Teachers Federation
-
‘పని సర్దుబాటు’ నిర్ణయాన్ని పునరాలోచించాలి
సాక్షి, అమరావతి: జీవో 117 ప్రకారం పనిసర్దుబాటు ద్వారా బదిలీలు జరపాలని ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీటీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోర్ల సుధాకర్, కాళింగిరి కుమార్ విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117ను రద్దు చేయాలని కోరుతున్నా, అదే జీవోతో పని సర్దుబాటు చేస్తే పాఠశాల విద్య మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే జీవో 117, 128 ప్రకారం పనిసర్దుబాటు కోసం ఏఏ కేడర్లలో ఎంతమంది అవసరమో అంతమందిని సర్దుబాటు చేయాల్సిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ ఉత్తర్వుల ప్రకారం 98 కంటే తక్కువ రోల్ ఉన్న పాఠశాలలకు గతేడాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించలేదని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి, రమణయ్య తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటు బదిలీలు ఏక పక్షంగా చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. -
సీఎం జగన్‌తోనే విద్యాభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం టీపీటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీల్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నాలుగు నెలలు కావస్తున్నా.. ఈ సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, వారంలోగా పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు. బదిలీల వ్యవహారంలో చిన్న ఉద్యోగులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
టీచర్ల ఒకరోజు సమ్మె కాలం రెగ్యులరైజ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు 2012 ఫిబ్రవరి 28న జరిగిన సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఒకరోజు ఆర్జిత సెలవును ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఆర్జిత సెలవు లేని వారికి భవిష్యత్‌లో రానున్న సెలవు సరెండర్ చేసే అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపా ధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 5 వేల పోస్టులు అప్‌గ్రేడేషన్‌కు గ్రీన్ సిగ్నల్ విద్యాశాఖ ప్రతిపాదనల మేరకు 2,500 పండిట్, 2,500 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ఆర్థిక శాఖ అంగీకరించింది.