
ఎమ్మెల్సీలను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.