సీఎం 'వైఎస్‌ జగన్' ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం | YS Jagan Helps a Handicapped Person - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం

Published Wed, Nov 27 2019 3:46 PM | Last Updated on Thu, Nov 28 2019 11:28 AM

YS Jagan Help A Handicapped Person - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగుడికి సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థిక సాయం చేశారు. అతన్ని ఆదుకునేందకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. 5లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆ దివ్యాంగుడికి అందజేశారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ.. లక్ష రూపాయల సాయం అడిగితే.. సీఎం రూ. 5లక్షలు ఇవ్వడం చాలా  సంతోషంగా ఉందన్నారు. గొప్ప మానవతావాది ముఖ్యమంత్రిగా లభించడం పేదల అదృష్టం అని తెలిపారు. 

చదవండి : స్పందించిన సీఎం వైఎస్ జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement