న్యూఢిల్లీ: సోషల్ మీడియా వచ్చకా ఏ వార్తలు నమ్మాలో.. ఏవి నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదో అల్లాటప్పా వాళ్లు చెప్పారంటే అది వేరు.. ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి చెప్పిన విషయం కూడా అబద్ధం అని తెలితే ఇక ఎవరిని నమ్మాలి. ఇదే ప్రశ్న ఎదురవుతుంది ఈ న్యూస్ చూసిన వారికి. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అరుదైన రకానికి చెందిన కూరగాయను సాగు చేస్తున్నాడు.. దాని ధర ఏకంగా కిలో లక్ష రూపాయలు పలుకుతుంది అని ఓ వార్త వచ్చిన సంగతి గుర్తింది కదా. అయితే ఇది శుద్ద అబద్ధం అట.
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ‘‘ఔరంగాబాద్‌కు చెందిన రైతు అమ్రేశ్ సింగ్ ‘‘హాప్ షూట్స్’’ అనే కొత్త రకం కూరగాయ పంట సాగు చేస్తున్నాడు. దేశంలో దీని పండిస్తున్న ఏకైక వ్యక్తి ఇతనే. ఈ పంట దేశీయ రైతుల తల రాతను మార్చనుంది. ఎందుకంటే ఈ కూరగాయ కిలో ధర ఏకంగా లక్ష రూపాయల విలువ చేస్తుంది’’ అంటూ మార్చి 31న ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా ఇది తెగ వైరలవుతూ.. వేల కొద్ది రీట్వీట్స్, లైక్స్ పొందింది.
ఈ క్రమంలో హిందీ న్యూస్ పేపర్ దైనిక్ జాగరణ్ బృందం శుక్రవారం బిహార్ ఔరంగబాద్ వెళ్లింది. ఈ పంట గురించి స్థానిక ప్రజలను అడగ్గా తాము అలాంటి పంట గురించి ఇంతవరకు వినలేదని.. తమ ప్రాంతంలో అలాంటి కూరగాయను పండిచడం లేదని తెలిపారు. ఇక ఫోన్‌లో అమ్రేశ్ సింగ్‌ను సంప్రదించగా.. హాప్ షూట్స్‌ని పండిస్తుంది ఔరంగాబాద్‌లో కాదు నలందలో అని తెలిపాడు. కొత్త రకం పంటే కానీ ఇంత భారీ ధర పలుకుతుందనే విషయం మాత్రం అబద్ధం అని తెలిపాడు. తాను గతంలో గోధుమలు, బ్లాక్ రైస్ పండించినట్లు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment