![Sharvanand Sudheer varma movie not Shelved - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/9/Sharwanand.jpg.webp?itok=1KObEpAG)
మహానుభావుడు సినిమాతో మరో విజయాన్ని అందుకున్న శర్వానంద్ వరుస సినిమాలతో సదండి చేసేందుకు రెడీ అవుతున్నాడు. మహానుభావుడు సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ వర్మ, హను రాఘవపూడిలతో సినిమాలు చేయనున్నట్టుగా ప్రకటించాడు. మహానుభావుడు పూర్తయిన వెంటనే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన శర్వా.. సుధీర్ వర్మ సినిమాను ఆలస్యం చేశాడు.
దీంతో సుధీర్ దర్శకత్వంలో శర్వా చేయాల్సిన సినిమా ఆగిపోయనట్టుగా ప్రచారం జరుగింది. అయితే ఈ విషయంపై స‍్పందించిన చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం హను సినిమాలో నటిస్తున్న శర్వానంద్, ఒకే సమయంలో రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయటం కుదరని కారణంగానే సుధీర్ వర్మ సినిమా ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన వెంటనే సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment