financial aid
-
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నా.. క్రమశిక్షణారాహిత్యం వల్ల అధఃపాతాళానికి పడిపోయిన క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli). శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబై బ్యాటర్ కెరీర్‌తో పాటు.. వ్యక్తిగత జీవితంలోనూ విఫలమయ్యాడు.చెడు వ్యసనాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చావు అంచులదాకా వెళ్లాడు. ఇటీవలి వినోద్ కాంబ్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారగా.. 1983 వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులోని దిగ్గజాలు అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ కాంబ్లీకి ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నారు. తన ఫౌండేషన్ చాంప్స్ (CHAMPS) ద్వారా అతడికి ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధం చేశారు. కాంబ్లీకి జీవితాంతం నెలకు..టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. గావస్కర్‌కు చెందిన ‘చాంప్స్’.. కాంబ్లీ బతికి ఉన్నంత కాలం నెల నెలా రూ. 30 వేల ఆర్థిక సాయం అందించనుంది. అంతేకాదు.. వైద్య అవసరాల నిమిత్తం ఏడాదికి మరో ముప్పై వేలు అదనంగా ఇవ్వనుంది.కాగా కాంబ్లీ గురించి సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో గతంలో మాట్లాడుతూ.. ‘‘1983 విన్నింగ్ జట్టు యువ ఆటగాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. వాళ్లు మాకు మనుమల లాంటి వాళ్లు. ఇంకొంత మంది వయసు దృష్ట్యా మాకు కుమారుల లాంటివారు.మమకారం ఉండటం సహజంఅందుకే వారి పట్ల మాకు మమకారం ఉండటం సహజం. వారి పట్ల మా ప్రేమకు సాయం అనే పదం వాడటం సరికాదు. వినోద్ కాంబ్లీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కష్టాల్లో ఉన్న క్రికెటర్లును చూసే నవ్వే రకం కాదు మేము. మాకు తోచిన రీతిలో వారికి సహాయపడటమే మా ముందున్న కర్తవ్యం’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తన వంతు సాయం అందించడం విశేషం.కాగా ఈ ఏడాది ఆరంభంలో అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని జనవరిలో డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో 1983 విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కాంబ్లీని పరామర్శించాడు. ఇక గావస్కర్ సైతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు.టీమిండియా తరఫునఇక సచిన్ టెండ్కులర్కు బాల్య మిత్రుడైన వినోద్ కాంబ్లీ.. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 17 టెస్టులు, 104 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) టీమిండియా తరఫున ఆడిన కాంబ్లీ.. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. అంతేకాదు.. టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు క్రికెటర్‌గా ఇప్పటికీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాంబ్లీకి భార్య ఆండ్రియా హెవిట్, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మద్యం, పొగ తాగటం చాన్నాళ్ల క్రితమే మానేశానంటూ కాంబ్లీ ఇటీవలే వెల్లడించాడు.చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది -
క్రీడా సమాఖ్యలకు సాయంపై సమీక్ష!
న్యూఢిల్లీ: వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించిన జాతీయ సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయంపై సమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో... రాబోయే కొన్నేళ్లలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమాఖ్య నిబంధనలు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ‘మూడేళ్ల క్రితం రూపొందించిన విధానం ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో ఉన్న నిబంధనలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేశాం. వేర్వేరు అంశాలను సమీక్షించి ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ పరీక్ పేర్కొన్నారు. కొత్తగా ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా క్రీడల్లో టోర్నీల నిర్వహణ, విదేశాల్లో జరిగే టోర్నీల్లో ఆటగాళ్లు పాల్గొనడం, క్రీడా సామగ్రి కొనుగోలు, కోచింగ్ క్యాంప్‌ల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది జీతాలు, గుర్తింపు పొందిన ఆటగాళ్ల కోసం ఇతర అదనపు సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటికి తోడు సమాఖ్యలు తమ స్థాయిని బట్టి బయట స్పాన్సర్ల ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతాయి. గత ఏడాది బడ్జెట్లో ఎన్ఎస్ఎఫ్ల కోసం రూ. 340 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సారి దానిని కొంత పెంచి రూ.400 కోట్లు చేసింది. సమాఖ్యల పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలు మార్పు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముసాయిదా క్రీడా బిల్లును కూడా త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు గ్రాంట్లు అందజేసే విషయంలో ఒక రెగ్యులేటరీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. 2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం భారత్ ఇప్పటికే తమ ఆసక్తిని చూపిస్తూ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను ఐఓసీకి పంపించింది. -
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు తమ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయడంలేదని మంత్రి లోకేశ్ ఓ పక్క స్పష్టంగా చెబుతున్నారు. పోనీ, 2019–24 మధ్య గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఎటువంటి మేలు జరిగిందో చెప్పడానికి కూటమి సర్కారుకు నోరు రావడంలేదు. అసలు సమాధానం చెప్పడానికే అంగీకరించలేదు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం అనుసరించిన తీరిది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి.విరూపాక్షి, డాక్టర్ దాసరి సుధ, ఎం. విశ్వేశ్వరరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సభలో చర్చించనేలేదు.రాతపూర్వకంగా సమాధానమిచ్చి ‘చెప్పినట్టే’ భావించాలని పేర్కొన్నారు. 2019–24 మధ్య కాలంలో లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలు, విడుదల చేసిన మొత్తం ఎంతో చెప్పాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగానూ వివరాలు ఇవ్వలేదు. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానం దాటవేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శాసన సభకు వివరించారు. తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.గత ప్రభుత్వంలో డ్వాక్రాకు రూ.3,541.27 కోట్లుగత ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు చేసే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. అంతకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి ఏప్రిల్ నెలలో వడ్డీ డబ్బులు జమ చేసేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ వడ్డీ డబ్బులు చెల్లించలేదు.దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం చెప్పకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వడ్డీ లేని రుణాల అమలుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.950 కోట్లు సమకూర్చినట్టు చెప్పారు. 2019–24 మధ్య ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.3,541.27 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 2023–24లో రూ.1,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా, నిధులు విడుదల కాలేదన్నారు.అంతర్ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిపై రెండు కమిటీలు: మంత్రి పయ్యావుల కేశవ్అంతర్ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇరు రాష్ట్రాల సీనియర్ అధికారులు, మంత్రులతో రెండు కమిటీలు వేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వన్ టైం చర్యలో భాగంగా అంతర్ రాష్ట్ర బదిలీ కోసం తెలంగాణ ప్రభుత్వ సమ్మతి కోరామని, స్పందన రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు విల్లింగ్ ఇచ్చారని, ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1,942 మంది అంగీకరించగా, అక్కడి స్థానికత గలవారు 1,042 మంది ఉన్నట్టు చెప్పారు.రూ.284 కోట్లతో కాల్వల నిర్వహణ: జలవనరులశాఖ మంత్రి నిమ్మలగత ఐదేళ్లలో ప్రాజెక్టులు, డ్రెయిన్స్ సరిగా నిర్వహించలేదని, విధ్వంసం జరిగిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సాగు నీటి కాల్వలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. రిపేర్లు, అత్యవసర గండ్లు పూడ్చడం, గట్లు బలోపేతం చేపట్టలేదని, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోయాయని, అన్నమయ్యప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు పోయాయన్నారు. లస్కర్లకు ఏడాది నుంచి జీతాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 1,040 లిఫ్టు పథకాలు ఉంటే 450 మూతపడ్డాయన్నారు.వీటి నిర్వహణకు ఏడాదికి రూ.983 కోట్లు కేటాయించాలని ప్లానింగ్ కమిషన్ సూచిస్తే ఐదేళ్లలో రూ.125 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 2014–19 మధ్య క్యాపిటల్ హెడ్, మెయింటెనెన్స్ ఇతరత్రాకు రూ.5,091 కోట్లు కేటాయిస్తే గత ఐదేళ్లలో రూ.1,340 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రూ. 284.04 కోట్లతో సాగునీటి కాల్వల నిర్వహణ చేపడతామని తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్‌పై ప్రాజెక్టు పూర్తయిందని, కానీ, రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చే కాల్వల పనులను గత ప్రభుత్వం చేపట్టలేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.గిరిజన డ్వాక్రా సంఘాలకు బకాయిల్లేవు : మంత్రి సంధ్యారాణిఐటీడీఏల పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు 2019–24 మధ్య ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, డాక్టర్ వాల్మీకి పార్థసారధి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం గిరిజన యువతకు శిక్షణ ఇవ్వలేదని, కాఫీని ప్రోత్సహించలేదని అన్నారు.భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు: మంత్రి వాసంశెట్టి సుభాష్రాష్ట్రంలోని 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వీరి నుంచి రూ.100 చొప్పున కార్మిక సంక్షేమ మండలికి చెల్లిస్తారని, ప్రస్తుతం బోర్డులో రూ.40.89 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2007నుంచి క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయని, రూ.7.38 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి ఇవ్వాలన్నారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీఅమలు చేస్తాం: మంత్రి సవితగత ఐదేళ్లలో చేనేత కార్మికుల పరిస్థితి బాగాలేదని, కొన్నిచోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చెప్పారు. చేనేత కార్మికులకు నూలు, విద్యుత్, ఇంధనం, షెడ్ల నిర్మాణానికి రాయితీలు, శిక్షణ, ముడి సరుకు సరఫరా, అమ్మకాలు, మార్కెటింగ్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. 2019 తర్వాత వైఎస్ జగన్ నేతన్నలను మోసం చేశారన్నారు. 86 వేల మందికి నేతన్న నేస్తం అందించారని, అవన్నీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారన్నారు.ఆక్వాకు ఇంధన సబ్సిడీ ఇవ్వలేం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ఆక్వా రైతులకు షరతుల్లేకుండా విద్యుత్ సబ్సిడీని వర్తింపజేసే ప్రతిపాదన ఏదీ లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 కే విద్యుత్ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రస్తుతం డిస్కంలు రూ.1.12 లక్షల కోట్ల అప్పులతో ఉన్నాయని తెలిపారు. 2019 నుంచి ట్రాన్స్ఫార్మర్ల కోసం ఆక్వా రైతుల నుంచి అందనంగా డబ్బులు వసూలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జీవోలతో గందరగోళం సృష్టించిందన్నారు. డిస్కంలకు రూ.1,990 కోట్లు బాకీ పెట్టారని చెప్పారు. 2018–19లో 46,329 మంది రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తే.. 2022–23లో 31 వేల మందికి తగ్గిపోయిందన్నారు.మీరు కట్టింది ఏ చీర?ఎమ్మెల్యేని ఆరా తీసిన డిప్యూటీ స్పీకర్ చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలపై మంత్రి సవిత సమాధానం చెప్పిన అనంతరం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అనుబంధ ప్రశ్నపై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ముడి సరుకుల ధరలు పెరిగిపోయాయని, ఉత్పత్తుల ధరలు పెరగట్లేదని అన్నారు. 50 శాతం మగ్గాలు మూతపడ్డాయన్నారు. నేతన్నలకు నెలకు నికర ఆదాయం రూ.10 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ముడిసరుకుపై సబ్సిడీ పెంచాలని, నేత కార్మికుల షెడ్లకు బడ్జెట్ ఇవ్వాలంటూ పలు సూచనలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వారిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో సూచనలు ఇవ్వొద్దని అన్నారు. ఇప్పటికే ఎక్కువ చేశారంటూ అడ్డుకున్నారు. నెలలో ఒక రోజు చేనేత వస్త్రాలు వేసుకునేలా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేయాలని మాధవి సూచించగా.. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ‘మీరు సభకు ఇప్పుడు చేనేత వేసుకున్నారా? మీ శారీ చేనేతేనా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ‘చేనేతే’ అని బదులివ్వడంతో ‘సంతోషం’అంటూ నిట్టూర్చారు.ఎంతమంది పిల్లలున్నా సహకార ఎన్నికల్లో పోటీ! ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), జిల్లా సహకారం కేంద్రం బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్) ఎన్నికల్లో పోటీకి అర్హత కలి్పస్తూ ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం శాసన సభలో ప్రకటించారు. అదే విధంగా సహకార చట్టంలో రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసినట్లు వివరించారు. ఈ సవరణలకు సంబంధించిన ఏపీ సహకార సంఘాల సవరణ బిల్–2024ను శాసన సభలో అచ్చెన్న ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా ఏపీ ఎక్సైజ్ సవరణ బిల్–2024, ఏపీ(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ ట్రేడ్ రెగ్యులేషన్) సవరణ బిల్–2024, ఏపీ మద్య నిషేధ సవరణ బిల్–2024ను అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టారు. -
ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలీ పనులకు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు. సాయం చేస్తే డాక్టర్ అవుతా..బీహెచ్ఎంఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి సంతోష్‌కుమార్ ఫీజు కట్టలేని స్థితిలో దాతల చేయూత కోసం ఎదురుచూపు అనంతగిరి: డాక్టర్ కావాలనుకుంటున్న ఆ విద్యార్థి కలకు పేదరికం అడ్డుపడుతోంది. మనసున్న దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో సమాజ సేవకు పాటుపడతానని చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన సంతోష్.. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి, 959 మార్కులు సాధించాడు. నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని రామంతాపూర్ జేఎస్పీఎస్ హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్ఎంఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ) సీటు వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఫీజు, వసతి కోసం నవంబర్ 2న లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. అనారోగ్యం బారిన పడిన తండ్రి అశోక్ 11 నెలల క్రితం మృతిచెందగా.. తల్లి పుష్పమ్మ కూలి పనులు చేస్తోంది. తండ్రి మరణంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫీజు కట్టే స్తోమత లేదని సంతోష్ వాపోతున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 9963870085లో సంప్రదించాలని కోరాడు.చదవండి: ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడుగోండు కళాకారుడికి అవార్డు జైనూర్ (ఆసిఫాబాద్): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేలా దండారీ ఉత్సవాల చిత్రాన్ని గీసిన ఆదివాసీ కళాకారుడు మడావి ఆనంద్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్‌రావు చిత్రకళలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 13 రోజులుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ఆనంద్‌రావు గుస్సాడీ నృత్యాలకు సంబంధించిన చిత్రం గీసి అవార్డు అందుకున్నారు. -
ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు.. ఏం చేయాలో తెలియక
కౌడిపల్లి(నర్సాపూర్): కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయితేనేం ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పెద్ద కొడుకు విజయ్‌కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్‌కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.మెడికల్ సీటు సాధించిన పేద విద్యార్థినికి పొన్నం భరోసా హుస్నాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది. దీనిపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘డాక్టర్ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు. మంగళవారం హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఇంజనీర్లకు పోస్టింగ్‌లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో భారీ సంఖ్యలో ఈ నెల 9న అడ్హాక్ (తాత్కాలిక) పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు ఎట్టకేలకు కొత్త పోస్టింగ్స్ కేటాయిస్తూ సోమవారం సంస్థ సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లోని 203 మంది ఏడీఈలు, ఎలక్ట్రికల్ విభాగంలో 34 మంది డీఈలు, ఏడుగురు ఎస్ఈలు, ఇద్దరు సీఈలతో పాటు మెకానికల్ విభాగంలో 12 మంది డీఈలు, ఎస్ఈలు.. సివిల్ విభాగంలో ఐదుగురు ఏఈఈలుగా, ఇద్దరు ఈఈలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు. చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
వరద సాయం విడుదల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరదలు, భారీ వర్షాల బాధితులకు పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం విడుదల చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్, బీమా, అర్బన్ క్లాప్ యాప్, ఎల్రక్టానిక్ ఉపకరణాల మరమ్మతులపై తొలుత సమీక్షించారు. వరద నష్ట పరిహారం లేఖలను లబ్దిదారులకు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.602 కోట్ల మేర పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30 కల్లా పరిష్కరించి సాయం అందిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 74 మంది మరణించారని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్లు వచ్చిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయమని చెప్పామన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీలు, ఆధార్ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇలా ఏ సర్టిఫికెట్ పోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాడైపోయిన పాఠ్యపుస్తకాల స్థానంలో పిల్లలందరికీ కొత్త పుస్తకాలు ఉచితంగా ఇవ్వమని చెప్పామన్నారు. ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 4 వేలు డూప్లికేషన్స్ పోగా 13 వేల దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి, అర్హులైన వారికి సాయమందిస్తామని చెప్పారు. సహాయ కార్యక్రమాలను ఈ నెల 30కి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రూ.602 కోట్లలో రూ.400 కోట్లు దాతలిచ్చినవేనని తెలిపారు. విధ్వంసాలు చేయడం, వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతలు కాపాడటం వంటివి తమ బాధ్యత అని, వీటికి ఎవరు విఘాతం కలిగించినా, తప్పులు చేసినా సహించబోమని చెప్పారు. -
వెంటాడుతున్న ఆర్థిక అనిశ్చితి భయాలు..
సాక్షి, హైదరాబాద్: భారతీయులను ‘ఆర్థిక అనిశ్చితి’భయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులతోనే కాకుండా రాబోయే ఐదేళ్లలో చోటుచేసుకోబోయే అనూహ్య పరిస్థితులపై కూడా వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఐదేళ్లలో భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం కొనసాగొచ్చన్న అభిప్రాయంతో మెజారిటీ భారతీయులు ఉన్నారు. ఇదే సమయంలో భారత్‌తో సహా దాదాపుగా అన్ని ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఆర్థిక అనిశ్చితి భయపెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికరంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా...రాబోయే ఐదేళ్లలోనూ ఇదే స్థితి కొనసాగుతుందా? పరిస్థితులు మరింత దిగజారుతాయా అన్న ఆందోళన వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల వ్యయం, వైద్యఖర్చులు, తదితరాల పెరుగుదలతో వచ్చే ఐదేళ్లలో మనదేశంతో పాటు వివిధ దేశాల్లో ఆర్థిక అస్థిరత, నిలకడలేని వాతావరణం కొనసాగుతుందని 88 శాతం భారతీయులు భావిస్తున్నారు. ఈ అనిశ్చితితో పాటు ఉద్యోగాలు, అప్పులు, రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలు కూడా తమ జీవితాలతో ముడిపడిన ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితితో తమకు వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు, అప్పులు, ఊహించని ఖర్చుల పెరుగుదలతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళన వంటి వాటికి దారితీస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి, దానిని ప్రభావితం చేసే అంశాలు తదితరాలపై తాజాగా ‘అనిశి్చత్ ఇండెక్స్’నివేదికను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,978 మంది వ్యక్తుల (5,320 మంది వేతన జీవులు, 2,658 మంది బిజినెస్ ప్రొఫెషనల్స్) నుంచి సేకరించిన సమాచారం, వివరాల మేరకు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఈ సర్వే ముఖ్యాంశాలు ఇవీ... » భారతీయులకు పెరుగుతున్న ఖర్చులే అతి పెద్ద అనిశ్చితి.. » కుటుంబ ఖర్చుల పెరుగుదలతో ఇబ్బంది పడొచ్చని భావిస్తున్నవారు 77 శాతం మంది » ఆరోగ్యం, జీవితంలో అనిశ్చితి, అప్పుడు, ఊహించని ఖర్చులు రావొచ్చునని అంచనా వేస్తున్నవారు 71 శాతం మంది » ఆర్థిక అనిశ్చితి ఎదురుకావొచ్చుననే భావనలో 67 శాతం » రాజకీయ అనిశి్చతితో ఇబ్బందులు ఎదురుకావొచ్చుననే అభిప్రాయంతో ఉన్న వారు 65 శాతం » చేస్తున్న ఉద్యోగాల్లో మార్పుచేర్పుల అనిశ్చితి ఏర్పడొచ్చునంటున్న వారు 64 శాతం » వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావంతో అనిశ్చితి ఉండొచ్చుననే భావనతో 62 శాతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడొచ్చా అన్న దానిపై ఏమన్నారంటే... » 88 శాతం మంది వచ్చే 5 ఏళ్లలో భారత్‌తో సహా ప్రపంచదేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనవచ్చుననే భావనతో ఉన్నారు. » 10 శాతం మంది ఈ అనిశ్చితి తక్కువస్ధాయిలో ఉండొచ్చునని నమ్ముతున్నారు. » 2 శాతం మందికి ఇది అతి స్వల్పంగా లేదా అసలు ఉండకపోవచ్చుననే అభిప్రాయం ఈ అనిశ్చితిని అధిగమించేందుకు ‘ఫైనాన్షి యల్ ప్లానింగ్’ఏ మేరకు తోడ్పడుతుంది ? » ఆర్థిక ప్రణాళికల సాయంతో ఈ అనిశ్చితిని తగ్గించవచ్చునని నమ్ముతున్నవారు 46 శాతం మంది » ఈ విషయంలో ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను గట్టిగా సమరి్థస్తున్నవారు 37 శాతం » ఈ ప్లానింగ్ పట్ల పెద్దగా మేలు జరగదని భావిస్తున్నవారు 13 శాతం » దీనిని పూర్తిస్థాయిలో నిరాకరిస్తున్న వారు 4 శాతం మంది అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆర్థిక సురక్షితలు ఉపయోగపడతాయి? » 77 శాతం మంది ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ పాలసీ అతిపెద్ద ఆర్థిక సురక్షితగా భావిస్తున్నారు. » 49 శాతం రాబోయే రోజుల్లో ఏవైనా ఆర్థికపరమైన సవాళ్లు వస్తే ఎదుర్కునేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిలో కొంత మొత్తం జమచేశామని చెబుతున్నారు. » 46 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్/ స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టినట్టుగా వెల్లడించారు. » 42 శాతం మంది పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉందని, తాము ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం లాభదాయకంగా ఉన్నట్టుగా తెలిపారు. » 6 శాతం మంది మాత్రం తాము ఎలాంటి ఆర్థిక సురక్షితలను సిద్ధం చేసుకోలేదని పేర్కొన్నారు. ‘ఫైనాన్షియల్ ప్లానింగ్’ను సమీక్షిస్తుంటారా ? » 37 శాతం మంది తమకు తాముగా ఇలాంటి సమీక్షలు చేయడం లేదు. తమ తరఫున సీఏలు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లు తమ బాధ్యతను తీసుకుంటున్నట్టు తెలిపారు. » 22 శాతం మంది ఏడాదికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ కాలంలో సమీక్షిస్తామన్నారు. » 15 శాతం మంది 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. » 14 శాతం మంది 6 నెలలకు, 14 శాతం నెలకు ఒకసారి ఈ పనిచేస్తామన్నారు. భవిష్యత్‌లో చోటుచేసుకునే పరిణామాల్లో ఏ అంశం అధిక ఆందోళనకు కారణమవుతోంది? » 64 శాతం మంది ఉద్యోగ, వృత్తిపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులు, పురోగతిపైనే అని వెల్లడి. » 61 శాతం దీర్ఘకాలిక ఆర్థిక పరమైన లక్ష్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయంటున్నారు.» 58 శాతం మంది తమ/కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఎక్కువ ఆందోళన ఉన్నట్టుగా తెలిపారు. » 39 శాతం మంది కుటుంబసభ్యులు/ స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయనే దానిపై సందిగ్ధతతో ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇదీ అధ్యయనం... ఆర్థిక అనిశి్చతితో తలెత్తే పరిస్థితులు, ఇబ్బందులను ఎదుర్కునేందుకు వివిధవర్గాల ప్రజలు తమ తమ ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను పునర్ నిర్దేశించుకోవడానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సురక్షిత స్థితికి చేరేందుకు అవసరమైన మార్గాల అన్వేషణ, అప్పులను తెలివిగా నిర్వహించడం, పెట్టే ఖర్చులను జాగ్రత్తగా వ్యయం చేయడం, డబ్బు పొదుపు వంటి వాటికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా పేర్కొంది. రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితిని అధిగమించేందుకు వివిధ రంగాలకు చెందినవారు అనుసరించే ప్రణాళికలు, ముందస్తు ఆలోచనలను బట్టి చూస్తే... ఇన్సూరెన్స్ పాలసీలు 77 శాతం మంది, ఫిక్స్డ్ డిపాజిట్లు 49 శాతం, మ్యూచువల్ ఫండ్స్/స్టాక్స్‌లో 46 శాతం, పెన్షన్‌పై ధీమా/సజావుగా సాగుతున్న వ్యాపారాలున్న వారు 42 శాతం, ఎలాంటి ఆర్థిక రక్షణ ప్రణాళికలున్చేయనివారు 6 శాతం ఉన్నట్టు ఆదిత్య బిర్లా స¯న్లైఫ్ నివేదిక తెలిపింది. -
దేశ ప్రగతిలో తనదైన ముద్రవేస్తూ...
‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్– 2024’ వారి తాజా నివేదిక ప్రకారం భారత జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ, బలమైన బ్రాండ్‌గా ప్రపంచంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఫార్చ్యూన్ ప్రపంచ సూచీ– 2023లో 107వ ర్యాంక్ పొంద డమే గాక, మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో 10వ అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇప్పటికే క్లెయిమ్‌ల చెల్లింపు తదితర విషయాలలో ప్రపంచ నంబర్ 1గా ఇది ఉండటం గమనార్హం. 2024 సెప్టెంబర్ 1 నాటికి భారతీయ జీవిత బీమా సంస్థ 68 ఏళ్ళు పూర్తిచేసుకుని, 69వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇటువంటి ఫలితాలు ప్రభుత్వ బీమా రంగానికి మరింత ఊతం ఇస్తాయి.జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము, భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని, వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయం చేయడం ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 1956 వరకు ఉద్య మాలు నడిచాయి. ఫలితంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1956 జనవరి 19న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయిదు కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో 1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్ఐసీ నేడు రూ. 53 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నది. ఇప్పుడు ఏడాదికి 3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్ల వరకు దేశా భివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఈ సంస్థ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణ పేరుతో ఎల్ఐసీలో 25 శాతం వాటాలు అమ్మి, రెవెన్యూ లోటును పూడ్చుకునే ఉద్దేశంతో ఉన్నది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! ఏదైనా బీమా కంపెనీ పనితీరుకు దాని క్లెయిమ్‌ల పరిష్కార శాతమే కొలబద్ద. ఆ విషయంలో 99 శాతంతో ఎల్ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది. ఎల్ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 37 ప్రకారం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. ఎల్ఐసీ జాతీయీకరణ ముందు ప్రైవేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోన స్‌లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. కానీ ఇంతవరకూ ఎల్ఐసీ ఈ గ్యారెంటీని ఉపయోగించుకో లేదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి బీమా కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్ప లేదంటే మన ఎల్ఐసీ ఎంత పటిష్ఠమైనదో తెలుస్తోంది. గత 24 ఏళ్ళుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ దాదాపు 70 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. ఎల్ఐసీ సంస్థలో పనిచేసే 14 లక్షల ఏజెంట్లలో 48 శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందు తున్నారు. 2024 మార్చి నాటికి మహిళా ఏజెంట్ల సంఖ్య మూడు లక్షల పైమాటే. ఈ విధంగా మహిళా ఉపాధికి సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1960లలో పేద భారత దేశంలో తాను అందించే పాలసీలలో కేవలం బీమాపై మాత్రమే కాకుండా, సేవింగ్స్ అంశంపై కూడా ఎల్ఐసీ దృష్టి పెట్టింది. పిల్లల చదువులకూ, యువతుల పెళ్లిళ్లకూ అందివచ్చేలా మధ్యంతర, తుది చెల్లింపులు, బీమా రక్షణ ఉండే పాలసీలను రూపొందించింది. గత బడ్జెట్ సెషన్లో అనేకమంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బీమాపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని అభ్యర్థించినా, జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అయితే, దేశవ్యాప్తంగా ఈ విషయంపై వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారు. బీమా ప్రీమియ మ్‌లపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే సంస్థ పాలసీదారులకు ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. ఎల్ఐసీని ఆర్థికంగా బలోపేతం చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి, అంతిమంగా దేశానికీ, పాలసీ దారులకూ ఎంతో ప్రయోజనకరం అవుతుంది. పి. సతీష్ వ్యాసకర్త ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులుమొబైల్: 94417 97900 (నేడు ఎల్ఐసీ ఆవిర్భావ దినోత్సవం) -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్‌లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్‌లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆర్థిక సాయం
తెనాలి/మచిలీపట్నం టౌన్/వీరవాసరం: టీడీపీ, జనసేన జరిపిన దాడుల్లో గాయపడిన ముగ్గురు కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు ఆర్థి క సాయం అందించి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కోలుకుంటున్న వైఎస్సార్సీపీ తెనాలి 16వ వార్డు ఇన్చార్జి కాళిదాసు సత్యనారాయణను శనివారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు పరామర్శించారు. ఆయనకు రూ.లక్ష ఆర్థి కసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మిద్దె బాబీ, అతని భార్యపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన బాబీ దంపతులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా టీడీపీ శ్రేణులు బెదిరించాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి వివరించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిన రూ.50 వేల చెక్కును పేర్ని కిట్టు, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ.. బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ శీలం భారతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త లింగంపల్లి సాల్మన్‌రాజును ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గా నాగమల్లేశ్వరరావుబాబు, నాయకులు శనివారం పరామర్శించారు. బాధితుడు సాల్మన్‌రాజుకు రూ.50 వేల చెక్కును సాయంగా అందజేశారు. -
గడిచిన ఐదేళ్లూ ఈ పాటికే ఖాతాల్లోకి..
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం చేతికందగా ఈసారి వ్యవసాయ పనులు మొదలైనా దిక్కులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికందిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం, సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవడం, నారుమళ్లు పోసు కోవడం, నాట్లు వేయడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి. గతంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్న, చిన్నకారులకు ఎంతగానో ఉపయోగపడేది. రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 50 శాతం మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణమున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టార్ లోపు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్‌లో టీడీపీ – జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు. ఒకపక్క వ్యవసాయ పనులు జోరందుకున్నా ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకూ ఆ ఊసెత్తక పోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పేరు మార్చేందుకే ఉత్సాహం..ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా మే/ జూన్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది. పీఎం కిసాన్ కింద 2024–25 సీజన్ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవలే జమ చేసింది. సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చటంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు.పెట్టుబడి కోసం అగచాట్లు..గత ఐదేళ్లు పెట్టుబడి సాయం సకాలంలో అందింది. దీంతో అదునులో విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదు. కేంద్రం నుంచి పీఎం కిసాన్ సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు విడుదల కాకపోవడంతో పెట్టుబడి కోసం అగచాట్లు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.– కారసాని శివారెడ్డి. సూరేపల్లి, బాపట్ల జిల్లాసాగు ఖర్చుల కోసం ఇబ్బందులు..గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అందజేసిన వైఎస్సార్ రైతు భరోసా సాయం రైతులకు కొండంత అండగా నిలిచేది. ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి భరోసా కల్పించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వకపోవడంతో సాగు ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.– చింతల రాజు, బురదకోట, ప్రత్తిపాడు రూరల్, కాకినాడ జిల్లాఐదేళ్లు నమ్మకంగా ఇచ్చారు..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేవి. ఆ నగదుతో పాటు కొంత డబ్బు కలిపి పంటలు సాగు చేసేవాళ్లం. ఐదేళ్లు నమ్మకంగా రైతు అకౌంట్లో జమ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకు ఆ ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఇస్తారో నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. – తూళ్లూరి నీరజ, గమళ్లపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లామా గోడు పట్టించుకోండి..గత ఐదేళ్లు రైతు భరోసా సకాలంలో అందడంతో సాగు సాఫీగా సాగేది. ప్రస్తుత పాలకులు మా బాధను పట్టించుకుని రైతులకు ఆర్థిక సాయం త్వరగా అందించాలి. – రాధయ్య, రైతు, పెద్దతయ్యూరు, శ్రీరంగరాజపురం, చిత్తూరు జిల్లా.పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..సీజన్ మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. ప్రధాని మోదీ సాయం అందిచాన అది ఎందుకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందక పోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏదో బాధపడి విత్తనాలు కొనుగోలు చేశాం. మిగిలిన పనులకు పెట్టుబడి సహాయం అత్యవసరం. – చింతల వెంకటరమణ, రైతు, లుకలాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లావారం పది రోజుల్లోనే ఇస్తామని..అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే రైతు భరోసా అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఖరీఫ్ సీజన్లో రైతులను ఆదుకోవాలి. లేదంటే అప్పులే శరణ్యం.– ప్రభాకర్, రైతు, తిరుపతి రూరల్ మండలంవ్యవసాయం ఇక కష్టమేజగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ నెలలో రైతు భరోసా సాయం ఖాతాలో పడేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రైతుల గురించి ఆలోచన చేసే విధంగా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు వ్యవసాయం చేయడం కష్టమే,–ఆకుల నారాయణ రైతు వంగర సాయం చేయాలి...మాలాంటి పేద రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా సాయం ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం వ్యవసాయ పనులు, సేద్యం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడం విచారకరం. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలి. – వెన్నపూస కృష్ణారెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట, మర్రిపాడు మండలం -
ఆఖరి మజిలీలో ఆర్థిక అభద్రత
సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఆర్థిక అభద్రతతో పండుటాకులు విలవిల్లాడుతున్నాయి. దేశంలో సగానికిపైగా వృద్ధుల్లో ఈ సమస్య ప్రబలంగా ఉంది. ఈ విషయం ఇటీవల హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ఏజింగ్ ఇన్ ఇండియా’ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 20 టైర్ 1, 2 నగరాల్లో 60 నుంచి 80 ఏళ్లు పైబడిన 5,169 మంది వృద్ధులు, 1,333 మంది సంరక్షకులను సర్వే చేశారు. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని టైర్ 1 చెన్నై, బెంగళూరు, టైర్ 2 సేలం, హుబ్లీ నగరాలను సర్వే కోసం ఎంపిక చేశారు. కాగా, సేకరించిన అభిప్రాయాలను అధ్యయనం చేసిన అనంతరం ప్రతి ముగ్గురిలో ఒకరు గత సంవత్సర కాలంలో ఎటువంటి ఆదాయం పొందలేదని గుర్తించారు. 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతా భావంతో జీవిస్తున్నట్లు నిర్ధారించారు. 29 శాతం మంది వృద్ధాప్య పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, సామాజిక భద్రతా పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు. అభద్రతాభావం మహిళల్లోనే అధికం తమ ప్రస్తుత రాబడి, పెట్టుబడులు, పొదుపు పరిగణనలోకి తీసుకుని 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతతో ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 90 శాతం, తమిళనాడులో 38 శాతం మంది అభద్రతా భావాన్ని వ్యక్తపరిచారు. 15 శాతం మంది వృద్ధులు నేటికీ పనిచేస్తున్నారు. వీరిలో 85 శాతం మంది అక్షరాస్యులుగా ఉన్నారు. 48 శాతం బీపీ.. 43 శాతం షుగర్ సమస్యలు 68శాతం మంది వృద్ధులు తమ సాధారణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. 10శాతం మంది మాత్రం తమ ఆరోగ్యం బాగోలేదన్నారు. మొత్తంగా పరిశీలిస్తే 48 శాతం మంది బీపీ, 43 శాతం మంది షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. 35 శాతం మంది ఎముకలు, కీళ్లకు సంబంధించిన అర్థరైటీస్ వంటి వ్యాధులను ఎదుర్కొంటున్నారు.19 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నాయి. అదే 80 ఏళ్లు పైబడిన వారిలో అయితే 62 శాతం మంది బీపీ, 54 శాతం మందిలో షుగర్ సమస్యతో ఉన్నట్టు తేలింది. 60 ఏళ్లు పైబడిన వారిలో 54 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌తో బాధపడుతున్నారు. 79 శాతం మంది రెగ్యులర్ చెకప్‌లు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు. -
మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు. డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం. -
‘చేయూత’ పండుగ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మనందరి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళా దినోత్సవం ముందు రోజు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదన్నారు. 45 – 60 ఏళ్ల వయసున్న మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అనకాపల్లి జిల్లాలోనే నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సాయంతో ఎదిగిన మహిళలంతా తమ విజయగాథలను వివరిస్తూ రానున్న 14 రోజుల పాటు సచివాలయాలవారీగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు గతంలో మేనిఫెస్టోలో అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మండిపడ్డారు. వారి పేరు చెబితే 8 రకాల మోసాలు, దగా గుర్తురాగా మన ప్రభుత్వం పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబును చూస్తే విశ్వసనీయతలేమి గుర్తుకొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం తెచ్చేలా కార్లను మార్చినట్లు భార్యలను మార్చే వ్యవహారం గుర్తుకొస్తుందని విమర్శించారు. వారిని నమ్మితే కాటేసే పాముని నమ్మినట్టేనని, తినేసే పులిని ఇంటిని తెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపైనర్లుగా నిలిచి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో సీఎం జగన్ ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే.. 14 రోజులు పండుగ వాతావరణంలో.. మహిళా సాధికారతకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించే వైఎస్సార్ చేయూతలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకుంటారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి? అనే స్ఫూర్తిదాయక కధనాలను ప్రతి సచివాలయం, ప్రతి మండలంలో చర్చించుకునేలా తెలియచేయాలని ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ కోరుతున్నా. 45 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు? వారికి తోడుగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదు. ఇంటిని నిలబెడుతూ.. ప్రతి అక్కచెల్లెమ్మ సొంత కాళ్లపై నిలబడేలా క్రమం తప్పకుండా చేయూత సాయంతోపాటు బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, హిందుస్తాన్న్ లీవర్ తదితర కంపెనీలతో అనుసంధానించి తోడ్పాటునిస్తున్నాం. ప్రభుత్వం ఏటా రూ.18,500 చొప్పున ఇస్తోంది కాబట్టి కంపెనీలు, బ్యాంకులు కూడా వారికి అండదండలు అందించాయి. 1.69 లక్షల మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు నిర్వహిస్తుండగా 85,630 మంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. 3,80,466 మంది గేదెలు, ఆవులు కొనుగోలు చేశారు. 1,34,514 మంది మేకలు కొనుగోలు చేశారు. 88,923 మంది ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తుండగా మరో 3,98,422 మంది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాల్లో ఉన్నారు. ఇంకో 2,59,997 మంది రకరకాల వ్యాపారాలతో సొంత కాళ్లపై నిలబడ్డారు. 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ నెలకు కనీసం రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. నాలుగు విడతల్లో రూ.19,189 కోట్లు.. ఒక్క వైఎస్సార్ చేయూత పథకం ద్వారానే 58 నెలల వ్యవధిలో 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. వారికి ఒక మంచి తమ్ముడిగా, అన్నగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి రుణపడి ఉంటా. నవరత్నాల పథకాల ద్వారా మరో రూ.29,588 వేల కోట్ల మేర లబ్ధి పొందారు. ఇదే 33 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను చూస్తే మరో రూ.56,188 కోట్ల మేర కూడా మంచి జరిగింది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతతో గొప్పగా ఎదగాలని ప్రతి అడుగూ ముందుకు వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ వారికి రిజర్వేషన్ కల్పించిన తొలి ప్రభుత్వం ఇదే. గత ప్రభుత్వానికి ఇలా మేలు చేసిన చరిత్రే లేదు. అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నాం. వసతి దీవెన మొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ వారి ఖాతాలకే డబ్బులను జమ చేసి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. నాడు ఛిన్నాభిన్నం.. నేడు నెంబర్ వన్.. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మనం మళ్లీ ఊపిరి పోశాం. నాడు చంద్రబాబు రుణమాఫీ మోసానికి పొదుపు సంఘాలన్నీ ఏకంగా 18.36 శాతం ఎన్పీఏలు, ఔట్ స్టాండింగ్‌లుగా చిన్నాభిన్నమయ్యాయి. ఇవాళ ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే ఉన్నాయి. ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచాయి. వైఎస్సార్ చేయూత ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఏకంగా రూ.19,190 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం అందించింది. కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదైతే ప్రతి అడుగులో అండగా నిలిచిన ఘనత మనది.గతానికి, ఇప్పటికి తేడా చూడమని కోరుతున్నా. మాట ఇచ్చిన చోటే... అత్యంత బాధ్యతగా వ్యవహరించే 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారే కాకుండా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్ఫూర్తిగా ఆలోచన చేశాం. క్రమం తప్పకుండా ఏటా రూ.18,750 చొప్పున వారి చేతిలో పెట్టి జీవనోపాధి మార్గాలు చూపిస్తూ ముందుకు సాగుతున్నాం. చేయూత ద్వారా మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయం చేస్తానని ఇదే జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో నాడు చెప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళి్టతో నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తూ ఇదే అనకాపల్లి జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు.. సొంతిల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందచేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చారా అంటే ఇచ్చింది సున్నా. తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం సచివాయాల్లో మహిళా పోలీసును నియమించాం. దిశ యాప్, భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలాంటి వ్యవస్థను తెచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలో ఏకంగా 50 శాతం వరకు మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే సేవలందిస్తున్నారు. పదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి.. చంద్రబాబు పాలనకు మన పాలనకు వ్యత్యాసం కళ్లకు కట్టినట్లు తెలియాలంటే గత పదేళ్లుగా మీ బ్యాంకు స్టేట్మెంట్లను తీసుకుని ఒక్కసారి పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మీ అకౌంటుకు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయో మీరే గమనించండి. లక్షాధికారులైన మహిళల జాబితాలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం కూడా చెప్పింది. మేనిఫెస్టోలో హామీలలో 99% అమలు చేసి మరోసారి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం మనదే. ఈ 58 నెలల కాలంలో మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరుతున్నా. చెడిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఆ పని చేయలేడు. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే సాధ్యం. బాబు – దత్తపుత్రుడు 8 మోసాలివిగో.. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది. 2014లో చంద్రబాబు – దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా? ► రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు. అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్‌మెంట్ వచ్చేది. ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు. ► ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు. ► మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ► ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. ► మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. ► పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు. ► బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. ► మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లు.. 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు. అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించారు. మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం. అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచడం మరో గజ మోసం. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా. -
పాడికి భరోసాపై కాలకూట విషం
సాక్షి, అమరావతి: సంక్షోభంలో చిక్కుకుని మూతపడ్డ సహకార పాల డెయిరీలను పునరుద్ధరించారు.. ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సహకార రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. లీటర్‌కు రూ.4 చొప్పున అదనపు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా లీటర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనపు లబ్ధి చేకూరుస్తున్నారు. ఇప్పుడు పాడి రైతు చిరునవ్వులు చిందిస్తుంటే ఈనాడు రామోజీకి నచ్చడం లేదు. తన హయాంలో పాడి రైతును దగా చేసిన చంద్రబాబుకు బాకా ఊదడమే లక్ష్యంగా విషపు రాతలతో తెగబడుతున్నారు. తన బురద రాతలతో పాడి రైతుకు భరోసాపై ఓర్వలేనితనంతో కాలకూట విషం కక్కుతున్నారు. ‘పాడి కష్టం..అమూల్ పాలు’ అంటూ కాకిలెక్కలతో ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈనాడు ఆరోపణ: ఏళ్లు గడుస్తున్నా..పెరగని పాలసేకరణ వాస్తవం: రాష్ట్రంలోని ప్రైవేటు డెయిరీలన్నీ కలిపి రోజుకు 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంటే..అమూల్ సంస్థ కేవలం 3.45 లక్షల లీటర్లు మాత్రమే సేకరిస్తోందని ఆరోపించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. నేడు 4778 గ్రామాల్లో 4.15 లక్షల మంది మహిళా పాడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,09,763 మంది రోజూ పాలు పోస్తున్నారు. 2023 జూలైలో రోజుకు 1.74 లక్షల లీటర్లు పాలు సేకరణ చేయగా.. 2024 జనవరి నాటికి 3.75 లక్షల లీటర్ల పాలసేకరణకు చేరుకుంది. 4 లక్షల లీటర్ల పాల సేకరణకు ప్రైవేటు డెయిరీలకు రెండు దశాబ్దాలకుపైగా పడితే అమూల్ కేవలం మూడేళ్లలో 4 లక్షల లీటర్లకు చేరువలో ఉంది. ఆరోపణ: నమ్మించి నట్టేట ముంచారు వాస్తవం: మధ్యవర్తులు లేకుండా మహిళా పాడి రైతులకు నేరుగా ప్రతి పదిరోజులకోసారి పాల బిల్లులను చెల్లిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు పాల నాణ్యత మేరకు రూపాయి నుంచి రూ.2.75 చొప్పున అందిస్తున్నారు. 180 రోజులకు తక్కువకాకుండా పాలు పోసే మహిళా పాడి రైతులకు మూడేళ్లలో రాయిల్టీ ఇన్సెంటివ్ కింద ఇప్పటి వరకు రూ.4.93 కోట్లు చెల్లించారు. ఆరోపణ: ప్రైవేటు డెయిరీ కంటే తక్కువ ధర? వాస్తవం: జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి పాల సేకరణ ధరలు ఏడు సార్లు పెంచారు. ఫలితంగా గేదె పాలు లీటరుకు రూ.18.29(రూ.71.47 నుంచి రూ.89.76) ఆవు పాలకు రూ.9.49(రూ.34.20 నుంచి రూ.43.69)కు పెంచారు. 13 శాతం కొవ్వు, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటరుకు గరిష్టంగా రూ.104 చొప్పున పాడిరైతులకు ఇస్తున్నారు. ఈ ధర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేటు డెయిరీ చెల్లించడం లేదు. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ధర, ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధర చెల్లిస్తుంటే, జగనన్న పాల వెల్లువలో సీజన్‌తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. అమూల్ ధరలు పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా తమ పాలసేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా ప్రైవేటు డెయిరీల నుంచి పాలు పోసే రైతులకు ఈ ప్రాజెక్టు ఫలితంగా రూ.4818.05 కోట్ల అదనపు లబ్ధి చేకూరింది. ఆరోపణ: పాడి రైతులకు చేయూత ఏదీ? వాస్తవం: పాడి రైతులకు 20 శాతం సీపీతో అత్యంత నాణ్యమైన పశువుల దాణా సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగానే గరిష్ట ధర పొందుతున్నారు. ఇంతవరకు 1065 టన్నుల దాణా పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా పాలుపోసే వారికి నిర్వహణ ఖర్చులు, దాణా, పశువైద్య సాయం, నీరు, విద్యుత్ సరఫరా వంటి వాటి కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా అందిస్తున్నారు. పాల సేకరణకు 317 మండలాల్లో 6684 గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే 137 చోట్ల బీఏంసీయూ భవనాలు నిర్మించారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ, పరీక్ష, శీతలీకరణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.126 కోట్లు విడుదల చేసింది. ఆరోపణ: గలీజు ఒప్పందాలు..అప్పు తీర్చి అప్పగించారు.. వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రైవేటు డెయిరీలు మూతపడ్డాయి. అలాగే యూహెచ్‌టీ, పౌడర్ ప్లాంట్లు, ఎంసీసీలతో పాటు 141 బీఎంసీయూలను మూసేశారు. మూతపడిన డెయిరీలను పునరుద్దరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. లిక్విడేషన్‌లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్‌కు లీజుకు ఇచ్చారు. వాటి ఆస్తులు, భూములపై అమూల్‌కు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్ రూ.385 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు డెయిరీకి రూ.182 కోట్లు అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవే. వాటిని క్లియర్ చేసిందే తప్ప అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు. ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్‌కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్ పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాంటపుడు రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని పస లేని రాతలు రాస్తున్నారు. -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు
పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్‌కు మొత్తం రూ. 25 వేలు ఆర్థిక సహాయం, అలాగే వారికి వైద్య సేవలు అందేలా గోర్సేవా(Gorseva)తో సమన్వయం చేశారు. అలాగే మన్ననురు రేంజుకు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి, వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!) -
మత్స్యకారులకు మరింత మేలు..
సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది. మంగళవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మరింత మేలు చేసేందుకు వీలుగా మరో మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఎఫ్ఎల్సీ ఏర్పాటుతో 500 బోట్లు నిలుపుకొనే అవకాశం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద రూ.23.93 కోట్లతో నిర్మించతలపెట్టిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్(ఎఫ్ఎల్సీ)కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ సెంటర్ ఏర్పాటుతో ఒకేసారి సురక్షితంగా 500 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే అవకాశం ఏర్పడుతుంది. దెబ్బతిన్న బోట్లకు ఫిష్ ల్యాండ్ సెంటర్ వద్ద మరమ్మతులు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా 20 వేల మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఈ సెంటర్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పులికాట్ ముఖ ద్వారం పునరుద్ధరణ మరోవైపు దశాబ్దాలుగా నెలకొన్న పులికాట్ సమస్యకు మోక్షం కలగనుంది. ఏపీ పరిధిలో 400 చదరపు కిలో మీటర్లు, తమిళనాడు వైపు మరో 61 చదరపు కిలోమీటర్ల మేర ఈ సరస్సు విస్తరించి ఉంది. మూసుకు పోయిన సరస్సు ముఖ ద్వారం పునరుద్ధరణ పనులను రూ.94.75 కోట్లతో శ్రీకారం చుడుతున్నారు. తద్వారా 20 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 54 నెలల్లో రూ.4,485.98 కోట్ల మేర లబ్ధి ఈ 54 నెలల్లో మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా 2,18,153 మంది మత్స్యకార కుటుంబాలకు అక్షరాల రూ.4,485.98 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. మరో వైపు వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో రూ.3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మిస్తోంది. రూ.11 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఓఎన్జీసీ పైపులైన్ బాధితులకు నాల్గో విడత సాయం అలాగే ఓఎన్జీసీ, జీఎస్పీసీ సంస్థల పైప్‌లైన్ పనుల కారణంగా 40,012 మంది జీవనోపాధి కోల్పోగా.. జీఎస్పీసీ పైపులైన్ వల్ల ఉపాధి దెబ్బతిన్న 16,554 మందికి రూ.78.22 కోట్ల సాయాన్ని ఇప్పటికే చెల్లించారు. అదే విధంగా ఓఎన్జీసీ పైపులైన్ వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి ఇప్పటికే మూడు విడతల్లో రూ.323.72 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. తాజాగా నాల్గో విడతగా ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున.. ఆర్నెల్లకు రూ.69 వేల చొప్పున రూ.161.86 కోట్ల సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి మొత్తం ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి రూ.485.58 కోట్ల పరిహారం చెల్లించినట్టవుతుంది. -
భారత్‌లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత!
సైకిల్ యాత్రపై భారత్‌కు వచ్చిన ఇరాన్ దంపతులను తిరిగి వారి దేశానికి తిరిగి పంపేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ ఇరాన్ దంపతులు ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తూ, సైకిల్‌పై భారతదేశానికి వచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌పారం ఎక్స్‌లో అఖిలేష్ యాదవ్ ఈ వివరాలను తెలియజేస్తూ మానవత్వం కంటే గొప్ప మతం లేదని, సహాయానికి మించిన ఆరాధన లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి వచ్చి, మన దేశంలో చిక్కుకుపోయిన ఈ అతిథుల కోసం ఏదో ఒకటి చేయడమనేది తన అదృష్టం అని అఖిలేష్ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా.. ఈ జంట తిరుగు ప్రయాణపు టికెట్ రద్దయింది. వారి దగ్గర డబ్బలు కూడా లేవు. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశారు. దీంతో ఈ జంటకు అఖిలేష్ సాయం అందించారు. ఈ జంటను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! इंसानियत से बड़ा धर्म और मदद से बड़ी इबादत कोई और नहीं, कुछ और नहीं। जंग के हालातों की वजह से, ईरान से आकर हमारे देश में फँसे इन मेहमानों की देश वापसी में हम कुछ कर पा रहे हैं, ये हमारी ख़ुशक़िस्मती है। देश की छवि दुनिया में सिर्फ़ कहने से नहीं, कुछ अच्छा करने से बनती है। pic.twitter.com/RtvlRmhaci — Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2023 -
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ఉపయోగం ఈ పథకం ద్వారా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష, నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి ఈ నగదు ఉపయోగపడుతుంది. రెండోది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది వ్యక్తిత్వ పరీక్షకు సన్నద్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఈ నగదు అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చులకు భరోసా ఇస్తుంది. అర్హత ప్రమాణాలు ఇవి.. ♦ దరఖాస్తుదారు తప్పనిసరిగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అయ్యుండాలి. ♦ ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి(స్థానికుడు) అయ్యుండాలి. ♦ తప్పనిసరిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. యూపీఎస్సీ అనుమతించిన ఎన్ని ప్రయత్నాల్లోనైనా ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని అభ్యర్థి పొందవచ్చు. ♦ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు. ♦ కుటుంబానికి పది ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు. ♦ఇలా పలు అర్హతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఉక్రెయిన్‌కు మరో రూ.2,695 కోట్ల సాయం
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య వల్ల ఎంతగానో నష్టపోయిన ఉక్రెయిన్‌కు ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్‌కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆయన తాజాగా వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతోయుద్ధంపై వారు చర్చించుకున్నారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్‌కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు. అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను వచ్చేవారం ఉక్రెయిన్‌కు ఇస్తామని వివరించారు. -
మాటిచ్చారు.. నెరవేర్చారు
నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.షణ్మోహన్‌కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది. మానవత్వంతో ఆదుకున్నారు నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్‌తో సీఎం జగన్‌ను కలిసింది. తన కుమారుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది. కార్వేటినగరం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్‌ను కలిసింది. తాను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండలం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్‌కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్.సుమిత్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. -
నేటి నుంచి మైనార్టీలకు రూ. లక్ష సాయం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష ఆర్థిక సాయం నూరుశాతం రాయితీతో అందించనున్నట్లు వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ వెల్లడించింది. -
చైనాను వీడని ప్రకృతి ప్రకోపం.. వరద బీభత్సం నుంచి బయటపడగానే..
ఇటీవలి కాలంలో చైనాను తరచూ ప్రకృతి విపత్తులు చుట్టుముడుతున్నాయి. ఈమధ్యనే వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దేశంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఇప్పుడు వరదల కారణంగా ఆహార సంక్షోభం కూడా అంతకంతకూ పెరుగుతోంది. పొలాల్లోకి వరద నీరు చేరింది. పంటలన్నీ నాశనమయ్యాయి. కొత్త పంటలు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గత కొన్ని నెలలుగా చైనా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యింది. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 30 మంది మరణించారు. ఈ మరణాలు బీజింగ్, దాని పక్కనే ఉన్న హెబీ ప్రావిన్స్‌లో సంభవించాయి. ఆహార సంక్షోభం దిశగా.. హీలాంగ్జియాంగ్, జిలిన్, లియోనింగ్.. ఇవి చైనాకు ఈశాన్య ప్రాంతంలోని మూడు ప్రావిన్సులు. వీటిని చైనా ధాన్యాగారం అని పిలుస్తారు. ఈ మూడు ప్రావిన్సుల్లోనూ సాగు భూమి చాలా సారవంతమైనది. దేశంలోని ఆహార ధాన్యాలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. సోయాబీన్స్, మొక్కజొన్న, వరి మొదలైనవి ఈ మూడు ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూడు ప్రావిన్స్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలో ఆహార సంక్షోభం సంభవించవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. ధ్వంసమైన పంటపొలాలు హీలాంగ్జియాంగ్లో వరదల కారణంగా వరి పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. కూరగాయల ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. హీలాంగ్జియాంగ్ రాజధాని హర్బిన్లో భారీ వర్షాలకు 90 వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. హర్బిన్‌కు ఆనుకుని ఉన్న షాంగ్జీ నగరంలో 42,575 హెక్టార్లలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వర్షాలు, వరదల కారణంగా దేశంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోధుమల దిగుబడి కూడా తగ్గింది. వరి పొలాలు నాశనమయ్యాయి. గత ఏడాది తీవ్రమైన ఎండలకు పంటలు నాశనం కాగా ఈ ఏడాది వరదలు విధ్వంసం సృష్టించాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’ -
ఎంఎస్ఈలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను (ఎంఎస్ఈలను) రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇతర ఎంఎస్ఈలు, ప్రభుత్వ సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న తరహా యూనిట్లకు అండగా నిలుస్తోంది. ఈ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వాటి బకాయిల వసూళ్లలోనూ సహాయ పడుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. మిగిలిన 385 కేసుల్లో 60 కేసులను ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో పరిష్కరించనున్నట్లు కౌన్సిల్ సభ్యుడు, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. కౌన్సిల్ ముందుకు కొత్తగా 65 కేసులు వచ్చాయని, మరో 78 కేసులు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కువ సమస్యలను ఇరు వర్గాలతో మాట్లాడటం ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్నతరహా సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో రుణాలను చెల్లించలేక ఎన్పీఏలుగా మారకుండా ఎంఎస్ఎంఈడీ యాక్ట్ 2006 కింద ప్రభుత్వం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్ కమిటీలో ఫాప్సియా ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ, ఏపీఐఐసీ జీఎం (లీగల్) ఎంఎస్ఎంఈ జేడీ సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి. కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలపై సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉద్యం పోర్టల్‌లో నమోదు చేసుకున్న సంస్థలు మాత్రమే కౌన్సిల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటంతో అన్ని సంస్థలు ఆ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చూడాలని చెప్పారు. -
మైనారిటీలకు రూ.లక్ష సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించే అంశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. త్వరలో అమల్లోకి రానున్న ఈ పథకానికి సంబంధించిన వివరాలను సీఎం ప్రకటిస్తారన్నారు. మైనారిటీ సంక్షేమానికి ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రూ.2,200 కోట్లు కేటా యించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. వివిధ విభాగాల కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమి తులైన మైనారిటీ నేతలను గురువారం జల విహా ర్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చెప్పే మాటలకు పొంతన ఉండదని, దేశంలో నేటి కీ ముస్లింలు పేదలుగా మిగలడానికి ఆ పార్టీయే కారణమన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మైనా రిటీ సంక్షేమానికి వెచ్చించిన మొత్తం కంటే ఒక్క ఏడాదిలో తమ ప్రభుత్వం ఖర్చు చేసిందే ఎక్కు వగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు షకీల్, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గంగా జమున తహజీబ్ మైనారిటీ వర్గాలను సీఎం కేసీఆర్ ఎంతగానో గౌరవిస్తారనేందుకు మహమూద్ అలీని రెండు పర్యాయాలు మంత్రిగా చేయడమే నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గంగ జమున తహజీబ్‌ను అమలు చేస్తున్నారని.. మైనారిటీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఓవర్సీస్ స్కాలర్షిప్, షాదీ ముబారక్ వంటి ఎన్నో పథ కాలు ఇస్తున్నారని చెప్పారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న మైనార్టీ నేతలను హరీశ్‌రావు, మహమూద్ అలీ సన్మానించారు. సన్మానం అందుకున్న మైనారిటీ నేతల్లో మేడే రాజీవ్ సాగర్, ముజీబ్ ఉద్దీన్, తన్వీర్, ఇంతియాజ్, తారిక్ అన్సారీ, సలీం, అక్బర్ ఉన్నారు. -
‘గృహలక్ష్మి’పై కదలిక: ఎంపిక ఎమ్మెల్యేలకే?
