krishana district
-
ప్రొద్దుటూరులో ప్రాణం తీసిన రూ.150 అప్పు
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రొద్దుటూరు గ్రామంలో దారుణం జరిగింది. రూ.150 రూపాయల అప్పు ప్రాణాలు తీసింది. వెంకటస్వామి వద్ద భుజంగరావు అనే వ్యక్తి 150 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.భుజంగరావును వెంకటస్వామి ఛాతిపై గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా భుజంగరావు కుప్పకూలిపోయారు. భుజంగరావును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘గుడ్లవల్లేరు’లో ఏం జరగలేదట!.. మీడియాపై లోకేష్ చిందులు
సాక్షి, కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరగలేదంటూ మీడియాపై మంత్రి నారా లోకేష్ చిందులు తొక్కారు. విచారణ జరగక ముందే ఆ కాలేజీ ఏం జరగలేదని ఆయన తేల్చేశారు. ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దని మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్ ఆగ్రహం వెళ్లగక్కారు.మరోవైపు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, చంద్రబాబు ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.కాగా, ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు?. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు.కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకం
సాక్షి, కృష్ణా జిల్లా: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకానికి దిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి పాల్పడింది. మీడియా సిబ్బందిపైనా కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడికి దిగింది. విద్యార్థినులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో దాడి చేసింది.వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి : ‘చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి’ అంటూ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు వైఎస్ జగన్.‘చంద్రబాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు.మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. -
బందరు తీరంలో భారీ చేప.. బరువు తెలిస్తే షాకే..
సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు. -
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
సాక్షి, కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య శ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్‌కు కావ్యశ్రీ చెప్పిన కానీ తమకు వారసుడిని ఇవ్వాలంటూ అత్త, మామ వేధింపులకు పాల్పడ్డారు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రగిలిపోతున్న ‘మండలి’.. జంపేనా?
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ రగిలిపోతున్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.. తొలి జాబితాలో అవకాశం దక్కక పోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్‌కు పంపించగా, అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు. సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు బుద్ధ ప్రసాద్ దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కడ టీడీపీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోయింది. మరో వైపు, కృష్ణా జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే యోచనలో బుద్ధ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ‘‘తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ బుద్ధ ప్రసాద్ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం -
గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు అడ్డంగా బైక్‌లను నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడింది. కాగా, గుడివాడ రాజకీయం హీటెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. -
స్థల వివాదంలో తన్నుకున్న జన సైనికులు
సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్లో జన సైనికులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దుపై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. కొట్టుకునేందుకు సమయం చెప్పి ఇరువర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఒక వర్గానికి నాయకత్వం వహించారు. ఆయన వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. -
‘బాబూ.. ఆ సీటు అమ్ముకున్నావా? లేదా..?’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును బీసీలెవ్వరూ నమ్మరని, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. నిన్నటి దాకా తన సొంత సామాజికవర్గం తప్ప మిగతా సామాజిక వర్గాల వారందర్నీ చంద్రబాబు హీనంగా, చులకనగా చూశాడు. ఇప్పుడేమో రేపోమాపో ఎన్నికలగానే మళ్లీ ఆయన వేషం మార్చాడంటూ మంత్రి దుయ్యబట్టారు. పెడనలోని మార్కెట్ యార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. బీసీలపై చంద్రబాబు దొంగ ప్రేమ: మీ తోకలు కత్తిరిస్తాం.. అంతుచూస్తానంటూ.. బీసీల్ని బెదిరించిన ఈ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు. ఈ రోజు జయహో బీసీ పేరిట పార్టీ కార్యక్రమం పెట్టుకుని అందులో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, బండారు సత్యన్నారాయణ, ఇంకా కొంతమంది బీసీలకేదో చేసినట్టు పెద్దపెద్దగా రంకేలేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీల విషయంలో ఎంతగా పశ్చాతాప్తం పడ్డా.. వాళ్ల మాటల్ని బీసీలు నమ్మరు గాక నమ్మరు. బీసీలకు పెద్దన్నగా జగన్‌కు ఆదరణ: అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం జగన్. అందుకే, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని చెప్పుకోవాలి. గర్వంగా చెప్పుకుంటున్నాం... కేబినెట్లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది. 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్సీల రాజ్యసభ్య సీటును అమ్ముకున్న నీచుడు చంద్రబాబు: చంద్రబాబు రాజ్యాంగ పదవుల నియామకంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపుసోదరులందరినీ మోసం చేశాడు. ఎస్సీ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని.. తెలుగుదేశం పార్టీ సీనియర్‌గా ఉన్న వర్ల రామయ్య గారికి కబురు పంపితే.. పాపం, ఆయన భారీ ర్యాలీగా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చేలోగానే.. ఆ రాజ్యసభ సీటును నీ సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రనాథ్‌కుమార్‌కు అమ్ముకున్నావా..లేదా..? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నాను. మోసానికి కేరాఫ్ చంద్రబాబు: చంద్రబాబు పేరు చెబితే మోసం గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనైనా ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి జమ చేశాడా..?. డ్వాక్రా అక్కచెల్లమ్మలకు రుణమాఫీ అని చెప్పి చేతులెత్తిపోయాడు. ఆయన ఎగొట్టిన రుణమాఫీని వైఎస్ జగన్ వచ్చాక అమలు చేసిన పరిస్థితి మీ అందరూ గుర్తుచేసుకోవాలి. అదే విధంగా రైతుల్ని కూడా రుణమాఫీ పేరిట నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన పాదం పెడితేనే పచ్చని పంటలు కూడా నిలువెల్లా మాడిమసైపోతాయి. చంద్రబాబు ఉంటే కరువు.. కరువంటే కేరాఫ్ చంద్రబాబు అనేది గుర్తు. మానవత్వమే జగనన్న కులం: అదే మన జగనన్న అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నేటి వరకు అంటే 2019 నుంచి ఇప్పటి దాకా ప్రతీ అక్కచెల్లెమ్మలు, రైతులు, అవ్వాతాతలు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వసంక్షేమం ఎంత జమ అయిందో అందరూ లెక్కగట్టండి. కులం, మతం, రాజకీయం, ప్రాంతం చూడకుండా మన జగనన్న ఇప్పటికీ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము అక్షరాలా రూ.2.41 లక్షల కోట్లు. జగనన్న మనసున్న మనిషి. మానవత్వమే ఆయన కులం. కనుకే, ఈరోజు అన్ని సామాజికవర్గాల అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులు, యువత ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ అప్పట్లో ఏం చేశాడు..?: గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్‌కళ్యాణ్..?. గతంలో మీరిద్దరూ కలిసే పోటీ చేశారు కదా..? ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా నీ దత్తదండ్రి చంద్రబాబును నువ్వు ప్రశ్నించావా..?. రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచితే.. ఆ పాపంలో నువ్వు కూడా భాగస్వామిగా ఉండలేదా..?. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? గ్రామగ్రామాన జగన్ మార్కు ఇది: చంద్రబాబుది దద్దమ్మ పాలన అని పిల్లోడు కూడా చెబుతున్నాడు. అదే మా జగనన్న ముఖ్యమంత్రిగా తన మార్క్‌ను గ్రామగ్రామాన చూపించారు. ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్నన్న మార్క్ కనపడుతుంది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. అందరం ఏకతాటిపైకొచ్చి బాబు, పవన్‌లను చిత్తుగా ఓడిస్తాం: చంద్రబాబు అధికార హయాంలో ప్రజల ఖాతాల్లో ఎందుకు ఒక్క రూపాయి కూడా జమచేయలేకపోయాడని అందరూ ఆలోచన చేయాలి. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్. మరి, మా ప్రభుత్వం పేదలకిచ్చిన సొమ్మంతా గత పాలకులు ఏం చేశారు..? అంటే, వాళ్లు దోచేసుకున్నారు.. పంచుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంక్షేమ లబ్ధిని లెక్కగట్టి.. చంద్రబాబు దవడ పగిలేటట్టు రేపటి ఎన్నికల్లో ఆయనకు అందరూ బుద్ధిచెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
సామాజిక జైత్రయాత్ర.. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన
సాక్షి, కృష్ణా జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని వివరిస్తూ వారిని చైతన్య పరిచే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పెనమలూరు నియోజకవర్గంలో గురువారం సాగింది. కంకిపాడు ప్రధాన సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు సంక్షేమ పాలనను ప్రజాప్రతినిధులు, నాయకులు వివరించారు. తాడిగడప వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మధ్యాహ్నం.. మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం మోటర్ బైక్ ర్యాలీ కంకిపాడు వరకూ సాగింది. చంద్రబాబుకు ఇదే నా సవాల్: మంత్రి జోగి రమేష్ దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఒకే ఒక్క సీఎం జగన్. 14 ఏళ్లలో సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు వందల కోట్లకు అమ్ముకున్నాడు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపించారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు ఇదే నా సవాల్. మీ మేనిఫెస్టోతో రండి.. మా మేనిఫెస్టోతో వస్తాం. చర్చించే దమ్ముందా?. చంద్రబాబుకే గ్యారంటీ లేదు. ఇక మనకేం గ్యారంటీ ఇస్తాడు జగన్ పాలనలోనే సామాజిక న్యాయం: మంత్రి మేరుగ నాగార్జున సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు సీఎం జగన్.చంద్రబాబు ఏరోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు.చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు.వెనుకబడిన వర్గాలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూసింది ప్రజలు గుర్తించాలి: ఎంపీ మోపిదేవి వెంకటరమణ అణగారిన వర్గాలను గతంలో ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. సంక్షేమాన్ని అందిస్తూ సీఎం జగన్ దేశంలోనే గొప్ప నాయకుడిగా నిలిచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు మరోమారు పొత్తులతో చంద్రబాబు, పవన్ వస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాన్ని అందించిందో ప్రజలు గుర్తించాలి. మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకోవాలి. సీఎం జగన్ ఉంటేనే మన భవిష్యత్తు మారుతుంది. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 20వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది. గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు జనం నీరాజనాలు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. ఉదయం 10.30 గంటలకు చిన్న మంగళాపురంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం జరగనుంది. 12.00 లకు మంగళాపురం గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. సాయంత్రం 3.30 కి పాలకొండ ప్రధాన సెంటర్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సాధికార యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు శకుంతలమ్మ డిగ్రీ కళాశాలలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం శకుంతలమ్మ కళాశాల నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 3:30 గంటలకు బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు హాజరుకానున్నారు. నంద్యాల జిల్లా: శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు మండలం నల్ల కాల్వ వద్ద వైఎస్సార్ స్మృతి వనంలో తటస్థులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం అనంతరం వైఎస్సార్ స్మృతివనం నుంచి ఆత్మకూరు వరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు హాజరుకానున్నారు. -
‘సీఎం జగన్ పాలనే కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కాదని.. ఒక జాతికి మాత్రమే అధ్యక్షుడు అంటూ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయితే.. తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేశారు?. అందుకే చంద్రబాబు వాళ్ల జాతికి మాత్రమే అధ్యక్షుడు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎవరూ బయటకు రాలేదు.. వాళ్ల జాతి తప్ప మరెవరూ బయటికి రాలేదు’’ అని దుయ్యబట్టారు. ‘‘జగనన్న ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండటం చారిత్రాత్మకమైన విషయం. ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు’’ అని మంత్రి చెప్పారు. సీఎం జగన్ పాలన మాకు కావాలి. మా పిల్లల భవిష్యత్తుకు కావాలి. మా కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎదగడానికి కావాలి. మా ఆరోగ్య పరిరక్షణకు ఔషధంలా పనిచేస్తున్న జగనన్న మాకు కావాలి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది గడపలకు బటన్ నొక్కి డబ్బులు పంపించారు. ఆ డబ్బుతో మా కుటుంబాలు సంతోషంగా ఆర్థికంగా బాగున్నాయని ప్రతి అక్క, చెల్లి అంటున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చదవండి: జగనే ఎందుకంటే.. -
తైవాన్ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి
సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. చల్లపల్లికి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్ యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్ లియూ అంగీకరించారు. దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్‌కు దివిసీమ రైతాంగం షాకిచ్చింది. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద రైతు సమస్యలపై సామూహిక సత్యాగ్రహ దీక్ష పేరిట బుద్ధ ప్రసాద్ డ్రామాకు తెరతీశారు. బుద్ధ ప్రసాద్‌కు వత్యిరేకంగా పులిగడ్డ సెంటర్లో దివిసీమ రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాడు-నేడు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దివిసీమ రైతాంగం.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి, సీఎం జగన్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితులపై ఫోటోలు ప్రదర్శించారు. రైతులకు మేలు చేయకపోగా దొంగ దీక్షలు ఎందుకంటూ మండలి బుద్ధ ప్రసాద్‌ను దివిసీమ రైతులు నిలదీశారు. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
కృష్ణా: పీఎస్ ముందే టీడీపీ గూండాల హల్చల్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతలు, కార్యకర్తలు బరి తెగించడంతో వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రంగన్నగూడెం ఘటనలో ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు రాగా, పోలీస్ స్టేషన్ వద్దే టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలోనే వైసీపీ శ్రేణులపైకి టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్‌గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చదవండి: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ: సజ్జల -
లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, వంశీలను చంపుతానన్న లోకేష్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావుపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం. దమ్ముంటే తండ్రీకొడుకులు గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి. టీడీపీ సైకోలందరినీ పెట్టుకుని సభలో చెలరేగారు.’’ అని గుడివాడ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కాగా, నారా లోకేష్‌కి పోలీసులు షాకిచ్చారు. నిన్న(మంగళవారం) సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు. -
నారా లోకేష్‌కు బిగ్ షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్‌కి పోలీసులు షాకిచ్చారు. నిన్న సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు. -
పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. పాదయాత్ర చేసుకుంటూ పోతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం.. జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, తమకు బలం ఉందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా ఏమిటో తేలిపోయింది. అభ్యర్థులు లేకపోవడం, ఉన్న వారి మధ్య గొడవలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సినిమా డైలాగ్‌లను వల్లె వేస్తున్నా టీడీపీలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులే లేకపోవడమే అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉన్న నేతలు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. లోకేశ్‌నైతే అసలు పట్టించుకోవడమే లేదు. ఆ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు యువగళం యాత్రను బహిష్కరించడమే ఇందుకు ఉదాహరణ. లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదవండి: బేల ‘గళం’.. అభ్యర్థులు లేక హైవే రూటు! -
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో దారుణం జరిగింది. జవారుపేట సెంటర్లో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్ వైద్యుడు ముచ్చెర్ల మహేశ్వరరావు భార్య రాధను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దోపిడీకి కోసం ఇంట్లో చొరబడి తన భార్యను హత్య చేసినట్లు డాక్టర్ చెబుతున్నారు. గొంతుకోసి హత్య చేసి, నగదు, నగలు దోపిడీ చేశారని ఆయన తెలిపారు ఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుంది. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు.. ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ రవి ప్రకాష్ పరిశీలించారు. ఆ ఇంటికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య -
కృష్ణా: ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, కృష్ణా జిల్లా: సంచలనం సృష్టించిన ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏడీజే(జిల్లా అదనపు జడ్జి) కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24, 2014న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తడంతో హత్య కోసం ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లను మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను ఢిల్లీలోనే అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు. అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్బ్యాచ్ )కూడా అక్కడే ఉన్నట్టు పోలీసులు కేసు రిపోర్టులో పేర్కొన్నారు. చదవండి: ప్రియునితో జీవిస్తోందని భర్త కిరాతకం? విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అందించాడు. తవేరా కారును ఆ షూటర్స్ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు. -
చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. ఆదివారం ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడంటూ దుయ్యబట్టారు. ‘‘గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.. పేదలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కుడా పేదలకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సెంటు భూమికుడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వారిని విమర్శించడానికి సిగ్గుశరం ఉండాలి’’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. చదవండి: వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్! -
నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు: మంత్రి జోగి రమేష్
సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెడన నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ సింహంలా సింగిల్‌గా వస్తాడు. చంద్రబాబు, దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కలిసొచ్చినా జగన్‌ని ఏం చేయలేరు. 2024లో 151పైగా స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామని మంత్రి అన్నారు. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని -
సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే..
సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దాతృత్వాన్ని కొనసాగిస్తూ గుంటూరులో కొందరు పేదలకు వరాల జల్లు కురిపించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో గిరిధర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని శ్యామలా నగర్ వచ్చారు. పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో కొందరు తమ గోడు వెళ్లబోసుకుని సాయం చేయమని వేడుకున్నారు. వారందరినీ పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్ వద్దకు తీసుకురమ్మని అధికారులకు ఆదేశించారు. అక్కడికక్కడే ఆదేశాలు అధికారుల సాయంతో హెలిప్యాడ్‌కు చేరుకున్న వి.మరియమ్మ, కోటేశ్వరరావు దంపతులు తమ గోడును వివరిస్తూ.. తమ రెండో కుమారుడు నవీన్ థలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడని, దీనికి రూ.26 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంటిస్థలం కూడా లేదని వాపోయారు. వెంటనే సర్జరీకి ఏర్పాటు చేసి.. ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జె.బాబు, శివ లక్ష్మి దంపతులు మాట్లాడుతూ మునిసిపాలిటీలో ఉద్యోగం తీసేశారని, ఆ ఉద్యోగం తమ కుమారుడికి ఇప్పించాలని వేడుకున్నారు. వెంటనే సీఎం జగన్ అందుకు తగిన ఆదేశాలిచ్చారు. బి.పేరిరెడ్డి అనే వ్యక్తి గోడు చెప్పుకుంటూ.. గతంలో కిడ్నీ వ్యాధికి సర్జరీ చేయించుకున్నానని కొంత ఆర్థిక సాయం చే యాలని కోరగా.. ఆయనకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని, వైద్యం అవసరమైతే తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా, కె.పుష్ప జైన్ మాట్లాడుతూ తమ జైన్ సొసైటీకి కల్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆగమేఘాల మీద సీఎం ఆదేశాలను సాయంత్రానికల్లా అమలు చేశారు. అప్పటికప్పుడే తమ కోర్కెలను మన్నించి న్యాయం చేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. పేదల పక్షాన ప్రభుత్వం: కలెక్టర్ గుంటూరులోని కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి, జేసీ జి.రాజకుమారి బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. చదవండి: ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం.. -
చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు?
కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎలాగైనా సైకిల్ జెండా ఎగరేయాలని పచ్చ పార్టీ అధినేత బోల్డన్ని ప్లాన్లు వేస్తున్నారు. అధికార పార్టీ నేతను ఓడించేందుకు బాగా సంపాదించిన ఎన్ఆర్ఐని రంగంలోకి దించారు. అయితే అక్కడ ఎప్పటినుంచో ఉన్న నేతలు ఎన్ఆర్ఐని పట్టించుకోవడంలేదట. పాపం చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పర్యటనకు వెళితే రెండు వర్గాలు కొట్టుకుని జనాన్ని తేవడం మర్చిపోయారట. ఆ నియోజకవర్గం సంగతేంటో చూద్దాం. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద గెలవడం సంగతి తర్వాత.. ముందు అమెరికా నుంచి దించిన ఎన్ఆర్ఐ.. లోకల్ లీడర్లు కలిసి పని చేసేవిధంగా చూసుకోండని పచ్చ పార్టీ మీద సెటైర్లు పడుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కొరకరాని కొయ్యలా మారారు. తన పరువు తీస్తూ.. కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం గుడివాడ ఇన్చార్జ్గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు కొడాలి నానిని ఎదుర్కొనడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న చంద్రబాబు అమెరికాలో బాగా సంపాదించిన వెనిగండ్ల రామును తీసుకువచ్చారు. ఆయన వచ్చీ రావడంతోనే నియోజకవర్గంలో రావికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది స్థానిక నేతలను తనవైపు తిప్పుకున్నారట. చంద్రబాబు మద్దతుతో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము దిగగానే అప్పటివరకు పార్టీకోసం పనిచేసిన రావి వెంకటేశ్వరరావు ఒంటరిగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సీనియర్ టీడీపీ నేతలు పలువురు రావి వెంకటేశ్వరరావుకు మద్దతుగా నిలిచారు. ఇప్పడిదే గుడివాడలో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు గుడివాడ పర్యటన సందర్భంగా కూడా పార్టీలోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు సీనియర్ల మద్దతుతో చంద్రబాబు టూర్ సందర్భంగా ఎన్ఆర్ఐ వర్గంతో తలపడ్డారు. దీంతో బాబు సభ పక్కకు పోగా రెండు వర్గాల మధ్య కొట్లాట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి గొడవతో అసలే తక్కువగా వచ్చిన జనాల్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చంద్రబాబు రాకముందే అందరూ వెళ్ళిపోయారు. ఇస్తామన్న డబ్బలు ఇవ్వకపోవవడంతో టీడీపీ నేతలతో కిరాయికి వచ్చిన వారు గొడవ పడటం కూడా చర్చకు దారి తీసింది. చంద్రబాబు గుడివాడ పర్యటన ఖర్చంతా భరించడానికి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము రెడీ అయ్యారు. అయితే బాబు పర్యటన ఏర్పాట్లు సమీక్షించడానికి సమావేశమైన జిల్లా నేతలు వెనిగండ్లను పిలవలేదట. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు చెప్పినట్లు చేయాల్సిందేనంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరుతో విడుదలైన లేఖ తీసుకెళ్లి వెనిగండ్ల రాము చంద్రబాబు దగ్గరే పంచాయితీ పెట్టారట. చదవండి: ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? పార్టీ కోసం ఎంతో ఖర్చు చేస్తున్న తనకు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ కడిగేశారట. నియోజకవర్గంలోని పరిస్థితులు, తన పర్యటన కారణంగా సంభవించిన పరిణామాలు చంద్రబాబుకు శిరోభారంగా మారాయని టాక్. అయితే గుడివాడ సీటు వెనిగండ్ల రాముకే అనే సంకేతాలు చంద్రబాబు ఇవ్వడంతో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం సందర్భంగా నానా రచ్చ జరిగింది. మొత్తంగా మాంచి దూకుడుగా ఉపన్యాసం ఇద్దామని గుడివాడ వచ్చిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపించారు. ఒక వైపు పార్టీ నేతల మధ్య గొడవలు, సభకు జనం లేకపోవడంతో చంద్రబాబు అందరిమీద అసహనం వ్యక్తం చేశారని సమాచారం. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్