Jagananna Vasathi Deevena
-
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్‌లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్‌కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్‌లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
‘ అన్నా.. అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు. ‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’ అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్ తర్వాత నాన్నకు హార్ట్ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్ సీట్ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చారు, మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. - శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు ‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’ మాదొక పేద కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి. మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అదే కాలేజ్‌కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా. విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లీష్ రైటర్ టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ. -దిల్షాద్, విద్యాదీవెన లబ్ధిదారు -
Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు. పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్లతో ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది. అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది. టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది. ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. -
మా అమ్మగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. జగనన్న విద్యాదీవెన,వసతి దీవెన పథకాలతో చదువుకోగలుగుతున్నాను.
-
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వరం..!
-
మీ భవిష్యత్తుకు బంగారు బాట
-
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు)
-
Andhra Pradesh: చదువే దివ్యాస్త్రం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనం చదువుకునేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు.. ప్రపంచంతో పోటీపడే అత్యుత్తమ చదువులే మన లక్ష్యం. విద్య ఒక కుటుంబం స్థితిగతులను, సామాజిక అసమానతలను రూపుమాపుతుంది. పేదరికం సంకెళ్లను తెంచాలంటే చదువే పెద్ద అస్త్రం. అందుకే అధికారంలోకి వచ్చాక విద్యా విధానంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. మన చదువులు బతకడానికి మాత్రమే కాదు.. లీడర్లుగా ఎదగడానికి కూడా ఉపయోగపడాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలెవరూ పెద్ద చదువులకు దూరం కాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థులు ఉండటానికి, తినటానికి అవసరమయ్యే వసతి ఖర్చులకు కూడా డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. బుధవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ‘జగనన్న వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. నాలుగేళ్లలో రూ.14,223.60 కోట్లు ఈరోజు విడుదల చేస్తున్న జగనన్న వసతి దీవెన నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 8,61,138 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేస్తున్నాం. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదివేందుకు ఎక్కడా అడ్డంకులు రాకూడదనే విద్యాదీవెనతో పాటు వసతి దీవెన నిధులు ఇస్తున్నాం. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద నాలుగేళ్లలో రూ.14,223.60 కోట్లు అందచేశాం. సత్య నాదెళ్ల స్థాయికి అందరూ ఎదగాలి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి మనమంతా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఒక్కరే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ అండతో చదువుకునే ప్రతి విద్యార్థీ ఆ స్థాయికి వెళ్లాలన్నదే నా తపన. భవిష్యత్తు తరాలకు మేలు జరగాలని పిల్లలను చక్కగా చదివించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. మనమంతా గత ప్రభుత్వాలను చూశాం. అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. భోజన వసతి లేక పేద పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవారు. గత పాలకులు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేస్తూ ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున వసతి దీవెన కింద ఇస్తున్నాం. రెట్టింపు దాటిన జీఈఆర్ గతంలో ఇంటర్ పూర్తయ్యాక చాలామంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేకపోయేవారు. ఇప్పుడు అలాంటి డ్రాపౌట్స్ తగ్గిపోయాయి. జీఈఆర్ (స్థూల చేరికల నిష్పత్తి) గతంలో 32.4 శాతం ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక 70 నుంచి 80 శాతానికి పెంచేలా చర్యలు తీసుకున్నాం. ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడటం కాకుండా ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేట్ స్కూళ్లే పోటీ పడాల్సిన స్థాయికి తెచ్చాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. 6వ తరగతి నుంచి 30,230 క్లాస్ రూమ్స్‌లో డిజిటల్ బోధన తెచ్చాం. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాం. 2018–19 నాటికి ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 40 లక్షల మందికి పెరిగారు. వారికి వాళ్ల అన్న ఉన్నాడనే నమ్మకంతోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. గతంలో 87 వేల మంది ఇంజనీరింగ్ చదువుతుంటే ఈ ప్రభుత్వం వచ్చాక రూ.1.20 లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. ‘ఉన్నత’ మార్పులతో ఉత్తమ ఉద్యోగాలు అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు అనుకూలంగా ఉన్నతవిద్య కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొచ్చాం. 30 శాతం స్కిల్, జాబ్ ఓరియెంటెడ్‌గా మార్పులు తేవడంతో పాటు 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు, 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సులను కరిక్యులమ్‌లో భాగం చేశాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాం. పిల్లల నైపుణ్యం పెంపొందించేలా అప్ స్కిల్లింగ్ కార్యక్రమాల కోసం దేశంలో తొలిసారిగా ఆన్లైన్ కోర్సులను కరిక్యులమ్‌లో భాగం చేశాం. ఆన్లైన్ క్రెడిట్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ సంపూర్ణ మార్పులు చేపట్టాం. 1.60 లక్షల మందికి సైబర్ సెక్యూరిటీ, అజూర్ వెబ్ సర్వీసెస్, డైనమిక్ 365 లాంటి కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ, సర్టిఫికెట్స్ ఇప్పించి మెరుగైన ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నాం. మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్‌ఫోర్స్ లాంటి దిగ్గజ సంస్థల సేవలను అనుసంధానం చేశాం. మన విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మాస్టర్స్ ప్రోగ్రాంపై జర్మనీకి చెందిన యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. బీఎస్సీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు సంబంధించి మెల్బోర్న్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని అడుగులు ముందుకు వేస్తున్నాం. గత సర్కారు పెత్తందారీ పోకడ పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ మనస్తత్వం గత ప్రభుత్వానిది. ప్రతి పేదవాడూ పెద్ద చదువులు చదువుకోవాలి.. కుటుంబ పరిస్థితులు మారాలన్నది మన ప్రభుత్వ సంకల్పం. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చూడండి. రెండు ప్రభుత్వాలనూ బేరీజు వేయండి. ఈ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందంటే మీరే జగనన్నకు సైనికులుగా నిలబడండి. అబద్ధాలు, మోసాలు లాంటివి రానున్న రోజుల్లో మరిన్ని చూస్తారు. అవేమీ నమ్మకండి. నాకు ఉన్న ధైర్యమల్లా దేవుడి దయ, మీ ఆశీస్సులే. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఉషశ్రీ చరణ్ తదితరులతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశీ విద్యకు ఆర్థిక సాయం.. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే మన విద్యార్థుల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. టాప్ 50 యూనివర్సిటీల్లో సీటొస్తే రూ.1.25 కోట్ల వరకూ ప్రభుత్వమే భరించి వారిని చదివిస్తుంది. ఇప్పటికే 200 మంది విద్యార్థులను జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివిస్తున్నాం. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నది నిజమే కానీ.. ‘ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్’ అన్నది సత్యం. మన చదువులు బతకడానికి మాత్రమే కాదు.. లీడర్లుగా ఎదగడానికీ ఉపయోగపడాలి. మనలో ఎదగాలన్న తపన, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఉంటే ప్రపంచమే మనచుట్టూ తిరుగుతుంది. మా జగనన్న చదివిస్తున్నారు.. అని గర్వంగా చెబుతా మాది ధర్మవరం. మా నాన్న టైలరింగ్ చేస్తారు. అమ్మ గృహిణి. చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. 2021లో ఇంటర్ పూర్తవగానే జేఎన్టీయూ అనంతపురంలో ఇంజినీరింగ్ సీటు సాధించా. విద్యాదీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నా. మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతిదీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని. మా ఇంటికి ఇప్పటివరకు అక్షరాలా రూ.3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది. – దివ్యదీపిక, బీటెక్ సెకండియర్, జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం మాది తిరుపతి జిల్లా చెన్నూరు. నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకపోతే నేను చదువుకు దూరమయ్యేవాడిని. నాలాంటి ఎంతోమంది మీకు రుణపడి ఉంటాం. ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి. మా ఒక్క కుటుంబానికే మీరు రూ.4,59,976 అందజేశారు. మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను ప్రయోజకుడిని అయి పదిమంది విద్యార్థులకు తోడ్పాటు అందిస్తానని ప్రమాణం చేస్తున్నా. – గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల లోకేశ్.. శింగనమల చెరువు వద్దకు వెళ్లి సెల్ఫీ చాలెంజ్ ఎందుకు చేయలేదు? గతంలో శింగనమల నియోజకవర్గంలో కరువు ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాయి. లాభసాటి వ్యవసాయం చూస్తున్నాం. ఇవన్నీ కేవలం నాలుగేళ్ల పాలనలోనే సాధ్యమయ్యాయి. ఒక్క శింగనమల నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా రూ.1,400 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.320 కోట్లు కేటాయించారు. ఇటీవల శింగనమలలో లోకేశ్ యువగళం కాదు.. గందరగోళం పాదయాత్ర జరిగింది. మీ బాబు హయాంలో ఒక్కసారైనా శింగనమల చెరువు నిండిందా? ఇప్పుడు నాలుగేళ్లుగా నిండే ఉంది. సెల్ఫీ చాలెంజ్ అంటున్న లోకేశ్.. ఆ చెరువు పక్కన సెల్ఫీ ఎందుకు తీసుకోలేదు? – జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల ఎమ్మెల్యే -
చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు: సీఎం జగన్
-
మా చిరునవ్వుకు కారణం మీరే జగనన్న.. నార్పల సభలో విద్యార్థిని భావోద్వేగం..
సాక్షి, అనంతపురం జిల్లా: ‘అన్నా నమస్తే, మా నాన్న టైలరింగ్ చేస్తారు.. మా అమ్మ గృహిణి, మాది ధర్మవరం.. అన్నా మీరు అంటుంటారు ఒక దీపం ఒక గదికి వెలుగులు ఇస్తుంది కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగులు నింపి ఆ కుటుంబ రూపురేఖలు మార్చేస్తుందని, మీరు విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.. ఆ చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు’’ అంటూ అనంతపురం జేఎన్టీయూ కాలేజ్ బీటెక్ సెకండియర్ విద్యార్ధిని దివ్య దీపిక భావోద్వేగానికి గురైంది. నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ‘జగనన్న వసతి దీవెన’ ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యార్ధులు తమ స్పందన తెలిపారు. ‘జగనన్న వసతి దీవెన గురించి విద్యార్ధిని దివ్య దీపిక మాటల్లోనే.. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. అన్నా నాది 2021లో ఇంటర్ పూర్తవగానే ఇక్కడ జేఎన్టీయూలో సీట్ తెచ్చుకున్నాను. నేను విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతి దీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని.. లాక్డౌన్ తర్వాత అంతంతగా ఉన్న మా ఆర్ధిక పరిస్ధితిపై మీరు కనుక ఈ పథకాలు పెట్టకపోయి ఉంటే ఎంతో భారం పడేది. మీ చిరునవ్వులో నేను భాగమవుతా.. మీ కుటుంబంలో ఒకడినవుతానని మీరు అంటుంటారు.. మా చిరునవ్వులో భాగమే కాదు చిరునవ్వుకు కారణం కూడా మీరే, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు.. విద్యా కానుక ద్వారా స్కూల్ బుక్స్, బ్యాగ్, ఇలా ప్రతీది అందిస్తున్నారు, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కానిదంతా మీరు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరు ప్రతి గుండెలో ఉంటారన్నా.. మా ఇంట్లో చాలా పథకాలు అందుతున్నాయి. మా ఇంట్లో ఇప్పటివరకు అక్షరాలా రూ. 3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది.. అన్నొచ్చాడని చెబుతాం, మంచి రోజులు వచ్చాయని చెబుతాం. చదవండి: ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది మీరు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు. మీ పాదయాత్రకు ఏదీ సాటిరాదన్నా. నేను కోరుకుంటున్న ఉన్నతమైన సమాజానికి మీరు పునాదులు వేశారు. ప్రతి గ్రామంలో అన్నీ ఏర్పాటుచేస్తున్నారు. సచివాలయాల ద్వారా అన్నీ అందుతున్నాయి, మీ కష్టాన్ని చరిత్ర కచ్చితంగా గుర్తుంచుకుంటుంది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొందరినే గుర్తించుకుంటుంది. ఆ చరిత్రలో జగన్ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. యాదృచ్చికమో లేక దైవ నిర్ణయమో కానీ మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కళకళలాడుతుంది. అన్నొచ్చేశాడు మన బతుకులు మార్చేశాడు. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఉన్నతస్ధాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్నా. మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా వంతు పాత్రను నేను పోషిస్తాను, ధ్యాంక్యూ అన్నా. మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం సార్, మాది నిరుపేద కుటుంబం, చెన్నూరు గ్రామం, తిరుపతి జిల్లా. మా నాన్న కూలిపనులు చేస్తారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకుండా ఉంటే నేను చదువుకు దూరమయ్యేవాడిని, నాలాంటి ఎంతోమంది విద్యార్ధులకు మీరు సాయం చేస్తున్నారు, మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం, వసతి దీవెన ద్వారా మాకు సాయం అందుతుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయే మార్పులు మీరు విద్యారంగంలో చేస్తున్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, విదేశీ విద్యాకానుక పథకాలు తీసుకొచ్చారు, ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి, మా ఒక్క కుటుంబానికే మీరు రూ. 4,59,976 అందజేశారు, మాలాంటి పేద విద్యార్ధులకు మీరు అండగా నిలిచి ఎప్పుడూ మాకు తోడుగా నిలిచి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, నేను రాముడి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పుస్తకాలలో చదివాను కానీ ఇప్పుడు జగనన్న పాలనలో మేం అంతే సంతోషంగా ఉన్నాం, నేను మంచి ప్రయోజకుడిని అయి పది మంది విద్యార్ధులకు తోడ్పాటును అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను, నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్, ధన్యవాదాలు. -గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేడీ యూనివర్శిటీ విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్.. సార్, నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివించడం అనేది మా తల్లిదండ్రులకు పెద్ద భారం, కానీ మీరు సమాజంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. మీరు మా విద్యార్ధులకు అనేక పథకాలు తీసుకొచ్చారు, దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్లో అనేక కోర్సులు ప్రవేశపెట్టారు, మా విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్‌గా నిలిచారు.. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మేం కూడా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై భవిష్యత్‌లో ఉన్నతంగా రాణిస్తాం.. నేను ఈ మధ్య మాల్కం గ్లాడ్వెల్ రచించిన అవుట్లేర్స్ పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో పదివేల గంటల సూత్రం చదివాను, దాని అర్ధం ఏంటంటే ఎవరైనా ఏ రంగంలోనైనా నిష్ణాతులు కావాలంటే పదివేల గంటలు అభ్యసించాలని, మీరు పాదయాత్రలో దానిని నిరూపించారు, ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది, మీరు మనసున్న మారాజులా నిలిచారు, మీరు మా యువతకు గొప్ప స్పూర్తిప్రదాతగా నిలిచారు. మీ పేరు నిలబెట్టేలా మేం ముందుకెళతాం, ధ్యాంక్యూ సార్. -గ్రేసీ, బీటెక్ సెకండియర్ విద్యార్ధిని, జేఎన్టీయూ, అనంతపురం -
అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి బుధవారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకం నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. చదవండి: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్ -
ఇదీ కదా సీఎం జగన్ విజన్.. ప్రత్యక సాక్షి ఈ అమ్మాయే
-
చంద్రబాబుపై సీఎం జగన్ పులి కథ.. వేరే లెవెల్..
-
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు)
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు) -
పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. వాళ్ల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నాం. చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా.. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం.. పెత్తందారి ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడాలు ప్రజలు గమనించాలని సీఎం జగన్ ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. పేదలకు పెద్ద చదువులు అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అని సీఎం జగన్ పేర్కొన్నారు. గవర్నమెంట్ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలనుకున్న పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. అందుకే బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. ప్రతీ మూడు నెలలకు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో డ్రాపవుట్ల సంఖ్య తగ్గిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్లలా ఎదగాలి.. మన పిల్లలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా విద్యా సంస్కరణలు చేశాం. ఈ ప్రయత్నాలు కేవలం ఉద్యోగాలు కోసం కాదు. వాళ్లను లీడర్లుగా వారిని తీర్చిదిద్దడానికి తపన పడుతున్నాం. మన పిల్లలను లీడర్లుగా చేసేందుకు జగనన్న ఆలోచన చేస్తున్నాడు. మన పిల్లలంతా సత్యనాదెళ్లలా(సత్యనాదెళ్ల మూలాలు అనంతపురంవే కావడం గమనార్హం) తయారు కావాలి. ఒక్క సత్యనాదెళ్లకాదు… ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్ల కావాలి. స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెడుతున్నామని సీఎం జగన్ వివరించారు. ఇదీ చదవండి: నా జగనన్న నన్ను చదివిస్తున్నాడు -
జగనన్న వసతి దీవెన: నిధులు విడుదల చేసిన సీఎం జగన్
CM Jagan Anantapur District Tour Updates: ► బటన్ నొక్కి రూ.912.71 కోట్లు నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. ► చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజకి వర్గాన్నే మారుస్తుంది. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం. చదువుల వల్ల ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. ► గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలి. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి. ► గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ► ఇది విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న వసతిదీవెన. ఫీజురియింబర్స్‌మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.. బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాత్లాలో డబ్బులు జమ చేస్తున్నాం. ► నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్యా నాదెళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్.. ఎడ్యూకేషన్ ఈజ్ పవర్. ► రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబును చూసి పంచతంత్రం కథ గుర్తొచ్చింది. వేటాగే శక్తి కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉంది. ► రోజూ రాజకీయాల మధ్య మనం బతుకుతున్నాం. నేను సీనియర్‌ను ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు. బంగారు కడియం ఆశచూపి మనుషులను మింగేసే పులి బాపతు వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిఏ ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. ► రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. బాబు వచ్చాడు.. రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండిచేయి చూపాడు. ► దోచుకో, పంచుకో, తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరికి తోడుగా దత్తపుత్రుడు. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్దాలను, మోసాలను నమ్మకండి. ► జగనన్న వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం ప్రజలే. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి. నా అన్న జగనన్న చదివిస్తున్నాడు ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ, చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాల రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. సీఎం జగన్‌తో ముఖాముఖి అయ్యింది దివ్య దీపిక. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దివ్య దీపిక.. తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్, తల్లి గృహిణి. విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటోంది. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక. ► జగనన్న పాలనలో పేదల చదువులకు ఢోకా లేదు. నాణ్యమైన చదువుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల రూపకర్త. అభివృద్దికి దిక్సూచి సీఎం జగన్. విద్యారంగంలో వినూత్న మార్పులు తెస్తున్నారు. 2019లో హిస్టరీ క్రియేట్ చేశాం. 2024లో హిస్టరీ రిపీట్ చేస్తాం.. అని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రసంగించారు. ► జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి జగన్. ► దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్. ► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమ సభా ప్రాంగణం వద్ద అప్యాయ పలకరింపుతో ముందుకు సాగుతున్న సీఎం జగన్. ► అపూర్వ స్వాగతం నడుమ.. నార్పల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. నార్పల హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్‌కు ఘన స్వాగతం ► అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మాత్యులు కేవీ ఉషశ్రీ చరణ్, జిల్లా కలెక్టర్ గౌతమి, అనంతపురం డిఐజి ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్,సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ లు సీఎం జగన్‌కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. ► జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా.. లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. ► అనంతపురం నార్పల పర్యటనలో భాగంగా.. పుట్టపర్తి నుంచి శింగనమల నియోజకవర్గం నార్పలకు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. ఆపై నార్పల క్రాసింగ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. ముందుగా విద్యార్థుల తల్లులను, స్థానిక నేతలను పలకరించి.. ఆపై వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. జగనన్న వసతి దీవెన లబ్ధిని బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేస్తారు. ► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు. అక్కడి సభాప్రాంగణం నుంచి ప్రసంగించిన తర్వాత సీఎం జగన్ నిధుల నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ► జగనన్న వసతి దీవెన కింద నిధులు విడుదల కోసం.. తాడేపల్లి నుంచి అనంతపురం జిల్లా నార్పల బయలుదేరిన సీఎం జగన్. ► జగనన్న వసతి దీవెన పథకం ప్రకారం.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ► రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. ► సంక్షేమ క్యాలెండర్ అమలు హామీలో భాగంగా పేద విద్యార్థులకు ఆసరా అందిస్తూనే.. గత ప్రభుత్వం 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. ► గతంలోని టీడీపీ ప్రభుత్వం అరకోరగా ఫీజుల కోసం నిధుల్ని విడుదల చేసేది. పెండింగ్ బకాయిల్ని ఉంచింది కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. -
నేడు జగనన్న వసతి దీవెన
సాక్షి, అమరావతి: చెప్పిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జగనన్న వసతి దీవెన అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. విప్లవాత్మక సంస్కరణలు కరిక్యులమ్‌లో మార్పులు, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ తదితర విప్లవాత్మక కార్యక్రమాలతో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తోంది. డిజిటల్ విద్యలో భాగంగా 8 వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది. కాగా, బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తిరిగి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 26న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. బుధవారం ఉదయం8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎం చేరుకుంటారు. 10.40 – 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం– లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసేందుకు 800కి.మీ సైకిల్ తొక్కుతూ వచ్చిన అభిమాని సీఎం పర్యటనపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు. సీఎం పర్యటనపై కలెక్టర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, లబ్ధిదారులను సమావేశానికి బస్సుల్లో తీసుకురావాలని సూచించారు. వాహనాలు నిలిపేందుకు ప్రజలకు, వీఐపీలకు వేరువేరుగా పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సభాస్థలి గ్యాలరీ వద్ద తాగునీరు, మజ్జిగ, స్నాక్స్ అందుబాటులో ఉంచాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 104, 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. వినతులు స్వీకరించాలి: ముఖ్యమంత్రికి సమస్యలు తెలుపుకొనేందుకు వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని గుంతకల్లు ఆర్డీఓ రవీంద్రకు సూచించారు. ప్రజల నుంచి ముందస్తుగానే అర్జీలు స్వీకరించి డీఆర్ఓకు అందజేయాలని ఆదేశించారు. చదవండి: ఏపీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టు కీలక సూచన ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటనకు సంబంధించి నార్పలలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను ఆదివారం సీఎం కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాస్‌రావు, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఆర్డీఓ మధుసూదన్ పరిశీలించారు. వీరి వెంట ఆర్అండ్బీ అధికారి ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రఘునాథ్‌రెడ్డి, అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ నాయకులు రఘునాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి ఉన్నారు. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
ఉన్నత చదువులు చదువుకుంటున్న సామాన్యులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్యుడికి ఉన్నత చదువు చేరువవుతోంది. బుర్ర నిండా తెలివితేటలు ఉన్నా జేబు నిండా డబ్బు లేకపోవడంతో నిన్నటి తరంలో చాలా మంది ఉన్నత చదువులకు దూరమయ్యారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల మూలాన ఇష్టం లేని కొలువులు, వ్యాపారాలు, చిరుద్యోగాల్లో చేరి సర్దుకుపోయారు. కానీ నేటి తరానికి ఓ ఊతం దొరికింది. ‘నువ్వు చదువుకో.. నేను ఫీజు కడతా’ అంటూ భరోసా ఇచ్చే నాయకుడు దొరికాడు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లలకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో వైఎస్ జగన్ సర్కారు కొండంత అండగా నిలుస్తోంది. ఈ సాయంతో చాలా మంది పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు జగన్న విద్యా వసతి, విద్యాదీవెన పథకంతో జిల్లాలో పేదల విద్య సాగుతోంది. ఈ పథకం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర కులాలకు చెందిన పేద పిల్లలకు అమలవుతోంది. 2020–21లో రెండు విడతల్లో 64,623 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 62.33 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన పథకం కింద 67,940 మంది విద్యార్థులకు గాను రూ.67.27 కోట్లు విడుదల చేశారు. 2021–22 సంవత్సరానికి గాను మూడు విడతల్లో 54,764 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద రూ.81.61 కోట్లు అందించారు. జగనన్న విద్యాదీవెన కింద 68,913 మంది విద్యార్థులకు రూ.63.52 కోట్లను అందజేశారు. ఈ ఏడాది ఇంకా కొన్ని విభాగాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ జ్ఞాన భూమి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు డబ్బులు నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో నిర్ణయించిన ఫీజులు చెల్లించగా, వసతి దీవెన పథకం కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నికల్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న వారికి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. రుణపడి ఉంటాం.. నా పేరు పొదిలాపు పార్వతి. నాది శ్రీకాకుళం మండలం లంకాం గ్రామం. నా భర్త పదేళ్ల కిందటే కాలం చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పిల్ల దీపిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. పెద్ద పిల్ల గీతిక విశాఖపట్నంలో ఇంజినీరింగ్ చేస్తోంది. మా ఇద్దరు పిల్లలను జగనన్నే చదివిస్తున్నారు. చిన్నపిల్లకు అమ్మ ఒడి వస్తుంది. పెద్ద పిల్లకు విద్యాదీవెన, వసతి దీవెన వస్తుంది. కాలేజీ ఫీజులకు, చదువు పుస్తకాలకు ఖర్చులకు ప్రభుత్వం సాయం మాకు ఎంతో మేలు చేస్తోంది. నేను నా పిల్లలు జగనన్నకు రుణపడి ఉంటాం. నా లాంటి వారికి మేలు నా పేరు పైడి మాధవరావు. మాది శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామం. మాకు స్థిర చరాస్తులు లేవు. కష్టపడి జీవ నం సాగిస్తున్నాం. నేను ఒక ప్రైవేటు వ్యాపారి వద్ద రోజు కూలీగా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. నిజానికి వీరిని పెద్ద చదువులు చదివించే స్థోమత మాకు లేదు. ఇంటర్ చదివేటప్పుడు మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరినీ విజయనగరంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించా. కేవలం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వస్తుందన్న ధైర్యంతోనే వారి చదువులు సాగుతున్నాయి. కళాశాల ఫీజులు, పిల్లల చదువు ఖర్చులు జగనన్న ఇస్తున్నారు. నాలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. (క్లిక్ చేయండి: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు) -
AP: ప్రభుత్వ పథకాలతో ఉన్నత చదువులకు విద్యార్థుల మొగ్గు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 93.38 శాతం మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడం గమనార్హం. ఇది దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ సగటుకు మించి ఏపీలో గరిష్ట చేరికల నిష్పత్తి నమోదవుతోంది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో మూడున్నరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. టీడీపీ హయాంలో 2018–19లో 20.37 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరలేక డ్రాపౌట్లుగా మిగలగా ప్రస్తుతం 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. గత సర్కారు అరకొర ఫీజులనూ ఇవ్వకుండా రూ.1,800 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోగా వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పాటు అకడమిక్ అంశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని నిజం. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ సదుపాయాలు మెరుగు పరుస్తుండడం, వివిధ పథకాలతో అడుగడుగునా అండగా నిలుస్తుండటంతో చదువుల నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికే ప్రాధాన్యం బయట రాష్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా తగ్గి రాష్ట్ర కాలేజీల్లో చేరికలు పెరిగాయి. 2022 – 23లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారు 35.50 శాతం ఉండగా డిగ్రీ కోర్సుల్లో 43.79 శాతం మంది చేరారు. 11.13 శాతం మంది అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరిన వారు 2.96 శాతం మంది ఉన్నారు. మరో 6.62 శాతం మంది మాత్రమే డ్రాపౌట్లుగా మిగిలారు. 2018–19లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారిలో 20.37 శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోగా ఈసారి అది 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. 2018 – 19లో టీడీపీ అధికారంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించినందున మిగతా ఫీజుల భారాన్ని భరించలేక ఇంజనీరింగ్ కోర్సుల్లో 21.77 శాతం మంది మాత్రమే చేరారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరికల శాతం అమాంతం 35.50 శాతానికి పెరగడం గమనార్హం. నాడు.. ప్రైవేట్‌కే విద్య టీడీపీ హయాంలో ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్‌పరం కావడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్ చదువులకే రూ.లక్షలు ధారపోయాల్సిన దుస్థితి నెలకొంది. తూతూ మంత్రంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలైంది. కాలేజీల్లో ఫీజు ఎంతున్నా ఇంజనీరింగ్‌కు రూ.35 వేలు, ఇతర డిగ్రీ కోర్సులకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే విదిలించి గత సర్కారు చేతులు దులుపుకొంది. అది కూడా అరకొరగానే ఇవ్వడంతో మిగతా ఫీజుల మొత్తాన్ని తలిదండ్రులే భరించాల్సి వచ్చేది. ఫలితంగా పిల్లల చదువులు పూర్తయ్యేసరికి అప్పుల్లో మునిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు, కూలి పనుల అన్వేషణలో నిమగ్నమైన పరిస్థితి ఏర్పడింది. నేడు.. సమూల మార్పులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా రంగం పరిస్థితి సమూలంగా మారిపోయింది. పేద విద్యార్థుల చదువులకయ్యే ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. చదువులు సాఫీగా సాగేలా వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై భరోసా ఏర్పడింది. ఫలితంగా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉన్న రెండేళ్లలోనూ చేరికలు పెరగడం విశేషం. లక్ష ప్లేస్‌మెంట్స్ లక్ష్యం ► టీడీపీ హయాంలో 2015–16లో ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 11,25,510 కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2021–22 నాటికి 14,23,952కి చేరుకుంది. చదువుల కోసం నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఫీజులను చెల్లిస్తుండటంతో ప్రవేశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ► అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2014–15లో రాష్ట్రంలో ప్లేస్మెంట్లు 56 వేలు కాగా 2021–22లో 78 వేలకు చేరాయి. ప్లేస్మెంట్స్ను లక్షకు పైగా తీసుకెళ్లటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► జీఈఆర్ (ప్రతి వంద మందిలో కాలేజీల్లో చేరేవారి సంఖ్య)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాల వారీగా ఆలిండియా ఉన్నత విద్యా సర్వే (ఐష్) పేరిట నివేదికలను వెలువరిస్తుంది. ఐష్ సర్వే ప్రకారం ఏపీలో జీఈఆర్ 2015–16లో 30.8 ఉండగా 2019–20లో 35.2కు పెరిగింది. జాతీయ స్థాయిలో 24.5 నుంచి 27.1కు పెరిగింది. జీఈఆర్ పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతంగా ఉండగా ఏపీలో 8.64 శాతంగా ఉండడం విశేషం. కేరళ 4.86 శాతం, తమిళనాడు 4.89 శాతం, తెలంగాణ –1.65 శాతంగా ఉన్నాయి. -
విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ
విద్యాభివృద్ధి మీదే సమాజాభివృద్ధి అధారపడి ఉంటుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టిన వెంటనే ముందు విద్యా రంగంపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ బడులలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. తొలి దశ క్రింద 15,715 స్కూళ్లలో సదుపాయాలను కల్పించగా... ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. ఈ దశలో స్కూళ్లతో పాటుగా కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, డైట్‌తో పాటు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక తరగతి నుండి ఇంటర్ వరకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలను ఆమె ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. పాఠశాల ప్రారంభంలోనే ‘జగనన్న విద్యా కానుక’ రూపంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు ప్రతి విద్యార్థికి అందిస్తోంది. అలాగే ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సహాయం అందిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు అన్ని కోర్సులకు చెల్లించే ఫీజును తిరిగి విద్యార్థులకే చెల్లిం చాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా 24.74 లక్షల మంది విద్యార్థులకు రూ. 8,365 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు జరిగాయి. ‘జగనన్న వసతి దీవెన’ కింద 18.77 లక్షల మందికి రూ. 3349.57 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ఈ మూడేళ్లలో 44.5 లక్షల మంది ఖాతాల్లో రూ. 19617.60 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 98 శాతం మందికి విద్య అందుబాటులోకి వచ్చిందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో చేస్తున్న అనేక రకాల సంస్కరణల్లో మరొకటి ఇంటర్ విద్యను, పాఠశాల విద్యను కలిపి ‘ప్లస్ 2’ చేయడం. దీనివలన మూడవ తరగతి నుండి ఇంటర్మీ డియట్ వరకు విద్య ఒకే చోట దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని మూడు నుంచి ఆరేళ్ల వయస్సుగల పిల్లలకు అందించడంలో ఏపీ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ‘ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్’ (ఈసీఈ) అమలులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పేద విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో జ్ఞానాన్ని అందించే క్రమంలో ‘విద్యా కానుక’లో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు, దాదాపు 50 వేల మంది టీచర్లకు 665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను ప్రభుత్వం అందించనున్నది. ఇలా ఏపీ విద్యాసంస్కరణలతో ముందుకు దూసుకు పోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. - వి.వి. రమణ సామాజిక విశ్లేషకులు -
అది తప్పుడు వార్త
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సీతాయిలంకలోని తుమాటి లత అనే మహిళ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల నిధులు పూర్తిగా అందలేదని ఎమ్మేల్యే సింహాద్రి రమేష్‌బాబును గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీసినట్లు ఆ పత్రిక సోమవారం ఒక వార్త ప్రచురించింది. ఆ కార్యక్రమంలో జరిగిన దానికి భిన్నంగా తప్పుడు సమాచారాన్ని వండి వార్చింది. వాస్తవానికి తుమాటి లత బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ. 1.72 లక్షలు జమ చేసినట్లు పేర్కొంటూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమెకు కరపత్రాన్ని అందించారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ. 1.40 లక్షల వరకు అందినట్లు, బ్యాంకు అకౌంట్ పుస్తకంలో ఆమేరకు జమ చేసినట్లు అందులో వివరించారు. అయితే ఈ రెండు పథకాల కింద తమకు రూ.82 వేలు మాత్రమే అందినట్లు లత చెప్పడంతో ఆమెకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే 1.72 లక్షల నిధులు లత, ఆమె కుటుంబీకులకు చెందిన ఏయే బ్యాంకు అకౌంట్లలోకి ఏ తేదీల్లో జమ అయ్యాయో వివరంగా చూపించారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన కింద 1.40 లక్షలు ఏయే తేదీల్లో జమ అయ్యాయో రికార్డులు చూపి మరీ చెప్పారు. తన అకౌంట్లో, తన కుమార్తె అకౌంట్లో మొత్తం నిధులు జమ అయ్యాయని, తానే పొరపాటున పూర్తిగా రాలేదని అనుకున్నానని లత వివరించారు. పూర్తి మొత్తం అందించినట్లు బ్యాంకు అకౌంట్లలో జమ అయిన మొత్తాలను చూపి మరీ అధికారులు తమకు వివరించారని చెప్పారు. అయితే, ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్త రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. -
Jagananna Vidya Deevena: విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. -
విద్యతోనే వెలుగులు: సీఎం జగన్
మీ బిడ్డల చదువులకు నాదీ భరోసా చదువుకోవాలనే ఆరాటం ఉన్నా పేదరికంతో ఆగిపోయిన పిల్లలను నా పాదయాత్రలో చూశా. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులను చూశా. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ఏ ఒక్క బిడ్డ కూడా పేదరికంతో చదువుకు దూరం కాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. మన బతుకులు, తలరాతలను మార్చే శక్తి చదువులకే ఉంది. మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ధైర్యంగా చదివించండి. వారి చదువులకు మేనమామగా నాదీ భరోసా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, కర్నూలు: విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఒక్క ఏడాదిలోనే 8.64 పెరిగిందని, గత సర్కారు హయాంతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరికలు ఏకంగా ఏడు లక్షలకుపైగా పెరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నంద్యాలలో జ్యోతి ప్రజ్వలనం చేసి వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిషు మీడియంతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మారాయని, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు ఇస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు, విద్యా వ్యవస్థపై నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడతలో భాగంగా రూ.1,024 కోట్లను శుక్రవారం నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నంద్యాలను జిల్లాగా చేసినందుకు శిల్పామోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఫీజులకు తోడుగా వసతి దీవెన.. ప్రతీ పార్లమెంట్‌ను జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఇదే నంద్యాల వేదికగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మీ ముందుకు వచ్చా. చదువు అనే ఆస్తిని పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రాలేవు. అందుకే విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేశాం. గత సర్కారు హయాంలో అరకొరగా ఫీజుల విదిలింపులతో ఎంతో మంది చదువులకు గండం ఏర్పడింది. అక్కచెల్లెమ్మలకు జగనన్న వసతి దీవెన చెక్కును అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తూ ఆదుకుంటున్నాం. భోజన, వసతి ఖర్చులు కూడా రూ.వేలల్లోనే ఉంటున్నాయి. వీటికి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని భావించాం. దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మరోరెండు అడుగులు ముందుకేసి ఫీజుల పథకానికి మార్పులు చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన అనే మరో గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. మీ అన్న తోడుంటాడని మాటిస్తున్నా.. నంద్యాల గడ్డ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లల చదువుల కోసం 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి 2021–22 జగనన్న వసతి దీవెన పథకం రెండో విడతగా రూ.1,024 కోట్లు జమ చేస్తున్నాం. పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలను భోజనం, వసతి కోసం రెండు విడతల్లో ఇస్తామని చెప్పాం. ఆ ప్రకారం రెండోదఫా డబ్బులు జమ చేస్తున్నాం. కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు పోయాయి. మీ కుటుంబంలో అందరినీ చదివించండి. మీ అన్న జగన్ మీకు తోడుగా ఉంటాడని ప్రతీ తల్లికి మాట ఇస్తున్నా. జవాబుదారీతనం పెంచేందుకు జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వీటిని తల్లులు కాలేజీలకు చెల్లిస్తున్నారు. దీంతో వారు సదుపాయాలపై కాలేజీలను ప్రశ్నించవచ్చు. యాజమాన్యాలలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తే కాలేజీలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. మూడేళ్లలో సమూల మార్పులు విద్యారంగంలో మూడేళ్లలో సమూల మార్పులు చేశాం. పేద కుటుంబంలో ప్రతీ బిడ్డ మంచి చదువులు చదవాలనే తాపత్రయంతో నాడు–నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. మంచి చదువు మాత్రమే సరిపోదు.. మంచి ఆహారం కూడా అందాలి. పిల్లలు ఏం తీసుకుంటే బాగుంటారు? ఎలాంటి నాణ్యమైన భోజనం అందించాలి? అని బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రీ ఆలోచించి ఉండరు. గతంలో పాఠశాలల్లో ఫర్నిచర్, బ్లాక్ బోర్డులకూ కొరతే. వంట గదుల్లో అంతా అపరిశుభ్రత. ఆహ్లాదంగా కనిపించేలా గోడలకు రంగులు లేవు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని గదుల్లో బోధించాల్సిన దుస్థితి. నాడు–నేడు ద్వారా ఈ దురవస్థను తొలగిస్తున్నాం. సర్కారు స్కూళ్లకు మంచి రోజులు.. పిల్లలకు ఇంగ్లీషు మీడియంతో ఇబ్బంది లేకుండా మిర్రర్ ఇమేజ్‌తో ద్విభాషా పాఠ్య పుస్తకాలను తెచ్చాం. పక్కపక్కనే ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పాఠాలను ముద్రించాం. నెమ్మదిగా ఇంగ్లీషు మీడియం వైపు నడిపించేలా ఇవి ఉపయోగపడతాయి. రానున్న 10 నుంచి 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాన్ని మార్చుతున్నాం. పాఠశాలల నుంచి మొదలైన ఈ మార్పు ద్వారా కాలేజీల వైపు కూడా అడుగులు వేస్తున్నాం. మెడికల్ కాలేజీలు.. స్కిల్ వర్సిటీలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 16 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అందులో ఒకటి ఇదే నంద్యాలలో మీ కళ్లెదుటే ఏర్పాటు కానుంది. ఇక యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్తగా నైపుణ్య విశ్వ విద్యాలయాలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను కాలేజీలకు, స్కిల్‌డెవలప్‌మెంట్‌కు అనుసంధానించాం. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను తెచ్చికాలేజీల్లో ఇంటర్న్‌షిప్ కచ్చితంగా అమలు చేస్తున్నాం. మరిన్ని ప్రత్యేక కోర్సులు కూడా తీసుకొస్తున్నాం. 67 ఒకేషనల్, 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు తీసుకొచ్చాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు కూడా ప్రవేశపెట్టాం. ఎక్కడా లేనివిధంగా అమ్మఒడి బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ప్రతీ తల్లి ఆరాట పడుతుంది. పిల్లలను బడులకు పంపిస్తే చాలు 12 తరగతి వరకూ జగనన్న అమ్మ ఒడి ద్వారా అటెండెన్స్‌ను జతపరిచి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తున్నాం. 84 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా పేద బిడ్డలకు మేలు చేసే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది? అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు అమ్మఒడితోపాటు చాలా అడుగులు వేశాం. హర్షధ్వానాల మధ్య సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు వైఎస్సార్ ఆసరా, చేయూతతో పాటు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. సున్నా వడ్డీ రుణాలిస్తున్నాం. ఆర్థిక సాధికారత కోసం రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, అమూల్‌తోపాటు మల్టీ నేషనల్ కంపెనీలు, దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. బ్యాంకులు రుణాలిచ్చేలా తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటే పిల్లలంతా బాగుంటారనే విశ్వాసంతో మూడేళ్లుగా మహిళా సాధికార ప్రభుత్వం అని చెప్పుకునేలా అడుగులు వేశాం. సంపూర్ణ పోషణ.. గోరుముద్ద పిల్లల చదువులపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో శారీరక, మానసిక ఎదుగుదల కోసం కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. తల్లితో పాటు గర్భస్థ శిశువులకు మంచి ఆహారం అందాలనే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని తెచ్చాం. గత సర్కారు ఇందుకోసం కనీసం రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ‘వైఎస్సార్ గోరుముద్ద’ ప్రవేశపెట్టాం. దీనికి గత సర్కారు ఏటా రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రూ.1,900 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఎక్కడ 500 కోట్లు?.. ఎక్కడ 1900 కోట్లు? ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.పది వేల కోట్లు 2017–18, 2018–19కి సంబంధించి గత సర్కారు రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను ఎగ్గొడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించింది. జగనన్న విద్యాదీవెన కింద త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులు ఇస్తున్నాం. టీడీపీ సర్కారు బకాయి పడ్డ రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,969 కోట్లను జగనన్న విద్యాదీవెన ద్వారా చెల్లించాం. వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. కేవలం ఈ రెండు పథకాలకే 34 నెలల్లో మన ప్రభుత్వం రూ.10,298 కోట్లు ఖర్చు చేసింది. అక్కచెల్లెమ్మలు, వారి పిల్లల కోసం మేనమామగా చేస్తున్న ఖర్చు ఇది అని సంతోషంగా తెలియజేస్తున్నా. జాతీయ సగటుకు మించి జీఈఆర్ పెరుగుదల వివిధ పథకాల ద్వారా చదువుకునేలా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. ఇంటర్ తర్వాత కాలేజీల్లో 18 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల చేరికలకు సంబంధించి జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) గత సర్కారు హయాంలో 2018–19 నాటికి 32.4 ఉంటే 2019–20లో ఒక్క ఏడాదిలోనే మనం తెచ్చిన మార్పులతో 35.2కి పెరిగింది. ఏడాదిలోనే జీఈఆర్ ఏకంగా 8.64 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే జాతీయ స్థాయిలో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.64 శాతం పెరిగింది. మహారాష్ట్ర, పశ్చిమ బంగ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఐదు శాతం కంటే తక్కువే పెరుగుదల నమోదైంది. –1.6 శాతంతో తెలంగాణలో నెగెటివ్ వృద్ధి నమోదైంది. మన రాష్ట్రంలో విద్యార్థినులకు సంబంధించి జీఈఆర్ 11.03 శాతానికి పెరిగింది. అదే జాతీయ స్థాయిలో కేవలం 2.02 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. విద్యారంగంలో మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గత సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 37 లక్షల మంది కాగా ఇప్పుడు 44.30 లక్షలకు పెరిగారు. అంటే 7.18 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మంచి మార్పు ఏముంటుంది? మన ఖర్మ కొద్దీ.. ఇవాళ ఇన్ని మంచి మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు, ఆయన పార్టీకి, దత్తపుత్రుడికి, ఎల్లో మీడియాకు కనిపించవు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా రోజుకో కట్టుకథ, వక్రీకరణతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. రాష్ట్రంలోచేస్తున్నవి సరిపోవని ఏకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ బురద జల్లి పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీరిది! ఎక్కడైనా ప్రతిపక్షాలుంటాయి. అన్ని పక్షాలు కలసి పార్లమెంట్లో రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మాట్లాడాలి. మన ఖర్మ ఏమిటంటే.. దౌర్భాగ్యమైన ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య ఎల్లో మీడియా ఉన్నాయి. కదిలించలేవు.. బెదిరించలేవు ఈ సమస్యలు, కష్టాలు ఎన్ని ఉన్నా.. ఒకటే చెబుతున్నా. ఇవేవీ నన్ను కదిలించలేవు.. బెదిరించలేవు. వీరందరికీ ఒకటే చెబుతున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చా. మీ దీవెనలు ఉన్నంత వరకూ వారు నా వెంట్రుక కూడా పీకలేరు. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు ఇలాగే ఉండాలని, ఇంకా మంచి చేసేలా దీవించాలని మనసారా కోరుతున్నా. నంద్యాలకు రింగు రోడ్డు, మిర్చి యార్డు ‘‘నంద్యాలలో మంచి అభివృద్ధి జరుగుతోందని, మరింత సహకారం కావాలని నా మిత్రుడు, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అడుగుతున్నారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు నంద్యాలలో రెండు హైవేలను కలిపేలా 12 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు చేస్తున్నా. ఆటోనగర్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. మిర్చి రైతులు గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే విక్రయించేలా మిర్చి మార్కెట్ ఏర్పాటు చేస్తాం. వైఎస్సార్ నగర్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దుతాం’’ నవరత్నాలన్నీ మా ఇంట్లోనే.. వసతి దీవెన కింద జగనన్న ఏటా అందిస్తున్న రూ.20 వేలు నాలాంటి మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మా నాన్న అర్చకుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ప్రతినెలా 1వ తేదీన పాలవారి కంటే ముందుగా వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. జగనన్న పథకాల వల్ల నేను చదువుకుంటున్నానని ఈ సభ సాక్షిగా చెబుతున్నా. బాగా చదివి న్యాయవాదినై ప్రజలకు సేవ చేస్తా. – కరణం బృహతి మానస, డిగ్రీ విద్యార్థిని మా చదువులు.. మీ చలవే మాది మధ్యతరగతి కుటుంబం. జగనన్న వసతి దీవెనవల్ల చదువుకుని మా కాలేజీలో సీనియర్లు 70 శాతం మంది మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. నా సోదరుడి బీటెక్ చదువంతా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే పూర్తయింది. మా కుటుంబం ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందింది. వైఎస్ జగనన్న ముందుచూపుతో ఇలాంటి పథకాలను ప్రారంభించి చక్కగా అమలు చేస్తున్నారు. – సౌమ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, నంద్యాల