత్తంగా 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. -
మాకూ బదిలీలు, పదోన్నతులు.... గురుకుల సిబ్బంది డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పుడు బదిలీలు, పదోన్నతుల మంత్రాన్ని జపిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తమ విషయంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని గురుకులాల సిబ్బంది కోరుతున్నారు. చివరగా 2018 సంవత్సరంలో ప్రభుత్వం సాధారణ బదిలీలను నిర్వహించింది. ఈ ప్రక్రియ పూర్తయి ఐదేళ్లు కావస్తోంది. మరోవైపు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా చాలామంది గురుకుల టీచర్లకు స్థానచలనం కలిగినప్పటికీ వారింకా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. తాజాగా సాధారణ బదిలీలు నిర్వహిస్తే తమకు పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతుందనే భావన వారిలో ఉంది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో తాజాగా బదిలీలు నిర్వహిస్తే కోరిన చోట పోస్టింగ్ వస్తుందని వారు ఆశిస్తున్నారు. 20వేల మందికి అవకాశం...! మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో 30 శాతం గురుకుల విద్యా సంస్థలు గత నాలుగేళ్లలో ఏర్పాటు చేసినవే. కొత్త గురుకులాల్లో మెజార్టీ టీచర్లు డిప్యుటేషన్ పద్ధతిలో కొనసాగుతుండగా, మరికొందరు కాంట్రాక్టు/తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా శాశ్వత ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది. ఈ క్రమంలో గురుకులాల్లో బదిలీలు చేపడితే అర్హత ఉన్న టీచర్లకు ఎక్కువ ఆప్షన్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు గురుకుల ఉద్యోగ సంఘాలు వరుసగా వినతిపత్రాలు సమర్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో బదిలీల ప్రక్రియ చేపడితే దాదాపు 20 వేల మందికి అవకాశం దక్కుతుందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగులపై పని ఒత్తిడి కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగా గురుకులాల్లోనూ బదిలీలు నిర్వహించాలి. అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, పీఈటీలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లకు కూడా పదోన్నతులు కల్పించాలి. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం