
సాక్షి, కర్నూలు : కరోనా వల్ల దేశం ఉపశమనం పొందాలని పూజలు చేయడానికి అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి వెళ్తే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. గుడిని బలవంతంగా తెరిపించామని ఆరోపణలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని, అలాంటి మాటలు పక్కన పెట్టాలని విమర్శించారు. జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై నిప్పులు చెరిగారు. (కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్ )
తాటాకు చప్పుళ్ళకు, పనికిరాని ఆలోచనలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిన ఘనత తమ కుటుంబానిది అని దుయ్యబట్టారు. పోలీసులు అరెస్టు చేస్తారని బయంతో బయట రాష్ట్రంలో కూర్చున్నారని అఖిలప్రియపై విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అఖిలప్రియకు, తమ కుటుంబానికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. (షాకింగ్: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు )
Comments
Please login to add a commentAdd a comment