మహానుభావుడు టీజర్ అదుర్స్
'నా పేరు ఆనంద్.. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్, ఎంటెక్ లాంటి డిగ్రీలు కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం. విపరీతమైన నీట్‌నెస్' అంటూ 'మహానుభావుడి'గా శర్వానంద్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్, మెహరీన్ జంటగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ గురువారం విడుదల చేశారు.
అతి శుభ్రత డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా శర్వానంద్ ఈ టీజర్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కాళ్లను కాళ్లతో రొమాంటిక్ గా తాకడానికి ముందు స్ప్రే చేయడం.. బాస్‌కు తుమ్ము వచ్చినట్టయితే.. అంత దూరం పరిగెత్తుకెళ్లి.. ఇక మీరు తుమ్మండి సార్ అనడం.. హీరోయిన్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకోబోతూ.. 'బ్రష్ చేసావా' అని ప్రశ్నించడం.. టీజర్‌లో హైలెట్స్.. మొత్తానికి 'భలేభలే మగాడివోయ్'లో మతిమరుపు హీరోతో నవ్వులు పూయించిన మారుతి.. ఈసారి ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ ఉన్న హీరోతో నవ్వులు పంచడం ఖాయమని టీజర్‌తో హింట్ ఇచ్చాడు. మీరూ ఓ లుక్ వేయండి.