Mahanubhavudu
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
ఆయన మ్యారేజ్ లైఫ్ బాగుండాలి: హీరోయిన్
మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్ లు అందుకున్న హీరోయిన్ మెహరీన్. ఆమె ఓ పెళ్లికి వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం మహానుభావుడు. ఆ మూవీకి అసోసియేట్ డైరెక్టర్‌గా రాము పనిచేశారు. ఆయన పెళ్లి వేడుకకు హాజరైన ఈ నటి ఆయన వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 'తాను నటించిన మూవీ మహానుభావుడు మూవీకి పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్లలో ఒకరైన రాము వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటూ' నటి మెహరీన్ ట్వీట్ చేశారు. Ramu Garu - One of the finest Associate Director I’ve worked with on one of my best film #Mahanubhavudu Wishing him a very Happy & Prosperous Married Life! 🎉 pic.twitter.com/cxcoLm0eDY — Mehreen Pirzada (@Mehreenpirzada) 28 April 2018 -
ఏప్రిల్ 6 నుంచి శర్వా కొత్త సినిమా
యంగ్ హీరో శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న శర్వా, అదే సమయంలో ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎంటర్టైనర్లు కూడా చేస్తున్నాడు. ఇటీవల మహానుభావుడుగా ఘనవిజయం అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. దీంతో ఈ నెల 6 నుంచి కొత్త సినిమా ప్రారంభించనున్నాడు శర్వానంద్. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయన్నాడు. స్వామి రారా, కేశల లాంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన సుధీర్.. శర్వాను మాఫియా డాన్ పాత్రలో చూపించనున్నాడు. -
శర్వా కొత్త సినిమాకు క్లాసీ టైటిల్
మహానుభావుడు సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచిన హను.. శర్వా సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పడి పడి లేచె మనసు’ అనే క్లాసీ టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ రోజు మంగళవారం శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. శర్వా సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘శర్వా సినిమా ఆగిపోలేదు’
మహానుభావుడు సినిమాతో మరో విజయాన్ని అందుకున్న శర్వానంద్ వరుస సినిమాలతో సదండి చేసేందుకు రెడీ అవుతున్నాడు. మహానుభావుడు సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ వర్మ, హను రాఘవపూడిలతో సినిమాలు చేయనున్నట్టుగా ప్రకటించాడు. మహానుభావుడు పూర్తయిన వెంటనే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన శర్వా.. సుధీర్ వర్మ సినిమాను ఆలస్యం చేశాడు. దీంతో సుధీర్ దర్శకత్వంలో శర్వా చేయాల్సిన సినిమా ఆగిపోయనట్టుగా ప్రచారం జరుగింది. అయితే ఈ విషయంపై స్పందించిన చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం హను సినిమాలో నటిస్తున్న శర్వానంద్, ఒకే సమయంలో రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయటం కుదరని కారణంగానే సుధీర్ వర్మ సినిమా ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన వెంటనే సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది. -
దర్శకత్వ బాటలో మరో సినిమాటోగ్రాఫర్
సినీరంగంలో సాంకేతిక నిపుణులుగా ప్రూవ్ చేసుకున్న చాలా మంది.. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్లుగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నవారు దర్శకులుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సంతోష్ శివన్, తేజ, రసూల్ ఎల్లోర్, గోపాల్ రెడ్డి లాంటి వారు దర్శకులుగానూ సత్తా చాటారు. అదే బాటలో మరో యువ సినిమాటోగ్రాఫర్, దర్శకుడిగా మారబోతున్నాడు. భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు సినిమాలకు సినిమాటోగ్రఫి అందించిన నిజార్ షఫీ, త్వరలో ఓ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. తన తొలి ప్రయత్నానికి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు నిజార్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరెకెక్కనున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. అంజలి, అనీషా ఆంబ్రోస్, శ్రద్ధ శ్రీనాథ్, నందిత శ్వేతలు కీలక పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. -
శర్వా కొత్త సినిమా మొదలవుతోంది..!
కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమా ప్రారంభించనున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న శర్వానంద్, తన కొత్త సినిమాను గురువారం ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. అందాల రాక్షసి సినిమాలతో దర్శకుడిగా పరిచయం అయిన హను, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. తరువాత నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచినా.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ క్లీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శర్వాకు జోడిగా ఫిదా ఫేం సాయి పల్లవి నటించే అవకాశం ఉంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫ్లాప్ దర్శకులకు ఓకె చెప్తున్నాడు..!
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్న స్టార్ శర్వానంద్. ఇప్పటికే వరుస విజయాలతో సత్తా చాటిన శర్వా ఇటీవల మారుతి దర్శకత్వంలో మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. దర్శకుడిగా ప్రకాష్ ఇంతవరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా సాధించలేదు. సుధీర్ వర్మ కూడా తాజా చిత్రం కేశవతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరో ఫ్లాప్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడు శర్వానంద్. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయనున్నాడు. అందాల రాక్షసి తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సక్సెస్ సాధించిన హను తరువాత లై సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. ఇలా వరుసగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
తిరుపతిలో మహానుభావుడి సందడి
హాస్యభరితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా రూపొందించిన మహానుభావుడు చిత్రాన్ని ఆదరిస్తూ విజయాన్ని అందిస్తున్న అభిమానుల ఆదరణ మరువలేనిదని ఆ చిత్రం హీరో శర్వానంద్ అన్నారు. తిరుమలలో జరిగిన తన చెల్లెలు వివాహానికి విచ్చేసిన ఆయన మహానుభావుడు చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్ థియేటర్‌కు మంగళవారం విచ్చేశారు. ఆయనకు థియేటర్ అధినేత పాంట్రివేటి అభిషేక్‌రెడ్డి, అభిమానులు పూలమాలలో ఘనంగా స్వాగతం పలికారు. హీరో శర్వానంద్ అభిమానులతో కలిసి మహానుభావుడు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను నటించిన శతమానంభవతి, రాధ చిత్రాలను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఒకే బ్యానర్‌పై శతమానంభవతి, రాధ, మహానుభావుడు చిత్రాలు రావడం సంతోషకరమన్నారు. తాను నటించిన రాధ, మహానుభావుడు చిత్రాలు పీజీఆర్ థియేటర్లో ప్రదర్శించడంతోపాటు విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. థియేటర్ వద్ద అభిమాన హీరోను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. హీరో శర్వానంద్ సెల్ఫీలుదిగి వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో యూవీ క్రియేషన్ డిస్ట్రిబ్యూటర్ జగదీష్ పాల్గొన్నారు. -
7లో 5 హిట్లు చిన్న విషయం కాదు! – ‘దిల్’ రాజు
‘‘ఆర్య’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్ అయిన వంశీ ఇప్పుడు నాతో సమానంగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నాడు. ఏడు సినిమాల్లో ఐదు సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. ఎంత హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందో నాకు తెలుసు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ సెప్టెంబర్ 29న విడుదలై మంచి హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పన్నెండు, పదమూడేళ్లుగా శర్వానంద్ తెలుసు. హీరో సినిమాను మెయిన్‌గా రన్ చేయాలి. శర్వా ఆ బాధ్యత నిలబెట్టుకుంటున్నాడు. ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో మారుతి కథలు రాసుకుంటుంటాడు. తన సక్సెస్ ఫార్ములా అదే’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నేను ఎంజాయ్ చేస్తూ జరుపుకున్న పుట్టినరోజు ఇది. ‘మహానుభావుడు’ సక్సెస్ రూపంలో ప్రేక్షకులు నాకు గిఫ్ట్ ఇచ్చారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ, ఎస్కేయన్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ చేసినందుకు ఓ నటుడిగా చాలా హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నా. ఇంత మంచి సినిమా నాదని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు శర్వానంద్. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మేఘన రోల్ ఇచ్చినందుకు మారుతిగారికి థ్యాంక్స్’’ అన్నారు మెహరీన్. -
అలా అనుకున్న రోజు దుకాణం కట్టేయాల్సిందే!
‘‘త్రివిక్రమ్‌గారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? శేఖర్ కమ్ములగారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? నేను తీసిన సినిమాను ప్రేక్షకులు చూసి ‘ఇది మారుతి సినిమా’ అన్నప్పుడు హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే... అదే మనకు గుర్తింపు. వంద మంది డైరెక్టర్లలో మనల్ని ప్రేక్షకులు గుర్తించగలిగితే అంతకు మించిన అదృష్టం ఉండదు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’... ఇలా వరుస విజయాలతో ‘క్లీన్ చిట్’ తెచ్చుకున్న మారుతి బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.. ► ఈ బర్త్‌డే స్పెషల్ ‘మహానుభావుడు’ సక్సెస్. ఈ సినిమాతో నా బాధ్యత మరింత పెరిగింది. ఒక మనిషిలో ఉన్న రెండు క్యారెక్టర్ల సంఘర్షణే ఈ సినిమా. ‘‘భలే భలే మగాడివోయ్’లో నానికి మతిమరుపు. ‘మహానుభావుడు’లో శర్వానంద్‌కి ఓసీడీ (అతిశుభ్రత). సినిమాల్లో మీ హీరోలకు ఏదో ఒక డిసార్డర్ పెట్టారు కదా.. రియల్ లైఫ్‌లో మీకేదైనా డిసార్డర్ ఉందా? అనడిగితే– ‘‘లేదు. ఆ రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ రియల్ లైఫ్‌లో నేను చూసినవే. నాకు ఒక్క ఐడియా వస్తే నా సన్నిహితులతో షేర్ చేసుకుంటా. వాళ్లందరూ బాగుందంటే... ప్రేక్షకులకు కూడా బాగుంటుందనిపించి తీస్తా’’ అన్నారు నవ్వుతూ. ► మారుతి అంటే... కొత్త కాన్సెప్ట్‌కు ఎంటర్టైన్మెంట్ జోడించి ఒక మంచి మాట చెబుతాడని నమ్మవచ్చు. కొంతమంది మాఫియా మూవీస్, కొందరు హారర్ మూవీస్ చేస్తారు. నేను నా జోనర్ (ఎంటర్టైన్మెంట్)లోనే వెళ్లాలనుకుంటున్నా. అయితే, వాటిని నెక్ట్స్ లెవల్లో తెరకెక్కించాలని ఉంది. ► నాకు కొత్తా పాతా, చిన్నా పెద్దా అనే తేడాలు లేవు. కథ కుదిరితే ఎవరితోనైనా సినిమా చేస్తాను. ముఖ్యంగా స్టార్స్ అందరితో సినిమాలు చేయాలని ఉంది. సీక్వెల్స్, రీమేక్ మూవీస్ చేయడానికి ఇష్టపడను. ► క్లీన్‌గా సినిమా తీయాలనుకుంటే తీయలేం. స్వతహాగా మనసులో ఉండాలి. నాలో ఒరిజనల్‌గా ఆ డైరెక్టరే ఉన్నాడు. వాడు ఇప్పుడు బయటకు వచ్చాడు... అంతే. ► టెక్నాలజీతో ఇవాళ లైఫ్ చాలా షార్ట్ అయిపోయింది. టీ20 మ్యాచ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు వచ్చిన తర్వాత రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోడానికి ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు. వాళ్లను థియేటర్లో కూర్చోబెట్టగలిగే డైరెక్టర్లే సక్సెస్ అవుతున్నారు ► ప్రేక్షకుడు ఎక్కడో ఉండడు నాలోనే ఉంటాడని అనుకుంటాను. ప్రతి శుక్రవారం ఒక కామన్ ఆడియన్లానే నేను సినిమాలను ఎంజాయ్ చేస్తాను. నచ్చితే... బాగున్నాయని ట్వీట్ చేస్తా. సినిమాను సినిమాలానే చూస్తా. ‘అరే.. ఆ సీన్ బాగా తీశారు. మనం కూడా ఇంత బాగా తీయా’లని ఎగై్జట్ అవుతుంటా. ఆ ఎగై్జట్‌మెంట్ పోయి, మనం తీసిందే సినిమా అనుకున్న రోజు... దుకాణం కట్టేసుకుని, పార్కుల్లో కాలక్షేపం చేసుకోవాలి. ► నాగచైతన్యతో తీయబోయేది టీనేజ్ యంగ్ లవ్‌స్టోరీ మూవీ. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ప్రభాస్, బన్నీగార్లతో సినిమాలు చేయడం ఇష్టం. కథ కుదిరి, వారికి నచ్చితే తప్పకుండా చేస్తాను. ► ప్రొడక్షన్ విషయానికొస్తే... ప్రస్తుతం నిర్మిస్తున్న ‘లండన్‌బాబులు’ను నవంబర్‌లో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత రెండు సినిమాలు మొదలుపెడతాం. ఒక సినిమాకు కథ ఇచ్చాను. ఇంకో సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. -
చూడకపోతే చూడండి... చూస్తే మళ్లీ చూడండి
‘‘వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నా. ‘మహానుభావుడు’ సినిమా ద్వారా వైజాగ్ ప్రజల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమా చూడకపోతే చూడండి.. చూస్తే మళ్లీ చూడండి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ దసరా సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం థ్యాంక్స్ మీట్‌ని వైజాగ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దసరావళి కార్యక్రమంలో థ్యాంక్స్ మీట్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మారుతి, శర్వానంద్ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివాళ్లే. ఈ చిత్రం హిట్ అయినందుకు సో హ్యాపీ’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని మరచిపోయేలా ‘మహానుభావుడు’ చిత్రానికి విజయం అందించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాని అందరూ ఇంకా బాగా ఆదరించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘‘నా రెండో చిత్రం ‘మహానుభావుడు’. మా చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు మెహరీన్. ‘‘మా సినిమా సక్సెస్ ఎనర్జీ మమ్మల్ని వైజాగ్ వచ్చేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్, సహనిర్మాత ఎస్కెఎన్ పాల్గొన్నారు. -
‘మహానుభావుడి’తో ముగింపు
-
వాళ్లను పట్టుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్!
‘‘శర్వానంద్ నటించిన సినిమాకి బాగా డబ్బులు, శర్వానంద్ బాగా చేశాడనే పేరు... రెండూ రావాలి. నేనప్పుడు హ్యాపీగా ఉంటాను’’ అన్నారు శర్వానంద్. ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన సినిమా ‘మహానుభావుడు’. విజయదశమి కానుకగా గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి శర్వానంద్ చెప్పిన సంగతులు... సంక్రాంతికి ‘శతమానం భవతి’, దసరాకు ‘మహానుభావుడు’... ప్రతి పండక్కీ ఓ హిట్ కొడుతున్నారు! బెస్ట్ సంక్రాంతి అండ్ బెస్ట్ దసరా! రిలీజ్ డే మార్నింగ్ షో ఆడియన్స్‌తో కలసి చూశా. వాళ్లంతా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీస్‌తో థియేటర్లకు వస్తున్నారు. మంచి సినిమా చేశామనే ఫీలింగ్ ఉంది. థియేటర్లు కూడా పెరిగాయి. పెద్ద సినిమాలు కూడా పండక్కి విడుదలయ్యాయి. టెన్షన్ పడ్డారా? లేదు. పండక్కి నాలుగు రోజులు సెలవులు ఉన్నప్పుడు ప్రేక్షకులు నాలుగు సినిమాలకు వెళ్లే ఆప్షన్ ఉంది. ఒక్కో రోజు ఒక్కో సినిమాకు వెళతారు. ప్రతి సిన్మాది డిఫరెంట్ జోనర్. ఒకటి మాస్ అయితే... ఇంకొకటి థ్రిల్లర్ ఫిల్మ్. మాది ఎంటర్టైన్మెంట్ మూవీ. మూడూ మూడు జోనర్లు కాబట్టి పెద్ద టెన్షన్ పడలేదు. సినిమాలో చేసిన ఓసీడీ (అతిశుభ్రత) క్యారెక్టర్ ఆనంద్కి, మీకు ఏవైనా పోలికలు ఉన్నాయా? అస్సలు లేవు. నేను టోటల్లీ డిఫరెంట్. అంత నీట్నెస్ ఉంటే చంపేస్తారంతా! మీరు కూడా తట్టుకోలేరు. సినిమాలో హీరోయిన్‌కి ఇచ్చినట్లు ఎవరికైనా శానిటైజర్స్ గిఫ్టులుగా ఇస్తున్నారా? సినిమా తర్వాత మీకేమైనా ఓసీడీ పట్టుకుందా? అంత లేదు! నాలో ఓసీడీ లక్షణాలు లేవు. ఇక, శానిటైజర్స్ గిఫ్టులంటారా? నాకు ప్రభాస్ అన్న ఇవ్వడమే (ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో స్టేజిపై ప్రభాస్ ఇచ్చిన గిఫ్టును గుర్తుచేస్తూ!). నేనెవరికీ ఇవ్వడం లేదు. ప్రభాస్ అన్న ఇంకా సినిమా చూడలేదు. ‘సాహో’ షూటింగ్లో ఉన్నారు. త్వరలో చూస్తారు. ఓసీడీ అనేది చిన్న పాయింట్! దాన్ని సినిమాగా తీయొచ్చని ఎలా అనిపించింది? అంత చిన్న పాయింట్లో ఇంత హ్యూమర్ ఉంటుందనీ, ప్రేక్షకుల్ని నవ్వించొచ్చనీ మారుతి మాత్రమే ఆలోచించగలరు. ఆయనే ఇలాంటి కథ రాయగలరు. కథ చెప్తున్నప్పుడే ఎంజాయ్ చేశా. నా కెరీర్లో... కారెక్టర్, క్యారెక్టరైజేషన్ బేస్డ్ చిత్రమిది. సిన్మాలో ఆనంద్ క్యారెక్టర్ లేకపోతే ఇంకొకటి లేదు. ఓసీడీ ఉన్నోళ్లను ఎవరినైనా కలిశారా? అసలు, ఇటువంటి వ్యక్తులు ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు? మన ఇళ్లల్లో అమ్మో... నాన్నో... ‘క్లీన్‌గా ఉండు, ఈ వస్తువు అక్కడే పెట్టు’ అని చెబుతారు కదా! సో, ఆ సీన్లకు ఎక్కడో చోట కనెక్ట్ అవుతాం. ఓసీడీ అనేది రోగం కాదు, తెలుగులో చెప్పా లంటే చాదస్తం. నా ఫ్రెండ్స్‌లో ఓసీడీ ఉన్నోళ్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ, వాళ్లను అబ్జర్వ్ చేయడం వంటివేం చేయలేదు. ‘ఏదైనా పాత్ర ఇస్తే శర్వానంద్ పరకాయ ప్రవేశం చేస్తారు. మిగతా వాళ్లు పాత్రను తమలో కనిపించేలా చేస్తారు’ అని మారుతి చెప్పారు. మీరేమంటారు? నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు కదా! మారుతి గ్రేట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేనెప్పుడూ దర్శకుడు ఏం చెబితే.. దాన్ని ఫాలో అవుతా. ‘నా స్టైల్ ఇది. శర్వాకి ఓ స్టైల్ ఉండాలి’ అనుకోను. దర్శకులు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నిస్తా. కథ రాసుకునేటప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండాలనేది దర్శకులు ఊహించి రాసుకుంటారు. అందువల్ల, వాళ్లను నేనెంత వరకు శాటిస్ఫై చేయగలననేది చూస్తా. ‘నా స్టైల్‌ని బట్టి కథ రాయండి. డైలాగులు మార్చండి’ అని చెప్పను. ఈ సిన్మాకు మారుతి చెప్పిందాన్ని ఫాలో అయ్యా. అతనిలో నచ్చేది ఏంటంటే... షూటింగ్లో ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజులను బట్టి డైలాగులు రాస్తారు. సీన్ బెటర్మెంట్ చేస్తారు. ఇందులో అలా చేసిన సీన్లు చాలా ఉన్నాయి. అందుకే, నేను క్రెడిట్ అంతా మారుతీకే ఇస్తా. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సిన్మాలు చేయడం మీకు ఈజీ కదా.. మీరలా అనుకుంటున్నారా? నాకు ‘ప్రస్థానం’ వంటివే ఈజీ. కామెడీ చేయడం, టైమింగ్ కుదరడం బాగా కష్టం. కామెడీ సీన్లలో యాక్షన్, డైరెక్షన్ వర్కౌట్ కావాలి. కామెడీయే మోస్ట్ టఫెస్ట్ జాబ్! ‘కాబోయే సూపర్‌స్టార్ మీరే’ అని ప్రభాస్ చెప్పారు. కాంప్లిమెంట్స్‌గా తీసుకుంటున్నారా? లేదా... (మధ్యలోనే అందుకుంటూ...) బ్లెస్సింగ్స్ అంతే! వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. తలకు ఎక్కించు కోకూడదు. ఇండస్ట్రీలో నా ప్లేస్ ఏంటని ఎప్పుడూ ఆలోచించలేదు. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే... పెద్ద స్టార్, యాక్టర్ అవ్వాలని ఉండదు. ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా. ప్రేక్షకుల రెస్పాన్స్ని బట్టి ముందుకెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్... లాస్ట్ టైమ్ ఫార్ములా ఫిల్మ్ ‘రాధ’ వచ్చింది. ‘శర్వాకు ఈ సినిమా అవసరమా?’ అన్నారు ప్రేక్షకులు. అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ‘మనం కొత్త సిన్మాలే చేయాలి’ అనుకున్నా. పాజిటివ్‌గా ఆలోచిస్తా. తర్వాతి సిన్మా సుధీర్‌వర్మ దర్శకత్వంలోనేనా? సుధీర్‌వర్మతో ఓ సిన్మా, ప్రకాశ్ కోవెలమూడి తో మరో సిన్మా తప్పకుండా చేస్తా. ఎవరి సినిమా ఎప్పుడు ఉంటుంది? అనేది త్వరలో ప్రకటిస్తాం. ‘అర్జున్‌రెడ్డి’ మిస్ అయ్యానని ఫీలవుతున్నారా? ‘అర్జున్‌రెడ్డి’ కథ నా దగ్గరికొచ్చినప్పుడు... ముగ్గురు నలుగురు నిర్మాతలకు పంపించా. ఎవరికి వాళ్లు ఇంత కంటే పెద్ద బడ్జెట్‌తో చేద్దా మన్నారు. కానీ, ఈ సినిమా చేయమన్నారు. కొంచెం భయపడ్డారు. వాళ్లంతా, ఇప్పుడు ఫోనులు చేసి ‘అర్రే... మిస్ అయ్యాం శర్వా’ అన్నారు. మళ్లీ మళ్లీ అలాంటి కథలు రావు. మంచి కథ మిస్సయినందుకు... ఐ ఫీల్ బ్యాడ్. బట్, ‘అర్జున్‌రెడ్డి’ చూశాక... ‘ఆ సిన్మాకి విజయ్ దేవరకొండే కరెక్ట్’ అనిపించింది. ‘ఇంకొకడు వచ్చాడ్రా... కొట్టాడ్రా’ అనేలా నటించాడు. విజయ్‌కి ఫోన్ చేసి ఆ మాటే చెప్పాను కూడా! కొత్త దర్శకులు మంచి మంచి కథలతో వస్తున్నారు. వాళ్లను పట్టుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. -
దసరా బరిలో విజేత ఎవరు..?
ఈ దసరా సీజన్ లో తెలుగు తెరపై భారీ పోటి నెలకొంది. ఇద్దరు టాప్ హీరోలు వారం రోజుల గ్యాప్ లో తలపడటంతో థియేటర్లు కలకలలాడాయి. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు కావటంతో ప్రమోషన్, రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతటి భారీ పోటీలో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బరిలో దిగాడు శర్వానంద్. మరి ఈ ముగ్గురిలో దసరా విజేత ఎవరు..? దసరా బరిలో ముందుగా థియేటర్లలోకి వచ్చిన హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సినిమాతో సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోవటం లాంటి చిన్న చిన్న మైనస్ లు కనిపించినా.. లాంగ్ వీకెండ్ కలిసి రావటం వారం పాటు పోటి లేకపోవటంతో భారీ వసూళ్లనే సాధించి సత్తా చాటాడు. ఇప్పటికీ జై లవ కుశ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. పర్ఫెక్ట్ దసరా సీజన్ లో సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 120 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన స్పైడర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ రావటం అభిమానులను నిరాశపరిచింది. కానీ టాక్ ప్రభావం కలెక్షన్ల మీద మాత్రం కనిపించటం లేదు. రెండు భాషల్లో కలిపి ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కు చేరువైన స్పైడర్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దసరా సీజన్ లో చివరగా బరిలో దిగిన హీరో శర్వానంద్. పండుగ సీజన్ లో టాప్ స్టార్లతో పోటి పడి మంచి విజయాలు సాధించిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేలాగే ఉన్నాడు. పండుగకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి వచ్చిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రొటీన్ టేకింగ్ తో తెరకెక్కిన సినిమానే అయినా.. కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు మహానుభావుడు. మరి ఈ ముగ్గురిలో ప్రేక్షకులు ఎవరికి విజయాన్ని అందిస్తారో చూడాలి. -
'మహానుభావుడు' మూవీ రివ్యూ
టైటిల్ : మహానుభావుడు జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్ సంగీతం : తమన్ దర్శకత్వం : మారుతి నిర్మాత : వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ పండుగ సీజన్ లో స్టార్ హీరోల సినిమాలకు పోటిగా బరిలో దిగి ఘనవిజయాలు సాధించిన రికార్డ్ శర్వానంద్ సొంతం. అదే ధైర్యంతో మరోసారి జై లవ కుశ, స్పైడర్ లాంటి సినిమాలు పోటి పడుతున్న దసరా సీజన్ లో మహానుభావుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు శర్వానంద్ ట్రాక్ రికార్డ్ ను కాపాడిందా..? మారుతి ఖాతాలో మరో సక్సెస్ ను అందించిందా..? కథ : ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్ నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు కూడా ఆనంద్ ప్రవర్తనతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు...? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఓసీడీ అనే ఇబ్బందికర వ్యాధితో బాధపడే పాత్రలో శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహరీన్ రీ ఎంట్రీలో ఆకట్టుకుంది. గ్లామర్ షోతో పాటు నటిగానూ మంచి మార్కులు సాధించింది. వెన్నెలకిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సినిమా అంతా హీరో వెంటే ఉండే పాత్రలో నవ్వులు పూయించాడు. హీరోయిన్ తండ్రిగా నాజర్ హుందాగా కనిపించారు. కూతురి ప్రేమను గెలిపించేందుకు తపన పడే తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవటం, ఆ పాత్రలో నటించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్నవారు కాకపొవటంతో పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు.(సాక్షి రివ్యూస్) సాంకేతిక నిపుణులు : భలే భలే మొగాడివోయ్ సినిమాతో ట్రాక్ మార్చి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, ఈ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. హీరో కు ఓ వ్యాధి, ఓ ప్రేమకథ, ఓ సమస్య ఇలా దాదాపు భలే భలే మొగాడివోయ్ కాన్సెప్ట్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే శర్వానంద్ ను ఓసీడీతో ఇబ్బంది పడే వ్యక్తిగా చూపించిన దర్శకుడు కావాల్సినంత వినోదం పంచాడు. కొన్ని సందర్భాలలో అతిగా అనిపించినా.. మంచి కామెడీతో అలరించాడు. కథాపరంగా కొత్తదనం లేకపోయినా.. టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయిన మహానుభావుడవేరా సాంగ్ విజువల్ గా మరింతగా అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) నిజర్ షఫీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, ప్రతీ సన్నివేశం, రిచ్ గా కలర్ ఫుల్ గా కంటికింపుగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : శర్వానంద్ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : కొత్తదనం లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మహానుభావులు
-
శర్వాకీ ఇతర హీరోలకీ తేడా అదే!
ఆనంద్ (శర్వానంద్) సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. క్లీన్‌గా ఉండకపోతే అతనికి నచ్చదు. క్యాప్ లేని పెన్ను చూస్తే తనే వెళ్లి క్యాప్ పెడతాడు. పక్కవాళ్ల బైక్‌కు బురద అంటితే క్లీన్ చేస్తానంటాడు. అంతెందుకు గర్ల్‌ఫ్రెండ్‌కు కిస్ చేయాలనుకున్నా బ్రెష్ చేశావా? అని అడిగే టైప్. హ్యాండ్స్‌కు గ్లౌజ్ వేసుకుంటాడు. అతనెందుకిలా ప్రవర్తిస్తున్నాడంటే అతనికి ఓసీడీ. ఆనంద్కి మేఘన (మెహరీన్) అంటే ఇష్టం. మేఘనకు కూడా ఇష్టమే. హ్యాండ్‌వాష్ చేసుకుంటేగానీ ఏదీ ముట్టని మనోడు ఆ అమ్మాయి చేయిపట్టుకుని ఏడడుగులు ఎలా నడిచాడన్నదే మహానుభావుడైన ఆనంద్ కథ. ‘‘హీరో అంటేనే స్పెషల్. నిజ జీవితంలో మనకన్నా వాళ్లు ఎప్పుడూ స్పెషలే. హీరో క్యారెక్టర్‌కు ఓసీడీ (అతిశుభ్రత) అనగానే, ఇది మలయాళ సినిమాకు రీమేక్ అని ఎలా అంటారు? ‘మహానుభావుడు’ చూశాక నిర్ణయిస్తే బెటర్’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా ఆయన దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ నేడు విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ– ‘‘మనుషుల అలవాట్లు, గుణాల మీద చాలా కథలు రాసుకోవచ్చు. అలాంటి కథల్లో ‘మహానుభావుడు’ ఒకటి. నాలుగేళ్ల క్రితం ఈ కథ అనుకున్నా. అఖిల్‌కి సరిపోతుందని నాగార్జునగారికి చెప్పాను. నాకు చాలా మంది ఓసీడీ లక్షణాలున్నవారు తెలుసు. కొందరు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. మరికొందరు అతి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఆయా లక్షణాలను బట్టి వాళ్లను వర్గీకరించవచ్చు. మిగిలిన హీరోలు ఆ పాత్రలను తమ స్టైల్‌కి తగ్గట్టు మార్చుకుని చేస్తారు. శర్వానంద్ మాత్రం పాత్రలోకి పరకాయప్రవేశం చేసి, చేస్తారు. ఇతర హీరోలకీ శర్వాకి తేడా అదే. ‘బాబు బంగారం’ చిత్రంలో వెంకీ పాత్రను అనుకున్న రీతిలో స్క్రీన్ మీదకు తీసుకురాలేకపోయాను. మిగిలిన విషయాల్లో అందరూ హ్యాపీ’’ అన్నారు. -
నా టైమ్ స్టార్టయ్యింది
‘‘ఏడాదిన్నరగా నా సినిమా రిలీజ్ కాలేదు. అనుకోకుండా స్మాల్ బ్రేక్ వచ్చింది. కానీ, నేను బిజీగానే ఉన్నాను. ఇప్పుడు నా టైమ్ స్టార్టయ్యింది. నేను నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానన్న నమ్మకం ఉంది’’ అన్నారు కథానాయిక మెహరీన్. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్కేఎన్ సహ నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక మోహరీన్ చెప్పిన విశేషాలు... ⇒ వెరీ స్వీట్ మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. విలేజ్ నుంచి వచ్చి ఐటీ కంపెనీలో వర్క్ చేసే మేఘన అనే క్యారెక్టర్లో నటించాను. ఫస్ట్‌హాఫ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో, సెకండాఫ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో చేసిన మహాలక్ష్మీ క్యారెక్టర్‌కి మేఘన క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ⇒ యూవీ క్రియేషన్స్ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో మారుతి గారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మారుతిగారు ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు. ⇒ ఈ సినిమాలో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ తెలుగు మాట్లాడలేకపోయినా బాగా అర్థం చేసుకోగలను. శర్వా, మారుతిగారు నాకు లాంగ్వేజ్ పరంగా బాగా హెల్ప్ చేశారు. సినిమా యూనిట్ ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. ⇒ ఈ మధ్య నేనో సినిమా ఒప్పుకుని, తప్పుకున్నానని కొంతమంది అంటున్నారు. నిజానికి నేను ఏ ప్రాజెక్ట్ నుంచీ తప్పుకోలేదు. అవి కుదర్లేదంతే. కానీ, ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’, ‘జవాన్’, ‘కేరాఫ్ సూర్య’ వంటి గుడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్నాయి. రెండు వారాలకోసారి మీరు హీరోయిన్ మెహరీన్‌ని స్రీన్‌పై చూస్తారు. కానీ, క్యారెక్టర్ పరంగా కొత్త మెహరీన్‌ను చూస్తారని కచ్చితంగా చెప్పగలను. ⇒ ‘మహానుభావుడు’ ఫస్ట్ డే షూట్లో శర్వాను కలిశాను. శర్వాది ఫ్రెండ్లీ నేచర్. చాలా నైస్ అండ్ స్వీట్ పర్సన్. హంబుల్‌గా ఉంటాడు. సెట్లో మేం ఈజీగా స్నేహితులమైపోయాం. ⇒ రవితేజగారు చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. రవితేజగారి దగ్గర రీ–స్టార్ట్ బటన్ ఉంది. ప్రతి సినిమాకు కొత్త నటుడిలా రీఛార్జ్ అవుతారు. ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన కో–స్టార్స్ అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. ⇒ తెలుగు చిత్రపరిశ్రమ నాకు మదర్ లాంటిది. సినిమా ఫేట్‌ను మనం నిర్ణయించలేం. క్యారెక్టర్ పరంగా ది బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వొచ్చు. ప్రతి సినిమాను నా ఫస్ట్ ఫిల్మ్‌లా ఫీలయ్యి చేస్తాను. బాలీవుడ్లో కొత్త అవకాశాలు వస్తే తప్పకుండా చెప్తాను. -
మహానుభావుడు ప్రీ–రిలీజ్ ఫంక్షన్
-
శర్వా మా ఇంటి హీరో – ప్రభాస్
‘శర్వా (శర్వానంద్) మా ఇంటి హీరో. తన యాటిట్యూడ్ సూపర్‌గా ఉంటుంది. భవిష్యత్‌లో శర్వా సూపర్‌స్టార్ అవుతాడు’’ అన్నారు ప్రభాస్. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్కెఎన్ సహనిర్మాత. మెహరీన్ కథానాయిక. తమన్ స్వరకర్త. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘రన్ రాజా రన్’కి హీరోగా ఎవరు బాగుంటారనుకుంటున్నప్పుడు ‘శర్వా యాటిట్యూడ్ సూపర్‌గా ఉంటుంది. తనని తీసుకుందాం’ అని వంశీ అన్నాడు. శర్వా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అదే శర్వాతో అంటే, ‘ట్రై చేస్తా. చూడండి. నచ్చకపోతే చెప్పండి’ అన్నాడు. ఆ యాటిట్యూడ్ మాకు నచ్చింది. శర్వాకు మేమందరం ఫ్యాన్స్ అయిపోయాం. ఆల్రేడీ హీరోగా చేసి, ‘నచ్చితే చూడండి’ అన్నాడు. ఆ రోజు నుంచి నాకు శర్వా బ్రదర్ అయిపోయాడు. మారుతి నిజంగా డాక్టర్. ఒక మనిషిని నవ్వించడం అంత ఈజీ కాదు. ‘ప్రేమక«థా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలకన్నా ‘మహానుభావుడు’ ఇంకా పెద్ద రేంజ్ హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను మహానుభావుడిని అయితే రియల్ లైఫ్‌లో మహానుభావుడు ప్రభాస్ అన్న. తను ఇక్కడికి వచ్చాడని ఇలా అనడంలేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ప్రభాస్ అన్నకు ప్రేమ ఇవ్వడం తప్ప ఇంకేమీ తెలీదు. నా సినిమా ఎప్పుడు రిలీజైనా నాకన్నా ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్నే. నేను ‘రన్ రాజా రన్’ చేసినప్పుడు ‘హిట్ కొట్టాంరా.. ఎంజాయ్ చెయ్’ అన్నాడు. పక్క వ్యక్తి పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రభాస్ ఫస్ట్ ఉంటాడు. మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు తనకు థ్యాంక్స్. మంచి సినిమా ఇచ్చినందుకు మారుతీగారికి థ్యాంక్స్. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రభాస్ వచ్చి ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాకు శర్వానంద్ ప్రాణం పోశారు. శర్వా విశ్వరూపాన్ని థియేటర్లలో చూస్తారు. కొత్త శర్వాన్ని చూడబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’లో నానీ యాక్షన్‌కి ఎంత ఎగై్జట్ అయ్యానో అంతకు డబుల్ ఎగై్జట్‌మెంట్ శర్వా నాకు ఇచ్చారు. నేను రాసుకున్న కథకు అందరూ ప్రాణం పోశారు. ఇలాంటి కాన్సెప్ట్స్ అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎమోషనల్ మూవీ. మంచి సినిమా తీయాడానికి కారణమైన యూవీ క్రియేషన్స్ వారికి రుణపడి ఉంటాను. ప్రభాస్‌గారు వచ్చినందుకు థ్యాంక్స్. ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘నేను ప్రభాస్ ఫ్యాన్‌ని. ఆయన లాంచ్ చేసిన నా లాస్ట్ ఆడియో ‘బృందావనం’. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎంకరేజ్ చేస్తున్నారు. మారుతి వన్నాఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్. నా దగ్గర్నుంచి బాగా వర్క్స్ తీసుకున్నాడు. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహానుభావుడు’ థియేట్రికల్ ట్రైలర్..
-
‘మహానుభావుడు’ థియేట్రికల్ ట్రైలర్..
హైదరాబాద్: శతమానం భవతి విజయంతో హ్యాపీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్ మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం రిలీజ్ అయిన శర్వానంద్ అప్‌కమింగ్ మూవీ మహానుభావుడు అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ఇదే అంచనాలను అభిమానులు వ్యక్తం చేశారు. దసరా బరిలో గట్టి పోటీ ఇస్తుందని, తమన్ సంగీతం కూడా ఈ సినిమాకు మంచి ఎసెట్ కానుందని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బేనర్ పై రూపుదిద్దుకున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ మహానుభావుడు. శర్వానంద్, మెహరీన్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, జబర్దస్త్ వేణు, నాజర్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఓసీడీ అనే డిజార్డర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు దర్శకుడు మారుతి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
మహానుభావుడు కోసం బాహుబలి
యంగ్ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మహానుభావుడు. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో రూట్ మార్చిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దసరా భారీలో జై లవ కుశ, స్పైడర్ చిత్రాల రిలీజ్ సమయంలో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. స్పైడర్ రిలీజ్ అయిన రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 29న ఈ సినిమాను మహానుభావుడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్థాయిలో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడట. మహానుభావుడు సినిమా ప్రభాస్ సన్నిహితులకు సంబంధించిన యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. దీంతో ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఓకె చెప్పాడని తెలుస్తోంది. -
సెయింట్ మేరీలో ‘మహానుభావుడు’
-
‘మహానుభావుడు’ టైటిల్ సాంగ్..
సాక్షి,హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో తెరకెక్కిన ‘మహానుభావుడు’ టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానుభావుడు. మహానుభావుడు టైటిల్ సింగిల్ ను నేడు( సెప్టెబర్ 7న ఉదయం) విడుదల చేశారు. దీంతో తమన్ సంగీతంపై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ధియెట్రికల్ ట్రైలర్ ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందించిన ఈ మూవీని దసరా కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మ్యూజికల్ లవ్ స్టోరి గా రూపొందిన ఈ చిత్రం ద్వారా మరోసారి హిట్ కొట్టాలని హీరో శర్వానంద్ ఆశిస్తున్నారు. శర్వానంద్‌కు జంటగా మెహరీన్ నటిస్తుండగా వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
దసరాకు మహానుభావుడు
కాళ్లకు సాక్సులు తీయకుండానే నిద్రపోతాడు. ప్రేయసి కాళ్లకు ముద్దుపెట్టాలంటే ఆ కాళ్లకు పెర్ఫ్యూమ్ కొడతాడు. ఎవరికైనా తుమ్మొస్తోందంటే ఆమడ దూరం పారిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కనిపించని గాలిని కూడా క్లీన్ చేయాలనుకునే టైప్. ఈ కుర్రాడి యవ్వారం తేడాగా ఉంది కదూ. నిజమే.. ఈ కుర్రాడికి ఓసీడీ అనే డిజార్డర్ ఉంది. అంటే.. అతి శుభ్రం అన్నమాట. ఈ డిజార్డర్ ఈ కుర్రాడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందన్న అంశాలతో రూపొందిన చిత్రం ‘మహానుభావుడు’. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. శర్వా బాగా యాక్ట్ చేశాడు. తమన్ సంగీతం సూపర్’’ అన్నారు. ‘‘మారుతి క్రియేట్ చేసిన శర్వా క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందనే నమ్మకం ఉంది. టీజర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. -
మారుతి డైరెక్షన్లో అక్కినేని హీరో..?
టాలీవుడ్ లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి, భలే భలే మగాడివోయ్ సినిమాతో తో రూట్ మార్చిన మారుతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రాల మీద దృష్టి పెట్టాడు. సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అక్కినేని యువ హీరో నాగచైతన్యతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యుద్ధం శరణం సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చైతూ, తరువాత పెళ్లి, హనీమూన్ ల కోసం బ్రేక్ తీసుకోనున్నాడు. బ్రేక్ మారుతి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. నాగచైతన్య హీరోగా ప్రేమమ్, మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలను తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ కాంబినేషన్ ను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మిస్టర్ క్లీన్!
కుర్రాడి పేరు ఆనంద్. అతనికి ఓసీడీ ఉంది. అంటే... అదేదో బీటెక్, ఎమ్‌టెక్ లాంటి డిగ్రీ అనుకునేరు. ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అన్నమాట. దీని లక్షణం అతి శుభ్రం. ఆనంద్ ‘మిస్టర్ క్లీన్’. ఈ డిజార్డర్‌తో ఆనంద్ లైఫ్ ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలంటే ‘మహానుభావుడు’ చూడాల్సిందే. శర్వానంద్ టైటిల్ రోల్లో మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్‌తో చేస్తున్న చిత్రం ఇది. పుల్æకామెడీ అండ్ మ్యూజికల్ లవ్‌స్టోరీ. ఓసీడీ ఉన్న కుర్రాడిగా శర్వానంద్ అద్భుతంగా చేస్తున్నారు. తన కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఎస్.ఎస్. తమన్ అందించిన ఆడియో సూపర్’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో శర్వానంద్ హీరోగా చేస్తున్న మూడో చిత్రం ఇది. క్యారెక్టరైజేషన్‌తో కామెడీ పండించగల దర్శకుల్లో మారుతి ప్రథముడు. డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
మహానుభావుడు టీజర్ అదుర్స్
-
మహానుభావుడు టీజర్ అదుర్స్
'నా పేరు ఆనంద్.. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్, ఎంటెక్ లాంటి డిగ్రీలు కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం. విపరీతమైన నీట్నెస్' అంటూ 'మహానుభావుడి'గా శర్వానంద్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్, మెహరీన్ జంటగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ గురువారం విడుదల చేశారు. అతి శుభ్రత డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా శర్వానంద్ ఈ టీజర్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కాళ్లను కాళ్లతో రొమాంటిక్ గా తాకడానికి ముందు స్ప్రే చేయడం.. బాస్‌కు తుమ్ము వచ్చినట్టయితే.. అంత దూరం పరిగెత్తుకెళ్లి.. ఇక మీరు తుమ్మండి సార్ అనడం.. హీరోయిన్ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకోబోతూ.. 'బ్రష్ చేసావా' అని ప్రశ్నించడం.. టీజర్లో హైలెట్స్.. మొత్తానికి 'భలేభలే మగాడివోయ్'లో మతిమరుపు హీరోతో నవ్వులు పూయించిన మారుతి.. ఈసారి ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ ఉన్న హీరోతో నవ్వులు పంచడం ఖాయమని టీజర్‌తో హింట్ ఇచ్చాడు. మీరూ ఓ లుక్ వేయండి. -
'మహానుభావుడు' వస్తున్నాడు..!
వరుస విజయాలతో దూసుకుపోతోన్న శర్వానంద్ జోరుకు రాధ సినిమాతో బ్రేక్ పడింది. దీంతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు శర్వా. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో మహానుభావుడు అనే ఆసక్తికరమైన టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను కూడా స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్ లకు పోటిగా దసరా సీజన్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ తో పాటు పొల్లాచ్చి, యూరప్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల మీద దృష్టి పట్టిన చిత్రయూనిట్ వినాయక చవితి కానుకగా ఈ నెల 24న మహానుభావుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
రెండు సినిమాలు లైన్లో పెట్టిన యంగ్ హీరో
రాధతో నిరాశ పరిచిన యంగ్ హీరో శర్వానంద్, వరుస సినిమాలతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో మహానుభావుడు షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తరువాత చేయబోయే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటి పడి సత్తా చాటిన శర్వాతో సినిమా చేసేందుకు అగ్రనిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన ఆర్కా మీడియా బ్యానర్ లో తెరకెక్కుతున్న నెక్ట్స్ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా ఓకె చెప్పాడు శర్వా. నిఖిల్ హీరోగా రెండు హిట్స్ అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు. -
జనవరి 19 నుంచి మహానుభావుడు
సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలతో తలపడేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో శర్వానంద్ వెంటనే మరో సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న శతమానంభవతి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న శర్వా, ఐదు రోజుల గ్యాప్ తో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో ఆకట్టుకున్న యూత్ ఫుల్ సినిమాల దర్శకుడు మారుతి, శర్వానంద్ హీరోగా సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈసినిమాకు మహానుభావుడు అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను జనవరి 19న లాంచనంగా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు మారుతి. -
మహానుభావుడు ఎవరంటే..!
హ్యట్రిక్ హిట్స్‌తో సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాలో హీరోగా నటిస్తున్న శర్వా, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తవ్వగానే మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగకీరించాడు. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి, తరువాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. తాజాగా శర్వానంద్ సినిమాతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు. శర్వా సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మహానుభావుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శతమానంభవతి మూవీ షూటింగ్ పూర్తయిన తరువాత మహానుభావుడు సెట్స్ మీదకు వెళ్లనుంది.