కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని హామీ
ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.34,005.12 కోట్లు సాయం
రూ. 24 వేల కోట్లు అదనంగా సాయం
డీబీటీ ద్వారానే రూ.26,232.93 కోట్లు..
నాన్ డీబీటీ ద్వారా మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనం
పార్టీలు, సిఫార్సులు, అవినీతికి తావు లేకుండా లబ్ధి
కాపులను నిలువునా మోసం చేసిన చంద్రబాబు
ఏటా రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు సాయం అని బాబు హామీ
వాస్తవంగా ఐదేళ్లలో బాబు కేటాయించింది రూ.1,340 కోట్లే
మోసం చేసిన బాబు ఒక వైపు – హామీకి మించి సాయం చేసిన జగన్ మరో వైపు
ముఖ్యమంత్రిగా జగన్ ఉంటేనే వచ్చే ఐదేళ్లు మరింత ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు.
డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు.
అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం.
Comments
Please login to add a commentAdd a comment