
ప్రతీకాత్మక చిత్రం
పెడన(కృష్ణా జిల్లా): ఒక వ్యక్తి ఇంట్లో భార్యతో గొడవ పడి స్నేహితుని ఇంటికి వచ్చి పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటనపై పెడన పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గూడూరు మండలం పిండివానిపాలెంకు చెందిన చింతల తిరుమలరావు(30)కు రెండేళ్ల కిందట వివాహమైంది. భార్య, ఎనిమిది నెలల పాప ఉన్నారు.
చదవండి: వైద్య విద్యార్థిని ఆత్మహత్య
ఇంటి వద్ద కూర విషయంలో గురువారం ఉదయం భార్యతో గొడవపడి పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న స్నేహితుడు గోపీ ఇంటికి వచ్చి, స్నేహితుడు లేని సమయంలో పురుగుమందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వగా వారు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. తిరుమలరావు భార్య నిర్మల జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్‌ఐ మురళి శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment