mudragada padmanabham
-
ముద్రగడ ఇంటిపై దాడి హేయమైన చర్య : జగ్గిరెడ్డి
-
ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన కార్యకర్త చేసిన దాడికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, దూలం నాగేశ్వరరావు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు బుధవారం కాకినాడ జిల్లా, కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు.ఆయనకు, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్రగడ గిరి బాబుకు సంఘీభావం తెలిపారు. వారు విలేకర్లతో మాట్లాడుతూ, ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమాన్ని నడిపి, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడపై జరిగింది చిన్న దాడి అని అనుకోవడం లేదన్నారు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డారని, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి గంజాయి తాగాడా.. మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనేది తర్వాత విషయమన్నారు. తాను జనసేన మనిషేనని, ఆ పార్టీ జెండా మోశానని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి ముద్రగడ ఇంటి పైకి వచ్చి రచ్చ చేయడమే కాకుండా.. మళ్లీ ఉదయం వచ్చి ఇదంతా తానే చేశానని చెప్పడాన్ని చూస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. నిందితుడి ఫోన్ డేటా ఇప్పటి వరకూ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు. దాడులపై విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
ముద్రగడ ఇంటిపై దాడి.. పరామర్శించిన YSRCP నేతలు
-
నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?
సాక్షి,గుంటూరు : ‘వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ‘నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలి’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.ముద్రగడ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు. ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్లో ఢీకొట్టి.. పోర్టికోలో ఉన్న కారును ఢీకొట్టారు. ముద్రగడ, ఆయన కుమారుడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు.‘‘ఆ వ్యక్తి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదు. తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు. నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం’ అని అంబటి అన్నారు. -
సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి: ముద్రగడ
-
చంద్రబాబు గుర్తుంచుకో.. ముద్రగడ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం శాశ్వతం కాదని తెలుసుకోండి అంటూ చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం కౌంటర్ వచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్‌రెడ్డి పై దాడి, వినుకొండలో రషీద్ హత్య అత్యంత హేయం అన్నారు.హత్యలు, దాడులను వెంటనే ఆపండి.. అధికారం శాశ్వతం కాదు.. అధికారంలో మీరే ఉండరని గుర్తించుకోండి. పౌర్ణమి తరువాత అమావాస్య వస్తుంది’’ అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. -
రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం.. కాపు రిజర్వేసన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కలిశారు.అనంతరం అంబటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్‌ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్ జగన్ మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
మాట ప్రకారం పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం
-
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి
అమరావతి/కాకినాడ, సాక్షి: అన్న మాట ప్రకారం పేరు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్ విడుదలైంది. -
పవన్ కళ్యాణ్ గెలుపుపై ముద్రగడ రియాక్షన్
-
సవాల్‌కు కట్టుబడి ఉన్నా: ముద్రగడ
కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విసిరిన సవాల్‌పై తాను ఓడిపోయానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ సవాల్ ప్రకారం నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా. దీని కోసం గెజిట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నాను. నన్ను ఉప్మా పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారు. వైఎస్ జగన్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలు ఎందుకు దీనిని స్వీకరించలేదు అనేది నా ప్రశ్న. ప్రజల కోసం కష్టపడిన జగన్‌ను గౌరవించకపోవడం చాలా బాధాకరం. నా రాజకీయ నడక వైఎస్ జగన్ వెనుకే ’’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ గెలిస్తే.. తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. -
ముద్రగడ కూతురు వీడియోపై సంచలన నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రామానుజం
-
ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారు. ఇప్పుడు ఆ సైకిల్‌కి తుప్పు పట్టడంతో మోటర్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమాశీస్సులు ఉంచమని కోరుతున్నాను.సీఎం జగన్‌కు ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారు. గతంలో వారి రాక్షస పాలన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాను ఒక్కసారి అందరూ చూడండి. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. పేదల సంక్షేమం చూసే ముఖ్యమంత్రి జగన్‌ను గౌరవించాలని కోరుతున్నాను’అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
-
జగన్‌ది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి చూపించి.. ప్రజల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పేదవాడి చేతి ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలని కోరుకుని ఆ దిశగా తన ఐదేళ్ల పాలన కొనసాగించిన నేత జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అలా మంచి చేసే ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారాడు చంద్రబాబు అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయి నుంచి చివరకు కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి దిగజారిపోయారని ముద్రగడ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నీచ రాజకీయాలపై చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న సినీ నటుడు పవన్‌కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. తుని ఘటన తరువాత చంద్రబాబు తనను వేధించిన తీరు, అవమానాలు మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు. మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సభకు మాజీ జెడ్పీటీసీ, కాపు నేత చాగంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నరసాపురం వైఎస్సార్సీపీ అ«భ్యరి్థ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
-
నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీకే దిక్కు లేదు. అటువంటి నువ్వు నా కుమార్తెకు సీటు ఇస్తావా? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు తానెప్పుడూ ప్రస్తావించకపోయినా.. తన కుమార్తెను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని అన్నారు. భీమవరం, గాజువాకల్లో తరిమేస్తే పిఠాపురం వచ్చి పడ్డారని, ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పవన్‌పై ధ్వజమెత్తారు. ఇటీవల ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తాజాగా తుని సభలో పవన్‌ను క్రాంతి కలిసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. తన కుమార్తెను తుని వేదికపై పరిచయం చేసినప్పుడు తన పేరు ఎందుకు ప్రస్తావించారని, ఆమె మామ పేరు ఎందుకు చెప్పలేదని ప్రశి్నంచారు. ఇది ఎదుటివారిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసినదే అని అన్నారు.తుని సభలో తన కుమార్తెను తన ఇంటి పేరుతో పరిచయం చేసి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఆడపిల్లకు వివాహమైన తరువాత తండ్రి ఇంటి పేరు ఉండదనే విషయం తెలియదా అని ప్రశి్నంచారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేందుకు కుట్ర పన్నారని పవన్‌పై మండిపడ్డారు. ఇదంతా మీ గురువు ఆదేశాలతో పెట్టిన చిచ్చు కాదా? అని నిలదీశారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి, మళ్లీ సానుభూతిగా మాట్లాడటం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు. రాజకీయాల్లో నటించడం మానేసి సినిమాల్లో మాత్రమే నటించాలని పవన్‌కు హితవు పలికారు. పైకి అతిగా గౌరవిస్తున్నట్టు నటిస్తూ, లోపల కుళ్లు, కుతంత్రాలతో తమ కుటుంబాన్ని విడదీయాలని పవన్ చూస్తున్నాడన్నారు. తన కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు, ప్రచారానికి, అలాగే టీవీ డిబేట్లకు, స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు తీసుకువెళ్లి ప్రచారానికి ఉపయోగించుకోండని సలహా ఇచ్చారు.వారాహి సభలో నన్నెందుకు దూషించారుపవన్ను కానీ, ఆయన అన్నయ్యను కానీ ఏ రోజూ ఒక్క మాట అనని తనను కాకినాడ వారాహి సభలో ఎందుకు దూషించారో చెప్పాలని ముద్రగడ నిలదీశారు. పవన్ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలను తానెప్పుడూ ప్రస్తావించలేదన్నారు. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో పవన్ చెప్పాలన్నారు. ఆయన కుటుంబం నుంచి వచ్చి పబ్‌లో మద్యం సేవించి పట్టుబడిన అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విషయాలు కూడా చెప్పాలన్నారు.పవన్ పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి, మూడో భార్యను సభలో పరిచయం చేసి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. నా కుమార్తెకు జనసేనలో టికెట్ ఇస్తామంటున్నారు.. అప్పటి ఎన్నికల వరకూ అసలు మీ పార్టీ ఉంటుందా? అని ముద్రగడ ప్రశి్నంచారు. అబద్ధాలు చెప్పడానికి పవన్ సిగ్గు పడడం లేదన్నారు. తనకు, తన భార్యకు అనారోగ్య పరిస్థితి వచి్చనా తన కుమార్తెను తన ఇంటికి పంపవద్దని పెద్దలకు మనవి చేస్తున్నానని అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. -
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
-
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీరియస్ అయ్యారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
-
కుటుంబంలో చిచ్చుపెట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల కోసం కుటుంబంలో చిచ్చుపెట్టి తనను బెదిరిస్తే బెదిరేది లేదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ఆయన శుక్రవారం పిఠాపురంలో మీడియా సమావేశంలో స్పందించారు. వివాహమైన రోజు నుంచే తన కుమార్తె మెట్టినింటి మనిషయ్యిందన్నారు. పెళ్లిగాక ముందు వరకే తమ మనిషి అని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమెకు ప్రపంచమని పేర్కొన్నారు. తన కుమారులు మాత్రమే తన మనుషులన్నారు. తన కుమార్తె మామ, జనసేన నాయకులు ఆమెతో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఎవరు బెదిరించినా బెదిరేది లేదని చెప్పారు. ఇలా తిట్లు తిట్టించడం వల్ల తనకు బాధ లేదని, అయితే రాజకీయం రాజకీయమే అని తెలిపారు.కుటుంబంలో చిచ్చుపెట్టిన వారికి ఆ భగవంతుడే సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తాడని చెప్పారు. తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు కూడా తన కుమార్తె మామ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తుచేశారు. నాటినుంచి నేటివరకు వారు తనకు ఏ విషయంలోను, ఏ రోజూ సహక రించలేదని తెలిపారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదుతాను 40 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు, కుట్రలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఇటువంటివన్నీ అలవాటయ్యాయన్నారు. తన తండ్రి ఎప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉండాలని ఇచ్చిన పిలుపుతో ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అందుకే తాను ఈ రోజుకీ ఎవ్వరికీ భయపడకుండా, ఎవరి చేతి కిందా బతకకుండా ఉంటున్నానన్నారు. తాను ఎప్పుడూ ఎవరి దగ్గరకు వెళ్లి పదవులు కావాలని, ఉన్నతస్థానాలు, హోదాలు కల్పించాలని అడగలేదని చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించాలని తాను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచీ తనవంతు కష్టపడుతూనే ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇటువంటి కుట్రలు పన్నడం రాజకీయాల్లో సహజమేనన్నారు.ఇటువంటి పథకాలు ఇచ్చే నాయకుడు భవిష్యత్‌లో పుట్టడు తాను ఒకసారి వైఎస్సార్సీపీలో చేరాక, ఇక పక్కచూపులు చూసేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడుగా ఉండటానికే తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చానన్నారు. ఎవరెన్ని అనుకున్నా జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పునరుద్ఘాటించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఊపిరి పోస్తున్నాయన్నారు.వైఎస్ తనయుడు జగన్ పేదల పెన్నిధిగా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడేదన్నారు. పేదల కోసం ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు భవిష్యత్తులో పుట్టడన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం నిత్యం పరితపించే జగన్‌కు తోడుగా అన్ని వర్గాలు నిలవాలని కోరారు. కూటమి ప్రజాసేవ కోసం వస్తున్నది కాదని, కేవలం అధికార దాహం తీర్చుకునేందుకు మాత్రమే వస్తోందని చెప్పారు. షూటింగ్‌ల కోసమే పవన్‌కు ఎమ్మెల్యే పదవి కావాలని ఎద్దేవా చేశారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడుపోయే కులమని పవన్‌కళ్యాణ్ అన్న మాటలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. -
పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు.కాగా, ముద్రగడ పద్మనాభం శుక్రవారం పిఠాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. యువత రాబోయే భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. ఓటర్లు చంద్రబాబు మేనిఫెస్టోను ఒక్కసారి గమనించాలి. చంద్రబాబుకు అధికారం అనే ఆకలిని తీర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. అందుకే ఇలాంటి మేనిఫెస్టోను తెచ్చారు.కానీ, ఓటర్లు చాలా తెలివైన వారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఇక, పవన్ హైదరాబాద్‌కే పరిమితమయ్యే వ్యక్తి. అలాంటి పవన్ సీఎం కావాలని అనుకుంటున్నాడు. పదవి కోసమే మాత్రమే పవన్ పిఠాపురం వస్తున్నాడు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడు.ఇక, ఇదే సమయంలో తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై కూడా ముద్రగడ స్పందించారు. ఈ సందర్బంగా ముద్రగడ.. కొందరు వ్యక్తులు నా కూతురితో నన్ను తిట్టించారు. ఇది చాలా బాధాకరం. నా కూతురుకు పెళ్లి అయిపోయింది.. ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే. నేను ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరాను. ఇక, పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నాకు పదవులేమీ వద్దు. నేను కేవలం సేవకుడిని మాత్రమే’అని కామెంట్స్ చేశారు. -
పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్
-
పవన్‌ను ఓడించి, తరిమేయడం ఖాయం: ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి, తన్ని తరిమేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖానికి రంగులు వేసుకొని వచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పవన్, చంద్రబాబు తీరును ఎండగట్టారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఉప్మా, కాఫీలు పెడుతున్నారని విమర్శించడం పవన్‌కు తగదని, ఇంటికి వచ్చినవారికి మర్యాద చేయటం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్‌కళ్యాణ్ ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?విషయాలపై అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీలేక పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని ఘటన 2016లో జరిగిందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు పవన్ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీలోనే ఉన్నారని, ఆ ఘటనకు చంద్రబాబే కారణమనే విషయం తెలుసుకోవాలని సూచించారు. తాను చేతగానివాడిననుకున్నప్పుడు కాపుల కోసం పవన్ ఏంచేశారు, ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని ప్రశ్నించారు. అసలు పవన్ కల్యాణ్ అడ్రస్ ఏమిటి? ఎక్కడ పుట్టాడని అడిగారు. త్వరలో ప్యాకప్తెలంగాణ ఎన్నికల్లో పవన్ నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో నటించండి.. ఇలా రాజకీయాల్లో నటించడం కుదరదని స్పష్టం చేశారు. త్వరలో పవన్ పార్టీ ప్యాకప్ అవుతుందన్నారు. 1978లో చంద్రబాబు, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లామన్నారు. 1978లో చంద్రబాబుకు శిథిలమైన పెంకుటింటికి మరమ్మతులు చేయించడానికి కూడా డబ్బులు లేని విషయం మర్చిపోయారా.. అని నిలదీశారు. 2019లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశానని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారని, 2014లో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ముద్రగడ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
కాకినాడ: అధికారం అనే ఆకలితో చంద్రబాబు నాయుడు అలమటిస్తున్నాడని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసి... తన కుటుంబాన్ని వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ జత కడతారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెంకుటింటికి మరమత్తులు చేయించుకోలేదా? ఎమ్మెల్యే అయ్యేంత వరకూ పెంకుటింట్లో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉన్న పళంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు. చంద్రబాబు ఎలా అపర కోటీశ్వరుడు అయ్యారో ప్రజలకు చెప్పమని కోరుతున్నాను. అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నాడు.వయస్సు పెద్దదైంది... ఆబద్దాలు ఆపేయండి. జగన్‌కు ఓటేయద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. పేదల పెన్నిధి జగన్. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. కుమిలి కుమిలి చనిపోయేలా చేశారు. రాష్ట్రంలో మీరు స్వేచ్చగా తీరుగుతున్నారు. మీరు, మీ సతీమణీ,.కుమారుడుకోడలు..వియ్యంకుడు,దత్తపుత్రుడుస్వేచ్చగాతిరుగుతున్నారు.ఇంకేమి స్వేచ్చ కావాలో తమ సతిమణీని అడగండి.కాపు ఉద్యమాన్ని అణిచివేసి.. .నా కుటుంబాన్ని వేధించిన చంద్రబాబుతో పవన్ జతకడతారా? నన్ను ప్రేమించే జగన్‌తో నేను జతకట్టకూడదా?, పవన్ సినిమా డైలాగ్‌లు చదువుతున్నారు. సినిమాల్లోను..రాజకీయాల్లోను పవన్ నటించేస్తున్నారు. యువతను పాడు చేయకండి..వారి జీవితాలను నాశనం చేయకండి.యువత జీవితాల్లో చీకటి నింపకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని యువతను కోరుతున్నాను.సినిమా హీరోలతో తిరిగి మీ బంగారు భవిష్యతు పాడుచేసుకోకండి.మీ కుటుంబాలు నాశనం అవకుండా యువత మేలుకోండి. -
నన్ను తీహార్ జైలుకి పంపాలని కుట్ర చేశారు.. చంద్రబాబు, పవన్‌పై ముద్రగడ ఫైర్
-
బాబుది రాక్షస రాజ్యం
-
సీఎం జగన్ దాడిపై ముద్రగడ స్ట్రాంగ్ రియాక్షన్..
-
రాజకీయాల్లో నటించకు పవన్..
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్‌కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్‌ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు.. 2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్‌కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్‌లు పెట్టడం మగతనం అనిపించుకోదు. 21 సీట్లకు పరిమితం కావడం దారుణం.. తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది. మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ? అసలు పేదల కోసం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది. వైఎస్సార్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్‌కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు. -
ధైర్యం ఉంటే నన్ను విమర్శించు పవన్
కిర్లంపూడి: గతంలో పవన్ కళ్యాణ్‌కు ఎవరికీ జరగని రీతిలో హైదరాబాద్‌లో ఘోరాతిఘోరంగా అవమానం జరిగిందని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్లి పవన్ టిఫిన్ చేసి వచ్చాడన్నారు. సీఎంను తిట్టడానికి బహిరంగ సభల్లో ఊగిపోతున్న ఆయనకు ఈ కోపం, పౌరుషం, పట్టుదల, ఆవేశం అప్పుడు ఎక్కడికి పోయాయన్నారు. పవన్‌కు జరిగిన అవమానం సామాన్యుడికి జరిగినా వారు నిలదీస్తారని.. కానీ ఈ పెద్దమనిషి ఒక్క మాటకూడా అనలేదని గుర్తు చేశారు. చిన్న సినిమా ఆర్టిస్టులతో తనను పవన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం ఉంటే నేరుగా తనను విమర్శించాలని సవాల్ విసిరారు. మీడియా ముందుకొచ్చి తనను కొన్ని ప్రశ్నలు అడిగితే తాను కూడా పవన్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అగ్నికుల క్షత్రియులు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలివచ్చి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయ న మాట్లాడుతూ పవన్ సినిమాలు తీసుకోవడానికి పిఠాపురంలో ఎమ్మెల్యే పదవి కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ తనతోపాటు నారా లోకేశ్‌ను, నందమూరి బాలకృష్ణను కూడా తీసుకొచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయించగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తామని, వైఎస్సార్సీపీ ఓటరుకి లక్ష రూపాయలు ఇస్తుందని మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని ముద్రగడ మండిపడ్డారు. అప్పుడప్పుడూ రాజకీయాలు చేసేవారిని పక్కనపెట్టాలి అప్పుడప్పుడూ వచ్చి రాజకీయాలు చేసే నాయకులను పక్కన పెట్టి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం అభ్యర్థి వంగా గీతను గెలిపించి జగన్‌ను మరోసారి సీఎం చేయాలని ముద్రగడ అభ్యర్థించారు. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు.. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి త్వరలో పిఠాపురంలో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్న వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ముద్రగడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం చూడలేక, అధికారం దక్కదనే ఉక్రోశంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం సభ్యత అనిపించుకోదన్నారు. జగన్‌ను తిట్టడం, అధికార దాహంతో నోటికొచ్చిన అబద్ధాలు ఆడడం చంద్రబాబు స్థాయికి తగదన్నారు. -
పవన్ కల్యాణ్ మగాడే అయితే.. ముద్రగడ సవాల్
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ మగాడే అయితే నేరుగా తన మీద మాట్లాడాలంటూ ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దమ్ముంటే.. మగాడే అయితే నేరుగా నా మీద మాట్లాడాలి. పవన్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంత వరకు సబబు?. హైదరబాద్‌లో అవమానం జరిగినప్పుడు, ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్‌కు ఏమయ్యాయి. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? అంటూ ముద్రగడ పవన్‌ను నిలదీశారు. -
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు నేతల ఆత్మీయ సమావేశం
-
చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ జనరల్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్‌గా పవన్ కల్యాణ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావ్. పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్‌లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్‌ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. -
షూటింగ్‌లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?
కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్‌లు మానేసి, హైదరాబాద్‌లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు. -
మీది పిరికితనం, చేతగానితనం
రాజమహేంద్రవరం రూరల్: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడానికి వచ్చేస్తోందంటున్నారని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్‌కళ్యాణ్‌కు కార్యకర్తలు వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదని, వారిని అడ్డుకునేలా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పారు. ప్రజలు ముట్టుకోకూడదని, షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదనే.. బ్లేడ్‌బ్యాచ్ వచ్చేస్తోందంటూ పవన్ నెపం వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కదా.. తమపై బ్లేడ్‌బ్యాచ్ దాడులు చేయలేదే అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు అసహ్యంగా ఉన్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అసహ్యంగా ఉందని ముద్రగడ పద్మనాభం చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు, ఆయన స్నేహితులు.. గతంలో ఆయన పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. సీఎం జగన్‌కు ఒక చాన్స్ ఇచ్చానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఒక్కచాన్స్ ఇచ్చారని, ప్రజాసంక్షేమ పథకాలతో మంచిపాలన చేస్తునఆయన్ని మరోసారి సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కె.రావు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే ఏపీలోని పేదలకు న్యాయం జరిగింది
-
పిఠాపురంలో పవన్ గెలవడు: ముద్రగడ
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్ వల్లే పవన్ రాజకీయ ఉనికి ఇంకా కొనసాగగలుగుతోందని ముద్రగడ కుండబద్ధలు కొట్టారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడ పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌కు సినీ గ్లామర్ మాత్రమే ఉంది. అందుకే యువకులు ఆయన వెంటపడుతున్నారు. కానీ, ఏరకంగా చూసుకున్నా పవన్ కంటే ఆయన అన్న చిరంజీవి ఎంతో బెటర్. రాజకీయాలు పక్కనపెట్టి పవన్ చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు. అసలు పిఠాపురంలో ఎట్టిపరిస్థితుల్లో పవన్ గెలిచే ప్రసక్తే లేదు అని ముద్రగడ చెబుతున్నారు. ఇక తనపై పోలీసుల దాడి అప్పట్లో నారా లోకేష్ ఆదేశాల మేరకే జరిగిందని ముద్రగడ సంచలన ఆరోపణ చేశారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ పాలనపై ముద్రగడ ప్రశంసలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. వైఎస్ జగన్ మాదిరిగా ఏ సీఎం ఇంత స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించలేదు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) కంటే ఎక్కువ కాలం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేయాలి అని ముద్రగడ ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. -
ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారనడం బాధాకరం
కిర్లంపూడి: ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతారనేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించడం బాధాకరంగా ఉందని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి తరలివచ్చి ఆయనను, యువ నాయకుడు ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ముద్రగడను కలిశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గంలోని ఒక్కో ఓటరుకు సీఎం జగన్ లక్ష ఇస్తున్నారంటూ ప్రజలను అవమానించేలా మాట్లాడడం పవన్‌కు తగదన్నారు. పవన్‌కు డబ్బు తీసుకునే జబ్బు ఉందని, ఆ జబ్బు అందరికీ ఉంటుందనుకోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గ ఓటర్లు డబ్బు తీసుకునేవారా? అమ్ముడుపోయేవారమా? అని ముద్రగడ ప్రశ్నించారు. పిఠాపురం ప్రజలంతా డబ్బుకు అమ్ముడుపోతారనుకోవడం సరికాదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి.. ఇక రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. ఆరునెలలకోసారి వచ్చి రాజకీయాలుచేసే పవన్ కన్నా నిత్యం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయానికి శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలని సునీల్, గీతకు సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలంతా ఆర్థికంగా బలపడేలా కృషిచేయాలని ముద్రగడ చెప్పారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కొద్దిమంది కాపులవల్లే గతంలో తాను అధికారంలోకి వచ్చానన్నారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలను ఎప్పుడూ మరచిపోనన్నారు. -
పేదలకు అన్నం పెట్టే దేవుడు సీఎం జగన్ పై ముద్రగడ అదిరిపోయే స్పీచ్
-
పిఠాపురంలో జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి శేషకుమారి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. సీఎం జగన్‌తో అసలు పవన్‌ను ఎవరూ పోల్చుకోరు. సీఎం జగన్ స్థాయి వేరు. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం. ఆచరణలో ఏమీ చేయరు’ అని తెలిపారు. నన్ను జనసేనలోకి రమ్మనటం పవన్ అవివేకం డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం. కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది. నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ. నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. పవన్‌ను కూడా నేను మా వైఎస్సార్సీపీలోకి రమ్మంటే బావుంటుందా?. సీఎం జగన్ మీద జనానికి నమ్మకం ఉంది. ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు. పవన్‌కు అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు. జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు’ అని వంగా గీత అన్నారు. -
పవన్ కు ఇచ్చి పడేసిన ముద్రగడ
-
నువ్వు సినిమాలో హీరో.. నేను రాజకీయాల్లో హీరో: ముద్రగడ
-
నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకు మొలతాడు కూడా లేదు పిల్ల బచ్చ పవన్..
-
జగన్ ను మళ్లీ సీఎంను చేయాలనే YSRCPలో చేరా
-
నేను రాజకీయాల్లో హీరోను.. పవన్‌పై ముద్రగడ ఫైర్
సాక్షి, కాకినాడ: రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘనమైన కుటుంబ చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరా. కానీ, ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బేషరతుగానే వైఎస్సార్సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే.. బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను.. .. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి ఆయన ఎవరు?. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు?. మీరు సినిమాల్లో హీరో కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. .. ‘‘సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదు? అని కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. మీరేంటీ పొడుగు?.. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు. నేను రాజకీయాల్లో గొప్ప. ఆ మాటకొస్తే రాజకీయాల్లోను.. సినిమా ఫీల్డ్ లో నేను ముందున్నాను. మీరా నాకు పాఠాలు నేర్పేది?’’.. అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు. .. ‘వైఎస్సార్సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం’ అంటూ ముద్రగడ ప్రకటించారు. -
YSRCPలోకి ముద్రగడ..పవన్, బాబు గుండెల్లో వణుకు
-
ముద్రగడకు సీఎం జగన్ ఆప్యాయ ఆలింగనం.. వైఎస్సార్సీపీలోకి ఆహ్వానం (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
-
వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
గుంటూరు, సాక్షి: సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఏపీలో తీవ్రంగా నడిచింది. అయితే.. సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని భావించిన ముద్రగడ చివరకు వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు. ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి… pic.twitter.com/8HrShBHGR0 — YSR Congress Party (@YSRCParty) March 15, 2024 1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు. కాపు ఉద్యమ నేతగా ఆయన పోరాటం తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. శ్రీనివాసులు 2011, 2017లో ఈస్ట్ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు మురళీధర్, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి 2011, 2017లో ఈస్ట్ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీనివాసులు రెడ్డి ఈ… pic.twitter.com/kGu3Iu3ZYO — YSR Congress Party (@YSRCParty) March 15, 2024 -
సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ
-
రేపు వైఎస్సార్సీపీలోకి ముద్రగడ
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కుమారుడి గిరితో కలిసి ముద్రగడ వైఎస్సార్సీపీలో చేరనున్నారు. -
టీడీపీ హయంలో ముద్రగడకు జరిగిన అవమానాలు..
-
‘‘జగన్‌ను మళ్లీ సీఎంను చేయాలనే...’’
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తేదీన వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ..‘ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్‌తో చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను. ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకొని తాడేపల్లికి రావాలని కోరారు. ఈ క్రమంలో ముద్రగడ లేఖను విడుదల చేశారు. -
14న వైఎస్సార్సీపీలో చేరుతున్నా
కిర్లంపూడి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు ఈ నెల 14న వైఎస్సార్సీపీలో చేరుతున్నానని కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ ఎంపీ పి.మిథున్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు ఇటీవల తన నివాసానికి వచ్చి పార్టీలోకి అహ్వానించారని చెప్పారు. సీఎం జగన్ పిలుపు మేరకు పార్టీలో చేరి తన మద్దతు అందించాలని నిర్ణయించానన్నారు. తనకు కానీ, తన కుమారుడు గిరిబాబుకు కానీ ఎటువంటి పదవులూ ఆశించకుండానే వైఎస్సార్సీపీలో చేరుతున్నామని, పార్టీ విజయం సాధించిన తరువాత వారు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నానని ముద్రగడ చెప్పారు. ఈ నెల 14న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య కిర్లంపూడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరతానని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ముద్రగడ చెప్పారు. ఆయన వెంట ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి ఉన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరబోతున్నా ముద్రగడ పద్మనాభం
-
వైఎస్సార్సీపీలో చేరబోతున్నా: ముద్రగడ
సాక్షి, కాకినాడ జిల్లా: ఈ నెల 14న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువాను ముద్రగడ కుటుంబం కప్పుకోనుంది. ఇటీవల కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి వైఎస్సార్సీపీలోకి చేరుతున్నట్లు ముద్రగడ తెలిపారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. సీఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ వెల్లడించారు. ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం! -
ముద్రగడను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానం
-
సీఎం జగన్ ఆదేశాలు..ముద్రగడను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
-
ముద్రగడను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు.. పార్టీలోకి ఆహ్వానం
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు. ఇక, వీరి భేటీ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలిశాం. ఈ సందర్బంగా ముద్రగడను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించాం. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ. ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదు. స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారు. సీఎం జగన్‌కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసు. ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారు’ అని కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్ బందీ అయిపోయారు. బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పెన్నులో ఇంకు అయిపోయిన పవన్ లో మార్పు రాలేదు
-
పవన్ కు ముద్రగడ లేఖ పై కొమ్మినేని విశ్లేషణ
-
పవన్ కు సూచనలిస్తూ లేఖలు రాసిన హరిరామ జోగయ్య
-
పవన్ కల్యాణ్ కు ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ
-
పవన్‌కు ముద్రగడ ఘాటు లేఖ..
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, పవన్‌కు తాజాగా ముద్రగడ లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ్ర..‘రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది. మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
అసలు ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేతగా చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా ఆయన్ను అవమానించారు. పవన్‌ను వెనకనుంచి ఆడిస్తున్నది చంద్రబాబే అన్నది ముద్రగడ అనుచరుల అనుమానం. అసలింతకీ ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది? కాపు ఉద్యమ నేతగా.. తన సామాజిక వర్గం హక్కుల కోసం గత టీడీపీ పాలనలో అలుపెరుగని పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలతో పాటుగా.. కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉన్నారు. కాని కిర్లంపూడిలోని తన నివాసంలో ప్రజల్ని, అభిమానులను కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది న్యూయర్ వేడుకలను తన అనుచరులతో కలిసి కిర్లంపూడిలో జరుపుకున్నారు. దీంతో ముద్రగడ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ముద్రగడతో పాటు ఆయన రెండవ కుమారుడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన అనుచరులు భావించారు. దీంతో ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి మైలేజ్ వస్తుందని భావించిన జనసేన నేతలు కిర్లంపూడికి క్యూలు కట్టారు. గత నెలలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటుగా కొందరు స్ధానిక నాయకులు రెండు పర్యాయాలు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్ళారు. జనసేనలో చేరాలంటూ ముద్రగడను కోరారు. అంతేకాదు..తమ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే కిర్లంపూడి వచ్చి మిమ్మల్ని కలుస్తారని ముద్రగడకు తెలియచేశారు. దీంతో పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని ముద్రగడ కూడా జనసేన నాయకులకు చెప్పారు. ఈ పరిణామాలతో ముద్రగడ జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. ముద్రగడ చేరికతో జనసేన బలపడుతుందన్న చర్చ కూడా నడిచింది. ఐతే రోజులు గడుస్తున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడ నివాసానికి వెళ్ళలేదు. ఈ ప్రతిష్టంభనకు తెర తీసారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రిందట రాజమండ్రి వెళ్ళిన పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాలపై సమీక్షలు చేశారు. తర్వాత రాజమండ్రి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళిపోయారు. రాజమండ్రి నుండి పవన్ కళ్యాణ్ కిర్లంపూడికి వస్తారని ముద్రగడ, ఆయన అనుచరులు ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యేందుకు ఆసక్తి చూపలేదు. జననేత నేతలు చెప్పినదాన్ని బట్టి పవన్ వస్తారని ముద్రగడ భావించారని..కాని పవన్ కళ్యాణ్ ముద్రగడను అవమానించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పవన్ రాజమండ్రి వచ్చి వెళ్లిపోయిన విషయం తెలిసిన ముద్రగడ ఆయనపై ఆసక్తికరమైన వాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన జనసేన నేతలకు చెప్పాల్సింది చెప్పామని..ఇక మనం చేసేది ఏమీలేదని కామెంట్ చేశారట ముద్రగడ. పవన్ తన ఇంటికి వస్తే ఒక నమస్కారం.. రాకపోతే రెండు నమస్కారాలు అంటూ సెటైర్లు వేశారట ముద్రగడ. ఇటీవల అనకాపల్లి పర్యటనలో పవన్ కళ్యాణ్.. కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లిన విషయం.. పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ నివాసానికి వెళ్ళిన విషయం ముద్రగడకు తెలిసింది. ఈ పరిణామాలు ముద్రగడ శిబిరంలో మరింత కాకరేపాయి. పవన్ ఉద్దేశపూర్వకంగానే ముద్రగడను అవమానిస్తున్నారన్న భావన వారిలో కలిగింది. ఎందుకంటే.. ఆమధ్య వారాహి పేరుతో తయారుచేయించుకున్న లారీ మీద యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ముద్రగడపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో ముద్రగడ కూడా అంతే ధీటుగా స్పందించి పవన్ కు లేఖ రాశారు. ముద్రగడ లేఖను జీర్ణించుకోలేని జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ముద్రగడను అవమానించారు. ఐనప్పటికీ గత నెలలో జనసేన నేతలు ముద్రగడ నివాసానికి వెళ్ళినప్పుడు ముద్రగడ వారిని సాదరంగా ఆహ్వనించారు. ఇక ముద్రగడను జనసేనలో చేరకుండా అడ్డుపుల్ల వేసింది చంద్రబాబే అని ముద్రగడ అనుచరులు అనమానిస్తున్నారు. ఇదీ చదవండి: బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పిన ‘దత్తపుత్రుడు’ -
పవన్ తీరుపై కాపుల్లో కాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తీరుపై కాపు సామాజికవర్గం రగిలిపోతోంది. ముఖ్యంగా.. కోస్తా జిల్లాల్లో ఆ సామాజికవర్గంలో బలమైన ముద్ర కలిగిన కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో పవన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. నిజానికి.. వివిధ కారణాలతో ముద్రగడ కాపు ఉద్యమాన్ని విడిచిపెట్టి చాలాకాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాలపై ఆసక్తి కూడా లేనట్లుగా ఉంటున్నారు. ఈ తరుణంలో పవన్ ఆదేశాలతో ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్యబాబు తదితరులు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. కానీ, వీరి ప్రతిపాదనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. ఇలా ముద్రగడను జనసేన నేతలు రెండు మూడు దఫాలు కలిశారు. ఆ సందర్భంలో ఫిబ్రవరి 15 తరువాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ, రాజమహేంద్రవరం వచ్చినప్పుడు పవన్ నేరుగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు మాట్లాడి వెళ్లాక కోనసీమ ప్రాంతం నుంచి జనసేన నేతలు వరుసగా ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తున్నారు. కావాలనే ముద్రగడకు దూరంగా పవన్!? ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి పవన్‌కళ్యాణ్ విశాఖలో పర్యటించి కొణతాల రామకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అక్కడి నుంచి సోమవారం సాయంత్రానికి రాజమహేంద్రవరం వచ్చిన పవన్ ఆ రోజు రాత్రి అక్కడే బసచేశారు. అక్కడ నుంచి మంగళగిరికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. అనంతరం బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లారు. అక్కడ టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి వంటి నేతలను వారి ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశారు. అంతమంది ఇళ్లకు వెళ్లిన పవన్.. అటు విశాఖ, ఇటు రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడంపై ఆయన అనుచరగణం, కాపు సామాజికవర్గం మండిపడుతోంది. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి మధ్య దూరం కేవలం 50 కిలోమీటర్లే. కానీ, ముద్రగడను కావాలనే పవన్ విస్మరించినట్లుగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖం చాటేయడానికి అదే కారణమా? తొలుత ముద్రగడ ఇంటికి వస్తానన్న పవన్.. ఆ తరువాత ముఖం చాటేయడానికి కాపు నేతలకు వచ్చిన ధర్మసందేహమే ఆయనకు కూడా రావడమే కారణమని అంటున్నారు. ముద్రగడను జనసేన నేతలు కలిసినప్పుడు ఆ పార్టీకి అధికారం షేరింగ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం విషయం చర్చకు వచ్చిందని విశ్వసనీయ సమాచారం. చంద్రబాబును నమ్మి రాజకీయంగా ప్రయాణం చేయడమంటే ఆత్మహత్యా సదృశమే అవుతుందనే అభిప్రాయం కాపు సామాజికవర్గంలో బలంగా ఉంది. ముద్రగడ కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఆ విషయంలో స్పష్టత కోరుతారేమోనన్న భావనతో పవన్ ముఖం చాటేసి ఉంటారనే చర్చ కాపు సామాజికవర్గంలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి.. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం జరిగిన సమయంలో గోదావరి జిల్లాల్లోని కాపులపై చంద్రబాబు సాగించిన అణచివేతను ఆ సామాజికవర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అటువంటి చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోవడంపై గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. చంద్రబాబు దాష్టీకాన్ని ఉద్యమ సమయంలో స్వయంగా చవిచూసిన ముద్రగడ సైతం.. జనసేన నేతలతో చర్చల సందర్భంగా ఆ రెండు పార్టీల పొత్తుపై సందేహం వ్యక్తంచేయడంతో.. దానికీ సమాధానం చెప్పలేకే పవన్ ముఖం చాటేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, ముద్రగడ ఇంటికి వెళ్లి పవన్ కలవకపోవడానికి తన పార్టనర్ చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడమే కారణమై ఉంటుందని కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ముద్రగడ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. -
జనసైనికులకు ఉప్మా పెట్టి చివరిలో ట్విస్ట్ ఇచ్చిన ముద్రగడ..
-
ముందు ఉప్మా తినండి.. తర్వాతే వివరాలు చెప్పండి
‘‘సరే మద్దతు కోరి వచ్చారు.. ముందు కూర్చోండి.. ఇదీ ఉప్మా తినండి.. కాఫీలు తాగారా.. ఇప్పుడు చెప్పండి.. అసలు జనసేనకు టీడీపీకి పొత్తు ఏ ప్రాతిపదికన కుదిరింది. ఎవరికీ ఎన్ని సీట్లు ఇస్తున్నారు... ఎక్కడెక్కడ ఇస్తున్నారు.. పోనీ కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ఎన్నిమంత్రిపదవులు ఇస్తారు.. ఆదేశికారంలో జనసేనకు, టీడీపీకి ఏ నిష్పత్తిలో అధికార పంపిణీ ఉంటుంది.. పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి గట్రా ఉందా.. దోస వేసుకోండి... ఒరేయ్ చట్నీ వెయ్యరా మనోళ్లకు అంటూనే.. ఆ ఇప్పుడు చెప్పండి.. రెండు పార్టీల మధ్య ఒప్పందం ఎలా జరిగింది.. అన్నీ చెప్పండి.. అప్పుడు నేను తప్పకుండా జనసేనలో చేరుతాను’’ అన్నారు ముద్రగడ. ఈ లోపు ఇడ్లీలు అయ్యాయి.. వేడి పూరీ వచ్చింది.. ‘‘దీన్ని కూడా వేసుకోండి’’ అని కొసరికొసరి వడ్డించిన ముద్రగడ ‘‘ఆ... ఇప్పుడు కాఫీ తాగి చెప్పండి.. గెలిస్తే మన కాపులకు ఒరిగేది ఏమిటి? మన వాళ్లకు ఎన్ని పదవులు.. ఈ లెక్కాపత్రం ఏమైనా ఉందా’’ అని వరుస ప్రశ్నలు వేయడంతో జనసేన ప్రతినిధుల గొంతులో ఉప్మా అడ్డం పడింది.. ‘‘అదేంటండి అన్ని ప్రశ్నలు ఒకేసారి వేశారు’’ అంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ కాపీ తాగి.. ‘‘టిఫిన్లు బాగున్నాయండి.. కానీ మీరు అడిగిన ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదండి’’ అన్నారు తీరిగ్గా.. ఈసారి ముద్రగడకు మరింత చిర్రెత్తుకొచ్చింది... ‘‘సరే తిన్నారా... చేతులు కడుక్కుని మళ్ళీ కూర్చోండి’’ అని కుర్చీలు చూపించి.. ‘‘మన కాపులకు.. జనసేనకు ఎన్ని సీట్లు.. ఎక్కడెక్కడ ఇస్తారో తెలీదు... ఎవరెవరికి ఇస్తారో తెలీదు... ఎన్నికల ఖర్చులు ఎవరివో తెలీదు.. గెలిస్తే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో తెలీదు.. ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ఇలాంటివి జనసేనకు ఉన్నాయో లేదో తెలీదు.. మరి ఏమీ తెలీకుండా చంద్రబాబు కావిడి మోయడానికి మీకు సిగ్గు లేకపోతే లేదు.. నాకైనా ఆలోచన ఉండాలి కదా.. ప్రతిఫలం ఆశించకుండా.. అధికారంలో వాటా కోరకుండా బేషరతుగా తెలుగుదేశం గెలుపుకోసం ఎందుకు పని చేయాలి.. ఇలా ఎవరైనా చేస్తారా ? మీరు రాజకీయ నాయకులా.. కూలీలా... కనీసం బుద్ధీ బుర్రా ఉండక్కర్లా’’ అన్నట్లుగా ఎదురు ప్రశ్నలు ఫటా ఫట్ సంధించడంతో జనసేన ప్రతినిధుల మొహాల్లో వరుసగా క్వశ్చన్ మార్కులు పడ్డాయి. ‘‘ముందు మనకు చంద్రబాబు ఏమి ఇస్తాడో చెప్పండి.. అప్పుడే నేను జనసేనలో చేరతాను.. పార్టీ కోసం పని చేస్తాను.. ఏమీ తెలీకుండా గుడ్డిగా చేరలేను.. చంద్రబాబుకు సేవ చేయలేను.. నా ఆత్మగౌరవం చంపుకోలేను’’ అంటూ.. నేను మీలాంటోడిని కాదని క్లారిటీ ఇచ్చారు.. దీంతో అయన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని జనసేన ప్రతినిధులు మొహాలు దిగాలుగా పెట్టుకుని వెనక్కు వచ్చారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ జనసేనలో చేరిక ప్రశ్నార్ధకమైంది. -సిమ్మాదిరప్పన్న -
జనసేనలో ముద్రగడ ఎంట్రీకి బ్రేక్?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఊహించని షాక్ ఇచ్చారు. ముద్రగడ వైఎస్సార్సీపీలో చేరతారనే ప్రచారం వేళ టీడీపీ, జనసేనలో టెన్షన్ మొదలైంది. దీంతో మధ్యవర్తులను రంగంలోకి దించింది. ముద్రగడను తమ పార్టీలోకి రావాలని జనసేన నేతలు ఆహ్వానించారు. కాపులంతా కలిసికట్టుగా ఉండాలని పవన్ చెప్పటం తనకు నచ్చిందని జనసేనలోకి రావాలని పవన్ కోరితే ఆలోచన చేస్తానని ముద్రగడ చెప్పారు. పవన్ స్వయంగా తానే ముద్రగడను ఆహ్వానిస్తారంటూ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ముద్రగడ, ఆయన కుమారుడుకు సీటు గురించి ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. ఇంతలో చంద్రబాబుతో పొత్తుతో ఉండటంతో పవన్‌కు సీఎం పదవిపైన నిర్ణయం ఏంటని ముద్రగడ స్పష్టత కోరారు. చంద్రబాబు నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేదని జనసేన నేతలు క్లారిటీ ఇచ్చారు. పవన్ ఆలోచన గురించి ఆరా తీశారు. పవన్ ఆలోచన ఏంటో పార్టీ నేతలు వివరించారు. దీంతో ముద్రగడ ఏకీభవించలేదు. కాపుల ఐక్యంగా పని చేసి పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ అభ్యర్దులకు సహకరిస్తున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు. గెలిచిన తరువాత అధికారం మాత్రం కాపులకు లేకుండా చంద్రబాబుకే దక్కాలంటే అందుకు పని చేసేందుకు తాను సిద్దంగా లేనని ముద్రగడ తేల్చి చెప్పారని జనసేన నుంచి అందుతున్న సమాచారం. ముద్రగడకు సీటు విషయంలోనూ చంద్రబాబుతో చర్చించి చెబుతానని పార్టీ నేతలు చెప్పటం ముద్రగడకు ఆగ్రహం తెప్పించింది. అన్నింటికీ చంద్రబాబుపైనే ఆధారపడితే ఇక మీకు పార్టీ ఎందుకని ముద్రగడ ప్రశ్నించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారని ముద్రగడ తెలుసుకొనే ప్రయత్నం చేసారు. ఆ విషయంలోనూ స్పష్టత లేదని నేతలు సమాధానం ఇచ్చారు. అసల ఏ ప్రాతిపదికన టీడీపీకి మద్దతిస్తున్నారంటూ ముద్రగడ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి మధ్యవర్తులు, జనసేన నేతల నుంచి సమాధానం రాలేదు. కాపులు కలిసి కట్టుగా ఉండాలని పవన్ చెబుతున్నది చంద్రబాబు పల్లకి మోయటానికి అంటూ ముద్రగడ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం. దీంతో అన్ని విషయాలు పవన్ వస్తే ఆయనతోనే మాట్లాడుతానని ముద్రగడ తేల్చేసారని తెలుస్తోంది. పవన్ నిర్ణయాలను గౌరవిస్తామని సీఎం పదవిలో పవన్ కు షేరింగ్ ఉంటేనే తాను జనసేనలో చేరి గెలుపు కోసం పని చేస్తానని.. పవన్‌కు సీఎం పదవి లేకుంటే తాను చేరేది లేదని ముద్రగడ తేల్చేసిన అంశం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారింది. -
ముద్రగడ దారెటు ?..కేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
-
న్యూ ఇయర్ సందర్భంగా కాపు నేతలతో ముద్రగడ ఆత్మీయకలయిక
-
అమలాపురం కోర్టుకు కాపు ఉద్యమ నేతలు
అమలాపురం టౌన్: కాపు ఉద్యమ సమయంలో పట్టణ పోలీస్‌స్టేషన్ ముట్టడికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు 30 మంది కాపు నేతలు గురువారం అమలాపురంలోని జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు ఉద్యమ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, సూదా గణపతి, ఆకుల రామకృష్ణ తదితరులు కోర్టుకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వం కాపులపై పెట్టిన అక్రమ కేసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఫిబ్రవరిలో ఎత్తివేయించారు. అక్రమ కేసులతో అవస్థలు పడుతున్న కాపు నాయకులకు విముక్తి కల్పించారు. అప్పట్లో ప్రభుత్వం జీవో నంబర్ 120 ద్వారా ఈ కేసులకు పుల్‌స్టాప్ పెట్టింది. ముద్రగడ పద్మనాభం గతంలో చట్టసభలకు ప్రాతినిథ్యం వహించిన నేత కావడంతో ఈ కేసును తొలుత విజయవాడ ప్రజా ప్రతినిధులు కేసుల కోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం తాను మాజీ మాత్రమేనని, ఈ కేసును అమలాపురం కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు అమలాపురం జ్యూడీషీయల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. మేజిస్ట్రేట్ ఎ.హిమబిందు ఎదుట ఆ 30 మంది కాపు ఉద్యమ నాయకులు గురువారం హాజరయ్యారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేసిన జీవోను మేజిస్ట్రేట్ పరిశీలించి కేసును కొట్టేసినట్టు వెల్లడించారని అమలాపురం పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కాపు నాయకులు అమలాపురం కోర్టుల సముదాయం ఎదుట హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేసి, ఇప్పుడు తమను కేసుల నుంచి విముక్తి కల్పించిన సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత సూదా గణపతి కృతజ్ఞతలు తెలిపారు. -
‘టీడీపీ నేతలు మర్చిపోయారా?.. కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా?’
సాక్షి, కాకినాడ: టీడీపీ నేతలపై సెటైరికట్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆల్ రెడీ మోత మోగింది కదా అని ఎద్దేవా చేశారు. ఈరోజు టీడీపీ నేతలు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా? అని కామెంట్స్ చేశారు. కాగా, కన్నబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో ఆకలి కేక పేరుతో కంచాలు కొట్టాలి అని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చి కంచాలు కొట్టిన వందలాది మందిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసులన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తివేశారు. మరి ఈరోజు టీడీడీ నేతలు కంచాలు కొట్టాలని పిలుపునిచ్చారు.. మరీ వీరి మీద కూడా కేసులు పెట్టాలి కదా?. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే నన్ను కలవనివ్వారా అని నారా లోకేష్ అంటున్నాడు. ఆనాడు ముద్రగడను అరెస్ట్ చేస్తే ఆయన కుమారుడిని పోలీసులతో దారుణంగా కొట్టించారు. కాపులు కంచాలు కొడితే తప్పని చెప్పారు.. ఇవాళ టీడీపీ నేతలు కంచాలు కొడతాం అంటున్నారు. చంద్రబాబు చేసిన స్కిల్ స్కామ్ కేసు రాష్ట్రమంతా మోతెక్కిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు మరో షాక్.. శ్రీనివాస్‌పై సస్పెన్షన్ -
ముద్రగడ సవాల్ ను స్వీకరించే దమ్ము పవన్ కు ఉందా: కొట్టు
-
ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని వాగితే..
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని ఒక సామెత. మరొకటి ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది వాగుతారని.. పవన్ సినిమా(కెమెరామెన్ గంగతో రాంబాబు)లోని ఓ డైలాగ్ ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందనిపిస్తుంది. తన పార్టీ గురించి కాకుండా ,అక్రమ పొత్తులో ఉన్న తెలుగుదేశం కోసం తిరుగుతూ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు ఆయనకే ఎదురుతిరిగాయి. ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే, సినిమాలలో మాదిరి అంతా పడి ఉంటారనుకుని పవన్ కళ్యాణ్ వాడిన ఆరాచక భాషకు కొంతమంది ప్రముఖులు ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత అయినా ఆయన మార్పు వస్తుందా?లేదా? అన్నది చెప్పలేం. ప్రత్యేకించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కూడా కెలికి పవన్ కల్యాణ్ పెద్ద తప్పు చేశారు. తద్వారా కామ్‌గా ఉన్న ముద్రగడను లేపి తన్నించుకున్నట్లయింది. పవన్ యాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు నో ఆన్సర్ ముద్రగడ రాసిన రెండు లేఖల సారాంశం చూశాక నిజంగా కాపు సామాజికవర్గానికి మేలు జరగాలని ఆశించేవారు. , వారి ప్రయోజనాలను కోరుకునేవారు ఎవరూ పవన్‌కు మద్దతు ఇవ్వరన్న అభిప్రాయం కలుగుతుంది. కేవలం అమాయకత్వంతోనో, అజ్ఞానంతోనో, లేక ఏదో భావావేశంతోనో పవన్ కోసం సీఎం. అని నినాదాలు ఇస్తూ తిరిగే కొద్ది మంది తప్ప ఎవరికి ఆయన ప్రసంగాల శైలి నచ్చడం లేదు. సినిమా యాక్టర్ కనుక కాసేపు చూసి వెళ్దామని ఆయన సభలకు వస్తే వస్తుండవచ్చు. కాని సభ పూర్తి అయ్యేసరికి ఇంతకీ పవన్ ఏమి చెప్పారన్న సందేహం వస్తుంది. ఆయన ఎందుకు యాత్ర చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. తాను ఒక పక్క ఓడిపోతానని చెబుతారు. మరో పక్క ఏదో తన వారాహి ముందు నిలబడి సీఎం...సీఎం అని నినాదాలు చేస్తున్న బాచ్ కోసం ఆ పదవి కావాలని చెప్పాను తప్ప, తనకు ఆ పదవి నిర్వహించే శక్తి లేదని ఒక టీడీపీ పత్రికకు ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఈ యాత్ర లక్ష్యమే నీరుకారిపోయింది. అది ఒక అంశం అయితే ముద్రగడ వంటి సీనియర్ నేతను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తన గొయ్యి తాను తవ్వుకున్నట్లయింది. ముద్రగడ పద్మనాభం ఇప్పటివారు కారు. 1978 లో తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికవడమే కాకుండా మంత్రిగా పనిచేసిన అనుభవ శాలి. ముద్రగడ రాజకీయాలలోకి వచ్చేనాటికి పవన్ కళ్యాణ్ నిక్కర్లు వేసుకుని తిరుగుతుండవచ్చు.అయినా పర్వాలేదు. విషయ పరిజ్ఞానం పెంచుకుని మాట్లాడితే అర్ధం ఉంటుందికాని ఏది పడితే అది మాట్లాడితే ఏమి ప్రయోజనం. ముద్రగడ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు ముద్రగడ కాపు సామాజికవర్గంలోని పేదరికం పోగొట్టాలన్న లక్ష్యంతో పనిచేశారు. ఆ క్రమంలో పూర్తి ఆశయం నెరవేరకపోయినా, ఆయన చిత్తశుద్దిని ఎవరూ శంకించలేదు. ముద్రగడ దీక్షలు చేసినా, తనను తాను గృహ నిర్భంధం చేసుకున్నా, భారీ సభలు నిర్వహించినా, అదంతా ఆయనకే చెల్లిందన్న భావన కాపు వర్గంలోనే కాకుండా ఇతర వర్గాలలో కూడా నెలకొంది. ఎవరూ ఆయనను వ్యక్తిగతంగా కించపరచలేదు. కాంగ్రెస్ టైమ్‌లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ తమ డిమాండ్ల కోసం దీక్షకు కూర్చున్నపుడు ఆయనను విరమింపచేయడానికి ప్రత్యేక విమానంలో ఆనాటి మంత్రి రోశయ్యను పంపించారు. అంటే అంతటి ప్రాముఖ్యత ముద్రగడకు ఉందన్నమాట. ముద్రగడ డిమాండ్ మేరకు ఆనాటి ప్రభుత్వం ఒక జిఓ కూడా విడుదల చేసింది. అది ఆయన పట్టుదల. కారణాంతరాలవల్ల అది కోర్టులలో నిలబడి ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. తదుపరి చంద్రబాబు 2014లో తన మానిఫెస్టోలో కాపు రిజర్వేషన్లు పెట్టి, ప్రభుత్వంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో దాని గురించి నిలదీసిన వ్యక్తి ముద్రగడ. ఉద్యమించిన నేత ఆయన. మొత్తం కాపు సమాజాన్ని కదిలించారంటే అతిశయోక్తి కాదు. తన భార్య, తన కుమారుడు, కోడలిని చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు అరాచకంగా దూషించినా, భయపెట్టినా లొంగకుండా నిలబడ్డారు. తనను అదుపులోకి తీసుకుని రాజమండ్రి ఆస్పత్రికి తరలించినా వెన్నుచూపని నేత ఆయన. ఈ ధైర్య లక్షణాలతో పాటు ఆయన అన్ని వర్గాలవారిని ఎంతో గౌరవంగా చూస్తారు. ఆయన మర్యాదలను స్వీకరించడం అంటే అది ఒక అనుభూతే. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏదో స్వార్దం కోసం ఉద్యమం నడిపారని అనడం సహజంగానే ఆగ్రహం తెప్పిస్తుంది. అందులోను ముద్రగడ అసలు అంగీకరించరు. అందుకే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాసి ఆయన వాడుతున్న బూతుభాషపై ముద్రగడ నిలదీశారు. వీధి రౌడీలా వ్యవహరించి పరువు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి పవన్ ఏ రకంగా ప్రతినిధి? కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో తన కుటుంబానికి ఉన్న స్నేహసంబంధాలను వెల్లడించి, పవన్ ఆరోపణలను తోసిపుచ్చడానికి కూడా ముద్రగడ వెనుకాడకపోవడం విశిష్ట లక్షణం. ఆయన రాసిన మొదటి లేఖమీద పవన్ అభిమానులు కొంతమందికి కోపం వచ్చింది. అంతే..వెంటనే చండాలపు మెస్సేజ్ లు పెట్టి వయసులో కూడా పెద్దవాడని కూడా చూడకుండా ముద్రగడను అవమానించారట. అలాంటివాటిని పవన్ ఖండించి,తన మద్దతుదారులు అలాంటి అసభ్య మెస్సేజ్ లు పెట్టవద్దని సూచించకపోవడం కూడా ఆగ్రహం కలిగిస్తుంది. ఈ బాధతో ముద్రగడ మరింత కలత చెంది మరోలేఖ రాసి, కాపులకు పవన్ కళ్యాణ్ ఎన్నడైనా ఏమైనా ఇసుమంతైనా సాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. అవి చదివితే కాపు సామాజికవర్గానికి అసలు పవన్ ఎలా ప్రతినిధి అవుతారన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. కేవలం తాను ఆ వర్గం వ్యక్తి కనుక, సినిమా నటుడిగా ప్రజలకు తెలిసిన మనిషి కనుక , ఏమైనా ముఖ్యమంత్రి అవకాశం వస్తుందేమో అని కొంతమంది అభిమానులు ఆశపడ్డారు. కాని వారి ఆశను నిరాశ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ యాత్ర సాగించారు. తొలిరోజు సభలో ఉన్న గాంభీర్యత ఆ తర్వాత కొరవడి ,బూతులు,పిచ్చి ఆరోపణలు, ముఖ్యమంత్రి జగన్ పై దూషణలు, కొన్ని డైలాగులు మినహాయించి అందులో పస లేకుండా పోయింది. ఎజెండా ఏమిటో తెలీదు.. సవాల్‌కు సమాధానం లేదు తన పార్టీ ఎజెండా ఏమిటో ఆయన చెప్పలేకపోతున్నారు. టీడీపీని సమర్దించడానికే తిరుగుతున్నట్లుగా వారి స్క్రిప్టులోని విషయాలనే ఈయన కూడా ప్రస్తావించడాన్ని అంతా గమనిస్తున్నారు. పైగా కాపు నేతలతోనే గొడవకు దిగడం. ముద్రగడ నిర్దిష్టంగా కొన్ని ప్రశ్నలు వేశారు. 1988లో వంగవీటి రంగాను టీడీపీ వారు హత్య చేసిన తర్వాత జరిగిన ఘటనలలో అరెస్టు అయిన కాపువర్గం వారిని విడిపించడానికి పవన్ ఏమైనా పనిచేశారా అని ముద్రగడ అడిగారు. అలాగే గత టరమ్ లో కాపులు అసలు రోడ్డు ఎక్కడానికి కారణం పవన్ అని ఆయన తేల్చి చెప్పారు. పవన్ మద్దతుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత కాపు రిజర్వేషన్ ఊసే పట్టించుకోకపోతే ఉద్యమం వచ్చిందని, ఆ సందర్భంలో ఎన్నడైనా ఉద్యమానికి పవన్ మద్దతు ఇచ్చారా? ఆ కేసులలో ఉన్నవారికి సంఘీభావంగా పవన్ నిలిచారా? తుని వద్ద రైలు దగ్ధం తర్వాత కేసులలో ఇరుక్కున్న కాపులకు అండగా ఏమైనా పవన్ నిలబడ్డారా? ఇలా ప్రశ్నల పరంపరకు ముగింపుగా కాకినాడలో చంద్రశేఖరరెడ్డిపై కాని, పిఠాపురంలో తనపై కాని పోటీ చేయడానికి సవాల్ విసరాలని కూడా ముద్రగడ సలహా ఇచ్చారు. వీటిలో ఒక్కదానికి కూడా పవన్ వద్ద సమాధానం లేదు. అందుకే ఆయన ఈ విషయాలను దాటవేస్తూ ఏవేవో సోది కబుర్లు చెప్పుకుంటూ యాత్ర నడుపుతున్నారు. పవన్ వ్యాఖ్యలపై వైసిపి నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందిస్తూ గుడ్డలూడదీస్తాం.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు అదే భాషలో సమాధానం ఇచ్చారు. అది పవన్ కనుక విని ఉంటే సిగ్గుతో తలదించుకోవల్సిందే. ప్రముఖ నటుడు , చలనచిత్ర అభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబుతో జత ఎలా కడతావని ప్రశ్నించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి అయితే జరిగింది మరొకటి. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో ఉన్న కాపు వర్గాన్ని సమీకరించి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా సమర్పించాలని అనుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహం గందరగోళం గా మారి బెడిసికొట్టినట్లనిపిస్తుంది. చివరికి కాపు సామాజికవర్గమే ఆయనను చీత్కరించుకునే పరిస్థితి తెచ్చుకోవడం బాధాకరం. అంతేకాక పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజికవర్గం వారు ఇతర వర్గాలలో పలచన అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. తన రాజకీయ స్వార్ధం కోసం ఏపీలో ప్రతిష్టాత్మకంగా జీవించే సామాజికవర్గాలలో ఒకటిగా ఉన్న కాపు వర్గాన్ని పవన్ కళ్యాణ్ వీధిన పడేయడం సముచితం కాదని వారు భావిస్తున్నారు. :కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?: ఎమ్మెల్సీ తోట
సాక్షి, విజయవాడ: కాపు ఉద్యమంలో ముద్రగడ ఏనాడూ లబ్ధి పొందలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాపు ఉద్యమం రాజకీయ లబ్ధి కోసమే అనడం దారుణం.. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ రాజకీయంగా నష్టపోయారని ఆయన అన్నారు. ‘‘ముద్రగడ స్ఫూర్తిగా మేమంతా ముందుకెళ్తాం. 30 ఏళ్ల క్రితం ముద్రగడ చేసిన ఉద్యమం ఈ జనరేషన్‌కు తెలియదు. సీఎం అయ్యే అర్హత, సంఖ్యా బలం తనకు లేదని పవన్ చెప్పారు. ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?. 2019లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్ మాదిరిగా వ్యక్తిగతంగా మేం మాట్లాడం పవన్ మాపై ఎందుకు కక్ష పెంచుకున్నారో అర్ధం కావట్లేదు’’ అంటూ ఎమ్మెల్సీ తోట వ్యాఖ్యానించారు. చదవండి: స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్ -
పవన్ కాపులను తిడుతున్నారంటే ఎంత పెద్ద స్కెచ్ వేశారో?: పోసాని
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు స్కెచ్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారని ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాలతోనే కాపులను పవన్ తిడుతున్నారని దుయ్యబట్టారు. 1981 నుంచి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని, ఆయన గొప్పతనం పవన్, చంద్రబాబులకు తెలియదన్న పోసాని.. కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారన్నారు. ‘‘ముద్రగడ ఏ రోజు కూడా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధిపొందలేదు. కాపుల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ. ముద్రగడ ఎనాడైనా తప్పు చేసినట్లు పవన్ నిరూపించలగలరా?. వంగవీటి మోహనరంగాను చంద్రబాబు చంపించారు.. ముద్రగడ గొప్పవాడా? పవన్ ప్రేమించే బాబు గొప్పవాడో గ్రహించాలి’’ అని పోసాని అన్నారు. ‘‘చంద్రబాబు అవినీతి పరుడని పవన్ కల్యాణ్ తిట్టారు. చంద్రబాబును తిట్టిన నోటితోనే ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలంటున్నావు. కాపులను హింసించిన చంద్రబాబుకు మద్దతు తెలుపుతావా. ముద్రగడకు పవన్ క్షమాపణ చెప్తే తప్పేం కాదు. ముద్రగడలో అవినీతి, అసూయ లాంటివి లేవు. పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నాడో కాపులు అర్థం చేసుకోవాలి. పవన్ కాపులను తిడుతున్నారంటే ఎంత పెద్ద స్కెచ్ వేశారో?’’ అంటూ పోసాని నిప్పులు చెరిగారు. చదవండి: స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్ -
పవన్ తన అభిమానులతో నన్ను బూతులు తిట్టిస్తున్నారు: ముద్రగడ
-
కాకినాడ. పిఠాపురం.. పోటీకి సిద్ధమా? పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్
కాకినాడ: పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదని లేఖలో కౌంటరిచ్చారు. ‘ మీరు సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదు.. నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చింది. నీ వద్ద నేను నౌకరిగా పనిచేయడం లేదు కదా.. అటువంటప్పుడు నన్ను తిట్టించాల్సిన అవసరం ఏంటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. పవన్‌కు రాసిన లేఖలో ముద్రగడ ప్రస్తావించిన అంశాలు కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి చేగువేరా మీకు ఆదర్శం అంటారు గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్తారు ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నాను మీరు మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు.. దమ్ముంటే మీరు నన్ను తిట్టండి నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు వంగవీటి హత్య ..తుని ఘటన తరువాత అమాయకులైన వారిని జైలులో వేశారు. ఏనాడైనా వారిని పరామర్శించారు. కనీసం వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారా? -
వీధి రౌడీ అంటూ ముద్రగడ ఫైర్
-
పవన్ ను కాపు కులం నమ్మదు: ముద్రగడ
-
ముద్రగడకు కాపు ఉద్యమ నేతల సంఘీభావం
సాక్షి, కాకినాడ: పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ బహిరంగ లేఖ విడుదల చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలుపుతున్నారు కాపు ఉద్యమ నేతలు, అభిమానులు. ఈ క్రమంలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి కాపు ఉద్యమ నేతలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఈ మేరకు కాపు ఉద్యమ నేతలు మాట్లాడుతూ.. ‘గోదావరి జిల్లాల్లో పవన్‌ను కాపులు నమ్మే పరిస్థితి లేదు. ఓ పొలిటిషియన్‌గా పవన్ మాట్లాడే భాష సరికాదు. పవన్‌కు ఏమాత్ర రాజకీయ అనుభవం లేదు. గుండు కొట్టించుకున్న అనుభవం పవన్‌కు ఉంది.కాపు ఉద్యమం కోసం మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. కాపు ఉద్యమం కోసం ముద్రగడ అలుపెరగని పోరాటం చేశారు. లేఖలో ముద్రగడ ప్రస్తావించిన అంశాలు అక్షరసత్యం’ అని స్పష్టంచేశారు. చదవండి: ఎందరి నార తీశారు? ఎందరికి గుండు గీయించారు? పవన్‌కు ముద్రగడ ఘాటు లేఖ -
నేనేం కులాన్ని వాడుకోలేదు లేఖలోముద్రగడ్డ ఆవేదన
-
ఎందరి నార తీశారు? ఎందరికి గుండు గీయించారు? పవన్‌కు ముద్రగడ ఘాటు లేఖ
కాకినాడ: కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదురుగుతున్నారంటూ ఇటీవల వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు పవన్‌ను ఉద్దేశించి.. ఓ సుదీర్ఘమైన ఘాటు లేఖ రాశారాయన. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఉద్యమించానని, నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టిసారించాలని లేఖలో పవన్‌కు చురకలంటించారు ముద్రగడ. 👊 ‘నేను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు. నేను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఉద్యమాలు చేయలేదు. చంద్రబాబు నాయుడి ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి బాబు ద్వారా పవన్ కల్పించారు’ అని స్ట్రాంగ్‌గా బదులిచ్చారు ముద్రగడ. కాపు ఉద్యమం ఎందుకు చేయలేదు? 👊 ‘నా కంటే చాలా బలవంతుడైన పవన్.. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి. జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోనిదని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏమిటో అడిగి తెలుసుకో పవన్. నా సమాధానం తర్వాత కాపు సామాజిక వర్గానికి రూ. 20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాను. బీసీల నుంచి పిల్లి సుభాష్‌ని, కాపుల నుంచి బొత్సను సీఎం చేయమని అడిగా’ అని ముద్రగడ పవన్‌ను ఉద్దేశించి స్పష్టం చేశారు. 👊 నేను ఎవరినీ బెదిరించి ఇరువురు పెద్దలు, పవన్ దగ్గర రూ.కోట్లు పొందలేదు. నేను ఎప్పుడూ ఓటమి ఎరుగను. కాపు ఉద్యమంతో ఓటమితో దగ్గరయ్యా. నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకో అంటూ పవన్‌కు చురకలంటించారాయన. సలహాలు వదిలేసి.. విమర్శలా? 👊 ఎమ్మెల్యేలను తిట్టడానికి విలువైన సమయం వృధా చేసుకోకండి. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడడం, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని 2019లో నా వద్దకు వచ్చిన రాయబారులకు సలహా ఇచ్చి పంపాను. సలహాలు అడిగారు కానీ గాలికి వదిలేశారు. పవన్‌ను నిజంగా రాష్ట్రప్రజలపై ప్రేమ ఉంటే నా సలహాల ఆధారంగా యుద్ధం చేయండి. ద్వారంపూడి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు 👊 పార్టీ పెట్టిన తర్వాత పదిమంది చేత ప్రేమించబడాలిగానీ.. వీధి రౌడీభాషలో మాట్లాడడం ఎంతవరకూ న్యాయమంటారు?. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే తండ్రి, తాతది తప్పుడు మార్గాల్లో సంపాదన అనే మాట చాలా తప్పు. ద్వాంరపూడిపై గెలిచి పవన్ తన సత్తా ఏమిటో చూపించాలి. -
పదేళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. ముద్రగడ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి ...
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దశాబ్ద కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మౌనం వీడారు. రాజకీయంగా, ఉద్యమపరంగా సంచలనంగా నిలిచే ఈయన రాజకీయ పునరాగమనానికి ముహూర్తం దగ్గర పడిందా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. 2016 జనవరి 31న తుని రైలు దహనం కేసులో ముద్రగడతో పాటు మరికొందరిపై నమోదైన కేసును రైల్వే కోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ నిర్ణయాన్ని భవిష్యత్‌లో ప్రకటిస్తానని ముద్రగడ లేఖ ద్వారా ప్రకటించారు. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించినా భవిష్యత్ రాజకీయ ప్రకటన పైనే అందరి దృష్టీ పడింది. ఆది నుంచీ కాపు ఉద్యమ సారథిగా ముద్రగడకు రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ ఉంది. తాతల కాలం నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈయన ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి చెందారు. తరువాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అన్ని వర్గాలతో బలమైన బంధం సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గ ప్రతినిధిగా ముద్రగడకు పేరుంది. ఆ సామాజికవర్గం కోసం అనేక ఉద్యమాలు చేశారు. బీసీ, ఎస్సీ నేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. గతంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని పోస్టులకు కలత చెందిన ఆయన కాపు సామాజిక ఉద్యమానికి దూరంగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. టీడీపీ ప్రభుత్వ పునాదుల్ని కదిలించింది. కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబుతో తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తుకు సై అన్న తరుణంలో ముద్రగడ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జనసేనపై రగులుతున్న యువత తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా జరిగినా రాజకీయాల్లో మాత్రం చర్చకు తెర తీశాయి. జనసేనపై గంపెడాశలు పెట్టుకున్న కాపు సామాజికవర్గం ప్రధానంగా కాపు యువత.. చంద్రబాబుతో దోస్తీ అనేసరికి మండిపడుతోంది. పవన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటోంది. ఇటువంటి తరుణంలో ముద్రగడ రాజకీయంగా తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ఉద్యమంలో ముద్రగడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయిప్పటికీ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల వైపు మళ్లించలేదు. అభిమానుల ఒత్తిడి: 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మనాభం.. ఓటమి అనంతరం కాపు ఉద్యమాన్ని కొనసాగించారు. తదనంతర పరిణామాల్లో 2020లో ఆ ఉద్యమం నుంచి దూరంగా జరిగారు. రైలు దహనం కేసు కొట్టివేసిన అనంతరం ఆయనకు అభిమానుల తాకిడి పెరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పిన ముద్రగడపై సహచరుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ముద్రగడ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదీ రాజకీయ నేపథ్యం ముద్రగడ తాత పద్మనాభం మునసబుగా పని చేశారు. తండ్రి వీర రాఘవరావు 1962, 67 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పని చేశారు. 1977లో తండ్రి మరణానంతరం పద్మనాభం అదే ప్రత్తిపాడు నుంచి 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి, 1983, 85లో రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పని చేసి, 1988లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తరువాత మంత్రి అయ్యారు. 1995 ఎన్నికల్లో ముద్రగడ ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చెంది, 1999లో తిరిగి టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ అయ్యారు. 2009లో వైఎస్ హయాంలో పిఠాపురం, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అన్ని ప్రధాన పార్టీల్లో పని చేసిన రాజకీయ అనుభవం ముద్రగడకు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన నేపథ్యమూ ఉంది. -
కాపులను దగా చేసింది చేసింది బాబు, పవన్ కాదా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. రైతులకు పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ విమర్శించేవాడని దుయ్యబట్టారు. విమర్శలు చేసేందుకే ఇప్పుడు మళ్లీ రోడ్డుపైకి వస్తున్నాడని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. 'జనం కోసం పట్టుమని 10 రోజుల పనిచేశావా పవన్? కాపులను బీసీల్లో చేరుస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు కాపులను మోసం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు ముద్రగడ కుటుంబాన్ని హింసించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడితే దాడి చేశారు. ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు నోటికి తాళం వేసుకున్నాడు. చంద్రబాబులా కాపులను మోసం చేయనని జగన్ ముందే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని నిజాయితీగా చెప్పారు. కాపులను దగా చేసింది చేసింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాదా? కాపులను పవన్ కల్యాణ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నాడు. సినిమా బాగుంటేనే జనం చూస్తారు. లేదంటే చూడరు. రూ.100 కోట్లు దాటిన పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా ఉందా? రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుంది? డబ్బింగ్, కాపీ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు? రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కల్యాణ్ కాదా? కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజైనా మాట్లాడారా? చంద్రబాబును తిడితే మాత్రమే పవన్‌కు మానవత్వం పొంగిపొర్లుతుందా? టీడీపీ నేతలు నీ గురించి బరి తెగించి మాట్లాడితే ఏం చేశావ్? మీరిద్దరు కలిసిపోతారు, కలిసి పోటీ చేయాలని మొదటి నుంచి చెబుతున్నాం. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒకటే. ప్రజలు అవకాశం ఇచ్చేవరకు పోరాటం చేస్తూనే ఉండాలి. చంద్రబాబు హయాంలో ఆలయాలను ధ్వంసం చేస్తే ఏం చేశావ్? కుల, మత రాజకీయాలతో పవన్ పబ్బం గడుపుతున్నాడని అని నాని ధ్వజమెత్తారు. చదవండి: పవన్ శ్వాస, ధ్యాస బాబే -
త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా: ముద్రగడ
సాక్షి, కాకినాడ: తన భవిష్యత్ రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ప్రజలకు రాసిన మూడు పేజీల బహిరంగ లేఖను కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాకు విడుదల చేశారు. 2016 జనవరి 31న తునిలో కాపుగర్జన సభ జరిగిన మరునాడు తనను తీహార్ జైలుకు తీసుకెళ్లటానికి హెలికాప్టర్ సిద్ధంగా పెట్టారని, వెంటనే బెయిల్ తెచ్చుకోవాలని.. లేదంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవాలని పలువురు సలహా ఇచ్చారని గుర్తు చేశారు. అప్పట్లో అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యేదని ముద్రగడ అన్నారు. తుని సమావేశంలో ఎక్కువగా భయపడింది, బాధపడింది తనతో ఉన్న సామాన్యుల కోసమేనని పేర్కొన్నారు. అందుకే.. సభకు వచి్చన వారిని బాధ పెట్టొద్దని, సభ పెట్టడానికి తానే కారకుడనని, అన్ని కేసులు తనపై పెట్టుకోవాలని ఆనాడే ప్రభుత్వానికి చెప్పానన్నారు. ఈ కేసులో ఉరిశిక్ష వేసినా పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లకూడదని నిశ్చయించుకున్నానని తెలిపారు. ‘ప్రత్తిపాడు రాజకీయ భిక్ష పెట్టింది’ ప్రత్తిపాడు నియోజకవర్గం తనకు రాజకీయ భిక్ష పెట్టిందని, తన తాత పద్మనాభం మున్సబుగా, తండ్రి వీరరాఘవరావు స్వతంత్ర ఎమ్మెల్యేగా తమ కుటుంబానికి విలువ తెచ్చారని ముద్రగడ పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఉంటూ ఎవరికీ అన్యాయం చేయకూడదని వారు చెప్పారని, తన ఊపిరి ఉన్నంత కాలం ఆ మాటలు గుర్తుంటాయన్నారు. వారి బాటలో నడిచే తాను జాతిని అమ్మకం, తాకట్టు పెట్టలేదన్నారు. ఉద్యమాలు, రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు. కాపు జాతి రిజర్వేషన్ల కోసం ప్రయతి్నంచి జోకర్ కార్డు మాదిరిగా అయినందుకు బాధపడుతున్నానని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, గౌతు స్వామి, గణేశుల రాంబాబు తదితరులు ఉన్నారు. చదవండి: బిల్డప్ బాబూ బిల్డప్..! ఆ విషయం చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా? -
ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: కన్నబాబు
-
తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు
సాక్షి, విజయవాడ: తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగతీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు రైల్వే పోలీసులు. ఈ కేసులో ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్ష్యులలో 20 మంది విచారణకు హాజరయ్యారు. 20 మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో తుదితీర్పు వెల్లడించింది. అయితే తుని ఘటన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. కానీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. చదవండి: బీటెక్ రవి దౌర్జన్యకాండ: బెదిరింపులు.. పచ్చబ్యాచ్‌తో కలిసి మారణాయుధాలతో.. -
పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్
-
సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ(కిర్లంపూడి): దళిత నాయకులను దళితులే ఎన్నుకొనే అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో శుక్రవారం లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా మెరుగైన పద్ధతులలో దళితుల పదవులను దళితులే ఓటు వేసుకునే అవకాశం కల్పించి వారి నాయకులను వారే ఎన్నుకొనేలా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఇతర వర్గాలు నివసించే వీధులలో ఒకటి నుంచి ఐదు దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, దళితులకు సంబంధించిన లక్షలాది రూపాయల గ్రాంట్లను అక్కడే ఖర్చు చేయడం వలన ఎక్కువ జనాభా ఉన్న దళితులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (ఆర్టీసీలో ఆఫర్లు!.. నలుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్ తీసుకుంటే..) -
కాపులకు రిజర్వేషన్ అమలుకు కృషిచేయాలి
కిర్లంపూడి: కాపు జాతికి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతులు కోల్పోయిన రిజర్వేషన్ విషయమై గతంలో రాసిన లేఖ సారాంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్‌పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సోషల్ జస్టిస్ మంత్రి స్పందిస్తూ రాజ్యాంగ సవరణలు 103, 105–2019, 2021 యాక్ట్స్‌ను అనుసరించి ఆర్టికల్ 342ఎ(3) ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చని చెప్పారని తెలిపారు. తదనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు దృష్టి పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, తమ సామాజికవర్గానికి కూడా రిజర్వేషన్ కల్పించి వెలుగు నింపాలని ముద్రగడ తన లేఖలో కోరారు. -
ముగిసిన ముద్రగడ పద్మనాభం రైలు దగ్ధం కేసు విచారణ
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ బహిరంగ లేఖ
Mudragada Padmanabham Letter, సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో రాధాకృష్ణకు పలు చురకలంటించారు. పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే తాను కాపు ఉద్యమం చేశానని ముద్రగడ తెలిపారు. లక్షాధికారిని కోటేశ్వరున్ని, కోటీశ్వరున్ని అపర కుబేరునిగా చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి తాను అసమర్థుడిని.. చేతకాని వాణ్ణి కాదని ముద్రగడ అన్నారు. రాధాకృష్ణలాగా.. ఎదుటి వాళ్లను ఏకవచనంతో మాట్లాడే పత్రిక యాజమానిని ఇంత వరకు చూడలేదన్నారు. ఆంధ్రజ్యోతి యాజమాని కేఎల్ఎన్ ప్రసాద్‌ను కూర్చిలోంచి కాళ్లుపట్టుకొని లాగి.. ఆ కుర్చిలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అని విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదని దుయ్యబట్టారు. ‘‘నా చరిత్ర కంటే మీ చరిత్రను అందరూ చదవాలి. ఎందుకంటే మీలా అపర కోటేశ్వరులు అవ్వలేరు. నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యాజమానులను బెదిరించి ఏలా చలమణిలోకి తెచ్చారో? రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని మీరు(రాధాకృష్ణను ఉద్దేశిస్తూ) ప్రజలకు చెప్పాలి. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి అంటూ రాధాకృష్ణపై ముద్రగడ ఆ లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయమని, ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. కాపుజాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా.. భగవంతుడు సీఎం వైఎస్ జగన్ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలవలేకపోతున్నానని పేర్కొన్నారు. కలిస్తే తమ జాతిని అడ్డుపెట్టుకొని ‘కోట్లు సంపాదించుకోవడానికి, పదవులు పొందడానికి వెళ్లాన’ని అనిపించుకోవడం ఇష్టంలేక కలువలేకపోతున్నానని ముద్రగడ తన లేఖలో పేర్కోన్నారు. -
అశ్వనీదత్.. నోరు అదుపులో పెట్టుకో
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ చౌదరి చేసిన వ్యాఖ్యలను అమరావతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి అంజిబాబు గురువారం ఖండించారు. ముద్రగడపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అశ్వనీదత్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడను వాడు, వీడు అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. కుల అహంకారంతో ముద్రగడను దూషించిన అశ్వనీదత్‌కు కాపుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాపులది పిచ్చి ఉద్యమమని వ్యాఖ్యానించి.. కాపు జాతిని అవమానించారని మండిపడ్డారు. -
సోషల్ మీడియా పోస్టులకు బెదిరిపోను
గోకవరం: తనను తిడుతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు బెదిరిపోనని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకి లేస్తుందన్నారు. అలాగే ఎవరో తిడుతున్నారని బలమైన ఆలోచనలను తాను వదలి పెట్టనన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాకు విడుదల చేశారు. ఇటీవల తాను రాసిన లేఖలకు కొంతమంది పెద్దలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తన న్యాయమైన ఆలోచనలను అమలు చేయొద్దని చెప్పడానికి ఇతరులెవరికీ హక్కు లేదన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటిస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే వారిని దగాకోరులు, దొంగలు అని చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనను సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి ప్రముఖుల గురించి ఒక మాట రాసినా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిని మంచి అని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోందని గుర్తు చేశారు. 1989 నుంచే తనకు ఎన్నో ఆశలు, ఆలోచనలు ఉన్నాయన్నారు. ఐదేళ్ల క్రితం దళిత నేత డాక్టర్ రత్నాకర్ తన వద్దకు వచ్చి మూడో ప్రత్యామ్నాయం గూర్చి మాట్లాడారని తెలిపారు. అలాగే రెండేళ్ల క్రితం బీసీ నేత కుడుపూడి సూర్యనారాయణరావు ‘నిత్యం ఒకే బొమ్మ కాదు, బొమ్మ తిరగేయాలి’ అని తనతో చెప్పారన్నారు. రత్నాకర్ లేవనెత్తిన విషయాన్ని సూర్యనారాయణతో చర్చించానని తెలిపారు. చిన్న ప్రయత్నంగా ప్రత్యామ్నాయం అనేదాన్ని మొదలు పెడదామని చెప్పానన్నారు. -
సంక్రాంతి, ఉగాది సందర్భంగా పందేలకు అనుమతివ్వాలి
గోకవరం: సంక్రాంతి, ఉగాది పండుగలకు గ్రామాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు వంటివాటికి ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. లేఖ ప్రతులను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విడుదల చేశారు. ఈ ప్రాంత వాసులకు సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పందేలు, ఆటల పోటీలు, జాతరలు తదితర వాటిని ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ మధ్యకాలంలో పండుగ ఉత్సవాల్లో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, చివరిలో అనుమతిస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు రోజుల పాటు పూర్తిస్థాయిలో ఆటలకు అనుమతి ఇవ్వాలని, పండుగలప్పుడు ప్రజలను జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలని కోరారు. -
దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..!
భార్యకు అవమానం జరిగిందంటూ చంద్రబాబునాయుడు చాలా బాధ పడుతూ వెక్కివెక్కి కన్నీరు కార్చడం టీవీల్లో చూసి చాలా ఆశ్చర్యపోయానని కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. గతంలో కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా తన భార్యను, కోడలిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రాక్షసానందం పొందారని పేర్కొంటూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. లేఖలోని అంశాలివీ... ‘‘చంద్రబాబునాయుడు గారికి... మీ ఉక్కుపాదాలతో అణచివేయబడ్డ మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారాలు. మా జాతికి మీరిచ్చిన హామీ కోసం నేను దీక్ష మొదలు పెట్టిన మొదటి రోజునే తమ పుత్రరత్నం సాగించిన కార్యకలాపాలు మరిచిపోయారా? మా ఇంటి ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్లు చేస్తూ, నన్ను బండబూతులతో సంబోధిస్తూ, బయటకు లాగారా లేదా అని వాకబు చేసిన మాట వాస్తవం కాదా? తలుపులు బద్దలుగొట్టి నా భార్యను, కోడలిని ‘లెగవే’ అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించి, బూటు కాళ్లతో తన్నించి ఈడ్చుకెళ్లడం గుర్తు లేదా? కొడితే మీకు ఇక్కడ దిక్కెవరని తిట్టించి, నా కుమారుడిని లాఠీలతో కొట్టుకుని తీసుకువెళ్లింది గుర్తు లేదా? ఇప్పుడు మీ నోటి వెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. తమరి దృష్టిలో మాది ఏ కుటుంబమనుకుంటున్నారు? మీరు, మీ భార్య దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి? మా కొంపలు ఏమిటి? దీక్షలప్పుడు ఒకసారి హెలికాప్టర్‌ను, మరోసారి సుమారు 6 వేల మంది పోలీసులను ప్రయోగించి తీహార్ జైలుకు పంపాలని, డ్రోన్ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టి, కార్గిల్ యుద్ధ భూమిని తలపించేలా నా ఇంటి వద్ద భయోత్పాతం సృష్టించింది వాస్తవం కాదా? ఆ సంఘటనలు గుర్తు చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని, మీ భార్యను అవమానించడం కోసం ఈ లేఖ రాయలేదు. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవు. నా గదిలో ఉన్న డబ్బులు, సెల్ఫోన్ల వంటి విలువైన వస్తువులను ఆ రోజు దొంగి లించారు. హాస్పిటల్ అనే జైలులో దుస్తులు మార్చుకోవడానికి, స్నానాలు చేయడానికి వీలు లేకుండా 14 రోజులు ఏ కారణంతో ఉంచారు? ఆ చిన్న గదిలో మా నలుగురితో పాటు మరో ఆరుగురు పోలీసులను పగలు, రాత్రుళ్లు కాపలాగా ఉంచారు. రేకు కుర్చీలతో శబ్దాలు చేయిస్తూ, ప్రతి రోజూ రాత్రి మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫొటోలు తీయించి పంపించమని పోలీసు అధికారులను మీరు ఆదేశించింది రాక్షసానందం కోసం కాదా? తమరు చేయించిన హింస, అవమానాలు భరించలేక వాటిని తలచుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. నాలుగేళ్ల నా మనవరాలు అర్ధరాత్రి గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలడం లేదు. భూమి గుండ్రంగా ఉన్న సంగతి మరవద్దు బాబూ. నన్ను, నా కుటుంబాన్ని అంత దారుణంగా అణచివేయాలని ఎందుకు అని పించింది? ఆ రోజున మీ పదవికి అడ్డు జగన్మోహన్రెడ్డి మాత్రమే. నేనైతే కాదు. అయినా నాపై కట్టలు తెంచుకునే కోపాన్ని, క్రూరత్వాన్ని ఎందుకు చూపారు? నాటి అణచివేత చర్యల వెనుక మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలనే ప్రయత్నం దాగి లేదా? మీరనుకున్నట్టే నేను కూడా ఆలోచన చేశాను. కానీ మనసులో ఏదో మూల నా కుటుంబాన్ని అవమానపరచిన తమరి పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాను. కొద్దోగొప్పో మీ కన్నా మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. మా తాత పేరుకే కిర్లంపూడి మునసబుగా ఉన్నా జిల్లా మునసబుగా పేరు గడించారు. నా తండ్రిని ప్రజలు ప్రేమతో రెండు దఫాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా అసెంబ్లీకి పంపారు. మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. మీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు వద్ద, తరువాత మీ పిలుపుతో మీ వద్ద చాలా సంవత్సరాలు పని చేశాను. మీతో ఉన్న రోజుల్లో ఏ ఒక్క రోజూ మీకు వెన్నుపోటు పొడవాలనే ప్రయత్నం వీసమెత్తు కూడా చేయలేదు. కార్యకర్తలు, బంధువుల సానుభూతిని మీడియా ద్వారా పొందే అవకాశం తమరికి మాత్రమే వచ్చింది. ఈ రోజు తమరు పొందుతున్న సానుభూతి ఆనాడు నేను పొందకుండా ఉండడం కోసం మీడియాను కూడా నియంత్రించడం వాస్తవం కాదా? ఆ రోజు నుంచి నన్ను అనాథను చేయడం కూడా తమరి భిక్షే కదా! చంద్రబాబూ! తమరు శపథాలు చేయవద్దు. తమరికి, నాకు అవి నీటి మీద రాతలు. అటువంటి శపథం చేసిన, చేసే నైతికత అప్పటి ప్రధాని,æ సీఎంలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, తమిళనాడు సీఎం జయలలిత, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకే సొంతం. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించాలి. ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో తమకు ఓట్లు వేయలేదన్నది గ్రహించండి.’’ ఇట్లు మీ ముద్రగడ పద్మనాభం, మాజీ శాసనసభ్యులు -
'మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా'
Mudragada Padmanabham Letter: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 'ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాల అవమాన పరిచారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను.. నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు. చదవండి: (AP 3 Capitals Bill: 'ఇంటర్వెల్ మాత్రమే.. శుభం కార్డుకు చాలా టైముంది') మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. నా కుటుంబాన్ని అవమానపరచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు, మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆ రోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాధను చేశారు. శపధాలు చేయకండి చంద్రబాబు గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి' అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. చదవండి: (వికేంద్రీకరణ బిల్లులపై ఎప్పుడేం జరిగిందంటే..) -
కాపు ఉద్యమం నుంచి పూర్తిగా తప్పుకున్నా
హనుమాన్ జంక్షన్ రూరల్: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తాను పూర్తిగా తప్పుకున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వెళ్తూ ఆయన మంగళవారం మార్గమధ్యంలో బాపులపాడు మండలం బొమ్ములూరులోని ఓ రెస్టారెంట్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక కాపు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. రాజకీయాలకు, కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. -
ఆన్లైన్లో సినిమా టికెట్ల విధానం మంచిది
గోకవరం: సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించే విధానం మంచిదని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటులు కూడా ఇదే విధానం కోరుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు కోరిన విషయం ఎమ్మెల్యే రోజా, మరికొందరు ఇటీవల ప్రస్తావించారన్నారు. మాజీ ఎగ్జిబిటర్‌గా తాను ఈ విధానాన్నే సమర్థిస్తానన్నారు. చిత్ర నిర్మాణం కోసం హీరో, హీరోయిన్లు మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని ఆన్లైన్లో టికెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్లేలా చూస్తే బాగుంటుందని సూచించారు. దీనివల్ల దుబారా, ఎగవేతలు ఉండవన్నారు. ప్రతీ పైసా ఖర్చుకు పారదర్శకత ఉంటుందన్నారు. -
అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత: పేర్ని నాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. ఇక మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన బాబుకు తగిన శాస్తి జరిగిందని విమర్శించారు. అందరూ బాగుండాలి.. అందులో కాపులు ఉండాలి అనే సిద్ధాతంతో కొనసాగుతామని అన్నారు. -
రైల్వే కోర్టుకు ముద్రగడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు దహనం ఘటన కేసుకు సంబంధించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 41 మందికి కోర్టు సమన్లు జారీ చేయగా వారిలో ముగ్గురు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. ముద్రగడతోపాటు మరో 37 మంది రైల్వే కోర్టు న్యాయమూర్తి సురేష్ బాబు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 16కు విచారణ వాయిదా పడింది. -
రచ్చ చేయడం మానేయండి: ముద్రగడ
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ ఆయన వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.(చదవండి: ‘పంచాయతీ’: ఒట్టు.. ఇదీ లోగుట్టు!) అదే విధంగా అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నిమ్మగడ్డను నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నానని.. రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయాలే తప్ప రాజకీయ నాయకులలాగా పట్టుదలకు పోవడం మంచిగా లేదన్నారు. రచ్చ చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’ ) -
మా కార్యకర్తల ప్రమేయం లేదు
సాక్షి, అమరావతి/ప్రత్తిపాడు: రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటనల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఎంత మాత్రం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఆలయాలపై దాడుల ఘటనలకు సంబంధించి కొందరు బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందంటూ డీజీపీ ప్రకటించినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో పాటు టీవీలో స్క్రోలింగ్ వెలువడడాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. విగ్రహాలను దెబ్బతీసే పనిలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారనే తప్పుడు అభిప్రాయాన్ని ఈ ప్రకటనలు తెలియజేస్తున్నాయని.. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం, విగ్రహాలపై దాడుల ఘటనలు రెండు వేర్వేరు అంశాలుగా సోము వీర్రాజు పేర్కొన్నారు. దీనిపై డీజీపీ వివరణ ఇవ్వాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తామన్నారు. ముద్రగడతో సోము భేటీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో శనివారం భేటీ అయ్యారు. ముద్రగడ నివాసానికి చేరుకున్న సోము.. అరగంటకు పైగా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీతో కలిసి బీజేపీ ముందుకెళ్తున్న పరిస్థితుల పై వివరించినట్టు చెప్పారు. అలాగే సుదీర్ఘమైన అంశాలను ఉంచానని, వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారని సోము వీర్రాజు చెప్పారు. -
కాపు ఉద్యమాన్ని మీరే నడిపించండి
గోకవరం: కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని నివాసంలో ముద్రగడ పద్మనాభాన్ని సోమవారం కలిశారు. కాపు ఉద్యమాన్ని ఆయన సారథ్యంలోనే నడిపించాలని కోరారు. వారి అభ్యర్థనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించారు. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ తన నిర్ణయాన్ని లేఖ ద్వారా జేఏసీ నాయకులకు తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ముద్రగడే తమ నాయకుడని, ఆయన సారథ్యంలోనే కాపు ఉద్యమం కొనసాగుతుందని, సమయాన్ని బట్టి ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తోట రాజీవ్, ఎన్.వెంకట్రాయుడు తదితరులు ఉన్నారు. -
నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
-
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం విదితమే. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.’ అని ఆ లేఖలో తెలిపారు. (చదవండి: కాపు ఉద్యమానికి ఇక సెలవ్) -
తుని రైలు ఘటన: మరో 17 కేసులు ఉపసంహరణ
సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైలు ఘటనలో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు తెలిపారు. మొత్తం నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. -
కాపు ఉద్యమానికి ఇక సెలవ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. సోషల్ మీడియాలో తనపై పెడుతున్న పోస్టింగ్‌లకు కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి సోమవారం సుదీర్ఘ లేఖ రాశారు. ‘ఈ మధ్య పెద్దవారు చాలామంది మన సోదరులతో నేను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి కారణం.. చంద్రబాబే. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీ అమలు కోసం ఉద్యమ బాట పట్టాను. ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదు.’ అని లేఖలో పేర్కొన్నారు. -
కాపు ఉద్యమం నుంచి తప్పుకొంటా: ముద్రగడ
సాక్షి, విజయవాడ: టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవులు, డబ్బు కోసం తాను ఉద్యమం చేయలేదని.. కాపు జాతికి మంచి జరిగేలా ఎన్నో ప్రయత్నాలు చేశానని గుర్తు చేశారు. తనను విమర్శిస్తున్న వారు ముందుండి నడిచి.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు... ‘‘సోషల్ మీడియాలో నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదు. నేను ఉద్యమం చేయడానికి కారణం చంద్రబాబే. గతంలో ఆయన కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. నాపై విమర్శలు చేసేవాళ్లు డ్రైవర్ సీటులో కూర్చుని.. కాపులకు బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలి’’అని సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. -
కాపు రిజర్వేషన్లపై సీఎంకు ముద్రగడ లేఖ
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి.. ‘మీరు అడిగిన వారికి, అడగని వారికి ఇచ్చిన, ఇవ్వని హామీలను దానం చేసి దానకర్ణుడనిపించుకుంటున్నారు. మా కాపు జాతి చిరకాల కోరిక, పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ కోసం చేసిన పోరాటానికి మీ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. 01–02–2016న మీడియాకి మీరిచ్చిన ఇంటర్వ్యూలో మా జాతి కోరిక సమంజసమని చెప్పారు. అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు మా కోరికను దానం చేయడానికి మీకెందుకు చేతులు రావడం లేదు? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయిక్, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా పూజలందుకోవాలే కానీ, పదవి మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దు’ అని ముద్రగడ పేర్కొన్నారు. దయచేసి తమ జాతి రిజర్వేషన్ సమస్య తీర్చాలని ప్రధాని మోదీని కోరాలని సీఎం జగన్‌కు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా?
కిర్లంపూడి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా చంద్రబాబూ.. అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు. లేఖ ప్రతులను సోమవారం మీడియాకు విడుదల చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో మా జాతితో పాటు ఎన్నో జాతులవారిని లాఠీలతో కొట్టించి, బూట్లతో తన్నించి రాక్షస పాలన సాగించిందెవరు? ప్రత్యేక హోదా అంశంపై రోడ్డుమీదికి వస్తే కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త.. అంటూ విద్యార్థులను హెచ్చరించింది మీరేనన్న సంగతి మర్చిపోయారా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించడమే కాకుండా 14 రోజులు ఆస్పత్రిలో బంధించి కంటిమీద కునుకులేకుండా చేసింది మీరు కాదా.. అంటూ నిలదీశారు. భారత రాజ్యాంగానికి, చట్టానికి మీరు అతీతులనుకుంటున్నారా? పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరేనన్న సంగతి మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చట్టాలను గౌరవించడం లేదంటూ విమర్శించడానికి మీకు అర్హత ఉందా.. రాక్షస పాలన, బ్రిటీషు పాలనను మించిపోయి పరిపాలించింది మీరు కాదా చంద్రబాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మీ నుంచి విముక్తిపొంది అదృష్టవంతులయ్యారు.. మీకు శాశ్వతంగా సెలవు ఇచ్చారు.. దాన్ని స్వాగతించి విశ్రాంతి తీసుకోండి అంటూ హితవు పలికారు. -
‘చంద్రబాబూ! ఇక విశ్రాంతి తీసుకోండి’
-
‘చంద్రబాబూ! ఇక విశ్రాంతి తీసుకోండి’
సాక్షి, కాకినాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. అందులో చంద్రబాబు తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేయించింది మీరు కాదా?.. బ్రిటీష్ వారి పాలనలో చేయని విధంగా మీ పాలన సాగిందన్న సంగతి గుర్తు లేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో తనను, తన కుటుంబాన్ని దారుణంగా లాఠీలతో కొట్టించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో.. భవిష్యత్తు పాడవుతుందని విద్యార్థులను రోడ్ల మీదకు రానివ్వకుండా బెదిరించారన్నారు. ‘ప్రస్తుత ప్రభుత్వం చట్టాలను గౌరవించడం లేదంటున్నారు.. ఆ మాట పలకడానికి మీకు కనీస అర్హత ఉందా?’ అంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆ లేఖలో.. ‘ మీ సామాజిక వర్గం మహిళలపై దాడి జరిగితే ‘ఇదేనా ప్రజాస్వామ్యం’ అంటున్నారు. మరి నా భార్యా, కొడుకు, కోడలిపై దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా చంద్రబాబునాయుడు?. మాకు జరిగిన అవమానం గురించి లోకానికి చెప్పుకోకుండా అప్పట్లో మీడియాను కట్టడి చేయమని ఏ చట్టం చెప్పిందో సెలవిస్తారా? కాపు ఉద్యమాన్ని చూపించొద్దని మీ పాలనలో మీడియా సంస్థలను ఆదేశించారు. ఇవాళ మీరు చెప్పిందే చెప్పి మీ మీడియాను మీ సామాజిక వర్గం కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఆ మీడియాలో ఇతర కులాలకు వాటా లేదా? మీ వార్తలలాగే ఇతరుల వార్తలు చూపించమని ఎందుకు చెప్పలేకపోయారు. మీది సంసారం? ఇతరులది వ్యభిచారామా? మాజీ గారు. చందాలతో నేను ఉద్యమం చేస్తున్నానని అప్పటి మీ ఇంటెలిజెన్స్ ఏబీవీతో తప్పుడు ఆరోపణలు చేయించారు. రుజువులతో బహిరంగ పరచమని కోరితే మీకు దమ్ము, ధైర్యం లేక తోక ముడిచేవారు. అలాంటి అబద్దాలు చెప్పే నిప్పులాంటి మీరు ఇవాళ జోలి పట్టి అడుక్కోవడానికి సిగ్గు లేదా?. మీ రాక్షస పాలన నుండి ముందు తెలంగాణ.. తర్వాత ఏపీ ప్రజలు విముక్తి పొంది అదృష్టవంతులయ్యారు. మీ జీవితం అంతా ఆబద్దాలు ఆడడం, వెన్నుపోట్లు పొడవడం. పిల్లనిచ్చిన మామను చెప్పులతో కొట్టించి.. ఇప్పుడు చెప్పులు విడిచి మామ ఫొటోకు దండలు వేస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వారిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అందుకే మీకు శాశ్వతంగా సెలవిచ్చారు. ఆ తీర్పును స్వాగతించి విశ్రాంతి తీసుకోండ’ని అన్నారు. -
ఆంధ్రజ్యోతి చానెల్, పత్రిక చూడను: ముద్రగడ
సాక్షి, తూర్పు గోదావరి : ఇసుక విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను ఇచ్చిన సలహాను ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అసహనం వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖ గురించిన వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి గనుక మీ ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని.. ఇకపై ఆంధ్రజ్యోతి చానెల్‌ను గానీ, పత్రికను గానీ చూడదలచుకోలేదు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ లేఖ రాశారు. నేనేమీ మీలాగా అపర మేధావిని కాను.. ‘04-11-2019వ తేదీన ఇసుక విషయమై సలహా ఇస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసి పత్రికలకు విడుదల చేశాను. నేనేమి మీలాగ అపర మేధావిని కాను. రాష్ట్రంలో ఇసుక కోసం ప్రజలు పడుతున్న బాధలు చూసి ఇసుక పాలసీ పక్కాగా రూపొందించే వరకు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయండి అని లేఖలో రాసాను. ఆంధ్రజ్యోతిలో ఆ వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నాను. నేను లిఖిత పూర్వకంగా ఇచ్చిన సలహాను రాష్ట్రంలోనే కాదు. దేశంలో ఉన్న గౌరవ మేధావులను తప్పు అని చెప్పమనండి బేషరతుగా క్షమాపణ చెబుతాను. నా సలహాను ఎందుకు పత్రికలో రాయకూడదని, రాయొద్దని హుకుం జారీ చేసారు. ప్రభుత్వాల వల్లన నష్టం జరిగినప్పుడు లొల్లి పెట్టడానికి ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా మీకు ఉన్నాయి. మీ స్వేచ్చకు సంకెళ్లు వేయకూడదు. మాలాంటి వారికి అలాంటివి జరిగినప్పుడు మా బాధను ఎక్కడ చెప్పుకున్నా న్యాయం జరగదు. మీ చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి కనుక మీ ఇష్టం. దయచేసి ఇక నుండి నా వార్తలు మీ ప్రింటు, ఎలక్ట్రానిక్ చానెల్లో చూపకండి. ఇక నుంచి మీ చానెల్ గాని, మీ పత్రిక గాని చూడదల్చుకోలేదు’ అని ఏబీఎన్ రాధాకృష్ణకు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. -
‘కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు నటన’
సాక్షి, కిర్లంపూడి: చంద్రబాబు, కోడెల అంతిమ యాత్రలో బాగానే నటించారు.. కానీ ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే.. యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేదా మౌనంగా ఉంటారు.. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ నటన అంతా రాజకీయ లబ్ది కోసం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని.. మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది.. అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్ ఇవ్వడం.. అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని కోడెల చంద్రబాబును ప్రశ్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు.. కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అన్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ ధ్వజమెత్తారు. తమ జాతి ఉద్యమానికి.. తమపై అక్రమ కేసులు పెట్టించి.. ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెబుతూ.. ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ ప్రశ్నించారు. -
చంద్రబాబుకు ముద్రగడ లేఖ
సాక్షి, తూర్పు గోదావరి : కాపు రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో తమ జాతికి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ బిల్లు పంపారని, బీసీల ప్రాతిపదికగా ఇస్తున్న ప్రయోజనాలు తమకు వర్తిసాయా అని ఆ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. 2017లో తీర్మానం చేస్తూ.. కేంద్రానికి పంపిన బీసీ-ఎఫ్ అమలు చేస్తారా? లేక 2019 ఈబీసీ బిల్లు అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు. 2019 బిల్లు మీరు ఇచ్చిందా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిందా చెప్పాలంటూ ప్రశ్నించారు. అసలు కాపులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం ఉందా అని మండిపడ్డారు. రిజర్వేషన్ తరగతులకు అందే ప్రయోజనాలు తమ జాతికి అందేంతవరకు తన ఉద్యమం ఆగదని అన్నారు. -
సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
-
చంద్రబాబుకు ముద్రగడ లేఖ
కాకినాడ: మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో ‘చలో కత్తిపూడి సమావేశం’ నిర్వహించడానికి తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్న నేపథ్యంలో ముద్రగడ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తూనే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఇందులో చంద్రబాబుకు అనేక ప్రశ్నలను సంధించారు ముద్రగడ. ‘గత మూడేళ్లుగా తమ జాతి కోసం జరిగిన ఉద్యమం గురించి ఈనెల 31వ తేదీన కత్తిపూడిలో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి సమాయత్తమయ్యాం. మరి ఆ కలయిక గురించి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదు. అన్ని పార్టీల పెద్ద నాయకులు నిత్యం రోడ్డుకు అడ్డంగా ఎన్నో సభలు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ధర్మపోరాట దీక్షల వంకతో విజయవాడలాంటి అతి పెద్దపట్టణం నాలుగు రోడ్ల జంక్షన్లో ట్రాఫిక్ మళ్లించి రోడ్డుకు అడ్డంగా కుర్చీలు వేసి ఉపన్యాసాలు చెప్పారు. అలాగే తొందరలో మీరు ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చెబుతున్నారే. మీరు బస్సు యాత్ర పేరుతో ఏ జిల్లాకైనా బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేస్తున్నారే. మీ అందరికీ ఒక రాజ్యాంగం.. మాకు మరొక రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారూ’ అని ముద్రగడ ప్రశ్నించారు. ఇక్కడ చదవండి: ‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’ -
‘అనుమతి తీసుకోకుంటే కఠిన చర్యలు’
-
‘ఛలో కత్తిపూడి సభకు అనుమతి తీసుకోలేదు’
సాక్షి, కిర్లంపూడి : పోలీసు శాఖ అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘ఛలో కత్తిపూడి’ సభకు తమ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ యాత్రలతో పాటు రాజమండ్రి బీసీ సభ ఇలా అన్నీ కూడా పోలీసుల అనుమతితోనే జరిగాయని తెలిపారు. ఛలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని.. అనుమతి లేని సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు. ఛలో కత్తిపూడి సభకు ముద్రగడ పిలుపు ఇవ్వడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఇందులో భాగంగా ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో గత రెండు రోజుల నుండి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించారు. -
కిర్లంపూడిలో భారీ పోలీసు బందోబస్తు
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో నిర్వహించ తలపట్టిన ‘చలో కత్తిపూడి జేఏసి సమావేశం’ను దృష్టిలో ఉంచుకొని కిర్లంపూడిలో భారీ పోలీస్ బందోబస్తు చేస్తున్నారు. గతంలో జరిగిన తుని సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముద్రగడ చేపట్టిన కత్తిపూడి సమావేశాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామానికి చేరుకుంటున్న పోలీసు బలగాలను చూస్తుంటే ఏ క్షణంలోనైనా ముద్రగడను గృహనిర్బంధం చేయవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి పెద్దాపురం డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది కిర్లంపూడి చేరుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ రామారావు, జగ్గంపేట, తుని టౌన్ సీఐలు వై.రాంబాబు, వి.శ్రీనివాస్, స్థానిక ఎస్సై డి.నరేష్‌తో పాటు ఎస్సైలు పార్థసారథి, రామకృష్ణ, పోలీసులు కిర్లంపూడిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి భారీ సంఖ్యలో పోలీసులు కిర్లంపూడి చేరుకుంటారని సమాచారం. ముద్రగడ పద్మనాభం ఇంటి బయట ఉన్న గేటు వద్ద శనివారం సాయంత్రం నుంచి ఎస్సై స్థాయి అధికారితో పాటు 10మంది పోలీసు సిబ్బంది మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. ముద్రగడ ఇంటి గేటు ఎదుట ఆర్అండ్బీ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి శనివారం సాయంత్రం మూడు సీసీ కెమెరాలను అమర్చారు. స్థానిక సత్యదేవా కల్యాణమండపంలో టెంట్లను వేశారు. మళ్లీ పోలీసు బలగాలు కిర్లంపూడి రావడంతో ఏక్షణాన ఏంజరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాపు నాయకుల అరెస్టు కొత్తపల్లి (పిఠాపురం): తమను వ్యతిరేకించే కాపునాయకులను ఎలాగైనా లొంగదీసుకోవాలని అధికారపార్టీ కుయుక్తులు పన్నుతోంది. అధికార దండంతో వారిని బెదిరిస్తోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో నిర్వహించనున్న కాపు మహాసభను అడ్డుకునే చర్యల్లో భాగంగా గొల్లప్రోలు మండలంలోని పలువురు నాయకులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని కొత్తపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అరెస్టు అయిన వారిలో మొగలి అయ్యారావు, ఎస్.సత్యనారాయణరాజు, డి.వెంకటేష్ ఉన్నారు. స్థానిక కాపునాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మారిశెట్టి శ్రీను, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జీలకర్ర సత్తిబాబు వారిని పోలీసు స్టేషన్లో కలసి సంఘీభావం తెలిపారు. అయ్యారావు మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేసినంత మాత్రాన ఈ సభ ఆగదన్నారు. పని ఉంది రమ్మని చెప్పిన పోలీసులు అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
ముద్రగడను కలిసిన మోహన్‌బాబు
-
ఆయన్ని పిలవకపోవడం సరికాదు: మోహన్‌బాబు
సాక్షి, పాలకొల్లు: దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్‌బాబు తప్పుబట్టారు. ఆయనను పిలవకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ముద్రగడను మోహన్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. ‘అనుకున్నది సాధించాలన్న పట్టుదల గల వ్యక్తి ముద్రగడ. తనను నమ్ముకున్నవారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమ’ని మోహన్‌బాబు అన్నారు. శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఇందులో మోహన్‌బాబుతో పాటు మురళీమోహన్, శ్రీకాంత్, శివాజీరాజా, కవిత, హేమ, ప్రభ, సి. కళ్యాణ్, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి, చోటా కె నాయుడు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దాసరి బయోపిక్ తీస్తే సహకరిస్తా దర్శకరత్న, తన గురువు దాసరి నారాయణరావు బయోపిక్‌ను ఎవరైనా తెరకెక్కిస్తే పూర్తిగా సహకరిస్తానని మోహన్‌బాబు అంతకుముందు చెప్పారు. దాసరి జీవితచరిత్రను సినిమా తీసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరైనా ముందుకు వస్తే తాను పూర్తిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. సినీ జగత్తులో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తనలాంది వందల మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత దాసరికే చెందుతుందన్నారు. -
ప్రజల కష్టాన్ని తగలబెట్టింది చంద్రబాబు కాదా?
సాక్షి, కాకినాడ : తెలంగాణలో ప్రజలు తరిమికొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చేస్తారని భయంతో చంద్రబాబును ఎదురు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కాపురిజర్వేషన్ పోరాటసమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలు పొగొట్టుకున్న రిజర్వేషన్లు తిరిగి రావాలంటే తనపాలన రావాలని చంద్రబాబు గత ఎన్నిక సమయంలో ఉపన్యాసాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని అమలు చేయాలని అడిగితే అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరాఠీలకు ఇచ్చినహామీ చూసైనా నేర్చుకోవాలన్నారు. 'రాష్ట్ర ఆదాయాన్ని, వనరులను దోచుకున్నది మీరు కాదా? ప్రజల కష్టాన్ని మీ సొంత ఖర్చులకు, విహారయాత్రలకు తగలబెట్టింది మీరు కాదా? మీ జీవితంలో ఒక్కసారైనా నిజం మాట్లాడి ఉంటే దయ చేసి చెప్పండి' అంటూ చంద్రబాబు నాయుడుపై ముద్రగడ నిప్పులు చెరిగారు. రాష్ట్ర సంక్షేమం కోరేవారైతే హోదా కోసం మీరు, మీ కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీకు అండగా అందరం ఉంటాం అని లేఖ రాస్తే నోరు విప్పలేదని తూర్పారబట్టారు. 'ఏం ఘనకార్యం చేశారని మీకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి. అసలు గజదొంగ మీరా లేక ఇతర పార్టీ నాయకులా? అమాయక ప్రజలకు హామీలు కురిపించి మరోసారి అధికార దాహం తీర్చుకోవడం కోసం ఈ తహతహ కాదా? ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ముందు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్, రేపు మళ్లీ బీజేపీ అధికారంలోకొస్తే వారికి జై కొట్టడం అలవాటుగా మారిపోయింది. మీ ఆరాటం చూస్తుంటే మీ కుటుంబ ఆస్తి కాపాడుకోవడం కోసం, అధికారం కావాలి అన్నది నగ్న సత్యం కాదా?' అని చంద్రబాబుపై ముద్రగడ ధ్వజమెత్తారు. -
బాబుకు తెలంగాణ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు
కిర్లంపూడి(జగ్గంపేట): ‘‘సీఎం చంద్రబాబు ఒక గజదొంగ. రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నాడు. అది చాలక తెలంగాణలో ఉన్న వనరులను, ఆస్తులను కబళించి కబ్జా చేయాలని మహాకూటమి పేరుతో ఆ రాష్ట్రంలో వేలు పెట్టాడు. చంద్రబాబును కోలుకోలేని దెబ్బకొట్టి వెనక్కు పంపించిన తెలంగాణ ప్రజల చైతన్యానికిదే నా నమస్కారాలు’’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో జేఏసీ నాయకులతో కలసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. లగడపాటితో గరుడ పురాణం చెప్పించి ప్రజల ఆస్తులను పందేల రూపంలో తగలేయించిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని ఆ దేవుడే కాపాడారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అప్పుడే రాష్ట్రానికి దరిద్రం వదిలిపోతుందని అన్నారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రానిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడన్నారు. తమ జాతికిచ్చిన హామీపై ప్రతిసారీ రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదంటూ వంకలు చెప్పడం మంచిది కాదన్నారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు చట్టాలు, రూల్స్ వంటివి గుర్తుకొస్తాయి కానీ.. మీ కుమారుడి విషయంలో అవి ఎందుకు వర్తించవని నిలదీశారు. ఇలాంటి గజదొంగ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నారు. ఈనెల 23న 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులతో సమావేశమై వారి సలహాలు, సూచనల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తుమ్మలపల్లి రమేష్, జీవీ రమణ, గౌతుస్వామి, శ్రీరామ్ పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారు
-
‘టీడీపీ గోవిందా.. గోవిందా..’
సాక్షి, కాకినాడ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు కూటమి రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. కూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయడం ప్రజలెవరూ ఆమోదించలేదు. టీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లోకి కూడా ‘కూటమి’ చేరలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పాలన గాలికొదిలేసి బాబు పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడమేంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని కాపు ఉద్యమనేత మద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణలో టీడీపీ ఓటమిపై ఆయన స్పందిస్తూ.. టీడీపీ పని గోవిందా గోవిందా అంటూ కాపు నేతలతో కలిసి నినాదాలు చేశారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్‌కు నా అభినందనలు. ఓ గజ దొంగను అధికారంలో పాలుపంచుకోనివ్వకుండా కొలుకోలేని దెబ్బ కొట్టిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఎందరో త్యాగాల ఫలంతో రాష్ట్రం సాధించుకున్నారు. అటువంటి తెలంగాణలో వేలు పెట్టడం ఎంతవరకు సమాంజసమో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏపీలో ఉన్న వనరులు సరిపోక తెలంగాణలో ఉన్న వనరులపై కన్నేసిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పారు’అని వ్యాఖ్యానించారు. -
నాడు వైఎస్ఆర్.. నేడు జగన్
-
వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారు
-
‘కాపు రిజర్వేషన్లకు బాబు వ్యతిరేకి’
-
వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
సాక్షి, హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ది పొందాలని కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మాత్రమే తమ అధినేత వైఎస్ జగన్ చెప్పారని, కాపురిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని, కాపు రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తునే ఉంటామన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు బాధాకరమని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. 6 నెలల్లో బీసీ కమిషన్ వేసి కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, మరి ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఈ రోజు వరకు కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పెండింగ్‌లో ఉందన్నారు. ముద్రగడ ఉద్యమం తర్వాతే చంద్రబాబుకు కాపులు గుర్తొచ్చారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ వేసి రిపోర్ట్‌ను పరిశీలంచకుండా హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. కాపురిజర్వేషన్లపై బీసీ కమిషన్ ఛైర్మన్ నివేదిక ఇవ్వలేదని, విడివిడిగా నివేదికలు ఇచ్చే అధికారం ఎవ్వరికి లేదని ఛైర్మనే చెప్పారని అంబటి గుర్తుచేశారు. ఈ అంశంపై కేవలం ముగ్గురు సభ్యులు ఇచ్చిన రిపోర్టునే కేంద్రానికి పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న నిధులనే కాపులకు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే తలుపులు పగలగొట్టి ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు కొట్టుకుంటు లాక్కెళ్లారని, ఆ సమయంలో ఆయనకు అండగా నిలబడిన వ్యక్తి వైఎస్ జగనే అని గుర్తుచేశారు. తుని ఘటనలో ముద్రగడ, బొత్స సత్యనారయణ, భూమన కరుణాకర్ రెడ్డి, తనపై కేసులు పెట్టారని, కాపు రిజర్వేషన్ల కోసం దివంగత నేత దాసరి నారాయణ రావు నేతృత్వంలో తమంతా పోరాడామన్నారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైఎస్సార్సీపీనే అని, ఈ అంశం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. -
‘కాపు రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకం’
సాక్షి, విజయవాడ: కాపు రిజర్వేషన్లపై మాట తప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట తప్పారని మండిపడ్డారు. బీసీ నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడుల చేయించారని ధ్వజమెత్తారు. కేవలం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్నారు. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే బాబు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఉద్యమం చేసిన కాపులను, ముద్రగడ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. తుని ఘటనలో కాపులపై టీడీపీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసుల పెట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌పై చంద్రబాబు నాలుగున్నర ఏళ్లుగా కాలయాపన చేశారన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రయత్నిస్తోందని కన్నా తెలిపారు. రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రానికి పంపి బాబు చేతుల దులుపుకోవాలనుకున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సిగ్గుందా? కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని టీడీపీ వర్గానికి చెందిన ఓ మీడియా రాయడం సరైనది కాదని కన్నా లక్ష్మీనారయణ పేర్కొన్నారు. రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒంగోలు వెళ్లి ధర్మ పోరాట దీక్ష పెట్టడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం అవినీతి చేయడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హోదాపై అనేక సార్లు మాట మార్చిన బాబుకు పరిపక్వత లేదని ఎద్దేవ చేశారు. రాష్ట్ర అభివృద్దిపై చర్చ చేయడానికి మోడీ అవసరం లేదని.. చంద్రబాబు స్థాయికి తాను సరిపోతానని కన్నా పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. హిందుత్వంపై చంద్రబాబు దాడికి దిగుతున్నారని అందుకే శివస్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారిన మండిపడ్డారు. -
‘నాడు వైఎస్ఆర్.. నేడు జగన్’
గుంటూరు : కాపు రిజర్వేషన్లను వైఎస్సార్సీపీ వ్యతిరేకించట్లేదని, ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మాత్రమే జగన్ చెప్పారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాల్ పురం రాముతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ మాత్రమే కాపులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను టీడీపీ ప్రభుత్వం గృహ నిర్భదం చేసినప్పుడు, వారి కుటుంబ సభ్యులకు జగన్ అండగా నిలిచిన విషయం ముద్రగడ మర్చిపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే కాపులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముద్రగడ వెనుకున్న టీడీపీ నేతలు ఆయనతో అలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. -
చంద్రబాబు దగా చేశారు...
-
రాజకీయ స్వార్థం కోసం జగన్ వ్యాఖ్యల వక్రీకరణ
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, మరికొందరు నేతలు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇతర నేతలతో కలసి ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు సంబంధించి అక్కడ ఎదురైన సందర్భాన్ని పక్కనపెట్టి కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమనే ధోరణిలో వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టుకుని కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరి చెప్పాలని కోరిన సందర్భంలో జగన్ అనేక వాస్తవ విషయాలను తన ప్రసంగంలో వివరించారని ఆయన తెలిపారు. చంద్రబాబు దగా చేశారు... రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని జగన్ విశదీకరించారన్నారు. ఈ వాస్తవం తెలిసినా టీడీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇచ్చేస్తానంటూ కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. న్యాయపరమైన అడ్డంకుల్లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచేలా చూడాల్సిన చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. కేంద్రంలో మంత్రి పదవులు పంచుకుని అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు సర్కారు ఆరోజే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఉంటే.. కర్ణాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా ఇక్కడ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ చంద్రబాబులా గాలి మాటలు తాను చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారన్నారు. కాపులను మభ్యపెట్టే క్రమంలో మంజునాథన్ కమిషన్ వేసి దాని నివేదిక పూర్తికాకుండా, చైర్పర్సన్ సంతకం కూడా లేకుండా ఓ నివేదికను కేంద్రానికి పంపి చంద్రబాబు చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించలేకపోగా, వాస్తవాలను మాట్లాడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై మాత్రం అర్థంలేని విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా చంద్రబాబు ఒక్కసారైనా కాపు రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ అడగలేకపోయారని కన్నబాబు విమర్శించారు. ఢిల్లీ పర్యటనల్లో పోలవరం ప్రాజెక్టు పనులను సొంత మనుషులకు కట్టబెట్టుకోవడం, లాలూచీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారే తప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బాబు తప్పు కనిపించట్లేదు కానీ.. జగన్ మాటల్ని వక్రీకరిస్తారా? కాపు రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తమ పార్టీ చెప్పిన మాటలకు ఎప్పటికీ కట్టుబడే ఉంటుందని కన్నబాబు తెలిపారు. కాపుల ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో రూ.ఐదువేల కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని ఆయన గుర్తు చేస్తూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తామని చెప్పిన జగన్ మాటల్లోని చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయకపోయినా ప్రశ్నించకపోవడం, ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్‌కల్యాణ్ స్పందించకపోయినా మాట్లాడని నేతలు, జగన్ వ్యాఖ్యలను వక్రీకరించడంలో మాత్రం ముందుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని అభ్యర్థినని మోదీ, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న తనను మళ్లీ గెలిపించాలని చంద్రబాబు కోరితే తప్పుగా కనిపించట్లేదని, తమకు అధికారమిస్తే ప్రజలకు మంచి చేస్తానన్న జగన్ మాటలను మాత్రం అడుగడుగునా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ హామీలు అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కన్నబాబు మండిపడ్డారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్‌పైనా, గృహ నిర్మాణాల పథకాలపైనా ఇలాంటి విమర్శలే చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆచరణలో వాటిని వైఎస్ అమలు చేసి చూపించారన్నారు. దేశవ్యాప్తంగా 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, ఒక్క ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ 48 లక్షల ఇళ్లను నిర్మించారని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు హయత్ హోటళ్లకు, విదేశీ, స్వదేశీ పర్యటనల్లో వాడే విమాన చార్జీలకు చేసే దుబారాను తగ్గించుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసినా జగన్ వ్యాఖ్యల్లోని సారాంశాన్ని కాపు కులస్తులు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడపై రాజా ఫైర్.. తన కుటుంబంపై జగన్ చూపించిన ప్రేమలో మొసలికన్నీరు కనిపిస్తుందంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదుగానూ కనిపిస్తున్నాయా? అని నిలదీశారు. ముద్రగడ ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో తన ఉనికిని కాపాడుకునేందుకు తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. జగన్‌పై యనమల చేస్తోన్న వ్యాఖ్యలపైనా రాజా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు 50సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందంటూ యనమల మాట్లాడారని, వాస్తవానికి 101సార్లు రాజ్యాంగ సవరణ జరిగిన విషయం కూడా ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లపై న్యాయం జరుగుతుందన్న యనమల వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ నాలుగేళ్లుగా ఏ గుడ్డిగాడిదకు పళ్లు తోముతున్నావని నిలదీశారు. కాపుల్లో జగన్‌పై విశ్వాసం: జక్కంపూడి జగన్ వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కాపు సామాజికవర్గంలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మాట ఇస్తే కట్టుబడే వ్యక్తిత్వం, నమ్ముకున్నవారికి న్యాయం చేసే తత్వం జగన్‌కు ఉందన్నారు. చంద్రబాబు రెండునాల్కల ధోరణితో ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ముద్రగడ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. గతంలో ఉద్యమ సమయంలో జగన్ అనుమతితోనే తామంతా ముద్రగడ వెంట నడిచిన విషయాన్ని మరువరాదన్నారు. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా గోదావరి వంతెనపై అశేష జనవాహినితో కనిపించిన స్పందనకు బాబు పునాదులే కదిలాయని, అందుకే జగన్ మాట్లాడే ప్రతిమాటను వక్రీకరిస్తూ తమకు అనువుగా మలుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు కోఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావు నాయుడు, పర్వత ప్రసాద్, మాజీమంత్రి కొప్పన మోహనరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పని అయిపోయిందని తప్పుకోవద్దు : ముద్రగడ
సాక్షి, కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కాపులకు తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ చంద్రబాబుకు శనివారం లేఖ రాశారాయన. లేఖలో.. గవర్నర్ ఆమోదంతో బీసీ రిజర్వేషన్లు అమలు చేయోచ్చని మేథావులు, న్యాయవాదులు సలహా ఇస్తున్నారని పేర్కొన్నారు. బిల్లు కేంద్రానికి పంపేశాను.. నా పని అయిపోయిందని తప్పుకోవద్దని సూచించారు. చంద్రబాబు ఆలోచన బస్సు, రైలు వెళ్లిపోయాక స్టేషన్‌కు వచ్చినట్లుందని ఎద్దేవాచేశారు. అలా ఆలోచించకూడదని ముద్రగడ పద్మనాభం అన్నారు. -
చంద్రబాబును ఓడించడమే మా లక్ష్యం
-
‘చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. అంతేకాక 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ముద్రగడ స్పష్టం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వంగవీటి రంగా హత్య తర్వాత టీడీపీని కాపులు ఓడించిన విషయాన్ని ముద్రగడ గుర్తు చేశారు. అంతకన్నా ఘోరంగా చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు ప్రస్తుతం కాపులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. 13 జిల్లాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి పవన్ కల్యాణ్‌తో కూడా చర్చిస్తామని, మోసం, దగా చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తామని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. -
కాపులను చంద్రబాబు తిడుతున్నారు : ముద్రగడ
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తున్నారని, రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో పాటు తమను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారని, అందులో సరైన సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపడం నిజం కాదా అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో తగాదా వచ్చాక మా బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాజస్తాన్, గుజరాత్, హరియాణా తరహాలో కాకుండా గతంలో ఉన్న రిజర్వేషన్లనే కాపులు అడుగుతున్నారని ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత గుర్తుచేశారు. ‘1910వ సంవత్సరం (బ్రిటీష్ కాలం) నుంచి మా జాతికి రిజర్వేషన్ ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య హయాంలోనూ రిజర్వేషన్ ఉంది. కానీ బీసీలుగా ఉద్యోగాలు పొంది, ఓసీలుగా కాపులు పదవీ విరమణ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తుగా ఓడించాలి. 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు మా రిజర్వేషన్లపై సృష్టత ఎవరు యిస్తారో, అప్పుడు మా కాపు జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని’ ముద్రగడ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు.. చంద్రబాబు సొంత ఆస్తులైనట్టు!
సాక్షి, కాకినాడ : ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ఆస్తులుగా భావించి.. సింగపూర్ కంపెనీలకు దానం చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. రైతు జీవితంలో నిత్యం కష్టాలే ఉంటాయని, రైతుల పట్ల సానుభూతి చూపాల్సిన ప్రభుత్వమే వారిని కష్టాలపాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం అన్ని పార్టీల నేతలతో ఒకే వేదికపైకి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ సమావేశం ఏర్పాటు చేయాలని ముద్రగడ కోరారు. రాష్ట్రాన్ని సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని ముద్రగడ అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలకు ముద్రగడ సోమవారం ఒక లేఖ రాశారు. ‘చంద్రబాబు తన తండ్రి, తాతల ఆస్తులు అయినట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నారు. ఈ విధంగా ఈ భూములను ధారాదత్తం చేసిన జూన్ 7ను చరిత్రలో చీకటి రోజుగా భావించాలి. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రిటీష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో.. అదేవిధంగా సింగపూర్ కంపెనీని తరిమి కొట్టాలి’ అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. వామపక్షలను కలుపుకుని పోరాటం చేస్తే.. అందులో పాల్గొనేందుకు.. తనలాంటి వాళ్లు ఎందరో సిధ్ధంగా ఉన్నారని, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఈ విషయమై చర్చించాలని పేర్కొన్నారు. -
అవసరానికి వాడుకుని వదిలేయడం బాబు నైజం
-
మోత్కుపల్లిని కలిసిన ముద్రగడ
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మాటల తూటాలు పేల్చన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం మోత్కుపల్లిని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన ఇంట్లో కలిసి తాజా పరిణామాలపై మంతనాలు జరిపారు. టీడీపీకి 35 ఏళ్లు సేవచేసిన మోత్కుపల్లి పట్ల పార్టీ వ్యవహరించిన తీరును ముద్రగడ తప్పుబట్టారు. అవసరానికి వాడుకొని వదిలేయడం బాబు నైజమని ముద్రగడ దుయ్యబట్టారు. మోత్కుపల్లి పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ముద్రగడ అన్నారు. అదేవిధంగా ఏపీలో కాపు ఉద్యమం, బాబు దుర్మార్గపు పాలన తమ పోరాటానికి మద్దతు కావాలని మోత్కుపల్లిని కోరారు. దీనికి ఏపీలో ప్రభుత్వంపై పోరాటాలకు తన మద్దతు ఉంటుందని మోత్కుపల్లి అన్నారు. -
పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. చెప్పులేయించావ్
కిర్లంపూడి (జగ్గంపేట): ‘నీకు పిల్లనిచ్చి వివాహం జరిపించిన ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించావ్. ఇప్పుడేమో ఓట్ల కోసం చెప్పులు విడిచి ఆయన విగ్రహానికి ఒంగి ఒంగి దొంగ నమస్కారాలు పెడుతున్నావ్’ అంటూ సీఎం చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. హామీలను నెరవేర్చాలని అడిగితే.. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్యాకేజీ వస్తోందంటూ నాలుగేళ్లుగా డప్పు కొట్టి.. ఇప్పుడేమో హఠాత్తుగా ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. గతంలో బీజేపీతో కాపురం పెద్ద తప్పిదమన్న చంద్రబాబు.. మళ్లీ వాళ్ల కాళ్లు పట్టుకొని నాలుగేళ్ల పాటు కాపురం చేసి అందినకాడికి దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎప్పటికప్పుడు యూ టర్న్‌లు తీసుకుంటూ.. తనను కాపాడాలని ప్రజల్ని వేడుకోవడం కూడా చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఈమధ్య చంద్రబాబు ఎడాపెడా నీతులు వల్లె వేస్తున్నారని.. మరి కాపు జాతిపై పెట్టిన తప్పుడు కేసుల మాట ఏమిటని ప్రశ్నించారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. -
చంద్రబాబుకు ముద్రగడ లేఖాస్త్రం