గోడ దూకి పాదయాత్ర చేస్తా
కాపుల ఆకలి ఆఖరి పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ
కిర్లంపూడి: కాపుల ఆకలి ఆఖరి పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శుక్రవారం పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడ పద్మనాభంను ఇంటి గేటు వద్ద పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తనను ఇలా హింసిస్తున్నందుకు నిరసనగా ఏదో ఓ రోజు గోడ దూకి, ఎక్కడో ఓ చోట నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు.
అనంతరం గేటు వద్ద జేఏసీ నాయకులు, కాపు నాయకులతో కలిసి కుర్చీలో బైఠాయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.