Vegetable
-
రైతు బజార్లలో సబ్జి కూలర్లు
కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా ఐఐటీ బాంబే విద్యార్థులు అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. టమాటాలు, దోసకాయలు, కాప్సికమ్, ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బెండకాయలు వంటి ఇతర కూరగాయలతోపాటు పండ్లు, పూలు వంటివి తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయవచ్చు. ఏడు లేయర్ల ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్ లేదా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. – సాక్షి, అమరావతిమూడు మోడల్స్‌లో సబ్జి కూలర్లుఈ సబ్జి కూలర్లను 100 కేజీలు (ధర రూ.50వేలు), 50 కేజీలు (రూ.35,400), 25 కేజీలు (రూ.17,700) సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. వీటిని పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 13మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై అధికారులు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లోని ఎనిమిది రైతుబజార్లలో రైతులు అందరూ ఉపయోగించుకునేలా మార్కెటింగ్ శాఖ ఏర్పాటుచేసింది.వీటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత మిగిలిన రైతుబజార్లలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుబజార్లలో రైతులకు కనీసం 100 కేజీల సామర్థ్యం కలిగిన కూలర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని సంకల్పించారు.కుప్పంలో 50 మంది రైతులకు...కుప్పంలో 50 మంది పూల రైతులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనిట్ విలువలో 50శాతం ఉద్యానవన శాఖ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు సంఘాలు, విలేజ్ ఆర్గజనైషన్స్(వీవో) భరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కుప్పంలో ఈ నెల 20వ తేదీన రైతులకు ఈ సబ్జి కూలర్లను ప్రదర్శించనున్నారు. అనంతరం 28వ తేదీన పొదుపు సంఘాలు, వీవోల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మార్చి 5న అర్హులను ఎంపకి చేసి, 15వ తేదీలోగా లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేలా గడువు ఇస్తారు. మార్చి 31వ తేదీన లబ్ధిదారులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. -
పత్తి చేనులో పప్పులు,కూరగాయలు : ఇలా పండించుకోవచ్చు!
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది. పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు. మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్‌లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్‌తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు. విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు. ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,దోర్నాలపల్లి, దోమ మండలం, వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు. ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు. మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు. పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు. -
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ను విడుదలకు దోహదపడే ఇనులిన్‌ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్‌ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్‌ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్‌ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్‌లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
భారీగా పతనమైన టమోటా ధర..
-
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
Health: వైట్.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.మేలు చేసే తెల్లటి ఆహారాలివి..ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ్రపోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్ అని పిలిచే పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు! -
బాదుడే బాదుడు..
-
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న కూరగాయల ధరలు
-
"ధరలు చూసి కొనకుండానే వెళ్లిపోతున్నా.."
-
మళ్లీ సెంచరీ కొట్టిన టమాటా
సాక్షి,కర్నూలు: కూరగాయల ధరలు మండుతున్నాయి. కేజీ టమాట ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లో మాత్రం కేజీ టమాటా 80 రూపాయలకు అందిస్తున్నారు. వంటింట్లో ఎక్కువగా వాడే టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుండుంతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధర వారం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది. గతంలో అధిక ధరలున్న వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టమాటాను సబ్సిడీ ధరతో అందించింది. కేజీ టమాటాను రూ.50కే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం టమాటను నోలాస్ నో పప్రాఫిట్ పేరుతో పెరిగిన ధరలకు కాస్త అటుఇటుగానే ప్రజలకు అందజేస్తోంది. -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్ నుండి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్‌ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్‌లకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్‌ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 పీకేఆర్‌లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్‌లకు అమ్ముతున్నారు. -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్‌కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
అమానుష ఘటన!ఆస్పత్రి వెలుపలే కూరగాయల బండిపై మహిళ ప్రసవం!
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించాలని అధికారులు ప్రచారం చేసినా ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆఖరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నా ముందుకు రావడం లేదు కూడా. ఎందుకుంటే? అక్కడ జరిగిన పలు ఘటనలే. పోతే పోయాయి డబ్బులు అని కార్పోరేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రులంటే ప్రజలు జంకడానికి ఇవేనేమో అనిపించేలా ఇక్కడ ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన నిండు గర్భిణి ఆస్పత్రి వెలుపలే గజగజలాడే చలిలో ఓ కూరగాయాల బండిపైనే ప్రసవించింది. ఆరుబయటే బహిరంగంగా ఓ తల్లి నొప్పులు పడి కనే దుస్థితి ఎదురైంది. ఈ ఘటనతో మాకు ఆస్పత్రులు, అక్కడ సిబ్బందిపై నమ్మకం పోయిందంటూ ఆ మహిళ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. అదీకూడా ఆస్పత్రి ప్రాంగణలోనే ఈ దారుణం జరగడం మరింత బాధకరం! అసలేం జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన హర్యానాలో అంబాలాలోని ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మెహాలి జిల్లాలోని దప్పర్ నివాసి తన భార్య గర్భవతి అని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు నొప్పులు మొదలవ్వడంతో స్ట్రెచర్ కోసం కంగారుగా ఆస్పత్రిలోకి పరుగెట్టాడు ఆ వ్యక్తి. అయితే అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎవరూ స్ట్రెచర్ తెచ్చేందుకు రాలేదు. పైగా అక్కడ ఉన్నవారెవరూ ఆమెను జాయిన్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఆమెను లోపలికి తీసుకువెళ్లేలోపే ఆస్పత్రి గేటు సమపంలో బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. ఆ తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నారు. తాను ఎంతలా ఆ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదనగా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ తల్లి బిడ్డలను దేవుడే కాపాడాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో తనకు ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై నమ్మకంపోయిందని వేదనగా చెప్పాడు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా సదరు ఆస్పత్రిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆ తల్లి బిడ్డలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లి వార్డులో ఉంచారు. ఈ ఘటన గురించి పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు చేరడంతో తక్షణమే ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధిపథంలోకి వెళ్తుండటం అంటే సామాన్యుడికి సైతం సక్రమమైన వైద్యం, బతకగలిగే కనీస సౌకర్యాలు ఉన్నప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఇలాంటి ఘటనలు పునురావృతమవుతున్నంత కాలం అధికారులపై, నమ్మకంపోతుంది. పైగా అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుంగా పోతుంది. ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సామాన్యుడికి అన్నిరకాల వసతులు అందేలా చేసి ప్రజలచేతే తమ రాష్ట్రం అభివృద్ధిపథంలోకి పోతుందని సగర్వంగా చెప్పేలా చేయండి. అప్పడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. (చదవండి: చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలనుకుంది! అందుకోసం ఆమె ఏకంగా..) -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్‌లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
పెద్దపల్లికి చెందిన యువరైతు అద్భుత ప్రతిభ..!
-
ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం
న్యూఢిల్లీ: కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటమే ఆందోళనకర అంశంగా మారిందని ఆయన చెప్పారు. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టమైన 7.44 శాతం స్థాయికి ఎగిసిన నేపథ్యంలో ప్రభుత్వ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూరగాయల రేట్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగియడం తాత్కాలికమేనని, ధరలు వేగంగా దిగి వచ్చే అవకాశం ఉందని అధికారి వివరించారు. వర్షపాతం 6 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఖరీఫ్ సీజన్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయని, భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పారు. అయితే, ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సరళతర వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. అటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రభుత్వానికి లేదని అధికారి తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్ రేట్లు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కాస్త ఆందోళనకర అంశమే అయినప్పటికీ.. చమురు మార్కెటింగ్ కంపెనీల కోణంలో ప్రస్తుతానికైతే భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ముడిచమురు రేట్లు 80-90 డాలర్ల మధ్య వరకూ ఉంటే ఫర్వాలేదని, 90 డాలర్లు దాటితేనే ద్రవ్యోల్బణం, ఇతరత్రా అంశాలపై ప్రభావం పడగలదని పేర్కొన్నారు. -
కూరగాయలే ఎక్కువగా తినాలి
రామచంద్రాపురం (పటాన్చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్‌లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటకు మంచి ధర దక్కేలా మార్కెట్ లో నేరుగా విక్రయం
-
పాతబస్తీలో నకిలీ నోటు కలకలం!
చంచల్‌గూడ: దేశంలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆర్బీఐ కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా గత గురువారం పాతబస్తీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్లో నకిలీ రూ. 200 నోటు దర్శనమిచ్చింది. మార్కెట్లో ఓ వ్యాపారి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆకు కూరలు కొనుగోలు చేసి రూ. 200 నోటు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని జారుకున్నాడు. సదరు వ్యాపారి ఆ రూ.200 నోటును వ్యాపారం చెల్లింపుల్లో భాగంగా మరో వ్యాపారికి ఇవ్వగా నకిలీదిగా గుర్తు పట్టాడు. నోటు సైజ్ తక్కువ, పేపర్ మందం ఎక్కువగా ఉంది. కలర్లో వ్యత్యాసం ఉండటంతో పాటు నోటుపై వాటర్ మార్క్ గాంధీ బొమ్మ కూడా లేకపోవడంతో అది ఫేక్ నోటుగా నిర్ధారించుకున్నాడు. దీంతో అసలైన నోటు అని భావించిన వ్యాపారి తాను మోసపోయినట్లు గుర్తు పట్టారు. వారం క్రితం రూ. 500 నోటు ఇక్కడే ఈ ఘటనకు వారం రోజుల ముందు కూడా ఇలాగే మరో గుర్తు తెలియని వ్యక్తి రూ. 500 నకిలీ నోటు మార్చేందుకు యయత్నంచగా పసిగట్టిన వ్యాపారి సదరు వ్యక్తితో గొడవపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే నగరంలో నకిలీ రూ. 500, 200 నోట్లు చెలామణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలీసు, ఎన్ఐఏ, బ్యాంక్ అధికారులు మార్కెట్లో నకిలీ నోట్ల గుర్తింపుపై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వ్యాపారులు మోసపోకుండా ఉంటారు. మార్కెట్లో పోలీసు స్టేషన్‌కు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలోని ఫుటేజీలను మాదన్నపేట పోలీసులు పరిశీలిస్తే నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యేందుకు అవకాశం లేకపోలేదు. అయితే మాదన్నపేట పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుంటారా లేక, బాధితులు ఫిర్యాదు ఇస్తేనే రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. -
కూరగాయల ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి?
-
కూరలో టమాటా వేశాడని.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయిన భార్య!
మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టమాటాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది మరింత పెద్దదిగామారడంతో భార్య తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. వివరాల్లోకి వెళితే టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ వర్మన్ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చినప్పటికీ ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్ నుంచి అతని భార్య ఆరతి ఫోన్ నంబరు తీసుకుని ట్రేస్ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్ అధికారి సంజయ్ జైశ్వాల్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతి వర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు. కాగా దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేపధ్యంలో వీటి కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
వెజిటబుల్స్ ఆన్ వీల్స్.. మొబైల్ మార్కెట్ రెడీ
మార్కెటింగ్ శాఖ ప్రారంభించిన మొబైల్ కూరగాయల మార్కె ట్లకు మంచి స్పందన లభిస్తోంది. తాజా కూరగాయలను రైతులే తమ ప్రాంతానికి తెచ్చి అమ్ముతుండటం, ధరలు కూడా ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుండటంతో వినియోగదారులు సంచార వాహనాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా చాలావరకు కూరగాయలు అమ్ముడుపోతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి విశేష స్పందన నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఫోన్ లేదా ఈమెయిల్ చేస్తే వినియోగదారులు కోరుకున్న ప్రాంతానికి ఈ మొబైల్ రైతు బజార్లను పంపించే వెసులుబాటు కల్పించింది. కూరగాయలు సైతం వివిధ యాప్‌ల ద్వారా ఆల్‌లైన్‌లో డోర్ డెలివరీ అవుతుండటం, వారానికో రోజు మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ల వంటివి వీధి మలుపుల్లోనే కొనసాగుతుండటం, ఇళ్లకు సమీపంలోనే భారీ దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో ఇటీవలి కాలంలో రైతుబజార్లకు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గింది. గతంలో మాదిరి కిటకిటలాడటం లేదు. చాలా సందర్భాల్లో శ్రమకోర్చి తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక రైతులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు పాడైన కూరగాయలను అక్కడే పారబోసి వెళ్ళాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన మార్కెటింగ్ శాఖ వినూత్నంగా ఆలోచించింది. వాహనాలు సమకూర్చి రైతులే కూరగాయల్ని బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలకు తీసుకెళ్లి విక్రయించుకునే ఏర్పాటు చేసింది. రైతుబజార్లకు వచ్చే రైతులు అక్కడినుంచి కూరగాయలను వాహనాల్లో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు వెళతారన్నమాట. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని మూడు ప్రధాన రైతుబజార్ల నుంచి మార్కెటింగ్ శాఖ వాహనాలు పంపిస్తోంది. రైతులు వాహనాలకు సంబంధించిన డీజిల్, ఇతరత్రా ఖర్చులు ఏవీ భరించాల్సిన అవసరం లేకుండా తానే వ్యయాన్ని భరిస్తోంది. ప్రస్తుతం ఎర్రగడ్డ, ఫలక్‌నుమా, మెహిదీపట్నం రైతుబజార్ల నుంచి రైతులు వాహనాల్లో కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో వచ్చే కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తాజా కూరగాయలు కళ్లెదుటే కని్పస్తుండటం వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. రైతుబజార్లకు తగ్గిన తాకిడి.. నగరవాసులు అన్ని వస్తు వులు ఆన్లైన్ ద్వారా డోర్ డెలివరీ పొందుతున్నారు. దీంతో రైతుబజార్లకు తాకిడి తగ్గింది. రైతులు కష్టపడి తెచ్చిన కూరగాయలు పూర్తిగా అమ్ముడవ్వక నష్టపోతున్నారు.దీంతో రైతులు వాహనాల్లో బస్తీలకు తీసుకెళ్లి విక్ర యించుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ ధరలు తక్కువ ఉంటున్నాయ్.. మా ఏరియాలో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ కానీ రైతుబజార్ కానీ లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేంది. ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వారానికి రెండుసార్లు బాలానగర్ బస్తీకి మొబైల్ రైతుబజార్ వస్తోంది. ధరలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. – గణపతి, బాలానగర్ నివాసి నిర్ధారించిన ధరలకే.. కూరగాయల ధరలను మార్కెటింగ్ శాఖే నిర్ణయిస్తోంది. ఆయా ధరలను రైతులు తమ వాహనం వద్ద బోర్డుపై ప్రదర్శిస్తున్నారు. ఆయా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. రైతులు ఇష్టమొచి్చన ధరలకు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తు తం ఒక్కో రైతుబజార్ నుంచి 10 చొప్పున మొత్తం 30 వాహనాలు ఈ విధంగా బస్తీలకు కూరగాయలు తీసుకెళుతున్నాయి. ప్రజల నుంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో మొత్తం 11 రైతుబజార్లు ఉండగా..మరికొన్ని ప్రధాన రైతుబజార్ల నుంచి మొత్తం 125 వాహనాలు నడిపే ఆలోచనలో మార్కెటింగ్ శాఖ ఉంది. కూరగాయల కోసం కాల్ చేయాల్సిన నంబర్లు.. ఎర్రగడ్డ రైతుబజార్.. 7330733746 ఫలక్‌నుమా.. 7330733743 మెహిదీపట్నం.. 7330733745 ఈమెయిల్.. ఎర్రగడ్డ రైతుబజార్.. MRB.E.HYD@Gmail.com మెహిదీపట్నం.. MRB.M.HYD@Gmail.com ఫలక్‌నుమా.. MRB.F.HYD@Gmail.com -
వైరల్ వీడియో : మార్కెట్ కి వెళ్లి బేరాలు ఆడుతున్న కుక్క
-
మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..
ఇప్పటి వరకు ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో అందరీ హృదయాలను దోచేవిధంగానూ, కదిలించేలా ఉంటుంది. రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవించే ఒక వృద్ధురాలు కలలో కూడా ఊహించి ఉండి ఉండదు. తన జీవితంలో ఇలాంటి మంచి రోజు ఒకటి ఉంటుందని, చింత లేకుండా బతకుతాను అని అనుకుని ఉండకపోవచ్చు కదా. ఆ యువకుడు ఒక్కరోజులో ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. వివరాల్లోకెళ్తే...75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ జీవిస్తుంటుంది. ఒక యువకుడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి షాపింగ్ చేయించి ..కూరగాయాలు, వేయింగ్ మిషన్, తోపుడు బండి వంటి అన్ని వస్తువులు కొని కూరగాయాలు అమ్ముకుంటూ బతకమని చెబుతాడు. అంతేగాదు ఆమెకు రోజు బతకడానికి కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. దీంతో సదరు వృద్ధురాలి సంబరపడిపోతూ ఆ యువకుడిని ఆనందంగా ఆశీర్వదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవినాశ్ శర్మ పోస్ట్ చేశారు. ఆ వృద్ధురాలికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి తరుణ్ మిశ్రా అనే ఇన్స్ట్రాగ్రామర్ అని చెప్పారు. అతను తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో నచ్చడంతో షేర్ చేసినట్లు తెలిపారు. అంతేగాదు నెటిజన్లు ఆ వృద్ధురాలికి చేసిన సాయానికి సదరు యువకుడిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp — Awanish Sharan (@AwanishSharan) October 18, 2022 View this post on Instagram A post shared by TARUN MISHRA (@tarun.mishra17) (చదవండి: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు) -
ఫుడ్‌కోర్టులో ‘గుడ్డు’ వివాదం
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్ ప్రధాన రోడ్డులో వెజ్ ఫుడ్ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్‌ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు. దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్‌ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి.. -
శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కూరగాయల ధరలు 40 శాతం, ఫలాల ధరలు 20 శాతం మేర పెరిగిపోయాయి. శ్రావణ మాసంలో అధిక శాతం కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసలుంటాయి. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. దీంతో శ్రావణ మాసంలో కోడి, మేక మాంసాలకు డిమాండ్ పడిపోతుంది. సాధారణంగా ఉపవాసాలుండే ఈ కుటుంబాల్లో పురుషులు మద్యం కూడా ముట్టుకోరు. అదేవిధంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉపవాసాలు, పూజల కారణంగా పండ్లు, ఫలాలకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో కోడి గుడ్లు, మేక, కోడి మాంసం ధరలు పడిపోతాయి. కాని ఏటా శ్రావణ మాసంలో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలు అమాంతం చుక్కలను తాకుతాయి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఏపీఎంసీలోకి 2,586 టన్నుల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 3,815 టన్నులు వస్తున్నాయి. దీన్ని బట్టి శ్రావణ మాసంలో కూరగాయాలకు ఏ స్ధాయిలో డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఏటా శ్రావణ మాసం ప్రారంభం కాగానే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరుగుతుంది. కాని ఈ ఏడాది జూలైలో భారీగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లన్నీ కోతకు గురై పాడైపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణ స్తంభించిపోయింది. పండించిన పంటలు కూడా నీటిపాలయ్యాయి. కొన్నిచోట్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ట్రక్కుల్లో ఉన్న సరుకులు కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటికితోడు తరుచూ ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. మరోపక్క ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య తగ్గిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువ, సరుకుల రవాణా తక్కువ అనే పరిస్ధితి నెలకొంది. ఫలితంగా కూరగాయల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 10–20 శాతం పెరగ్గా, రిటైల్ వ్యాపారులు 40 శాతం మేర పెంచారు. అలాగే పండ్లు, ఫలాల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 10–15 శాతం పెరగ్గా రిటైల్‌లో 20 శాతం మేర ధరలు పెంచాల్సి వచ్చిందని చిరు వ్యాపారులంటున్నారు. -
బోడ కాకర.. 2 నెలలు మాత్రమే పండుతుంది.. కిలో ధర రూ.200 పైనే
సాక్షి, మహబూబ్‌నగర్: అడవి కాకర (బోడ కాకర) ఏడాదిలో కొద్ది రోజులే వినిపించే ఓ రకమైన కాయగూర. మార్కెట్లో ఏ కూరగాయకు లేని ధర దీనికి ఉంటుంది. గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉండటంతో పాటు ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ గుణాలు ఉంటాయి. ఏటా వర్షాకాలం జూలై, ఆగష్టు రెండు నెలలు మాత్రమే పండుతుండటంతో దీనికి డిమాండ్ ఉంటుంది. బోడ కాకరను సామాన్యులు కొనలేని పరిస్థితి. ప్రస్తుతం కూరగాయల మార్కెట్లో కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. బోడ కాకరకాయ పూతకు వచ్చే వరకు ఏది కాయ కాస్తుందో, ఏది కాయదో తెలియదు. పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసివేసి ఆడ మొక్కలను మాత్రమే ఉంచాలి. ఆడ మొక్కలకే కాయ కాస్తుంది. బోడకాకరను విత్తనాలు, దుంపలు, తీగల కత్తిరింపు ద్వారా పెంచుతారు. తీగలైతే 2 లేక 3 నెలల వయస్సున్న వాటిని కత్తిరించి నాటుకోవచ్చు. దుంపలు అయితే 2 లేక 3 ఏళ్ల వయసున్నవి నాటుకోవచ్చు. విత్తనాలైతే గుంతకు 4, 5 విత్తుకోవాలి. విత్తనాల ద్వారా నాటిన మొక్కలు 50 నుంచి 60 రోజులకు పూతకు వస్తాయి. ఒక్కసారి నాటితే ప్రతి వర్షాకాలంలో 3 లేక 4 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఆరోగ్యానికి మంచింది.. అధిక ప్రొటీన్లు, ఐరన్, ఖనిజ లవణాలున్న పంటగా ప్రత్యేక స్థానం ఉంది. పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. దీనిలోని ప్రొటీన్లు శరీరంలో రక్తకణాల వృద్ధి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడతాయి. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచడంతో చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తాయి. ఏ, సీ విటమిన్లు ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకలను నాశనం చేయడానికి తోడ్పడుతుంది. దీని ఆకులతో తయారు చేసిన డికాషన్కు జ్వరాన్ని తగ్గించే గుణం ఉంటుంది. దీని వేర్లు తలనొప్పి, శరీరంలోని రాళ్లను, చెంపనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేగాకుండా మూలశంక, రక్తస్రావం, మూత్రకోశ వ్యాధులను అదుపులో ఉంచుతుంది. బోడకాకరకాయ గింజలను ఛాతి సంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. ఔషధ గుణాలెక్కువ.. అడవి కాకర తీగజాతికి సంబంధించినది. సీజన్లో మాత్రమే లభిస్తోంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్, బీపీ, డయాబెటిస్ తదితర వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇందులో ఆడ, మగజాతి రకాలుంటాయి. దీని విత్తనాన్ని కాపాడుకోవడానికి కాయలు కాసినప్పుడు ఆడజాతి కాకర కాయలను తెంపి వాటిని శుద్ది చేసుకోవాలి. వర్షాలకు రెండు నెలల ముందే భూమిలో నాటుకోవాలి. వర్షాలు కురిసితే జూన్‌లో మొలకెత్తి జూలై, ఆగష్టు వరకు కాయలు కాస్తాయి. మార్కెట్లో కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. – ఖదీర్, ఉద్యాన అధికారి, మక్తల్ -
విస్తారంగా కూరగాయల సాగు
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కూరగాయల పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయి. కొద్దిపాటిగా ఉన్న నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఎండలు అధికమవడంతో లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలు కూడా అడుగంటాయి. పంట కాల్వల్లో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో రబీలో సాగవుతున్న పలు రకాల కూరగాయల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు, చిన్న గెడ్డల్లో నీటి నిల్వలు పెరిగాయి. ఏజెన్సీలోని అరకులోయ మండలం పెదలబుడు, చినలబుడు, బస్కి, డుంబ్రిగుడ మండలం సొవ్వ, సాగర, హుకుంపేట మండలంలోని సంతారి, శోభకోట, తీగలవలస, రంగశీల, పాడేరు మండలంలోని గుత్తులపుట్టు, వనుగుపల్లి, ఇరడాపల్లి, కిండంగి, పెదబయలు మండలంలోని గలగండ, ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు, చింతపల్లి మండలంలోని చౌడుపల్లి, లోతుగెడ్డ, లంబసింగి, తాజంగి, జి.కె.వీధి మండలంలోని దారకొండ, గుమ్మిరేవుల, మాలివలస, రింతాడ ప్రాంతాల్లో మాలి జాతి గిరిజనులు ఆకు కూరలతో పాటు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాట, వంగ, బీన్స్‌తో పాటు పలురకాల మిర్చి, ఆకు కూరల పంటలన్నింటికి ఈ అకాల వర్షాలు ఊపిరి పోసినట్టయిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అధిక దిగుబడులకు కూడా ఈ వర్షాలు ఎంతో అనుకూలించాయి. -
ఇది బుడ్డోడి బాహుబలి ‘సొర’
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): ప్రకృతిపై ప్రేమ.. పర్యావరణంపై మక్కువ.. ఈ రెండూ కలిపి ఎనిమిదేళ్ల పూండ్ల అధ్విక్రెడ్డిని పెరటి తోటలో కూరగాయల పెంపకంపై ఆసక్తిని పెంచింది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ పీవీఆర్ ప్రాజెక్టస్ సీఎండి పూండ్ల వెంకురెడ్డి మనవడు అధ్విక్రెడ్డి ఓక్రిడ్జ్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి పి.సతీష్‌కుమార్‌రెడ్డి అదే సంస్థలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్. కాగా తల్లి పి.దీప్తిరెడ్డి యంగ్ ఫిక్కి లేడీస్ అసోసియేషన్ చైర్పర్సన్. తాతకు కూరగాయలు, పండ్ల పెంపకంపై ఉన్న ఆసక్తి మనవడిపై ప్రభావం చూపింది. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఈ బాలుడు పెరటి తోటలో కూరగాయల పెంపకంపై దృష్టిసారించాడు. ఇంట్లో పెట్టిన సోరకాయ ఏకంగా వంద సెంటీమీటర్ల ఎత్తుతో ఆకర్షణగా ఉంది. దీని బరువు 10 కిలోలు. ఈ నాటు సోరకాయను పెంచడానికి అధ్విక్ ప్రతిరోజూ వేపపొడితో పాటు సేంద్రీయ ఎరువులను వేస్తుండేవాడు. ఇంటి వెనుక కిచెన్ గార్డెన్లో కూడా రకరకాల కూరగాయలు పెంచుతున్నాడు. మన కూరగాయలు మనమే పండించుకోవాలన్న ఉద్దేశంతో దీనిపై ఆసక్తి పెరిగిందని ఇందుకోసం పార, గంప తదితర పెరటి తోట సామగ్రిని కూడా కొనుగోలు చేసుకున్నారు. మొక్కలు నాటడం, పెంచడం అది కూడా సేంద్రీయ పద్ధతిలో పండించడం ఈ బాలుడు చేస్తున్న విశేషం. మా తాత వెంట చేవెళ్లలోని తోటకు వెళ్తుంట.. అక్కడ చాలా కూరగాయల మొక్కలున్నాయి. అలాంటివి ఇంటిదగ్గర పెంచితే రోజూ నీళ్లు పోయొచ్చుకదా అని పెరట్లో నాటాను. రోజూ నాకు మొక్కలతో టైమ్‌పాస్ బాగుంది. నేను నాటిన మొక్కకు ఇంత పెద్ద కాయ కాసిందని చాలా హ్యపీగా ఉంది. సోరకాయ తీగ స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లింది. దాంతో స్విమ్మింగ్ పూల్‌లో నీటిని తీసేయించా. -అద్విక్‌రెడ్డి చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
డాక్టరవ్వాలని... ఓ కూరగాయలమ్మాయి ఎదురుచూపులు
‘ఒక పేదింటి బిడ్డ డబ్బు లేని కారణంగా చదువుకు దూరం కాకూడదు’ అనే స్ఫూర్తి ఏమైంది? ఒక విద్యా కుసుమం ఎందుకు వాడిపోవడానికి సిద్ధంగా ఉంది? ఎవరైనా వచ్చి పాదులో నీళ్లు పోస్తే సంపూర్ణంగా వికసించాలనే ఆశతో ఎదురు చూస్తోంది. డాక్టర్ అయి తీరాలనే కోరిక ఆ అమ్మాయి చేత ఓ సాహసం చేయించింది. తొలి అడుగు వేయగలిగింది. కానీ విధి పరీక్షల్లో తర్వాతి అడుగులు తడబడుతున్నాయి. ఇంత పెద్ద సమాజంలో పెద్ద మనసుతో ఎవరైనా ముందుకు రాకపోతారా అని బేలగా చూస్తోంది హైదరాబాద్, మోతీనగర్‌లోని అనూష. ‘‘నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవాలనే కోరిక ఉండేది. స్కూల్‌డేస్ నుంచి అదే కలతో చదివాను. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో 945వ ర్యాంకు వచ్చింది. ఎన్సీసీ, స్పోర్ట్స్ పాయింట్లు ఉంటే ఫ్రీ సీటు వచ్చేది. మా పేరెంట్స్ ఇద్దరూ ఏమీ చదువుకోలేదు. నాకు చిన్నప్పుడు ఇలాంటివి చెప్పేవాళ్లెవరూ లేరు. ఏ రిజర్వేషనూ లేదు. ఓపెన్‌లో సీట్ తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఏడాదికి ఏడు లక్షలుంది. ప్రైవేట్‌లో అయితే కోటిదాకా ఉంది. కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో కోర్సు పూర్తవుతుందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. మా ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఆ డబ్బు సమకూర్చుకోవడం కూడా జరిగే పని కాదు. అయితే మెరిట్ స్టూడెంట్‌ని కాబట్టి స్కాలర్షిప్లు వస్తాయని, మిగిలిన డబ్బు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చనుకున్నాను. స్కాలర్షిప్ కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టానో లెక్కేలేదు. ‘ఈపాస్’ లో అయితే ఇరవై సార్లు అప్లయ్ చేశాను. బ్యాంకులోన్ కూడా రాలేదు విద్యాలక్ష్మి పథకానికి అప్లయ్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. కానీ ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదన్నారు. కూరగాయల బండిని ష్యూరిటీగా పెట్టుకోలేం. నీ సర్టిఫికేట్లన్నీ బాగున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉన్నా... ఆ ఇంటి మీద లోన్ ఇస్తామన్నారు. కానీ మాకు ఇల్లు లేదు. నాకు చదువుకోవడానికి సహాయం చేయమని ఎంతమంది కాళ్లమీదనో పడ్డాను. అందరమూ పని చేస్తున్నాం మా నాన్న వాచ్‌మన్, అమ్మ స్వీపర్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. నెలకు తొమ్మిది వేలు వస్తాయి. ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెచ్చి, ఆరు గంటలకు తన డ్యూటీకి వెళ్తుంది. మధ్యాహ్నం తర్వాత కూరగాయలమ్మేది. ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతున్నాను. తమ్ముడు డిగ్రీ చదువుతూ ఖాళీ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. రోజంతా క్షణం తీరిక లేకుండా పని చేసి కూడబెట్టుకున్న డబ్బును అనారోగ్యం హరించి వేసింది. ఇక ఇప్పుడు మూడవ సంవత్సరం చదువుకు వెళ్లాలి. రెండవ సంవత్సరం ఫీజు, ఈ ఏడాది ఫీజు కలిపి పది లక్షలు కట్టాలి. నేను కాలేజ్‌లో అడుగుపెట్టగలిగేది ఆ డబ్బు చేతిలో ఉంటేనే’’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అనూష. ఆమె మాటల్లో అన్ని దారులూ మూసుకుపోయాయనే దిగులుతోపాటు ఏదో ఒక దారి కనిపించకపోతుందా అనే చిరు ఆశ కూడా కనిపించింది. ఆమె ఆశ, ఆశయం నెరవేరుతాయని భావిద్దాం. విధి కూడా ఆడుకుంటోంది ఎలాగైనా డాక్టర్నవ్వాలనే ఆశతోనే కిర్గిస్తాన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చేరాను. కిర్గిస్తాన్ వెళ్లడానికి చెవి కమ్మలతో సహా ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేశాం. చిట్టీల డబ్బులు... అంతా కలిపితే మూడు లక్షలు జమయ్యాయి. మొదటి ఏడాది ఫీజు ఆరులక్షల్లో సగం ఫీజు కట్టాను. రెండవ ఏడాదిలో ఉండగా మరో మూడు లక్షలు కట్టాను. రెండవ ఏడాది ఫీజు కట్టాల్సిన సమయంలో అమ్మకు యాక్సిడెంట్ అయింది. ఫీజు కోసం సమకూర్చుకున్న డబ్బు వైద్యానికి అయిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్లు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఫీజు కట్టకనే పరీక్షలు రాయగలిగాను. ఇంతలో కరోనా రూపంలో మరో ఉత్పాతం వచ్చి పడింది. కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్ అందరినీ వారి దేశాలకు పంపించి వేసింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. నా వైద్యం కోసం మళ్లీ అప్పులు. ఐదు లక్షలు ఖర్చయ్యాయి. – వాకా మంజులారెడ్డి -
కొత్త కూరగాయ: కేజీ రూ.లక్ష.. అంతా తూచ్ అట!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వచ్చకా ఏ వార్తలు నమ్మాలో.. ఏవి నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదో అల్లాటప్పా వాళ్లు చెప్పారంటే అది వేరు.. ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి చెప్పిన విషయం కూడా అబద్ధం అని తెలితే ఇక ఎవరిని నమ్మాలి. ఇదే ప్రశ్న ఎదురవుతుంది ఈ న్యూస్ చూసిన వారికి. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అరుదైన రకానికి చెందిన కూరగాయను సాగు చేస్తున్నాడు.. దాని ధర ఏకంగా కిలో లక్ష రూపాయలు పలుకుతుంది అని ఓ వార్త వచ్చిన సంగతి గుర్తింది కదా. అయితే ఇది శుద్ద అబద్ధం అట. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ‘‘ఔరంగాబాద్‌కు చెందిన రైతు అమ్రేశ్ సింగ్ ‘‘హాప్ షూట్స్’’ అనే కొత్త రకం కూరగాయ పంట సాగు చేస్తున్నాడు. దేశంలో దీని పండిస్తున్న ఏకైక వ్యక్తి ఇతనే. ఈ పంట దేశీయ రైతుల తల రాతను మార్చనుంది. ఎందుకంటే ఈ కూరగాయ కిలో ధర ఏకంగా లక్ష రూపాయల విలువ చేస్తుంది’’ అంటూ మార్చి 31న ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా ఇది తెగ వైరలవుతూ.. వేల కొద్ది రీట్వీట్స్, లైక్స్ పొందింది. ఈ క్రమంలో హిందీ న్యూస్ పేపర్ దైనిక్ జాగరణ్ బృందం శుక్రవారం బిహార్ ఔరంగబాద్ వెళ్లింది. ఈ పంట గురించి స్థానిక ప్రజలను అడగ్గా తాము అలాంటి పంట గురించి ఇంతవరకు వినలేదని.. తమ ప్రాంతంలో అలాంటి కూరగాయను పండిచడం లేదని తెలిపారు. ఇక ఫోన్లో అమ్రేశ్ సింగ్‌ను సంప్రదించగా.. హాప్ షూట్స్‌ని పండిస్తుంది ఔరంగాబాద్‌లో కాదు నలందలో అని తెలిపాడు. కొత్త రకం పంటే కానీ ఇంత భారీ ధర పలుకుతుందనే విషయం మాత్రం అబద్ధం అని తెలిపాడు. తాను గతంలో గోధుమలు, బ్లాక్ రైస్ పండించినట్లు వెల్లడించాడు. చదవండి: కొత్త రకం కూరగాయ.. కేజీ రూ.లక్ష మాత్రమే -
కొత్త రకం కూరగాయ.. కేజీ రూ.లక్ష మాత్రమే
పట్నా: మన దేశంలో అత్యంత విలువైన వృత్తి.. అధికంగా నష్టాలు మిగిల్చే పని ఏదైనా ఉందా అంటే అది వ్యవసాయం మాత్రమే. ఆరు గాలం కష్టపడి.. కన్న బిడ్డలా పంటను కాపాడి.. శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు.. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ.. మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా పంటలు పండించే వారికి సేద్యం కనక వర్షం కురిపిస్తుంది. అలాంటి కోవకు చెందినదే ఈ కథనం. సంప్రాదాయ పంటలతో విసిగిపోయిన ఓ రైతు కొత్త రకం కూరగాయను పండించాడు. ప్రస్తుతం అది కేజీ అక్షరాల లక్ష రూపాయలకు అమ్ముడవుతోంది. నమ్మలేకపోయినప్పటికి ఇది మాత్రం వాస్తవం. మరి ఆ పంట ఏంటో.. సాగు విధానం తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన చెందిన అమ్రేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు సంప్రదాయ పంటలను సాగుచేసి విసిగివేసారి పోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది తన పంథా మార్చిన అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ అనే కూరగాయను సాగుచేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా ‘హాప్ షూట్స్’కు పేరుంది. మన కొనే కూరగాయల మాదిరి దీని ధర కేజీకి పదులు, వందల రూపాయలు ఉండదు. ‘హాప్ షూట్స్’ కిలో ధర కనిష్టంగా 85,000 రూపాయలు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంది. ఈ కూరగాయ సాగుకు తన సొంత పొలాన్ని సిద్ధం చేసిన అమ్రేష్ రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా ఆశించిన విధంగానే ఉంది. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు వాడకుండా అమ్రేష్ ఈ పంటను పండించడం విశేషం. ‘హాఫ్ షూట్స్’ శాస్త్రీయ నామం హ్యుములస్ లుపులస్. ఈ కూరగాయ మొక్కలను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పెంచుతున్నారు. అమ్రేష్ కూడా తన పొలంలో ఈ మొక్కలను నాటేందుకు అక్కడి నుంచే తెచ్చాడు. ఈ మొక్కకు పూచే పూలను ‘హాప్ కాన్స్’ అంటారు. బీర్ తయారీలో వీటిని వాడతారు. ఈ మొక్క కొమ్మలను పొడిగా చేసి మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు. అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ పండిస్తున్న విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ సుప్రియా సాహు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వ్యవసాయంలో ఓ కొత్త ప్రయత్నం చేసిన అమ్రేష్‌ను ఆమె అభినందించారు. అమ్రేష్ ప్రయత్నం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయంలో రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు వీలవుతుందని సుప్రియ ఆశించారు. ‘హాప్ షూట్స్’ సాగు చేసిన పొలంలో ఉన్న అమ్రేష్ ఫొటోలను సుప్రియా ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. One kilogram of this vegetable costs about Rs 1 lakh ! World's costliest vegetable,'hop-shoots' is being cultivated by Amresh Singh an enterprising farmer from Bihar, the first one in India. Can be a game changer for Indian farmers 💪https://t.co/7pKEYLn2Wa @PMOIndia #hopshoots pic.twitter.com/4FCvVCdG1m — Supriya Sahu IAS (@supriyasahuias) March 31, 2021 హిమాచల్ ప్రదేశ్‌లో ఈ కూరగాయలను పండించే ప్రయత్నం చేశారని, కానీ.. సరైన మార్కెటింగ్ లేక రైతులు మళ్లీ సంప్రదాయ పంటల వైపే మొగ్గుచూపారని అమ్రేష్ చెప్పాడు. ‘హాప్ షూట్స్’ యాంటీ బాండీస్ ఏర్పడేందుకు కూడా తోడ్పడతాయని.. టీబీతో బాధపడుతున్నవారు ఈ కూరగాయను తినడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను, లుకేమియా కణాలను ఈ కూరగాయలో ఉడే యాసిడ్స్ నిరోధించగలవని తేలింది. చదవండి: స్పెయిన్ చెబుతున్న ‘రైతు’ పాఠం శారదకు అండగా ‘టిటా’ -
ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు!
పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం.. ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ.. అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతినే ఒడిసిపడతాయి. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్న మాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణా లను ఈ పదార్థం ఉపయోగించుకుం టుంది. ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమిపై అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూ వబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందు కున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీల లోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజీని నియంత్రిం చుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసు కోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేం దుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధా రణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిము ఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండ దు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు 9 రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నా యాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుం దని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
దిగుబడి బాగున్నా.. దిగిరాని ధరలు
కడప అగ్రికల్చర్: కూరగాయల దిగుబడులు బాగున్నా ధరలు దిగిరావడం లేదు. చిన్న హోటళ్ల వారు ఈ ధరలను చూసి కూరలను తయారు చేయడం తగ్గించారు. పచ్చళ్లను వండి పార్శిల్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో రూ.10–15లోపే ఉన్న కూరగాయల ధరలు రూ.30 నుంచి 60కి ఎగబాకాయి. దీంతో వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలో పంటల సాగు పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో కాస్త తక్కువగా ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదల కారణంగా పంట దెబ్బతినడంతో అక్కడికి కూరగాయలను తరలిస్తుండడంతో మార్కెట్ కొరత కారణంగా తగ్గుతున్నాయని వ్యాపారులు సమర్ధించుకుంటున్నారు. పంటల సాగు పెరిగినా ధరలు ఎందుకు తగ్గడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. కిలో రూ.10–15 ఉన్న టమాట ధర కూడా రూ.30లకు చేరింది. మార్కెట్లో వ్యాపారులు దళారుల మాయాజాలం...: జిల్లాలో రోజుకు 5 నుంచి 6 టన్నుల కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని ఉద్యానశాఖ అధికారుల అంచనా. మార్కెట్లో కొరతను సాకుగా చూపుతూ ధరలు పెంచి వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రవాణా, ఇతర ఖర్చులు పోయినా ధరలు బాగా ఉండడంతో అక్కడికి తరలించడంతో ఆదాయం ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం హెక్టార్లలో : 4,000 జిల్లాకు అవసరమైన కూరగాయలు : 10.80 టన్నులు ప్రస్తుతం వినియోగిస్తున్నవి : 6 టన్నులు జిల్లాలో కొరత : 5 టన్నులు -
కూరలమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు
భువనేశ్వర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులనుంచి,సెలబ్రిటీలదాకా అందరినీ సంక్షోభంలో పడేసింది. ప్రధానంగా సినీపరిశ్రమ దాదాపుగా మూత పడిన పరిస్థితుల్లో ఒడిశాకు చెందిన బాలీవుడ్ నటుడు కార్తికా సాహూ బాధితుడిగా మారారు. నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోవడం, చాలా ప్రొడక్షన్స్ నిలిచిపోవంతో కూరగాయాలను అమ్ముకుంటూ జీవనం సాగించాల్సి పరిస్థితి ఏర్పడింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) ఒడిశా కేంద్రాపాడ జిల్లాలోని గరద్పూర్కు చెందిన సాహూ 17 సంవత్సరాల వయసులో 2014లో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై వెళ్ళాడు. కొన్నాళ్లు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులకు బాడీగార్డ్‌గా పనిచేశాడు చివరకు 2018లో అతని కల సాకారమైంది. మెల్లిగా అవకాశాలు రావడం మొదలైంది. కానీ ఇంతలోనే కరోనా, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు. చాలా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలలో గుర్తించదగిన పాత్రలను పోషించాననీ, ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో రాబోయే చిత్రం 'సూర్యవంశి'లో ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందని సాహూ చెప్పు కొచ్చారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ముందు జైపూర్‌లో ఒక షూటింగ్లో పాల్గొన్నానని, ఇక ఆ తరువాత పని దొరకకపోవడంతో ఒడిశాలోని ఇంటికి తిరిగి చేరుకున్నానని తెలిపాడు. అప్పటినుంచీ పొదుపు చేసిన డబ్బులతో కుటుంబాన్ని పోషించానని వెల్లడించాడు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జీన్సీకి చాలా డబ్బు ఖర్చయిపోయిందని వాపోయాడు. చివరికి రాజధాని నగరం భువనేశ్వర్‌కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో కూరగాయల విక్రయం ద్వారా పొట్ట పోషించుకుంటున్నామన్నాడు. అయితే పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్లీ బాలీవుడ్లోతనకు అవకాశాలు తప్పక లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటి వరకు మనుగడ కోసం కష్టపడక తప్పదని సాహు పేర్కొన్నాడు. -
ఈ ఏడాది నయమే..
సాక్షి సిటీబ్యూరో: లాక్డౌన్ ప్రభావం కూరగాయలపై తక్కువగా ఉందనే చెప్పవచ్చు. ఇతర నిత్యావసర ధరలు కాస్త పెరిగినా కూరగాయల ధరలు అదుపులోనే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నుంచే ధరలు తగ్గుముఖం పట్టాయి. నగరానికి శివారు జిల్లాల నుంచి దిగుమతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ. 40 లోపు ఉన్నాయి. శివారు జిల్లాలనుంచి నగరానికి దిగుమతులు పెరగడంతో ధరలు అదుపులోనే ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది తీవ్ర ఇబ్బందులు నగరవాసి గత సంవత్సరం కూరగాయలు కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ. 50 నుంచి రూ.60 ధర పలికేది. ఇక బహిరంగ మార్కెట్లో ధరలు ఇష్టానుసారంగా ఉండేవి. పచ్చి మిర్చి, బీన్స్, టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఎక్కువగానే ఉండేవి. అయితే ఈ సంవత్సరం ధరలు తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏ రకం అయినా కిలో రూ.40 ఉండటం ఊరటనిస్తుంది. ధరలు నిలకడగానే ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది అధిక సంఖ్యలో సాగుచేశారు.గతంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్య లేదు. – చిలుక నర్సింహారెడ్డి కార్యదర్శి, ఎల్బీనగర్ మార్కెట్ కమిటీ -
శానిటైజర్లు,కూరగాయలు పంచిన చెవిరెడ్డి
-
ప్రతి ఇంటికి ఉచిత కూరగాయల పంపిణీ
-
80 టన్నుల కూరగాయల పంపిణీ
-
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
ఆకు లేని పాలకూరలు
ఇక్కడ చెప్పినవన్నీ ‘పాల’కూరలే. మామూలుగా మనం పాలకూర అని పిలిచే వెజిటబుల్‌లో ఆకులుంటాయి. ఇక్కడ చెప్పిన కూరల్లో దేనిలోనూ ఆకుల్లేవు. కానీ ఆకుకూరలంత ఆరోగ్యముంది. సంపూర్ణాహారమైన ‘పాలు’ పోసి వండిన కూరలివి. వీటి రుచుల్లో పాలభాగం సగపాలు. మిగతాది ఆ కూరల పాలు. వీటి రుచులెంతో మేలు. తింటే మంచి ఆరోగ్యం మీ ‘పాలు’. బీరకాయ పాలు కూర కావలసినవి: బీరకాయలు – అర కేజీ; పాలు – పావు కప్పు పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టీ స్పూను; మినప్పప్పు – ముప్పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 4; పసుపు – అర టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత. తయారీ: ∙చెక్కు తీసేసిన బీర కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు వేయించాలి ∙జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి, ఐదు నిమిషాల తరవాత పాలు పోసి మరోమారు కలియబెట్టి, పది నిమిషాల సేపు మూత ఉంచాలి ∙మెత్తగా ఉడికి, పాలన్నీ ఇగిరిపోయిన తరవాత దింపేయాలి ∙ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది. మునగకాడ పాలు కూర కావలసినవి: మునగ కాడలు – 3 (పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; నానబెట్టిన బియ్యం – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; పాలు – 400 మి.లీ. పోపు కోసం: నూనె – 5 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన బియ్యం వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి నాలుగైదు నిమిషాలు కలియబెట్టాలి ∙మునగ కాడ ముక్కలు, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, పావు గంట సేపు ఉడికించాలి ∙మెత్తగా చేసిన పచ్చి కొబ్బరి తురుము మిశ్రమం, పాలు జత చేసి బాగా కలియబెట్టి, మరో పావు గంట ఉడికించి దింపేయాలి ∙అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. సొరకాయ పాలు కూర కావలసినవి: సొరకాయ ముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6 (సన్నగా పొడవుగా తరగాలి); పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙సొరకాయ ముక్కలకు తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి కొద్దిసేపు మూత ఉంచాలి ∙ఉడికించిన సొరకాయ ముక్కలు జతచేసి మరోమారు కలియబెట్టాలి ∙బాగా ఉడికిన తరవాత పాలు పోసి, మూత ఉంచి, కూర దగ్గర పడేవరకు ఉడికించి దింపేయాలి (ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం కాని పం^è దార కాని వేసుకోవచ్చు) ∙అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. వంకాయ పాలు కూర కావలసినవి: వంకాయలు – 8 (గుత్తి కాయలు); ఉల్లి తరుగు – పావు కప్పు; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; గసగసాలు – ఒక టేబుల్ స్పూను; లవంగాలు – 2; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్లు; మిరప కారం – అర టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పాలు – ఒక కప్పు; ఆవాలు + జీలకర్ర – ఒక టేబుల్ స్పూను; పసుపు– పావు టీ స్పూను; నూనె – తగినంత తయారీ: ∙వంకాయలను గుత్తులుగా కట్ చేసి, ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి ∙మిక్సీలో గసగసాలు, ధనియాలు, ఉల్లి తరుగు, అల్లం తురుము, టొమాటో తరుగు, ఎండు కొబ్బరి పొడి, మిరప కారం, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేసి, ఈ మిశ్రమాన్ని వంకాయలలోకి స్టఫ్ చేయాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙స్టఫ్ చేసిన వంకాయలను జత చేసి బాగా కలిపి, మూత ఉంచాలి ∙పది నిమిషాల తరవాత పాలు జత చేసి కూరను బాగా కలియబెట్టి, మరోమారు మూత ఉంచి, బాగా ఉడికించి దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పాలు కూర కావలసినవి: పొట్ల కాయ – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; జీడిపప్పులు – 10; నూనె – ఒక టేబుల్ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – ఒక కట్ట (చిన్నది); పాలు – పావు లీటరు (ఒక గ్లాసు). తయారీ: ∙పొట్ల కాయను శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, ఉప్పు నీళ్లలో శుభ్రంగా కడిగి, నీరంతా పిండేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, జీడి పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙టొమాటో తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙పొట్లకాయ చక్రాలను జత చేసి బాగా కలియబెట్టి, పది నిమిషాల పాటు ఉడికిన తరవాత, పాలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙బాగా ఉడికిన తరవాత మూత తీసేసి, కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలిపి, ఉడికించి దింపేయాలి ∙ ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది. -
కూరగాయల ధరలు పైపైకి
ఈ నెల 10న బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు 1,492 క్వింటాళ్ల టమాటా దిగుమతి అవగా బుధవారం అది వెయ్యి క్వింటాళ్లకు పడిపోయింది. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో నిత్యం3 వేల టన్నుల కూరగాయలు అవసరం.ఆఫ్ సీజన్‌తోపాటు కూరగాయల దిగుమతులు తగ్గడాన్ని దళారులు అనువుగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో వేసవి తీవ్రతతో ఉష్ణోగ్రతలు ఓవైపు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు కూరగాయల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. భూగ ర్భ జలాలు అడుగంటి కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి సైతం తగ్గిపోవడంతో వినియోగదారులపై ధరాభారం పెరుగుతోంది. ధరల పెరుగుదల జూలై దాకా కొనసాగే అవకాశముందని ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు అంచనా వేస్తున్నాయి. తగ్గిన సాగు రాష్ట్రంలో రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుండటం కూరగాయల సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేసవి తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో నష్టాల భయంతో రైతులు కూరగాయల సాగుకు దూరంగా ఉంటున్నారు. కూరగాయల సాగు సీజన్‌గా పేర్కొనే అక్టోబర్–ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయని ఉద్యానవనశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కూరగాయల సాగులో ఆఫ్ సీజన్ కొనసాగుతుండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. కూరగాయలు ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ సీజన్లో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణంపై ఉద్యానవనశాఖ వాస్తవ గణాంకాలు సేకరిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో వినియోగించే కూరగాయల్లో 60 శాతం వరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్నాయి. ప్రజలు ఎక్కువగా వినియోగించే టమాటా, పచ్చి మిర్చి, బెండ, దొండ, బీర వంటి కూరగాయలు ఈసారి ఇతర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి కాకపోవడం ధరల పెరుగుదలకు దారితీస్తోంది. పొరుగు రాష్ట్రాలపైనే ఆధారం... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే గతంలో నిత్యం 4 వేల పెట్టెల టమాటాలు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చేవి. ప్రస్తుతం రోజూ వచ్చే దిగుమతులు 400 పెట్టెలకు మించకపోవడం తో హోల్‌సేల్ వ్యాపారులు పొరుగు రాష్ట్రాల వైపు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మద నపల్లి నుంచి కూడా టమాటా, పచ్చిమిర్చి దిగుమతి నిలిచి పోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్, లాతూర్, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంత రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా, బెల్గాం నుంచి పచ్చిమిర్చి, చిక్‌బళ్లాపూర్ నుంచి ఫ్రెంచ్ బీన్స్ రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. బోయినపల్లి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు ఈ నెల 10న 1,492 క్వింటాళ్ల టమాటా దిగుమతి అవగా బుధవారం కేవలం వేయి క్వింటాళ్లకు పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కాకర, క్యాప్సికం, దొండ, బెండ, వంకాయ, ఆకుకూరల దిగుమతుల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబున్నారు. ఓవైపు ఆఫ్ సీజన్‌తోపాటు కూరగాయల దిగుమతులు తగ్గడాన్ని దళారు లు అనువుగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వారం వ్యవధిలోనే కూరగాయ ల ధరలు బయటి మార్కెట్లో కిలోకు సగటున రూ. 5 నుంచి రూ. 20 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం పెంచేందుకు క్రాప్ కాలనీలు.. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 300 నుంచి 400 గ్రాముల కూరగాయలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ లెక్కన కేవలం హైదరాబాద్ జంట నగరాల పరిధిలో నిత్యం 3 వేల టన్నుల కూరగాయలు అవసరం. రాష్ట్రంలో ఎక్కువగా టమాటా, పచ్చిమిర్చి, దుంపలు, ఆకుకూరలు, ఫ్రెంచ్ బీన్స్‌ను వినియోగిస్తారు. కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఇప్పటికే క్రాప్ కాలనీల పేరిట రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ క్రాప్ కాలనీలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 985 కోట్లు అవసరమవుతాయని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. టమాటా సాగుతో నష్టపోయా... మూడు నెలలపాటు దిగుబడి ఇచ్చే టమాటాను ఎకరా విస్తీర్ణంలో సాగు చేసేందుకు రూ. 15 వేల వరకు వెచ్చించా. మొదట్లో బోరుబావిలో నీరున్నా దిగుబడి వచ్చే సమయంలో అడుగంటడంతో తోట ఎండిపోయింది. 400 పెట్టెల దిగుబడి వస్తుందని ఆశించినా 15 పెట్టెలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో పెట్టె టమాటా ధర రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 400 నుంచి రూ. 500 వరకు పలుకుతోంది. పెట్టుబడితో కలుపుకొని మొత్తంగా రూ. లక్షన్నరపైనే నష్టపోయా. – ఫయాజ్, రైతు, కుప్పానగర్, సంగారెడ్డి జిల్లా -
ప్రచారంలో కూరలు అమ్మిన పోచరం
-
దీర్ఘాయుష్షు కిటుకు రూఢీ అయింది..
కాయగూరలు, పండ్లు బాగా తింటే ఆయుష్షు పెరుగుతుందనేది చాలామంది నమ్మిక. ఇందులో నిజం లేకపోలేదు కూడా. కాకపోతే ఇదెలా జరుగుతోందన్నది మాత్రం తాజా పరిశోధన ద్వారా తెలిసింది. కాయగూరలు, పండ్లలో ఉండే ఫిసెటిన్ అనే ఫ్లేవనాయిడ్ పాడైపోయి.. విభజన ఆగిపోయిన కణాలను శరీరం నుంచి బయటకు పంపడంలో ఉపయోగపడతాయని, ఫలితంగా ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా మెరుగవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. సాధారణ పరిస్థితుల్లో మన రోగ నిరోధక వ్యవస్థ పాడైన కణాలను తొలగిస్తూంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యమూ తగ్గిపోవడం వల్ల పాడైన కణాలు శరీరంలో పోగుపడుతూంటాయి. ఈ పరిణామం కాస్తా మంట, వాపులకు.. తద్వారా వ్యాధులకు దారితీస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో పాడైన కణాలను శరీరం నుంచి తొలగించే మందుల తయారీకి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పది ఫ్లేవనాయిడ్లపై పరిశోధనలు జరగ్గా ఫిసెటిన్తో మంచి ఫలితాలు ఉన్నట్లు తెలిసింది. ఎలుకలతోపాటు మానవ కణజాలంపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు రావడంతో మానవ ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిసెటిన్ అనేది సహజసిద్ధమైన పదార్థం కావడం వల్ల మానవ ప్రయోగాలూ సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ రాబిన్స్ అంటున్నారు. -
సేంద్రియం కంటే ప్రకృతి సాగే మేలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయం పెరగాలన్నా.. వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా.. రూపాయి పెట్టుబడి అవసరం లేని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే చాలని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ సూచించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండబోదని, దీని వల్ల ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనేది అపోహ మాత్రమేనని అన్నారు. శుక్రవారం రామకృష్ణమఠంలో ప్రారంభమైన మూడు రోజుల విత్తనోత్సవానికి పాలేకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విత్తనోత్సవం ప్రారంభ వేడుకల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, సినీనటుడు తనికెళ్ల భరణి, మాతా నిర్మలానంద, మాతా విజయేశ్వరీదేవి, సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు. రూపాయి పెట్టుబడి అవసరం లేదు.. కేంద్ర బడ్జెట్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావడం అసాధ్యమని పాలేకర్ అన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల్లాగే వర్మికంపోస్టు వంటి రకరకాల సేంద్రియ ఎరువులపైనా రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, పైగా దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాదని చెప్పారు. దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగు ద్వారా అద్భుతమైన దిగుబడి సాధించవచ్చని, ఒక్క ఆవు ద్వారా ప్రకృతి సాగుతో 30 ఎకరాల భూమిలో పంట పండించవచ్చని పాలేకర్ పేర్కొన్నారు. దేశీ విత్తనం, దేశీ ఆవు, మన మాతృభాష, మన ఆధ్యాత్మికతను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. జన్యుపరివర్తన విత్తనాలు, సంకర విత్తనాలు రసాయనాలు, పురుగుమందులు వినియోగించినప్పుడే దిగుబడిని ఇస్తాయని, దాంతో నేల పూర్తిగా పాడవుతుందని, ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం.. ఎరువులు, పురుగుమందుల కోసం భారీగా ఖర్చు చేసి, సరైన దిగుబడి రాక, అప్పులపాలై లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాతా విజయేశ్వరీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేని ప్రకృతిసాగు రైతులకు మేలు చేస్తుందన్నారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగును తమ జీవితంలో భాగం చేసుకోవాలని తనికెళ్ల భరణి కోరారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వంద మందికిపైగా రైతులు, సహజ సాగు పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విత్తన ప్రదర్శన.. ఆదివారం వరకు కొనసాగనున్న విత్తనోత్సవంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు ప్రదర్శించిన వివిధ రకాల వరి విత్తనాలు ఆకట్టుకున్నాయి. సహజ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలు, పప్పుదినుసులు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ప్రదర్శించారు. విత్తనోత్సవానికి వచ్చిన రైతులకు అర కిలో చొప్పున రెండు రకాల వరి విత్తనాలను ఉచితంగా అందజేశారు. కొన్ని రకాల వరి విత్తనాల ప్రత్యేకతలు ఇవీ.. - తమిళనాడుకు చెందిన ‘మా పిళ్లై సాంబ’ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వరి. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కొత్త అల్లుడికి ఈ బియ్యంతో వండిన అన్నాన్ని వడ్డిస్తారు. 180 రోజుల్లో ఇది చేతికొస్తుంది. - తమిళనాడు, కర్ణాటకలో విరివిగా పండించే ‘కులాకార్’రకం బియ్యం గర్భిణులకు వరప్రదాయిని. ఈ అన్నం తిన్న గర్భిణిలకు సాధారణ కాన్పు అవుతుందని, పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ప్రజల నమ్మకం. 130 నుంచి 140 రోజుల్లో ఇది పండుతుంది. - కేన్సర్ నివారణకు దివ్యౌషధంగా పనిచేసే ‘కర్పుకౌని’(నల్ల బియ్యం) వరిని తమిళనాడులోనే పండిస్తున్నారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉంటాయి. 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. - అధిక దిగుబడినిచ్చే మరో రకం వరి ‘బహురూపి’. ప్రకృతి సాగు భూమిలో 3 ఏళ్ల తర్వాత ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు దిగుబడి సాధించవచ్చు. పంట కాలం 140 రోజులు. పశ్చిమ బెంగాల్లో వీటిని పండిస్తున్నారు. - మధుమేహాన్ని అదుపులో ఉంచే ‘నవ్వారా’రకం కేరళ, తమిళనాడులో పండిస్తున్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే ఈ రకంలో 17.5 రెట్లు పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పంటకాలం 120 రోజులు. - ప్రపంచంలోనే అతి చిన్న వడ్లగింజగా పేరొందిన ‘తులసీబాసో’బియ్యం సుగంధ భరితంగా ఉంటాయి. పోషకాలు ఎక్కువ. 130–140 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒడిశాలో వీటిని పండిస్తున్నారు. - పశ్చిబెంగాల్‌లో ‘నారాయణ కామిని’వరి విత్తనాలను పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండే అన్నం రుచిగా ఉంటుంది. పంటకాలం 140 రోజులు. చిరుధాన్యాలకు డిమాండ్ ఈ ప్రదర్శనకు చిరుధాన్యాలు తెచ్చా ను. చాలామంది కొనుగోలు చేశారు. ప్రజ ల్లో ఆరోగ్యం పట్ల, సహజ పంటల పట్ల అవగాహన పెరగడం చాలా సంతోషం. – మహేష్, అరకు కూరగాయలు,ఆకుకూరలు పండిస్తున్నాం సహజ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. ఆ విత్తనాలను ప్రదర్శనలో పెట్టాం. క్షణాల్లో అమ్ముడయ్యాయి. – మనూ, సహజ స్వీట్స్, బెంగళూరు ప్రదర్శన చాలా బాగుంది ఇలాంటి ప్రదర్శనకు రావడం ఇదే తొలిసారి. చాలా వెరైటీలు ఉన్నాయి. పూల మొక్కలు, కూరగాయల విత్తనాల కోసం వచ్చాను. – తులసి, హైదరాబాద్ రూఫ్ గార్డెనింగ్పై ఆసక్తి దేశీ కూరగాయల విత్తనాలు లభిం చాయి. మార్కెట్లో దొరికేవన్నీ హైబ్రీడ్. ఇలా లభించడం అరుదు. మా ఇంటిపై పండించాలనుకుంటున్నాం. – మౌనిక, హైదరాబాద్ -
కూర ’గాయాలు’
-
క్యారె ట్టూ గుడ్
తవ్వితే బయటపడే వంటల ఖజానా క్యారెట్! వెజిటబుల్‌లో దీనిని స్టార్ అంటారు. దుంపల్లో తార అన్నమాట. అన్నమాట ఎందుకు? తిన్నమాటే!! క్యారెట్ కేక్ కావలసినవి: క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, మైదా – 2 కప్పులు, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ను (500 ఎం.ఎల్), వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్.. – అర కప్పు, పాలు – అర కప్పు తయారీ: ∙మైదా, బేకిండి పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి. వెన్న పంచదారపొడి, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వేసి గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా మిశ్రమం క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదా చేత్తో టిన్ను లోపల అంతా సర్దాలి. ఒవెన్‌ని 150 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చేసి, అర గంటపాటు బేక్ చేసి తీయాలి. తర్వాత కట్ చేసి, సర్వ్ చేయాలి. నోట్: ఈ కేక్‌ను కుకర్లోనూ తయారుచేయవచ్చు. కుకర్ అడుగున ఇసుక లేదా ఉప్పు పోసి తగిన స్టాండ్ అమర్చి, ఆ పైన కేక్ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టె, పైన మూత ఉంచాలి. వెయిట్ పెట్టకుండా 40–50 నిమిషాలు బేక్ చేయాలి. క్యారెట్ పచ్చడి కావల్సినవి: క్యారెట్లు – 2, కారం – 1 1/2 టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఆవనూనె – 6 టేబుల్ స్పూన్లు తయారీ: ∙పీలర్‌తో క్యారెట్ పై తొక్క తీయాలి. పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపుగా అనిపించే భాగాన్ని తీసేయాలి. ఈ ముక్కలలో ఉప్పు వేసి అర గంటసేపు ఉంచాలి. తర్వాత చేత్తో కలిపి, నీళ్లు పోసి వడకట్టాలి. 15–20 నిమిషాలు జల్లిలో వేసి నీళ్లన్నీ పోయే వరకు ఉంచాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, వెనిగర్, నూనె వేసి కలపాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన క్యారెట్ ముక్కలను వేసి కలపాలి. కారం, ఉప్పు ఎవరి ఇష్టమ్మేరకు వారు కలుపుకోవచ్చు. దీనిని ఒక జార్లో వేసి మూత పెట్టాలి. (వేడి నూనె పోయకూడదు. దీంట్లో పచ్చిమామిడికాయ తురుము కూడా వేసి కలుపుకోవచ్చు. 2–3 రోజులు నిల్వ ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. మూడవ రోజున భోజనంలోకి పప్పు వడ్డించినప్పుడు కాంబినేషన్‌గా ఈ పచ్చడిని వడ్డించాలి. దీంట్లోకి ఆవనూనె వాడితేనే రుచిగా ఉంటుంది. క్యారెట్ వడ కావల్సినవి: క్యారెట్ తురుము – కప్పు, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – 2 రెమ్మలు, శనగపిండి – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙వెడల్పాటి గిన్నెలో క్యారెట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత దీంట్లో శనగపిండి వేసి కలపాలి. (నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఉల్లి, క్యారెట్ తురుములోని తడితోనే పిండి ముద్దలా అవుతుంది) నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అరచేతితో వత్తాలి. ఇలాగే అన్నీ చేయాలి. కడాయి పొయ్యిమీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన పట్టీలను వేసి రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. తర్వాత నూనె పీల్చుకోవడానికి పేపర్ టవల్ మీద వేయించిన పట్టీలను వేయాలి. తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకొని వేడి వేడిగా టొమాటో చట్నీ లేదా కెచప్‌తో వడ్డించాలి. క్యారెట్ రొయ్యలు కావల్సినవి: క్యారెట్లను నిలువుగా సన్నని ముక్కలుగా కోయాలి – 2, గుడ్లు – 4, రొయ్యలు – 15 (శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయలు – 3 (సన్నగా తరగాలి), నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, సోయా సాస్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ∙ఒక చిన్న గిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీంట్లో మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి. పొయ్యిమీద కడాయి పెట్టి నూనె వేసి, ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయలు వేగాక సిద్ధంగా ఉంచిన రొయ్యలను వేసి, సోయా సాస్ చల్లి వేయించాలి. దీంట్లో క్యారెట్ తరుగు వేసి పైన మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టి, 3–4 నిమిషాలు కదపకుండా ఉంచాలి. తర్వాత గరిటతో రెండోవైపు తిప్పి, 2 నిమిషాలు ఉంచి ఒకసారి కలపాలి. వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి. క్యారెట్ సూప్ కావల్సినవి: క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి), ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి), వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు, నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు, టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: ∙క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి. -
వెలవెలబోతున్న కూరగాయల మార్కెట్లు
-
బలవంతంగా నోట్లో యూరిన్ పోశారు!
రోజు రోజుకూ మానవత్వం మంటకలసి పోతోంది. అమానుషం కోరలు చాస్తోంది. సాటి మనిషిని భరించలేని తనం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఓ కూరగాయల వ్యాపారిపై ఉత్తర ప్రదేశ్ లో జరిగిన దారుణ ఘటన అదే రుజువు చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఆగ్రా నగరానికి దగ్గరలోని ఎత్మద్ పూర్ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ కూరగాయల వ్యాపారి నోట్లో ఐదుగురు వ్యక్తులు బలవంతంగా యూరిన్ పోసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భాయీ సాబ్ కాస్త తప్పుకొని దారివ్వండి అంటూ బాధితుడు అడగడమే తప్పయిపోయింది. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న నిరోత్తమ్ ఖాన్ ఆదివారం ఇంటికి వచ్చే సమయంలో ఓ సమాజ్ వాదీ పార్టీ జిల్లా యూనిట్ ఇంఛార్జి తోపాటు ఐదుగురు వ్యక్తులు తాను దారి అడిగినందుకు కొట్టడమే కాక తన నోట్లో బలవంతంగా యూరిన్ పోశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు కాస్త దారివ్వమంటూ పున్నీఖాన్ ను అడగడమే తప్పయిపోయిందని, ఆగ్రహించిన అతడు తన బంధువులతోపాటు తనపై దాడి చేయడమే కాక తన నోట్లో యూరిన్ పోశారని నిరోత్తమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. దాడి సమయంలో తనకు ఎటువంటి సహాయం దొరకకపోవడంతో దిక్కులేని స్థితిలో ఊరుకున్న బాధితుడు... బుధవారం కొంతమంది సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
పండు కూర అయ్యింది...
తిండి గోల ప్రపంచ ఆరోగ్యప్రదాయిని ఎవరు అంటే ఠకీమని చెప్పే ఒకే ఒక పేరు టొమాటో. ప్రపంచం మొత్తమ్మీద విస్తృతంగా వాడే కూరగాయ ఏంటీ అంటే వినిపించే పేరు టొమాటో. ఏ కూరగాయ లేకున్నా ఆ రోజుకు సర్దుబాటు చేసుకోవచ్చేమో కానీ, టొమాటో లేకుండా మాత్రం అస్సలు కుదరదు. నిజానికి టొమాటో పండుజాతికి చెందింది. కానీ, వంటకాలలో వాడటంతో అది కాస్తా కూరగాయల జాబితాలో చేరిపోయింది. దీని పుట్టినిల్లు అమెరికా. కానీ, మెక్సికో ప్రజలే ముందుగా టొమాటోను వాడుకలోకి తెచ్చారు. మొదట్లో అమెరికన్లు టొమాటో విషపూరితమని, తింటే చనిపోతారని భయపడేవారట. ప్రపంచ యాత్రికుడైన క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నప్పుడు టొమాటో యూరప్ దేశాలకు పరిచయమైంది. స్పానిష్‌లో 1493లోనే టొమాటో ఉన్నట్టు చారిత్రాక ఆధారాలున్నాయి. టొమాటోలో ఔషద గుణాలు ఉన్నట్టు 1544లో యూరప్ సాహిత్యకారుడు ఇటాలియన్ జీవశాస్త్రవేత్త పీట్రోఆండ్రే మటియోలి తన రచనలలో వివరించారు. యూరప్ దేశాలలో ఎర్రని టొమాటోను కొద్దిగా ఉడికించి, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్ చల్లుకొని తింటుంటారు. దీనిని ‘గోల్డెన్ యాపిల్’ గా అభివర్ణిస్తారు. 17 శతాబ్దం చివరిలో 18వ శతాబ్దం మొదట్లో బ్రిటన్‌లో అడుగుపెట్టిన టొమాటో మన దేశంలోనూ ఆనాటి నుంచే టేబుల్ మీద అందంగా ముస్తాబైంది. -
ఏపీఎంసీ మార్కెట్ యార్డులో కమీషన్ల దందా
కోలారు : జిల్లాలోని ఏపీఎంసీ మార్కెట్ యార్డులో రైతులు విక్రయించే కూరగాయలకు 8 నుంచి 10 రూపాయలు కమీషన్ వసూలు చేస్తున్నారని రైతు సంఘం పుట్టణ్ణయ్య వర్గం జిల్లా సంచాలకుడు కే.శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. చిక్కబళ్లా పురంలో 100 రూపాయలకు 3 రూపాయల కమీషన్ తీసుకుంటుండగా కోలారు జిల్లాలోని అన్ని ఏపీఎంసీ మార్కెట్లలో 100కు 8 నుంచి 10 రూపాయల వరకు కమీషన్లు గుంజుతున్నారని ఆరోపించారు. ఈ కమీషన్ దందాను వెంటనే అడ్డుకుని ఫిర్కాకో రైతు సంతలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగారుణాలు, వ్యవసాయ ఖర్చులను భరించలేకపోతున్నారన్నారు. మార్కెట్ యార్డులో కమీషన్లను అరికట్టాలని పలుమార్లు పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా జాక్ పాట్ పేరుతో 100 కిలోలకు 10 కిలోల చొప్పున తగ్గిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత చేస్తున్నా రాష్ట్రంలో తమ కంటే తక్కువ కమీషన్లు ఎక్కడా తీసుకోవడం లేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మార్కెట్ యార్డులో జరుగుతున్న నిలువు దోపిడీని అడ్డుకోవాలని డిమాండు చేశారు. విలేకరుల సమావేశంలో మరగల్ శ్రీనివాస్, తేర్నహళ్లి వెంకటస్వామిగౌడ పాల్గొన్నారు. -
సామాన్యుడిపై ధరాఘాతం
-
'మన ఊరు-మన కూరగాయలు' స్టాళ్లు ప్రారంభం
హైదరాబాద్: వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించటం కోసం ' మన ఊరు-మన కూరగాయలు' పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలోని మెహదీపట్నం రైతు బజార్ లో బుధవారం తెలంగాణ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి వాటిని ప్రారంభింబారు. ఈ స్టాళ్ల ద్వారా నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే పొందవచ్చని వారు తెలిపారు. అనంతరం గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ను మంత్రులు సందర్శించారు. -
కూరగాయల ఔట్లెట్లు
- ఈ నెల 23 నుంచి ప్రారంభం - కాలనీలు, కార్యాలయాల్లో అందుబాటులోకి.. - ధరల నియంత్రణకు చర్యలు - రంగంలోకి మార్కెటింగ్ శాఖ సాక్షి, సిటీబ్యూరో: కూరగాయల ధరలను నేల మీదికిదించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అసలు ధరకే అన్నిరకాల కూరగాయలను వినియోగదారుడికి అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. పెద్దమొత్తంలో సరుకు సేకరించి... నగరం నలుమూలకు సరఫరా చేసి... కొరత లేకుండా చూడటం ద్వారా ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, ట్రాఫిక్ ఇబ్బంది లేని కూడళ్లలో పెద్దసంఖ్యలో కూరగాయల ఔట్లెట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. నగరంలో కూరగాయల ధరలపై ‘ధర దగా’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. తాజా కూరగాయలను హోల్‌సేల్ ధరకే అందుబాటులో ఉంచడం ద్వారా రిటైల్ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు ఊరట కలిగించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ‘మన కూరగాయల’ పథకం కింద 20 వాహనాల ద్వారా వివిధ ప్రాంతాల్లో తాజా కూరగాయలను హోల్‌సేల్ రేట్లకే అందిస్తున్న అధికారులు... ఇకపై నగరంలోని అన్ని రైతుబజార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, కూడళ్లలో ఔట్లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్లే తరుణంలో ఈ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చే స్తారని... దీంతో అన్ని రకాల కూరగాయలను అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. దీని వల్ల వారికి సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి ఈ ఔట్లెట్లకు మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సచివాలయం, బీఆర్కె భవన్, ఏజీ ఆఫీస్, మణికొండ, నేరెడ్మెట్, డిఫెన్స్ కాలనీ, వనస్థలిపురం సహారా ఎస్టేట్స్, కూకట్‌పల్లిలోని భవ్యాస్ ఆనంద్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, జనప్రియ అపార్టుమెంట్స్ తదితర ప్రాంతాల్లో మంగళవారం నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా సేకరణ నగరంలో కూరగాయల కొరత లేకుండా చూసేందుకు పెద్ద మొత్తంలో సరుకు సేకరించాలని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ అధికారులను ఆదేశించారు. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ధరలు పెరగకుండా నియంత్రించాలని సూచించారు. వర్షం లేదా మరే అనునుకూల పరిస్థితి ఎదురై ఒక్కరోజు కూరగాయల సరఫరా తగ్గినా.. రిటైల్ వ్యాపారులు యథేచ్ఛగా ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకే ఎక్కువగా వినియోగించే టమోటా, మిర్చి, ఉల్లి ధరలు పెరగకుండా చూస్తే మిగతా కూరగాయల ధరలన్నీ అదుపులో ఉంటాయని అధికారుల యోచన. ఇందులో భాగంగా మహారాష్ట్ర నుంచి ఉల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు, మదనపల్లి నుంచి టమోటా, కర్నూలు, గుంటూరు ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి పెద్దమొత్తంలో సేకరించేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నగరమంతటా ఔట్లెట్స్ ప్రారంభించి ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ వై.జె.పద్మహర్ష తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఎన్ని ఔట్లెట్స్ పెట్టాలి..? స్థానికంగా ఎంత మేర ఉత్పత్తి అవుతోంది? ఇతర ప్రాంతాల నుంచి ఏమేరకు సరుకు దిగుమతి చేసుకోవాలి..? వంటివాటిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో వచ్చే మంగళవారం కొత్త ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. -
ఆల్ ఇన్ 1 కాయ
తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ... వంకాయ. ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. అలాంటి వంకాయతో సాక్షి పాఠకులు వండిన నాలుగు కమ్మని వంటకాలు... ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో! వెన్న వంకాయ కావలసినవి : లేత వంకాయలు - పావుకిలో, పచ్చిమిర్చి - 6, ఉల్లిపాయలు - 2, వెన్న - అరకప్పు, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - 1 రెమ్మ, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, మినప్పప్పు - 1 చెంచా, శనగపప్పు - 1 చెంచా, ఇంగువ - 2 చెంచాలు, చక్కెర - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా తయారీ : ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, మధ్యలో చీరాలి (గుత్తివంకాయకు చేసుకున్నట్టుగా); తర్వాత వాటిని ఐదు నిమిషాల పాటు నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి; ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, పసుపు, చక్కెర వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి; ఈ పేస్ట్‌ను వంకాయల మధ్యలో కూరాలి; స్టౌమీద బాణలి పెట్టి వెన్న వేయాలి; కరిగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేయాలి; వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలి; మాడిపోకుండా కలుపుతూ సన్నని మంటమీద వేయించాలి; వంకాయలు బాగా మగ్గి మెత్తబడిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి. వంకాయ నువ్వుల పులుసు కావలసినవి : వంకాయలు - పావుకిలో, నువ్వులు - 2 చెంచాలు, ఎండుమిర్చి - 4, ఉల్లిపాయ - 1, చింతపండు - నిమ్మకాయ అంత, బెల్లం - కొద్దిగా, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, తాలింపుకోసం - జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు తయారీ : చింతపండును నీటిలో నానబెట్టి పులుసు తీయాలి; వంకాయలకు నూనె రాసి, మంటమీద కాల్చాలి; అవి చల్లారిన తర్వాత తొక్క ఒలిచేసి, గుజ్జులా చేసుకోవాలి; నువ్వులు, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక తాలింపు దినుసులు వేయాలి; చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి, రంగు మారేవరకూ వేయించాలి; తర్వాత చింతపండు పులుసు వేసి మూతపెట్టాలి; పులుసు తిరగబడుతున్నప్పుడు వంకాయగుజ్జు, ఉప్పు, నువ్వులు-మిర్చి పొడి, బెల్లం వేసి ఉడికించాలి; మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. బైగన్ మంచూరియా కావలసినవి : వంకాయలు - పావుకిలో, బ్రెడ్ - 4 స్లైసెస్, మైదా - 2 చెంచాలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా,కారం - 1 చెంచా, పచ్చికొబ్బరి పొడి - 1 చెంచా, ధనియాల పొడి - 1 చెంచా, టొమాటో సాస్ - 2 చెంచాలు, పసుసు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, నూనె - తగినంత తయారీ : బ్రెడ్ స్లైసెస్ను పొడిలా చేసుకోవాలి; వంకాయలను ఉడికించి, మెత్తని గుజ్జులా చేసుకుని, దీనిలో ఉప్పు, కారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మైదా వేసి కలపాలి; ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి; స్టౌమీద మరో బాణలి పెట్టి, కాస్త నూనె వేయాలి; వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి; చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి; వేగిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపొడి, ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి; తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయ బాల్స్, టొమాటో సాస్, కొత్తిమీర వేయాలి; సన్నని మంటమీద ఐదు నిమిషాల పాటు ఉడికించి దించేయాలి; జీడిపప్పు, కొత్తిమీరతో అలంకరించుకుని వడ్డించాలి. వంకాయ ఉల్లి పచ్చడి కావలసినవి : వంకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 3, పచ్చిమిర్చి - 3, చింతపండు - కొద్దిగా, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు, ఛాయ మినప్పప్పు - 2 చెంచాలు, ఇంగువ - అరచెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ : ముందుగా వంకాయలను కాల్చి, తొక్క తీసి, మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జు 2 కప్పులు ఉండేలా చూసుకోవాలి; ఈ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి; తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి; ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయాలి; చిటపటలాడాక ఇంగువ కూడా వేయాలి; ఆపైన రుబ్బి పెట్టుకున్న రెండు మిశ్రమాలూ వేసి బాగా కలపాలి; రెండు నిమిషాల పాటు సన్నని మంటమీద ఉంచి దించేసుకోవాలి; దీనిలో కాసిన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని, నెయ్యితో పాటు అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. మధుమేహ రోగులకు మంచిది! వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది. అలాగే వంకాయ హైబీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి. ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్లు గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. -
ఏపీలో పెట్టుబడులకు ఇజ్రాయెల్ ఆసక్తి
⇒హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, వ్యవసాయం, నీటి వనరులపై దృష్టి ⇒దానిమ్మ, మామిడి, కూరగాయల కోసం 28 ప్రత్యేక కేంద్రాలు ⇒త్వరలోనే ఎఫ్‌టీఏపై చర్చలు ⇒ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇజ్రాయెల్ ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (రాష్ట్ర శాంతి భద్రతల రక్షణకు అవసరమైన టెక్నాలజీ అందించడం), వ్యవసాయం, నీటి వినియోగ రంగాల పెట్టుబడులపై ఇజ్రాయెల్ మక్కువ చూపుతోంది. ఇందుకోసం గత ఐదు నెలల్లో నాలుగు సార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో అందులో రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు దేశంలో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మాన్ తెలిపారు. గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రాలో కూడా వ్యవసాయ రంగంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ముందుగా కూరగాయలు, మామిడి, దానిమ్మ పంటలను ఎంపిక చేశామని, వచ్చే కొద్ది నెలల్లో రాష్ర్ట వ్యాప్తంగా 28 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డేనియల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఇండో ఇజ్రాయెల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఈఎఎస్ఫ్ ల్యాబ్స్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీస్ స్టడీస్ ఏర్పాటు చేసిన సదస్సుకు డానియల్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం జరిపినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడులకు అవకాశాలున్నాయని, కాని ప్రస్తుత పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకోలేకపోయామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలో ఎఫ్‌టీఏపై చర్చలు: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని, దీనిపై వచ్చే ఏడాది ప్రారంభంలో చర్చలు జరగొచ్చన్నారు. దీనికి సంబంధించి గత నెల నవంబర్‌లో జరగాల్సిన సమావేశం అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, త్వరలోనే ఎఫ్‌టీఏ దిశగా అడుగులు పడతాయన్న ఆశాభావాన్ని డేనియల్ వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 20 ఏళ్ల క్రితం రెండు లక్షల డాలర్లుగా ఉంటే అది ఇప్పుడు 6 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఇందులో రక్షణ రంగానికి సంబంధించి ఏమీ లేవని, ఇప్పుడు ఈ రంగంలో కూడా పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి కె.పద్మనాభయతో పాటు మాజీ పోలీస్ ఉన్నతాధికారలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. -
కార్తీకం..ధరలు ప్రియం
డోన్‌టౌన్: కార్తీక మాసం.. భక్తులు దీక్షలు స్వీకరించే కాలం. ఈ నెలలో వ్రతాలు, పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. వనభోజనాల సందడీ కనిపిస్తుంది. ఆదివారం వచ్చిందంటే తోటలు, పార్కులు జనంతో కిటకిటలాడుతాయి. వనభోజనాల్లో అందరూ శాఖాహారమే భుజిస్తారు. దీంతో కూరగాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ కాలంలో 60 శాతానికి పైగా ధరలు పెంచేసి వీటిని విక్రయిస్తున్నారు. గత అక్టోబరు నెలలో కిలో 10రూపాయలకే లభించే వంకాయలు ప్రస్తుతం రూ. 40 పలుకుతున్నాయి. బీరకాయలు రూ.12 నుంచి రూ.40, క్యారెట్ రూ.20నుంచి రూ. 50లకు పెరిగాయి. పూలకు భలే డిమాండ్.. కార్తీక పూజలతోపాటు అయ్యప్ప భక్తులు చేసే పడి పూజలకు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో బంతి, చామంతి రకాలే కాకుండా అన్నిరకాల పూలకూ డిమాండ్ రావడంతో వ్యాపారులు అమాంతం వాటి ధరలు పెంచేశారు. చామంతులు కిలో ధర రూ. 90, బంతి కిలో ధర రూ. 80 వరకూ పలుకుతున్నాయి. కొండెక్కిన ‘కొబ్బరి’ సహజంగానే కార్తీక మాసంలో కొబ్బరికాయలకు ధర పెరుగుతుంది. ఈ మాసంలో కొబ్బరి వినియోగం ఎక్కువకావడంతో కిరాణందుకాణాలలోనూ, రిటైల్ మార్కెట్లల్లోనూ వినియోగదారుని అవసరాన్ని బట్టి ధర పెంచేస్తుంటారు. గతంలో రూ. 8 ఉండే టెంకాయ.. 16 రూపాయలకు విక్రయిస్తున్నారు. అరటి పండ్లు డజను 40 రూపాయల ధర పలుకుతున్నాయి. వెలగని ‘కర్పూరం’ ప్రస్తుతం మార్కెట్లో పూజా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భక్తులు విధిగా వినియోగించే అగరరబత్తీలు, కర్పూరం, కుంకుమ, పసుపు వంటి వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు రేట్లు పెంచారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వీటి ధరలు రెట్టింపయ్యాయని దీంతో కర్పూరాన్ని వెలిగించలేక పోతున్నామని భక్తులు పేర్కొంటున్నారు. -
కోడిగుడ్డు రూ.15, పాలు లీటర్ రూ.80
-
కాలే కడుపుకు కుళ్లిన వంట
ఈడేపల్లి : ప్రజాప్రతినిధుల పట్టించుకోనితనం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వెరచి ప్రభుత్వాసుపత్రుల్లోని రోగుల కడుపు అర్థాకలితో మలమల మాడిపోతుంది. అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో కాంట్రాక్టర్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ‘ప్రత్యేక మెనూ’ అనే పదాన్నే మరచిపోయాడు. నిబంధనల మేరకు రోగులకు ప్రత్యేక మెనూ ప్రవేశపెట్టినా అది కాగితాలకే పరిమితమైంది తప్ప పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు రోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. పెట్టే భోజనం అరకొరగా అధ్వాన్నంగా ఉండడంతో అన్నమో ‘రామచంద్రా ’ అని రోగులు ఆకలితో అల్లాడిపోతున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న దుస్థితి ఇదీ. కుళ్లిపోయిన కూరగాయలే దిక్కు... నాణ్యమైన కూరగాయలతో రోగులకు భోజనం పెట్టాలని నిబంధనలు చెబుతున్నా వీటిని తుంగలోకి తొక్కి నాసిరకం కూరలతో భోజనం తయారు చేస్తున్నారు. ఇక్కడి భోజనశాలలోని కూరగాయల్ని చూస్తే... మళ్లీ జన్మలో ఆ ఛాయలకు వెళ్లరు. రైతుబజారులో ఎవరూ కొనకుండా వదిలేసిన, జంతువులకు ఆహారంగా ఉపయోగించే కుళ్లిపోయిన కూర గాయల్ని తెచ్చి రోగులకు ఆహారంగా వండుతున్నారు. వీరికి ఇచ్చే పాలు పూర్తిగా నీళ్ల పాలు. భోజనశాల కాంట్రాక్టరు తన వ్యాపారంలో భాగంగా స్థానిక హోటల్స్‌కు పాలు సరఫరా చేస్తుంటాడు. ఇలా హోటల్స్‌లో సాయంత్రం పూట మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తక్కువ ధరకు కొనడం లేదా సేకరించి దీన్ని మర్నాడు ఉదయం రోగులకు పెట్టే అల్పాహారానికి ఉపయోగిస్తుంటాడని విశ్వసనీయ సమాచారం. రైతుబజారులో నిల్వఉన్న, పాడై పోయిన కూరగాయలను సదరు కాంట్రాక్టరు తక్కువ రకానికి కొనుగోలు చేస్తుంటాడు. కుళ్లివాసన వస్తున్న టమాటలను కూడా సేకరించి తీసుకువెళ్తుంటాడని రైతు బజారు వర్గాలు చెబుతున్నాయి. 20ఏళ్ల నుంచి ఒకే కాంట్రాక్టరు.... దాదాపు 20ఏళ్ల పైనుంచి ఒకే కాంట్రాక్టరు చేతిలో భోజనశాల(మెస్) నడుస్తోందని ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. ఈ కాంట్రాక్టరుకు అటు ఆస్పత్రి వర్గాలు, ఇటు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ వర్గం నాయకులను తన బుట్టలో వేసుకోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య అని ఆస్పత్రి సిబ్బందే బాహాటంగా చెబుతున్నారు. నిబంధనలకు తిలోదకాలు ... సాధారణ, ఆరోగ్యశ్రీ, జననీ సురక్షాయోజన పథకం రోగులకు అల్పాహారం, పాలు, మజ్జిగ, సన్నబియ్యంతో వండిన అన్నం, నాణ్యమైన కూరగాయలతో తయారు చేసిన కూర, అరటి పండు, గుడ్డు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. కానీ అమలులో మాత్రం అలసత్వమే కనపడుతోంది. రోగులకు ఇచ్చే అర టి పళ్లు కళ్లిపోయి కంపుకొడుతుంటాయి. అందరికీ ఒకేలా.. ప్రభుత్వాసుపత్రిలోని సాధారణ, ఆరోగ్యశ్రీ, జననీసురక్షాయోజన(జేఎస్ఎస్కే) రోగులకు వేర్వేరుగా మెనూ ఉంది . కానీ అందరికీ సాధారణ రోగుల మాదిరిగానే ఒకేలా భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారు. సాధారణ పేషింట్లకు రూ. 56 విలువ గల భోజనం, ఆరోగ్యశ్రీ వారికి రూ. 60 , జననీసురక్షా రోగులకు రూ. 60 ఖరీదు గల ఆహారం పెట్టాలి. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా ప్రతిరోజూ రెండు గుడ్లు, వారంలో ఒకసారి మాంసాహార భోజనం అందివ్వాలి. కానీ ‘వండిందే తిను, పెట్టిందే మెనూ’ అన్న రీతిలో కాంట్రాక్టరు తీరు ఉంటోందని రోగులు కన్నీరుమున్నీరవుతున్నారు. పర్యవేక్షణ లోపమే శాపమా? రోగుల భోజనానికి ఉపయోగించే కూరగాయల నాణ్యత పరిశీలనకు ప్రత్యేకంగా డైటీషియన్ ఉండాలి. వారి సమక్షంలోనే ఆహారపదార్ధాలు వండి రోగులకు పెట్టాలి. కానీ గత ఆరేళ్ల నుంచి డైటీషియన్ పోస్టు ఖాళీగానే ఉంది. భోజనం వడ్డించే ముందుగానే డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆర్ఎంవో ఆహార పదార్ధాల నాణ్యత పరిశీలించి, రుచి చూసిన తర్వాత మాత్రమే రోగులకు పెట్టాలనేది నిబంధన. కానీ పర్యవేక్షించాల్సిన అధికారులు కేవలం రికార్డుల్లోనే వీటిని నమోదు చేసుకుని చేతులు కడుక్కుంటున్నారనే ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం భోజనం మెనూ ప్రకారమే అమలవుతోంది. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. డైటీషియన్ లేకపోవడంతో నర్సింగ్ సూపరింటెండెంట్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం. వారు ప్రతిరోజూ ఆహారపదార్థాల నాణ్యతని పరిశీలిస్తున్నారు. ఒక వేళ నాణ్యతా లోపాలేమన్నా ఉన్నట్లు నాదృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. - డాక్టరు ఎమ్.జయకుమార్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ -
దిగివస్తున్న కూరగాయల ధరలు
మెహిదీపట్నం: కూరగాయల ధరలు కాస్త దిగి రావడంతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు. నెల క్రితం రూ.50 పలికిన కిలో టమాట ప్రస్తుతం రూ.20కి దిగి వచ్చింది. వర్షాలు కురవడంతో కూరగాయల దిగుబడి నెమ్మదిగా పెరుగుతోంది. ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య వరకు కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. ప్రధాన పండుగలైన బోనాలు, రంజాన్ సమయంలో ధరలు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి. ఓ సందర్భంలో కిలో టమాట రూ.80కి చేరుకుంది. పచ్చిమిర్చి కిలో రూ.100, బీన్స్ రూ.120తో పాటు కూరగాయలు ఏవైనా కిలో రూ. 30 పైనే ఉండేవి. వర్షాలు ఆలస్యంగా పడడంతో ధరలపై చూపింది. ప్రస్తుతం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. మెహిదీపట్నం రైతుబజార్, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లకి కూరగాయలు భారీగా వస్తున్నాయి. శివారు ప్రాంతాలైన మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, షాద్‌నగర్ నుంచి క్రమంగా కూరగాయల దిగుమతి పెరుగుతుంది. మరో రెండు వారాల్లో ధరలు ఇంకా దిగి వస్తాయని వ్యాపారులు అంటున్నారు. -
ఆర్థిక గణాంకాల నిరుత్సాహం
న్యూఢిల్లీ: 2013 జూన్‌లో ఐఐపీ అసలు వృద్ధి నమోదు చేసుకోకపోగా, మైనస్ (-)1.8 శాతం క్షీణతలో ఉంది. ఈ అతి తక్కువ ‘బేస్’ ఎఫెక్ట్ వల్లే తాజా సమీక్ష నెల (2014 జూన్) గణాంకాలు ఎంతోకొంత మెరుగ్గా కనిపిస్తున్నాయని కొందరు ఆర్థిక నిపుణుల విశ్లేషణ. 2013 మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)తో పోల్చిచేస్తే కూడా తాజా జూన్ త్రైమాసిక ఐఐపీ ఫలితాలు మెరుగ్గా కనిపించాయి. ఈ కాలంలో ఉత్పత్తి గత -1.0 శాతం క్షీణత నుంచి తాజాగా 3.9 శాతం వృద్ధి బాట పట్టింది. వార్షికంగా ఓకే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తి 2013 జూన్‌లో క్షీణతలో -1.7 శాతంగా ఉంది. అయితే 2014 జూన్‌లో ఈ రేటు 1.8 శాతానికి ఎగసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ రేటు 2013 ఇదే కాలంతో పోల్చితే -1.1 శాతం క్షీణ బాట నుంచి 3.1 శాతానికి ఎగసింది. వార్షికంగా పరిశీలిస్తే- ఇది కొంత ఊరటనిచ్చే అంశం. మైనింగ్: ఈ రంగం కూడా కొంత ఉత్సాహకరమైన ఫలితాన్ని ఇచ్చింది. -4.6 క్షీణత నుంచి 4.3 శాతం వృద్ధికి మళ్లింది. త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి. -4.6 క్షీణ ఉత్పత్తి, 3.2 శాతం వృద్ధి బాట పట్టింది. విద్యుత్: 2013 జూన్‌లో అసలు వృద్ధి లేకుండా నిశ్చలంగా ఉండిపోయిన ఈ రంగం, 2014 జూన్‌లో 15.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. త్రైమాసికంగానూ వృద్ధి 3.5 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగం 6.6 శాతం క్షీణత నుంచి 23 శాతం వృద్ధి బాటకు మళ్లింది. త్రైమాసికంలో ఈ రేటు 3.7 శాతం నుంచి 13.9 శాతానికి ఎగసింది. వినియోగ వస్తువులు: ఈ రంగం మాత్రం నిరుత్సాహంగానే ఉంది. అసలు వృద్ధి లేకపోగా, 1.5 శాతం క్షీణత మరింతగా 10 శాతం క్షీణతకు జారిపోయింది. త్రైమాసికంగా కూడా క్షీణత రేటు - 2.1శాతం నుంచి -3.6 శాతానికి ఎగసింది. ఈ రంగంలో రెండు విభాగాలైన ‘కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్’ ఫలితాలు కూడా నిరాశా జనకంగానే ఉన్నాయి. ఈ రంగం మొత్తం గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై ధరలు బెంబేలు... ఇక రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, వార్షిక ప్రాతిపదికన 2014 జూన్‌లో రిటైల్ ధరలు (2013 ఇదే నెలలో ధరలను పోల్చి) 7.31 శాతం పెరిగితే, జూలైలో ఈ రేటు మరింత ఎగసి 7.96 శాతానికి చేరింది. ఇందులోని మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహార, పానియాల ద్రవ్యోల్బణం రేటు 9.16 శాతంగా నమోదయ్యింది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.47 శాతంగా ఉంది. దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షల ద్రవ్యోల్బణం రేటు 8.73 శాతం. వేర్వేరుగా ఆహార, పానియాల విభాగంలో వార్షిక ప్రాతిపదికన 2014 జూలైలో ధరల పరుగు తీరును పరిశీలిస్తే- పండ్ల ధరలు భారీగా 22.48 శాతం ఎగశాయి. కూరగాయల ధరలు 16.88 శాతం పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 11.26 శాతం పరుగు పెట్టాయి. అన్ని ఆహార ఉత్పత్తుల ధరలూ ఎంతోకొంత శాతం పెరిగాయి తప్ప, తగ్గడం ప్రశ్నే లేదు. వీటిలో తృణ ధాన్యాలు, ఉత్పత్తులు (7.45 శాతం), పప్పు దినుసులు, సంబంధిత ఉత్పత్తులు (5.85 శాతం), చమురు, వెన్న పదార్థాలు (0.70 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం (7.68 శాతం), సుగంధ ద్రవ్యాలు (8.74 శాతం), చక్కెర (0.82 శాతం), ఆల్కాహాలేతర పానియాలు (6.35 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (7.77 శాతం) ఉన్నాయి. -
కొండెక్కుతున్న కూరగాయల ధరలు
-
మరింత ప్రియం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వేసవి కాలం ముగిసినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టక పోగా రోజు రోజుకు ఆకాశ మార్గాన విహరిస్తున్నాయి. ఆకు కూరల ధరలు కూడా అందుబాటులో లేవు. కొత్తిమీర, పుదీనా లాంటి వాటి ధరలు వాకబు చేస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. బీన్స్ ధర నెల రోజులుగా రూ.80-90 మధ్య నిలకడగా ఉంటోంది. ముల్లంగి రూ.45-50, కాలిఫ్లవర్ రూ.60, బీట్రూట్ రూ.34, క్యాబేజీ రూ.20, ఉల్లిపాయలు రూ.32-35, బంగాళాదుంపలు రూ.35 చొప్పున పలుకుతున్నాయి. వంటల తయారీలో నిత్యం అత్యవసరంగా భావించే కొత్తిమీర ధర కేజీ. రూ.200గా ఉంది. చిల్లర వర్తకులు ఫారం ఆకు కూర కట్టను డిమాండ్‌ను బట్టి రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. నాటు కూరాకు మార్కెట్లకు రావడమే లేదు. మెంత్యాకును హాప్‌కామ్స్‌లో కేజీ రూ.120 చొప్పున అమ్ముతున్నారు. వేరే చోట్ల చిన్న కట్టలను రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. పుదీనా ధర కట్టకు రూ.5 నుంచి రూ.20కి ఎగబాకింది. గుడ్డిలో మెల్ల అన్నట్లు ధాన్యాల ధరలు స్వల్పంగా తగ్గాయి. దాదాపు అన్ని రకాల ధాన్యాలు కేజీకి రూ.5 నుంచి రూ.15 వరకు తగ్గు ముఖం పట్టాయి. కాగా కొన్ని చోట్ల నీటి కొరత, మరి కొని చోట్ల భారీ వర్షాల కారణంగా కూరగాయల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలకు భారీ ఎత్తున కూరగాయలు రవాణా అవుతున్నందున, ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. -
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
-
పరిశోధన సరే... ప్రోత్సాహం ఏదీ..?
గిరిజన రైతుల దరి చేరని పరిశోధన కేంద్రం ఫలితాలు చింతపల్లిలో కూరగాయల శిక్షణ కేంద్రం లేక నష్టాలు విదేశీ కూరగాయలు పండేందుకు మన్యం అనుకూలం సదుపాయాలు లేక అక్కరకురాని పరిజ్ఞానం కొయ్యూరు, న్యూస్‌లైన్ : చింతపల్లి ఉద్యానవన పరిశోధన కేంద్రంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఎనిమిది రకాల కూరగాయలను ప్రయోగాత్మకంగా వేసి చూశారు. పంట బాగా వచ్చింది. రాష్ట్రీయ కృషీ విజ్ఞాన్ యోజన(ఆర్వీవై)లో వాటిని ప్రయోగాత్మకంగా వేశారు. రాత్రి సమయంలో పది డిగ్రీలకు తక్కువగా ఉండే వాతావరణంలో ఆ పంటలు పండుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారణ అయింది. అయితే ఈ ఫలితాలు గిరిజనులకు చేరాలంటే...గిరిజనులు ఈ కూరగాయలను సాగు చేయాలంటే.... శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు అనుగుణంగా కూరగాయల శిక్షణ కేంద్రాన్ని (వీటీసీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ పరిశోధన కేంద్రంలో పండించిన కూరగాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వాటిపై రైతులకు అవగాహన కలగాలంటే వీటీసీ ఉండాలి. కానీ ఆ దిశలో ఇంతవరకూ ప్రయత్నాలు జరగలేదు. ఈ కేంద్రం ద్వారా గిరిజన రైతులను అనేక విధాల ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవకాశాలున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ప్రయోగాల ప్రయోజనాలు గిరిజనులకు అక్కరకు రావడం లేదు. కనీసం పండించిన పంటను కొన్నాళ్లు దాచుకునేందుకు అవసరమైన శీతలగిడ్డంగులు(కోల్డ్ స్టోరేజీ) సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజన రైతులకు లాభాలు రావాల్సిన చోట నష్టాలు వస్తున్నాయి. చింతపల్లిలో మార్కెట్ కమిటీ ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దాని ఆధీనంలో వీటీసీ ఉంటే వందలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, కనీసం ఐటీడీఏ చింతపల్లిలో వీటీసిని ఏర్పాటు చేసినా బాగుంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఏమేం పండించవచ్చు? చింతపల్లి పరిశోధన కేంద్రంలో బ్రకోలి, రెడ్ క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ, లటస్, ప్రచోరి రకం కూరగాయలు పండించారు. వీటిలో బ్రకోలిలో క్యాన్సర్‌ను నివారించే యాంటి ఆక్సిటెండ్లున్నాయి. దీని ధర ఇతర ప్రాంతాల్లో కిలో రూ.150 వరకు పలుకుతుంది. ప్రధానంగా మెట్రో నగరాల్లో వాటికి మంచి డిమాండ్ ఉంది. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇంత విలువైన కూరగాయలు పండించినా గిరిజనులు లాభపడేది అనుమానమే. ప్రోత్సహిస్తే మన్యం మరో కొడెకైనాలే! విదేశాల్లో గిరాకీ ఉన్న కూరగాయలను పండించే ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఒక్క కొడెకైనాల్ మాత్రమే. అక్కడ శీతల గిడ్డంగులు ఉండడంతో రైతులు తాము ఒక్కసారి పండించిన కూరగాయలను దఫ దఫాలుగా అమ్ముకుంటున్నారు. మన్యంలో కూరగాయల సాగుకు వాతావరణం అనుకూలించినా... శీతల గిడ్డంగులు లేక నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఇతర మార్కెట్లతో అనుసంధానమై తమ పంటలను మంచి ధరలకు అమ్ముకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో దళారుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ‘న్యూస్‌లైన్’ చింతపల్లి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి జగన్‌ను సంప్రదించగా గిరిజన రైతులు కోల్డ్ స్టోరేజీ కావాలని కోరితే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. స్టోరేజీ ఉంటే ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం రైతులకు ఉంటుందన్నారు. -
కూరగాయలు.. డోర్ డెలివరీ!
సాక్షి, ముంబై: మీరు నిత్యం తలమునకలయ్యే పనుల్లో పడి ఇంటికి కావాల్సిన కూరగాయలు తెచ్చుకోలేకపోతున్నారా.. తాజా కూరలు దొరక్క ఇబ్బంది పడుతున్నారా! ఏం ఫర్లేదు.. ఒక ఫోన్ కాల్.. 9223433734 సెల్ నంబర్‌కు చేయండి.. తాజా కూరలు మీ ఇంటి ముందుంటాయ్..అని అంటున్నారు మాజ్గావ్లోని ఘోడ్పదేవ్ నాగరిక్ సహకార సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ కామ్కర్. నగరంలో బతుకు అంటే ఇంట్లో అందరూ కష్టపడాల్సిందే. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి అసలు చెప్పక్కర్లేదు.. ఇటు ఇల్లు, అటు ఉద్యోగం.. తెల్లారిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగుల బతుకు.. ఈ గందరగోళంలో ఇంటికి సరిపడా తాజా కూరగాయలు తెచ్చుకోవడం గగనంగా మారుతోంది. ముంబైకర్లలో సుమారు 80 శాతం ఉద్యోగినుల పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. ఇటువంటివారికి దోహదపడేలా కూరగాయల డోర్ డెలివరీకి నడుం బిగించింది ఘోడ్పదేవ్ నాగరిక్ సహకార సంస్థ. ‘ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు..వారికి కావాల్సిన తాజా కూరగాయాలు ఇంటిముందు ఉంటాయి. ఈ సేవలకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ ధర కంటే చౌకగానే అందజేస్తాం..’ అని చెప్పారు ప్రవీణ్ కామ్కర్. ‘రైతుల నుంచి మా సంస్థ కూరగాయలు నేరుగా కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పేదలే కాదు మధ్యతరగత ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసిన దళారులు ధరలు పెంచి లాభాలు గడిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ నుంచి కూరగాయలు కొనుగోలు చేసి నేరుగా కస్టమర్లకు విక్రయించాలని మా సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా కూరగాయలు కొనుగోలుదార్ల చెంతకే నేరుగా చేరుతుండటంతో మంచి స్పందన వస్తోంద’ని ప్రవీణ్ అన్నారు. తాము అన్ని రకాల కూరగాయలు అందజేస్తామన్నారు. ఫోన్ చేస్తే చాలు వాహనంలో కూరగాయలు చేరవేస్తామని కామ్కర్ తెలిపారు. అందుకు గృహిణులే కాకుండా సొసైటీ యాజమాన్యాలు కూడా తమ నంబర్‌కు సంప్రదిస్తే సరుకులు డెలివరీ చేస్తామన్నారు. మహిళా పొదుపు సంఘాలు, లేదా ఇతర ఎవరైనా ఈ వ్యాపారంపై ఆసక్తి ఉంటే తమని సంప్రదించవచ్చని కామ్కర్ తెలిపారు. ఇప్పటికే వడాల, వర్లీ లాంటి కీలక ప్రాంతాల్లో బొలేరో వాహనంలో కూరగాయలు విక్రయించడం ప్రారంభించామన్నారు. దీనివల్ల సంస్థకు నెలకు రూ.10వేలు వరకు ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో సేవలు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో మహిళా పొదుపు సంఘాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. -
ఏలూరులో కూరగాయల ధరలకు రెక్కలు
-
కూర‘గాయాలు’ ధరల కాక
కొనలేం.. తినలేం.. =భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు = కార్తీకమాసం ఎఫెక్ట్ =కొండెక్కిన ధరలతో సామాన్యుల బెంబేలు పెడన, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, కార్తీక మాసం ప్రభావంతో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆకు కూరలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. కార్తీక మాసంలో హిందువులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటంతో శాకాహారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయ్యప్ప, భవానీ దీక్షలకు కూడా ఇది సీజన్ కావడంతో కూరగాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏ రకం కూరగాయలు కొనాలనుకున్నా ధరలు చుక్కల్లో ఉండటంతో అన్ని వర్గాల ప్రజలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో వంకాయ కేజీ రూ.60 నుంచి 70, టమోటా 40, దోస 25, క్యారెట్ 60, బంగాళాదుంపలు, బీరకాయలు, బెండకాయలు 40 వరకు పలుకుతున్నాయి. దొండకాయలు ఎన్నడూ లేనిది రూ.70 వరకు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి రూ.25, చిక్కుళ్లు రూ.30, కొత్తిమీర కట్ట చిన్నది రూ.30, చామదుంపలు 40, కంద 30 చొప్పున అమ్ముతున్నారు. పువ్వులు, పండ్ల ధరలూ పైపైకి... మార్కెట్లో పువ్వులు, పండ్ల ధరలు సైతం పైపైకి ఎగబాకుతున్నాయి. ఒక మోస్తరు సైజున్న బత్తాయిలు డజను రూ.100కు పైబడి అమ్ముతున్నారు. యాపిల్స్ అయితే సామాన్యుడు కొనే పరిస్థితే కనిపించటం లేదు. ఒక్కోటి రూ.40 వరకు పలుకుతోంది. సీతాఫలాలు డజను రూ.200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఇక పూజలకు తప్పనిసరిగా వాడే అరటిపండ్లు సైజును బట్టి డజను రూ.40 నుంచి 50 వరకు పలుకుతున్నారు. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయని, దీంతో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ధర తగ్గిన చికెన్... కార్తీకమాసానికి ముందునుంచే ధర తగ్గిన కోడిమాంసం ఇప్పుడు మరీ చౌకగా మారింది. కార్తీక మాసం ప్రభావంతో చికెన్ వినియోగం తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర కేజీ రూ.80కి చేరుకుంది. ఒక్కసారిగా హోల్‌సేల్ రేటు పడిపోవటంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కోళ్లఫారాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దిగొస్తున్న ధరలు
సాక్షి, ముంబై: ఆకాశన్నంటిన కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల మార్కెట్లోకి వచ్చే కూరగాయల సరఫరా తగ్గడంతో కొండెక్కిన ధరలు మళ్లీ నేలవైపు చూస్తున్నాయి. నగరంలోని అన్ని మార్కెట్లోకి కూరగాయల తాకిడి పెరిగింది. మరోవైపు వీటి వినియోగం తగ్గడం కూడా ధరల తగ్గుదలకు కారణంగా చెప్పవచ్చు. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరిగింది. దీంతో సరుకు నిల్వలు పేరుకుపోతుండటంతో వ్యాపారులు ధరలు కొంతమేర తగ్గించారు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి గణేశ్ ఉత్సవాలు ముగిసేవరకు అత్యధిక శాతం ప్రజలు మాంసానికి దూరంగా ఉన్నారు. దీంతో కూరగాయాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగియడంతో కూరగాయలు కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వస్తున్న భారీ వాహనాల సంఖ్య పెరిగింది. ఫలితంగా మొన్నటి వరకు చుక్కలను తాకిన కూరగాయల ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. మొన్నటివరకు కేజీ రూ.80లు ధర పలికిన ఉల్లి ఇప్పుడు సుమారు రూ.50 ధర పలుకుతోంది. ఇదే తరహాలో కేజీకీ రూ.50 ధర పలికిన వివిధ రకాల కూరగాయలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గృహిణిలకు కొంతమేర ఊరట లభిస్తోంది. కొన్నినెలలుగా పేదలకే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు అందకుండాపోయిన కూరగాయల ధరలను నియంత్రించేందుకు కేంద్రం చౌక ధరల కూరగాయల కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో కూరగాయల దిగుబడి కూడా పెరిగింది. గత మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ సుమారు 450కిపైగా ట్రక్కులు, టెంపోలు వచ్చాయి. కానీ శని, ఆదివారాల్లో మాత్రం ఈ సంఖ్య 600కుపైగా చేరింది. దీంతో ధరలు కొంతమేర దిగివచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత దిగివస్తాయని హోల్‌సేల్ వ్యాపారి రాజేశ్ గుప్తా చెప్పారు. -
చుక్కల్లో...మిర్చి, ఉల్లి ధర
భువనగిరి, న్యూస్‌లైన్: కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉల్లిగడ్డ ధర ప్రస్తుతం రూ.50, మిర్చి రూ.64 పలుకుతుంది. దీనికి తోడు బియ్యం రేటు రోజురోజుకు పెరిగిపోతోంది. సంచుల్లో డబ్బులు తీసుకుపోయి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రాబోతుందన్న భయం జనాలను వెంటాడుతోంది. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కూరగాయలను పరిమితంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. నెల బడ్జెట్లో ఇప్పుడు కూరగాయలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. వారంలో రెండు రోజులు గుడ్లు, ఒక రోజు పప్పు, మరో రోజు చికెన్ లేదా మటన్, ఇలా సర్ధుబాటు చేసుకుని మిగిలిన రోజులకు కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. కలిగిన వారు సైతం కూరగాయలను ఫ్రిజ్‌ల నిండా నింపుకునే పరిస్థితికి టాటా చెప్పి మితంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక పేదలు చింతపులుసు, కారంతో రోజులు గడిపేస్తున్నారు. కూరగాయల పంటలు మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఈ దశలో మండిపోతున్న ధరలు రైతుల పంటలు మార్కెట్లోకి వ చ్చేటప్పుటికి ఉండడం లేదు. దీంతో రైతులు కూరగాయల ధరలపై నిరుత్సాహంగా ఉంటున్నారు. ధరలు పెరిగిన ప్రతిసారీ రైతులు ఆశతో సాగు ప్రారంభిస్తున్నారు. భువనగిరి డివిజన్ పరిధిలో రైతులు పలు రకాల కూరగాయలు పండిస్తారు కానీ ఇప్పుడవన్నీ పంట దశలోనే ఉన్నాయి. రూ.42కు చేరిన సన్న బియ్యం బీపీటి పాత బియ్యం కేజీ రూ.42లకు చేరింది. నాలుగు నెలల క్రితం అత్యధికంగా కిలో రూ.30 పలికిన ఫైన్ బియ్యం ఇప్పుడు కిలోకు రూ.10 పైనే పెరిగింది. దీంతో పేద, మధ్యతరగతి, సామాన్య జనం సన్న బియ్యం కొనుగోలు చేయాలంటే ధరలు చూసి హడలిపోతున్నారు. సన్న బియ్యం ఆశను తీర్చుకోలేని జనం దొడ్డు బియ్యం, నూకలతోనే సరిపెట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. రూ.160లకు కిలో చికెన్ కిలో చికెన్ ధర రూ.140 నుంచి రూ.160లకు పెరిగింది. 15 రోజుల క్రితం వరకు రూ.130, రూ.140 కిలో ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.160కి చేరింది. శ్రావణమాసం అయినప్పటికీ చికెన్ ధరల పెరుగుదల ఆగడం లేదు. గత 15 రోజులుగా చికెన్ ధర ఇలాగే కొనసాగుతుంది. -
చుక్కలనంటిన కూరగాయల ధరలు