సాక్షి, హైదరాబాద్: సొంతంగా స్థలాలున్న పేదలు వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేసే ‘గృహలక్ష్మి’ పథకానికి జూలైలో శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయి తే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, జాబితాల రూపకల్పన బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్లో కేటాయింపులు చేసినా.. ‘పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనే ఈ పథకానికి రూ.12 వేల కోట్లను కేటాయించింది. కానీ పథకానికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేయకపోవటంతో అమల్లోకి రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం తిరిగి రూ.12 వేల కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటివరకు మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలను ఆర్థిక సాయంగా అందిస్తుంది. లబ్ధిదారులు అవసరమైన అదనపు మొత్తాన్ని కలిపి సొంత జాగాలో కావాల్సిన విధంగా ఇంటిని నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. జూలై నెలలో పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఉన్నతాధికారులు భేటీ అయి ఈ పథకం తీరు తెన్నులపై చర్చించారు. వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. త్వరలో సీఎం నుంచి అనుమతి వస్తుందని, ఆ వెంటనే మార్గదర్శకాలు, ఇతర అంశాలపై కసరత్తు ముమ్మరం చేస్తామని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ పథకం కీలకంగా మారుతుందని.. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే విషయంలో స్థానిక శాసనసభ్యులకే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కనీసం స్థలంపై అస్పష్టత సొంత స్థలమున్న పేద లబ్ధిదారులకే గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తారు. అయితే ఈ స్థలం ఎంత ఉండాలన్న విషయంలో మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎంత, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంత స్థలం ఉంటే మంచిదన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇక కులాల వారీగా ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్ అమలు చేయాలన్న విజ్ఞప్తులూ ఉన్నాయి. వీటన్నింటిపై మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ‘గృహలక్ష్మి’కి అర్హతల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కనీస స్థలం పరిమితులు లేకుండా ఉంటే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రభుత్వం ఇటీవల ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిందని వివరించాయి. మొత్తంగా ఆగస్టు నాటికి అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడత ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్న దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించాయి. -
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు చేయూత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు చేయూతనిస్తూ..ఖాతాదారులు ‘ఇష్టపడే బ్యాంకు’గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో మణిమేఖలై అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, నరసరావుపేట రీజియన్ల సమావేశం శుక్రవారం విజయవాడ టౌన్ హాలులో జరిగింది. సీఈవో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం బ్యాంకును విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఖాతాదారుల ఆధారంగా వ్యాపార విస్తరణ, మార్కెట్ వాటా, లాభదాయకతను పెంచుకునేందుకు ఫోకస్డ్ విధానంతో కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 2024 మార్చి నాటికి 21.50 ట్రిలియన్ల గ్లోబల్ వ్యాపారాన్ని సాధించి అంతర్జాతీయంగా 3వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం 100 రోజుల అజెండాతో, నాలుగు ముఖ్య లక్ష్యాలను నిర్ధేశించుకున్నామన్నారు. అబ్ నారీ కి బారీ పథకం కింద 2023 జూలై 31 నాటికి 1.25 లక్షల మíహిళా పారిశ్రామికవేత్తలకు, కృషి కే సాథ్ మహిళా వికాస్ పేరిట కనీసం 50 వేల మంది వ్యవసాయ ఔత్సాహికులకు పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనివ్వనున్నామని చెప్పారు. క్యూఆర్, పీవోఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కనీసం 25 శాతం సీడీ ఖాతాలను డిజిటలైజేషన్ చేయనున్నామన్నారు. ఆయా జిల్లాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సమావేశంలో సీజీఎం లాల్ సింగ్, హెచ్ఆర్ జోనల్ హెడ్ నవనీత్‌కుమార్ పాల్గొన్నారు. -
నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. నిఖత్ జరీన్‌కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్ జరీన్‌ను సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయంలోని తన చాంబర్లో నిఖత్‌కు శాలువా కప్పి సత్కరించారు. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
సీఎం జగన్ ఆదేశాలు..యువకుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎం.ప్రేమ్హర్షవర్ధన్కు కలెక్టర్ ఎల్.శివశంకర్ రూ.లక్ష చెక్కు అందజేశారు. హర్షవర్ధన్ గత నెల 26న అనంతపురంలో సీఎం జగన్ నిర్వహించిన జగనన్న వసతి దీవెన సభకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి తాను పడుతున్న ఇబ్బందులను వివరించి ఆదుకోవాలని వేడుకున్నాడు. స్పందించిన ముఖ్యమంత్రి బాధితుడ్ని ఆదుకోవాలని, వైద్యసేవలు అందేలా చూడాలని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వివరాలను పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ స్పందించి తక్షణ సాయంగా రూ.లక్ష చెక్కును బాధితుడికి సోమవారం కలెక్టరేట్లో అందజేశారు. హర్షవర్ధన్ గుండెలో పేస్‌మేకర్ అమర్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూఅధికారి కె.వినాయకం, జిల్లా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్. సునీల పాల్గొన్నారు. -
థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
రామచంద్రపురం: సైంటిస్ట్ ఆస్ట్రోనాట్‌గా ఎదగాలని కలలుగన్న ఓ యువతి ఆకాంక్షలకు ప్రభుత్వ సాయం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు అంతరిక్ష రంగంపై విపరీతమైన మక్కువ. అమెరికా నాసా శిక్షణకు ఎంపికైన ఈమెకు ఆర్థిక ఇబ్బంది తలెత్తింది. బీసీ సంక్షేమ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే సీఎం ఈ శిక్షణ కోసం ఆమెకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో అమెరికాలోని నాసా అంతరిక్ష కేంద్రంలో నెల పాటు శిక్షణ పొందింది. ఇటీవల జాహ్నవి స్వస్థలం చేరుకుంది. మరికొన్నాళ్లు ఆమె శిక్షణ పొందాల్సి ఉంది. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణును కలిసింది. చిరకాల స్వప్నమైన సైంటిస్ట్ ఆ స్ట్రోనాట్ కావడానికి సహకారాన్ని అందజేసిన సీఎం జగన్‌కు, మంత్రి వేణుకు కృతజ్ఞతలు తెలిపింది. -
నార్పలలో సీఎం జగన్ గొప్ప మనసు.. కలెక్టర్‌కు ఆదేశాలు, బాధితులకు సాయం
సాక్షి, అనంతపూర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. జిల్లాలోని నార్పలలో బుధవారం రోజున జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా అనారోగ్య బాధితులను కలిసి సీఎం జగన్ నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సాయం చేయాలని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అవసరమైన సాయం అందజేశారు. తమ గోడు విని సత్వరం స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. (చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే) బాధితుల పూర్తి వివరాలు... 1.డి.రాజు, పి. అరుణ రాజు, అరుణల కుమారుడు ధనుష్ జెనెటికల్ సమస్యలతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ధనుష్‌కు అవసరమైన వైద్యచికిత్సలు ఉచితంగా చేయించాలని నిర్ణయం. 2.యోగిశ్వరి యోగిశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించారని, ఇద్దరు కుమారులతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం. 3. రామచంద్ర, భవాని రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగవైకల్యంతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.1 లక్ష ఆర్ధిక సాయం, వీల్ ఛైర్. 4. చాకలి నవ్య ఇటీవల జరిగిన కెమికల్ బ్లాస్ట్ లో తన భర్తను కోల్పోయానని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.7 లక్షల ఆర్ధిక సాయం. 5. ఏ.నారాయణమ్మ తన కుమారుడు జశ్వంత్ రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ఉచితంగా చికిత్స. 6. జి.రామాంజి విద్యుత్‌శాఖలో టెంపరరీగా పనిచేస్తున్న తనకు విద్యుత్‌షాక్‌తో కుడి చెయ్యి కోల్పోయానని, సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం, విద్యుత్ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం. 7. వి.అమర్నాథ్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం 8. బి.గంగయ్య తన భార్య నాగలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, వీల్ ఛైర్. 9. బి.కొండారెడ్డి తన మేనల్లుడు చేతన్ రెడ్డి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం 10. ఎస్.నబీరసూల్ తనకు వైకల్యం కారణంగా ట్రైసైకిల్ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకురాగా ఆయనకు ట్రైసైకిల్ అందజేసిన అధికారులు. (చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?) -
బిడ్డ కోసం రక్తం అమ్ముకున్న ఓ తండ్రి కథ
జనాభాలో భారత్ చైనాను అధిగమించింది. మరి మానవాభివృద్ధిలో ఎక్కుడున్నాం?. ఎక్కడో చివర్లో ఉన్నాం. సాంకేతికత, సోషల్ మీడియా గురించి నిత్యం మాట్లాడుకునేం మనం.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం మాటకొచ్చేసరికి చర్చల్లో వెనకబడిపోతాం. దేశంలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కథలు కళ్లకు కట్టేలా కనిపిస్తున్నా.. ‘అయ్యో అనుకోవడం’ తప్పించి అంతకు మించి ఏం చేయని పరిస్థితి మనలో చాలామందిది. ఇప్పుడు చెప్పుకోబోయేది కథ కాదు.. కూతురి కోసం పోరాడుతూ జీవితంలో ఓడిన ఓ తండ్రికి సంబంధించిన విషాద గాథ. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన కూతురి కోసం తాను చేయగలిగిందంతా చేశాడు ఓ వ్యక్తి. సాయం కోసం ఎదురు చూసి.. చూసి విసిగిపోయాడు. చివరకు కూతురిని కాపాడుకోలేనేమో అనే బెంగతో ఆర్థిక కష్టాల నడుమ నిస్సహాయ స్థితిలో ప్రాణం తీసుకున్నాడు. అనుష్కా గుప్తా.. ఐదేళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక విరిగి మంచానికే పరిమితమైంది. ఆమె చికిత్స కోసం తండ్రి ప్రమోద్ ఉన్న ఇంటిని, దుకాణాన్ని అమ్మేశాడు. అప్పులు చేసి మరీ మందులు, థెరపీలు చేయించాడు. అయినా ఆమెకు నయం కాలేదు. ఈలోపు ఆర్థిక సమస్యలు ఇంటిదాకా వచ్చాయి. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ వచ్చే డబ్బు ఏపాటికీ సరిపోలేదు. గత్యంతరం లేక రక్తం అమ్ముకుని.. ఈ లోపు అధికారులు సాయం అందిస్తామని మాటిచ్చారు. ఆ విషయాన్ని కొందరు నేతలు కూడా మైకుల్లో మీడియా ముందు అనౌన్స్ చేసుకున్నారు. అది పట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, స్థానిక నేతల ఇళ్ల చుట్టూ ఏడాదిపాటు తిరిగి తిరిగి అలిసిపోయాడా తండ్రి. ఇంట్లో తినడానికి ఏం లేని పరిస్థితుల్లో.. తరచూ రక్తం సైతం అమ్ముకున్నాడు ప్రమోద్. ఏడాది కాలంగా గుప్తా ఇంటి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. శక్తిహీనుడైన ఆ తండ్రి కూతురి కోసం తానేం చేయలేకపోతున్నాననే నిరాశ, ఆర్థికంగా కుంగిపోయి నిస్పృహలోకి కూరుకుపోయాడు. చివరకు ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. కూతురి ఆరోగ్యం విషయంలో అప్పటికే దిగులుగా ఉన్న ప్రమోద్ కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం సాత్నా రైల్వే పట్టాలపై ప్రమోద్ శవాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు తల్లీ.. ఏం చేయలేపోతున్నానమ్మా! అనుష్కా గుప్తా.. సరస్వతి పుత్రిక. ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైనా సరే పుస్తకాన్ని వదల్లేదు. కూతురిలోని ఆ ఆసక్తికి చంపడం ఇష్టం లేక.. ఇంటి నుంచే ఆమె చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు ప్రమోద్. ఓ మనిషి సాయంతో ఆమె బోర్డు పరీక్షలు రాసింది. బోర్డు ఎగ్జామ్స్‌లో ఆమె సాధించిన ప్రతిభకు విద్యాశాఖ సత్కారం కూడా చేసింది. పై చదువుల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఆ తండ్రి.. కూతురి ట్రీట్మెంట్, ఇంటి అవసరాల ఆర్థిక భారాన్ని మోయలేకపోయాడు. బంగారు తల్లి కోసం ఏం చేయలేకపోయానే అనుకుంటూ నిత్యం కుమిలిపోయాడు. పాపం.. ప్రాణం తీసుకునే ధైర్యం ప్రదర్శించిన ఆ తండ్రి.. బదులు పోరాడి అధికారుల నుంచి రావాల్సిన సాయం రాబట్టుకుని ఉంటే బాగుండేదేమో!. -
క్షీణించిన నిర్మాత ఆరోగ్యం.. దీనస్థితిలో వీడియో విడుదల.. లారెన్స్ సాయం
చెన్నై: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు. విక్రమ్, సూర్య కలిసి నటించిన పితామహన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రంతో పాటు విజయకాంత్ హీరోగా నటించిన గజేంద్ర తదితర భారీ చిత్రాలను నిర్మాత విఏ.దురై. చివరిలో నిర్మించిన చిత్రాలు ప్లాప్ కావడంతో నష్టాల పాలయ్యారు. కాగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నటుడు రజనీకాంత్ కూడా సాయం చేస్తానని చెప్పారు. రాఘవ లారెన్స్ నిర్మాత పరిస్ధితి గ్రహించి బుధవారం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. కాగా లారెన్స్ కథానాయకుడిగా నటించిన రుద్రన్ చిత్రం తమిళ ఉగాది సందర్భంగా ఇవాళ ఏప్రిల్ 14న విడుదలైంది. చదవండి: ‘రుద్రన్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
విషాదంలోనే మూడు గ్రామాలు
కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంపై పోలీసుల ఆరా.. చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తలకొరివి పెట్టిన తనయ చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది. -
రైతులకు సాయంపై తక్షణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ శాంతికుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్‌తో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు.. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు జారీ చేయాలని సూచించారు. త్వరలో పోడు పట్టాల పంపిణీ రాష్ట్రంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధతపై సీఎం సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి, 1.55 లక్షల మంది అర్హులకు పట్టాలు అందించేందుకు పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దీంతో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు మంజూరు శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. -
పంటనష్టంపై విస్తృత సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షా లు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు గురువారం విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్కసారికి సాయం అందించేందుకు గ్రామాలవారీగా, సాగుదారులవారీగా పంటనష్టంపై సవివరమైన సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖకు సూచించారు. నష్టాన్ని చవిచూసిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీల మధ్య ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురియడంతో అన్నిరకాల పంటలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారుల బృందం పంటలకు నష్టం జరిగిన వివిధ ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేసిందన్నారు. పంట చేతికొచ్చేదశలో ఉందని, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వందశాతం నష్టం వాటిల్లిందని, దీంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, పంటనష్టాన్ని గ్రామాల్లో అంచనా వేయాలని, లబ్ది దారులను గుర్తించాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)లను ప్రభుత్వం ఆదేశించింది. 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే వాస్తవంగా ఇది ఐదు లక్షల వరకు ఉంటుందని రైతు సంఘాలు, కిందిస్థాయి నుంచి సమాచారం వస్తోంది. కాగా, ప్రభుత్వం వేసిన నష్టం అంచనా ప్రకారం మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. తాజాగా చేయబోయే సర్వేలో ఇంకేమైనా అదనంగా నష్టం వెలుగుచూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. నష్టపరిహారంగా దీన్ని పేర్కొనకూడదని, సహాయ, పునరావాస చర్యలు అని పిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని వారం, పది రోజుల్లో రైతులకు అందజేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. -
రాష్ట్రంపై క్షయ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై క్షయ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అధిక కేసులు నమోదు అవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు బ్యాక్టీరియా లొంగకపోవడం, పాలకులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గడంలేదని క్షయ మరణాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2022లో టీబీ కారణంగా ఏకంగా 1,892 మంది మరణించారు. 2021లో 2,055 మంది, 2020లో 2,300 మంది చనిపోయారు. 2022లో 72,911 కేసులు... రాష్ట్రంలో టీబీ పూర్తి నియంత్రణకు రావడం లేదు. 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో 52,269 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 2019లో 71,665 మందికి వ్యాపించింది. 2020లో 63,243 మందికి, 2021లో 60,796 మందికి వ్యాధి సోకింది. 2022లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఏకంగా 72,911 మంది టీబీ బారినపడ్డారు. రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవడం గమనార్హం. 2022లో మొదటి ఏడు నెలల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 2,356 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 2,294 నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,409 కేసులు, ఖమ్మం జిల్లాలో 1,299 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 232 టీబీ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 86.5 శాతం మందికి ఆర్థిక సాయం... నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్దతిలో క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం. అయితే రాష్ట్రంలో కొందరు క్షయ రోగులకు ఆ ఆర్థిక సహకారం పూర్తిస్థాయిలో అందడంలేదు. వారికి బలవర్థకమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది పేద రోగులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతం కంటే ఇది కాస్త మెరుగుపడిందని రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారులు అంటున్నారు. 2020లో క్షయ వ్యాధిగ్రస్తుల్లో 72 శాతం మందికి ఆర్థిక సాయం అందగా, 2021లో 83 శాతం మందికి, 2022లో 86.5 శాతం మందికి డీబీటీ పద్ధతిలో ఆర్థిక సాయం అందింది. 2022లో 68,965 మంది ఆర్థికసాయానికి అర్హులు కాగా, 59,677 మందికి మాత్రమే ఆర్థికసాయం అందింది. మిగిలిన వారికి రాలేదని అధికారులు చెబుతున్నారు -
ఏపీ: మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల
సాక్షి, విజయవాడ: మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. కాగా మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. -
ఎంబీబీఎస్ విద్యార్థినికి ఎంపీ కోమటిరెడ్డి ఆర్థికసాయం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మాధవనగర్ ప్రాంతానికి చెందిన ఊట్కురి రుక్కయ్య కూతురు శ్రీలక్ష్మి ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. శ్రీలక్ష్మి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు మొదటగా రూ.లక్షా యాభై వేలు సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు. ఎంపీ కోమటిరెడ్డి తమకు దేవుడిలా సహాయం అందించారని, తమ కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని రుక్కయ్య అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. -
పాకిస్థాన్ చింత తీర్చే హామీ ఇచ్చిన జిన్‌పింగ్
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ చింత తీర్చే హామీ ఇచ్చారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. తమ చిరకాల మిత్రదేశం పాకిస్థాన్‌ను ఎప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనివ్వమని, అన్ని విధాలా ఆదుకుని గట్టెకిస్తామని భరోసా కల్పించారు. ఇప్పటికే 9 బిలియన్ డాలర్ల సాయం అందించిన డ్రాగన్.. మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత శనివారం మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్.. చైనా నుంచి 9 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా నుంచి 4 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హామీలను గుర్తు చేసుకున్నారు. ‘నవంబర్ 3న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటనకు వెళ్లిన క్రమంలో షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలాంటి చింత వద్దు.. మేము మిమ్మల్ని సంక్షోభంలో కూరుకుపోనివ్వం అని ఆయన భరోసా కల్పించారు.’ అని వెల్లడించారు పాక్ ఆర్థిక మంత్రి. మరోవైపు.. దార్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ను ప్రశ్నించగా.. ‘పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా అన్ని విధాల ఆదుకుంటుంది. ఇప్పటికే చాలా చేశాం.. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.’ అని తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. అందులోంచి బయటపడేందుకు తన చిరకాల మిత్రులైన చైనా, సౌదీ అరేబియాకు మరింత దగ్గరవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అవసరమైన 35 బిలియన్ డాలర్లను సేకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇరు దేశాలు 13 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు అందించేందుకు అంగీకరించాయి. ఇదీ చదవండి: కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్! -
ట్రస్‌కు ఏటా రూ.కోటి!
లండన్: బ్రిటన్ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్‌గా అందుకోనున్నారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్‌తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు. -
చిన్నారికి ప్రాణదానం చేయరూ..
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల చిరుప్రాయం.. ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం.. కానీ అనూహ్యంగా తీవ్ర డెంగీ జ్వరం బారినపడటం ఆ చిన్నారి ప్రాణాలకు ముప్పుగా మారింది. చికిత్సకు రూ. లక్షలు అవసరం కావడంతో ఆ చిన్నారి కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌కు చెందినవి. వినీల మూడేళ్ల కుమారుడు వి. వేదార్యన్ ఇటీవల తీవ్ర డెంగీ జ్వరంబారిన పడ్డాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే వివిధ అవయవాలు వైఫల్యం చెందాయి. ప్రస్తుతం ఆ బాలుడిని కుటుంబ సభ్యులు రెయిన్బో పిల్లల ఆస్పత్రిలోని పీఐసీయూ వార్డుకు తరలించారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడంతో హార్ట్ అండ్ లంగ్ బైపాస్ మెషీన్ (వీఏ–ఎక్మో) ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తున్నారు. అయితే ఖరీదైన ఈ చికిత్సలకు మరో రూ. 15 లక్షలు అవసరమని, దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని బాలుడి తల్లి వినీల కోరారు. దాతలు milaap.org/fundraisers/support-v-vedaryan?deeplink_type= ద్వారా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్
మాస్కో: ఫిబ్రవరి 18 నుంచి ఉక్రెయిన్ విడిచి రష్యాకు వచ్చిన పౌరులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంచి ఆఫర్ ఇచ్చారు. ఈమేరకు పుతిన్ ఉక్రెనియన్ భూభాగాన్ని విడిచి పెట్టి రష్యాకు వచ్చిన వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే డిక్రీ పై సంతకం చేశారు. ఉక్రెయిన్ పౌరులకు, పెన్షనర్లకు, మహిళలకు, వికలాంగులకు నెలవారి భృతి సుమారు రూ 13 వేలు అందించేలా రష్యా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రష్యాకు తరలి వచ్చిన ప్రతి ఒక్క ఉక్రెయిన్ పౌరుడికి ఈ భృతిని చెల్లించాలని పుతిన్ ఆదేశించారు. ఒక పక్క రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగుతూనే ఉక్రెయిన్ రష్యన్లకు పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తోంది. మరోవైపు యూఎస్, ఉక్రెయిన్, పశ్చిమదేశాలు, చట్ట విరుద్ధమైన చర్య అంటూ గొంతు చించుకుంటున్నా రష్యా మాత్రం ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. (చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ప్రాణ నష్టం.. ఎన్ని వేల మంది సైనికులు చనిపోయారంటే..?) -
కేంద్రం కీలక నిర్ణయం.. వారికి రూ.3వేల ఆర్థిక సాయం
Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా, సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.అయితే, అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. కాగా, రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అనాథ పిల్లలు(కుమార్తె, కుమారుడు)21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్ -
శతమానం భారతి విదేశీ వాణిజ్యం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సందర్భంలోనైనా అనే మాట ఒకటి ఉంది : స్వావలంబన మాత్రమే కాదు, అంతకు మించి దేశం ఎదగాలి అని. అంతర్థాం ఏమంటే మన ఉత్పత్తులపై విదేశాలను ఆధారపడేలా చేయడం. తద్వారా విదేశీ మారక నిల్వల్ని పెంచుకుంటూ పోవడం. అప్పుడు దేశం ఆర్థికంగా ఆగ్రరాజ్యం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు అయ్యేనాటికి దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధిగా ఉండాలని ప్రధాని ఆకాంక్ష. విదేశీ వాణిజ్య రంగంలో ఆ ఆకాంక్ష నేరవేరడం అలవిమాలని లక్ష్యం అయితే కాబోదని పాత గణాంకాలను చూస్తే తేటతెల్లం అవుతుంది. మొదటి పంచవర్ష ప్రణాళికలోని ఐదేళ్లలో మన ఎగుమతుల సగటు విలువ 647 కోట్ల రూపాయలు ఉండగా, 2022 నాటికి ఆ మొత్తం 32 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. భారత్ నుంచి పలు రకాలైన ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలలో అమెరికా, చైనా, యూ.ఎ.ఇ. హాంకాంగ్, బంగ్లాదేశ్, సింగపూర్, యు.కె. జర్మనీ, నేపాల్, నెదర్లాండ్ ఉన్నాయి. ఈ వరుస క్రమంలో అమెరికా మనకున్న పెద్ద దిగుమతి దారు. ఇంజనీరింగ్ ఉత్పత్తులు మన ప్రధాన ఎగుమతులు కాగా, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్త్రాలు, అభరణాలు, చేనేత, రెడీమేడ్ దుస్తులు, ప్లాస్టిక్స్, సముద్ర ఉత్పత్తులు.. మిగతావి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభం అయిన 1991 నాటికి భారత్ ఎగుమతులు 1800 కోట్ల డాలర్లు కాగా.. ఈ విలువ లక్ష కోట్ల డాలర్లకు పెరిగితేనే, భారత్ తను నిర్దేశించుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోగలదు. (చదవండి: శతమానం భారతి : బ్రిటిష్ ఇండియాలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ ఐ.ఐ.టి. రూర్కీ) -
ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం
భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం కోసం రూపొందించిన నాలుగు పథకాలు నూటికి నూరు శాతం భరూచీ జిల్లాలో లబ్ధిదారులందరికీ అందిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ భావోద్వేగం అంతకు ముందు ప్రధాని మోదీ పథకాలు అందుకున్న లబ్ధి దారులతో మాట్లాడారు. వారిలో కంటి చూపు కోల్పోయిన అయూబ్ పటేల్ తన పెద్ద కుమార్తె అలియాతో కలిసి వచ్చారు. పన్నెండో తరగతి చదువుతున్న ఆమె డాక్టర్ చదవాలని అనుకుంటోందని, అందుకోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు డాక్టర్ చదవాలని అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ప్రధాని కదిలిపోయారు. చూపు లేని తన తండ్రి దుస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నానని, అందుకే డాక్టర్ అవుదామని అనుకుంటున్నానని అలియా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దీంతో ప్రధాని కాసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఒక సరళమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసే విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను సరళం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో కోవిడ్–19పై గురువారం నిర్వహించిన రెండో గ్లోబల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమానికి ఈ–శ్రమ్
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, నష్ట పరిహారం నేరుగా కార్మికులకు అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడుతుంది. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలంటే తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తమ సిబ్బందితో ముందుగా సర్వే నిర్వహిస్తారు. బాధిత కార్మికుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం నష్టపరిహారం మంజూరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ విధమైన సర్వేలో అవకతవకలు జరగడానికి, అలాగే అసలైన కార్మికులకు కాకుండా అనర్హులను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అదే ఈ శ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకుంటే విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో ఎంత మంది ఆసంఘటిత కార్మికులు ఉన్నారన్న విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఉంటే కార్మికులు ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చు. ఈ గుర్తింపు కార్డు దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. ఈ శ్రమ్ కార్డు అంటే... ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆధార్ నంబర్లా దేశ వ్యాప్తంగా కార్మికుడికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 12 అంకెల నంబర్‌తో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే కార్మికుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. మెరుగైన ఉపాధి అవకాశాలకు నైపుణ్యాల అభివృద్ధికి సహాయం లభిస్తుంది. కార్డుతో ప్రయోజనాలు అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది. అంగవైకల్యం పొందితే రూ.లక్ష లభిస్తుంది. నమోదు కావాలంటే... ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు సమీప మీ సేవ, సీఎస్సీ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికులు/నామిని ఖాతాకు జమ అవుతుంది. మరిన్ని వివరాలకు జిల్లా ఉప కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అసంఘటిత కార్మికులంటే ఎవరు? ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, ఇళ్లల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి కార్మికులు, వలస కార్మికులు, డొమెస్టిక్, అగ్రికల్చర్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, ఆశ వర్కర్లు, అంగనవాడీ వర్కర్లు, మత్స్యకార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, ట్యూషన్ టీచర్లు, చేతి వృత్తుల వారు, కార్పెంటర్లు, ప్లంబర్స్ ఇలా చాలా రకాల పనులు చేసే కార్మికులు అసంఘటిత రంగంలోకి వస్తారు. (చదవండి: గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్) -
Russia-Ukraine war: ఉక్రెయిన్ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అంతేగాక రష్యాకు కనీవినీ ఎరగని స్థాయిలో నష్టాలు కలిగించింది. అగ్రరాజ్యం అమెరికా పుష్కలంగా అందిస్తున్న అండదండలే ఇందుకు చాలావరకు కారణం. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకున్నా ఉక్రెయిన్‌కు భారీగా సాయుధ సాయం చేస్తోంది. ప్రధానంగా యూఎస్ నుంచి వస్తున్న ఆయుధాలతోనే రష్యా దాడులను ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఈ రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు అమెరికా ఏకంగా 340 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేసింది. ఎనిమిదో విడత సాయంగా తాజాగా మరో 80 లక్షల డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించింది. వాటికి తోడు ఇంకా భారీగా ఆయుధాలను పంపుతోంది. ► రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అమెరికా పంపిన జావెలిన్ క్షిపణులు. సులువుగా భుజం మీద మోసుకెళ్లగలిగే ఈ పోర్టబుల్ క్షిపణుల సాయంతో పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించవచ్చు. ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 6,000 జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను సరఫరా చేసింది. ఇవే రష్యా సైన్యానికి పెను సవాలుగా మారాయి. ► 1,44,000 రౌండ్లను కాల్చే సామర్థ్యమున్న డజన్ల కొద్దీ అత్యాధునిక శతఘ్నులను కూడా అమెరికా అందజేసింది. ► అఫ్గానిస్తాన్ యుద్ధంలో వాడిన మరెన్నో అత్యాధునిక రైఫిల్స్, 3 వేలకుపైగా బాడీ ఆర్మర్ సెట్స్, హెలికాఫ్టర్లు, రాడార్ వ్యవస్థలు, సాయుధ వాహనాలను కూడా భారీగా పంపింది. ► వందల సంఖ్యలో 200 ఎం113 సాయుధ వాహనాలను సమకూర్చింది. 90 శతఘ్ని విధ్వంసక వ్యవస్థలను కూడా ఇచ్చింది. దాంతో ఉక్రెయిన్‌కు రష్యా హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం సమకూరింది. ► రష్యా శతఘ్నల్ని ఎదుర్కోనేలా 10 రాడార్ వ్యవస్థలను కూడా పంపింది. ► అత్యాధునిక ఎంఐ–17 హెలికాప్టర్లను పంపేందుకు కూడా అమెరికా సన్నాహాలు చేస్తోంది. ► 4 కోట్ల రౌండ్ల చిన్న మారణాయుధాలు, భారీగా అత్యాధునిక రైఫిల్స్, పిస్టల్స్, మిషన్ గన్లు, షాట్ గన్స్, 10 లక్షలకు పైగా గ్రెనేడ్లు ఈ 2 నెలల్లో యూఎస్ నుంచి అందాయి. ► తూర్పున డోన్బాస్లో రష్యా దాడుల్ని ముమ్మరం చేస్తూండటంతో ఉక్రెయిన్ అవసరాలకు తగ్గట్టుగా అమెరికా వాయుసేన ప్రత్యేకంగా తయారు చేసిన 121 డ్రోన్లను తాజాగా పంపినట్టుగా పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. వీటి వాడకంలో శిక్షణ ఇవ్వడానికి డా ఒక బృందం ఉక్రెయిన్‌కి వెళ్తోంది కూడా. మరో 300 స్విచ్ బ్లేడ్ డ్రోన్లు కూడా ఇప్పటికే కీవ్ చేరుకున్నాయి. మరిన్ని డ్రోన్లు పంపేందుకు కూడా యూఎస్ సిద్ధమవుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
మంత్రి హరీశ్ ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీట్లు సాధించినా.. రుసుము కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేయూత అందించారు. ములుగు జిల్లాకు చెందిన షేక్ షబ్బీర్ తన ఇద్దరు పిల్లలు వైద్యులు కావాలని తపించారు. కానీ గత ఏడాది కరోనాతో ఆయన మరణించారు. అయినా పిల్లలు షేక్ షోయబ్, సానియా ఆత్మ విశ్వాసంతో తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కష్టపడి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. సానియాకు కాకతీయ మెడికల్ కాలేజీలో, షోయబ్‌కు రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. కానీ పిల్లలిద్దరినీ చదివించే స్తోమత లేకపోవడంతో తల్లి జహీరాబేగం దాతలను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అన్నా చెల్లెళ్ల వైద్య విద్య కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జహీరా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుదలతో సీట్లు సాధించినందుకు అభినందిస్తూ.. మంచి వైద్యులై పేదలకు సేవ చేయాలని షోయబ్, సానియాలకు సూచించారు. -
Russia-Ukraine war: తూర్పున తాడోపేడో
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరింది. తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణాయక యుద్ధానికి తెర లేస్తోంది. 47 రోజుల పై చిలుకు యుద్ధంలో రాజధాని కీవ్ సహా దేశంలో ఏ కీలక ప్రాంతాన్నీ ఆక్రమించలేకపోయిన రష్యా, డోన్బాస్ ప్రాంతంపై ఎలాగైనా పూర్తి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు అక్కడ కూడా రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులూ కూడదీసుకుంటోంది. కొత్త జనరల్ అలెగ్జాండర్ ద్వొర్నికోవ్ సారథ్యంలో డోన్బాస్‌పై భీకర దాడులకు రష్యా సైన్యం ఇప్పటికే తెర తీసింది. వాటిని ఒకట్రెండు రోజులుగా ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతోందని ఇంగ్లండ్ పేర్కొంది. ఈ క్రమంలో డోన్బాస్లోనూ రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను, సాయుధ వాహనాలను నష్టపోయిందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది వారాలు అత్యంత కీలకమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమకు మరింత సాయుధ, ఆర్థిక సాయం చేయాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు కావాల్సిన సాయుధ సంపత్తి జాబితాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇప్పటికే ఇచ్చాం. అవి అందజేసి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఆయన ముందుంది’’ అన్నారు. భారీగా పౌర మరణాలు ఉక్రెయిన్ కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్టు రష్యా సోమవారం ప్రకటించింది. దింప్రో నగర శివార్లలో నాలుగు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్లను క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. దాడుల్లో 25 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు మరణించారన్నారు. ఒక్క మారియుపోల్‌లోనే ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా అమాయక పౌరులు మరణించారని నగర మేయర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై ఈయూ చర్చలు ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం, మరింత సాయంపై ఈయూ విదేశాంగ మంత్రులు సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మామూలుగా ఏళ్లూ పూళ్లూ పట్టే సభ్యత్వ ప్రక్రియను కొద్ది వారాల్లోపే తేల్చేస్తామని ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొండొర్ లెయన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈయూలో మాల్డోవాకు సభ్యత్వంపైనా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు ఇప్పుడు విదేశీ మద్దతు మరింతగా కావాలని జర్మనీ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు. -
పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. ప్రతీ ఉద్యోగికి రూ.74 వేలు ఇచ్చిన యజమాని
కరోనా కాటుకు ప్రపంచంలోని అనేక దేశాలు నెమ్మదిగా ద్రవ్యోల్బణం అంచుల్లోకి చేరుకుంటున్నాయి. వరుసగా పెట్రోలు, ఎలక్ట్రిసిటి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా జీతాలు పెరగక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అయితే వీళ్ల కష్టాలు చూడలేని ఓ కంపెనీ యజమాని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌కి చెందిన ఎమెరీస్ టింబర్ అండ్ బిల్డర్ మర్చంట్స్ కంపెనీ యజమాని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, పెట్రోలు పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో, ఆ ఖర్చులకు తట్టుకునేలా ప్రతీ ఉద్యోగికి జీతంతో పాటు అదనంగా 750 యూరోలు (సుమారు రూ. 74,251) అందించాడు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ హిప్కిన్స్. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. Due to rising costs of fuel/petrol and electricity/gas, we have decided to pay £750 to EVERY Emerys employee ✅ We hope this goes a long way to help our team during an unsettled financial time Much like a family, Emerys takes care of each other during difficult times! 🙌🏼 pic.twitter.com/WK3qeooH55 — Emerys Timber and Builders Merchants (@emerysltd) March 28, 2022 వ్యక్తిగతంగానే పెరుగుతున్న ధరల కారణంగా ఎమెరీస్ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతోనే ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు అందించే సాయం మొత్తాన్ని కంపెనీ ఖాతా నుంచి కాకుండా ఎండీ జేమ్స్ హిప్కిన్స్ తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు. దీని కోసం ఆయన 45 వేల యూరోలు (సుమారు రూ. 44 లక్షలు) కేటాయించారు. ఎమెరీస్ కంపెనీలో 60 మంది ఉద్యోగులు ఉన్నారు. అండగా ఉంటా వరుసగా కొన్ని రోజులుగా పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయి. గతంలో ఫ్యూయల్ కోసం 40 యూరోలు ఖర్చయ్యే చోట ఇప్పుడది 60 యూరోలుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరగవచ్చంటూ అనేక నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ఫ్యూయల్ మాత్రమే కాదు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కంపెనీ ఉద్యోగులకు అండగా నిలవాలని అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని జేమ్స్ హిప్కిన్స్ తెలిపారు. సరికొత్త చర్చ ఎమెరీస్ కంపెనీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒపెక్ దేశాల ఒంటెద్దు పోకడలకు తోడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎమెరీస్ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తూ సరికొత్త చర్చకు తెర తీసింది. అంతటా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 6.2 శాతంగా నమోదు అయ్యింది. దీంతో అక్కడ పెట్రోలు, గ్యాస్, ఎలక్ట్రిసిటీతో సహా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఇక్క ఇంగ్లండ్‌లోనే కాదు అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్నాయి. మన దేశంలో గడిచిన రెండేళ్లలో లీటరు పెట్రోలు/డీజిల్ ధర రూ.40 వరకు పెరిగింది. చదవండి: పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్.. గ్యాప్ లేకుండా బాదుతున్న చమురు సంస్థలు -
మరో ఇద్దరు విద్యార్థులకు కేటీఆర్ ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: చదువు, క్రీడల్లో రాణిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అంతర్జాతీయ హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి కరీనాకు, ఐఐటి గౌహతిలో సీట్ సాధించిన హైదరాబాద్ విద్యార్థి మణిదీప్‌కు మంగళవారం కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్‌లోనూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
12 లక్షల మందికి ఉచిత ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సుల ద్వారా సాఫ్ట్వేర్, ఇతర ఐటీ ఆధారిత అంశాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ 12 లక్షల మంది విద్యార్థులకు నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్) పోర్టల్ ద్వారా ఆర్థిక సాయం అందించనుంది. విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ రంగంలో నైపుణ్యం, నిర్వాహక (అడ్మినిస్ట్రేటివ్) వ్యవహారాలు మొదలైన వాటిలో నైపుణ్యాన్ని సాధించేలా చేయడం ఈ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సుల లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. కృత్రిమ మేధస్సును (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ఆయా కోర్సులకు ఎంపిక చేస్తారు. ఎడ్టెక్ కంపెనీల భాగస్వామ్యంతో శిక్షణ ఇందుకోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ద్వారా వివిధ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోనుంది. అనేక పరిమితుల ఆధారంగా వీటిని కౌన్సిల్ ఎంపిక చేసింది. నీట్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అయిన అభ్యర్థుల నుంచి ఈ ఏడాదికి సంబంధించి శిక్షణ కోసం ఎంపిక ప్రక్రియ ఇటీవలే ఏఐసీటీఈ ప్రారంభించింది. ఎడ్ టెక్ కంపెనీలు సర్టిఫికేషన్ కోర్సులు, సైకోమెట్రిక్ పరీక్షలు, అసెస్మెంట్ టెస్ట్‌లు, లేబొరేటరీ టూల్స్, ఇంటర్న్‌షిప్ సపోర్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు, కాగ్నిటివ్ స్కిల్స్, మార్కెటింగ్ నైపుణ్యాలు, ప్లేస్మెంట్ సపోర్ట్, ఇంటర్న్‌షిప్ సపోర్ట్, మేనేజ్మెంట్, అకౌంట్, ఫైనాన్స్ వంటి ఈ–కంటెంట్లను అందిస్తాయి. -
అఫ్గన్లకు ఇక మంచిరోజులు!
అఫ్గన్ పౌరులకు మంచిరోజులు మొదలయ్యాయి!. చరిత్రలో మునుపెన్నడూ చూడలేనంత దీనస్థితిని ఒక దేశం ఎదుర్కొనుందన్న విశ్లేషణలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్ నేలకు సాయం అందించేందుకు అగ్ర రాజ్యంతో పాటు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు ఆహార, ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేసేందుకు భారీ విరాళాల కోసం ఐక్యరాజ్య సమితి ప్రణాళిక రచించింది. తాజాగా అమెరికా 308 మిలియన్ డాలర్ల (రెండువేల కోట్ల రూపాయలకు పైనే) తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆశ్రయం, ఆరోగ్య భద్రత, చలికాల పరిస్థితుల నేపథ్యంలో సాయం, అత్యవసర ఆహార సాయం, మంచి నీరు, శానిటేషన్, శుభ్రత సర్వీసులు తదితరాల కోసం ఈ భారీ సాయం వినియోగించనున్నట్లు, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోనున్నట్లు వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మానవతా ధృక్పథంతో అమెరికా అందించిన సాయం(గత అక్టోబర్ నుంచి) ఇప్పటిదాకా 782 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు 27 దేశాలు అఫ్గన్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి కూడా. గతంలో అఫ్గన్ బడ్జెట్ 80 శాతం విదేశీ నిధుల ద్వారానే సమకూరేది. అయితే తాలిబన్ల రాకతో ఎక్కడిక్కడే నిధులు ఆగిపోయాయి. పైగా అఫ్గన్‌కు చెందిన అకౌంట్లు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల తాలిబన్ల పాలనలో అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ గాడితప్పి సంక్షోభం దిశగా అడుగులు పడ్డాయి. ఒకానొక టైంలో కరెన్సీ కొరత కారణంగా వస్తు మార్పిడి విధానం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఒకవైపు ఆహార కొతర, మరోవైపు ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాలంటూ అమెరికాతో సహా అన్ని దేశాలకు తాలిబన్ ప్రభుత్వం పిలుపు ఇవ్వగా.. అనూహ్యమైన స్పందన లభిస్తోంది. యూఎన్ భారీ ప్రణాళిక సాయం కోసం చూస్తున్న కోట్ల మంది అఫ్గన్ పౌరుల ముఖం తలుపులు వేయొద్దంటూ యూఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిథ్స్ ప్రపంచానికి పిలుపు ఇచ్చారు. అఫ్గనిస్థాన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే 2022 ఒక్క ఏడాదిలోనే 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో ఉన్న పౌరుల కోసం 4.4 బిలియన్ డాలర్లు, సరిహద్దుల అవతల ఆశ్రయం పొందుతున్న పౌరుల కోసం 623 మిలియన్ డాలర్లు అవసరం పడొచ్చని యూఎన్ భావిస్తోంది. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి ఒక దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున్న సాయం కోసం ప్రపంచానికి పిలుపు ఇవ్వడం ఇదే మొదటిసారి. పాక్ సహకరించకున్నా.. ఇదిలా ఉంటే అఫ్గనిస్థాన్‌కు సాయం అందించే విషయంలో భారత్ ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గత ఆగష్టు నుంచి ఆహార ఉత్పత్తులతో పాటు మందులను సైతం పంపించింది. కిందటి నెలలో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్లను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి మందుల్ని సరఫరా చేసింది. మరోవైపు ఆహార కొరత నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం యాభై వేల టన్నుల గోధుమల్ని పంపించింది భారత్. ముందుగా పాక్ మార్గం గుండా వెళ్లాల్సి ఉండగా.. అఫ్గన్‌తో సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్‌తో భారత్ ప్రభుత్వం సంప్రదింపులు సైతం జరపగా.. లాభం లేకుండా పోయింది. అ తరుణంలో అనూహ్యంగా ఇరాన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. తమ గుండా సరుకుల్ని,మందుల్ని అఫ్గన్‌ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదవండి: అఫ్గన్‌పై అమెరికా కొర్రిలు.. తలవంచిన తాలిబన్ ప్రభుత్వం -
డెలివరీబాయ్ దుర్మరణం.. జొమాటో స్పందన ఇది
ఫుడ్, గ్రాసెసరీస్, రైడ్.. ఇలాంటి సేవలందించే గిగ్ ఎంప్లాయిస్ పడే కష్టాలు, ఇతరత్ర ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితుల్లోనూ అందించే సేవల గురించి తరచూ చూస్తుంటాం. అఫ్కోర్స్.. నాణేనికి రెండో వైపు మాదిరి ఇక్కడా సిన్సియారిటీ లేనివాళ్లూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ.. కంపెనీల నుంచి వాళ్లకు అందే సాయం, తోడ్పాటు విషయంలో మాత్రం విమర్శలే వినిపిస్తుంటాయి. కానీ, తాజాగా జొమాటో చేసిన ఓ ప్రకటనపై ఇంటర్నెట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ జొమాటో డెలివరీబాయ్ విధుల్లో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోగా.. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది జొమాటో. ‘విధి నిర్వహణలో మా ఎగ్జిక్యూటివ్స్ పడే కష్టం ఏంటో మాకు మాత్రమే తెలుసు. అది అభినందనీయం. కానీ, సకాలంలో అందించాలనే తొందరలో మీరు (డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ను ఉద్దేశించి) ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మీకుటుంబాల గురించి కూడా కాస్త ఆలోచించండి’ అంటూ ఢిల్లీ జొమాటో ప్రతినిధి ఒకరు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీబాయ్ సలిల్ త్రిపాఠి కుటుంబానికి తోడుగా నిలుస్తామని పేర్కొన్నారు.ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బాధితుడి పేరు సలిల్ త్రిపాఠి. ఢిల్లీ రోహిణి ఏరియాలో ఉంటోంది అతని కుటుంబం. సలిల్ తండ్రి కరోనాతో ఈమధ్యే చనిపోయాడు. దీంతో కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యాడు సలిల్. జొమాటోలో డెలివరీబాయ్‌గా అతను సంపాదించిన దాంతోనే ఆ కుటుంబం గడుస్తోంది. శనివారం రాత్రి బుధ్ విహార్‌లో డెలివరీ కోసం వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సలిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ మహేంద్ర.. ఆ సమయంలో తప్పతాగి ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 50 లక్షలకు పైగా ఉన్న ఇండియన్ గిగ్ సెక్టార్లో.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లను ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఫెయిర్‌వర్క్2021 లిస్ట్ జాబితా ఈమధ్యే విడుదలైన విషయం తెలిసిందే. ఈ విషయంలో జొమాటో గతంతో పోలిస్తే.. ఉద్యోగుల కోసం మెరుగ్గా ఆలోచిస్తోందని (ఒకటి నుంచి 3 పాయింట్లకు చేరుకుంది) వెల్లడైంది. చదవండి: ఓలా, ఉబెర్.. కనీసం మనుషుల్లా చూడట్లేదా? -
ఎట్టకేలకు దిగొచ్చిన తాలిబన్లు!
Afghan Taliban Govt Needs US Help: దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతూ.. జనజీవనం ఆకలి కేకల దుస్థితికి చేరుకున్న తరుణంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల కొర్రిల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. అఫ్గన్ నేలపై ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. వరుసగా అమెరికా, పొరుగు దేశాల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. అయితే ప్రతీ చర్చలో తమ ఆధిపత్యమే ప్రదర్శిస్తూ.. ఫలితంపై ఎటూ తేల్చకుండా వస్తున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాయం కావాలి ఆడపిల్లలకు విద్యను అందించడం, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి స్పష్టం చేశారు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల సాయం తమకు అవసరం ఉందని ఆదివారం ది అసోషియేట్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేస్తుంటారు. కానీ, మేం అధికారం చేపట్టేనాటికే అఫ్గన్ ఆర్థికం ఘోరంగా ఉంది. గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారు. పైగా అఫ్గన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు. అమెరికాతో మాకెలాంటి సమస్యలు లేవు. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. ..అఫ్గన్‌కు సంబంధించి 10 బిలియన్ డాలర్ల ఫండ్ నిలిచిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అది విడుదలయ్యేందుకు అన్నీ దేశాలు మాకు సహకరిస్తాయని భావిస్తున్నాం. అఫ్గన్‌పై ఆంక్షలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగించవు. అఫ్గన్ అస్థిరత, ఒక దేశ ప్రభుత్వాన్ని బలహీనపర్చడం ఏదో ఒక దేశం ఆసక్తి మీద ఆధారపడి ఉండదని గమనించాలి. అఫ్గన్ కోలుకోవడానికి సాయం అందించాలి’’ అని అంతర్జాతీయ సమాజానికి ముట్టాఖి విజ్ఞప్తి చేశాడు. ఇక తాలిబన్ల పాలనలో ఆడపిల్లలు, మహిళల అణచివేత కొనసాగుతోందన్న కథనాలను కొట్టిపారేసిన ముట్టాఖీ.. మత చట్టంలో కొన్ని సవరణలకు, వాటిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. గతంలోనూ తాము సవరణలు చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారాయన. ‘‘ముందు ప్రపంచం మాతో కలవాలి. మేం వాళ్లతో కలవాలి. అప్పుడే కదా మాకు బయటి ప్రపంచం గురించి తెలిసేది. ఎలాంటి సడలింపులు ఇవ్వాలో తెలిసేది’’ అని వ్యాఖ్యానించారాయన. చదవండి: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు తప్పులు ఒప్పుకుంటున్నాం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ(తాలిబన్) ప్రభుత్వం తప్పులు చేసిందని ముట్టాఖీ అంగీకరించారు. అయితే వాటి గురించి చర్చించకుండా.. సంస్కరణల గురించి, సంక్షోభం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారాయన. అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో.. మేం మాట నిలబెట్టుకున్నాం. నాటో, అమెరికా దళాలపై ఎటువంటి దాడులు చేయలేదు. దురదృష్టవశాత్తూ ఐసిస్ చేసిన దాడుల్ని మేం చేసినట్లుగా అనుమానించారు. ఆపై మా నిజాయితీ నిరూపించుకున్నాం. ప్రతీకార దాడుల కథనాలు కూడా ఊహాగానాలే!. ఏదిఏమైనా శాంతి భద్రతల స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనకు కట్టుబడి ఉంటాం. ముందు ముందు కూడా అదే ఆచరిస్తాం. అందుకు అఫ్గన్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత అమెరికా లాంటి అగ్రరాజ్యం పై ఉందని ఆయన పేర్కొన్నారాయన. ‘‘అమెరికా సంయుక్త బలగాల ఉపసంహరణ తర్వాత అప్గన్.. దారుణంగా దెబ్బతింది. అది కోలుకోవాలంటే తిరిగి అమెరికా చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా గొప్ప దేశం కాబట్టి. పొరపచ్చాలను పక్కనపెట్టి అమెరికాతో మా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే అప్గన్నిస్థాన్ బాగుపడేది అని ఆశాబావం వ్యక్తం చేశారాయన. అయితే ఐసిస్ వ్యతిరేక పోరాటంలో అమెరికాకు మద్ధతుగా నిలుస్తారా? అనే ప్రశ్నకు మాత్రం అమిర్ ఖాన్ దాటవేత ధోరణి ప్రదర్శించడం కొసమెరుపు. చదవండి: పెళ్లిళ్లపై తాలిబన్ల సంచలన నిర్ణయం.. -
సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు
కురబలకోట: అమర జవాన్ బి.సాయితేజ బిడ్డలు మోక్షజ్ఞ, దర్శిని చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. గురువారం ఆయన పీఏ సతీశ్ కురబలకోట మండలంలోని రేగడపల్లెకు వచ్చారు. సాయితేజ భార్య శ్యామలను మంచు విష్ణుతో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ సాయితేజ బిడ్డల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటామని, శ్రీవిద్యా నికేతన్‌లో ఎందాకైనా చదివిస్తామని చెప్పారు. -
మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు ఇవ్వండి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, తిరుపతి: వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు గురైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 10.32 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి.. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్ విజయరామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్‌కుమార్‌లు వైఎస్సార్ జిల్లాలో పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇరు జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టులో చిత్తూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉదారంగా వ్యవహరించండి ► వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఉదారంగా ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల సాయం అందజేయాలి. ఊహించని వరదలతో పంటలు, పంట పొలాలు, ఇళ్లు నష్టపోయిన వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► చెయ్యేరు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే కాకుండా ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. ► అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయాలి. కడప నగరంలో బుగ్గవంక పరిధిలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. కడప నగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు రూ.68 కోట్లతో స్వామ్ వాటర్ డ్రైయిన్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యుత్, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి. ► వివిధ మునిసిపాల్టీల నుంచి ఇప్పటికే రప్పించిన 500 మంది సిబ్బందితో కలిసి తిరుపతి పట్టణంలో వెంటనే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలి. ► తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలి. శిబిరాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలి. ► ఈ పర్యటనలో హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వెంట వచ్చారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వరద ప్రభావిత ప్రాంతం ఏరియల్ వ్యూ సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రాంతాలు ► బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాలు. ► పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు. ► వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు, ముంపునకు గురైన గ్రామాలు. ► పింఛ ప్రాజెక్టు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు. ► రేణిగుంట, తిరుపతి, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాలు. -
భూలక్ష్మీ, దుర్గ.. అయ్యో! వీళ్లకు ఎంత కష్టం వచ్చి పడింది
నా పేరు దుర్గ. చిన్న వయస్సులోనే పెళ్లి అయ్యింది. నా మొగుడు పచ్చి తాగుబోతు. ఏ పని చేయకుండా ఇంట్లో ఉండటమే కాదు, నేను పని చేస్తే వచ్చిన కొద్ది డబ్బులు కూడా తాగుడుకే తగలేసేవాడు. ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇళ్లో నరకంలా మారింది. కానీ ఇన్ని కష్టాల్లో నాకు ఏ కొంత సంతోషమైనా ఉందంటే అది నా కూతురు భూలక్ష్మిని చూస్తే కలిగేది. తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంత కష్టమైనా సరే భరించాలి అనిపించేంది. భూలక్ష్మీ చదువు కోసం పక్కన పెట్టిన డబ్బులు కూడా తాగడానికి వాడుకోవడంతో నా భర్తను గట్టిగా నిలదీశాను. మళ్లీ గొడవైంది. ‘నువ్వు వద్దు, నీ కూతురు వద్దూ’ అంటూ నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి పాపే లోకంగా బతుకుతున్నాను. తను కూడా అంతే ఈ అమ్మ కష్టాలను అర్థం చేసుకుని మెలిగేది. తనని చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చేది. కొండంత కష్టాల మధ్య ఓదార్పు లభించేది. ఓ రోజు పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఇంట్లో స్పృహ లేకుండా భూలక్ష్మీ పడిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇరుగుపొరుగు సాయంతో వెంటనే దగ్గర్లోని క్లినిక్‌కి తీసుకుపోయాను. వాళ్లు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. భూలక్ష్మీ చదువు కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాను.. చివరకు అప్లాస్టిక్ ఎనిమీయా అనే ప్రాణాంతక క్యాన్సర్‌గా తేల్చారు. ఈ భయంకరమైన క్యాన్సర్ వల్ల భూలక్ష్మీకి ఎప్పటికప్పుడు రక్తం మార్పిడి చేయాల్సి వస్తోంది. ఏడాదిగా ఖర్చు గురించి ఆలోచించకుండా రక్తమార్పిడి చేయిస్తున్నాను, అయితే ఈ ఖర్చుల కోసం ఉన్న ఇంటిని, కొద్దొగొప్పొ ఉన్న పొలం అమ్మేశాను. అవి అమ్మగా వచ్చిన రూ.16 లక్షలు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. ఇప్పటికీ నా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు అప్లాస్టిక్ ఏనిమీయా క్యాన్సర్ చికిత్సకు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ ఖర్చు రూ. 30 లక్షలు అవుతుందన్నారు. బాధ్యత లేని భర్తతో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒకప్పుడు ఆసరాగా ఉన్న ఇళ్లు, పొలం కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. భూలక్ష్మీ ఆస్పత్రిలో ఉంటే నేను బయట వరండాలో ఉంటున్నాను. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలని, ఆపరేషన్ చేయించాలని తెలిసినవారందరినీ ప్రాథేయపడ్డాను. చివరకు మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. నా భూలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. నా చిట్టి తల్లిని బతికించండి. సాయం చేయాలనుకునే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు చావాలని లేదు, పోరాడాలని ఉంది.. కానీ
నా పేరు యశ్వంత్. మాది విజయవాడ. పదేళ్ల పిల్లలాగే స్నేహితులతో ఆడుకోవడమంటే ఇష్టం. అయితే గత మేలో జ్వరం వచ్చింది,. అప్పటి నుంచి స్నేహితులతో ఆడుకోవడానికి నాకు వీలుపడటం లేదు. ఇక ముందు కూడా నేను ఆడుకోలేను కావొచ్చు. ఈ ఏడాది వేసవిలో వరుసగా పదిహేను రోజుల పాటు జ్వరం వచ్చింది. ఆ తర్వాత వాంతులు కూడా మొదలయ్యాయి. ఏదీ తిన్నా క్షణాల్లో బయటకి వచ్చేది. దీంత అమ్మానాన్నా భయపడ్డారు. నన్ను పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రకరకాల పరీక్షలు చేశారు. సిరంజీలతో రక్తం తీసుకున్నారు. ల్యాబ్‌లకు పంపించారు. చివరకు నాకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ ఉందంటూ అమ్మానాన్నలకు డాక్టర్లు చెప్పారు. అదేం రోగమో నాతో పాటు అమ్మాన్నాలకు ముందుగా అర్థం కాలేదు. చివరకు అదో రకరమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగైనా నన్ను బతికించుకోవాలని మా అమ్మానాన్న ఆరాటపడ్డారు. రకరకాల పరీక్షలు చేయించారు. మెడిసిన్స్ ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా శరీరం ఇంకా బలహీనమైపోయింది. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నడవలేని స్థితికి చేరుకున్నాను. చివరకు మందులతో లాభం లేదని డాక్టర్లు తేల్చారు. నా ఆరోగ్యం మెరుగుపడాలంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయి, బతుకుపై ఆశ వదిలేసుకున్న నాకు, అమ్మానాన్నలకు ఆ మాట వరంలా అనిపించింది. కానీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి దాదాపు రూ.20 లక్షల ఖర్చు అవుతుంది. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మానాన్న రోజువారి కూలీ. నెలంతా కష్టపడితే రూ.6000లకు మించి రాదు. ఇప్పటికే నా ఆస్పత్రి ఖర్చుల కోసమని వాళ్లిద్దరు ఉన్నదంతా అమ్మేశారు. అయినకాడికి అప్పులు తెచ్చారు. నన్ను బతికించుకునేందుకు వాళ్లు చేయాల్సిందంతా చేశారు. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి అవసరమైన డబ్బులను నా తల్లిదండ్రులు సర్థుబాటు చేసే పరిస్థితి లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మీరు సాయం చేస్తే ఆపరేషన్‌కి అవసరమైన డబ్బు సర్థుబాటు అవుతుంది. నా ప్రాణాలు నిలబడతాయి. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మాయదారి క్యాన్సర్‌తో రోజురోజుకి నా ఆరోణ్యం క్షీణిస్తోంది. ఒంట్లో శక్తి లేకుండా తగ్గిపోతుంది. కానీ నాకు బతకాలని ఉంది. స్నేహితులతో ఆడుకోవాలని ఉంది. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, మా అమ్మానాన్నలని మంచిగా చూసుకోవాలని ఉంది. అది జరగాలంటే మీ సహకారం అవసరం. నా ఆపరేషన్‌కి మీవంతు సాయం చేయండి. నా ప్రాణాలు కాపాడండి. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆర్థిక ఇబ్బందులు, తరచూ భార్యతో గొడవలు.. పొద్దున్న తలుపు తెరచి చూస్తే..
సాక్షి,రాజేంద్రనగర్( హైదరాబాద్ ): సెల్ఫీ వీడియో తీసుకోని ఓ ఫోటోగ్రాఫర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(30) కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీనికి తోడు భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకోని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో భార్యతో పాటు బావమరిది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. ఉదయం ఇంట్లో నుంచి చంద్రశేఖర్ బయటకు రాకపోవడంతో స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
అనూషను ఆదుకున్న కేటీఆర్.. ‘డాక్టర్‌గా తిరిగి రా’..!
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపధ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. (చదవండి: వైద్య విద్యార్థిని అవస్థలు .. శ్మశానంలో ‘డాక్టర్’ చదువు) పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అనూష వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్‌గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని బుధవారం కేటీఆర్ ప్రకటించారు. (చదవండి: కేటీఆర్ వాహనానికి చలాన్.. ట్రాఫిక్ ఎస్ఐని అభినందించిన మంత్రి) అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని.. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని కేటీఆర్ కోరుకున్నారు.. ఈ సందర్భంగా అనూషకి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: కేటీఆర్ మెచ్చిన ‘పేపర్ బాయ్’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా? -
ఆర్టీసీ సురక్ష ఆగింది
సాక్షి, హైదరాబాద్: ఈ ఇద్దరి మృతి మధ్య పక్షం రోజులే తేడా. కానీ ఒకరికి బీమా సాయం అందితే, మరొకరికి అందకపోవటానికి ఆర్టీసీ నిర్వాకమే ప్రధాన కారణం. నర్సయ్య కుటుంబానికే కాదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ముందు కూడా ఉద్యోగులెవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు బీమా సాయం అందే పరిస్థితి లేదు. రూ.5 లక్షల చేయూతనందించేలా రైతు బీమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం కంటే దాదాపు ఏడాది ముందుగానే ఆర్టీసీలో పథకం ప్రారంభమైంది. ఇప్పటివరకు 1,100 ఆర్టీసీ కుటుంబాలకు అండగా నిలిచింది. ఇప్పుడా పథకం ఆగిపోయింది. దీనిపై ఉద్యోగులు, పథకం నిలిచిపోవడంతో సాయం అందకుండా పోయిన కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అండగా నిలిచిన సురక్ష ఆర్టీసీ సహకార పరపతి సంఘం 2017లో సురక్ష పేరుతో బీమా పథకం అమలులోకి తెచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7% సంఘానికి జమ చేయటం ద్వారా సమకూరిన సీసీఎస్ నిధిని బ్యాంకులో డిపాజిట్ చేయటం ద్వారా వడ్డీ వచ్చేది. ఆ క్రమంలోనే బీమా పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో ఉద్యోగికి సాలీనా రూ.1,500 ప్రీమియం చెల్లిస్తే.. ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి బీమాసంస్థ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఉద్యోగుల నుంచి పైసా వసూలు చేయకుండా ఈ పథకం ప్రారంభమైంది. ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థకు ప్రీమియంగా రూ.7.5 కోట్లు చెల్లించగా.. ఆ ఏడాది 220 మంది ఉద్యోగులు చనిపోవటంతో సదరు సంస్థ ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.11 కోట్లు చెల్లించింది. ఇలా వేర్వేరు బీమా సంస్థలు 1,100 కుటుంబాలను ఆదుకున్నాయి. ఏటా జూన్ ఆఖరుతో బీమా ఒప్పందం ముగిసేది. గతేడాది వారం ఆలస్యంగా ఒప్పందం జరగటంతో, గత జూలై ఏడు వరకు పథకం కొనసాగింది. కోవిడ్ వల్ల ఎక్కువమంది చనిపోగా రూ.2,750 ప్రీమియంతో ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థ జూలై ఏడు వరకు చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. సీసీఎస్ వద్ద నయాపైసా లేక.. జూలై ఏడుతో పథకం ముగిసిపోగా, అది కొనసాగేందుకు మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే సీసీఎస్ వద్ద నయా పైసా నిల్వ లేకుండా పోయింది. డబ్బులన్నీ ఆర్టీసీ వాడేసుకోవటమే దీనికి కారణం. రూ.1,000 కోట్లకు పైగా ఏర్పడ్డ బకాయిలను ఆర్టీసీ చెల్లించకపోగా ప్రతినెలా ఇచ్చే మొత్తాన్ని ఇవ్వటం మానేయటంతో సీసీఎస్ పూర్తిగా దివాలా తీసింది. దీంతో బీమా పథకం ప్రీమియాన్ని చెల్లించే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో ఏ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో జూలై 8 నుంచి చనిపోయిన ఏడుగురు ఉద్యోగుల కుటుంబాలకు బీమా పథకం అందకుండా పోయింది. దీంతో తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ సహకరిస్తేనే.. బీమా ప్రీమియంకు కావల్సిన మొత్తాన్ని సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లిస్తే.. వేలాది మంది అల్పాదాయ కార్మికుల కుటుంబాలకు మళ్లీ బీమా సాయాన్ని పునరుద్ధరించే వీలుంది. లేదంటే ఉద్యోగులే ప్రతినెలా నిర్ధారిత మొత్తాన్ని ప్రీమియం కింద చెల్లించడం ద్వారా ఏర్పడే నిధి నుంచి ఈ సాయం అందేలా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. దీనిపై ఆర్టీసీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పునరుద్ధరిస్తాం సురక్ష మంచి పథకమని దీనిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని సీసీఎస్ కార్యదర్శి మహేష్ చెప్పారు. ఇప్పటికే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా సాయం అందేలా చూస్తామని తెలిపారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పీఎస్ నారాయణ. జనగామ బస్ డిపోలో కండక్టర్. కోవిడ్ బారిన పడి కోలుకున్నట్టే కోలుకుని ఆరోగ్యం విషమించి గత జూన్ 29న చనిపోయారు. ఆ కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)లో బీమా పథకం అమలులో ఉండటంతో వారికి రూ.5 లక్షల సాయం అందింది. ఆ మొత్తం ఆ కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. ఈయన పేరు నర్సయ్య. గోదావరిఖని డిపోలో డ్రైవర్. గత జూలై 14న బస్సు నడుపుతుండగానే గుండెపోటుకు గురయ్యారు. బాధతో విలవిల్లాడుతూనే ప్రమాదం జరక్కుండా బస్సును క్షేమంగా నిలిపి ప్రాణాలు వదిలారు. ఆయనది నిరుపేద కుటుంబం. కానీ ఇన్సూరెన్సు పథకం నుంచి నయాపైసా రాలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. -
అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస
జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు అఫ్గన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. -
గైడ్లకు రూ.లక్ష.. ఆపరేటర్లకు రూ.10 లక్షలు
(గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నవంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, టూర్ గైడ్లకు రూ.లక్ష చొప్పున, ఆపరేటర్ల(సంస్థలు)కు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, రిజిస్ట్రేషన్లు ఉన్న గైడ్లు, ఆపరేటర్లకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నందున, వారిని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని చెప్పారు. మొత్తంగా 10 వేల మంది గైడ్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం ఈశాన్య రాష్ట్రాల మంత్రుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022, జనవరి 1 నుంచి దేశ, విదేశ పర్యాటకుల కోసం దేశంలోని పర్యాటక కేంద్రాలను తెరవాలని భావిస్తున్నామని అన్నారు. అయితే, ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ, హోం, విదేశాంగ ఇతర శాఖల నుంచి ఆమోదం లభించాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికానుందని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, పారాలింపిక్స్ వంటి క్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు సాధించేందుకు మణిపూర్‌లోని ఇంఫాల్ సమీపంలో జాతీయ క్రీడల విశ్వవి ద్యాలయాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నామని మంత్రి వివరించారు. వచ్చే రెండేళ్లలో దేశంలోని వంద విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. -
ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది
Sachin Bansal Biography: ఫ్లిప్‌కార్ట్, ఇండియాలో ఇ కామర్స్‌కి రాచబాటలు వేసిన స్టార్టప్. సచిన్బన్సాల్, బిన్ని బన్సాల్ అనే ఇద్దరు యువ ఇంజనీర్లు స్థాపించిన ఇ కామర్స్ కంపెనీ మన దగ్గర రికార్డులు సృష్టించింది. 2007లో నాలుగు లక్షలతో ప్రారంభిస్తే 2018లో ఆ కంపెనీలో వాటా అమ్మినందుకు ప్రతిఫలంగా సచిన్ బన్సా్ల్కి వన్ బిలియన్ డాలర్లు ప్రతిఫలంగా దక్కాయి. మన కరెన్సీలో అయితే ఏకంగా 73 వేల కోట్ల రూపాయల పైమాటే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ని అమ్మేసిన తర్వాత సచిన్ బన్సాల్ ఏం చేస్తున్నారు? అక్కడ వచ్చని సొమ్మును ఎలా వెచ్చిస్తున్నారు? సమస్య నుంచే పుట్టిందే ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివేప్పుడు అవసమైర పుస్తకాల కోసం బుక్‌స్టోర్స్ గాలించే వాడు సచిన్ బన్సాల్, ఒక్కో పుస్తకం ఒక్కో షాపులో దొరికేది. కొన్ని పుస్లకాల కోసం నగరంలోని మార్కెట్లను జల్లెడ పట్టాల్సి వచ్చేది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి పక్క ఊరి నుంచి కూడా పుస్తకాలు తెప్పించుకునే వాడు. తాను పడ్డ ఇబ్బందులకు పరిష్కార మార్గం ఆలోచించే పనిలో పుట్టిందే ఫ్లిప్‌కార్ట్. పుస్తకాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఒకే చోట అన్ని లభించేలా ఆన్లైన్ బుక్‌స్టోర్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభమైంది. నాలుగు లక్షల పెట్టుబడి ఇండియా ఐటీ సెక్టార్ క్యాపిటల్ బెంగళూరు కేంద్రంగా కేవలం రూ. 4,00,000 పెట్టుబడితో 2007లో ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ తప్పనిసరి యాప్‌గా ఫ్లిప్‌కార్ట్ మారింది. మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలు, చిన్న మున్సిపాలిటీల వరకు ఫ్లిప్‌కార్ట్ సేవలు విస్తరించాయి. చివరకు 2018లో వాల్‌మార్ట్ సంస్థ 16 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చారు సచిన్ బన్సాల్. బ్యాంకులు ఇలా పని చేస్తాయా ! ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్‌గా ఉంటూ టెక్నోక్రాట్‌గా ఎంట్రప్యూనర్‌గా అంత వరకు గడిపిన లైఫ్ ఒకటైతే ఆ తర్వాత మరో లైఫ్ గడపాల్సి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ అమ్మగా వచ్చిన బోలెడంత డబ్బు చేతిలో ఉంది. అప్పటి వరకు తన ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేందుకు సచిన్ బన్సాల్ ఓ పెద్ద బ్యాంక్‌కి చెందిన యాప్‌ని వినియోగించేవాడు. ఆ సమయంలో ఆ యాప్ క్రాష్ అయ్యింది. నాలుగు రోజుల పాటు పని చేయలేదు. ఆర్థిక లావాదేవీలన్నీ నాలుగు రోజుల పాటు నిలిచి పోయాయి. అప్పడే బ్యాంకులు, వాటి పనితీరు, వాటి నిర్వహాణ పద్దతుల మీద సచిన్‌లో ఆలోచన మొదలైంది. ఆరు నెలల పాటు.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు బ్యాంకులు కష్టమర్ల ఎంపిక, లోన్లు ఇచ్చే తీరు, వసూలు చేసే పద్దతిలను జాగ్రత్తగా గమనించాడు. దాదాపుగా అన్ని బ్యాంకులు ఒకే పద్దతిని అనుసరిస్తూ లోన్లు ఇచ్చేప్పుడు విపరీతమైన ఆలస్యం చేస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చాడు. అంతేకాదు అర్హత కలిగిన ఎంతో మందికి బ్యాంకుల ద్వారా లోన్లు పొందడం కష్టంగా ఉందనే విషయం అర్థమైంది. ఇక బ్యాంకుల డిజిటల్ లావాదేవీలు జటిలంగా ఉండటానికి గమనించాడు. నావికి రూపకల్పన సామాన్యుల నుంచి బిజినెస్ టైకూన్ల వరకు అందరి ఆర్థిక వ్యవహరాలు నిర్వర్తించడానికి వీలుగా ఉండేలా నావి పేరుతో డిజిటల్ ఫైనాన్సియల సర్వీసెస్ యాప్‌ని సచిన్ బన్సాల్ రూపకల్పన చేశారు. నావిగేటర్ అనే పదం నుంచి నావిని తీసుకున్నారు. హోం లోన్లు, పర్సనల్ లోన్లతో పాటు హెల్త్ ఇన్సురెన్స్ సేవలను అందివ్వడం నావి ప్రత్యేకత. 20 నిమిషాల్లోనే నావి ద్వారా లోన్లు పొందేందుకు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ, వందల కొద్ది సంతకాలు, పదుల కొద్ది డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఐదు నుంచి 20 నిమిషాల లోపే అన్ని పనులు నావి యాప్ ద్వారా చేసేయోచ్చని ఆ వెంటనే లోన్ పొందవచ్చని సచిన్ చెబుతున్నారు. తమ యాప్‌లోని ఆర్టిఫీషియల ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో పని త్వరగా పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నారు. రికవరీ కూడా అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. వంద కోట్ల మందికి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి నావి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ద్వారా రూ. 4200 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా రూ. 900 కోట్లు రుణాలు ఇచ్చారు. కేవలం మైక్రోఫైనాన్స్లకే రూ.1500 కోట్లు ఇవ్వాలని లక్క్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే నావి బ్యాంకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బ్యాంకులు ప్రధానంగా ఆన్లైన్ వేదికగానే ఎక్కువ పనులు చక్కబెడతాయి. వంద కోట్ల మందికి సేవలు అందివ్వాలన్నదే లక్క్ష్యంగా నావి ముందుకు పోతుంది. భవిష్యత్తు డిజిటల్‌దే ఒకప్పుడు మన దగ్గర ఒక వస్తువు కొనేప్పుడు దాన్ని ముట్టుకుని, గట్టిగా పట్టుకుని సంతృప్తి చెందితేనే కొనే అలావాటు ఉండేది. అలాంటిది ఫ్లిప్‌కార్ట్ రాకతో నెట్లో చూసి నమ్మకంతో వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు. అదే తీరులో నావి కూడా భవిష్యత్తులో ప్రతీ ఒక్కరికి చేరువ అవుతుందనే నమ్మకంతో సచిన్ ఉన్నారు. ఎందుకంటే 5జీ రాకతో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సచిన్ అంటున్నారు. మనీకంట్రోల్ సౌజన్యంతో చదవండి: Alibaba: అత్యాచార బాధితురాలికి అండగా పోస్టులు.. పది మంది ఎంప్లాయిస్ డిస్మిస్ -
ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం, పూర్తి ఆయకట్టుకు నీరివ్వకపోవడం పై గుర్రుగా ఉన్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి 8 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, పనుల పురోగతిపై ఈ నెల 31న సమీక్ష నిర్వహించనుంది. 8 ప్రాజెక్టులు.. 8 నెలలు... రాష్ట్రంలో ఏఐబీపీ కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులు 11 ఉండగా అందులో గొల్లవాగు, రాలివాగు, మత్తడి వాగు పనులు పూర్తయ్యాయి. సుద్దవాగు, పాలెంవాగు, జగన్నా«థ్పూర్, భీమా, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, కొమురం భీం ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులకు రూ.19,500 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.2వేల కోట్లు మేర నిధుల అవసరాలున్నాయి. ఇందులో కేంద్రం సాయం రూ.4,500 కోట్లకుగాను ఇంకా రూ.175 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2కి రూ.9 కోట్లు, దేవాదులకి రూ.145 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.6.50 కోట్లు, భీమాకు రూ.29 కోట్ల మేర నిధులు ఇవ్వాలి. ఈ నిధులను గత ఆర్థిక ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. ఈ ఏడాది ఆ నిధుల విడుదలకు సానుకూలంగా ఉంది. ఏఐబీపీ కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం వెనకాముందూ చేస్తోంది. దీనికి తోడు దేవాదుల పరిధిలోనే 2,400 ఎకరాలు, వరద కాల్వ కింద మరో 6వేల ఎకరాలు, ఎస్సారెస్పీ–2 కింద 700 ఎకరాలు మేర భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సేకరణను వేగవంతం చేసి పనులు ముగించి ఈ వానాకాలానికే 11 ప్రాజెక్టుల కింద నిర్ణయించిన 6.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేంద్రం ఆదేశించినా అది జరగలేదు. 4 లక్షల ఎకరాల్లో మాత్రమే నీరందించగలిగారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కేంద్రం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిధుల విడుదల చేసే అవకాశాలున్నాయి. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఈ నెల 31న రాష్ట్ర అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. పనుల పూర్తికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిధుల వ్యయం, అవరోధాలు తదితరాలపై సమగ్ర నివేదికలతో సిద్ధం కావాలని జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఏకే ఘా రాష్ట్రానికి లేఖ రాశారు. -
‘గల్ఫ్‌బంధు’తో ఆదుకోండి
మోర్తాడ్ (బాల్కొండ): దళితులు ఆర్థికంగా వృద్ధి చెందడానికి అమలు చేస్తున్న దళితబంధు పథకం తరహాలోనే గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్‌బంధు పథకాన్ని అమలు చేయాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ వలస కార్మికులకు అన్ని రకాలుగా ప్రయోజనాలను కల్పించడానికి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అది కార్యరూపం దాల్చలేదు. మరో పక్క గల్ఫ్‌దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అండగా ఉండటానికి గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ హామీ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా గల్ఫ్ కార్మికుల ఆంశం చర్చకు వచ్చింది. గల్ఫ్ వలస కార్మికుల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఆర్థికంగా లాభం జరుగుతోందని, అందువల్ల వారి శ్రేయస్సు కోసం ఒక మంచి పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికుల కోసం ఎలాంటి పథకం అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో దళితుల అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్న విధంగానే గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గల్ఫ్‌బంధు అమలు చేయాలని కార్మికుల నుంచి, వారికి అండగా ఉంటున్న సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కనీసం గల్ఫ్‌బంధు పథకం అమలు చేస్తే తెలంగాణ జిల్లాల్లో ఉన్న సుమారు 13 లక్షల గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా అండ దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేయూతనివ్వాలి – ఎస్వీరెడ్డి, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గల్ఫ్ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్‌బంధు అమలు చేయాలి. గల్ఫ్ కార్మికులలో కొందరే ఆర్థికంగా స్థిరపడ్డారు. మెజార్టీ కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. గల్ఫ్ కార్మికులకు చేయూతనివ్వడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలి – నంగి దేవేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధి గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నోమార్లు హామీ ఇచ్చింది. ఆ హామీలను నిలబెట్టుకోవడానికి దళితబంధు తరహాలో గల్ఫ్‌బంధు లేదా మరేదైనా పథకం అమలు చేయాల్సిందే. -
పేద క్రీడాకారుడికి ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సాక్షి, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఓ నిరుపేద క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడు ముడావత్ వెంకటేశ్ ఇటీవల నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఎస్ఎన్ఐఎస్)లో డిప్లొమా కోర్సులో సీటు సంపాదించాడు. అయితే, పేద గిరిజన కుటుంబానికి చెందిన వెంకటేశ్‌కు ఆ కోర్సులో చేరేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించాడు. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెం దిన టీఆర్ఎస్ యువజన llనేత ఉగ్గం రాకేశ్‌యాదవ్ వెంకటేశ్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా గురువారం రూ. 1.8 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వెంకటేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ యాదవ్‌ను కేటీఆర్ అభినందించారు. -
అందరినీ ఆదుకుంటాం
సాక్షి, ముంబై: ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. బాధితులందరికి వెంటనే ఆర్థిక సాయం ప్రకటించి, దాన్ని అమలు చేయడంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన గ్రామాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం పర్యటించారు. చిప్లూన్‌లో వరదకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, వ్యాపారస్తులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సింధుదుర్గ్, రత్నగిరి, రాయ్‌గఢ్, సాతారా, సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో జరిగిన నష్టంపై పంచనామా నిర్వహించి ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేస్తామన్నారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, రీజినల్ కమిషనర్లకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక రాగానే బాధితులు అందరికి ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆలోపు తాత్కాలికంగా తక్షణమే కొంత ఆర్థిక సాయం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ‘అనేక చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. పంటలు, తోటలకు అపార నష్టం జరిగింది. బాధితులు అందరికీ సాధ్యమైనంత త్వరగా ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తాం’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితులు అందరికీ బియ్యం, గోధుమలు, కిరోసిన్, ఇతర వంట సామగ్రి, దుస్తులు పంపిణీచేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కేవలం పబ్లిసిటీ కోసం ఆదరా బాదరగా ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కూడా ఎంత మేర సాయం కోరాలా అనేది త్వరలో నిశ్చయిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని చెప్పారు. గతంలో వరద, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు. అందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపామని చెప్పారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అందరికీ ఆర్థిక సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. కరోనా వల్ల ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం ఉంటుందని తెలిపారు. రక్షణ బలగాలకు చెందిన కొన్ని బృందాలను పంపి కేంద్రం సాయం చేసిందన్నారు. సోమవారం తాను పశ్చిమ మహారాష్ట్రలో పర్యటిస్తానని, జరిగిన నష్టంపై నివేదిక తయారుచేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, అంతకుముందు చిప్లూన్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని స్థానికులు అడ్డుకున్నారు. వర్షాల వల్ల తాము ఎదుర్కొంటున్న నరకయాతనను వారు ముఖ్యమంత్రికి వివరించారు. తమకు తక్షణమే సాయం అందించాలని వేడుకున్నారు. -
జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు!
న్యూఢిల్లీ: దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను వేలంలో దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం .. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం కంపెనీలో రూ. 1,375 కోట్ల మేర నిధులు సమకూర్చనుంది. ఇందులో రూ. 475 కోట్లు రుణదాతలకు దక్కనున్నాయి. మిగతా రూ. 900 కోట్ల మొత్తాన్ని సంస్థ నిర్వహణ మూలనిధి అవసరాలు, పెట్టుబడి వ్యయాల కోసం కన్సార్షియం వెచ్చించనుంది. ఈ ప్రణాళిక ప్రకారం బ్యాంకులకు దక్కే నిధుల్లో భారీగా అంటకత్తెర పడనుంది. సుమారు రూ. 7,800 కోట్ల పైగా రావాలంటూ బ్యాంకులు క్లెయిమ్ చేయగా వాటికి రూ. 475 కోట్ల మేరకే కేటాయింపు జరిగింది. ఇందులోనూ మళ్లీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) సంబంధించిన ఖర్చులు పోగా ఆర్థిక రుణదాతలకు నికరంగా రూ. 380 కోట్లు లభించనున్నాయి. దీనిలో రూ. 185 కోట్ల మొత్తాన్ని ముందస్తుగా చెల్లించనుండగా, మిగతా రూ. 195 కోట్లకు జీరో – కూపన్ బాండ్లను కన్సార్షియం జారీ చేస్తుంది. అలాగే జెట్ ఎయిర్వేస్లో బ్యాంకులకు 9.5 శాతం, జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 7.5 శాతం వాటా లభిస్తుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలు నిలిపివేసింది. అదే ఏడాది జూన్ నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 22న జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను రాతపూర్వకంగా బుధవారం ప్రకటించింది. చదవండి: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ రెక్కలు! -
HP: ఔషధ మొక్కల పెంపకానికి ఆయుష్ 128.94 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆయుర్వేదం. భారతదేశంలో 5000 సంవత్సరాల పూర్వం నుంచే ఆయుర్వేదంతో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఆయుర్వేంద చిట్కాలను అనుసరిస్తుంటారు. ఇక కొన్నాళ్ల క్రితం కాలుష్యం తక్కువగా ఉండేది. అందువల్ల అంతగా ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. అంతేకాకుండా ఔషధ మొక్కల వినియోగం వాటి విలువ గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. ఈ మొక్కల ఉపయోగం గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో ఆయుష్ డిపార్ట్మెంట్ జాతీయ ఆయుష్ మిషన్ కింద ఔషధ మొక్కల సాగు కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. సిమ్లా: సహజ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో చిన్న మొత్తంలో భూములు కలిగిన రైతుల ఆదాయం పెంచడానికి ఔషధ మొక్కలను పెంచాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ రైతులను పోత్సహిస్తున్నట్లు అక్కడి అధికారులు సోమవారం తెలిపారు. ఇందుకోసం కొంతమంది రైతులను ఓ బృందంగా ఏర్పాటు చేశారు. అయితే ఔషధ మొక్కలను పెంచడానికి ఆర్థిక సాయం కావాలంటే రెండు హెక్టార్ల భూమి ఉండాలి. ఔషధ మొక్కల కోసం 2018 జనవరి నుంచి 318 మంది రైతులకు 99.68 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా 2019-20లో జాతీయ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రంలో ఔషధ మొక్కలను పెంచడానికి 128.94 లక్షలు అందించారు. ఇందులో 54.44 లక్షలు ‘అటిస్’, ‘కుట్కి’, ‘కుత్’, ‘షాతావారి’, స్టెవియా, ‘సర్పగంధ’ సాగుకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు జోగిందర్ నగర్‌లోని ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్‌లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో లోకల్-కమ్-ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఆరు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఔషధ మొక్కల పెంపకం, పరిరక్షణను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా ప్రజలలో అవగాహన కల్పించడానికి, ఆయుష్ విభాగం ప్లాంటేషన్ డ్రైవ్ ‘చారక్ వాటిక’ నిర్వహించింది. ఈ డ్రైవ్ కింద 1,167 ఆయుర్వేద సంస్థలలో 11,526 మొక్కలను నాటడంతో చారక్ వాటికలను స్థాపించారు. చదవండి: ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి! -
మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు
చింతకాని/సాక్షి, హైదరాబాద్: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలోని మరియమ్మ ఇంటికి సోమవారం మంత్రి పువ్వాడతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, సీపీ విష్ణు ఎస్. వారియర్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు మరియమ్మ కుమార్తెలు స్వప్న, సుజాతకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చెక్కులు, కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు రూ.15 లక్షల చెక్కుతో పాటు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పువ్వాడ, భట్టి తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మరియమ్మ ఘటన సీఎం కేసీఆర్ దృష్టికి రాగానే, ఆయన స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 35 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. అఫిడవిట్ వేయండి: హైకోర్టు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ లాకప్‌డెత్ ఘటనలో మృతి చెందిన మరియమ్మ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. అలాగే ఆమె కుమారుడు, కుమార్తెలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. లాకప్‌డెత్ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని, మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థికసాయం అందించేలా ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. లాకప్‌డెత్ ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 2కు వాయిదా వేసింది. చదవండి: ‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’ -
కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే.. రూ. 5 లక్షలతో స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) ‘స్మైల్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఆ కుటుంబానికి ఆర్థికపరమైన అంశాల్లో ఆసరా ఇచ్చే లక్ష్యంతో స్మైల్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కోవిడ్–19 వ్యాప్తితో చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పలు రంగాల్లో ఉద్యోగాల కోత విధించడంతో ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. కోవిడ్–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు ఎన్‌బీసీఎఫ్‌డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్‌బీసీఎఫ్‌డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ ప్రతిపాదనలను ఈనెల 26లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దరఖాస్తుకు అర్హతలివీ... కరోనా వైరస్ సోకి మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్‌బీసీఎఫ్‌డీసీ స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుడి మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తహసీల్దారు నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నట్లు నిర్ధారణ పత్రం దరఖాస్తుతో జతచేయాలి. వీటిని నేరుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తులో మరణించిన కుటుంబ సభ్యుడి పేరు, మరణించిన రోజుకు వయసు, ఆధార్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, కులం తదితర వివరాలను భర్తీ చేయాలి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారులు ఈనెల 26లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపితే... రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎన్‌బీసీఎఫ్‌డీసీ కార్యాలయానికి పంపుతుంది. బీసీ కుటుంబాలకు ప్రయోజనకరమైన ఈ పథకంపై పెద్దగా ప్రచారం లేకపోవడం... రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఈ నెల 23న సూచనలు జారీ చేసి కేవలం మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించడం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశమే. -
ఏడుగురు చిన్నారులకు పరిహారం
అనంతపురం సప్తగిరి సర్కిల్/జగ్గయ్యపేట అర్బన్: కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఏడుగురు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించింది. మంగళవారం అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం సలీం, కలెక్టర్ గంధం చంద్రుడు బాధిత చిన్నారులు సత్యనాగ సాయికృష్ణతేజ, హేమంత్‌కుమార్, రాఘవేంద్ర, జేమ్స్‌బాండ్, దీపికలకు రూ.10 లక్షల చొప్పున చెక్‌లు అందజేశారు. కృష్ణా జిల్లాలో ఇద్దరికి.. సత్యనారాయణపురానికి చెందిన షేక్ ఖలీల్, రేష్మా దంపతులు కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. అనాథలైన వీరి పిల్లలకు మంగళవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రూ.20 లక్షల పరిహార ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్‌తో కలసి అందజేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 9 మంది చిన్నారులను గుర్తించామని కలెక్టర్ తెలిపారు. బాధిత రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందజేత పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ల గ్రామానికి చెందిన రైతు గుమ్మ యలమంచయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.7 లక్షల పరిహారాన్ని మృతుడి భార్య గుమ్మ నాగమణికి ప్రభుత్వ విప్ ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. -
BCCI: అనుకున్నాం... కానీ ఇవ్వలేకపోయాం
న్యూఢిల్లీ: గతేడాది కరోనా కారణంగా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రతిష్టాత్మకమైన రంజీ టోర్నీ రద్దయింది. మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టుల రూపంలో దేశవాళీ ఆటగాళ్లకు చెప్పలేనంత ఆర్థిక నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్ద మనసు చేసుకుంది. ఆయా టోర్నీలను కోల్పోయిన పురుషులు, మహిళా క్రికెటర్లకు పరిహారం అందజేయాలని గతేడాదే నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే బోర్డు కృషి మాత్రం ప్రణాళికాబద్ధంగా సాగలేదు. ఆచరణలో విఫలమైంది. ఏడాది పూర్తయినా కానీ ఇంకా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు, అమ్మాయిలకు ఎలాంటి పరిహారభత్యం అందలేదు. మహిళల టి20 ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వలేదన్న అంశం తెరమీదకు రావడంతో ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్ల చెల్లింపుల విషయం కూడా బయటికొచ్చింది. దీనిపై బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఆటగాళ్ల జాబితాలను ఇప్పటివరకు బీసీసీఐకి పంపలేదని, వారి తాత్సారం వల్లే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు పరిహారం అందజేయలేకపోయామని చెప్పారు. ‘ఎవరు ఆడేవాళ్లు. ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు. ఎవరు రిజర్వ్ ఆటగాళ్లు అన్న వివరాలేవీ రాష్ట్ర సంఘాలు పంపలేదు. అందుకే చెల్లించలేకపోయాం’ అని అరుణ్ అన్నారు. -
బీపీఎల్ కుటుంబాలకు రూ.5 వేలు సాయం
చండీగఢ్: కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే పేదలను ఆదుకునేందుకు హరియాణా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు 5 వేల రూపాయల నగదు సాయం అందిస్తామని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించిన క్రమంలో జీవనోపాధి కోల్పోయిన బీపీఎల్ కుటుంబాలకు నగదు సాయం అందించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ మరికొంత కాలం కొనసాగుతుందని అనిల్ విజ్ తెలిపారు. మే 10 నుంచి 17 వరకూ ‘సురక్షిత్ హరియాణా’ పేరిట కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. లాక్‌డౌన్‌కు తోడు కఠిన నియంత్రణలను అమలు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలకు ల11 మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో హర్యానాలో 13,548 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 151 మంది మహమ్మారి బారినపడి మరణించారు. చదవండి: ‘వ్యాక్సిన్ల కొరత.. డబ్బులిచ్చి కొందామన్న లభించడం లేదు’ -
దివ్య తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్కు అందజేత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబసభ్యులకు పది లక్షలు చెక్కును అందజేశారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. హామీ ఇచ్చిన 48 గంటల్లోనే దివ్య తల్లిదండ్రులకు ప్రభుత్వం చెక్కును అందజేసింది. చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుందని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ దివ్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారని, ప్రభుత్వం తరపున , పార్టీ తరపున వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) సీఎం వైఎస్ జగన్ సహాయం మరవలేనిదని దివ్య తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. మా బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చారని, ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారని తెలిపారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని, మా కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జగన్‌కి రుణపడి ఉంటామన్నారు. ఈ కేసులో తమ బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. (సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
ఒడిదుడుకుల ట్రేడింగ్ అయినా లాభాలే
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు సూచీలను లాభాల బాట పట్టించాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 40,707 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లను ఆర్జించి 11,938 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది వరుసగా 4వ రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 826 పాయింట్ల రేంజ్ లో కదలాడింది. నిఫ్టీ 242 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది. ఆరంభం ఆదిరింది... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతను అందుకున్న మార్కెట్ భారీ గ్యాప్ అప్‌తో మొదలైంది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 40,767 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,958 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ రావచ్చనే అంచనాలతో ఉదయం సెషన్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,976 వద్ద, నిఫ్టీ 12,000 మార్కును అందుకొని 12,019 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మిడ్‌సెషన్‌లో అమ్మకాల సునామీ... మిడ్‌సెషన్ వరకు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో టీసీఎస్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో సెనెక్స్ గరిష్టస్థాయి 40,976 నుంచి ఏకంగా 826 పాయింట్లను కోల్పోయి 40,150 కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టస్థాయి 12,018 నుంచి 242 పాయింట్లు నష్టపోయి 11,776 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. -
దివ్యతేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల సహాయం
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దివ్యతేజస్విని కుటుంబసభ్యులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వారిని ఓదార్చారు. చలించిపోయిన సీఎం దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారని, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్ ముఖ్య మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దివ్యతేజస్విని తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రి సుచరిత సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రేమోన్మాది నాగేంద్రబాబు కోలు కోగానే అదుపులోకి తీసుకుని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగేంద్రబాబు పూర్వ పరిచయాన్ని అడు ్డపెట్టుకుని దివ్యతేజస్వినిని వేధించాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులపై మహిళలు, యువతులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దివ్యతేజస్విని కుటుంబసభ్యులు కోలుకునే వరకు పార్టీపరంగా కూడా అండగా ఉండాలని సీఎం జగన్ తమకు సూచించారని చెప్పారు. దివ్యతేజస్వినిని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ మాట్లాడుతూ నాగేంద్రబాబుకు ఉరిశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. నిందితుడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని చెప్పారు. -
ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ తమ చేయి జారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుమారు రూ. 43,000 కోట్ల విలువ చేసే తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను విక్రయించైనా రుణదాతల బాకీలు తీర్చేస్తామని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మిని స్ట్రేటర్ ఆర్ సుబ్రమణియ కుమార్‌కు ఈ మేరకు లేఖ రాశారు. రుణ బాకీలు తీర్చేసే దిశగా.. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధ్వాన్ ప్రతిపాదించారు. 2018 సెప్టెంబర్ నాటి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా డీహెచ్ఎఫ్ఎల్తో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుదేలయ్యాయని ఆయన తెలిపారు. కష్టకాలంలోనూ వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ. 44,000 కోట్లు చెల్లించిందని వివరించారు. మనీలాండరింగ్, నిధుల గోల్మాల్ వంటి ఆరోపణలపై డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బాకీలను రాబట్టుకునే క్రమంలో రుణదాతలు .. డీహెచ్ఎఫ్ఎల్ని వేలానికి ఉంచగా ఓక్ట్రీ, ఎస్సీ లోవీ తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. -
ప్రభుత్వ రుణ భారం 94.62 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వంపై మొత్తం చెల్లింపుల (పబ్లిక్ అకౌంట్‌సహా) భారం గడచిన ఆర్థిక సంవత్సరం (2019–2020) జనవరి– మార్చి మధ్య అంతక్రితం త్రైమాసికంతో (అక్టోబర్–డిసెంబర్) పోల్చిచూస్తే, 0.8 శాతం పెరిగి రూ.94.62 లక్షల కోట్లకు పెరిగింది. మంగళవారం ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే మార్చి త్రైమాసికానికి చెల్లింపుల భారం రూ.93,89,267 కోట్ల నుంచి రూ.94,62,265 కోట్లకు పెరిగినట్లు ప్రకటన తెలిపింది. మొత్తం చెల్లింపుల విషయంలో ఒక్క పబ్లిక్ డెట్ పరిమాణం 90.9%గా ఉంది. డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ (ప్రభుత్వ బాండ్లు), ట్రెజరీ బిల్స్, అంతర్జాతీయ ఆర్థిక రుణాలు, స్వల్పకాలిక రుణాల వంటివి పబ్లిక్ డెట్ పరిధిలోకి వస్తాయి. విదేశీ రుణ భారం 558.5 బిలియన్ డాలర్లు కాగా, భారత విదేశీ రుణ భారం 2020 మార్చి నాటికి 558.5 బిలియన్ డాలర్లుగా (డాలర్ రూ. 75 చొప్పున దాదాపు రూ.41.9 లక్షల కోట్లు) నమోదయ్యింది. 2019 మార్చితో పోల్చితే ఈ పరిమాణం 15.4 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. కాగా మొత్తం రుణంలో వాణిజ్య రుణాల వాటా 39.4 శాతం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు 23.4 శాతం. స్వల్పకాలిక వాణిజ్య రుణాల వాటా 18.2 శాతం. 0.6 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ మిగులు మరోవైపు 2020 జనవరి–మార్చి మధ్య భారత్ 0.6 బిలియన్ డాలర్ల (ఈ కాలవ్యవధి జీడీపీ విలువలో 0.1 శాతం) కరెంట్ అకౌంట్ మిగులును నమోదుచేసుకుంది. 2019 ఇదే సమయంలో భారత్ 4.6 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ లోటు (జీడీపీలో 0.7 శాతం) నమోదయ్యింది. వాణిజ్యంసహా పలు అంశాలకు సంబంధించి ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాలను ‘కరెంట్ అకౌంట్’లో చూపుతారు. గడచిన ఆర్థిక సంవత్సరం దేశ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) జీడీపీ విలువలో 0.9 శాతంగా ఉంది. 2018–19లో ఇది 2.1 శాతం. 58.6 శాతానికి పెరిగిన ద్రవ్యలోటు ఇదిలావుండగా, ప్రభుత్వ–ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే ముగిసే నాటికి బడ్జెట్ అంచనాల్లో ఏకంగా 58.6 శాతానికి చేరింది. విలువలో ఇది 4.66 లక్షల కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు (జీడీపీలో 3.5 శాతం) ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. -
విదేశాల్లోని వారికి నగదు పంపాలా?
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి రెండు నెలలకుపైనే అవుతోంది. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన వారు, ఉపాధి ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులు తిరిగి రావాలనుకుంటున్నా.. రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడి వారికి ఆర్థిక సాయం అవసరం కావచ్చు. ‘స్వేచ్ఛాయుత చెల్లింపుల పథకం’ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు (మైనర్లు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల కోసం పంపుకోవచ్చు. విదేశీ విద్య, నిర్వహణ ఖర్చులు, బహుమతులు, విరాళాలు, పర్యటన ఖర్చులు తదితర అవసరాల కోసం నగదు పంపుకునేందుకు (ఫారిన్ అవుట్వార్డ్ రెమిటెన్స్) నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇంటి నుంచే ఈ లావాదేవీలను సులువుగా చేసుకునే అవకావం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో విదేశాల్లోని వారికి నగదు పంపుకునేందుకు (ఫారిన్ రెమిటెన్స్) అనుమతిస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకుని ఉండాలి. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఆన్లైన్ రెమిటెన్స్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత దేశీయ లావాదేవీల మాదిరే విదేశాల్లోని తమ వారి ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎవరికి అయితే నగదు పంపించాలని అనుకుంటున్నారో వారి పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్‌తో బెనిఫీషియరీని నమోదు చేసుకోవాలి. ఇందుకు కొంత సమయం తీసుకుంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే బెనిఫీషియరీ నమోదుకు 30 నిమిషాలు చాలు. మధ్యాహ్నం 2.30 గంటల్లోపు నమోదైన అన్ని రెమిటెన్స్ అభ్యర్థనలను అదే రోజు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పూర్తి చేసేస్తుంది. అదే ఎస్బీఐ అయితే నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత యాక్టివేషన్‌కు ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఎస్బీఐ కస్టమర్లు ఒకే రోజు గరిష్టంగా మూడు బెనిఫీషియరీలను నమోదు చేసుకోవచ్చు. పరిమితులు.. ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) పరిమితి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లుగా ఉంది. ఆన్లైన్ కొనుగోళ్లకూ ఇదే పరిమితి అమలవుతుంది. అయితే, బ్యాంకులు ఫారిన్ రెమిటెన్స్ లావాదేవీలకు సంబంధించి పలు రకాల పరిమితులను నిర్దేశిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనిష్టంగా ఒక లావాదేవీలో 100 డాలర్లు, గరిష్టంగా 12,500 డాలర్ల వరకే పంపుకునేందుకు అనుమతిస్తోంది. రెమిట్నౌ అనే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఒక కస్టమర్ ఈ మేరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు మించిన మొత్తాల్లో విదేశాల్లోని తమ వారికి పంపించాలని అనుకుంటే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంకు అయితే ఒక కస్టమర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గరిష్టంగా 25,000 డాలర్ల వరకు విదేశాలకు పంపించుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ కస్టమర్‌కు ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ పరిమితి ఒక లావాదేవీలో రూ.10 లక్షలుగా అమల్లో ఉంది. అలాగే, ఎస్బీఐ కస్టమర్లు నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత మొదటి ఐదు రోజుల్లో మాత్రం కేవలం 50,000 వరకే పంపుకోగలరు. ఇక ఎల్ఆర్ఎస్ కింద కొన్ని దేశాలకు నగదు పంపుకునే అవకాశం లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిషేధించిన దేశాలు లేదా యూఎస్ ట్రెజరీ ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ కస్టమర్లకు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని వారికి నగదు పంపుకునే అవకాశం ఉండదు. ఇక కొన్ని బ్యాంకులు కొన్ని రకాల ఫారిన్ కరెన్నీ రెమిటెన్స్లకే పరిమితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు 20 కరెన్సీల్లో ఫారిన్ రెమిటెన్స్‌లను ఆఫర్ చేస్తోంది. అదే ఎస్బీఐ కస్టమర్లు అయితే యూఎస్ డాలర్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్, సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ మారకంలో రెమిటెన్స్‌లు చేసుకోవచ్చు. కమీషన్, చార్జీలు.. బ్యాంకులు ఫారిన్ కరెన్సీ రెమిటెన్స్‌లకు సంబంధించి మారకం రేట్లను రోజువారీగా ప్రకటిస్తుంటాయి. ఈ వివరాలను బ్యాంకు వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఫారీన్ అవుట్వార్డ్ రెమిటెన్స్‌ల లావాదేవీలకు బ్యాంకులు చార్జీలు, కమీషన్లను వసూలు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 500 డాలర్ల వరకు లావాదేవీపై రూ.500 చార్జీని వసూలు చేస్తోంది. అదే 500 డాలర్లకు మించిన లావాదేవీలపై ఈ చార్జీ రూ.1,000గా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు అయితే వివిధ కరెన్సీల్లో వివిధ రకాల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్ డాలర్ రూపంలో అయితే చార్జీ 11.25 డాలర్లు, బ్రిటన్ పౌండ్ రూపంలో చార్జీ 10 పౌండ్లు ఇలా చార్జీలు మారిపోతుంటాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారీన్ రెమిటెన్స్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వారికి.. విదేశీ రెమిటెన్స్ లావాదేవీల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో నమోదు చేసుకోని వారి పరిస్థితి ఏంటి..? అటువంటప్పుడు ‘డీసీబీ బ్యాంకు రెమిట్ ఫెసిలిటీ’ని పరిశీలించొచ్చు. డీసీబీ బ్యాంకు ఖాతా దారులతోపాటు ఇతరులు అందరికీ ఇది అందుబాటులో ఉన్న సదుపాయం. పైగా విదేశీ రెమిటెన్స్ లావాదేవీలకు డీసీబీ బ్యాంకు ఎటువంటి చార్జీలను లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. పాన్ కార్డు ఉన్న వారు డీసీబీ బ్యాంకులో డీసీబీ రెమిట్ సదుపాయం కోసం బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కాకపోతే వీరికి డీసీబీ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులో ఖాతా ఉండాలి. డీసీబీ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 డాలర్ల వరకు ఒక కస్టమర్ విదేశాలకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఇంతకు మించి పంపించుకోవాలంటే డీసీబీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ కూడా ఇటువంటి సదుపాయమే. ఇతర బ్యాంకు కస్టమర్లు విదేశాలకు నగదు పంపుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ ఉపయోగపడుతుంది. కాకపోతే ఐసీఐసీఐ బ్యాంకు శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. కేవైసీ వివరాలు కూడా సమర్పించాలి. మనీ2వరల్డ్ ద్వారా రెమిటెన్స్‌లపై రూ.750 కమీషన్‌గా చెల్లించాలి. ఏజెంట్లు... నెట్ బ్యాంకింగ్ సదుపాయాల్లేని వారు నాన్ బ్యాంకింగ్ ఏజెంట్ల సేవలను ఫారిన్ రెమిటెన్స్ కోసం వినియోగించుకోవచ్చు. థామస్‌కుక్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ తదితర సంస్థలను ఫారీన్ రెమిటెన్స్ సేవలకు ఆర్బీఐ అనుమతించింది. అయితే, రెమిటెన్స్ లావాదేవీల పరంగా పరిమితులు సంస్థలను బట్టి మారిపోవచ్చు. చార్జీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. థామస్‌కుక్ ద్వారా ఆన్లైన్లో 5,000 వరకు డాలర్లను పంపుకోవాలంటే అందుకు గాను 8 డాలర్ల ఫీజును చెల్లించుకోవాలి. అంతకుమించిన లావాదేవీలపై ఫీజు రూ.11 డాలర్లుగా ఉంది. పన్నులు ఉన్నాయా..? విదేశీ రెమిటెన్స్‌పై కమీషన్లు/చార్జీలు, కరెన్సీ మారకం చార్జీలను పక్కన పెడితే.. పన్నుల భారం కూడా ఉంటుంది. పన్ను వర్తించే విలువపై 18% జీఎస్టీ చెల్లించాలి. పన్ను వర్తించే విలువ కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.60,000 వరకు ఉంటుంది. కనుక ఈ మొత్తంపై జీఎస్టీ రూ.45–10,800 మధ్య చెల్లించాల్సి రావచ్చు. 2020 అక్టోబర్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7లక్షలకు మించి విదేశాలకు పంపితే 5% మూలం వద్ద పన్నును వసూలు (టీసీఎస్) చేస్తారు. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెమిటెన్స్ చేస్తుంటే మాత్రం టీసీఎస్ 0.5 శాతమే. -
అర్చకులు,ఇమామ్,మౌజమ్,పాస్టర్లకు ఆర్థికసాయం
-
సచివాలయాల్లో జాబితాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్ 24న ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్ 10న రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. అభ్యంతరాలుంటే 25లోగా తెలపాలి.. ► ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి సచివాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లకు బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు ఆదేశాలిచ్చారు. అభ్యంతరాలను ఈనెల 25లోగా తెలియచేయాలి. ► అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీలకు జాబితాను పంపించాలి. కలెక్టర్ అనుమతితో బీసీ కార్పొరేషన్ ఈడీలు ఈ జాబితాను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఎండీ, కాపు కార్పొరేషన్ ఎండీ కార్యాలయాలకు పంపిస్తారు. ► వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 45 – 60 ఏళ్ల లోపు మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. మూడు వర్గాలకు ‘చేదోడు’... ► జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల షాపులకు వలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్ చేయించాలి. జియో ట్యాగింగ్ చేయించకుంటే మంజూరు ఉత్తర్వులు ఆపివేస్తారు. ► జగనన్న చేదోడు పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు మండలాలు, మునిసిపాలిటీల్లో పర్యటిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు తెలిపారు. ► ఈ పధకానికి 1,29,749 మంది దర్జీలు, రజకులు 81,815 మంది, 38,643 మంది నాయీ బ్రాహ్మణులు ఎంపికయ్యారు. వీరికి వృత్తి పనుల కోసం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తుంది. -
జగన్ గారికి హ్యాట్సాఫ్
‘‘విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఘటన బాధాకరం. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను ప్రధాని మోదీగారు నిషేధించాలి’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నారాయణమూర్తి స్పందిస్తూ– ‘‘1985, 1990 దశకంలో భారతదేశంలో పీవీ నరసింహారావుగారు ప్రధానిగా, మన్మోహన్ సింగ్గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటి. బహుళ జాతి కంపెనీలను, కార్పొరేట్ శక్తులను, ప్రైవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలోకి ఆహ్వానిస్తున్నాం. దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియాకి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన. బాగా వెనకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినా ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిగారు నవరత్నాలను అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులున్నాయా? లేవా? అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించి మానవతను చాటుకున్న జగన్‌గారికి హ్యాట్సాఫ్. నరేంద్ర మోదీగారు ఇప్పటికైనా స్పందించి, జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలి’’ అని అన్నారు. -
4వ తేదీ నుంచి జన్‌ధన్ ఖాతాల్లో నగదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ మహిళా ఖాతాదారులకు రెండో విడత ఆర్థిక సాయం రూ. 500 ఈనెల 4వ తేదీ నుంచి విడుదల చేయనుంది. నిర్దేశించిన తేదీల్లో నగదు వారి ఖాతాల్లో జమ కానున్నట్లు ఎస్ఎల్బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి) శనివారం ప్రకటించింది. ఖాతా నంబరు చివరి అంకె ఆధారంగా షెడ్యూల్ ఇచ్చామని, లబ్ధిదారులు ఆయా తేదీ ల్లో సంబంధిత బ్యాంకులు, ఏటీఎం, బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే రూ.1,500 ఆర్థిక సాయం కూడా వారి ఖాతాల్లో ఈనెల 2వ తేదీ నుంచి జమ కానున్నాయి. ఈ నిధులను కూడా నిర్దేశించిన షెడ్యూల్ ఆధారంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఎస్ఎల్బీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 12వ తేదీ తర్వాత సీరియల్ నంబర్‌తో సంబంధం లేకుండా అందరూ విత్‌డ్రా చేసుకోవచ్చని, జన్‌ధన్ అకౌంట్ లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఒకసారి జమ అయిన నిధులను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోదని స్పష్టం చేసింది. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
నృత్యకళాకారులకు సాయం
కరోనా సమయంలో పనిలేకఇబ్బంది పడుతున్న నృత్యకళాకారులకు 5 లక్షల 75 వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని అందించారు నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. హైదరాబాద్ లో 10 మంది, చెన్నైలో 13 మంది... మొత్తం 23 మంది నృత్య కళాకారులకు తలా ఒక్కొక్కరికీ 25 వేలు చొప్పున వారి అకౌంట్లో వేశారు. ‘‘డ్యాన్స్‌ని నమ్ముకుని జీవితం సాగిస్తున్న నృత్యకళాకారులకు ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో సహాయం చేయడం నా బాధ్యత’’ అన్నారు లారెన్స్. -
ఏపీలో ‘వేట’ సాయం వెంటనే
సాక్షి, అమరావతి: లాక్డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీరికి అందచేసే సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. గత నవంబరు 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్ధి్దదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం : శారదా పీఠాధిపతి) మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరపడవలపై 8 మంది, మోటారు పడవలపై ఆరుగురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనుంది. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లబ్ధి్దదారుల జాబితా ఖరారు అయిన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది వేట విరామ సమయం ప్రాంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం అందజేస్తుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి చెప్పారు. (చదవండి: డ్రోన్లతో థర్మల్ స్క్రీనింగ్) -
అధిక కేసులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా నిబంధనలను మరింత కఠినతరంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలందరికీ మాస్క్‌ల పంపిణీ, క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇంటికి పంపే సమయంలో పేదలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ► క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలి. తొలుత హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీ చేయాలి. ప్రతి ఒక్కరికీ మూడు మాస్క్‌లు ఇవ్వాలి. ► నేటి నుంచి మాస్క్‌ల డెలివరీ ప్రారంభం. రెండు మూడు రోజుల తర్వాత విస్తృతంగా పంపిణీ. మాస్క్‌ల తయారీ పని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి. రైతు భరోసా కేంద్రంగా మార్కెటింగ్ ► వైఎస్సార్ రైతు భరోసా, మత్య్సకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలి. కియోస్క్‌లు ఏర్పాటు చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రంగా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలి. ► ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ► ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తూ పేదలకు రూ.2 వేలు ఇవ్వాలి. లేదంటే.. సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం ఇచ్చే డబ్బుతో పాలు, గుడ్లు, కూరగాయలు లాంటి పౌష్టికాహారం తీసుకోవడానికి వీలుంటుంది. – సీఎం వైఎస్ జగన్ -
సినిమా జర్నలిస్ట్‌లకు ఎఫ్సీఏ సాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరిMీ ఐదు వేల రూపాయలు చొప్పున ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (ఎఫ్సీఏ) ఆర్థిక సాయం చేసింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మొత్తం 87 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా సోమవారం ఐదు వేల నగదును బదిలీ చేశారు. ‘‘ఎఫ్సీఏ’ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావుగారి సలహాల మేరకు, హెల్త్ కమిటీ చైర్మన్ రెడ్డి హనుమంతురావు, మురళి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. -
ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం!
గువాహటి: కరోనా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆన్లైన్ ద్వారా వారందరికీ ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి బిశ్వ శర్మ సోమవారం వెల్లడించారు. ఇందుకోసం త్వరలో హెల్ప్‌లైన్ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన అస్సాం వాసులు హెల్ప్‌లైన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఓ లింక్ వస్తుంది. దాన్ని అనుసరించి తమ వ్యక్తిగత వివరాలు.. బ్యాంకు ఖాతా వివరాలతో ఆర్థిక సాయానికై ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత.. డబ్బు ఆయా బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది’అని మంత్రి పేర్కొన్నారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియ పూర్తవనిదే.. ఎంత మొత్తం సాయం చేస్తామనేది తేల్చలేమని అన్నారు. (చదవండి: లాక్డౌన్: ఆ 25 జిల్లాల్లో కాంటాక్ట్ కేసులు లేవు) అప్లికేషన్ల ప్రక్రియలో తమతో కలిసి పనిచేసేందుకు పిరమల్ ఫౌండేషన్, అస్సాం ఇంజనీరింగ్ కాలేజ్, కాటన్ యూనివర్సిటీ, గువాహటి యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని మంత్రి తెలిపారు. ఆర్థిక సాయం అమలుకు డేటాబేస్‌ను రూపొందిస్తామని బిశ్వ శర్మ వెల్లడించారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చేవారెంతమందో లెక్కతీసి ముందుజాగ్రత్త చర్యగా వారందరికీ తగిన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులు, చిరుద్యోగులు ఇళ్లకే పరిమితమై... జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి వివరాలు తెలుసుకుంటున్నామని అన్నారు. ఇదిలాఉండగా.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయిన రోగుల కుటుంబాలను ఆదుకునేందుకు అస్సాం ప్రభుత్వం ఒక్కో పేషంట్‌కు రూ.25 వేలు అందించి పెద్ద మనసు చాటుకుంది. దాంతోపాటు విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరులను ఆదుకునేందుకు 21 మందికి తొలి విడతగా వెయ్యి డాలర్ల చొప్పున అందించింది. (చదవండి: ‘74 మంది అనుమానితుల శాంపిల్స్ సేకరణ’) -
‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాద్షా’
బాలీవుడ్ సింగర్ బాద్షా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘బోరోలోకర్ బీటీ లో’ పాట సృష్టికర్త, బెంగాల్ జానపద కళాకారుడు రతన్ కహార్‌కు ఆర్థిక సాయం అందిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బాద్షా తన టీంతో ఆ కళాకారుడుకి వీడియో కాల్ చేసి అకౌంట్ వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అతని ఖాతాలో రూ. 5లక్షలు జమ చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. బాద్షా చేసిన సాయంపై రతన్ కహార్ స్పందించారు. ‘బాద్షా చేసిన సాయానికి కృతజ్ఞతలు. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా శౌరి గ్రామంలో ఉండే నా ఇంటికి బాద్షా రావాల’ని ఆయన ఆహ్వానించారు. ఇక తన పాటను ఆల్బమ్‌లో ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బాద్షాతో సంగీతానికి సంబంధించిన పలు విషయాలు చర్చించాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రతన్ కహార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. (‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’) హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, సింగర్ బాద్షా కలిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బమ్ ‘జెండా ఫూల్’ ఈ మధ్యే రిలీజ్ అయింది. ఈ పాట మూలాలు రతన్ కహార్ ‘బోరోలోకర్ బీటీ లో’తో దగ్గరగా ఉన్నాయని, కనీసం ఆ కళాకారుడికి గుర్తింపు ఇవ్వకపోవటంపై సోషల్‌మీడియాలో నెటిజన్లు బాద్షాపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. -
పేదలకు ఆర్ధిక సహాయం
-
మార్కెట్లకు రుచించని ప్యాకేజీ
ముంబై : కరోనా వైరస్ వ్యాప్తితో ఇబ్బందులుపడుతున్న పేదలు, అల్పాదాయ కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్లను మెప్పించనట్టు కనిపిస్తోంది ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ప్యాకేజీ మార్కట్ అంచనాలను అందుకోలేకపోవడంతో తాజాగా ఇన్వెస్లర్లలో నిరాశ నెలకొంది. దీంతో మార్కెట్లు అనూహ్యంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆరంభ లాభాలు కరిగిపోయాయి. మార్నింగ్ సెషన్లో భారీ లాభాల్లో కదలాడిన సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. భారీ ప్యాకేజీ అంచనాలతో ఒక దశలో 1600 పాయింట్లు ఎగిసిన ప్రస్తుతం సెన్సెక్స్ 800 పాయింట్లు లాభానికే పరిమితమైంది. అటు నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. గరిష్టం నుంచి దాదాపు వెయ్యి పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 30వేల స్థాయిని, నిఫ్టీ 8700 కీలక మద్దతు స్థాయిని కోల్పోవడం గమనార్హం .ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. వీటితోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్ 33.62శాతం, యాక్సిస్ బ్యాంక్ 10.76 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 8.03శాతం, భారతీ ఎయిర్టెల్ 7.69 శాతం, యూపీఎల్ 7.24శాతం లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. యెస్ బ్యాంక్ 6.08 శాతం, మారుతీ సుజుకీ 4.18 శాతం, అదానీ పోర్ట్స్ 4.03శాతం, గెయిల్ 3.71శాతం, ఎన్టీపీసీ 2.63శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. చదవండి : లాక్‌డౌన్‌కు, కర్ఫ్యూకు తేడా ఏమిటీ? -
వైఎస్సార్ కాపరి బంధు
సాక్షి, అమరావతి: గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనుంది. ఎన్సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో ‘వైఎస్సార్ కాపరి బంధు’ పథకాన్ని అమలు చేయనుంది. యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. గొర్రెల రేట్లు అధికంగా ఉండటంతో ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనుంది. సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ – రాష్ట్రంలోని గొర్రెల కాపరులు, సొసైటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల కలిసి తమ జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఒక పథకాన్ని అమలు చేయాలని కోరారు. – ఎన్సీడీసీ ఆర్థిక సాయంతో ప్రస్తుతం గొర్రెలకాపరులు రుణంపై గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. – ఈ పథకం అమలులో నిబంధనలు కఠినంగా ఉండటంతో గొర్రెల కాపరులు రుణాలు పొందలేక పోతున్నారు. – ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో నిబంధనలు సరళీకృతం చేయడంతో పాటు, సబ్సిడీ పెంచే విధంగా పథకాన్ని రూపకల్పన చేయాలని ఆదేశించారు. – ఎన్సీడీసీ ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతున్నారు. – రుణం ఇచ్చేటప్పుడు గొర్రెల కాపరులు భూమిని తనఖా పెట్టే విధానం అమలులో ఉంటే.. అందులో కొన్ని మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. – ఈ మేరకు అధికారులు పథకాన్ని రూపకల్పన చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. దీనిపై త్వరలో జరనున్న సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నష్ట పరిహారం, పశు వైద్యంతో అండగా.. – రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ పశు నష్ట పరిహారం, రాజన్న పశు వైద్యం వంటి పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. వీటితోపాటు సబ్సిడీపై పశువుల దాణా, పరికరాలను అందిస్తోంది. – చనిపోయిన పశువులు, గొర్రెలు, మేకలకు ఎటువంటి ప్రీమియం చెల్లించక పోయినప్పటికీ నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. – ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయిన 9 వేల అవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం వాటి పోషకుల బ్యాంకు ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు జమ చేసింది. – తొలి విడతగా ప్రభుత్వం పశు నష్టపరిహారం పథకానికి రూ.35 కోట్లు కేటాయించింది. – ఫిబ్రవరిలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజన్న పశు వైద్యం పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. – గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమితులైన పశు సంవర్థక శాఖ సహాయకులు పశువులకు వైద్యసాయాన్ని అందిస్తున్నారు. -
ట్రిపుల్ తలాక్ బాధితులకు ఆర్థిక చేయూత!
లక్నో: ట్రిపుల్ తలాక్ బాధితులు పునరావాసం పొందే వరకు ఆర్థిక సహాయం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బాధితులతో పాటు భర్త నుంచి విడాకులు పొందిన అన్ని మతాలు, వర్గాలకు చెందిన మహిళా బాధితులు వార్షిక సహాయం కింద ఏడాదికి రూ. ఆరు వేలు పొందనున్నారు. ఈ ప్రయోజనాలను బాధితులకు 2020 నుంచి వర్తించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయ సహాయం కూడా అందేలా సీఎం యోగీ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. యూపీ రాష్ట్ర మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందడానికి వీలుగా.. సరళరీతిలో ప్రక్రియను రూపకల్పన చేశారు. ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే సదరు బాధిత మహిళ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కోర్టు కేసుకు సంబంధించిన కాపీని ప్రూఫ్ కింద సమర్పించాల్సి ఉంటుంది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 5,000 మంది ట్రిపుల్ తలాక్ బాధితులతో సహా దాదాపు 10,000 మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు. -
చేనేతలకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని.. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు అపూర్వ సంక్షేమ పథకం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ను ప్రవేశపెడుతోంది. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, హస్త కళలకు పూర్వ వైభవం తేవడమే కాకుండా కేవలం మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న వారికి మరింత తోడ్పాటునివ్వడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఈనెల 21న అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. (చదవండి : రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు) ముడిసరుకు కొనుగోలుకు అవకాశం మరమగ్గాలు వచ్చిన తరువాత చేనేతలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో చేతి ద్వారా నేత నేసే నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సాయం తోడ్పాటునిస్తుందని చేనేత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మగ్గాలను బాగు చేయించుకోవడం, నూలు, రంగులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మగ్గంపై నేత నేయాలంటే నేత కార్మికుడు అప్పుచేయాల్సిందే. అది కూడా ముందుగానే చీరలు, ఇతర వస్త్రాలు కొనుగోలు చేసే పెట్టుబడిదారుల నుంచి అప్పులు తీసుకుంటారు. వీటిని తీర్చలేక నేసిన వస్త్రాలు వారికే విక్రయిస్తారు. అప్పు ఇచ్చిన వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి వీరికి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలని సంకల్పించి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’కు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 81,783 మంది నేతన్నలను గుర్తించారు. అలాగే, ఇందుకోసం రూ.196.27కోట్లు ఖర్చు చేయనుంది. అర్హులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ.. ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరు.. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా పెడన, నెల్లూరు జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, వైఎస్సార్ జిల్లాలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మాధవరం, అప్పనపల్లె వంటి పేరుగాంచిన పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా నేతన్నలు వస్త్రాలు తయారుచేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. నేను పదో తరగతి వరకు చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులవల్ల పై చదువులకు వెళ్లలేకపోయా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేత నేస్తూనే ఉన్నా. ఇప్పటివరకు చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద రూ.24వేలు ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం. దీంతో ఆధునిక పరికరాలు కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుంది. – మరక షణ్ముఖరావు, పెడన, కృష్ణా జిల్లా -
సీఎం జగన్ ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. అతన్ని ఆదుకునేందకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆ దివ్యాంగుడికి అందజేశారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ.. లక్ష రూపాయల సాయం అడిగితే.. సీఎం రూ. 5లక్షలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గొప్ప మానవతావాది ముఖ్యమంత్రిగా లభించడం పేదల అదృష్టం అని తెలిపారు. చదవండి : స్పందించిన సీఎం వైఎస్ జగన్ -
'చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం'
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీలి విప్లవం పథకం కింద సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి పలు విధాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మత్స్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నీలి విప్లవం పథకం కింద సాంప్రదాయక చేపల పడవలను ఆధునీకరించుకోవడానికి, మత్స్యకారులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఫైబర్ గ్లాస్ ప్లాస్టిక్ బోట్లు, ఇన్సులేటెడ్ ఐస్ బాక్స్‌లు సమకూర్చుకోవడానికి ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మత్స్యకారులు సముద్ర జలాల్లో సుదూరంగా వేటను కొనసాగించడానికి ట్రాలర్లను లాంగ్ లైనర్స్ కింద మార్చుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేట సామర్ధ్యం తగ్గ లేదని, 2017-18లో మొత్తం మత్స్య సంపదలో 70 శాతం వరకు వేటాడినట్లు మంత్రి వివరించారు. అయితే దేశంలో వివిధ కేటగిరీలకు చెందిన 2.6 లక్షల బోట్లు చేపల వేట సాగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి చెందిన సముద్ర జలాల్లో మొత్తం 5.31 మిలియన్ మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉన్నట్లుగా అంచనా వేశామని తెలిపారు. తీర ప్రాంత భద్రతను పటిష్టపరచేందుకు ఏర్పాటైన జాతీయ కమిటీ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల భద్రతకు సంబంధించినన వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం
సాక్షి, మిర్యాలగూడ: ఆమె ఓ యాచకురాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో 30 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. ఆర్టీసీ కార్మికులంతా ఆ యాచకురాలికి సుపరిచితులు. కాగా 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పాటు చాలా మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందిన సైదమ్మ తాను భిక్షాటన చేసి పోగేసిన రూ.4 వేల 43లను వారికి అందించింది. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేపట్టిన టెంటు వద్దకు వెళ్లి ఆర్టీసీ నల్లగొండ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్‌కు రూ.4 వేలు అందజేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తాను 30 ఏళ్లుగా బస్టాండ్‌లో ఉంటూ యాచిస్తున్నానని.. ఆర్టీసీ కార్మికులంతా పరిచయస్తులు అని, వారి కడుపులు మాడుతుంటే తనకు ఎంతో బాధ కలిగిందని వివరించింది. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేశానని తెలిపింది. దీంతో అక్కడున్న వారు ఆమెను అభినందించారు. -
ఊపిరి నిలిపిన మానవత్వం
కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలన్న మనసు, సంకల్పం ఉన్న నలుగురు మనచుట్టూ ఉంటే చాలు అది ఎంత పెద్ద కష్టమైనా కరిగిపోతుంది. కాయకష్టం చేసి బతుకుపోరు సాగించే తమలో ఒకడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతుంటే చలించిపోయారా తోటి కూలీలు. బింధువులే సింధువైనట్లు..అందరూ ఒక్కటై తమకు తోచిన సాయం చేసి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. సాక్షి, ప్రకాశం (ముండ్లమూరు) : కష్టకాలంలో తోడబుట్టిన వాళ్లనే పట్టించుకోని రోజులివి. అలాంటిది తోటి కూలికి ఆపద వస్తే అండగా నిలిచి మేమున్నాం అంటూ అందరూ ఒక్కటై లక్షల రూపాయలు విరాళాలుగా వసూలు చేసి అతనికి మరో జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. ముండ్లమూరు మండలం వేముల పంచాయతీలోని రమణారెడ్డిపాలెం గ్రామంలో సుమారు 300 కుటుంబాలున్నాయి. అన్ని గ్రామాల్లానే ఆ గ్రామంలోనూ మూడు పార్టీలు, రెండు మతాల వారు ఉన్నారు. కానీ ఆపదలో ఒక్కటై ఒకరికొకరు అండగా నిలిచి తోటి వారిలో మనోధైర్యాన్ని నింపారు. గ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాశ్యులు కావడంతో వారంతా బేల్దారి పనులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. పదిమంది ఒక ముఠాగా ఏర్పడి కూలి పనులకు వెళ్తుంటారు. అందులో భాగంగా ఏటా తొలి ఏకాదశి అనంతరం ఇతర గ్రామాలకు వలసలు పోతుంటారు. ఈ ఏడాది బత్తుల నాగరాజు పదిమందిని తీసుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్ సెప్టెంబర్ మొదటి వారం వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే జ్వరం బారిన పడ్డాడు. పనుల హడావిడిలో పట్టించుకోక పోవడంతో ముదిరి డెంగీగా మారింది. అనుకోకుండా పడిపోవడంతో దగ్గరలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నాగరాజు బాగా క్షీణించడంతో మెరుగైన వైద్యసేవలు అవసరమని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎస్ఎల్జీ (శ్రీలక్ష్మీ గాయత్రి) సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలో చేర్చారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసిన అనంతరం నాగరాజుకి లివర్ పూర్తిగా దెబ్బతినిందని దీనికి తోడు డెంగీ అని నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో లాభంలేదని చెప్పారు. అప్పటికే అక్కడ మూడు లక్షల పదిహేను వేలరూపాయలు ఖచ్చు చేశారు. బతుకుతాడో లేదో చెప్పలేం గానీ హాస్పటల్లో రోజుకి లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే బంధువుల వద్ద మూడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే గత ఏడాది నాగరాజు తండ్రి బాలకోటయ్యకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అందిన కాడికి అప్పులు చేసి చూపించినా తండ్రి బతకలేదు. వారు రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజుకి లక్ష రూపాయలు అంటే చాలా కష్టంతో కూడిన పని, ఇక వారికి అప్పు ఇచ్చేవారు కూడా లేరు. దీంతో నాగరాజుపై ఆశలు వదులుకున్నారు. తోటి కూలీల ఆపన్నహస్తం: ఇదే సమయంలో గ్రామానికి చెందిన మేస్త్రీలు, కూలీలు అతడిని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. పరిస్థితి విషమించడంతో మనతో నిన్నటి వరకు కలిసి పని చేసిన వ్యక్తిని ఎలాగైనా బతికించుకుందాం అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నాగరాజు వైద్య ఖర్చుల కోసం తమకి తోచినంత సహాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరు తమ వెసులుబాటుని బట్టి రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు విరాళాలుగా నగదుని రూ.5,18,000 వసూలు చేశారు. వారికి తెలిసిన వైద్యులకు రిపోర్టులను చూపి వారి సలహా మేరకు నాగరాజుని హైదరాబాద్ నుంచి మంగళగిరి వద్ద ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. వెంటిలేటర్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లో సెప్టెంబర్ 23న ఎన్ఆర్ఐకి చేరుకున్నారు. నాగరాజు పరిస్థితిని చూసిన అక్కడి వైద్యులు లాభంలేదు, ఒంగోలు రిమ్స్‌కి తీసుకెళ్లండని సూచించారు. అక్కడ తెలిసిన మెడికల్ కాలేజి ప్రొఫెసర్ సహాయంతో అక్కడే వైద్యం చేయించేందుకు ఒప్పించారు. నాగరాజుకి ఏమైనా ప్రాణాపాయం అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొన్న వైద్యులు నాగరాజుకి మళ్లీ అన్నీ పరీక్షలు చేసి చికిత్స చేయడం ప్రారంభించారు. దీంతో అతని పరిస్థితి రోజు రోజుకి కుదుట పడడంతో బతుకు పై ఆశలు చిగురించాయి. మరో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయగా కొంత మేర కోలుకోవడంతో నాగరాజుని ఈనెల 9న ఇంటికి పంపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడింది. అందరి సహాయ సహకారాలతో నాగరాజు బతకడంతో గ్రామంలో ఇలాంటి అపాయం ఎవరికి వచ్చినా తామంతా అండగా నిలుద్దామని యువకులు నిర్ణయానికి వచ్చారు. తమకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నాగరాజు కుటుంబ సభ్యులు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎస్ఎల్జీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజు (ఫైల్) -
వీరజవాన్లకు సాయం 4రెట్లు
న్యూఢిల్లీ: యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారని శనివారం కొందరు అధికారులు తెలిపారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ మొత్తం చెల్లిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని, సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్‌గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
కరీబియన్ దీవులకు వంద కోట్లు
న్యూయార్క్: కరీబియన్ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు భారత్ తనవంతు సాయంగా సుమారు రూ.100కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. సౌరశక్తి, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరుల పనులకుగాను మరో రూ.1000 కోట్ల రుణాలు కల్పించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. బుధవారం న్యూయార్క్‌లో కరీబియన్ దేశాల సమాఖ్య ‘కరికామ్’తో మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో తొలి ‘కరికామ్’ సమావేశంలో మోదీతోపాటు సెయింట్ లూసియా ప్రధాని, కరికామ్ ఛైర్మన్ అలెన్ ఛాస్టెనెట్లు పాల్గొన్నారు. భారత్ సాయం ఇరు పక్షాల మధ్య ఉన్న సంబంధాలను ఉన్నతస్థానానికి తీసుకెళ్తుందని అలెన్ వ్యాఖ్యానించారు. గయానాలో ఐటీ రంగంలో ప్రాంతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు, బెలీజ్‌లో ప్రాంతీయ వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రధాని అంగీకరించినట్లు కరికామ్ ఓ ప్రకటనలో పేర్కొంది. సదస్సు సందర్భంగా మోదీ మాట్లాడారు. కరీబియన్ దేశాలతో ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సంబంధాలను దృఢం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో న్యూయార్క్‌లో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిస్థితులు, ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్, అమెరికాల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం విశేషం. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై దాడులకు ఇరానే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ‘ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ స్థితిగతులపై చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా కిర్గిజిస్తాన్‌లో ఈ జూన్‌లోనే మోదీ, రౌహనీల మధ్య భేటీ జరగాల్సి ఉన్నా, ఇతర కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇటీవలి కాలం వరకు ఇరాక్, సౌదీ అరేబియాల తరువాత ఇరాన్ నుంచే భారత్ ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటూ ఉండేది. -
‘మా బిడ్డను ఆదుకోండి’
సాక్షి, పంజగుట్ట: కేన్సర్‌తో బాధపడుతున్న తన ఒక్కగానొక్క కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఏడేళ్ల వయసులో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారి ఎముకల కేన్సర్‌తో అవస్థలు పడుతుండడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ఉన్న ఒక్క ఎకరం భూమి అమ్మి, అప్పులు చేసి వైద్యం చేయించామని వారు తెలిపారు. వైద్యులు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేయాలని చెబుతున్నారని, అందుకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. వివరాలు.. తాండూర్లోని బక్నారం గ్రామానికి చెందిన వర్రె రాజేందర్‌రెడ్డి, మల్లేశ్వరి దంపతులు. వీరు బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో నివసిస్తున్నారు. రాజేందర్‌రెడ్డి సెక్యూరిటీ గార్డు కాగా.. మల్లేశ్వరి స్వీపర్‌గా పని చేస్తోంది. వీరికి మదన్‌రెడ్డి (7) కొడుకు ఉన్నాడు. మదన్‌రెడ్డి పుట్టిన సంవత్సరానికే అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా చికిత్స చేయిస్తూ ఉండడంతో మదన్‌రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. 2016లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించగా బోన్ కేన్సర్ అని తేలింది. చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని సిటిజన్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. -
కష్టాల వేళ.. సర్కారు చేయూత
సాక్షి, కాకినాడ : గోదావరి వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఉపాధి కోల్పోయి, ఇంటికే పరిమితమైన కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి రూ.5000 చొప్పున 14,435 కుటుంబాలకు రూ.7,21,75,000 విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులందాయి. ఆర్థిక సాయం పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అకౌంట్ల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రెండు రోజుల్లో నగదు జమయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను గత నెల 8వ తేదీన ఆయన స్వయంగా ఏరియల్ సర్వే చేసి వరద ముంపులో బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధితులకు ‘నేనున్నా’నంటూ భరోసా ఇచ్చారు. విదేశాల్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా జిల్లాలో గోదావరి వరద బాధితులను కంటికి రెప్పలా చూసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బాధితులకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. పరిస్థితిపై ఆరా తీసేందుకు మూడుసార్లు మంత్రుల బృందాన్ని క్షేత్రస్థాయికి పంపించారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వరద తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మన్యంలో వరద పరిస్థితి, అందుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా పునరావాస కేంద్రాల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. వరదల్లో నష్టపోయిన వారికి సాయంగా రూ.5 వేలు, రవాణా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో వంతున పప్పులు, నూనె వంటి నిత్యావసరాలు యుద్ధప్రాతిపదికన సరఫరా చేశారు. రూ.7.21 కోట్ల సాయం విడుదల గోదావరి వరద ప్రభావిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేసింది. జులై 30 నుంచి ఆగస్టు 12 వరకు సంభవించిన వరదల్లో వారం రోజులకుపైగా నీటిలో చిక్కుకున్న 14,435 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.7,21,75,000 ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఇందులో ఎటపాక డివిజన్లో పరిధిలో 9,321 కుటుంబాలకు, రంపచోడవరం 5,000, అమలాపురం 55, రామచంద్రపురం డివిజన్లలో 59 కుటుంబాలకు సాయం అందనుంది. ఇప్పటికే 49,380 కుటుంబాలకు 12,345 క్వింటాళ్ల బియ్యం, 493 క్వింటాళ్ల కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, 49,380 లీటర్ల వంటనూనె, 1,46,313 లీటర్ల కిరోసిన్ ఇప్పటికే పంపిణీ చేశారు.గతానికి భిన్నంగా నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వంద శాతం సబ్సిడీతో పంట సాగుకు విత్తనాలు సరఫరా చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. గత టీడీపీ హయాంలో మొక్కుబడి తంతు టీడీపీ ప్రభుత్వ హయాంలో విపత్తులు ఎదురైనప్పుడు కేవలం ఐదు కిలోల బియ్యం, మొక్కుబడిగా కిరోసిన్ ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండేది. 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించేవారు. గతానికి భిన్నంగా నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వంద శాతం సబ్సిడీతో పంట సాగుకు విత్తనాలు సరఫరా చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పారదర్శక పంపిణీకి శ్రీకారం వరద బాధితులకు సాయం సొమ్ము నేరుగా అందేలా చర్యలు తీసుకోనున్నారు. మధ్యవర్తులు, దళారులకు ఆస్కారం లేకుండా బాధితుడికి అందజేసేందుకు శ్రీకారం చుట్టారు. బాధితుడి బ్యాంక్ ఖాతాలో నేరుగా సాయం సొమ్ము జమ చేస్తున్నారు. ఇందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. బాబు హయాంలో... వరదలు వచ్చే సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేతల్లో కన్నా అనవసర హడావుడే ఎక్కువగా కనిపించేది. వరద నష్టంకన్నా ప్రచారానికే అధిక వ్యయమయ్యేది. అంతా తానే చేస్తున్నట్టుగా మీడియాలో ప్రచారం కల్పించి బాధితులకు మొండిచేయి చూపించేవారు. ఇస్తే...గిస్తే ఐదు కిలోల బియ్యం, మొక్కుబడిగా కిరోసిన్ అందజేసి చేతులు దులుపుకొనేవారు. విత్తనాలు అరకొరగా అందించేవారు. జగన్ పాలనలో... జిల్లాలో ఏ ఉపద్రవం వచ్చినా ప్రాథమికంగా అధికార యంత్రాంగం, మంత్రుల సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అధినేత దిశా నిర్దేశంతో అమలు చేయాలి... బాధితులను ఆదుకోవాలి. అదే చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 14,435 బాధిత కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా అన్నమాటకు అనుగుణంగా రూ.7,21,75,000 మంజూరు చేశారు. బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం గోదావరి వరద ప్రభావిత బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరద ప్రభావానికి నష్టపోయిన కుటుంబాలను గుర్తించాం. వారి బ్యాంకు ఖాతా నెంబర్ల సేకరణ ప్రక్రియకు నాంది పలికాం. సొమ్ము పక్కదారి పట్టకుండా నేరుగా చర్యలు తీసుకుంటున్నాం. సాయం సొమ్ము నేరుగా బాధితుడి ఖాతాల్లోనే జమ చేస్తాం. మరో రెండు రోజుల్లో సాయం అందే అవకాశం ఉంది. – మురళీధర్‌రెడ్డి, కలెక్టర్ -
జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!
సాక్షి, సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మరణించిన ‘సాక్షి’ క్రైం రిపోర్టర్ బ్యాగరి నర్సింహులు కుటుంబ సభ్యులకు కలెక్టరేట్ ఆవరణలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ తరపున రూ.10 వేలు, కలెక్టర్ ఎం.హన్మంతరావు తన వంతుగా రూ.5 వేలు శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి డేవిడ్ రాజ్, సంతోష్, నాగభూషణం, రమేష్, రఘునందన్, డీపీఆర్ఓ పాల్గొన్నారు. -
సయీద్ అరెస్టుకు సిద్ధం
లాహోర్/న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్, అతని ప్రధాన అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారన్న ఆరోపణలపై సయీద్‌తోపాటు మరో 13 మంది జేయూడీ నేతలపై పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బుధవారం 23 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే హఫీజ్ సయీద్‌తోపాటు కేసులు నమోదైన 13 మంది నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పాక్ పోలీసులు ప్రకటించడం గమనార్హం. సయీద్‌ను అరెస్టు చేసేందుకు గాను పంజాబ్ పోలీసులు ‘పైస్థాయి’ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ఒకరు వెల్లడించారు. సయీద్ ప్రస్తుతం లాహోర్ లోని జాహర్ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నారని, ప్రభుత్వం నుంచి పచ్చజెండా రాగానే ఏక్షణమైనా పోలీసులు సయీద్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సదరు వ్యక్తి తెలిపారు. సయీద్ ఈ వారంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనీ వివరించారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టే విషయమై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్‌కు గతంలో పలుమార్లు చివాట్లు పెట్టింది. జూన్‌లోగా చర్యలు తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ గతంలో విధించిన గడువును పాక్ ఉల్లఘించింది. దీంతో గడువును అక్టోబర్ వరకు పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్.. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు తేల్చిచెప్పింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే సయీద్ అరెస్టుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ మోసగించడానికి ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో అన్నారు. -
ఎస్బీఐ జనరల్ నుంచి సైబర్ బీమా పాలసీ
న్యూఢిల్లీ: సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం మొదలైన వాటి నుంచి వ్యాపార సంస్థలకు రక్షణనిచ్చేలా ప్రత్యేకంగా బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ప్రారంభ దశలో చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి పెడతామని, ఆ తర్వాత పెద్ద కార్పొరేట్ సంస్థలకూ అందించనున్నామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అన్ని రకాలు, పరిమాణాల వ్యాపార సంస్థలకు సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిందని, ఈ నేపథ్యంలోనే అలా వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసేందుకు అనువుగా ఈ పాలసీని రూపొందించడం జరిగిందని ఎస్బీఐ జనరల్ తెలిపింది. -
2.18 కోట్ల మందికి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసింది. తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.18 కోట్ల మంది రైతులకు రూ. 4,366 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ఐదెకరాలలోపున్న నిర్దేశిత సన్న చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చుల నిమిత్తం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి నిధులను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలు అయ్యాక మిగిలిన రైతులకు కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 14.41 లక్షల మందికి ఐదెకరాలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులని పీఎం–కిసాన్ పథకం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా, మాజీ చైర్మన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైర్ అయిన ఉద్యోగులు, అధికారులు అనర్హులు. స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు కూడా అనర్హులే. 10 వేల రూపాయలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా అనర్హుల జాబితా కిందకే వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులకు ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. దీంతో తెలంగాణలో సన్న, చిన్నకారు రైతులు దాదాపు 47 లక్షల మంది ఉంటే, వారిలో కేవలం 26 లక్షల మంది మాత్రమే పీఎం–కిసాన్ పథకానికి అర్హులయ్యారు. తెలంగాణ లో 14.41 లక్షల మంది రైతులకు రూ.288 కోట్లు విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా ఏపీలో 32.15 లక్షల మంది రైతులకు రూ.643 కోట్లు అందజేసింది. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 25.58 లక్షల మంది రైతులకు రూ. 511.62 కోట్లు అందజేసింది. అత్యంత తక్కువగా ఛత్తీస్‌గఢ్‌లో 36 మంది రైతులకు రూ.72 వేలు అందజేసింది. -
సంక్షోభం నుంచి బయటపడేందుకు జెట్ కసరత్తు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకులు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేసేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రణాళిక అమలు ద్వారా మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని ధీమా వ్యక్తం చేసింది. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ , సంస్థలో వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్ సీఈవో టోనీ డగ్లస్ సోమవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక సంక్షోభం, రుణభార సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్.. నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రుణాలను ఈక్విటీ కింద మార్చే ప్రతిపాదనకు గత వారం సంస్థ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. మరోవైపు, జెట్ ఎయిర్వేస్ నుంచి బాకీలు రాబట్టుకునే అంశంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎస్బీఐ సోమవారం తెలిపింది. -
ఆర్థిక సాయమందిస్తే...
న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాంకు మెరుగవ్వాలంటే అంతర్జాతీయ టోర్నీలే దిక్కని, దీని కోసం తనకు ఆర్థిక సాయమందించాలని జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ సౌరభ్ వర్మ అభ్యర్థించాడు. 26 ఏళ్ల వర్మ ఎనిమిదేళ్ల క్రితమే 2011లో సీనియర్ జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఖరీదైన శిక్షణకు నోచుకోకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, గాయాలు తదితర కారణాలతో అతను తరచూ టోర్నీలకు దూరమవుతున్నాడు. దీంతో 2012లో కెరీర్ బెస్ట్ 30వ ర్యాంకుకు చేరుకున్న సౌరభ్ ఇప్పుడు 55వ ర్యాంకుకు పడిపోయాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అంతర్జాతీయ టోర్నీలు ఆడేంత స్థోమత నాకు లేదు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. దీనికి తోడు కొత్త నిబంధన నాకు శాపమైంది. కేవలం టాప్–25 ర్యాంకర్లకు మాత్రమే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో నాకు అంతర్జాతీయ టోర్నీలు ఆడే అవకాశం కష్టమైంది. దాంతోపాటే ర్యాంకింగ్ కూడా దిగజారింది’ అని అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో నా ప్రతిభ చూసిన ‘బాయ్’ డచ్ ఓపెన్ ఆడేందుకు సాయపడిందని... అయితే మరిన్ని అంతర్జాతీయ టోర్నీలు ఆడేందుకు మరింత చేయూత కావాలని సౌరభ్ వర్మ కోరాడు. కనీసం 10 నుంచి 12 టోర్నీలు ఆడితేనే ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయన్నాడు. గతేడాది మోకాలి గాయం బాధించడంతో ఆటకు దూరమయ్యానని, ఇప్పుడైతే టోర్నీలను నా సొంత డబ్బులతోనే ఆడుతున్నానని చెప్పాడు. ఇది తనకు పెనుభారమవుతోందని తెలిపాడు. ‘త్వరలో స్విస్ ఓపెన్, ఒర్లియన్స్ ఓపెన్ ఆడేందుకు వెళుతున్నా. దీనికి అయ్యే ఖర్చంతా నాదే’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక గతేడాది సౌరభ్... రష్యా ఓపెన్, డచ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. ఇటీవలే గువాహటిలో ముగిసిన జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఈ సీనియర్ టోర్నీలో అతను మూడో టైటిల్ గెలుచుకున్నాడు. -
పెళ్లి కానుక కోసం.. కళ్లు కాయలు
సాక్షి, అమరావతి: పెళ్లి నాటికి పెళ్లి కానుక అందిస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఆచరణలో అది అమలుకావడం లేదు. పెళ్లి సమయంలో కల్యాణ మిత్రలు వచ్చి ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశాకే కానుకను ఆన్లైన్ ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. పెళ్లి కానుక అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు వారి అధికారుల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి. ఇవి కాకుండా మండలానికి ఇద్దరు చొప్పున స్వయం సహాయక సంఘాల నుంచి నియమితులైన కల్యాణ మిత్రలు.. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇంటికెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి పత్రికను తీసుకుంటారు. వీరిద్దరికి పెళ్లి జరుగుతుందని తెలిసిన వారి నుంచి సాక్ష్యం తీసుకుంటారు. పెళ్లి సమయంలో అక్కడికెళ్లి ఫొటోలు తీసుకుని ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయితేగానీ పెళ్లి కానుక అందని పరిస్థితి. ఆంక్షలతో ఆలస్యం ఈ పథకాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి 45,875 జంటలు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోగా కానుక ఇచ్చింది మాత్రం 16,956 జంటలకే. అంటే ఇంకా 28,919 జంటలకు అందాల్సి ఉంది. పథకం ప్రారంభానికి ముందు.. 15 రోజులు ముందుగా పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. వీరందరికీ అక్టోబర్‌లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటలు 29,834 ఉన్నాయి. అంటే ఇంకా కానుక అందుకోవాల్సిన జంటలు మొత్తం 58,753 మంది ఉన్నాయి. పెళ్లి కానుక గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మంజూరులో మాత్రం రకరకాల ఆంక్షలు పెడుతోంది. మంజూరు చేయగానే పంపిణీ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే మంజూరు చేశాక నెలకు కూడా కానుక అందడం లేదు. పెళ్లి కానుకను కూడా రాజకీయాలకు వాడుకోవాలనే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉండటంపై నూతన వధూవరులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రకరకాలుగా.. పెళ్లికానుక కింద షెడ్యూల్డ్ కులాల వారికి రూ.40 వేలు, షెడ్యూల్డ్ తెగల వారికి రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, మైనార్టీలకు రూ.50 వేలు ఇస్తున్నారు. ఈబీసీలకు ఇవ్వడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు.. రూ.1,00,116 చెల్లిస్తున్నారు. -
కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం..
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామానికి చెందిన రైతు మచ్చల ఈరన్న అప్పుల బాధ భరించలేక 2017 అక్టోబరు 18న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని భార్య శ్యామల, నలుగురు పిల్లల జీవితం వేదనా భరితంగా మారింది. ప్రభుత్వం నుంచి చంద్రన్న బీమా సహా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్న శ్యామల, నలుగురు పిల్లల వేదనా భరిత జీవితమే నిదర్శనం. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా సొంతూరు జాలిమంచి. పదేళ్ల క్రితం ఈరన్నతో పెళ్లి అయింది. నా భర్త పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సకాలంలో వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి. మా కాపురం ఎంతో సంతోషంగా కొనసాగింది. మాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. మా అమ్మ, నాన్న, అత్త, మామ చనిపోయారు. నా భర్త సొంత భూమితోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేశారు. అతివృష్టి, అనావృష్టి కల్లోలం రేపడంతో పెట్టుబడి పెట్టడం తప్ప రాబడి లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఉల్లి, పత్తి వేశాం. వానలు ఎక్కువై పంటలు పోయాయి. తెలిసిన వారి దగ్గర చేసిన అప్పు రూ. 3 లక్షలతో పాటు ఆదోని ఆంధ్రా బ్యాంకులో తీసుకున్న అప్పు రూ.1.5 లక్షలు కట్టలేక పోయాం. పోయినేడు వానలే లేవు. మా పొలంలో సాగు చేసిన పత్తి దిగుబడి విత్తనాల ఖర్చుకు కూడా రాలేదు. గర్భవతిని కావడంతో తొమ్మిదో నెలలో పుట్టినిల్లు జాలిమంచిలో మా చిన్నాన్న ఇంటికి పురిటికి వెళ్లాను. ఒంటరిగా ఉన్న నా భర్త ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయిన వారంలో మగ పిల్లోడు పుట్టాడు. నెలలోపే దొడ్డనగేరికి వచ్చేశాను. విఆర్ఓ సురేష్ వివరాలు సేకరించుకు వెళ్లారు. ఏడాది దాటినా ఒక్క పైసా సాయం అందలేదు. ఈ ఏడు తీవ్ర కరువు వచ్చింది. మా పొలంలో పత్తి వేసినా దిగుబడి పెద్దగా రాలేదు. బోరు బావుల కింద కూడా పంటలు లేవు. ఉపాధి పనులు పెట్టలేదు. కూలి పనికి పిలిచే వారు కూలీలుగా మారారు. వారానికి రెండు రోజులు కూడా కూలి పనులు దొరకటం లేదు. డీలరు వేసే బియ్యంతో నెలలో సగం రోజులు ఒక పూట గడచిపోతోంది. మిగిలిన రోజుల్లో కూలి పనులు దొరికితే ఒక పూట కడుపు నింపుకుంటున్నాం. లేదంటే మంచి నీళ్లతోనే ఆకలిని సంపుకుంటున్నాం. ప్రభుత్వం ఏదో ఒక రోజు ఆదుకుంటుందన్న ఆశతోనే రోజులు వెళ్లదీస్తున్నా..’ – కె.బసవరాజు, సాక్షి, ఆదోని, కర్నూలు జిల్లా -
బండి సుధాకర్ కుటుంబానికి సాయం అందేనా?
వ్యవసాయాన్నే జీవనాధరం చేసుకొని కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లు కష్టపడినా.. కాలం కలసి రాక పేరుకుపోయిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. బంగి సుధాకర్ ఆత్మహత్య పాలై 16 నెలలు గడిచినా పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుసుకుంటే ఎవరికైనా గుండె గొంతుకలోకి వస్తుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల కేంద్రానికి చెందిన సుధాకర్(35) అనే రైతు అప్పుల పాలై 2017 ఆగస్టు 24న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తండ్రి సోమన్న పేరు మీద∙రెండు ఎకరాల పొలం ఉంది. దీనికి తోడు మరో 13 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయితే, సొంత పొలం కేవలం రెండు ఎకరాలే ఉందన్న సాకుతో బ్యాంకులో అప్పు ఇవ్వలేదు. దీంతో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి సాగు కోసం రూ.5 లక్షలు అప్పులు చేశాడు. కొండంత ఆశతో సాగు చేసిన పంటలు వర్షాల్లేక సరిగ్గా పండకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. చేసిన రూ.5 లక్షల అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో కలవరం మొదలై పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అనుమంతమ్మ, 4గురు పిల్లలు ఉన్నారు. కుమార్తె స్ఫూర్తి(11) ఆరో తరగతి, గణేష్(9) నాలుగో తరగతి, కవల పిల్లలు రాజు, రాజేష్ (5) యూకేజీ చదువుతున్నారు. ఆర్డీఓ విచారణ చేసి వెళ్లారు.. సాయం అందలేదు.. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో నలుగురు పిల్లల పోషణ తనకు కష్టంగా మారిందని అనుమంతమ్మ అన్నారు. కూలీ నాలీ చేసి పిల్లల ను పోషిస్తున్నారు. ఆదోని ఆర్డీఓ వచ్చి విచారణ చేసి వెళ్లారని, అయినా తమకు ఎలాంటి సహయం చేయలేదన్నారు. – పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా -
పరిమళించిన సంస్కారం
ఒంటరిగా జీవన పోరాటం చేస్తున్న ఆ యువతిని ఆదుకోడానికి ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రెహానాకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు సాక్షి పాఠకులు కనుమూరు హరిచంద్రారెడ్డి. ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష అందజేసి, స్నేహితుల ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. మంచంలో ఉన్న భర్తకు తల్లిగా సపర్యలు చేస్తూ, కాలం చేసిన మామకు.. తనే కొడుకై తల కొరివి పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించింది రెహానా. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులను, బంధువులను వదిలేసి వచ్చి మతాంతర వివాహం చేసుకున్న యువతి ఆమె. భర్త అనారోగ్యంతో శల్య స్థితిలో మంచంలో ఉన్నాడు. మామ మరణించడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అయిన వారెవరూ ముందుకు రాలేదు. దీంతో రెహానానే హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానం వరకూ వెళ్లి అక్కడ, ఆ ధర్మం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించింది. దీనిపై సాక్షి ‘ఫ్యామిలీ’ అక్టోబర్ 24న ‘అంతిమ సంస్కారం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని చూసి పాఠకులు కొందరు స్పందించారు. వారిలో ఒకరు గూడూరు తూర్పువీధి ప్రాంతానికి చెందిన కనుమూరు హరిచంద్రారెడ్డి. ‘‘ఈ కథనం నా మనసును కదలించింది’’ అంటూ రెహానా సంస్కారాన్ని ఆయన అభినందించారు. ఆమె భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మంచంలోనే ఉన్నాడని చెప్పడంతో అతనికి అవసరమైన సహాయం చేస్తామనీ, రెహానాను తమ ట్రస్ట్ ద్వారా మరింత ఆదుకునే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. శ్రీనివాసులు స్నేహితుడైన శ్రీనాథ్ కూడా స్పందించి ‘హెల్ప్ టు శ్రీను’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, అందులో అతని స్నేహితుల నంబర్లను అనుసంధానం చేశారు. దీంతో అతని మిత్రులైన ఎస్వీ సుధాకర్ రూ.20 వేలు, ఉమాశంకర్‌రాజు, బిల్డర్ చంద్రతో పాటు మరికొందరు కలిసి రూ.1,05,000 శ్రీనివాసులు అకౌంట్లో జమ చేశారు. – సాక్షి ప్రతినిధి, గూడూరు -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
కేరళకు యూఏఈ విరాళంపై వివాదం
-
యూఏఈ అంబాసిడర్ సంచలన ప్రకటన
తిరువనంతపురం: వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీసాయాన్ని ప్రకటించడం ఆకర్షణీయంగా నిలిచింది. అయితే తాజాగా యూఏఈ ఆర్థికసాయంపై మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సాయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలేదని యూఏఈ అంబాసిడర్ ప్రకటించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. కేరళకు అందించే ఆర్థిక సహాయం నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. వారికందించాల్సిన విరాళాలపై తమ అంచనా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పారని రిపోర్ట్ చేసింది. అయితే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేవలం 600 కోట్ల రూపాయలిచ్చి కేంద్రం చేతులు దులుపుకోగా గల్ఫ్‌దేశం రూ.700 కోట్ల భారీ సాయం అందించిందంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు విదేశీ ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా భారీ చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. విదేశీసాయంపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే, యూఏఈ రాయబారి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూఏఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం కూడా గమనార్హం. మరి తాజా గందరగోళంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు గల్ఫ్ దేశం సాయాన్నితిరస్కరించడంపై పలువురు నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ గల్ఫ్ దేశం ఇచ్చింది రుణంకాదు, సాయం, విపత్తు నివారణ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే యూఏఈ సహాయాన్ని ఆమోదించేలా విధానంలో సవరణలు తేవాలంటూ ప్రధాని మోదీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఒక లేఖ రాశారు. ప్రజల బాధలను నిర్మూలించేలా విధానాలు ఉండాలి, విదేశీ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, దయచేసి తగిన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ యూఏఈ సహాయంపై స్వయంగా మీడియాకు తెలియజేసారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. -
విలయానికి సైతం ఎదురొడ్డి..
కొచ్చి: మహా విలయం చుట్టుముడితే అది మిగిల్చిన కల్లోలం నుంచి బయటపడడం పెను సవాలే. అయితే కేరళ తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. అన్ని వైపుల నుంచి వచ్చిన సాయంతో పాటు కేరళీయుల మనోస్థైర్యంతో వరద కష్టాలకు ఎదురొడ్డి నిలిచింది. నిరాశలో కూరుకుపోకుండా ప్రజల ప్రాణాల్ని కాపాడుకునేందుకు పోరాట పటిమ ప్రదర్శించింది. రాష్ట్రపాలకులకు, నాయకత్వానికీ ఈ విపత్తు పెద్ద సవాల్! మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్రీకరించి, సైనికదళాల సాయంతో సహాయక చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి విజయన్ కృతకృత్యులయ్యారు. అప్రమత్తతతో సాహసోపేతమైన సహాయక చర్యలు చేపట్టడం వల్ల వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు, చిన్నారులనూ కాపాడారు.వరద విలయాన్ని ఎదుర్కోవడంలో కేరళ ప్రజల పాత్ర అనన్యసామాన్యం. వైద్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇలా ఎవరికి తోచిన సాయం వారందించారు. బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అహోరాత్రులు శ్రమించారు. వరదల్లో చిక్కుకున్న గర్భిణులు, చిన్నారుల్ని భుజాలకెత్తుకుని తీసుకెళ్ళారు. స్వచ్ఛంద కార్యకర్తలెందరో అహోరాత్రులు శ్రమించి కేరళ ప్రజల్లో దాగున్న పోరాటపటిమను చాటిచెప్పారు. వరద సాయంలో కేరళ మత్స్యకారుల పాత్ర మరువలేం. సొంత ఖర్చుతో వరద ప్రాంతాలకు చేరుకొని తమ శరీరాలను మెట్లుగా మలిచి ఎందరినో కాపాడారు. 1924 విలయాన్ని తట్టుకుని.. కేరళ మట్టిలోనే పోరాడే శక్తి ఉంది. అక్కడి ప్రభుత్వం, ప్రజలు సమైక్యంగా వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్న తీరు 1924లో కేరళని అతలాకుతలం చేసిన విలయాన్ని గుర్తుకు తెస్తుంది. 1924లో కేరళని ముంచెత్తిన వరదలు కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. మృతుల సంఖ్యపై సరైన లెక్క లేకపోయినా ఆ వరదల్లో వేల మంది మరణించారు. లక్షల మంది శిబిరాల్లో తలదాచుకున్నారు. ఆ ఏడాది ప్రభుత్వం పన్నులు రద్దుచేసింది. వ్యవసాయ రుణాల కోసం నిధులు కేటాయించింది.. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఇళ్ళనిర్మాణం కోసం ఆర్థిక సాయం, వెదురును ఉచితంగా సరఫరా చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో కేరళ మళ్లీ కోలుకుంది. -
ఎన్నారైలు @ 12.5 కోట్లు
దుబాయ్: కేరళను ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. భారత సంతతికి చెందిన యూఏఈ వ్యాపారవేత్తలు ఆదివారం రూ.12.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ మూలాలున్న లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ఫాతిమా హెల్త్‌కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ రూ.5 కోట్ల చొప్పున ప్రకటించారు. యునిమొని అండ్ యూఏఈ ఎక్సే్ఛంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి రూ. 2 కోట్లు, అస్టర్ డీఎమ్ హెల్త్‌కేర్ చైర్మన్, అజద్ మూపెన్ రూ. 50 లక్షల సాయం చేశారు. -
వెల్లువెత్తుతున్న ఆర్థిక సాయం
సాక్షి, బెంగళూరు: ముప్పేట వరదలతో అతలాకుతలమైన కేరళకు నలువైపుల నుంచి ఆర్థిక సాయం వెల్లువెత్తుతోంది. రూ.10 కోట్ల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతున్నట్లు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అమృతానందమయి చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అమరీందర్ రూ.10 కోట్ల చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ప్రముఖ ప్రసార మాధ్యమ సంస్థ స్టార్ ఇండియా కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. రూ.25 లక్షల సాయం చేయనున్నట్లు ఆసియానెట్ ఉద్యోగులు చెప్పారు. -
బోరుబావి ఘటనకు ఏడాది
కృష్ణా, వినుకొండ: ఆడుకుంటున్న బాలుడు బోరుబావిలో పడి మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన సంఘటన జరిగి అప్పుడే ఏడాది పూర్తయింది. పది గంటలపాటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం టీవీల ముందు కూర్చుని బాలుడు ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో జరిగిన ఈ ఘటనలో బాలుడిని రక్షించేందుకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు సంఘటనాస్థలికి చేరుకుని శ్రమించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, స్థానిక పోలీసులు, ప్రజల సాయం తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ వేగంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా బోరుబావిలో పడ్డ బాలుడు (అప్పట్లో బాలుడి వయసు ఏడాదిన్నర) ప్రాణాలతో బయటపడ్డాడు. జిల్లా అధికార యంత్రాంగం దాదాపు పది గంటలపాటు కష్టపడి 15 అడుగుల మేరకు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వి బాలుడిని సజీవంగా బయటికి తీసుకొచ్చారు. అనుములమూడి మల్లికార్జునరావు, అనూష దంపతుల కుమారుడు చంద్రశేఖర్ (చందు) ఇప్పుడు అంగన్వాడీ పాఠశాలకు వెళుతున్నాడు. తమ బిడ్డ తమ ముందు తిరుగాడుతున్నాడంటే అధికారులు పడ్డ కష్టమేనని ఆ బాలుడి తల్లిదండ్రులు నిత్యం గుర్తుచేసుకుంటున్నారు. అమలుకాని ముఖ్యమంత్రి హామీ రెండు తెలుగురాష్ట్రాల్లో బోరుబావి నుంచి బయటపడ్డ మొట్టమొదటి బాలుడు చందు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చందుకి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం చంద్రబాబు సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా పిలిపించుకుని చందుతో ఫొటోలు దిగి బాలుడి భవిష్యత్ కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం
-
ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’లో పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాక్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీని ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఆ దేశ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు విదేశీ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. బుధవారం పారిస్‌లో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరైన పాక్ ఆర్థిక మంత్రి షంషాద్ అక్తర్.. తమ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జమాత్–ఉద్– దవా సంస్థ అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహా ఉగ్రమూకలకు నిధులు అందకుండా చేయటానికి వచ్చే 15 నెలల్లో అమలు చేయనున్న 26 అంశాల కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనిపై చర్చించిన ఎఫ్ఏటీఎఫ్..పాక్ పేరును గ్రే జాబితాలో ఉంచనున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ నిర్ణయం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. దీనిపై పాక్ స్పందిస్తూ.. ‘ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇది రాజకీయ పరమైన నిర్ణయం. ఉగ్రవాదంపై పోరులో పాక్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు. త్వరలోనే గ్రే జాబితా నుంచి బయటపడతాం. గతంలోనూ ఇలా జరిగింది’ అని పేర్కొంది. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ గ్రూపులో 37 దేశాలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది. కాగా, గ్రే లిస్ట్‌లో ఇప్పటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలున్నాయి. గ్రే లిస్ట్‌లో ఉంటే ఏమవుతుంది? ఇప్పటికే పాక్ పలుకుబడి అంతర్జాతీయంగా మసకబారింది. ఉగ్రవాదులతో సంబంధ మున్న దేశంగా ముద్రపడితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ పెట్టుబ డులు పెట్టడానికి, కంపెనీలు నెలకొల్పేందుకు విదేశీ సంస్థలు సంశయిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టడం కష్టం. స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకులు దేశం నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వవు. -
బిగ్ బాస్‌కి నో చెప్పేశాడు
సాక్షి, ముంబై/శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో గతేడాది ఓ వీడియో సంచలనం సృష్టించింది. రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తిని కవచంగా మార్చుకున్న సైన్యం.. అల్లరిమూకపై ఎదురుదాడి చేసింది. బుద్గాం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ, జాతీయ మీడియాల దృష్టిని ఆకర్షించింది. కాగా రాళ్లదాడికి పాల్పడే వ్యక్తిగా ఫరూక్ అహ్మద్ దార్ (29) సైన్యం ముద్రవేయడంతో ప్రభుత్వం అతనికి అండగా నిలువడం లేదు. మరోవైపు సైన్యానికి సహకరించాడంటూ గ్రామస్థులు కూడా సామాజికంగా బహిష్కరించారు. దీంతో జీవనోపాధి కరువై దార్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హిందీ బిగ్ బాస్ నిర్వాహకులు అతనికి పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే అతను ఆ సాయాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ‘ఓ రోజు బిగ్ బాస్ నిర్మాత ఒకరు నాకు ఫోన్ చేశారు. రూ. 50 లక్షల చెక్కు ఇస్తామని, మీ కోసం టికెట్లు సిద్ధం చేశామని చెప్పారు. నేను వద్దని స్పష్టం చేశాను. అయినా ఫర్వాలేదు మీకోసం మేం సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని ఆయన నాతో అన్నారు’ అని దార్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు వెల్లడించాడు. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మానవతా కోణంలోనే అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చారని దార్ తరపు న్యాయవాది అహ్సన్ వుంటూ తెలిపారు. కాగా, బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. శ్రీనగర్ లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికలను బహిష్కరించాలని వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. అయితే వేర్పాటువాదుల హెచ్చరికలను లెక్కచేయకుండా దార్ తన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వెళ్లాడు. అదే సమయంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. తమ బలం తక్కువగా ఉండటంతో వారి నుంచి తప్పించుకునేందుకు దార్‌ను ఓ జీప్ కు కట్టేసి మేజర్ లీతుల్ గొగోయ్ నేతృత్వంలోని సైన్య బృందం ప్రతిఘటించింది. ఆ ఘటన తర్వాతే దార్ జీవితం మలుపు తిరిగింది. ఎంబ్రాయిడరీ దుస్తుల నిపుణుడైన దార్‌కు.. కూలీ పని కూడా దొరకని పరిస్థితి నెలకొంది. చివరకు అహ్మద్ దార్‌కు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని జమ్ము-కశ్మీరు మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో దార్ న్యాయపోరాటం కొనసాగుతోంది. -
తూత్తుకుడిలో విద్రోహ శక్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. చెన్నై నుంచి బుధవారం ఉదయం తూత్తుకుడికి చేరుకున్న రజనీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన 48 మందికి రూ.10వేలు చొప్పున సాయం అందజేశారు. తర్వాత ఆయన∙మీడియాతో మాట్లాడారు. ‘జిల్లా కలెక్టర్ కార్యాలయంపై దాడి, అగ్ని ప్రమాదానికి కారణం సంఘ విద్రోహశక్తులే.ఉద్యమంలోకి సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయనే విషయం ముందుగా తెలుసుకోవటంలో పోలీసునిఘా విఫలమైంది. సీఎంగా జయలలిత అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఆమె బాటలో సాగాలి’ అని అన్నారు. తూత్తుకుడి ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవటంపై.. ‘మీడియా చాలా శక్తివంతమైంది. ఈ విషయం ఆయన్నే అడగండి’ అని రజనీ అన్నారు. -
కానిస్టేబుల్‌కు సహచరుల ఆర్థికసాయం
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను తన బ్యాచ్ కానిస్టేబుళ్లు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ కెరమెరి పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న హజీపూర్ మండలం రాపెల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందగా కుడికాలు పూర్తిగా తొలగించారు. మూడు నెలల నుంచి ఇంటి వద్ద ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ పరిస్థితి తెలుసుకున్న కానిస్టేబుళ్లు రూ.50 వేలు జమ చేసి.. మంగళవారం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కానిస్టేబుళ్లను అభినందించారు. కృత్రిమ కాలు అమర్చే విధంగా ఆర్థిక సాయం అందజేయాలని కుమురంభీం జిల్లా ఎస్పీ సింగనేవార్ కల్మేశ్వర్‌ను కోరుతామని అన్నారు. అదనపు ఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సభ్యులు దేవిదాస్, ఇసాక్, శ్రీనివాస్, ఎండి.యూనుస్, సురేష్, గజానన్ పాల్గొన్నారు. -
సిరియాపై ట్రంప్ పిడుగు
వాషింగ్టన్ : అంతర్యుద్ధంతో విచ్ఛిన్నమైన సిరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాకే ఇచ్చారు. భారీ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్రెజరీ(నిధుల) విభాగానికి ఆయన ఆదేశాలు జారీచేశారు. తాజాగా సిరియా నుంచి తమ బలగాలు వెనక్కి తీసుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో సుమారు 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్లు ట్రెజరీ శాఖ పేర్కొంది. ఫిబ్రవరిలో కువైట్ పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్.. సిరియా పునర్మిణానికి ఆ భారీ ఆర్థిక సాయ ప్రకటన చేశారు. దాడుల్లో విధ్వంసం అయిన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయాల కోసం వీటిని వెచ్చించనున్నట్లు టిల్లర్సన్ ఆ సమయంలో ప్రకటించారు. ఇక సిరియన్ డెమొక్రటిక్ దళాలకు సాయంగా అమెరికా 2 వేల మంది సైనికులను సుమారు దశాబ్దం క్రితమే సిరియాలో మోహరించింది. తాజా నిర్ణయంతో త్వరలో వారంతా స్వదేశానికి చేరుకోబోతున్నట్లు గురువారం ట్రంప్ ప్రకటించారు కూడా. -
కోట్లు పోతున్నాయి
ట్యాంపరింగ్‌తో పరువు ఎలాగూ పోయింది...ఏడాది పాటు బ్యాట్‌ను ఇంట్లో మూలన పెట్టేయాల్సిందే... కానీ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు వీటితో పాటు ఆర్థికపరంగా కూడా భారీ స్థాయిలో నష్టం జరగనుంది. ఆటపరంగా, ఆర్జనపరంగాఆస్ట్రేలియా క్రికెట్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నవీరిద్దరిపై తాజా పరిణామాలతో పెద్ద దెబ్బే పడబోతోంది. ఐపీఎల్‌కు దూరం కావడంతో పెద్ద మొత్తం కోల్పోయిన వీరిద్దరు సంవత్సరం పాటు ఇతర మ్యాచ్ ఫీజుల డబ్బులు కూడాపోగొట్టుకుంటారు. అన్నింటికి మించి వ్యక్తిగత స్పాన్సర్షిప్ ఒప్పందాలు దూరం కావడం వల్ల జరిగే నష్టం కూడా చాలా పెద్దది. సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా జట్టు రాబోయే షెడ్యూల్‌ను బట్టి చూస్తే సంవత్సర కాలంలో ఆ జట్టు 12 టెస్టులు, 26 వన్డేలు, 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడబోతోంది. కచ్చితంగా మూడు ఫార్మాట్లలో కూడా తుది జట్టులో ఉండగలిగే స్మిత్, వార్నర్ ఈ మ్యాచ్‌లు అన్నింటికీ దూరమవుతున్నారు. ఇంగ్లండ్ పర్యటన (ఐదు వన్డేలు, ఒక టి20), పాకిస్తాన్‌తో యూఈఏలో సిరీస్ (3 టెస్టులు), స్వదేశంలో దక్షిణాఫ్రికా (ఐదు వన్డేలు, 3 టి20లు), భారత్ (నాలుగు టెస్టులు) ఇందులో అతి ప్రధానమైనవి. ఇవి కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగే సిరీస్‌లకు కూడా వీరిద్దరు దూరం కానున్నారు. ఐపీఎల్ దెబ్బ... స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్, వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు తమతో అట్టి పెట్టుకున్నాయి. నిబంధనల ప్రకారం ఇద్దరిని చెరో రూ. 12 కోట్ల మొత్తానికి ఆయా ఫ్రాంచైజీలు ఉంచుకున్నాయి. స్మిత్ బ్యాటింగ్‌కంటే కూడా అతని నాయకత్వ ప్రతిభకారణంగానే రాయల్స్ ఎంచుకుందనేది వాస్తవం. 45 రోజుల వ్యవధిలో అతను ఇంత పెద్ద మొత్తం కోల్పోతున్నాడు. మరోవైపు 2016లో జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా వార్నర్‌కు సన్‌రైజర్స్ ప్రత్యేక విలువ ఇచ్చింది. అందుకే కెప్టెన్‌గా తొలగించడంలో తొందర పడలేదు. బ్యాట్స్‌మన్‌గానైనా అతడిని ఆడించాలనే ఆలోచనే చివరి నిమిషం వరకు కూడా వారిలో కనిపించింది. అయితే నేరుగా బీసీసీఐ అడ్డు చెప్పడంతో మరో అవకాశం లేకుండా పోయింది. కాంట్రాక్ట్ మొత్తమూ... ప్రస్తుతం స్మిత్, వార్నర్ మ్యాచ్ ఫీజు రూపంలో ఆసీస్ బోర్డు నుంచి చెరో 5 లక్షల 80 వేల ఆస్ట్రేలియా డాలర్లు తీసుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్ట్ రూపంలో స్మిత్‌కు 15 లక్షల డాలర్లు, వార్నర్‌కు 8 లక్షల 16 వేల డాలర్లు లభిస్తున్నాయి. ఐపీఎల్ మొత్తంతో పాటు దీనిని కలిపితే స్మిత్ ఏడాదికి 45 లక్షల 80 వేల ఆసీస్ డాలర్లు, వార్నర్ 38 లక్షల 96 వేల ఆసీస్ డాలర్లు పోగొట్టుకుంటారు. మన కరెన్సీలో చూస్తే స్మిత్‌కు రూ. 22 కోట్ల 90 లక్షలు... వార్నర్‌కు రూ. 19 కోట్ల 48 లక్షల నష్టం జరగనుంది. ఏ రకంగా చూసినా మైదానంలో ఆట ద్వారా దక్కే ఆర్జనను వీరు భారీగా కోల్పోయినట్లే లెక్క. స్పాన్సర్లూ వెనక్కి... ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలందరి దృష్టిలో విలన్లుగా మారిన క్రికెటర్లతో అనుబంధం కొనసాగించడం ఏ సంస్థకైనా కష్టమే. బ్రాండ్ అంబాసిడర్లుగా తమ ఉత్పత్తుల స్థాయిని పెంచాల్సినవాళ్లు చేసిన పనితో తమ ప్రతిష్ట ఇంకా దెబ్బ తినవచ్చని వారు భయపడటం సహజం. అందుకే ఇప్పుడు వీరిద్దరి స్పాన్సర్లలో ఎంత మంది కొనసాగుతారో చెప్పడం కష్టం. వార్నర్‌తో ఒప్పందం పునరుద్ధరించుకోబోమని ఎల్జీ ఇప్పటికే ప్రకటించింది. అతనికి నెస్లే మైలో, టయోటా, అసిక్స్, గ్రే నికోల్స్‌తో ఒప్పందం ఉంది. స్మిత్‌కు న్యూ బ్యాలెన్స్ ప్రధాన స్పాన్సర్ కాగా...జిల్లెట్, ఫిట్‌బిట్, వీట్ బిక్స్ తదితర సంస్థలతో పెద్ద ఒప్పందాలు ఉన్నాయి. క్రికెట్‌పరంగా కోల్పోయే డబ్బుతో పాటు ఇవన్నీ కూడా జత కలిస్తే ట్యాంపరింగ్ వీరిద్దరిపై ఎంత ప్రభావం చూపించబోతోందో అర్థమవుతుంది. ఇందుకే వారికి శిక్ష తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనను ఉల్లంఘించినందుకే ముగ్గురు ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రధానంగా నాలుగు అంశాలను ఇందులో ప్రస్తావించింది. అవి 1) క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడం 2) స్థాయికి తగినట్లు ప్రవర్తించకపోవడం 3)క్రికెట్ ప్రయోజనాలకు హాని కలిగించడం 4) ఆటను వివాదాస్పదం చేయడం. వీటితోపాటు ఆటగాళ్లు వ్యక్తిగతంగా చేసిన తప్పులనూ పేర్కొంది. దాని ప్రకారం ఎవరెలా అంటే... స్టీవ్ స్మిత్: 1. బంతి ఆకారాన్ని కృత్రిమంగా మార్చే ఆలోచన గురించి ఇతడికి తెలుసు. 2. ట్యాంపరింగ్ ప్రణాళిక అమలు కాకుండా నిరోధించలేదు. 3. ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువును మైదానంలో దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. బాన్‌క్రాఫ్ట్ ప్రయత్నాలపై మ్యాచ్ అఫీషియల్స్, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలతో పాటు ప్లాన్‌ను పొడిగించి, అందులో అందరినీ భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నించడం. డేవిడ్ వార్నర్: 1. ట్యాంపరింగ్ ఆలోచనను రూపొందించడం. 2. బంతి ఆకారం దెబ్బతీసేలా జూనియర్ ఆటగాడికి సూచనలు చేయడం. 3. బంతి స్వరూపాన్ని ఎలా మార్చవచ్చో సలహాలివ్వడంతో పాటు వివరించి చూపడం. 4. ప్లాన్ అమలును నిరోధించడంలో విఫలమవడం. 5. తన పరిజ్ఞానంతో మ్యాచ్ అధికారులను తప్పుదోవ పట్టించడం, ట్యాంపరింగ్‌లో భాగం కావడం. 6. మ్యాచ్ అనంతరం కూడా తన ఆలోచనను స్వచ్ఛందంగా వెల్లడించకపోవడం. బాన్‌క్రాఫ్ట్: 1. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ఆలోచనలో నేరుగా పాల్గొనడం. 2. ట్యాంపరింగ్ ప్రయత్నాన్ని కొనసాగించడం 3. తన దగ్గర ఉన్న వస్తువును దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. మ్యాచ్ అధికారులు, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం. -
'మా డబ్బులు కావాలంటే పాక్ ఇవి చేయాలి'
వాషింగ్టన్ : తమ దేశం నుంచి ఆర్థిక సాయం కావాలంటే పాకిస్థాన్ కొన్ని తప్పకుండా చేయాలని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు పెంటగాన్ అధికారిక ప్రతినిధి కలోనెల్ రాబ్ మ్యానింగ్ విలేకరులకు కొన్ని విషయాలు వెల్లడించారు. 'మేం అనుకున్నది చాలా సూటిగా చెప్పాం. మా అంచనాలు కూడా డొంకతిరుగుడు లేకుడా సూటిగా ఉన్నాయి. మా నుంచి పాకిస్థాన్‌కు డబ్బు సాయం కావాలంటే మేం చెప్పే ఈ పనులు చేయాల్సిందే. అవేమిటంటే.. 1. తాలిబన్ ఉగ్రవాదులను తుదముట్టించడం 2. హక్కానీ నెట్‌వర్క్‌ను, నాయకత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం 3. ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేయడం 4. పాక్‌లో ఉగ్రవాదులకు చోటే లేకుండా చేయడం 5. పాక్ నుంచి వేరే ప్రాంతాలపై ఎలాంటి దాడులు జరగకుండా చూసుకోవడం ప్రస్తుతానికి పైన పేర్కొన్న అంశాలు తమ ప్రాధాన్యత అంశాలని, అవన్నీ పాక్ చేస్తే ఎప్పటిలాగే వందల మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పాక్ అందుతుందని మ్యానింగ్ చెప్పారు. ప్రతి ఏడాది ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్‌కు 900 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా చేస్తోంది. అలాగే, సైన్యం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు కూడా ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని చేస్తోంది. అయితే, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే కారణంతో ఆ నిధులన్నింటిని ట్రంప్ సీజ్ చేశారు. పాక్ తీరు మార్చుకోకుంటే వాటిని అమెరికాలో రోడ్లు, వంతెనలు నిర్మించేందుకు ఉపయోగించడని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
వాట్ యాన్ ఐడియా.. వెరీ గుడ్ : ట్రంప్
వాషింగ్టన్ : 'చాలా మంచి ఆలోచన.. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ అమెరికన్ సెనేటర్పై ప్రశంసలు గుప్పించారు. ఆ సెనేటర్ చేసిన ఆలోచనకు ముగ్దుడైపోయారు అది ఎందుకనుకుంటున్నారా.. పాకిస్థాన్‌కు సంబంధించిన విషయంపైనే.. అవునూ.. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ర్యాండ్ పౌల్ ఓ బిల్లును తెరపైకి తెచ్చారు. అందులో పాక్‌కు నిధులు నిలిపివేసే అంశమే ఉంది. ఇది చూసిన ట్రంప్ వెంటనే ఆయనకు ఓ వీడియోతో సహా ప్రశంసలతో కూడిన ట్వీట్ చేశారు. 'మంచి ఆలోచన ర్యాండ్. ఉగ్రవాదంపై పాక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేనందున ఈ నిధులు ఆపేయాలంటూ తెచ్చిన బిల్లు బావుంది. మన దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచేందుకు ఆ డబ్బు వినియోగిద్దామన్న ఆలోచన మంచిది' అని ట్రంప్ చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని తుదముట్టించని కారణంగా ప్రతి ఏటా అమెరికా చేస్తున్న ఆర్థిక సాయం నిరర్ధకమవుతోందని, ఈ ఏడాది ఆ డబ్బును పంపిచడం ఆపేసి దాంతో దేశంలో రహదారులు, వంతెనలువంటి మౌలిక సదుపాయాలకు ఉపయోగించుదామని సెనేటర్ ర్యాండ్ బిల్లును తెచ్చారు. దాదాపు రెండు బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా ఆపేసిన విషయం తెలిసిందే. -
'ఏం చేయాలో పాకిస్థానే డిసైడ్ చేసుకోవాలి'
వాషింగ్టన్ : పాకిస్థాన్ విషయంలో అమెరికా వైఖరి కఠినంగానే మారినట్లు మరోసారి స్పష్టమైంది. చాలాకాలంపాటు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపిన తర్వాతే పాక్‌పై అమెరికా ఒత్తిడిని నానాటికి పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తాజాగా మరోసారి వైట్ హౌస్ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. 'పాకిస్థాన్‌ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ప్రత్యామ్నాయాలను మేం సిద్ధంగానే ఉంచుకున్నాం. తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ విషయంలో పాక్ కఠినంగా ఉండకున్నా, వారి రక్షణ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయకున్నా మేం మా ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తాం. ఏం చేయాలో పాక్ డిసైడ్ చేసుకోవాలి' అంటూ వైట్ హౌస్ శనివారం ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పాక్ భద్రత కోసం ఏటా అమెరికా చేసే సాయం రెండు బిలియన్ డాలర్లను ఈసారి అమెరికా ఆపేసిన విషయం తెలిసిందే. పాక్ చెబుతున్నంత సంతృప్తి స్థాయిలో ఉగ్రవాద చర్యలను నిలువరించడం లేదనే కారణంతో ఆ దేశానికి నిధులు ఇవ్వడం ఆపేసింది. దానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా పై హెచ్చరికను చేసింది. -
ద్వైపాక్షిక విశ్వాసానికి దెబ్బ: పాక్
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొంది మోసం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని దెబ్బతిస్తాయని పేర్కొంది. పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ నేతృత్వంలో మంగళవారం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, హోం మంత్రి అశాన్ ఇక్బాల్, రక్షణ మంత్రి ఖుర్రమ్ ఖాన్, త్రివిధ దళాల చీఫ్‌లు హాజరయ్యారు. ట్రంప్ ఆరోపణలు పూర్తి అసంబద్ధంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ తరువాత వెలువడిన ప్రకటనలో మండలి పేర్కొంది. -
పాక్‌కు ట్రంప్ షాక్
వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ.. బయటకు కపట నాటకాలాడుతున్న పాకిస్తాన్ నెత్తిన భారీ పిడుగు పడింది. ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ‘సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా?’ అని ట్వీటర్లో సోమవారం ఘాటుగా విమర్శించారు. సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది. ఇదా మీరిచ్చే ప్రతిఫలం! ‘గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా పాక్‌కు 33 బిలియన్ డాలర్ల సాయాన్నందించింది. కానీ.. దీని ప్రతిగా పాక్ మమ్మల్ని మోసం చేసింది. దొంగలెక్కలు, అబద్ధాలు చెప్పింది. మా నేతలను వాళ్లు మూర్ఖులనుకుంటున్నారు’ అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామం గా మారింది. అతితక్కువ సాయంతో అఫ్గానిస్తాన్‌లో వేట కొనసాగిస్తున్నాం. ఇకపై ఇలాం టివి సాగవు’ అని ట్రంప్ తొలి ట్వీట్లో విమర్శించారు. ఓ అమెరికా అధ్యక్షుడు మిత్రదేశంగా ఉంటూ వస్తున్న పాక్‌పై ఇలాంటి ఘాటు విమర్శలు చేయటం ఇదే తొలిసారి. తన గడ్డపైనుంచి ఉగ్రవాదాన్ని తరిమేసేందుకు పాకిస్తాన్ సుముఖంగా లేని కారణంగా వారికి ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14.3 వేల కోట్లు) సాయాన్ని నిలిపేయాలని అమెరికా భావిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. సయీద్ విషయంలో సీరియస్ ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ రెండు నెలల క్రితం విడుదల చేసినప్పుడూ అమెరికా బహిరంగంగానే విమర్శించింది. సయీద్‌ను వెంటనే అరెస్టు చేసి పునర్విచారణ జరపాలని సూచించింది. ఒకవేళపాక్ ఈ అంశంపై స్పందించకుంటే అమెరికా–పాక్ ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం తప్పదని హెచ్చరించింది. తన దక్షిణాసియా పాలసీని ప్రకటించిన ట్రంప్.. ఉగ్రవాదంపై పాక్ తన తీరును మార్చుకోని పక్షంలో కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. ‘మేమింత సాయం చేస్తున్నా.. అమెరికన్లను చంపాలని ప్రతినిత్యం ప్రయ త్నించే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్ర యం కల్పిస్తోంది. ఈ పరిస్థితి తక్షణమే మారాలి’ అని నాడు ట్రంప్ స్పష్టం చేశారు. రెండు దశాబ్దాలుగా హెచ్చరికలు పాక్ ఉగ్రస్థావరాలకు స్వర్గధామంగా మారిందనే అంశాన్ని భారత్ పలుమార్లు అంతర్జాతీయ సమాజానికి ఆధారాలతో సహా వెల్లడించింది. అమె రికా కూడా పాక్ ఉగ్ర స్వర్గధామంగా మారిందని ధ్రువీకరించింది. రెండు దశాబ్దాలుగా ఉగ్రకేంద్రాలను నిర్వీర్యం చేయాలని అమెరికా సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తూ వచ్చింది. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే అంశంపై పాక్‌కు పలుమార్లు సూచించారు. సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. అయినా పాక్ తీరులో మార్పు రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు నేరుగా తుపాకీ ఎక్కుపెట్టారు. క్రిస్మస్కు ముందు అఫ్గానిస్తాన్‌లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా.. పాకిస్తాన్ ఉగ్రవాదుల సాయంతో అఫ్గానిస్తాన్, భారత్‌ల అంతర్గత భద్రతకు విఘాతం కల్గిస్తోందని విమర్శించారు. సరైన సమాధానమిస్తాం: పాక్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ దేశ ప్రధాని షాహిద్ అబ్బాసీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ‘ట్రంప్ ట్వీట్‌కు మేం వీలైనంత త్వరగా సమాధానమిస్తాం. ప్రపంచానికి అసలు నిజాలు తెలియాలి. వాస్తవాలు–కల్పితాల మధ్య తేడాను మేం వివరిస్తాం’ అని సమావేశం అనంతరం ఆసిఫ్ చెప్పారు. అమెరికా సాయం అందుతుందా లేదా అనే అంశాన్ని పక్కనపెట్టి దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే పాక్ ముందుకెళ్లాలని పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా ఖురేషీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోందని.. దీనికి అనుగుణంగా పాక్ విదేశాంగ విధానంలోని లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని విపక్ష పీపీపీ సెనెటర్ షెర్రీ రెహమాన్ పేర్కొన్నారు. -
దినకరన్.. ఇలా గెలిచెన్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత ఆకస్మిక మరణానికి శశికళే కారణమంటూ ప్రచారం ఓవైపు.. ఎన్నికల కమిషన్‌కి లంచం ఇవ్వజూపిన కేసులో జైలుకెళ్లిన అప్రతిష్ట మరోవైపు.. పళనిస్వామి ప్రభుత్వానికి పుష్కలంగా కేంద్రం అండదండలు, డీఎంకేకు సమర్థమైన నాయకత్వం.. ఇవేవీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ (శశికళ సోదరి కుమారుడు) విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దీనికితోడు ‘అమ్మ’ కంటే దినకరన్‌కే అధిక మెజారిటీని ఆర్కేనగర్ ఓటర్లు కట్టబెట్టడం, నోటాకన్నా బీజేపీకి తక్కువ ఓట్లు రావటం విస్తుపోయేలా చేసింది. ‘ఆర్కేనగర్’కు ఆర్థిక సాయం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాతే దినకరన్ పేరు తెరపైకి వచ్చింది. శశికళకు పాదాభివందనం చేసి పార్టీ పగ్గాలు ఇచ్చిన నేతలు ఆమె జైలుపాలు కాగానే తగిన కారణం చూపకుండానే దినకరన్‌పై బహిష్కరణ వేటు వేయడం ప్రజల్లో సానుభూతి కలిగించిందని విశ్లేషకులంటున్నారు. అదే సమయంలో తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనం కావడం విమర్శలకు దారితీసింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపి జైలుకు వెళ్లిన దినకరన్.. తిరిగొచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నేతలను, కార్యకర్తలను చేరదీశారు. ఆర్కే నగర్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. దీంతో దినకరన్ తన సొంత డబ్బుతో స్థానిక ప్రజల రుణాలు తీర్చినట్లు తెలుస్తోంది. జయ మరణం తర్వాత ఓసారి ఉపఎన్నిక రద్దవటం, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నా.. దినకరన్ వెనుకంజ వేయలేదు. తన అనుచరుల ద్వారా అక్కడి పేదలకు సాయం చేస్తూ సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఎన్నికకు ముందు రోజు వ్యూహాత్మకంగా ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో ఆస్పత్రిలోని బెడ్‌పై జయలలిత జ్యూస్ తాగుతున్నట్లు కనిపించారు. ఇది కూడా శశికళపై ఆగ్రహం తగ్గేందుకు కారణమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు, ఎన్నికకు ముందురోజు దినకరన్ భారీగా డబ్బులు పంపిణీ చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ పరోక్ష సాయం ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళ ఓటర్లు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జోక్యాన్ని సహించలేకపోయారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనన్ ఓటమికి అసమర్థ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంటున్నారు. అటు, ఆర్కేనగర్లో డీఎంకేకు చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. అయినా కూడా ఆ పార్టీకి డిపాజిట్ రాకపోవడం గమనార్హం. దినకరన్ గెలిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం బలహీనపడుతుందనే వ్యూహంతోనే స్టాలిన్ మిన్నకుండిపోయారనే ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూడా బీజేపీ గూటికి చేరుతుందనే అనుమానాలతో ప్రజలు ఆ పార్టీకి మొండిచేయి చూపారని భావిస్తున్నారు. కరుణానిధిని మోదీ పరామర్శించడం, కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమాలను డీఎంకే విరమించుకోవడం, పోలింగ్ సమయంలోనే కనిమొళి, రాజా 2జీ కేసులో నిర్దోషులుగా తేలడం వంటివి ఆర్కే నగర్ ఓటర్లు డీఎంకేనూ పక్కన పెట్టేందుకు కారణమయ్యాయంటున్నారు. -
దిగ్గజ దీనస్థితి.. స్పందించిన సూపర్ స్టార్
సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరోసారి తన దయా గుణాన్ని ప్రదర్శించాడు. బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్(69)కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కౌర్ కొంత కాలంగా మొహలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. 1982లో ఏషియన్ గేమ్స్‌లో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ అయిన కౌర్ మెడికల్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారంటూ ఈ మధ్యే టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. అది చూసి స్పందించిన షారూఖ్ తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పేరు మీదుగా కౌర్‌సింగ్ కుటుంబానికి అందజేశారు. ‘‘ఆటగాళ్లుగా ఇలాంటి దిగ్గజాలు తమ కృషి ద్వారా దేశానికి ఎంతో పేరు తెచ్చారు. అలాంటప్పుడు వారి బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అంటూ షారూఖ్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ మధ్యే పంజాబ్ ప్రభుత్వం రెండు లక్షల చెక్‌ను ఆయనకు అందజేయగా.. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) కూడా లక్ష రూపాయాలను ఆయన చికిత్స కోసం అందజేసిన విషయం తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ ముహమద్ అలీతో రింగ్‌లో తలపడిన ఏకైక భారతీయుడిగా కౌర్ సింగ్ ఘనత సాధించారు. -
హజ్ యాత్రికులకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేయూత
కొడంగల్ : హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింములకు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. కొడంగల్‌లోని దారుల్ ఉలూం పాఠశాలలో బుధవారం యాత్రికులను సన్మానించారు. నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి హాజ్ యాత్రకు ఆరుగురి ఎంపికవగా వారిని సన్మానించారు. ఎండీ సులేమాన్, రియాసత్ ఖాన్, అల్లావుద్దీన్, ఎం.ఏ మోహీద్లతోపాటు మరో ఇద్దరు మహిళలు హజ్‌కు వెళ్తున్నారు. రూ.1.25లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాల సందర్శనతో పుణ్యంతో పాటు జ్ఞానం పెరుగుతుందన్నారు. సంస్కతి సంప్రదాయాలు తెలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, మహ్మద్ యూసూఫ్, ప్రశాంత్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కిట్లోనే ‘అమ్మ ఒడి’
ఈ పథకం కిందే గర్భిణులకు 12 వేలు,15 రకాల వస్తువులు ► కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేలు కలిపి అందజేత ► నగదు బదిలీ పద్ధతిలో నాలుగు దశల్లో లబ్ధిదారు ఖాతాకు సొమ్ము ► ఇద్దరు పిల్లలకే పథకం వర్తింపు, మూడో ప్రసవానికి నో ► మార్గదర్శకాలు విడుదల ► కరీంనగర్ లేదా హైదరాబాద్‌లో 25న ప్రారంభించనున్న సీఎం? సాక్షి, హైదరాబాద్: ఇక అమ్మ ఒడి పేరుతో పథకం ఉండదు. దాని బదులుగా కేసీఆర్ కిట్ పథకం కిందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇవ్వనున్న రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేలు కలిపి కేసీఆర్ కిట్ పథకం కింద గర్భిణులకు అందజేస్తారు. దీనికి సంబం ధించి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మ ఒడి పథకం కింద గర్భిణులకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్ పథకం కింద బాలింతలు, శిశువులకు అవసరమైన 15 రకాల వస్తువులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రెండు పథకాలకు బదులు ఒకే పథకం కింద వీటిని అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆ మేరకు కేసీఆర్ కిట్ పథకం కిందే ఈ రెండింటినీ అమలుచేస్తారు. నాలుగు దశల్లో నేరుగా ఖాతాకు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం, అనవసర సిజేరియన్ ఆపరేషన్లు జరగకుండా చేయడం, తల్లీబిడ్డల క్షేమం తదితర లక్ష్యాలతో ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను ప్రారంభించిన సం గతి తెలిసిందే. ఇందులో భాగంగా గర్భిణులకు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే అదనంగా రూ.వెయ్యి ఇస్తారు. ఆ సొమ్మును నాలుగు విడతల్లో గర్భిణుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నప్పుడు మొదటి దశలో రూ.3 వేలు ఇస్తారు. మెడికల్ ఆఫీసర్ ద్వారా కనీసం రెం డు పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే మొదటి సొమ్ము అందజేస్తారు. రెండో దశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న సమయంలో రూ.4 వేలు ఇస్తారు. ఆడపిల్ల పుడితే అదనంగా మరో రూ.వెయ్యి ఇస్తారు. అప్పుడే తల్లీబిడ్డలకు 15 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఇక మూడో దశలో శిశువుకు పెంటావాలెంట్, ఓపీ వీ వంటి డోసులు అందజేసినప్పుడు రూ.2 వేలు ఇస్తారు. నాలుగో దశలో బిడ్డకు 9 నెలలు వచ్చినప్పుడు మీజిల్స్ వ్యాక్సిన్ వేసే సమయంలో రూ.3 వేలు ఇస్తారు. ఇద్దరు పిల్లలకే.. గర్భిణుల వివరాలను సేకరించే బాధ్యత పూర్తిగా ఏఎన్ఎంలపైనే ప్రభుత్వం ఉంచింది. గర్భి ణులు తప్పనిసరిగా ఆధార్ సహా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఇద్దరు పిల్లలు పుట్టే వరకే ఈ ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తారు. మూడో బిడ్డకు వర్తించదు. ఒకవేళ కవలలైతే ఒక్కసారికే ఆర్థిక సాయం చేస్తారు. రెండో కాన్పుకు డబ్బు ఇవ్వరు. కవలలిద్దరికీ రెండు కేసీఆర్ కిట్లు అందజేస్తారు. తల్లీ బిడ్డలు చనిపోయినా కుటుంబ సభ్యులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ఈనెల 25న హైదరాబాద్ లేదా కరీంనగర్‌లలో ఎక్కడో ఒక చోట ప్రారంభించే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
నవోదయ శిక్షణ కేంద్రానికి రూ.40వేలు సాయం
తాడూరు: మండల పరిధిలోని మేడిపూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత నవోదయ శిక్షణ కేంద్రానికి గురువారం పాలెంకు చెందిన మనసాని రమేష్ రూ. 40వేలు, తండ్రిలేని అభయశ్రీకి రూ.2వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈసందర్భంగా ఎంఈఓ టి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు విద్యార్థుల ఎదుగుదల కోసం చదువులో రాణించాలనే ఉద్ధేశ్యంతో చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే లక్ష్యంతో సహాయ, సహకారాలు అందించేందుకు ముందుకొచ్చే దాతలు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆవోపా తరఫున రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఆవోపా జిల్లా అధ్యక్షుడు పోల శ్రీధర్, కోశాధికారి రవి, కుమ్మెర జీహెచ్ఎం గుడిపల్లి నిరంజన్, ఆయా ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు భద్రన్న, ఎస్వీరాజు, కట్టా శ్రీనివాస్‌రెడ్డి, నవోదయ శిక్షకులు రాములుగౌడ్, కార్తీక్, మధు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం
- జగన్ పిలుపు మేరకు స్పందించిన ప్రవాస భారతీయులు - సాయం అందజేసిన జగన్ సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందగా ఆయన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చిన వ్యక్తి కుటుంబానికి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కొందరు ఆర్థిక సాయం చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి (35) గత అక్టోబర్ 2వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను నారాయణ ఆసుపత్రిలో చేర్పించగా బ్రెరుున్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. నిరుపేద కుటుంబీకులైనప్పటికీ ఎంతో ఔదార్యంతో సుబ్బారెడ్డి అవయవాలను వారు దానం చేశారు. అయితే చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవిస్తున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 ఏళ్లు), జశ్వంత్ (7) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం కావ డం, ఇంటిపెద్ద చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం లేదా ఇతరుల నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా... కొందరు పార్టీ నేతలు, అమెరికాలోని ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. సుబ్బారెడ్డి పిల్లలిద్దరి పేరిట చెరో రూ.లక్ష , ఆయన తల్లి పేరిట రూ .60 వేలు మొత్తం రూ 2.6 లక్షలు ఆర్థిక సాయం చేశారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి పిల్లల చదువులకయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాద్‌రెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికి అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను కూడా ఆ కుటుంబానికి చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ ఆర్థిక సాయాన్ని శనివారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆ కుటుంబానికి అందజేశారు. ఆదుకున్న వారందరినీ జగన్ అభినందించారు. కార్యక్రమంలో పుట్టపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ నేత డాక్టర్ హరికృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తమను ఆదుకున్నందుకు సుబ్బారెడ్డి సతీమ ణి శివకుమారి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్యారాణి కుటుంబానికి జగన్ హామీ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్ విద్యార్థిని బి.సంధ్యారాణి తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు బాల సత్తయ్య, ప్రమీల, అన్న రవికుమార్‌లు శనివారం జగన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమార్తె చావుకు కారణం అరుున ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని వారు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.లక్ష్మిని సస్పెండ్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సలామ్‌బాబు, కో- కన్వీనర్ సీవీ సారుునాథ్‌రెడ్డిలు కూడా ఉన్నారు. -
11 ప్రాజెక్టులకు రూ.9 వేల కోట్లు
- పీఎంకేఎస్‌వై కింద కేంద్రం ఆర్థిక సాయం - గ్రాంటుగా రూ.1,299 కోట్లు - నాబార్డు రుణం రూ.7,889.99 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.9 వేల కోట్ల మేర సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీని కింద దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టుల పూర్తికి నిధుల సమీకరణకు కేంద్రం, నాబార్డు మధ్య గతనెల 7న ఢిల్లీలో ఒప్పందం కుదరడం తెలిసిందే. దీంతో రాష్ర్టం లోని 11 పెండింగ్ ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందనుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కింద రూ.1,299.19 కోట్లను, నాబార్డు రుణంగా రూ.7,889.99 కోట్లను ఇవ్వనున్నాయి. 2016-17లోనే కేంద్ర సాయం కింద రూ.993.88 కోట్లు అందనుం డగా మిగతాది వచ్చే ఏడాది లోగా అందనుంది. నాబార్డు నుంచి ఈ ఆర్థిక ఏడాదిలోనే రూ.5,832.31 కోట్ల రుణం రానుండగా 2017-18లో రూ.1,375 కోట్లు, 2018-19 ఏడాదిలో రూ.681 కోట్ల మేర రుణం అందించేందుకు కేం ద్రం సానుకూలత తెలిపింది. నాబార్డు రుణంపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సోమవారం కేంద్ర ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే రుణ మంజూరు జరగనుంది. పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించడం తెలిసిందే. నిర్మాణానికి అవసర మైన రూ.25,159.20 కోట్లలో ప్రభుత్వం ఇప్పటికే 15,969.29 కోట్లను ఖర్చు చేసింది. -
తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే రూ.51 వేల ఆర్థికసాయాన్ని వధువు తల్లి జీవించి లేకపోతే, ఆమె తండ్రి పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకూ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. -
తెలంగాణ ఉద్యమ నేతకు రూ.10లక్షలు
ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కొడుకు ఈతకు వెళ్లి మరణించాడు. కూతురును పోషించుకుంటూ పరంధామ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలసి పరంధామ తన పరిస్థితిని వివరించాడు. దీంతో స్పందించిన సీఎం రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. -
ఆటోడ్రైవర్ వంశీకి ఆర్థిక సాయం
నెల్లూరు(మినీబైపాస్): ప్రమాదంలో గాయపడిన ఆటోడ్రైవర్ వంశీ వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలను మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అందజేశారు. సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పరామర్శించారు. మాస్టర్‌మైండ్స్ తిరుపతి, నెల్లూరు విద్యార్థులు వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలను వంశీ భార్య గీతకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రెండేళ్లలో మూడు కేసులు తన దృష్టికి వచ్చాయని, టీటీడీ ప్రాణదాన ట్రస్ట్, తిరుపతి సిమ్స్ హాస్పిటల్ సహకారం, దాతలు, సీఎం సహాయనిధి, సింహపురి ఆస్పత్రి ద్వారా వంశీకి పూర్తిస్థాయిలో నయం చేయించగలిగామన్నారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు కృతజ్ఞతలను తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కర్ణాల వంశీ, కృష్ణ, మాస్టర్‌మైండ్స్ ప్రిన్సిపల్ రవికిరణ్, వైఎస్సార్ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మదనకుమార్రెడ్డి, నగరాధ్యక్షుడు శేషు, నగర కార్యదర్శులు ముజామిల్, రాకేష్, రాజా, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
‘దిడుగు’ మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత చందర్లపాడు: పుష్కర స్నానాలకెళ్లి మృతిచెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని నేతలు బుధవారం అందజేశారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీశ్, నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన పాశం గోపిరెడ్డి, నందిగామకు చెందిన కమ్మవరపు హరిగోపి, కూచి లోకేశ్, వీరులపాడు మండలం జయంతి గ్రామవాసి నందిగామ నగేష్‌లు ఇటీవల గుంటూరు జిల్లాలోని దిడుగు గ్రామం వద్ద పుష్కరస్నానాలకు వెళ్లి మృత్యువాత పడడం తెలిసిందే. కాగా పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌లు బుధవారం మృతుల కుటుంబాలను కలసి వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఈ ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. -
అవయవదానంతో పునర్జన్మ
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో పునర్జన్మను పొందవచ్చని జేసీ 2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, సెట్నల్ ఆధ్వర్యంలో నగరంలోని రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జేసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాల బారిన పడి బ్రెయిన్‌డెడ్ అయిన వారు అవయవదానంతో 8 మందికి పునర్జన్మను ఇవ్వొచ్చని తెలిపారు. అవయవదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం అవయవ దానం చేసిన నారాయణమ్మ, సుభాషిణి కుటుంబసభ్యులకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ ఏవీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చక్రవర్తి, సెట్నెల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉగ్ర’ ఫైనాన్షియర్ల కోసం వేట
జేకేబీహెచ్కు భారీగా హవాలా నిధులు - నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ బృందాల దర్యాప్తు - హైదరాబాద్‌లో 13 చోట్ల పేలుళ్లకు కుట్ర సాక్షి, హైదరాబాద్ : సాధారణ పదార్థాలతో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్)కు ఆర్థిక సాయం చేసిన ఉగ్ర ఫైనాన్షియర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి పెట్టింది. వారికి అడ్డుకట్ట వేయకపోతే అదను చూసుకుని మరో మాడ్యూల్ ఏర్పాటు చేసే ప్రమాదముందని అనుమానిస్తోంది. అందుకే వీరిని గుర్తించేందుకు తమ కస్టడీలో ఉన్న నలుగురు ఉగ్రవాదుల్నీ లోతుగా విచారించాలని నిర్ణయించింది. ఈ మాడ్యూల్‌కు రాజస్థాన్‌లోని అజ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా నిధులందాయని గుర్తించింది. ఇవన్నీ ‘రియాల్’ కరెన్సీలో వచ్చాయని తేలింది. సిరియాతో పాటు దుబాయ్ కోణమూ వెలుగులోకి వచ్చింది. సిరియాలో ఉన్న వీరి హ్యాండ్లర్ ద్వారానే సమాచార మార్పిడితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక సహకారం అందుతోందని ఇప్పటిదాకా భావించారు. కానీ వీరికి ఉగ్ర నిధులు రియాల్ రూపంలో రావడంతో దుబాయ్‌లోని ఉగ్ర ఫైనాన్షియర్లే హ్యాండ్లర్ ఆదేశానుసారం పంపి ఉంటారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. హ్యాండ్లర్‌తో పాటు ఈ ఫైనాన్షియర్లనూ గుర్తించడం కీలకమనే భావనతో నిందితుల విచారణతో పాటు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టింది. ఈ ముష్కరులు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఆ వివరాలను నిందితులు పూర్తిగా బయటపెట్టడం లేదని అనుమానిస్తోంది. అందుకే అన్ని వివరాలూ రాబట్టడానికి నిందితుల్ని లోతుగా విచారించనుంది. 12 రోజుల పాటు విచారించినా వారు సహకరించనందున పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్ని వికారాబాద్, పోచంపల్లి, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకూ తీసుకెళ్లి ఆధారాలు సేకరించనున్నారు. ‘ఆన్లైన్’లో అప్రమత్తం ఆన్లైన్ వాడకంలో ముష్కరులు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉండే ఈ-మెయిల్స్, డార్క్ వెబ్ వంటి అప్లికేషన్స్ వాడటంతో పాటు ఇబ్రహీం యజ్దానీ ద్వారా హ్యాండ్లర్‌తో సంప్రదింపులు జరిపారు. సమాచార మార్పిడికి ఇదే విధానాలతో పాటు సోషల్‌మీడియాను వాడారు. ఐసిస్ వీడియోలు, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకునేందుకు సొంత కంప్యూటర్లు కాకుండా సైబర్ కేఫ్‌లను వాడారు. ‘ఐసిస్’పై కన్నేసి ఉంచే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదాన్ని శంకించి ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఆయా నెట్ సెంటర్లను గుర్తించి హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 13 ప్రాంతాల గుర్తింపు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్... పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రక్షణ రంగ సంస్థలనూ లక్ష్యం చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయాలను విదేశంలో ఉన్న హ్యాండ్లర్కు ముష్కరులు ఎప్పటికప్పుడు చేరవేశారు. వారిమధ్య ఫేస్బుక్, ఈ-మెయిల్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల ద్వారా జరిగిన మార్పిడైన సమాచారాన్ని ఎన్ఐఏ సేకరించింది. నగరంలోని 13 ప్రాంతాలతో పాటు ఆరుగురు ప్రముఖులు వీరి హిట్‌లిస్ట్‌లో ఉన్నట్టు తేల్చింది. విధ్వంసాలు సృష్టించాలని వారు భావించిన ప్రాంతాలను అధికారికంగా గుర్తించారు. వారినుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషణ కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, తుపాకులు, తూటాల్ని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్), కేంద్రం ఆధీనంలోని సెర్ట్-ఇన్ సంస్థలకు పంపారు. ఖలీఫాగా ప్రకటించుకున్న ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి బద్ధులమై ఉంటామంటూ ప్రమాణం చేయడానికి (బయాత్) వీరు వినియోగించిన పత్రాలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కీలకాధారాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లు ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించడానికి ఆధారాల సేకరణలో భాగంగా పలు ప్రాంతాల నుంచి భారీగా సీసీ కెమెరాల ఫుటేజ్‌లను ఎన్ఐఏ సేకరించింది. బాంబుల తయారీకి ముడి పదార్థాలు సమీకరించుకోవడానికి పలు దుకాణాల్లో, రెక్కీ కోసం పలు ప్రాంతాల్లో సంచరించారు. అప్పుడు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధికారులు సేకరించారు. వీటిని నిందితులతో పోల్చి చూడనున్నారు. ఇందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు. వీరు షెల్టర్ తీసుకున్న, భేటీ అయిన, శిక్షణకు వినియోగించిన ప్రదేశాలకు వెళ్లి క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. వెలుగులోకి వచ్చిన అంశాల్లోని మిస్సింగ్ లింకులను పూరించుకోవడానికి కస్టడీలోకి తీసుకున్న నలుగురినీ విడిగా విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది.