
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు.
ఇక మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన బాబుకు తగిన శాస్తి జరిగిందని విమర్శించారు. అందరూ బాగుండాలి.. అందులో కాపులు ఉండాలి అనే సిద్ధాతంతో కొనసాగుతామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment