సీ ఫుడ్ అంటే సాధారణంగా చేపలు పీతలు, రొయ్యలు గుర్తొస్తాయి చాలామందికి. అయితే నత్త మాంసం గురించి ఎపుడైనా విన్నారా? ఓ మై గాడ్.. నత్తలా.. దేన్నీ వదలరా ..ఎలా తింటార్రా బాబూ అనిపించినా ఇది నిజం. అంతేకాదు చాలా రోగాలు నయమవుతాయని విశ్వసిస్తారు తీర ప్రాంత ప్రజలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నత్తల కూరను చాలా ఇష్టంగా తింటారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఆహార అలవాట్లు భిన్నంగా ఉంటాయి. నత్తలు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని గోదావరి వాసులు అంతేకాదు నమ్ముతారు. ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం పోర్చుగల్‌తో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చాలా ఇష్టపడే వంటకం. ఇది దగ్గు, క్షయవాధి ఆయాసం వంటి జబ్బులకు బాగా పనిచేస్తుందని భావిస్తారు.
ప్రొటీన్ ఎక్కువ, కొవ్వు తక్కువ
నత్తలతో వెరైటీ వంటలు కూడా చేస్తూ ఉంటారు నత్త మాంసంలో ప్రోటీన్ కంటెంట్ పంది మాంసం , గొడ్డు మాంసంలో ఉండే ప్రోటీన్ లభిస్తుంది.కానీ కొవ్వు చాలా తక్కువ. ఇనుము, కాల్షియం, విటమిన్ ఏ, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీరంలోని కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు బలంగా ఉండటానికి, బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కళ్లు, జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు నత్తల ద్వారా మనకు అందుతాయి.
రక్తహీనతను మెరుగుపరుస్తుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది.ఈ జబ్బుతో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించి రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. హార్ట్ బీట్‌ను నియంత్రిస్తుంది. శ్వాస కోశ సమస్యలు, ఫైల్స్ ఉన్నవారు నత్త ప్రత్యేకంగా తింటారు. అయితే వీటిని షెల్‌ను జాగ్రత్తగా తొలగించి, ముందుగా ఉప్పు, పసుపుతో శుభ్రంగా కడిగాలి. ఆ తరువాత మజ్జిగలోగానీ, నిమ్మరసం కానీ కొద్దిసేపు ఉంచితే నీచువాస పోతుంది. వేడినీళ్లలో ఉడికించాలి. తరువాత చికెన్, మటన్ కర్రీ తరహాలోనే ఈ నత్తల కూరను తయారు చేస్తారు. నత్తలు, గోంగూరతో కలిపి కూడా కర్రీ చేస్తారు. కొత్తగా పెళ్లయిన వారు పిల్లలు పుట్టని వారు నత్తల కూర తింటే ఎంతో ఉపయోగం నమ్ముతారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)
పచ్చివి, ఉడికీ ఉడకని నత్తలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో, ఎలుక ఊపిరితిత్తుల వ్యాధి అనే పరిస్థితికి దారి తీస్తుంది. కనుక మేలిమి జాతి సముద్ర నత్తలతో పాటు స్థానికంగా వర్షాకాలంలో ఎక్కువగా దొరికే నత్తలను శుభ్రంగా కడిగి, ప్రవీణులైన వంటగాళ్ల సలహా మేరకు అవసరమైన మసాలా దినుసులు జోడించి, జాగ్రత్తగా ఉడికించిన తరువాత తింటే... ఆ మజానే వేరు!
ఇవీ చదవండి: ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే.. ‘ఆహా ఏమి రుచి’ అనాల్సిందే!
డ్రీమ్ జాబ్ : అమ్మకోసం రూ.2 కోట్ల జాక్ పాట్ కొట్టిన టెకీ
Comments
Please login to add a commentAdd a comment