
‘పడి పడి లేచె మనసు’ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్
మహానుభావుడు సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచిన హను.. శర్వా సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పడి పడి లేచె మనసు’ అనే క్లాసీ టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఈ రోజు మంగళవారం శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. శర్వా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment