CM Jagan Anantapur District Tour Updates:
► బటన్ నొక్కి రూ.912.71 కోట్లు నిధులు విడుదల చేసిన సీఎం జగన్.
► సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం.
► చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజకి వర్గాన్నే మారుస్తుంది. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం. చదువుల వల్ల ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం.
► జగనన్న వసతి దీవెన ద్వారా ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం.
► గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలి. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి.
► గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.
► ఇది విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న వసతిదీవెన. ఫీజురియింబర్స్‌మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.. బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాత్లాలో డబ్బులు జమ చేస్తున్నాం.
► నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్యా నాదెళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్.. ఎడ్యూకేషన్ ఈజ్ పవర్.
► రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబును చూసి పంచతంత్రం కథ గుర్తొచ్చింది. వేటాగే శక్తి కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉంది.
► రోజూ రాజకీయాల మధ్య మనం బతుకుతున్నాం. నేను సీనియర్‌ను ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు. బంగారు కడియం ఆశచూపి మనుషులను మింగేసే పులి బాపతు వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిఏ ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు.
► రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. బాబు వచ్చాడు.. రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి.
సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండిచేయి చూపాడు.
► దోచుకో, పంచుకో, తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరికి తోడుగా దత్తపుత్రుడు. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్దాలను, మోసాలను నమ్మకండి.
► జగనన్న వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం ప్రజలే. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి.
నా అన్న జగనన్న చదివిస్తున్నాడు
ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ, చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాల రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. సీఎం జగన్‌తో ముఖాముఖి అయ్యింది దివ్య దీపిక. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దివ్య దీపిక.. తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్, తల్లి గృహిణి.
విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటోంది. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక.
► జగనన్న పాలనలో పేదల చదువులకు ఢోకా లేదు. నాణ్యమైన చదువుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల రూపకర్త. అభివృద్దికి దిక్సూచి సీఎం జగన్. విద్యారంగంలో వినూత్న మార్పులు తెస్తున్నారు. 2019లో హిస్టరీ క్రియేట్ చేశాం. 2024లో హిస్టరీ రిపీట్ చేస్తాం.. అని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రసంగించారు.
► జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి జగన్.
► దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్.
► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమ సభా ప్రాంగణం వద్ద అప్యాయ పలకరింపుతో ముందుకు సాగుతున్న సీఎం జగన్.
► అపూర్వ స్వాగతం నడుమ.. నార్పల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్.
నార్పల హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్‌కు ఘన స్వాగతం
► అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మాత్యులు కేవీ ఉషశ్రీ చరణ్, జిల్లా కలెక్టర్ గౌతమి, అనంతపురం డిఐజి ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్,సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ లు సీఎం జగన్‌కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు.
► జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా.. లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్.
► అనంతపురం నార్పల పర్యటనలో భాగంగా.. పుట్టపర్తి నుంచి శింగనమల నియోజకవర్గం నార్పలకు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. ఆపై నార్పల క్రాసింగ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. ముందుగా విద్యార్థుల తల్లులను, స్థానిక నేతలను పలకరించి.. ఆపై వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. జగనన్న వసతి దీవెన లబ్ధిని బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేస్తారు.
► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు. అక్కడి సభాప్రాంగణం నుంచి ప్రసంగించిన తర్వాత సీఎం జగన్ నిధుల నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.
► జగనన్న వసతి దీవెన కింద నిధులు విడుదల కోసం.. తాడేపల్లి నుంచి అనంతపురం జిల్లా నార్పల బయలుదేరిన సీఎం జగన్.
► జగనన్న వసతి దీవెన పథకం ప్రకారం.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.
► రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.
► సంక్షేమ క్యాలెండర్ అమలు హామీలో భాగంగా పేద విద్యార్థులకు ఆసరా అందిస్తూనే.. గత ప్రభుత్వం 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు.
► గతంలోని టీడీపీ ప్రభుత్వం అరకోరగా ఫీజుల కోసం నిధుల్ని విడుదల చేసేది. పెండింగ్ బకాయిల్ని ఉంచింది కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment