Perni Nani
-
5 ఎకరాల్లో ఇల్లు ఇంటి ముందు అసెంబ్లీ, వెనుక హైకోర్టు
-
బాబు బినామీలకు ‘ప్రైమ్ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్ బెల్ట్‌గా మార్చేశారన్నారు.కోర్ క్యాపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..‘సీఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు. రెండో విడత పూలింగ్‌కు వ్యతిరేకం..‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. -
మీరు ఆచరించి ప్రజలకు చెప్పండి.. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగకుండా..
-
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్‌ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్‌కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్‌ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు
-
హైదరాబాద్ ఆస్తులు అమ్మిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలు వదులుతాడా?: పేర్ని నాని
-
ఇలాంటి వాడిని అల్లుడు ఎలా చేసుకున్నావయ్యా.. చేతకానోడు ముఖ్యమంత్రి అయ్యాడు!
-
ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
-
TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్
-
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ధ్వజం
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ తరపున హామీ ఇస్తున్నాం.ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్సీపీ పాలనే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు. -
నీ అనుభవం ఎందుకూ పనికిరాదు, నీ కొడుకేమో కనబడట్లేదు..
-
పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్
-
ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు
-
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..
-
జనసేన నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఎంపీ బాలశౌరికి పేర్ని నాని కౌంటర్
-
మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..
-
టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు
-
వెంట్రుక కూడా పీకలేవు .. నీకు ఇక మంగళమే, బాబుకు పేర్ని నాని వార్నింగ్
-
బాబు, లోకేష్.. పర్యవసానాలు అనుభవిస్తారు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: టీడీపీ వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు.. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గరున్న వారిని భయపెట్టాలనుకుంటున్నారా?.. లోకేష్ ఒక్కడికే విద్య తెలుసు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశారని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా నేరాలు చేశాడా?. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు.సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళతారా. చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు?. మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని ఓ 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు?. జైలు నుంచి బయటకి వచ్చాక జగన్ దగ్గర పనిచేయకుండా ఆపగలరా?. ఒకవేళ శ్రీహరి తప్పు చేస్తే అందరి ముందు అరెస్ట్ చేయండి. అలా కాకుండా దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి.. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సీజ్ చేయడం దేనికి?. ఎవరిని భయపెడదామనుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పోకడగలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరికాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే పర్యవసనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఏమైపోతారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు. మీ కేసులు అరెస్టులు జగన్ వెంట జెండా మోయకుండా ఆపలేరు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. తప్పుడు పనులు మానుకోవాలని లోకేష్ సూచిస్తున్నాం’ అని హితవు పలికారు. -
ఎవడు తుగ్లకో.. చెప్తా విను.. జయప్రకాశ్ నారాయణకు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
-
రాజధానిలో మచిలీపట్నం ఉందా? ఉంటే అక్కడ ఏం కడుతున్నారు?
-
ఇదిగో ప్రూఫ్.... బాబుని పచ్చి బూతులు తిట్టిన టీడీపీ జనసేన బిజేపీ నేతలు
-
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్‌పై చర్చ జరగకుండా జగన్‌ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్‌లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్‌లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్‌ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్‌లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్‌ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్‌కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్‌లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్‌లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
అమరావతి మోయలేని గుదిబండగా మారింది: పేర్ని నాని
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అత్యాశ వల్ల అమరావతి మోయలేని గుదిబండగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం (ఏప్రిల్ 13) పేర్నినాని తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.‘మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటి? బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. చంద్రబాబు అంతులేని అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మావిగన్ అనే ప్రతిపాదనతో రాజధాని తక్కువ ఖర్చుతో నిర్మితమవుతుంది. ప్రజలు అమాయకులేం కాదు.. అన్నీ ఆలోచిస్తారు. చంద్రబాబుకు విశ్వాసం లేదని ఎన్టీఆర్ విమర్శించారు. 224 మంది ఎమ్మెల్యేలను కాసులతో కొనుక్కున్నారని ఎన్టీఆర్ అన్నారు. వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీఆరే అన్నారు. కేబినెట్లో ఉన్న తొమ్మిది మంది మంత్రులే చంద్రబాబును తిట్టని తిట్టు తిట్టారురాజధానికి అప్పులు చేసి ఏం ఏస్తారు? అప్పులతో 7 కోట్ల ప్రజలను తాకట్టు పెడుతున్నారు. రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామని జబ్బలు చరుకుంటున్నారు. ఇప్పటివరకు మీరు మా ప్రాంతానికి చేసిందేంటి?’ అని పేర్ని నాని అన్నారు.అమరావతి వలన కలిగే ప్రయోజనం ఏంటో? మావిగన్ వలన కలిగే నష్టం ఏంటో చంద్రబాబు చెప్పటం లేదని పేర్ని నాని అన్నారు. ‘మావిగన్ ప్రకటనకు 48 గంటల్లోనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మావిగన్‌కు అడవిలో ఉండే గిరిజనులు సైతం మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయకూడదు. మావిగన్ పై జనంలో మంచి రెస్పాన్స్ రాగానే బొత్స, ధర్మానపై కూటమి నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబు వాడుకుని వదిలేసేరకం అని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో అన్నారు. మళ్లీ వచ్చి ఏం చేస్తావ్? అని పవన్ కల్యాణ్ విమర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకాలే రాశారు. కాంట్రాక్టర్లను రాత్రి సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడని చంద్రబాబుకు టార్చ్‌లైట్ మంత్రి అనే పేరుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు చూపిస్తాం. టీటీపీ నేతలు వీటిని కూడా ప్రెస్‌మీట్ లో చూపించగలరా? చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలకు చూపించే టైం వస్తుంది. అమరావతి, మావిగన్ లలో దేనికి సత్తా ఉందో ప్రజలకు ఎందుకు చెప్పటం లేదు? మావిగన్ ప్రాంతం సీఆర్డీఏ పరిధిలోనే ఉందని చంద్రబాబు అంటున్నారు. పామర్రు వరకు సీఆర్డీఏ లో మరి మాస్టర్ ప్లాన్ ఎందుకు లేదు? జగన్ మావిగన్ అనగానే ఇప్పుడు సర్వే సంస్థలను కొన్ని గ్రామాలకు ఎందుకు పంపారు? అమరావతిలో రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామన్న ప్రభుత్వం మా ప్రాంతంలో ఏం అభివృద్ధి చేస్తున్నారు? మేము కూడా రాజధానిలోనే ఉంటే మరి మావైపు ఎందుకు అభివృద్ధి చేయటం లేదు? మావైపు ఒక్క టవర్ కూడా ఎందుకు కట్టలేదు? జడ్జీల బంగ్లాలు, అసెంబ్లీ, ఇతర బిల్డింగులు మా ఏరియాలో ఎందుకు కట్టటం లేదు? అసలు అమరావతిలో నిర్మించే భవనాలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. బేసిక్ నిర్మాణాలకే రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక కరెంటు, నీరు, డ్రైనేజీలు ఇతరత్రా పనులకు ఎంత ఖర్చు చేస్తారు? ఇవి కాకుండా అంతర్గత రోడ్లకు ఎంత ఖర్చు చేస్తారు? చంద్రబాబు, మంత్రి నారాయణ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరినీ మానసిక వైద్యులకు చూపించాలి. ఎకరంలో జగన్ ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అన్నారు. మరి ఐదు ఎకరాల్లో చంద్రబాబు కట్టేదాన్ని ఏం అనాలి? వెలగపూడిలో సచివాలయం లిఫ్టులే పని చేయటం లేదు, ఇక ఏం రాజధాని బిల్డింగులు కడతారు? అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?ఇంకా ఎంత అప్పు చేస్తారు? మావిగన్ ఎందుకు అవసరం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి చట్టబద్ధత అనగానే చంద్రబాబు, లోకేష్ పండుగ చేసుకున్నారు. కానీ భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు అయినా సంబరాలు చేసుకున్నారా? జనానికి అప్పులు, చంద్రబాబుకు సంపద మిగులుతుంది. టీడీపీ వారు కూడా మావిగన్ ప్రతిపాదనను మెచ్చుకుంటున్నారు’ అని పేర్ని నాని చెప్పారు. -
అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్
-
తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణం: పేర్ని నాని
గుంటూరు: తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అక్రమ భూకేటాయింపులపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించారు.ఇందులో పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువచేసే భూములను బడా బాబులకు కట్టబెడుతోందని తెలిపారు. 99 పైసలకి భూములు కేటాయించిన జీవోలు కొన్ని మాత్రమే బయటపడ్డాయని, కనిపించకుండా ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల భూములపైనే కాకుండా దేవుడి భూములపై కూడా కన్నేశారని తెలిపారు. ఇలా ప్రభుత్వం భూముల కేటాయింపులో ఇప్పుడు కొత్తరకం మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మ కర్త మాత్రమే. ప్రజల ఆస్తులు ఎవరికిబడితే వారి కట్టబెట్టడానికి వీల్లేదు. విశాఖలో 99 పైసలకే కొన్ని కంపెనీలకు భూములు కేటాయించడం దారుణం. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అమరావతికి ఓఆర్ఆర్ వేస్తామని చెప్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని చెన్నై కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లే అడ్డుకున్నాం. ఇవాళ కూడా బెజవాడలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాం’ అని చెప్పారు. -
మావిగన్ పంచ్‌తో రాధాకృష్ణకు భయం పట్టుకుంది
సాక్షి, కృష్ణా: ఏబీఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. ‘‘రాధాకృష్ణ బరితెగించాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నాడు. నీది(రాధాకృష్ణను ఉద్దేశించి..) దమ్మున్న చానెల్ అయితే వాస్తవాలు ఒప్పుకో. చంద్రబాబుకు వంత పాడడమే నీకు తెలుసు. అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారు?. వైఎస్ జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా?’’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదు. అమరావతి పేరుతో దోపిడి ఆపాలి. వందేళ్లైనా అమరావతి పూర్తి కాదు. ఆ అవినీతిని అడ్డుకోవాలని జగన్ కోరారు. అందుకే మావిగన్ పెట్టమని జగన్ చెప్పారు. జగన్ చెప్పింది తప్పు అయితే అది తప్పని నిరూపించు. అంతేగానీ ఏబీఎన్‌ను అడ్డం పెట్టుకొని రోత రాతలు రాస్తున్నారు. అసలు ఏబీఎన్ రాధా కృష్ణది కానే కాదు. ఎవరో యావడో పెట్టిన ఛానల్ దోచుకొన్నాడు కదా. రాధాకృష్ణా.. కాశీ వెళ్లి సిగ్గుశరం వదిలేసి వచ్చావా?. దమ్మున్న చానల్ అయితే.. వలంటీర్ల విషయంలో కూటమి పార్టీల నేతలను ఎందుకు నిలదీయలేదు?. ఈ రెండేళ్లలో చంద్రబాబు 4లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమైపోయావ్?. నీతులు చెప్పగానే సరిపోదు.. అమలు చేయాలి. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడినందుకు తక్షణమే క్షమాణలు చెప్పాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
కాశీ వెళ్ళీ సిగ్గు వదిలేసి.. నీతి జాతి లేకుండా బ్రతికేస్తున్నాడు
-
కేవలం నీ డబ్బా కోసం.. నెలకు 85 లక్షలు ఖర్చు పెట్టి ఆరు న్యూస్ ఛానల్స్..
-
నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్
-
నాది నా కొడుకు కాల్ డేటా చెక్ చెయ్యి.. తప్పు చేశాం అని నువ్వు నిరూపిస్తే..
-
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: పేర్ని నాని
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్రకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (ఏప్రిల్ 5న) పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన కార్యకర్త ఇంటిని మీరు కూల్చేస్తే మేం వెళ్లకూడదా? బాధితుడు తనకు జరిగిన కష్టం గురించి చెబితేనే నేను వెళ్లాను.కావాలంటే నా కాల్ డేటా ఇస్తా చెక్ చేసుకో. కోర్టు తీర్పు ఉంటేనే కూల్చేశామని చెబుతున్నారు కదా... దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. కోర్టు తీర్పు చూపించండి... మీరు ఏం చేయమన్నా చేస్తా. కోర్టు తీర్పు ఉందని నిరూపించలేకపోతే నేను చెప్పింది మీరు చేస్తారా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కొల్లు రవీంద్ర.గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొబ్బరి తోటలో లే అవుట్ వేశారు. ఇప్పుడు మీరు మంత్రి అయ్యాకే అక్కడ బిల్డింగ్ లు కట్టారు. అక్కడ స్థలానికి, ఇళ్లకు నాకేం సంబంధం? నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా ఎవరి ఆస్తులను కూల్చలేదు. రోడ్డు విస్తరణలో కోర్టు ఆదేశాల మేరకే ఒకే ఒక్క అక్రమ బిల్డింగ్ ను అధికారులు కూల్చివేశారు.ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా... బయటికి తీయండి ఆధారాలు. నేనే ఆ బిల్డింగ్ కూల్చి వేయించినట్లు నీ దగ్గర ఆధారాలుంటే నా పై కేసు పెట్టించు. బందరుకు ఏం చేయలేదని నన్ను విమర్శిస్తున్నావు? నేను బందరు రోడ్డు విస్తరణ చేశానని నీ నోటితోనే చెబుతున్నావ్. నా బినామీల కోసమే నేను ఏదైనా చేస్తే బినామీ చట్టం ఉపయోగించండి’ అని అన్నారు.మీకు ఆ సత్తా లేదా? ‘మీకు అధికారం ఉంది కదా... మీకు ఆ సత్తా లేదా? అందరినీ ఒప్పించి నేను బందరులో రోడ్డు విస్తరణ చేపట్టాను. 2014-19 వరకూ ఇప్పుడు రెండేళ్లలో బందరుకు మీరేం చేశారో చెప్పగలరా కొల్లు రవీంద్ర? 2004-2014 వరకు బందరు అభివృద్ధికి పాటుపడింది నేను. మీరు వచ్చాక బందరుకు ఏం చేశారో సమాధానం చెప్పండి. బందరు కోటలో మీరు కట్టిన ఇంటికి ప్లాన్ లేదు. మార్కెట్లో కట్టిన మీ కాంప్లెక్స్‌కు ప్లాన్ లేదు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్ కు ప్లాన్ లేదు. పోలీస్ కల్యాణ మండపానికి ప్లాన్ లేదు. నేను మాట్లాడేవన్నీ ఆన్ రికార్డు. బందరులో ప్లాన్ లేనివన్నీ వెతికిమరీ ఓ లిస్ట్ ఇస్తా. ప్లాన్లు లేనివన్నీ కొట్టేసే దమ్ముందా మీకు? అంత సీనుందా మీకు? నీకు దమ్ముంటే నా బినామీలను బయటపెట్టండి. విజయవాడ కేంద్రంగా మీరు ఆరు న్యూస్ ఛానల్స్ నడిపిస్తున్నారు’ అని అన్నారు. -
మా అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి జైపాల్ గారు.. పేర్ని నాని నాన్ స్టాప్ పంచులు
-
థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
-
పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
-
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్‌తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?...డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్‌ను విడుదల చేయండి...ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్‌మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్మెన్లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు...నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
నీ ఇల్లు, మంత్రి నారాయణ ఇల్లు ఉంటే రాజధాని చేసేస్తావా..
-
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు. -
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..
-
నువ్వు పేదల గుండెల్లో దింపిన గునపం నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా
-
‘కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్‌గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్‌లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా...అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్‌ను మీడియాకు విడుదల చేయండి...బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
‘రైతుల జోలికొస్తే సహించేది లేదు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టిపీడుస్తున్నారన్నారు. ఈ రోజు(సోమవారం, మార్చి 30వ తేదీ) ఆక్వారైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్‌కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా అనంతరం మీడియాతో మాట్లాడారు పేర్ని నాని. ‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు. వందల ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా రెండు ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవిన్యూ సిబ్బంది పాల్పడుతున్నారు. ఎకరం రిపేరుకు 50,000 బోరు వేసేందుకు మరో 50 వేలు వసూలు చేస్తూ ఆక్వా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెదపట్నం కానూరు గ్రామాలలో యథేచ్ఛగా మడ అడవులను చెరువులుగా తవ్వుకుంటుంటే పట్టించుకోవడం లేదు. కోన గ్రామంలో 83 సెంట్ల రైతును రికార్డులు చూపించమంటూ ఆర్డీవో నా నా హైరానా చేశారు. రైతు చెరువును పూడ్చమని ఆదేశించడం ఏంటి?, ముడుపుల మాయలో బందరు ఆర్డిఓ ఎమ్మార్వోలు రైతులపై అగత్యాలకు పాల్పడితే సహించబోం’ అని హెచ్చరించారు. -
లంచాలు కాదు.. ఇంటికెళ్లి అన్నం తినండి..పేర్ని నాని ఉగ్రరూపం
-
11 నుండి 170కు.. ఎలా వస్తామో చూద్దురు కానీ
-
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: అమరావతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. అమరావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా నడిపించిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘రెండోదశలో మరో 50వేల ఎకరాలు తీసుకునేందుకే తీర్మానం పేరిట అసెంబ్లీలో డ్రామా ఆడారు. అసెంబ్లీలో ఆరుగంటల పాటు కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవ సరం లేదా?. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను, అమరావతి రైతులను మోసగించటానికి, మభ్యపెట్టడానికే చంద్రబాబు ఈ డ్రామాలు, నాటకాలు’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అమరావతి రాజధాని అని చెప్పేందుకు ఒక్క అధికారిక పత్రం లేదని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి చెప్పింది. ఈ విషయం ఈనాడు పత్రికే రాసింది. (ఈ సందర్భంగా ఈనాడు ప్రతిని పేర్ని నాని చదివి వినిపించారు) అందుకే హడావిడిగా కేబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టారు. నిజంగానే అమరావతికి చట్ట బద్ధత కల్పించాలంటే శాసనమండలి అవసరం లేదా? మండలిని ఎందుకు సమావేశ పరచలేదు? ఒక చట్టం కావాలంటే శాసన వ్యవస్థలో భాగమైన మండలి అనుమతి అక్కర్లేదా? ఉభయ సభలు ఆమోదం తెలపకుండా చట్టం ఎలా అవుతుంది? వాస్తుకోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. మరి అలాంటప్పుడు రెండో దశ విస్తరణలో వాస్తు వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తున్నారు? ఇది అరిష్టంకాదా? అమరావతి ఆలోచనను చంద్రబాబు చేసినప్పుడే ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్నారు. ఈ ప్రశ్నలంటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే విజయవాడలో బస్సులో పడుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ఉండడానికి ఇళ్లు, హోటళ్లు ఉన్నాయి, కాని బస్సులో పడుకున్నారంటే అదికూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన డ్రామానే. బస్సులో పడుకునే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్తున్నారు, అది నిజమే, ఎందుకంటే మిగతావాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉండేది, డ్రామా చేసేది చంద్రబాబు మాత్రమేనని పేర్ని నాని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. మొత్తం అప్పులకుప్ప..అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి? 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–25లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్‌ఫిడ్ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్‌ని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా?రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా...రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొప్పున∙కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది.అమరావతికి న్యాయం చేసింది జగన్...అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది మాజీ సీఎం జగనే. పశ్చిమ బైపాస్‌ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకులు ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా? రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ తీర్మానం పెడితే జగన్ ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా?, (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు.ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి..ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనుల్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. -
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా’
సాక్షి, తాడేపల్లి: అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పేరుతో చంద్రబాబు జనం సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు 21 వేల కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్ చేశారు.‘‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా?. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగనే అమరావతికి న్యాయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయి. అమరావతిపై వైఎస్ జగన్‌కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు. రాజధానిలో పేదలు లేకుంటే ఎలా అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
స్టేషన్ లో లో సీసీ పుటేజ్ తీయండి..నిరూపిస్తే దేనికైనా రెడీ
-
సుప్రియా కేసు.. పోలీసులకు పేర్ని నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుంది ఏపీ పోలీసుల తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి.. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా అని పోలీసులకు పేర్ని నాని సవాల్ విసిరారు.మాజీ మంత్రి పేర్నినాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రియను మేం జైలులో పరామర్శించాం. బాధితురాలు చెప్పిన విషయాలపై నేను మీడియాతో మాట్లాడాను. పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్, హోంగార్డు కోటేశ్వరమ్మ ఎలా సుప్రియపై దాడి చేశారో చెప్పాను. బాధితురాలకి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను. కానీ, తెల్లవారుజామున 3 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి ఒక అశరీరవాణి విడుదల చేశారు. ప్రకటన పంపించడాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ సంతకం లేకుండా ప్రకటన ఇచ్చారు. ఎవరో ఒకరు సంతకం పెట్టి ప్రకటన ఇవ్వాల్సింది. పోలీసులు సుప్రియపై దాడి చేయలేదని అశరీరవాణి ప్రకటనలో చెబుతున్నారు. సుప్రియ శరీరం పై ఎలాంటి రక్త గాయాలు లేవని వైద్యులు చెప్పారట. 108 సిబ్బంది కూడా ఎలాంటి గాయాలు లేవని సుప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. పోలీసులు అంతా చెడ్డవారని నేను చెప్పడం లేదు. దుర్మార్గంగా వ్యవహరించే వారి పేర్లనే మేం చెబుతున్నాం.రాజకీయ నాయకుడు లెటర్ ఇస్తే కానీ కేసులు కట్టే పరిస్థితి లేదు. 21వ తేదీన సుప్రియ, ఆమె తల్లిదండ్రులు పామర్రు స్టేషన్ కు వెళ్లారు. 21వ తేదీన స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేయండి. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా. నేను మాట్లాడిన ప్రతీ మాట వెనక్కి తీసుకుంటా.. పోలీసు సిబ్బందికి క్షమాపణ చెబుతాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. రేపు 11:30 గంటల లోపు మీరు ఆధారాలను బయటపెట్టండి. సుప్రియ సోదరుడు తేజ దొంగతనం చేస్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలున్నాయంటున్నారు. తేజకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టండి. పామర్రు నియోజకవర్గం పేకాటకు నిలయంగా మారింది. ఆశ్రమం ఏరియాలో పేకాట శిబిరంపై దాడి చేసి పోలీసులు లక్షా 60 వేలు వసూలు చేశారని సమాచారంమూడు నక్షత్రాలు ఉన్న అధికారి ఏలూరు నుంచి వచ్చిన కొంతమంది నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడా లేదా?. కైలే అనిల్‌తో మాట్లాడమని ఏలూరుకు చెందిన ఓ మిత్రుడు నన్ను అడిగారు. అనిల్ కుమార్ దమ్ముగా రాజకీయం చేసే వ్యక్తి. డబ్బుకు కక్కుర్తి పడే రకం కాదు. నాకు కులమతాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలుసుకోవాలి. పోలీసులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి సామాన్యులకు ఉంటుందా?. ఆసుపత్రికి తీసుకెళ్లనని 108 సిబ్బంది ఎప్పుడైనా లిఖితపూర్వకంగా రాసివ్వడం చూశామా. కానీ సుప్రియ కేసులో 108 సిబ్బంది రాసిచ్చారు అని అన్నారు. -
నీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరాకులా.. చంద్రబాబు సిద్ధంగా ఉండు..
-
సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి.. దళిత మహిళా అని.. CI సుధాకర్ పై పేర్ని నాని ఫైర్
-
సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్
-
పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట
-
కడుపుకు అన్నమే తింటున్నావా..? ఆ మంత్రికి సిగ్గు లేదు..
-
పోలీసుల అండతో జనసేన జెండా దిమ్మ ఏర్పాటు.. ఇచ్చిపడేసిన పేర్ని నాని, పేర్ని కిట్టు
-
నా ఇంటికి వచ్చిన వాళ్ళని తోసేస్తావా.. పోలీసులపై పేర్ని నాని ఉగ్రరూపం
-
పోలీస్ VS పేర్ని నాని.. స్ట్రాంగ్ వార్నింగ్
-
పేర్ని నాని ఇంటి వద్ద హైటెన్షన్
-
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్‌ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
భరితెగించి నోడిని టీటీడీ చైర్మన్ చేయడం కరెక్టేనా..?
-
రెచ్చగొడుతున్న జనసైనికులు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
-
ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
-
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుదల చేసే దమ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్లో మెషినరీ అప్‌గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైఎస్ జగన్ ప్రెస్మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గరుంటే బయటపెట్టాలి.మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్సైట్ చెబుతోంది.అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు..వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా.నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్సైట్లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా?నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్‌లను కలిసి మొర పెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా?హెరిటేజ్ మెషినరీ అప్‌గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు.ఇది కాకుండా ఈరోజు కేబినెట్లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్‌గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా? లేక హెరిటేజ్‌కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్‌కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్‌కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు.బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్‌కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి తెలిసే టీటీడీ చైర్మన్‌గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్‌గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్‌లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు.మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్‌ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
మచిలీపట్నం పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: మచిలీపట్నం పోలీసులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు ఏపీ హైకోర్టులో ఉపశమనం దక్కింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని పోలీసులకు హైకోర్టు గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం, ఏపీ కోర్టు.. పోలీసుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని గుర్తు చేసింది. ఈ క్రమంలో జయసుధ ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే, రేషన్ బియ్యం అక్రమ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
మైకులు పనిచేయక అసెంబ్లీ వాయిదా..! ఇంతకన్నా దరిద్రపు ప్రభుత్వం ఏమైనా ఉంటుందా..?
-
మరి నువ్వు, నీ కొడుకు ముగ్గురిని కనలేదు ఎందుకు? బాబుపై పేర్ని నాని సెటైర్లు
-
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి
-
‘అప్పుడేమో అబద్ధాలతో అధికారంలోకి.. ఇప్పుడేమో బోగస్ లెక్కలు’
తాడేపల్లి: అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అన్ని బోగస్ లెక్కలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం, మార్చి 6వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబుకు రూ. 8 వేల కోట్ల బడ్జెట్ అప్పచెప్పింది. 2019లో వైఎస్ జగన్‌కు చంద్రబాబు రూ. 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అప్పచెప్పారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి. కరెంట్ చార్జీలు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే 60 రోజుల్లో 57 వేల కోట్లు సంపద సృష్టిస్తామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు’ అని విమర్శించారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయాలు రాకపోగా, లోటు కనిపిస్తోందిఅంచనాలకు, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందిచివరికి బడ్జెట్ కూడా దొంగతనంగా పెడుతున్నారురూ.98 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంటామని రూ. లక్షా 3 వేల కోట్లు గతేడాది అప్పు చేశారుఈ ఏడాది రూ. 97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పారువివిధ కార్పొరేషన్ల నుండి తీసుకుంటున్న అప్పులను బడ్జెట్లో చూపటం లేదుఈ విషయాన్ని ఎల్లోమీడియా కూడా రాసిందిరెండు నెలల్లో రూ. 57 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుంది?రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంటే గాడిన పెట్టామంటూ అబద్దపు మాటలు ఎందుకు చెప్తున్నారు?చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇల్లు ఎవరిదో ఎందుకు చెప్పటం లేదు?లింగమనేని రమేష్‌దా? సీఆర్డీఏదా? చంద్రబాబుదా?రైతుల భూమిని 22A లో ఎక్కించిన వ్యక్తి చంద్రబాబుదీనిపై రాజకీయ పార్టీలు, మీడియా ఎదుట విచారణకు సిద్దమా?టాటా మోటర్స్ కి ఎకరా రూ.38 లక్షల చొప్పున గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఇచ్చిందికానీ ఎకరం రూపాయికే ఇచ్చారంటూ లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు1100 ఎకరాలను రూ.400 కోట్లకు టాటా మోటర్స్ కొనుగోలు చేసిందిప్రపంచ వ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయిందికానీ విశాఖలో రూపాయి విలువ విపరీతంగా పెరిగిందిఅందుకే విశాఖలో 99 పైసలకే భూములను ఇస్తున్నారురాష్ట్రంలో సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా వాటిని కూల్చేశారుకానీ గీతం యూనివర్సిటీ ఆక్రమంచిన వేల కోట్ల విలువైన భూమిని మాత్రం క్రమబద్దీకరిస్తున్నారుఇల్లు కోల్పోయిన పేదల కన్నీటి వరదలో కూటమి ప్రభుత్వం కొట్టుకు పోతుందిగీతం యూనివర్సిటీ ఓనరు నారా లోకేష్ తోడల్లుడు కాబట్టే క్రమబద్దీకరిస్తారా?వెయ్యి కోట్ల విలువైన భూమినే తాను కబ్జా చేసినట్టు గీతం ఓనరు చెప్పారువెయ్యి కోట్ల భూమిని కబ్జా చేయటం అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అనాలి?వైఎస్ జగన్ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఆరోపించారుఅసెంబ్లీలోనేమో జగన్ కలిపాడని లేదనీ, టీటీడీ పాలకమండలిదే బాధ్యత అంటూ మాట మార్చారుబోలేబాబా, సంగం డెయిరీ, వైష్ణవి, ఏఆర్ డెయిరీ అన్నీ చంద్రబాబువే4 వేల కోట్ల టర్నోవర్ హెరిటేజ్ కు ఉందని భువనేశ్వరి చెప్పారుతనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు ప్రకటించారుఅసెంబ్లీలో మాత్రం కుటుంబ బతుకు తెరువు కోసమే వ్యాపారం చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారుహెరిటేజ్ సంస్థ నుండి కొనుగోలు చేసిన మజ్జిగ ప్యాకెట్లనే ప్రజలకు పంచాలని జీవోలు ఇచ్చారుకానీ తాము ప్రభుత్వానికి అసలు మజ్జిగ అమ్మలేదని పచ్చి అబద్ధం చెప్పారుచివరికి టీటీడీకి కూడా హెరిటేజ్ ద్వారా నెయ్యి సరఫరా చేశారుదీనిపై చర్చించటానికి చంద్రబాబుకు దమ్ముందా?పాలపొడి, నెయ్యి సరఫరా చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?ఈ విషయాలన్నీ చెబుతుంటే హిస్టరీ వద్దంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడటం సిగ్గుచేటునెయ్యితో చేసిన లడ్డూకి నెయ్యి వాసన రావటానికి నెయ్యిని స్ప్రే చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారుఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ఆ వివరాలను ఆన్ లైన్ లో పెట్టే సత్తా ఉందా?రాష్ట్ర అప్పులు రాకెట్ వేగంతో చేస్తూ, ఆ డబ్బును ఏం చేస్తున్నారో ఎందుకు చెప్పటం లేదు?20 నెలల్లోనే రూ. 3.20 లక్షల కోట్ల అప్పుకు లెక్క చెప్పాలిఅనిత తన శాఖను వదిలేసి జగన్ దూషణ శాఖామంత్రిగా పని చేస్తున్నారుసొంత పార్టీ ఎమ్మెల్యేనే మోంథా తుపాను పరిహారం రైతులకు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారుమైకులు పని చేయక అసెంబ్లీని వాయిదా వేసిన ఘనత ఈ ప్రభుత్వానిదిఅసెంబ్లీ నడపటం చేతగానీ ప్రభుత్వ పెద్దలు తుపాను తీవ్రతను తగ్గించామని బడాయి మాటలు చెప్పారుప్రతి జనవరిలో జాబ్ కేలండర్ అంటూ లోకేష్ పిట్టలదొర మాటలు చెప్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదుజగన్ కట్టించిన ఇళ్లని చంద్రబాబు ఉగాదికి ప్రారంభించబోతున్నారువిమానయాన శాఖ మంత్రి కార్పొరేట్ సేవకుడుసొంత జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ ను కనీసం పట్టించుకోవటం లేదుభోగాపురం ఎయిర్ పోర్టు జీఎంఆర్ కడుతుంటే రామ్మోహన్ నాయుడు హడావుడి చేస్తున్నారుప్రభుత్వ ఎయిర్ పోర్ట్ అయిన గన్నవరం ఎయిర్ పోర్టును ఎందుకు పట్టించుకోవటం లేదు?రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన మంత్రులు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారుహిందూ ఆలయాలను ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ తర్వాత చంద్రబాబేఆయన హయాంలోనే తిరుమల వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారుచంద్రబాబు హిందూ మతాన్ని పాటించే వాడైతే ఆ మంటపాన్ని కూల్చుతారా?జంతువుల తోలుతో చేసిన బూట్లు వేసుకుని పూజలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబుతల్లి, తండ్రి చనిపోతే కనీసం పిండప్రదానమైనా చేశారా?మరి ఏ రకంగా చంద్రబాబు హిందువు?జంతువుల కొవ్వు, టాయిలెట్ యాసిడ్ లను లడ్డూలో కలిపితే జనం బతికేవారా?తిరుమల కొండ మీద కూడా అన్యమత ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు హామీ ఇవ్వలేదా?రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారుసూపర్ సిక్స్ అని ఇప్పుడు మోసం చేశారుఇక ఆయన మాటలు విని ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి పోషణ పరిస్థితి ఏంటి?చంద్రబాబు లాంటి బడాబాబుల ఇళ్లలో పని చేయించుకోవడానికి సామాన్యులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలా?11 మంది ఎమ్మెల్యే మాకు ఉన్నా 11వేల మందిలాగా పోరాడుతున్నాంనిజాయతీనే మాకు ధైర్యంలడ్డూ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే హెరిటేజ్ అతలాకుతలం అయిందిచంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తున్నారో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారుఅసలు లడ్డూలో కల్తీ జరిగితే అది చంద్రబాబు హయాంలోనేఅందుకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలికాగ్ నివేదికలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని మంత్రులు ఏపీలో ఉన్నారు -
రాజకీయాల కోసం నీ భార్యకు గుండు కొట్టించావ్.. నువ్వు ఒక్కసారైనా గుండు కొట్టించుకున్నావా ?
-
మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం
సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్‌పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్‌కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా? ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ? ⇒ 2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం? ⇒ కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? ⇒ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా ఇచ్చారు? ⇒ చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్ ప్రభుత్వం పునర్ నిరి్మంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి పాపం మీదే ⇒ మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా? ⇒ 2024 జూన్‌లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది. ⇒ ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్ జగన్‌కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే. వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్‌లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. బయటపడ్డ హెరిటేజ్–ఇందాపూర్ బంధం ⇒ తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ పిటిషన్ వేసింది. బోలేబాబా ఆర్గానిక్కూ, సీబీఐ చార్జిషీట్లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్కూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది. ⇒ దీన్నిబట్టి భారత్‌లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్ ఎవరు? బాబూ ఇదేనా మీ భక్తి? ⇒ మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? ⇒ చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా? అవి జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్‌కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది? మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ⇒ బోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్నర్. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్‌లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్‌కు దగ్గరా? ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్‌లో హెరిటేజ్ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? ⇒ నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. -
‘మీకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారు?’
తాడేపల్లి: కూటమి నేతలకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలకు దేవుడంటే నమ్మకం ఉందని ఎలా అనుకోవాలన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బరితెగించి మరీ మాట్లాడారని, పవన్ పని గట్టుకుని తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇదంతా చూస్తుంటే దేవుడంటే భయలేకుండా బరితెగించి మాట్లాడమేనని పేర్ని నాని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ క్లియర్‌గా చెప్పింది. అయినా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ మాట్లాడుతున్నారు. పవన్, లోకేష్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..బందిపోట్లకు మించిన ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు ఉందంటూ ఈరోజు కూడా మాట్లాడారుఇంతకు మించిన బరితెగింపు లేదుతిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు చేశారుచంద్రబాబుకు దేవునిమీద భక్తి, భయం ఏదీ లేదుఅందుకే విజయవాడలో అనేక ఆలయాలను చంద్రబాబు కూల్చారుప్రసిద్ధ కాశీనాయన క్రేత్రంలో సత్రాలను కూల్చింది కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వమేకూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ మంత్రిత్వ శాఖ అధికారులే సత్రాన్ని కూల్చారుపవన్ ఆదేశాలు లేకుండా కూల్చటం సాధ్యం అవుతుందా?సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించలేదా?ఇది నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కాదా?తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే బాధ్యత లేదా?తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిందెవరు?గోదావరి పుష్కరాలలో 29 మంది చావుకు కారణం ఎవరు?తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిందెవరు?ఈ పాపాలన్నీ చేసింది చంద్రబాబేఅలాంటి చంద్రబాబు.. జగన్ మీద విషం కక్కుతారా?రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి చంద్రబాబు డబ్బులు ఇచ్చారుపెంటపాడులో రథాన్ని తగులపెడితే ఎందుకు నిర్మాణం చేయలేదు?అంతర్వేదిలో రథం తగుల పడితే కోటి ఖర్చుతో జగన్ హయాంలో కొత్తది నిర్మించారురామతీర్థంలో రూ.3 కోట్లతో రాతి నిర్మాణంతో ఆలయాన్ని జగనే నిర్మించారుచంద్రబాబు హయాంలో కూలదోసిన విజయవాడ ఆలయాలను కూడా జగనే నిర్మించారుకొన్ని వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను జగనే నిర్మించారుతిరుమలలో శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తానన్న చంద్రబాబు, పవన్ ఇప్పుడు కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు?చంద్రబాబుకు దమ్ముంటే తిరుమలలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయగలరా?గదులు తీసుకోవాలన్నా లంచాలు ముట్టచెప్పాల్సిందేకొండ మీద అవినీతి జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారు?జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టు కింద 5,263 పనులు ఆలయాల్లో చేసినమాట నిజం కాదా?రెండో సంతకంతో నియమించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు ఎందుకు కనపడటం లేదు?తిరుమల నుండి జీఏడీలోకి ఎందుకు పంపారు?జులైలో నెయ్యి శాంపిల్స్ తీసి నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపారుల్యాబు రిపోర్టు ప్రకారం కల్తీ కలిశాయని వెనక్కు పంపారుఅవి రాఘవేంద్ర క్రషర్ దగ్గర పార్క్ చేశారుఆ ట్యాంకర్లను మళ్ళీ వైష్ణవి డెయిరీ పేరుతో కొండ మీదకు పంపారుచంద్రబాబు కూటమి ప్రభుత్వమే ఈ పాపపు పని చేసి, జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేశారువైష్ణవి, బోలేబాబా డెయిరీలు ఎవరివి?పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరూ బోలేబాబా, వైష్ణవి డెయిరీలకి ఓనర్లుటీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డెయిరీకి ఉన్న సంబంధం ఏంటి?పొమిల్ జైన్, విపుల్ జైన్ లకు హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయిఏఆర్ డెయిరీ ఓనర్ రాజురాజశేఖర్తో చంద్రబాబుకు సంబంధం ఉందా లేదా?దిండిగల్ లో హెరిటేజ్ ఫ్యాక్టరీని కట్టించింది ఎవరో చంద్రబాబుకు గుర్తుందా?జగన్ హయాంలో నిబంధనలు మార్చారంటున్న చంద్రబాబు.. మరి ఇప్పటికీ దాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు?పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పార్థసారథి, ప్రశాంతిరెడ్డి రికమెండేషన్ చేశారువారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నారు2022 లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణలు చేశారుఆ రిపోర్టును పైవారికి పంపకుండా కింద వారు తొక్కి పెట్టారని సీబిఐ చెప్పిందా లేదా?ఆల్ఫా, మాల్ గంగా, ప్రీమియర్ డెయిరీలు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటున్న చంద్రబాబు మరి అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు కొనసాగించారు? -
లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్.. పుష్ప డైలాగ్ తో పేర్ని నాని కౌంటర్
-
‘సినిమా డైలాగులు ట్విటర్లో పెట్టడం కాదు లోకేష్’
సాక్షి,మచిలీపట్నం: నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్‌పై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ‘సినిమా డైలాగులు ట్విటర్లో పెట్టడం కాదు. దమ్ముంటే ఫ్లైట్,బోర్డింగ్ వివరాలు బయట పెట్టాలి.మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్ వివరాలు తెలపండి. ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. -
తలశిల రఘురాం తండ్రి పాడె మోసిన పేర్ని నాని
-
తోట త్రిమూర్తులను పరామర్శించిన పేర్ని నాని
-
Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు
-
బాబు, పవన్ బొమ్మేసి ఏకిపారేసిన పేర్ని నాని
-
మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..
-
బాబుని ఇమిటేట్ చేస్తూ.. ఉతికారేసిన పేర్ని నాని
-
సీబీఐ క్లీన్‌చిట్‌పై ‘ఏకసభ్య’ డ్రామా!
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి సీబీఐ సిట్ రిపోర్టుతో చెక్ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని సీబీఐ సిట్ చెప్పలేదని.. దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ సిట్ చార్జిషీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమెత్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్‌ను నియమించి వాటినే రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సీబీఐ సిట్ చెప్పింది.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న జగన్ పేరు ఉందా? సిట్ రిపోర్టులో జగన్ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్ జగన్‌కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‡్ష ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్గానే పని చేసింది. 2019లో జగన్ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‡్ష ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయటపెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా.. పవన్ కళ్యాణ్ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువును! వైఎస్ జగన్ క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్‌కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే ఏడు కొండలను నాడు వైఎస్సార్ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న వైఎస్సార్ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. తమ ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైఎస్ జగన్ క్రిస్టియన్ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్‌కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో ఎక్కడా వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్ (వన్‌మెన్ కమిషన్) వేసి జగన్‌ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్‌ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అపచారం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు? -
పవన్.. రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రం చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు చెప్పరు. ఆర్థిక శాఖపై కేశవ్‌కు పట్టింపు లేదు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి. గతంలో అనేకసార్లు పవన్ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
నెక్స్ట్ మీరే అంటగా.. ఎల్లో మీడియా రిపోర్టర్ ప్రశ్న.. పేర్ని నాని స్ట్రాంగ్ రిప్లై
-
‘దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్‌ను ఎందుకు పంపలేదు?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని మండిపడ్డారు.‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్‌ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్‌లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త...ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు. వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్‌గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
ఏపీలో రాషపతి పాలన..! వెంటనే కేంద్ర బలగాలను దింపండి..
-
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి’
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిన్న(శనివారం) అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఈరోజు(ఆదివారం) జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడులను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అంబటి ధ్వజమెత్తారు. ‘ఇంటెలిజెన్స్ చీఫ్ కిందస్థాయి సిబ్బందిని నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న దాడులను అడ్డుకోవద్దని పైస్థాయి అధికారుల నంచి ఆదేశాలున్నాయని కింద స్థాయి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని అరాచకం చేస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.. లేకంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు. టీడీపీ దాడులను పోలీసులు అడ్డుకోవడం లేదు. ప్రశ్నించే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలి’ అని పేర్కొన్నారు. -
ఈ దాడి దేశం మొత్తం తెలిసేలా చేస్తా.. గెట్ రెడీ..
-
‘శాంతి భద్రతలను కాపాడాల్సినవారే దాడులు చేయించడం ధర్మమా?’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు అండ్ బ్యాచ్‌కు దేవుడు వాతలు పెట్టాడని.. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపం పండి లడ్డూలో కొవ్వు వాడలేదని వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బరి తెగించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ఫ్లెక్సీలు పెట్టారని మండిపడ్డారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం చంద్రబాబు అండ్ బ్యాచ్ మీద కేసులు పెట్టాలన్నారు.‘‘తప్పుడు ఫ్లెక్సీలు పెట్టడం వల్లనే అంబటి వెళ్లి ఆ ఫ్లైక్సీ లు తొలగించాలన్నారు. చంద్రబాబు పెట్టించిన తప్పుడు ఫైక్సీలకు పోలీసులు కాపలా ఉండటం దురదృష్టం. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. డీజీపీ సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి బయటకు వస్తుంటే అంబటిపై దాడికి యత్నించారు. టీడీపీ మహిళలు కూడా సభ్యత మరిచి పచ్చిగా వినలేని భాషతో మాట్లాడారు...తన మాటలను వెనక్కి తీసుకుంటున్నాని, విచారిస్తున్నానని అంబటి చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబుపై దాడి చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సినవారే దాడులు చేయించడం ధర్మమా?. ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడం, డబ్బులతో రాజకీయం చంద్రబాబు బ్రాండింగ్’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
Perni Nani: చిన్న లేదు పెద్ద లేదు.. అమ్మ.. అమ్మ.. అంటాడు..
-
మైలవరంలో జోగి రమేష్ గెలుపు ఆపేంత దమ్ముందా.. బాబు,లోకేష్ ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
పేర్ని నానిపై మరో అక్రమ కేసు నమోదు..
-
పేర్ని నానిపై మరో కేసు నమోదు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నూజివీడులో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది. ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్‌లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్‌ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది. -
అసలు మనిషి జన్మేనా.. చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
-
ఇంతకంటే దుర్మార్గం ఏముంది బాబూ?: పేర్ని నాని
సాక్షి, ఏలూరు జిల్లా: చంద్రబాబు జుగుప్సాకరమైన రాజకీయం చేస్తున్నారని.. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘‘తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిపారని దుష్ప్రచారం చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ దుర్గగుడికి మెట్లు కడిగారు. తిరుపతి అపవిత్రమైందంటూ సంప్రోక్షణ చేశారు. పాపపు మాటలు మాట్లాడిన చంద్రబాబు నాలుకపై వాతలు పెట్టాలి’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.లడ్డూలో ఎలాంటి పంది, జంతువు, చేప కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చెప్పిందని పేర్ని నాని గుర్తు చేశారు. ‘‘కలియుగదైవం వెంకటేశ్వరస్వామి వేసే శిక్షను చంద్రబాబు,పవన్ తప్పించుకోగలరా?. వెంకటేశ్వరస్వామి పవిత్రతో ఆటలాడిన చంద్రబాబు, పవన్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
Perni Nani: రాళ్లు రాళ్లు అని మొరుగుతున్నారు.. అవే మీకు రాజకీయ సమాధికి..
-
నాడు ఎన్టీఆర్ పై బూతు బొమ్మలు వేసి నేడు 1700 కోట్లు తో విగ్రహం
-
సత్య ప్రసాద్ గారు తొందరపడకండి ఏప్రిల్ లో ఉంది ముసళ్ళ పండుగ...
-
జగన్ భూ సర్వేపై మంత్రి అనగాని వ్యాఖ్యలు పేర్ని నాని అదిరిపోయే కౌంటర్
-
Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..
-
ప్రతి పొలానికి పక్కా మ్యాప్.. పాసు పుస్తకాలు ముందు పెట్టి..
-
జగన్ ఇచ్చిన పాస్బుక్కులే అవి.. మీరు చేసిందేమిటీ?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి రెండేళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు అని తెలిపారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్‌ల మీద అనగాని పచ్చి అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చారా?. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్‌లు తీసుకుని కొత్త పాస్ బుక్‌లు ఇస్తున్నారు. పాస్ బుక్‌ల మీద వైఎస్ జగన్ ఫొటో తీయడం తప్ప మీరు చేసిందేమిటీ?. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా?. 1802లో మొట్టమొదటి సారి ఇండియాలో సర్వే చేశారు. 1926-32 వరకు తరువాత బ్రిటీషర్లు సర్వే చేశారు. ఈ సర్వేనే ఇప్పటి వరకు ఇండియాలో కొనసాగుతోంది. రెవెన్యూ మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడారు. మంత్రి అనగాని ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి అయ్యారు. రూ.25 కోట్లు తీస్తే పార్టీ మారుతానని చెప్పిన వ్యక్తి అనగాని అని ఎద్దేవా చేశారు.1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రైతులు ఇబ్బందుల గురించి ఆలోచన చేశారా?. తక్కెళ్లపల్లిలో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వే మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు. మంత్రి అనగాని తన డిపార్ట్మెంట్ మీద దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేలో కొంచెం కూడా తేడా రాదు. జగన్ ఆరు వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి చేశారు. ఈ ఆరువేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన పరికరాలనే బాబు వాడుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ శాఖ కలిపి ఏపీలో భూ సమగ్ర సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన డ్రోన్ ప్లే డేటా, ఓఆర్ఐ కాపీలను బాబు ప్రభుత్వం వాడుతుంది. శాలిలైట్తో లింక్ చేసి వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు. వైఎస్ జగన్ తెచ్చి సిస్టం ప్రపంచంలోనే అద్భుత భూ సర్వే అని చెప్పుకొచ్చారు. -
పేర్ని నాని భోగి సంబరాలు
-
భూ సర్వే రాయి పై జగన్ ఫోటో..! బాబుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన పేర్ని నాని
-
సభ అట్టర్ ఫ్లాప్.. పాస్ బుక్ ఇవ్వడం కోసం హెలికాప్టర్.. పేర్నినాని సెటైర్లు
-
రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
-
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉంది. ఒక్క పాసు పుస్తకం ఇవ్వటానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కానీ, చివరకు ఏమైంది.. పరాభవం ఎదురైంది. పాస్ బుక్‌లు ఇవ్వలేదని స్వయంగా సీఎంకే రైతులు చెప్పారు. అయినా కూడా వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు జగన్ కోటి రాస్తూ.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారు. రైతులను జగన్ ఏం ఇబ్బంది పెట్టారు?. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22(A)లో భూముల్ని పెట్టి రైతులని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22Aలో చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందుల ఎదురయ్యాయి. జగన్ ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధం అని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జగన్ పరిష్కరిస్తే ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏం అనాలో తెలుగులో పదాలు దొరకటం లేదని అన్నారాయన. జగన్ వచ్చాక జేసీతో పనిలేకుండా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబు హయాంలోనే భూ రికార్డుల్లో చాలా అక్రమాలు జరిగాయి. ఆయన చెప్పే మాటలకు ఆయనకే నమ్మకం ఉండదు. బంధువులతో గొడవలు పెట్టుకో వద్దని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గర్నుంచి జూ.ఎన్టీఆర్ వరకు అందరితో గొడవలు పెట్టుకున్నదే చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆయనకే తగాదాలు ఉన్నాయి. ఎన్డీఆర్ ఆస్తుల్ని లాక్కున్నది ఎవరు?. నిమ్మకూరులో ఎన్టీఆర్ భూములు తీసుకున్నది ఎవరో చెప్పాలి?. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఆయన ఇల్లు, బ్యాంకు అకౌంటను లాగేసుకున్నది ఎవరు?. క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?.. అంటూ పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్‌ను కూడా జగనే తెచ్చారు. జగన్ చేపట్టిన భూ సర్వేనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్ బుక్కులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చిందే వైఎస్ జగన్. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక.. భూ సర్వేలు, పాస్ బుక్కుల విషయంలో ఏం మార్పులు చేశారో చెప్పాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. పాసు పుస్తకాల ప్రింటింగ్‌లో కూడా కూటమి నేతలు కక్కుర్తి పడి కమీషన్లు తీసుకుంటున్నారు. పాస్ పుస్తకం మీద ఫోటో వేసుకుంటే నేరమా?. పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ తొలగించటం తప్ప చంద్రబాబు ఏం చేశారు?. అనేక ప్రభుత్వ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఫొటోలు పెట్టారు కదా. చంద్రబాబు ఆరు అడుగుల గురివింద గింజ. 18 నెలలకే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు. రేపు వేసవి కాలానికే మా వైఎస్సార్సీపీ హయాంనాటి అప్పుల్ని దాటి పోతారు. త్రిబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలి?. పూర్తి కాని పోలవరం దగ్గర జయం జయం చంద్రన్నా అంటూ ఎందుకు భజన చేయించారు?. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు మిగిలాయి. కూటమి నేతలు రికార్డు స్థాయిలో అప్పులు చేశామని సంబురాలు చేసుకోవచ్చు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.👉నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజి కి నీళ్లు రాకపోతే కృష్ణాడెల్టా ఏం కావాలి?. మా హక్కులను కాలరాయటానికి చంద్రబాబు ఎవరు?. తన స్వార్ధానికి పొరుగు రాష్ట్రానికి మా హక్కులు కాలరాస్తారా?. ముచ్చుమర్రిలో 0.33tmc ల నీటితో కుప్పం వరకు నీళ్లు ఎలా వెళ్తాయి?. రాయలసీమకు లిఫ్టు అవసరం లేదంటూ చంద్రబాబు పాపం మూట కట్టుకుంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు విద్వేషం👉2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానన అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. పోలవరం పూర్తి చేయలేని వారు నల్లమల సాగర్ ఎలా పూర్తి చేస్తారు?. ఈ ప్రాజెక్టు చేయటానికి లక్ష కోట్లు కావాలి. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలి. ఈ సొమ్మంతా ఎక్కడినుండి తెస్తారు?. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్తే చంద్రబాబు రచ్చ చేశారు. అలా ఎలా వెళ్తారనీ.. తెలంగాణతో గొడవ పడాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నీతులు ఎలా చెప్తారు?. రాజధానిలో వెయ్యి కోట్లతో లిఫ్టులు కడతారా?. ఆ ఖర్చు చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పూర్తవుతుంది కదారాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. ఆ తర్వాత రెండో విడత గురించి మాట్లాడాలి. సీఎంగా ఉన్న చంద్రబాబుకు వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించమని జగన్ కోరారు. అమరావతి మీద జగన్ కు మమకారం లేకపోతే ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారు?. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదు. లింగమనేని రమేష్ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు?ఏపీలో కులం, మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్. ఆయన్ని జనం కాపు కాయాలంట. ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంట. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలి?. దళితులను వెలి వేస్తుంటే ఎవరు కాపు కాయాలి? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. -
హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని
-
అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్
-
Perni Nani: పార్టీలకు అతీతంగా మెడికల్ కాలేజీలను కాపాడుకుందాం
-
లోకేష్.. హెరిటేజ్ ఆస్తులను రూపాయికి ఇస్తారా?: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రజల ఆస్తిని దోచుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘మచిలీపట్నంలో మా పార్టీ ప్లాన్ పెట్టుకుంటే కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులు పార్టీ టీడీపీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కోర్టులు తీర్పునిచ్చినా.. నాకు మంత్రి కొల్లు రవీంద్రే ఎక్కువ అన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జైలులో వేస్తా జాగ్రత్త అని మండిపడ్డారంటే మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు అర్ధం అవుతుంది.ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే తీసేస్తారు ఇలాంటి వాళ్లని. ప్రజల ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తాననడం సిగ్గుచేటు. జనం ఆస్తి కాబట్టి మదం ఎక్కి మాట్లాడుతున్నారు.. హెరిటేజ్ ఆస్తులను అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తారా?. లోపల ప్రోడక్ట్స్ పావలాకి ఇస్తారా?. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా?. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.వైఎస్ జగన్ మాటలను అసహ్యంగా వక్రీకరిస్తున్నారు. మీ సొమ్ము కాదు కాబట్టి జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. మీ ఆస్తులు ఎక్కడైనా హైవేలపైనే ఎందుకు కడుతున్నారు. రెట్టింపు అయ్యేందుకా?. జనం సొమ్ము నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టి తగలేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మాణం చేసుకుంటారని జగన్ అన్నారు. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయడం నీటిని తోడే దానికి వందకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొంటామంటున్నారు.. మరి దాని కోసం కోట్లు తగలేసే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారు. జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు నోరు తెరుస్తారా?. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్దాలు మాట్లాడితే నోరు మెదపరా?. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
జగన్ శ్రమ ఫలితమే ‘భోగాపురం’
చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర అంతా అసత్యాలు, బురిడీ, మాయమాటలు చెప్పటమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టం, ఆలోచన, శ్రమతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు ట్రైల్ రన్ అనంతరం ప్రెస్ మీట్లో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రామ్మోహన్నాయుడు దేశం మొత్తం సిగ్గుపడి తలవంచుకునేలా ఇండిగో వ్యవహారంలో దొరికిపోయారని ఎద్దేవా చేశారు. అసలు భోగాపురం ఎయిర్‌పోర్టుకు, చంద్రబాబుకు ఏం సంబంధం? అని సూటిగా ప్రశి్నంచారు. సోమవారం మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు 15 వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిరి్మస్తామంటూ మభ్యపుచ్చి, చివరకు ఒక ఎకరా కూడా చేతికి రాకుండానే గతంలో అధికారంలో ఉండగా ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 14వ తేదీన రాయి వేశారు. ఇదే రీతిలో డ్రామాలాడుతూ బందరు పోర్టుకు 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్ పటిష్ట ప్రణాళికా, చర్యలతో ఏడాదిలో బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో అది కూడా తామే కట్టామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు.నిజానికి గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2,200 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో భూసేకరణ పూర్తి చేశారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నగదు చెల్లించి వారికి కాలనీలు కూడా ఏర్పాటు చేసిన తరువాతే 2023లో శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆరు లేన్ల రహదారి ఎన్‌హెచ్–16ని కలిపే విధంగా నిరి్మంచాలని, అందుకు రూ.6,600 కోట్లు మంజూరు చేయాలని ఆ సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరి అందుకు ఒప్పించారు. ⇒ భోగాపురం ఎయిర్‌పోర్టును తామే నిరి్మంచామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అదే నిజమైతే 18 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎలా సాధ్యం? ఎవరో చేసిన పనులను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేయడమే చంద్రబాబు నైజం. తాము తీసుకువచ్చిన పరిశ్రమలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో వెళ్లిపోయాయని చంద్రబాబు, లోకేశ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అలాగైతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎందుకు వెళ్లలేదు? ⇒ రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహిస్తామని చంద్రబాబు సర్కారు చెబుతున్నా టెండర్లు ఎందుకు రావట్లేదు? ఆదోని మెడికల్ కళాశాలకు టెండరు వచ్చిందని, కిమ్స్ హాస్పటల్ మేనేజ్మెంట్ దాన్ని దాఖలు చేసిందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. అయితే కిమ్స్ ఆస్పత్రి ప్రతినిధులు తాము ఆ టెండరు వేయలేదని చెప్పారు. దీనిపై విలేకరులు మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ను ప్రశ్నిస్తే.. ఆసుపత్రి నిర్వాహకుడు ప్రేమ్‌చంద్ షా దాఖలు చేశారని చెబుతున్నారు. నిజానికి దేశంలోని 26 కిమ్స్ ఆస్పత్రుల్లో ప్రేమ్‌చంద్ షా పేరుతో గుండె వైద్యనిపుణులు ఎవరూ లేరని మా పరిశీలనలో తేలింది. మరి ప్రేమ్‌చంద్ షా ఎవరు? ఆయన టెండరు వేసినట్లు, ఆయనెవరో ఆధారాలతో చెప్పే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? ⇒ ఎన్నికల ముందు రూ.15 వేలు ఫీజుతోనే మెడికల్ విద్య సీట్లు కళాశాలల ద్వారా అందుబాటులోకి తెస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమ్మకానికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. మాయమాటలు చెప్పటం ఆయనకు అలవాటైపోయింది. ప్రభుత్వ వైద్యం బాగోదని.. ప్రైవేటు వైద్యం మాత్రమే బాగుంటుందని చెప్పిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా? ⇒ తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని, ప్రతి ఇంటి నుంచి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వంలో కరెంట్ మీటర్లు పెడితే బద్దలు కొడతామని అన్న తండ్రీ, కుమారుడు ఇప్పుడు అవే మీటర్లు బిగిస్తున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం ఏకంగా రూ.10 వేలకు పెంచి ఇస్తామని నమ్మబలికి చివరకు ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకటి రెండు నెలలు మినహా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు వేయటం లేదు? సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న వాగ్దానం ఏమైంది? డీఏ, ఎరియర్స్ ఇవ్వకపోగా పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించలేదు. ఐఆర్ కూడా ప్రకటించకుండా గోరుచుట్టు మీద రోకటి పోటులా ఉపాధ్యాయులకు ‘టెట్’ పెడుతున్నారు. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు సంవత్సరానికి మూడుసార్లు చెల్లించాల్సి ఉండగా, గత ప్రభుత్వంలో నిల్వ ఉంచిన సొమ్ము మినహా 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. హోంగార్డులకు జగన్మోహన్రెడ్డి హయాంలో జీతం పెంచారు. ఆ తరువాత మీరు ఒక్క రూపాయి అయిన జీతం పెంచారా? ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ కునారిల్లుతోందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వ్యాఖ్యానించటం నిజం కాదా? పోలీసులు కూడా ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది. ⇒ వైఎస్ జగన్ తన కుమార్తె వద్దకు లండన్ వెళితే రూ.12 కోట్లు ఖర్చు చేశారని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, లోకేశ్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బాలి, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లి తిరిగి రావడానికి ఎంత ఖర్చు అవుతోంది? పోలీసులకు పెట్రోల్ ఖర్చులు ఇవ్వలేని వారు వీటికి రూ.కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చేసిన దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. ఎవరో చేసిన పని తన ఖాతాలో వేసుకుని, తానే చేసినట్లుగా గొప్పలు చెప్పుకోవటం మానుకుని ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించటంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ⇒ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా, తలకిందులుగా తపస్సు చేసినా.. జనబలం, గుండెబలం ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ప్రజలంతా తమవాడిగా, ఇంట్లో మనిíÙగా గెలిపించుకోవటం ఖాయం. ⇒ చంద్రబాబు ప్రభుత్వం పలు సంస్థల పేరుతో వేల ఎకరాలు కేటాయింపులు చేస్తున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా స్థాపించకపోవటం ప్రజలను మోసం చేయటమే. సింగపూర్‌లా అమరావతి నిర్మాణం చేస్తామని ప్రభుత్వ పెద్దలు మాయమాటలు చెబుతున్నారు. మంత్రి నారాయణ మాత్రం రోజూ తుమ్మ చెట్లు నరుకుతున్నామని చెప్పటం మినహా ఇంతవరకు చేసిందేమీ లేదు.⇒ విదేశాల నుంచి తీసుకువచ్చిన ప్రతినిధులతో సమ్మిట్లు నిర్వహించి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. హోటళ్లలో వంటవారిని తీసుకొచ్చి సూటు బూటు వేస్తున్నారని తెలంగాణ మాజీ సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధపడటం విడ్డూరంగా ఉంది. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు షో చేశారు
-
భోగాపురంలో రామ్మోహన్ షో.. బాబు తీరు అలా?: పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కృషితోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ ఆలోచన, కష్టంతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు తీరుతో భారత్ పరువు పోయిందని విమర్శించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురంలో ఎయిర్‌పోర్టులో ట్రయిల్ రన్ జరిగింది. విమానం రన్ వే మీద ఆగడం రామ్మోహన్ నాయుడు బిల్డప్ ఇచ్చాడు. హైదరాబాద్, భోగాపురంలో చంద్రబాబే ఎయిర్‌పోర్టులు కట్టారంటూ రామ్మోహన్ మాట్లాడుతున్నాడు. ఇండిగో అంశాల్లో భారతదేశం సిగ్గు పడుతుంది. ప్రపంచం ముందు భారత్ తలదించుకుంది. అది ఎవరి వల్లనో అందరూ గుర్తు పెట్టుకుంటారు.భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకి అసలు సంబంధం ఏంటి?. 2019 ఎన్నికల ముందు దిగిపోతూ శిలాఫలకం పెట్టాడు. ముందు 5 వేల ఎకరాలు అని.. తర్వాత 15వేల ఎకరాలు అని చంద్రబాబు అన్నాడు. ఒక్క ఎకరం కూడా భూమి తీసుకోకుండా శిలాఫలకం వేసి చంద్రబాబు దిగిపోయాడు. బందర్ పోర్టుకి 33వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చి 7వ తేదీ శంకుస్థాపన చేసారు. జగన్ రాకపోతే భోగాపురం ఎప్పటికీ మొదలయ్యేది కాదు. 2200 ఎకరాలు ఎయిర్‌పోర్టుకి చాలు అని.. భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చి.. కాలనీ నిర్మించి 2023లో శంకుస్థాపన చేశారు..జగన్ కష్టార్జితమే భోగాపురం.. అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్‌పోర్టు రైతుల త్యాగాలతో నిర్మాణం అవుతుందని.. 2026లో ప్రారంభం అవుతుందని వైఎస్ జగన్ చెప్పారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్టుకి 6600 కోట్లతో ఆరు వరుసల జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ ప్రకటించారు. 18 నెలల్లో భూ సేకరణ చేసి ఎయిర్పోర్ట్ కట్టగలరా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఎవరో చేసిన పని తన అకౌంట్లో వేసుకోవడం కూటమి నేతలు నేర్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎలా కట్టారు?. మీరు ఫొటోలు దిగే ఎయిర్‌పోర్టు జగన్ కష్టార్జితం. జగన్ మళ్ళీ రాడని, భూస్థాపితం చేశామని కూటమి నేతలు చెపుతున్నారు. మరి మెడికల్ కాలేజీకి ఎందుకు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అసమర్థ పాలన అని చెప్పుకునే మీకు అధికారంలో ఉండే అర్హత ఎక్కడ ఉంది?. చంద్రబాబు చెప్పిన సొల్లు మాటలు ఇవే. కరెంట్ ఛార్జీలు పెంచమని, ప్రతి ఇంటి నుండి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పాడు. మీటర్లు బద్దలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అదే మీటర్లు బిగిస్తున్నారు. వాలంటీర్లకి 10వేలు ఇస్తామని చెప్పారు.. వాలంటీర్లు లేకుండా చేశారు..మెడికల్ కాలేజీలు తీసుకోవాలని అనుకొనే వాళ్లను చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని జగన్ చెప్పాడు. ఎకరం భూమి రూపాయికి, ఆసుపత్రి ఫ్రీ.. రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా ముందుకు రాలేదు. టెండర్లు ఒక్కడు కూడా వేయలేదు. కానీ ఆదోనికి ఒక టెండర్ వచ్చిందని సంకలు గుద్దుకున్నారు. రెండు రోజుల్లోనే టెండర్ మేము వేయలేదని కిమ్స్ చెప్పింది. ప్రేమ్ చాంద్ షాకి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు సత్యకుమార్ ప్రకటించాడు. కిమ్స్ 26 ఆసుపత్రిలో ప్రేమ్ చాంద్ షా అనే వ్యక్తి లేడు. ఉన్నాడని ఆధారాలతో నిరూపించగలడా?. లక్ష కోట్లు ఆస్తులు దోచేస్తున్నారు..అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. నీళ్లు తోడం అని ప్రతీ మూడు నెలలకు నారాయణ చెపుతున్నారు. ప్లాట్స్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాటి సింగపూరు వాళ్ళు ఏమైపోయారు?. సింగపూర్ అమరావతి కట్టినట్లు ఉంది.. మెడికల్ కాలేజీల పరిస్థితి. నూతన సంవత్సర వేడుకలకు విదేశాలు పోతారు.. మీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?. పోలీస్ వాహనాలకు డీజిల్ ఇచ్చారా? ఒక్క పైసా కూడా నేటికి ఇవ్వలేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పింది. ఏదో ఒక రోజు పోలీసులు చంద్రబాబుపై సహాయ నిరాకరణ చేస్తారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమే. చంద్రబాబు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు.. వచ్చిన ఆదాయం ఏం చేశారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. -
Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష
-
2 లక్షల పుస్తకాలు చదివి సైన్స్ చదవడం మర్చిపోయాడు
-
కొడాలి నాని అరెస్ట్.? పేర్ని నాని రియాక్షన్
-
పేర్ని నాని: రేషన్ బియ్యం దొంగా ...?
-
మా అబ్బాయి కంటే.. జగనన్న ఓడిపోయాడని చాలా బాధపడ్డాం!
-
పేర్ని నాని ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు
-
మెడికల్ కాలేజీలను టచ్ చేసి చూడండి.. పేర్నినాని వార్నింగ్
-
అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్
-
టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు
-
బాబూ.. సీఎం పోస్టు పీపీపీకి ఇచ్చేయండి: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలి. పీపీపీ, పీ-4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా?. నాలుగో పీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేటు పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారు?. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.ఆసుపత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా సంతకాలు చేశారు. మీ టీడీపీ, జనసేన నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసేది?. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు. ఆరోగ్యాన్ని, చదువును జగన్ బాధ్యతగా తీసుకున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు?. బాబూ.. నీ వాళ్లకు దోచిపెట్టాలి అనుకుంటే పీపీపీ కింద కొత్త కాలేజీలు పెట్టు. 17 మెడికల్ కాలేజీలు ఆరు కోట్ల ఏపీ ప్రజల ఆస్తి. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వైఎస్ జగన్ నిర్మాణం చేపట్టారు. 17 కాలేజీల్లో నాలుగు కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేశారు.ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. ప్రజల హక్కుగా పొందాల్సిన వైద్యాన్ని దిగజార్చుతున్నారు. అన్నీ ప్రైవేటీకరిస్తే సీఎం పదవి ఎందుకు?. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి. ప్రశ్నిస్తానని ఓట్లు అడుక్కున్న పవన్ కల్యాణ్.. ఇంకా జగన్నే ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీలను తీసుకుని ఆ పాపం మోయకూడదు అనుకునే ఎవరూ తీసుకోవడం లేదు. మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా తీసుకుంటామని ముందుకు రావడం లేదు. ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలపై సిట్ వేస్తారు. అమరావతిలో వచ్చిన ప్రతీ టెండర్లో చంద్రబాబుకు నాలుగు శాతం కమీషన్ ఇస్తున్నారు. ప్రజల సొమ్మును హల్వా తింటున్నట్టు బాబు అండ్ కో తినేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు మాస్ దోపిడీ చేస్తున్నారు. అమరావతి అవినీతి సొమ్ముతో కడుపు నిండటం లేదా బాబూ?. దేశంలో ఎక్కడైనా 99 పైసలకు భూములు ఇస్తున్నారా?.. లేక తీసుకుంటున్నారా?. చంద్రబాబు తానా అనగానే ఎల్లో మీడియా తానా తందానా అంటుంది. తన ఆవేదన చెబుతూ అమరావతి రైతు రామారావు చనిపోయారు. అమరావతి రైతుని ఈడ్చుకు వెళ్లమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనలేదా?. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు?. కూటమి పార్టీల కార్యకర్తల అరాచకాలు రాష్ట్రంలో పెరిగి పోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికార మందంతో విర్ర వీగుతున్నారు. రాజధాని రైతులపై పోలీసులను ఉసి గొల్పుతున్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులను రోడ్డు పాల్జేయవద్దు. కనకదుర్గమ్మ గుడికి బిల్ కట్టలేదని కరెంటు కట్ చేస్తారా?. బాలకృష్ణ అల్లుడి విద్యాసంస్థకు వందల కోట్ల బిల్ పెండింగ్ ఉన్నా కరెంటు ఎందుకు కట్ చేయలేదు?. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్ మాఫీ చేస్తే వచ్చే నష్టం ఏంటి?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెప్పు కోసం రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. -
ఎవడో ప్రోగ్రాంలో దూరుతున్నాడు.. మేము 4గంటలకు పోయి దండా వెయ్యాలా?
-
వైఎస్సార్సీపీ ర్యాలీ అడ్డగింత.. మచిలీపట్నంలో ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల ఆంక్షలతో మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వంగవీటి మోహన రంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ర్యాలీని మాత్రమే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి కోసం రామానాయుడుపేట నుంచి వైఎస్సార్సీపీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. అయితే.. ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి నేతల ర్యాలీ ఉందని.. ఆ తర్వాతే మీ ర్యాలీ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. అయితే తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను పేర్ని నాని నిలదీశారు.వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి ర్యాలీకి అనుమతి ఇచ్చామని.. ఇరవర్గాలు తారసపడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్ని నానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు, అదనపు బలగాలు ఏర్పాట్లు చేసినట్లు సీఐ ఏసుబాబు వివరించారు. ఈ వివరణతో పేర్ని నాని మండిపడ్డారు. పోలీసుల తీరు.. ‘పచ్చ’పాత ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు పేర్ని నాని డిమాండ్‌తో దిగొచ్చిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది. -
ముఖ్యమంత్రిగా నువ్వెందుకు.. PPPకి ఇచ్చేయ్.. పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్
-
కలెక్టర్ల వైఫల్యం కాదు.. అది మీ వైఫల్యమే: పేర్ని నాని
మచిలీపట్నం: కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది సీఎం చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ నేత, పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజమ్ మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి, సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పేరుతో సీఎం చేసింది పాలనా సమీక్ష కాదని, ఒక కాలక్షేప కార్యక్రమం అని తేల్చి చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం దూరం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. పేర్ని నాని ఏమన్నారంటే..అది కచ్చితంగా సీఎం వైఫల్యమేసీఎం చంద్రబాబుగారు రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను పిలిచి వారిని దాదాపు 20 గంటలు కూర్చోబెట్టారు. ఈ సమావేశంలో పాలనా సమీక్ష జరగాల్సిన చోట, అధికారులు ఎలా ఉండాలి. ఎలా ఉద్యోగం చేయాలి. ఎవరైనా లావుగా ఉంటే బరువు ఎలా తగ్గాలి. ఫిట్‌గా ఎలా ఉండాలి. వంటి అంశాలపై కాలక్షేప బఠానీ కబుర్లు చెప్పారు. ఆ కాలక్షేపాన్ని కూడా ప్రజలు చూసేలా టీవీల్లో ప్రసారం చేయించారు. ఇంకా ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీరు గొప్పగా పని చేస్తున్నామని అనుకుంటున్నారు. నేనూ అలా అనుకుంటున్నాను. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు’ అంటూ కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపై నిందలు వేశారు. రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంలో ఆయన సూక్తిముక్తావళి చెబుతూ అధికారులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వారిని పని చేయనివ్వకుండా అనేక ఆంక్షలు విధించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు.మొట్టమొదటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. ‘మనది పొలిటికల్ గవర్నెన్స్. మా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మీ వద్దకు వస్తారు. వారికి మర్యాద ఇవ్వండి. మా ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాకుండా చూసుకోండి’ అంటూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు చెప్పిన మాటలకు, ఇవాళ చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ‘మీరు సరిగ్గా పని చేయడం లేదు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు’ అంటూ అధికారులనే లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి కలెక్టర్లు, ఎస్పీలు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించడం, విధానాలు రూపొందించడం, అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం సీఎం బాధ్యతేనని పేర్ని నాని గుర్తుచేశారు.ముఖ్యమంత్రి బాధ్యత. కలెక్టర్లు, ఎస్పీలు సరిగ్గా పని చేయడం లేదంటే దాని అర్థం ముఖ్యమంత్రి పనితీరు బాగోలేదన్నదే. తన వైఫల్యాలను దాచుకునేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నిందలు వేయడం అన్యాయం. ప్రజల ముందు మాత్రం మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తుల్లా, ప్రతివ్రత కబుర్లు చెబుతూ అధికారుల పనితీరును తప్పు బట్టడం చేతకాని పాలనకు నిదర్శనం. అధికారుల పనితీరు ప్రజలకు నచ్చలేదంటే, ప్రభుత్వ పనితీరు కూడా ప్రజలకు నచ్చనట్లేనన్న సత్యాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి అని పేర్నినాని ధ్వజమెత్తారు.దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి లేరుప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నడపడం ప్రపంచమంతా జరుగుతోందని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అయితే ప్రపంచంలో జరుగుతున్నదంతా ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా జరుగుతుందా? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రి తప్పులు చేసి జైలుకు వెళ్లి, ఆరోగ్యం బాగోలేదని బెయిల్‌పై బయటకు వచ్చి, మళ్లీ ముఖ్యమంత్రి అయి తనపై ఉన్న కేసులన్నీ మూయించుకున్న ఉదాహరణ ఉందా? ఈ తరహా చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక్క చంద్రబాబు విషయంలో కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.‘మీరు ముద్దాయిగా ఉండి, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కేసులు మాఫీ చేయించుకున్న ముఖ్యమంత్రి మీరే కదా?. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి మరెవరూ లేరన్న వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైయస్ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించడం కాదు, ముందు మీ గతాన్ని, మీ పాలనను మీరు పరిశీలించుకోవాలి. 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే..పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే, వారు నిర్వహించి మళ్లీ ప్రభుత్వానికి అప్పగిస్తారని చంద్రబాబు వివరిస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ మెడికల్ కాలేజీలను మొత్తం 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 66 ఏళ్లలో మీరు, మీ లోకేష్, మీ పవన్ కళ్యాణ్, సత్యకుమార్ ఎవరు ఉంటారు? మేము కూడా అప్పటికి ఉండం కదా? అని ప్రశ్నించారు. ఎకరానికి రూపాయి అద్దెకు ప్రభుత్వ భూములను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే. పీపీపీ ఆస్పత్రి బయట ‘ప్రభుత్వ ఆసుపత్రి’’ అని పెద్ద బోర్డు పెట్టి, కింద చిన్న అక్షరాల్లో ప్రైవేట్ వ్యక్తి పేరు రాస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. రాష్ట్రంలో ఉన్న మీ భూములను కూడా ఎకరా రూపాయి చొప్పున 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వండి. 66 ఏళ్ల తర్వాత మళ్లీ దేవాన్ష్ లేదా ఆయన కొడుక్కి అప్పగిస్తారు. చంద్రబాబు తత్వం మొత్తం గాలిలో మేడలు కట్టడం, పిట్టల దొర కబుర్లు చెప్పడం, అసాధ్యాన్ని సాధ్యమని చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలే.ఏఐ డాక్టర్ ఎలా అవుతుంది?:చంద్రబాబుకు జ్వరం వస్తే ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నారు? మొన్న డాక్టర్లకు ఏం తెలుసు అని, ఏఐని అడగాలని చంద్రబాబు చెప్పడం కూడా అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారంతోనే ఏఐ ఒక నాలెడ్జ్ హబ్‌గా, డేటా సెంటర్‌గా తయారవుతుందని, ఏఐ డాక్టర్ కాదని స్పష్టం చేశారు. జ్వరం వస్తే చంద్రబాబు కంప్యూటర్ ఎదుట కూర్చొని ఏఐని అడుగుతారా? లేక వెంటనే నాగార్జున ఆసుపత్రికి పరుగెత్తుకెళ్తారా? అని ప్రశ్నించారు.ప్రైవేటులో ఫ్రీగా వైద్యం అందుతుందా?:2015లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్‌కు ఇచ్చారు కదా అని గుర్తు చేస్తూ, మీరు ఒక్కరోజైనా ఆ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారా? ఒక్క ఇంజక్షన్ అయినా వేయించుకున్నారా? ఒక్క మందు బిళ్ల అయినా తీసుకున్నారా? ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు ఎలా వెళ్తారు. పీపీపీ వల్ల మెడికల్ సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయని జర్నలిస్టులను చంద్రబాబు దబాయిస్తున్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థికి ఏడాదికి కేవలం రూ.15 వేలే ఫీజు ఉంటుంది, స్కానింగ్, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. ప్రైవేట్ నిర్వహణలో ఇవన్నీ ఉచితంగా ఇస్తారా. డయాలసిస్, చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితం కదా?బసవ తారకం ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నారా?చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ కలిసి నడుపుతున్న బసవతారకం ఆసుపత్రిలో 70 శాతం ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం వద్ద భూమి తీసుకున్నప్పుడు అంగీకరించారని గుర్తు చేశారు. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క పేదవాడికైనా ఉచితంగా చికిత్స ఇచ్చారా? పేదలు ఆ ఆసుపత్రికి వెళ్లగలుగుతున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ పేదల్ని పట్టించుకునే పరిస్థితే లేదని తీవ్రంగా విమర్శించారు. వరి సాగు తగ్గిస్తే యూరియా రూ.800 ఇస్తానని, ఏడాదిలో నేరాలు తగ్గాలంటూ చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మాట్లాడుతున్నాడు. ఆయన పాలనలో నేరాలు తగ్గలేదు–ఘోరాలు మాత్రమే పెరిగాయి. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, హింస, హత్యలు 19 నెలల పాలనకు నిదర్శనంగా మారాయి.డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు?డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలను నిర్లక్ష్యం చేసి హోం శాఖలో జోక్యం చేసుకుంటూ మాటలకే పరిమితమయ్యారు. భీమవరం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో పేకాట, ల్యాడ్ సెటిల్మెంట్లు, రాజకీయ జోక్యంతో పోలీసు–రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దళితులపై కుల వివక్ష, జర్నలిస్టులపై దాడులు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చేతకాని పాలనకు స్పష్టమైన నిదర్శనం.మా ప్రభుత్వం వచ్చాక వారందరిపై చర్యలు తప్పవుపీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే వాటిని అమ్మేయడమే. వైయస్ జగన్ ప్రభుత్వం పేదలపై భారం పడకూడదని పారదర్శకంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తీసుకొస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి వంద శాతం ప్రైవేటీకరణ చేసింది. దీనికి వ్యతిరేకంగా కోటి మందికిపైగా ప్రజల మనోభావాలను వారి సంతకాల రూపంలో నిన్న (గురువారం) శ్రీ వైయస్ జగన్ గవర్నర్ గారికి అందించారు. కాలేజీలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వైద్యం వ్యాపారమవుతుంది. ఈ పాపానికి బాధ్యులైన వారందరిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఎయిమ్స్‌ను ఎందుకు పీపీపీ పద్ధతిలో ఇవ్వడం లేదు?లోకేష్ ఇచ్చిన కాగితం చదవడానికి హడావిడిగా వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ ప్రతినిధిలా కాకుండా చంద్రబాబు–లోకేష్ ఆదేశాలతో పని చేసే వ్యక్తిగా మారిపోయారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నది తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ, ప్రశ్నించే వారిని బెదిరించడం ఆయన అవివేకానికి నిదర్శనం. పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం దొరుకుతుందనడం అబద్ధం. ఉచిత, నాణ్యమైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధ్యం. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీకి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని మంత్రి, అధికార మదంతో మాట్లాడుతున్నారు.సుష్మా స్వరాజ్ ఏమన్నారో తెలుసా?వైఎస్ జగన్‌పై కేసుల విషయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడే నైతిక హక్కు సత్యకుమార్‌కు లేదు. ఎందుకంటే ఆయన పని చేస్తున్నది సుమారు 150 కేసులు ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు చేతి కింద ఆయన పలు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు రాలేదా అన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాస్తవం. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్ స్వయంగా, వైయస్ జగన్‌పై కేసులు రాజకీయ ప్రతీకారమేనని స్పష్టం చేశారు. అధికార మదంతో మాట్లాడడం సత్యకుమార్ అవివేకానికి నిదర్శనం అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
నువ్వు వేస్ట్ అని ప్రజలకు ఎప్పుడో తెలుసు నీకే ఇప్పుడు తెలిసింది
-
బ్రోకర్లకి,నీ చెంచాల చేతిలో మెడికల్ కాలేజీలు పెడతా అంటే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
కోటి సంతకాలసేకరణ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్న పేర్ని నాని
-
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు
-
Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ
-
అప్పులు.. దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: రైతును గుడ్డికన్నుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు.. అసత్య ప్రచారాలపై పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్ ఉండేది. అలాంటి బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే. గంటన్నర చంద్రబాబు ప్రసంగంలో అసత్యాలు, నిందలు, విషం వెదజల్లారు. రైతును గుడ్డికన్నుతో చూడడం చంద్రబాబు విధానం. ప్రభుత్వంలో ఎవరున్నా రైతుహితం కోసం పని చేశారు. కానీ చంద్రబాబు ఒక్కరే వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్ష కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ రూ.10 లక్షల కోట్లని బొంకుతున్నారు. అప్పుల ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్‌గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చు. మోదీ, నీతీశ్‌కుమార్‌లు ఏనాడైనా తప్పుడుగా అప్పులు చేశారా?. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుది. లక్షా 91 వేల కోట్లను తాకట్టపెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారు. మీ ముగ్గురు(చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌లను ఉద్దేశిస్తూ..) అడుగు తీసి అడుగేస్తే హెలికాఫ్టర్లు ప్రత్యేక విమానాలా?. అప్పులు చేస్తోంది ప్రత్యేక విమానాల్లో తిరగడానికా?.. అప్పులు తెచ్చి డబ్బు ఎక్కడ పెడుతున్నావ్.. దేశ జీడీపీలో రాష్ట్ర ఎంతో చెప్పగలవా చంద్రబాబు? అని పేర్ని నాని నిలదీశారు. ఉన్నత చదువులతోనే పేదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్. అందుకే వైఎస్సార్సీపీ హయాంలో స్కూల్స్ అభివృద్ధి చెందాయి. కానీ, స్కూళ్లపై చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సినిమా సెట్టింగులు వేసి.. స్టూడెంట్స్- పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఏంటి?. ఒక్క స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు?. నేరుగా స్కూల్ కే వెళ్తే జగన్ హయాంలో బాగు పడిన విధానం కనపడుతుందని భయం కాబట్టి. కూటమి వచ్చాక ఎంత మందికి ట్యాబ్‌లు ఇస్తున్నారు?. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసేశారు?. ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేసింది.. చేస్తోంది ఎవరు?.. ..వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ జీడీపీ వేగంగా పెరిగింది. అభివృధ్ధి శరవేగంగా జరిగింది. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు సహా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణం ద్వారా జగన్ ఆదాయం సృష్టించారు. వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే.. మీరు దానిని వాడుకుంటున్నారు. మూలధన పెట్టుడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా?.. బుగ్గన రాజేంద్రనాధ్(ఏపీ మాజీ ఆర్థిక మంత్రి)తో చర్చకు వచ్చే దమ్ముందా చంద్రబాబూ? అని చంద్రబాబుకి పేర్ని నాని సవాల్ విసిరారు.చంద్రబాబు సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలను ఎందుకు అమలు చేయడం లేదు?. ఏ పేదవాడికీ ఇప్పటి వరకు గజం స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు?. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో చంద్రబాబు ఫస్ట్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీలో కష్టపడే వారికి పదవులు దక్కటం లేదు. జంపింగ్ జపాంగులకే పదవులు ఇస్తున్నారు. అనంతపురం రైతులకు వ్యవసాయం నేర్పానని చంద్రబాబు బడాయి మాటలు చెప్పుకుంటున్నారు. ధాన్యం పండించకుండా జనం తినే ఆహారం పండించాలని చంద్రబాబు అంటున్నారు. మరి అరటి, మామిడి, టమోటా, దానిమ్మలాంటివి పండిస్తే వాటికి కూడా ఎందుకు ధరల్లేవు?. రైతులకు అత్యాశ అంటూ కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.. అని పేర్ని నాని అన్నారు.సీఎం హోదాలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను తానే కొట్టేసుకోవటం పెద్ద నేరం. చంద్రబాబు చేసిన దివాళాకోరు తనం, నీతి మాలిన తనం కంటే ఇంకోటి లేదు. చంద్రబాబుకు దమ్ముంటే కేసును న్యాయబద్దంగా ఎందుకు ఎదుర్కోలేక పోయారు. పరకామని కేసులో తన ఆస్తిని రవికుమార్ టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు చేసిన దోపిడీలతో పోల్చితే రవికుమార్ చేసిన నేరం చిన్నదే. ఇండిగో సంక్షోభం టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తప్పిదమే. పైలెట్లకు రెస్టు ఉండాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమలు చేయాలి. విమానయాన సంస్థల పనితీరును సమీక్షించాలి. కానీ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇండిగో సంస్థ విమానాలను పెంచుకుంటున్నంతగా సిబ్బందిని పెంచుకోలేదు. ఆ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు సమీక్ష చేయలేదు?. దీని గురించి ప్రజలు, ప్రయాణీకులు ప్రశ్నిస్తే చంద్రబాబు మా పార్టీపై పడి ఏడుస్తున్నారు. తెలుగువారి పరువే కాదు, మొత్తం దేశం పరువునే పోగొట్టారు. తప్పు చేశారు కాబట్టే అర్నాబ్ గోస్వామి చర్చను బాయ్ కాట్ చేశారు అని పేర్ని నాని అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి పేర్నినాని
-
మ్యాట్నీకే పవన్ సినిమా ఎత్తేస్తారు.. నువ్వెందుకు ఆపడం
-
అంత బిల్డప్ ఇచ్చి జగన్ నే ఫాలో అవుతున్నావ్ కదా
-
నువ్వు ఉప ముఖ్యమంత్రివా.. లేక మంత్రగాడివా
-
Perni Nani: చంద్రబాబు అనైతిక రాజకీయాల్లో భాగంగానే ఎమ్మెల్సీల రాజీనామాలు
-
రాజకీయాల్లో చంద్రబాబు వింత పోకడ: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్‌లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు. -
బాబు, నాదెండ్లపై నిప్పులు చెరిగిన పేర్ని నాని
-
చంద్రబాబును మించిన పెద్ద దొంగ.. నాదెండ్ల మనోహర్ పై పేర్ని నాని సెటైర్లు
-
‘రైతులు రోడ్డున పడ్డా చంద్రబాబుకు పట్టింపు లేదు’
తాడేపల్లి : ఏపీ రాష్ట్రాన్ని కూటమి నేతలు దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉండి కూడా ఏపీకి నష్టం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే రైతులు రోడ్డున పడినట్టే. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరికి అరటి పంటని కూడా అమ్ముకోలేక పోతున్నారు.పొగాకు, మిర్చి, మామిడి, పత్తి, కొబ్బరి, పామాయిల్, ధాన్యం.. ఇలా ఏ పంటకూ ధరలేదు. రైతులు సర్వనాశనం అవుతున్నా చంద్రబాబుకు పట్టింపు లేదు. జగన్ హయాంలో రైతలు ఎంత గొప్పగా బతికారు? చంద్రబాబు హయాంలో ఎలా ఉన్నారు?, ప్రపంచమంతా వ్యవసాయంలో యంత్రాలు వాడుతున్నారుఇక చంద్రబాబు కొత్తగా నేర్పించేదేంటి?, ఈ 20 నెలల్లో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నైనా తెచ్చారా?, చంద్రబాబు వాడే హెలికాప్టర్లు, విమానాలకు వెంటనే డబ్బులిస్తారు. కానీ రైతులకు మాత్రం ధాన్యం అమ్మిన డబ్బులు ఇవ్వటం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతుల ధాన్యాన్ని రానివ్వటం లేదు. రైతులు కాలర్ ఎగరేయటం కాదు, కనీసం ఒంటి మీద చొక్కా వేసుకునే పరిస్థితి కూడా లేదు. పోలీసులు, టీడీపీ గూండాలు లేకుండా ఎమ్మెల్యేలు రైతుల దగ్గరకు వెళ్లే దమ్ముందా?, 85 లక్షల మంది రైతుల్లో ఎంతమందికి క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు?, తుపానులు, వరదల వలన నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వందల ఎకరాల భూములను మాత్రం ఇష్టం వచ్చి వారికి దోచి పెట్టే పనిలో ఉన్నారు. దళితులు, పేద రైతుల ఎసైన్డ్ భూములను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టారు. ధరల స్థిరీకరణ నిధితో పంటలు కొంటామని చెప్పి ఒక్క గింజైనా కొన్నారా?, దళ్వాకు సాగు నీరు అందించాలి. ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ప్రధానిని ఎన్నిసార్లు కలిసినా రైతులకు మేలు చేయమని ఎందుకు అడగటం లేదు?, లేఖల పేరుతో డ్రామాలు ఎందుకు?, ఇరిగేషన్ లో ఓనమాలు తెలియని వ్యక్తి రామానాయుడు. బుడమేరు వరదలతో వందలమందిని చనిపోయినా పట్టించుకోని వ్యక్తి. అలాంటి వారు కూడా జగన్ గురించి విమర్శలు చేస్తారా?, కేంద్ర జలసంఘాన్ని ఏనాడైనా కలిసి రాష్ట్రానికి ఏమైనా మేలు చేశారా?, జగన్ తప్పులు చేస్తే ఈ 20 నెలల్లో ఎందుకు సరి చేయలేదు?’ అని ప్రశ్నించారు. -
వీళ్లందరినీ తలుపుకొట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు
-
Perni Nani: పంచనామా అవలేదు.ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో లేదో!
-
ఎల్లో మీడియాపై పేర్ని నాని ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: ఎల్లోమీడియాపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్నినాని మీడియాతో మాట్లాడారు.రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. టీటీడీ మాజీ ఏవీఎస్ఈవో చనిపోతే ఆయన ఇంటిని పోలీసులే జల్లెడ పట్టారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. సతీష్ కుమార్‌పై ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. సతీష్ కుమార్‌ది అసలు ఆత్మహత్య?హత్య?అని తెలుసుకునేలోపే ఇల్లంతా జల్లెడపట్టారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకూ తెలియదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడ? అని ప్రశ్నించారు. -
మచిలీపట్నం ప్రజా ఉద్యమంలో దుమ్మురేపుతున్న పేర్ని నాని, కిట్టు
-
చంద్రబాబు ఇంతమంది ప్రాణాలు పోతే మీకు బాధ్యత లేదా?: పేర్నినాని
-
‘2027లో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు.సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసనమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురహంకార, ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా 2027నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, సాకె శైలజానాథ్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, రుహుల్లా, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాదయాత్ర సాహసోపేత నిర్ణయం: మాజీ మంత్రి మేరుగు నాగార్జున దేశ రాజకీయ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర చరిత్రను మార్చేసింది. తన పాదయాత్ర ద్వారా అడుగడుగునా అన్ని వర్గాల వారిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసి పాలనలోనూ దిక్సూచిగా నిలిచారు.మళ్లీ జగన్ ప్రజా పాలన వస్తుంది: మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను, ఆకాంక్షలను దగ్గర్నుంచి చూసిన పార్టీ అర్టీ అధ్యక్షులు వైయస్ జగన్, వాటికి పరిష్కారాలను వెతుకుతూ ఆసాంతం ముందుకుసాగారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రజా పాలన వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మాజీ మంత్రి పేర్ని నాని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్, నిరంతరం ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, వేధింపులు, కేసులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 2,516 గ్రామాల ప్రజలను పలకరించి వారి ఆకాంక్షలను స్వయంగా తెలుసుకున్నారు. ఆప్యాయమైన తన పలకరింపు, చిరునవ్వుతో ప్రతి గుండెను తాకారు.చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు, లాయర్లు, వృత్తి పనులు చేసుకునే కార్మికులు, కౌలు రైతులు.. ఇలా అన్ని వర్గాలను పలకరించి అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలను విని తానొస్తే ఏం చేయబోయేది వివరించారు. 124 బహిరంగ సభల ద్వారా పాదయాత్రలో తాను చూసిన అంశాలను, తన అనుభవాలను వివరించడంతోపాటు ప్రజాభిలాషకు అనుగుణంగా అధికారంలోకి వస్తే ఏం చేయబోయేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెబుతూ వచ్చారు. 55 ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కుల వృత్తులను బతికించడానికి ఏం చేయాలనే దానిపై కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.వైద్య విప్లవం తెచ్చిన ఘనత జగన్‌దే..సింగిల్‌గా పోటీ చేసి 151 స్థానాల్లో భారీ విజయం నమోదు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో తన పాలన ద్వారా చూపించారు. సమాజంలో వెనుకబాటుకు కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించి రాష్ట్రంలో విద్యావిప్లవం తీసుకొచ్చారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకునే క్రమంలో అప్పులపాలై కుటుంబాలు చితికిపోవడమో లేదా వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మార్చాలని వైద్య విప్లవం తీసుకొచ్చారు. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయాలని తపించి తన ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీలను పూర్తి చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది.ఢిల్లీలో నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం 800 స్కూల్స్‌ను పదేళ్లలో మార్చి చూపిస్తే, వైఎస్ జగన్ హయాంలో (కరోనాతో రెండేళ్లు పోయినా) మూడేళ్లలో 16 వేల పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం రికమండేషన్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారంటే ఎంతగొప్పగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులను నాశనం చేశారు. ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ధన దాహంతో ప్రైవేటుపరం చేస్తున్నాడు. వైద్య విద్య చదవాలన్న పేదవిద్యార్థుల ఆశలకు గండి కొట్టాడు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పెత్తందారీ విధానాలతో పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలను బలితీసుకుంటున్నది చంద్రబాబే..మోంథా తుపాన్‌తో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు వెళితే.. ఎవర్నీ చంపకుండా రావాలంటూ నారా లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సభలు, పబ్లిసిటీ స్టంట్ల ద్వార అమాయకుల ప్రాణాలను బలి పెట్టే లక్షణం చంద్రబాబుదని మర్చిపోయినట్టున్నాడు. ఎన్నిలకు ముందు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో ఏడుగురు, గుంటూరు సభలో ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్నాడు. గుంటూరులో చీరల పంపిణీ పేరుతో పేదలను బలితీసుకున్నాడు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగి దేవుడ్ని చూడ్డానికి వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సింహాచలం గుడిలో గోడ కూలి ఏడుగురు, తిరుపతిలో 9 మంది చనిపోయారు. ఏకాదశి రోజున కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. దీన్ని ప్రైవేటు ఆలయం అని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటు. శాంతిభద్రతల శాఖను నిర్వహించే చంద్రబాబు కనీస బాధ్యత తీసుకోలేదు. చేతకానివారు, అవినీతిపరులు, తప్పుడు ఆలోచనలు ఉన్నవారు అధికారంలో ఉంటే ప్రజలకు శాపాలుగా మారతాయని చెప్పడానికి ఈ వరుస దుర్ఘటనలే ఉదాహరణలు.వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్న నారా లోకేశ్.. మోంథా తుపాన్‌తో రైతులు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆయన మాత్రం ముంబైలో కుటుంబంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. నేనే గెలిపించానని ప్రచారం చేసుకుంటున్నారు. రైతులు అల్లాడిపోతుంటే అమిత్‌షా కొడుకుతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం గొప్ప అనుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో 2027 నుంచి మళ్లీ మరోసారి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. మళ్లీ ప్రజలందర్నీ నేరుగా పలకరించి అక్కున చేర్చుకుంటారు. -
Perni Nani: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఎనిమిదేళ్లు...


