చాగలమర్రి: రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని, అనవసరంగా మాట్లాడితే గ్రామ గ్రామాన బుర్రకథలు పెట్టి అందరి బాగోతాలు చెప్పిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం నేలంపాడు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో తాను ప్రతిపాదించిన పనులే ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. వారు రెండేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ నియోజకవర్గానికి చేసేందేమీ లేదని మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి సడక్ యోజన కింద మంజురైన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
ఇప్పటికే ఎన్నో జన్మభూమి సభలు నిర్వహించారని, ఎన్ని సమస్యలు పరిష్కరించారో వెల్లడించాలన్నా రు. టీడీపీ నాయకులు జేబులు నింçపు కోవడానికి తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించడం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం వస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేలంపాడు గ్రామంలోని రాళ్లగనుల గుంతలను వక్కిలేరు, కేసీ కాల్వ నీటిని నింపాలని అధికారులను కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబులాల్, మండల కన్వీనర్ కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రుడు, డివిజన్ ప్రధాన కార్యదర్శి గణేష్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు మనోహర్‌రెడ్డి, గుండుసాబ్, పత్తి నారాయణ, బంగారు షరీఫ్, ముల్లా రఫి, బాబు, రమణారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో చేరిక: నేలంపాడు గ్రామానికి చేందిన టీడీపీ నాయకులు పొన్నతోట ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఒంటెద్దు రçఘురాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుంకిరెడ్డి, చిన్న సుంకి రెడ్డి, లింగారెడ్డి, దానయ్య, రాముడుతో పాటు 30 కుటుంబాల సభ్యులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిని గంగుల ప్రభాకర్‌రెడ్డి, గంగుల నాని పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీíపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment