Madhya Pradesh Angry Wife Leaves Husband House After He Puts Tomato In Vegetable Sabzi, Deet Inside - Sakshi
Sakshi News home page

Viral News: కూరలో టమాటా వేశాడని.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయిన భార్య!

Published Thu, Jul 13 2023 8:31 AM | Last Updated on Thu, Jul 13 2023 10:04 AM

husband put tomato in vegetable angry wife left home - Sakshi

మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టమాటాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది మరింత పెద్దదిగామారడంతో భార్య తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. 

వివరాల్లోకి వెళితే టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్న సంజీవ్‌ వర్మన్‌ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చినప్పటికీ ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. 

దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్‌ నుంచి అతని భార్య ఆరతి ఫోన్‌ నంబరు తీసుకుని ట్రేస్‌ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్‌ అధికారి సంజయ్‌ జైశ్వాల్‌ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతి వర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్‌, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు. కాగా దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేపధ్యంలో వీటి కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్‌’,‘అన్‌లాక్‌’,‘డౌన్‌లోడ్‌’.. ఎందుకిదంతా జరుగుతోంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement