సాక్షి, అనంతపూర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. జిల్లాలోని నార్పలలో బుధవారం రోజున జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా అనారోగ్య బాధితులను కలిసి సీఎం జగన్ నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సాయం చేయాలని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అవసరమైన సాయం అందజేశారు. తమ గోడు విని సత్వరం స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.
(చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే)
బాధితుల పూర్తి వివరాలు...
1.డి.రాజు, పి. అరుణ
రాజు, అరుణల కుమారుడు ధనుష్ జెనెటికల్ సమస్యలతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ధనుష్‌కు అవసరమైన వైద్యచికిత్సలు ఉచితంగా చేయించాలని నిర్ణయం.
2.యోగిశ్వరి
యోగిశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించారని, ఇద్దరు కుమారులతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం.
3. రామచంద్ర, భవాని
రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగవైకల్యంతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.1 లక్ష ఆర్ధిక సాయం, వీల్ ఛైర్.
4. చాకలి నవ్య
ఇటీవల జరిగిన కెమికల్ బ్లాస్ట్ లో తన భర్తను కోల్పోయానని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.7 లక్షల ఆర్ధిక సాయం.
5. ఏ.నారాయణమ్మ
తన కుమారుడు జశ్వంత్ రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ఉచితంగా చికిత్స.
6. జి.రామాంజి
విద్యుత్‌శాఖలో టెంపరరీగా పనిచేస్తున్న తనకు విద్యుత్‌షాక్‌తో కుడి చెయ్యి కోల్పోయానని, సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం, విద్యుత్ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం.
7. వి.అమర్‌నాథ్ రెడ్డి
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం
8. బి.గంగయ్య
తన భార్య నాగలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, వీల్ ఛైర్.
9. బి.కొండారెడ్డి
తన మేనల్లుడు చేతన్ రెడ్డి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం
10. ఎస్.నబీరసూల్
తనకు వైకల్యం కారణంగా ట్రైసైకిల్ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకురాగా ఆయనకు ట్రైసైకిల్ అందజేసిన అధికారులు.
(చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?)
Comments
Please login to add a commentAdd a comment