అప్‌డేట్స్
1.29PM
‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద రెండో విడతలో 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసిన సీఎం జగన్.
12.45PM
పరిపాలను మరింత చేరువ చేస్తానని ప్రజలకు మాటిచ్చాను. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికం కారణంగా చదువులు ఆగిపోకూడదు. పూర్తి రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులకు తోడుగా నిలుస్తాం. చదువుకుంటేనే తలరాతలు మారతాయి. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి-చదువు. నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మారుస్తాం. సర్కారీ బడులకు మళ్లీ మంచి రోజులు తెచ్చాం. నేనే పేద పిల్లల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నా. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు.
-సీఎం జగన్
12:30PM
► నంద్యాలను జిల్లా చేయడం, అంతకు ముందు మెడికల్ కాలేజీ ప్రకటించడం.. ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకోవడంపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు సభా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.
12:21PM
► దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్, పలువురు నేతల నివాళులు. అనంతరం ఆడపచుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయించిన సీఎం జగన్.
12:11 PM
► నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. విద్యార్థులు-తల్లులతో ఆప్యాయ పలకరింపు.
► 2021-22 విద్యాసంవత్సరానికి గానూ రెండు విడత ‘జగనన్న వసతి దీవెన’లో భాగంగా లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.
10:10AM
► క్యాంప్ కార్యాలయం నుంచి నంద్యాలకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
► పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదు.. చదువుల ఖర్చు పేరిట వాళ్ల తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే సమున్నత లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం.. జగనన్న వసతి దీవెన.
► జగనన్న వసతి దీవెన రెండో విడతలో భాగంగా.. 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయల్ని జమ చేయనున్నారు.
► ఉన్నత విద్యకు ఆలంబన లక్ష్యంతో పేద విద్యార్థుల చదువుకు ఫీజుల ఖర్చులను పూర్తిగా భరించడం. భోజన, వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకుండా సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న కానుకే ఇది.
-------------------------
► కార్యక్రమం ముగిశాక నంద్యాల నుంచి బయలుదేరి.. తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
► ఈ వేదికగా జగనన్న వసతి దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
► అటుపై ఎస్‌పీజీ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
► అక్కడి నుంచి నంద్యాలలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి చేరుకుని.. ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లడతారు.
► కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
► ఉదయం పది గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీఎం బయలుదేరుతారు.
► కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment