నెల్లూరంటే ఇష్టం : హీరోయిన్‌ మెహ్రిన్‌ | I Love Nellore, Raja The Great Fame Mehreen Kaur | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 7:12 AM | Last Updated on Sun, Apr 15 2018 7:12 AM

I Love Nellore, Raja The Great Fame Mehreen Kaur - Sakshi

సినీ హీరో యిన్‌ మెహ్రిన్‌కౌర్‌

సాక్షి, నెల్లూరు(బృందావనం): నెల్లూరుంటే తనకు ఎంతో ఇష్టమని రాజాది గ్రేట్‌ ఫేమ్, ప్రముఖ సినీ హీరో యిన్‌ మెహ్రిన్‌కౌర్‌ పేర్కొన్నారు.వీనులవిందైన సంగీతం, సినీతారల మెరుపులు, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపకాంతుల నడుమ నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని మైదానంలో శనివారం రాత్రి తెలుగుసినీ కళోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్‌ మెహ్రిన్‌కౌర్‌ హాజరై మాట్లాడారు. నెల్లూరుకు మళ్లీ మళ్లీ రావాలని ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు నెల్లూరుకు వచ్చానన్నారు. నెల్లూరన్నా.. నెల్లూరీయులన్నా తనకెంతో ఇష్టమన్నారు. ఎలా ఉన్నారంటూ...? ముద్దు ముద్దు మాటాలతో సింహపురీయుల్లో జోష్‌ నింపారు. 

నెల్లూరీయులంటే ఎనర్జిటిక్‌ అని మెహ్రిన్‌కౌర్‌ ప్రశంసలజల్లు కురిపించారు. స్కంద ఆర్ట్స్‌ పర్యవేక్షణలో నిర్వహించిన తెలుగుసినీ కళోత్సవ కార్యక్రమాన్ని తొలుత ఆ సంస్థ సీఈఓ సందీప్‌దంపతులు జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు. బుల్లితెర హాస్యనటులు బుల్లెట్‌భాస్కర్, సునామీ సుధాకర్, ఉదయ్, చైతన్య బృందం నిర్వహించిన(జబర్దస్త్‌ టీం) స్కిట్స్‌ నవ్వులు పూయించాయి. ప్రముఖ ల్యాండ్‌ డెవలపర్, రియల్టర్‌ సత్యంజీ గ్రూప్‌ అధినేత జి.సత్యనారాయణ, జెడ్‌ఎస్‌ న్యూస్‌ మీడియా ఇన్‌చార్జి దిలీప్, హోండా, వెస్పా సన్‌ మోటార్స్, సజావ్‌కార, సెట్నెల్, స్పోర్ట్స్‌ అథారిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. కళాకారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


జ్యోతిప్రజ్వలన చేసి కళోత్సవాన్ని ప్రారంభిస్తున్న సందీప్‌దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement