Curry
-
దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!
చాలామంది భారతీయులు ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. ఇక అక్కడ ఉండే మన వాళ్లకు కొన్ని విషయాల్లో మన భారత్‌లో ఉన్నట్లు కుదరదు. ఆ దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా మలసుకోక తప్పదు. అలాంటి వాటికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ఆ వీడియోలో మన భారతీయ వంటకాల వాసనలు దుస్తుల నుంచి రాకూడదంటే ఏం చేయాలో.. కొన్ని చిట్కాలను షేర్ చేశారు.మన భారతీయులు వంట చేయగానే కూర వాసన చూస్తారు. ఆ తర్వాత రుచి ఎలా ఉందో చూస్తాం. పైగా ఆ ఘుమ ఘుమలు వండిన వాళ్ల శరీరం నుంచి రావడం మాములే. కానీ పాశ్చాత్యా దేశాల్లో ప్రజల తీరు చాలా క్లీన్‌గా.. క్రమపద్ధతిలో ఉంటుంది. అక్కడ ఆహారాలన్నీ మన వంటకాల మాదిరి ఘుమఘుమలు రావు. అందువల్ల బట్టలకు గనుక కూర వాసన వస్తే చాలు వాళ్లు భారతీయులు అన్నట్లు గుర్తించడమే గాక అదోలా ముఖాలు పెట్టుకుంటారు కూడా. అందువల్ల ఆ వాసన రాకుండా కాస్త జాగ్రత్తలు తప్పనిసరి ఆ విషయాన్నే కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేసింది. తనకు కూడా అలా దుస్తుల నుంచి కూరల వాసన రావడం ఇష్టముండదట. అలా కర్రీ వాసన రాకుండా ఎలా జాగ్రత్తపడాలో కొన్ని చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. మన భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలు, మసాలాలు ఉంటాయి. వాటి ఘాటు వాసన దుస్తులను అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి వంట చేసేటప్పడు ధరించిన బట్టలనే బయటకు వెళ్లేటప్పడు ధరించొద్దని అంటున్నారు. అలాగే వంట చేసే సమయంలో జాకెట్లు ధరించకపోవడమే మంచిదని సూచించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆమెది శ్వేతజాతీయుల భావన అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shivee Chauhan | Indian in USA | Desi Lifestyle (@shiveetalks) (చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!) -
తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు!
సీ ఫుడ్ అంటే సాధారణంగా చేపలు పీతలు, రొయ్యలు గుర్తొస్తాయి చాలామందికి. అయితే నత్త మాంసం గురించి ఎపుడైనా విన్నారా? ఓ మై గాడ్.. నత్తలా.. దేన్నీ వదలరా ..ఎలా తింటార్రా బాబూ అనిపించినా ఇది నిజం. అంతేకాదు చాలా రోగాలు నయమవుతాయని విశ్వసిస్తారు తీర ప్రాంత ప్రజలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నత్తల కూరను చాలా ఇష్టంగా తింటారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఆహార అలవాట్లు భిన్నంగా ఉంటాయి. నత్తలు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని గోదావరి వాసులు అంతేకాదు నమ్ముతారు. ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం పోర్చుగల్‌తో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చాలా ఇష్టపడే వంటకం. ఇది దగ్గు, క్షయవాధి ఆయాసం వంటి జబ్బులకు బాగా పనిచేస్తుందని భావిస్తారు. ప్రొటీన్ ఎక్కువ, కొవ్వు తక్కువనత్తలతో వెరైటీ వంటలు కూడా చేస్తూ ఉంటారు నత్త మాంసంలో ప్రోటీన్ కంటెంట్ పంది మాంసం , గొడ్డు మాంసంలో ఉండే ప్రోటీన్ లభిస్తుంది.కానీ కొవ్వు చాలా తక్కువ. ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీరంలోని కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు బలంగా ఉండటానికి, బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కళ్లు, జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు నత్తల ద్వారా మనకు అందుతాయి. రక్తహీనతను మెరుగుపరుస్తుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది.ఈ జబ్బుతో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించి రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. హార్ట్ బీట్‌ను నియంత్రిస్తుంది. శ్వాస కోశ సమస్యలు, ఫైల్స్ ఉన్నవారు నత్త ప్రత్యేకంగా తింటారు. అయితే వీటిని షెల్‌ను జాగ్రత్తగా తొలగించి, ముందుగా ఉప్పు, పసుపుతో శుభ్రంగా కడిగాలి. ఆ తరువాత మజ్జిగలోగానీ, నిమ్మరసం కానీ కొద్దిసేపు ఉంచితే నీచువాస పోతుంది. వేడినీళ్లలో ఉడికించాలి. తరువాత చికెన్, మటన్ కర్రీ తరహాలోనే ఈ నత్తల కూరను తయారు చేస్తారు. నత్తలు, గోంగూరతో కలిపి కూడా కర్రీ చేస్తారు. కొత్తగా పెళ్లయిన వారు పిల్లలు పుట్టని వారు నత్తల కూర తింటే ఎంతో ఉపయోగం నమ్ముతారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)పచ్చివి, ఉడికీ ఉడకని నత్తలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో, ఎలుక ఊపిరితిత్తుల వ్యాధి అనే పరిస్థితికి దారి తీస్తుంది. కనుక మేలిమి జాతి సముద్ర నత్తలతో పాటు స్థానికంగా వర్షాకాలంలో ఎక్కువగా దొరికే నత్తలను శుభ్రంగా కడిగి, ప్రవీణులైన వంటగాళ్ల సలహా మేరకు అవసరమైన మసాలా దినుసులు జోడించి, జాగ్రత్తగా ఉడికించిన తరువాత తింటే... ఆ మజానే వేరు!ఇవీ చదవండి: ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే.. ‘ఆహా ఏమి రుచి’ అనాల్సిందే!డ్రీమ్ జాబ్ : అమ్మకోసం రూ.2 కోట్ల జాక్ పాట్ కొట్టిన టెకీ -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కివీ కర్రీ గురించి విన్నారా..!
కివీ పండ్లు రుచే వేరేలెవెల్ అన్నట్లు ఉంటాయి. ఇది ఎంత బాగుంటుందంటే..తింటుంటే పుల్లగా తియ్యగా మరోవైపు దానిలోని గింజలు క్రంచిగా తగులుతు భలే ఉంటాయి. మాములుగా కివీ పండ్లను నేరుగా తినేస్తాం. అంతే తప్ప వాటితో రెసిపీలు తయారు చేయడం గురించి వినలేదు కదా. కానీ శ్రీలంకలో ఈ కివీ పండ్లతో కర్రీ చేస్తారట. టేస్ట్ వారెవ్వా అనేలా ఉంటుదట. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ కివీ పండుని కర్రీలా చేసుకుని తినడం వల్ల ఎలాంటి పోషకాలు నష్టపోమని చెబుతున్నారు శ్రీలంక చెఫ్ మినోలి డి సిల్వా. నిక్షేపంగా కూరగా చేసుకుని తినొచ్చట. కర్రీ ఎలా చేస్తారంటే..ఒక పాన్‌లో కొబ్బరి నూనె వేసి, అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో కారం పొడి, నల్ల మిరియాలు, గ్రౌండ్ జీలకర్ర, సొంపు పొడి, ధనియాలపొడి వేసి ఓ అరంగంట కలపుతూ ఉండాలి. అందులో టమాటాలు, జీడిపప్పు వేసి ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి నీరు సగం లేదా పూర్తిగా వేసి ఉడికించాలి. చివరగా కివీ పండ్లు వేసి మిగిలిని కొబ్బరి నీరు, కొబ్బరి పాలు జోడించాలి. ఈ రెసిపీలో కివీ పుల్లదనం తెలియాలంటే కొద్దిగా సాస్, ఉప్పుని జోడించాలి. ఈ కర్రీని అన్నం లేదా రోటీలతో తింటే టేస్ట్ అదిరిపోతుందట. అయితే ఈ రెసిపీలో కివీ పండు రుచిని కొబ్బరి పాలు మరింత టేస్టీగా ఉండేలా చేస్తుందట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Chef Minoli De Silva (@minoli.desilva) (చదవండి: మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..! ఏకంగా దట్టమైన ..) -
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బోడకాకర ఉంటే, మటన్, చికెన్ దండగ, ఒక్కసారి రుచి చూస్తే
ఏ సీజన్లో లభించే కూరగాయలు, పళ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంటే ఆయా కాలంలో వచ్చే వైరస్లు, రోగాల నుంచి కాపాడతాయని దీని అర్థం. వర్షాకాలం పచ్చగా నిగ నిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకర కాయ. వీటినే బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇంకా అడవి కాకర, ఆ-కాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడకాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలోపేతం చేస్తుందని, సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు నిపుణులు.శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందిస్తుంది. విటమిన్ డీ12, విటమిన్ డీ, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివి లభిస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీన్ని ఫ్రై లేదా, ఉల్లిపాయలు, మసాలతో కూర చేసుకుంటారు. పోషకాలతో పోలిస్తే, చికెన్, మటన్ కంటే ఇది చాలా బెటర్ అంటారు. బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలుబోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకుమంచిది. రోగనిరోధక శక్తిని బలపడుతుంది తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.రక్తపోటు, కేన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలోసాయపడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఫ్లావనాయిడ్లు వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్‌తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్‌లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్‌కుకర్‌లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
నోరూరించే ఫేమస్ తెలంగాణ వంటకాలు (ఫొటోలు)
-
చల్లని వాతావరణానికి.. కమ్మని 'గ్రీన్ కర్రీస్'!
వాతావరణం మారింది... వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ కోల్డ్... ఇంకా అనుబంధ సమస్యలు కూడా. ఇమ్యూనిటీ పుష్కలంగా ఉండడమే అన్నింటికీ పరిష్కారం. ఆహారంలో రుచికి తోడుగా ఆరోగ్యాన్ని జోడించాలి. రోజూ ఏదో ఒక ఆకు కూర తింటే ఆరోగ్యం పరిపూర్ణం. రోజూ ఆకు కూరలేనా... అని పిల్లలు ముఖం చిట్లిస్తే... పిల్లలు ఇష్టపడే కాంబినేషన్లతో వండి పెట్టండి.ఆలూ మేథీ..కావలసినవి..బంగాళదుంప– 200 గ్రా;మెంతి ఆకు – మీడియం సైజు కట్ట ఒకటి;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 2 టేబుల్ స్పూన్లు;జీలకర్ర – టీ స్పూన్;ఇంగువ – పావు టీ స్పూన్;వెల్లుల్లి తరుగు – టీ స్పూన్;అల్లం తరుగు – టీ స్పూన్;పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;ఎండుమిర్చి – 2; పసుపు – అర టీ స్పూన్;ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లుతయారీ..– బంగాళదుంప ఉడికించి తొక్క తీసి ముక్కలు చేయాలి.– మెంతి ఆకులు వలిచి శుభ్రంగా కడిగి, నీరంతా పోయిన తర్వాత తరిగి పక్కన పెట్టుకోవాలి.– బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి సన్నమంట మీద వేయించాలి.– పసుపు, బంగాళాదుంప ముక్కలు వేయాలి. మసాలా దినుసులు ముక్కలకు పట్టేటట్లు మధ్య మధ్య కలియబెడుతూ ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.– ఇప్పుడు ధనియాల పొడి, మెంతి ఆకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద మగ్గనిచ్చి దించేయాలి. పిల్లల లంచ్ బాక్సుకు ఇది మంచి పోషకాహారం.క్యారట్ మొరింగా కర్రీ.. కావలసినవి..క్యారట్ – పావు కేజీ;మునగ ఆకు – వంద గ్రాములు;జీలకర్ర – అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;పచ్చిమిర్చి – 4 (తరగాలి);వెల్లుల్లి రేకలు – 3 (తరగాలి);అల్లం తరుగు – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;నూనె – 2 టీ స్పూన్లు.తయారీ..– క్యారట్‌ని శుభ్రం చేసి తరగాలి. మునగ ఆకును కడిగి నీరు పోయేటట్లు చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.– బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి, వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి.– మునగాకు కలిపి రెండు నిమిషాలు(పచ్చివాసన పోయే వరకు) వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.– అరకప్పు నీరు పోసి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల్లో క్యారట్ ముక్కలు ఉడుకుతాయి.– మూత తీసి నీరు ఆవిరయ్యే వరకు కలిపి దించేయాలి. ఇష్టమైతే కూరలో చివరగా కొబ్బరి పొడి చల్లుకోవచ్చు. గమనిక: మునగ ఆకు లేకపోతే మెంతి ఆకుతో చేసుకోవచ్చు. -
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
మే నెల వచ్చేసింది... ఎండలు మండుతున్నాయి. భోజనం చేయాలంటే చెమటలు పడుతున్నాయి. కూరలను చూస్తేనే ఆకలి పోయి దాహం వేస్తోంది. నేరుగా మజ్జిగలోకి వెళ్లాలనిపించేంత దాహం అది. అందుకే పెరుగుతోనే కూరలు చేసుకుందాం. ఇవన్నీ నాలుకకు హితవుగా ఉంటాయి. తిన్న తర్వాత పొట్టను చల్లగా ఉంచుతాయి.దహీ బైంగాన్..కావలసినవి.. వంకాయ – 1 (మీడియం సైజు); నూనె – టేబుల్ స్పూన్ (వంటకు ఉపయోగించే నూనె ఏదైనా) ; ఆవనూనె – టేబుల్ స్పూన్ (పోపు కోసం) ; యాలకులు – 2 ; లవంగాలు – 2 ; పెరుగు – పావు లీటరు (చిలకాలి). గ్రేవీ కోసం: మెంతిపిండి – టేబుల్ స్పూన్ ;అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; కశ్మీర్ మిర్చిపౌడర్ – టేబుల్ స్పూన్ ; నీరు – కప్పు (పై వన్నీ కలపడానికి) ; ఇంగువ– చిటికెడు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; పసుపు – టీ స్పూన్.తయారీ..ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో మెంతిపిండి, మిర్చిపౌడర్, అల్లం పేస్టు వేసి కలపాలి.వంకాయను మందపాటి చక్రాల్లా తరిగి ఉప్పు రాయాలి.నూనె వేడి చేసి వంకాయ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి(ఎయిర్ ఫ్రయర్ ఉంటే నూనె లేకుండా ఫ్రై చేసుకోవచ్చు)అదే బాణలిలో మిగిలిన నూనెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, ఇంగువ వేయాలిఇందులో మెంతిపిండి, అల్లం, మిరప్పొడి కలిపిన మిశ్రమం, పసుపు వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలిఆ మిశ్రమం వేడెక్కిన తర్వాత పెరుగు వేసి గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మరో కప్పు నీటిని పోసి కలిపితే చిక్కటి గ్రేవీ తయారవుతుందిఇప్పుడు ఉప్పు కలిపి గ్రేవీ చిక్కదనాన్ని సరిచూసుకుని అవసరమైతే మరికొన్ని నీటిని పోసి మరగనివ్వాలిఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలిపి వడ్డించాలిఇది అన్నంలోకి రోటీకి కూడా మంచి కాంబినేషన్.పులిస్సెరి..కావలసినవి.. పెరుగు – పావు లీటరు ; పసుపు – పావు టీ స్పూన్ ; నీరు – పావు లీటరు. కొబ్బరి పేస్టు కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చిమిర్చి– 3 ; జీలకర్ర– టీ స్పూన్; నీరు – కప్పు లేదా కొబ్బరి పేస్టు చేయడానికి తగినంత.పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు (వంటకు ఉపయోగించే కొబ్బరి నూనె లేదా ఇతర వంట నూనె) ; ఆవాలు – అర టీ స్పూన్ ; కరివేపాకు – 2 రెమ్మలు ; మెంతులు– పావు టీ స్పూన్ ; ఎండుమిర్చి– 2 ; ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు ; అల్లం – అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి) ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేయాలి. తగినంత నీటిని వేస్తూ మెత్తగా చేసుకోవాలిఒక పాత్రలో పెరుగు, పసుపు, నీరు కలిపి చిలికి అందులో ఉప్పు, కొబ్బరి పేస్టు వేసి కలపాలిఈ పాత్రను స్టవ్ మీద పెట్టి మీడియం మంటమీద మధ్యలో గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.దీనిని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మరగడం మొదలైన వెంటనే దించేయాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలిఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత పోపును ముందుగా వేడి చేసి సిద్ధంగా ఉంచిన పెరుగు– కొబ్బరి పేస్టు మిశ్రమంలో కలిపి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. ఈ కేరళ వంట అన్నంలోకి రుచిగా ఉంటుంది.గుజరాతీ కడీ..కావలసినవి: శనగపిండి– 4 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చిమిర్చి పేస్ట్– అర టేబుల్ స్పూన్ (అల్లం అంగుళం ముక్క, రెండు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి); తాజా పెరుగు – కప్పు ; బెల్లం లేదా చక్కెర – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నీరు – రెండున్నర కప్పులు. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ; ఆవాలు – అర టీ స్పూన్ ; జీలకర్ర– అర టీ స్పూన్ ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; కరివేపాకు – ఒక రెమ్మ ; ఎండు మిర్చి – 2; మెంతులు – పావు టీ స్పూన్ ; ఇంగువ – చిటికెడు ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..ఒక పాత్రలో శనగపిండి, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, బెల్లం, ఉప్పు వేసి బాగా చిలకాలిబాణలిలో నూనె వేడిచేసి ఆవాలు వేయాలిఅవి పేలిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, ఎండు మిర్చి (విరిచి వేయాలి), మెంతులు, ఇంగువ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలిఈ పోపును ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు – శనగపిండి మిశ్రమంలో వేసి కలపాలిఇప్పుడు ఆ పాత్రను మీడియం మంట మీద ఉంచి మిశ్రమం అడుగుకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలిమిశ్రమం మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి కలుపుతూ మాడకుండా చూసుకోవాలిశనగపిండి పచ్చి వాసన పోయిన తర్వాత మిశ్రమం మంచి రుచికరమైన వాసన వస్తుంటుంది. అప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలిగుజరాతీ కడీని సూప్లాగ భోజనానికి ముందు తాగవచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, రోటీలోకి కూడా తినవచ్చు. ఇది వేసవి, శీతాకాలాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గుజరాతీ కడీ, కుకురార్కుకురార్..కావలసినవి.. చికెన్ – అర కేజీ ; చిక్కటి పెరుగు – 5 టేబుల్ స్పూన్లు ; బంగాళదుంప – 2 (ముక్కలుగా తరగాలి) ; అల్లం వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – 3 (తరగాలి) ; ఆవ నూనె లేదా సాధారణ వంటనూనె – 5 టేబుల్ స్పూన్లు ; చక్కెర – చిటికెడు ; ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి ; ఎండు మిర్చి– 5 ; పచ్చిమిర్చి– 3 (నిలువుగా చీరాలి) ; పసుపు – టీ స్పూన్ ; మిరప్పొడి– 2 టీ స్పూన్లు ; గరం మసాలా పొడి – టీ స్పూన్ ; చికెన్ మసాలా పొడి– టీ స్పూన్ ; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి.అందులో పసుపు, చికెన్ మసాలా పొడి, మిరప్పొడి వేసి మసాలా పొడులు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలిఈ లోపు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఇంగువ, చక్కెర, ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలిఇవి చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులోనే పెరుగు కూడా వేసి సమంగా కలిసేటట్లు ఒకసారి తిప్పి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టాలిఉల్లిపాయలు వేయించిన బాణలిలో మిగిలిన నూనెలో బంగాళాదుంప ముక్కలు వేయించి ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలిఅదే బాణలిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి తీసి పెట్టుకోవాలిఇప్పుడు మిగిలిన నూనెలో మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలిచికెన్ ముక్కలు ఎర్రగా వచ్చేవరకు వేయించి అప్పుడు ఉప్పు వేసి ముక్కలకు పట్టేటట్లు కలపాలిచికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతున్న సమయంలో బంగాళాదుంప ముక్కలను వేయాలిఈ రెండింటినీ కలిపి పది నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులో రెండు కప్పుల నీరు పోసి కలిపి మంట పెంచి ఉడకనివ్వాలిచికెన్ ఉడికేటప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితోపాటు గరం మసాలా పొడి, చిలికిన పెరుగు మిశ్రమాన్ని వేయాలిఇవన్నీ కలిసి ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. ఈ కుకురార్ అస్సాం వాళ్ల వంట. అన్నం, రోటీల్లోకి రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!
పురాతన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు, ఆయుధాలు, విలువైన వస్తువుల గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే వేటితో వంటలు చేసుకునేవారు, వారు ఉపయోగించిన వంట సామాగ్రి గురించి విన్నాం. కానీ పురాతన కాలంలో ఎలాంటి కూరలు వండుకునేవారు, ఏం తినేవారు తెలియదు. వాటి గురించి చరిత్రకారులు రాసిన దాఖాలాలు కూడా లేవు. అయితే తాజాగా ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేం కర్రీ?.. ఏ దేశపు వంటకం అంటే.. మన పూర్వీకుల తరుచుగా ఏం వంటకాలు వండుకుని తినేవారు అనే దిశగా సాగిన తవ్వకాల్లో కొంత వరకు పురొగతి సాధించారు శాస్త్రవేత్తలు. ప్రతి వంటకం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వంటకాలే. అయితే ఆ కాలంలో కుండలు, దంతాల అవశేషాల సామాగ్రితో చేసుకునేవారు. ఇక్కడ శాస్త్రవేతలు హరప్పా నగరమైన రాఖీగర్హికి ఆగ్నేయంగా ఉన్న ఫర్మానాలో పూర్వీకుల వంటకాలు గురించి చేసిన అన్వేషణలో నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన వంటకాన్ని గుర్తించారు వారు తవ్వకాల్లో ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ మిశ్రమం ఆధునికులకు బాగా తెలిసిన రెసిపీనే. ముఖ్యంగా ఇది భారతదేశ వంటకం. దీంతో ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదయ్యిన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. మన పూర్వీకులు, అరటి పండ్లు, మామిడి వంటివి తినేవారని, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించినట్లు తవ్వకాల్లో గుర్తించారు గానీ కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే తాజాగా గుర్తించిన పురాతన కూరలో వాడిన అల్లం పసుపు హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లోనే గుర్తించడం జరిగింది. అంతేగాదు ఈ సుగంధ ద్రవ్యాలే 2023లో వియత్నాంలో 2 వేల ఏళ్ల నాటి ఇసుకరాయి స్లాబ్‌పై కనిపించి కూర అవశేషాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ పరిశోధకులు మైక్రోస్కోపిక్ ద్వారా స్టార్చ్ ధాన్యాలను పరిశీలించారు. విశ్లేషణలో పసుపు, అల్లం, వంటి విభిన్న సుగంధద్రవ్యాల మూలాలను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఆసియా వంటకాల మూలాలు చరిత్రలో స్థిరంగా ఉన్నాయని తెలుస్తోందన్నారు శాస్తవేత్తలు. ఇక పురాతన వంటకాన్ని ఎలా చేస్తారో చూద్దామా..! మన భారతీయలు ఈజీగా చేసుకునే వంకాయ వేపుడే!.. నాటి పుర్వీకులు చేసుకునేవారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే.. వంకాయ వేపుడు పురాతన వంటకంగా తెలుస్తోంది. ఈ రెసిపీని నాటి పూర్వీకులు ఎలా చేసుకున్నారనే దాని గురించి ప్రముఖ చెఫ్ కునాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. కావాల్సిన పదార్థాలు. . రెండు పెద్ద సైజు వంకాయలు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు ఉప్పు తగినంత తయారీ విధానం: ఓ కడాయిలో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేయించి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నవంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఓ ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ..! View this post on Instagram A post shared by Kunal Kapur (@chefkunal) (చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!) -
చూడడానికి పాములా భయపెడుతుంది.. కానీ చల్లగా కాపాడుతుంది..
పొట్లకాయ.. స్నేక్‌గార్డ్. చూడడానికి పాములా భయపెడుతుంది. కానీ.. ధైర్యంగా నమిలి మింగేస్తే సరి. పొట్టలోకి వెళ్లి చల్లగా కాపాడుతుంది. సమ్మర్ గార్డ్ ఫ్యామిలీలో ఇదీ ఒకటి. పొట్టను కాపాడే కాయ.. పొట్లకాయ. వేడి నుంచి రక్షించే.. కూరగాయ ఇది. దీనినే ఎన్నో రకాలుగా వండవచ్చు. ఎంతో రుచిగా మార్చవచ్చు. అలాగే పచ్చడి చేసి నిల్వ చేయవచ్చు కూడా. మరి ఈ పొట్లకాయ రుచుల తీరేంటో తెలుసుకుందాం.. పొట్లకాయ పెసరపప్పు.. కావలసినవి.. పొట్లకాయ ముక్కలు– 2 కప్పులు; పెసరపప్పు – అర కప్పు ; కొబ్బరి తురుము – అర కప్పు ; ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2 ; కరివేపాకు – 2 రెమ్మలు ; ఇంగువ– పావు టీ స్పూన్ ; నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; చక్కెర – టీ స్పూన్. తయారీ.. బంగాళాదుంపను శుభ్రం చేసి నిలువుగా కోసి గింజలను తొలగించిన తర్వాత ముక్కలు చేయాలి. పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి. పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగేటప్పుడు పొట్లకాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉడికించాలి. పప్పు ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత ఉప్పు కలిపి పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడకడానికి నీరు సరిపోకపోతే మరికొంత నీటిని చిలకరించి ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. మినప్పప్పు వేగిన తర్వాత చక్కెర, ఉడికించి సిద్ధంగా ఉంచిన పొట్లకాయ – పెసరపప్పును వేసి కలపాలి. తేమ ఆవిరి అయ్యే వరకు కలియబెడుతూ వేయించి చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి రుచి కూరగాయ ముక్కలకు పట్టడం కోసం ఓ నిమిషం పాటు గరిటెతో కలియబెడుతూ వేయించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గే కొద్దీ కూర రుచి ఇనుమడిస్తుంది. ఇది సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ పొరిచ్చ కొళంబు పొట్లకాయ పొరిచ్చ కొళంబు.. కావలసినవి: కందిపప్పు – అరకప్పు; పొట్లకాయ ముక్కలు – 3 కప్పులు ; సాంబారు పొడి – టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్. పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; పచ్చి శనగపప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2; మినపప్పు– టీ స్పూన్ ; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు ; ఇంగువ – చిటికెడు ; నూనె – టీ స్పూన్. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ;ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – టీ స్పూన్ ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన ఉంచాలి. పొడి కోసం తీసుకున్న దినుసులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పొట్లకాయను శుభ్రంగా కడిగి తరిగి గింజలు తొలగించి ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో ఉప్పు, సాంబారు, పొట్లకాయ ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేటట్లు నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన కందిపప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఉడికించిన పొట్లకాయ ముక్కలను, మసాలా పొడి వేసి నీరు పోసి కలిపి ఉడికించాలి. పప్పు, కూరగాయ ముక్కలు, మసాలా పొడి అన్నింటి రుచి కలిసే వరకు ఉడికించి, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, నిమ్మరసం మరికొంత చేర్చుకోవచ్చు పోపు కోసం మందపాటి పాత్ర తీసుకోవాలి. పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు వేయించి కరివేపాకు వేసి ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచిన కందిపప్పు కూరగాయ ముక్కల మిశ్రమాన్ని పోసి కలిపి దించేయాలి. ఘుమఘుమలాడే పొట్లకాయ పొరిచ్చ కొళంబు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది. పొట్లకాయ పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – కప్పు; ఎండుమిర్చి –3 ; మినప్పప్పు – టేబుల్ స్పూన్ ; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ; వేరు శనగపప్పు లేదా నువ్వులు లేదా కొబ్బరి తురుము – పావు కప్పు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్; చింతపండు– అంగుళం ముక్క ; బెల్లం పొడి– టీ స్పూన్ (ఇష్టమైతేనే). పోపు కోసం: నూనె– టేబుల్ స్పూన్ ; ఆవాలు– టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్ ; ఎండుమిర్చి– ఒకటి; ఇంగువ– చిటికెడు ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. మందపాటి బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చిని దోరగా వేయించి మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాణలిలో పొట్లకాయ ముక్కలను వేసి పచ్చిదనం తగ్గేవరకు వేడి చేసి ఆపేయాలి. చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి, అందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరో రౌండ్ తిప్పాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి పచ్కడిలో వేసి కలపాలి. ఇది అన్నంలోకి ఇడ్లీ, దోసెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ వేపుడుకూర పొట్లకాయ వేపుడుకూర.. కావలసినవి: పొట్లకాయ ముక్కలు – పావుకేజీ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; జీలకర్ర– టీ స్పూన్ ; పసుపు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; ఇంగువ– చిటికెడు ; కారం – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి– టేబుల్ స్పూన్ ; నీరు– పావు కప్పు ; వేరుశనగ పప్పుల పొడి లేదా శనగపిండి– టేబుల్ స్పూన్. తయారీ.. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, పసుపు, ఇంగువ వేసి కలపాలి. పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో ఉప్పువేసి, కొద్దిగా నీటిని పోసి కలపాలి. మసాలా పొడులన్నీ సమంగా కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాణలిలో పొట్లకాయ ముక్కలు వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ముక్కలకు మసాలా సమంగా పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ముక్కల్లో నీటిని పోసి కలిపి మంట తగ్గించి మూత పెట్టాలి. రెండు నిమిషాలకోసారి మూత తీసి గరిటెతో ముక్కలను కలిపి మళ్లీ మూత పెడుతుండాలి. పది నిమిషాలకు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి. చివరగా వేరుశనగపప్పు పొడి లేదా శనగపిండి చల్లి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..? -
మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!
కూరల్లో ఒక్కోసారి మసాలాలు ఎక్కువై టేస్ట్ మారిపోద్ది. పైగా బాగా ఘాటుగా ఉంటుంది. ఎంతలా అంటే గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. బాబోయ్ తినలేం అని పడేద్దామంటే మనసొప్పదు. అంత ఖరీదైన మసాలా దినుసులు వేసి పడేయ్యడం అంటే బాధ అనిపిస్తుంది ఎవ్వరికైనా. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే కూరపడేయాల్సిన బాధ తప్పుతుంది. పైగా రుచికి రచి ఉంటుంది. అవేంటో చూద్దామా!. కూరల్లో గరం మసాలా పొడులు మోతాదు మించితే కూర రుచి మారిపోతుంది, చేదు వస్తుంది. అలా చేదు వచ్చినప్పుడు కూరల్లో అర కప్పు చిక్కటి పాలు లేదా టేబుల్ స్పూన్ మీగడ కలపాలి. పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడని వాళ్లు జీడిపప్పు పొడి లేదా వేరుశనగపప్పు పొడి కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే చేదు తగ్గడంతోపాటు కూర రుచి ఇనుమడిస్తుంది కూడా. మార్కెట్లో కొన్న మసాలా పొడుల్లో ప్యాకెట్ సీలు విప్పినప్పుడు ఉన్నంత సువాసన ఆ తర్వాత ఉండదు. కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కుని తెరిచిన వెంటనే మొత్తం వాడేయడం ఒక పద్ధతి. పెద్ద ప్యాకెట్ కొన్నప్పుడు కొద్దిగా వాడిన తర్వాత ప్యాకెట్లోకి గాలి దూరకుండా క్లిప్ పెట్టాలి. గరం మసాలా పొడులను ఇంట్లోనే ఎక్కువ మోతాదులో చేసి నిల్వ ఉంచుకోవాలంటే... పొడిని తేమలేని సీసాలో పోసి గాలి చొరకుండా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేసిన పొడి ఏడాదంతా నిల్వ ఉంచినా తాజాదనం తగ్గదు. (చదవండి: వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!) -
ఈ స్టయిల్లో మటన్ కీమా మెంతి ట్రై చేశారా? అస్సలు బోర్ కొట్టదు!
వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ వెంట ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు మాంసాహార ప్రియులు. ప్రతీ వారం ఒకే లాగా కూర చేసుకుంటే తినడానికి బోర్ కొడుతుంది.చిన్న పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు కదా. అందుకే మటన్ కీమా మెంతి కూరతో కలిపి పోషకాలతోపాటు రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి: కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగిన మటన్ కీమా – పావుకిలో రెండు కట్టలు చింత మెంతి కూర(శుభ్రం చేసి కడిగినవి), ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా, బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి దాదాపు గంటలో ఈ వంటకాన్ని రడీ చేసుకోవచ్చు. తయారీ విధానం కుక్కర్లో శుభ్రం చేసిన కీమాకు కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు కారం వేసి బాగా కలిపి మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఇపుడు ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేడి చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బే ఆకులు , గరం మసాలా వేసి, వేయించినూనె తేలెదాకా వేయించాలి. ఇపుడు ఉడికించి పెట్టుకున్న కీమావేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. ఇక చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడక నివ్వాలి. మంచి సువాసనతో కుతకుత లాడుతూ ఉడుకుతుంది. ఇందులో ఇష్టమున్న వాళ్లు రెండు చిన్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచి మటన్ కీమా మెంతికూర రడీ. దీన్ని చక్కని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీన,ఉల్లిపాయ, నిమ్మ స్లైస్‌లతో అందంగా గార్నిష్ చేయండి. రైస్తోగానీ, చపాతీలో గానీ చక్కగా ఆరగించే యొచ్చు. అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. -
ఫ్రిజ్‌లో పెట్టిన కర్రీ తింటే డేంజరా?
రిఫ్రిజ్‌రేటర్లు వచ్చిన తర్వాత నుంచి వేస్ట్ అంటూ ఏమి ఉంచకుండా ప్రతీదీ దాంట్లోకే తోసేస్తున్నాం. ప్రతీ కూర మూడు నుంచి వారం రోజులకు పైనే ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నాం. ఇలానే తమిళనాడుకు చెందిన చిన్నారి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ కర్రీ తిని మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు కొద్ది పాటి అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకీ ఫ్రీజ్‌లో పెట్టిన కూరలు తినొచ్చా? ఎన్ని రోజుల వరకు ఉంచి తింటే మంచిది? తమిళనాడులోని అరియలూరుకి చెందిన గోవిందరాజులు అనిర్బసి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్లు కోడిమాంసం తెచ్చుకుని వండుకుని తినగా మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. అంతే ఇంటిల్లపాది ఆస్పత్రి పాలయ్యారు. కానీ చిన్న కుమార్తె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఫుడ్ పాయిజ్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకీ వాళ్లు సరిగా నిల్వ చేయలేదా? మరేదైనా అనేది తెలియాల్సి ఉంది. ఇలా అందరం సర్వసాధారణంగా చేస్తాం. కానీ పలు సందర్భాల్లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనలు తలెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఫ్రిజ్‌లో ఎలా నిల్వచేయొచ్చు. ఎన్ని రోజుల వరకు ఏ కూర అయినా ఉంచొచ్చు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం!. కూరల్లో సాధారణంగా టమాట, కొబ్బరి, మసాలా దినుసులు జోడించి ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అయితే మనకు నిల్వ ఉండాలనుకుంటే తక్కువ సేపట్లోనే ఉడికిపోయేలా వండుకోవాలి. ముఖ్యంగా నాన్‌వెజ్‌కి సంబంధించిన బటర్ చికెన్, వంటివి ఎక్కువసేపు మంటపై వండకూడదు. తక్కువ టైంలోనే వండేసి, ప్రిజ్‌లో పెట్టాలనుకున్న దాన్ని వేరుగా గాలి చొరబడిన బాక్స్‌లో వేసి ఫ్రిజలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా రుచి పాడవ్వదు. అలాగే కూర వండిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేలా చేస్తే మంచిది. అలాగే బట్టర్ చికెన్ వంటి కూరలు వండటానికి ముందే చికెన్‌ని మసాల, కారం పొడులతో చక్కగా మారినేట్ చేసుకుని ఫ్రిజ్ నాలుగు నుంచి ఐదు గంటలు ఉంచి వండుకోండి. అదికూడా జస్ట్ 30 నిమిషాలకు మించి ఉడకనివ్వకండి. అలాగే మటన్ వంటి కొన్ని రకాల నాన్‌వెజ్‌లు ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి వాటిని ప్రెజర్ కుక్కర్ వంటి వాటిల్లో వండుకోండి. త్వరితగతిన ఉడికిపోతాయి. పైగా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్న కర్రీలను మంచి టైట్ బాక్స్‌లో ఉంచి పెట్టడం మంచిది. అలాగే ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడూ నీటిగా క్లీన్ చేసి ఉంచుకుంటే ఎలాంటి బ్యాక్టీరియాలు దరిచేరవు. ఫుడ్ పాయిజన్లు అవ్వడం జరగదు. ఏదైనా గానీ నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం చల్లటి నీళ్లు పడకుండా ముందుగా వేరొక పాత్రలో తీసుకుని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు కర్రీలో గరిటలు పెట్టి వాడేసి, ఆ తర్వాత మిగిలింది కదా అని ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజలుకు గానీ ఆ విషయం గుర్తుకు రాదు. అప్పటికే అది పాడైపోయి ఉంటుంది. ఇక పడేయ్యడం ఇష్టం లేక తిని ఆస్పత్రి పాలవ్వుతారు. దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. వంటకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగురకతతో వ్యవహరించండి. (చదవండి: నలభైలో కూడా 20లా కనిపించాలంటే..! ఇలా చేయండి!) -
సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. మటన్ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది. రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి? లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం.. లాలూ: అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం. రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ? లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు. మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
కూరల్లో గ్రేవీ కోసం..చల్లటి నీళ్లు పోస్తున్నారా..!
కూరలు వండేటప్పుడే ఒక్కొసారి బాగా రావు. లేదా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు చిన్న చిన్న ఈ చిట్కాలు పాటిస్తే వాటినిపడేయాల్సిన అవసరం లేకుండా మంచిగా వాడుకోవచ్చు. అలాగే రుచి పోకుండా చేయొచ్చు కూడా. అవేంటో చూసేద్దామా!. గ్రేవి రుచికరంగా పోషకాలు పోకుండా ఉండాలంటే.. పాలకూరలో టీస్పూను పంచదార, కాసిన్ని నీళ్లుపోసి పది నిమిషాలపాటు మరిగించి, తరువాత చల్లటి నీటిలో వేయాలి. చల్లారాక గ్రైండ్ చేసి గ్రేవీల్లోకి వాడుకుంటే పాలకూరలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. కూరల్లో గ్రేవీ కోసం కొన్నిసార్లు నీళ్లు పోస్తుంటాము. అయితే ఇలా పోసే నీళ్లను కాస్త మరిగించి పోస్తే కూర వేడికి వేడినీళ్లు చక్కగా సరిపోయి గ్రేవీ మరింత రుచికరంగా వస్తుంది. చల్లటి నీళ్లుపోస్తే ఆ నీరు కూర ఉష్ణోగ్రతలకు చేరుకోవడానికి సమయం పట్టి గ్రేవీ అంత రుచిగా రాదు. కారం ఎక్కువైతే.. ఆలు పరాటా చేసేటప్పుడు .. ఉడికించిన బంగాళదుంపలను ఇరవై నిమిషాలపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక దుంపల తొక్కతీసి ఆలు పరోటా చేస్తే దుంపల మిశ్రమం అతుక్కోకుండా, జిగట లేకుండా పరాటాలు చక్కగా వస్తాయి. కూరలో కారం, మసాలా ఘాటు ఎక్కువైనప్పుడు, పెరుగు, ఫ్రెష్‌క్రీమ్, పాలు... వీటిలో ఏ ఒక్కటైనా కూరను బట్టి రెండు మూడు టే బుల్ స్పూన్లు వేసి కలిపితే ఘాటు తగ్గుతుంది. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరట..!
ముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మన్యంలో అయితే మరెన్నో రకాల కూరగాయలు లభ్యమవుతాయి. వెదురు నుంచి తీసిన కూరని ఎప్పుడైన వండుకొని తిని ఉంటారా? వినడానికే ఎంతో కొత్తగా ఉన్న మన్యం వాసులు మాత్రం వెదురు నుంచి తీసిన చిగురును కూర వండుకొని తింటారు. దీనిని మన్యం వాసులు వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. కానీ వెదురు కంజి కూర టేస్టే వేరు. వెదురు కొమ్ములు సీజన్ మొదలైయింది. ప్రస్తుతం మన్యంలో మండల కేంద్రాలు, వారపు సంతల్లో వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా జరుగుతున్నాయి. అటవీ, కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని సంతల్లో రూ.20 నుంచి రూ.50 లు వరకు వాటాలుగా విక్రయిస్తారు. వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారికి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఒక రకంగా కూర తయారు చేస్తారు. వెదురు కంజిని ఎండబెట్టి మరో విధంగా కూర తయారికీ వినియోగిస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కూర తయారు చేసుకోవాలి. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజినీ బాగా కడుగుకోవాలని గిరిజనులు చెబుతున్నారు. ఎండబెట్టుకొని ఉంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారికి వినియోగించుకోవచ్చు. ఈ వెదురు కంజి కూరను మన్యం వాసులంతా చాలా ఇష్టంగా తింటారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరును తయారు చేస్తారు. ఎన్నో ఉపయోగాలు వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు, మూడు సార్లు నీటితో శుభ్రం చేస్తారు. అప్పుడు వెదురు కంజిలో ఉండే చేదుపోతుంది. బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తీసుకుంటారు. దీంతో రక్తం శుద్ధి అవుతుందని, శరీరానికి తక్షణ శక్షి అందుతుందని, జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు నులిపురుగులను నివారిస్తుందని గిరిజనులు చెబుతారు. వెదుర కంజి ద్రావణాన్ని మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా సైతం వినియోగిస్తారు. వెదురు కంజి ఉపయోగాలెన్నో అని గిరిజనులు చెబుతారు. సంతల్లో జోరుగా అమ్మకాలు వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ20, రూ.50 చొప్పున అమ్ముతున్నాము. గతంలో మా గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగాను, ఉడకబెట్టి విక్రయిస్తున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. – కె.దొణ, పెదతమ్మెంగుల గ్రామం, ముంచంగిపుట్టు మండలం రుచికరంగా వంటకాలు వెదురు కొమ్ములతో తయారుచేసిన వంటకాన్ని ఎక్కువగా గర్భిణులకు అందజేస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం వెదురు కంజి కూరల్లో ఉంటుంది. వెదురు కొమ్ముల కూర రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి.అడవీ, కొండ ప్రాంతాల్లో లేత వెదురు నుంచి వెదురు కొమ్ములను సేకరిస్తారు .వారపు సంతలో విక్రయిస్తారు. – రాధమ్మ, సుజనకోట గ్రామం, ముంచంగిపుట్టు మండలం (చదవండి: పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!) -
మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..
మనదేశంలోని యమునా నది ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో యుమునలో రకరకాల చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో ఇన్ని చేపలు కనిపించేవి కాదని యమున పరీవాహక ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా యమునా నదిలో ఇటీవలి కాలంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి. యూపీలోని కౌశంబి జిల్లాలో పిపరీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న నలుగురు మత్స్యకారులు యమునలోని డాల్ఫిన్లను పట్టుకుని, కూర చేసుకుని తినేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర కుమార్ నసీర్పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ మత్స్యకారుల తమ వలలో పడిన డాల్ఫిన్‌ను ఇంటికి తీసుకుపోయి, కూర వండుకున్నారని రవీంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్లడాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి, నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో రాజేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారు పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్! -
కూరలో టమాటా వేశాడని.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయిన భార్య!
మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టమాటాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది మరింత పెద్దదిగామారడంతో భార్య తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. వివరాల్లోకి వెళితే టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ వర్మన్ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చినప్పటికీ ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్ నుంచి అతని భార్య ఆరతి ఫోన్ నంబరు తీసుకుని ట్రేస్ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్ అధికారి సంజయ్ జైశ్వాల్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతి వర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు. కాగా దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేపధ్యంలో వీటి కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
కప్పను తిని అస్వస్థతకు గురైన కుటుంబం..ఆరేళ్ల చిన్నారి మృతి
కప్పను చంపి ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు వండి పెట్టాడు. దీంతో కుంటుంబ అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యింది. ఈ ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటు చేసుకుంది. మున్నా అనే వ్యక్తి ఇంట్లోకి కప్ప వచ్చింది. అతను పాముపై ఉన్న కోపంతో కప్పను చంపి దానితో సాంబారు చేశాడు. దీన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. కొద్ది సేపటికే వారంతా వాంతులు చేసుకుని స్ప్రుహతప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా.. ఆరేళ్ల చిన్నారి సుమిత్ర ముండా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతేగాదు మరో నాలుగేళ్ల చిన్నారి మున్నీ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ కూర తిన్న ఆ చిన్నారుల తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు ఆ చిన్నారి మృతిని అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, వీఎస్ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా మాట్లాడుతూ..కప్పల శరీరంలోని పరోటిడ్ గ్రంథి వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి విషాన్ని కలిగి ఉంటుంది. ఇది కప్పను తినే వారిపై ప్రభావం చూపుతుంది. అలాగే కొన్ని కప్పల చర్మం కూడా విషపూరితంగా ఉంటుందని మిశ్రా చెప్పారు. (చదవండి: పచ్చని పందిట్లో రభస..కారణం వింటే ఛీ!..అంటారు!) -
మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది
సాక్షి, మహబూబాబాద్: కోడలు వండిన టమాట కూర.. ఆ అత్త ప్రాణం మీదకు తెచ్చింది. భార్యను అవమానించిందంటూ సొంత తల్లిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. వేంనూరులో ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణ.. ఒక ప్రాణం మీదకు తెచ్చింది. వండిన టమాటా కూర బాగలేదని కోడలిని మందలించింది అత్త బుజ్జి. ఈ విషయంపై భర్తకు ఫిర్యాదు చేసింది నందిని. తన భార్యనే అట్లా అంటావా అంటూ మటన్ కొట్టే కత్తితో కొడుకు మహేందర్ సొంత తల్లిపైనే దాడికి దిగాడు. ఈ దాడిలో తల్లి బుజ్జి తల్లి తలకు తీవ్రగాయ్యాలు. వెంటనే ఆమెను స్థానికులు మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. ఆపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్ రేప్ -
కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఇవి కలపండి!
కొన్నిరకాల కూరల్లో నీళ్లు ఎక్కువైనప్పుడు రుచి అంతగా బావుండదు. ఇటువంటప్పుడు గ్రేవి చిక్కగా, మరింత రుచిగా రావాలంటే ఏం కలపాలో చూద్దాం...! ►పెరుగు, ఫ్రెష్ క్రీమ్‌లను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూరలో వేసి కలపాలి. ►దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవి చిక్కగా రుచికరంగా వస్తుంది. ►జీడిపప్పులను పాలలో నానబెట్టాలి. ►నానాక జీడిపప్పుని నేతిలో వేయించాలి. ►చల్లారాక పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూరలో వేసి పదినిమిషాలు మగ్గనిస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది. ►కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి కూరలో వేసినా గ్రేవీ చిక్కబడుతుంది. ►వేయించిన వేరు శనగపప్పుని మెత్తని పొడిలా చేయాలి. ►దీనిలో కాసిన్ని నీళ్లుపోసి కలిపి కూరలో వేస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? -
కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి..
పెడన(కృష్ణా జిల్లా): ఒక వ్యక్తి ఇంట్లో భార్యతో గొడవ పడి స్నేహితుని ఇంటికి వచ్చి పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటనపై పెడన పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గూడూరు మండలం పిండివానిపాలెంకు చెందిన చింతల తిరుమలరావు(30)కు రెండేళ్ల కిందట వివాహమైంది. భార్య, ఎనిమిది నెలల పాప ఉన్నారు. చదవండి: వైద్య విద్యార్థిని ఆత్మహత్య ఇంటి వద్ద కూర విషయంలో గురువారం ఉదయం భార్యతో గొడవపడి పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న స్నేహితుడు గోపీ ఇంటికి వచ్చి, స్నేహితుడు లేని సమయంలో పురుగుమందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వగా వారు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. తిరుమలరావు భార్య నిర్మల జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ మురళి శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
సాంబారు రుచిగా లేదని తల్లి, సోదరిని చంపిన కిరాతకుడు
బెంగళూరు: ఇటీవల కాలంలో కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు చిన్న చిన్న విషయాలకు హత్యలు చేస్తున్నారు. తాజాగా సాంబారు రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని డోడ్‌మణెలో నివాసముంటున్న నారయణ హస్లర్ అనే యువకుడు మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఆకలిగా ఉందని భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలానే తన తల్లి ఆహారాన్ని వడ్డించింది. అయితే ఆ రోజు ఇంట్లో వండిన సాంబారు అతనికి నచ్చలేదు. దీంతో కర్రీ రుచిగా చేయలేదని తల్లి, సోదరితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న తుపాకీతో కిరాతకంగా వారిద్దరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతని తల్లి, సోదరి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అడల్ట్ కంటెంట్ వ్యసనం.. ఆన్లైన్ ప్రియురాలు.. కోరికల కోసం కోటి స్వాహా -
కర్రీ పాయింట్ వద్ద ఘర్షణ.. గాయాలు
నల్లకుంట: కర్రీ పాయింట్ వద్ద జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అడ్మిన్ ఎస్సై వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక భాగ్యనగర్ బస్తీ నివాసి ప్రైవేట్ ఉద్యోగి ఆర్.రవి, అతనిస్నేహితుడు ఎస్.యాదగిరితో కలిసి శనివారం రాత్రి 11.25 గంటల సమయంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సిగ్నల్స్ సమీపంలోని ఓ ఫాస్ట్ ఫుడ్‌సెంటర్‌కు వచ్చారు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న కర్రీ పాయింట్ వద్ద ఏదో గొడవ జరుగుతుంటే ఇద్దరు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో కర్రీ పాయింట్ నిర్వాహకుడికి రవికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎం.తిరుమలేశ్ ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని రవి తలపై కొట్టాడు. తలకు గాయం కావడంతో రక్తం ఓడుతున్న రవి నేరుగా నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. గాయపడిన రవిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. తనను గాయపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రవి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే.. పోలీసులకు అందిన మరో ఫిర్యాదు ప్రకారం.. మస్తి విజయ అనే మహిళ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సిగ్నల్స్ సమీపంలో శ్రీలక్ష్మి కర్రీ పాయింట్ నిర్వహిస్తోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కర్రీ పాయింట్ పక్కనే ఉన్న రాజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు గోల్నాకకు చెందిన ఆర్.రవి, ఎస్.యాదగిరి వచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కర్రీ పాయింట్ వద్దకు వెళ్లి కర్రీ పాయింట్‌లోని స్టూళ్లపై కూర్చున్నారు. ఆ సమయంలో కర్రీ ప్యాకెట్లు పార్సల్ కడుత్ను విజయ ఏం కావాలని వీరిని పలుమార్లు అడిగింది. అయినా వారి నుంచి స్పందన రాలేదు. అదే సమయంలో కర్రీ పాయింట్లోకి వచ్చిన విజయ భర్త ఎం.తిరుమలేశ్ అక్కడ కూర్చున్న రవి, యాదగిరిలను ఏం కావాలని అడిగాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలోనే అసభ్య పదజాలంతో దూషిస్తూ తిరుమలేశ్ను ఇద్దరు కలిసి తోసివేశారు. అది గమనించిన విజయ వెంటనే భర్త తిరుమలేశ్ను గేట్ లోపలికి తీసుకు వెళ్లింది. అయినా గేట్ తోసుకుంటూ లోపలికి వచ్చిన రవి, యాదగిరిలు అక్కడ ఉన్న ఖాళీ కూల్ డ్రిక్స్ బాటిళ్ళను కింద పడవేసి హంగామా చేస్తూ తిరుమలేశ్‌పై చేయి చేసుకున్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం తిరుమలేశ్ ఓ కూల్ డ్రింక్ బాటిల్ తీసి వారిపై విసిరాడు. తమ కర్రీ పాయింట్లోకి వచ్చి తనపై దాడిచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తిరుమలేశ్ ఆదివారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ఆ ఇద్దరు మద్యం తాగి ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రుచుల పొట్లం
పొట్లకాయ తీరే వేరు. పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది. జ్వరమొస్తే పథ్యమవుతుంది. పొట్లకాయ అంటే ముఖం చిట్లించక్కర్లేదు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... చవులూరించేలా... తన రుచులు సైతం తనంత పొడవంటూ నిరూపించే పొగరుకాయ పొట్లకాయ. ఆ రుచులెలా తేవాలో తెలిపే ‘పొట్ల’మ్ ఇది. విప్పండి... చవులతో నాలుక చప్పరించండి. పొట్లకాయ రింగ్స్ కావలసినవి: బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను, కోడి గుడ్డు – 1 (పెద్దది); ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పొట్ల కాయ తరుగు – 2 కప్పులు (చక్రాల్లా తరగాలి); నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో అన్ని పదార్థాలు (నూనె, పొట్లకాయ చక్రాలు మినహా) వేసి బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి బజ్జీ పిండిలా చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ►పొట్ల కాయ చక్రాలను పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పొట్ల కాయ రింగ్స్‌ను, టొమాటో సాస్‌తో అందించాలి. పొట్లకాయ కట్లెట్ కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను శుభ్రంగా కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి (గింజలు తీసేయాలి) ►ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో మెదపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి ►బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి ►ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి ►స్టఫ్ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి (డీప్ ఫ్రై కాదు) రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►టొమాటో సాస్ లేదా చిల్లీ సాస్‌తో అందించాలి. పొట్లకాయ మసాలా కర్రీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; పల్లీ పొడి – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4; ఉప్పు – తగినంత; పొట్ల కాయ – 1 (లేతది); పసుపు – అర టీ స్పూను. తయారీ: ►పొట్లకాయలను శుభ్రంగా కడిగి మధ్యలోకి నిలువుగా చీల్చి, గింజలు తీసేయాలి ►చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో పెసర పప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►కొద్దిగా ఉడుకుతుండగానే, పొట్ల కాయ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, ఉడికించి, దింపేయాలి ►స్టౌ మీద పాన్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లి తరుగు, పసుపు, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి ►ఉడికించిన పొట్లకాయ + పెసర పప్పు మిశ్రమం జత చేసి బాగా కలిపి, నీరు పోయేవరకు మగ్గబెట్టాలి ►పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి, దింపేయాలి ►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. పొట్లకాయ చట్నీ కావలసినవి: పొట్ల కాయ – 1; నూనె – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కాశ్మీరీ మిర్చి – 3; తాజా కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు – కొద్దిగా. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, గింజలు వేరు చేయాలి ►స్టౌ మీద పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►పొట్ల కాయ తరుగు వేసి సన్నని మంట మీద ముక్కలు మెత్తబడేవరకు వేయించి, దింపి, చల్లార్చాలి ►పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, చింత పండు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి ►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ పొట్లకాయ కూర కావలసినవి: పొట్లకాయ – 1; ఉల్లి తరుగు – పావు కప్పు + పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టే బుల్ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను + అర టీ స్పూను; మిరియాలు –అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; గరం మసాలా – పావు టీ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►పొట్లకాయను పెద్ద పెద్ద ముక్కలుగా గుండ్రంగా తరిగి, అందులోని గింజలను చాకుతో జాగ్రత్తగా తీసేయాలి ► జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి +అల్లం ముద్ద, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి మసాలా ముద్ద జత మరో రెండు నిమిషాలు వేయించాలి ►పొట్ల కాయలో నుంచి వేరుచేసిన గింజలను ఈ మిశ్రమానికి జత చేసి మరోమారు వేయించాలి ►బాగా ఉడికిన తరవాత తగినంత ఉప్పు, మిరప కారం, గరం మసాలా జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి సన్నటి మంట మీద రెండు నిమిషాల పాటు ఉడికించాలి ►మూత తీసి, మరోమారు బాగా కలిపి దింపేయాలి ►తరిగి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలలోకి ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో కొద్దికొద్దిగా స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి (డీప్ ఫ్రై కాదు) కాగాక, స్టఫ్ చేసి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలను వేసి, మూత ఉంచి, మంట తగ్గించి రెండు నిమిషాల తరవాత, ముక్కలను రెండో వైపుకి తిప్పి, మళ్లీ మూత ఉంచాలి ►ఈ విధంగా రెండు నిమిషాలకోసారి ముక్కలు మెత్తబడేవరకు తిప్పుతుండాలి ►బాగా వేగిన తరవాత దింపేయాలి ►అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పాలు కూర కావలసినవి: పొట్ల కాయ – 1; కొబ్బరి నూనె – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలు – అర కప్పు (మరిగించాలి); ఉప్పు – తగినంత; తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 4; పసుపు – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొబ్బరి నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి ►ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి, ఉల్లి తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►పొట్లకాయ ముక్కలు జత చేసి, మూత ఉంచాలి ►ముక్కలు బాగా మగ్గాక, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి ►కొబ్బరి తురుము, పాలు జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి ►కూర బాగా దగ్గర పడిన తరవాత, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది. -
సామల వంటలు
సామల టొమాటో పులావ్ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి/నూనె – 2 టీ స్పూన్లు ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – రెండు క్యారట్ తరుగు – ఒక టేబుల్ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలుఅల్లం తురుము – ఒక టీ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూనుమినప్పప్పు – ఒక టీ స్పూనుటొమాటో తరుగు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూనుమిరప కారం – పావు టీ స్పూను, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, నీళ్లు, ఉప్పు – తగినంత, ఉడికించిన బఠాణీ – ఒక కప్పు తయారీ: సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, పసుపు, మిరప కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? సామలు (Littile Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.07 థయామిన్ (Thiamine) mg (B1) 0.30 కెరోటిన్(Carotene)ug 0 ఐరన్ (Iron)mg 2.8 కాల్షియం (Calcium)g 0.02 ఫాస్పరస్ (Phosphorous)g 0.28 ప్రొటీన్ (Protein)g 7.7 ఖనిజాలు (Minerals) g 1.5 పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5 పీచు పదార్థం (Fiber) g 9.8 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.68 సామలు పుట్ట గొడుగుల బిర్యానీ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు తరిగిన పుట్ట గొడుగులు – 100 గ్రా., ఉల్లి తరుగు – పావు కప్పుటొమాటో తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను పసుపు – అర టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూనుగరం మసాలా – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతనీళ్లు – 2 కప్పులు (చిరు ధాన్యాలకి) + పావు కప్పు (పుట్టగొడుగుల మసాలాకి)కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – అర కప్పుతరిగిన పచ్చి మిర్చి – 1, ఏలకులు – 1, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1దాల్చిన చెక్క – చిన్న ముక్క, జాపత్రి – చిన్న ముక్క సోంపు గింజలు – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూను కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. సామలు జతచేయాలి. కొద్దిగా నీళ్లు, కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి. సామల దద్ధ్యోదనం కావలసినవి: సామలు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు పెరుగు – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు క్యారట్ – 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నెయ్యి/నూనె – ఒక టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను మినప్పప్పు – అర టీ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలు తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను తయారీ: ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి. సామల ఖీర్ కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూను, జీడి పప్పు పలుకులు – 10 కిసిమిస్ – ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు జతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. -
ఇంటిప్స్
ఉప్పు నీటిని చల్లి వాము(ఓమ)ను కొద్దిగా వేయించితే తినేటప్పుడు ఘాటుగా అనిపించదు. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని ఆ డబ్బాలో కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.కరివేపాకును గాజు సీసాలో వేసి మూతపెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. పల్లీలను తరచూ వంటలలో ఉపయోగిస్తుంటారు. వంటకు వాడినప్పుడల్లా వాటిని, వేయించి పొడి చేసుకుంటుంటారు. అలా కాకుండా ఒకేసారి వేయించి, చల్లారాక సగం గాజు బాటిల్లో పోసి భధ్రపరుచుకోవాలి. మిగతా సగం పొడి చేసుకుని బాటిల్లో పోసి ఉంచుకుంటే టైమ్, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి. లెదర్ బ్యాగ్ మురికి పోవాలంటే హ్యాండ్‌వాష్ (చేతులు శుభ్రపరుచుకునే లిక్విడ్)లో ముంచిన దూది ఉండతో తుడవాలి. టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ మంచి నూనె కలిపి ఎండుమిరపకాయలున్న జార్లో అడుగున వేసి ఉంచితే మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.తెలుపురంగు మురికి బట్టలను ఉతికాక బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్ది సేపు నానబెట్టి, నీళ్లలో జాడించి ఆరవేయాలి. మురికి పూర్తిగా వదిలి, తెల్లగా అవుతాయి.బంగారు, వెండి నగలను విరిగిన పాలతో కడితే త్వరగా శుభ్రపడతాయి. బంగాళ దుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిలో కొన్ని కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. -
వంటకే కాదు.. ఒంటికీ మంచిది
మనం రోజూ ఒక ముద్ద ఇంత రుచిగా తినగలుగుతున్నామంటే కారణం... కరివేపాకు. తన సువాసనతో మీ నాసికాపుటాలతో పాటు మీ కడుపులో స్థలాన్నీ విప్పారేలా చేసి... మరో ముద్దను అదనంగా తినేలా చూస్తుందది. ఒక్కరోజు కరివేపాకు లేకుండా మీ వంటలను తినండి. దాని గొప్పదనం మీకు తెలిసివస్తుంది. ఒక అదనపు ముద్దతో పాటు... మరెన్నో అదనాలను సమకూర్చే ఆ కరివేప ఇచ్చే ప్రయోజనాల్లో కొన్ని ఇవి... ఐరన్ పాళ్లు పుష్కలం కావడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది కరివేప. అనీమియాతో బాధపడేవారు తమ వంటల్లో కరివేపాకు ఎక్కువగా తింటే చాలు ఒంటికి మంచి రక్తం పడుతుంది. రక్తహీనతకు స్వాభావికమైన చికిత్స ప్రక్రియ కరివేపాకు. కరివేపలో విటమిన్–ఏ చాలా ఎక్కువ. ఇది చూపును చాలాకాలం పదిలంగా కాపాడటంతో పాటు అకాలదృష్టిదోషాలను నివారిస్తుంది. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ కరివేపలో చాలా ఎక్కువ. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. మెగ్నీషియమ్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు దోహదం చేయడంతో పాటు మేని నిగారింపునకు దోహదం చేస్తుంది.కరివేపలో పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా శక్తిమంతమైనవి కావడంతో ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం... మనదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కరివేపను తాలింపునకు వాడే ప్రాంతాల్లో పెద్దపేగు, మలద్వార (కోలో–రెక్టల్) క్యాన్సర్లు చాలా తక్కువ. అంతేకాదు... జపాన్‌లోని మెజియో యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీకి చెందిన నిపుణుల అధ్యయనంలో కరివేపాకులో క్యాన్సర్‌ను అరికట్టే గుణం ఉందని స్పష్టంగా తేలింది. లుకేమియా, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్లను కరివేప సమర్థంగా నివారిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌కు కరివేప మంచి విరుగుడు. ఒంట్లోని విషాలను కరివేప సమర్థంగా విరిచేస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడుతుంది. -
సీరమేను కూర
ఇపుడొక చిక్కొచ్చి పడింది. పైగా స్వయంకృతాపరాధం. దీన్నుండి ఎలా బయట పడాలి? సమస్యను ఎలా తీర్చాలి?అసలు ఆ రోజు సీరమేను ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది. ఇపుడీ ఇబ్బంది ఉండకపోను. అలా అనుకుంటాం గానీ ఒకానొక ఉబలాటం ఊరుకుంటుందా? బురదలో కాలు పెట్టినట్లయ్యింది. కడుక్కోక తప్పదు. ఈ కథంతా మా తాత గారైన వెంకటపతిరాజుగారి గురించే. వెంకటపతి తాత మహా చాదస్తుడు. పుట్టి బుద్ధెరిగి నీసు మాంసాలు తినలేదు. జీవుల్ని చంపుకు తినడం పాపం అనేవాడు. సృష్టిలో అవి మనకు ఆహారం కోసం ఎప్పట్నుంచో కేటాయింపబడ్డాయంటే ఊరుకునేవాడు కాదు. తిట్టేవాడు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి ఇంట్లో వండుకుంటే ఏనాడూ వద్దనలేదు. ఇదే కాదు దేవుడు గురించి కూడా ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారివి అన్నట్టే ఉండేవాడు. ఎవరి అభిప్రాయం ఎలాంటిదైనా గౌరవించేవాడు. వెంకటపతి తాత పొదుపుగా బతికేడు. బోలెడు సంపాదించాడు. పొలాలు కొన్నాడు. అదను పాటించి సేద్యం చేసి పంటలు బాగా పండించాడు. ఊళ్ళో వాళ్ళకు సరిపడే ధాన్యం ఆడే చిన్న మిల్లు కట్టాడు. పిల్లల్ని చదివించాడు. అందరికీ ఏరికోరి మంచి సంబంధాలు చేశాడు. ఏ విధమైన లోటు పాట్లు లేవు. అంతా బాగానే ఉంది... అంతా బాగానే ఉంది... ‘‘బాగుందా? బాగానే ఉందా?’’ ఇది మాత్రం రుచి గురించే. ఈ రెండు ప్రశ్నలూ బావుండటంలో హెచ్చుతగ్గులు తెలుసుకోడానికే. ఇంట్లో భోజనం సమయంలో తరచు ఎదురయ్యే ప్రశ్నలే. ఒక రుచి. అన్నట్టు ఏ రుచైనా గొంతు దాకానే కదా. గొంతు దాటింతర్వాత దాని ప్రభావం నాలుక మీద కొంచెంసేపు ఉంటుందేమో. అవునా? అలాగే అనుకుంటే ఈ తాపత్రయం ఎందుకు? జిహ్వ చాపల్యం ఎలా పుట్టింది?అకస్మాత్తుగా సీతారాముడు గుర్తుకొచ్చాడు. ‘వివాహ భోజనంబు... వింతైన వంటకంబు.. అహహ్హా...’’ పాట విన్నపుడూ వాడే గుర్తుకొస్తాడు. సీతారాముడు సన్నగా ఉండేవాడు. ఇపుడు లేడు. రెండేళ్ళ క్రితం పోయాడు. కొద్దిగా గొంతు గరగరతో మాట్లాడేవాడు. బొంగురు గొంతు అన్నమాట. వాడి తిండి కనులార చూస్తే ఎవరికైనా మతిపోతుంది. బకాసురుడే. పొరుగూరులో ఉండి నాలుగు రోజులు వరసాగ్గా తినాల్సి వస్తే రోజుకో హోటలు మారేవాడు. మా ఊళ్ళో కుర్రాళ్ళకు ఓ వింత సరదా ఉండేది. ఆడపిల్లోళ్ళ ఇంటికి పెళ్లికి తరలి వెళ్ళినపుడు మర్యాదలు సరిగ్గా జరగకపోతే... భోజనాల్లో ఏదో ఒక పదార్థం లేదనిపించే పని పెట్టుకునేవారు. రెచ్చగొట్టి గొడవ తెచ్చుకునేవారు. అపుడు సీతారాముడ్ని ముందు పెట్టి సవాలు విసిరేవారు. అడిగినంత వడ్డించకపోతే అవమానం కదా. వాళ్ళు కిందా మీదా పడుతుంటే మా కుర్రాళ్ళకు గొప్ప ఆనందం. నిజం చెప్పొద్దూ... వాడు ఉన్నంత కాలమూ తినడం కోసమే జీవించడంలా బతికాడు. అంతెక్కువ తినడం రోగమని వాడికి తెలీదు. తనే కదా ఇంతటి మొనగాడ్ని అనుకునేవాడు. వైద్యం చేసుంటే మరికొన్నాళ్ళు బతికేవాడేమో. మరి... మరి... తక్కువ తినడం కూడా రోగమేనా?ఈ ఎక్కువ తక్కువ మీమాంస అలా ఉంచితే సరిగ్గా ఇప్పుడే... జ్ఞాపకాల్లోంచి ఓ పాత కథొకటి రాలిపడింది. ఇది అనగనగా ఒక రాజు కథే. రాజు కాస్తంత తమాషా అయినవాడు. ఎవర్నీ సలహా అడక్కుండా నేరం చేసి కొత్తగా బందీ అయినవాడికి ఒక వింత శిక్ష వేశాడు. ‘‘ప్రతిరోజు జైలులో వాడికి పెట్టే తిండి కొంచెం కొంచెం తగ్గించి పెట్టండి’’ అని ఆదేశించాడు. అలాగే చేశారు. పది రోజులయ్యాక ఖైదీ ఎలా ఉన్నాడో అని చూడ్డానికెళ్ళాడు. నేరస్తుడి ముఖం ఎంతో కాంతివంతంగా తేటగా కళకళలాడుతూ కనపడింది. వచ్చేసాడు వెనక్కి. మరో పదిరోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు రాజు. ఖైదీ ముఖం మరింత తేజస్సుతో వెలిగిపోతూంది. రాజుకి మతిపోయింది. అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ‘ఇదేమిటీ...’ అని మంత్రిని అడిగాడు. ‘‘కంగారుపడకండి, మహాప్రభూ... ఒక పని చేయండి... రోజురోజుకూ పెంచుకుంటూ తిండి పెట్టించండి’’ మంత్రి సలహా చెప్పాడు నెమ్మదిగా నవ్వుతూ. అంగీకారంగా తల ఊపాడు రాజు. కొన్ని రోజులకు నేరçస్తుడు చచ్చి ఊరుకున్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ‘‘జనాల్ని ఎపుడూ అర్ధాకలితోనే ఉంచాలి. అపుడే మన రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లు లెక్క. చూశారు కదా తిండి ఎక్కువ అయితే చచ్చి పోవడాన్ని’’ వివరించాడు మంత్రి. అయితే మా తాత కోరిక విడ్డూరమైందీ, ఆక్షేపణీయమైందీ కాదు. ఊహించనిది. అకాలమైనది. అంతే కాదు. ఒక రకంగా మా మేనత్త కొడుకు రామం తెచ్చి పెట్టిన తంటా ఇది. కోరికలు అనంతమైనవి. కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. ఋతుధర్మంగా లభ్యమయ్యే దాన్నైతే ఎలాగోలా తీర్చేయవచ్చు. ఆ రోజు – వెంకటపతి తాతకు ఒంట్లో బాగోలేదు. పొద్దుట్నుంచీ నీరసంగా పడుకున్నాడు. ఎనభై ఏడేళ్ళ తాతకు తిండి సయించడం లేదు. అపుడే చూడ్డానికి మా మేనత్త కొడుకు రామం వచ్చాడు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినపుడు ముడుచుకుని పడుకుంటాడు. సహజంగా తెలిసినవాళ్ళు వచ్చినపుడు కళ్ళల్లో కాంతితో... ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఈవేళ ఆ ప్రయత్నం లేదు. రామం మంచం అంచున కూచుని తను తెచ్చిన కమలాఫలం తొనలు తీసి తినిపించాడు. పలకరిస్తుంటే ముభావంగా సమాధానాలు చెబుతున్నాడు తాత. మాట స్పష్టత లేదు. కాసేపటికి వెంకటపతి తాత వెర్రి చూపులు చూస్తున్నాడు. ‘‘డాక్టరు... డాక్టరు...’’ నెమ్మదిగా అంటున్నాడు. వసారా ఆనుకుని ఉన్న చిన్న గది. గదిని చాలా శుభ్రంగా ఉంచుతాం. ప్రతిరోజూ దుప్పట్లు మారుస్తాం. రెండురోజులకొకసారి ఫినాయిల్‌తో గదిని కడిగిస్తాం. రెండు చేతులూ పొట్ట మీద వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు పైన తిరుగుతున్న ఫ్యాన్‌కేసి చూస్తున్నాడు. బలహీనంగా చిక్కిపోయి ఉన్నాడు. కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. కారు రప్పించాను. ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం. ‘‘నేనూ వస్తాను’’ అన్నాడు రామం. బయలుదేరాం. జాగ్రత్తగా తాతను ముందు సీట్లో కూర్చోబెట్టి మేమిద్దరం వెనుక కూర్చున్నాం. రామం నా ఈడువాడే. దైవభక్తుడు. చెట్టూ పుట్టా అని చూడకుండా కొలుస్తాడు. ప్రయాణం ఉంటే రాహుకాలం, వర్జ్యం చూస్తాడు. శకునం చూసుకుని బయటకు కదులుతాడు. కాకినాడ చేరాలంటే రోడ్డు సరిలేకపోవడం వల్ల గంటన్నర సమయం పడుతుంది. మేమిద్దరం రాజధాని నిర్మాణం... రైతు రుణమాఫీ... పాదయాత్రలు... రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి రామానికి ఈ రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే వాడు యానాంలో ఉంటున్నాడు. అక్కడి ప్రభుత్వం, రాజకీయాలు వేరు. తర్వాత సంభాషణ పులస, సీరమేను మీదకు మళ్ళింది. ‘‘పులస, సీరమేను సంవత్సరంలో కొద్దిరోజులు మాత్రమే దొరుకుతాయి. అందుకే వాటికి అంత డిమాండు. వాటిని రుచి చూడ్డానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. పుస్తెలమ్మైనా పులసలు తినాలనే నానుడి ఉంది. మనకు తెలియదు గానీ సీరమేనుకు కూడా ఏదో సామెత ఉండే ఉంటుంది. వాటి కోసం పడి చస్తారనుకో...’’ అన్నాడు రామం. ‘‘అది సరే. సీరమేను గురించి చెప్పు. రెండు మూడుసార్లు తిన్నాను. బావుంది. అది అసలు ఎలా దొరుకుతుంది?’’ అడిగాను. తాత అటూ ఇటూ తల తిప్పుతూ మా మాటలు వింటున్నాడు. ఏదో గొణుక్కుంటున్నాడు. ‘‘మంచినీళ్ళు కావాలా?’’ తాతను అడిగాను. వెనక్కి చూసి తల అడ్డంగా ఊపాడు. మా మాటలు కొనసాగుతున్నాయి.‘‘సీరమేను ఆశ్వీయుజ మాసంలో మాత్రమే దొరుకుతుంది. తూర్పు వానలు, గాలులకు సీరమేను పుడుతుంది. పులసల సీజను పూర్తవ్వగానే సీరమేను మొదలవుతుంది. సముద్రంలో తీవ్ర ప్రకంపనలకు అలల తాకిడి వేగవంతమై వీచే తూర్పు గాలులకు సీరమేను దొరకడానికి అనుకూలం. నాగుల చవితికి నాగలోకానికి పోతుందని అంటారు. ఆ తర్వాత ఇక మళ్ళీ సంవత్సరం దాక సీరమేను దొరకదు’’ రామం చెప్పుకుపోతున్నాడు. తల వారగా పెట్టి తాత వింటున్నాడు. రామం చెప్పడాన్ని ఆపాడు. రోడ్డు వెడల్పు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. పొక్లైనర్లు పనిచేన్తున్నాయి. ఎర్ర జాకెట్టులు, టోపీలు పెట్టుకుని కొంతమంది హడావుడిగా తిరుగుతున్నారు. రోడ్డంతా ఎగుడుదిగుడుగా ఉంది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఎదురుగా లారీలు... ట్రక్కులు.. ఆర్టీసీ బస్సులు... ఆటోలు...తాత చిటికెన వేలు చూపించాడు. ఒకటికి అన్నమాట. కారు ఆపాలి. సరైన చోటు రాగానే కారు ఆపించాను. తాతను రోడ్డు వరకు నడిపించుకుని కూచోబెట్టాం. తిరిగి కారు బయలుదేరింది. రామం కొనసాగించాడు. ‘‘సీరమేను పట్టడానికి వలలు అక్కర్లేదు. రంగుల చీరలు చాలు. ఒకడు ఒడ్డున నీటిలో ఉంటే మరొకడు కొంచెం దూరంగా నిలబడతాడు. రెండు చీరలు కలిపి కుట్టి అంచులు పట్టుకుని బిగబెట్టి దేవుతారు. నది మధ్యకో లోతుకో వెళ్ళక్కర్లేదు. అంతా తీరాన్నే. బుస్సుమనే శబ్దంతో తెల్లటి పొట్టు మాదిరిగా వస్తున్న సీరమేను రంగులకు ఆకర్షిస్తుంది. జాగ్రత్తగా బిందెల్లోకి పోసుకుంటూ వేట కొనసాగిస్తారు. చీర ఉపయోగిస్తారు గనుక సీరమేనుకు ఆ పేరు. చిరుమీనం అనగా చిన్న చేప అర్థంలో సీరమేను అనే పేరు స్థిరపడిందని కూడా అంటుంటారు’’ రామం చెప్పడం ఆపాడు. వాహనాలు రద్దీ పెరగడంతో నెమ్మదిగా కారు పోతూంది. రామం చెప్పే మాటలు కొత్తగా వినడానికి కారణముంది. నేను పుట్టిన తర్వాత మా నాన్న వేరే రాష్ట్రంలోకి మకాం మార్చాల్సివచ్చింది. ఇక్కడి ఆహారపు అలవాట్లు నాకు పెద్దగా తెలియవు. ‘‘ఇప్పుడైతే సీరమేను అపురూపం అయ్యింది గానీ మా చిన్నప్పుడు కొబ్బరి మొదళ్ళకు వేసేవారు. ఆ రోజులే వేరు. అమ్మ చేసే సీరమేను గారెలు ఎంతో బావుండేవి. అన్నానికి రెట్టింపు కూర కలుపుకుని తినేవాళ్ళం.ఇంకో సంగతి తెలుసా?’’ కారు ముందుకు కదలలేని పరిస్థితి. అక్కడేదో ప్రమాదం జరిగినట్లుంది. నగర కూడలిలో వాహనాలు ఆగినట్లుగా... వరుసగా నిలబడిపోయాయి.జరిగింది ప్రమాదం కాదు. ఎదురెదురుగా వస్తున్న బస్సు, లారీ డ్రైవర్లు వాదులాడుకుంటున్నారు. వెనక్కి తిప్పడానికి ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. ఆఖరుకు కొంతమంది వెళ్ళి సర్ది చెప్పారు. వాహనాలునెమ్మదిగా కప్పను మింగిన పాముల్లా కదులుతున్నాయి.తాత మంచినీళ్ళు అడిగాడు. ఇచ్చాను. తాగాడు. తనలో తాను తిట్టుకుంటూ చికాకుగా ముఖం పెట్టాడు. ఇక్కడ్నుంచి రోడ్డు మంచిగానే ఉంది.‘‘సరే...చెప్పు... సీరమేను గురించి...’’ అడిగాను. ‘‘విచిత్రం ఏమిటంటే సీరమేను కూరను అందరూ ఒకేలా వండరు. ఒక్కో కులం వారు ఒక్కోలాగ వండుతారు. పులుపు కోసం కొంతమంది చింతకాయలు వాడతారు. కొంతమంది చింతపండు వాడతారు. ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేదు. తినాలనే కోరిక ఉన్నా ఎక్కువ డబ్బులు వెచ్చించలేక చాలామంది రుచికి దూరమై పాయారనే చెప్పాలి. ఒక సేరు రెండువేల రూపాయిల వరకు పలుకుతున్నది. ఎంత వరకు నిజమో గానీ జాలర్లకు దొరక్కుండా పోయిన సీరమేను పురదొందులుగానో మూనీరుచేపలుగానో పరిణామం చెందుతాయంటారు.’’ అప్పటిదాకా మౌనంగా ఉన్న తాత నోరు విప్పాడు.‘‘మీ సొద కాసేపు ఆపండర్రా... ఒకటే తిండి గొడవ..’’ విసుగ్గా అన్నాడు తాత. భుజం మీద తువ్వాలుతో పెదాలు తుడుచుకున్నాడు. ఇంకా ఏదో అంటున్నాడు. మా చెవులకు చేరడం లేదు. నేను, రామం ముఖ ముఖాలు చూసుకుని చేతితో సైగలు చేసుకుని మా సంభాషణ ఆపేశాం.కాకినాడ చేరేటప్పటికి సాయంత్రం అయిదయ్యింది.డాక్టరు వీర్రాజు గౌరవంగా చనువుగా తాతను పలకరించారు. కుశల ప్రశ్నలడిగారు. తాత కూడా హుషారుగా మాట్లాడాడు. మూలుగుతున్న వాడల్లా డాక్టరును చూడగానే కొత్త శక్తి వచ్చేసింది. యోగక్షేమాలు అడిగి ఆరోగ్యం గురించి భరోసా ఇస్తూ ధైర్యవచనాలు చెబితే చాలు. ఈ వయసు వాళ్ళకు అదే గొప్ప మందు. తాతలో పూర్వపు చలాకీతనంతో బాటు తన మీద తనే జోకులేసుకునేంత కలివిడి మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాగే డాక్టరు చేతులు పట్టుకుని చాలాసేపు వరకు వదలలేదు. తర్వాత డాక్టరు తాతను పరీక్షించారు. ‘‘తాతగారూ... మీరు మాకంటే ఆరోగ్యంగా ఉన్నారు. మీకే రోగమూ లేదు. అంతా చక్కగా ఉంది. మనసులో ఏమీ పెట్టుకోకండి. నిండైన సంతృప్తి జీవితం మీది. మీరు కోరుకున్నవి సాధించారు. మీ పిల్లలంతా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా అదృష్టవంతులు. రోజూ కాసేపు నడవండి చాలు. బలానికి మందులు రాస్తాను. వాడండి’’ అని డాక్టరు చెప్పడంతో తాత ముఖం వెలిగిపోయింది. ‘‘సంతోషం బాబూ... మీ నాన్నలాగే మంచి పేరు సంపాదించుకో. అన్నట్టు నేనేం తినొచ్చో ఏం తినకూడదో చెప్పలేదు..’’ డాక్టరు చేతులు వదలకుండానే ఆయన ముఖంలోకి చూస్తూ అడిగాడు. ‘‘అరె... నేను ముందే చెప్పాను కదా... ఫలానా పదార్థం తినకూడదని లేదు. అన్నీ బ్రహ్మాండంగా తినొచ్చు. మీరు రుచికి ఇష్టమైనవన్నీ తినండి. మీకు ఏదైనా తినాలనిపిస్తే చేయించుకుని నిరభ్యంతరంగా తినండి. మీకు ఏం కావాలి?’’ అని మృదువుగా అడిగారు డాక్టరు. తాత నా వైపు చూసాడు. ‘‘డాక్టరు గారు చెపుతున్నారు కదా... మీకేం కావాలంటే అది తీసుకురావడానికి నేను సిద్ధం’’ అన్నాను చిరునవ్వుతో. రామం కూడా అదే మాట చెప్పాడు. ‘‘అలాగే బాబూ... అలాగే...’’ అని ఊరుకున్నాడు. డాక్టరుకు థ్యాంక్స్ చెప్పి ఆసుపత్రి బయటకు వచ్చాం. చీకటి పడింది. పట్టణంలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒకటే జనం. ఉరుకులు పరుగులు. కూడళ్ళలో అయితే చెప్పనక్కర్లేదు. ఇడ్లీలు కట్టించుకుని మరల కారు ఎక్కాం. రామం తను యానాం వెళ్ళిపోతానని చెప్పడంతో అతన్ని బస్టాండ్ దగ్గర దింపడానికి నిశ్చయించుకున్నాను. ‘‘తాత గారూ... నేను మరికొద్ది రోజుల్లో వస్తాను. మా ఊరు వెళతాను’’ అని చెప్పాడు రామం. తాత ఒప్పుకోలేదు. ఇంటికి రావాల్సిందే అని పట్టు పట్టాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. రామం తాత ఇష్టాయిష్టాల గురించి అడుగుతున్నాడు. ఒకొక్కటి నెమ్మదిగా బోసినోటితో తాత చెబుతున్నాడు. ‘‘డాక్టరు చెప్పింతర్వాత ధైర్యం వచ్చిందిరా... ఇన్నాళ్ళూ తమాయించుకున్నాను. వచ్చే పొద్దా పోయే పొద్దా... నిజం చెప్పాలంటే నేను కోరికలు చంపుకునే బతికానురా... ఎంత ఇష్టం అయినా దూరంగానే ఉన్నాను. మీ అమ్మమ్మ పాకం గారెలు గొప్పగా చేసేదిరా... నోటిలో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే వెన్నపూసలా. అలాగే బందరు లడ్డు. ఇక్కడ చేసినవి కావు. బందరులో తయారు చేసినవే తినాలనుందిరా...’’ ఈ మాటలు ఒకేసారి చెప్పినవి కావు. మొత్తం మీద తాత మాటల సారాంశం ఇది. ‘‘తప్పకుండా తాతా.... రేపే పెరుమాళ్ళపురం పాకం గారెలు తెప్పిస్తాను. అవి మీరు చెప్పినట్లే ఉంటాయి. బందరు నుంచి లడ్డూలు కూడా రప్పిస్తాను. మీరేమీ సందేహించకుండా ఏదైనా సరే చెప్పండి’’ అని చెప్పాను. ఇంటికి చేరాం. రాత్రి పదయ్యింది. ఉదయం లేచి తాత గదికి వెళ్ళాను. ఇంకా లేవలేదు. ముసుగు తన్ని పడుకునే ఉన్నాడు. చేతితో తట్టి లేపాను. మెల్లగా కళ్ళు తెరచి చూశాడు. నన్ను చూడగానే లేచి కూర్చున్నాడు. అంతలోనే తలగడ సరిచేసుకుని మరల పడుకున్నాడు.‘‘ముఖం కడుక్కోండి’’ చెంబుతో నీళ్ళు... బ్రష్... పేస్టు... టేబుల్ మీద పెట్టి గది బయటకు వచ్చాను.ఇంటిని ఆనుకునే మా పొలం. పెరటి గుమ్మం తలుపు తీసుకుని సన్నని బాట మీదుగా కొద్ది దూరం వెళితే పొలం వస్తుంది. రామం నన్ను అనుసరిస్తున్నాడు. నేలపై మొక్కలు తడిగా ఉన్నాయి మంచు పడి. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం. మౌనంగా నడుస్తున్నాం. అలా వెళ్ళామో లేదో ఇంటి నుండి కబురు. తాత మాట్లాడటం లేదని వెంటనే రమ్మని.మా ఆవిడ ఆందోళనగా నా కోసం ఎదురుచూస్తూంది.‘‘మనిషి మనలో లేడు. బయట గాదెలున్న వసారాలోకి చేరిస్తే మంచిదేమో. అసలే మండువా లోగిలి. పాడు పెట్టాల్సి వస్తే అవతల కాపురం ఉంటున్న మీ బంధువులతో మాట వస్తుంది. చూసుకోండి’’ ఈ మధ్యనే ఊళ్ళోకి వచ్చిన పెద్దాయన అంటున్నాడు.‘‘ఫర్వాలేదు లెండి. అలాంటి అవసరం వచ్చినా సరే ఈ ఇంటికి ఎంతో చేసిన ఆయన్ను ఇక్కడ్నుంచి బయట పెట్టేది లేదు’’ విసురుగా అని తాత దగ్గరకు వెళ్ళాను.ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నాడు. నన్ను చూడగానే కళ్ళు మెరిశాయి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మాట అర్థం కావడం లేదు. పది నిముషాలయ్యేటప్పటికి తాత మామూలు మనిషి అయ్యాడు. పాలు తాగాడు.చుట్టూ పోగుపడిన తెలిసిన ముఖాల్ని తేరిపార చూశాడు. నన్ను దగ్గరకు రమ్మన్నాడు. వెళ్ళాను.‘‘వీళ్ళందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఏమైందని? వెళ్ళి పొమ్మను. నేనింకా చావనని చెప్పు. నీ ఒక్కడితో మాట్లాడాలి... తలుపులు మూసి రా...’’ అన్నాడు. ‘అమ్మయ్య’ తాతకు ఏం కాలేదు అనుకున్నాను. అందరూ బయటకు వెళ్ళి పోయారు. గదిలో నేనూ రామం మిగిలాం. పెద్ద తలపాగాతో గుబురు మీసాలతో మా ముత్తాత గోడ మీద పాత కాలం నాటి ఫొటోలో నవ్వుతున్నాడు. ‘‘ఒరేయ్... తప్పుగా అనుకోకండి. నాకొకటే కోరిక మిగిలిపోయింది రా... సీరమేను తినాలనుంది. నిన్న మీ మాటలు విన్నప్పట్నుంచీ అదే ఆలోచన. రామాన్ని పంపించి తెప్పించరా నాయనా...’’ చిత్రంగా పెదాలు తడుపుకుంటూ అన్నాడు. ఆ ఒక్క మాట అని కళ్ళు మూసుకున్నాడు. మాకు గుండెలు అదిరాయి. జీవితమంతా శాకాహారిగా నిష్టగా బతికినోడికి అసందర్భంగా ఈ కోరికేమిటి? పైగా దొరకని రోజులు. సీరమేనును ఎక్కడ్నుంచి తీసుకురావాలి? మథనపడ్డాం. ఎలా? ఎలా? ఎలా?‘‘సరే.. మా ఊరెళ్ళి నేనొక ప్రయత్నం చేస్తాను. అయిదు మాసాల క్రితమే సీరమేను సీజను అయిపోయింది. ఇపుడు దొరికే ప్రశ్న లేదు. కానీ ఎవరైనా ముచ్చటగా, ఇష్టంగా డీప్ ఫ్రిజ్‌లో దాచుకుంటే గనుక బతిమాలి తీసుకురావాలి.... చూద్దాం... తాత కోరిక తీరుతుందో లేదో?’’ అని రామం వెంటనే బయలుదేరడానికి సిద్ధమైనాడు.‘‘దొరికితే... సాయంత్రానికల్లా వస్తాను’’ అన్నాడు రామం. మధ్యాహ్నం అయ్యింది. తాత పిలిచాడు. ‘‘రామం వచ్చాడా?’’ వస్తున్నాడన్నట్టు తల ఊపాను. రామం తన ప్రయత్నాల గురించి ఎప్పటికప్పుడు ఫోన్లో చెబుతూనే ఉన్నాడు. దొరికే ఆశ లేనట్లే.ఈ లోపులో మరోసారి తాత కళ్ళు తేలేశాడు. కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. మాటిమాటికీ ఉలికిపడుతున్నాడు. సన్నగా వణుకుతున్నాడు. తల విదిలిస్తున్నాడు. భయంగా ఉంది. అనుమానంగా ఉంది. ఆఖరి క్షణాలేమో...ఉన్నట్టుండి తాత మళ్ళీ పిలిచాడు. నా వంక తీక్షణంగా చూశాడు. ఆ చూపుకు అర్థం తెలిసింది. కానీ... ఏం చేయగలను? అసలు ఇదంతా ఏమిటి? సీరమేను తినకుండా పోవడాన్ని లోటుగా భావిస్తున్నాడా? ఇన్నేళ్ళుగా కోరికల్ని అణచుకుని బతుకుతున్నాడా? రామం దగ్గర్నుంచి సెల్ మోగింది. శుభవార్త అందించాడు. సీరమేను దొరికిందని, అందులోకి ముఖ్యంగా కావల్సిన చింతకాయల కోసం బజారంతా గాలించినా దొరకలేదని కంగారుగా చెప్పాడు. చింతపండు వాడమని సలహా చెప్పాను. వెంటనే వండించుకుని కారులో బయలుదేరి వస్తానని చెప్పాడు. ‘అమ్మయ్య’ అనుకున్నాను. తాత చెవిలోగట్టిగా అరిచి విషయం చెప్పాను. తాతకు తెలిసిపోయింది. అలాగే అన్నట్టు తల ఊపాడు.రాత్రి పది గంటలకు వచ్చాడు రామం.సీరమేను కూర కలిపిన అన్నం ముద్దను పట్టుకొచ్చింది మా ఆవిడ. మగత కమ్మినట్టుగా ఉన్నాడు తాత. తలగడ నిలువుగా వాల్చి కూర్చోబెట్టారు.‘‘మీరడిగిన సీరమేను ఇదిగో తినండి’’ అని చెప్పాను.తాత కళ్ళు మెరిసాయి. ఎంతో ఆనందంగా నోరు తెరిచాడు. ముద్ద అందించింది. సీరమేను మటుక్కి నోటికి చేరింది. గొంతు దిగలేదు. ఆ నోరు అలాగే ఉండిపోయింది. దాట్ల దేవదానం రాజు -
ఏం కూర చేస్తున్నావ్?
భర్త కొంతకాలంగా భార్యలో మార్పును గమనిస్తున్నాడు. తను ఏం అడిగినా భార్య వెంటనే సమాధానం చెప్పడం లేదు! పనిలో అలసిపోతోందా? ఆమె ఎప్పుడూ అలసట గురించే మాట్లాడలేదు. మరేమిటి? ‘చెవుడుగానీ రాలేదు కదా’ అనుకున్నాడు! ఆ మాట అంటే ఆమె బాధపడుతుందని అనలేదు. స్నేహితుడైన ఒక వైద్యుడిని కలిసి, తన భార్య మనసు నొప్పించకుండా ఆమెకు చెవుడు వచ్చిందేమో తెలుసుకోవడం ఎలా? అని అడిగాడు. ‘ఓ పని చెయ్యి. మొదట ఇరవై అడుగుల దూరంలో ఉండి ఏదైనా అడుగు. ఆమె పలకక పోతే పదిహేను అడుగుల దూరంలో ఉండి మళ్లీ అడుగు. అప్పటికీ మౌనంగానే ఉండిపోతే, పది అడుగుల దూరంలోకి వెళ్లి అడుగు. అప్పటికీ ఉలుకూ పలుకూ లేకపోతే ఐదు అడుగులు ముందుకెళ్లి అడుగు. అయినప్పటికీ ఆమె సమాధానం చెప్పలేదంటే నీ సందేహం నిజమే... ఆమెకు చెవుడు వచ్చినట్లే’ అని చెప్పాడు స్నేహితుడు. అలాగే చేశాడు భర్త. ఆమె వంటగదిలో ఉన్నప్పుడు ఇరవై అడుగుల నుంచి, పదిహేను అడుగుల నుంచి, పది అడుగుల నుంచి, ఐదు అడుగుల నుంచి ‘కూర ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో అడిగాడు.. ‘ఏంటి.. ఇవాళ కూర?’ అని. ‘అబ్బబ్బ.. చికెన్ అని నాలుగుసార్లు చెప్పాను కదా! మీకు వినిపించకపోతే నేనేం చేసేది’ అంది ఆవిడ, పనిలో మునిగిపోతూ. సమస్య మనతోనే అని తెలుసుకోలేక, చాలాసార్లు మనం అవతలి వాళ్లను సమస్యగా భావిస్తాం. తప్పు మనదే అని గ్రహించక తొందరపడి అవతలి వాళ్లను తప్పుబడతాం. ఎవర్నైనా సందేహించే ముందు.. మిమ్మల్ని మీరొకసారి సందేహించండి. ఎవర్నైనా ఒక ప్రశ్న వేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. -
తెల్లజుట్టుకు కరివేపతో చెక్!
వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా నేటి యువతకు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేసింది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. తెలుపు జుట్టు పోవాలంటే ఏం చేయాలంటే.. మెంతుల పొడిని పెరుగులో కలుపుకుని తలకు రాసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకసారి తలంటు స్నానం చేయాలి.ఉసిరికాయ ముక్కలు, పుదీనా, కరివేపాకును ఓ గుడ్డలో చుట్టి సూర్యకిరణాలు పడేలా మూడు రోజుల పాటు ఉంచండి. మూడు రోజులు తర్వాత పొడి చేసుకుని.. ఈ పొడితో వారానికి ఒకసారి తలకు ప్యాక్ వేసుకుని ఎండిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఉసిరి పొడి ప్యాక్... నిమ్మరసం, బీట్రూట్ రసం, పెరుగు, టికాషన్తో ఈ పొడిని చేర్చి తలకు రాసుకోవాలి. తద్వారా మీ జుట్టు దృఢంగా ఉంటుంది. ఇలా చేస్తే తెల్లజుట్టు మాయమైపోతుంది. -
క్యాబేజీ పకోడీ
ఈజీ కుకింగ్ కావలసినవి: క్యాబేజీ తురుము – రెండు కప్పులు శనగపిండి – కప్పు బియ్యప్పిండి – అర కప్పు పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ – రెండు టీ స్పూన్లు కరివేపాకు – రెండు రెమ్మలు నూనె – డీప్ ఫ్రైకి సరిపడా జీలకర్ర – టీ స్పూన్ కారం – టీ స్పూన్ ఉప్పు – తగినంత తయారి: ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, శనగపిండి, బియ్యప్పిండి, పచ్చిమిర్చి తరుగు, కార్న్‌ఫ్లోర్, కరివేపాకు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు, తగినంత నీరు పోసి గట్టిగా కలుపుకోవాలి. తరువాత బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత పిండిని పకోడీలుగా వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. తరవాత టిష్యూపేపర్ మీదకు తీసుకోవాలి. కరకరలాడే ఈవెనింగ్ స్నాక్ క్యాబేజీ పకోడీ రెడీ. -
పచ్చడి పచ్చడే!
తిండి గోల విస్తట్లో పప్పు, కూర, ధప్పళం, గారెలు, బూరెలు, లడ్లు, అరిసెలు, వడియాలు, అప్పడాలు, ఊరగాయలు, పులిహోర, పాయసాలు... ఇలా ఎన్ని ఉన్నా, పచ్చడి ఇంకా పడలేదే అని ఎదురు చూసేవారెవరయినా ఉన్నారా అంటే అది తెలుగువారే! పచ్చళ్ల కోసం ఇంతగా నాలుక పీక్కుంటారు కాబట్టే గోంగూరకు శాకంబరీ మాత అని పేరు పెట్టుకుని మురిసిపోయారు మన తెలుగువాళ్లు. ఇప్పుడంటే మిక్సీలొచ్చి పని సులువు చేశాయిగానీ, అవి రాక మునుపు నానా తంటాలూ పడేవాళ్లు లేడీసు. ఊర్బిండి అంటే మినప లేదా పెసరపప్పును నానబెట్టి రుబ్బిన పచ్చడో, ఊర్పచ్చడి అంటే ఏ కందిపచ్చడో, శనగపచ్చడో, బజ్జీపచ్చడి అంటే దోసకాయనో, వంకాయనో నిప్పులమీద కాల్చి, నూరి తాలింపు పెట్టిన పచ్చడో, తొక్కు అంటే గోంగూర లేదా చింతకాయను రోట్లో నూరిన పచ్చడో లేనిదే ముద్ద దిగేది కాదు. పచ్చడి మెతుకులంటే పేదవారి కూడు అనేది దురభిప్రాయం మాత్రమే.. అప్పుడూ ఇప్పుడూ కూడా! ఎందుకంటే ఇప్పుడు మిర్చి రేటు ఘాటు భరించడమే కష్టం. దొండ, బెండ, బీర, దోస... వాడ్చి, అందులో ఇంత చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు పడేసి, కచ్చాపచ్చాగా నూరి, ఇష్టం ఉంటే ఇంగువ, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు పడేసి, తిరగమోత పెట్టేస్తే ఘుమ ఘుమలాడే రోటిపచ్చడి రెడీ! ఏమీ లేదంటారా, నాలుగు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్తంత ఉప్పు, చింతపండు కలిపి నూరి, ఓపికుంటే తిరగమోత పెట్టుకోవడం లేదంటే అట్లాగే తినేసినా సరే. ఒకప్పుడు మిరపకాయలకు బదులు మిరియాలపొడి, చింతపండుకు బదులు నిమ్మరసం, ఉప్పు స్థానంలో సైంధవ లవణం వేసి, ఆరోగ్యంగా తినేవారు. ఇప్పుడు కూడా పచ్చడి మీద జిహ్వచాపల్యం చంపుకోలేని వారు ఇలా కూడా ఓసారి ట్రై చేసి చూస్తే సరి! -
కూరల్లో తిరుగుతుంది
స్టౌపై వండే ఏ వంటలకైనా గరిటతో అవసరం తప్పదు. అది కూరైనా, పులుసైనా గరిటతో కలపకుంటే కుదరదు. చాలామందికి అదొక పెద్ద పని అనే చెప్పొచ్చు. అందుకే వచ్చేసింది ‘ఆటోమేటిక్ పాట్ స్టిరర్’. ఇకపై వంట చేసేంత సేపు గరిటకు పని చెప్పాల్సిన పని లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ స్టిరర్‌ను... కూర లేదా పులుసులో పెట్టి, దానికున్న బటన్ నొక్కితే చాలు. దానంతట అదే తిరుగుతుంది. ఇవి బ్యాటరీ సాయంతో పని చేస్తాయి. అలాగే ఈ స్టిరర్కు మూడు స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంత స్పీడు కావాలంటే, అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటికున్న లెగ్స్ (గిన్నెలో పడిపోకుండా నిల్చునే కాళ్లు)ను స్టిరర్ పైభాగం నుంచి విడదీసి, మామూలు డిష్వాషర్తోనే శుభ్రం చేసుకోవచ్చు. ఇవి 150 డిగ్రీల వేడిని తట్టుకుంటూ... అదేపనిగా నాలుగు గంటల పాటు తిరగ్గలవు. ఇవి కూర, రసం, గ్రేవీ మొదలైన అన్ని వంటకాల్లోనూ తిరుగుతాయి. -
దుంప తెగ!
తప్పు చేస్తే తాతయ్యో నానమ్మో విపరీతమైన కోపం వచ్చి... సున్నితంగా తిట్టే తిట్టు... ‘వాడి దుంప తెగ అంతపని చేశాడా..’ అని. తిట్టులో కూడా ప్రేమను దట్టిస్తారు! అలా... రుచిని దట్టించి రోజూ తినే కూరల బోర్‌డమ్‌ని తెగ్గొట్టండి. దుంపలతో ప్రేమను వడ్డించండి. ‘దుంప తెగ... ఏం టేస్టు...’ అనే కాంప్లిమెంటు కొట్టేయండి. క్రీమ్ చీజ్ ఫిల్డ్ బీట్స్ కావల్సినవి: బీట్ రూట్స్ - 2 ఫిల్లింగ్ కోసం: చిలికిన పెరుగు - 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ చీజ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగిన క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు తరిగి కొత్తిమీర - టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్ సాస్ కోసం: నూనె - టీ స్పూన్ రెడ్ క్యాప్సికమ్ - 2; గ్రీన్ క్యాప్సికమ్ - 2 వెల్లుల్లి -2 రెబ్బలు; జీలకర్ర - 2 టీ స్పూన్ ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూన్ కొత్తిమీర - టీ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్ తయారి: పీలర్‌తో బీట్రూట్ పై తొక్క తీసి, ఉడకబెట్టి, చాలా పలచని స్లైసులుగా కట్ చేయాలి. ఫిల్లింగ్‌కి ఇచ్చినవన్నీ గిన్నెలో వేసి కలపాలి. పలచని బీట్రూట్ స్లైసులను రోల్ చేసి, పై మిక్చర్(ఫిల్లింగ్)ని ఫిల్ చేయాలి. సాస్ కోసం ఇచ్చిన పదార్థాలలో రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా వేపి, చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. అలాగే పచ్చ క్యాప్సికమ్, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర విడిగా వేయించి చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి, పక్కనుంచాలి. ఫిల్ చేసిన బీట్రూట్ రోల్స్‌ని ప్లేట్లో పెట్టి ఒకవైపు ఎరుపు రంగు క్యాప్సికమ్ మిశ్రమం, మరోవైపు పచ్చరంగు క్యాప్సికమ్ మిశ్రమం పోయాలి. {Mీమ్ చీజ్.. ఆ పైన కొత్తిమీర లేదా తులసి ఆకును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కుక్డ్ కెబాబ్ కావల్సినవి: బంగాళదుంపలు-3 లేదా చామదుంపలు - 6; ఉప్పు - తగినంత; నల్లుప్పు - అర టీ స్పూన్; కొత్తిమీర - టీ స్పూన్; చాట్ మసాలా - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2; బ్రెడ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు (శనగపిండి కూడా వాడుకోవచ్చు) ఫిల్లింగ్ కోసం: అల్లం తరుగు - టీ స్పూన్ బాదంపప్పు తరుగు - టీ స్పూన్ పచ్చి బఠాణీలు -2 టేబుల్ స్పూన్లు చీజ్ - టీ స్పూన్; కిస్మిస్ - టీ స్పూన నీళ్లన్నీ వడకట్టిన గడ్డ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: దుంపలను ఉడికించి, పై పొట్టు తీసి గుజ్జు చేయాలి. అందులో ఉప్పు, నల్లుప్పు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చాట్‌మసాలా, బ్రెడ్ పొడి, తరిగిన పచ్చిమిర్చి, మిగిలిన ఇతర దినుసులు కూడా వేసి బాగా కలపాలి. ముద్దగా తయారైన ఈ మిశ్రమాన్ని సమభాగాలుగా తీసుకొని, ఉండలు చేసి, అరచేత్తో అదమాలి. కడాయిలో తగినంత నూనె పోసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి.. రెండువైపులా వేయించాలి. టూత్ పిక్‌లకు ఈ కెబాబ్స్‌ను గుచ్చి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అలంకరణకు ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్ తరుగు, కొత్తిమీర వాడచ్చు. స్వీట్ పొటాటో చీజ్ కేక్ కావాల్సినవి: స్వీట్‌పొటాటో (చిలగడ దుంప) - 1 (100 గ్రా.), కుకీ క్రంబ్స్ - కప్పు; తాజా పాల మీగడ (చిలికినది) - పావు లీటర్, క్రీమ్ చీజ్ - 200 గ్రాములు; గుడ్లు - 3; పంచదార పొడి - 200 గ్రాములు, మొక్కజొన్న పిండి - 125 గ్రాములు తయారీ: చిలగడ దుంపలను ఉడికించి గుజ్జు చేయాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రంగా జామూన్లను తయారుచేయాలి. ఇందుకు కార్న్‌ఫ్లోర్‌ను వాడుకోవచ్చు. వీటిని నూనెలో అన్ని వైపులా వేయించి, పంచదార పాకంలో వేసి ఉంచాలి. వెడల్పాటి పుడింగ్ కేక్ గిన్నెకు అడుగున నెయ్యి రాయాలి. పైన కుకీ క్రంబ్స్ పొడి వేసి ఆ పైన చిలగడదుంప జామూన్లు వేయాలి. ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ, పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పుడింగ్ గిన్నెలో పోయాలి. ఈ గిన్నెను ఇడ్లీ కుకర్‌లో పెట్టి సన్నని మంట మీద ఆవిరితో ఉడికించాలి. పూర్తిగా ఉడికాక దించుకోవాలి. చల్లారాక తీసి, చాకొలెట్ చాప్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి. అవెన్‌లో అయితే 160 నుంచి 180 డిగ్రీల ఉష్ణొగ్రతలో అరగంటపాటు బేక్ చేయాలి. స్టఫ్డ్ శాండ్విచ్ కావల్సినవి: బంగాళదుంప/క్యారెట్ - 3, ఉల్లిపాయలు - 2, టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 1 రెమ్మ, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్ తయారీ: బంగాళదుంప లేదా క్యారెట్ తొక్క తీసి, ఉడికించి, గుజ్జు చేయాలి. మూకుడులో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కలపాలి. దీంట్లో దుంప గుజ్జు వేసి కలపాలి. మిశ్రమం బాగా వేగాక కాల్చిన శాండ్విచ్ బ్రెడ్ మధ్యలో అమర్చాలి. ఫ్రెంచ్ ప్రైస్ లేదా చిప్స్‌తో సర్వ్ చేయాలి. ఖజానా ఆలూ కావాల్సినవి బంగాళదుంపలు/చిలగడ దుంపలు - 4 ఫిల్లింగ్ కోసం: బాదంపప్పు తరుగు - టీ స్పూన్ జీడిపప్పు తరుగు - టీ స్పూన్ పిస్తాపప్పు తరుగు - టీ స్పూన్ పచ్చిమిర్చి - 2; చీజ్ - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు సాస్ కోసం: టొమాటో గుజ్జు 200 గ్రాములు సాజీర - అర టీ స్పూన్; యాలకులు - 4 బిర్యానీ ఆకు - 1; కారం - టీ ఊ్పన్ మెంతిపొడి - అర టీ స్పూన్; కొతితమీర - కట్ట నూనె - టీ స్పూన్; ఉప్పు - తగినంత పాల మీగడ - టేబుల్ స్పూన్ నెయ్యి - టీ స్పూన్; వెన్న - టేబుల్ స్పూన్ తయారీ బంగాళదుంప తొక్క తీసి మధ్యభాగాన్ని కొంత తీసి, ఉడికించాలి. డ్రై ఫ్రూట్స్, ఛీజ్, పచ్చిమిర్చి, బంగాళుదంప గుజ్జు, ఉప్పు.. దుంప మధ్యన కూరాలి. కార్న్ఫ్లోరోలో అన్నివైపులా దొర్లించి కాగుతున్న నూనెలో వేసి, వేయించి తీయాలి. మందపాటి గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి. మరొక కడాయిలో నూనె వేసి సాజీర, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, మెంతిపిండి, టొమాటో గుజ్జు, ఉప్పు, పంచదార వేసి ఉడికించాలి. మిశ్రమం నుంచి నూనె వేరయ్యాక కొద్దిగా నూనె కలిపి పాల మీగడ, నెయ్యి, వెన్న వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బంగాళదుంప ముక్కలున్న గిన్నెలో ముక్కలు తడిసేలా పోయాలి. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కొత్తిమీరతో అలంకరించాలి. ముల్లంగి పచ్చడి కావల్సినవి: ముల్లంగి - 1 (తరుమాలి) ఎండుమిర్చి - 2; ధనియాలు - 2 టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; మెంతులు - పావు టీ స్పూన్ కరివేపాకు - 1 రెమ్మ; నూనె - టేబుల్ స్పూన్ మినప్పప్పు - శనగపప్పు - టీ స్పూన్ చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత తయారి: కడాయి పొయ్యి మీద పెట్టి టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేసి వేయించి, తీసి పక్కనుంచాలి. అదే కడాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు ఉడికించి, దించాలి. ముందుగా వేయించుకున్న దినుసులన్నీ చల్లారాక తగినంత ఉప్పుతో సహా కలిపి పొడి చేయాలి. దీంట్లో చింతపండు గుజ్జు, ఉడికిన ముల్లంగి వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. దీనిని గిన్నెలోకి తీసుకోవాలి. కడాయిలో మిగిలిన నూనె పోసి జీలకర్ర, పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. దీనిని పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. -
కూరలో పడి.. రంగు మారింది!
యునైటెడ్ కింగ్ డమ్ లో ఎక్కువగా కనిపించే సీ-గల్ పక్షి ప్రస్తుతం అక్కడ సెలబ్రిటీ అయిపోయింది. బాగా ఆకలితో నకనకలాడిందేమో! ఆహారం కనిపించగానే ముందు వెనుకా చూసుకోకుండా ఓ ఫ్యాక్టరీ దగ్గరలోని చెత్తకుండీలో పడేసి ఉన్న మసాలా చికెన్ టిక్కా కోసం వెళ్లింది. కుండీ లోపల ఉన్న ఆహారం అందుకోలేక బొక్కబోర్లా పడింది. అంతే, ఒక్కసారిగా తెల్లగా ఉన్న పక్షి ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. ఇది చూసిన అక్కడి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు దానిని రక్షించారు. జంతు సంరక్షణ కేంద్రంలో అప్పజెప్పారు. దాని రంగు మారిపోవడాన్ని చూసిన ఓ నర్సు ముచ్చటపడి ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అంతే సోషల్ మీడియా ప్రపంచం ఒక్కసారిగా రంగు మారిన పక్షి అందానికి ముగ్ధులైపోయారు. లైక్ లు , కామెంట్లతో యూకేలో ఈ ఫోటో వైరల్ అయింది. ప్రస్తుతం సంరక్షణ కేంద్రంలోనే ఉన్న పక్షిని సిబ్బంది శుభ్రపరిచారు. దాని రంగయితే పోయింది కానీ, వాసన పోవడం లేదంటూ పోస్టులు పెట్టింది నర్సు. -
లస్సీ విత్ ఫ్లేక్స్
కూల్ కూల్‌గా... కావలసినవి: పెరుగు - అరలీటరు, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు తయారి: మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి. -
ఇంటిప్స్
బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. యాలకుల లోపలి గింజలు వాడాకా పై పొట్టు పొడి చేసి చక్కెరలో కలపాలి. ఈ చక్కరెను టీలోకి వాడుకుంటే రుచిగానూ, సువాసనగానూ ఉంటుంది.కరివేపాకును గాజు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. మామిడి ఊరగాయ చట్నీ ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే తిరగమాతలో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. పల్లీలను తరచూ వంటలలో ఉపయోగిస్తుంటారు. వంటకు వాడినప్పుడల్లా వాటిని, వేయించి పొడి చేసుకుంటుంటారు. అలా కాకుండా ఒకేసారి వేయించి, దంచి, డబ్బాలో ఉంచుకుంటే టైమ్, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి.ఎండుమిరపకాయల్లో ఉప్పు, మంచి నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉప్పు నీటిని చల్లి వాము(ఓమ)ను కొద్దిగా వేయించితే తినేటప్పుడు ఘాటుగా అనిపించదు. -
కూర బాగా వండలేదని...భార్యను హతమార్చిన భర్త
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం: కూర బాగా వండలేదంటూ భర్త క్షణికావేశంతో కొట్టడంతో భార్య మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్‌పేట పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ అచ్చబ గ్రామానికి చెందిన కోలక లక్ష్మణరావు సోమవారం సేకరించిన చింతపండును కురుపాం మండల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించి సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి భోజనంలో వంటలు సరిగా వండలేదంటూ భార్య కోలక లక్ష్మమ్మ (44)తో ఘర్షణకు దిగాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న వెదురుకర్రతో లక్ష్మమ్మ పొట్ట, వీపుపై బలంగా కొట్టాడు. వెంటనే స్పందించిన ఇరుగు పొరుగువారు కుప్పకూలిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మమ్మ ఒంటిగంట సమయంలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు మిన్నారావు మంగళవారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు ఎల్విన్‌పేట సీఐ జి.వేణుగోపాల్, ఎస్ఐ ఎస్.రాజు, పోలీసు సిబ్బంది అచ్చబ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మమ్మకు ముగ్గురుకు కుమార్తెలు, ఒక కుమారుడు. వారందరికీ వివాహమైంది. సాయంత్రం వరకు తమతో ఉన్న లక్ష్మమ్మ భర్త చేతిలో హతమవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
నచ్చిన కూర వండలేదని..
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : నచ్చిన కూర వండలేదనే కారణంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. గుమ్మలక్ష్మీపురం మండలం దేరుపాడు పంచాయతీ అచ్చిబ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి నచ్చిన కూర వండలేదని కోలక లక్ష్మమ్మ(50) అనే మహిళను ఆమె భర్త లక్ష్మణరావు కర్రతో కొట్టి చంపాడు. అనంతరం పరారయ్యాడు. బంధువులు ఆమె మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కసకస కోసేస్తుంది!
కొత్తిమీర, కరివేపాకు వేయకుండా వంటకం పూర్తవుతుందా? పూర్తి చేసినా మీవారికి, పిల్లలకు నచ్చుతుందా? అందుకే ఏది మిస్సయినా మీరు కచ్చితంగా వాటిని మిస్సవరు. అయితే వాటిని ముక్కలు చేయకుండా వేస్తే ఆ వాసన అంత బాగా వంటకానికి పట్టదు. ముక్కలు చేయాలంటే అదంత తేలిక కూడా కాదు. ఆకుల్ని వరుసగా పేర్చి, చాకుతో కోసి, అప్పుడు కూరలో వేయాలి. అవి సరిగ్గా తెగవు. ఈలోపు చేయి మాత్రం తెగుతుంది. అలా చేతులూ వేళ్లూ కోసుకోకుండా మనకి సాయపడుతుంది ఈ ‘హెర్బ్ మిల్ గ్రైండర్’. ఈ గ్రైండర్కి కరెంటు అవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకుల్ని ఇందులో వేసి, గట్టిగా బిగించి, ఒక్క తిప్పు తిప్పితే చాలు... అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తెగిపోతాయి. కావాలంటే ఈ ఫొటో చూడండి... క్లారిటీ వస్తుంది. ఏ పార్టుకి ఆ పార్టు విడిపోతుంది కాబట్టి శుభ్రం చేసుకోవడం కూడా చాలా తేలిక. ధర మోడల్ని బట్టి రూ. 200 నుంచి రూ. 300 మధ్య ఉంది. ఆన్లైన్లో అయితే రూ. 250 దాటదు. -
భల్లే భల్లే..
పంజాబీ ఫుడ్డా? అంటే? ‘ఏదీ.. సర్దార్జీలు తింటారూ... అదా’ అని కొట్టిపారేయొద్దు. మీకలా చెప్తే అర్థం కాదు గానీ.. ‘ధాబా ఫుడ్డు’ అంటే వెంటనే ఒంటబట్టుద్ది. నోరు ఊరుతోంది కదా! తాజ్ బంజారా లాంటి స్టార్ హోటల్ నుంచి మీకోసం ఈవారం.. భల్లే.. భల్లే ధాబా ట్రీట్. శోర్బా కావల్సినవి: టమాట ముక్కలు - 6 కప్పులు శనగపిండి - టీ స్పూన్ కరివేపాకు - 3-4 రెమ్మలు (ఆకులు మాత్రమే తీసుకోవాలి) కారం - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత పంచదార - 2 టీ స్పూన్లు నిమ్మరసం - 2 టీ స్పూన్లు నెయ్యి - టీ స్పూన్ ఆవాలు - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్ ధనియాల పొడి - పావు టీ స్పూన్ తయారి: కప్పు నీళ్లలో శనగపిండి కలపాలి. కడాయిలో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. దాంట్లో టొమాటో గుజ్జు వేసి 4 నిమిషాల సేపు ఉడికించాలి. దీంట్లో కరివేపాకు, కారం, మెత్తటి మిశ్రమం అయ్యేలా కలపాలి. దీంట్లో శనగపిండి మిశ్రమం, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి సన్నని మంటమీద 3-4 నిమిషాలు ఉడికించాలి. విడిగా కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ధనియాల పొడి వేసి పోపు పెట్టి ఈ మిశ్రమాన్ని శోర్బాలో కలపాలి. అతిథికి అందించే ముందు కొత్తిమీరతో అలంకరించాలి. మచ్చి అమృత్సరి కావల్సినవి: కింగ్‌ఫిష్/వంజరం/ కట్ల - చేప ముక్కలు - 600 గ్రా.లు శనగపిండి - కప్పుకారం - టేబుల్ స్పూన్ వాము (ఓమ) - టీ స్పూన్అల్లం ముద్ద - 2 టేబుల్ స్పూన్లువెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత గుడ్డు - 1 చాట్ మసాలా - టీ స్పూన్నిమ్మ ముక్కలు (చక్రాల్లా కోసినవి) - 2 తయారి:శుభ్రపరచిన చేప ముక్కలను గిన్నెలో వేసి, అందులో కారం, ఉప్పు, వాము, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, శనగపిండి వేసి, కలిపి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, కలిపి, చేప ముక్కలను అందులో ముంచి కాగిన నూనెలో వేసి రెండువైపులా గోధుమరంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. పేపర్ నాప్కిన్ (పలచగా ఉండే టిష్యూ పేపర్) మీద వేయించుకున్న ముక్కలు వేయాలి. ఇలా చేస్తే అదనపు నూనెను పేపర్ పీల్చుకుంటుంది. వెంటనే వడ్డిస్తే చేప ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి. చేప ముక్కల పైన చాట్ మసాలా చల్లి, గుండ్రగా కట్ చేసుకున్న నిమ్మముక్కలతో అలంకరించి, గ్రీన్ చట్నీ (దీని తయారీ కింద ఇచ్చాం) తో అందించాలి. స్టార్టర్ పనీర్ కుర్‌కురె కావల్సినవి: అప్పడాలు (పాపడ్స్) - 8 పనీర్ - 400 గ్రా.లు (ముక్కలుగా కోసుకోవాలి) శనగపిండి - అర కప్పు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; కారం - అర టీ స్పూన్; పసుపు - చిటికెడు ధనియాల పొడి - టీ స్పూన్; జీలకర్రపొడి - అర టీ స్పూన్; వాము (ఓమ) - అర టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత ; వంటసోడా - చిటికెడు; చాట్ మసాలా - టీ స్పూన్ ; గ్రీన్ చట్నీ - 4 టేబుల్ స్పూన్లు (దీని తయారీ కింద ఇచ్చాం); నూనె -వేయించడానికి తగినంత తయారి: బేసిన్లో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, వాము, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి, పిండి జారుగా కలుపుకోవాలి. జారుగా కలిపిన పిండిలో వంటసోడా, చాట్ మసాలా వేసి, కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి. పనీర్ ముక్కలకు ఒకవైపు గ్రీన్ చట్నీ రాయాలి. అప్పడాలను నలిపి ప్లేట్ అంతా పరచాలి.కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పనీర్ ముక్కలను ముంచి, తర్వాత అప్పడాలలో తిప్పి, వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. (అదనపు నూనె పీల్చుకోవడానికి పేపర్‌నాపికిన్ మీద వేయాలి) అన్ని ముక్కలు వేయించుకున్నాక చాట్ మసాలా పై నుంచి చల్లాలి. వడ్డించే ప్లేట్లో పనీర్ కుర్కురేని సర్ది, టొమాటో కెచప్‌తో గానీ, టొమాటో పచ్చడితో గానీ అందించాలి. మెయిన్ కోర్స్ దాల్ మఖనీ కావల్సినవి: పొట్టు తీయని మినప్పప్పు - కప్పు రాజ్మా - అరకప్పు ; నీళ్లు - 4 కప్పులు; జీలకర్ర - టీ స్పూన్ జీలకర్రపొడి - అర టీ స్పూన్; కారం - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) అల్లం - చిన్న ముక్క (సన్నగా తరగాలి ; వెల్లులి రెబ్బలు - 5 (సన్నగా తరగాలి); మసాలా (లవంగాలు, యాలకులు, మిరియాలు, వేయించిన ధనియాలు కలిపి పొడిచేసినది)- టీ స్పూన్ ; నెయ్యి - 3 టీ స్పూన్లు పాల మీగడ (చిలికినది) - 3 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత కొత్తిమీర ఆకులు - టీ స్పూన్ తయారి: రాజ్మ, మినప్పప్పు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం ప్రెషర్ కుకర్‌లో వేసి, నీళ్లు పోసి కనీసం 12-15 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. బయట ఉడికించాలంటే పప్పులు మెత్తగా అయ్యేవరకు ఉంచాలి. ఉడికిన పప్పును పెద్ద గరిటతో లేదా పప్పు గుత్తితో గుజ్జుగా చేయాలి. దీంట్లో జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, గరమ్ మసాలా, నెయ్యి వేసి మూత పెట్టకుండా సిమ్‌లో 10-15 నిమిషాల సేపు పప్పు అంతా బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. దీంట్లో పాల మీగడ వేసి మరో 15 నిమిషాలు ఉడికించి దించాలి. గిన్నెలో పోసి కొత్తిమీరతో అలంకరించాలి. ముర్గ్ మకాయ్ కావల్సినవి: చికెన్ (బెస్ట్) - అర అంగుళం చొప్పున 4 ముక్కలు ఉడికించిన మొక్కజొన్న గింజలు - కప్పు నూనె - 1 1/2 టేబుల్ స్పూన్ అల్లం - అంగుళం పొడవు ముక్క (సన్నగా తరగాలి) వెల్లుల్లి రెబ్బలు - 5-6 (సన్నగా తరగాలి) టొమాటో గుజ్జు - 3 మధ్యస్థంగా ఉండే టొమాటోలతో చేయాలి కారం - టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్ ధనియాల పొడి - టేబుల్ స్పూన్ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ - అంగుళం చొప్పున 2 ముక్కలుఉప్పు - రుచికి తగినంతకొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారి: నాన్‌స్టిక్ పాన్ లేదా కడాయిలో నూనె వేసి వెల్లుల్లిని వేయించుకోవాలి. దీంట్లో టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి. కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపిన చికెన్ ముక్కలు టొమాటో గుజ్జులో వేసి 5-6 నిమిషాలు ఉడికించాలి. యోగర్ట్ / పెరుగు, మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. దీంట్లో మసాలా వేసి మిశ్రమం చిక్కపడేంతవరకు, చికెన్ ముక్కలు ఉడికేంత వరకు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి, దించాలి. మాంసాహారాన్ని ఇష్టపడేవారికి ఈ కూర బాగుంటుంది. చాట్ మసాలా కావల్సినవి: జీలకర్ర - టేబుల్‌స్పూన్; దనియాలు - టేబుల్ స్పూన్; సోంపు గింజలు- పావు టీ స్పూన్; వాము - పావు టీ స్పూన్; ఇంగువ - పావు టీ స్పూన్; లవంగాలు - 5; టీ స్పూన్ - కారం; మామిడిపొడి (ఆమ్చూర్ పౌడర్) - 2 1/2 టేబుల్ స్పూన్లు; నల్ల ఉప్పు- టేబుల్ స్పూన్; ఉప్పు - 1 1/2 టీ స్పూన్; నల్లమిరియాలు - టేబుల్ స్పూన్; శొంఠి పొడి - టీ స్పూన్; పుదీనా పొడి (ఎండు పుదీనా ఆకులను పొడిచేయాలి) - అర టేబుల్ స్పూన్ తయారి: పెనంలో పై దినుసులన్నీ వేసి, వేయించి చల్లారనివ్వాలి. వేయించినవి పొడి చేసుకొని దాంట్లో మామిడి పొడి, నల్ల ఉప్పు, ఉప్పు, ఇంగువ కలిపి మరొక్కసారి బ్లెండ్ చేయాలి. దీనిని గాలి చొరని మూత ఉన్న సీసాలో పోసి కావల్సినప్పుడు వాడుకోవాలి. గ్రీన్ చట్నీ కావల్సినవి: పుదీనా ఆకులు - అర కప్పు; కొత్తిమీర ఆకులు - అర కప్పు; పచ్చిమిర్చి - 4 వెల్లుల్లి రెబ్బలు - 3-4 చాట్ మసాలా - 2 టీ స్పూన్లు; నిమ్మరసం - అర టీస్పూన్ ఉప్పు- తగినంత ; నీరు - తగినంత తయారి: పుదీనా, కొత్తిమీర ఆకులను శుభ్రం చేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చాట్ మసాలా, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో అర ముక్క నిమ్మరసం పిండి, చెంచాతో బాగా కలపాలి. గాజర్ కా హల్వా కావల్సినవి: గాజర్ గడ్డ లేదా క్యారెట్ తురుము - 2 కప్పులు; వెన్న తీసిన పాలు - 2 కప్పులు; పాల పొడి- 6 టేబుల్‌స్పూన్లు పంచదార- 4 టీ స్పూన్లు; యాలకుల పొడి - అర టీ స్పూన్; కుంకుమపువ్వు - చిటికెడు తయారి: కడాయిలో క్యారెట్, పాలు కలిపి మెత్తగా ఉడికించాలి. (ప్రెషర్ కుకర్‌లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచితే సరిపోతుంది) దీంట్లో పాల పొడి, పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి 4 నిమిషాలు ఉడికించాలి. అడుగు అంటుకోకుండా దించేంతవరకు గరిటెతో తిప్పుతుండాలి. దీనిని వేడిగా అందించాలి. ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసుకోవచ్చు. చెఫ్స్: కమల్ రానా, గౌతమ్ సుబేది హోటల్ తాజా బంజారా, హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
కరివేపాకు తీసిపారేయకండి
ఉప్మాలో కరివేపాకులా అంటూ ఉంటారు కానీ, కరివేపాకు లేకుంటే ఉప్మా చెయ్యడమే మానేస్తారు గృహిణులు. పులుసు, కూర, చారు, పులిహోర, సాంబారు, పచ్చడి... వీటిలో ఏ ఒక్కదానిలోనూ కరివేపాకు లేనిదే రుచి పుట్టదు, సువాసన రాదు. సుగంధ ద్రవ్యాలలో దీని తర్వాతి స్థానమే దేనిదైనా సరే! ఒకప్పుడు పల్లెటూళ్లలో ఇంచుమించు ప్రతి ఇంటి పెరట్లోనూ కరివేపాకు చెట్టు ఉండేది. అన్నట్టు కరేపాకులో ఎన్నో ఔషధ విలువలున్నాయి. ఆయుర్వేదంలో అయితే దీని ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, బెరడు, వేరు... అన్నింటినీ ఉపయోగిస్తారు. ఇటీవలకాలంలో సౌందర్యసాధనంగానూ దీనిని ఉపయోగిస్తున్నారు. స్థూలకాయంతో బాధపడేవారు రోజూ ఓ టేబుల్ స్పూన్ కరేపాకు పొడిని లేదా ముద్దను మజ్జిగతో పాటూ తీసుకుంటూ ఉంటే స్థూలకాయమే కాదు... దానిమూలంగా వచ్చే మధుమేహం కూడా తగ్గుతుందట. ఇండియా, శ్రీలంకలలో విరివిగా కనిపించే కరివేప... తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తుంది. అన్నట్టు ఆంగ్లంలో దీన్ని కర్రీ లీవ్స్ అంటారని అందరికీ తెలుసు కానీ, స్వీట్ నీమ్ లీవ్స్ అనీ, చైనీస్ బాక్స్ ట్రీ అని కూడా అంటారు. అలాగే తెలుగులో దీన్ని పూల వెలగ అని కూడా అంటారట. తిండి గోల -
ఆహా ఏమి రుచి... వంకాయ
తిండి గోల నవనవలాడే వంకాయలతో కూర చేస్తే ఆఖరు బంతివారికి అందనే అందదని చెప్పుకుంటుంటారు పెద్దవాళ్లు. వంకాయవంటి కూరయు లేదు... అంటూ తెగ పొగిడించుకునే ఈ కూరగాయను ప్రాచీన హిందూమత శ్రాద్ధ కర్మలలో నిషేధించేవారట. దీంతో ఈ కాయగూర పాశ్చాత్యులదే తప్ప భారతీయులది కాదని తెలుస్తోంది. అయితే, ఇది ఎప్పుడు మన దేశాన అడుగుపెట్టిందనే లెక్కలు అంతగా లేవు. కానీ, బ్రిటిషర్ల కాలంలోనే మన దేశంలో తన ముచ్చికను ముందుగా మోపి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. దక్షిణ ఆసియా, దక్షిణ అమెరికాలో వంకాయను ‘బ్రింజాల్’ అని, ఉత్తర అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, బ్రిటీషర్లు ‘ఎగ్‌ప్లాంట్’, గార్డెన్ ఎగ్.. వంటి పేర్లతో పిలుస్తుంటారు. అక్కడి పరిశోధకులు ఈ కూరగాయసాగులో పాటించిన అధునాతన పద్ధతుల వల్ల వందల రకాల ఆకృతులు, రంగులతో దర్శనమిస్తుంది వంకాయ. మన నోట మాత్రం ఆహా ఏమి రుచి అని కూరను తిన్న ప్రతిసారీ అనిపిస్తూనే ఉంది. వంకాయ పాశ్చాత్యులదే అయినా దాన్ని నడ్డి విరిచి వండేది మనమే కాబట్టి, రుచి క్రెడిట్ మన పాకశాస్త్ర ప్రవీణులకే ఇచ్చేయాలి. కాదంటారా!! -
కూర వండలేదని హత్య
జీడిమెట్ల: భర్త చేతిలో ఓ నవవధువు హత్యకు గురైంది. తప్పతాగి వచ్చిన ఆ దుర్మార్గుడు కూర వండలేదని గొంతు నులిమి భార్య ఉసురుతీశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భూపాల్ గౌడ్, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... మెదక్‌జిల్లా ఆందోల్ మండలం తాడ్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్, మహబూబ్ బీలకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుతురు మోసిన్(19)ను గాజులరామారం డివిజన్ శ్రీరాం నగర్లో ఉండే దూరపు బంధువు మహ్మద్ ఫరీద్ 3వ కుమారుడు ఎండీ ఎజాస్(22)కు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. కట్నం కింద అతనికి రూ.40 వేల నగదు, తులం బంగారంతో పాటు వంటసామగ్రి, బైక్ ఇచ్చారు. ఎజాస్ కూలి పనులు చేస్తుంటాడు. భార్య మోసిన్ అంటే మొదటి నుంచీ అతనికి ఇష్టం లేదు. బుధవారం రాత్రి 10 గంటలకు తప్ప తాగి ఇంటికి వచ్చిన ఎజాస్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. అన్నం వడ్డించిన ఆమె కూర వండలేదని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎజాస్ భార్యతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సమీపంలో ఉండే బంధువులకు విషయాన్ని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే సీఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మోసిన్ హత్య విషయం తెలిసి నగరానికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాక్షసుడికి ఇచ్చి చంపుకున్నామని వారు రోదించిన తీరు అందరి హృదయాలను కలచి వేసింది. -
కూర వండలేదని హత్య
నవవధువును కడతేర్చిన భర్త జీడిమెట్ల: భర్త చేతిలో ఓ నవవధువు హత్యకు గురైంది. తప్పతాగి వచ్చిన ఆ దుర్మార్గుడు కూర వండలేదని గొంతు నులిమి భార్య ఉసురుతీశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భూపాల్ గౌడ్, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... మెదక్‌జిల్లా ఆందోల్ మండలం తాడ్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్, మహబూబ్ బీలకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుతురు మోసిన్(19)ను గాజులరామారం డివిజన్ శ్రీరాం నగర్లో ఉండే దూరపు బంధువు మహ్మద్ ఫరీద్ 3వ కుమారుడు ఎండీ ఎజాస్(22)కు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. కట్నం కింద అతనికి రూ.40 వేల నగదు, తులం బంగారంతో పాటు వంటసామగ్రి, బైక్ ఇచ్చారు. ఎజాస్ కూలి పనులు చేస్తుంటాడు. భార్య మోసిన్ అంటే మొదటి నుంచీ అతనికి ఇష్టం లేదు. బుధవారం రాత్రి 10 గంటలకు తప్ప తాగి ఇంటికి వచ్చిన ఎజాస్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. అన్నం వడ్డించిన ఆమె కూర వండలేదని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎజాస్ భార్యతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సమీపంలో ఉండే బంధువులకు విషయాన్ని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే సీఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మోసిన్ హత్య విషయం తెలిసి నగరానికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాక్షసుడికి ఇచ్చి చంపుకున్నామని వారు రోదించిన తీరు అందరి హృదయాలను కలిచి వేసింది. -
మష్రూమ్... ఖుష్రూమ్!
పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? మనలో చాలామందికి డౌట్. దీనికి సమాధానం... ఒకసారి తిని చూడ్డం! డీప్ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రాజ్మా మష్రూమ్ కర్రీ, టొమాటో పాస్తా కర్రీ, కొరమీను మష్రూమ్ పొరటు... వీటిలో ఏం తిన్నా మీకు ఒకటే అనిపిస్తుంది ‘శాకాహరమైతేనేం? మాంసాహారమైతేనేం మష్రూమ్ ఇంత టేస్టుగా ఉంటే’ అని!! ఇవే కాదు... ఇంకా రకరకాల ప్రయోగాలను మీరు మష్రూమ్‌తో చెయ్యండి. ఈ ఆదివారం మీ డైనింగ్ హాల్ని... ఖుష్రూమ్గా మార్చండి. డీప్ మష్రూమ్ కర్రీ కావలసినవి: మష్రూమ్స్ - 2 కప్పులు చింతపండు - కొద్దిగా (నీళ్లలో నానబెట్టాలి) ఉప్పు - తగినంత గరంమసాలా - టీ స్పూను శనగపప్పు - టేబుల్ స్పూను మిరియాల పొడి - టీ స్పూను నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను ఎండుమిర్చి - 2 కొత్తిమీర - కొద్దిగా టొమాటో ముక్కలు - పావు కప్పు కరివేపాకు - 2 రెమ్మలు తయారి: చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి బాణలిలో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి పాన్‌లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక టొమాటో ముక్కలు వేయించాలి. మష్రూమ్ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్చేయాలి. అలసందలు మష్రూమ్ కర్రీ కావలసినవి: అలసందలు - 50 గ్రా. మష్రూమ్స్ - 200 గ్రా., ఉల్లితరుగు - పావు కప్పు టొమాటో తరుగు - అర కప్పు పచ్చిమిర్చితరుగు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కారం - అర టీ స్పూను పసుపు - చిటికెడు, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, జీడిపప్పులు - 8 జీలకర్ర - టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - టే బుల్ స్పూను, ఉప్పు - తగినంత తయారి: అలసందలను రెండు గంటలసేపు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి పాన్‌లో నెయ్యి కరిగాక ఉల్లితరుగు వేయించి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించి తీసి పక్కన ఉంచాలి ధనియాలపొడి, జీడిపప్పు, టొమాటో తరుగు, కారం, పసుపు, గరంమసాలా జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు జత చేసి వేగాక మసాలా వేసి వేయించాలి ఉడికించిన అలసందలు, అర కప్పు నీరు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మష్రూమ్ ఫ్రై కావలసినవి: మష్రూమ్ ముక్కలు - కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కొత్తిమీర - టీ స్పూను, కరివేపాకు పొడి - టీ స్పూను, నిమ్మరసం - టీ స్పూను, నూనె - 5 టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు తయారి: ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి. మష్రూమ్ టొమాటో పాస్తా కర్రీ కావలసినవి: పాస్తా /మాక్రోనీ/ మీల్మేకర్ - అర కప్పు, ఉప్పు - తగినంత, నానబెట్టిన మష్రూమ్ ముక్కలు - కప్పు, టొమాటోతరుగు - అర కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పుదీనా ఆకులు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 3, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10, బాదంపప్పులు - 6, ఏలకుల పొడి - టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూను, ధనియాల పొడి - అర టీ స్పూను, గరంమసాలా - టీ స్పూను, కొత్తిమీర - తగినంత తయారి: గిన్నెలో పాస్తా, తగినంత నీరు, ఉప్పు వేసి కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె కాగాక వెల్లుల్లి రేకలు వేయించాలి పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు, బాదం పప్పులు, ఏలకుల పొడి జత చేసి వేయించాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు వేసి, మెత్తబడేవరకు వేయించి, దించేసి, చల్లారాక, ఈ మిశ్రమానికి పుదీనా ఆకులు జతచేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కాగాక, క్యాప్సికమ్ తరుగు, ఉడికించిన పాస్తా, మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి కొద్దిగా నీరు జత చేసి నాలుగైదు నిముషాలు ఉడికించి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కొరమీను మష్రూమ్ పొరటు కావలసినవి: ఉడికించిన కొరమీనులు - కప్పు, మష్రూమ్ ముక్కలు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను, ఉల్లితరుగు - అర కప్పు, వెల్లుల్లి రేకలు - 6 అల్లం పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ గరంమసాలా - అర టీ స్పూను, పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు తయారి: బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాలి అల్లం పేస్ట్, వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి 5 నిముషాల తరవాత మష్రూమ్ ముక్కలు, ఉప్పు, పసుపు, నీరు జతచేసి మూత పెట్టాలి ముక్కలు ఉడికిన తర్వాత, ఉడికించి ఉంచుకున్న కొరమీనులు, సోయా సాస్ వేయాలి గరంమసాలా, నిమ్మరసం, కరివేపాకు వేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కర్టెసీ: రఘువీర్ కె.సి. హైదరాబాద్ సేకరణ: డా. వైజయంతి