రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు.
‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’
అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్ తర్వాత నాన్నకు హార్ట్ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్ సీట్ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్‌షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చారు, మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ.
- శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు
‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
మాదొక పేద కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి. మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అదే కాలేజ్‌కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు.
అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా. విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా.
మాల్కం గ్లాడ్‌వెల్ అనే ఇంగ్లీష్ రైటర్ టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్‌గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ.
-దిల్షాద్, విద్యాదీవెన లబ్ధిదారు
Comments
Please login to add a commentAdd a comment