Lie
-
Dipraj Jadhav: సరదాగా చేసిన ఒక వీడియో స్థాయినే మార్చేసింది..
‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటాడు కవి. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని దిప్రజ్ జాదవ్ ఎప్పుడూ అనుకోలేదు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏమిటో కూడా తెలియదు. సరదాగా చేసిన ఒక వీడియో అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది... ఒక వైరల్ వీడియోతో మహారాష్ట్రలోని షిర్పూర్ అనే చిన్న పట్టణానికి చెందిన దిప్రజ్ జాదవ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మరాఠీ సినిమా ‘లై బారి’లోని ఒక డైలాగ్ మీమ్ మాషప్ చేశాడు జాదవ్. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ దృష్టిని కూడా ఆ వీడియో ఆకట్టుకుంది. వైరల్ అయింది. ‘ఫేస్బుక్లో నేను పేజీ స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది పెద్ద విషయం కాదు. దానికి అంత ్ర΄ాముఖ్యత కూడా లేదు. అలాంటి సమయంలోనే కొత్త కొత్త వీడియోలు చేసేవాడిని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు దిప్రజ్ జాదవ్. జాదవ్‌కు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులోని ΄ాపులర్ సీన్లకు తనదైన స్టైల్ జోడించి అనుకరించే వాడు. పుణెలో యానిమేషన్ కోర్సు చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్‌పై ఇష్టం పెరిగింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పర్ఫెక్ట్గా మిక్స్ చేయడంలో గట్టి పట్టు సం΄ాదించాడు. ఆ విద్య అతడికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో ఎంతోమంది ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. సెకండ్ టర్నింగ్ ΄ాయింట్ విషయానికి వస్తే,.,.. రామానంద్‌సాగర్ ‘రామాయణం’లోని రాముడు, రావణుడికి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోకు ర్యాపర్ డివైన్ ΄ాడిన ‘సీన్ క్యా హై’ ΄ాటను జోడించాడు. ఇది చూసి మ్యూజిక్ ్ర΄÷డ్యూసర్ న్యూక్లియ(ఉద్యాన్ సాగర్) జాదవ్‌ను సంప్రదించి సబ్ సినిమా సిరీస్‌లో భాగంగా ఇలాంటి ఫిల్మీ మాషప్స్ మరిన్ని కావాలని, వాటిని మ్యూజిక్ ్ర΄ోగ్రాంలలో ఉపయోగించుకుంటానని చె΄్పాడు. జాదవ్ క్రియేటివిటీకి న్యూక్లియ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ‘ఊహకు అందనిది ఆలోచించే సామర్థ్యమే అరుదైన సృజనాత్మకత. ఇలాంటి అరుదైన సృజనకారులలో జాదవ్ ఒకరు. రెండు పరస్పర విరుద్ధ అంశాలను మిళితం చేసి అందరినీ ఆకట్టుకుంటాడు’ అంటాడు న్యూక్లియ. చిత్రపరిశ్రమలో పనిచేయాలనేది జాదవ్ కోరిక. బాలీవుడ్‌లోని కొన్ని సినిమాలు, బాట్లా హౌజ్, రాకెట్ బాయ్స్లాంటి వెబ్‌సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ‘నేను చేస్తున్న పని గురించి నా తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఏదైన స్థిరమైన ఉద్యోగం చేయాలని కోరుకునేవారు. అయితే నాకు వచ్చిన గుర్తింపు చూసిన తరువాత వారి ఆలోచన మారింది. నాపై నమ్మకం పెరిగింది’ అంటాడు దిప్రజ్ జాదవ్. 28 సంవత్సరాల జాదవ్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–2024’ జాబితాలో చోటు సాధించాడు. కొత్త ద్వారాలు ‘పదిమందిలో ఒకరు’ అని కాకుండా పదిమందికి భిన్నంగా ఆలోచించినప్పుడే మంచి ఫలితం సాధించగలం. ఒక టాపిక్ గురించి మనకు ఇష్టం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి అన్ని కోణాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆ టాపిక్‌పై పట్టు వస్తుంది. కొత్తగా ఆలోచించడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. – దిప్రజ్ యాదవ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ దిప్రజ్ జాదవ్ -
నిజాయితీ నిల్! మగవాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారట!
అబద్ధాలు చెప్పేవాళ్ల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతోందట. అందులో మగవాళ్లే, స్త్రీల కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. 1980 నుంచి 2021మధ్య జన్మించిన వ్యక్తుల వారిగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో పెద్ద, చిన్నా తేడా అనే తారతమ్యం లేకుండా అందరూ అబద్ధాలే చెబుతున్నారని, నిజాయితీగా ఉండే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్లేస్టార్ అనే ఆన్లైన్ క్యాసినో దాదాపు 1306 మంది చొప్పున యుఎస్‌లోని వివిధ రాష్ట్రాలపై జరిపినలో సర్వేలో తేలిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వారంతా వివిధ పరిస్థితుల్లో ఎలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారో గమనించినట్లు పేర్కొంది. ఈ మేరకు యూస్‌లోని కొలరాడో,ఇల్లనాయిస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టేనస్సీ, విస్కాన్సిన్లతో సహా అన్ని రాష్ట్రాలలో సుమారు వెయ్యి మంది చొప్పున చేసిన సర్వేలో ఈవిషయం వెల్లడించింది. వారిలో నిజాయితీ లేని వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సుమారు 13 శాతం మంది కనీసం ఒక్కసారైన అబద్ధం చెబుతున్నామని అంగీకరించనట్టు పేర్కొంది. 1965-1980 మధ్య జన్మించిన వ్యక్తులను 'జెడ్‌గా' 1997-2021 మధ్య జన్మించిన వ్యక్తులను ఎక్స్‌గా విభజించి పోల్చి చూస్తే రెండు గ్రూప్‌లలో కేవలం 5 శాతం మంది రోజు అబద్ధాలు చెబుతున్నట్లు అంగీకరించారని తెలిపింది. అలాగే కార్యాలయాల్లో తమ బాస్‌కి రెజ్యుమ్‌లో తప్పుడు సమాచారమే ఇస్తున్నట్లు తేలింది. ప్రతి ఐదు మిలియన్ల మందిలో ఇద్దరూ ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. సోష్ల్ మీడియాలో కూడా ఇదే తంతని, అక్కడ ఈ అబద్ధాల చెప్పే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. వారంతా ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఈ అబద్ధాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అందులో 58 శాతం మంది ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు, ఇక 42 శాతం మంది గోప్యత కోసం, మరో 42 శాతం మంది తాము చులకన అవ్వకుండా ఉండేందుకు, తమ వ్యక్తి గత రక్షణ కోసం చెప్పినట్లు తెలిపారు. చివరిగా సర్వేలో మహిళలతో పోలిస్తే పురుషులే రోజుకు ఒక్కసారైనా అబద్ధం చెప్పకుండా ఉండలేరని , వారు కూడా దీన్ని అంగీకరించారని సర్వే పేర్కొంది. (చదవండి: భార్యను చంపి, ఆమె పుర్రెని యాష్ ట్రేగా..) -
అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!
పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ... నిజంగానే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్డౌన్ కాంపిటీషన్’. పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహుమతి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్. నగదుతోపాటు ఇద్దరికి రెస్టారెంట్లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. యూరప్ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకున్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడటానికి కుటుంబసభ్యులెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు. వంద సంవత్సరాల కిందటి ఓ చెట్టు కింద పోటీ నిర్వహించారు. తొమ్మిది మందితో పోటీ ప్రారంభమైనా.. ఏడుగురు మొదటిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండురోజులు మిగిలిన ఇద్దరి మధ్యే కాంపిటీషన్ జరిగింది. చివరకు జర్కో గెలిచాడు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..:) -
శతక నీతి – సుమతి: అద్దం... అబద్ధం
‘బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా/బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతీ !’ అన్న సుమతీ శతకకారుడి నీతి సూత్రాన్ని చర్చించుకుంటున్నాం... నిజానికి ఏ కాలానికి ఆ కాలంలో పెద్దలు పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఇటువంటి హితోక్తులు చాలా చెబుతుంటారు. వాటిని విని అనుసరించిన వారు విచక్షణతో, వివేకంతో వారి జీవితాలను సుఖమయం చేసుకుంటుంటారు. నందుల చరిత్ర తెలిసే ఉంటుంది. కేవలం పొగరుబోతు తనంతో, అతిశయంతో నిష్కారణంగా వైరం పెట్టుకొని మలయకేతు, పర్వతకుడు, వైరోచకుడు..ఇలా ఎంతో మంది రాజులను అవమానించారు. ఆ క్రమంలోనే అన్నశాలలోకి అన్నం తినడానికి కూర్చొన్న చాణక్యుడిని అవమానకరంగా మాట్లాడారు. ఆయన చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, మహా మేధావి అంటూ అందరూ చెబుతున్నా వినకుండా జుట్టుపట్టి ఈడ్పించారు నందులు. పిలక ఊడిపోయింది.. మిమ్మల్ని పదవీచ్యుతుడిని చేసేదాకా ఈ పిలక ముడి వేయను.. అని అక్కడే శపథం చేసాడు చాణక్యుడు. చంద్రగుప్తుణ్ణి ముందు నిలబెట్టి నందుల చేతిలో అవమానం పొందిన రాజులందరినీ ఏకం చేసిన చాణక్యుడు వ్యూహరచన చేసిన యుద్ధంలో ఇంత గొప్ప నందులు ఏమయిపోయారు. మొత్తం వంశమే మిగలకుండా పోయింది. నందుల మీద అపార ప్రేమ కలిగిన మహా మేధావి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు రాక్షసుడు. చాణక్యుడికి ప్రతిభకు లొంగిపోయి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రగుప్తుడు తన అభిరుచి మేరకు ఒక రాజభవనం కట్టించుకున్నాడు. మొత్తం సిద్ధమయిన తరువాత దానిలో ఉండడానికి చాణక్యుడి అనుమతి కోరాడు. ‘వీల్లేదు’ అని శాసించాడు రాజగురువు. చంద్రగుప్తుడు చిన్నాచితకా రాజేమీ కాదు... అప్పట్లో భారత దేశంలో వైభవంగా వెలిగిన మగధ సామ్రాజ్యాధిపతి. అంత గొప్ప రాజ్యానికి తిరుగులేని మహారాజయి ఉండి తను ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి పోవడానికి అనుమతి అడగడం, దాన్ని చాణక్యుడు తిరస్కరించిన వెంటనే సమ్మతించడం... సాధారణ విషయమేమీ కాదు. వినయం అంటే అదీ. చెప్పినంత సులువు కాదు అలా ఉండడం. మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడే గృహప్రవేశం చేస్తానన్నాడు. చాణక్యుడు కొంతమంది సైనికులను వెంటపెట్టుకుని ఆ మహాసౌధాన్ని అణువణువూ గాలిస్తున్నాడు. ఆంతరంగిక మందిరం వంటి ఒకగది నిండా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉండడం చూసి అనుమానించాడు. పిలిచి అడిగాడు అక్కడివారిని.. అలంకారం కోసం పెట్టామని చెప్పారు. అంతకంటే గొప్ప అలంకారం రావడానికి నేను చిట్కా చెబుతానంటూ వాటిని తొలగించి చిత్తరువులు పెట్టమన్నాడు. అద్దాలు తొలగిస్తుంటే వాటి వెనుక గదులు, వాటిలో సాయుధులైన సైనికులు కనబడ్డారు. వెంటనే తన సైనికులతో వారిని తుదముట్టించాడు. చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు. అద్దాలు గదినిండా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాన్ని భిన్నకోణాలలో చూసుకుంటూ మురిసిపోతూ ఆదమరిచి ఉంటారు. ఆ క్షణాల్లో వెనుకనుంచి చంపేయడానికి రాక్షసుడు అనే మంత్రి చేసిన కుట్ర బట్టబయలయిపోయింది. చంద్రగుప్తుడు మహారాజయినా వినయంతో ప్రవర్తించినందుకు క్షేమంగా బయటపడ్డాడు. వాళ్లెంత, వీళ్ళెంత ...అని గర్వాతిశయంతో ధిక్కరించి నడుచుకొన్నందుకు నంద రాజులలో ఒక్కడంటే ఒక్కడూ మిగలలేదు. వీటిలో నీతిని గ్రహించాలి. మనకంటే గొప్పవాళ్లుంటారనే సత్యాన్ని గ్రహించి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘అది చూపించక్కర్లేదు.. తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాది’
భోపాల్: దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ జిల్లా యంత్రాంగం వ్యాక్సిన్ తీసుకున్న వారికే మద్యం అమ్మాలని నిర్ణయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న ఖాండ్వా జిల్లా యంత్రాంగం కొత్త నిబంధనను విధించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు టీకాలు వేసుకున్న వారికే వైన్స్ షాపుల్లో మద్యం విక్రయించనున్నారు. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "ఖచ్చితంగా వాక్సిన్ సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదు, కేవలం నోటి మాట చెప్తే చాలని, ఎందుకంటే మద్యం తాగే వారు అబద్ధాలు చెప్పరని తెలిపారు. జిల్లాలో ప్రారంభించిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రెండు డోసుల టీకాలు తీసుకోని వారికి మద్యం కూడా అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. "No vaccination proof is required, verbal assurance of being fully vaccinated is enough. Those who drink don’t lie": RP Kirar, Khandwa district excise officer, on recent order restricting the sale of liquor only to those fully vaccinated. pic.twitter.com/Ltzqsy3GUV — NDTV (@ndtv) November 19, 2021 చదవండి: ఇంట్లో మకాం వేసిన కొండచిలువ.. ఇంటి యజమానిని చూసి.. -
అబద్ధం లాంటి నిజం... నిజమైన అబద్ధం
నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా మహారాజా? అంటాడు ‘పాతాళభైరవి’లో తోటరాముడు. ఎందుకలా అడగాలి? నిజమే చెప్పచ్చు కదా? అబద్ధం కూడా ఓ ఆప్షన్ ఎందుకయ్యింది? ఎందుకంటే ఎక్కువ మంది కోరుకునేది అబద్ధం కావచ్చు. లేదా ఎక్కువ మంది చెప్పేవి అబద్ధాలు కావచ్చు. బుజ్జాయిలను ఊరడించడానికి అమ్మలు అందమైన అబద్ధం ఆడతారు. ‘చందమామ రావే...జాబిల్లి రావే.. కొండెక్కి రావే..గోగుపూలు తేవే‘ అని పాడతారు. నిజానికి చందమామ రానూ రాదు... గోగుపూలు తేనూ తేదు. చాలా సందర్భాల్లో అబద్ధాన్ని ప్రమోట్ చేసినంతగా నిజాన్ని ప్రమోట్ చేసినట్లు కనిపించదు. ‘వంద అబద్ధాలు ఆడినా సరే ఓ పెళ్లి చేయాల’న్నారు పెద్దలు. అంటే వైవాహిక జీవితం అలా కొన్ని అబద్ధాలతో మొదలవుతుందన్నమాట. అంతేకాదు ‘అబద్ధం ఆడితే గోడకట్టినట్లు ఉండాలి’ అంటారు. అంటే అబద్ధాన్ని ప్రమోట్ చేయడమేగా? ‘నిజం నిప్పు లాంటిది... దాన్ని దాచాలంటే దాగదు’ అంటారు. అది నిజంగా నిజం కాదు. పచ్చి అబద్ధం. బహుశా నిజం నిప్పులాంటిది అయితే అయి ఉండచ్చు. కాకపోతే అది నిజం చెప్పినవాళ్లనే అది కాల్చేస్తుంది. దానికి ఇటలీకి చెందిన బ్రూనో మరణమే తిరుగులేని నిదర్శనం. 16వ శతాబ్ధంలో పుట్టిన బ్రూనో ఖగోళ శాస్త్రజ్ఞుడు. భూమిని పోలిన గ్రహాలు... వాటి చుట్టూ తిరిగే ఉప గ్రహాలూ చాలా ఉన్నాయని లోకానికి చాటాడు. అంతే... నాటి మతపెద్దలు అది దైవద్రోహం అన్నారు. చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. బ్రూనో ఒప్పుకోలేదు. అంతా కలిసి బ్రూనోని సజీవదహనం చేశారు. బహుశా దీన్ని చూసిన తర్వాతే నిజం నిప్పులాంటిదని ఎవరికైనా తోచి ఉండచ్చు. ‘అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను’ అని మన న్యాయస్థానాల్లో పవిత్ర గ్రంథాల సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉంటారు. అలా ప్రమాణం చేసిన వాళ్లంతా నిజాలే చెబితే కోర్టుల్లో అసలు కేసులే ఉండకూడదు. వాళ్లు ఏం చెబుతున్నారో అందరికీ తెలుసు. కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవతకూ తెలుసు. మహాభారత యుద్ధంలో కౌరవుల ఆర్మీ కమాండర్‌గా ఉన్న ద్రోణాచార్యుడు తిరుగులేని యోధుడు. అతను ఉన్నంత సేపూ కౌరవులను ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికీ తెలుసు. అందుకే ద్రోణాచార్యుని ఓ అబద్ధంతో తప్పించాలని కృష్ణుడు ప్లాన్ చేశాడు. ఎప్పుడూ అబద్ధం ఆడని ధర్మరాజును పిలిచి చెవిలో ఓ ఉపాయం చెప్పాడు. ఆ వెంటనే అంతటి ధర్మరాజూ మరో ఆలోచన లేకుండా ‘అశ్వత్థామ హతః’ అని గట్టిగా అని... టోన్ డౌన్ చేసి ‘కుంజరః’ అన్నాడు. అంటే అబద్ధం ఆడకుండా, నిజం చెప్పకుండా ద్రోణుణ్ణి దెబ్బతీశాడన్నమాట. నిజం దాచిపెట్టడం కూడా అబద్ధమే కాబట్టి ధర్మరాజు ఎలాంటి మొహమాటాలూ లేకుండా అబద్ధం ఆడాడని మహాభారతమే చాటి చెప్పింది. ‘ఏం నిజాలే ఎందుకు చెప్పాలి? అవసరం పడితే అబద్ధం ఆడమని కృష్ణపరమాత్ముడే చెప్పాడు కదా నువ్వు ఆయన కన్నా గొప్పోడివేటి?’ అని ఎవరైనా లాజిక్ లాగితే... ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. సూర్యుడు ఏడు గుర్రాల రథంపై తిరుగుతూ ఉంటాడని నమ్మకం. ఖగోళశాస్త్రంలో పరిశోధనలు మొదలు కానంత వరకు అందరూ అదే నిజం అనుకున్నారు. కానీ గ్రహాల గురించి చదువుకున్నాక.. సూర్యుడు రథంపై తిరగడం లేదని.. ఆ మాటకొస్తే సూర్యుడు సౌర వ్యవస్థ మధ్యలో మఠం వేసుకుని కూర్చుంటే... ఆయన చుట్టూరా భూమి వంటి గ్రహాలు తిరుగుతున్నాయని తేలిన తర్వాత కూడా ఏడు గుర్రాలపై సూర్యుడు తిరుగుతాడని నమ్మేవాళ్లు ఉన్నారంటే... అందమైన అబద్ధం యొక్క గొప్పతనం అది. ఈ నిజాన్ని మొట్టమొదట కనిపెట్టింది కోపర్నికస్. ఆ తర్వాత గెలీలియో మరింత లోతుగా పరిశోధనలు చేసి ‘నాయనలారా... మనం ఇప్పటి వరకు అనుకుంటున్నట్లు సూర్యుడు ఎటూ తిరగడం లేదురా బాబూ. సూర్యుడి చుట్టూరా భూమి తిరుగుతోంటే... మనం ఖాళీగా ఉండడం ఎందుకని చంద్రుడు మన భూమి చుట్టూరా తిరుగుతున్నాడురా నాయనలారా’ అని చెప్పాడు. అంతే... ‘నువ్వు దైవదూషణకు పాల్పడుతున్నావ’ని మతపెద్దలు మండిపడ్డారు. ఎంత బెదిరించినా గెలీలియో తాను చెప్పిందే నిజమన్నాడు. దాంతో పాలకులు గెలీలియోని జీవితాంతం గృహనిర్బంధంలో పెట్టారు. నిజం చెప్పినందుకు దొరికిన బహుమానం అది. నిజాన్ని ప్రమోట్ చేయడానికి సత్యహరిశ్చంద్రుడి జీవితాన్ని చూపిస్తారు. ఎన్ని కష్టాలెదురైనా నిజానికే కట్టుబడి ఉండాలన్న హరిశ్చంద్రుని గొప్పతనాన్ని కొనియాడుతూ అందరూ నిజాలే చెప్పాలని సూచిస్తారు. హరిశ్చంద్రుని జీవితకథను చదివిన వారికి ఏమనిపిస్తుంది? నిజాలు చెబితే జీవితాంతం హరిశ్చంద్రుడిలా ఇలా కష్టాలు అనుభవించాలన్నమాట. దీని బదులు అబద్ధం చెప్పేసి హాయిగా ఉండచ్చు కదా అన్న కొంటె ఆలోచన వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. నిజాలు చెప్పాలి. నిజమే. కానీ కొందరు అబద్ధాలు ఆడేస్తూ... కొందరే నిజాలు చెబితే రెంటి మధ్య ఘర్షణ వస్తుంది. ఎవరో ఎందుకు మహాసాధ్వి సీతమ్మ ఏం చేసింది? ‘అలో లక్ష్మణా’ అంటూ రాముడిలా రాక్షసుడు అరవగానే అంతటి దశరథుని కోడలూ అమాయకంగా నమ్మేసి ‘లక్ష్మణా... మీ అన్న కష్టాల్లో ఉన్నాడు వెళ్లి కాపాడు’ అనేసింది. ‘వదినమ్మా... అది రాముడి గొంతు కాదు ఏదో మాయ’ అన్నా సరే సీతమ్మ వినలేదు. అది అబద్ధమని లక్ష్మణుడికి తెలిసినపుడు సీతమ్మకు ఎందుకు తెలియలేదు? అంటే అబద్ధానికి ఉన్న పవర్ అది అని అర్థం చేసుకోవాలి. ఇటలీకి చెందిన నావికుడు కొలంబస్ అబద్ధంతో జీవితం గడిపేశాడు. రాణి ఇసాబెల్లా, రాజు ఫెర్డినాండ్ల ఆర్థికసాయంతో నావికా యాత్ర చేసిన కొలంబస్ అమెరికా తీరాన్ని చూసి భారత్ అనుకున్నాడు. తాను భారత్‌ను కనుగొన్నానని రాణిని నమ్మించాడు. అయితే అది భారత్ కాదని తర్వాత తేలింది. అప్పటికీ కొలంబస్ తాను ఆర్థిక సాయం పొందిన రాణికి నిజం చెప్పలేదు. కొలంబస్ అబద్ధం చెప్పాడని తెలిసిన తర్వాత రాజదంపతులు కొలంబస్ను క్షమించి వదిలేశారు. నిజం చెప్పిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేసే సమాజం... అబద్దం చెప్పిన వాళ్లకు ప్రాణభిక్ష పెట్టి ప్రోత్సహించిందన్నమాట. బహుశా ఇవి చూసిన తర్వాతే తోటరాముడికి ‘నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?’ అన్న డైలమా వచ్చి ఉంటుంది. – సి.ఎన్.ఎస్. యాజులు -
కొత్త కూరగాయ: కేజీ రూ.లక్ష.. అంతా తూచ్ అట!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వచ్చకా ఏ వార్తలు నమ్మాలో.. ఏవి నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదో అల్లాటప్పా వాళ్లు చెప్పారంటే అది వేరు.. ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి చెప్పిన విషయం కూడా అబద్ధం అని తెలితే ఇక ఎవరిని నమ్మాలి. ఇదే ప్రశ్న ఎదురవుతుంది ఈ న్యూస్ చూసిన వారికి. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అరుదైన రకానికి చెందిన కూరగాయను సాగు చేస్తున్నాడు.. దాని ధర ఏకంగా కిలో లక్ష రూపాయలు పలుకుతుంది అని ఓ వార్త వచ్చిన సంగతి గుర్తింది కదా. అయితే ఇది శుద్ద అబద్ధం అట. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ‘‘ఔరంగాబాద్‌కు చెందిన రైతు అమ్రేశ్ సింగ్ ‘‘హాప్ షూట్స్’’ అనే కొత్త రకం కూరగాయ పంట సాగు చేస్తున్నాడు. దేశంలో దీని పండిస్తున్న ఏకైక వ్యక్తి ఇతనే. ఈ పంట దేశీయ రైతుల తల రాతను మార్చనుంది. ఎందుకంటే ఈ కూరగాయ కిలో ధర ఏకంగా లక్ష రూపాయల విలువ చేస్తుంది’’ అంటూ మార్చి 31న ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా ఇది తెగ వైరలవుతూ.. వేల కొద్ది రీట్వీట్స్, లైక్స్ పొందింది. ఈ క్రమంలో హిందీ న్యూస్ పేపర్ దైనిక్ జాగరణ్ బృందం శుక్రవారం బిహార్ ఔరంగబాద్ వెళ్లింది. ఈ పంట గురించి స్థానిక ప్రజలను అడగ్గా తాము అలాంటి పంట గురించి ఇంతవరకు వినలేదని.. తమ ప్రాంతంలో అలాంటి కూరగాయను పండిచడం లేదని తెలిపారు. ఇక ఫోన్లో అమ్రేశ్ సింగ్‌ను సంప్రదించగా.. హాప్ షూట్స్‌ని పండిస్తుంది ఔరంగాబాద్‌లో కాదు నలందలో అని తెలిపాడు. కొత్త రకం పంటే కానీ ఇంత భారీ ధర పలుకుతుందనే విషయం మాత్రం అబద్ధం అని తెలిపాడు. తాను గతంలో గోధుమలు, బ్లాక్ రైస్ పండించినట్లు వెల్లడించాడు. చదవండి: కొత్త రకం కూరగాయ.. కేజీ రూ.లక్ష మాత్రమే -
డైరెక్టర్ డాలీతో నితిన్?
‘అ ఆ’ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన నితిన్ తరువాత వరుసగా లై, ఛల్ మోహన్ రంగ సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శతమానం భవతి సినిమాతో సక్సెస్ సాధించిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం... నితిన్ ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. కాటమరాయుడు డైరెక్టర్ డాలీ (కిషోర్ పార్థసాని)తో తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాలీ చెప్పిన కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో నితిన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇదే అన్న ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
అఖిల్‌కు జోడిగా మేఘా
హలో సినిమాతో ఆకట్టుకున్న అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా లై ఫేం మేఘా ఆకాష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్లతో నటించిన అఖిల్ మూడో సినిమాలో మాత్రం ఫాంలో ఉన్న హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి ఎలాగైన కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు అక్కినేని వారసుడు. -
శర్వా కొత్త సినిమాకు క్లాసీ టైటిల్
మహానుభావుడు సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచిన హను.. శర్వా సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పడి పడి లేచె మనసు’ అనే క్లాసీ టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ రోజు మంగళవారం శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. శర్వా సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘మేగా.. కాదు మే..ఘ’
‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్.. త్వరలో ఛల్ మోహన్ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రౌడీఫెలో ఫేం కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ తో ఆకట్టుకున్న ‘ఛల్ మోహన్ రంగ’ యూనిట్ తాజాగా తొలిపాటను రిలీజ్ చేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా పాటగా రూపొందిన ‘గ..ఘ..మేఘ’ పాటను రిలీజ్ చేశారు. రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యమందించారు. తమన్ సంగీత మందిస్తున్న సినిమాలో లై ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. -
ఆర్మీ ఆఫీసర్‌గా యంగ్ హీరో
విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్. 2017లో రెండు ఘనవిజయాలు అందుకున్న ఈ యంగ్ హీరో కొత్త కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మహానుభావుడు సినిమాతో సత్తా చాటిన శర్వ, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లై సినిమాతో నిరాశపరిచిన హను, శర్వానంద్ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. అంతేకాదు సెకండ్ హాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
అవసరమైతే అబద్దాలు చెప్పండి!
సాక్షి, బెంగళూరు : ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. గెలుపే ధ్యేయంగా పార్టీలు పనిచేస్తాయి. అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకు కూడా సిద్ధపడతాయి. ఇందుకు నిదర్శనమే కర్ణాటక బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు అవసరమైతే అబద్దాలు చెప్పండి.. అని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు. కొప్పాల్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వచ్చే ఏడాది ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అందరూ కలుపుకుపోవాలని ఆయన చెప్పారు. -
మేఘాకు మరో ఛాన్స్
ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మేఘా ఆకాష్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా మరో అవకాశం వరించింది. ఈ చెన్నై చిన్నది తొలుత టాలీవుడ్ తెరపై మెరవడం మరో విశేషం. తెలుగులో నితిన్‌తో రొమాన్స్ చేసిన లై చిత్రం ఆ మధ్య విడుదలయింది. కోలీవుడ్‌లో గౌతమ్ మీనన్ దృష్టిలో పడి ధనుష్ సరసన 'ఎన్నైనోకి పాయుం తోటా' చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు ఒరుపక్క కథై, వర్మ చిత్రాలలో నటిస్తోంది. వీటిలో ఒరుపక్క కథై చిత్ర విడుదల హక్కులను నటుడు విజయ్‌సేతుపతి పొంది త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు అధర్వతో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతోంది. దర్శకుడు కన్నన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందట. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటి మేఘా ఆకాష్ విజువల్ కమ్యునికేషన్ చదివే విద్యార్ధినిగా నటించనుందనీ, ఈ పాత్రకు తనే కరెక్ట్‌గా ఉంటుందని ఎంపిక చేసినట్లు వివరించారు. మొత్తం మీద ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే నాలుగు చిత్రాల అవకాశాలను అందుకుంది మేఘా ఆకాష్. -
ఫ్లాప్ దర్శకులకు ఓకె చెప్తున్నాడు..!
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్న స్టార్ శర్వానంద్. ఇప్పటికే వరుస విజయాలతో సత్తా చాటిన శర్వా ఇటీవల మారుతి దర్శకత్వంలో మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. దర్శకుడిగా ప్రకాష్ ఇంతవరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా సాధించలేదు. సుధీర్ వర్మ కూడా తాజా చిత్రం కేశవతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరో ఫ్లాప్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడు శర్వానంద్. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయనున్నాడు. అందాల రాక్షసి తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సక్సెస్ సాధించిన హను తరువాత లై సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. ఇలా వరుసగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు : నితిన్
‘‘అఆ’ తర్వాత కొత్తగా చేయాలనుకున్నప్పుడు హను నన్ను కలిసి ‘లై’ లైన్ చెప్పారు. స్టోరీ రెడీ చేయమని చెప్పా. మా ఇద్దరితో పాటు నిర్మాతలు కూడా ఈ కథను నమ్మారు. మా అందరి ఏడాది కష్టమే ‘లై’’ అని హీరో నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా వెంకట్ బోయిన్పల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘లై’ గత శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో థ్యాంక్స్‌మీట్ నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘ఆగస్ట్ 11న విడుదలైన మూడు సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విడుదలకు ముందు రోజు టెన్షన్‌తో నాకు నిద్ర పట్టలేదు. ముందు యూఎస్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇండియాలో తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా, ఇప్పుడు 85 శాతం మంది బావుందంటున్నారు. కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘నితిన్‌కి ‘లై’ లైన్ చెప్పగానే ఒప్పుకోవడం నాకెంతో హ్యాపీగా అనిపించింది. 14 రీల్స్ బ్యానర్లో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా చేయడంతో నిర్మాతలు ‘లై’కు నాకు మరింత స్వేచ్ఛనిచ్చారు. 150 సినిమాలు చేసిన అర్జున్‌గారు విలన్‌గా చేయడంతో ఈ సినిమాకి బలం వచ్చింది. గడచిన పదేళ్లల్లో ఇలాంటి సినిమా రాలేదని చెప్పగలను’’ అన్నారు హను రాఘవపూడి. ‘‘హీరోగా చేస్తున్న నన్ను విలన్‌గా చూపెట్టిన అందాల రాక్షసుడు హను. తనను రాక్షసుడని ఎందుకు అన్నానంటే.. పని పట్ల అంత డెడికేటెడ్‌గా ఉంటాడు. నితిన్ 102 డిగ్రీల జ్వరంతో ఉన్నా యాక్షన్ సీన్స్‌లో నటించాడు’’ అన్నారు అర్జున్. -
తిరుమలలో 'లై' చిత్ర యూనిట్
-
'లై' రిలీజ్‌కు ముందే ఫుల్ జోష్
నితిన్ హీరోగా లై సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తన సినిమా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న హను, సినిమా రిలీజ్ కు ముందే లైఫ్ టైం గిఫ్ట్ అందుకున్నాడు. హను రాఘవపూడి భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా సక్సెస్ తరువాత గత ఏడాది ఆగస్టు 26న అమూల్యను వివాహం చేసుకున్నారు. తన కెరీర్ లో తొలి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో తండ్రయ్యాడు హను రాఘవపూడి. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాలో మెగా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు అర్జున్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది. -
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
-
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
'నా పేరు ఏ. సత్యం. అంటే వాడుకభాషలో అసత్యం. పొట్టకొసినా, భగవద్గీత మీద ఒట్టు వేసినా అబద్ధమే చెప్తాను. నిజం చచ్చినా చెప్పను' అంటున్నాడు నితిన్. ఆయన నటించిన తాజా చిత్రం 'లై'.. అంటే అబద్ధం. అబద్ధాలు చుట్టూ ఈ సినిమా అల్లుకున్నట్టు సినిమా ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు. ఎందుకంటే.. 'మనం అబద్ధాలే మాట్లాడుకుందాం. అర్థమైందా?' అని హీరోయిన్ అంటే.. 'నువ్వు పెద్ద బాగోవు.. బాగా యావరేజ్' అని హీరో బదులిస్తాడు.. ఇక 'అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్ టైమ్ తెలిసింది' అని హీరోయిన్ సిగ్గులొలికితే.. 'అసలు అమ్మాయిలు పడేదే అబద్ధానికి.. పాపం అమాయకులు..' అంటూ హీరో హస్కీ వాయిస్‌లో చెప్తాడు. మొత్తానికి ఈ అబద్ధాల కథేంటో తెలుసుకోవాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’... వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. -
ఈ సారి పవన్ కాదు.. మహేష్..?
యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. సినిమా ఫంక్షన్స్ లో తన అభిమానాన్ని చాలా సార్లు బహిరంగంగానే చాటుకున్నాడు నితిన్. పవన్ కు కూడా నితిన్ అంటే చాలా అభిమానం. తన ఫ్యామిలీ హీరోల ఫంక్షన్లకు మిస్ అయ్యి నితిన్ సినిమాల వేడుకల్లో మాత్రం తరుచూ కనిపిస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం నితిన్ రూట్ మార్చాడు. నితిన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం లై ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హజరుకానున్నాడట. లై సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో ఉన్న అనుబంధం కారణంగా మహేష్ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం మహేష్ స్పైడర్ తో పాటు కొరటాల శివ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే మహేష్ ఫ్రీ టైం చూసుకొని ప్రీ రిలీజ్ డేట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు లై యూనిట్. -
నితిన్ 'లై' టీజర్
-
నితిన్ 'లై' టీజర్ వచ్చేసింది
నితిన్, మేఘా ఆకాశ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం 'లై'- లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటీ అనేది ఉప శీర్షిక. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. అర్జున్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 'కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామ హతః కుంజరః' అంటూ సాగిన టీజర్‌లోని డైలాగ్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ను కల్పిస్తున్నాయి. సినిమాలో అర్జున్ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. యాక్షన్ సినిమాలకు అర్జున్ పెట్టింది పేరు. అలాంటిది యాక్షన్ లుక్‌లో కనిపిస్తున్న లై సినిమాలో ఆయన ఉండటం ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. వచ్చే నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
'లై' స్టిల్స్
-
'లై' టీజర్ వచ్చేస్తోంది
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్, ఆ రేంజ్ కాపాడుకునేందుకు కష్టపడుతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందాల రాక్షసీ, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో లై సినిమాలో నటిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ హీరో అర్జున్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. ఈ సోమవారం హీరో విలన్ల మధ్య వచ్చే ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మంగళవారం లై ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. -
ఆ రోజు బిగ్ ఫైట్ తప్పదా..?
ప్రస్తుతం సినీ రంగంలోని అందరి దృష్టి ఆగస్టు 11 మీదే ఉంది. లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది స్టార్లు ఆగస్టు 11న తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కెరీర్లో కీలకమైన సినిమాలతో బరిలో దిగుతున్న నలుగురు హీరోలు ఒకేసారి బరిలో దిగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తే అందరికి నష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న జయ జానకి నాయక సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తేజ, రానాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోల కెరీర్‌కు చాలా కీలకం దీంతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో మంచి ఫాంలో ఉన్న నితిన్ 'లై' సినిమాను ఆగస్టు 11నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అ..ఆ.. తో 50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ లైతో ఆ ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ప్రేమమ్, రారంబోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస హిట్స్ అందుకున్ననాగచైతన్య కూడా యుద్ధం శరణం అంటూ అదే రోజు బరిలో దిగుతున్నాడు. మరి ఈ నలుగురు యువ కథానాయకుల్లో సక్సెస్ ఎవరి వరిస్తుందో చూడాలి. -
లై ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్..!
అ..ఆ.. లాంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ హీరో నితిన్ చేస్తున్న తాజా చిత్రం 'లై'. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని వివిధ లోకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అదే సమయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టారు చిత్రయూనిట్. అందుకే చికాగో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం అఫీషియల్‌గా రిలీజ్ కానున్న బొంబాత్ అనే పాట.., రేపు(సోమవారం) ఉదయం 9.30కు ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తొలిసారిగా యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు. -
'లై' బ్యూటీతో మరోసారి..!
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'లై' సినిమాలో నటిస్తున్నాడు. హాను రాఘవపూడి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్.., నితిన్‌కు జోడిగా నటిస్తోంది. దాదాపు రెండు నెలలుగా అమెరికాలోని వివిధ లోకేషన్లలో ఈసినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమా పూర్తి కానుండటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు నితిన్. ఈ సినిమాను రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లు నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో కూడా నితిన్‌కు జోడిగా లై ఫేం మేఘా ఆకాష్‌నే తీసుకోవాలని నిర్ణయించారట. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలకు అంగకీరిస్తోంది. -
వెయ్యి విమానాల మధ్య యాక్షన్ సీన్స్
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన యంగ్ హీరో నితిన్.. నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ షెడ్యూల్ మొత్తం ఫైట్స్ సీక్వన్స్ మాత్రమే షూట్ చేశారు. ప్రస్తుతం కాలీఫోర్నియాలోని మిడెస్ట్ లో క్లైమాక్స్‌కు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్, నితిన్‌ల కాంబినేషన్లో వెయ్యి విమానాల మధ్య క్లైమాక్స్‌ను షూట్ చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో లై సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ లోకి మారిపోయినా నితిన్ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అ..ఆ.. సినిమాతో ఓవర్సీస్లోనూ సత్తా చాటిన నితిన్ ఈ సినిమాతో యాక్షన్ హీరోగానూ ప్రూవ్ చేసుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
నితిన్ లేటెస్ట్ స్టిల్స్ సూపర్
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నితిన్' ఒకరు. ‘అ..ఆ' సినిమా విజయవంతం అనంతరం నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హనురాఘవపూడి దర్శకత్వంలో 'లై' పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్నారు. గతంలో హను రాఘవపూడి 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో 'నితిన్' సరసన 'మేఘ ఆకాష్' హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ కు ఇది 24వ సినిమా. చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను ఎయిర్‌పోర్టులో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో విమానాల మధ్యలో నితిన్ చేతికి కట్టుతో రక్తం కారుతున్నట్లు ఉంది. 'నితిన్' ఇమేజ్‌కి సరిపోయేలా తన స్టైల్లో హను రాఘవపూడి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. -
అన్నమయ్య పాటతో నాని..?
డబుల్ హ్యాట్రిక్ సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. ఇటీవల నేనులోకల్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. రెండు సినిమాలు చేతిలో ఉండగానే మరో సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. తనకు కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం నితిన్‌తో లై సినిమాను తెరకెక్కిస్తున్న హను, ఆ సినిమా పూర్తయిన తరువాత నాని సినిమా పనులు ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు ఓ క్లాసీ టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య పాటలోని 'అదిగో..అల్లదిగో..' అనే పదాలు టైటిల్‌గా ఫిక్స్ చేశారట. ప్రస్తుతానికి యూనిట్ సభ్యుల నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా నాని ఇమేజ్‌కి ఈ టైటిల్ కరెక్ట్‌గా సూట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
నితిన్ సినిమాలో హాలీవుడ్ స్టార్
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్ తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో లై అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీగా గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లోకి మారిపోయాడు నితిన్. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి నితిన్ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ సినిమాలో ఒలంపస్ హాజ్ ఫాలెన్, ది ఈక్వలైజర్, వార్ డాగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఆకట్టుకున్న డాన్ బిల్జరియాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో నితిన్, బిల్జరియాన్ల కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు నితిన్. మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. Thanks @DanBilzerian for being such a sport n for being part of our film..u r a total natural!! 😎#LIEthemovie pic.twitter.com/lkBOEOZ7Eh — nithiin (@actor_nithiin) 18 April 2017 -
అబద్ధం చెపుతున్న నితిన్
అ..ఆ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త మేకోవర్ తో ఈ సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ లను క్రైం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించే హను రాఘవపూడి నితిన్ కోసం కూడా అదే తరహా కథను రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సూపర్ హిట్ తరువాత హను దర్శకత్వంలో తెరకెక్కుతున్న కావటంతో నితిన్ కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేస్తూ నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గడ్డంతో నితిన్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు 'లై' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. LIE అనే అక్షరాలకు విడివిడిగా లవ్, ఇంటలిజెన్స్, ఎన్‌మిటి అనే ట్యాగ్ తో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ భారీగా నిర్మిస్తోంది. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ హీరో అర్జున్ నెగెటివ్ రోల్ లో నటిస్తున్నాడు. -
పవన్, నితిన్, త్రివిక్రమ్‌ల 'లై'
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం ఈ లవర్ బాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా కథనాలు అందిస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపించేలా 'లై' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇంగ్లీష్‌లో LIE అనే రాసే ఈ టైటిల్‌కు 'లవ్ ఈజ్ ఎండ్ లెస్' అనే ట్యాగ్ లైన్‌ను జోడిస్తున్నారు. నితిన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నితిన్ మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి. -
ఉప్పు కొరత లేదు..!
* ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు * నిల్వ చేసి కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు * వ్యాపారులకు జేసీ వెంకటేశ్వరరావు హెచ్చరిక గుంటూరు ఎడ్యుకేషన్ : ఉప్పు నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు వ్యాపారులను హెచ్చరించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో ఆదివారం ఉప్పు హోల్‌సేల్ విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ మార్కెట్లో ఉప్పు కొరత లేదని, ఉప్పు నిల్వలు తగినంత లేవనే ఆదుర్దాతో అధిక ధరలకు ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోల్‌సేల్ డీలర్లు తగినంత ఉప్పు బస్తాల నిల్వలు సిద్ధంగా ఉంచుకుని కొరత లేకుండా చూడాలని సూచించారు. లూజు ఉప్పుతో పాటు కంపెనీ ప్యాకెట్లపై ముద్రిత ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వదంతులు నమ్మొద్దు... కిలో కల్లు ఉప్పు లూజు రూ. 4, ప్యాకెట్ రూపంలో అయితే కిలోకు రూ. 5.80, అయోడైజ్డ్ ఉప్పు వివిధ కంపెనీల వారీగా రూ. 12 మొదలు రూ. 18 వరకూ ఎంఆర్పీ ప్రకారం విక్రయించాలని ఉందని, దీనికి విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంతో పాటు రాష్ట్రంలోని ఉత్పత్తిదారుల దగ్గర ఉప్పు కొరత లేదని, ఉప్పు కొరత పేరుతో వస్తున్న వదంతులను ప్రజలెవ్వరూ నమ్మవద్దని సూచించారు. ఉప్పు కొరత ఏర్పడిందని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఓ దినపత్రికలో (సాక్షి కాదు) వచ్చిన వార్తను ఆయన ఖండించారు. హోల్‌సేల్ దుకాణాల్లో 20 టన్నుల చొప్పున ఉప్పు స్టాక్ ఉంచుకోవాలని, కిరాణా దుకాణాలు, సూపర్ బజార్లలో యథావిధిగా ఉప్పు విక్రయాలు జరపాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఇ. చిట్టిబాబు మాట్లాడుతూ కొరత పేరుతో ఉప్పు అక్రమ నిల్వ చేసిన మూడు దుకాణాలపై శనివారం సాయంత్రం దాడులు చేసి సరుకు సీజ్ చేసినట్లు చెప్పారు. అధిక ధరకు విక్రయిస్తే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ఉప్పు నిల్వ లేకపోవడంపై సీరియస్.. గుంటూరులోని హోల్‌సేల్ డీలర్ల వద్ద ఉప్పు నిల్వ లేకపోవడంపై జేసీ సీరియస్ అయ్యారు. సమీక్షలో భాగంగా వ్యాపారుల దగ్గర నిల్వల వివరాలు నమోదు చేస్తున్న సమయంలో ఏడుగురు డీలర్లు తమ దగ్గర ఉప్పు స్టాక్ లేదంటూ చెప్పడంతో ఆగ్రహించారు. సోమవారానికి స్టాక్ తెప్పించి మార్కెట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
నిజాలు దేవుడికెరుక: ఏది నిజం? అబద్ధం?
నిజాన్ని ఎంతోకాలం దాచలేం. అబద్ధాన్ని నిజమని ఎక్కువకాలం నమ్మించనూలేం. కానీ జెన్నిఫర్ జాక్సన్ హత్య విషయంలో బయటకు రాకుండా ఎన్నో నిజాలు దాగివున్నాయి. ఎన్నో అబద్ధాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ జెన్నిఫర్ జాక్సన్? ఆమెను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? సంవత్సరం క్రితం జెన్నిఫర్ భర్త నజ్మీని కూడా ఎవరో చంపేశారు. అతడికి డ్రగ్స్, అమ్మాయిల ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉండటంతో వాళ్లే చంపేశారని అనుకున్నారంతా. ఇప్పుడు జెన్నిఫర్‌ని కూడా వాళ్లే చంపేశారేమోనని అనుమానం వచ్చింది. కానీ జెన్నీకి అలాంటి వాళ్లెవరితోనూ సంబంధాలు లేవని, ఆమె చాలా గౌరవమైన జీవితం జీవిస్తోందని పరిశోధనలో తేలింది. జూన్ 5, 2005. షెల్బీ కౌంటీ (అమెరికా) ఉదయం అయిదున్నర దాటుతోంది. మెంఫిస్ ప్రాంతంలోని ఆ ఇంట్లో అప్పటికే హడావుడి మొదలైంది. పిల్లలతో కలిసి పిక్నిక్కి వెళ్లాలని ప్లాన్ చేసుకోవడంతో యజమానురాలు శారా ఐదు గంటలకే లేచి ఏర్పాట్లు మొదలెట్టింది. భర్త జాయ్ ఆమెకు సహకరిస్తున్నాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ‘‘ఇంత పొద్దునే ఎవరొచ్చారు జాయ్, వెళ్లి చూడు’’ అంది శారా. ప్యాక్ చేస్తోన్న శాండ్విచెస్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లాడు జాయ్. తలుపు తీయగానే ఎదురుగా కనబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నోరా... నువ్వేంటి ఈ టైమ్‌లో... ఏమయ్యింది’’ అన్నాడు ఆతృతగా. నోరా కళ్లలో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘అంకుల్... ఓసారి నాతో వస్తారా?’’ అంది నోరా వణుకుతున్న కంఠంతో. ‘‘ఏమయ్యింది నోరా?’’ ‘‘నేనిప్పుడే ఇంటికొచ్చానంకుల్. ఎంతసేపు కొట్టినా అమ్మ తలుపు తీయట్లేదు. భయంగా ఉంది.’’ ‘‘అవునా... పద చూద్దాం’’ అంటూ నోరాతో కలిసి రోడ్డుకు అవతల ఉన్న ఇంటివైపు నడిచాడు. ఇద్దరూ తలుపులు బాదారు. కానీ తలుపు తెరచు కోలేదు. ‘‘లాభం లేదు... తలుపు పగులగొడదాం’’ అన్నాడు జాయ్. ఇద్దరూ కలిసి తలుపులు పగులగొట్టారు. వెంటనే తల్లి గదిలోకి పరుగుదీసింది నోరా. మరుక్షణం కెవ్వున అరిచింది. జాయ్ గబగబా వెళ్లాడు. అక్కడ... బెడ్రూమ్లో... మంచం పక్కన... రక్తపు మడుగులో పడివుంది జెన్నిఫర్ జాక్సన్. అసలు ఆమె ఒంట్లో ఒక్కచుక్క రక్తమైనా మిగిలివుందా లేదా అన్నంతగా రక్తం ధారలు కట్టింది. పెదవులు చితికిపోయాయి. పొట్ట చీలిపోయి పేగులు బయటకు వచ్చేశాయి. ఒళ్లంతా తూట్లు పడిపోయి భయానకంగా ఉంది. ‘‘మమ్మీ’’ అంటూ భోరుమంది నోరా. జాయ్ నోరాని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘నో మై చైల్డ్... భయపడకు. ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం’’ అన్నాడు. అంత దుఃఖాన్నీ నియంత్రించుకుని నంబర్ డయల్ చేసింది నోరా. బాండ్ ట్రేడర్ అయిన జెన్నిఫర్ జాక్సన్ (39) గురించి ఎవరినడిగినా చెబుతారు. వ్యాపారం ఎంత కచ్చితంగా చేస్తుందో... వ్యక్తిత్వపరంగా అంత నిక్కచ్చిగా ఉంటుందంటూ సర్టిఫికెట్ ఇస్తారు. అలాంటి మంచి మనిషిని యాభైసార్లు పొడిచి చంపేంత పగ ఎవరికి ఉంటుందో అర్థం కాలేదెవరికీ. పోలీసులు ఇల్లంతా సోదా చేశారు. జెన్నిఫర్ బెడ్రూమ్ కిటికీ పగులగొట్టి ఉంది. హంతకుడు దానిగుండానే రాక పోకలు సాగించి ఉంటాడని అంచనా వేశారు. అయితే దాని మీద వేలిముద్రలేవీ దొరక్కపోవడం విస్మయపరిచింది. సంవత్సరం క్రితం జెన్నిఫర్ భర్త నజ్మీని కూడా ఎవరో చంపేశారు. అతడికి డ్రగ్స్, అమ్మాయిల ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉండటంతో వాళ్లే చంపేశారని అనుకున్నారంతా. ఇప్పుడు జెన్నీని కూడా వాళ్లే చంపేశారేమోనని అనుమానం వచ్చింది. కానీ జెన్నీకి అలాంటి వాళ్లెవరితోనూ సంబంధాలు లేవని, గౌరవమైన జీవితం జీవిస్తోందని పరిశోధనలో తేలింది. దాంతో ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో అర్థం కాలేదు పోలీసులకి. వారు మౌనంగా ఉండటం నోరాకి కోపం తెప్పించింది. ‘‘ఏంటి సర్ ఇది? మా అమ్మని దారుణంగా చంపేశారు. మీరేమో... వాళ్లని పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారు.’’ నోరా మాటకి ఒళ్లు మండింది ఇన్స్పెక్టర్ డేవిడ్‌కి. ఆవేశంగా ఏదో అనబోయాడు. కానీ అధికారి లివింగ్స్టన్ ఆపడంతో గమ్మునుండిపోయాడు. ‘‘మిస్ నోరా... మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎవరిని అడిగినా మీ అమ్మగారికి శత్రువులు లేరని చెబుతున్నారు. అనుమానాస్పదమైన వ్యక్తులెవరూ మీ అమ్మగారి జీవితంలో లేకపోవడం వల్ల కేసు కదలడం లేదు’’ అన్నాడు లివింగ్స్టన్ అనునయంగా. శాంతించింది నోరా. ‘‘ఒక్కసారి పాస్టర్ ఇర్విన్‌తో మాట్లాడండి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో’’ అంది. ‘‘అతడెవరు?’’ ‘‘అమ్మ అతడిని ప్రేమించింది. కానీ కొద్దిరోజుల క్రితం ఏదో తేడా వచ్చి దూరమైపోయింది. అది మనసులో పెట్టుకుని అతడేమైనా...’’ ఆమె ఏం చెబుతోందో అర్థమైంది లివింగ్‌స్టన్‌కి. వెంటనే తన టీమ్‌తో పాస్టర్ మార్క్ ఇర్విన్ ఇంటికి బయలుదేరాడు. ‘‘వాట్ నాన్సెన్స్... నేను జెన్నీని చంపడమేంటి?’’ సూటిగా అన్నాడు ఇర్విన్. ‘‘అంటే మీకు జెన్నిఫర్ మీద కోపం లేదా’’... ఇర్విన్‌ని నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ అన్నాడు లివింగ్స్టన్. ‘‘లేదు, ఉండదు కూడా. మేమిద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేసినమాట నిజమే. కానీ ఏవో పొరపొచ్చాలు వచ్చాయి. దూరంగా ఉందామనుకున్నాం... ఉంటున్నాం. ఇంత మాత్రానికే ఆమెని నేను చంపేశాననడం హాస్యాస్పదంగా ఉంది. నాకే కాదు... జెన్నీని చంపాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు... నోరాకి తప్ప.’’ ఉలిక్కిపడ్డాడు లివింగ్స్టన్. ‘‘ఏం మాట్లాడుతున్నారు?’’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘నోరా చంపిందని అనడం లేదు. కానీ ఈ లోకంలో జెన్నీకి అతి పెద్ద శత్రువు నోరాయే. హత్య జరిగిన ప్రదేశంలో నోరా వేలిముద్రలు గానీ, పాదముద్రలు గానీ, ఆమెకు సంబంధించిన ఎటువంటి ఆధారం గానీ లభించలేదు. పైగా జెన్నీ చేతిలో ఎవరివో వెంట్రుకలు దొరికాయి. డీఎన్ఏ పరీక్ష చేస్తే అవి నోరావి కాదని తేలింది. అంటే చనిపోకముందు జెన్నీ ఎవరితోనో పెనుగులాడింది. అతడి తల వెంట్రుకలు ఆమె చేతిలో చిక్కుకున్నాయి. మరి అతడెవరో తెలుసుకోవాలి కదా! అది మానేసి నోరాని నిందితురాలిని చేయడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ దానికి స్పందించడం లేదు. ఇరవయ్యేళ్ల వయసులో నోరాకి జన్మనిచ్చింది జెన్నీ. తర్వాత కొద్ది కాలానికే భర్తతో విడిపోయింది. కూతుర్ని కష్టపడి పెంచింది. కానీ ఆమె కష్టాన్ని నోరా అర్థం చేసుకోలేదు. డ్రగ్స్ అడిక్ట్ అయ్యింది. తిరుగుళ్లకు అలవాటు పడింది. తన కోసం జెన్నీ ఎంత ఆవేదన చెందేదో నాకు తెలుసు.’’ ‘‘అంత మాత్రాన తల్లిని చంపేస్తుందంటారా?’’ ‘‘చెప్పానుగా... నోరా చంపిందని నేను అనడం లేదని. తను తప్ప జెన్నీని బాధపెట్టేవాళ్లు ఎవరూ లేరని చెబుతున్నాను అంతే.’’ కేసును ముందుకు నడిపించడానికి పెద్ద ఆధారమే దొరికింది లివింగ్‌స్టన్‌కి. ‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా... ఏం మాట్లాడుతున్నారు?’’... అరిచినట్టే అంది నోరా. లివింగ్స్టన్ నవ్వాడు. ‘‘పిచ్చి పట్టలేదు... నిజం తెలిసింది. ఆ రోజు ఉదయం ఐదు గంటల వరకూ ఎక్కడికెళ్లావ్?’’ అన్నాడు చాలా కూల్‌గా. ‘‘రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్లాను. లేటయ్యింది. అందుకే తెల్లవారు జామున వచ్చాను.’’ ‘‘అవును. తెల్లవారుజామున ఇంటికొచ్చావ్. అయితే ఐదు గంటలకి కాదు. నాలుగింటికే. మీ అమ్మని చంపేశావ్. ఎవరికీ అనుమానం రాకుండా లోపల గడియ పెట్టి, కిటికీ పగులగొట్టి పారిపోయావ్. తర్వాత ఏమీ ఎరగనట్టు ఎదురింటాయన దగ్గరకు వెళ్లి సాయమడిగావ్.’’ ‘‘నో నో నో’’... స్టేషన్ అదిరిపోయేలా అరిచింది నోరా. ‘‘అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. మీ అమ్మని నువ్వే చంపావ్. అప్పుడు నీ చేతిమీద కత్తిగాటు కూడా పడింది. నాలుగున్నర ప్రాంతంలో మీ ఇంటికి దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కొనుకున్నావ్. మీ ఇంటి దగ్గర, డిస్పెన్సరీ దగ్గర ఉన్న సీసీ టీవీ ఫుటేజుల్లో మొత్తం రికార్డయ్యింది.’’ ఏదో చెప్పాలనుకుంది నోరా. కానీ మాట తడబడింది. గొంతు వణికింది. దాంతో నేరం ఆమే చేసిందని నిర్ధారణ అయ్యింది. సెప్టెంబర్ 29, 2005న నోరా అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ వేగంగా జరిగిపోయింది. నోరా డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యిందని, దాని గురించి తల్లీకూతుళ్లకు ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేదని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు. నోరా చెడు తిరుగుళ్లతో జెన్నీ విసిగిపోయిందని, పద్ధతి మార్చుకోకపోతే వెళ్లి ఎక్కడైనా హాస్టల్లో ఉండమని నోరాకి జెన్నీ చెప్పేసిందని, ఆ కోపంతోనే తల్లిని చంపి ఉంటుందని జెన్నిఫర్ తల్లి చెప్పింది. జెన్నీకి ఏదైనా అయితే తనకు ఎంత ఆస్తి వస్తుందని నోరా అడిగిందని జెన్నిఫర్ సోదరుడు సాక్ష్యం చెప్పాడు. దాంతో నోరాయే జెన్నిఫర్‌ని చంపిందని కోర్టు నమ్మింది. ఇరవయ్యేళ్ల జైలుశిక్ష విధించింది. బెయిల్‌కు అప్లై చేయడానికి వీల్లేదంటూ కండిషన్ కూడా పెట్టింది. ప్రస్తుతం నోరా జైల్లో ఉంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన ఆమె... ఇనుప ఊచల వెనుక ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. జీవితం నేర్పిన పాఠాన్ని జైలు గోడల మధ్య చదువుకుంటోంది. కానీ ఇప్పటికీ ఆమె తాను నిర్దోషిననే అంటోంది. ఆమే కాదు... నోరా నేరస్తురాలు కాదు అనేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఏ ఆధారం దొరకనందుకు నోరాని నేరస్తురాలిని చేశారని కొందరు అంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో జెన్నీ మాత్రమే చెప్పగలదు. కానీ ఆమె తిరిగిరాదు. మరి నిజం ఎలా తెలుస్తుంది? నోరా నేరం చేసిందో లేదో ఎలా తేలుతుంది? ఆమె నిర్దోషే అయితే ఏ శక్తి ఆమెను కాపాడుతుంది? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి