Mehreen Kaur
-
తమన్నా మాములుగా లేదు భయ్యా.. చీరలో ఈషా అలా కనిపించేసరికి!
టైట్ పింక్ డ్రస్‌లో తమన్నా పరువాల విందు డిమ్ లైటింగ్‌లో శ్రుతిహాసన్ విచిత్రమైన పోజులు పెళ్లయి ఏడాది.. భార్యతో కలిసి హీరో నాగశౌర్య సెలబ్రేషన్స్ చీరకట్టి మరీ టెంప్ట్ చేస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా వంగి మరీ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహ్రీన్ 'బలగం' బ్యూటీ కావ్య కల్యాణ్‌రామ్ కిర్రాక్ స్టిల్స్ సౌత్ కొరియా టూర్లో హీరోయిన్ నివేతా పేతురాజ్ శివలింగానికి అభిషేకం చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ క్యూట్ పోజుల్లో బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
సినిమాల్లో కేవలం హీరోయిన్ల కోసం వచ్చే ప్రేక్షకులూ ఉంటారన్నది వాస్తవం. కొన్నిసార్లు ఈ కారణంగానే దర్శక నిర్మాతలు యువ హీరోల సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. తాజాగా హీరో వసంత రవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా తానేమిటో నిరూపించుకున్నాడు వసంత రవి. ఆ తర్వాత రాఖి చిత్రంతో యాక్షన్ హీరోగా విజయాన్ని అందుకున్నారు. ఇటీవల అశ్విన్స్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్ కొడుకుగా విభిన్న పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. కాగా వసంత రవి ఇప్పుడు కథానాయకుడిగా తన ఏడవ చిత్రానికి సిద్ధమయ్యారు. జేఎస్ఎం పిక్చర్స్, ఎంపీరర్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శబరీష్ నందా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వసంత రవికి జంటగా పటాస్, నోటా చిత్రాల ఫేమ్ మెహ్రీన్, హీరోయిన్ అనికా సురేంద్రన్ నటిస్తున్నారు. అజ్మల్ దాసిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రం కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. టైటిల్ సహా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నాడు. చదవండి: Varun Dhawan: కొత్త సినిమా.. గాయపడ్డ హీరో వరుణ్! -
మెహ్రీన్‌తో బ్రేకప్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో భవ్య భిష్ణోయ్ ఎంగేజ్మెంట్
హీరోయిన్ మెహ్రీన్‌కు ఈమధ్య పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. ఎఫ్-3 సక్సెస్ సాధించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్గా బరువు తగ్గి బాగా నాజుగ్గా తయారైంది ఈ భామ. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నా చేతిలో సరైన అవకాశాలు లేవు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 మార్చిలో మెహరీన్-భవ్య భిష్ణోయ్ నిశ్చితార్థం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్దిరోజులేక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు. మెహ్రీన్ హీరోయిన్గా కంటిన్యూ చేస్తుంటే, 2022లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన భవ్య భిష్ణోయ్ ప్రస్తుతం హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పరి భిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Couldn’t think of a more special place to ask you possibly the most important question of my life… where it all began… and where it begins for us… pic.twitter.com/qWSssP6ljt — Bhavya Bishnoi (@bbhavyabishnoi) May 5, 2023 -
హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్‌లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న లైగర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్‌లో రష్మీ
► కూతురితో ట్విన్నింగ్ అంటున్న హీరోయిన్ ప్రణీత ► పట్టు పరికిణిలో సాంప్రదాయబద్దంగా రీతూ చౌదరి ► సెజ్లింగ్ లుక్‌లో యాంకర్ రష్మీ ► పెళ్లికూతురి గెటప్‌లో మురిసిపోతున్న వర్ష ► బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ► దుబాయ్‌లో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్న మెహ్రీన్ View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Dhanvika (@dhanvikashasha) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది?
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది మెహరీన్ పిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇటీవలే ఎఫ్ 3తో ప్రేక్షకులను అలరించిన మెహరీన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మెహరీన్ ముఖమంతా సూదులతో గుచ్చి ఉంది. ఇది చూసిన మెహరీన్ ఫ్యాన్స్ ముఖానికి సూదులు గుచ్చుకోవడమేంటని కంగారుపడుతున్నారు. అయితే తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఇలా చేసింది మెహరీన్. తను ఆక్యుస్కిన్లఫ్ట్ అనే థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ చేసి నా ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) చదవండి: జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది తుప్పాస్ పని చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ -
మెహరీన్, తమన్నాల ఫైర్ అండ్ ఫెంటాస్టిక్ ఫోటోలు
-
అల్టీమెట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..
F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ తాజాగా ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. చదవండి: వైజాగ్‌లో రామ్‌చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదే.. కానీ ఆరవ భూతం ఒకటుంది అదే డబ్బు' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'డబ్బు ఉన్నవాడికి ఫన్.. లేని వాడికి ఫ్రస్టేషన్, సీక్వెల్లో కూడా వీడికి సేమ్ డైలాగ్స్.. అంతేగా, అంతేగా'..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. -
బ్రేకప్‌లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్‌కు కలిసోచ్చాయా?!
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా చక్రం తిప్పుతున్న మన తెలుగు హీరోయిన్స్ కొందరూ నిజ జీవితంలో చేదు అనుభవాలను చూశారు. అయినా కేరీర్ పరంగా వారు పరిశ్రమలో దూసుకుపోతున్నారు. కొందరు ప్రేమ వరకు వెళ్లి విడిపోయారు, మరికొందరు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు, ఇంకొంత మంది నిశ్చితార్థం వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా ఈ బాధలో కూడా వారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కేరీర్ పరంగా ఫుల్ బిజీ అవ్వడమే కాదు అంతకు ముందున్న సక్సెస్ కంటే కూడా డబుల్ సక్సెస్‌ను అందుకుంటున్నారు. వారెవరో కాదు పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న మన స్టార్ హీరయిన్స్. మరి వారెవరో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. సమంత అక్కినేని వారసుడు నాగచైతన్యతో ‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత చైతో పరిచయం, ప్రేమ, పెళ్లి, విడాకులు అంతా పదేళ్లలో జరిగిపోయింది. ఈక్రమంలో ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ కమర్షియల్ హిట్లు అందుకుంది. 2017లో చైతో వివాహం అనంతరం సినిమాల పరంగా కాస్తా ఆచితూచి అడుగులేస్తూ డిసెంట్ క్యారెకర్లు మాత్రమే ఎంచుకుంది. అయినా సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఇటీవల చైతో విడాకులు ప్రకటించిన సామ్ సినీ కేరీర్‌కు ఇంకా బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస ప్రాజెక్ట్స్ సంతకం చేస్తోంది. ఇటీవల శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అంతేగాక ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతుందని వినికిడి. బ్రేకప్ అనంతరం ఆమె కెరీర్ ముగిసిందని అనుకుంటుండగా సామ్ జాతీయ స్థాయిని మించి ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇవే కాక కొత్తగా ఆమె ఐటెం సాంగ్‌తో సత్తా చాటుబోతోన్న సంగతి తెలిసిందే. అంటే విడాకులు ఆనంతరం సామ్ మునుపటి కంటే మరింత బిజీగా మారిపోయింది. నయన తార నయన తార పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆడదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తమిళ శింబు సినిమా సమయంలో ఈ మూవీ హీరో శింబుతోతో ప్రేమయాణం నడిపింది. అది బ్రేకప్ తర్వాత కాస్తా సినిమాల స్పీడ్ పెంచిన నయన్ మెగి, లక్ష్మి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగే క్రమంలో కొరియోగ్రఫర్, నటుడు ప్రభుదేవాతో సీక్రెట్ రిలేషన్లో ఉంది. పెళ్లి వరకు వెళ్లిన వారి ఎఫైర్ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ సమయంలో నయన్‌కు పెద్దగా హిట్లు లేవు. ప్రభుదేవతో కట్ అయ్యాక పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టిన నయన్ లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వరుస హిట్ అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈ క్రమంలో దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా నయన్ పేరు తెచ్చుకుంది. ఇది మాత్రమే కాదు ప్రభుదేవతో బ్రేకప్ అనంతరం ఆమె లేడి సూపర్ స్టార్‌గా పిలుపించుకుంటుంది. కొంతకాలంగా తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నయన్ త్వరలోనే అతడినే పెళ్లి చేసుకోబోతోంది. రష్మిక మందన్నా రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్గా మాత్రమే కాదు నేషనల్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా రష్మిక రికార్డులను సొంతం చేసుకుంది. వరుస హిట్లతో తెలుగు స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. పరిశ్రమలో అడుగు పెట్టిన తక్కవు కాలంలోనే రష్మిక ఎంతో పాపులారిటి తెచ్చుకుంది. అయితే కన్నడ సినిమాతో అరంగేట్రం చేసిన రష్మిక శాండల్‌వుడ్ నిర్మాత, నటుడు రక్షిత్ శెట్టిని నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నిశ్చితార్థం బ్రేక్ చేసుకుంది. అనంతరం తెలుగు హాలో మూవీతో తెలుగులో అడుగు పెట్టిన రష్మిక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్రేకప్ అనంతరం కేరీర్‌పై ఫోకస్ పెట్టిన ఆమెకు వరుస విజయాలు వరించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ హీరోయిన్గా మారింది. మెహ్రీరిన్ కౌర్ ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, కవచం, చాణక్య, ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్ పెళ్లి వరకు వెళ్లింది. ఏమైందో ఏమో తెలియదు కానీ తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా మెహ్రీన్.. బ్రేకప్ అనంతరం వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తోంది. అంతేగాక మునుపటి కంటే ఇప్కుడే మరింత బిజీ అయిపోయింది. అంతేగాక ఈ మధ్య సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటు వస్తున్నాయి. చెప్పాలంటే బ్రేకప్ మెహ్రీన్‌గా కలిసోచ్చినట్లు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఆమె చేతిలో ఎఫ్ 3 మూవీతో పాటు మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది త్రిష. అయితే స్టాలిన్ అనంతరం తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆ మధ్య వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్మణిమన్ను నిశ్చితార్థం చేసుకుంది. ఏమైందో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన త్రిష సెకండ్ తమిళ చిత్రం 96తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అవకాశాలు తక్కువే అయినప్పటికీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా మారిపోయింది. లేడి ఓరియెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. శ్రుతీ హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలికి పరిశ్రమలో అడుగు పెట్టింది. శ్రుతి. కెరీర్ ప్రారంభంలో ఆమెకు పెద్ద విజయాలు లేవు. ఒకానోక సమయంలో ఐరన్ లెగ్గ్ అనే ముద్ర కూడా ఆమెకై పడింది. అయితే గబ్బర్ సింగ్ మూవీతో తోలి హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రుతి వెనక్కి తిరిగి చూడలేదు. వరుస విజయాలు ఉన్నప్పటికి సినిమాలు మాత్రం చాలా తక్కువగా చేసేది. ఆ మధ్య మైఖెల్ కోర్సలేతో ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో కెరీర్‌ను కాస్తా పక్కన పెట్టింది. ఇక అతడితో బ్రేకప్ అనంతరం గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన శ్రుతి వరుస ప్రాజెక్ట్స్ దూసుకుపోతోంది. ప్రభాస్ సలార్ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు బాలయ్యతో ఓ సినిమాకు సంతకం చేసింది. అంతేగాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్రేకప్ తర్వాత శ్రుతి మరింత పుంజుకుని సినిమాల పరంగా ఫుల్ బిజీ మారింది. ప్రస్తుతం ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో మునిగి తేలుతోంది. -
ఆ అదృష్టం అందరికి రాదు: సంతోష్ శోభన్
‘‘ఇండస్ట్రీలో ఉండగలననే ఆత్మవిశ్వాసం వచ్చింది కానీ ఇండస్ట్రీలో సెటిలైపోయామనే కాన్ఫిడెన్స్ నాకు లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ కొత్త పర్సన్‌కు చోటు ఉంటుంది. రిలాక్స్ అయిపోతే మన అవకాశాలు వేరే వాళ్లకు వెళతాయి. అందుకే ప్రతి రోజూ ఓ పోరాటంగానే భావిస్తాను’’ అన్నారు సంతోష్ శోభన్. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్, వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ చెప్పిన విశేషాలు. ⇔ భయం, ఆందోళన నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. భయానికి మన లైఫ్‌లో ఎంత చోటు ఇవ్వాలనే అంశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. మారుతి అన్న స్టైల్ ఆఫ్ హ్యూమర్ ఈ సినిమాలోనూ ఉంటుంది. నవ్విస్తూనే ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. ⇔ నాకు ఓటీటీ, థియేటర్స్ అనే లెక్కలు లేవు. యాక్టింగ్‌లో నాకు టీవీ అయినా ఓకే. స్క్రిప్ట్ నచ్చితే సినిమా అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అయినా ప్రాజెక్ట్స్ చేస్తాను. నిజానికి సినిమాల్లోకి రాకముందు వెబ్ సిరీస్‌లు, వెబ్ షో చేశాను. కాకపోతే పెద్దగా ఎవరికీ తెలియదు. ⇔ నాకు కొంచెం సిగ్గు. లిప్‌లాక్ సీన్స్ నా దృష్టిలో కష్టమైనవి. కానీ నటనలో ఇదో భాగం. ఎంత నార్మల్‌గా, ఎంత ప్రొఫెషనల్‌గా డీల్ చేస్తే అంత మంచిది. మారుతిలాంటి దర్శకుడితో చేసినప్పుడు ఏ సీన్స్ అయినా ఈజీ అయిపోతాయి. డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు. ⇔ మనకు పని లేనప్పుడు మనకు ఇష్టమైన పని దొరికితే అవే మంచి రోజులు. నా లైఫ్‌లో స్ట్రగుల్‌ను కూడా ఎంజాయ్ చేసాను. ప్రస్తుతం నందినీ రెడ్డిగారి దర్శకత్వంలో, సుష్మితాగారి ప్రొడక్షన్లో, మళ్లీ యూవీ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాను. ⇔ మా నాన్న (ప్రభాస్ ‘వర్షం’ చిత్ర దర్శకుడు శోభన్) గురించి ఇండస్ట్రీలో ఉన్న పాజిటివ్ వైబ్స్ నాపై కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు యాక్టింగ్ చాన్స్ వస్తే, వెళ్లమని అమ్మ అన్నారు. నా 23 ఏళ్ల వరకు ఫ్యామిలీని సపోర్ట్ చేసేంత డబ్బు సంపాదించలేదు. ఇప్పుడు నా వంతు నేను చేస్తున్నాను. నా బ్రదర్ కూడా మంచి యాక్టర్... రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. -
స్టార్ స్టయిల్: మెహ్రీన్ కట్టిన ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా!
హనీ ఈస్ ద బెస్ట్.. అని చదవగానే మీ మనసులో మెహరీన్ కౌర్ మెరుస్తారని తెలుసు. ఆ బెస్ట్ హీరోయిన్ గురించి కొత్త వివరాలను తెలుసుకోవాలనే ఆత్రం మొదలవుతుందనీ తెలుసు. అందుకే ప్రస్తుతానికి ఆమె ఇష్టపడే వెరీ బెస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను పరిచయం చేస్తున్నాం ఇక్కడ.. అంజలి భాస్కర్ ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరు అంజలి భాస్కర్. 2010లో ’సమత్వం’ పేరుతో సంస్థ స్థాపించి, 12 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలతో రూపొందించిన @ఫైబర్ టు ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్‌లు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే వేల రూపాయల నుంచి లక్షల్లో ఉంటుంది. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ అంజలి భాస్కర్ డిజైన్స్ లభిస్తాయి. బ్రాండ్ వాల్యూ నీరహ్ బై నిధి జ్యూయెల్స్.. ఆన్లైన్ జ్యూయెలరీ షాపింగ్‌లో అన్ని వర్గాలను అలరిస్తున్న బ్రాండే ‘నీరహ్ బై నిధి జ్యూయెల్స్’. అతి తక్కువ ధరల్లో లభించే వీటికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఫ్లాట్‌ఫామ్‌గా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇతర ఆన్లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి ఈ ఆభరణాలు. ఇయర్రింగ్స్ బ్రాండ్: నీరహ్ బై నిధి ధర: రూ. 199 చీర డిజైనర్: సమత్వం బై అంజలి భాస్కర్ ధర: రూ. 26,000 గంటలు గంటలు షాపింగ్ చేయటం నాకు ఇష్టం ఉండదు.. షాప్‌లోకి వెళ్లిన వెంటనే నచ్చింది కొనేస్తాను. ట్రయల్ కూడా చేయను. అందుకే స్క్రీన్ షాపింగ్ ఎక్కువగా చేస్తాను. – మెహరీన్ కౌర్ -
అలాంటి మంచిరోజులు త్వరలోనే వస్తాయి!
Manchi Rojulochaie: ‘‘కరోనా సమయంలో అందరం నవ్వుకు దూరం అయిపోయాం. కరోనా రాకపోయినా భయంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసి ‘మంచి రోజలు వచ్చాయి’ సినిమా తీశాను’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా థియేటర్లకు వచ్చి మా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూస్తారని, అలాంటి మంచి రోజులు అతి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులను కూడా చేర్చాలి’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా చిత్రాన్ని చూసి ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు మెహరీన్. ‘‘నా ప్రతిభని నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలు వంశీగారు, విక్రమ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు సంతోష్ శోభన్. నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. -
అత్యంత ప్రమాదకరమైన స్త్రీ ఆ పని చేయదు.. మెహ్రీన్ ఆసక్తికర పోస్ట్
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్.. ఇటీవల బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చింది. పెళ్లి రద్దు విషయం తన పర్సనల్ అని, ఇకపై దీని గురించి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ అంశం మీద స్పందించిన భవ్య కూడా తాను ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మెహరీన్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది’అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. కొటేషన్ కాస్త గందరగోళంగా ఉన్నా... తాను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని, రక్షణ కోసం ఇతరులపై ఆధారపడబోనని చెప్పుకోవడానికే ఈ పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
అందుకే మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందా?!
Mehreen Pirzada Calls Off Engagement: ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, కవచం, చాణక్య, ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అనంతరం ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే పెళ్లి అనంతరం తను నటించనని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. పెద్దింటికి కోడలు అవుతుంది కదా అందుకే నటించకూడదని నిర్ణయించుకుందేమోనని అనుకుని అభిమానులంతా ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక గత నెలలలోనే భవ్యతో తన పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి పనులతో బిజీగా ఉన్నట్లు చెప్పిన మెహ్రీన్ సడెన్‌గా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడినట్లు చెప్పింది. అంతేగాక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ గ్యాప్‌లో తను సంతకం చేసిన ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో మెహ్రీన్‌కు ఓ పెద్ద హీరోతో నటించే ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. అయితే త్వరలోనే పెళ్లి పెట్టుకుని మెహ్రీన్ కొత్త ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పడం అందరిని కాస్త ఆశ్యర్యపరిచినా.. పెళ్లికి ఇంకా చాలా గ్యాప్ ఉందేమోనని అభిప్రాయపడ్డారు. ఏమైందో ఏమో తెలియదు శనివారం ఉదయం లేచేసిరికి తన సోషల్ మీడియా ఖాతాల్లో భవ్య బిష్ణోయ్‌తో తను వివాహం రద్దు చేసుకున్నట్లు పోస్టులు దర్శనం ఇచ్చాయి. ‘ఇక నుంచి భవ్యతో కానీ, తన కుటుంబ సభ్యులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టంగా తీసుకున్న నిర్ణయం. నా వ్యక్తిగతం. ప్రతిఒక్కరు నా నిర్ణయాన్ని, ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్న’ అని ఆమె పోస్టులు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ సీనియర్ స్టార్ హీరో అని, ఆయన సినిమాలో అవకాశం రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందంటూ నెటిజన్లు తమదైన శైలిలో చర్చించుకుంటున్నారు. -
పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్
కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు యువతరాన్ని కట్టిపడేసింది పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్. ఎఫ్ 2, మహానుభావుడు, కవచం వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయింది. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది సెకండాఫ్‌లో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెహ్రీన్ కోవిడ్, పెళ్లి తదితర విషయాల గురించి మీడియాతో మాట్లాడింది. "కరోనా వైరస్ మరికొంతకాలం ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ మహమ్మారి మనకు కావాల్సిన వ్యక్తులను ఎందరినో పొట్టనపెట్టుకుంటోంది. ఇది చాలా విషాదకరం. గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగాక మా అమ్మకు, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వెంటనే మేము ముంబైలో క్వారంటైన్లో ఉండిపోయాం. చాలా భయపడిపోయాం. కొద్ది రోజుల వరకు ఎంతో ఆందోళన చెందాం. కానీ దాన్నుంచే ఎలాగోలా బయటపడ్డాం" "కరోనాను జయించిన తర్వాత కూడా ఇప్పటికీ నీరసంగా ఉంటోంది. అందుకే వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాను. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య నాకు నిత్యం కాల్ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. నేను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు అతడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపించాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే చర్చించడం లేదు. అయినా పరిస్థితులు చక్కబడాలి కదా!" అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’లో నటిస్తోంది. చదవండి: ‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’ -
‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’
‘‘చూడచక్కగా ఉన్నారు. మీ జంట సూపర్’’ అంటూ మెహరీన్ స్నేహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్ పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తాజాగా మెహరీన్ స్కూల్ ఫ్రెండ్ తమన్నా నిశ్చితార్థంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫొటో చూసినవాళ్లు సూపర్ అంటున్నారు. ఈ శుక్రవారం (మార్చి 12) జైపూర్‌లోని అలీలా కోటలో మెహరీన్–భవ్య నిశ్చితార్థం జరగనుంది. భవ్యా బిష్ణోయ్ హరియానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు. భవ్య కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. మెహరీన్–భవ్యాల వివాహ తేదీని నిశ్చితార్థం రోజున ప్రకటిస్తారట. ప్రస్తుతం మెహరీన్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న ఎఫ్ 3 భామ!
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కౌర్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తన్న ఈ సినిమా షూటింగ్ హైదరబాద్‌లో జరుపుకుంటోంది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మెహరీన్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇకపై మెహరీన్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని దీని సారాంశం. ఎఫ్ 3 తరువాత మరే ఏ సినిమాలోనూ నటించదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తను వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే కారణం అని తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కనుందన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని, మెహరీన్ పెళ్లాడబోతున్నట్లు ఇటీవల ఆవిడే స్వయంగా వెల్లడించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడే భవ్య బిష్ణోయ్. రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 12న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. అయితే గొప్పింటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి మెహరీన్ ఇకపై నటించకపోవచ్చని అంటున్నారు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకున్న ఆమె సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అదే విధంగా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని వివరించారు. చదవండి: మాజీ సీఎం మనువడితో హీరోయిన్ పెళ్లి.. -
మాజీ సీఎం మనువడితో హీరోయిన్ పెళ్లి
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. బాగా రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి కోడలిగా మెహ్రీన్ వెళ్లనుంది. ఎఫ్ 2లో హనీ పాపగా కనిపించిన మెహ్రీన్ మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే మెహ్రీన్ కొత్త జీవితం ప్రారంభించనుంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. హర్యానాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్, భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా వీరి నిశ్చితార్థం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్ వేదిక కానుంది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉంది. -
నెల్లూరంటే ఇష్టం : హీరోయిన్ మెహ్రిన్
సాక్షి, నెల్లూరు(బృందావనం): నెల్లూరుంటే తనకు ఎంతో ఇష్టమని రాజాది గ్రేట్ ఫేమ్, ప్రముఖ సినీ హీరో యిన్ మెహ్రిన్‌కౌర్ పేర్కొన్నారు.వీనులవిందైన సంగీతం, సినీతారల మెరుపులు, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపకాంతుల నడుమ నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని మైదానంలో శనివారం రాత్రి తెలుగుసినీ కళోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్ మెహ్రిన్‌కౌర్ హాజరై మాట్లాడారు. నెల్లూరుకు మళ్లీ మళ్లీ రావాలని ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు నెల్లూరుకు వచ్చానన్నారు. నెల్లూరన్నా.. నెల్లూరీయులన్నా తనకెంతో ఇష్టమన్నారు. ఎలా ఉన్నారంటూ...? ముద్దు ముద్దు మాటాలతో సింహపురీయుల్లో జోష్ నింపారు. నెల్లూరీయులంటే ఎనర్జిటిక్ అని మెహ్రిన్‌కౌర్ ప్రశంసలజల్లు కురిపించారు. స్కంద ఆర్ట్స్ పర్యవేక్షణలో నిర్వహించిన తెలుగుసినీ కళోత్సవ కార్యక్రమాన్ని తొలుత ఆ సంస్థ సీఈఓ సందీప్‌దంపతులు జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు. బుల్లితెర హాస్యనటులు బుల్లెట్భాస్కర్, సునామీ సుధాకర్, ఉదయ్, చైతన్య బృందం నిర్వహించిన(జబర్దస్త్ టీం) స్కిట్స్ నవ్వులు పూయించాయి. ప్రముఖ ల్యాండ్ డెవలపర్, రియల్టర్ సత్యంజీ గ్రూప్ అధినేత జి.సత్యనారాయణ, జెడ్ఎస్ న్యూస్ మీడియా ఇన్చార్జి దిలీప్, హోండా, వెస్పా సన్ మోటార్స్, సజావ్కార, సెట్నెల్, స్పోర్ట్స్ అథారిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. కళాకారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జ్యోతిప్రజ్వలన చేసి కళోత్సవాన్ని ప్రారంభిస్తున్న సందీప్‌దంపతులు -
రివాల్వర్ రాణి
మెహరీన్ గురి చూసి కొట్టిందంటే హిట్ మీద హిట్టే ఇండస్ట్రీలో ఇప్పటిదాకా టార్గెట్ మిస్ కాలేదు ఫ్యాన్స్ గుండెల్లోకి దూసుకెళ్లడంలో కూడా గురి తప్పలేదు తెర మీద అందంగా కనపడటమే కాదు సమాజం పట్ల లోతైన అవగాహన ఉన్న అమ్మాయి తను ఒలింపిక్స్‌కి వెళ్లి షూటర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంది కానీ సినిమా షూటింగ్స్‌కి గురి పెట్టింది ఈ రివాల్వర్ రాణి క్వొశ్చన్స్ ‘షూట్’ చేస్తాం.. రెడీగా ఉన్నారా? ఓ యస్.. కమాన్ షూట్. బ్యాగ్‌లో పిస్టల్ ఉందా? (నవ్వేస్తూ).. లేదు. మా కజిన్‌కి ఇచ్చేశాను. ఆ పిస్టల్‌తో తను నేషనల్స్‌కి వెళుతున్నాడు. యాక్చువల్లీ మీరూ నేషనల్స్‌కి వెళ్లాల్సింది.. మిస్సయ్యారు కదా? అవును. సరిగ్గా ఎగ్జామ్స్ టైమ్. అందుకే మిస్సయ్యాను. వెళ్లుంటే.. సినిమా షూటింగ్స్‌కి బదులు పిస్టల్ షూట్‌తో బిజీగా ఉండేవారేమో. ఒక్కసారి మీ ‘పిస్టల్ షూటింగ్’ గురించి షేర్ చేసుకుంటారా? చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలని మా అమ్మగారు అనేవారు. నచ్చిన స్పోర్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ‘టామ్‌బాయ్’ టైప్. టాయ్ గన్స్‌తో ఆడుకునేదాన్ని. అమ్మాయిలకు నచ్చేవి ఏవీ నాకు పెద్దగా నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ వంటివి నచ్చవు. గన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ‘ఎయిర్ పిస్టల్’ షూటింగ్ నేర్చుకుంటానన్నా. మా అమ్మగారు సరే అన్నారు. పిస్టల్ షూట్ అంటే గురి తప్పకూడదని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. దానివల్ల నాకు లైఫ్‌లోనూ ఫోకస్ పెరిగింది. పిస్టల్ని కజిన్‌కి ఇచ్చారు. ప్రాక్టీస్ మానేశారా? పంజాబ్ వెళ్లినప్పుడు షూటింగ్ రేంజ్‌కి వెళతాను. కాసేపు ప్రాక్టీస్ చేస్తాను. బాగుంది.. ఆ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినా కూడా మీ లైఫ్‌లో షూటింగ్ కంటిన్యూ అవుతోంది.. (నవ్వేస్తూ) కరెక్టేనండి. ‘షూటింగ్’ అనే వర్డ్‌కి నా లైఫ్‌లో ఏదో తెలియని ఎటాచ్మెంట్ ఉంది. అప్పుడేమో గన్‌తో ఇప్పుడేమో సినిమా షూటింగ్‌తో. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ అదే ప్రొఫెషన్ అవ్వాలనుకోలేదు. రకరకాలు చేయాలని ఉండేది. అది ఒక్క సినిమా వల్లే కుదురుతుంది. వేరే ఏదైనా చేస్తే నేను మెహరీన్గానే ఉండాలి. అదే సినిమా అయితే మహాలక్ష్మిలా పల్లెటూరి అమ్మాయి (‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’) అవ్వొచ్చు. మేఘనలా మోడరన్ గాళ్ (‘మహానుభావుడు’).. రకరకాలుగా కనిపించొచ్చు. అందుకే ‘ఐ లవ్ సినిమా’. ‘ఆడపిల్లవి.. పిస్టల్ షూటింగ్ వద్దు’ అని మీ అమ్మగారు అనకపోవడం గ్రేటే? మా అమ్మగారు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. కూతురు కూడా అలానే ఉండాలను కున్నారు. నా ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ రోల్ మోడల్. అమ్మలానే నేనూ స్ట్రాంగ్. లైఫ్‌లో ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ మరింత స్ట్రాంగ్ చేస్తుందని నమ్ముతాను. కాస్త సన్నబడ్డట్లున్నారు.. ఏదైనా క్యారెక్టర్ కోసమా? బొద్దుగా ఉన్నారని విమర్శలు వచ్చాయా? క్రిటిసిజమ్ కాదు. నేను ఎప్పుడూ వర్కౌట్స్ చేస్తూనే ఉంటాను. కొంచెం తగ్గితే బాగుంటుందనుకున్నా.. తగ్గాను. అంతే. డైట్, వర్కౌట్స్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నాను. సో... ‘గ్లామర్ ఇండస్ట్రీ’ని డీల్ చేయడం మీకు పెద్ద కష్టం కాకపోవచ్చు.. ఇండస్ట్రీ కాదు మన లైఫే చాలా క్రిటికల్. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. పెద్ద కాంపిటీషన్. లైఫ్ మనకు చాలా టీచ్ చేస్తుంది. నేను ఆ ఫ్లోతో వెళ్లిపోతుంటాను. మీరు యాక్ట్ చేసిన సినిమాలు దాదాపు హిట్ కాబట్టి ‘లక్కీ లేడీ’ అనే ట్యాగ్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుణ్ణి బాగా నమ్ముతాను కాబట్టి ఇదంతా ఆయన ఇచ్చిందే అనుకుంటాను. నేను ఒకటి బలంగా నమ్ముతాను. మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అదే విషయాన్ని ఇంకెవరైనా మనకోసం కోరుకుంటే దేవుడు ఆ విషయాన్ని వెంటనే వింటాడని. నా మంచి కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టే నేను సక్సెస్ అవ్వగలుగుతున్నాను. ఓకే... ఉమెన్స్‌డే సందర్భంగా ఏదైనా కొత్త డెసిషన్స్ తీసుకున్నారా? ప్రతిరోజూ ఉమెన్స్‌డే అనే నమ్ముతాను. మా అమ్మగారు ఎప్పుడూ చెబుతుంటారు. హీరోలో ‘హర్’ ఉంటుంది. ఉమెన్ లేకుండా ఏదీ లేదని. ప్రపంచమే మహిళలది. మనం లేనిదే ఏదీ లేనప్పుడు మనం మన ఉమన్హుడ్ని ఎంజాయ్ చేయాలి. తలెత్తుకుని గర్వంగా బతకాలి. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుని, మనల్ని మనం ప్రేమించుకుంటే ఏదైనా సాధించగలం అని నమ్ముతాను. తెలుగు కొంచెం నేర్చుకున్నట్లున్నారు. ట్యూటర్‌ను పెట్టుకున్నారా? లేదు. మా టీమ్ అందరితోను తెలుగులో మాట్లాడుతున్నాను. అలా అలవాటైపోయింది. మరి నెక్స్›్ట సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంటారా? అదే ఆలోచనలో ఉన్నాను. కచ్చితంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటాను. ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు ? గోపిచంద్‌తో పంతం’. విజయ్ దేవరకొండతో తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ అనే సినిమా చేస్తున్నాను. ప్రపంచమే మహిళలది అన్నారు. అలాంటి ప్రపంచంలో ప్రస్తుతం మహిళకు రక్షణ ఉందా? ఈ మధ్య జరుగుతున్న విషయాలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఆడ, మగ అని తేడా గురించి వదిలేస్తే.. ఏ మనిషైనా బతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. ఆడవాళ్లకు ఒకలా, మగవాళ్లకు ఒకలా లేదు కదా. ఏ శరీరానికైనా నొప్పి ఒకటే కదా. అది తెలిసి కూడా ఒక అమ్మాయిని వేధిస్తున్నాడంటే అతను మనిషి ఎలా అవుతాడు? అతడ్ని మనిషి అంటే.. మానవ జన్మని ఇన్సల్ట్ చేసినట్లే. ఆడవాళ్లపై లైంగిక దాడులు అమానుషం అంటే.. సిరియాలో ఆ చిన్నపిల్లలు ఏం చేశారని అలా చంపుతున్నారు. అది ఎంత దారుణం. ఈ దారుణాలు విన్నప్పుడు ‘దేవుడా... శిక్షించకుండా ఉండకు’ అనుకుంటుంటాను. మొన్న శ్రీదేవిగారు చనిపోయినప్పుడు బోలెడన్ని సర్జరీల వల్ల అని, డైటింగ్ వల్ల అని.. ఇలా ఆవిడ మరణం గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు.. అది విన్నప్పుడు ఎలా అనిపించింది? నిన్నటిదాకా కనిపించిన మనిషి ఎప్పటికీ కనిపించే అవకాశం లేదు. ఆ మనిషి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాలి కానీ చెడు ఎందుకు? చనిపోయినవాళ్ల గురించి తప్పుగా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ భూమ్మీద బతికిన 54 ఏళ్లల్లో 50 ఏళ్లు మనల్ని ఎంటర్టైన్ చేశారు ఆవిడ. అలాంటి ఆవిడకు మనం గౌరవమైన నివాళి ఇవ్వాలి. ఆ సంగతలా ఉంచితే.. శ్రీదేవిగారిని చనిపోనివ్వనందుకు ‘థ్యాంక్స్ టూ సినిమా.. అండ్ థ్యాంక్స్ టూ కెమెరా’. ఆమెను మళ్లీ మళ్లీ చూసుకునే అవకాశం కల్పించింది. సెలబ్రిటీలు ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్నా అవేం పట్టించుకోకుండా నెగటివ్‌గా మాట్లాడటానికి రెడీ అయిపోతారు. సో.. సెలబ్రిటీగా ఉండటం శాపం అని అనుకుంటారా? అస్సలు అనుకోను. అదో బ్లెస్సింగ్‌లా భావిస్తాను. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించేవాళ్లు చాలామంది ఉంటారు ఇక్కడ. మాలాగా అవ్వాలనుకునే వాళ్లూ ఉంటారు. అందర్నీ ఎంటర్టైన్ చేయగలుగుతాం. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. మంచిని మాత్రమే తీసుకుంటూ వెళ్లిపోవడమే. సోషల్ మీడియాలో వచ్చే కాంప్లిమెంట్స్, క్రిటిసిజమ్ గురించి.. సోషల్ మీడియా మమల్ని ఫ్యాన్స్‌కు దగ్గర చేస్తుంది. విమర్శలు ప్రతి చోటా ఉంటాయి. ప్రతి ఒక్కర్నీ మనం ఇంప్రెస్ చేయలేం. అందరూ మనల్ని ప్రేమించేలా కూడా ఉండలేం. మిమ్మల్ని ప్రేమించేవాళ్లను తిరిగి ప్రేమించాలి. హేట్ చేసేవాళ్లను కూడా లవ్ చేస్తే ఏదో రోజు వాళ్లు రియలైజ్ అవుతారు. సింపుల్. క్యాస్టింగ్ కౌచ్ గురించి మీరు వినే ఉంటారు. మీకలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా? నేను చాలా లక్కీ. అలాంటివి ఎప్పుడు నాకు ఎదురుపడలేదు. సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందుకే దేవుణ్ణి ‘నన్ను చాలా జాగ్రత్తగా చూసుకో’ అని ప్రార్థిస్తుంటా. ఐ లవ్ మై జాబ్. ఇష్టంగా సినిమాలు చేస్తున్నా. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ‘బాహుబలి’లో దేవసేన లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. అనుష్కగారంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అలాంటి పాత్‌బ్రేకింగ్ సినిమా చేసే అవకాశం వస్తే నా అంత ఆనందపడేవాళ్లు ఉండరేమో. అలాగే రాజమౌళిగారి లాంటి దర్శకులతో వర్క్ చేయాలన్నది నా డ్రీమ్. దేవసేన గుర్రపు స్వారీ చేసింది.. మీరు? కొంచెం కొంచెం వచ్చు. అలాంటి క్యారెక్టర్ వస్తే ఫుల్‌గా నేర్చుకుంటా. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇంతకీ ఆ కొంచెం గుర్రపు స్వారీ ఎప్పుడు నేర్చుకున్నారు? మా ఫ్యామిలీ గుర్రాలను పెంచుతారు. అలా కొంచెం నేర్చుకున్నాను ట్రెడిషనల్‌తో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేస్తారా? ట్రెడిషన్, గ్లామరస్.. ఏ రోల్ అయినా నాకు ఓకే. మంచి సినిమాలో భాగం అవ్వాలని మాత్రం అనుకుంటాను. మీరు సినిమాలను ప్రేమిస్తారు. మిమ్మల్మి చాలా మంది ప్రేమిస్తారు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? నేను కెమెరాతో లవ్‌లో ఉన్నాను. కెమెరా ఈజ్ మై సోల్‌మేట్, కెమెరా ఈజ్ మై లవర్. మీతో జీవితం పంచుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటున్నారు? అర్థం చేసుకునేవాడు. పేరెంట్స్ వల్ల కాకుండా తనంతట తాను పేరు తెచ్చుకునేవాడు. మహిళలను గౌరవించేవాణ్ణి ఇష్టపడతా. – డి.జి. భవాని -
వైజాగ్ లో కాథరీన్, మెహ్రీన్ కౌర్, శాలిని పాండే సందడి
-
మహానుభావుడు టీజర్ అదుర్స్
-
మహానుభావుడు టీజర్ అదుర్స్
'నా పేరు ఆనంద్.. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్, ఎంటెక్ లాంటి డిగ్రీలు కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం. విపరీతమైన నీట్నెస్' అంటూ 'మహానుభావుడి'గా శర్వానంద్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్, మెహరీన్ జంటగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ గురువారం విడుదల చేశారు. అతి శుభ్రత డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా శర్వానంద్ ఈ టీజర్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కాళ్లను కాళ్లతో రొమాంటిక్ గా తాకడానికి ముందు స్ప్రే చేయడం.. బాస్‌కు తుమ్ము వచ్చినట్టయితే.. అంత దూరం పరిగెత్తుకెళ్లి.. ఇక మీరు తుమ్మండి సార్ అనడం.. హీరోయిన్ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకోబోతూ.. 'బ్రష్ చేసావా' అని ప్రశ్నించడం.. టీజర్లో హైలెట్స్.. మొత్తానికి 'భలేభలే మగాడివోయ్'లో మతిమరుపు హీరోతో నవ్వులు పూయించిన మారుతి.. ఈసారి ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ ఉన్న హీరోతో నవ్వులు పంచడం ఖాయమని టీజర్‌తో హింట్ ఇచ్చాడు. మీరూ ఓ లుక్ వేయండి. -
కళ్లతో కాదు... దిమాక్‌తో!
‘కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ – ‘దూకుడు’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఆ సినిమాలో మహేశ్ ఏదైతే చెప్పారో ఇప్పుడు రవితేజ అలానే చేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ! మరేం లేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘రాజా.. ది గ్రేట్’లో మాస్ మహారాజా రవితేజకు కళ్లు కనిపించవు. కానీ, దునియా మొత్తం అతనికి కనిపిస్తుందట. ఎలాగంటే... మాస్‌రాజా కళ్లతో కాదు, దిమాక్‌తో దునియా చూస్తాడు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్‌లా ఉండదని చిత్రబృందం అంటోంది. అలీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రఘు తదితర కమెడియన్స్ ఉన్నారీ సిన్మాలో. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్ మెహరీన్ హీరోయిన్. సరికొత్త కథతో పక్కా కమర్షియల్ పద్ధతిలో సిన్మాను తెరకెక్కిస్తున్నారట. ఆర్టిస్టులు, జోకులు... షూటింగ్ స్పాట్ యమా సందడిగా ఉంటోందట. ప్రస్తుతం డార్జిలింగ్‌లో షూటింగ్ జరుగుతోంది.