AV subbareddy
-
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఈ కక్ష ఇప్పటిది కాదు అది ఎప్పటికీ అంతమవుతుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి తరుణంలో వేసిన ఓ ప్లాన్ బెడిసికొట్టింది. చేసింది ఎవరు , చేయించింది ఎవరు ? ఎవరు ఎవరిని టార్గెట్చేశారన్న విషయం తెలిసి కూడా వాళ్లు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి ? ఇంతకీ ఈ ఫాక్ష్యన్ కసిలో రగిలిపోతున్న ఆ ఊరేంటి? ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెరెడ్డిల మధ్య కొన్నేళ్లుగా రాజకీయకక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టు కోసం ఇరువర్గాలు సమయం కోసం ఎదురుచూస్తుంటాయి. పోలింగ్ తర్వాత ఆళ్లగడ్డలో మరోసారి ఏవీ, భూమాకుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ప్రయత్నాలు జరగడం, అతడు తృటిలో తప్పించుకోవడంతో మరోసారి ఆళ్లగడ్డ ఉద్రిక్తంగా మారింది. ఈ మర్డర్ ప్లాన్ వెనుక టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నంద్యాలజిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉందన్న వాదన ఉంది. దానికి ప్రతికారం తీర్చుకునేందుకే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌ని చంపేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ వేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిల ప్రియ మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడంలేదు. సరికదా కేసు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అఖిలప్రియపై పలు కేసులున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు గురించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి ఆమె సిద్ధంగా లేరట. అందుకే బాడీగార్డ్‌పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏవీ సుబ్బారెడ్డి తరపు నుంచి కూడా ఎవరూ పెద్దగా ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు ఈ కేసుని తమదైన శైలిలో ముగించే పనిలో ఉన్నారని సమాచారం. ఇంకోవైపు ఆళ్లగడ్డలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నా ప్రజలు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
అఖిలను పక్కకు పెట్టేసినట్టే..
సాక్షి, నంద్యాల: టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి అఖిలప్రియ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అవుతుందా? సొంత కుటుంబ సభ్యులకే నచ్చడం లేదా? ఆమె ఏకాకిగా మిగిలారా? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. బాబు మోసాల ఖాతాలో మరో వికెట్ పడిందని నంద్యాల జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కూతురిగా అఖిలప్రియ వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అధికశాతం వైఎస్సార్ సీపీకే మద్దతుగా నిలిచారు. దీనికితోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచరులతోపాటు కుటుంబ సభ్యులూ తప్పుపట్టారు. అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిశోర్ రెడ్డి (అఖిలప్రియ పెదనాన్న కొడుకు) స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కిశోర్ పేర్కొన్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అఖిల వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత దోపిడీ, బెదిరింపులు, కిడ్నాప్ కేసులతో అఖిల తీరు వివాదాస్పదమైంది. బంధువులతోనూ వివాదాలు, ఆస్తి తగాదాలు రావడం, అఖిల భర్త వ్యవహారశైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. గతేడాది నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్రపై ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలను మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆమె వల్ల పార్టీ దెబ్బతింటోందని జిల్లా నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివరించారు. దీంతో ఆళ్లగడ్డ బరి నుంచి ఆమెను తప్పించాలనే నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా.. కదలిరా సభలోనూ టికెట్ విషయం తేల్చకపోవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ బాధ్యతల నుంచి అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించడం.. ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్ అఖిలప్రియకు ఇవ్వరనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబును నమ్మి భూమా కుటుంబం పెద్ద తప్పే చేసిందనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. అఖిల కూడా ఈ విషయంపై ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. -
చున్నీ లాగానని కేసు పెట్టడం బాధ కలిగించింది
నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియవి దిగజారుడు రాజకీయాలని సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆమె తనపై చున్నీలాగానని కేసు పెట్టడం బాధ కలిగించిందన్నారు. పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొత్తపల్లె గ్రామం వద్ద జరిగిన ఘటనలో తండ్రి లాంటి వయసు ఉన్న తనపై చున్నీ లాగి, హత్యాయత్నం చేసినట్లు అఖిలప్రియ కేసు పెట్టడం మహిళా సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల ఇద్దరి పరువు పోతుందని, కేసు పెట్టాలంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయని, మరీ ఇంత దిగజారడం ఏమిటని ప్రశ్నించారు. అఖిలప్రియ విధానాల వల్ల ఆమె కుటుంబ సభ్యులే దూరమవుతున్నారన్నారు. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను దూరం చేసుకుందన్నారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు తనను అరెస్టు చేయలేదన్నారు. పలుచోట్ల అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడటంతోనే అఖిలప్రియను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఇందులోనూ తన ప్రమేయం ఏమీ లేదన్నారు. అప్పు చెల్లించాలని బంధువులే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారని, తల్లి, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం ఆశించినప్పుడు వారి అప్పులు కూడా కట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. -
లోకేష్‌కు నలుగురూ వేర్వేరుగా స్వాగతం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..!
నంద్యాల: టీడీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, దివంగత భూమా నాగిరెడ్డి తనయుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ ప్రయత్నంలో భాగంగా నాయకులు నంద్యాలలో నాలుగు గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యువగళం పాదయాత్రలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ కు నలుగురు నాయకులు తమ వర్గీయులతో వేర్వేరుగా స్వాగతం పలికారు. ఈ కోవలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వారి అనుచరులు సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డిని కిందకు తోసి, చొక్కా చింపి దంతాలు ఊడే విధంగా కొట్టారు. ఈ ఘటనతో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీకి నియోజకవర్గంలో అంతంత మాత్రమే బలం ఉంది. గ్రూపు తగాదాలతో కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. యువగళం పాదయాత్రలో నారాలోకేష్ ముందే టీడీపీ నాయకులు దాడి చేసుకోవడం టీడీపీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు. భూమా అఖిలప్రియకు రిమాండ్.. సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్, పీఏ మోహన్, శక్తి వెంకటసాయినాథ్లు లతో పాటు మరో 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అఖిలప్రియతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం భూమా అఖిలప్రియను నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నంద్యాల జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. నంద్యాల మెజి్రస్టేట్ అఖిలప్రియ, భార్గవరామ్, మోహన్, సాయినాథ్‌లకు 14రోజుల పాటు రిమాండ్ విధించారు. అఖిలప్రియను కర్నూలు మహిళా సబ్‌జైలుకు , మిగిలిన వారిని కర్నూలు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. లోకేష్ పాదయాత్రలో ఎవరికి వారే బ్యానర్లు.. యువగళం పాదయాత్రలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు నంద్యాల పట్టణంలో టీడీపీ నాయకులు ఎవరికి వారు బ్యానర్లు వేయించుకున్నారు. భూమా బ్రహా్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మద్దతు దారులు వేర్వేరుగా తమ అనుచరులతో బ్యానర్లు కట్టారు. ఈ బ్యానర్లు చూసిన నంద్యాల ప్రజలు పట్టణంలో టీడీపీ నాయకులు అధికమయ్యారని నవ్వుకుంటున్నారు. ఆధిపత్యం కోసమే ఏవీపై దాడి.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల లేదంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి తరచూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధిపత్యం కోసమే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు శిరివెళ్ల మండలంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి సైతం రాళ్ల దాడి చేయించారు. అనంతరం ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు కిరాయి హంతకులతో కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై మరో సారి దాడి చేయడంతో వీరి మధ్య విభేదాలు ఎక్కడికి వెళ్తాయోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి వేడుకల్లో సైతం విభేదాలే.. ప్రతి ఏడాది జరిగే ఎన్టీ రామారావు జయంతి, వర్ధంతి వేడుకల్లో సైతం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లు వేర్వేరుగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. సోషల్ మీడియాలో సైతం ఎవరి వర్గం వారు టికెట్ మాకేనంటూ పోస్టులు పెట్టుకోవడంతో పాటు సొంత నాయకులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి మధ్య ఏడాది కాలంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలనే ప్రయత్నంతో నంద్యాలలో అఖిలప్రియ సొంత కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి వరి్ధంతి కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించడం అప్పట్లో చర్చనీయాశమైంది. భూమా అఖిలప్రియ, భూమా బ్రహా్మనందరెడ్డి.. ఏడాదిన్నర కాలంగా ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొనలేదు. టికెట్ మాకంటే మాకు అంటూ అనుచరులకు చెప్పుకుంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతు ఇచ్చే ప్రసక్తే కనిపించనంతగా విభేదాలు నెలకొన్నాయి. -
A1 అఖిలప్రియకు బెయిల్ కాదు.. జైలే
సాక్షి, నంద్యాల: టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో భూమా అఖిల ప్రియను ఆమె భర్త భార్గవ్ రామ్ ను మరో ఇద్దరిని హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ అఖిలప్రియ, ఆమె భర్త JFCM ఇంచార్జ్ జడ్జి ఆదినారాయణకు విన్నవించుకున్నారు. అయితే అఖిలప్రియ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు.. ఆమెకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 30 వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో మాజి మంత్రి అఖిలప్రియను కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. అసలేం జరిగిందంటే టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. (చదవండి: ఆళ్లగడ్డలో తన్నుకున్న తెలుగుదేశం నేతలు) ఉదయం ఏం జరిగిందంటే ఈ దాడి ఘటన కేసులో నలుగురు నిందితులను నంద్యాల పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల.. 11 మందిపై కేసులు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. (చదవండి : అఖిలను కన్న బిడ్డలా పెంచితే మా నాన్నను చంపేందుకు ప్రయత్నించింది: జశ్వంతి) ఈ నలుగురిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, అఖిలప్రియ పీఏ మోహన్, ఆమె అనుచరుడు సాయి ఉన్నారు. ఇక, పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఐపీసీ 307, 120B, 324, రెడ్ విత్ 34సెక్షన్ కింద భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా నిందితులపై కేసులు నమోదు చేశారు. నిందితులు వీరే.. - భూమా అఖిల ప్రియా.. A1 - అఖిల ప్రియా అనుచరుడు సాయి.. A4 - అఖిల ప్రియా పిఏ మోహన్.. A7 - మద్దురూ భార్గవ్ రామ్.. A11. -
అఖిలప్రియ పోటీ చేస్తే నేనే బరిలో దిగుతా: ఏవీ సుబ్బారెడ్డి కూతురు
-
అఖిలప్రియకు టీడీపీ షాక్!
సాక్షి, నంద్యాల: టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఖిలప్రియకు టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి విషయంలో వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని అఖిలప్రియకు పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఇదిలా ఉండగా.. నంద్యాలలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ఈ దాడి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. అఖిల ప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే ఆమె పతనం కోసం పని చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. అఖిల ప్రియను ఓడించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని జశ్వంతిరెడ్డి అన్నారు. రోడ్డు మీద, బరి తెగించి.. ఎత్తుకుని పెంచిన ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏమిటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అఖిల ప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. (చదవండి, జశ్వంతి వీడియో చూడండి : అఖిలప్రియ గురించి ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి ఏమి చెప్పిందంటే.?) ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి! -
అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి అల్టిమేటం
సాక్షి, నంద్యాల: ప్రతీసారి ఉమెన్‌కార్డును చూపిస్తూ సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ టీడీపీ నేత భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి మండిపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆమె.. అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా నాన్న అఖిలప్రియను సొంత కూతురిలా పెంచి పెద్ద చేశాడని, అయితే అఖిల ప్రియ మాత్రం చివరకు తన తండ్రిని చంపడానికి కూడా వెనుకాడలేదని జశ్వంతి ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్మీట్లకు పిల్లాడిని తీసుకురాకుండా.. సరిగ్గా అరెస్ట్ సమయంలో సంకలో పిల్లాడిని ఏస్కుని సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ అఖిలప్రియపై జశ్వంతిరెడ్డి మండిపడ్డారు. అఖిలప్రియ నీచమైన బతుకు బతుకుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఏదైతే చేశావో. తగిన శాస్తి జరుగుతుందని అఖిలప్రియకు శాపనార్థాలు పెట్టారు. అఖిలప్రియకు గనుక టికెట్ ఇస్తే.. తాను, తండ్రి ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ వర్గం అంతా ఆమెను ఓడించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు జశ్వంతి. అలాగే పార్టీ గనుక ఆదేశిస్తే.. తాను, తన తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరం పోటీకి దిగుతామని స్పష్టం చేశారామె. పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ.. ఏ ప్రెస్‌మీట్ పెట్టలేదని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చేందుకే తాను లైవ్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారామె. -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి!
సాక్షి, నంద్యాల: నంద్యాలలో రోడ్డున పడ్డ తెలుగుదేశం పరువును అర్జంటుగా కాపాడేందుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు రంగంలోకి దిగారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలుగవద్దని, పార్టీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినొద్దంటూ కింది క్యాడర్ కు సందేశమిచ్చారు చంద్రబాబు. కొట్టుకున్నది చాలు, కేసులు వద్దు అంటూ రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు ఇదే జిల్లాలో పాదయాత్ర, మరో వైపు సొంత పార్టీలోనే కుమ్ములాటలు బాబుకు ఇరకాటంగా మారాయి. నిన్న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడులకు దిగిన భూమా అఖిలప్రియను, దెబ్బలు తిన్న ఏవీ సుబ్బారెడ్డిని రాజీపరిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అఖిలప్రియపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డిపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కానీ, చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ కేసు విషయంలో రాజీపడే ప్రస్తకే లేదని ఏవీ సుబ్బారెడ్డి ఫిక్స్ అయినట్టు ఆయన వర్గం చెబుతోంది. ఇదిలా ఉండగా.. తనపై దాడికి పాల్పడినట్టు ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా ఏవి సుబ్బారెడ్డినే తనపై దుర్భాష లాడి దాడికి యత్నించారని అఖిలప్రియ నేరుగా డిజిపి కి ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఏవి సుబ్బారెడ్డిపై నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది భూమా అఖిల ప్రియ. నిన్న జరిగిన ఘటనలో తమపై ముందుగా ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారని, తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి జరిగిందని తెలిపింది. మరోవైపు.. వీరిద్దరిని రాజీకి ఒప్పించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ ఫరూఖ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన భూమా అఖిలప్రియను పాణ్యం నుంచి నంద్యాల తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నంద్యాల కోర్టులో జడ్జి ముందు అఖిలప్రియను హాజరు పరిచారు పోలీసులు. ఇది కూడా చదవండి: కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్ -
Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు
నంద్యాల: వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా నంద్యాల టీడీపీ నేతల మధ్య అప్పుడే మూడు ముక్కలాట మొదలైంది. నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వర్గ పోరు బాట పట్టారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి లోలోపల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమదంటే తమదేనని అనుచరులకు చెప్పుకుంటూ వర్గ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి ప్రజల నుంచి మద్దతు లేక విలవిలలాడుతుంటే నాయకుల వర్గపోరు టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పి తెప్పిస్తోంది. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ లాడ్జ్‌లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు హాజరయ్యారు. చదవండి: ('ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు.. కాసింత బువ్వ పెట్టండ్రా') ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్ తనయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ.. ‘క్లస్టర్ సమావేశానికి తనను ఏ కారణం చేత పిలువలేదో అర్థం కావడం లేదు. జిల్లా ప్రధాన కార్యదర్శినే పిలువక పోతే ఎలా? మన మధ్య ఐక్యత లేకుంటే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమావేశానికి తాను ఎవరినీ పిలువలేదని, టీడీపీ కార్యాలయం నుంచే ఫోన్లు చేశారని, ఒకరిని దూరంగా ఉంచాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే సమావేశానికి ఫరూక్, ఆయన తనయుడు ఫిరోజ్ హాజరైనా వారి అనుచరులను మాత్రం సమావేశానికి దూరంగా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా సమావేశంలోనే ఫిరోజ్ తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏవీ జాడ ఏదీ.. క్లస్టర్ సమావేశానికి సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి గైర్హాజరై, తన వర్గాన్ని కూడా దూరంగా ఉంచడంతో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి, ఫరూక్‌కు టికెట్ వచ్చే పరిస్థితి లేదని, గతంలో వారికి అవకాశం ఇచ్చారని, ఈ సారి కొత్త నాయకుల వైపు అధిష్టానం చూస్తుందని, వచ్చే ఎన్నికల్లో తనకే నంద్యాల అసెంబ్లీ టికెట్ వస్తుందని అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యనాయకులు దూరం నంద్యాల క్లస్టర్ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. టీడీపీ ముస్లిం, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా, మాజీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఇంతియాజ్ అహమ్మద్, మాజీ కౌన్సిలర్ మిద్దె హుసేనితో పాటు ప్రముఖ టీడీపీ నాయకులు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. నాయకుల మధ్య విభేదాలు ఉండటం, ఒకరినొకరు విమర్శించుకోవడం, పార్టీ పదవుల్లో కష్టపడిన వారికి కాకుండా నాయకుల అనుచరులకే పదవులు దక్కడంతో అసంతృప్తికి లోనైన పలువురు నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. -
అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్‌పేట్ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్ఐఆర్లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్‌రామ్, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. (చదవండి: బోయిన్పల్లి కిడ్నాప్: వెలుగులోకి సంచలన విషయాలు) కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్ల పోలీసులకు బాధితులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వే నం.80లో 2016లో 25 ఎకరాలను బాధితులు కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్‌రామ్ వాదిస్తున్నారని, ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నారు.. భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారని, ఇంకా డబ్బులు కావాలని నిందితులు డిమాండ్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. భూమా అఖిలప్రియపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద కేసులను పోలీసులు నమోదు చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు సికింద్రాబాద్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. టీడీపీ నేత అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా, ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్‌కుమార్ సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్‌రామ్ లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్.. డబ్బు చెల్లించారు. సెటిల్మెంట్ విషయం తెలిసి అఖిలప్రియ మండిపడ్డారు ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు దగ్గర ఎలాగైన డబ్బు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు ప్లాన్ వేశారు. సాయి అనే వ్యక్తితో కలిసి అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ తర్వాత ఓఆర్ఆర్ వద్ద ఖాళీ బాండ్ పేపర్‌పై కిడ్నాపర్లు సంతకాలు చేయించారు. సంతకాల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ పేర్లను కిడ్నాపర్లు ప్రస్తావించారు. సంతకాలు తీసుకునే సమయంలోకిడ్నాపర్లు కర్రలతో దాడి చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను ముందే అదుపులోకి తీసుకోకుంటే.. సాక్ష్యాధారాలు తారుమారు చేసేవారని పోలీసులు భావించారు. అఖిలప్రియ, భర్త భార్గవ్రామ్కు నేర చరిత్ర ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు.. కొన్నేళ్ల క్రితం భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు హఫీజ్ పేట్లో భూములు కొనుగోలు చేశారు. ప్రవీణ్‌రావ్ తండ్రి కిషన్ రావ్.. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలో కిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. భూమా మరణం తర్వాత ఏవీ సుబ్బా రెడ్డి ల్యాండ్ విషయంలో రంగంలోకి దిగారు. ఏవీ ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్‌లోకి ప్రవేశించారు. ( బెంగళూరులో ఏ-3 భార్గవరామ్? ) ఈ నేపథ్యంలో 2020లో ఏవీ సుబ్బారెడ్డిపై కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్‌రావ్ ట్రెస్ పాస్ కేసు పెట్టారు. గతంలోనే 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు ఏవీ సుబ్బారెడ్డి మీడియేషన్ చేశారు. సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది. కానీ, మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్‌రావ్‌పై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌కు పాల్పడ్డారు. -
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్ట య్యారు. హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావుతోపాటు ఆయన సోదరులను మంగళవారం రాత్రి సినీఫక్కీలో కిడ్నాప్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అఖిలప్రియను ఏ1గా నిర్ధారించిన హైదరాబాద్ పోలీసులు.. బుధవారం ఆమెను అరెస్టు చేసి మారేడుపల్లిలోని 11వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆశాలత 14 రోజుల రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. భూవివాదమే కారణం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేటలో 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్‌నకు కారణమని తెలుస్తోంది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోద రులు సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా ఆ స్థలాన్ని తమ పేరుతో రాయించుకోవాలని అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ పథ కం వేశారు. ఈ బాధ్యతల్ని తమ అనుచరుడైన శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. నేరచరిత్ర ఉన్న ఇతడిపై గుంటూరులో రౌడీషీట్ ఉన్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం రంగంలోకి దిగిన గుంటూరు శ్రీను.. సాయి, చంటి, ప్రకాష్ సహా 14మంది శ్రీకృష్ణనగర్‌లో ఉన్న భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్లో సమావేశమయ్యారు. అక్కడే తాము వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్, మహేంద్ర వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చి నకిలీవి తగిలించారు. అధికారుల్లా కనిపించేందుకు అందరూ ఫార్మల్ వస్త్రాలు, మెడలో టైలు ధరించారు. ఓ నిందితుడు పోలీసు యూనిఫాం వేసుకుని చేతితో లాఠీ కూడా పట్టున్నాడు. ఇవన్నీ ఫిల్మ్‌నగర్‌లో సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇచ్చే దుకాణం నుంచి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డులు, బోగస్ సెర్చ్ వారెంట్లు కూడా తయారు చేసుకున్నారు. సోదాల పేరుతో హడావుడి చేసి... అంతా సిద్ధమైన తర్వాత మూడు వాహనాల్లో బయలుదేరి రాత్రి 7.20 గంటల ప్రాంతంలో బోయిన్‌పల్లిలో ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. ప్రవీణ్, సునీల్, నవీన్‌లను హాలులో ఉంచిన నిందితులు.. మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఓ బెడ్రూమ్లో బంధించారు. దాదాపు 20 నిమిషాలు సోదాల పేరుతో హడావిడి చేశారు. అనంతరం ఆ ముగ్గురి కళ్లకూ గంతలు కట్టి బయటకు తీసుకొచ్చారు. ముగ్గురినీ వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని వారి చేతులు, కాళ్లూ కట్టేశారు. బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్, ప్యాట్నీ, మెహదీపట్నం మీదుగా చిలుకూరులో ఉన్న భార్గవ్ స్నేహితుడి ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురినీ నిర్బంధించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోవైపు రాత్రి 8.20 గంటల ప్రాంతంలో పొరుగింట్లో ఉండే సచిత అనే మహిళ ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చారు. ఓ గది నుంచి శబ్దాలు రావడం, బయట నుంచి గడియపెట్టి ఉండటం గమనించిన ఆమె.. తలుపు తీశారు. దీంతో గది బయటకు వచ్చిన కుటుంబీకులు ప్రవీణ్, నవీన్, సునీల్ కనిపించకపోయే సరికి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కిడ్నాప్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. జల్లెడ పట్టిన ప్రత్యేక బృందాలు... ప్రవీణ్‌రావు తదితరులు కిడ్నాప్ అయిన విషయాన్ని వారి బంధువు కె.మనీష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 15 బృందాలను రంగంలోకి దింపారు. మూడు కమిషనరేట్లలో పోలీసులు జల్లెడ పడుతుండటం, ఇరుగుపొరుగు రాష్ట్రాలకూ సమాచారం ఇవ్వడం, మీడియా హడావుడి నేపథ్యంలో నిందితులు పునరాలోచనలో పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కోకాపేట వద్ద బందీలను వదిలేశారు. బాధితులు ఆ విషయాన్ని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్‌కు చెప్పడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ముగ్గురినీ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బుధవారం ఉదయం 11.20 గంటలకు బోయిన్పల్లి పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బేగంపేటలోని మహిళా ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం 12.40కి అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో హైడ్రామా.. అఖిలప్రియ అరెస్టు అనంతరం గాంధీ ఆస్పత్రి వద్ద స్వల్ప హైడ్రామా చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో వాహనం దిగుతూనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియతోపాటు కుటుంబసభ్యులు హంగామా చేశారు. అఖిలప్రియకు ఫిట్స్ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్నారని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. ఆమె గర్భవతి అని కూడా అబద్ధాలు చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు గంటలపాటు అఖిలప్రియకు అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె గర్భవతి కాదని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు. అనంతరం అఖిలప్రియను మీడియా కంటపడనీయకుండా పోలీసులు అక్కడ నుంచి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో సుబ్బారెడ్డి ఈ కిడ్నాప్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీ సుబ్బారెడ్డిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో నివసించే సుబ్బారెడ్డి.. ఈ కేసులో తన పేరు రావడంతో మీడియాతో మాట్లాడారు. మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ విషయం గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కిడ్నాప్లతో నాకు సంబంధం లేదు ప్రవీణ్‌రావుతో కొన్ని అంశాల్లో వివాదాలు ఉన్నాయి. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్లతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను నిందితుడిగా ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. గతంలో భూమా అఖిలప్రియ తదితరులు నన్ను చంపడానికి ప్రయత్నించారు. కొందరికి సుపారీ కూడా ఇచ్చారు. అలాంటివారితో కలిసి ఎలా పనిచేస్తాను? – మీడియాతో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే.. హఫీజ్‌పేట్: ఈ కిడ్నాప్ వ్యవహారానికి కారణమైన భూమి అత్యంత విలువైనదేనని తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం న్యూ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 80లోని 25 ఎకరాల భూమిపై ఏళ్లుగా వివాదం నెలకొంది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి తమదంటే తమదంటూ ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే, అది ప్రభుత్వ భూమేనని ఆధారాలతో నిర్ధారించలేకపోవడంతో 2003లో హైకోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్‌రావు తదితరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరి కిడ్నాప్‌కు దారితీసినట్టు తెలుస్తోంది. 17 ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా.. సర్కారు మాత్రం అది ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును పున:సమీక్షించాలని గత నెలలో సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ!) -
కర్నూలు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు
-
అఖిలప్రియపై సంచలన ఆరోపణలు
సాక్షి, కర్నూలు : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడుపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరు తనను చప్పేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తనను చంప్పేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఊహించని రీతిలో బాంబు పేల్చారు. దీనిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు. అనంతరం పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని, భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను వేడుకున్నారు. తాజా ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ భర్తపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయిన విషయం తెలిసిందే. (అఖిలప్రియ భర్తపై మరో కేసు) -
టీడీపీ నేతపై హత్యాయత్నం కేసు; కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారి మాదా శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డి హత్య కేసుకు సంబంధించి జరిపిన ఆర్థిక లావాదేవీల్లో శ్రీనివాసులు ముఖ్య పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. సుబ్బారెడ్డి హత్యకు నిందితులు రూ.50 లక్షలు సుపారీగా తీసుకున్నట్లు వెల్లడైంది. కాగా.. హత్య కేసుకు సంబంధించి మార్చి 21న పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిందితులు అందించిన సమాచారం మేరకు సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రెండు మొబైల్స్, ఒక వాహనం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే చాలా కాలంగా భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు నడుస్తున్నాయి. తనను హత్య చేసేందుకు భూమా కుటుంబం ప్రయత్నిస్తోందని గతంలోనే ఏవీ సుబారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు తెరలేపిన ప్రధాన సూత్రదారులను త్వరలోనే పట్టుకుంటామని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. చదవండి: ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు -
ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, వైఎస్సార్ కడప : ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను చిన్న చౌక్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.. ఏవి సుబ్బారెడ్డిని హతమార్చేందుకు నిందుతులు రూ.50లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందినవారేనని పేర్కొన్నారు. కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 3.20 లక్షల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు, సంజురెడ్డి అనే నిందితుడు సూడో నక్సలైట్‌గా తేలింది. ఇప్పటికే రెండుసార్లు సుబ్బారెడ్డి ఇంటిని రెక్కి చేసిన నిందితులు.. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు బయపడి వెనక్కి వచ్చారు. -
తేలని భూమా, ఏవీ పంచాయితీ..
సాక్షి, అమరావతి : భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరింది. రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే.. దీంతో గురువారం భూమా అఖిలప్రియ, ఆమె సోదరి మౌనికా రెడ్డి, సోదరుడు బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి తరపున ఆయన, కుమార్తె ఏవీ జశ్వంతి రెడ్డి చంద్రబాబు సమక్షంలో సుదీర్ఘ చర్చలకు కూర్చున్నారు. ఇరువర్గాలతో వేరువేరుగా చర్చలు జరిపిన చంద్రబాబు ఇరువురి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదని సమాచారం. ఇరు వర్గాలు చంద్రబాబు ఎదురుగానే పరస్పర విమర్శలకు దిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భూమా నాగిరెడ్డి మరణానంతరం సుబ్బారెడ్డి తనదైన శైలిలో ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియా మండిపడ్డారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే ఏవీ సుబ్బారెడ్డికి తమ మద్దతు ఉంటుందని, కానీ ఇలాంటి చవకబారు రాజకీయాలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అయితే పార్టీ కార్యక్రమాలపై దాడి చేయించడం ఏంటని ఏవీ సుబ్బారెడ్డి నిలదీశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే రాజీనామాలకు సైతం వెనుకాడబోమని అఖిల ప్రియ హెచ్చిరించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సుధీర్ఘంగా ఇరువురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం మరోసారి చర్చలకు రావాలంటూ దీంతో ముఖ్యమంత్రి, ఇరువర్గాలకు సూచించారు. -
అఖిలప్రియ భయపడుతోంది
-
‘భూమా ఫ్యామిలీతో సంబంధాలు తెగిపోయాయి’
సాక్షి, అమరావతి : తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని టీడీపీ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ కుటుంబాన్ని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డలో సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. అయితే అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ అఖిలప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. దీంతో ఆళ్లగడ్డ పంచాయితీ రేపటికి వాయిదా పడింది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి ..అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. తనపై జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు అందచేశారు. ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ...‘ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాళ్లదాడులు సరికాదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దాడికి సంబంధించిన ఆధారాల్నీ ముఖ్యమంత్రికి అందచేస్తా. పార్టీ ఆదేశాల మేరకే సైకిల్ ర్యాలీ చేశారు. రాజకీయంగా వారికి అడ్డు వస్తున్నాననే నాపై దాడులు చేస్తున్నారు. రాళ్లదాడి చెత్త. ఇలాంటివి చాలానే చూశాను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. ఏవీ సుబ్బారెడ్డి అంటే భయం, భక్తి లేదు. కనీసం వయస్సుకు కూడా పెద్దరికం ఇవ్వలేదు. ప్రత్యర్థులు కూడా నాపై దాడి చేయడానికి సాహసం చేయరు. అలాంటిది ఆమె నాపైనే దాడి చేయిస్తుందా?. అఖిలప్రియ భయపడుతోంది.. నా ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు స్పందించాలి కదా. మంత్రి సైకిల్ ర్యాలీ కంటే నాకే ఎక్కువ ఆదరణ లభించింది. అఖిలప్రియ తన గ్రాఫ్ పడిపోతోందని భయపడుతోంది. అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు. అలాంటిది ఆమె గురించి మాట్లాడాలంటే నా పెద్దిరికం అడ్డు వస్తోంది. అందుకే నా తరఫున నా కూతురు మాట్లాడింది. ఇంత జరిగాక, ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. అయితే రాజకీయపరంగా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందే. ఇక వ్యక్తిగతంగా వస్తే భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధానికి తెరపడినట్లే. సీఎంతో సమావేశానికి అఖిల ఎందుకు రాలేదో అర్థం కాలేదు. రేపు సాయింత్రం సీఎంతో సమావేశం అవుతున్నాం.’ అని తెలిపారు. -
రాజధానికి చేరుకున్న ఆళ్లగడ్డ పంచాయతీ
-
ఆళ్లగడ్డ పంచాయితీకి అఖిలప్రియ డుమ్మా!
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీ ఎట్టకేలకు అమరావతికి చేరింది. సైకిల్ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి ఘటనపై అమరావతి రావాల్సిందిగా ఏపీ పర్యాటక శాఖమంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన విషయం విదితమే. దీంతో ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. కాగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...వారిద్దర్నీ బుధవారం సాయంత్రం అమరావతికి వచ్చి కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సీఎం కలవమని చెప్పిన ఒకరోజు ముందే ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కడం గమనార్హం. ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారకముందే ...మంగళవారం రాత్రి అఖిలప్రియ చేపట్టిన సైకిల్ యాత్ర అలాంటి వాతావరణాన్నే పునరావృతం చేసింది. అయితే పోలీసుల పర్యవేక్షణలో చివరకు సైకిల్‌యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆళ్లగడ్డలో తారాస్థాయికి వర్గపోరు
-
ఏం జరిగినా అఖిలప్రియదే బాధ్యత: జశ్వంతి
సాక్షి, ఆళ్లగడ్డ : తన తండ్రికి ఏం జరిగినా అందుకు మంత్రి అఖిలప్రియే బాధ్యత వహించాలని టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి అన్నారు. అఖిలప్రియ తన వాహనాలపై భూమా స్టిక్కర్ తీసివేసి మంత్రి అఖిలప్రియగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎంతో సేవ చేశాడు. ర్యాలీ సందర్భంగా నాన్నపై దాడి జరగడం చాలా బాధ కలిగించింది. నాన్నకు ఏదైనా జరిగింతే అఖిలక్కా నువ్వు బాధ్యత తీసుకుంటావా?. మామా మామా అంటూ మా నాన్నకు ఇచ్చే గౌరవం ఇదా?. మీడియా ముందు మాత్రం మేమంతా కలిసిపోయాం అని చెబుతావు. వెనుక మాత్రం చేయాల్సింది చేస్తున్నావ్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నా?. నాన్న కన్నా అఖిలప్రియ 35ఏళ్లు చిన్నది. కనీసం నాన్న వయసు అయినా గౌరవం ఇవ్వడం నేర్చుకో.’ అని జశ్వంతి రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఆళ్లగడ్డలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి మీద నిన్న రాళ్ళ దాడి జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆ దాడి భూమా అఖిలప్రియ వర్గీయులే చేశారని సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి తనపై దాడి జరిగి 24 గంటలు దాటినా ఇప్పటివరకూ దుండగులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాళ్లదాడికి కారకులైన మంత్రి అఖిలప్రియపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఈ కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ పంచాయితీ పార్టీ అధిష్టానం వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి.