![Promotions and Transfers in RTC - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/21/TSRTC_LOGO.jpg.webp?itok=0hvOnem6)
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారుల్లో కొందరికి పదోన్నతులు కల్పిస్తూ మరికొందరిని బదిలీ చేస్తూ సంస్థ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పదోన్నతుల్లేకుండా ఇన్‌చార్జి ఈడీలుగా నియమితులైన ముగ్గురికి ఇప్పుడు పదోన్నతి కల్పించారు. రవీందర్, టీవీ రావు, అజయ్‌కుమార్‌లు కొంతకాలంగా ఇన్‌చార్జి ఈడీలుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వారిని పూర్తిస్థాయి ఈడీలుగా నియమించారు. దీంతో వారి అసలు పోస్టులను ఇతర అధికారుల బదిలీ లతో భర్తీ చేశారు.
ఆదిలాబాద్ ఆర్‌ఎంగా ఉన్న రవీందర్ ఈడీగా నియమితులైనా ఆయన ఆర్‌ఎం పోస్టును మాత్రం ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. త్వరలో అక్కడ మరో అధికారిని నియమించే అవకాశముంది. డిప్యూటీ సీటీఎంగా ఉంటూ సికింద్రాబాద్ ఇన్‌చార్జి ఆర్‌ఎంగా పనిచేస్తున్న శ్రీధర్‌కు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ ఆర్‌ఎంగా నియమించారు. అక్కడ ఆర్‌ఎంగా ఉన్న సూర్యకిరణ్‌ను బస్‌భవన్‌లో చీఫ్ పర్సనల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. నల్లగొండ ఆర్‌ఎంను చీఫ్ కం ట్రోలర్ ఆఫ్ స్టోర్స్‌గా బస్‌భవన్‌కు బదిలీ చేశారు. డిప్యూటీ సీఎంఓ (టెక్నికల్) గా ఉన్న వెంకన్నను నల్లగొండ ఆర్‌ఎంగా నియమించారు. మెదక్ ఆర్‌ఎంను సికిం ద్రాబాద్ ఆర్‌ఎంగా బదిలీ చేసి, మెదక్‌లో డీవీఎంగా ఉన్న రాజశేఖర్‌ను మెదక్ ఆర్‌ఎంగా నియమించారు. త్వరలో మరికొన్ని బదిలీలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment