వివిధ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
సాక్షి, అమరావతి: జీవో 117 ప్రకారం పనిసర్దుబాటు ద్వారా బదిలీలు జరపాలని ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీటీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోర్ల సుధాకర్, కాళింగిరి కుమార్ విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117ను రద్దు చేయాలని కోరుతున్నా, అదే జీవోతో పని సర్దుబాటు చేస్తే పాఠశాల విద్య మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే జీవో 117, 128 ప్రకారం పనిసర్దుబాటు కోసం ఏఏ కేడర్లలో ఎంతమంది అవసరమో అంతమందిని సర్దుబాటు చేయాల్సిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ ఉత్తర్వుల ప్రకారం 98 కంటే తక్కువ రోల్ ఉన్న పాఠశాలలకు గతేడాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించలేదని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి, రమణయ్య తెలిపారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటు బదిలీలు ఏక పక్షంగా చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment