AV Subba Reddy Daughter Jaswanthi Reddy Comments On Bhuma Akhila Priya, Details Inside - Sakshi
Sakshi News home page

అఖిలప్రియకు గనుక టికెట్‌ ఇస్తే.. చంద్రబాబుకు ఏవీ సుబ్బారెడ్డి కూతురి అల్టిమేటం

Published Wed, May 17 2023 4:25 PM | Last Updated on Wed, May 17 2023 5:47 PM

av subba reddy daughter jaswanthi Comments On bhuma akhila priya  - Sakshi

సాక్షి, నంద్యాల: ప్రతీసారి ఉమెన్‌కార్డును చూపిస్తూ సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ టీడీపీ నేత భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి   మండిపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేసిన ఆమె.. అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా నాన్న అఖిలప్రియను సొంత కూతురిలా పెంచి పెద్ద చేశాడని, అయితే అఖిల ప్రియ మాత్రం చివరకు తన తండ్రిని చంపడానికి కూడా వెనుకాడలేదని జశ్వంతి ఆవేదన వ్యక్తం చేశారు

ప్రెస్‌మీట్‌లకు పిల్లాడిని తీసుకురాకుండా.. సరిగ్గా అరెస్ట్‌ సమయంలో సంకలో పిల్లాడిని ఏస్కుని సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ అఖిలప్రియపై జశ్వంతిరెడ్డి మండిపడ్డారు. అఖిలప్రియ నీచమైన బతుకు బతుకుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఏదైతే చేశావో. తగిన శాస్తి జరుగుతుందని అఖిలప్రియకు శాపనార్థాలు పెట్టారు.  

అఖిలప్రియకు గనుక టికెట్‌ ఇస్తే.. తాను, తండ్రి ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ వర్గం అంతా ఆమెను ఓడించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు జశ్వంతి. అలాగే పార్టీ గనుక ఆదేశిస్తే.. తాను, తన తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరం పోటీకి దిగుతామని స్పష్టం చేశారామె. పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ.. ఏ ప్రెస్‌మీట్‌ పెట్టలేదని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చేందుకే తాను లైవ్‌ వీడియో రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement