kapu
-
మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు. డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం. -
YSRCPలో చేరిన కాపు జేఏసీ నేతలు
-
పవన్ కల్యాణ్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఫైర్
-
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు. -
బడుగులకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. బడుగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికే 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వెలమ సామాజిక వర్గాన్ని కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచేయి చూపారు. టీడీపీ జాబితాలో ముస్లిం మైనార్టీ సీట్లు కేవలం మూడే కేటాయించారు. ఇప్పటివరకు 139 స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించగా, బీసీ-31, ముస్లిం మైనార్టీ-3, ఎస్సీ-26, ఎస్టీ-04, కాపు-09, కమ్మ 30, రెడ్డి-28, వైశ్య-02, క్షత్రియ-05, వెలమ-01 సీట్లు కేటాయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు సీఎం జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
మనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం జగన్ వల్లే దక్కింది: అడపా శేషు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు అయ్యిందని.. ఈ కాలంలో కాపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమిలో 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడని మండిపడ్డారు. జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తిరువూరులో వైఎస్సారీసీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్ ,తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. కాపులకు అండగా ఉంటానని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 30 మందిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. కొలికపూడి శ్రీనివాస్‌పై అడపా శేషు ఫైర్.. ‘రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే. టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం. వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం వైఎస్ జగన్. టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి .పథకాలు ఆగిపోతాయి. కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్. మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే. చిరంజీవి, పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే. వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ, చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు’ అని అడపా శేషు మండిపడ్డారు. -
నేను రాజకీయాల్లో హీరోను.. పవన్‌పై ముద్రగడ ఫైర్
సాక్షి, కాకినాడ: రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘనమైన కుటుంబ చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరా. కానీ, ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బేషరతుగానే వైఎస్సార్సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే.. బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను.. .. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి ఆయన ఎవరు?. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు?. మీరు సినిమాల్లో హీరో కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. .. ‘‘సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదు? అని కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. మీరేంటీ పొడుగు?.. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు. నేను రాజకీయాల్లో గొప్ప. ఆ మాటకొస్తే రాజకీయాల్లోను.. సినిమా ఫీల్డ్ లో నేను ముందున్నాను. మీరా నాకు పాఠాలు నేర్పేది?’’.. అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు. .. ‘వైఎస్సార్సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం’ అంటూ ముద్రగడ ప్రకటించారు. -
Fact Check: ‘కాపు’ కాసిందే జగన్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపుల మదిలో విష బీజాలు నాటి చంద్రబాబుకు మేలు చేయాలనే కుతంత్రంతో రామోజీరావు అడ్డగోలుగా మరో తప్పుడు కథనాన్ని వండి వార్చారు. ‘కాపులకు జగన్ దగా’ అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడులో విషం కక్కారు. అసలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి ఓట్లతో గద్దెనెక్కి వారిని వంచించి వదిలేసిందే చంద్రబాబు. ఇది జగమెరిగిన సత్యం. రిజర్వేషన్లు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి ఎన్నో హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా కాపులను దారుణంగా దగా చేశారు. ఒక్క కాపులే కాదు.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేశారు. మోసాలకు కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర వేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాయ మాటలతో తాను మభ్య పెట్టలేనని, చేసేదే చెబుతానని నిఖార్సైన నాయకుడిగా నిలబడ్డారు. ఇచ్చి న మాటను నిలబెట్టుకుంటూ నవరత్న పథకాలతో కాపులను అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ పెట్టి వారికి నిజమైన మేలు చేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాటునందించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. సీఎం జగన్ 58 నెలల పాలనలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,317.80 కోట్లు ఆర్థిక సాయమందించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ కాపుల ఉన్నతిలో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వసనీయత, నిబద్ధత, నిజాయతీకి సీఎం వైఎస్ జగన్ మారుపేరు. ఈ విషయాలన్నీ తెలిసీ రామోజీ అసత్య కథనంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. రామోజీ ఇలాంటి కథనాలు ఎన్ని అచ్చేసినా చంద్రబాబుకున్న మోసాలకు కేరాఫ్ ముద్రా పోదు.. సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న విశ్వసనీయతకు మారు పేరన్న గౌరవమూ తగ్గదు. రామోజీ అచ్చేసిన కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిస్తే.. ఆరోపణ: కార్పొరేషన్‌ను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు? వాస్తవం: కాపు కార్పొరేషన్‌ను గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది తెలిసినా ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబుకు రాజకీయ మేలు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలకు దిగజారారు. కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరుపుతానని మాట ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా 2014 నుండి 2017 వరుకు ఒక్క రూపాయీ విదల్చలేదు. 2017 నుండి 2019 వరకు రూ.1,874.67 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విడుదల చేసింది రూ.1,334 కోట్లే. అంతే ప్రకటించిన మొత్తంలో రూ.540 కోట్లు బకాయి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు పెట్టిన బకాయిలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ద్వారా చేయూతనిచ్చి ంది. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.15,044.64 కోట్లతో వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ అసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆరోపణ: గత ప్రభుత్వ హయాంలో రూ1,441 కోట్ల మేర రాయితీ రుణాలు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రూ.1,441.75 కోట్లు మేరకు రాయితీ రుణాలు ఇచ్చి నట్టు చంద్రబాబు గురించి గొప్పలు చెప్పిన ఈనాడు.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు మించి నిధులు కేటాయించినప్పటికీ మసిపూసి మారేడు కాయ చేసేలా అబద్ధాలు రాసేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 (ఈ ఏడాది మార్చి) వరకు 19,81,458 మంది లబ్దిదారులకు రూ.3,260.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి వాటికి నిధులు విడుదల చేసింది. వాహన మిత్ర పథకంలో 58 నెలల కాలంలో 25,046 మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.132.57 కోట్లు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: నైపుణ్య శిక్షణ నిలిపేశారు వాస్తవం: నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ సంస్థలకు బకాయిలు పెట్టిన రూ.8.83 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం విద్యోన్నతి అంటూ గొప్పలు చెప్పిన పథకంలో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ ఇచ్చి న సంస్థలకు బకాయి పెట్టిన రూ.6.15 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–2024 ఏడాదికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ద్వారా అర్హత కలిగిన కాపు విద్యార్ధులకు లక్ష రూపాయలు చొప్పున 23 మందికి రూ.23 లక్షలు అందించింది. ఆరోపణ: కాపు భవన నిర్మాణాలపైనా జగన్ కన్నుకుట్టింది వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలు చెప్పి మంజూరు చేసిన భవనాల్లో ఒక్క దానికీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించలేదు. అదీ చంద్రబాబు సర్కారు ఘనత. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీలో, బాపట్ల జిల్లా ఏల్చూరు, అడవిపాలెం, చందలూరులో నాలుగు కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. ఇదీ సీఎం వైఎస్ జగన్ నిబద్ధత. ఆరోపణ: విదేశీ విద్య దక్కకుండా కుతంత్రాలు వాస్తవం: గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్యా పథకంలో అక్రమాలు, అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ పథకాన్ని మరింత మెరుగులు దిద్ది పేద వర్గాలకు మేలు చేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2015–16 నుండి 2018–19 వరకు 307 మంది విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.20.97 కోట్ల మేర బకాయిలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. 2022 నుంచి 2024 (మార్చి) వరకు విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 60 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ రూ.15.62 కోట్లు అందించి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల్లో 2019 నుంచి 2024 వరకు 8,41,677 మంది కాపు విద్యార్ధుల కోసం వారి తల్లులకు రూ.3,950.79 కోట్లు అందించింది. -
కాపుల పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ: వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నం, సాక్షి: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని.. కాపుల పట్ల సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలు పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కాపులకు రూ. 25 కోట్లు భూమి కేటాయించడమమే ఇందుకు నిదర్శనం. అదీ విశాఖ నడిబొడ్డున.. హైవే పక్కన 50 సెంట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘‘రూ. 25 కోట్లు విలువైన 50 సెంట్లు భూమిని కాపు భవనానికి సీఎం జగన్ కేటాయించారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తాం. విశాఖ నగరంలో ఇప్పటికే అనేక కళ్యాణ మండపాల నిర్మాణం పూర్తి చేశాం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 31మంది కాపులు పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఆ 31 మందిలో 29 విజయం సాధించారు. ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను చంపిన వారికి.. ముద్రగడ పద్మనాభంను అవమానించిన వారికి మద్దతు చెబుతారో.. కాపులకు మేలు చేసిన వారికి అండగా ఉంటారో మీరే(కాపులను ఉద్దేశించి..) నిర్ణయించుకోవాలని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేశారు. కాపు నేస్తం పథకం ప్రవేశ పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కులగణన చేపట్టారు. కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు. కాపులకు సేవ చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటాం అని బొత్స ఝాన్సీ అన్నారు. ఇంకా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీదర్, కొండా రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రబ్బరు చెప్పుల రాజకీయం కాస్త.. !’
విజయవాడ, సాక్షి: రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చాడని.. ఇప్పుడు డబ్బున్న వాళ్ళను మాత్రమే జనసేన నాయకుల్ని చేస్తోందని వైఎస్సార్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ విమర్శించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలే చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరి నుంచి పవన్ కల్యాణ్ కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నాడు. పవన్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడు. 2019 తరువాత చార్టర్ ఫ్లైట్ కొన్నాడు. కోట్లు పెట్టి కార్లు కొన్నాడు. అసలు పవన్‌కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?.. .. పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తున్నా. పార్టీ పెట్టి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డున పడేశారు. టీడీపీకి హోల్ సేల్ గా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడు. నమ్మి మోసపోయిన నాకు మీరు(పవన్‌ను ఉద్దేశించి..) సమాధానం చెప్పాలి అని రామ్‌సుధీర్ వ్యాఖ్యానించారు. .. జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాల పేరుతో పెద్ద స్కామ్‌కు తెరలేపారు. జనసేనలో నాదెండ్ల లింగమనేని ఇద్దరూ కలిసి టికెట్ల డిసైడ్ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు.. అని రామ్ సుధీర్ ఆరోపించారు. -
పవన్ కల్యాణ్.. టీడీపీ తొత్తు: అడపా శేషు
-
కాపు ఓట్లకి గేలం వేసేందుకు పవన్ ని ట్రాప్ చేసిన చంద్రబాబు
-
కులం పేరిట బాబు విష రాజకీయం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి. కులం.. ఓ అస్త్రం ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. పవన్‌తో పొత్తు.. దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్‌లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్ కళ్యాణ్ అనే చాప్టర్‌ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్‌కళ్యాణ్‌ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్‌తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్ రూపం మాత్రమే. పవన్ వెనక ఉన్న వారెవరు? పవన్ కళ్యాణ్‌ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్‌కళ్యాణ్. నిజంగా పవన్ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు, బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు. మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాస్‌ను, అగ్రోస్ ఛైర్మన్‌గా నవీన్ నిశ్చల్‌ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు. నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఫారెస్ట్ బోర్డు మెంబర్‌గా నయనార్ శ్రీనివాసులును నియమించారు. పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్. బలిజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : రత్నాకర్ వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. పవన్‌తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు. -
కాపుల మీద దాడులపై పవన్ నోరు విప్పాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ)/రాజమహేంద్రవరం సిటీ: కాపు సామాజికవర్గంపై దాడులు జరుగుతుంటే పవన్‌కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులపై పవన్‌కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ ర్యాలీ మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్, నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల గూండాగిరిపై కాపుల కన్నెర్ర
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): వంగవీటి రంగాను హత్య చేయడంతోపాటు ముద్రగడ పద్మనాభంను మానసికంగా చంపేశారని.. ఇలా అన్ని రంగాల్లో కాపులను టీడీపీ నేతలు అణగదొక్కుతూనే వచ్చారని అఖిల భారత కాపు అభ్యున్నతి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని.. ఇకపై ఇలాంటి దాడులు చెల్లవని పేర్కొంది. గతంలో కూడా అంబటిపై దాడి చేశారని.. పదే పదే కాపులపై దాడులకు తెగబడితే తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించింది. మంత్రి అంబటిపై టీడీపీ గూండాల దాడిని ఖండిస్తూ అఖిల భారత కాపు అభ్యున్నతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాపులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతల గూండా గిరిపై కన్నెర్ర చేశారు. ఆలిండియా కాపు అభ్యున్నతి సంఘం జిల్లా అధ్యక్షుడు, గుంటూరు మిర్చియార్డు డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ టీడీపీకి మొదటి నుంచి కూడా కాపుల పట్ల చిన్నచూపే ఉందని విమర్శించారు. కాపు నేత కాకి శ్రీను మాట్లాడుతూ తమ మౌనాన్ని చేతగానితనంగా భావిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మిర్చియార్డు మాజీ వైస్ చైర్మన్ ఎర్రబాబు, కాపు నేతలు కోట రాందాస్, గేదెల రమేష్, యిర్రిసాయి, రాతంశెట్టి మన్నార్, నరాలశెట్టి అర్జున్, కారసాని వెంకట్, రవి నాయుడు, డి.జయ, రేజేటి నవీన్ పాల్గొన్నారు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
పవన్ కళ్యాణ్ పై తూర్పు కాపు నేతల ఆగ్రహం
-
పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కిందని కాపు మహిళా నేతలు అన్నారు. ఆదివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడలో కాపు మహిళలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీర మహిళలపై దాడి అంటూ రెచ్చగొట్టేయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై వపన్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని కాపు మహిళా నేతలు అన్నారు. కాపులను గౌరవించేది ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. కాపుల కోసం ఆలోచించి ఉన్నత పదవులు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ద్వారంపూడి పేరు ప్రస్తావిస్తున్నారు. ద్వారంపూడి వల్ల పవన్‌కు ఎప్పుడో మంచి జరిగే ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించడానికి వీరమహిళలు వచ్చారు. అప్పుడు మేమంతా ద్వారంపూడికి అండగా నిలబడ్డాం -కాకినాడ అర్బన్ డవలప్మెంట్ ఛైర్మన్ చంద్రకళా దీప్తి గత 30 ఏళ్లుగా నగరంలో ఉన్న 80 శాతం కాపులు ద్వారంపూడి కి అండగా ఉంటున్నాం. మాకు ద్వారంపూడితో ప్రయాణం ఆనందకరం. -రాజారపు కృష్ణ, కాపు నేత -
కాపు రిజర్వేషన్‌పై జూన్‌లో తుది విచారణ
సాక్షి, అమరావతి: ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 26న తుది విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌కు పలు సూచనలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని, ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తేవాలని సూచించింది. లేనిపక్షంలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో పెండింగ్‌లో ఉందన్న కారణంతో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని వ్యాఖ్యానించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం చట్ట విరుద్ధమంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చిందని, దీనిపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్ని అమలు చేయడంలేదని అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు జోక్యం చేసుకుంటూ.. కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ తాము గతంలోనే పిల్ దాఖలు చేశామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కాపులకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని, అందువల్ల లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. -
పదేళ్లైనా.. ప్చ్! జనసేన అనుకూల పవనాలు ఇంకా రాలేదు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్నా పార్టీకి అనుకూల పవనాలు ఇంకా రాలేదని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాపులందరూ ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకలో తాను ఓడిపోయేవాడిని కాదన్నారు. ‘రాష్ట్రంలో ఇంత సంఖ్యా బలం ఉన్న కాపు, బలిజ కులాలకు నిజంగా కట్టుబాటు ఉంటే వేరేవారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది గ్రహించనంత వరకు రాజ్యాధికారాన్ని మరిచిపోండి’ అని పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి బీసీలు, ఎస్సీలను కూడగట్టి కమ్మ, రెడ్డి, క్షత్రియులకు గౌరవం ఇచ్చి తీరాలన్నారు. ‘మా అమ్మ గాజుల బలిజ, నాన్న కాపు. నా కులం ఉనికిని నేను ఎప్పుడూ తీసివేయలేదు. నా కులం వాస్తవం. కాపులు ఐక్యంగా ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తిగా ఎదగవచ్చు’ అని పేర్కొన్నారు. కాపులు కోస్తాలో గొంతు ఎత్తగలరుగానీ రాయలసీమలో బలిజలు నోరెత్తేందుకు భయపడతారని, ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. సీఎం పదవిస్తేనే పొత్తు! ముఖ్యమంత్రి పదవి ప్రాతిపదికనే ఏ పారీ్టతోనైనా పొత్తులు ఉండాలని కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్‌కు సూచించింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో హరిరామ జోగయ్య మాట్లాడుతూ జనసేనను బలహీన పరిచేందుకు టీడీపీ పలు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ రెండింటితో యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాలని తాను పవన్‌కళ్యాణ్‌ను కోరుతున్నట్లు చెప్పారు. లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోనని మాటిస్తున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొంటూ తానెందుకు ఉంటానని ప్రశి్నంచారు. ‘నమ్మిన వారిని తగ్గించం. ఎవరి అజెండాల కోసమూ పనిచేయం’ అని తెలిపారు. చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే -
హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్..
అమరావతి: కాపు సామాజిక వర్గం అంశంపై మాజీ మంత్రి హరి రామ జోగయ్య రాసిన లేఖకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు నాయుడుతో జతకడుతున్న పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖను తనకు పంపారా? అని పరోక్షంగా హరిరామ జోగయ్యకు చురక అంటించారు. అలాగే హరి రామ జోగయ్య ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు అమర్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖను ట్వీట్ చేశారు. pic.twitter.com/bnqvFRKR6L — Gudivada Amarnath (@gudivadaamar) February 5, 2023 చదవండి: యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా? -
చంద్రబాబు, పవన్ ఎత్తులను కాపులే చిత్తు చేస్తారా..?
సంక్రాంతి తరువాత తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గినా రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ముఖాన్ని ముందు పెట్టి కాపుల ఓట్లు కొల్లగొట్టాలి అనేది బాబు ఎత్తుగడ. కానీ, కాపులు ప్రజారాజ్యం తరువాత రాజకీయంగా చేతులు కాల్చుకున్నారు. చిరంజీవిని నమ్మి దివాళ తీసిన కాపులు చాలా మంది ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినా ఆయన వెనుక నడవడానికి మెజార్టీ కాపులు ఇష్టపడటం లేదు. ప్రజారాజ్యం అనుభవాలు, జనసేన వెనుక చంద్రబాబు, రామోజీలు ఉన్నారనే ప్రచారంతో కాపులు చాలా మంది పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉంటున్నారు. జనసేన వెనుక చంద్రబాబు, రామోజీ ఉన్నారనేది ప్రచారం కాదు, వాస్తవమే అనే విధంగా పవన్ మాటలు, చేష్టలు ఉంటున్నాయి. 2014లో చంద్రబాబును గెలిపించడానికే జనసేన ఉద్దేశపూర్వకంగా పోటీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే పవన్ విడిగా పోటీ చేశారని రాజకీయ వర్గాల్లో బలమైన టాక్ ఉంది. ఇక.. 2024 ఎన్నికల కోసం చంద్రబాబు, పవన్ ఏడాది క్రితం నుంచే సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలకు మొదటి మెట్టుగా ఇప్పటం సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం ఆధ్యంతం చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే విధంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలోనే పవన్ శపథం చేశారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేసిన పవన్, 2024 నాటికి తన ఆలోచనలు మార్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని జబ్బలు చరుస్తున్నాడు. ఇదంతా ఎవరి కోసం..? ఇక్కడే కాపులు పవన్ కల్యాణ్ మీద అనుమానం పెంచుకుంటున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనను, మూడున్నరేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో 60శాతం కంటే ఎక్కువ మద్దతు ఉంది. పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న చంద్రబాబుకు పరిస్థితులు ఆశాజనకంగాలేవు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన కాపులు సీఎం జగన్ చిత్తశుద్ది, రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న తాపత్రయం గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన విద్యా, వైద్య సంస్కరణలు చూస్తున్నారు. 30 ఏళ్లు పైబడి నిజాయితీగా ఆలోచించే కాపులు జగన్‌కే జై కొడుతున్నారు. ఇక.. 50 ఏళ్ల పైబడిన కాపులు 90 శాతానికిపైగా వైఎస్ జగన్‌పై బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికీ బలమైన కాపు ఓటు బ్యాంక్ సీఎం వైఎస్ జగన్‌తోనే ఉంది. పవన్ కల్యాణ్ చెప్పులు చూపించడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి, విజయవాడ నోవాటెల్‌లో చంద్రబాబుతో పవన్ భేటీ, హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడాన్ని మెజార్టీ కాపులు సమర్థించడం లేదు. 2024కు చంద్రబాబు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ శస్త్రాల్లో మొదటి ఆయుధం పవన్ కల్యాణ్. లోకేష్ కంటే కూడా చంద్రబాబు పవన్ కల్యాణ్‌నే ఎక్కువ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క లోకేష్ గ్రాఫ్ పడిపోకుండా ఉండటానికి జనవరి 27 నుంచి పాదయాత్రకు ప్లాన్ చేశారు. మరో పక్క కాపుల ఓట్ల కోసం వారాహితో పవన్‌ను రోడ్డెక్కిస్తున్నారు. ఇంకోపక్క ఎల్లో మీడియాతో నిత్యం అబద్ధాలు చెప్పిస్తున్నారు, రాయిస్తున్నారు. మరో పక్క వందల కోట్లు గుమ్మరించి సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలకు తెగిస్తున్నారు. ఇంత చేస్తున్నా.. కాపులు, బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారనేది చంద్రబాబు పచ్చమీడియా ఆందోళన. అందుకే.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై, అభివృద్దిపై చర్చ జరగకుండా ఉండేందుకు హింసను రెచ్చగొడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎల్లో మీడియా చేసే ఫేక్ ప్రచారాలు అడ్డుకోవాలంటే.. వైఎస్సార్సీపీ వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం కల్పించాలి. సచివాలయాల దగ్గర నుంచి సినిమా థియేటర్ల వరకూ ఈ ప్రచారం హోరెత్తాలి. రాజకీయంగా అస్త్రాలను సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు, అమలు చేస్తున్నారు. 1. సంక్షేమ అస్త్రం 2. రాజకీయ సమానత్వ అస్త్రం 3. ఆర్ధిక సమానత్వ అస్త్రం. మూడు అస్త్రాలకు మార్గదర్శి భారత రాజ్యాంగం, మహాత్మ గాంధీ ఆలోచనలే. బాబు, పవన్‌లు సీఎం వైఎస్ జగన్ మీద దాడి చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ, వారు దాడి చేస్తున్నది భారత రాజ్యాంగంపై, గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానాలపై అని తెలుసుకోలేకపోతున్నారు. 75 ఏళ్లుగా స్వాతంత్య్ర భారత చరిత్రలో కాగితాలకే పరిమితమైన సిద్దాంతాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయి. సీఎం జగన్ తన పాలనకు మానవత్వం జోడించి ముందుకెళ్తున్నారు. చదువే తలరాతను మారుస్తుందని, ఆంధ్రప్రదేశ్ పౌరులు గ్లోబల్ సిటిజన్స్‌గా ఎదగాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. మాటలు చెప్పడమే కాదు.. అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఒక్క విద్యారంగం మీదనే మూడున్నరేళ్లలో రూ.55వేల కోట్లు ఖర్చు చేశారు. వైద్య రంగంలో దాదాపు 50 వేల ఉద్యోగాలిచ్చారు. చంద్రబాబు విద్య, వైద్య రంగాల ఊపిరి తీయడానికి ప్రయత్నిస్తే.. సీఎం జగన్ మాత్రం విద్య, వైద్య రంగాలే తమ ప్రభుత్వానికి పీఠిక అన్నట్లు పాలన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్దిని కాపు సోదర, సోదరీమణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పవన్ ఆరాటమంతా చంద్రబాబును సీఎం చేయడం కోసమేనని వీరంతా ఓ అంచనాకు వచ్చారు. పవన్ అరుపులు, ఆర్తనాదాలు ప్యాకేజీ నుంచి వచ్చినవేనని మెజార్టీ నమ్ముతున్నారు. ఒక్క సీటు లేని ఆయన, 68 నియోజకవర్గాల్లో ఇంచార్జిలే లేని బాబు ఇద్దరూ కలిసి జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా? అనే ప్రశ్న వేసుకుంటే.. వచ్చే సమాధానం అడ్డుకోలేరనే. ఈ విషయం.. చంద్రబాబు, పవన్‌లకు కూడా బాగా తెలుసు. - వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ, సామాజిక విశ్లేషకులు. -
పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్
-
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
రాజానగరం లో ఘనంగా కాపు కార్తీకమాస వన సమారాధన సభ
-
'ఆయన ఉన్నంతకాలం టీడీపీ గుడివాడలో గెలిచే ప్రసక్తే లేదు'
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావి వెంకటేశ్వరరావు ఒక రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. గుడివాడలో బలమైన వర్గాలైన బీసీ, కాపు వర్గాలకు టీడీపీలో రావి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రావి కుటుంబ హయాంలో కాపు వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఏ ముఖం పెట్టుకుని రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో రావి పాల్గొంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలోని కాపు వర్గాల నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. కాపు వర్గాలకు అన్యాయం చేస్తున్న రావి కుటుంబం ఉన్నంతకాలం గుడివాడలో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. చదవండి: (వైఎస్సార్ షాదీ తోఫాకు దూదేకులు అర్హులే) -
పవన్ పై రెక్కీ నిర్వహించింది చంద్రబాబు కు చెందిన వ్యక్తులే : ఏపీ రెడ్డి, కమ్మ ,కాపు కార్పొరేషన్ చైర్మన్లు
-
కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధ్యానత ఇచ్చారు : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
-
ద్రోహం చేసిన వాళ్లతోనే పవన్ కళ్యాణ్ స్నేహం
-
కాపు నేతలపై పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై చర్చ
-
రాజమండ్రి వేదికగా కాపు నేతల భారీ సమావేశం
-
పవన్ వల్ల ఓ సామాజికవర్గం ఆందోళన చెందుతోంది : డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
కాపుల పట్ల నిజమైన హీరో సీఎం జగన్ : అడపా శేషు
-
నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
-
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం విదితమే. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.’ అని ఆ లేఖలో తెలిపారు. (చదవండి: కాపు ఉద్యమానికి ఇక సెలవ్) -
పవన్‌పై మంత్రి అవంతి ఆగ్రహం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాపు సోదరుల్ని చంద్రబాబు నిలువునా ముంచింది నిజం కాదా, ఆనాడు పవన్ గొంతెందుకు లేవలేదని ఆయన ప్రశ్నించారు. అవంతి మీడియాతో ఆదివారం మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసింది నిజం కాదా? అప్పుడు పవన్ కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా. టీడీపీ హయాంలో కాపు సోదరులు, యువకులపై అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొట్టేయించారు. కాపు సోదరులు పవన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున 5 వేల కోట్లు ఇస్తామని కేవలం రూ.1800 కోట్లు మాత్రమే ఇచ్చారు. కాపుల్ని మోసం చేశారు. దానిపై పవన్ గొంతెందుకు వినిపించలేదు. ఏడాది కాలంలోనే కాపుల అభ్యున్నతికి రూ. 4 వేల కోట్లకు పైగా సీఎం జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అదంతా పవన్ కళ్లకు కనిపించడం లేదా. వంగవీటి రంగాని హత్య చేయించిన పార్టీతో పవన్ చేతులు కలిపాడు. రంగా హత్యానంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాపు కులానికి అండగా నిలిచారు. కాపుల్ని మోసం చేశారు కాబట్టే ఆనాడు, ఇప్పుడు టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు’ అని మంత్రి అవంతి పేర్కొన్నారు. (చదవండి: నమ్మించి వీడియోలు తీసి.. లైంగిక వేధింపులు) -
కాపుల కోసం జగన్ చాలా చేశారు: జక్కంపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు కాపులందరి తరుపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కాపులకు నేను ఉన్నాను అంటూ వైస్సార్ కాపు నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా వసతి, జగనన్న విద్యా దీవెన ద్వారా లక్షలాది మంది కాపులకు మేలు జరిగింది. గత ప్రభుత్వం వలన కాపులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాదికి 15 వేలు చొప్పున ఐదేళ్లు కాపు నేస్తం ద్వారా ఇవ్వనున్నారు. కాపుల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు. ఏడాదికి 400 కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదు. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పి మోసం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టాలని అడిగితే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం) కాపులకు ఇచ్చిన హామీలు కంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు సీఎం జగన్ రూ. 4800 కోట్లు ఖర్చు చేశారు. కాపులకు ఇచ్చిన ఏ హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. గత పాలకులు కాపులను గాలికి వదిలేశారు. కాపులకు అండగా నిలుస్తున్నారు. కాపు నేస్తం ద్వారా రెండు లక్షల 36 వేల మందికి లబ్ది కలిగింది. కాపు నేస్తంకు రూ. 354 కోట్లు నిధులు విడుదల చేశారు. వంగవీటి రంగాను చంపించిన దగ్గర నుంచి చూస్తే కాపులకు చంద్రబాబు చేసింది ఏమీలేదు. కాపులను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే చంద్రబాబు వాడుకున్నారు. కాపులకు మేలు చేస్తున్న వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతార’ని జక్కంపూడి రాజా అన్నారు. (వారికి కూడా కాపునేస్తం తరహా పథకం) -
నేడు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ప్రారంభం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అమలు చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా అర్హులైన కాపు మహిళలు 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ చేయనున్నారు. అర్హతే ప్రామాణికం దారిద్య్ర రేఖకు దిగవనుండటమే ప్రామాణికంగా వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేసింది. ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరినీ గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు. లబ్ధిదారుల పేర్లతో కూడిన జాబితాలను సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల తర్వాత తుది జాబితాలను శాశ్వత ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు. ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉండరాదు. ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు. -
కాపు నేస్తం
-
వైఎస్సార్ కాపు నేస్తంకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల మహిళలకు ఆపన్నహస్తం అందించడానికి సిద్ధమైంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలను అందించనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలు.. - ఒక్కో కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉండాలి. - కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పదెకరాల్లోపు మెట్ట భూమి ఉండొచ్చు. - కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించి ఉండకూడదు. - పట్టణ ప్రాంతాల్లో 750 చ. అడుగుల్లోపు నిర్మిత భవనం ఉన్నా అర్హులే. - 45–60 ఏళ్లలోపు వయసు ఉన్నట్లు ధ్రువీకరించే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్ గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ కార్డు గానీ ఉండాలి. - కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు. - కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు. పారిశుధ్య ఉద్యోగులు ఉంటే అర్హులే. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. వైఎస్సార్ కాపు నేస్తం కింద లబ్ధిదారులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వలంటీర్లు.. పట్టణ ప్రాంతాల్లో వార్డు వలంటీర్లు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. లబ్ధిదారు, కుటుంబ పెద్ద ఆధార్ నంబర్లు, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఆదాయం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. -
కాపు, తెలగ, బలిజ నేతల రౌండ్ టేబుల్ సమావేశం
-
చంద్రబాబుతో భేటీకి కాపు నేతల డుమ్మా
సాక్షి, అమరావతి: తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు మొహం చాటేశారు. అధినేతతో భేటీకి ఈరోజు చంద్రబాబు నివాసానికి రావాలని కోరినా కాపు నేతలు హాజరుకాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. అధినాయకత్వంపై అసంతృప్తితో ఈ నెల 20న కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించిన కాపు నేతలను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో గురువారం రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. కాకినాడలో సమావేశమైన నాయకులను చంద్రబాబుతో భేటీకి తీసుకురావాలని కోరారు. అయితే శుక్రవారం కాపు నేతలు ఎవరూ రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. మరోవైపు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సంజాయిషీ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి పార్టీ కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. జూలై 2, 3 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. నామినేషన్ వేయడానికి తాను రాకపోయినా అభిమానంతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. (చదవండి: కాకినాడలో టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల భేటీ) -
‘ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పిన వారికే టీడీపీ సీట్లు, కోట్లు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పివారికే టీడీపీ సీట్లు, కోట్లు ఇచ్చారని ఆ పార్టీకి చెందిన కాపు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గురువారం కాకినాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ టార్గెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. లోకేశ్ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని తెలిపారు. ఎన్నికల సమయంలో నిధులు కూడా ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్ ఎక్కువ సమయం కేటాయించే వారని మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తొలగిన జేడీ లక్ష్మీనారాయణ ముసుగు...
శకునాలు చెప్పే బల్లి కుడిత తొట్లో పడి చచ్చినట్లుగా ఉంది సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వాసగిరి వెంటక లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ తీరు. అవినీతిని అంతం చేసేందుకు పుట్టిన కారణజన్ముడిగా పాపులర్ అయి, ఆ వాపులో, కైపులో సమాజాన్ని ఉద్దరించేందుకు అభివృద్ధి, సంక్షేమం పునాదిగా సరికొత్త రాజకీయాలు, పాలనను అందించేందుకు కంకణం కట్టుకున్నానని ప్రకటించిన జేడీ అదే రాజకీయ రొచ్చులో కూరుకుపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సీబీఐలో తన పదవికి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ ‘వందేమాతరం’ లేదా ’జనధ్వని’ అనే పేరుతో కొత్త పార్టీ పెట్టాలని, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సులర్ రాజగోపాల్‌తో కలిసి తీవ్రంగా కసరత్తు చేశారు. తర్వాత ఆరెస్సెస్ మహాసభలో జేడీ పాల్గొనడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు ఫిబ్రవరిలో టీడీపీలే చేరేందుకు ఆహ్వానం అందుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. వీటన్నిటిపై ఓ లుక్ వేసిన ఆయన చివరకు సామాజిక రాజకీయ అంశాల్లో గందరగోళ దృక్ఫథం కలిగిన జనసేన పార్టీలో చేరడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ బాల్యరిష్టం అందరికీ అర్థమైపోయింది. కులం కుడితి తొట్లో ఆయన పడ్డారని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సత్యం కంప్యూటర్స్, ఓవోంసీ, ఫోక్స్ వ్యాగన్, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్...కేసుల దర్యాప్తు చేసిన జేడీ చివరకు రాజకీయ చదరంగంలో పావుగా మారారు. కేంద్రంలో అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ‘పంజరంలో చిలక’లాగా నడుచుకుంటుందన్న అపఖ్యాతి మూటగట్టుకుని, ఇప్పటికీ అనేక అంతర్గత వివాదాలతో అప్రతిష్ట పాలైన సీబీఐలో పనిచేసే ఒక ఉద్యోగి స్వతహా సంచలనాత్మక దాడులకు పాల్పడటం ఏ మేరకు సాధ్యమో అందరికి తెలిసిన విషయమే. ప్రత్యర్థి రాజకీయ వర్గాలను తీవ్ర ఇబ్బందులు పాలు చేయాలనుకున్న సమయాల్లో అధికార పార్టీ కొందరు ఉన్నతాధికారులను సాధనాలుగా వినియోగించడంతో పాటు, దానికి అనుకూల మీడియాతో వారికి ఎక్కడలేని ప్రచారం తీసుకురావడం వల్ల ఆ అధికారులకు విపరీతమైన పేరు ప్రతిష్టలు రావడం దేశ చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ అవసరం తీరిపోయాక వారు గడ్డిపరకతో సమానంగా మారిపోవడం చూస్తునే ఉన్నాం. అలాంటి కోవలోనే జేడీ లక్ష్మీనారాయణ దేశవ్యాప్తంగా సంచలనాత్మక కేసులు అధికార పార్టీ ప్రోద్బలంతో చేపట్టి పాపులర్ అయ్యారు. గిరిగిరా తిరుగుతున్న కుమ్మరి అరె మీద ఎక్కి దానితోపాటే తిరుగుతున్న ఈగ తానే ఆ ఆరెను తిప్పుతున్నానని భ్రమించినట్లు జేడీ లక్ష్మీనారాయణ చేపట్టిన కేసులన్నీ తనవల్లను తెల్లారినట్లు, తన తెలివితేటలు, ఆదర్శాల వల్లే సంచలనాత్మకమైనాయని ఆయన భ్రమించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక జరగబోయే ఎన్నికల్లో టీడీపీపై ఏర్పడిన వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీ ఖాతాలోకి ఓట్లుగా జమ కాకుండా ఉండేందుకు, పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్‌ను వినియోగించుకొని వ్యతిరేక ఓట్లను జనసేన పార్టీకి మళ్లించడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేస్తున్న పవన్‌తో కలిసి పనిచేయడమంటే కుల, మత, ముఠా రాజకీయాల రొచ్చులో జేడీ దిగబడటమే.13 జిల్లాల్లో రైతు సమస్యలపై అధ్యయన సమావేశాలు, సొంతపార్టీ పెట్టేందుకు హడావుడి, లోక్‌సత్తాకు కాయకల్ప చికిత్స చేసి పునర్జీవనం చేయబోతున్నట్లు పుకార్లు, బీజేపీ, టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు...వెరసి జేడీ చివరకు ఒక అసంబద్ధ, అర్థరాహిత్య పార్టీ పంచన చేరారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఎంపీ బరిలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ‘ప్రశ్నిస్తా’ అంటూ అధికార పక్షాలను కాకుండా ప్రతిపక్షాలను ప్రశ్నించే విడ్డూరు రాజకీయ వేత్త పవన్ కల్యాణ్ నాయకత్వంలో జేడీ సమాజాన్ని బాగు చేసేందుకు ఏం చేయగలరో?. ఇక ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను ఉద్దరించే మొనగాడు అంటూ రాయలసీమకు చెందిన జేడీని ...పవన్ కల్యాన్‌ను ఆకాశానికి ఎత్తేయడం ఒక వైచిత్రి. కరువు కాటకాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సీమ బిడ్డగా పుట్టిన జేడీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. రైతాంగ సమస్యలు, ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ సమస్యలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ సమస్యలు, ప్రత్యేక హోదా సహా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కనీస అవగాహన లేని పవన్ మార్గదర్గకత్వంలో ‘రిల్ హీరో’ ప్రస్థానం వెనుక రాజకీయ వ్యూహం ఇప్పటికే తెల్లతేటమైంది. మరోవైపు విశాఖపట్నాన్ని మరో సింగపూర్ చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ.. మందీమార్బలంతో హడావుడి చేసి కూడా.. నయాపైసా ఖర్చు కాకుండా నామినేషన్ వేశానని డబ్బా కొట్టుకుంటూ.. ప్రచారంలో నా స్టైలే వేరు అని బీరాలు పోతున్న జేడీ లక్ష్మీనారాయణ ...ఓ కుల పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహించడం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల కిందట నగరంలోని వాల్తేరు క్లబ్లో ఓ సామాజికవర్గానికి చెందిన 350 మందితో ఆయన సమావేశమయ్యారు. ఆ భేటీలో.. ‘నేను మీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నాను.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా మీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం వచ్చినట్టుగా భావించి పనిచేయండి..’ అని కోరినట్టు భోగట్టా. అదేవిధంగా ఇటీవల రుషికొండ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ సంస్థలో కూడా ఇదే మాదిరి కుల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ముందే జేడీ అసలు రంగు బయటపడినట్లు అయింది. -
కాపులు బీసీలా..? ఓసీలా..?
సాక్షి, హైదరాబాద్: కాపులు బీసీలా... ఓసీలా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని శాసన మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు కాపులను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు చంద్రబాబూ.. అని ప్రశ్నిం చారు. అసెంబ్లీలో కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా బిల్లు పెట్టారన్నారు. కాపులకు రిజర్వేషన్ల అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారా..? లేక వారు అమాయకులని అనుకుం టున్నారా? అని నిలదీ శారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చుతామంటే నమ్మి ఓట్లేశారని, మళ్లీ ఇప్పుడు ఐదు శాతం అంటే ఓట్లు వేస్తారని చంద్రబాబు మరో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లపై మంజునాథ కమిటీ వేయడానికి చంద్రబాబుకు ఏడాదిన్నర పట్టిందన్నారు. అయితే కాపులను బీసీల్లో చేర్చాలని చెప్పలేదని, బీసీల్లో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉందో సర్వే చేయమన్నారని కమిటీ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. -
బీసీ-ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోండి: ముద్రగడ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారందరూ బీసీ-ఎఫ్ సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవాలని ముద్రగడ పద్మనాభం బుధవారం కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో, బయట సభల్లో కాపులను బీసీ-ఎఫ్ కేటగిరీ కింద చేర్చినట్లు చెబుతున్నారని అన్నారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లి బీసీ-ఎఫ్ కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
ఆయనకి అత్తారింటికి దారి ఎటో తెలియదు..
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు మూకుమ్మడి ఎదురుదాడి చేయడమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణరెడ్డి ...పవన్‌పై ధ్వజమెత్తారు. ‘పవన్‌కు రాజకీయం ఒక సరదా. రాజకీయాలు సినిమా అనుకుని మాట్లాడుతున్నాడు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అందుకే వేచి చూశాం. పవన్‌కి అత్తారింటికి దారి ఎటో తెలియదు. ఏ అత్త ఇంటికి పోవాలో కూడా తెలియని పవన్...లోకేశ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాపులు భయపడుతున్నారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపులను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేనతో కాపులను ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని మంత్రి నారాయణ సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను చూసి కాపులందరు భయపడుతున్నారని అన్నారు. బీజేపీ పవన్‌ను పావులా వాడుకుంటుందని, నాలుగేళ్లు పాటు టీడీపీ అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడలేదన్నారు. పవన్ దీక్ష ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని, ఇన్నాళ్లు ఏం పోరాటం చేశారని ... ఏపీ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. తక్షణమే క్షమాపణ చెప్పాలి ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కల్యాణ్.. సోదరుడు చిరంజీవి హోదాపై రాజ్యసభలో ఎందుకు పోరాటం చేయడంలేదో ముందుగా ప్రశ్నించాలని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ‘ఎంతోమంది నాయకులను మోసం చేసిన చిరంజీవిని పవన్ ప్రశ్నించాలి. మీ అన్నని మీరు ప్రశ్నించకపోతే ప్రజలే కాలర్ పట్టుకుని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. లోకేశ్ అవినీతి చేశాడు అని దారుణంగా మాట్లాడుతున్న పవన్...చిన్న ఇల్లు కోసం మీకు రెండు ఎకరాలు కావాలి కానీ...రాష్ట్ర రాజధానికి ఇన్ని అవసరం లేదని అంటారా?. పవన్‌కి రాజకీయ కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి’ అని ఆమె సుజాత డిమాండ్ చేశారు. పవన్‌కు ఒక్కరాత్రిలో జ్ఞానోదయం పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలోప్రజల కోసం ఏమి చెబుతారా అని రాష్ట్రం అంతా వేచి చూసిందని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగల అనిత అన్నారు. అయితే ఒక్క రాత్రిలో ఆయనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సభలో కనీసం జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిమాటలో చంద్రబాబుని తిట్టడమే పనిలా మాట్లాడారని అనిత మండిపడ్డారు. ఇన్నేళ్లలో ఎక్కడా మాట్లాడని పవన్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ మాట్లాడటం వెనుక ఉద్దేశ్యమేమిటో చెప్పాలన్నారు. కేంద్రం చేతుల్లో పవన్ కీలుబొమ్మగా మారారని, ఆయన ఒకసారి పునరాలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు. -
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేం..!
-
కాపు రిజర్వేషన్లపై ముద్రగడ కేవియట్
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నందున దీనిపై తమ వాదనలు కూడా వినాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మరో నలుగురు ఉమ్మడి హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఆర్.కృష్ణయ్యతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముద్రగడ తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది జి.గంగయ్యనాయుడు వాదనలు వినిపించనున్నారు. తొలుత మాకు నోటీసులిచ్చి వాదనలు వినాలి ‘కాపులు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల ప్రజలను బీసీల్లో చేర్చాలంటూ ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నాం. సామాజిక, విద్యా, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మా వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతి కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. మా డిమాండ్ న్యాయమైందని బీసీ సంఘం కూడా తన నివేదికలో చెప్పింది. కాపులను బీసీల్లో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో మా వాదనలు వినకుండా ఏవైనా ఆదేశాలిస్తే మాకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే తొలుత మాకు నోటీసులు ఇచ్చి మా వాదనలు వినండి’అని ముద్రగడ తదితరులు తమ కేవియట్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
పాదయాత్రకు అడ్డుతొలగే వరకు చలో కిర్లంపూడి: ముద్రగడ
జగ్గంపేట: పాదయాత్రకు అడ్డుతొలగే వరకు ‘చలో కిర్లంపూడి’ నిర్వహించాలని కాపు నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసం వద్ద శనివారం కూడా ఆయన ఆందోళన నిర్వహించారు. అనంతరం తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారినుద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతుంటే.. సీఎం చంద్రబాబు కాపులను అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోజూ కిర్లంపూడికి వెల్లువెత్తండి: ముద్రగడ
జగ్గంపేట : రాష్ట్రవ్యాప్తంగా కాపుల నిరసలతోనే ప్రభుత్వం దిగివచ్చి పాదయాత్రకు అనుమతి వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అప్పటి వరకు ప్రతిరోజూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి తరలి రావాలని కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గీయులకు పిలుపునిచ్చారు. 5రోజు నిరసన అనంతరం ఆయన ప్రసంగిస్తూ బాబు పోలీసులను అడ్డు తొలగించే వరకు పోరు ఆగదన్నారు. -
‘బాబు’ బెదిరేలా ఉద్యమిద్దాం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పిలుపు కిర్లంపూడి(జగ్గంపేట): రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న నిరంకుశ పాలన దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. తీవ్ర అణచివేతకు పాల్పడుతున్న బాబు బెదిరేలా ఉద్యమించాలని కాపులకు పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ముద్రగడ తలపెట్టిన ‘చలో అమరావతి’ నిరవధిక పాదయాత్రను అడ్డుకుని ఆదివారానికి 26 రోజులైంది. నిత్యం చేస్తున్నట్టే ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంటి గేటు వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడారు. -
ఎన్ని ఇబ్బందులు పెట్టినా మడమతిప్పం: ముద్రగడ
కిర్లంపూడి (జగ్గంపేట): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా, అణచివేతకు గురిచేసినా ఉద్యమం నుంచి మడమ తిప్పబోమని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఉధృతం చేయాలని కాపు జాతికి ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమం ఆఖరిదశలో ఉన్నందున యావత్తు కాపుజాతి ఉద్యమంలో పాలుపంచుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను గత 25 రోజులుగా పోలీసులు నిత్యం ఇంటిగేటు వద్దే అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. శనివారం ముద్రగడ, కాపునేతలు యథావిధిగా గేటు వద్ద కుర్చీలపై బైఠాయించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలిపారు. -
గోడ దూకి పాదయాత్ర చేస్తా
కాపు ఉద్యమనేత ముద్రగడ కిర్లంపూడి: కాపుల ఆకలి ఆఖరి పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శుక్రవారం పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడ పద్మనాభంను ఇంటి గేటు వద్ద పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తనను ఇలా హింసిస్తున్నందుకు నిరసనగా ఏదో ఓ రోజు గోడ దూకి, ఎక్కడో ఓ చోట నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అనంతరం గేటు వద్ద జేఏసీ నాయకులు, కాపు నాయకులతో కలిసి కుర్చీలో బైఠాయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. -
కాపులు, పోలీసుల మధ్య తోపులాట
కంచాలతో రోడ్డేకేందుకు యత్నం జగ్గంపేట : కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద కాపులు, పోలీసుల మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది. కంచాలతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల 26న ముద్రగడ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని అడ్డు చెప్పడంతో.. పోరు సీఎం వర్సెస్ ముద్రగడగా మారింది. ఓట్ల కోసం కాపు జాతికి రిజర్వేషన్లను ఎరవేసి వారి ఓట్లతో పీఠం ఎక్కిన చంద్రబాబుకు ఆ హామీని గుర్తు చేయడం రుచించడం లేదు. జాతి కోసం కుటుంబంతో పోరుబాట సాగిస్తున్న ముద్రగడ..తనకు కంటిలో నలుసుగా మారినట్టు భావిస్తున్న సీఎం.. ఆయనను అణచివేసి ఉద్యమం నీరుగార్చేందుకు దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జగ్గంపేట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తనకు ఎవరూ చెప్పాల్సిన పని లేదంటూ చేసిన వ్యాఖ్య.. ముద్రగడను ఉద్దేశించి చేసిందనంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. నిరవధిక పాదయాత్ర పేరిట ముద్రగడ రోజూ బయటకురావడం, ఆయనను పోలీసులతో నిలువరించడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం రోడ్కెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటే పరిష్కారం చేయకుండా.. ముద్రగడను టార్గెట్‌గా చేయడాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కంచాలు మోగించి... ముద్రగడ, కాపు జేఏసీ నాయకులు, మహిళలు గురువారం కంచాలు మోగించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో రకం నిరసనలు వ్యక్తం చేస్తోన్న కాపు జేఏసీ నాయకులు నల్ల చొక్కాలను ధరించారు. కంచాలతో నిరసన సందర్భంగా ముద్రగడ ఇంటి నుంచి ఒక్కసారి గేటు వరకు పెద్ద సంఖ్యలో వచ్చి రోడుపై ధర్నాకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు వాసురెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, గౌతు స్వామి, ఆరేటి ప్రకాష్, చక్కపల్లి సత్తిబాబు, గుండా వెంకటరమణ, తుమ్మలపల్లి రమేష్, గోపు అచ్యుతరామయ్య, తదితరులు పాల్గొని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సంకెళ్లు వేయండి.. కాపు జాతిపై కక్ష సాధింపు ఎన్ని రోజులని నిలదీశారు. -
నేనొక్కడినే సంఘ విద్రోహ శక్తినా?: ముద్రగడ
కిర్లంపూడి: మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి నుంచినిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు సోమవారం కూడా అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో నేనొక్కడినే సంఘ విద్రోహ శక్తినా, ఎవరికీ లేని ఆంక్షలను నాకెందుకు పెడుతున్నారు. నాకోసం పాదయాత్ర చేసి వస్తున్న వారిని అనుమతిస్తున్నారు, వారికి ఏ అనుమతులూ లేవు, చాలా గౌరవం ఇచ్చారు, సంతోషించాను. అదే పాదయాత్ర నేను చేస్తానంటే నాకెందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి: సినీనటి హేమ చంద్రబాబుకి తగిన గుణపాఠం చెప్పేందుకు కాపుజాతి యావత్తు సిద్ధంగా ఉండాలని సినీ నటి హేమ పిలుపునిచ్చారు. సోమవారం ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలోని ఆయన ఇంటిలో కలిసి పాదయాత్రకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. -
ముద్రగడను మళ్లీ అడ్డుకున్న పోలీసులు
కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన నిరవధిక పాదయాత్రను ఆదివారం కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ నయీమ్ఆద్మీ, పెద్దాపురం డీఎస్పీ రామారావు ముద్రగడ ఇంటి గేటు వద్దకు రాగానే ఎదురుగా వచ్చారు. దీంతో ఈ రోజు కూడా మా జాతికి స్వేచ్ఛ లేదా అంటూ ముద్రగడ వారిపై మండిపడ్డారు. గతంలో ఒక ఎస్సైని ఒక నాయకుడు బంధిస్తే పోలీసులు అంతా ఒక్కటై ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. హామీ తప్పిన ప్రభుత్వంపై మా జాతి అంతా ఒక్కటవ్వకూడదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు లేదా అని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులూ.. గేటు వద్ద కాపలా కాస్తూ మీ స్థాయి దిగజార్చుకోవద్దన్నారు. పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదు, ఇవాళ కాకపోతే రేపు చేస్తానని పోలీసులను ఉద్దేశించి ముద్రగడ అన్నారు. పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా గేటు వద్ద జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రకు వెంటనే అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. -
పౌరుల ప్రశ్నలకు సమాధానం చెప్పరా?
రాష్ట్ర ప్రభుత్వంపై ముద్రగడ ధ్వజం కిర్లంపూడి: మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను 18వ రోజైన శనివారం కూడా పోలీసులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఇంటి నుంచి ముద్రగడ బయలుదేరగానే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ను నిలువరించారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ.. కాపులకు ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం పాదయాత్ర చేస్తానంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పౌరులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరంలేదా? అని ప్రశ్నించారు. తమ జాతికి ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం శాంతియుతంగా పాదయాత్ర చేపడితే.. కేసులు నమోదు చేశారని.. ఆ కేసులను కోర్టుకు అప్పగిస్తే అక్కడైనా బాధలు చెప్పుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కాలం అడ్డుకున్నా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో గుడ్డిపాలన కొనసాగుతోందని, దానికి నిరసనగా తలకు నల్ల ముసుగులు ధరించి నిరసన తెలియజేశారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా, ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేశారు. పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, మహిళలు, కాపు నేతలు పాల్గొన్నారు. ముద్రగడ చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా ఆయన ఇంట మధ్యాహ్నం కంచాలమోత కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పోరాట ఉధృతితోనే ఫలితం
–ముద్రగడ పాదయాత్ర మొదలుపెడితే ప్రభుత్వానికి శ్మశాన యాత్రే –ఉద్యమం చివర స్థాయిలో ఉంది కాపులంతా రెట్టింపు ఉత్సహంతో పనిచేయాలి –పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ చలో కిర్లంపూడి తరలిరావాలి –13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి: ఉద్యమాన్ని ఎంత తీవ్రతరం చేస్తే ఫలితాలు అంత తొందరగా వస్తాయని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు అభిప్రాయ పడ్డారు. గురువారం కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో ముద్రగడ ఆధ్వర్యంలో 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు, జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ నాయకులు ముద్రగడ పాదయాత్ర భవిష్యత్తు కార్యచరణపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యమం శివరి దశలో ఉందని రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తే తొందరలోనే ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి కాపుల అభివృద్ధికి పాటుపడతానని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్తు అందిస్తానని చెప్పి ఇంత వరకూ ఆ హామీలు అమలు చేయకపోవడంతో జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం నిరవధిక పాదయాత్ర చేపడితే వేలాది మంది పోలీసుల ఆసరాతో పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు చలో కిర్లంపూడి నినాదంతో 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కాపులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నో పార్టీల జెండాలు మోసి అలసిపోయాం ... ఇప్పటికైనా జండాలు పక్కనపెట్టి ఒకే ఎజెండాతో ముందుకు సాగుదాం అని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులంతా కొదమ సింహాలు ... వారంతా ముద్రగడ వెంటే ఉన్నారు.... చంద్రబాబు వెనుక ఉన్నది పిల్లి పిల్లలు, వ్యక్తిగత స్వప్రయోజలన కోసం చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారని మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులను ఉద్ధేశించి పలువురు జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ రోజు కాపు కార్పోరేషన్ పెట్టినా, కాపు రుణాలు ఇచ్చినా ముద్రగడ పోరాటమేనని అన్నారు. జాతి మనుగడ కోసం, జాతి మనుగడ కోసం ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు యావత్తు కాపు జాతి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ దొంగ జపం
– తెరపైకి మళ్లీ కాపు మంత్రం – మేయర్ పీఠం కాపులకంటూ కుతంత్రం –ఓ పక్క కాపులను తొక్కేస్తూ మరో పక్క బుజ్జగించే యత్నాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ మళ్లీ డ్రామాలాడుతోంది. 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చేతులేత్తేసిన పచ్చపార్టీ కార్పొరేషన్ ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత మూడేళ్లుగా అణగదొక్కుతున్న కాపు నినాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. పసుపు నేతలకు రాజకీయాలు తప్ప విలువలు, నిజాయితీ లేదా అని జనాలు చీదరించే పరిస్థితి ఏర్పడింది. గడిచిన ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాపు నేతలపై కేసులు బనాయిస్తున్నారు. కాపు జాతికోసం చేస్తున్న ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాపులు రోడ్డుపైకి అడుగు పెడితే చాలు నిర్బంధం పెడుతున్నారు. పోలీసుల నిఘాలోనే కాపులు నిరంతరం గడుపుతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కాపులపై అనుసరిస్తున్న తీరుపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కాపులపై కక్షకట్టినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ అంటేనే కాపులు రగిలిపోతున్నారు. చంద్రబాబు దగ్గరి నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన కాపులను అధికారంలోకి వచ్చాక హింసిస్తున్నారని ఆ జాతి అంతా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆ సామాజిక వర్గానికి పూర్తిగా దూరమైన పరిస్థితి ఏర్పడింది. చక్కదిద్దేందుకు కాపు జపం అసలే ప్రభుత్వంపై అసంతృప్తి...ఆపై కాపుల నుంచి వ్యతిరేకత...పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంపై అనుసరిస్తున్న తీరుతో కాపులంతా అంతెత్తున లేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలా అన్న దానిపై తర్జనభర్జన పడి గడిచిన ఎన్నికల్లో గట్టెక్కించిన కాపు మంత్రాన్ని ఎంచుకున్నారు. బీసీల్లో చేర్చుతామన్న హామీని ఏ ఒక్కరూ నమ్మకపోవడంతో మేయర్ పీఠాన్ని కాపులకే కట్టబెడతామని కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటి వరకూ పార్టీలో అంతర్గతంగా ఈసారి బీసీలకు ఇద్దామని చెప్పుకుని వస్తూ ఎన్నికలకొచ్చేసరికి దూరమవుతున్న కాపులను దృష్టిలో ఉంచుకుని వారికే పెద్దపీట వేస్తామంటూ తెరపైకి తెచ్చారు. ఇప్పుడీ ప్రకటనను కాపులెవ్వరూ హర్షించడం లేదు. తమ జీవితాలను నిలబెట్టేది, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి మేయర్ పీఠం అప్పగిస్తే మారిపోతామా అంటూ కాపులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోసారి కేటాయిస్తుందని, ఇందులో టీడీపీ గొప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. -
కాపు కులస్థులకే మేయర్ పీఠం
భానుగుడి (కాకినాడ): కాకినాడ నగర మేయర్ పీఠాన్ని కాపు కులస్తులకే ఇవ్వాలని అ««ధిష్టానం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ వార్డుల్లో పోటీచేసే తేదేపా అభ్యర్థుల జాబితాను జిల్లా పార్టీ కార్యవర్గం సిద్ధం చేసిందని, పరిశీలనకు అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు. ఆమోదముద్ర పడగానే జాబితాను విడుదల చేస్తామని రాజప్ప ప్రకటించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కళా వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సంధానకర్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాకినాడ నగర పార్టీలో కాపు వర్గీయులకు–ఎమ్మెల్యేకు మధ్య ఉన్న పొరపొచ్చాలను విలేకరులు ప్రశ్నించగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి ముందుకెళతామన్నారు. ముద్రగడ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని ప్రశ్నించిన విలేకరులపై విరుచుకుపడ్డారు. కాపులకు ఎప్పుడూ పార్టీలో గుర్తింపు ఉందని, ముద్రగడ గేటువరకు వచ్చి డబ్బు కొట్టి వెనక్కి వెళుతున్నారని, ఇదేం పద్ధతో అర్థం కావడం లేదని ముద్రగడ ఆందోళనను అవహేళన చేసేలా మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ముద్రగడ పాదయాత్ర
-
నేటి నుంచి పాదయాత్ర
శాంతియుతంగా తరలిరావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పిలుపు కిర్లంపూడి (జగ్గంపేట): పోలీసులు విధించిన గృహ నిర్బంధం బుధవారంతో ముగిసిందని, గురువారం నుంచి పాదయాత్ర జరిగి తీరుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కాపు నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో కాపు నాయకులతో కలసి ముద్రగడ బుధవారం కూడా ‘కంచాల మోత’ కార్యక్రమం కొనసాగించారు. -
లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదు
- ముద్రగడ చేపట్టిన పాదయాత్ర జరిగి తీరుతుంది - కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి (జగ్గంపేట): లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదని తమనాయకుడు ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర జరిగి తీరుతుందని జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, గౌతు స్వామి తదితరులు స్పష్టం చేశారు. శనివారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో కొందరు మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుతోపాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు ముద్రగడ ఉద్యమాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారు. కాపు కులాన్ని వేరు చేసి ఓట్లు అడిగింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అధికారం వచ్చిన వెంటనే ఆరు నెలల్లోపు కాపు, తెలగ, బలిజ వంటి కులాలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది చంద్రబాబు కాదా అన్నారు. కాపు ఓట్లు ద్వారా లబ్ధి పొంది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా ఇంత వరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోవడం చంద్రబాబు విధానం తేటతెల్లమవుతుందన్నారు.ముద్రగడ వెంట ఎవరూ లేరనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోను ఇన్ని వేల మంది పోలీసులతో పోలీస్ పికెట్లు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. ముద్రగడను పాదయాత్రకు పంపించండి...అప్పుడు ముద్రగడ వెంట ఎంత మంది ఉన్నారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ నిరంతరం 144, సెక్షన్ 30 అమలులో పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వాలని కోరారు. ఈ సమావేశంలో తనిశెట్టి వెంకటేశ్వరావు, కొత్తెం బాలకృష్ణ, అడబాల శ్రీను, ఓరుగంటి చక్రం, వాసా రాఘవరావు, ఎస్సీ నాయకుడు మూరా సహదేవుడు, బీసీ నాయకుడు ఎల్లపు తాతారావు, ఓసీ నాయకులు మండపాక చలపతి, గౌతు వెంకటేశ్వరరావు, దాడి నారాయణమూర్తి, ఒన్నెం శ్రీను, సూరత్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి తీసుకునే వరకూ అడ్డుకుంటాం
ముద్రగడ పాదయాత్రపై హోం మంత్రి చినరాజప్ప సాక్షి, అమరావతి: ప్రభుత్వ అనుమతి తీసుకునే వరకూ ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటూనే ఉంటామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. బుధవారం తాత్కాలిక సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని.. విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లోనే రిజర్వేషన్లు కావాలన్నారు. త్వరితగతిన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. ఎటువంటి హింస జరగదని ముద్రగడ హామీ ఇస్తేనే పాదయాత్రకు అనుమతిస్తామని చెప్పారు. -
ముద్రగడ పాదయాత్ర ని అడ్డుకున్న పోలీసులు
-
‘మామీద ఎందుకంత కక్ష, మేమేం తప్పు చేశాం’
-
‘మామీద ఎందుకంత కక్ష, మేమేం తప్పు చేశాం’
కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధంతో పాటు కాపు నేతల అరెస్ట్‌లపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ కాపులను అణచివేస్తున్న చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీని అమలు చేయాలని కోరడమే కాపులు చేసిన తప్పా? అని కన్నబాబు ప్రశ్నించారు. కాపులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు భవిష్యత్‌లో ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు. గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.... ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా?. కాపులను ఎంతకాలం అణచివేస్తారు. వ్యక్తిగత పనికోసం వెళ్తుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మా మీద ఎందుకింత కక్ష సాధింపు, మేమేం తప్పు చేశాం. ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలి కానీ ఉద్యమాన్ని అణివేయాలనుకోవడం సరికాదు.’ అని అన్నారు. కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. మూడేళ్లయినా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. హామీని అమలు చేయమని కోరడమే నేరమా, కాపులను అవమానిస్తే ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. -
ముద్రగడ వెంటే మేమంతా
అరచేతిని అడ్డుపెట్టి ఉద్యమాన్ని ఆపలేరు పాదయాత్ర జరిగి తీరుతుంది కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి (జగ్గంపేట) : అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఏ విధంగా ఆపలేరో పోలీసులను అడ్డుపెట్టి ముద్రగడ పాదయాత్రను ఆపలేరని, ఆరు నూరైనా పాదయాత్ర జరిగి తీరుతుందని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్ తదితరులు మాట్లాడుతూ ముద్రగడ వెంట ఎవరూ లేరని కొందరు తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారని ముద్రగడ వెంట ఎవరూ లేకపోతే పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో పోలీసు పికెట్లు ఎందుకు పెట్టారని, కిర్లంపూడిలో వేలమంది పోలీసు బలగాలను ఎందుకు మొహరింపజేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల అమలు గుర్తు చేయడం కోసం తమ నాయకుడు రోడ్డెక్కి పాదయాత్ర నిర్వహించ తలపెడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం 30 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆ తరువాత కృష్ణా పుష్కరాలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. తుని రైల్వే సంఘటన కాపులకు సంబంధం లేదని 2016 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పత్రికా ముఖంగా తెలిపారని, అప్పటి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కిర్లంపూడి వచ్చి ఆరు నెలల్లో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారన్నారు. ఇచ్చిన గడువు పూర్తయ్యింది, మరో ఏడాది కావస్తుంది ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం పాదయాత్ర చేస్తుంటే తమ జాతిని అణగ దొక్కేందుకు బైండోవర్ కేసులు బలవంతపు సంతకాలు తీసుకుని భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్టు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని మాట్లాడుతున్నారు. కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందా, ప్రభుత్వాన్ని కమిషన్ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో కమీషన్లు ఏర్పాటు చేశారు ఐదారు నెలల కాలంలో రిపోర్టులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కాపుల కోసం వేసిన కమీషన్ 18 నెలలు దాటినా అతీగతీ లేదన్నారు. సహనం పాటించాల్సిన ప్రభుత్వం 26న పాదయాత్రకు పిలిపిస్తే వారం రోజుల ముందుగానే బైండోవర్ కేసులు, అరెస్టులకు పాల్పడుతుందన్నారు. కాపు జాతి ఏం పాపం చేసుకుంది, మేమేమన్నా దొంగలమా, ఉగ్రవాదులమా అన్నారు. జీఓ నంబర్ 30ని అమలు చేయమని అడుగుతుంటే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సెక్షన్ 30, 144లు అమలు చేసి వేలాది మంది కాపుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 1994లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో తమపై పెట్టిన కేసులు అన్యాయమని ఖండించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు కొట్టివేశారన్నారు. పదేళ్ల అధికారంలో కాపులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అడుగుతుంటే కేసులు పెట్టి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తుని ఐక్యగర్జనకు హాజరై ఆ నాడు మద్దతు తెలిపిన నాయకులు పార్టీ మారిన తరువాత వారి తీరు మారిందని విమర్శించారు. ప్రభుత్వం, పోలీసులు ఏకమై అత్యుత్యాహం ప్రదర్శించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. దమ్ముంటే ముద్రగడను విమర్శించే మంత్రులు, ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని చంద్రబాబును డిమాండ్ చేయాలని హితవు పలికారు. జేఏసీ నాయకులు తోట రాజీవ్, నడిశెట్టి సోమేశ్వరరావు, గౌతు స్వామి, చల్లా సత్యన్నారాయణ, తోట బాబు, మండపాక చలపతి, రాపేటి పెద్ద, ఇంటి రాజా, కురుమళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
అడుగడుగునా నిఘా
కాపు నేతలపై ఆంక్షలు విస్తృతంగా తనిఖీలు పలుచోట్ల హౌస్ అరెస్టులు కొనసాగుతున్న చెక్‌పోస్టులు అమలులో సెక్షన్ 30, 144 సాక్షి ప్రతినిధి, ఏలూరు : రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్దమౌతున్న కాపులపై పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్టులు చేస్తుండగా, మిగిలిన నాయకులపై ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టులు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. స్వయంగా ఎస్పీ రవిప్రకాష్ కూడా కాపుల జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లకు వెళ్లి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉద్యమాల్లోకి వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. విద్యార్ధులు ఈ పాదయాత్రలో పాల్గొని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. పోలీసులు ఎప్పుడు మా గ్రామం విడిచి వెళ్తే అప్పుడు పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించడంతో ఎంతకాలం ఈ ఆంక్షలు ఉంటాయన్న దానిపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. కొవ్వూరులో ఐదుగురు కాపు నాయకులను మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. గామన్ ఇండియా బ్రిడ్జి జంక్షన్, రోడ్డు కం రైలు వంతెన, విజ్జేశ్వరం ఆనకట్ట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. పట్టణంలో ప్రధాన కూడళ్లతో పాటు చాగల్లు, తాళ్లపూడిలో పోలీసు చెక్ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు యాభై మందికి పైగా కాపు నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. సెక్షన్30 పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్ విధించారు. కాపు సంఘం నాయకులను పోలీసు స్టేషన్లకు పిలిపించుకుని కౌన్సెలింగ్ చేస్తున్నారు. రెండు రోజుల పాటు బయటకి వెళ్లవద్దని పోలీసులు నాయకులకు ఆంక్షలు విధిస్తున్నారు. సెక్షన్30, 144 లు అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఏవిధమైన సభలు, సమావేశాలు, దీక్షలు నిర్వహించకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా బెదిరింపులకు దిగడాన్ని కాపునేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. బస్సులలో కూడా తనిఖీలు చేస్తున్నారు. సీతంపేట బ్యారేజ్ సెంటర్, కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో మూడు షిఫ్ట్‌లుగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కార్లలో ప్రయాణించే వారి వివరాలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, కారు నంబర్‌తో సహా రిజిష్టర్‌లో నమోదు చేసి పంపుతున్నారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన వ్యక్తుల నుంచి ఆధార్, ఇతర గుర్తింపుకార్డులను పరిశీలించి మరీ వెళ్లడానికి అనుమతి ఇస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఏలూరు నగరంలోని పలు ముఖ్య కూడళ్ళతో పాటు నగర సరిహద్దులలో మొత్తంగా 15 పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ పికెట్లలో ఏఎస్సై స్థాయి అధికారితో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, మరో నలుగురు హోంగార్డులను నియమించి నగరం గుండా రాకపోకలు సాగించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. తాళ్లపూడిలో మండలంలో ఎనిమిది మంది కాపునేతలకు నోటీసులు ఇచ్చారు. జాతీయరహదారిపై కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, నాచుగుంట, బాదంపూడి వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పెరవలి మండలంలో కాపులు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు పద్మనాభం పాదయాత్ర కానూరులో ఉండటంతో పోలీసులు ముందస్తుగా మూడుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేసారు. మండలంలో కాపు నాయకులకు పోలీసులు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి నిర్వహించతలపెట్టిన అమరావతి పాదయాత్రను పురస్కరించుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా తాడేపల్లిగూడెం పట్టణానికి అదనపు బలగాలను రంగంలోకి దింపారు. కడప, కృష్ణా జిల్లాల నుంచి 50 మందితో పాటు తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్, పెంటపాడు పోలీస్ స్టేషన్ల నుంచి మరో 50మంది మొత్తం వంద మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాపునాయకులు పలుప్రాంతాల్లో సమావేశాలు సమావేశాలు నిర్వహించి ఎన్ని అవాంతరాలు వచ్చినా పాదయాత్ర చేయడానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ చేపట్టబోమే పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మాద్ రఫీఉల్లా బేగ్ తెలిపారు. -
ఆ కులాల సర్టిఫికెట్ల జారీకి లైన్ క్లియర్
హైదరాబాద్: కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాల కుల ధృవీకరణ పత్రాల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ కులాల వారికి ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని తహశీల్దార్లకు కట్టబెడుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాపుల ఆందోళన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. -
మేమేమైనా ఉగ్రవాదులమా ?
పోలీసుల తీరుపై కాపు జేఏసీ నేతల ఆగ్రహం ఉక్కుపాదంతో అణచివేతకు పోలీసుల కుట్ర కిర్లంపూడి(జగ్గంపేట) : రాష్ట్రంలో కాపుజాతిని అణచి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి, పసుపులేటి ఉషాకిరణ్, నల్లకట్ల పవన్‌కుమార్‌లు అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు కాపులను బీసీల్లో కలుపుతానని, ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి కాపుల అభివృద్ధికి కట్టుబడతానని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి అధికారం చేపట్టి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హామీల అమలుకు ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమం చేపట్టి రెండేళ్లు దాటినా కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తు చేయడం కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర నిర్వహించ తలపెట్టారన్నారు. 26 కు ముందే వేలాది మంది పోలీసులను మోహరింపజేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ముద్రగడ పాదయాత్రపై విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరు చూస్తుంటే మేమేమన్నా నక్సలైట్లమా, తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు రిజర్వేషన్లు, స్పష్టమైన వైఖరిని ప్రకటించండాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో విషయాలపై కమిషన్లు వేశారు, మూడు, నాలుగు నెలల్లో కమిషన్ రిపోర్టులు ఆయా ప్రభుత్వాలు తెప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రెండేళ్లు దాటినా కమిషన్ రిపోర్టు తెప్పించుకోకుండా కాలయాపన చేయడం కాపులను మోసం చేయడమేనన్నారు. ఇచ్చిన హామీలను అడుగుతుంటే నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందన్నారు. ఇదే ధోరణి అవలంబిస్తే భవిష్యత్తులో జాతి తిరగబడటానికి సిద్ధంగా ఉందన్నారు. 1994లో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపుల మీద జరిగిన దౌర్జన్యానికి నిసనగా సొంత పార్టీ మీదే తిరుగుబాటు చేసి జాతి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జీఓ నంబర్ 30ని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముద్రగడను విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే ముద్రగడ సారథ్యంలో కిర్లంపూడి నుండి అమరావతి వరకు పాదయాత్ర చేసి తీరుతామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు బిఎన్ మూర్తి, పసుపులేటి మురళి, దోమాల బాబు, ఏసురెడ్డి పాపారావు, ఎస్సీ నాయకులు పల్లె హరిశ్చంద్రప్రసాద్, ఎస్కే ఇబ్రహీం, చల్లా సత్యనారాయణ, అన్నెం సత్తిబాబు, అడబాల శ్రీను, మండపాక చలపతి తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పాదయాత్రకు వెళితే కేసులా తునిలో 100 మందికి నోటీసులు తుని : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కేసులను తెరపైకి తీసుకువచ్చి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 26న ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనవద్దని పోలీసులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తుని నియోజకవర్గం పరిధిలో ఆదివారం నాటికి 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, 70 మందికి నోటీసులు ఇచ్చారు. కాపు జేఏసీ మాత్రం నోటీసులకు భయపడేది లేదని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుందని కాపులు విమర్శిస్తున్నారు. ఎంతమందిని జైలులో పెట్టినా పాదయాత్రకు కాపులు తరలి వెళతారని జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంత అతి ? పోలీసుల ఓవరాక్షన్‌పై వైఎస్సార్ సీపీ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ మండిపాటు జగ్గంపేట : చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీని అమలు చేయమని ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టదలచడంతో ఆయనను నిలువరించేందుకు ప్రభుత్వం పోలీసులతో అవసరానికి మించి ఓవరాక్షన్ చేయిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. ముద్రగడను కలిసి మద్దతు తెలిపేందుకు ఆదివారం ఆమె కిర్లంపూడి వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడకు కలవడానికి వస్తే నక్సలైట్, మావోయిస్టు, సంఘ విద్రోహ శక్తులను చూసేందుకు వస్తున్నట్టు దారిలో నాలుగు చోట్ల వాహనం ఆపి కిందకు దించి ఫొటోలు తీసుకున్నారని ఇది ఎంతవరకు సమంజసం మన్నారు. ఇన్ని అడ్డంకులు దేనికని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా గట్టి బందోబస్తుతో ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెతో పాటు పసుపులేటి మురళీకృష్ణ, మనోజ్ తదితరులు ఉన్నారు. -
భావితరాల భవిష్యత్ కోసం తరలిరండి
‘చలో అమరావతి’పై కాపులకు ముద్రగడ బహిరంగ లేఖ కిర్లంపూడి(జగ్గంపేట): ‘చావో రేవో.. చలో అమరావతి’ పేరుతో ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు భారీగా తరలిరావాలని కాపులకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇది ఆఖరి పోరాటమని, భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ మంగళవారం ఈ మేరకు కాపులకు బహి రంగ లేఖ రాశారు. పోలీసులు ఎన్నిసార్లు అరెస్టు చేసినా ‘పాదయాత్రకు వెళతాం.. కాదంటే జైలుకు పంపుకోండి’ అని ధైర్యంగా చెప్పాలని కాపులకు సూచించా రు. యాత్రలో పాల్గొంటే కేసులు పెడతామంటూ ప్రభుత్వ పెద్దలు పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. -
కాపు రిజర్వేషన్ వ్యవహారం ఇప్పట్లో తేలదా..?
-
కావల్సిన వారికే... కాపులోన్లు
- పార్టీ కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక - - ఉత్సవ విగ్రహాలుగా అధికారులు - అన్ని లోన్లు పార్టీ కార్యకర్తలకే - అర్హులకు మొండిచేయి - ప్రధాన అర్హతగా దేశం సభ్యత్వం! - పిఠాపురంలో కాపులోన్ల మాయాజాలం పిఠాపురం: కాపులకు రుణాలు ... ఇందుకు కాపు కులంలో పుట్టిన నిరుపేదలందరూ అర్హులే అనుకుంటే పొరపాటే. పిఠాపురం మున్సిపాల్టీలో మాత్రం కాపు కులానికి చెందిన వారైతే చాలదు. తెలుగు దేశం పార్టీ నాయకుడో, కార్యకర్తో, లేక ఎమ్మెల్యే అనుచరుడో అయి ఉంటేనే కాపు లోను తన కాళ్ల దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చేస్తుంది. అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఆ దరఖాస్తులు కాపు కార్పొరేషన్‌కు ఆన్లైన్లో పంపించేది ... ఎంపిక చేసేది మాత్రం ‘దేశం’ నేతలే అన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. ఏదైనా ఒక ప్రభుత్వ పథకంలో లబ్థిదారుల ఎంపిక జరగాలంటే వివిధ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణలు జరిపి ప్రభుత్వ కార్యాలయంలో అర్హుల జాబితా తయారు చేస్తుంటారు. కానీ పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాగే అధికారులతో సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు దేశం నేతలు కలిపి భర్తలున్న వారికే వితంతు పింఛన్లు మంజూరు చేయించగా ‘సాక్షి’ దినపత్రిక ఆ గుట్టును బట్టబయలు చేయడంతో అధికారుల విచారణ అనంతరం వాటిని రద్దు చేశారు. అయినప్పటికీ ఇక్కడ పద్ధతిలో మాత్రం మార్పు రాలేదంటున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న కాపు రుణాల మంజూరులో నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. పచ్చచొక్కా వేసుకుంటేనే నిజమైన లబ్ధిదారుడిగాను, లేకుంటే ఎంత నిరుపేదవాడైనా సరే అనర్హుడిగా పరిగణిస్తున్నట్లు ప్రస్తుతం మంజూరైన లోన్ల నడత స్పష్టం చేస్తోంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది కాపులోన్ల లక్ష్యం 105 కాగా ఇప్పటి వరకు సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 27 మందికి రుణాలు మంజూరయ్యాయి. వీరిలో అధిక శాతం మంది తెలుగు దేశం పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. దేశం నేతలకే కాపులోన్లు... పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 24వ వార్డులో 15 మంది అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అంగీకారంతో సహా కాపులోన్లకూ దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వారందరినీ పక్కన పెట్టి కేవలం ఆ వార్డు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, పాదగయ ట్రస్టు బోర్డు సభ్యుడైన ఓగేటి మురళీధర్‌కు మాత్రమే కాపులోను మంజూరయింది. ఇలా అన్ని వార్డుల్లోను ఆయా వార్డుల పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వినినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అన్ని అర్హతలుండీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క రుణం కూడా మంజూరుకాకపోవడం విశేషం. పార్టీ కార్యాలయంలోనే ఎంపిక...! అర్హులైన లబ్ధిదారులు బ్యాంకు అనుమతితో మున్సిపల్ అధికారులు దరఖాస్తులు చేసుకుంటుండగా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో తెలుగు యువత నాయకుడు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పక్రియంతా స్థానిక తెలుగదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరగాల్సిన ఎంపిక పక్రియ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండడంతో కేవలం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే రుణాలు మంజూరవుతున్నాయి. మా దరఖాస్తులు ఏమయ్యాయో తెలియడం లేదు నేను కూలిపని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా. దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుందామని కాపులోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. బ్యాంకు విల్లింగ్ సైతం ఇచ్చారు. అయినా ఏడాదవుతున్నా లోన్ రాలేదు. నాకంటే వెనుక పెట్టుకున్న తెలుగుదేశం వారికి మాత్రం లోన్లు ఇచ్చేస్తున్నారు. - కె. అచ్చియ్య, లబ్దిదారుడు, పిఠాపురం అధికారులు పట్టించుకోవడం లేదు పొట్టపోసుకోడానికి ప్రభుత్వం ఇచ్చే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. అధికారలెవరూ పట్టించుకోవడం లేదు. అసలు వారి ప్రమేయం ఏమీ లేనట్టు మాట్లుడుతున్నారు. మా దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు. ఆకుల దొరబాబు, లబ్ధిదారుడు, పిఠాపురం అర్హులైన కాపులకు అందడం లేదు నిరుపేదలైన కాపులకు అన్యాయం జరుగుతోంది. ఏ ఆధారం లేకుండా అణగారిపోతున్న కాపుల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నేతల అక్రమాలు ఎక్కువయిపోతున్నాయి. పిఠాపురంలో కేవలం తెలుగుదేశం నేతలకే రుణాలు మంజూరవుతున్నాయి. అర్హులందరూ రుణాలు రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బాలిపల్లి రాంబాబు, కాపుఐక్య వేదిక నాయకుడు. పిఠాపురం -
కాపు రుణాల్లో అవినీతి కాక
ఏలూరు (మెట్రో) : మాకు అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి.. మేం నిరుపేద కుటుంబానికి చెందిన వారం.. మా అర్హతలన్నీ పరిశీలించి రుణాలు ఇస్తే పలానా వ్యాపారం చేసుకుని జీవిస్తాం.. అని న్యాయంగా అధికారులను వేడుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. అదే అయినవాళ్లయితే.. ధ్రువీకరణ పత్రాలు, నిబంధనలతో పనిలేదు. కనీసం ఆ కులం కాకపోయినా తప్పుడు ధ్రువీకరణతో రుణాలిచ్చేస్తారు. జిల్లాలో కాపు రుణాలను కొందరు అధికారులు, బ్యాంకర్లు ఆ కులస్తులు కాకపోయినా ఇచ్చేసి తమ ఘనతను చాటుకున్నారు. సామాన్య వ్యక్తికి ఏదైనా రుణం కావాలంటే.. ఈ గ్యారంటీ తీసుకురా.. ఆస్తులేమైనా ఉన్నాయా.. నీకు రుణం ఇస్తే ఎలా కడతావు.. అంటూ అధికారులు, బ్యాంకర్లు సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. కానీ అధికారులు తలచుకుంటే మాత్రం ఇవేమీ లేకుండా కూడా రుణాలు ఇచ్చేస్తారు. ఆ కులానికి సంబంధించిన వారు కాకున్నా అదే కులానికి చెందిన వారని ధ్రువీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇక తతంగం అంతా అధికారులే నడిపేస్తారు. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్, మండల పరిధిలో 22 మందికి, చింతలపూడి మండలంలో 3, దేవరపల్లిలో 1, రుణాలను కాపులు కాకపోయినా నకిలీ కాపు ధ్రువీకరణ పత్రాలతో ఇచ్చేశారు. లేని వ్యక్తులకూ రుణాలు కాపు నకిలీ ధ్రువీకరణ పత్రాలతోనే కాకుండా అసలు వ్యక్తులే లేకుండా టి.నరసాపురం మండలంలో 5, తణుకు మండలంలో ఒకరికి రుణాలను అందించారు. ఈ ఉదంతాలపై విచారణ చేసేం దుకు అభ్యర్థులు ఇచ్చిన చిరునామాలకు వెళితే అసలు ఆ అభ్యర్థులే లేరనే సమాధానంతో కాపు కార్పొరేషన్ అధికారులు కంగుతిన్నారు. ఇలా 33 మందికి లక్ష, లక్షన్నర చొప్పున రుణాలు పొంది అరకోటి పైబడి రుణాలను కాజేశారు. రెవెన్యూ అధికారుల హస్తం కాపులు కాకున్నా వారికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన రెవెన్యూ అధికారులు రుణాలకు సిఫార్సు చేశారు. ఈ కుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించని అధి కారులు కాపు కార్పొరేషన్లో రుణాలు మంజూరు చేసేశారు. ఇంకేముందుకు కాస్త బ్యాంకు మేనేజర్లను మేనేజ్ చేసుకుని యథేచ్ఛగా రుణాలు పొందారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని దర్జాగా దోచుకున్నారు. బిగుస్తున్న ఉచ్చు జిల్లాలో కాపులు కాకుండానే కాపులుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ భాస్కర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందించి రుణాలు పొందిన వారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రుణాల మంజూరులో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి ఇప్పటికే విచారణ నివేదికను కలెక్టర్ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. -
హామీలు రెండేళ్లలో అమలు చేయాలి
- లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాలను సవరించాలి - ప్రధాని మోదీకి కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ కిర్లంపూడి (జగ్గంపేట): ఎన్నికల మేనిఫెస్టోలోను, ప్రచారంలోను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు అమలు చేసేవిధంగా నిబంధన విధించాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఒకవేళ ఆ హామీలు అమలు చేయకపోతే కఠినచర్యలు తీసుకునేందుకు చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకర్లకు విడుదల చేశారు. అధికారం చేపట్టేందుకు అమాయక ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి, నమ్మించి ఓట్లు వేయించుకుంటున్నారని, హామీలు అమలు చేయాలని అడిగితే ప్రజలను పోలీసులతో కొట్టించడం, తిట్టించడం, తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడంలాంటివి చేసి భయంకరమైన పాలన సాగిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. హామీలపై ఉన్నతస్థాయిలో నియంత్రణ లేకపోవడంతో నాయకులు అధికారం కోసం అబద్ధాలు చెప్పడానికి వెనుకాడటంలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను పదవీకాలం ముగిసేసరికి తూతూమంత్రంగా అమలు చేసి అన్నీ నెరవేర్చామని చెబుతున్నారని, ఇలాంటివారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
అందరి భాగస్వామ్యంతో ఉద్యమం ఉధృతం
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం - ఎన్నికల హామీ ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి - పోరుబాటలో మహిళల భాగసామ్యం అవసరమని పిలుపు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అందరి భాగస్వామ్యంతో మరింత ఉధృతం చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యాన స్థానిక సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక్షన్ హాలులో బలిజ, తెలగ, ఒంటరి, కాపు రిజర్వేషన్లపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని చులకనగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకూ నిద్రపోయేది లేదని అన్నారు. కాపులకు, బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తగాదాలు పెడుతున్నారని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లలో తమకు వాటా వద్దని, జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలువురు బీసీ నాయకులను కలిసి ఈ విషయాన్ని స్పష్టం చేశామని చెప్పారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ముద్రగడ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకూ ముద్రగడ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తామంతా ఆయన వెంటే ఉంటామని అన్నారు. సినీ నటి హేమ మాట్లాడుతూ, రిజర్వేషన్లు లేకపోవడంతో కాపులు అన్నివిధాలా నష్టపోతున్నారన్నారు. ‘‘మన పిల్లల కోసం ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఉద్యమంలో పాల్గొనాలి’’ అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చేంత వరకూ ముద్రగడ చేసే ప్రతి ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యమం బలోపేతానికి మండలాలవారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. సమావేశంలో కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ, మలకల చంటిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, ఇతర నాయకులు పసుపులేటి చంద్రశేఖర్, కొప్పన మోహనరావు, 13 జిల్లాలకు చెందిన జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
తాడో పేడో తేల్చుకుంటాం
కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తాం 7న కాకినాడలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ కాకినాడ రూరల్ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంపై ప్రభుత్వంతో తాడో డో తేల్చుకుంటామని జిల్లా కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గురువారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ వీవై దాసు మాటట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు అడుగుతున్న తమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు దాడి చేయిస్తున్నారన్నారు. మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ప్రోద్బలంతో ఉద్యమంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఏడాదికి కాపులకు రూ.1,000 కోట్లు రుణాలు ఇస్తామని చెప్పి, మూడేళ్ల పదవీ కాలంలో కేవలం రూ. 320 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలో 3.30 లక్షల మంది కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. కాపులు సామాజిక, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను 1.10 లక్షల మంది సంతకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్‌తో మంజునాథ కమిటీకి అందజేశామన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు దాటకూడదని ప్రభుత్వం చెబుతోందని, ఇది ఎంతమాత్రం నిజం కాదని జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ తెలిపారు. దేశంలోని కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 65 నుంచి 70 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 80 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. జిల్లాకు చెందిన దేశంలో ఎన్నడు లేని రీతిలో జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అత్యవసర పరిస్థితిని పోలీసులతో విధించారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ నుంచి నేటి దాకా సెక్షన్ 30 అమలు చేసిన ఘనత హోం మంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలు పరిష్కారం ముఖ్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎంకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. గ్రామాల్లోకి ఏముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారో అప్పుడే కాపుజాతి ప్రజా ప్రతినిధులను నిలదీస్తారన్నారు. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ నెల 7న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి జేఏసీ సర్వసభ్యుల సమావేశాన్ని కాకినాడ పద్మనాభ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశానికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కె.తాతాజీ, బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం సప్తగిరిసర్కిల్ : చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అందజేసిన కాపు, బలిజల దరఖాస్తులను శుక్రవారం పరిశీలించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముణి తెలిపారు. ఈమేరకు గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పెన్నార్ భవన్ సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉంటుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న గ్రూపు సభ్యులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, బ్యాంకు వివరాలతోపాటు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–275539లో సంప్రదించాలన్నారు. -
ఉద్యమానికి అండగా మేమున్నాం
- కాపు న్యాయవాద జేఏసీ భరోసా - పిల్లల భవిత కోసమే ఈ సమరమన్న ముద్రగడ - కాకినాడ సదస్సుకు తరలివచ్చిన కాపు న్యాయవాదులు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాపు ఉద్యమానికి అండగా నిలబడతామని కాపు న్యాయవాద జేఏసీ నాయకులు సృష్టం చేశారు. కాకినాడ సినిమా రోడ్డులోని పద్మనాభ ఫంక్షన్ హాలులో రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల న్యాయవాద జేఏసీ సదస్సు ఆదివారం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ, ప్రభుత్వం కాపు కులాన్ని అణచివేసే ధోరణితో ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమ బాట తప్పదన్నారు. ఉద్యమం చేస్తున్నవారిపై ప్రభుత్వం పెట్టే కేసులను తామే వాదిస్తామని, కోర్టు ఖర్చులు కూడా తామే భరిస్తామని, కాపు న్యాయవాదులు భరోసా ఇవ్వడం ఆనందించదగ్గ విషయమన్నారు. కర్ణాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ద్వారకానా«త్ మాట్లాడుతూ, 1912 నుంచి 1956 వరకూ కాపులను బీసీలుగానే పరిగణించారన్నారు. తమకు గతంలో ఉన్న రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయమంటున్నామని, కొత్తగా రిజర్వేషన్లు కోరడం లేదని అన్నారు. ప్రభుత్వం కాలయాపన చేసేందుకే మంజునాథ కమిషన్ వేసిందని అన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.చిదంబరం మాట్లాడుతూ, ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు మాట్లాడుతూ, ఉద్యమం చేస్తున్న ముద్రగడ కుటుంబంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమను కలచివేసిందన్నారు. ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. జిల్లాలో 144, 30వ సెక్షన్లను నిరంతరం అమలు చేయడంపై న్యాయపోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీనియర్ న్యాయవాది బాలకృష్ణ మాట్లాడుతూ, కాపు కులానికి చెందిన 66 శాతం మంది కూలీనాలీ చేసుకుని బతుకుతున్నారన్నారు. ప్రభుత్వం దీనిని గుర్తించి వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ, కాపు జాతిని అన్ని రంగాల్లోనూ ముందుంచడానికి కృషి చేయాలన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, గతంలో ఉన్న రిజర్వేషన్లనే పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు. కాపు ఉద్యమంలో ఎవరి కర్తవ్యం ఏమిటో ఎవరికివారు ఆలోచించుకుని ముందుకు సాగాలన్నారు. కాపు జేఏసీ నాయకుడు వీవై దాసు మాట్లాడుతూ, ఉద్యమానికి మద్దతు ప్రకటించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు న్యాయవాద జేఏసీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వెయ్యిమంది న్యాయవాదులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కాపు ఉద్యమ జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, బసవా ప్రభాకరరావు, ఆర్‌వీజేఆర్ కుమార్, పసుపులేటి చంద్రశేఖర్, సంగిశెట్టి అశోక్, బసవా ప్రభాకరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. -
టెన్షన్.. అటెన్షన్..!
- నేడు మంజునాథ కమిషన్ విచారణ - కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఇరువర్గాల నుంచి అభిప్రాయ సేకరణ - బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సామాజిక వర్గాలు - సెక్షన్-30 అమలు.. ప్రదర్శనలపై నిషేధం - కాకినాడలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు - డ్రోన్, వీడియో కెమెరాల చిత్రీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్ బుధవారం విచారణ జరపనున్న నేపథ్యంలో.. జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. విచారణకు వేదిక కానున్న కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంవద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి కాపు, బీసీ వర్గాల నుంచి, అభిప్రాయాలను, వినతులను కమిషన్ స్వీకరించనుంది. దీంతో తమతమ వాదనలు వినిపించేందుకు, అభిప్రాయాలు తెలిపేందుకు ఇటు కాపులు, అటు బీసీలు అధిక సంఖ్యలో కాకినాడకు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతోపాటు కాపు జేఏసీ నేతలు వీవై దాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ.. మరోవైపు బీసీల నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, కుడుపూడి చిట్టబ్బాయి తదితర నేతలు కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు, వినతులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న కీలక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సొంత జిల్లా కావడంతో.. జిల్లాలో పరిణామాలను చంద్రబాబు సర్కార్ సహజంగానే నిశితంగా పరిశీలిస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. మరోపక్క కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథతోపాటు సభ్యులు ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, సభ్య కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ప్రత్యేకాధికారి సి.రమేష్‌కుమార్, సీనియర్ అకౌంటెంట్ అనురాధ మంగళవారమే కాకినాడ చేరుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు తమకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోవాలని కాపు సామాజికవర్గం చాలాకాలంగా ఉద్యమిస్తుండగా.. కాపులను బీసీల్లో కలపడాన్ని బీసీ సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కడా ఎటువంటి కవ్వింపు చర్యలూ చోటుచేసుకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ జిల్లాలో మకాం వేసి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ తదితర పోలీసు అధికారులతో కాకినాడలో పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే జిల్లా అంతటా సెక్షన్-30 అమలు చేస్తున్నారు. అవసరమైతే బుధవారం మరీ ఇబ్బందికర పరిణామాలు తలెత్తినచోట 144 సెక్షన్ అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, తుని, పిఠాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రెండు సామాజిక వర్గాల నుంచి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీల పేరుతో అల్లర్లకు దిగుతారేమోనన్న అనుమానంతో ముందస్తుగా 149 సెక్షన్ ప్రకారం పెద్ద సంఖ్యలో నోటీసులు కూడా జారీ చేశారు. ఊరేగింపులు, ఇతర ఆందోళనలను నిషేధించారు. మద్యం దుకాణాలపైనా ఆంక్షలు కాకినాడకు వచ్చే ప్రధాన రోడ్ల పక్కన ఉండే మద్యం దుకాణాలను కూడా మూసివేసేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. రోడ్ల చెంత జిల్లాలో దాదాపు 40 కీలక ప్రదేశాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి పంపించనున్నారు. ఆకాశంలో డ్రోన్ కెమెరాలతో.. నేలపై వీడియో కెమెరాలతో ప్రతి కదలికను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బాడీ కెమెరాతో కూడా మఫ్టీలో ఉన్న పోలీసులు జనంలో సంచరించేలా బాధ్యతలు అప్పగించారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో సుమారు 1,715 మంది పోలీసులను వినియోగిస్తుండగా, జిల్లా అంతటా పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఆడిటోరియంలోకి వెళ్లే ముందు మద్యం తాగినవారిని కనుగొనేందుకు బ్రీత్ ఎనలైజర్లు కూడా ఏర్పాటు చేశారు. చెరి 175 మందికే అనుమతి ఒక్కో వర్గం నుంచి 175 మందిని మాత్రమే వాదనలు వినిపించేందుకు కమిషన్ ముందుకు అనుమతిస్తారు. వారు బయటకు వచ్చాక మరో 175 మందిని వాదనలు వినిపించేందుకు అనుమతించనున్నారు. -
అణచివేత యత్నాన్ని ఐక్యంగా తిప్పికొడదాం
-మంజునాథ కమిషన్‌కు మన గళాన్ని వినిపిద్దాం -జిల్లా బీసీ సంఘాల జేఏసీ సమావేశంలో నేతల పిలుపు రావులపాలెం : ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వాలు బీసీలను అణదొక్కాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కాపులను బీసీల్లో చే ర్చేందుకు వేసిన మంజునాథ కమిషన్ వద్దకు జిల్లాలోని నలుమూల నుంచి లక్షలాదిగా తరలివచ్చి ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని జిల్లా బీసీ సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. బుధవారం రావులపాలెంలోని కోనసీమ వర్తక సంఘ కల్యాణ మండపంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రారావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ కులాల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో 70 ఏళ్లుగా బీసీలు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, బీసీ జాబితాలో కాపులను చేర్చే ప్రయత్నాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ నెల 22న కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్‌కు బీసీల సమస్యలను, కాపులను చేర్చడం వల్ల కలిగే నష్టాలను సమగ్రంగా వివరించేందుకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీలు తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతుండటం సమంజసం కాదన్నారు. గ్రామాల్లోకి వెళ్ళి మైక్ ద్వారా ప్రచారం చేసుకునే ప్రయత్నాలకు పోలీస్‌శాఖ ద్వారా అవాంతరాలు కల్పిస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు సార్లు జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటన వాయిదా వేసి 12 జిల్లాల్లో ముగిశాక ఆఖరిగా ఇక్కడ పర్యటిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీలు ఐక్యతను చూపేందుకు సంసిద్ధులుగా ఉండాలన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడంపై వ్యతిరేకతను కాపుల కవ్వింపు చర్యలను లెక్క చేయకుండా శాంతియుతంగా మంజునాథ కమిషన్‌కు వినిపించాలన్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీల్లో అభివృద్ధి చెందిన కాపులను చేర్చడం అన్యాయమన్నారు. కొత్తపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం మండలం అధ్యక్షుడు ఇళ్ళ సతీష్ మాట్లాడుతూ ఇప్పటికే కొత్తపేట ఏఎంసీ చైర్మన్ పదవి ఎంపికలో బీసీలు అన్యాయానికి గురయ్యారన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే వార్డు మెంబరు నుంచి ఉన్నత పదవుల వరకూ బీసీలు అణగదొక్కబడతారని కమిషన్‌కు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మరుకుర్తి దుర్గాయాదవ్, జిల్లా గౌడ శెట్టిబలిజ సంఘం కన్వీనర్ కుడుపూడి పార్థసారథి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ తులసి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్కా వెంకటలక్ష్మి, అప్పారి విజయకుమార్, గుబ్బల వీర్రాజు, గుబ్బల సుబ్రహ్మణ్యం, కడలి ఈశ్వరీ, పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
కాపు వెబ్సైట్ ప్రారంభం
అమలాపురం టౌన్ (అమలాపురం) : కాపు వెల్ఫేర్ డాక్కామ్ అసోసియేషన్ రూపొందించిన వెబ్సైట్ ద్వారా అందించే ఉచిత సేవలను కాపు యువత సద్వినియోగం చేసుకోవాలని ఆ వెబ్సైట్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్‌లోని ఐబీఎం సాఫ్ట్వేర్ ఉద్యోగి డాక్టర్ యాళ్ల శ్రీనివాసవరప్రసాద్ కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం, ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డ సుమారు రెండు కోట్ల మంది కాపులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చే ప్రయత్నంగా ఈ వెబ్సైట్ ప్రారంభించినట్టు చెప్పారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్‌లో కాపు విద్యావంతులతో సోమవారం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 22న జిల్లాకు వస్తున్న మంజునాథ కమిషన్‌కు ఈ వెబ్సైట్ ద్వారా కాపుల మనోభావాలు, ఆవేదనను తెలియజేయనున్నట్టు చెప్పారు. ఈ వెబ్సైట్లో కాపులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్నారు. త్వరలో కాపు వెల్ఫేర్ డాట్కాం మొబైల్ హెల్ప్ పేరుతో మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఈ వెబ్సైటులో 1.50 లక్షల మంది కాపుల వివరాలను పొందుపరిచానని చెప్పారు. kapuwelfare.comకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కాపు మిత్ర టీమ్ కన్వీనర్ బండారు రామమోహనరావు, కాపు ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు నంధ్యాల నాయుడు, కాపు మిత్ర టీమ్ సభ్యులు కరాటం ప్రవీణ్, నిమ్మకాయల సురేష్, ముత్యాల శరత్‌బాబు, మద్దింశెట్టి రాంబాబు, నిమ్మకాయల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు సంఘటితం కావాలి
కాపులను బీసీల్లో చేర్చితే రోడ్డెక్కి ఉద్యమాలు 22న చలో కాకినాడకు సన్నాహక ఏర్పాట్లు రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్ : కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదని... అదే జరిగితే బీసీలు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురంలోని శెట్టిబలిజ సంఘం భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన జిల్లా బీసీ కులాల ప్రతినిధుల సమావేశానికి కుడుపూడి అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్ర బీసీ జేఏసీ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై ఈనెల 22న జిల్లాకు మంజునాథ కమిషన్ వస్తున్న సందర్భంగా నిర్వహించనున్న చలో కాకినాడ కార్యక్రమంలో ప్రతి బీసీ సామాజిక వర్గీయుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో ఎందుకు చేర్చకూడదో..చేర్చితే బీసీలకు నష్టాలు ఎలా ఉంటాయో గణాంకాలతో సహా కమిషన్‌కు వివరించాలని బీసీ జేఏసీ నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే తమ అభ్యంతరాలతో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసేందుకు కూడా బీసీలు సిద్ధం కావాలని సూచించారు. బీసీలను అణగదొక్కటానికే కాపులను రంగంలోకి దించారని ఆరోపించారు. ఇది చంద్రబాబు పన్నుతున్న కుట్రగా అభివర్ణించారు. సూర్యనారాయణరావు మాట్లాడుతూ బీసీల్లో నేటికీ వెలుగులోకి రాని దాదాపు 40 సంచార జాతుల ఉనికి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. బీసీలకు రుణాలు, రాయితీలు వద్దని...రాజ్యాధికారాన్ని అందుకునే రిజర్వేషన్లు సంపూర్ణంగా కల్పించాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల వారికి కనీసం ఆధార్ కార్డులు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయటంలేదని ధ్వజమెత్తారు. ఆ జాతుల వారిని గుర్తించి ప్రభుత్వమే ఉన్నత విద్య, కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించాలని రాష్ట్ర గంగిరెడ్ల సామాజిక సంఘం నాయకుడు అమ్మోరు అన్నారు. రాష్ట్ర బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, బీసీ నేతలు గుత్తుల సాయి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, మల్లాడి సత్తిబాబు, గుత్తుల శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సత్యం, యిళ్ల సత్యనారాయణ, అనుపోజు శ్రీనివాస్, పట్నాల వెంకటరమణ, దొమ్మేటి రాము, బండి రాధమ్మ తదితరులు ప్రసంగించారు. 22న చలో కాకినాడ కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లపై సమావేశం విస్తృతంగా చర్చించింది. -
హక్కులను హరిస్తే సహించేది లేదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు రావులపాలెం(కొత్తపేట) : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలనే కోరిక అసమంజసమైనదని దీనిని తిరస్కరిస్తూ మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, తదితర అన్ని రంగాల్లో కాపులు ముందంజలో ఉన్నారన్నారు. సంచార జీవులు వివక్షకు గురైన కులాలను గుర్తించి ఆనాడు అంబేడ్కర్ బీసీ రిజర్వేషన్లు కల్పించారన్నారు. నేడు కాపులు వివక్షకు గురికాలేదని వారు సంచార జీవులుకాదని బీసీల్లో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుకు చేర్చే అధికారం లేదన్నారు. మంజునాథ కమిషన్ కేవలం బీసీ కులాల స్థితిగతులను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే తప్ప కాపును బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీ కాదని ఆయన స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిందని తూర్పుగోదావరి జిల్లా మిగిలిఉందని చెప్పారు. ఇప్పటికీ బీసీ కులాలు అనుభవిస్తున్న సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనం గురించి కమిషన్‌కు వివరించామన్నారు. కాపు సంఘ నాయకులు కూడా తాము సాంఘికంగా ఎలా వెనుకబడి ఉన్నామో కమిషన్‌కు ఆధారాలు చూపలేకపోయారని, ఈ పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యం కాదనే నివేదికను నిస్పక్షపాతంగా ఇవ్వాల్సి ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లోను, స్థానిక సంస్థల్లోను రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ నివేదిక సమర్పించడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లిన సహించేది లేదని న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం, కొత్తపేట మండలాల అధ్యక్షుడు ఇళ్ల సతీష్, గుబ్బల వీర్రాజు, గుబ్బల వెంకటరమణ పాల్గొన్నారు. -
సత్యాగ్రహం
బీసీలను రెచ్చగొడుతున్న బాబు - హామీని అమలు చేయకుండా ఎదురు దాడి - కాపుల నిరసనలపై ఉక్కుపాదం - ఊపిరున్నంత వరకు పోరాటం - మార్చి 26న న్యాయవాదులతో సమీక్ష - కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కర్నూలు(అర్బన్): కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు..బీసీలను రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్‌తో కర్నూలు నగరంలోని మెగాసిరి ఫంక్షన్హాల్లో ఆదివారం చేపట్టిన సత్యాగ్రహ దీక్షలకు ఆయన హాజరయ్యారు. ముందుగా నగరంలోని శ్రీ కృష్ణదేవరాయలు, దామోదరం సంజీవయ్య విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం దీక్షా వేదిక నుంచి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. హామీని అమలు చేయకుండా.. కాపులు నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లో సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ జాబితాలో ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను ఓసీ జాబితాలో చేర్చేందుకు భారత రాజ్యంగ నిర్మాత డా.బీఆర్ అడ్డుకున్నారన్నారు. అయితే రాజకీయ పరిణామాల్లో ఓసీలుగా మారిన ఆయా కులాలను దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తిరిగి బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. కృతజ్ఞతగా...అంబేద్కర్, దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతుల్లో పాల్గొనాలని కోరారు. తాము కొత్తగా బీసీ రిజర్వేషన్లు కోరడం లేదని, గతంలో ఉన్నవి తిరిగి పునరుద్ధరించాలని అడుతున్నామన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి.. 9వ షెడ్యూల్లో చేర్చి.. కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధం.. ఎంతో సున్నితమైన మనసు ఉన్న తనను ఉద్యమకారుడిగా మార్చింది చంద్రబాబే అని ముద్రగడ అన్నారు. జాతి శ్రేయస్సు కోసం జరుగుతున్న పోరాటంలో చావోరేవో తేల్చుకుంటామని ఉద్విగ్నంగా చెప్పారు. రాజకీయాలకు, గ్రూపులకు అతీతంగా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని, ముఖ్యంగా మహిళలు కూడా ఉద్యమ పథాన ముందుండాలన్నారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టమంటే.. ప్రభుత్వం కేసులను పెడుతోందని విమర్శించారు. ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న ఏ,బీ,సీ,డీల్‌లో కాకుండా క్రిమిలేయర్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేవలం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదని, ఇచ్చిన హామీ మేరకు ఏడాది రూ.1000 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు. మార్చి 26న న్యాయవాదులతో సమీక్ష ... ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మార్చి 26వ తేదీన న్యాయవాదులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అనుకున్న లక్ష్యం సాధించే ప్రక్రియలో తాము నిద్రపోమని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముద్రగడ దీక్ష విరమించారు. సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ, జిల్లా సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా.విజయశంకర్, అమరం నరసింహారెడ్డి, కొండా విజయ్, పీ నారాయణరెడ్డి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వై సత్యనారాయణ, ఆర్జా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రం
రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ కొత్తపేట : కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గురువారం సాయంత్రం రామకృష్ణ కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాపులను బీసీలలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే కాపులను ఉగ్రదవాదుల్లా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా అది శాంతియుత కార్యక్రమమేనని స్పష్టం చేశారు. సత్యాగ్రహ దీక్షకు పిలుపు ఇస్తే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరగనీయమంటున్నారు. ఎలా జరగనీయరో చూస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలు కోసం రాజప్ప లాంటి కాపు మంత్రులు, కొందరు కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాపు ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. -
కాపులను బీసీల్లో చేర్చొద్దు
- మంజునాథన్ కమిటీని అడ్డుకుంటాం - రాష్ట్ర బీసీ నాయకుల సమావేశం కొత్తపల్లి (పిఠాపురం) : కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, బీసీ నాయకుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కొత్తపల్లి ఊరచెరువు సెంటర్లో వున్న సతీష్చంద్రభవన్లో మంగళవారం రాష్ట్ర బీసీ నాయకులు, స్థానిక నాయకులతో మాజీ ఎంపీటీసీ కాకరపల్లి గంగాధర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలు విద్య, ఉద్యోగ అవకాశాలనే కాక రాజకీయ పదవులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను, హక్కులను కోల్పోతారన్నారు. కాకినాడలో జరగబోయే మంజునాథన్ కమిటీ పర్యటనను అడ్డుకుంటామన్నారు. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రకటించిందని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు 50 శాతం సబ్సిడీతో రుణాలను అందిస్తున్నారన్నారు. బీసీల్లో 144 కులాలు వున్నాయని వారికి మాత్రం 30 శాతం సబ్సిడీ కల్పిస్తున్నారన్నారు. అధికారం కోసం ఎన్నికల్లో అడగని వాగ్దానాలు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. 93 కులాల బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర గణేష్‌బాబు, జిల్లా రజిక సంఘం నాయకుడు మురముళ్ల రాజాబాబు, జిల్లా పద్మశాలి సంఘ నాయకుడు పొన్నగంటి సత్యనారాయణ, పెద్దాపురం నియోజకవర్గ బీసీ నాయకుడు పెంకె వెంకటేష్‌బాబు, జిల్లా మత్స్యశాఖ నాయకుడు తుమ్మల రమేష్, మండల శెట్టిబలిజల సంఘ నాయకుడు కొప్పిశెట్టి ఈశ్వరరావు, మదర్ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్, బీసీ ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లి తిరుపతిరావు పాల్గొన్నారు. -
ఎన్ని ఇబ్బందులున్నా..రిజర్వేషన్లు సాధిస్తాం
కాపు ఉద్యమనేత ముద్రగడ మేము సైతం అంటున్న మహిళా నేతలు బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కాపు రిజర్వేషన్ల సాధిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తంచేశారు. స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాల్ గురువారం కాపు మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మహిళా నాయకురాలు కూడా పాల్గొన్న ముద్రగడ ఉద్యమానికి మద్దతు పలికారు. సదస్సులో ముద్రగడ మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చితే వచ్చే పరిస్థితిపై బీసీల అనుమానాలు నివృత్తి చేసేందుకు బీసీ నాయకులను కలుస్తున్నట్టు చెప్పారు. త్వరలో మరికొంతమందిని కలుస్తానన్నారు. గతంలో ప్రకటించినట్టుగా సత్యగ్రహ యాత్ర చేయనున్నట్టు వెల్లడించారు. గద్దె ఎక్కేందుకే సీఎం చంద్రబాబు కాపులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టిన భయపడేదిలేదని వైఎస్సార్సీపీ విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి అన్నారు. ముద్రగడ వెంటే ఉంటామన్నారు. సభాధ్యక్షురాలు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి మాట్లాడుతూ కాపులు రిజర్వేషన్లు సాధించిన తర్వాతే నిజమైన పండుగన్నారు. సినీ నటి హేమ మాట్లాడుతూ ఎంతోమంది కాపులు ఆకలితో అలమటిస్తున్నారని, బీసీల్లో చేర్చితే నిరుపేద కాపులకు ఉపయోగమన్నారు. రిజర్వేషన్లు భవిష్యత్తు తరాలకు ఉపయోగమన్నారు. ముద్రగడ ఉద్యమానికి ఉడతాభక్తిగా సహాయం చేస్తామన్నారు. కాపు మహిళా నాయకురాళ్లు ఉమామహేశ్వరి (శ్రీకాకుళం), శేషులత (విశాఖ అర్భన్), మొగలి సర్వమంగళం(విజయనగరం), ఆకుల జయప్రద (నూజివీడు), మిరయాల రత్నకుమారి (గుంటూరు), పబ్బినీడి మణి, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి లీలావతి, పంతం ఇందిర, పోలిశెట్టి సునీత మాట్లాడుతూ ఏ ఉద్యమం తలపెట్టిన తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు ఐకాస నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, మలకల చంటిబాబు, జానపాముల నాగబాబు , సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు
– కాపు ఎంఎస్ఎంఈల ద్వారా గ్రూపుకు రూ. 25లక్షల రుణం – బీసీ, కాపు కార్పొరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు ఎం.తిమ్మాపురం(మహానంది): కాపు, బీసీ కారొ్పరేషన్ల ద్వారా రుణాల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు కానున్నట్లు బీసీ, కాపు కారొ్పరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన ఆయన మండల కేంద్రంఎం.తిమ్మాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన రుణమేళాను సందర్శించారు. అనంతరం ఎంపీడీఓ నరసింహులు, బ్యాంకు మేనేజర్లతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో బీసీలకు 1790 మందికి ఒక్కొక్కరికి రూ. 2లక్షలు చొప్పున, 1400 మంది కాపులకు రూ. 2లక్షలు చొప్పున రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాపులకు ఎంఎస్ఎంఈ కింద 35 గ్రూపులకు (ఒక్కొక్క గ్రూపుకు రూ. 25లక్షలు ) 8.75కోట్లు విడుదలయ్యాయన్నారు రూ. 25లక్షల్లో రూ. 10లక్షలు సబ్సిడీ, రూ. 10లక్షలు బ్యాంకు రుణం, రూ. 5లక్షలు లబ్ధిదారుడి వాటా ఉంటుందన్నారు. ఫెడరేషన్ల ద్వారా 3887 మందికి రూ. 7.74కోట్లు ఇవ్వనున్నామన్నారు. రుణాల కోసం అర్హులు అందించిన దరఖాస్తులను ఆయా మండల పరిషత్ అధికారులు 48 గంటల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం ఆయన మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్త బాలరాజుయాదవ్, నాయకులు రవిస్వామి, క్రాంతికుమార్ తదితరులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. -
రుణ దరఖాస్తుల్లో కాపులకు అందని సహకారం
కాపు కార్పొరేషన్ చైర్మ్న్కు కాపు మిత్ర బృందం ఫిర్యాదు అమలాపురం టౌన్ : రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న కాపులకు బ్యాంకర్లు, మండల పరిషత్, బీసీ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద సహాయ సహకారాలు లభించడం లేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయకు కాపు మిత్ర బృందం ఫిర్యాదు చేసింది. విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్‌ను కాపు మిత్రకు చెందిన కోనసీమ నాయకుల బృందం ఆదివారం కలిసిందని ఆ బృంద ప్రతినిధి బండారు రామ్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాపు రుణాల విషయంలో దరఖాస్తుదారులు పడతున్న ఇబ్బందులను ఆయనకు వివరించామన్నారు. ప్రభుత్వం కాపుల కోసం అమలు చేస్తున్న 8 పథకాల తీరుపై మాట్లాడామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,687 దరఖాస్తులకు రూ.86 కోట్లు రుణాల పంపిణీ లక్ష్యంగా కాపు నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటి వరకూ కేవలం 259 మందికి మాత్రమే రూ.3 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారని చెప్పామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు అసలు రుణాలే మంజూరు కాలేదని, ఈ లోపాలపై దృష్టి సారించి కాపు యువతకు త్వరతగతిన రుణాలు మంజూరయ్యేలా చూడాలని కోరినట్టు తెలిపారు. కాపు మిత్ర చైర్మన్ డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ లోపాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ చలమశెట్టి హామీ ఇచ్చారని తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలో కాపు మిత్ర ప్రతినిధులు పరుచూరి అప్పాజీ, కరాటం ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
పోరు ఆగదు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆకలికేకలతో హోరెత్తిన జిల్లా మిన్నంటిన నిరసనలు కాపులు కదం తొక్కారు. ఆదివారం ఆకలికేకలు కార్యక్రమంతో జిల్లాను హోరెత్తించారు. కంచాలపై గరిటెలతో మోగిస్తూ.. మానవహారాలు నిర్వహించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం/తణుకు : రిజర్వేషన్లు సాధించేవరకూ కాపుల ఆకలి పోరు ఆగదని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ఆయన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కాపులు ఆకలికేకలు కార్యక్రమం నిర్వహించారు. అన్ని మండలాల్లో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీసు ఐలాండ్ సెంటర్లో జరిగిన కాపుల ఆకలికేకలు కార్యక్రమంలో ముద్రగడ సతీసమేతంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు. గాంధేయమార్గంలోనే రిజర్వేషన్లు సాధిద్దామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేక ఇప్పటికే కాపులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, నిజాం పాలనలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని గుర్తుచేశారు. మండల కమిషన్ కూడా కాపులకు రిజర్వేషన్లు అవసరమని నివేదికలు ఇచ్చిందని, దామోదరం సంజీవయ్య హయాంలో ఆరేళ్లపాటు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్లతో కాలయాపన చేయొద్దని, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కంచంపై గరిటెల శబ్దం చేసి నిద్రలేపాలని పిలుపునిచ్చారు. ముద్రగడ గాంధీ మార్గంలో పాదయాత్ర ప్రారంభిస్తే నిరంకుశవైఖరితో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, అధికారం చేపట్టాక కాపులను మోసం చేసిందని విమర్శించారు. కాపు ఉద్యమాన్ని నీరు కార్చాలని, ఉద్యమానికి తూట్లు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆవేదన చెందారు. ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్లు సాధించడం ఖాయమన్నారు. అన్ని విధాలుగా ముద్రగడకు మద్దతు నిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు మాకా శ్రీనివాసరావు, ఈతకోట తాతాజీ. నరిశే సోమేశ్వరరావు, గుండుమోగుల నాగు, ఆకుల ధనశేఖర్ , మారిశెట్టి అజయ్, యెరుబండి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వలవల బాబ్జీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి అబ్బులు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, కాంగ్రెసు నాయకులు దుర్గా రామచంద్రరావు, కాపునాడు జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మాలమహానాడు, మైనార్టీ అసోసియేషన్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముద్రగడకు ఘనస్వాగతం అంతకుముందు ముద్రగడ పద్మనాభానికి 16వ జాతీయ రహదారి పొడవునా కాపులు పెద్దసంఖ్యలో మోటారు సైకిళ్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం చేరుకున్న అనంతరం ఆయన అంబేడ్కర్, శ్రీకృష్ణ దేవరాయలు, ఈలి ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటుగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ రాకకు ముందు టీబీఆర్ సైనిక స్కూలు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆలరించాయి. గుర్రాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. -
పోరు ఆగదు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆకలికేకలతో హోరెత్తిన జిల్లా మిన్నంటిన నిరసనలు కాపులు కదం తొక్కారు. ఆదివారం ఆకలికేకలు కార్యక్రమంతో జిల్లాను హోరెత్తించారు. కంచాలపై గరిటెలతో మోగిస్తూ.. మానవహారాలు నిర్వహించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం/తణుకు : రిజర్వేషన్లు సాధించేవరకూ కాపుల ఆకలి పోరు ఆగదని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ఆయన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కాపులు ఆకలికేకలు కార్యక్రమం నిర్వహించారు. అన్ని మండలాల్లో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీసు ఐలాండ్ సెంటర్లో జరిగిన కాపుల ఆకలికేకలు కార్యక్రమంలో ముద్రగడ సతీసమేతంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శించారు. గాంధేయమార్గంలోనే రిజర్వేషన్లు సాధిద్దామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేక ఇప్పటికే కాపులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, నిజాం పాలనలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని గుర్తుచేశారు. మండల కమిషన్ కూడా కాపులకు రిజర్వేషన్లు అవసరమని నివేదికలు ఇచ్చిందని, దామోదరం సంజీవయ్య హయాంలో ఆరేళ్లపాటు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్లతో కాలయాపన చేయొద్దని, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కంచంపై గరిటెల శబ్దం చేసి నిద్రలేపాలని పిలుపునిచ్చారు. ముద్రగడ గాంధీ మార్గంలో పాదయాత్ర ప్రారంభిస్తే నిరంకుశవైఖరితో ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, అధికారం చేపట్టాక కాపులను మోసం చేసిందని విమర్శించారు. కాపు ఉద్యమాన్ని నీరు కార్చాలని, ఉద్యమానికి తూట్లు పొడవాలని కుట్ర పన్నుతున్నారని ఆవేదన చెందారు. ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్లు సాధించడం ఖాయమన్నారు. అన్ని విధాలుగా ముద్రగడకు మద్దతు నిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు మాకా శ్రీనివాసరావు, ఈతకోట తాతాజీ. నరిశే సోమేశ్వరరావు, గుండుమోగుల నాగు, ఆకుల ధనశేఖర్ , మారిశెట్టి అజయ్, యెరుబండి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వలవల బాబ్జీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి అబ్బులు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, కాంగ్రెసు నాయకులు దుర్గా రామచంద్రరావు, కాపునాడు జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మాలమహానాడు, మైనార్టీ అసోసియేషన్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముద్రగడకు ఘనస్వాగతం అంతకుముందు ముద్రగడ పద్మనాభానికి 16వ జాతీయ రహదారి పొడవునా కాపులు పెద్దసంఖ్యలో మోటారు సైకిళ్ల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం చేరుకున్న అనంతరం ఆయన అంబేడ్కర్, శ్రీకృష్ణ దేవరాయలు, ఈలి ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటుగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ రాకకు ముందు టీబీఆర్ సైనిక స్కూలు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆలరించాయి. గుర్రాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. -
కాపుల మలిపోరు
తాడేపల్లిగూడెం: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు దిగింది. తమ డిమాండ్లను సాధించుకునే దిశగా గత నెలలో కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తొలి విడతగా ఆదివారం కంచాలు, పల్లాలపై గరిటెలతో శబ్థాలు చేస్తూ ఆకలికేకలు పేరుతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు నియోజకవర్గ, మండల కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో కాపు వర్గీయులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రావులపాలెం, కొత్తపేటలో గరిటలతో కంచాలు మోగిస్తూ నిరసనలు తెలిపారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి కాపుల మలిదశ ఉద్యమం
-
ఆకలికేకలు విజయవంతం చేయండి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : కాపుల ఆకలి కేకల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కాపు కల్యాణ మండపం వద్ద నిర్వహించిన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం కూడలి వద్ద ప్లేట్లు, గరిటెలతో శబ్ధం చేసే నిరసన కార్యక్రమం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాపులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొత్తపల్లి సుబ్బలక్ష్మి కాపునాడు జిల్లా మహిళా అధ్యక్షు రాలిగా కొత్తపల్లి సుబ్బలక్షి్మని చినమిల్లి వెంకట రాయుడు నియమించారు. తాడేపల్లిగూడెం పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న సుబ్బలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు. పెంటపాడు మండల అధ్యక్షుడిగా పెన్నాడ సూరిబాబును నియమించారు. కాపుల ఆకలి కేకలు నిరసనకు అనుమతి తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించే కాపుల ఆకలి కేకలు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద పట్టణ అధ్యక్షులు మాకా శ్రీనివాస్ శనివారం రాత్రి మాట్లాడుతూ పోలీస్ ఐలండ్ వద్ద ఆదివారం ఉదయం 10–11 గంటల మధ్య నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతారని చెప్పారు. కాపు రిజర్వేషన్లను పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ కాపు కుటుంబాలు ప్లేట్లు, కంచాలపై గరిటెలతో చప్పుడు చేసే కార్యక్రమం నిర్వహిస్తాయన్నారు. దీనికి డీఎస్పీని అనుమతి కోరగా, ఆయన అంగీకరిస్తూ ఆ¯ŒSలై¯ŒS ద్వారా సమాచారం పంపించారన్నారు. కాపులంతా ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. -
మలిపోరుకు కాపులు రె‘ఢీ’
నేడు కంచాలపై గరిటెలతో ఆకలి కేకలు ముఖ్య కూడళ్లలో నిరసనలకు ఏర్పాట్లు తాడేపల్లిగూడెంలో ’ముద్రగడ’ జిల్లాలోనే ఇతర నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు సిద్ధమవుతోంది. గత నెలలో కోనసీమలో తలపెట్టిన పాదయాత్రను చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపి నిలిపివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో డిమాండ్లను సాధించుకునే దిశగా గత నెలలో కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించింది.అందులో దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. తొలి విడతగా ఈ నెల 18 (ఆదివారం)న కంచాలు, పల్లాలపై గరిటెలతో శబ్థాలు చేస్తూ ఆకలికేకలు పేరుతో ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు ప్రతి నియోజకవర్గంలో 30 మంది కాపు వర్గీయులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లులో ఆ కమిటీ ఆధ్వర్యంలో కాపు వర్గీయులు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక వెసలుబాటును బట్టి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు ఇందులో ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేసేలా జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగే కాపుల ఆకలికేకలు కార్యక్రమ ంలో పాల్గొననున్నారు. జిల్లా కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ రావులపాలెం, వాసిరెడ్డి ఏసుదాసు కాకినాడ భానుగుడి జంక్షన్, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒS తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గడియారపు స్తంభం సెంటర్లో ఆకలికేకలు వినిపించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోను స్థానిక జేఏసీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
చంద్రబాబు ఆటలు సాగనివ్వం
రాష్ట్ర కాపు జేఏసీ నేతల తీర్మానం సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట ఇచ్చి తప్పడమే కాకుండా కాపులను అణచివేసేందుకు చంద్రబాబు ఆడుతున్న ఆటలు సాగనివ్వరాదని, వచ్చే రెండేళ్లలో బాబుతో తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీ నిర్ణరుుంచింది. కాపుల ఉద్యమాన్ని మాత్రమే అణచివేసేందుకు చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా బెదరకుండా పోరాడాలని తీర్మానించింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలి అని జేఏసీ నిర్ణరుుంచింది. అవసరమైతే ఉద్యమాన్ని ఢిల్లీ స్థారుుకి తీసుకువెళ్లేందుకు కూడా సిద్ధపడాలని తీర్మానించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జేఏసీ నేత వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా తమకు తీవ్రవాదులుగా ముద్రవేస్తున్న చంద్రబాబు తీరును గ్రామగ్రామానా ఎండగట్టాలని నేతలు తీర్మానించారు. సమావేశం అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ముద్రగడ మీడియాకు వెల్లడించారు. -
రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం
-కాపు ఉద్యమనేత ముద్రగడ -పుష్కర ఘటనలో చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ అంబాజీపేట : కాపు రిజర్వేషన్ల సాధనకు రాజీలేని పోరాటం చేస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. అంబాజీపేటలో గురువారం రవణం వెంకట్రావు ఇంట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనందున గాంధేయ మార్గంలో తలపెట్టిన పాదయాత్రను పోలీసు బలగాలతో అణచివేయడం దురదృష్టకరమన్నారు. గత ఏడాది పుష్కరాల సందర్భంగా షూటింగ్ కోసం జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణానికి కారకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా తప్పుడు కేసులతో కాపు యువతను పోలీసులు భయపెడుతున్నారన్నారు. తమ ప్రమేయం ఉన్నట్లు రుజువైతే తన యావదాస్తిని అమ్మి నష్టపరిహారం చెల్లిస్తామని ఇటీవల డీజీపీకి పంపిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. కాపు కార్పోరేషన్‌కు ఏడాదికి రూ.వేయి కోట్లు మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. గత జన్మలోనూ కేసులున్నాయేమో చూడండి.. తనపై ఎన్ని కేసులు ఉన్నాయో చూడాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్న చంద్రబాబు తనపై గత జన్మలో కూడా ఏమైనా కేసులు ఉన్నాయేమో చూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు చేసే యాత్రలకూ అనుమతులు ఉన్నాయా, కాపు జాతి కోసం చంద్రబాబు ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకువచ్చాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు సోకుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఇచ్చిన వాగ్దానాల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ పోరాటం వల్ల ఏ కులానికి, ఏ వర్గానికి నష్టం జరగదని, తమకిస్తామన్న రిజర్వేషన్లను ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. మంజునాథ కమిషన్ వేసి దాన్ని కూడా అడ్డుకునే కుతంత్రానికి చంద్రబాబు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల జేఏసీ నాయకులతో వచ్చే నెల 2న కాకినాడలో సమావేశమై రిజర్వేషన్ల కోసం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణు, గంటా స్వరూప, పత్తి దత్తుడు, యర్రా నాగబాబు, యేడిద శ్రీను, శిరిగినీడి వెంకటేశ్వరరావు, జక్కంశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. -
‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
బోట్‌క్లబ్ (కాకినాడ) : స్థానిక కాపు కల్యాణమండపంలో సోమవారం ‘కాపు సత్యాగ్రహ యా త్ర’ పోస్టర్‌ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, జిల్లా కాపు సద్భావన సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. తుని ఘటన కొన్ని దుష్టశక్తులు కారణంగా జరిగిందని స్పష్టం చేశారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాపు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోను కాపు జేఏసీ ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొనుల తాతాజీ, రావూరి వేంకటేశ్వర్ారవు, పసుపులేటి చంద్రశేఖర్, పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు -
కాపులను బీసీల్లో చేర్చుతాం
ఆత్మకూరు: రాష్ట్రంలోని కాపు, బలిజలను బీసీ జాబితాలో చేరుస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు. పట్టణంలో ఆదివారం కాపు, బలిజ కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 1500 కోట్లు నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో కాపు, బలిజల కల్యాణ మండపాల ఏర్పాటుకు రెండు ఎకరాల పొలాన్ని, రూ. 5కోట్ల నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ కాపు,బలిజలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమశెట్టి రామానుజ, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు శెట్టినారాయణరెడ్డి కాపు, బలిజ సంఘం డివిజన్ నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు, సాయికృష్ణమూర్తి, తోట వెంకటరమణ, శివరాము, నాగ తిప్పయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలి
పి.గన్నవరం : ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16న కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి పిలుపునిచ్చారు. పి.గన్నవరం గరుడేశ్వర స్వామివారి ఆలయం వద్ద మండల టీబీకే అధ్యక్షుడు కొమ్మూరి మల్లిబాబు అధ్యక్షతన బుధవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజులపాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈయాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ జేఏసీ జాయింట్ కన్వీనర్లు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ముద్రగడ పోరాటం వల్లే టీడీపీలోని కాపు నేతలకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారన్నారు. కాపు జాతి ముద్రగడ వెన్నంటి ఉన్నారని వారు స్పష్టం చేశారు. అనంతరం సత్యాగ్రహ యాత్రకు సంబంధించిన కరపత్రాలను విష్ణుమూర్తి ఆవిష్కరించారు. టీబీకే నాయకులు ఉలిశెట్టి బాబీ, జక్కంపూడి వాసు, అడ్డగళ్ళ వెంకట సాయిరామ్, ఆర్వీ నాయుడు, దాసరి కాశీ, తోలేటి బంగారు నాయుడు, వివిధ గ్రామాలకు చెందిన టీబీకే నాయకులు, యువకులు పాల్గొన్నారు. -
కాపు రిజర్వేషన్ సాధనే నా ఊపిరి : ముద్రగడ
తాటిపాక(రాజోలు) : కాపు రిజర్వేషన్ సాధనే నా ఊపిరి అని, ఆర్థికంగా, సామాజికంగా కాపులు అనేక మంది వెనుకబడి ఉన్నారని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. బుధవారం ఆయన తాటిపాక విచ్చేసి మాజీ ఏఎంసీ చైర్మన్ జక్కంపూడి తాతాజీ స్వగృహం వద్ద కాపు ఉద్యమ నాయకులు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కాపు కుటుంబాలు ఇచ్చిన మద్దతు ఎంతో మనోబలాన్ని ఇచ్చిందన్నారు. ఉద్యమం పేరుతో అనేక మందిపై కేసులు పెట్టారని కాపు నాయకులు పలువురు ముద్రగడకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా కాపు రిజర్వేన్ పై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యమానికి సహకరించిన కాపు నాయకులకు, కార్యకర్తలకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ, నాయకులు అడబాల తాతకాపు, తోరం భాస్కరరావు, జక్కంపూడి వాసు తదితరులు పాల్గొన్నారు. -
అనంత మంజునాథ్ కమిషన్ సభలో రచ్చ
-
కాపుల సమస్యలు మంజునాథ్ కమిషన్‌కు తెలియజేయండి
కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు విజయవాడ (గాంధీనగర్) : కాపు కులస్తుల సమస్యలు, స్థితిగతులను జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తెలియజేయాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో కాపునాడు నగర కమిటీ ప్రమాణస్వీకారోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరాన్ని మంజునాథ్ కమిషన్‌కు వివరించాలని చెప్పారు. జిల్లాలో కమిషన్ పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలు సహకరించాలని కోరారు. అనంతరం కాపునాడు నగర అధ్యక్షుడిగా యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర కార్యదర్శిగా రంగిశెట్టి సత్యనారాయణ, నగర మహిళా కార్యదర్శిగా వరలక్ష్మి ప్రమాణస్వీకారం చేశారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు నియామకపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం పిళ్లా వెంకటేశ్వరరావును కాపునాడు నగర నాయకులు సన్మానించారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్రావు, నాయకులు పానక్‌దేవ్, ఎం.జయప్రద, కె.రజనీ, జయశ్రీ, భానుకుమారి, కృష్ణ వందన పాల్గొన్నారు. -
మంజునాథ కమిటీ ఎదుట నినాదాలు
-
మంజునాథ కమిటీ ఎదుట నినాదాలు
తిరుపతి: కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ తిరుపతిలో ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో బీసీ కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన కమిటీ సభ్యులు..సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కాపులను బీసీల్లో చేర్చడంపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఓవైపు తమను బీసీల్లో చేర్చాలంటూ కాపులు, మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. -
గద్దె దక్కదన్న భయంవల్లే..
తెలుగు రాష్ట్రాల ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ డి.సుభాష్‌చంద్రబోస్ ముద్రగడ ఉద్యమానికి సంఘీభావం కాపులను వెంటనే బీసీల్లో చేర్చాలని డిమాండ్ కిర్లంపూడి : కాపులను బీసీల్లోకి చేరిస్తే ఎక్కడ రాజ్యాధికారం కోల్పోతామో అనే భయం వల్లే చంద్రబాబు ఆ అంశంపై కాలయాపన చేస్తున్నారని తెలుగురాష్ట్రాల ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డి.సుభాష్ చంద్రబోస్ అన్నారు. మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఆదివారం ఆయన కలిసి కాపు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లోకి చేర్చడం వల్ల ఎవరికీ నష్టం చేయకూడదనే విషయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆనాడే చెప్పారన్నారు. తక్షణమే కాపులను బీసీల్లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లోకి చేర్చడం అంశంపై త్వరలో ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయన్నారు. ఆయన వెంట ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు బాలు నాయక్ తదితరులు ఉన్నారు. -
సింహ గర్జనకు సిద్ధం కావాలి
రాజమహేంద్రవరం రూరల్ : సింహగర్జనకు కాపులు సిద్ధంగా ఉండాలని కాపు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన మోరంపూడి బార్లపూడి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు కార్యాచరణ కమిటీ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చడంలో కాలయాపన చేస్తూండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిమాండు నెరవేరే దిశగా ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ముద్రగడ మాట్లాడుతూ, కాపు ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం తనను, తన కుటుంబ సభ్యులను ఎంతో అవమానించిందని పేర్కొంటూ కంటతడి పెట్టుకున్నారు. కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను బలోపేతం చేసుకోవాలని.. ఉద్యమానికి ఎప్పుడు పిలుపు ఇచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. మంజునాథ కమిషన్ ఇప్పటి వరకూ ఎక్కడా పర్యటించలేదన్నారు. ఏవర్గానికీ అన్యాయం జరగకుండా గతంలో ఉన్న రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలనే కోరుతున్నామన్నారు. ఇది కుల ఉద్యమం కాదని, సామాజిక ఉద్యమమని, హక్కుల కోసం పోరాడకపోతే భవిష్యత్తులో జాతి నష్టపోతుందని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చకపోతే టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులకు భయపడకుండా ఉద్యమానికి సన్నద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, జన్మభూమి కమిటీల పెత్తనంతో కాపు కార్పొరేషన్ రుణాలు పచ్చా చొక్కాలకే పరిమితమవుతున్నాయన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారన్నారు. సీఎం ఆయన సామాజికవర్గానికే న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే లక్ష్యంతో ఏ ఉద్యమం చేపట్టినా సిద్ధంగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను మాత్రమే జేఏసీలో నియమించాలని సూచించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, నరిశే సోమేశ్వరరావు తదితరులు కూడా మాట్లాడారు. ముద్రగడతోపాటు కాపునేతలను పొగుడుతూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాడిన పాట అందరినీ అలరించింది. కాపు జేఏసీ నేత వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్ రామినీడి మురళి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, బసవా ప్రభాకరరావు, కామన ప్రభాకరరావు, కలువకొలను తాతాజీ, సంగిశెట్టి అశోక్, నారాయణస్వామి, జక్కంపూడి గణేష్, నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజా చినబాబుకు సత్కారం తుని కాపు ఐక్యగర్జనకు కొబ్బరితోట ఇచ్చిన రాజా చినబాబును ముద్రగడ పద్మనాభం, కాపునేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ, ముద్రగడ తనకు రాజకీయ గురువని ఆయన కోసం ఏదైనా చేస్తానని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చిన అనంతరం అదే కొబ్బరితోటలో ముద్రగడను ఘనంగా సత్కరిస్తామని చెప్పారు. -
సింహ గర్జనకు సిద్ధం కావాలి
lకాపులకు జేఏసీ నేతల పిలుపు l13 జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు lముద్రగడ మాటే తమ బాట అని స్పష్టీకరణ రాజమహేంద్రవరం రూరల్ : సింహగర్జనకు కాపులు సిద్ధంగా ఉండాలని కాపు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన మోరంపూడి బార్లపూడి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు కార్యాచరణ కమిటీ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చడంలో కాలయాపన చేస్తూండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిమాండు నెరవేరే దిశగా ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ముద్రగడ మాట్లాడుతూ, కాపు ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం తనను, తన కుటుంబ సభ్యులను ఎంతో అవమానించిందని పేర్కొంటూ కంటతడి పెట్టుకున్నారు. కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను బలోపేతం చేసుకోవాలని.. ఉద్యమానికి ఎప్పుడు పిలుపు ఇచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. మంజునాథ కమిషన్ ఇప్పటి వరకూ ఎక్కడా పర్యటించలేదన్నారు. ఏవర్గానికీ అన్యాయం జరగకుండా గతంలో ఉన్న రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలనే కోరుతున్నామన్నారు. ఇది కుల ఉద్యమం కాదని, సామాజిక ఉద్యమమని, హక్కుల కోసం పోరాడకపోతే భవిష్యత్తులో జాతి నష్టపోతుందని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చకపోతే టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులకు భయపడకుండా ఉద్యమానికి సన్నద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, జన్మభూమి కమిటీల పెత్తనంతో కాపు కార్పొరేషన్ రుణాలు పచ్చా చొక్కాలకే పరిమితమవుతున్నాయన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారన్నారు. సీఎం ఆయన సామాజికవర్గానికే న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే లక్ష్యంతో ఏ ఉద్యమం చేపట్టినా సిద్ధంగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను మాత్రమే జేఏసీలో నియమించాలని సూచించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముద్రగడ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, నరిశే సోమేశ్వరరావు తదితరులు కూడా మాట్లాడారు. ముద్రగడతోపాటు కాపునేతలను పొగుడుతూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాడిన పాట అందరినీ అలరించింది. కాపు జేఏసీ నేత వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్ రామినీడి మురళి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, బసవా ప్రభాకరరావు, కామన ప్రభాకరరావు, కలువకొలను తాతాజీ, సంగిశెట్టి అశోక్, నారాయణస్వామి, జక్కంపూడి గణేష్, నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజా చినబాబుకు సత్కారం తుని కాపు ఐక్యగర్జనకు కొబ్బరితోట ఇచ్చిన రాజా చినబాబును ముద్రగడ పద్మనాభం, కాపునేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ, ముద్రగడ తనకు రాజకీయ గురువని ఆయన కోసం ఏదైనా చేస్తానని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చిన అనంతరం అదే కొబ్బరితోటలో ముద్రగడను ఘనంగా సత్కరిస్తామని చెప్పారు. -
'కాపు జాతిలో చిచ్చు పెట్టాలని చూడొద్దు'
రాజమండ్రి: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని, వాటిని అణచివేయాలని చూడటం దారుణమని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. టీడీపీ కాపు నేతలతో తనపై సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ కాపు ద్రోహి అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, కుర్చీ కోసం కాపు జాతిలో చిచ్చు పెట్టాలని చూడొద్దని హెచ్చరించారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. తన పై టెర్రరిస్ట్ ముద్రవేయాలని చూస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు ఇక్కడికి వచ్చారని ముద్రగడ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను అమ్మేసి చంద్రబాబు మన భూములను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. హోదాను ఢిల్లీకి, మన భూములు సింగపూర్ కు చంద్రబాబు అమ్మేశారన్నారు. దమ్ము, ధైర్యముంటే తుని లాంటి మీటింగ్ పెట్టండన్నారు. ఉద్యమాల నుంచి మధ్యలో ఒదులుకోవడంగానీ, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేయడం తనకు తెలియదని మద్రగడ తెలిపారు. -
'కాపు జాతిలో చిచ్చు పెట్టాలని చూడొద్దు'
-
చంద్రబాబు ప్రోద్బలంతోనే నాపై విచారణ
నన్ను అక్రమంగా జైలుకు పంపే కుట్ర పన్నుతున్నారు: భూమన సాక్షి, గుంటూరు/పట్నంబజారు: కాపులు చేస్తున్న న్యాయమైనపోరాటంలో బలిపశువును కావడం భగవంతుని ప్రసాదంగా భావిస్తున్నానని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయం ఆవరణలో భూమనను తుని ఘటన కేసులో బుధవారం రెండోరోజున విచారించారు. విచారణకు హాజరయ్యేముందు, విచారణ పూర్తయి బయటికొచ్చిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపుల న్యాయమైన కోర్కెలకోసం తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడడానికి మానసికంగా సంసిద్ధుడినై వెళుతున్నానని చెప్పారు. చంద్రబాబు ఇంటిపేరు వంచన.. కేరాఫ్ అడ్రస్ కుట్ర, ఆయన గోత్రం మోసమని, వీటితో పరిపాలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపట్ల తనకు నమ్మకముందని, ఏనాడూ హింసాయుతమైన చర్యలకు పాల్పడే చరిత్రలేని తనను ఉద్దేశపూర్వకంగా సీఐడీద్వారా పిలిపించే కుట్ర చంద్రబాబు చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఇబ్బంది పెట్టాలని.. వైఎస్సార్సీపీని సర్వనాశనం చేయాలనే తలంపుతో తుని ఘటనలో జరిగిన విధ్వంసానికి తమను పావులుగా వాడే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారన్నారు. వీరెన్ని కుట్రలు చేసినా వెరవనన్నారు. అమాయకులను కేసుల్లో ఇరికించి వేధించడంలో బాబు దిట్టని, తనను ఎదిరించేవారిని సహించలేని తత్వం ఆయనదని దుయ్యబట్టారు. సీఐడీ అధికారులు హరికృష్ణ, భాస్కర్లు తనపట్ల సభ్యతతో వ్యవహరించారని, ఇందుకు వారిని అభినందిస్తున్నానని భూమన చెప్పారు. తుని ఘటనపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే మాటకు తామిప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీఐడీ విచారణలో భాగంగా రెండోరోజు బుధవారం కరుణాకర్‌రెడ్డిని సీఐడీ అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు.విచారణ పూర్తయి భూమన బయటికొచ్చేవరకూ ఆయన్ను అరెస్టు చేస్తారనే ఆందోళనతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూశారు. సీఐడీ ఏఎస్పీ హరికృష్ణ మాట్లాడుతూ విచారణ పూర్తయిందని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారు. -
కాపు నేతలను విమర్శించే స్థాయి ‘చలమలశెట్టి’కి లేదు
కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా అమలాపురం టౌన్: రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్యకు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, చిరంజీవి, దాసరి నారాయణరావును విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆ పదవి చేపట్టే వరకూ కూడా కాపులన్న సంగతి రాష్ట్రంలోని కాపులకే తెలియదని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇటీవల తరచూ ముద్రగడను విమర్శిస్తూ, కాపు జాతిని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజప్ప మాట్లాడితే కాపులపై కేసులు, జైళ్లూ అంటున్నారని, తనకు అంతట పదవి ఇచ్చిన వారి మెప్పు కోసం ఆయన అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వానికి కాపులు బుద్ధి చెప్పే రోజు రాక మానదనిహెచ్చరించారు. -
కాపులను బీసీల్లో చేర్చొద్దు
అనంతపురం, సప్తగిరి సర్కిల్ : రాజకీయ లబ్ధికోసం కాపులను బీసీ కులాల్లో చేర్చొద్దని ఏపీ బీసీ ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, బూసా సాంబశివరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కాపులతోపాటు, ఇతర అగ్రకులాల వారిని బీసీ జాబితాలో చేర్చడం తమ హక్కుల్లో వారికి వాటా కల్పించడమేనన్నారు. ‘కాపులను బీసీల్లో చేర్చటం తప్పు, అది బీసీల రిజర్వేన్లకు ముప్పు’ అనే నిర్థిష్ట అవగాహనతో బీసీ ఐక్యకార్యాచరణ సమితి ముందుకు వెళ్తోందన్నారు. భవిష్యత్ కార్యాచరణ అన్ని కుల సంఘాలను కలుపుకొని, బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ కులాలకు సంబంధించి స్పష్టమైన జీవోను విడుదల చేసి బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేషఫణి, జిల్లా కన్వీనర్ సుధాకర్ యాదవ్, అమర్‌యాదవ్, లింగమయ్య, శ్రీనివాసులు, పవన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాపులకు టీడీపీ మరో షాక్ !
-
ముద్రగడను కలిసిన కాపు జేఏసీ నాయకులు
విజయవాడ(గుణదల) : కాపుల అభ్యున్నతికి దీక్ష చేపట్టిన కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంను రాధారంగా మిత్ర మండలి, విజయవాడ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం కిర్లంపూడిలోని ఆయన ఇంటిలో కలిశారు. నగరం నుంచి సుమారు 200 మంది కాపు నాయకులు అక్కడికి వెళ్లి ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్ పొందే వరకు పోరాటం సాగాలని, దీనికి పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని ముడ్రగడకు హామీ ఇచ్చారు. ముద్రగడను కలిసిన వారిలో కాపు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కొప్పుల వెంకట్, రాధారంగా మిత్రమండలి రాష్ర్ట అధ్యక్షుడు చె న్నుపాటి శ్రీనివాస్, కాపు నాయకులు మల్లెమూడి పిచ్చయ్యనాయుడు, అడపా నాగేంద్ర, నరహరిశెట్టి నరసింహారావు, ఆళ్ల చెల్లారావు, చింతల ఆనంద్, రవి కుమార్, విక్రం, నాగు, రాజనాల బాబ్జి, అల్లంపూర్ణ, రామాయణపు శ్రీనివాస్, తిరుమలశెట్టి ఉదయ్, అక్కల గాంధీ, బాడిత శంకర్, ఎన్ గాంధీ, ఎన్ సాంబశివరావు, అడ్వకేట్ ఏడుకొండలు, ఎస్టీ నాయకులు మేడ రమేష్, బీసీ నాయకులు బోను చిన్న శ్రీరాములు, బ్రాహ్మణ సంఘం నాయకులు అరుణ్‌కుమార్, ఎం.వివేక్ తదితరులు ఉన్నారు. -
తుని ఘటన కేసులో 8మంది బెయిల్ పై విడుదల
తుని(తూ.గో): తుని ఘటన కేసులో రాజమండ్రి జైలు నుంచి 8 మంది బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు సరిగా లేవని ఒకరిని అధికారులు విడుదల చేయలేదు. బెయిల్ పై విడుదలైన మరొకరిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని ఘటన కేసులో 10 మందికి పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ముగ్గురి బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి పదో రోజుకు చేరింది. -
కాపు మంత్రులను కులం నుంచి బహిష్కరిస్తున్నాం
కాపు నేత చింతాల వెంకట్రావు కావలి : కాపు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన రాజప్ప, పి.నారాయణను కాపు కులం నుంచి బహిష్కరిస్తున్నామని కాపు నేత చింతాల వెంకట్రావు చెప్పారు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఆయన నివాసంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా రిలే దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముద్రగడ ఉద్యమంలో అనుమానం ఉందంటూ గంటా, చినరాజప్ప, నారాయణ మాట్లాడటం దారుణమన్నారు. కాపులను బీసీల్లోకి చే ర్చేంత వరకు ముద్రగడతోనే తామంతా ఉండి ఉద్యమాన్ని శాంతియుతంగా బలోపేతం చేస్తామన్నారు. కాపు ఉద్యమ మహిళ నేత మెతుకు రాజేశ్వరి మాట్లాడుతూ గతంలో తమ జాతినేత వంగవీటి మోహనరంగాను కోల్పోయామని, ఇప్పుడు మా ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేమన్నారు. కాపుల దీక్షకు వైఎస్సార్సీపీ మద్దతు చింతాల వెంకట్రావు నివాసంలో కాపు నేతలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ, డీఆర్‌యూసీసీ సభ్యులు కుందుర్తి కామయ్య, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, నేతలు శ్రీహరిరెడ్డి, యల్లంటి ప్రభాకర్, జనిగర్ల మహేంద్ర యాదవ్ దీక్ష స్థలికి చేరి కాపులకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు కాపు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. కాపు నేతల అరెస్ట్ చింతాల వెంకట్రావు నివాసంలో కాపు నేతలు మెతుకు రాజేశ్వరి, నున్నా వెంకటరావు, తోట శేషయ్య, వెంకయ్య, పసుపులేటి వెంకటేశ్వర్లు, ఇంటూరి శ్రీహరి, పాలడుగు వెంకటేశ్వర్లు, పసుపులేటి పద్మ, రమణతో పాటు పలువురు కాపు నేతలు రిలే దీక్షలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కావలి 1వ పట్టణ సీఐ వెంకటరావు, ఎస్ఐ రామ్మూర్తి, తమ సిబ్బందితో వచ్చి కాపు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. వ్యక్తిగత పూచిపై విడుదల చేశారు. -
నాన్ బెయిలబుల్ కేసులతో బెదిరిస్తే ప్రయోజనం లేదు..
► మాజీ మంత్రి కాసు ► ముద్రగడతో సీఎం చంద్రబాబు ► చర్చలు జరపాలని డిమాండ్ నరసరావుపేట : కాపులను బీసీల్లో చేర్చాలని ఆందోళన చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సీఎం చంద్రబాబునాయుడు చర్చలు జరపాలని మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణ సంఘ చైర్మన్ కాసు వెంకటకృష్ణారెడ్డి కోరారు. తన గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ విధంగా వ్యవహరించకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బెదిరిస్తే సమస్య పెరిగి పెద్దదవుతుందని ెహ చ్చరించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో స్టేట్మెంట్లు ఇప్పించినంతమాత్రాన ప్రజలు, కాపు సంఘీయులెవరూ విశ్వసించరని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ మేరకు బీసీ వర్గీయులకు ఇబ్బంది కలుగకుండా కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని సూచించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన విషయంపైనే ముద్రగడ ఆందోళన చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తాము మేనిఫెస్టోలో లేని ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను సమర్థంగా అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం నుంచి స్పందనే లేదు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధుల కేటాయింపుల ప్రతిపక్షాలను కూడా ఢిల్లీ తీసుకెళ్లాలని ఎన్నిసార్లు కోరినా సీఎం వద్ద నుంచి స్పందనే రావడంలేదని విమర్శించారు. పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. సమావేశంలో మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వైవీ నర్సిరెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తుని ఘటనలో నలుగురికి బెయిల్
తుని(తూ.గో):తుని ఘటనలో అరెస్టయిన వారిలో నలుగురికి పిఠాపురం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. పుల్లయ్య, సత్తిబాబు, లగుడు నివాస్, పల్ల హరిబాబులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ముద్రగడ మాత్రం వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. -
'వాళ్లు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు'
గుంటూరు: మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి టీడీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్నారని, వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొండి వైఖరి వీడాలని కోరారు. అంతకు ముందు గుంటూరులో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ నెల 27 లోపు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ అమరావతి వచ్చేస్తాయని తెలిపారు. -
కాపు ఉద్యమం ఉధృతం
ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన చోడవరంలో మౌనప్రదర్శన.. అడ్డుకున్న పోలీసులు అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటు 18 మంది అరెస్టు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో ఆ సామాజిక వర్గీయుల్లో ఆందోళన రెట్టింపవుతుంది. మరో పక్క కాపులను అణిచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ఆ సామాజిక వర్గీయులు భగ్గుమంటున్నారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. రోడ్డెక్కిన కాపు నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తూ పోలీసులు ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారు. కనీసం నిరసనలు, మౌనల ప్రదర్శ నలు చేసుకునేందుకు కూడా ఈ ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా అంటూ కాపు నేతలు నిలదీస్తున్నారు. విశాఖపట్నం: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా పక్కన పెట్టేందుకే చంద్రబాబు సర్కార్ కాపు ఉద్యమాన్ని నీరుగారుస్తోందని జిల్లా కాపు నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమె త్తారు. గోడను కొట్టిన బంతిలా ఉద్యమాన్ని ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతలా ఉవ్వెత్తున ఎగసి పడుతుందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా సుమారు 200 మందికి పైగా కాపునాడు కార్యకర్తలతో కలిసి అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నోటికి గుడ్డలు కట్టుకొని పట్టణ పురవీధుల్లో మౌన ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కనీసం ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకుండా మౌనంగా ప్రదర్శన చేయడం కూడా తప్పేనా.. ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? అని నేతలు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రదర్శనకు అనుమతివ్వాలని కోరినప్పటికీ ససేమిరా అనడంతో పోలీసుల తో నేతలు వాగ్వాదానికి దిగారు. అమర్నాధ్, ధర్మశ్రీలతో 18 మందిని అరెస్ట్‌చేసి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట కాపునాడు నేతలు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు. ప్లకార్డులు చేతబూని చంద్రబాబు, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కాపునాడు నేతలు వీసాల సుబ్బన్న, కోనేటి రామకృష్ణ, గొలుసు నరసింహమూర్తి తదితరులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా గొలుగొండ మండలంలో కాపునాడు కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. నక్కపల్లిలో కాపునాయకుడు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ తదితరులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం కొత్తపాలెం జంక్షన్లో స్థానిక కాపునాడు నాయకుడు దొడ్డి కిరణ్‌కుమార్ తదితరులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఏపీ సర్కార్ తీరు అమానుషం
కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాడులా? ముద్రగడకు మద్దతుగా ప్రవాసాంధ్ర కాపు నేతల ధర్నా సాక్షి ప్రసారాలు నిలిపివేయడం హేయం బెంగళూరు(బనశంకరి) : కాపులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఏపీ సర్కార్.. కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్షను భగ్నం చేసి అమానుషంగా వ్యవహరించిందని ప్రవాసాంధ్ర కాపు నేతలు మండిపడ్డారు. ముద్రగడకు మద్దతుగా ప్రవాసాంధ్ర కాపులు ఆదివారం బెంగళూరులోని ఆనందరావు సర్కిల్ ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాపు నేత డాక్టర్ జగన్నాథ్‌రావు మాట్లాడుతూ... కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ తర్వాత గాలికొదిలేశారన్నారు. ఈ నేపథ్యంలో కాపుల కోసం దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబసభ్యులను పోలీసుల చేత బలవంతంగా లాక్కెళ్లి ఆస్పత్రికి తరలించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభంను పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ఇది చంద్రబాబు నిరంకుశ పాలనను గుర్తు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాక్షి ఛానల్ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం నిలిపివేయించి నీచ రాజకీయాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందించకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బత్తుల అరుణాదాస్, మూర్తి, ఆస్ట్రేలియా నుంచి విచ్చేసిన ప్రవాసాంధ్రుడు రావు, నాగబాబు, భరత్, చిత్తూరు శ్రీను బాలాజీ, మదన్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
వైఎస్సార్సీపీ నేత బొత్స తదితరుల అరెస్టు తగదు ‘సాక్షి’ ప్రసారాలను అడ్డుకోవడం పిరికిపంద చర్య వైఎస్సార్ సీపీ నేత వీసం రామకృష్ణ నక్కపల్లి: అరెస్టులతో కాపు ఉద్యమాన్ని ఆపలేరని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, కాపు నాయకుడు వీసం రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్న ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం పిరిపిపంద చర్య అని అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసిల్లో చేరుస్తామంటూ ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని ముద్రగడ చేస్తున్న దీక్షలో తప్పులేదన్నారు. ముద్రగడను అన్యాయంగా అరెస్టుచేసి ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న ముద్రగడను పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జగ్గిరెడ్డి తదితరులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ కాపులను చులకనగా చూస్తోందన్నారు. వెఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేయడం, ఉభయ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ విధించడం వంటి ఆంక్షలను ఉపసంహంచుకోవాలని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేయడం తగదు... ముద్రగడ దీక్ష విరమించే వరకు సాక్షి టీవి ప్రసారాలు నిలిపివేస్తామని మంత్రి చినరాజప్ప ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఏపీ చరిత్రలో ఇలా మీడియా ప్రసారాలను అడ్డుకోవడం ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఎల్లో మీడియా, పచ్చపత్రికలు వ్యతిరేక వార్తలు రాసినా, ప్రసారాలు చేసినా ఏనాడు ఆయన మీడియాపై ఆంక్షలు విధించలేదన్నారు. -
కాపు నేతలపై పోలీసు చూపు !
ముద్రగడ దీక్ష నేపథ్యంలో నిఘా జిల్లా వ్యాప్తంగా షాడో పార్టీలు చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా కాపు (బలిజ) నాయకుల కదలికలపై పోలీసు యం త్రాంగం నిఘా ఉంచింది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ సామాజికవర్గ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం రెండు రోజులుగా ఆయన భార్యతో కలిసి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ చేపట్టిన దీక్షను అణచివేయాలని ఎక్కడా ఆందోళనలు జరగకుండా ఉండటానికి పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. జిల్లాలో దాదాపు 3.75 లక్షల కాపు జనాభా ఉంది. కాపు నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నప్పటికీ ముద్రగడ దంపతుల ఆమరణ దీక్షతో ప్రభుత్వానికి ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటుందోననే భయం పట్టుకుంది. ఈ ఏడాది జనవరి 31న తునిలో జరిగిన బీసీ గర్జనలో రైలును తగులబెట్టడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ముద్రగడకు మద్దతుగా ఎక్కడైనా కాపు నాయకులు ఆందోళనకు దిగితే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయోనని పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రధానంగా చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉన్న కాపు ప్రధాన నాయకుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌తో పాటు శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులు సైతం వేర్వేరుగా రంగంలోకి దిగారు. ఏయే వేళల్లో ఎక్కడికి వెళుతున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారు..? ఏదైనా ఆందోళనకు సిద్ధమవుతున్నారా..? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. కొందరు ప్రధాన కాపు నాయకులకు పోలీసు ఉన్నతాధికారులే ఫోన్లు చేసి ఉన్నపలంగా కుశలం అడుగుతుండటంతో నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు పోలీసులు ఓ అడుగు ముందుకేసి ముద్రగడకు మద్దతుగా ఏదైనా ఆందోళన కార్యక్రమాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తే కేసులు పెట్టి జైలులో వేస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక తునిలో జరిగిన బీసీ గర్జనకు వెళ్లిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కాపు నేతలను సైతం షాడో పార్టీ వెంటాడుతోంది. ఇంట్లోంచి బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా.. వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడానికి పోలీసుల నిఘా ఇబ్బంది కరంగా మారుతోందని పలువురు నేతలు వాపోతున్నారు. -
'కాపులపై కేసులు ఉపసంహరించేది లేదు'
విజయవాడ: కాపులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. విధ్వంసానికి దిగితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కేసులు పెట్టి ఉపసంహరించడం ఉండదని తెలిపారు. మరోవైపు తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా బనాయిస్తున్న కేసులను ఉపసంహరించాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయించుకోడానికి ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలోని 202 రూమ్‌లో ఆయనను ఉంచారు. వైద్యులు అనేకసార్లు ఆయనకు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. నిన్న సాయంత్రం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. పరిస్థితి ఏంటన్నది బయటకు తెలియనివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. పేషెంట్లు, అధికారులు మినహా ఎవరినీ ఆస్పత్రిలోకి రానివ్వడం లేదు. తన డిమాండ్ నెరవేర్చేవరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. -
'ముద్రగడపై కేసులు పెట్టడం రెచ్చగొట్డడమే'
-ముద్రగడ దీక్షపై కేంద్ర హోంశాఖ, గవర్నర్ స్పందించాలి అనంతపురం: కాపుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ ఆమరణ దీక్షపై కేంద్ర హోం శాఖ, రాష్ర్ట గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని అనంతపురం జిల్లా కాపు-బలిజ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లోకి చేరుస్తామని హామి ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు గడిచినా హామీలను నెరవేర్చడం లేదని అనంతపురం కాపుసంఘం నేత అమర్నాథ్ విమర్శించారు. తుని ఘటనకు బాధ్యులను చేస్తూ ఎనిమిది మంది కాపులను భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టు అయిన నేతలను విడుదల చేయాలని కోరిన ముద్రగడపై కేసులు నమోదు చేయడం కాపులను రెచ్చగొట్టటమేనని ఆయన అన్నారు. ముద్రగడ డిమాండ్లపై సానుకూలంగా స్పందించపోతే తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాలని ఆయన హెచ్చరించారు.ఈ విషయంపై వెంటనే రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని కాపుల న్యాయపరమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ముద్రగడ దీక్షతో ఏపీ సర్కార్‌లో హై టెన్షన్
విజయవాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. దీంతో వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం హుటాహుటీన విజయవాడ బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయంలోనే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ దీక్షతో పాటు, కిర్లంపూడిలోని తాజా పరిణామాలపై చినరాజప్ప వివరించారు. ఇక తుని ఘటనలో సీఐడీ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కాగా తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు అమలు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంది. అలాగే కిర్లంపూడిలో పోలీసులు భారీగా మోహరించారు. డిఐజి రామకృష్ణ, ఎస్పీ రవి ప్రకాశ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి అర్బన్‌లో 144 సెక్షన్ అమలు అవుతోంది. -
ముద్రగడ దీక్షపై స్పందించిన చంద్రబాబు
కడప: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమని ఆయన గురువారమిక్కడ అన్నారు. కష్టాల్లో ఉన్నామని, రాష్ట్రంలో సమస్యలు సృష్టించవద్దంటూ చంద్రబాబు ఈ సందర్భంగా ముద్రగడతో పాటు ఇతరులకు విజ్ఞప్తి చేశారు. అరాచకాలు సృష్టిస్తే వ్యవస్థని ఎవరు కాపాడతారని అన్నారు. వ్యక్తిగత సమస్యలపై ఇష్టారీతిలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తునిలో రైలును దగ్ధం చేసిందెవరని, రౌడీలను అరెస్ట్ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. నేరాలు ఎక్కడా జరగటానికీ వీల్లేదన్నారు. కాపుల రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం పూర్తి స్పష్టత ఉందన్నారు. అందుకోసం కాపు కమిషన్‌తో పాటు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని చంద్రబాబు కోరారు. -
కాపు నేతలపై నిఘా
ముద్రగడను అదుపులోకి తీసుకోవటంతో అప్రమత్తం విజయవాడ : కాపు నేతలపై పోలీసు శాఖ నిఘా పెరిగింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లాలో ఉన్న ముఖ్య నేతల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కిర్లంపూడిలో ముద్రగడ అరెస్ట్, తుని ఘటనలో కొందరిని అరెస్ట్ చేయటంతో మళ్లీ కాపు ఉద్యమ అలజడి రేగింది. ఈ క్రమంలో ముద్రగడకు సంఘీభావంగా ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలో దృష్టి సారించిన పోలీసులు నేతల కదలికలను పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలో, వివిధ రాజకీయ పార్టీల్లో కీలక నేతలుగా ఉన్న కాపు నేతలు, వారి అనుచరగణంపైనా నిఘా ఉంచారు. విజయవాడ రాజధాని నగరం కావటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని పరిస్థితిపై పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అధికారులతో చర్చించారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట, భవానీపురం హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాలతో పాటు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల వద్ద పోలీసులు ఎక్కువగా దృష్టిసారించారు. మరోవైపు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలు ప్రభుత్వ చర్యల్ని సమర్ధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి కార్యాలయాల వద్ద ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి నగరంలో పోలీసులు కీలక ప్రాంతాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తుని ఘటనలో జిల్లాకు చెందినవారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సీఐడీ కొంతకాలంగా దర్యాపు సాగిస్తోంది. -
ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
తూర్పుగోదావరి: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు, పరిటాల రవి చనిపోయినప్పుడు విధ్వంసం సృష్టించాలని పిలుపునిచ్చింది చంద్రబాబే అన్నారు. పరిటాల రవిని హత్య చేస్తారని చంద్రబాబుకు తెలుసి కూడా రాజకీయ మైలేజ్ కోసం పాకులాడారని ఆయన ఆరోపించారు. పరిటాల రవి చనిపోయిన రోజున అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి.. 'తగలబెట్టండి' అని చంద్రబాబు దహనకాండను ప్రేరేపించారన్నారు. రాజమండ్రి పుష్కర పాపం చంద్రబాబుదేనని విమర్శించారు. తుని ఘటనలో కేసులుండవని చెప్పిన ప్రభుత్వం మాటతప్పి అరెస్టులకు పాల్పడుతోందని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపుల్లోని కులాలను విడదీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. విభజించి పాలించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇప్పటివరకు మంజునాథ్ కమిషన్ పర్యటించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. అమాయక ప్రజలను జైల్లో పెడుతున్నారని.. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ముద్రగడ స్పష్టం చేశారు. రేపు సాయంత్రంలోగా కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేయకపోతే.. గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ముద్రగడ ప్రకటించారు. -
కాపులను మభ్యపెడుతున్న ప్రభుత్వం
► జాట్ల రిజర్వేషన్‌పై స్టేను స్వాగతిస్తున్నాం ► రాష్ట్రంలో కాపులతో అధికార పార్టీ ఓట్ల రాజకీయం ► బీసీ మహాజన సమితి నాయకుడు వై.కోటేశ్వరరావు గుంటూరు వెస్ట్ : కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని బీసీ మహాజన సమితి నాయకుడు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు(వైకే) శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జాట్లు, మరో 5 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం గత మార్చిలో ఆమోదించిన చట్టం అమలుపై పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజన్ బెంచి స్టే (నిలుపుదల) ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక ప్రాతిపదికన ఆ కులాలకు 10 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించిన విధానం రాజ్యాంగబద్ధంకాదని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్ చట్టాన్నే రూపొందించగా సుప్రీంకోర్టు 2015 మార్చిలో రామ్‌సింగ్ కేసులో కొట్టివేసింది. జాట్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కిందకు రారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు ఏపీలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని అధికార పార్టీ ఓట్ల రాజకీయం చేస్తున్నట్లు స్పష్టమవుతోందని వైకే తెలిపారు. -
'హవ్వా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసమా'
హైదరాబాద్ : ఓ వైపు రాష్ట్రం ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు (చదవండి....ఫైవ్ స్టార్ హోటల్లో చంద్రబాబు నివాసం) తక్షణమే స్టార్ హోటల్ బస నుంచి చంద్రబాబు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. దుబరా ఖర్చులు చేస్తూ చంద్రబాబు నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. 'కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని, మీరే జీవో విడుదల చేసి నాటకాడుతున్నది వాస్తవం కాదా?. మేధావులు, స్వామీజీలకు రాజకీయాలు అంటగట్టడం దారుణం. హామీలు అమలు చేయాలని వాళ్లు కోరితే అందుకు వైఎస్ జగన్‌ను నిందిస్తారా?. ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తూ కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మినీ మహానాడు పేరుతోనూ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. అవి మినీ మహానాడులు కాదు...మనీ మహానాడులు. ఎన్నికల వాగ్దానాలపై చర్చించకుండా వైఎస్ జగన్‌ను దూషించడం సరికాదు.' అని అంబటి అన్నారు. -
చంద్రన్న కాపు భవనాలా?
హైదరాబాద్ : కాపు జాతిని అవమానపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపుల అభ్యున్నతి కోసం వేసిన మంజునాథ్ కమిషన్ ఏమైందో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. నాలుగు మాసాలు గడిచిన కాపు రిజర్వేషన్లపై అతి గతీ లేదని ఆయన మండిపడ్డారు. బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...కనీసం వంద కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రన్న పేరు పెట్టి కాపు జాతిని అవమానపరుస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఆయన అభద్రతా భావనతో ఉన్నారని, అందుకే బతికుండగానే అన్ని పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రన్న కాపు భవనాలు అంటూ పేర్లు పెట్టుకోవటం శోచనీయమన్నారు. ఇప్పటివరకూ కాపులకు ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘కాపు’లపై శ్వేతపత్రం విడుదల చేయూలి
బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక చైర్మన్ సాంబశివరావు తెనాలి టౌన్ : కాపులను బీసీల్లో చేరిస్తే బీసీలకు నష్టం జరగదని టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక చైర్మన్ సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని ఎన్జీవో కల్యాణ మండపంలో బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన సాంబశివరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం జిల్లాలవారీగా సభలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సభలు నిర్వహించి రాష్ట్ర రాజధానిలోని బీసీ ఐక్య గర్జనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎంబీసీ జాతీయ అధ్యక్షుడు యూవీ చక్రవర్తి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం 54 శాతం ఉన్న బీసీలందరూ ఏకకులంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోలా శంకర్, నాయకులు టి.ఆశోక్‌యాదవ్, కందుల సాంబశివరావు గౌడ్, పి.సుఖదేవయ్య, జి.అమేశ్వరరావు, జయలత, వేల్పూరి వెంకటేశ్వర్లు, గండికోట నరసింహారావు, వివిధ వర్గాలకు చెందిన బీసీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి ‘కాపు’ కాయలేదు
రూ.60వేలకే పరిమితమైన బీసీ కార్పొరేషన్ రుణయూనిట్లు జన్మభూమి కమిటీల అడ్డంకులతో నేటికి 842మందికే సాయం సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది ప్రభుత్వం పరిస్థితి. అధికారం చేపట్టేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి తీరా అధికారం చేజిక్కాక అందుకు సాయపడిన వారిని కరివేపాకు లా తీసిపారేస్తోంది. కాపులే తమ బలమని, వారి కోసం ప్రభుత్వం ఎంతైనా చేస్తుందని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరణలోకొచ్చేసరికి వారికి ఝలక్ ఇచ్చారు. ఒక్కో రుణ యూనిట్ రూ.2లక్షల విలువతో మంజూరు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడేమో యూనిట్‌ను రూ.60వేలకే పరిమితం చేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. బీసీలకు 5945యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా జన్మభూమి కమిటీల గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అర్థిక సంవత్సరం ముగియవస్తున్నా వెయ్యి యూనిట్లు కూడా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు బ్యాంకు రుణాలతో మెలిక పెడ్డటం కూడా లబ్ధిదారులకు ప్రతిబంధకంగా మారింది. 50శాతం రుణమిస్తామని, బ్యాంకులు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీ విడుదల చేస్తామని ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి, మోసగిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 60వేల లోపే కాపులకు రుణం 2015-2016ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న కాపులకు రూ.50వేల నుంచి రూ. 2లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2462 రుణయూనిట్లు ఇచ్చేందుకు లక్ష్యం పెట్టుకుంది. అయితే, అమల్లోకి వచ్చేసరికి రూ.60వేలకు మించి రుణయూనిట్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెబుతోంది. అంతమేరకే బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడా నిధుల విడుదలకు కూడా బ్యాంకు రుణం మెలిక పెట్టింది. 50శాతం మేర బ్యాంకులు రుణమిచ్చేందుకు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీని విడుదల చేస్తామని చెబుతోంది. లేదంటే ఆ రుణ యూనిట్‌ను పెండింగ్‌లో పెడుతోంది. ఈ క్రమంలో బ్యాంకు అనుమతి లేక అనేక మంది రుణ యూనిట్లకు దూరమవుతున్నారు. బీసీలకు అడ్డంకిగా మారిన జన్మభూమి కమిటీలు బీసీలకు జన్మభూమి కమిటీల ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోంది. కమిటీలు పెడుతున్న ఇబ్బందులు పడలేక చాలామంది నిరాశకు లోనవుతున్నారు. జిల్లాలో బీసీలకు 5945యూనిట్లు మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. ఈమేరకు ఆన్లైన్లో 10,572దరఖాస్తులొచ్చాయి. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి, బీసీ కార్పొరేషన్‌కు నివేదించాల్సిన బాధ్యతను జన్మభూమి కమిటీలకు సర్కార్ అప్పగించింది. జన్మభూమి కమిటీలు టీడీపీ కమిటీలుగానే చెలామణి అవుతున్నాయని సర్వత్రా వినిపిస్తున్న మాట. దాదాపు సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారే కావడంతో అవి కాస్తా పచ్చ కమిటీలుగా మారిపోయాయి. వాళ్లకు నచ్చితే ఎంపిక చేస్తారు. లేదంటే పక్కన పడేస్తారు. పలు కమిటీలు చిలక్కొట్టుడుకు ఆశపడడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో నెలతో ముగియనుంది. కానీ ఇప్పటి వరకు 842మందికి సంబంధించిన ఎంపిక జాబితాయే అధికారుల వద్దకు వచ్చింది. వాటికి మాత్రమే రుణమంజూరు ఇచ్చారు. వారికి 50శాతం మేర బ్యాంకు రుణ అనుమతి ఇస్తేనే సబ్సిడీ నిధుల్ని విడుదల చేస్తున్నారు. లేదంటే కొర్రీ పెడుతున్నారు. నిధుల మేరకే యూనిట్లు ప్రభుత్వం కేటాయించిన నిధుల మేరకు కాపులకు యూనిట్లు మంజూరు చేస్తున్నాం. రూ.60వేల లోపే యూనిట్లు కేటాయిస్తున్నాం. జన్మభూమి కమిటీలిచ్చే జాబితా ప్రకారమే బీసీలకు రుణ యూని ట్లు మంజూరు చేస్తున్నాం. బ్యాంకులు 50శాతం రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీ నిధుల్ని విడుదల చేస్తున్నాం. అంతకుమించి చేసేదేమీ లేదు. - ఆర్.వి.నాగరాణి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, బీసీ కార్పొరేషన్ -
కాపు కార్పొరేషన్ రుణాల్లో భారీగా కోత!
విజయవాడ: కాపు కార్పొరేషన్ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. రుణాల కోసం 3 లక్షల 25 వేల మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడతగా కేవలం 32 వేల మందిని మాత్రమే బీసీ కమిషన్ ఎంపీక చేసింది. వీరికి గురువారం ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలు పంపిణీ చేయనున్నారు. సబ్సిడిగా ప్రభుత్వం రూ. 90 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ముద్రగడ ఉద్యమం సమయంలో రూ. 500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం దశల వారిగా మంజూరు చేస్తామని కొత్తమాట చెబుతోంది. పెండింగ్ దరఖాస్తులకు మరోసారి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. -
బీసీల్లో కలపడం కుదరదని చెప్పండి
ఎంబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప పంజగుట్ట: కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీని వెంటనే రద్దు చేసి...వారిని బీసీల్లో కలపడం కుదరదని ప్రకటించాలని ఎంబీసీ సంక్షేమ సంఘం (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) జాతీయ అధ్యక్షుడు కె.సి. కాళప్ప డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీల ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి సూర్యారావుతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను ఆ జాబితాలో చేరుస్తానని చంద్రబాబు ప్రకటిస్తున్నారని... అది సాధ్యం కాదని అన్నారు. కాపులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్నారని తెలిపారు. కాపుల కోసం మాట్లాడే నాయకులు అత్యంత వెనుకబడి ఉన్న ఎంబీసీల విషయం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కాపు అన్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఒక్క కులం కోసం కమిటీ వేసి గడువు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారని కాళప్ప అన్నారు. చంద్రబాబు వేసిన కమిటీకి మరింత సమయం ఇచ్చి కాపులతో పాటు ఎంబీసీల స్థితిగతులపైనా అధ్యయనం చేయాలని కోరారు. సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు చల్లా వీరేశం, మ్యాంగోజీ పటాన్, నగర అధ్యక్షుడు జగదీష్ కుమార్, రవితేజ, రాఘవేందర్, రెడ్డప్ప, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కాపులను బీసీల్లో చేర్చడం అసాధ్యం
♦ బీసీలకు అన్యాయం జరగకుండా ఎలా చేరుస్తారు? ♦ నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తే పాలకుల పీఠాలు కదుల్చుతాం ♦ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ♦ విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం సాక్షి, విజయవాడ: వెనుకబడిన తరగతుల్లో(బీసీ) కాపులను చేర్చితే బీసీలు నష్టపోతారని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిం చేందుకు మంగళవారం విజయవాడలో బీసీ సం క్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... రిజర్వేషన్లు ప్రకటించే విషయంలో మండల్ కమిషన్, బీసీ కమిషన్, సుప్రీంకోర్టు కొన్ని పారామీటర్లను పెట్టాయని గుర్తుచేశారు. వాటిని పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం కాపులను బీసీల్లో కలిపితే చట్టప్రకారం చెల్లవని స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చడం ఆచరణలో సాధ్యం కాదన్నారు. ఏపీలోనూ జనాభా సర్వే జరగాలి ‘‘విద్యారంగంలో ఎ, బి, సి,డి గ్రూపులు ఉండడం వల్ల బీసీలకు ఇబ్బంది ఉండదు. స్థానిక సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూపులు లేకపోవడం వల్ల అక్కడ కాపులే బీసీ ట్యాగ్ మీద రిజర్వేషన్లు పొందుతారు. బీసీల గొంతు నొక్కి అయినా సరే కాపులను బీసీల్లో కలపాలని ప్రభుత్వం చూస్తోంది. దీన్ని మేము కచ్చితంగా అడ్డుకుంటాం. ఏకపక్షంగా, నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తే పాలకుల పీఠాలను కదల్చడానికీ వెనుకాడబోం. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభా సర్వే జరగాలి. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. వారి అభ్యున్నతి కోసం ప్యాకేజీలు ఇవ్వాలే తప్ప బీసీ రిజర్వేషన్లను తీసుకోవడం సరైంది కాదు. బీసీల్లో కాపులు చేరకుండా అడ్డుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’’ అని కృష్ణయ్య తేల్చిచెప్పారు. న్యాయం కోసం పోరాడుతాం కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ ఇప్పటికే పోరాటం చేస్తున్నామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, దాన్ని పరిశీలించిన తర్వాత బీసీల జేఏసీ ఏర్పాటు చేసి, బీసీలకు న్యాయం చేసేందుకు పోరాడతామని తెలిపారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ... బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఏవిధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. త్వరలోనే బీసీల్లోని అన్ని కులాలతో బీసీ సింహగర్జన నిర్వహించాలని విస్తృత స్థాయి సమావేశంలో కొందరు సూచించారు. ఆత్మత్యాగానికైనా సిద్ధం బీసీ సమావేశంలో ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తుండగా గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన మురళీగౌడ్(35) లేచి ‘బీసీల ఐక్యత వర్థిలాలి’ అంటూ నినాదాలు చేస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తలపై పోసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పక్కనే ఉన్న మిగిలిన నేతలు అతడిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాపులను బీసీల్లో చేర్చుకుండా ఉండేందుకు తాను ఆత్మత్యాగం చేయడానికైనా వెనుకాడబోనని మురళీగౌడ్ హెచ్చరించాడు. మద్దతు ఇవ్వండి: కాగా, కాపులను బీసీల్లో చేర్చడానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా కాపునాడు అధ్యక్షుడు బేటు రామ్మోహన్, ఇతర కాపు నేతలు.. ఆర్.కృష్ణయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాపు నాయకులతో బీసీ నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను శాంతపరిచి అక్కడ నుంచి పంపించివేశారు. -
ముద్రగడ ఇంటికి నేతల తాకిడి
కిర్లంపూడి : కిర్లంపూడిలోని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహానికి మంగళవారం నేతల తాకిడి ఎక్కువైంది. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం విరమించిన విషయం విదితమే. జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి అభినందనలు తెలియజేశారు. మంగళవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడును ముద్రగడను కలిసి అభినందనలు తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు పాలంకి ప్రసాద్, ఏడిద కోట సత్యనారాయణ, వనుంరెడ్డి శ్రీనివాస్, గుగ్గులపు మురళి పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఆకుల రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు గుండా రమణ, వాసిరెడ్డి ఏసుదాసు, ప్రగడ సుబ్బారావు, మలకల చంటిబాబు, గౌతు స్వామి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు చల్లా ప్రభాకరరావు, చల్లా భూషణం, చిన్నం హరిబాబు, బండారు శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ పెంటకోట నాగబాబు ముద్రగడను కలిశారు. -
కట్టుబడతారా? చిచ్చుపెడతారా?
కాపుల కోరికలను తీర్చడం సాధ్యం కాదన్నట్టు మాట్లాడిన చంద్రబాబు వారం తిరిగే సరికి అన్నిటికి సరే అంటున్నారు. ఇవి, కాపుల ఉద్యమం సద్దుమణిగేలా చేసేందుకు చెబుతున్న మాటలేనా లేక నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నిస్తారా? కాపు సామాజిక వర్గం భావోద్వేగాలతో ఆటలాడుకోవడం ప్రభువులకు మంచిది కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీలలో చేర్పించడమా? లేదా 2019 ఎన్నికల్లో ఆ వర్గం ఆగ్రహాన్ని చవి చూడ టమా? చంద్రబాబు తేల్చుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మీద మరో మారు హామీని పొందడానికి ఒక రైలు తగలబడాల్సి వచ్చింది. లెక్క లేనంత మంది మీద దొమ్మీ, దహనం వగైరా కేసులు పెట్టాల్సి వచ్చింది. ఒక పెద్దాయన నాలుగు రోజులపాటు భార్యా సమేతుడై నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సివచ్చింది. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛంద గృహ నిర్బం ధంలో గడపాల్సి వచ్చింది. మరో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడమూ తప్ప లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు కాకపోతే మరెన్నటికీ కాదు అనే దిక్కు తోచని స్థితిలో, పదేళ్లు అధికారానికి దూరమై పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలవికాని హామీలను తమ ఎన్నికల ప్రణాళికలో గుప్పించేశారు. అవన్నీ అమలు చేయడం తన వల్ల కాదని ఆయనకు బాగా తెలుసు. అయినా గెలవడం ముఖ్యం కానీ విశ్వస నీయతేమిటి ‘‘మై ఫుట్’’ అనేది మొదటి నుంచి చంద్రబాబు సిద్ధాంతం. కాబట్టి ఆయన అలవోకగా హామీలు ఇచ్చేశారు. అటువంటి హామీలను గురించి ఈ 19 మాసాల్లో చాలాసార్లు మీడియాలో రాసుకున్నాం, మాట్లాడు కున్నాం. అందుకే ఆయన మీడియా మైండ్‌సెట్ మారాలని చెప్తూ ఉంటారు. ‘మైండ్‌సెట్’ బాబు రుబాబు దాదాపు రెండేళ్లు గడుస్తున్నా రైతు రుణమాఫీ జరగలేదేమని అడిగితే ఆయ నకు కోపం వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఏది? అంటే చికాకు ఎత్తుతుంది. డ్వాక్రా రుణ మాఫీ ఊసే ఎత్తొద్దు. ఎవరూ ఏమీ అడగకుండా, ఆయన చూపే అమరావతి చిత్రాలను తిలకించి పరవశిస్తుంటే చాలు.... ఆయనే ఆంధ్రప్ర దేశ్‌ను అభివృద్ధి చేసిపారేస్తారు. ఆయన చేయబోయే ఆ అభివృద్ధికి ప్రతి పక్షాలు, ప్రజలు అడ్డంకి కాబట్టి వారెవరూ అవసరం లేదు. రైతు రుణ మాఫీ గురించి మొన్న ఒక విలేకరి ప్రశ్నిస్తే... అత్యాశ ఉండటం మంచిది కాద న్నారు. మొత్తం రుణాలు మాఫీ చేస్తానన్నానా? నీ కలలోకి వచ్చి చెప్పానా? అని ఆ విలేకరిని దబాయించి పారేశారు. విశాఖపట్నంలో అత్యద్భుతమైన అంతర్జాతీయ వైమానిక దళ విన్యాసాలు జరుగుతుండగా... పనికిమాలిన కాపు ఉద్యమాన్ని పదే పదే చూపిస్తారా? అని టీవీ వాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత మైండ్‌సెట్. ఆయన మైండ్‌సెట్ ఎలాంటిదో చెప్పడానికి... ముద్రగడ పద్మనాభం నిరా హార దీక్ష విరమణతో తాత్కాలికంగా విశ్రాంతి కార్డు పడ్డ కాపు ఉద్యమం పట్ల ఆయన వ్యవహరించిన తీరే చాలు. కాపులను బీసీలలో చేర్చడం, కాపుల సంక్షేమానికి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి దానికి ఏడాదికి వెయ్యి కోట్లు కేటా యించడం ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి. ‘ఆ హామీని అమలు చెయ్యకుండా రెండేళ్లు గాడిదలు కాస్తున్నావా బాబూ?’ అని కమ్యూనిస్ట్ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించడంలో తప్పేముంది? ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన వాడిన భాష సముచితమైనది కాకపో వచ్చు. కానీ అంతిమ అర్థంలో జరిగింది అదే కదా! ముద్రగడ తునిలో కాపు గర్జన నిర్వహించిన నాడు విధ్వంసం జరుగుతుండగానే మీడియాను పిలిచి మాట్లాడిన బాబు... ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బు లేదు, కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్నారు. మరి ముద్రగడ దీక్షను విరమింపజేయడానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాం అని మళ్లీ ఎలా చెప్పారు? తొమ్మిది నెలల్లో మంజునాథ కమిషన్ నివేదికను ఇప్పిస్తాం, కేంద్రం ముందుపెట్టి రాజ్యాంగ సవరణ చేయించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పిస్తాం అన్న మాటలు ముద్రగడ దీక్షకు ముందు ఏమయ్యాయి? కేంద్రం వద్ద అంత పలుకుబడుందా? ఇలా బీసీ కులాలకు నష్టం జరగకుండా కాపులకు కూడా రిజర్వేషన్లను కల్పిం చాలంటే రాజ్యాంగ సవరణ జరగడం తప్పనిసరి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అందుకు ఒప్పించగలరా? రాజకీయంగా తనకు ఎలాంటి చిక్కులు రాని పరిస్థితుల్లో మాత్రమే బీజేపీ అందుకు ఇష్టపడుతుందని అందరికీ తెలుసు. కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ వ్యాప్తంగా అది మరిన్ని తలనొప్పులను ఎందుకు తెచ్చిపెట్టుకుంటుంది? కాబట్టి ఆ హామీని చంద్రబాబు కచ్చితంగా నెరవేర్చగలరన్న నమ్మకం ఎవరికీ లేదు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి లొంగి వచ్చేట్టు చెయ్యగల బలం టీడీపీకి లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో ఇవాళ బీజేపీకి ఏ మిత్ర పక్షం అవసరమూ లేదు. మరి కాపు సామాజిక వర్గం చంద్రబాబు మాటలను ఎలా నమ్మాలి? పోనీ బీసీలను సముదాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయగలరా? అంటే అదీ సాధ్యం కాదని తేలిపోయింది. టీడీపీ శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్య స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు. బీసీ జాబితా ఏమన్నా ధర్మసత్రం అనుకు న్నారా? అని కృష్ణయ్య కన్నెర్ర చేశారు కూడా. తన సొంత పార్టీ శాసన సభ్యుడి మైండ్‌సెట్‌నే చంద్రబాబు ఎందుకు మార్చలేక పోతున్నట్టు? బహి రంగంగా సవాలు చేస్తున్న కృష్ణయ్య మీద ఎటువంటి చర్యా తీసుకోకపోవ డమే కాదు, కనీసం మందలించకుండా మౌనం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని చూసి చాలా మంది ఆయనే కృష్ణయ్య చేత అలా మాట్లాడిస్తున్నా రేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కరవమంటే కాపులకు కోపం, విడవమంటే బీసీలకు కోపం అన్న చందంగా తయారైంది. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వెనకా ముందు ఆలోచించకుండా చేసే వాగ్దానాలు చాలా వరకు ఇటువంటి తల నొప్పులే తెచ్చి పెడతాయి. నిజానికి ఈ పాపం కాంగ్రెస్ పార్టీదే. కాపులను గతంలో రెండుసార్లు బీసీల జాబితాలో నుంచి తొలగించి పుణ్యం కట్టుకున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. కాపుల భావోద్వేగాలతో ఆడుకోవడం చేటు ఇక మొదటి రోజున ఇది సాధ్యం కాదు అన్న ధోరణిని వ్యక్తం చేసిన చంద్ర బాబు వారం తిరిగే సరికి ముద్రగడ దీక్ష తదనంతర పరిణామాల కారణంగా అన్నిటికి సరే అంటున్నారు. ఇవి, కాపుల ఉద్యమం సద్దుమణిగేందుకు చెబుతున్న మాటలేనా లేక నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నిస్తారా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతున్నది. ఇప్పటికి నలుగురు ఆత్మ బలి దానాలకు పాల్పడ్డారు. ఆ సామాజిక వర్గం భావోద్వేగాలతో ఆటలాడుకో వడం ప్రభువులకు మంచిది కాదు. మొదట్లోనే చెప్పినట్టు ముద్రగడ దంపతుల చేత దీక్షను విరమింపజేయడం కోసం పాత హామీలపై ఇచ్చిన సరికొత్త హామీల వల్ల ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం కొద్ది మాసాల పాటూ శాంతించవచ్చు. కానీ వాటిని నెరవేర్చకపోతే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది. అదలా ఉంటే, రేపటి నుంచి రోడ్డెక్కనున్న బీసీలను చంద్రబాబు ఎలా సముదాయిస్తారో చూడాలి. ఇంతకూ ముద్రగడ దీక్ష ఎందుకు విరమించినట్టు? తన మీద ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తి వేయించుకోడం తప్పించి మరేమీ లేదు అని మరో కాపు నాయకుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు. నిజానికి అది సాధ్యం కాని పని. తుని కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు తగలబడిన ఘటన, పోలీస్ స్టేషన్లపై దాడులు, పోలీసులను గాయపర్చటం వంటి ఘటనల మీద కేసులు ఉండవు అని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేదా ఆయన తరఫున రాయబారం నెరపిన మంత్రులు, నాయకులు ఎవరయినా ఇచ్చారా? అట్లా ఇచ్చి ఉంటే మళ్లీ ఒక మోసానికి తెర లేచినట్టే లెక్క. అదలా ఉంటే, తుని ఘటనలపై దర్యాప్తు చేయించి బాధ్యులపై కేసులు పెడతామని చంద్రబాబు అన్నారు. ఆ దర్యాప్తు ఏ కోణ ంలోంచి జరగబోతోందో. అందులో ఎవర్ని బాధ్యులను చేసి ఎవరిని అక్రమంగా కేసులలో ఇరికించబోతున్నారో ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టం అవుతున్నది. అసలు దోషులను వదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలను తప్పుడు కేసుల్లో ఇరికించడం టీడీపీ అధినేతకు కొత్తేమీ కాదు. అందుకే ఆయన తొలిరోజు నుంచీ పదేపదే పులివెందుల, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పేర్లే పలవరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఇప్పుడు రెండు మార్గాలు న్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీలలో చేర్చి ఆ వర్గాన్ని శాంతింపజేయడం లేదా 2019 ఎన్నికల్లో ఆ వర్గం ఆగ్రహాన్ని చవి చూడ టం. ఇప్పటికే చంద్రబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ ఈ సమస్య నుంచి ఆయనను గట్టెక్కిస్తుందా? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తూర్పు కాపులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్
విజయనగరం మున్సిపాలిటీ: సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా వెనుకబడిన తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చాలని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, తూర్పుకాపు సామాజిక వర్గ నాయకుడు బెల్లాన.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్‌రోడ్డులో గల ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చేందుకు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు, యువతతో పోరాటం చేస్తామన్నారు. అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 95 శాతం మంది తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉండగా.. అందరూ రైతులు, రైతు కూలీలు, కార్మికులుగానే జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ మాట్లాడుతూ తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చే వరకూ రాజీలేనిపోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో గెదల సన్యాసినాయుడు, నడిపేన శ్రీనివాసరావు, సంగంరెడ్డి బంగారునాయుడు, బోడసింగి ఈశ్వరరావు, వలిరెడ్డి శ్రీనివాసరావు, బోడసింగి నారాయణరావు, సత్తరపు శంకరరావు, థాట్రాజు కృష్ణ, ముల్లు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ముద్రగడకు మద్దతుగా ప్లేట్లు కొట్టి నిరసన
అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలోని పలుచోట్ల ఆదివారం కాపు నాయకులు గరిటెలతో ప్లేట్లుకొట్టి నిరసన తెలిపారు. అవనిగడ్డలో టీటీడీ కల్యాణ మండపం ఎదుట దీక్షా శిబిరం వద్ద నాయకులు ప్లేట్లను గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. పలువురు కాపు నేతలు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరాటం ఆగదన్నారు. గాంధేయ మార్గంలో దీక్షలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. రెండు చేతులు లేని పెయింటర్ యలవర్తి వెంకటేశ్వరరావు ప్లేటు కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు సింహాద్రి వెంకటేశ్వరరావు, బాడిగ నాంచారయ్య, కొండవీటి కిశోర్, న్యాయవాది రాయపూడి వేణుగోపాల్, అలపర్తి గోపాలకృష్ణ, పద్యాల వెంకటేశ్వరరావు, దేవనబోయిన అంజిబాబు, తోట ప్రసాద్, దాసినేని గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొత్తమాజేరులో చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మాజేరు కాపు సంఘం ఆధ్వర్యంలో యువకులు, గ్రామస్తులు గరిటెలతో ప్లేట్లు కొట్టారు. చల్లపల్లి-మచిలీపట్నం ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
‘దివి’లో రెండోరోజు కాపుల దీక్ష భగ్నం
అవనిగడ్డ, భావదేవరపల్లి, చల్లపల్లి, మోపిదేవిలో దీక్షలను భగ్నం చేసిన పోలీసులు అవనిగడ్డలో దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలో పలుచోట్ల రెండోరోజైన ఆదివారం కాపు నేతలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి మద్దతు అవనిగడ్డ టీటీడీ కల్యాణమండపం ఎదురుగా కాపునేతలు రాజనాల బాలాజీ, ఇమ్మిడిశెట్టి వెంకటేష్ రెండోరోజు దీక్షచేశారు. వీరితోపాటు రేపల్లె హేమ, పూషడపు మనోహర్ దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, కడవకొల్లు నరసింహారావు వీరికి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామన్నారు ప్రభుత్వం స్పందిం చి బీసీలను కాపుల్లో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. కాపు సంఘం ఐక్యవేదిక నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి, కొండవీటి కిశోర్, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షను భ గ్నం చేసిన పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ వెంకటకుమార్ నేతృత్వంలో పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షను భగ్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని బలవంతంగా ట్రక్ ఆటోలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 144వ సెక్షన్ అమలులో ఉండగా దీక్షచేయమని పేర్కొంటూ వారివద్ద నుంచి పోలీసులు సంతకాలు తీసుకున్నారు. చల్లపల్లిలో చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అడపా రాంబాబు, ఆది రాంబాబు, అడపా బాబూరావు, సోమిశెట్టి శివనాగేశ్వరరావు దీక్షచేశారు. ఈ దీక్షకు న్యాయవాది మోపిదేవి ద్వారకానాథ్‌తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికుమార్ దీక్షను భగ్నం చేసి, వారిని బలవంతంగా పోలీసు వాహనంలో స్టేషన్‌కి తీసుకెళ్లారు. నాగాయలంక, భావదేవరపల్లిలో కాపుల దీక్షలు భావదేవరపల్లి(నాగాయలంక) : కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతు పలుకుతూ ప్రభుత్వతీరుకు నిరసనగా భావదేవరపల్లిలో గ్రామస్తులు రెండవరోజు ఆదివారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పూషడపు నిరంజనరావు, ముమ్మారెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెదప్రోలులో.. పెదప్రోలు(మోపిదేవి) : కాపులు బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా పెదప్రోలు ప్రధాన సెంటరో కాపులు మహిళలతో కలసి దీక్ష చేపట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కంచాలు, గరిటెలతో నినాదాలు చేశారు. శ్రీకాకుళం(అవనిగడ్డ) : శ్రీకాకుళంలో ఆదివారం కాపునేతలు దీక్ష చేశారు. కాపు సంఘం రాష్ట్ర నేత సింహాద్రి శ్రీనివాసరావుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా నేత అందె జగదీష్ దీక్షకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు మురళి, సత్యనారాయణ, కాంగ్రెస్ నేత కృష్ణారావు దీక్షకు మద్దతు తెలిపారు. -
ఉధృతమవుతున్న ఉద్యమం
మచిలీపట్నం :కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు మద్దతుగా ఉద్యమంఊపందుకుంటోంది. మచిలీపట్నంలో కాపు సంఘాల నాయకులు శనివారం రాత్రి జిల్లా పరిషత్ సెంటరు నుంచి కోనేరుసెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చాలని, ప్రభుత్వ ద్వంద వైఖరి విడనాడాలని కోరుతూ నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన కాపు నాయకులు పంచపర్వాల కాశీవిశ్వనాధం, కొట్టే వెంకట్రావు, లోగిశెట్టి వెంకటస్వామి, బీజేపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి పంతం గజేంద్ర, వైఎస్ఆర్ సీపీకి చెందిన మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, గాజుల భగవాన్, చలమలశెట్టి సుబ్రమణ్యం పాల్గొన్నారు. నాయర్ బడ్డీ సెం టరులో మిరియాల కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఘంటా సురేష్, గాజుల సత్యనారాయణ కాపునాడు కార్యాల యంలో రిలే దీక్ష చేపట్టారు. బహిరంగ ప్రదేశంలో రిలే దీక్షలు చేపడితే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించటంతో శనివారం సాయంత్రానికి ఈ దీక్షలను విరమించారు. ఈ దీక్షలకు వైఎస్ఆర్సీపీ నాయకులు మాదివాడ రాము సంఘీభావం తెలిపారు. పెడనలో.. పెడనలోని కాపుల బజారులో కాపు యువజన సంఘం అధ్యక్షుడు కూనపరెడ్డి రంగయ్యనాయుడు ఆధ్వర్యంలో 70 మంది గరిటెలతో పళ్లాలను కొట్టి తమ నిరన తెలిపారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రిలే దీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు తీసివేయడంతో మండుటెండలో దీక్షలు చేపట్టారు. పులగం త్రిమూర్తులు, పులగం సుబ్రమణ్యం, కొప్పర్తి రంగారావు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బంటుమిల్లి ముంజులూరు, కంచం క్రాస్‌రోడ్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గరిటెలతో పళ్లాలపై కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కైకలూరులో... కైకలూరులో కాపునాడు సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పేటేటి భాస్కరరావు ఆధ్వర్యంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. కలిదిండిలో పేటేటి వివేకానంద, కోరుకొల్లులో రిటైర్డ్ డీఎస్పీ చెన్నంశెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు శిబిరాలను సందర్శించారు. -
కులాల మధ్య టీడీపీ చిచ్చు
కాకినాడ : బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్కమిటీ డిమాండ్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందంటూ సమావేశం మండిపడింది. కాపు రిజర్వేషన్ల వ్యవహారం కాపులు-ప్రభుత్వానికి మధ్య సమస్య అని, దీనిని బీసీలు, కాపుల మధ్య వివాదంగా సృష్టించవద్దని సమావేశం హితవు పలికింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శుక్రవారం కాకినాడ కళా వెంకట్రావు భవనంలో డీసీసీ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం బీసీలను రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్షకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు డాక్టర్ కె.సుధాకర్‌బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుది ద్వంద్వవైఖరి మధురపూడి : ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ ఎంపీల కన్వీనర్ వి.హనుమంతరావు విమర్శించారు. శుక్రవారం స్పైస్‌జెట్ విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం న్యాయమైనదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారం పొందాక మాట మార్చడం దుర్మార్గమని అన్నారు. -
రెండుకళ్ల సిద్ధాంతం చంద్రబాబు నైజం
బాబు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్లే ముద్రగడ దీక్ష బీసీ జాబితా నుంచి వెనుకబడిన కులాలను తొలగిస్తున్న కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చే విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విషయాన్ని రెండుకళ్ల సిద్ధాంతంతో చూడడం బాబుకు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సందర్భంగా కాపులను బీసీల్లో చేరుస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు నిధులు విడుదల చేస్తామని చంద్రబాబే స్వయంగా ప్రకటించారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా హామీ అమలు చేయలేదన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ రెండేళ్లలో రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. తమకు న్యాయం జరగదని గ్రహించిన కాపులంతా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంనాయకత్వంలోఉద్యమించారన్నారు. 1966 వరకూ తెలగకులస్తులంతా బీసీల్లోనే ఉండేవార ని, తర్వాత తొలగించారన్నారు. తొలగించిన వారిని మరలా బీసీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారన్నారు. వారి న్యాయమైన డిమాండ్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలుపుతోందన్నారు. మాల-మాదిగ రిజర్వేషన్ల ప్రక్రియలో, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన బాబు ఇప్పుడు కాపులు-బీసీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అదే విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వెనుకబడిన కులాలను బీసీ జాబితా నుంచి కేసీఆర్ తొలగిస్తున్నారని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగా కృష్ణయ్య అక్కడ పోరాటం చేయాలన్నారు. ఇక్కడి బీసీలకు అన్యాయం జరిగితే పోరాడేందుకు ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారన్నారు. ఇటీవల తునిలో నిర్వహించిన కాపు గర్జనకు అనూహ్య స్పందన రావడంతో పాలకపక్షంలోని టీడీపీ నాయకులు సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహించి ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు హింసాత్మక ఘటనగా మార్చారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు టొంపల సీతారాం, పార్టీ నేతలు సనపల నారాయణరావు, పసగడ రామకృష్ణ, పాలిశెట్టి మధుబాబు, తెలగ సంఘ నేతలు పాల్గొన్నారు. -
ముద్రగడకు సంఘీభావంగా దీక్షలు
తూర్పుగోదావరి: కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ముద్రగడకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు దీక్షలు చేపడుతున్నారు. ఆయన నివాసానికి పోలీసులు ప్రజలను అనుమతించడం లేదు. ముద్రగడ దంపతులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంచాలు, చెంచాలతో శబ్ధం చేస్తూ కాపులు ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం, బోడపాటివారిపాలెంలో భారీగా కాపు మహిళలు దీక్షలు చేపడుతున్నారు. కంచాలు, గంటెలతో శబ్ధం చేస్తూ.. తమ మద్దతు తెలుపుతున్నారు. మేడపాడులో కాపు మహిళలు ముద్రగడ దీక్షకు సంఘీభావంగా ఒక్క పూట భోజనం మానేసి కంచాలు, గరిటలతో రోడ్డుపై బైఠాయించారు. కోనసీమలోని అన్ని మండల కేంద్రాలలో సంఘీభావ దీక్షలతో కాపులు కదంతొక్కారు. రాజమహేంద్రవరం లోని కోటగుమ్మం సెంటర్లో శుక్రవారం మధ్యాహ్నం కంచాలు గంటెలతో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు.