
ఎన్ని ఇబ్బందులు పెట్టినా మడమతిప్పం: ముద్రగడ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా, అణచివేతకు గురిచేసినా ఉద్యమం నుంచి మడమ తిప్పబోమని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను గత 25 రోజులుగా పోలీసులు నిత్యం ఇంటిగేటు వద్దే అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. శనివారం ముద్రగడ, కాపునేతలు యథావిధిగా గేటు వద్ద కుర్చీలపై బైఠాయించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలిపారు.