
‘బాబు’ బెదిరేలా ఉద్యమిద్దాం
రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న నిరంకుశ పాలన దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు.
నిత్యం చేస్తున్నట్టే ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంటి గేటు వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడారు.