ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక | alla nani, gangula prabhakar reddy others to be declared elected for AP MLC elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక

Published Fri, Mar 10 2017 3:47 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక - Sakshi

ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నుంచి నారా లోకేశ్‌, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, అర్జునుడు, పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని శుక్రవారం ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలపై పోరాటం చేస్తానని ఆళ్ల నాని తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైన మైనంపల్లి హనుమంత రావు, ఎలిమినేటి క్రిష్ణారెడ్డి , గంగాధర్ గౌడ్ లకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి ,అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు శుభాకాంక్షలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement