Gangula prabhakar reddy
-
ఎమ్మెల్సీ గంగులను కలిసిన తారకరత్న
సాక్షి, ఆళ్లగడ్డ: సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జమ్మలమడుగు మండలం గండికోటలో జరుగుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం వచ్చిన తారకరత్న తిరుగు ప్రయాణంలో వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలిశారు. (కోనేటి ఆదిమూలంకు సీఎం జగన్ పరామర్శ) అహోబిలేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ముందుగా మఠం మేనేజర్ వైకుంఠం, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. -
‘తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు’
సాక్షి, కర్నూలు : కరోనా వల్ల దేశం ఉపశమనం పొందాలని పూజలు చేయడానికి అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి వెళ్తే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. గుడిని బలవంతంగా తెరిపించామని ఆరోపణలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని, అలాంటి మాటలు పక్కన పెట్టాలని విమర్శించారు. జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై నిప్పులు చెరిగారు. (కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్ ) తాటాకు చప్పుళ్ళకు, పనికిరాని ఆలోచనలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిన ఘనత తమ కుటుంబానిది అని దుయ్యబట్టారు. పోలీసులు అరెస్టు చేస్తారని బయంతో బయట రాష్ట్రంలో కూర్చున్నారని అఖిలప్రియపై విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అఖిలప్రియకు, తమ కుటుంబానికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. (షాకింగ్: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు ) -
ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: రాష్టంలో 7 నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుభిక్షమైన పాలన అందించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ సోసైటీ వారు శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవ కూమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ సోసైటీ అధ్యక్షుడు కోసరాజు వెంకటేశ్వరావు, సొసైటీ సభ్యులకు కండువా కంపి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తట్టుకుని సీఎం జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. రాజధాని కట్టే స్థోమత ప్రస్తుతం మనకు లేదని, త్వరలో సీఎం జగన్ రాజధానిపై మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ప్రజల మనసులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన చెరగని ముద్ర వేస్తుందని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఇక దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా తన తండ్రి దేవినేని నెహ్రూని నమ్ముకున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే నిలబడే వ్యక్తని, తనని సొంత తమ్ముడిలా చూస్తున్నారని అన్నారు. 2014లో తాను నష్టపోయినా ఇచ్చిన మాటకోసం నిలబడ్డానని, అమ్మఒడితో సీఎం జగన్ తల్లులకు అండగా నిలిచారన్నారు. 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉండాలని సామాన్య ప్రజానీకం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, మీ పిల్లల భవిష్యత్తుకు సీఎం జగన్ భరోసా ఇస్తున్నారని అన్నారు. ఇక చంద్రబాబు జోలి పట్టుకుని ఎందుకు భిక్షాటన చేశారోనని, ఇందుకు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని హితువు పలికారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు రాజకీయ లబ్థి పోందాలని చూస్తున్నారని అవినాష్ పేర్కొన్నారు. -
తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం క్షమించదు
సాక్షి, ఆళ్లగడ్డ రూరల్ : తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం క్షమించదని, ఈ విషయాన్ని మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెబుతున్నారని శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా దిగజారుడు మాటలతో ప్రభుత్వంపై బుదరజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన తీరు మార్చుకోకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 12 మందికి మంజూరైన రూ.3,12,000కు సంబంధించిన చెక్కులను ఆదివారం ఆయన ఆళ్లగడ్డలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాధితులకు అందించారు. అనంతరం చాగలమర్రి వెళ్లిన ఆయన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కుమార్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ‘యురేనియం తవ్వకాలు ఆపాలని టీడీపీ పోరాడుతుంటే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన ఇలాంటి మాటలు మాట్లడడం సరికాదు. ఆ పార్టీ నాయకుల లావాదేవీల్లో వచ్చిన విభేదాలతో వారే కేసులు పెట్టుకున్నారు తప్ప ఇతరులెవరూ ఆ పని చేయలేదు. యురేనియం తవ్వకాలను మేము కూడా వ్యతిరేకిస్తున్నాం’ అని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం రూ.265 కోట్లు విడుదల చేసిందని, రూ.10వేల లోపు వారికి చెల్లించే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇటీవలే ఆళ్లగడ్డకు డిగ్రీ కళాశాల మంజూరైనట్లు వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించవద్దని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల సమావేశాల్లో కూడా చెప్పిన గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. 90 శాతం రైతులకు వైఎస్సార్ భరోసా సాయం అందిందని, మిగతా 10 శాతం మందికి సాంకేతిక సమస్యలతో రాలేదన్నారు. సమస్య పరిష్కరించి వారికి కూడా సాయం అందిస్తామన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.35 కోట్లు మంజూరైందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు గంధం రాఘవరెడ్డి, సింగం భరత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చాగలమర్రి విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరభద్రుడు, గణేష్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బాబు చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసింది: గంగుల
కర్నూలు: టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పేద కుటుంబాలకు విద్యను అందించే దిశగా వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
మండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిమితులయ్యారు. విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిమితులైన విషయం తెలిసిందే. అలాగే మండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడును ఖరారు చేస్తూ.. మండలి చైర్మన్ షరీష్ అహ్మద్ సభలో ప్రకటించారు. -
అసాంఘిక కార్యకలాపాలకు చోటివ్వం: గంగుల
కర్నూలు జిల్లా: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిపై వైఎస్సార్సీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రి అఖిల ప్రియా తమ్ముడు జగత్ విఖ్యాత్ టీడీపీ కండువా వేసుకుని, వాహనం మీద స్టిక్కర్ వేసుకుని పోలింగ్ బూతులోకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్లు వేసే సమయంలో అఖిల ప్రియ ఫోటో స్టికర్ ఓటర్లకు పంపించి ఓట్లు టీడీపీకి వేసిన తర్వాత రూ.2 వేలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఎలక్షన్ కమీషన్ సరిగ్గా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించలేదని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ఎంతగానో ప్రయత్నించారని ఆరోపించారు. ఆళ్లగడ్డ అభివృద్ధిలో పోటీ పడతాం తప్ప, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వమని గంగుల ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. -
ప్రజలు జగన్‌లాంటి నాయకుడిని కోరుకుంటున్నారు
-
మంత్రి భూమా ఇలాకాలో.. రౌడీ రాజ్యం..
సాక్షి, ఆళ్లగడ్డ : నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇందూరు ప్రభాకరరెడ్డి, ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరు ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డికి ముఖ్య అనుచరులు. హంతకులు.. మంత్రి అఖిలప్రియకు ముఖ్యులు. ∙2018 అక్టోబర్‌లో బాలయ్య అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు అహోబిలంలో దాడులకు పాల్పడ్డారు. అంతేగాక అడ్డుబోయిన కానిస్టేబుల్ నాగిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. 2019న ఫిబ్రవరి 12న ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దళిత మహిళను మంత్రి అఖిలప్రియ ప్రధాన అనుచరుడు (అంగరక్షకుడు) సి.శ్రీనివాసులు లైంగికంగా వేధిస్తుండంతో అవమాన భారంతో పాటు భయంతో ఆ మహిళ గ్రామం వదిలి పుట్టింటికి వెళ్లింది. భార్య ఇళ్లు వదలి వెళ్లి పోవడంతో పాటు ఈవిషయం గ్రామంలో చర్చనీయాంశం కావడంతో అవమాన భారంతో ఆ మహిళ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. - అలాగే మంత్రి అనుచరులు 2019 డిశంబర్‌లో ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దివ్యాంగుడైన దస్తగిరిని మోటారు బైక్ అడ్డువచ్చిందనే నెపంతో దారుణంగా కొట్టారు. పోలీసుల అండతో అక్రమ కేసులు - 2015 మార్చి 21న జిల్లాలోని కృష్ణగిరి మండల పరిధిలోని బోయబొంతిరాళ్ల గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. అయితే అధికారపార్టీ పోలీసుల అండతో ప్రతిపక్షం వారు పెట్టిన కేసును ఫాల్స్ కేసుగా చేశారు. కాని వైఎస్సార్సీపీ వారిపై మాత్రం సెక్షన్–307కేసు నమోదు చేయడంలోనే కోర్టులో నడుస్తోంది. - కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్. ఎర్రగుడి గ్రామంలో గతేడాది జూలై 13న దళితులకు సంబంధించి బావి వద్ద అక్రమం నిర్మాణాలను తొలగించే విషయంలో టీడీపీ జెండా కట్టాను తీసేయాలని చూసారని వైఎస్సార్సీపీ నాయకులు మాదన్నతోపాటు మరో ఐదుగురుపై అధికారపార్టీ నాయకులు కేసు నమోదు చేయించారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తమను కులం పేరుతో దూషించారని కేసు ఇచ్చేందుకు వెళ్లితో పోలీసులు పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. - కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో వైఎస్ఆర్సీపీ వర్గీయులు తమ పొలం మీదుగా వెళ్లేందుకు రస్తా ఇవ్వలేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. చిన్న రామాంజనేయులు, రాజి, భవాణిపై టీడీపీ నాయకులు కొండారెడ్డి, మల్లేశ్వరరెడ్డి,శివారెడ్డి పొలం వద్దే దాడికి పాల్పడ్డారు. ఇంటికొచ్చాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా మరో సారి దాడికి తెగబడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా.. చివరకు పోలీసులు వారి పైనే కేసు నమోదు చేసి టీడీపీ నాయకులపై కేసు లేకుండా చేశారు. -
ఆళ్లగడ్డలో జోరందుకున్న చేరికలు
సాక్షి, ఆళ్లగడ్డ: వైఎస్ఆర్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో మంత్రి అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వలసలను ఆపేందుకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి బుజ్జగిస్తున్నారు. వినని వారి ఇంటికి పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నా వారు బెదరకుండా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తోంది. తాజాగా గురువారం మంత్రి అఖిలప్రియ సమీప బంధువు, అత్యంత ఆప్తుడు రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన అంబటి మహేశ్‌రెడ్డి వర్గానికి చెందిన నంద్యాల శివారెడ్డి, సంజీవరెడ్డి, బాలిరెడ్డి, మోహన్‌రెడ్డి, సోముల వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, శౌరెడ్డి, చంద్రమౌలి, పంగా సుబ్బరాయుడు, మేకలమాబు తదితరులు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు నాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రసాదరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, నాగరాజు, సుద్దుల కిట్టు తదితరులున్నారు. మంత్రికి ఝలక్... వైఎస్ఆర్సీపీలోకి సింగం మంత్రి అఖిప్రియకు అత్యంత ఆప్తుడు, పట్టణ టీడీపీ నాయకుడు, నగరం పంచాయతీ కో ఆప్షన్ కౌన్సిలర్ సింగం వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం గంగుల ప్రభాకర్‌రెడ్డి, నానీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమైంది. కార్యక్రమంలో నాయకులు గంధం రాఘవరెడ్డి, గజ్జల రాఘవేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, నాసారి వెంకటే శ్వర్లు, నరసింహారెడ్డి తదితరులున్నారు. -
చంద్రబాబువి విలువలు లేని రాజకీయాలు
కర్నూలు,ఆళ్లగడ్డ: ‘ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ గగ్గోలు పెడుతున్న రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు ఆనాడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబునాయుడు.. టీఆర్ఎస్తో పొత్తుల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిస్తే టీడీపీ నాయకులు ఎందుకు అంత ఉలికి పాటుకు గురవుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ కలిసి పోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఫెడరల్ ఫ్రంట్‌పై తమ పార్టీ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మాత్రమే జగన్ చెప్పారన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతున్నామని ఎక్కడా ప్రకటించ లేదన్నారు. ఇదే విషయం కేటీఆర్ కూడా ప్రకటించారన్నారు. ఏపీలో టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకుందని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం పాకులాడి, చివరకు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినట్లు చంద్రబాబే బహిరంగంగా ఎన్నో సార్లు చెప్పారని, ఆ విషయం ప్రజలకు తెలుసునన్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించి అక్కడ శిలాఫలకంపై పేరు కూడా వేయించు కోలేదా అని గుర్తు చేశారు. కోల్‌కతా సభలో బీజేపీ వాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జంతువులను కొనుగోలు చేసినట్లు కొంటున్నారని చంద్రబాబు ప్రసంగించారని, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కూడా జంతువులు అవునో.. కాదో చెప్పాలన్నారు. అధికారం కోసం విలువలు లేని రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమన్నారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు ఘనత ఆయనకే దక్కిందన్నారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. -
రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి
చాగలమర్రి: రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని, అనవసరంగా మాట్లాడితే గ్రామ గ్రామాన బుర్రకథలు పెట్టి అందరి బాగోతాలు చెప్పిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం నేలంపాడు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో తాను ప్రతిపాదించిన పనులే ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. వారు రెండేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ నియోజకవర్గానికి చేసేందేమీ లేదని మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి సడక్ యోజన కింద మంజురైన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పటికే ఎన్నో జన్మభూమి సభలు నిర్వహించారని, ఎన్ని సమస్యలు పరిష్కరించారో వెల్లడించాలన్నా రు. టీడీపీ నాయకులు జేబులు నింçపు కోవడానికి తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం వస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేలంపాడు గ్రామంలోని రాళ్లగనుల గుంతలను వక్కిలేరు, కేసీ కాల్వ నీటిని నింపాలని అధికారులను కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబులాల్, మండల కన్వీనర్ కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రుడు, డివిజన్ ప్రధాన కార్యదర్శి గణేష్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు మనోహర్‌రెడ్డి, గుండుసాబ్, పత్తి నారాయణ, బంగారు షరీఫ్, ముల్లా రఫి, బాబు, రమణారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక: నేలంపాడు గ్రామానికి చేందిన టీడీపీ నాయకులు పొన్నతోట ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఒంటెద్దు రçఘురాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుంకిరెడ్డి, చిన్న సుంకి రెడ్డి, లింగారెడ్డి, దానయ్య, రాముడుతో పాటు 30 కుటుంబాల సభ్యులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిని గంగుల ప్రభాకర్‌రెడ్డి, గంగుల నాని పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీíపీ అధినేత జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. -
చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోం
కర్నూలు :ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టాలని మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరులు చూస్తున్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకుడు రాజారెడ్డిపై ఆదివారం జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సక్రమంగా స్పందించి ఉంటే ఇలాంటి దాడులు జరిగేవి కావన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డ ప్రజలు పెద్ద ఫ్యాక్షన్‌ను చూశారన్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ప్రాణాలతోవెళ్తామో లేదో అనే పరిస్థితుల్లోనే ఎవరూ భయపడకుండా తిరిగారన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహిం చేది లేదన్నారు. పదిరోజుల్లో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు ఫిర్యాదులు చేశామని, మొదట ఇచ్చిన ఫిర్యాదుకే స్పందించి నిందితులను అదు పులోకి తీసుకుని, మందలించి ఉంటే ఈ ఘటనలు జరిగేవా అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని దాడులను అరికట్టాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎలాంటి హాని జరిగినా సహించబోమన్నారు. ఫ్యాక్షన్ గొడవలకు 1999 నుంచి నియోజకవర్గ ప్రజలు దూరంగా ఉన్నారని, మళ్లీ అలాంటి పరిస్థితులను సృష్టించవద్దని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి, నాయకులు పలచాని బాలిరెడ్డి, శివనాగిరెడ్డి, రంగేశ్వర్‌రెడ్డి, పత్తి నారాయణ పాల్గొన్నారు. -
ప్రజా ధనాన్ని దోస్తున్నా..పట్టదా?
కర్నూలు (అర్బన్): ‘నాసిరకంగా రోడ్లు నిర్మించి..ప్రజా ధనాన్ని అధికార పార్టీ నేతలు దోచుకుతింటున్నా ప్రభుత్వానికి పట్టదా’ అంటూ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బుధవారం.. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్సీ గంగుల మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ పరిధి లో వేస్తున్న రోడ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. నాసిరకం కంకర వేస్తుండడంతో వేసిన కొద్దిరోజులకే పాడైపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎర్రగుంట్ల– యు.కొత్తపల్లి రోడ్డు పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరిందన్నారు. డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు మాట్లాడుతూ.. రోడ్ల నిధుల కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి 12గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని చిప్పగిరి జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు కోరారు. జెడ్పీటీసీలకు పది నెలలుగా వేతనాలు అందలేదని బేతంచెర్ల జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సీఈఓ విశ్వేశ్వరనాయుడు స్పందిస్తూ.. ఈ ఏడాది జూన్ నెల వరకు జెడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. డోన్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు కావాల్సిన వారికి మాత్రమే ఉపాధి పనులు కల్పించినట్లు చూపించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు కోరారు. గూడూరు మండలంలో నిర్మించుకున్న గృహాలకు సంబంధించి ఇంతవరకూ రెండు నెలలుగా బిల్లులు రావడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కరువుపై నిర్లక్ష్యం వద్దు.. కరువు పరిస్థితులను అంచనా వేయడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో జిల్లా అంతటా కరువు తాండవిస్తున్నా.. 37 మండలాలను మా త్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతం గా ప్రకటించాలని తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ నిధులను ఒక్కో మండలానికి రూ.10 లక్షల ప్రకారం తాగునీటి అవసరాలకు కేటాయించామని, ఏయే మండలాల్లో పనులు ప్రారంభించారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. ప్యాపిలి జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ ఆయా పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించలేకపోతున్నామన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగే నాటికి జిల్లాలోని క్వారీలు, క్రషర్ యూనిట్ల వివరాలను అందించాలని మైనింగ్ అధికారులను జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సీపీఓ ఆనంద్‌నాయక్, ఎస్ఎస్ఏ పీఓ తిలక్ విద్యాసాగర్, అధికారులు పాల్గొన్నారు. -
జన్మభూమి అట్టర్ ఫ్లాప్: శిల్పా
సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పాదయాత్ర సూపర్ హిట్.. జన్మభూమి అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం సూదేపల్లి గ్రామంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అన్నారు. జన్మభూమి సభల్లో జనాలు లేరన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలన్నారు. అధికార పార్టీ నాయకులు జన్మభూమికి వెళ్లలేని పరిస్థితి ఉందని, వాస్తవాలు ఒప్పుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్ధాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నామని, సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అరెస్టులు దారుణం నాలుగేళ్ళ టీడీపీ పాలనలో చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య అన్నారు. అభివృద్ధిపై బహిరంగ సవాల్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదని, బహిరంగ చర్చకు టీడీపీ నాయకులు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలకు మాత్రమే జన్మభూమి కార్యక్రమం వల్ల ఉపయోగమన్నారు. ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు. మరోసారి మోసం జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజలను మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ఆయన ప్రశ్నించారు. -
గంగుల ప్రభాకర్ రెడ్డి నివాసంలో సోదాలు
-
హామీల అమలులో బాబు విఫలం
= రుణమాఫీ పేరుతో మోసం = ఇంటికో ఉద్యోగం ఉత్తి మాటే = జగన్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి = ఆళ్లగడ్డ ప్లీనరీలో గౌరు, గంగుల, ఎర్రబోతుల ఆళ్లగడ్డ: హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్లీనరీకి ర్యాలీగా తరలివచ్చారు. ముఖ్య అతిథి గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ అధినేత అధికారం చేజిక్కించుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. పంటలు పండక..గిట్టుబాటు ధర లేక అన్నదాతకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. బాబు పాలనలో కరువు తాండవిస్తోందన్నారు. ఒకే సారి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ కాక..అప్పులు తీర్చలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రైతుల ఉసురు చంద్రబాబుకు తగలడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందినవారు టీడీపీ హామీలతో మోసపోయారని..ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను అధికార పార్టీ నేతలు మభ్య పెట్టారన్నారు. ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో విజయబాపుటా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎదుగుదల చూడలేకే..
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఎమ్మెల్పీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. నారాయణ రెడ్డి మృతి చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూడలేకే టీడీపీ ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ ఉండదన్న భయంతోనే దాడులకు పాల్పతున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీరం చేసిందని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక
-
ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి నారా లోకేశ్, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, అర్జునుడు, పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని శుక్రవారం ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలపై పోరాటం చేస్తానని ఆళ్ల నాని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైన మైనంపల్లి హనుమంత రావు, ఎలిమినేటి క్రిష్ణారెడ్డి , గంగాధర్ గౌడ్ లకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి ,అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ ఏడు, తెలంగాణలో మూడు ఏకగ్రీవం
విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, తెలంగాణలో ముగ్గురు ఏకగ్రీవంగా శాసనమండలికి ఎన్నికయ్యారు. ఏపీలో ఎనిమిదో అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగుల ప్రభాకర్ రెడ్డి భార్య నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీమైంది. వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి.. టీడీపీ నుంచి నారా లోకేశ్, కరణం బలరాం, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థులు మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా నాని, గంగుల
మండలికి ఖరారు చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: శాసన సభ నుంచి శాసన మండలికి త్వరలో జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్లను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. అభ్యర్థుల విషయమై జగన్ నాలుగు రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకున్న అనంతరం గురువారం వీరిద్దరి పేర్లను జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సేవ చేస్తారని గెలిపిస్తే ప్రజల్ని దోచుకుంటున్నారు : నాని, గంగుల సేవ చేస్తారని ప్రజలు ఓట్లేసి టీడీపీ నేతలను గెలిపిస్తే చివరికి వారినే దోచుకుతింటున్నారని ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డిలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడు చోట్ల పీడీఎఫ్ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులకు మూడు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ అభ్యర్థులకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ రాయలసీమ (ఈస్ట్) పట్టభద్రుల నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డికి, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యంకు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అజయ్‌శర్మకు పార్టీ మద్దతు తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. రాయలసీమ (పశ్చిమ) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కూడా ఈ ప్రకటనలో వైఎస్ జగన్ కోరారు. -
‘ ప్రభుత్వ అరాచకాలు ఎదుర్కొంటాం’
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లనాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేల కోటాలో తమను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆళ్లనానిని, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంగుల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వారు వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామని, ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత ఇవాళ అభ్యర్థులను ఖరారు చేశారు. ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు 1. ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి జిల్లా-ఏలూరు) 2. గంగుల ప్రభాకర్ రెడ్డి (కర్నూలు జిల్లా-ఆళ్లగడ్డ) మరోవైపు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు తదితరులు ఇవాళ వైఎస్ జగన్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాయలసీమ ఈస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాసులురెడ్డి, టీచర్స్ నియోజకవర్గంలో విటపు బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అజయ్ శర్మకు మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా మూడు నియోజకవర్గాల్లో పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి పార్టీ నేతలు కృషి చేయాలన్నారు.