సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను పోలీసులు, ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకోలేరు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని నాని అన్నారు.
‘‘వైఎస్ జగన్‌పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్‌ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను రాకుండా ఆపలేరు. కృష్ణాజిల్లాలో ఒక్క మంత్రిగాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని.. జిల్లా మంత్రిగాని ఒక్క ఎమ్మెల్యే గాని... రైతులకు జరిగిన నష్టాన్ని పొలంలోకి వచ్చి చూడలేదు. ఎల్లో మీడియాలో రావడానికి పొలంలో ఫోటోలకు పోజులు మాత్రమే ఇస్తారు. రైతు కష్టాన్ని పొలంలోకి వచ్చి విన్నవాడు ఎవరూ లేరు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.


