AP CM YS Jagan Speech Highlights At Narpala Public Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

AP CM YS Jagan: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు

Published Wed, Apr 26 2023 12:20 PM | Last Updated on Wed, Apr 26 2023 1:58 PM

AP YS Jagan Speech At  Narpala Public Meeting - Sakshi

సాక్షి, అనంతపురం: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా..  బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. వాళ్ల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నాం. చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా..  విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.  ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు,  డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

గత ప్రభుత్వం.. పెత్తందారి ప్రభుత్వం
గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడాలు ప్రజలు గమనించాలని సీఎం జగన్‌ ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. పేదలకు పెద్ద చదువులు అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గవర్నమెంట్‌ విద్యాసంస్థలు ప్రైవేట్‌ విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం. 

గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలనుకున్న పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. అందుకే  బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. ప్రతీ మూడు నెలలకు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో డ్రాపవుట్ల సంఖ్య తగ్గిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. 

ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్లలా ఎదగాలి.. 
మన పిల్లలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా విద్యా సంస్కరణలు చేశాం. ఈ ప్రయత్నాలు కేవలం ఉద్యోగాలు కోసం కాదు. వాళ్లను లీడర్లుగా వారిని తీర్చిదిద్దడానికి తపన పడుతున్నాం. మన పిల్లలను లీడర్లుగా చేసేందుకు జగనన్న ఆలోచన చేస్తున్నాడు. మన పిల్లలంతా సత్యనాదెళ్లలా(సత్యనాదెళ్ల మూలాలు అనంతపురంవే కావడం గమనార్హం) తయారు కావాలి. ఒక్క సత్యనాదెళ్లకాదు… ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్ల కావాలి. స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ పెడుతున్నామని సీఎం జగన్‌ వివరించారు.

ఇదీ చదవండి: నా జగనన్న నన్ను చదివిస్తున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement