bhuma akhila priya
-
ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిషోర్‌రెడ్డి సవాల్
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చర్చకు సిద్ధంగా ఉన్నామని.. అన్ని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌పై అఖిల ప్రియ ఆరోపణలు చేయడం అవివేకం. విజయ పాల డైరీలో బకాయిలు, మేము ఎత్తిచూపించాము. అఖిల ప్రియా, ఆమె సోదరుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కొత్తూరు కోట కొండల్లో మైనింగ్ చేసి ఇటుక బట్టిలకు మట్టిని అమ్ముకుంటున్నారు.. ఆళ్లగడ్డలో బెదిరింపులు పాల్పడుతూ.. రాజకీయాలు చేస్తున్నారు. విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డదారులో చైర్మన్ కావాలని చూస్తున్నారు’’ అని కిషోర్ రెడ్డి మండిపడ్డారు.జగత్ విఖ్యాతరెడ్డి విజయ డెయిరీ ఎన్నికలకు అర్హుడు కాదు. ప్రజల కోసం ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నాం. వారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కార్యకర్తల, ప్రజలు వ్యతి రేకిస్తున్నారు’’ అని కిషోర్‌రెడ్డి అన్నారు. -
నీ బాలకృష్ణ డైలాగులు ఆపి.. అఖిల ప్రియకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్
-
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు షాక్
-
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా అఖిల ప్రియ.. భూమా కిషోర్‌రెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల జిల్లా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడటం కంటే ఆళ్లగడ్డలో జరిగే అరాచకాల గురించి మాట్లాడితే బాగుండేదంటూ భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపాలిటీలో ఉద్యోగాల కోసం రెండు లక్షల తీసుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు.‘‘అసెంబ్లీలో ఆళ్లగడ్డ రైతుల ప్రస్తావన రాకపోవడం, మద్దతు ధర గురించి మాట్లకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పెరిగాయని బాదుడే బాదుడు అంటూ తిరిగారు. కూటమి ప్రభుత్వం హయాంలో గతంలో కంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. 15 మంది ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లు చేస్తున్నారు. తర్వాత వడ్డీతో సహా చెల్లించేలా చేస్తాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బెల్టు షాపులు, కల్తీ మద్యం అమ్ముతున్నారు ముందు వాటి గురించి తేల్చడంటూ భూమా కిషోర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
సొంతపార్టీ నేతలపైనా అఖిలప్రియ రెడ్ బుక్ పడగ
-
భూమా అఖిల ప్రియపై ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం
-
ఆళ్లగడ్డలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తా.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మందిమార్బలంతో డెయిరీ ప్రాంగణంలోని చైర్మన్ గదిలోకి వెళ్లారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడి అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలాఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యకం చేశారు. తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని అఖిల సూచించారు.‘నాతో మామగా మాట్లాడుతున్నావా... లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నంద్యాలకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని.. తమ పరిధిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. -
అఖిల ప్రియా ఓవర్ యాక్షన్ పై మామ స్ట్రాంగ్ రియాక్షన్...
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్‌బుక్ రాజ్యాంగం
-
అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం.. మహిళపై దాడి
సాక్షి, నంద్యాల: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే పచ్చ మంద.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇక, తాజాగా నంద్యాల జిల్లాలో అఖిలప్రియ మద్దతుదారులు మహిళలపై భౌతిక దాడులు చేస్తున్నారు.ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగంనంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి కబ్జాలు చేస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కొండయ్య కూతురిపై పచ్చ మంద విరుచుకుపడింది. అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి ఆమెను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. చేయి విరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.నా టార్గెట్ వంద మంది: అఖిలప్రియకొన్ని రోజుల క్రితమే తనకు ఓ రెడ్ బుక్ ఉంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు. వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్.. అఖిలప్రియ
సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. రెడ్‌బుక్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రజాపాలన, ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను టార్గెట్ చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా మీడియాలో బహిరంగంగానే భూమా అఖిలప్రియ.. వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు.ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు ఓ రెడ్ బుక్ ఉంది. అందులో వంద మందికిపైగా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. పాపం పోనీలే అని ఇద్దరు, ముగ్గురిని వదిలేస్తున్నాను. కానీ, వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో వంద మంది కచ్చితంగా ఇబ్బంది పడబోతున్నారు. వారి పేర్లు నా రెడ్ బుక్‌లో ఉన్నాయి అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు.అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను కదా. అదే విధంగా ఎవరినీ వదిలిపెట్టను. అందరి తోలుతీస్తాను. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. -
భూమా అఖిల ప్రియాపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
అఖిల ప్రియ అడ్డాలో అరాచకం
-
అఖిల ప్రియVs ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌పై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిల ప్రియ ర్యాలీగా బయలుదేరగా, ర్యాలీలో వెళ్తుండగా ఏవీ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్, రిలయన్స్ మార్ట్ పై అఖిల ప్రియ అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాల విషయం తెలిసిందే. గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇటీవల ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డుపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
ఇదేందయ్యా.. భార్గవా?
సాక్షి, నంద్యాల: నంద్యాల పార్లమెంట్ స్థానానికి ఓ వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఉపసంహరించుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆయన ఎవరో కాదు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ రామ్ నాయుడు. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లలో చివరి రోజు ఈనెల 25వ తేదీ భార్గవ రామ్ చడీచప్పుడు కాకుండా నంద్యాల ఎంపీగా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు తాను సమర్పించిన నామినేషన్ల పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శబరి.. అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇస్తేనే భార్గవరామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని.. లేని పక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామని అఖిల ప్రియ చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో టీడీపీలో హైడ్రామా నడిచింది. భార్గవరామ్ తన నామినేషన్ విత్‌డ్రా చేసుకోకుంటే పార్టీ పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలు చేయడంతో భార్గవ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ‘సార్.. ఏం ఆశించి నామినేషన్ వేశారో’ అన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఈ తంతంగంపై బైరెడ్డి శబరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
వివరాలు చెప్పండి.. అఖిలమ్మ అడగమంది!
ఆళ్లగడ్డ: ఓటమి భయంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని భూమా అఖిలప్రియ ఓటర్లకు ఎర వేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టి.. కులాల మధ్య కుంపటి రాజేసి గెలుపొందాలని కుటిల ప్రయత్నం చేస్త్తున్నారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్ట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ వైపు ఉన్నారనే సమాచారంతో ఆపార్టీ నేతలు, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేయాలనే ప్రయత్నంలో దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు గ్రామాలు, వార్డులను ఎంచుకుని ఇంటింటికి తిరిగి ఫోన్ నంబర్లతో సహా వివరాలు సేకరిస్తున్నారు. వాటిని అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు అందజేస్తున్నారు. ఆయన నాయకులకు ఫోన్ చేసి నగదు ఆశ చూపడమే కాక ‘పెత్తనం మీదేనంటూ’ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఎంతో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ ప్రలోభాలుక లొంగకుండా ధీటుగా సమాధానం చెబుతున్నారు. చాగలమర్రి, రుద్రవరం మండలాల పరిధిలోని సీనియర్ నాయకులకు ఇదే తరహాలో ఫోన్ వస్తే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫోన్ కట్ చేసిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సొంత మండలమైన రుద్రవరాన్ని టీడీపీ నాయకులు టార్గెట్ చేసి ప్రలోభాల పర్వానికి తెరతీశారని తెలుస్తోంది. మండల కేంద్రం రుద్రవరానికి చెందిన బలిజ సంఘం నాయకుడు అఖిలప్రియ భర్తతో కలిసి వైఎస్సార్సీపీకి చెందిన బలిజ నేతలే లక్ష్యంగా నిత్యం ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే పెత్తనం అంతా మీదే అని ఖర్చులకు నగదు కూడా ఇస్తామని అఖలప్రియ భర్త భార్గవరామ్ నేరుగా ప్రలోభపెడుతున్నారని సమచారం. ఎన్నికల నియమావళి ఉల్లంఘనే.. అనుమతి లేకుండా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఏం పనిచేస్తారు. ఏ కులం, ఏ పార్టీకి ఓటు వేస్తారని వివరాలు అడగటంతో పాటు ఫోన్ నంబర్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు కూడా సేకరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ముమ్మాటికీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఓటర్ల వివరాలతో పాటు ఇంటి పెద్ద ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు అడిగితే తప్పులేదని ప్రలోభాలకు గురిచేయడం, వ్యక్తిగత వివరాలు సేకరించే వ్యక్తులపై ఆధారాలు తమకు సమర్పిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎందుకు అంటే ఏమి చెప్పడం లేదు టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు మా ఇంటితో పాటు చుట్టూ ఉన్న వాళ్ల ఇళ్ల దగ్గరకు వచ్చి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఏం పనిచేస్తున్నారు? మీరు ఏ పార్టీ.. అంటూ వివరాలు అడిగి విషయాలు రాసుకున్నారు. ఫోన్ నంబర్లతో పాటు కొందరి బ్యాంక్ అకౌంట్ కూడా అడిగి రాసుకున్నారు. ఎందుకు అంటే అఖిలమ్మ రాసుకు రమ్మంది అంటున్నారు. అంతకంటే ఏమీ చెప్పడం లేదు. – నజీర్, రహిమాన్ వీధి, ఆళ్లగడ్డ -
భూమా అఖిలప్రియకు చంద్రబాబు హుహించని షాక్..!
-
అఖిలను పక్కకు పెట్టేసినట్టే..
సాక్షి, నంద్యాల: టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి అఖిలప్రియ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అవుతుందా? సొంత కుటుంబ సభ్యులకే నచ్చడం లేదా? ఆమె ఏకాకిగా మిగిలారా? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. బాబు మోసాల ఖాతాలో మరో వికెట్ పడిందని నంద్యాల జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కూతురిగా అఖిలప్రియ వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అధికశాతం వైఎస్సార్ సీపీకే మద్దతుగా నిలిచారు. దీనికితోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచరులతోపాటు కుటుంబ సభ్యులూ తప్పుపట్టారు. అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిశోర్ రెడ్డి (అఖిలప్రియ పెదనాన్న కొడుకు) స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కిశోర్ పేర్కొన్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అఖిల వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత దోపిడీ, బెదిరింపులు, కిడ్నాప్ కేసులతో అఖిల తీరు వివాదాస్పదమైంది. బంధువులతోనూ వివాదాలు, ఆస్తి తగాదాలు రావడం, అఖిల భర్త వ్యవహారశైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. గతేడాది నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్రపై ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలను మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆమె వల్ల పార్టీ దెబ్బతింటోందని జిల్లా నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివరించారు. దీంతో ఆళ్లగడ్డ బరి నుంచి ఆమెను తప్పించాలనే నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా.. కదలిరా సభలోనూ టికెట్ విషయం తేల్చకపోవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ బాధ్యతల నుంచి అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించడం.. ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్ అఖిలప్రియకు ఇవ్వరనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబును నమ్మి భూమా కుటుంబం పెద్ద తప్పే చేసిందనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. అఖిల కూడా ఈ విషయంపై ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. -
టీడీపీ నేత అఖిలప్రియపై బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డి ఫైర్
-
అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య ముదిరిన వర్గపోరు
-
ఏవీ సుబ్బారెడ్డి సభ వద్దకు రావద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
-
బాబు సభకు ముందే.. ఆళ్లగడ్డలో భగ్గుమన్న టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, నంద్యాల: అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి వస్తే తాను సైలెంట్‌గా ఉన్నా తన అనుచరులు ఊరుకోరని చెప్పిందట అఖిల ప్రియా.. దీంతో రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బాబు సభకు జనసేన నేతలు కూడా వేదికపైకి రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. ‘మీ సభ మీ ఇష్టం, మేం ఎందుకు వస్తాం’ అని జనసేన నేతలు చెప్పేశారట. దీంతో ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు జనసేన సైడ్ అయిపోయింది. ఈ మేరకు ఆళ్లగడ్డ జనసేన ప్రకటన విడుదల చేసింది. ‘టీడీపీ సభకు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు. రేపు జనసైనికులు, నేతలు టీడీపీ సభకు వెళ్లొద్దు’అని ఆదేశించింది. -
అమ్మ అఖిలప్రియా.. అలా డిసైడ్ అయ్యావా?
చంద్రబాబు రాజకీయ ఎత్తులు.. జిత్తుల సంగతి పూర్తిగా అవగతం చేసుకున్న భూమా అఖిల ప్రియ.. తనకు తాను అపరచాణక్యుడిలా ఫీలయ్యే చంద్రబాబుకే షాక్ ఇచ్చారట. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత అనూహ్యంగా మంత్రి అయిన అఖిలప్రియ పేరు కన్నా చెడ్డపేరును ఎక్కువ సంపాదించారు. హత్యలు.. కిడ్నాపులు.. బ్యాంకులను మోసం చేయడం.. రుణాలు ఎగ్గొట్టడం.. బెదిరించడం.. ఇంకా తన తండ్రి అంతరంగికుడు.. ఆప్తమిత్రుడు అయినా ఏవీ సుబ్బారెడ్డి మీద లోకేష్ పాదయాత్రతోనే బహిరంగంగా దాడులు చేయడం వంటి దూకుడు చర్యలతో ఎంత అప్రదిష్టమూటగట్టుకున్నారో ఎవరికీ తెలియదు.. ఆళ్లగడ్డలో మళ్ళీ పోటీ చేసేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని టీడీపీ అంటోంది.. ఆమెకు టికెట్ ఇస్తే క్యాడర్ సపోర్ట్ చేయదని .. ఆమె దూకుడు పార్టీకి మరింత చేటు చేస్తుందని పార్టీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే ఆమెకు టికెట్ లేకుండా పక్కనబెట్టి. ఆమె సపోర్ట్ తీసుకుని వేరేవాళ్లకు టికెట్ ఇచ్చేలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం సైతం టిక్కెట్లు ఖరారు చేసేందుకు ఓ వైపు సిద్ధం అవుతూనే చంద్రబాబు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ చేసారు. ఈనెల ఐదున తణుకు, ఏడున కృష్ణాజిల్లా తిరువూరు.. తొమ్మిదిన ఆళ్లగడ్డ , పదకొండున నరసరావుపేటలో భారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ జనసమీకరణతో .. భారీ వేదికలు ఏర్పాటుతో రూపొందే ఈ సభలకు ఆయా స్థానిక నాయకులూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.. బస్సులు.. వేదిక.. సౌండ్ సిస్టం.. రవాణా.. భోజనాలు.. పెద్ద నాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా. టికెట్ కోరుకుంటున్నవాళ్ళు చేయాల్సి ఉంది. ఇది అన్ని చోట్లా ఉన్నదే.. అయితే ఆళ్లగడ్డ సభకు మాత్రం భూమా అఖిల ప్రియ మెలికపెట్టినట్లు తెలిసింది. తనకు టిక్కెట్ ఇస్తామంటేనే ఈ సభ ఖర్చులు తాను పెట్టుకుంటానని. లేకుంటే ఈ సభకు దాదాపు కోటి ఖర్చు చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసినట్లు తెలిసింది. టిక్కెట్ ఇవ్వనప్పుడు ఈ గడ్డు రోజుల్లో అంత డబ్బును అప్పుతెచ్చి ఎందుకు ఖర్చు చేయాలన్నది ఆమె ఆలోచన అంటున్నారు. ఇప్పటికే కోర్టులు.. కేసులు.. బ్యాంకర్ల నోటీసులతో ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న అఖిల ప్రియా ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇస్తాను అంటేనే సభా ఖర్చుల బాధ్యత తీసుకుంటాను అని .. లేదంటే లేదని ఆమె పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆమెకు టిక్కెట్ ఇస్తారా.. ఆమెను పక్కన పెడతారా అన్నది టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.. ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -సిమ్మాదిరప్పన్న -
నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్!
‘భూమా’ పేరు రాజకీయాల నుంచి కనుమరుగు కానుందా? నంద్యాల బరిలో నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని కాకుండా ఫరూక్‌ను బరిలోకి దించనున్నారా? ఆళ్లగడ్డలో కూడా అఖిల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? టీడీపీలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ అధినేతలు సాగిస్తున్న చర్చలు ఈ విషయాలనే వెల్లడి చేస్తోంది. పార్టీ నిర్ణయంతో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అత్యధికంగా గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో టీడీపీ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. పైగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ చేసిన సర్వేల్లో కూడా కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టమైనట్లు సమాచారం. ఈ క్రమంలో టిక్కెట్ల ఖారారుపై టీడీపీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. డోన్ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇదివరకే ప్రకటించారు. అయితే డోన్ బరిలో కచ్చితంగా కేఈ కుటుంబం ఉంటుందని, పోటీ చేసి తీరుతుందని కేఈ ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఈ టిక్కెట్ బీసీ జనార్దన్‌రెడ్డి సూచన మేరకే చంద్రబాబు ప్రకటించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మనందరెడ్డిపై చంద్రబాబుకు ప్రతీ సందర్భంలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది గ్రహించిన బ్రహ్మం ఇటీవల నంద్యాలకు వచ్చి అరెస్టయ్యే ముందురోజు బీసీ జనార్దన్రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల బహిరంగసభలో బ్రహ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ‘భూమా’ అనుచరులు నినాదాలు చేసినా చంద్రబాబు ఎవ్వరి పేరు ప్రకటించనని, సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫరూక్‌ను నంద్యాల అభ్యర్థిగా టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీని వీడాలని బ్రహ్మం నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. ఇది తెలిసి టీడీపీ అధిష్టానం ఫరూక్, బ్రహ్మంలను పిలిపించి ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు బ్రహ్మం ససేమిరా అని మధ్యలోనే లేచి వచ్చేశాడని సమాచారం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని జనసేనకు.. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేకపోవడం, మరోవైపు బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కట్టబెడదామనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఓడిపోయే సీటు, పొత్తులో ఇస్తే సరిపోతుంది, పైగా బలిజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ లాంటి కీలక స్థానం జనసేనకు ఇచ్చామని చెప్పుకునేందుకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీటలో చేరారు. పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్ తనకే వస్తుందని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకునేంత శక్తి తన నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గంలో లేరని, కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని ఇరిగెల తన వర్గీయులతో చెబుతుండటం గమనార్హం. ఏదిఏమైనా ఓ వైపు నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి, మరోవైపు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు టిక్కెట్లు దక్కకపోతే ‘భూమా’ కుటుంబం తొలిసారి పోటీలో లేని పరిస్థితి తలెత్తుంది. ఇదే జరిగితే రాజకీయాల్లో ‘భూమా’ కుటుంబం తెరమరుగైనట్లే! స్వయంకృతాపరాధం భూమా బ్రహ్మనందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్ విఖ్యాత్‌కు టిక్కెట్ దక్కించుకోవాలని అఖిల శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఖిల, బ్రహ్మనికి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇద్దరి విభేదాలతో పరస్పరం బలాన్ని తగ్గించుంటున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఘోర పరాభవం తప్పదని రాబిన్‌శర్మ టీం అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీంతో అఖిలకు కాకుండా భూమా కిషోర్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ తొలుత భావించింది. అయితే కిషోర్‌కు ఇచ్చినా అఖిల వర్గం మద్దతు ఇవ్వదని గ్రహించింది. ప్రజల్లో నిత్యం ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తోన్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ద్వయం చేతిలో కిషోర్ కూడా ఓటమిని తప్పించుకోలేరని తేలినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో 45వేల బలిజ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని, వారికి టిక్కెట్ ఇద్దామనే ఓ చర్చ నడిచింది. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇదే క్రమంలో బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం కూడా గెలుపును దక్కించుకునేది కాదని తేలినట్లు చర్చ జరుగుతోంది. అఖిలకు అందరూ దూరమే.. ► నాగిరెడ్డి మృతి తర్వాత రాజకీయంగా కీలకంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే దూరమయ్యాడు. ► ‘భూమా’కు అత్యంత సన్నిహితుడు శివరామిరెడ్డి, విజయడైరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో పాటు బంధువర్గం, సన్నిహితులు ఆ గుమ్మం తొక్కడమే మానేశారు. ► ‘భూమా’ కుటుంబం సొంత మండలం దొర్నిపాడులోనే వారికి వ్యతిరేకంగా సర్వేలు వచ్చాయంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
నంద్యాల జిల్లాలో భూమా కుటుంబానికి బలమైన వర్గం
-
టీడీపీలో అరాచక నేతలు
‘‘నాపై హత్యకు సుపారీ ఇచ్చింది. ఇప్పుడు దాడి చేసింది. ఇన్ని రోజులు పిల్లోళ్లు ఎత్తుకుని పెంచాం ఎందుకులే అనుకున్నా. ఇంత వరకూ వచ్చిన తర్వాత ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.’’ ఏవీ సుబ్బారెడ్డి యువగళం పాదయాత్రలో మే 16న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల, తన అనుచరవర్గం భౌతికదాడి చేశారు. అఖిల దగ్గరుండి కొట్టండి.. తన్నండి అని రెచ్చగొడుతూ దాడికి పురిగొల్పారు. దాడిలో ఏవీకి రక్తగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి అఖిలపై కేసు నమోదైంది. రిమాండ్‌కు వెళ్లొచ్చారు. ఈ ఘటన నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ టీడీపీలో కలకలం రేపింది. ‘‘కొడకల్లారా దాక్కోండి. గుళ్లోకెళ్లి మొక్కోండి. మీ ఖర్మకాలి టీడీపీ అధికారంలోకి వస్తే ఏ మూలన దాక్కున్నా వెంటపడి వస్తాం. వెతుక్కుంటూ వస్తాం. శోభానాగిరెడ్డి రాజకీయం చూపిద్దామనుకున్నా. వీళ్లకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాల. కచ్చితంగా నాగిరెడ్డి రాజకీయమే చూపిస్తా!’’ – ఆళ్లగడ్డ యువగళం సభలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సాక్షి ప్రతినిధి కర్నూలు: వ్యక్తిగతమైన ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలు తమ వర్గాలకు రుద్ది, ఇది వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న విభేదాలుగా కాకుండా, వర్గాల మధ్య విభేదాలుగా చూపి రాజకీయం చేయడం టీడీపీ నేతలకే చెల్లింది. పొరపాటున టీడీపీకి అధికారం ఇస్తే ‘ఫ్యాక్షన్’ రాజకీయాలు చేస్తామని భూమా నాగిరెడ్డి వారసుడు విఖ్యాత్‌రెడ్డి.. లోకేశ్ సమక్షంలోనే తెగేసి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఇలాంటివి తప్పని కూడా వారించే ప్రయత్నం లోకేశ్ చేయకపోవడం ఆయన రాజకీయ పరిణతి ఏపాటిదో తెలియజేస్తోంది. దీంతో నిజంగానే వీరికి అధికారం ఇస్తే మళ్లీ ఫ్యాక్షన్ తగాదాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో రక్తం పారే ప్రమాదం లేకపోలేదని ప్రజల్లో భయాందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ కండువాతో గెలిచిన అఖిల, నాగిరెడ్డి ‘పచ్చ’కండువాలేసుకుని ‘సైకిల్’ జర్నీ చేశారు. 2019 ఎన్నికలకు ముందే నాగిరెడ్డి చనిపోయారు. ఈ ఎన్నికల్లో అఖిల ఓడిపోయారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలుగా కొత్తతరం రాజకీయనేతలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నాలుగేళ్లలో అభివృద్ధి మినహా వీరికి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా రెండు నియోజకవర్గాల్లో మళ్లీ అరాచక పాలన మొదలవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అఖిల వ్యవహారంతో కుటుంబ సభ్యులు దూరం నాగిరెడ్డి మృతి తర్వాత విభేదాల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యాడు. చివరకు తనను చంపించేందుకు అఖిల సుఫారీ ఇచ్చినట్లు ఏవీ ఆరోపించారు. చింతకుంట, గోవిందపల్లికి చెందిన కొంతమందిని కడప పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఏవీని దూరం చేసుకోవడం అఖిలకు దెబ్బే! ‘భూమా’కు అత్యంత సన్నిహితుడైన శివరామిరెడ్డిని క్రషర్ విషయంలో దూరం చేసుకున్నారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా దూరమయ్యారు. ఆపై అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పెంచుకున్నారు. దీంతో అతను బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషోర్ పార్టీలో చేరిన తర్వాత తన ఇంటికి వెళ్లకుండా కిషోర్ నివాసానికి అఖిల తాళాలు వేయించారు. చివరకు బ్రహ్మానందరెడ్డికి, అఖిలకు కూడా మాటల్లేవు. ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రాని పరిస్థితి. ఈ కారణంగానే ఆమె జిల్లాకు రావడం వదిలేసి ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటోందనే చర్చ ఉంది. అయితే అక్కడ కూడా వివాదాల్లో తలదూర్చారు. శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అఖిల 14రోజుల రిమాండ్‌లో ఉన్నారు. చంచల్‌గూడకు ‘సీమ’లో బహుశా, రాష్ట్ర రాజకీయాల్లో కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ఇదే ప్రథమం. ‘ఫ్యాక్షన్’ భూమిలో అభివృద్ధి వెలుగులు ఆళ్లగడ్డ మూడు దశాబ్దాలపాటు ‘భూమా’ ఏలుబడిలోనే ఉంది. ఇన్నేళ్లలో సాధించిందేమిటని ఆరాతీస్తే హత్యలు, కేసులు, వారిని నమ్మకున్న కుటుంబాలు ఫ్యాక్షన్‌లో రాలిపోవడం మాత్రమే. నాగిరెడ్డి వల్ల నాపై 24కేసులు ఉన్నాయని, ఫ్యాక్షన్ నడిపానని ఏవీ సుబ్బారెడ్డే స్వయంగా చెబుతున్నారు. ఇదేదో వారు సాధించిన ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. గంగుల బిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు పెంచి పేదల ఆరోగ్యానికి దన్నుగా నిలిచారు. చాగలమర్రి మండలం వనిపెంట చెంచుగూడెం లాంటి చీకటి తండాలకు వంతెనలను నిర్మించి బయటి ప్రపంచానికి వారిని తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఆలోచనలో అభివృద్ధి మినహా మరో ఆలోచన లేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అలాగే శిల్పా రవి హయాంలో నంద్యాల జిల్లా కేంద్రమైంది. మెడికల్ కాలేజి సాధించారు. ‘అమృత్’ ద్వారా రూ.9కోట్లతో వెలుగోడు నుంచి తాగునీటిని నంద్యాలకు రప్పించి దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మూడు వంతెనలు నిర్మించారు. ఇలా వీరు అభివృద్ధి వైపు వెళుతున్నారు. కానీ టీడీపీ నేతలు గెలిస్తే చంపుతాం, నరుకుతాం అంటూ రక్తచరిత్రను గుర్తు చేస్తూ ప్రశాంత గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు. -
చున్నీ లాగానని కేసు పెట్టడం బాధ కలిగించింది
నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియవి దిగజారుడు రాజకీయాలని సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆమె తనపై చున్నీలాగానని కేసు పెట్టడం బాధ కలిగించిందన్నారు. పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొత్తపల్లె గ్రామం వద్ద జరిగిన ఘటనలో తండ్రి లాంటి వయసు ఉన్న తనపై చున్నీ లాగి, హత్యాయత్నం చేసినట్లు అఖిలప్రియ కేసు పెట్టడం మహిళా సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల ఇద్దరి పరువు పోతుందని, కేసు పెట్టాలంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయని, మరీ ఇంత దిగజారడం ఏమిటని ప్రశ్నించారు. అఖిలప్రియ విధానాల వల్ల ఆమె కుటుంబ సభ్యులే దూరమవుతున్నారన్నారు. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను దూరం చేసుకుందన్నారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు తనను అరెస్టు చేయలేదన్నారు. పలుచోట్ల అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడటంతోనే అఖిలప్రియను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఇందులోనూ తన ప్రమేయం ఏమీ లేదన్నారు. అప్పు చెల్లించాలని బంధువులే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారని, తల్లి, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం ఆశించినప్పుడు వారి అప్పులు కూడా కట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. -
లోకేష్‌కు నలుగురూ వేర్వేరుగా స్వాగతం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..!
నంద్యాల: టీడీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, దివంగత భూమా నాగిరెడ్డి తనయుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ ప్రయత్నంలో భాగంగా నాయకులు నంద్యాలలో నాలుగు గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యువగళం పాదయాత్రలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ కు నలుగురు నాయకులు తమ వర్గీయులతో వేర్వేరుగా స్వాగతం పలికారు. ఈ కోవలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వారి అనుచరులు సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డిని కిందకు తోసి, చొక్కా చింపి దంతాలు ఊడే విధంగా కొట్టారు. ఈ ఘటనతో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీకి నియోజకవర్గంలో అంతంత మాత్రమే బలం ఉంది. గ్రూపు తగాదాలతో కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. యువగళం పాదయాత్రలో నారాలోకేష్ ముందే టీడీపీ నాయకులు దాడి చేసుకోవడం టీడీపీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు. భూమా అఖిలప్రియకు రిమాండ్.. సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్, పీఏ మోహన్, శక్తి వెంకటసాయినాథ్లు లతో పాటు మరో 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అఖిలప్రియతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం భూమా అఖిలప్రియను నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నంద్యాల జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. నంద్యాల మెజి్రస్టేట్ అఖిలప్రియ, భార్గవరామ్, మోహన్, సాయినాథ్‌లకు 14రోజుల పాటు రిమాండ్ విధించారు. అఖిలప్రియను కర్నూలు మహిళా సబ్‌జైలుకు , మిగిలిన వారిని కర్నూలు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. లోకేష్ పాదయాత్రలో ఎవరికి వారే బ్యానర్లు.. యువగళం పాదయాత్రలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు నంద్యాల పట్టణంలో టీడీపీ నాయకులు ఎవరికి వారు బ్యానర్లు వేయించుకున్నారు. భూమా బ్రహా్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మద్దతు దారులు వేర్వేరుగా తమ అనుచరులతో బ్యానర్లు కట్టారు. ఈ బ్యానర్లు చూసిన నంద్యాల ప్రజలు పట్టణంలో టీడీపీ నాయకులు అధికమయ్యారని నవ్వుకుంటున్నారు. ఆధిపత్యం కోసమే ఏవీపై దాడి.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నంద్యాల లేదంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి తరచూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధిపత్యం కోసమే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు శిరివెళ్ల మండలంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి సైతం రాళ్ల దాడి చేయించారు. అనంతరం ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు కిరాయి హంతకులతో కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై మరో సారి దాడి చేయడంతో వీరి మధ్య విభేదాలు ఎక్కడికి వెళ్తాయోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి వేడుకల్లో సైతం విభేదాలే.. ప్రతి ఏడాది జరిగే ఎన్టీ రామారావు జయంతి, వర్ధంతి వేడుకల్లో సైతం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లు వేర్వేరుగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. సోషల్ మీడియాలో సైతం ఎవరి వర్గం వారు టికెట్ మాకేనంటూ పోస్టులు పెట్టుకోవడంతో పాటు సొంత నాయకులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహా్మనందరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి మధ్య ఏడాది కాలంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలనే ప్రయత్నంతో నంద్యాలలో అఖిలప్రియ సొంత కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి వరి్ధంతి కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించడం అప్పట్లో చర్చనీయాశమైంది. భూమా అఖిలప్రియ, భూమా బ్రహా్మనందరెడ్డి.. ఏడాదిన్నర కాలంగా ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొనలేదు. టికెట్ మాకంటే మాకు అంటూ అనుచరులకు చెప్పుకుంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతు ఇచ్చే ప్రసక్తే కనిపించనంతగా విభేదాలు నెలకొన్నాయి. -
A1 అఖిలప్రియకు బెయిల్ కాదు.. జైలే
సాక్షి, నంద్యాల: టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో భూమా అఖిల ప్రియను ఆమె భర్త భార్గవ్ రామ్ ను మరో ఇద్దరిని హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ అఖిలప్రియ, ఆమె భర్త JFCM ఇంచార్జ్ జడ్జి ఆదినారాయణకు విన్నవించుకున్నారు. అయితే అఖిలప్రియ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు.. ఆమెకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 30 వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో మాజి మంత్రి అఖిలప్రియను కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. అసలేం జరిగిందంటే టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. (చదవండి: ఆళ్లగడ్డలో తన్నుకున్న తెలుగుదేశం నేతలు) ఉదయం ఏం జరిగిందంటే ఈ దాడి ఘటన కేసులో నలుగురు నిందితులను నంద్యాల పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల.. 11 మందిపై కేసులు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. (చదవండి : అఖిలను కన్న బిడ్డలా పెంచితే మా నాన్నను చంపేందుకు ప్రయత్నించింది: జశ్వంతి) ఈ నలుగురిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, అఖిలప్రియ పీఏ మోహన్, ఆమె అనుచరుడు సాయి ఉన్నారు. ఇక, పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఐపీసీ 307, 120B, 324, రెడ్ విత్ 34సెక్షన్ కింద భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా నిందితులపై కేసులు నమోదు చేశారు. నిందితులు వీరే.. - భూమా అఖిల ప్రియా.. A1 - అఖిల ప్రియా అనుచరుడు సాయి.. A4 - అఖిల ప్రియా పిఏ మోహన్.. A7 - మద్దురూ భార్గవ్ రామ్.. A11. -
అఖిలప్రియ పోటీ చేస్తే నేనే బరిలో దిగుతా: ఏవీ సుబ్బారెడ్డి కూతురు
-
అఖిలప్రియకు టీడీపీ షాక్!
సాక్షి, నంద్యాల: టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అఖిలప్రియకు టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి విషయంలో వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని అఖిలప్రియకు పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఇదిలా ఉండగా.. నంద్యాలలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ఈ దాడి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. అఖిల ప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే ఆమె పతనం కోసం పని చేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. అఖిల ప్రియను ఓడించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని జశ్వంతిరెడ్డి అన్నారు. రోడ్డు మీద, బరి తెగించి.. ఎత్తుకుని పెంచిన ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏమిటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అఖిల ప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. (చదవండి, జశ్వంతి వీడియో చూడండి : అఖిలప్రియ గురించి ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి ఏమి చెప్పిందంటే.?) ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి! -
అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి అల్టిమేటం
సాక్షి, నంద్యాల: ప్రతీసారి ఉమెన్‌కార్డును చూపిస్తూ సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ టీడీపీ నేత భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి మండిపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆమె.. అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా నాన్న అఖిలప్రియను సొంత కూతురిలా పెంచి పెద్ద చేశాడని, అయితే అఖిల ప్రియ మాత్రం చివరకు తన తండ్రిని చంపడానికి కూడా వెనుకాడలేదని జశ్వంతి ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్మీట్లకు పిల్లాడిని తీసుకురాకుండా.. సరిగ్గా అరెస్ట్ సమయంలో సంకలో పిల్లాడిని ఏస్కుని సింపథీ కోసం ప్రయత్నిస్తోందంటూ అఖిలప్రియపై జశ్వంతిరెడ్డి మండిపడ్డారు. అఖిలప్రియ నీచమైన బతుకు బతుకుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఏదైతే చేశావో. తగిన శాస్తి జరుగుతుందని అఖిలప్రియకు శాపనార్థాలు పెట్టారు. అఖిలప్రియకు గనుక టికెట్ ఇస్తే.. తాను, తండ్రి ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ వర్గం అంతా ఆమెను ఓడించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు జశ్వంతి. అలాగే పార్టీ గనుక ఆదేశిస్తే.. తాను, తన తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరం పోటీకి దిగుతామని స్పష్టం చేశారామె. పార్టీ సిద్ధాంతాలు ఫాలో అవుతూ.. ఏ ప్రెస్‌మీట్ పెట్టలేదని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత ఇచ్చేందుకే తాను లైవ్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారామె. -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. షాకిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి!
సాక్షి, నంద్యాల: నంద్యాలలో రోడ్డున పడ్డ తెలుగుదేశం పరువును అర్జంటుగా కాపాడేందుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు రంగంలోకి దిగారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలుగవద్దని, పార్టీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినొద్దంటూ కింది క్యాడర్ కు సందేశమిచ్చారు చంద్రబాబు. కొట్టుకున్నది చాలు, కేసులు వద్దు అంటూ రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు ఇదే జిల్లాలో పాదయాత్ర, మరో వైపు సొంత పార్టీలోనే కుమ్ములాటలు బాబుకు ఇరకాటంగా మారాయి. నిన్న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడులకు దిగిన భూమా అఖిలప్రియను, దెబ్బలు తిన్న ఏవీ సుబ్బారెడ్డిని రాజీపరిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అఖిలప్రియపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డిపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కానీ, చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ కేసు విషయంలో రాజీపడే ప్రస్తకే లేదని ఏవీ సుబ్బారెడ్డి ఫిక్స్ అయినట్టు ఆయన వర్గం చెబుతోంది. ఇదిలా ఉండగా.. తనపై దాడికి పాల్పడినట్టు ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా ఏవి సుబ్బారెడ్డినే తనపై దుర్భాష లాడి దాడికి యత్నించారని అఖిలప్రియ నేరుగా డిజిపి కి ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఏవి సుబ్బారెడ్డిపై నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది భూమా అఖిల ప్రియ. నిన్న జరిగిన ఘటనలో తమపై ముందుగా ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారని, తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి జరిగిందని తెలిపింది. మరోవైపు.. వీరిద్దరిని రాజీకి ఒప్పించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ ఫరూఖ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన భూమా అఖిలప్రియను పాణ్యం నుంచి నంద్యాల తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నంద్యాల కోర్టులో జడ్జి ముందు అఖిలప్రియను హాజరు పరిచారు పోలీసులు. ఇది కూడా చదవండి: కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్ -
భూమా అఖిలప్రియ అరెస్ట్
-
కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: లేఖను ఎందుకు దాచారు? -
టీడీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. లోకేస్ పాదయాత్రలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండిస్తున్నారు. -
భూమా కుటుంబంలో మరోసారి అసమ్మతి చిచ్చు
ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ‘భూమా వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో భూమా కిషోర్‌రెడ్డి నిర్వహించిన సమావేశం టీడీపీలో కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా కిషోర్ పోటీ చేస్తారా? లేదంటే టీడీపీ ఆయననే అభ్యర్థిగా ప్రకటిస్తుందా? అనే చర్చ మొదలైంది. రాజకీయంగా తన వైఖరితో పాటు అఖిల, భార్గవ్ లక్ష్యంగా కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: లోకేశ్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో కిషోర్‌రెడ్డి సమావేశం చర్చనీయాంశమైంది. అఖిలపై విమర్శలు, తాను బరిలో ఉంటానని ప్రకటించడం రాజకీయంగా వేడి పెంచుతోంది. పొత్తులు ఉంటే బీజేపీ నుంచి.. లేదంటే మీరంతా అనుకుంటున్న పార్టీ నుంచి అని చెప్పడం ద్వారా పరోక్షంగా టీడీపీ తరపున పోటీలో ఉంటానని ప్రకటించారు. కొన్ని విషయాలు బహిర్గతం చేయలేనంటూనే టీడీపీతో టచ్‌లో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే కిషోర్ ఏం మాట్లాడుతున్నారో తనకే స్పష్టత లేదనే చర్చ ఆళ్లగడ్డలో నడుస్తోంది. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ వర్గానికి నాయకత్వం వహిస్తారని, అలాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారనే చర్చ కొనసాగుతోంది. బీసీ జనార్దన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి.. కిషోర్‌ను వెనుక ఉండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. అఖిలకు టిక్కెట్ రాకుండా వీరిద్దరూ పొత్తులు ఉంటే బీజేపీ తరఫున కిషోర్‌ను, లేదంటే టీడీపీ టిక్కెట్ దక్కేలా తెరవెనుక రాజకీయం చేస్తున్నారని ఆ పార్టీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ వైఖరిపై కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో టీడీపీ పూర్తిగా బలహీనపడిందన్నారు. ఆళ్లగడ్డ రమేశ్‌రెడ్డి కమిషన్ ఇవ్వలేదని రూ.3కోట్లకు ఫోర్జరీ సంతకం చేసి చెక్‌బౌన్స్ అయిందని భార్గవ్ కేసు వేయించారన్నారు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన రమేశ్‌రెడ్డి పరిస్థితి ఇలా ఉందని, కమీషన్ల కోసం కార్యకర్తల రక్తం పీలుస్తున్నారన్నారు. వీరి వైఖరితో చాగలమర్రి రాంపల్లి రఘునాథరెడ్డిరెడ్డి, రామోహన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిలను భార్గవ్ అవమానించి పార్టీని వీడేలా చేశారన్నారు. ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో చాలామంది కీలక నేతలు పార్టీ వీడారన్నారు. శివరామిరెడ్డి క్రషర్‌ను లాక్కోవాలని చూస్తే ఆయన దూరమయ్యారన్నారు. పాము తన పిల్లలు తానే తిన్నట్లు భార్గవ్, అఖిల కార్యకర్తలను తినేస్తున్నారని విమర్శించారు. ‘భూమా’ వర్గం అంటూ ఏదీ లేదని, అది పూర్తిగా బలహీనపడిందని కిశోర్ పరోక్షంగా అంగీకరిస్తున్నారు. తద్వారా టీడీపీ కూడా అత్యంత బలహీనమైందని ఆయన మాటల్లోని అర్థం. అయితే ఇదే సమయంలో భూమా వర్గానికి అండగా ఉంటానని చెప్పడం గమనార్హం. ఇదిలాఉంటే కిశోర్ సమావేశాన్ని అఖిల తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనొక పిచ్చోడని, అలాంటి వ్యక్తి మాటలు పట్టించుకోవల్సిన అవసరం లేదని.. అతని వెనుక ఎవరు ఉన్నారో? ఎలా ఆడిస్తున్నారో తనకు తెలుసని అఖిల తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆళ్లగడ్డలో అత్యంత దారుణంగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఇంటిపోరు, వర్గపోరుతో మరింత నష్టం వాటిల్లనుంది. -
అఖిలప్రియ హౌస్ అరెస్ట్
ఆళ్లగడ్డ(నంద్యాల): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు శనివారం హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, నంద్యాల గాంధీ చౌక్‌కు వచ్చి వాటిని బయటపెడతానని, తమపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కూడా ఆధారాలతో రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆమె ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో అఖిలప్రియ ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. -
అఖిల ప్రియ అండ.. భార్గవ రామ్ దందా!
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండతో ఆమె భర్త భార్గవ రామ్ భూ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డలో ఓ మహిళ స్థలాన్ని తమ ఇంట్లో పని చేసే వ్యక్తుల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చింతకుంటకు చెందిన గూడా నరసింహుడు ఆళ్లగడ్డ శివారులో (కీర్తన స్కూల్ పక్కన) ఉన్న అదే గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్, నూర్ అహమ్మద్ కుటుంబ సభ్యులకు చెందిన 25 సెంట్లు స్థలాన్ని కొని, 1995 మార్చి 27న భార్య గూడా వెంకటలక్ష్మమ్మ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ 1.50 కోట్లు ఉంటుందని అంచనా. స్థలం ఖాళీగా ఉన్న విషయం అఖిలప్రియ దృష్టికి వెళ్లడంతో ఆమె భర్త భార్గవరామ్ రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఇక్కడి రెవెన్యూ శాఖలో తిష్ట వేసిన ఓ అధికారి ఆ స్థలం రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుత యజమాని పేరు రికార్డుల్లో లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా 1952లో అల్లిసా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఆధారంగా వారి మనువడు నూర్‌బాషాకు వారసత్వంగా వచ్చినట్లుగా రికార్డులు సృష్టించారు. 1952 నుంచి 1985 వరకు అనేక మార్లు రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఈసీలో ఒక్క ఎంట్రీ కూడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటి ద్వారా నూర్‌బాషాతో అఖిలప్రియ ఇంట్లో పనిచేసే నంద్యాల హుస్సేన్‌రెడ్డి పేరు మీద 9 సెంట్లు, అనుచరుడు మిద్దె నాగార్జున పేరు మీద 9 సెంట్లు, బుట్టగాళ్ల రమణ పేరు మీద 7 సెంట్లు 2022 డిసెంబర్ 1న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆ స్థలం కంచె తీసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంకటలక్ష్మమ్మ, ఆమె భర్త నరసింహులు అధికారులను ఆశ్రయించారు. అధికారులు న్యాయం చేయాలి: బాధితురాలు 1995లో కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కొన్నేళ్లు పొలం సాగు చేసుకున్నాం. చుట్టూ ఇళ్లు పడటంతో మేము కూడా సాగు ఆపేసి కంచె వేసుకున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి తాము కొనుక్కున్నామని బెదిరిస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలి. కాగా ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని సబ్ రిజిస్ట్రార్ నాయబ్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. -
మౌనిక రెడ్డితో రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఆదివారం హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక మండపానికి భూమా మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది.చదవండి:పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి! అంతేకాకుండా ఇద్దరూ కలిసి జంటగా పూజలు చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మౌనిక రెడ్డిని పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీరు ఏమంటారు అని మంచు మనోజ్‌ని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... అది వ్యక్తిగత విషయమని, మంచిరోజున తానే అన్ని విషయాలు తప్పకుండా చెబుతాను అంటూ మనోజ్ సమాధానమిచ్చాడు. ఇక భూమా మౌనిక రెడ్డితో పెళ్లి తర్వాత మనోజ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్ -
అదంతా కుదరదు.. అఖిలప్రియకు షాకిచ్చిన భూమా జగత్ విఖ్యాత్
దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ భూముల వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల దగ్గర తన తల్లిపేరుపై ఉన్న స్థలంలో వాటా ఇప్పించాలని కోరుతూ నాగిరెడ్డి కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాగా, తన పిటిషన్లో ప్రతివాదులుగా భూమా అఖిలప్రియ, మౌనికలతో పాటుగా భూమిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు. వివరాల ప్రకారం.. 2016లో భూమా నాగిరెడ్డి.. తన భార్య శోభ చనిపోకముందు రాజేంద్రనగర్‌లో కొంత స్థలాన్ని విక్రయించారు. అయితే, ఆ స్థలాన్ని తాను మైనర్‌గా ఉన్నప్పుడు తన తండ్రి విక్రయించారని జగత్ విఖ్యాత్ తన పిటిషన్ పేర్కొన్నారు. తన తల్లి చనిపోయాక భూమిని విక్రయించారని.. ఈ క్రమంలో ఆ భూమి అమ్మకం చెల్లదంటూ పిటిషన్లో కోర్టుకు విన్నవించారు. భూమి అమ్మకం జరిగిన కొద్దిరోజుల తర్వాత నాగిరెడ్డి కూడా మరణించారు. ఇక, ఈ భూ వివాదంపై కింది కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో జగత్ విఖ్యాత్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వాటా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా, భూమి అమ్మిన సమయంలో మేజర్లు అయిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు నాగిరెడ్డి సంతకం చేశారు. అప్పటికి జగత్ విఖ్యాత్ మైనర్ కావడంతో తనతో వేలి ముద్ర వేయించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: విజయవాడ ఆర్టీసీ బస్సులో మహిళ ఓవరాక్షన్ -
భూమా అఖిలప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు
సాక్షి, బొమ్మలసత్రం (నంద్యాల): ఆళ్లగడ్డ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వస్తుండగా అఖిల ప్రియ తన కాన్వాయ్‌ను అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగారన్నారు. తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రయత్నించిందన్నారు. అఖిలప్రియ గత నెల రోజుల నుంచి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. చదవండి: (పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు) -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో 75 పేజీల చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 5న భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి అనుచరులతో కలిసి ఐటీ అధికారులమని చెప్పి ప్రవీణ్‌రావు ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత ప్రవీణ్‌రావు సోదరులను సినిఫక్కీలో కిడ్నాప్ చేసిన సంఘటన తెలిసిందే. కాగా, సంచలనంగా మారిన ఈ కేసులో.. అఖిల ప్రియ దంపతులతోపాటు, మరో 30 మందిపై బోయిన్పల్లి పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో .. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ సమయంలో ఒక్కొక్కరి పాత్రను వివరించారు. చదవండి: Bhuma Akhila Priya: బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు -
బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసులు కిటికీ అద్దాలను పగులగొట్టి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, విలువైన ఆస్తి పత్రాలను తీసుకెళ్లారని మంగళవారం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల మొదటివారంలో బోయిన్పల్లి పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. దాదాపు నెల రోజుల తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
భూమా కుటుంబంలో ఇంటి పోరు.. తమ్ముడితో అమీతుమీ
సాక్షి కర్నూలు: మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు దెబ్బమీద దెబ్బ తగులుతుండటంతో తేరుకోలేక పోతున్నారు. ఓ వైపు కుటుంబీకులు, పార్టీ శ్రేణులు దూరమవుతుండటంతో రాజకీయంగా ఉనికిని కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆమె తమ్ముడు భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి సొంత బావతోనే విభేదించి ఒంటరిగా రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి కిడ్నాప్ వ్యవహారం నుంచి బయటపడేందుకు అఖిల తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆ కేసులో పోలీసు విచారణ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించారని బోయిన్పల్లి పోలీసులు అఖిల భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే కుట్రపూరితంగా పోలీసులు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి తమపై అభియోగం మోపుతున్నారని అఖిల చెబుతున్నారు. ఇదే క్రమంలో జగత్, భార్గవ్ పరస్పరం వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు సీఎం కేసీఆర్ బంధువులను అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కిడ్నాప్ చేశారని ఈ ఏడాది జనవరిలో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అఖిలకు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు వెళ్లి వచ్చారు. భార్గవ్, జగత్ పోలీసులకు లొంగిపోకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కాగా ఈనెల 3వ తేదీన సికింద్రాబాద్‌లోని సిటీ కోర్టులో హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. దీంతో విచారణ కోసం భార్గవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌కు పోలీసులు వెళ్లగా భార్గవ్ సూచనలతో వాచ్‌మన్ లోపలికి అనుమతించ లేదు. అయినప్పటికీ పోలీసులు అపార్ట్మెంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. అప్పటికే భార్గవ్ తప్పించుకున్నారు. తమ విధులకు ఆటంకం కల్గించారని వాచ్‌మన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకుండా ఉండేందుకు భార్గవ్, జగత్లు కోవిడ్ వచ్చిందని, అందుకే విచారణకు రాలేకపోతున్నామని సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే పోలీసులు వీటిని తప్పుడు సర్టిఫికెట్లుగా తేల్చారు. కోవిడ్ రాకపోయినా వచ్చినట్లు, తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించినందుకు భార్గవ్, జగత్‌తో పాటు ల్యాబ్ నిర్వాహకులపై బోయిన్‌పల్లిలో కేసు నమోదు చేశారు. దీంతో మళ్లీ భార్గవ్, జగత్ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే క్రమంలో ముందస్తు బెయిల్ కోసం భార్గవ్, జగత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బావ, బామ్మర్ది మధ్య గొడవ రెండేళ్లుగా భూమా కుటుంబంలో జరుగుతున్న వరుస పరిణామాలకు భార్గవ్ వైఖరే కారణమని జగత్ బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత భూమాకు అన్నీతానై వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆ కుటుంబానికి దూరమయ్యారు. అలాగే వారి సమీప బంధువు శివరామిరెడ్డి, నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ మాజీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. పార్టీలో మండల, గ్రామస్థాయి నేతలు చాలా వరకూ దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు మహేశ్ బీజేపీలో చేరారు. దీంతో ఆళ్లగడ్డలో భూమా కుటుంబం పూర్తిగా పట్టుకోల్పోయింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి బలపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగత్ ఎక్కడ పొరపాటు జరుగుతోందని ఆలోచించి, దానికి భార్గవ్ కారణమని అతనితో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. అఖిలతో కూడా జగత్ గట్టిగా వాదించి, ఆళ్లగడ్డ రాజకీయాలు ఇక తాను చూసుకుంటానని, భార్గవ్ జోక్యం ఇక అనవసరమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు ఆళ్లగడ్డతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే వయసు రీత్యా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగత్‌కు 2024కు రెండు నెలలు వయస్సు తక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలంటే అఖిల తప్పనిసరి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని సంకటస్థితిలో జగత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు కాస్త అటో ఇటో జరిగితే వయస్సు సమస్య ఉండదని, ఆ పరిస్థితి వస్తే తానే పోటీ చేయాలనే యోచనలో జగత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల గురువారం కర్నూలులో విలేకరుల సమావేశం నిర్వహించి కావాలనే తమపై కుట్రపూరితంగా హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. పోలీసులే తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి, తమపై కేసులు నమోదు చేశారని, దీనిపై మంత్రి కేటీఆర్‌తో పాటు పోలీసులను కలిసి ఆధారాలు ఇస్తామని చెప్పింది. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఒకసారి ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు ఈ దఫా మరోసారి ముందస్తు బెయిల్ ఇవ్వడం కష్టమే అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అఖిల, భార్గవ్‌ను పక్కనపెట్టి జగత్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. -
తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్
సాక్షి, కంటోన్మెంట్: బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్ కేసులో కీలక నిందితులైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్‌రామ్‌లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్ సోకిందని భార్గవరామ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్ ద్వారా సికింద్రాబాద్‌లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు. పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్‌కు సహకరించిన జగత్ విఖ్యాత్‌తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్ టెక్నీషినయన్ శ్రీదేవి, గాయత్రిల్యాబ్‌లో పనిచేసే రత్నాకర్‌లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్‌లను రిమాండ్‌కు తరలించారు. భార్గవరామ్, జగత్‌విఖ్యాత్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్‌పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం. -
Hyderabad: భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు
-
భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు విఖ్యాత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కేసు నమోదైంది. నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ సమర్పించి ఈనెల 3న కోర్టులో జరగాల్సిన విచారణకు హాజరుకాలేమని జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్ రామ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదం కిడ్నాప్ కేసులో భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. -
భూమా అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ
ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో బాసటగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివిరెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్‌వలి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటు వెంకటరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్‌రెడ్డి తదితర భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం గమనార్హం. వీరిని ఆదివారం ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సాదరంగా పారీ్టలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిన్నవంగలి లక్ష్మీరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కొండారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, కుమార్‌రెడ్డి, రమణ, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు భూమా కోట బద్దలు భూమా కుటుంబానికి చాగలమర్రి మండలం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది. వారు ఏ పారీ్టలో ఉన్నా చాగలమర్రి మండల నాయకులు మాత్రం వారి వెంటే నడుస్తూ ప్రతి ఎన్నికల్లో బాసటగా నిలిచారు. అలాంటి మండలంలో నేడు భూమా వర్గానికి చెందిన దాదాపు నాయకులందరూ గంగుల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో భూమా వర్గం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలని భావించారు. కానీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం, ఇదే తరుణంలో అఖిలప్రియ కూడా పోటీలో నిలిచిన అభ్యర్థులకు అందుబాటులో లేకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. దీంతో కీలక నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రజాసేవలో పాలుపంచుకుంటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారీ్టలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన పాలనా దక్షతకు ఆకర్షితుడినై వైఎస్సార్సీపీలో చేరా. ప్రజాసేవలో నా వంతుగా పాలు పంచుకుంటా. – రామగురివిరెడ్డి, చాగలమర్రి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అందరికీ సముచిత స్థానం దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానికంగా మా నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. అందరినీ సమన్వయం చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వారి స్థాయికి తగ్గ పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తాం. – ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి చదవండి: అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..! కళా వెంకట్రావు ఓ డిక్టేటర్.. ఆడియో హల్చల్ -
జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉంటున్న ఆమెకు బెయిల్ లంభించడంతో శనివారం బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టుల్లో అనేక సార్లు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే అఖిలప్రియకు బెయిల్ మంజూరు కావడంతో బెయిల్ ఆర్డర్ కాపీలను ఆమె తరుఫు న్యాయవాదులు జైలుకు తీసుకువచ్చారు. అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అఖిల ప్రియ విడుదలతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. (మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!) మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్రామ్కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయ్యింది. భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) అఖిలప్రియకు బెయిల్ మంజూరు అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డిసెంబర్లోనే స్కెచ్ వేశారు! -
డిసెంబర్లోనే స్కెచ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు తదితరుల్ని కిడ్నాప్ చేసేందుకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ డిసెంబర్లోనే స్కెచ్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఈ నెల మొదటి వారానికి వాయిదా పడింది. మరోపక్క కిడ్నాప్ చేసే సమయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోవడానికి భార్గవ్ విశ్వప్రయత్నం చేశాడు. ఈ కేసులో బందిపోటు అభియోగాలను కూడా పోలీసులు చేరుస్తూ సోమవారం సికింద్రాబాద్ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ తరహా నేరాలకు సంబంధించిన పిటిషన్లను నాంపల్లి సెషన్స్ కోర్టు మాత్రమే విచారించాల్సి ఉండటంతో అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది. స్కెచ్ ఇలా వేశారు.. హఫీజ్‌పేటలోని భూమిని చేజిక్కించుకోవడానికి ప్రవీణ్‌రావు తదితరులను కిడ్నాప్ చేయడమే మార్గమని అఖిలప్రియ, భార్గవ్‌రామ్ గత నెల నిర్ణయించుకున్నారు. గుంటూరు శ్రీను ద్వారా మాదాల సిద్ధార్థ్‌కు సమాచారం ఇచ్చి కొందరు అనుచరులతో రావాలని చెప్పారు. దాదాపు 10 మందిని వెంట తీసుకుని డిసెంబర్ 25న హైదరాబాద్‌కు సిద్ధార్థ్ చేరుకున్నాడు. వారికి శివార్లలోని ఓ లాడ్జిలో బస కల్పించిన భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు కుట్ర అమలుకు ఆలస్యమవు తుందని, డిసెంబర్ 31 తర్వాత అమలు చేద్దామని చెప్పి పంపారు. తిరిగి ఈ నెల 2న హైదరాబాద్ రావాలని సమాచారం ఇవ్వడంతో సిద్ధార్థ్ దాదాపు 25 మందిని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. విజయవాడ, పరిసర ప్రాంతాల వారికి ఒకే బస్సులో టికెట్లు బుక్ చేశాడు. షేర్ల వ్యాపారానికి సంబంధించి బోయిన్‌పల్లికి చెందిన కొందరు ‘మంత్రి గారిని’(అఖిలప్రియ) మోసం చేయడంతో వారిపై ఐటీ దాడులు చేయిస్తోందని సిద్ధార్థ్ తన అనుచరులకు చెప్పాడు. ఆ అధికారులకు మనం సహాయంగా ఉండాలని నమ్మబలికాడు. ఇలా వచ్చిన వారంతా కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో బస చేశారు. కిడ్నాప్ చేసే రోజు బాధితుల ఇంటికి వెళ్లకూడదని భార్గవ్ రామ్ తొలుత భావించాడు. అయితే బాధితులతో బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నా.. హఫీజ్‌పేట స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోకపోతే దాన్ని సొంతం చేసుకోవడం కష్టమవుతుందని అనుకున్నాడు. చదవండి: (ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) దీంతో కిడ్నాప్ రోజు భార్గవ్‌రామ్, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా బాధితుల ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను ఓ గదిలో, ముగ్గురు అన్నదమ్ములను హాలులో నిర్బంధించాక వీరిద్దరూ ఇల్లంతా గాలించారు. అయితే ఆ పత్రాలను ప్రవీణ్‌రావు బ్యాంకు లాకర్లో ఉంచడంతో అవి దొరకలేదు. ముగ్గురు బాధితులను కిడ్నాప్ చేసిన ఈ ముఠా ఇంట్లోని ల్యాప్‌టాప్‌తోపాటు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లింది. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు, ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సికింద్రాబాద్ 11వ అదనపు మెట్రో పాలిటన్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా బోయిన్పల్లి పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియకు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యింది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. సోమవారం భూమా అఖిలప్రియ బెయల్ పిటిషన్‌ని విచారించిన సికింద్రాబాద్ కోర్టు.. జీవిత కాలం శిక్ష పడే నేరాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పిటిషన్‌ని రిటర్న్ చేసింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మరోసారి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇక అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో ధాఖలు చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసు నమోదు చేశారు. (చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. ) -
మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది నిందితుల్ని బోయిన్పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీంతో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. వీరంతా కిడ్నాప్ జరిగిన రోజు ప్రవీణ్‌రావు ఇంటికి ఆదాయపు పన్ను అధికారులుగా వెళ్లిన వారే అని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. గుంటూరు శ్రీనుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వీరిని విజయవాడకు చెందిన సిద్ధార్థ్ పంపాడని, అతడినీ అరెస్టు చేశామని పోలీసులు పేర్కొంటున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అఖిలప్రియ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆమె హైదరాబాద్, బెంగళూరులో ఉండేవారు. అమరావతికి వెళ్లిన ప్రతిసారీ తన వెంట మందీమార్బలం ఉండాలని కోరుకునేది. విజయవాడ, అమరావతి ఆ చుట్టుపక్కల అఖిలప్రియ పర్యటన ఉన్నప్పుడల్లా ‘జన సమీకరణ’చేసే బాధ్యతల్ని శ్రీను నిర్వర్తించేవాడు. ఇతడికి విజయవాడలోని ఓ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ నిర్వహించే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రతి దఫా దాదాపు 20 మంది ఆమె వెంట ఉండేలా చూశారు. అప్పట్లో ఒక్కొక్కరికీ రోజుకు రూ.1,000 చొప్పున చెల్లించేవారు. ఐటీ అధికారులుగా తర్ఫీదు.. తాజాగా బోయిన్పల్లి కిడ్నాప్‌నకు కుట్ర పన్నిన అఖిలప్రియ, భార్గవ్‌రామ్.. ఆదాయపుపన్ను అధికారులుగా నటించడానికి అద్దెకు బౌన్సర్లను ఏర్పాటు చేయమని శ్రీను ద్వారా సిద్ధార్థ్‌కు తెలిపారు. రూ.50 వేలు అడ్వాన్సుగా ఇచ్చి.. విషయం సెటిల్ అయిన తర్వాత భారీ మొత్తం ఇస్తానంటూ శ్రీను హామీ ఇచ్చాడు. దీంతో విజయవాడలోని వివిధ కాలనీలకు చెందిన దాదాపు 20మంది యువకుల్ని కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్‌కు పంపాడు. వీరికి యూసుఫ్‌గూడలోని ఎంజీ ఎం స్కూల్ వద్ద ఐటీ అధికారులు, పోలీసులుగా నడుచుకోవడంపై భార్గవ్‌రామ్ తర్ఫీదు ఇచ్చాడు. కిడ్నాప్ పూర్తి కాగానే కొందరు, బాధితుల్ని విడిచిపెట్టిన తర్వాత మరికొందరు విజయవాడకు వెళ్లిపోయారు. దర్యాప్తులో ఈ విషయాలను గుర్తించిన పోలీసులు శనివారం సిద్ధార్థ్ సహా 15 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 11న అరెస్టయిన అఖిలప్రియ పీఏ బోయ సంపత్‌కుమార్, భార్గవ్‌రామ్ వ్యక్తిగత సహాయకుడు నాగరదొడ్డి మల్లికార్జున్‌రెడ్డి, డ్రైవర్ డోర్లు బాల చెన్నయ్యలను కస్టడీలోకి తీసుకోవాలని బోయిన్పల్లి అధికారులు నిర్ణయించారు. పరారీలో ఉన్న భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరుల కోసం గాలిస్తున్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తానికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌కు సంబంధించిన కుట్రలో పాలు పంచుకున్నారని భార్గవ్ తండ్రి మురళి, తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అఖిలప్రియ–భార్గవ్‌రామ్ కుటుంబాల్లో ఒక్క మౌనిక రెడ్డి తప్ప మిగిలిన వారంతా కిడ్నాప్ కేసులో నిందితులుగా మారారు. హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడానికి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ కొన్నాళ్ల క్రితమే పథకం వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై తమ కుటుంబీకులతో కలసి పదేపదే చర్చలు జరిపారు. గుంటూరు శ్రీను నేతృత్వంలో కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర చేసే సందర్భంలో మురళి, కిరణ్మయి, చంద్రహాస్‌లు భార్గవ్‌రామ్‌తోనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చదవండి: బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి మరోపక్క కిడ్నాప్‌ను అమలు చేయడానికి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను, కిరాయి గూండాలను హైదరాబాద్‌కు రప్పించారు. వీరికి కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్లో బస కల్పించారు. అక్కడ నుంచి యూసుఫ్‌గూడలోని స్కూలుకు తీసుకువచ్చారు. అక్కడే వీరిలో ఐటీ అధికారులుగా నటించే వారికి కొత్త బట్టలు ఇవ్వగా.. గుంటూరు ప్రాంతానికి చెందిన వంశీకి మాత్రం అద్దెకు తీసుకువచ్చిన పోలీసు యూనిఫాం ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల దాడి నేపథ్యంలో తాను బందోబస్తుగా వచ్చినట్లు ఇతడు బాధిత కుటుంబానికి తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న వారి జాబితాలో వంశీ కూడా ఉన్నాడు. భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరులు ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి నేరచరిత్ర ఉండటంతో పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో నిందితులు ప్రత్యేక బృందాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే నిందితులు ముందస్తు బెయిల్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. -
ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ నెల 5న అర్ధరాత్రి కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సూత్రధారి భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బాధితుల్ని విడిపించారు. ఆ తర్వాతి రోజే ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే ఈ కేసులో ఆమె భర్త భార్గవ్‌రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. అయితే అఖిలప్రియ అరెస్టు తర్వాత మిగిలిన నిందితులు అంతా తమ అదుపులోనే ఉన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు. మళ్ళీ ఆదివారం నుంచి వేగంగా స్పందించిన ప్రత్యేక బృందాలు ఆ మరుసటిరోజు అఖిలప్రియ పీఏ బోయ సంపత్, భార్గవ్‌రామ్ పీఏ నాగరదొడ్డి మల్లికార్జున్రెడ్డిలతోపాటు గుంటూరు శ్రీను అనుచరుడు డోర్లు బాల చెన్నయ్యలను పట్టుకున్నారు. చదవండి: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ ఈలోపు భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. అఖిలప్రియ పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఈమెను విచారించిన బోయిన్పల్లి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. కిడ్నాప్ జరిగినరోజు బా ధితుల ఇంటికి భార్గవ్‌రామ్‌తోపాటు జగద్వి ఖ్యాత్రెడ్డి కూడా వెళ్లినట్లు తేలింది. అపహరణకు ముందు కూకట్‌పల్లిలో ఉన్న పార్థ గ్రాండ్ హోటల్లో భార్గవ్‌రామ్ మిగిలిన నిందితులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి వారిని యూసుఫ్‌గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్‌కు తీసుకువచ్చారు. అక్కడి ప్రొజెక్టర్‌లో గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాల్లోని కొన్ని సీన్స్ ప్రదర్శించారు. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనేది ఆ సీన్ల ద్వారా చూపించారు. అక్కడే అద్దెకు తెచ్చిన పోలీసు దుస్తులు, కొత్తగా ఖరీదు చేసిన ఫార్మల్ డ్రెస్సులను నిందితులు ధరించారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు భార్గవ్‌రామ్, జగద్విఖ్యాత్‌రెడ్డి ఒకే వాహనంలో ప్రయాణించారు. కిడ్నాప్ జరిగిన తర్వాత నేరుగా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్న భార్గవ్ అక్కడే బాధితులతో సంతకాలు చేయించాడు. ఈ కేసులో మొత్తం30 మంది ప్రమేయముందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో పది మంది అదుపులో ఉండగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ పోలీస్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్‌రామ్ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. (చదవండి: కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..) ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ -
అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కారు డ్రైవర్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా.. కిడ్నాప్‌లో జగత్‌విఖ్యాత్‌కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా.. బాధితుడు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులమంటూ.. వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్లో ఉండగా... లోథా అపార్ట్మెంట్లో ఉన్న అఖిలప్రియ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా కిడ్నాప్ తర్వాత.. భార్గవ్, జగత్‌విఖ్యాత్ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ) మూడోరోజు విచారణ.. 300 ప్రశ్నలు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడోరోజు విచారణ ముగిసింది. ఈ క్రమంలో.. ఆమె భర్త భార్గవ్‌రామ్ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలప్రియ అండ్ గ్యాంగ్ సినిమా తరహాలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కు చూపెట్టాడు. అలానే ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్, అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. ఇక అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. అలానే ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారు. (చదవండి: పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్!?) -
కిడ్నాప్ కేసు: అఖిలప్రియ వాడిన సిమ్ నంబర్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేడమే కాక.. కీలక ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయను అరెస్ట్ చేశాం. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రధాన సూత్రధారి. కిడ్నాప్ చేయడానికి ముందు నిందితులు మియాపూర్‌లో ఆరు సిమ్ కార్డులు కొన్నారు. కాగా వీటిలో 70956 37583 నంబర్ని అఖిలప్రియ వాడారు. మల్లికార్డున్‌రెడ్డి ద్వారా 6 సిమ్‌లు, మొబైల్స్ కొనుగోలు చేశారు. కిడ్నాప్‌నకు ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉంది’ అని సీపీ తెలిపారు. (చదవండి: అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు) అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉంది : సీపీ ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశాం. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడకల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. చంచలగూడ జైలు నుంచి బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై కూపీ లాగనున్నట్లు పోలీసులు తెలిపారు. -
కిడ్నాప్ కేసు: అఖిల ప్రియకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో ఆమె కోరారు. అయితే వైద్యులు న్యాయస్థానానికి సమర్పించిన వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. దీంతో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది. కిడ్నాపు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదన విన్న కోర్టు.. అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి అఖిల ప్రియ 13వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. కాగా బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉండగా.. కిడ్నాప్ కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌తో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వారిద్దరి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: గుంటూరు శ్రీను నేర చరిత్రపై ఆరా.. -
మా అక్కకు జైల్లో భోజనం పెట్టడం లేదు: భూమా మౌనిక
సాక్షి, హైదరాబాద్: ‘టెర్రరిస్టులను కూడా బాగా చూసుకునే దేశం మనది. జైల్లో మా అక్కకు కనీసం భోజనం పెట్టడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా అక్క జైలు నుంచి ప్రాణాలతోనే వస్తుందా అని భయం వేస్తుంది’ అంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మౌనిక మాట్లాడుతూ.. ‘జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొలిటికల్ గేమ్ నడుస్తోంది అనిపిస్తోంది. అఖిలప్రియ ఆధారాలు ట్యాంపరింగ్ చేశారు అని పోలీసులు ఆధారాలు కోర్టుకు ఇవ్వకుండా రిమాండ్ రిపోర్టులో చెప్పారు. అఖిలప్రియ హెల్త్ కండిషన్ సరిగ్గా లేకున్నా అంతా బాగుంది అని పోలీసులు చెప్తున్నారు. టెర్రరిస్టులను అయినా సరిగ్గా చూసుకుంటారు. అంతకంటే దారుణమా. ఏ-1 ఏవీ సుబ్బారెడ్డిని పట్టుకొని వదిలేశారు. ప్రవీణ్ రావును కొట్టారు, తిట్టారు అన్నారు.. మరి కోర్టుకు ఎందుకు ఆధారాలు చూపించలేదు. గాంధీ హాస్పిటల్ నుంచి మీడియా, కరెంట్ తీసివేసి ఎందుకు తీసుకెళ్లారు’ అంటూ మౌనిక పలు ప్రశ్నలు సంధించారు. వేరే రాష్ట్రం నుంచి వస్తే.. ఇక్కడ ఉండనివ్వరా? ఇక ‘ల్యాండ్ సమస్య మా నాన్న ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది. వాళ్ళ మరణం తరువాత మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. భూమా కుటుంబం ఏపీకే కాదు ఇరు ప్రాంతాలకు సేవలు చేశారు. ఆళ్లగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వ్యక్తులా. సెటిలర్లు ఓట్లు వేస్తేనే కదా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయారా. పోలీసుల స్టేట్మెంట్ సరిగ్గా లేదు. ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేసే విధానం ఇదేనా. అఖిల-సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అని పోలీసులు చెప్పి.. రాత్రికి రాత్రి పూర్తిగా మార్చేశారు. గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫూటేజ్ బయటపెట్టాలి. పోలీసులు జడ్జీలు అన్నట్లు చెప్తున్నారు. అఖిలప్రియ నేరం చేసినట్లు కోర్టుకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉంటే ఇంత ఇబ్బంది పడాలా. వైద్యుల డ్యూటీ కూడా పోలీసులే చేస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉంది అని అనుమానం కలుగుతోంది. వేరే రాష్ట్రం నుంచి వస్తే రాష్ట్రంలో ఉండనివ్వరా. అఖిలప్రియపై పోలీసులు రోజుకో కొత్త కేసు పెడుతున్నారు’ అని మౌనిక ఆరోపించారు. (చదవండి: ఎందుకు చంపాలనుకున్నారు?) ఇక భార్గవ్ రామ్ వస్తే ఏం చేస్తారో ‘ఆ ల్యాండ్ మా నాన్నది... అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మేము పుట్టింది ఆళ్లగడ్డలో అయినా పెరిగింది సిటీలోనే. మేము హైదరాబాద్‌లో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా అని అనిపిస్తోంది. మా జీవితాలు సినిమా చూసినట్లు ఉంది. మేము సీఎం కేసీఆర్‌ని రిక్వస్ట్ చేస్తున్నాం.. మధ్య వర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించండి. పోలీసులు కనీసం ప్రోటోకాల్ ఫాలో కాకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ల్యాండ్ ధర పెరిగింది అని పోలీసులు అంటున్నారు.. ధర పెరిగినట్లు వాళ్లకు ఎలా తెలుసు. భూమా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ కుళ్లు రాజకీయాలు మాకు వద్దు.. మా కుటుంబ పరంగా వస్తున్న రాజకీయ సేవలు మేము చేస్తున్నాము. 70 ఎకరాల ల్యాండ్ సమస్య ఉంది. మా కుటుంబానికి కావాల్సింది ల్యాండ్ కాదు.. మా అక్క కావాలి. మమ్మల్ని సెటిలర్లుగా.. ఔట్ సైడర్స్గా, ఫ్యాక్షనిస్టులుగా చూపిస్తున్నారు. మా అక్కను ఇలా ట్రీట్ చేస్తున్నారు.. ఇక భార్గవ్ రామ్ వస్తే ఏం చేస్తారో. ప్రవీణ్ రావు హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో చూపించలేదు. సూపరింటెండెంట్ నాకు కాల్ చేసి హెల్త్ రిపోర్ట్స్ కావాలని అడిగారు’ అని తెలిపారు. (చదవండి: అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..) కేసీఆర్ పెద్ద మనసు చేసుకోని సమస్యను పరిష్కరించాలి. 2006 లేదా 2007లో చాలా మంది పై అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, మేము కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కానీ సీన్ మారింది. ఏవీ సుబ్బారెడ్డి ఆధారాలు ట్యాంపర్ చేయడని పోలీసులకు ఏంటి నమ్మకం. ఏ-1కి నోటీసులు ఇచ్చి... ఏ-2ని పిక్ చేసి అరెస్ట్ చేస్తారా. మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ల్యాండ్ ఒక్కరి పేరుమీద లేదు. చాలా కంపెనీలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి లేకపోతే ఇంత హడావుడి జరుగదు అనిపిస్తుంది. నేను కేసీఆర్ ఫ్యామిలీని విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి సమస్యను పరిష్కారించండి’ అని మౌనిక అభ్యర్థించారు. -
కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట భూ వ్యవహారంలో కిడ్నాప్ ముఠా నాయకుడు మాడాల శ్రీను నేరచరిత్రపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ ముఠాలో కీలక వ్యక్తి గుంటూరుకు చెందిన శ్రీనుకు.. అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. నంద్యాల ఉపఎన్నికలో శ్రీను కీలకంగా వ్యవహరించారు. కిడ్నాప్ ప్లాన్ అంతా అతని కన్నుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్న శ్రీను.. సినీఫక్కీలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు తెలిసింది. భార్గవ్రామ్కు రైట్‌హ్యాండ్‌గా శ్రీను వ్యవహరిస్తున్నారు (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) కాగా, ప్రవీణ్ రావు తదితరుల్ని కిడ్నాప్ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్ ప్లేట్‌తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.(చదవండి: అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు) -
మసకబారుతున్న అఖిలప్రియ ప్రతిష్ట
భూమా.. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో మూడు దశాబ్దాల పాటు ప్రత్యేక స్థానం సంపాదించిన పేరు. అయితే ఇటీవల పరిణామాలతో ఆ కుటుంబ పేరు ప్రతిష్టలు మసకబారాయి. రాజకీయంగా పతనమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అఖిలప్రియ చేసిన తప్పిదాలతో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. దీంతో మాజీ మహిళా మంత్రి ‘పొలిటికల్ జర్నీ’ కష్టంగా మారింది. ఈ క్రమంలో కిడ్నాప్ వ్యవహారంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లడంతో ప్రతిష్ట మరింత దిగజారింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆళ్లగడ్డ రాజకీయాలు ‘గంగుల’ కుటుంబం కనున్నల్లో సాగాయి. అయితే 1989లో భూమా శేఖర్‌రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి ఆళ్లగడ్డలో రాజకీయంగా ‘భూమా’ వర్గానిదే పైచేయిగా నడిచింది. 1989 నుంచి 2014 వరకూ కేవలం ఒక్కసారి మాత్రమే ‘భూమా’ కుటుంబం ఓడిపోయింది. తక్కిన అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ‘భూమా’ కుటుంబం ప్రజారాజ్యంలో చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో 18 స్థానాల్లో మాత్రమే పీఆర్పీ విజయం సాధించిన పరిస్థితుల్లో కూడా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి విజయం సాధించారు. ఆపై పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల నుంచి నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో శోభా పోటీ చేశారు. నామినేషన్ తర్వాత పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రోడ్డు ప్రమాదంలో శోభా మృతి చెందారు. మృతి తర్వాత శోభా గెలిచారు. ఆపై శోభా స్థానంలో అఖిల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో వీరికి ప్రాధాన్యత ఇస్తూ నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టబెట్టారు. వైఎస్సార్సీపీని వీడడంతో మొదలైన పతనం.. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని భూమా నాగిరెడ్డి, అఖిల టీడీపీలో చేరారు. ఇదే వారి రాజకీయ పతనానికి తొలిమెట్టు. మంత్రి పదవి ఆశతో వెళ్లిన నాగిరెడ్డికి చంద్రబాబు చేతిలో ఆశాభంగం తప్పలేదు. మంత్రి పదవి రాకపోవడం, టీడీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో రోజూ నాగిరెడ్డి కుమిలిపోయేవాడని అనుచరులు చెబుతారు. దీంతోనే గుండెపోటు వచ్చి మృతి చెందారని అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. నాగిరెడ్డి మృతి తర్వాత విమర్శల జడిని తప్పించుకునేందుకు చంద్రబాబు అఖిలకు మంత్రి పదవి కట్టబెట్టి, ప్రాధాన్యత లేని పర్యాటకశాఖను కట్టబెట్టారు. ఆపై ‘భార్గవ్‌రామ్’ను అఖిల వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డితో అఖిలకు విభేదాలు మొదలయ్యాయి. ఆస్తుల వ్యవహారం, రాజకీయంగా తానూ బలపడేందుకు ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డ, నంద్యాలలో ఒక స్థానం నుంచి టిక్కెట్టు ఆశించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో అఖిల ఓడిపోయారు. చివరకు తనను చంపించేందుకు అఖిల సుఫారీ ఇప్పించారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. చింతకుంట, గోవిందపల్లికి చెందిన కొంతమందిని కడప పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటన తర్వాత అఖిల అంతమే తన పంథమని ఏవీ శపథం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి దూరం కావడం రాజకీయంగా అఖిలకు కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘భూమా’ కుటుంబ సభ్యులు కూడా దూరం భూమా నాగిరెడ్డితో సన్నిహితంగా ఉన్న సమీప బంధువు శివరామిరెడ్డికి చెందిన క్రషర్‌ను స్వాధీనం చేసుకునేందుకు అఖిల ప్రయత్నించారు. దీనికి సంబంధించి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. దీంతో శివరామిరెడ్డి అఖిలకు దూరమయ్యారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అతనూ దూరమయ్యారు. ఆపై అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పొడచూపాయి. దీంతో అతను బీజేపీలో చేరారు. ఇదే సందర్భంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషోర్ పార్టీలో చేరిన తర్వాత..అతను ఇంటికి అఖిల తాళాలు వేయించారు. ఈ పరిణామాలతో బ్రహ్మానందరెడ్డి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రావడం లేదు. దీంతో జిల్లాకు రావడం వదిలేసి ఎక్కువగా హైదరబాద్‌లోనే అఖిల ఉంటున్నారు. (చదవండి: అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?) కోలుకోలేని దెబ్బ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి భూ వివాదంలో కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అఖిలకు 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. కిడ్నాప్ వ్యవహారంలో ఓ మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ‘సీమ’ రాజకీయాల్లో ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి తర్వాత రాజకీయంగా దెబ్బతిన్న అఖిలప్రియకు ఈ పరిణామం మాత్రం కోలుకోలేని దెబ్బ. అనుభవరాహిత్యం, శ్రేయోభిలాషులు, బంధువులను దూరం చేసుకోవడం, భర్త భార్గవ్‌రామ్ కనుసన్నల్లోనే రాజకీయాలు చేయడం.. అఖిల రాజకీయ పతనానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. పైగా కేసులో ఏ1గా అఖిలప్రియ, ఏ2 ఏవీ సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్‌రామ్ పేర్లు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ రూపంలో ఆధారాలు, భార్గవ్ సోదరుడు చంద్రహాస్ పోలీసులకు చెప్పిన సమాచారం ప్రకారం కిడ్నాప్ కేసులో అఖిల, భార్గవ్ బయటపడేది దాదాపు కష్టమే అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. -
అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ,అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు) ఆమె పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. జైలులోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని.. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఒకవేళ అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని.. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. కాగా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో విచారణకు రానుంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రేపు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. -
అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్‌పేట్ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్ఐఆర్లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్‌రామ్, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. (చదవండి: బోయిన్పల్లి కిడ్నాప్: వెలుగులోకి సంచలన విషయాలు) కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్ల పోలీసులకు బాధితులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వే నం.80లో 2016లో 25 ఎకరాలను బాధితులు కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్‌రామ్ వాదిస్తున్నారని, ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నారు.. భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారని, ఇంకా డబ్బులు కావాలని నిందితులు డిమాండ్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. భూమా అఖిలప్రియపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద కేసులను పోలీసులు నమోదు చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు సికింద్రాబాద్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. టీడీపీ నేత అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా, ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్‌కుమార్ సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్‌రామ్ లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్.. డబ్బు చెల్లించారు. సెటిల్మెంట్ విషయం తెలిసి అఖిలప్రియ మండిపడ్డారు ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు దగ్గర ఎలాగైన డబ్బు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు ప్లాన్ వేశారు. సాయి అనే వ్యక్తితో కలిసి అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ తర్వాత ఓఆర్ఆర్ వద్ద ఖాళీ బాండ్ పేపర్‌పై కిడ్నాపర్లు సంతకాలు చేయించారు. సంతకాల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ పేర్లను కిడ్నాపర్లు ప్రస్తావించారు. సంతకాలు తీసుకునే సమయంలోకిడ్నాపర్లు కర్రలతో దాడి చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను ముందే అదుపులోకి తీసుకోకుంటే.. సాక్ష్యాధారాలు తారుమారు చేసేవారని పోలీసులు భావించారు. అఖిలప్రియ, భర్త భార్గవ్రామ్కు నేర చరిత్ర ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. -
అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావు, అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అఖిల ప్రియ వైద్య పరీక్షల రిపోర్టులో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినందునే అస్వస్థకు గురైనట్టు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆమెను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. కాగా, బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ఏ2 గా ఉండగా.. ఆమె భర్త భార్గవ్‌రామ్ ఏ3గా, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1 ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. ఇదిలాఉండగా.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అఖిలప్రియ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై రేపు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. (చదవండి: కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు) -
సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ!
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కేసులో కిడ్నాపర్లపై ఐపీసీ సెక్షన్ 448, 419, 341, 342, 506, 366 విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉండగా, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత వీరిని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల నిర్వహించారు. కాసేపట్లో నిందితులను సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చదవండి: (బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: ఆ ముగ్గురు క్షేమం) నిందితులను అరెస్ట్ చేశాం: సీపీ అంజనీ కుమార్ కాగా, బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి సీపీ అంజనీ కుమార్ సాక్షితో మాట్లాడారు. 'కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్ట్ చేశాము. ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగుతంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మాకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపైఅయితే అనుమానం వ్యక్తం చేశారో వారినే అదుపులోకి తీసుకున్నాం. కిడ్నాప్‌కి గురైన ముగ్గురు వ్యక్తులను కూడా సేఫ్‌గా తీసుకొచ్చాము. కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నాము' అని సీపీ అంజనీ కుమార్ వివరించారు. మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. చదవండి: (భూమా ఫ్యామిలీకి ఎంత చెప్పినా వినలేదు) -
‘జగత్’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..
ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వారే కబ్జాదారుడికి అండగా నిలిచారు. పీర్ల మాన్యం ఆక్రమణలో తమ వంతు పాత్ర పోషించారు. ఆక్రమిత స్థలంలో డెయిరీ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. బాధిత ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ‘భూ మా’య విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వే నం. 67లో 6.40 ఎకరాల పీర్ల మాన్యం భూమి ఉంది. దీన్ని ముల్లా మక్తుమ్ సాహెబ్ వారసులు అనుభవించేవారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో పీర్ల చావిడి సేవలు, పండుగలు ఘనంగా జరిపేవారు. అయితే ఈ భూమిపై భూమా అఖిలప్రియ అనుచరుడు కోతమిషన్ షరీఫ్ కన్ను పడింది. ముల్లా కుటుంబ సభ్యులను భయపెట్టి మాన్యాన్ని కబ్జా చేశారు. ఈ భూమిని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఇళ్లను నిర్మించారు. వీటిని కొంత మందికి అమ్మేశారు. మరికొంత స్థలంలో భూమా కుటుంబ సభ్యులు జగత్ డెయిరీని నిర్మించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 67 సర్వే నంబరులో రికార్డుల ప్రకారం ఏయే నిర్మాణాలు ఉన్నాయో తెలపాలని ముల్లా కుటుంబం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సర్వే నంబరులో ఇళ్లు, జగత్ డెయిరీ, బీబీఆర్ స్టేడియం, షాదీఖానా, రోడ్లు, జగత్ డెయిరీ ఫార్మా నిర్మాణాలు ఉన్నాయని, 4.50 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని ఆళ్లగడ్డ తహసీల్దార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాన్యం భూమిలో 0.66సెంట్లు ఆక్రమించి జగత్ డెయిరీ ఫార్మా నిర్మించినట్లు తేలింది. పీర్ల మాన్యం మొత్తం ఆక్రమణలో ఉన్నా.. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియ సైతం నోరుమెదపడం లేదు. (అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?) ముస్లింలకు న్యాయం చేయాలి భూమా అఖిలప్రియ మాటలు, చేష్టలు వేర్వేరుగా ఉన్నాయి. ముస్లింలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నట్లు మాట్లాడుతారు. ఆళ్లగడ్డలో మాత్రం ముస్లింలకు చెందిన భూములను ఆక్రమించుకొని, అందులో కట్టడాలు నిర్మిస్తారు. ఆళ్లగడ్డలో పీర్ల మాన్యం ఆక్రమించుకున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలి. – శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు.. పీర్ల మాన్యం ఆక్రమణకు గురైందని, తమకు న్యాయం చేయాలని ముల్లా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కోరారు. ముల్లా కుటుంబీకులతో కలిసి ఇరువురు ఎమ్మెల్యేలు గురువారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు వినతి పత్రం అందించారు. పీర్ల మాన్యాన్ని భూమా అనుచరుడు ఆక్రమించడంతో ఆదాయం కోల్పోయి పీర్ల పండుగ ఘనంగా నిర్వహించలేకపోతున్నామని ముల్లా వంశస్తులు మహబూబ్‌బాషా, గౌస్‌మొద్దీన్, ముక్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబరు 67లో ఉన్న 6.40 ఎకరాల పీర్ల మాన్యం తమకు అప్పగించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) విచారణ జరపండి.. ఆళ్లగడ్డ పట్టణంలోని పీర్ల మాన్యం ఆక్రమణ విషయంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెంటనే స్పందించారు. ఆళ్లగడ్డ తహసీల్దార్‌కు ఫోన్ చేసి, రికార్డులను పరిశీలించి విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇన్చార్జ్ భూమా అఖిల ప్రియ సైతం నోరు మెదపడం లేదు ముస్లింల మాన్యం భూమిని ఆక్రమించుకొని అందులో జగత్ డెయిరీని నిర్మించుకున్న భూమా అఖిలప్రియకు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలపై మీకు నిజంగా ప్రేమ, అభిమానం ఉంటే పీర్ల మాన్యంలో నిర్మించుకున్న కట్టడాలను తీసివేసి స్థలం వారికి ఇవ్వాలి. ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేశారు. భూమా కుటుంబ సభ్యులు మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే -
అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?
సాక్షి, నంద్యాల: అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకుంటే మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం 11వ తేదీ వచ్చి పరామర్శించారని, ఇన్నాళ్లూ ఆమె ఎక్కడికెళ్లారని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు మొదటి నుంచీ శిల్పా కుటుంబం అండగా ఉంటోందన్నారు. మొన్నటి ఎన్నికల్లో 38 వేల మెజార్టీ వచ్చిందంటే ముస్లిం మైనార్టీలు తనకు అండగా నిలవడం వల్లే సాధ్యమైందన్నారు. అఖిలప్రియ శవ, హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత తాత అయిన భూమా నారాయణరెడ్డిని విజయ డెయిరీ చైర్మన్ పదవి నుంచి దించడానికి ఇంటికి వెళ్లి చంపుతామని అఖిలప్రియ భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి బెదిరించలేదా అని నిలదీశారు. సొంత తాతనే మీ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారంటే ఏం రాజకీయం చేస్తున్నారో అందరికీ అర్థమవుతోందన్నారు. ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని అఖిలప్రియ శిల్పా కుటుంబంపై ఆరోపణలు చేయడం శోచనీయమని, తాను మొదటి సారి పోటీ చేసి 35వేల మెజార్టీతో గెలిస్తే ఆమె మాత్రం 38వేల మెజార్టీతో ఓడిపోయారని గుర్తు చేశారు. (24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు) ‘మీ నాన్న ప్రాణ స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి కుట్ర పన్నారు. నంద్యాలలో మాజీ కౌన్సిలర్ జాకీర్‌హుసేన్, మరో 9మందిపై ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే హత్యాయత్నం కేసు పెట్టి వేధించారు. ముస్లిం సోదరులకు అయ్యలూరు మెట్ట వద్ద మాజీ మంత్రి పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేయించారు. ఉప ఎన్నిక సమయంలో బేస్మెంట్లు సైతం రాత్రికి రాత్రి తొలగించి ముస్లింలను ఇబ్బంది పెట్టారు. వీటిని ముస్లిం సోదరులు మరచిపోలేద’ని అన్నారు. తమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, మీ ఆస్తులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చిన పర్సెంటేజీలతో సంపాదించినవి కావా అని ప్రశ్నించారు. దళితుడైన న్యాయవాది సుబ్బరాయుడును టీడీపీ నాయకులే హత్య చేశారు కాబట్టి అఖిలప్రియ నోరు మెదపడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హబీబుల్లా, గన్నికరీం, మాజీ కౌన్సిలర్ జాకీర్‌హుసేన్ తదితరులు పాల్గొన్నారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) -
నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి
సాక్షి, నంద్యాల: ‘నిన్ను చంపితే కాని మాకు చైర్మన్ పోస్టు రాదు’ అని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డిని భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం నంద్యాల తాలూకా పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా సీఐ దివాకర్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయ డెయిరీ పాలక మండలి సమావేశం గత నెల 28వ తేదీన జరగగా డైరెక్టర్లను మాట్లాడాలని పిలిపించుకొని భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ ఆళ్లగడ్డలో ఉంచుకున్నారు. ముగ్గురు డైరెక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో 28వ తేదీ జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని విజయడెయిరీ చైర్మన్ ఎండీ ప్రసాదరెడ్డి డైరెక్టర్లకు సమాచారం అందించారు. డైరెక్టర్లు కొందరు మంత్రాలయం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. డైరెక్టర్లు వెళ్లిన చోట జగత్‌విఖ్యాత్ రెడ్డి మనుషులు కనిపించడంతో తిరిగి వారు రైతునగరం గ్రామంలోని భూమా నారాయణరెడ్డి నివాసానికి వచ్చారు. విషయం తెలుసుకున్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్, రవి తమ అనుచరులతో కలిసి వాహనాల్లో నారాయణరెడ్డి ఇంటి వద్దకు 1వ తేదీ రాత్రి 11.20గంటలకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ‘నిన్ను చంపితే గాని చైర్మన్ పదవి మాకు రాదు అంటూ’ భూమా నారాయణ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మంగళవారం బాధితుడు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో పడకండ్ల గ్రామంలో కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ శూలం నరసింహుడు ప్రత్యర్థులపై దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్లోకెళ్లి అడ్డొచ్చిన పోలీసులను తోసేసి నిందితుడిని తీసుకెళ్లాడు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు) ఈ విషయాన్ని స్టేషన్ సిబ్బంది పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు అఖిలప్రియ ఇంటి వద్దకెళ్లి మళ్లీ నిందితుడిని స్టేషన్ తీసుకెళ్లారు. దీంతో భూమా విఖ్యాత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 224, 225, 212 సెక్షన్ల కింది కేసు ఫైల్ చేశారు. -
అఖిలప్రియపై సంచలన ఆరోపణలు
సాక్షి, కర్నూలు : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడుపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరు తనను చప్పేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తనను చంప్పేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఊహించని రీతిలో బాంబు పేల్చారు. దీనిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు. అనంతరం పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని, భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను వేడుకున్నారు. తాజా ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ భర్తపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయిన విషయం తెలిసిందే. (అఖిలప్రియ భర్తపై మరో కేసు) -
‘తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు’
సాక్షి, కర్నూలు : కరోనా వల్ల దేశం ఉపశమనం పొందాలని పూజలు చేయడానికి అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి వెళ్తే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. గుడిని బలవంతంగా తెరిపించామని ఆరోపణలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని, అలాంటి మాటలు పక్కన పెట్టాలని విమర్శించారు. జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై నిప్పులు చెరిగారు. (కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్ ) తాటాకు చప్పుళ్ళకు, పనికిరాని ఆలోచనలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిన ఘనత తమ కుటుంబానిది అని దుయ్యబట్టారు. పోలీసులు అరెస్టు చేస్తారని బయంతో బయట రాష్ట్రంలో కూర్చున్నారని అఖిలప్రియపై విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అఖిలప్రియకు, తమ కుటుంబానికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. (షాకింగ్: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు ) -
నారా లోకేష్ ‘విందు’ రాజకీయం
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసుల్లో ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరిని ఎంపిక చేసి ఈ విందు భేటీకి ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. (చదవండి: మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..) ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీపై తన పట్టును నిరూపించుకోవాలన్న ఆలోచనతో పాటు రాజకీయంగానూ తనపై పార్టీ నేతల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ విందు రాజకీయం మొదలుపెట్టినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్ చెప్పినట్లు తెలిసింది. (విజయవాడ నడిబొడ్డున కోట్ల విలువైన భూమి కబ్జా) -
టీడీపీలో నాయకత్వ లేమి.. జిల్లాలో పూర్తి డీలా
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ పరిస్థితి చూస్తే నాయకత్వ లేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు 20 ఏళ్లుగా జిల్లాలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నేళ్లు ‘సైకిల్’పై ప్రయాణం చేసినా రాజకీయ లక్ష్యాన్ని చేరుకోలేమని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ∙ సాక్షి, కర్నూలు : రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. వైఎస్సార్ జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా వైఎస్సార్ జిల్లా తర్వాత కర్నూలే! గత 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచింది 2009 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా నాలుగు స్థానాలే. తక్కిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. ఈ ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది. ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు నేతల తప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది. విశ్వాసం కోల్పోయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి జిల్లాలో రాజకీయంగా గౌరవం ఉండేది. అయితే.. ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాన్ని కోట్ల వర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మను కూడా ఘోరంగా ఓడించారు. వారు కనీసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే గౌరవం ఉండేది. కానీ కొన్నేళ్లుగా వైరం నడిపిన కేఈ కుటుంబం ప్రయాణిస్తున్న ‘సైకిల్’లోనే వీరు ఎక్కడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆయన వర్గంగా ఉన్న వారు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు కోట్ల కుటుంబం రాజకీయంగా చెల్లని కాసైపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బలహీనపడిన ‘భూమా’, కేఈ వర్గాలు జిల్లా టీడీపీలో కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి బలమైన నేతలుగా ఉండేవారు. భూమా మృతితో కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్యంగా భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి... అఖిల ప్రియతో విభేదించి తనవర్గాన్ని దూరంగా ఉంచారు. భూమా సోదరుడి కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి బంధువైన శివరామిరెడ్డి కూడా అఖిలతో విభేదించారు. క్రషర్ విషయంలో అఖిల భర్తకు, శివరామిరెడ్డికి తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులే ఆమెకు దూరం కావడం, రాజకీయంగా పరిణతి లేకపోవడంతో పాటు కుటుంబం కూడా టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్సార్సీపీ, ఆపై తిరిగి టీడీపీలో చేరడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. మండల, గ్రామస్థాయి నేతలు కూడా వారికి దూరమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో టీడీపీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యాంబాబు పార్టీని వీడితే కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే. ఆదోనిలో మీనాక్షినాయుడుకు వయసైపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే! ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత కుటుంబం టీడీపీలో చేరడాన్ని సొంత వర్గీయులే జీర్ణించుకోలేకపోయారు. గతంలో టీడీపీ వైఖరితోనే గౌరు కుటుంబం దెబ్బతింది. అదే పార్టీలో చేరడంతో కేడర్‌కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత, వెంకటరెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ముగుస్తుందని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. టీజీ ద్వారా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో టీజీ వెంకటేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ తీర్థం పుచ్చుకునే టీజీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. తన కుమారుడిని మాత్రం టీడీపీలోనే కొనసాగిస్తున్నారు. వ్యాపార రంగంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకే టీజీ బీజేపీలో చేరారనేది బహిరంగ సత్యం. తండ్రీ కొడుకుల ‘డబుల్‌గేమ్’తో బీజేపీ, టీడీపీ ఇద్దరినీ విశ్వసించడం లేదు. ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ముందు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గస్థాయి నేతలు గత 20 ఏళ్ల ఫలితాలను బేరీజు వేసుకుని..మరో 20 ఏళ్లు టీడీపీతో ప్రయాణం చేసినా ఎమ్మెల్యేలం కాలేమని నిర్ధారణకు వస్తున్నారు. అందుకే ‘సైకిల్’ ప్రయాణాన్ని వీడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.