
భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టీడీపీ నేత గంగుల ప్రభాకర్రెడ్డి వర్గీయుల మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలోనే ఇరువర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. రెండు నెలల కిందట సీసీ రోడ్డు పనుల విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. తాజా పరిణామాలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీలో భూమా చేరికను మొదటి నుంచి గంగుల, శిల్పా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.