
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేడు ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కొద్దిసేపట్లో ‘వైఎస్సార్ జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్‌కు చేరుకుని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment