Bhuma Nagi Reddy
-
మా నాన్నను వేధిస్తున్నారు
-
మా నాన్నను వేధిస్తున్నారు
టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గతంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డిని టీడీపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ గతంలో పలుమార్లు అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. 2014 నవంబర్ 6న.. ‘‘మా నాన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రప్రభుత్వం పదేపదే వేధిస్తోంది. రెండు రోజుల్లోనే నాన్నపై మూడు తప్పుడు కేసులు పెట్టారు. రౌడీషీట్ ఓపెన్ చేశారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు నాన్న గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. భూమా నాగిరెడ్డి గారి మీద ఇంతకు ముందు కేసులు లేవు. ఇప్పుడు ఒక్క సంఘటనలో మూడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేశారు. అమ్మ పోయిన షాక్‌లో నుంచి మేమింకా బయటకు కూడా రాలేదు. ఆయన్ని మెంటల్‌గా ఇంకా వీక్ చేయాలని కేసులు పెడుతున్నారేమో.. మీరు ఆయన్ని ఎంతైతే వెనక్కి లాగాలని చూస్తారో ఆయన అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ బలపడతారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి గారు ఓపెన్‌గా మీడియాకు చెబుతున్నారు. నంద్యాలకు బై ఎలక్షన్స్ వస్తాయి. భూమా నాగిరెడ్డిపై కేసులు ఎలా పెట్టాలో మాకు, మా నాయకుని(సీఎం చంద్రబాబు)కి తెలుసు. అంత ఓపెన్‌గా వాళ్లు నంద్యాలకు బై ఎలక్షన్స్ వస్తాయని ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు తెలియడం లేదు. దాని వెనుక చంద్రబాబు సపోర్టు కూడా ఉందని ఓపెన్‌గా మీడియాకే చెబుతున్నారు. నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. భూమా నాగిరెడ్డి గారికి గానీ, నా కుటుంబానికి గానీ ఏమైనా జరిగితే దానికి బాధ్యత చంద్రబాబే అవుతారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకుండా వీళ్లు ఇంత ఓపెన్‌గా బైఎలక్షన్స్ వస్తాయి. కేసులు పెడతాం అని అనరు.. 2015 జూలై 4న... ‘‘బైపాస్ సర్జరీ చేయించుకున్న నాన్నకు మధుమేహం, రక్తపోటు ఉంది. అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదు. ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరు. మమ్మల్ని వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఓటుకు కోట్ల వ్యవహారంలో ప్రమేయమున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. నాన్నకు హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా నిమ్స్‌కు తరలించడానికి అభ్యంతరం ఏమిటి? ఒక పధకం ప్రకారం నాన్నను ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారు..’’ -
కేసులు.. వేధింపులు.. అవమానాలు
► భూమా నాగిరెడ్డిని మొదట్నుంచీ వేధించింది తెలుగుదేశం పార్టీయే.. ► ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రౌడీషీట్ ► పార్టీ మారేలా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ► పార్టీ మారాక మంత్రి పదవి ఇవ్వకుండా అవమానాలు ► ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని గెలిపించాలని సీఎం హుకుం ► మానసిక క్షోభకు గురై తుదిశ్వాస విడిచిన భూమా నాగిరెడ్డి సాక్షి ప్రతినిధి, కర్నూలు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మొదటి నుంచీ వేధించింది ఎవరు? ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఏకంగా రౌడీషీట్ తెరిచింది ఎవరు? ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? కేసులు పెట్టి, వేధింపులకు గురిచేసి పార్టీ మారేలా ఒత్తిడి తెచ్చింది ఎవరు? తీరా పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానాలకు గురిచేసింది ఎవరు? పైగా ఎమ్మెల్నీ ఎన్నికల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్థి శిల్పా గెలుపు కోసం పని చేయాలంటూ ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ విజయవాడకు పిలిపించి మరీ ఒత్తిడి పెంచింది ఎవరు? అనే అంతులేని ప్రశ్నలకు అటు ఆళ్లగడ్డతోపాటు ఇటు నంద్యాలలోని ఆయన అనుచరుల నుంచి వస్తున్న ఒకేఒక్క సమాధానం... చంద్రబాబు నాయుడు. భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సర్ 2014 ఎన్నికల్లో వెఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనపై కేసులు నమోదు చేయించింది. మున్సిపాలిటీలో జరిగిన గొడవలను కారణంగా చూపి 2014 అక్టోబరు 31న ఆయనపై ఒకేసారి ఏకంగా మూడు కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2015లో డీఎస్పీతో వాగ్వావాదానికి దిగారనే నెపంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లోనూ ఇరికిస్తామని ప్రభుత్వం ఆయనను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘‘భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సర్’’ అంటూ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కూరలో కరివేపాకు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబాన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకుని, అవసరం తీరాక పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. భూమా కుటుంబానికి ఎన్నడూ మంత్రి పదవి ఇచ్చి గౌరవించలేదు. భూమా కుటుంబాన్ని టీడీపీ నాయకత్వం కూరలో కరివేపాకులా వాడుకుంటూ వదిలేసిందనే అభిప్రాయం ఇప్పటికీ ఆయన అనుచరుల్లో ఉంది. చిన్నకర్మ కాకుండానే అసెంబ్లీకి అఖిలప్రియ భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియను అసెంబ్లీకి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో కనీసం చిన్నకర్మ కూడా కాకుండానే ఆమె అసెంబ్లీకి వచ్చారు. అయితే, తాము ఆమెను అసెంబ్లీకి రావాలని పిలవలేదని స్వయంగా సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని టీడీపీ కార్యకర్తలే ఖండిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులు కేసు 1 224/2014, టూటౌన్ పోలీస్ స్టేషన్, నంద్యాల తేదీ: 31–10–2014 ఫిర్యాది: దేశం సులోచన, మున్సిపల్ చైర్పర్సన్ నిందితులు: భూమా నాగిరెడ్డి, కౌన్సిలర్లు సెక్షన్లు: 147, 148, 324, నేపథ్యం: మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే భూమా రోడ్ల విస్తరణ గురించి మాట్లాడటం ప్రారంభించగా, సమావేశం ముగిసిందని చైర్పర్సన్ బెల్ కొట్టారు. తాను ఇంకా మాట్లాడాలని భూమా పట్టుబట్టారు. ఆయ నపై చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు 2 225/2014 నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ తేదీ: 31–10–2014 ఫిర్యాది: వైస్‌చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, టీడీపీ ఇన్చార్జి శిల్పా మోహన్‌రెడ్డి అనుచరుడు నిందితులు: భూమా నాగిరెడ్డి, మరికొందరు కౌన్సిలర్లు సెక్షన్లు: 147, 148, 324, 506, 307, 120బీ, 109 రెడ్‌విత్34 ఐపీసీ. నేపథ్యం: వైస్ చైర్మన్ గంగిశెట్టివిజయ్కుమార్పై జరిగిన హత్యాయత్నం కేసు 3 226/2014, నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ తేదీ: 31–10–2014 ఫిర్యాది: అనిల్ అమృతరాజ్, టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్ నిందితులు: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, కౌన్సిలర్లు సెక్షన్లు: 147, 148, 324, 506, రెడ్‌విత్ 149 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేపథ్యం: మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే భూమా తనను కులం పేరిట దూషించారని ఎస్సీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. కేసు 4 132/2015 నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్ తేదీ: 03–07–2015 ఫిర్యాది: దేవదానం, డీఎస్పీ నిందితులు: భూమా నాగిరెడ్డి సెక్షన్లు: 353, 188, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేపథ్యం: ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా డీఎస్పీ దేవదానం విధి నిర్వహణకు అడ్డుతగిలి, కులం పేరిట దూషించినట్లు నమోదైన కేసు ఆ రోజు ఏం జరిగింది? అనారోగ్య కారణాలతో గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో భూమా చికిత్స పొందుతున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పాకు భూమా సహకరిస్తాడో లేదో అనే అనుమానంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో వచ్చి, తనను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటికప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, విమానంలో విజయవాడకు వెళ్లి సీఎంను కలిసినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి సహకరిస్తామని భూమాతోపాటు వచ్చిన నేతలు తెలిపారు. తమ నేత భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని నంద్యాల కౌన్సిలర్లు ఈ సమావేశంలో సీఎంను కోరినట్లు సమాచారం. అయితే, ‘ఏయ్... నాకు తెలుసు మీరు ఉండండి’ అంటూ చంద్రబాబు గద్దించారనే వాదన వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏ ఎమ్మెల్యేనూ పిలవకుండా, కేవలం తనను మాత్రమే పిలవడంపై కూడా భూమా మానసిక క్షోభకు గురై, గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ శవ రాజకీయం
-
వారికి పదవులు ఇవ్వండని చెప్పాలా?
⇒ బాబు వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం ⇒ ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని ధ్వజం సాక్షి, అమరావతి: భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి విషయంలో సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీపై నిందలు వేయడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ వైఎస్సార్సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిందని సీఎం చంద్రబాబు మంగళవారం వ్యాఖ్యానించారు. విజయవాడ లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? మన పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని చెప్పకుండా ఇంకేం చెబుతాం? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు యాగీ చేసిన విషయం మరిచారా? శాసనసభలో భూమా సంతాప తీర్మానంపై మాట్లాడేటపుడు చంద్రబాబు గానీ, మరొకరు గానీ నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనో ఎందుకు చెప్పలేక పోయారు? నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనే విషయమే ప్రస్తావించలేక పోయారంటే వారి నైతికత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబు తాను తప్పు చేసిందే కాకుండా ఎదుటి వారిని తప్పుపట్టడం ‘దొంగే... దొంగా దొంగా’ అని అరచినట్లుగా ఉంది’’ అని జగన్ పేర్కొన్నారు. -
భూమా నాగిరెడ్డికి శాసనసభ నివాళి
⇒ సభలో సంతాప తీర్మానం ⇒ తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తా: అఖిల ప్రియ సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శాసనసభ మంగళవారం నివాళులు అర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. నాగిరెడ్డి మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించిన అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమవుతూనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ భూమా జీవిత విశేషాలను వివరించారు. చనిపోవడానికి 24 గంటల ముందు భూమా తనను విజయవాడలో కలిశారని, నియోజకవర్గ సమస్యలపై చర్చించారని, ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. నాగిరెడ్డి గుండె ధైర్యం, అంకిత భావం కలిగిన నాయకుడని కొనియాడారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే తల్లి, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే అఖిల ప్రియ, ఆమె చెల్లెలు, తమ్ముడికి అండగా ఉంటామని, కన్నతండ్రిలాగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటిని తరలించే పైప్‌లైన్ ప్రాజెక్టుకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టడానికి అభ్యంతరమేమీ లేదని తెలిపారు. వ్యక్తులు వేరు, రాజకీయాలు వేరంటూ శివారెడ్డి, పరిటాల రవి హత్యోదంతాలను చంద్రబాబు ప్రస్తావిం చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తాము సహకరించామని అన్నారు. డాక్టర్లు వారించినా విజయవాడ వచ్చారు తన తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తానని, వారి ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భూమా దంపతుల కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పారు. తన తండ్రి నాగిరెడ్డి ఆసుపత్రిలో బెడ్‌పై ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు. ప్రయాణం చేయవద్దని డాక్టర్లు వారించినా విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబును కలసి వెళ్లారన్నారు. తనకు మార్గదర్శకుడు తన తండ్రేనని, తన తల్లి చనిపోయిన పడక మీదనే తండ్రి కూడా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా బడుగువర్గాల కాలనీకి, రహదారి విస్తరణకు, నంద్యాల పైప్‌లైన్‌కు ఆయన పేరు పెట్టాలని కోరారు. బాధను కసిగా మార్చుకుని పని చేస్తానన్నారు. భూమా కుటుంబంతో తనకు 25 ఏళ్లుగా పరిచయం ఉందని స్పీకర్ కోడెల చెప్పారు. -
భూమాకు తుది వీడ్కోలు
⇒ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ⇒ భౌతిక కాయానికి నివాళులర్పించిన నేతలు ⇒ కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ⇒ అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ఆళ్లగడ్డలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయ కులు, వేలాదిమంది అభిమానుల మధ్య భూమా అంతిమయాత్ర సాగింది. ఆళ్లగడ్డ లోని శోభానాగిరెడ్డి ఘాట్ వద్దనే భూమా అంత్యక్రియలను ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉద యం భూమా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జన సందోహం మధ్య భూమా పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభాఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడే అంత్యక్రియలను అధికార లాంఛనా లతో పూర్తి చేశారు. ప్రత్యేక పోలీసులు గౌరవ వందనం సమర్పించి సంతాపసూచకంగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం జగత్‌విఖ్యాత్‌రెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించారు. భూమా కుమార్తెలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, నాగ మౌనిక, కుటుంబసభ్యుల రోద నలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. భూమా కుటుంబానికి సీఎం భరోసా భూమా కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కాసేపు ఏకాంతంగా చర్చించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే సమయానికి 24 గంటల ముందు భూమా విజయవాడలో తనను కలిశారని.. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించారని తెలిపారు. అఖిలప్రియ ద్వారా ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ప్రకటించారు. సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు కార్యకర్తలు అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం స్పందించలేదు. నేతల నివాళి భూమా భౌతిక కాయానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శాసనమండలి చైర్మన్ చక్ర పాణి యాదవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతో పాటు డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణ మూర్తి, చిన్నరాజప్ప, మంత్రులు అచ్చెన్నా యుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జె.సి.దివా కర్రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజ య్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆది మూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాజ గోపాల్‌రెడ్డిలు భూమాకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ముగిసిన భూమా అంత్యక్రియలు
-
భూమా నాగిరెడ్డి కన్నుమూత
- గుండెపోటుతో కుప్పకూలిన నంద్యాల ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, కర్నూలు/ నంద్యాల: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (54)ఆదివారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఆళ్లగడ్డ నివాసంలో అల్పాహారం తీసుకున్న భూమా 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనను కాపాడటానికి వైద్యులు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం అమరావతిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, ఆళ్లగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో కలసి భూమా పాల్గొన్నారు. భూమాకు మంత్రి పదవి అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్టు, ఈ సందర్భంగా వాదోపవాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. అనంతరం అమరావతి నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటల సమయంలో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో మరోమారు భేటీ అయ్యారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న భూమా ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు, కార్యకర్తలు వెంటనే స్థానిక డాక్టర్ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 9.30 గంటల సమయంలో నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ రవికృష్ణ సారథ్యంలో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ హరినాథరెడ్డి, డాక్టర్ మధుసూదనరావు, కర్నూలు నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ అలీలు సుమారు రెండు గంటల పాటు భూమాను కాపాడేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో ఆయన్ను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై చాలాసేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు భూమా మరణించినట్లు 11.30 గంటల సమయంలో వైద్యులతో కలసి భూమా బావమరిది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. గుండె ఆగిపోవడంతో... గుండె పనిచేయడం ఆగిపోవడంతో (కార్డియాక్ అరెస్ట్) భూమా నాగిరెడ్డి మరణించారని డాక్టర్ హరినాథరెడ్డి తెలిపారు. భూమా హార్ట్‌బీట్ తీవ్రస్థాయిలో 250కి పైగా చేరిందని, బీపీ కూడా ఎక్కువై మెదడుకు రక్తప్రసారం నిలిచిపోయిందని చెప్పారు. దీని వల్ల ఆయనకు ఫిట్స్ వచ్చాయని, ఊపిరితిత్తులకు ట్యూబ్ ద్వారా ఆక్సిజన్‌ను పంపే ఏర్పాటుచేసి కొన ఊపిరితో తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే వెంటిలేటర్‌పై పెట్టి ఇంజక్షన్లు వేసి తీవ్రంగా ప్రయత్నించినా భూమా గుండె స్పందించలేదని, దీంతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించామని తెలిపారు. ప్రముఖుల సంతాపం.. నివాళులు భూమా హఠాన్మరణంపై ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కె. హరిబాబు, వామపక్ష పార్టీల నేతలు కె. నారాయణ, కె. రామకృష్ణ, పి. మధు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు భూమా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం జరిగే అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు భూమా మరణించారని తెలియగానే ఆయన కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భూమాను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలివచ్చారు. భూమా భౌతికకాయాన్ని నంద్యాల పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆళ్లగడ్డకు తరలించారు. సోమవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. భూమా నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు అఖిలప్రియ (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే), మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ఉన్నారు. భార్య శోభా నాగిరెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మూడుసార్లు ఎంపీ.. మూడుసార్లు ఎమ్మెల్యే భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు 1964 జనవరి 8వ తేదీన భూమా జన్మించారు. బెంగళూరులో హోమియో వైద్యం చదువుతూ మధ్యలో ఆపేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా ఏడాది క్రితం కుమార్తెతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భూమా మరణ వార్త తెలియగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఫోన్లో అఖిలప్రియను పరామర్శించారు. -
‘తండ్రిలా అఖిలప్రియకు అండగా ఉంటా’
-భూమా హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి : నంద్యాల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని ముఖ్యమంత్రి అన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. భూమా మృతి వ్యక్తిగతంగా తనకు, తెలుగుదేశం పార్టీకి, కర్నూలు జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. భూమా కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు భూమా ఎనలేని కృషి చేశారని, కొద్ది రోజుల క్రితమే జిల్లా నాయకులతో వచ్చి తనను కలసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. భూమా కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. తండ్రి స్థానంలో తానుంటానని, అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు ధైర్యం చెప్పారు. భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. -
భూమా నాగిరెడ్డి కన్నుమూత
-
భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
-
భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చిందని నాగిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. స్మృహలేని స్థితిలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. నాగిరెడ్డి అస్వస్థకు గురయ్యారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు. నిన్ననే సీఎం చంద్రబాబుతో నాగిరెడ్డి భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబును కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, శిల్పా సోదరులతో విభేదాలు, మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చించారు. నాగిరెడ్డి అనారోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయనను తరలించేందుకు అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆదేశించారు. మరోవైపు అహొబిలంలో ఉన్న నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు. -
కొత్త చిచ్చు!
మంత్రి పదవి ఆశల చుట్టూ రాజకీయం - భూమా వైపు మొగ్గితే తాముండబోమంటున్న శిల్పా? - సీఎం వద్ద పంచాయితీకి నిర్ణయం - ఎన్నికలు వస్తే స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధం - భూమాను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే పార్టీకే నష్టం. ప్రధానంగా భూమా నాగిరెడ్డికి ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటే ఒప్పుకోం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మేం ఎలా కొనసాగగలం. మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సిందే. అదే జరిగితే భూమాకు వ్యతిరేకంగా మేం ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాం. సహకరించే అవకాశమే లేదు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించాలని భావిస్తున్నాం.’’ ఇవీ తన ప్రధాన అనుచరులతో శిల్పా బ్రదర్స్ చెబుతున్న మాటలు. ఈ నేపథ్యంలో మరోసారి నంద్యాల రాజకీయం రసకందాయంలో పడబోతుందని అర్థమవుతోంది. తెలంగాణలో జరిగిన మంత్రి తలసాని ఎపిసోడ్‌తో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కొత్తగా ఎవ్వరికీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదనేది శిల్పా వర్గీయుల భావనగా ఉంది. ఎన్నికలు తప్పవని.. ఇదే జరిగితే తాము స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుతామని కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇదీ ఇప్పుడు అధికార పార్టీలో మరింత కాక పుట్టిస్తోంది. ఎన్నికలొస్తే.. వాస్తవానికి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసానికి మంత్రి పదవి అప్పగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయనే ప్రచారం ఉంది. దీంతో గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ లేఖ పంపిందని కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవులు లభించే అవకాశం లేదని స్వయంగా అధికార పార్టీ నేతలే పేర్కొంటున్నారు. భూమాకు మంత్రి పదవి రావాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో నంద్యాల అసెంబ్లీలో ఉప ఎన్నికలు తథ్యమని కూడా అధికార పార్టీలో వాదన ఉంది. ఒకవేళ భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించి.. ఉప ఎన్నికలకు సిద్ధపడితే తమ నేత కూడా బరిలో ఉంటారని శిల్పా వర్గీయులు పేర్కొంటున్నారు. పోటీలో తమ నేత గెలిచినా, గెలవకపోయినా భూమాను మాత్రం కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని స్పష్టంగా అధినేతకు వివరించిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని వక్కాణిస్తున్నారు. కాగా.. ఎన్నికలు వచ్చి ఓడిపోతే పార్టీ పరువు బజారున పడుతుందని అధికార పార్టీలో అలజడి రేగుతోంది. ఇదిలాఉంటే తమ నేతకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భూమా వర్గీయులు ధీమాగా ఉన్నారు. ఆదీ నుంచి సమన్వయలేమి..! ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే సామెతకు అనుగుణంగా.. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోందనే వాదన అధికారపార్టీలో వినిపిస్తోంది. పైకి ఎంత బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినప్పటికీ లోలోపల మాత్రం పాత నేతలు కొత్త నేతల రాకపై మండిపడుతున్నారు. పైగా తమ అధినేత కూడా కొత్తగా వచ్చిన వారికే పట్టం కడుతున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత నేతలంతా కలిసి తమ స్థానానికి కన్నం పెట్టే ప్రయత్నాలు పార్టీ నుంచే జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తమకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గం లేకపోతే.. తమకు విలువ ఏముంటుందని మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత నేతలంతా కలిసి అధినేతను కలవాలనే చర్చ కూడా సాగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా అధికార పార్టీలో అగ్గి రాజేస్తోంది. -
నాపై రౌడీషీట్ ఎత్తేయండి!
- ప్రభుత్వానికి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వినతి - పరిశీలించాలంటూ జిల్లా పోలీసులకు ప్రభుత్వ ఆదేశం - త్వరలో రౌడీషీట్ ఎత్తేసేందుకు రంగం సిద్ధం! సాక్షి ప్రతినిధి, కర్నూలు: తనపై ఉన్న రౌడీషీట్ ఎత్తివేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు. ఆయన స్వయంగా సీఎం చంద్రబాబును కలసి ఈ మేరకు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వినతిని పరిశీలించాలంటూ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. భూమాపై రౌడీషీట్ ఎత్తివేయడంపై జిల్లా పోలీస్ యంత్రాంగం తన అభిప్రాయాల్ని మరికొన్ని రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది. వైఎస్సార్సీపీ నుంచి అధికారపార్టీలో చేరిన తర్వాత భూమాపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తివేసేందుకు పావులు కదపడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే కేసుల్ని నమోదు చేస్తారని, అధికారపార్టీలో చేరితే అవే కేసుల్ని ఎత్తివేస్తారనే భావన ప్రజల్లో బలంగా నెలకొనే ప్రమాదముందనే ఆందోళన అధికారపార్టీలోని నేతల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. కేసు నేపథ్యమిదీ..: నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని 2014, అక్టోబర్ 31న నిర్వహించారు. చివర్లో రోడ్ల విస్తరణపై భూమా నాగిరెడ్డి మాట్లాడుతుండగా.. సమావేశం ముగిసిందంటూ అధికారపార్టీకి చెందిన చైర్పర్సన్ దేశం సులోచన బెల్‌కొట్టారు. ఇది ఇరువర్గాలమధ్య దాడులదాకా వెళ్లింది. మాజీమంత్రి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గాయపడ్డారు. చైర్పర్సన్ చాంబర్ అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన కౌన్సిలర్లను సమావేశం ముగిశాక మునిసిపల్ వైస్‌చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ పరామర్శించి వస్తుండగా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనల గురించి మాజీ మంత్రులు శిల్పామోహన్‌రెడ్డి, ఫరూక్‌లు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అదేరోజు ఫిర్యాదు చేశారు. దీనిపై దళిత కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్‌ను అవమానించారంటూ అట్రాసిటీ కేసు, గంగిశెట్టి విజయ్‌కుమార్‌పై హత్యాయత్నానికి కుట్రపన్నినట్టు భూమాపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వెంటనే రాత్రిసమయంలో ఆయన్ను అరెస్ట్ చేసి విచారించారు. మరుసటిరోజు భూమా, ఆయన అనుచరులైన ఏడుగురు కౌన్సిలర్లతోపాటు ఏవీఆర్ ప్రసాద్‌లపై రౌడీషీట్ నమోదైంది. -
భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టీడీపీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలోనే ఇరువర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. రెండు నెలల కిందట సీసీ రోడ్డు పనుల విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. తాజా పరిణామాలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీలో భూమా చేరికను మొదటి నుంచి గంగుల, శిల్పా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. -
భూమాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, డీఎస్పీ దేవదానంకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమా డీఎస్పీని కులం పేరుతో దూషించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరస్టయిన భూమా బెయిల్ మీద బయటకు వచ్చారు. కాగా, కోర్టు కేసు విచారణకు దాదాపు రెండుమార్లు గైర్హాజరయ్యారు. సోమవారం మరోసారి విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. -
ఎమ్మెల్యే భూమాకు స్వల్పంగా గుండెపోటు
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన క్రాంతినగర్‌లో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు బాణసంచా కాల్చడంతో వచ్చిన పొగ వల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అలాగే ఐఎంఏ సమావేశంలో పాల్గొని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు ఆయనకు ఈసీజీ తీసి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు గంట పాటు చికిత్స అందించిన అనంతరం ఆయన కోలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. భూమా మీడియాతో మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. -
కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా
కర్నూలు: నమ్ముకున్న కార్యకర్తలతో పాటు వర్గాన్ని కాపాడుకునేందుకే తాను వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులతో పాటు తాత, ముత్తాతలు వర్గాన్ని మిగిల్చిపోయారని, వారు కొంతకాలంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల కాపాడుకోవడం కోసం అన్నింటికీ సిద్ధపడి టీడీపీలో చేరానన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని, ఎవరికీ అన్యాయం జరగకుండా కలసి పనిచేద్దామని అన్నారు. -
ముఖ్యమంత్రి వద్దే పరిష్కరించుకుంటాం
భూమా నాగిరెడ్డితో సమస్యలపై శిల్పా ప్రకటన సాక్షి, కర్నూలు: ‘‘భూమా నాగిరెడ్డితో మాకు సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పరిష్కరించుకుంటాం’’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. గురువారం ఆయన నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఫిలిప్ సి టాచర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఫ్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చన్నాయుడు, జిల్లా అధ్యక్షుడితో కూడిన కమిటీ త్వరలోనే సీఎం చంద్రబాబును కలవనుందని.. ఆ సందర్భంగా భూమాతో సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. శ్రీశైలంలో అభివృద్ధి పనులపై అనేక ఆరోపణలు వస్తున్నాయని.. త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా కర్నూలు కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. తుంగభద్ర నుంచి ఎల్ఎల్సీకి మే నెలలో నీళ్లు ఇచ్చేందుకు బళ్లారి కలెక్టర్ అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారన్నారు. జిల్లాలో కరువు నివారణకు ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్.సి.టాచర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రిస్టియన్, మైనార్టీ వర్గాల స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. -
భూమా వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో
పాములపాడు: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పాములపాడులో కర్నూలు-గుంటూరు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నంద్యాలలో గురువారం కొంతమంది దళితులు తమకు అంబేద్కర్ భవన్‌ను కట్టించవలసిందిగా భూమానాగిరెడ్డిని కోరారు. ఆ సందర్భంలో ఆయన‘ మీకు తినడానికి తిండి లేదు కానీ అంబేద్కర్ భవన్ అంత అవసరమా’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. -
టీడీపీ నాయకుడు జేవీసీ ప్రసాద్ అరెస్ట్
► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో నిందితుడు ► రిమాండ్‌కు తరలించిన పోలీసులు నంద్యాల: మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నాయకుడు జేవీసీ ప్రసాద్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. రిమాండ్‌కు ఆదేశించారు. నూనెపల్లె ట్యాంక్ వద్ద వాల్వ్ ఆపరేటర్‌గా హుసేన్‌బాషా పని చేస్తున్నారు. ఇటీవల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రమైన విషయం తెలిసిందే. దీంతో ప్రజా ప్రతినిధులు, ప్రజలు సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. నూనెపల్లె ట్యాంక్ వద్ద ఉన్న హుసేన్‌బాషాను ..టీడీపీ కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ నీటి సరఫరా విషయంలో దూషించారు. అసభ్యంగా తిట్టడంతో అవమానం తట్టుకోలేక హుసేన్‌బాషా గత నెల 24న ట్యాంక్ వద్ద దోమల నివారణకై వినియోగించే రసాయనాలను తాగి ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. కాని ఆయన చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందారు. ఈ మేరకు జేవీసీ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మున్సిపల్ ఆఫీసు ఎదుట మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఆవాజ్ కమిటీ నాయకులు రాస్తారోకో చేశారు. అయితే పోలీసులు హుసేన్‌బాషా భార్య షహనాభాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. విచారణలో జేవీసీ ప్రసాద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ... సెక్షన్ 306కింద కేసు నమోదు చేశారు. ఆయనను రాత్రి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, రిమాండ్‌కు ఆదేశించారు. అయితే హుసేన్ ఆత్మహత్యకు తాను కారకుడు కాదని, తనపై కుట్రపన్ని ఇరికించారని ప్రసాద్ తెలిపారు. -
సీఎం చంద్రబాబును కలిసిన భూమా
శిల్పా మోహన్‌రెడ్డిపై ఫిర్యాదు! తాడేపల్లి రూరల్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన శిల్పా మోహన్‌రెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత 20 రోజుల కిందట శిల్పా మోహనరెడ్డి తన సోదరుడితో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలసి భూమాపై ఫిర్యాదు చేశారు. భూమా నాగిరెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని.... తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగలేదని చంద్రబాబుకు వివరించారు. భూమా కుటుంబం టీడీపీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాలలో గొడవలు మొదలయ్యాయని పార్టీ అధ్యక్షుడికి శిల్పా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తమను టీడీపీలో లేకుండా చేయాలని భూమా ప్రయత్నిస్తున్నారంటూ శిల్పా మోహనరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు
భూమాపై సీఎంకు శిల్పా సోదరుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఇటీవల టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత శిల్పా మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో ఫ్యాక్షనిజంతో కల్లోలం రేపాలని భూమా చూస్తే సహించబోమని హెచ్చరించారు. సీఎంను కలసిన అనంతరం శిల్పామోహన్‌రెడ్డి అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడారు. నంద్యాల మండలంలోని కొత్తపల్లె గ్రామ సర్పంచ్, జిల్లా టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు తులసిరెడ్డిపై సోమవారం భూమా అనుచరులు కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారని, తీవ్ర గాయాలపాలైన ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆయనకు జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత భూమా వహించాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని సీఎంకూ చెప్పామన్నారు. -
పోలీసుల 'పచ్చ'పాతం
అధికారానికి తలొగ్గారు! ► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో టీడీపీ నేత పేరు చేర్చని పోలీసులు ► మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్యోగులు, ఆవాజ్ కమిటీ రాస్తారోకో ► గంటన్నరసేపు స్తంభించిన ట్రాఫిక్ కమిషనర్ హామీతో ఆందోళన విరమణ ఈమె పేరు షారాబాను. నంద్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు వాటర్ వాల్వు ఆపరేటర్ హుసేన్‌సాబ్ భార్య. గుండలవిసేలా రోదిస్తున్న ఈమె కన్నీటి వెనుక అధికార పార్టీ నేత అహంకారం దాగుంది. టీడీపీ కౌన్సిలర్ భర్త అయిన ఆయన.. ఆ చిరుద్యోగిపై ఉరిమిన చూపునకు ఈమె జీవితంఅంధకారమైంది. ఓ మనిషి ప్రాణం తీసిన ఆ నేత విషయంలో పోలీసుల ‘పచ్చ’పాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నంద్యాల: బాధితుల పక్షాన నిలబడి న్యాయం అందించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్‌బాషా ఆత్మహత్యకు కారకుడైన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నేత జేవీసీ ప్రసాద్ పేరును కేసు నుంచి పోలీసులు తప్పించారు. విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పి, చేతులు దులుపుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆవాజ్ కమిటీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట సేపు ఆందోళన చేశాయి. నూనెపల్లె ట్యాంకు వద్ద వాల్వ్ ఆపరేటర్‌గా హుసేన్‌బాషా పని చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీ రాత్రి 9గంటల సమయంలో టీడీపీ నాయకుడు, కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ అక్కడికి వెళ్లి ‘నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదు.. అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నావు.. నీ అంతు చూస్తా.. అంటూ దుర్భాషలాడాడు. భార్య సమక్షంలో దూషించడంతో మనస్థాపానికి గురైన హుసేన్‌బాషా గురువారం మధ్యాహ్నం ట్యాంకు వద్ద ఉన్న ఫాగింగ్‌కు వినియోగించే కెమికల్స్‌ను తాగి భార్యకు ఫోన్ చేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. అయితే రాత్రి వాంతులు అధికమై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విచారణలో తేలాకే కేసు: కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్‌బాషా ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేవీసీ ప్రసాద్‌పై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. గురువారం సాయంత్రం హుసేన్‌బాషా, అతని భార్య షారాబాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేశామని, ఎవరి పేర్లు చేర్చలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఆధారాలు లభ్యమైతే జేవీసీ ప్రసాద్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై జేవీసీ ప్రసాద్ మాట్లాడుతూ హుసేన్ బాషా ఆత్మహత్యకు తాను కారణం కాదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మృతదేహంతో ఆందోళన కర్నూలులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు శుక్రవారం సాయంత్రం నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు ముర్తుజా, డివిజన్ కార్యదర్శి అమ్జాద్‌బాషా సిద్ధిఖీ, సీపీఎం నాయకులు తోటమద్దులు, మస్తాన్‌వలి, మరికొందరు ముస్లిం మైనార్టీ నేతలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. జేవీసీ ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. హుసేన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, అతని భార్యకు ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టూటౌన్ సీఐ గుణశేఖర్ బాబు, ఎస్ఐ మోహన్‌రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలా కల్యాణ్, మరికొందరు ఎమ్మార్పీఎస్ నేతలు కూడా జత కావడంతో ఆందోళన ఉధృతమైంది. కమిషనర్ సత్యనారాయణరావు, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. జేవీసీ ప్రసాద్‌పై చర్యలు తీసుకొనేలా చూస్తామని, ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. -
భూమాకు ఎదురుగాలి
► వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నగర పంచాయతీ వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ► అదే బాటలో మరికొందరు మండల, గ్రామస్థాయి నాయకులు ఆళ్లగడ్డటౌన్: ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఇటీవలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అనుకోని పరిస్థితి ఎదురవుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉంటారని భావిస్తూ వచ్చిన ఆయనకు సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోంది. నగర పంచాయతీ వైఎస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం, మరికొందరు గ్రామ, మండలస్థాయి నాయకులు ఆయన బాటలో వెళ్తుండడం ఇందుకు నిదర్శనం. శుక్రవారం ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ రామలింగారెడ్డి ఈ మేరకు బహిరంగంగానే ప్రకటించారు. ‘ఎవరో పార్టీని వీడినంత మాత్రాన నేను కూడా మారాలా? నాకు ఆ అవసరం లేదు’ అని పేర్కొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి, ఆయన భార్య డాక్టర్ సరోజిని దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ, విద్యా సంస్థలు స్థాపించి, అంకాళ్‌రెడ్డి మెమోరియల్ సేవా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు నియోజవర్గ ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. గత నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 20 వార్డులకు 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయిండంతో వైఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాల్టీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భూమా, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పార్టీ మారడంతో డాక్టర్ రామలింగారెడ్డి ఆయన వెంట వెళ్లారా? వారితో విభే దిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిరభ్యంతరంగా స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు. అదేబాటలో పలువురు భూమానాగిరెడ్డి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడ టం జీర్ణించుకోలేని అనేకమంది లోలోన మదనపడుతున్నారు. ఎవరో ఒకరు ముందుకు వస్తే వారి నాయకత్వంలో పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. భూమా కుటుంబం పీఆర్పీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన సమయంలో ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న అనేక కుటుం బాలు వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో కలిసి నడిచారు. ముఖ్యంగా ఉయ్యలవాడ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో ప్రధాన వర్గాలుగా ఉన్న ముస్లిం మైనార్టీ, క్రైస్తవులు, మరో సామాజిక వర్గం పూర్తిగా మద్దతు తెలిపింది. ఫలితంగానే పీఆర్పీ అభ్యర్థిగా కేవలం 2 వేల మెజార్టీతో గెలిచిన దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడి ఆ త ర్వాతి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇందులో చాలా వరకు వైఎస్సార్ అభిమానులే ఉన్నారన్న విషయం సుస్పష్టం. అలాంటి వీరంతా ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకుని కోసం ఎదురుచూస్తున్నారు. -
వైఎస్ఆర్సీపీని ఎవరూ వీడరు
ఆత్మకూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరని, అంతా కల్పిత ప్రచారమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరిద్దరు పార్టీ వీడినా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సీనియర్ నాయకుడని, పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చిందన్నారు. అయితే, పార్టీ వీడడానికి ఆయనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నాయో తెలియదన్నారు. టీడీపీ నుంచి త్వరలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు ప్రారంభమవుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, మేము పార్టీలోకి చేర్చుకునేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా నీచ రాజకీయాలు చేయమన్నారు. రాష్ట్రంలో టీడీపీ తప్ప ఏ పార్టీని ఉండనివ్వమని ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జన్మలో కూడా అది జరగదని అన్నారు. బాబువి దిగజారుడు రాజకీయాలు - హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమరెడ్డి, మంత్రాలయం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమరెడ్డి విమర్శించారు. గురువారం మంత్రాలయంలో జరిగిన ఆయన బంధువుల వివాహ వేడుకలకు హాజరైన పురుషోత్తమరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు గ్రేటర్ హైదరాబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. తమ వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం అనైతికమని అక్కడ చెప్పిన బాబు ఇక్కడ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. పార్టీలు మారే నాయకులు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కోసమేనని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ అభివృద్ధి చెందలేదంటూ తన తల్లిపైనే నిందలు వేయటం ఆమె తెలియని తనానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పాల్పడే కుట్రలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అభిమానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలు మారే వారికి మనుగడ ఉండదు ఆలూరు రూరల్ / హాలహర్వి : పార్టీలు మారే నేతలకు మనుగడ ఉండదని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం స్థానిక స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వారి స్వార్థప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని చెప్పారు. వీరికి అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. తాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటానన్నారు. టీడీపీలో చేరుతున్నాననే ప్రచారం కల్పితమేనన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేసుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. కొందరు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారని, అయితే, ఈ రెండేళ్ల కాలంలో అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో చూపిస్తే తాను శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి కమ్మరచేడు తిమ్మారెడ్డి, మండల కో-కన్వీనర్ బాబాసాహెబ్, మరకట్టు తిక్కన్న, అరికెర వెంకటేశ్వర్లు తదితర నాయకులు ఉన్నారు. -
గోడ దూకిన ఎమ్మెల్యేల ఫొటోలు దహనం
టీడీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు పీలేరు: ప్రజల ఆకాంక్షను విస్మరించి తమ స్వార్థం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి చిత్రాపటాలను మంగళవారం చిత్తూరు జిల్లా పీలేరులో దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో టీడీపీ దుకాణం మూతపడడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక్కడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కోట్లు, పదవులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన బాబుకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి జిల్లా కార్యదర్శి పూల కుమార్, ఎం. నరేష్, శ్రీనాథ్, ఉదయ్, సాయికుమార్, ఆజాద్, సాదిక్, అస్లాం, మస్తాన్, గణేష్ పాల్గొన్నారు. -
‘భూమా’ గతంలో ఏమన్నారు..!
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడుకు దూకుడుగా వెళ్లినపుడు మేం నచ్చుతాం. అపుడు ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్నారు. టీడీపీలో ఉన్నపుడు మాకు అవమానం జరిగితే చంద్రబాబు ముందే ఏడ్చాను. అయినా పట్టించుకోలేదు. ఆయనకు ఓదార్చటం కూడా రాదు. ఓదార్చటం అలవాటు ఉందో లేదో కూడా తెలియదు. పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదు. ప్రతిదానికీ రాజకీయమే. పార్టీలో మేం సిన్సియర్‌గా పనిచేస్తేనే ఆ పాటి గౌరవం దక్కింది. ఇతర పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వస్తే ఏ పాటి గౌరవం ఉంటుందో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఫిరాయింపులపై గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యాఖ్యలు సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లు, ఇది న్యాయమా? టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే.. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్లూ? ఇది న్యాయమా? ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్థంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉంది. -
పీఏసీ చైర్మన్‌గా తప్పుకున్న భూమా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తప్పుకున్నారు. సోమవారం సమితి సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఆ సమావేశానికి భూమా అధ్యక్షత వహించారు. సభ్యులు ఆదిమూలం సురేష్, తోట త్రిమూర్తులు, పి. శమంతకమణి హాజరయ్యారు. గనులు, రోడ్లు, భవనాలు, నౌకాశ్రయాలు తదితర శాఖలపై సమీక్షించి నివేదిక రూపొందించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పీఏసీ తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంది. సమావేశంలో పాల్గొన్న భూమా మాట్లాడుతూ.. చైర్మన్‌గా తనకు ఇదే చివరి సమావేశమని చెప్పారు. ఆ వెంటనే సమావేశం నుంచి బైటకు వెళ్లిపోయారు. -
టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
సాక్షి, తాడేపల్లి (గుంటూరు): వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, జమ్మలమడుగు ఎమ్మెల్యేల దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సోమవారం రాత్రి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ వేదికగా మధ్యాహ్నం నుంచి జరిగిన హై డ్రామా చివరకు సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి మారింది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఒక్కొక్కరితో విడివిడిగా జరిపిన చర్చల అనంతరం 11 గంటల తర్వాత చంద్రబాబు వీరికి పార్టీ కండువాలు కప్పారు. ఆరేడు నెలల కిందటే తాము టీడీపీలో చేరే విషయం ఖరారైనా ఇంత దాకా ఆలస్యం జరిగిందని ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకు ఉందనే నమ్మకం కార్యకర్తలు, ప్రజల్లో ఉన్నందువల్లే తాము టీడీపీ గూటికి వచ్చినట్లు వివరించారు. మాజీ శాసనసభ్యుడు రామసుబ్బారెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి భయంకరమైన ఫ్యాక్షన్ ఉన్నా దాన్ని మర్చి పోయి వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రెండేళ్లుగా చంద్రబాబే సీఎంగా ఉన్నా అభివృద్ధి జరగలేదంటే ఆయనే కారణం కదా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. సర్దుబాట్లు చేసుకుంటాం : భూమా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజక వర్గాల్లో మా వాళ్లు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నారని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు తమ నియోజక వర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదనీ, కార్యకర్తలందరితో మాట్లాడి టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానన్నారు. పార్టీలో ప్రత్యర్థులనుకునే వారితో కూడా సర్దుబాట్లు చేసుకుంటామన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనే టీడీపీలో చేరామని చెప్పారు. మా పనులు జరగడం లేదు : జలీల్ ఖాన్ రెండేళ్లుగా తమ పనులు జరగడం లేదనీ, నియోజక వర్గంలో ముస్లింలు పేదలకు అన్యాయం జరుగుతోందనీ అందువల్లే టీడీపీలో చేరుతున్నానని విజయవాడ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ చెప్పారు. -
భూమాను చేర్చుకోవద్దు
చంద్రబాబుతో కర్నూలు టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో కర్నూలు జిల్లా నుంచి విపక్ష నేతలు చేరటాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్న అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. తాము పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చేరామని, అలాంటి తమకు ఇతరుల చేరికవల్ల ప్రాధాన్యత తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి నంద్యాల శాసనసభ్యుడు, పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిలను విజయవాడ పిలిపించుకుని వారితో సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తమలో కొందరు ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నారని, మరికొందరం గత ఎన్నికలకు ముందు పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చేరామని, భూమాలాంటి వారి చేరికవల్ల తమకు ప్రాధాన్యత తగ్గుతుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భావసారూప్యత కలిగిన వారిని చేర్చుకుంటాం: భావసారూప్యత కలిగిన వారిని చేర్చుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం చేరికపై ప్రశ్నించగా... చూస్తారుగా, చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. -
భూమా పార్టీలోనే కొనసాగుతారు
వైవీ సుబ్బారెడ్డి, సజ్జల వెల్లడి సాక్షి, హైదరాబాద్ : భూమా నాగిరెడ్డి తమ పార్టీలోనే కొనసాగుతారని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వీరిద్దరూ శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు భూమా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. భూమా పార్టీని వీడుతున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారు ఆయన వద్దకు వెళ్లారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... నాగిరెడ్డి తమ పార్టీ సీనియర్ నాయకుడని, ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారని స్పష్టంచేశారు. భూమా పార్టీని వీడుతున్నట్లు మీడియా సృష్టించిన వార్తలపై స్పష్టత కోసమే ఆయన వద్దకు వచ్చామని వారు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను తన కుమార్తె నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉంటే ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో తనకూ తెలియడం లేదని ఆయన తమతో చెప్పారని తెలిపారు. నంద్యాలలో శుక్రవారం పార్టీ కార్యకర్తలు సమావేశమైనపుడు, స్థానిక మీడియా ప్రతినిధులు అడిగినపుడు పార్టీ వీడుతున్నట్లు భూమా చెప్పారని ప్రతినిధులు ప్రశ్నించగా... అసలు అక్కడ కార్యకర్తల సమావేశం గాని, విలేకరుల సమావేశం గానీ జరుగనే లేదని వైవీ వివరించారు. వాస్తవానికి భూమా నంద్యాలకు వెళ్లింది కోర్టు కేసు పనులపైనని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎలా కేసులు పెట్టి వేధిస్తోందో అనే విషయం కూడా భూమా తమకు చర్చల సందర్భంగా చెప్పారని పేర్కొన్నారు. పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని భూమా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించగా... తాను పార్టీని వీడుతున్నట్లు భూమా ఎక్కడ చెప్పలేదని, అలాంటపుడు ఖండించే అవసరం ఏముందన్నారు. ఈ సమస్యకు ఇంతటితో పుల్‌స్టాప్ పడినట్లేనా? అని ప్రశ్నించగా... ‘అసలిక్కడ ఎలాంటి సమస్యా లేదు... పుల్‌స్టాప్ పడటానికి. అంతా మీరే సృష్టించారు అంతే’ అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ వీడుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఐజయ్య, జయరామయ్య తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. దీన్ని బట్టే ఇలాంటి వార్తల్లో నిజమెంతో తెలుస్తోందన్నారు. ఇవాళ కర్నూలు ఎమ్మెల్యేలు జగన్‌కు కలిసిన నేపథ్యంలో భూమా కూడా ఆయనను కలుసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఈ రోజని కాదు, వైఎస్సార్సీపీ నేతగా నాగిరెడ్డి జగన్‌ను ఎపుడైనా కలుసుకోవచ్చునని ఆయన సమాధానం ఇచ్చారు. -
ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
బగనానపల్లె : రాష్ట్ర ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. బనగానపల్లెలోని జి.ఎం.ఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల స్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భూమానాగిరెడ్డి మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలు సీఎం చంద్రబాబులో లేవన్నారు. టీడీపీ అధికారం చేపట్టి 15 నెలలైనా ఒక్క అభివృద్ధి చేయలేదని, టీడీపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు సాగునీరు అందిస్తానని సీఎం చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు అధికారం బలంతో బనగానపల్లె నియోజకవర్గంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వేధింపులు తమకు కొత్తకాదని, గతంలో ఇలాంటి వాటిని ఎన్నో చూశామన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ఇలాంటి వారు ఇంటి నుంచి బయటికి రాగలరా అంటూ ప్రశ్నించారు. కాటసాని కుటుంబానికి వేధింపులు కొత్తేమీ కాదని, బెదిరింపులను లెక్కచేయబోమన్నారు. వైఎస్సార్ హయాంలో ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి కుసుమాలు విరిశాయని, టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కారణంగా మళ్లీ గ్రామాల్లో అశాంతి నెలకొందన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కాటసాని రామిరెడ్డి అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా కలిసికట్టుగా రెక్కలు కట్టుకొని వాలుతామని భూమా భరోసా ఇచ్చారు. విసృతస్థాయి సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం చూస్తుంటే అధికార పార్టీపైన, ఇక్కడి అధికార పార్టీ నాయకుడిపై ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతోందన్నారు. ‘బీసీ జనార్దన్ రెడ్డి ఓ సైకో’ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణను మండలంలోని యనకండ్ల గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేయించామన్నారు. అయితే పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే దానిని ఆపివేయించారన్నారు. ఈ విషయం తనకు తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించే పోలీసులపై న్యాయపరంగా పోరాటం సాగిస్తామన్నారు. గ్రేడుల వారీగా అవినీతి చంద్రబాబు పాలనలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు గ్రేడుల వారీగా అవినీతి సాగుతోందని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. చేసిన అభివృద్ధి కొంతయితే ప్రచారం ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బయోమెట్రిక్ విధానంతో ఎంతో మంది పేదలు పింఛన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపడితే ఒక పోలీసు కానిస్టేబుల్ని కూడా నియమించని ప్రభుత్వం బనగానపల్లెలో మండల స్థాయి వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమేమిటంటూ ప్రశ్నించారు. రాజకీయాలు శాశ్వతం కాదని, పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజల మన్నలను చురగ్గొన్నవాడే ప్రజానాయకుడని బుగ్గన అన్నారు. -
అక్రమ కేసుల బనాయింపే బాబు లక్ష్యం
- ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు - నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిలదీసే వారిపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆరోపించారు. నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నాయకులు ఆదివారం.. 72గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరికి భూమా మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయన్నారు. అక్రమ కేసులతో ప్రజా పోరాటాలను అణచి వేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎల్లకాలం సాగబోవన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండబోదని, ప్రజలకు మాత్రమే తాము భయపడుతామన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సీపీఎం నాయకులు కోరుతున్న విధంగా నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రూ.350కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించారనే కసితో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని భూమా ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను గమనించకుండా కాలుష్యానికి దూరంగా శిల్పా..బెంగళూరులో నివాసం ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండబోదని, అధికారులు తొత్తులుగా మారకుండా నిజాయితీ వ్యవహరించాలని కోరారు.నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణతో పాటు పందుల సమస్య కూడా తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. రోడ్లు వెడల్పు చేయాలని చిన్నారులు సైతం ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి తేవడానికి పీఏసీ చైర్మన్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో సీపీఎం నాయకుడు మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
దౌర్జన్యం చేస్తే గెలుపు వరించదు
మెజార్టీ పోలీసులకు నేను మిత్రున్ని.. ♦ జిల్లా ఎస్పీ రవికృష్ణను ఏనాడూ కించపరిచి మాట్లాడలేదు ♦ చట్టం గురించి ప్రశ్నిస్తే సంకెళ్లా ♦ రూల్స్ పోలీసులకు వర్తించవా ♦ వీడియో పుటేజీ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ♦ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలుపు కులమతాలకు అతీతంగా తమ గెలుపులో ప్రజలు కీలక భూమిక పోషించారన్నారు. రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలిచిన ఘనత కూడా తమ కుటుంబానికే దక్కిందన్నారు. ఎస్పీ ఇప్పుడు చేస్తున్న ప్రచారం, తన ప్రత్యర్థులు ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ చేసి విఫలమయ్యారన్నారు. నిజంగానే డీఎస్పీ దేవదానం కులం తనకు తెలియదన్నారు. ఆయనపై అంతటి అభిమానమే ఉంటే రెగ్యులర్ డీఎస్పీగా ఎందుకు నియమించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి డీఎస్పీ దేవదానం కులాన్ని పదేపదే చెప్పడం ఎస్పీకి తగదన్నారు. నంద్యాల : మూడు దఫాలు పార్లమెంట్‌కు, నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికయ్యానంటే ప్రజాబలంతోనే సాధ్యమైందని.. దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఇన్నిసార్లు గెలుపు వరించేది కాదనే విషయం జిల్లా ఎస్పీ రవికృష్ణ గుర్తుంచుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను, రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసినప్పుడు.. చట్ట ప్రకారం తాను ప్రశ్నిస్తే ఎస్పీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల విధుల్లోని రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసిన విషయాన్ని వీడియో ఫుటేజీల ఆధారంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ స్టాల్లో కూర్చొన్న ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియను బయటకు పంపేందుకు పోలీసులు అధికారం ఎవరిచ్చారో చెప్పాలన్నారు. పోలీసులు తనను కూడా వెయిటింగ్ స్టాల్లో కూర్చోనివ్వలేదన్నారు. అదే విషయం వారికి చెప్పగా.. ఆర్డీఓ వచ్చి ఓటు వేయాలని కోరడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం గౌరవించానన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ప్రకటించిన రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించడం వెనుక ఎవరి డెరైక్షన్ ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసు శాఖలో ఉన్నంత మిత్రులు మరెక్కడా లేరనే విషయం ఎస్పీ తెలుసుకోవాలన్నారు. ద్వేషించే వారు ఒకరిద్దరు ఉంటే.. అభిమానించే వారి సంఖ్య 95 మందికి పైమాటేనన్నారు. ఎస్పీ బాధపడేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అయితే ఆయన ఎందుకు అంతలా కక్ష పెంచుకున్నారో వేయి డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. తనను అరెస్టు చేయడానికి ఇల్లు, ప్రభుత్వాసుపత్రి వద్ద వందల సంఖ్యలో పోలీసులను నియమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బాధాకరమన్నారు. ఆ సందర్భంగా ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయవద్దని క్యాడర్‌కు స్వచ్ఛందంగా పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇమెజ్ అంతలా పెరుగుతుందన్నారు. పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని.. ఎస్పీ మరోసారి రాజకీయ నాయకుడిలా ప్రకటనలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
కర్నూలు ఎస్పీపై భూమా మండిపాటు!
-
'కర్మ, కర్త, క్రియ అన్నీ ఆయనే'
ఆళ్లగడ్డ: తమపై కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు డిపార్ట్ మెంటును ప్రభుత్వం ఉపయోగించడం విడ్డూరమని నంద్యాల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. తమపై అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించాలని టీడీపీ సర్కారు చూస్తోందని ఆరోపించారు. ఆళ్లగడ్డ సబ్ జైలు నుంచి బుధవారం సాయంత్రం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనపై కేసులకు కర్మ, కర్త, క్రియ అన్నీ జిల్లా ఎస్పీనే అన్నారు. ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని అంతకుముందు ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు. -
నెట్టేస్తే 'డోంట్ టచ్ మీ' అన్నందుకు కేసా?
-
క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
-
క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అక్రమంగాపెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు అయిన నంద్యాల ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. మూడు రోజులుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం వైద్యులు పరీక్షించారు. 1999లో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న భూమా నాగిరెడ్డికి కార్డియాక్ ఎంజైమ్స్ పెరుగుతున్నందున ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు ఆయనను ఉన్నతస్థాయి సౌకర్యాలున్న వైద్యశాలకు తరలించాలని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తాను రెగ్యులర్‌గా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స చేయించుకుంటున్నానని, తనను అక్కడికి పంపించాలని భూమా నాగిరెడ్డి కోరినట్లు సమాచారం. -
భూమాకు మధుమేహం, రక్తపోటు
-
భూమా అరెస్ట్ అప్రజాస్వామికం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గిద్దలూరు రూరల్ : నంద్యాల శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. పట్టణంలోని తన నివాస గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు అఖిలప్రియను ఎన్నికల ప్రదేశానికి వెళ్లిన సమయంలో ఆమెపై దురుసుగా ప్రవర్తించిన అక్కడి పోలీసులను అడ్డుకుని ప్రశ్నించినందుకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించడం చాలా దారుణమన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి బూటకపు కేసులు బనాయించి పార్టీని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కర్నూల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న భయంతో ఇటువంటి లోపబూయిష్టమైన పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి పై ఇటువంటి తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్న ఇటువంటి హేయమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంత అణచాలని ప్రయత్నించినా అంత పైకి లేచే శక్తి పార్టీకి ఉందన్నారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని సమయం చూసి తిప్పి కొడతారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ పెద్దబాష, కౌన్సిలర్ శ్రీను, కంభం ముస్లీం మైనార్టీ నాయకులు మహమ్మద్ మాబు, వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చింతలపూరి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ అక్రమం మార్కాపురం : కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిం దని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మార్కాపురం -
కులచిచ్చు రేపుతున్న చంద్రబాబు
భూమా నాగిరెడ్డిపై కేసులు పెట్టడం దారుణం చంద్రబాబుకు తొత్తులుగా పోలీసులు తిరుపతి మంగళం : కులమత భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న వారి మధ్య చంద్రబాబు కు లచిచ్చు రేపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వా మి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అదేమిటని ప్ర శ్నించిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. జిల్లాలో పెద్దదిక్కు గా ఉన్న భూమా నాగిరెడ్డిని జైలుకు పంపితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవొచ్చన్న దురాలోచనతో చంద్రబాబు కు ట్రపన్నారని తెలిపారు. తమ పార్టీ అ ధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు అంసెంబ్లీలో ప్రభుత్వ తీ రును నిలదీస్తే టీడీపీలోని దళిత మం త్రులు, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. కులాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో పిల్లనిచ్చి చేరదీసిన ఎన్టీఆర్‌నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా భూమానాగిరెడ్డిపై వేధింపుల పర్వం కొనసాగుతూనే వస్తోందన్నారు. కర్నూలులో పోలీసులు కూడా చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయ న ఆరోపించారు. భూమా నాగిరెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. -
భూమాపై కేసులు అక్రమం
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పామర్రు : కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డినిఅధికార పార్టీ నాయకులు స్థానిక అధికారులతో కలిసి కక్ష సాధింపుతో అరెస్టు చేయించడం నీచ రాజకీయానికి నిదర్శనమని పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన దుయ్యబట్టారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయనపై అక్రమ కేసులు, వేధింపులు చేస్తూనే ఉన్నదన్నారు. భూమా ఆరోగ్యం బాగుండలేకపోయినా 12 గంటలపాటు పోలీ స్స్టేషన్లో ఉంచడం కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నిం చారు. నేను ఎమ్మెల్యేని తనను గౌరవించాలని అన్న పదాన్ని అధికార పార్టీ నాయకులు తప్ప డు దారి పట్టించి భూమాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే తన ఆరోగ్యం బాగోలేదని, వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే దా నిని కూడా టీడీపీ నాయకుల సలహాతో ఒప్పుకోకపోవడం అన్యాయన్నారు. భూమానాగిరెడ్డికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు బాధ్య త వహించాల్సి వస్తుందని కల్పన హెచ్చరించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ మొబీన్, జిల్లా పార్టీ నాయకులు బొప్పన స్వర్ణలత, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
తప్పుడు కేసులతో భూమా అరెస్టు
ఎల్.ఎన్.పేట: టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుతో ఇది నిజమని తేలిందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుహక్కును కూడా వినియోగించుకోకుండా పోలింగ్ కేంద్రం వద్దనే అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధిస్తున్నారని.. లేదంటే దాడులు చేసి మారణహోమం సృష్టస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దగ్గరగా వస్తున్నప్పుడు నన్ను తాకద్దు.. దూరంగా ఉండి మాట్లాడండి అనడం నేరంగా వక్రీకరించి అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్న ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా చేస్తున్నారని అన్నారు. నెల రోజులు క్రితం తెలంగాణ లో ఓటుకు కోట్లు ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అరెస్టులు చేసి అరాచకం సృష్టిస్తూ ప్రజలను భయానికి గురిచే స్తున్నారన్నారు. -
ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా
-
ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్ జైల్లో ఉన్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించనున్నారు. -
'నువ్వు అరిస్తే ఏమీ కాదు.. '
హైదరాబాద్: ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పట్ల డీఎస్పీ అగౌరవంగా మాట్లాడారని డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఉన్న భూమా నాగిరెడ్డిని 'నువ్వు అరిస్తే ఏమీ కాదు' అంటూ డీఎస్పీ ఏకవచనంతో మాట్లాడారని, ఎమ్మెల్యేలతో మాట్లాడేతీరు ఇదేనా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డితో అగౌరవంగా మాట్లాడిన విషయం వీడియో రికార్డులో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. భూమా కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలా ప్రవర్తించడం సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ విషయంపై పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకే భూమా నాగిరెడ్డిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని రాజేంద్రనాథ్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు. -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'
-
అక్రమ కేసులకు భయపడం
డోన్ : ప్రతిపక్ష పార్టీగా అధికార టీడీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడతామని.. ఈ విషయంలో అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలిచిన డి.వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి.. నంద్యాల, కర్నూలు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. బుగ్గన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికార పార్టీ ఆదేశాలతో రెండు జీపుల్లో వచ్చిన పోలీసులు నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే కానీ అధికార పార్టీకి కొమ్ము కాయం తగదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు రుణాలు అందడం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.56వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ పంపిణీ రూ.16వేల కోట్లు మించలేదన్నారు. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులతో పాటు డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపుతున్నారన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నందుకే తరతరాలుగా తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం ఒక సంవత్సరం 10 నెలలు మాత్రమే ఉందని, ఈ పదవినీ దక్కించుకునేందుకు బలం లేకపోయినా అధికార టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. దొంగ పని చేసిన చంద్రబాబు సమర్థించుకుంటున్న తీరు చూస్తే.. భవిష్యత్తులో చిల్లర దొంగలు కూడా కోర్టులను తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పాలనను భ్రష్టు పట్టించి అవినీతి మార్గాలను అన్వేషించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్నారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కన్న తల్లి లాంటి పార్టీని కళ్లలో పెట్టుకుని చూసుకున్నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజాసంక్షేమానికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలిప్చక్రవర్తి, పద్మావతమ్మ, బేతంచెర్ల ఎంపీపీ కిష్టమ్మ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ దివంగత నేత ఆర్ఈ రవికుమార్ సతీమణి ఆర్ఈ సరళమ్మ, కుమారుడు రాజవర్దన్లను నాయకులు పరామర్శించారు. -
ముల్కనూర్ బ్యాంకు పనితీరు భేష్
ఏపీ పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి భీమదేవరపల్లి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ముల్కనూర్ బ్యాంకు పనితీరు అభినందనీయమని ఏపీ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండ లం ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకును ఆదివారం ఆయన పరిశీలించారు. బ్యాంకు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జనరల్ మేనేజర్ మార్పాటి లక్ష్మారెడ్డి బ్యాంకు పనితీరును పవర్ పారుుంట్ ప్రజంటేషన్ ద్వారా భూమాకు వివరించారు. అనంతరం బ్యాంక్ ఆర్థిక లావాదేవీలను రికార్డుల ద్వారా చూపించారు. బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారాబాయిల్డ్ రైస్‌మిల్, కాటన్ జిన్నింగ్ ప్లాంట్, సూపర్‌బజార్, పెట్రోల్ బంక్‌లను పరిశీలించారు. అనంతరం ముల్కనూర్ స్వకృషి డెయిరీని పరిశీలించారు. డెరుురీ పనితీరును అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి భూమా నాగిరెడ్డికి వివరించారు. -
చెత్తబుట్టలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో
నంద్యాల : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సింగపూర్, జపాన్ పర్యటనలను కొనసాగిస్తున్నారని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి విమర్శించారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అయితే సహచర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ కార్మికులను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని భూమా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో రెండు దఫాలుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచిన విషయాన్ని భూమా గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని బాబు ఆలోచించిన విషయాన్ని భూమా వారికి గుర్తు చేశారు. రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. సమావేశంలో జేఏసీనేత ఖాన్ మాట్లాడుతూ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఇప్పటికే అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భూమా అండగా నిలువాలని కోరారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : భూమా
నంద్యాల(కర్నూలు జిల్లా) : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఒక వేళ విఫలమైతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. ఎంసెట్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని విద్యార్ధులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. -
మాగోడు వినండయ్యా..
పునరావాస కాలనీల్లో పీఏసీ చైర్మన్ భూమా పర్యటన సమస్యలు ఏకరువు పెట్టిన కాలనీవాసులు ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి మంగళవారం కృష్ణపట్నం పోర్టు పునరావాస కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితుల కోసం ఏర్పాటైన సీవీఆర్ ఆసుపత్రి(మాధవ చికిత్సాలయం)ని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్వో ప్లాంటును పరిశీలించారు. మండుటెండలో పాదయాత్ర ద్వారా కాలనీలో నిర్మించిన రోడ్లు, ఇరువైపులా నాటిన చెట్లు, డ్రెయిన్లు, ఆలయాలను తిలకించారు. మధురానగర్‌లో సీవీఆర్ పాఠశాలను పరిశీలించారు. సమస్యలను విన్నవించిన నజిరీనా పునరావాస కాలనీలోని పాదర్తిపాళేనికి చెందిన నజిరీనా అనే మహిళ పలు సమస్యలను భూమా నాగిరెడ్డికి విన్నవించింది. ఆమెతోపాటు ఆ ప్రాంతవాసులు తమ గోడును వెల్లిబుచ్చారు. ఉప్పు సాగు నిలిచిపోవడంతో ఉపాధి దొరక్క బతుకు భారంగా మారిందన్నారు. ప్రాజెక్టుల నుంచి కొందరు పెద్దలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కృష్ణపట్నం గ్రామంలో జెన్కో ప్రాజెక్టు అందజేస్తున్న ప్యాకేజీని ఇతర ప్రాజెక్టుల నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ గ్రామాల కాపులు ఈ సందర్భంగా పలు సమస్యలు, డిమాండ్లను భూమా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం నిర్వాసితులకు అంద వలసిన ప్రతి సదుపాయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామని భూమా హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గండవరం సూరి ఉన్నారు. -
భూమా పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
ప్రతివాదులకు నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నంద్యాల పట్టణంలో రోజు రోజుకు ఊర పందుల సంఖ్య పెరిగిపోతోందని, వీటిని ఆరికట్టేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానిక శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న నంద్యాల మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో పందుల సంఖ్య పెరిగిపోతోందని, దీని వల్ల స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ తదితర ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదంటూ భూమా నాగిరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున పి.నాగేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పట్టణం చుట్టపక్కల దాదాపు 8వేల పందులు రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతూ ట్రాఫక్ తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల ముఖ్యంగా వానా కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని వివరించారు. పందులను చంపేందుక బుల్లెట్లు కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ను పురపాలక కమిషనర్ అనుమతి కోగా, కలెక్టర్ అనుమతి నిరాకరించారని, దీంతో జిల్లా ఎస్పీ కూడా అనుమతిని ఇవ్వలేదని తెలిపారు. దీని వల్ల పందుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పందులను చంపడానికి బదులు వాటిని జనావాసాలకు దూరంగా ఉంచడం మేలని అభిప్రాయపడింది. పందుల వల్ల వ్యాధులు వస్తున్న మాట నిజమేనని, అయితే పర్యావరణ సమతుల్యతను కాపాడంలో పందుల పాత్ర కూడా ఉందని, అందువల్ల వాటిని జనావాసాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది. -
మంచి మనసున్న మనిషి శోభ: భూమా నాగిరెడ్డి
-
నంద్యాల పేరు గొప్ప...ఊరు దిబ్బ
-
కాగ్ అభ్యంతరాలపై వివరణలివ్వండి: భూమా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల అమలు తీరు, నిధుల వినియోగంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు వివరణలు ఇవ్వాలని ప్రజా పద్దుల సమితి(పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ ప్రాధామ్యాలను చైర్మన్ భూమా అధికారులకు వివరించారు. సమావేశంలో ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధనరెడ్డి(వైఎస్సార్సీపీ), తోట త్రిమూర్తులు, పీవీజీఆర్ నాయుడు(టీడీపీ), విష్ణుకుమార్ రాజు (బీజేపీ), పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఫిబ్రవరి 5న పీఏసీ విశాఖపట్నం వెళ్లనుంది. 6న భీమిలిలో ఏర్పాటు చేసిన పర్యాటక రిసార్టులపై వచ్చిన ఆడిట్ అభ్యంతరాలను స్వయంగా పర్యవేక్షించనుంది. అనంతరం, గంగవరం నౌకాశ్రయం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల అమలు తీరును సమీక్షిస్తుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై నీటిపారుదల, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర శాఖలపై కూడా సమీక్షించనున్నట్లు తెలిసింది. కాగా, గురువారం జరగాల్సిన రెండోరోజు పీఏసీ భేటీ రద్దయింది. -
విఐపి రిపోర్టర్ - నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
-
పీఏసీ అలంకారప్రాయం కావొద్దు
ప్రజా పద్దుల కమిటీ తొలి భేటీలో స్పీకర్ కోడెల హితవు కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమా సాక్షి, హైదరాబాద్: ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) అలంకారప్రాయం కాకూడదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికట్టడంలో సమితి క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పీఏసీ తొలి సమావేశాన్ని కోడెల శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, పనుల్లో ఏైదె నా అవినీతి జరిగినట్లు కమిటీ పరిశీలనకు వస్తే ప్రభుత్వంతోపాటు అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సభ్యులు క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కానీయొద్దు కమిటీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీలన్నింటిలో పీఏసీ కీలకమైందన్నారు. ప్రజాధనం ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రయత్నిద్దామన్నారు. అందుకు అందరి సహకారం కావాలన్నారు. అందరూ ఒక బృందంగా పనిచేద్దామన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గత పీఏసీలో కూడా తాను సభ్యుడినని, అపుడు నిర్వహించిన సమావేశాలకు అధికారులు సక్రమంగా హాజరయ్యేవారు కాదని, శాఖాపరమైన సమీక్షలు సక్రమంగా జరగాలంటే అధికారుల హాజరు తప్పనిసరని అన్నారు. శాసనసభ సచివాలయ ప్రభుత్వ అధికారులు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సభ్యులందరం కలిసి పనిచేసి అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిద్దామన్నారు. కమిటీ ఆషామాషీగా కాకుండా గట్టిగా పని చేయాలన్నారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పీఏసీ స్థాయిని పెంచేందుకు సభ్యులందరం కలిసి ప్రయత్నిద్దామన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికడదామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి కె. సత్యనారాయణ మాట్లాడుతూ కమిటీ సమావేశానికి రెండు వారాల ముందు తమకు సమాచారం అందిస్తే అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కాకాణి గోవర్ధనరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, బీకే పార్థసారథి, పీవీజీఆర్ నాయుడు, ఎంవీఎస్ శర్మ, శమంతకమణి, రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భూమా ప్రమాణం
-
'ముస్లిం, మైనార్టీలపై టీడీపీకి ప్రేమ లేదు'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీ వర్గాలపై టీడీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భూమా మాట్లాడుతూ... రాష్ట్రంలో హజ్‌హౌస్ భవనం శంకుస్థాపనకే పరిమితమైందని విమర్శించారు. భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే హజ్ హౌస్ నిర్మాణాన్ని గుంటూరు నగరంలో చేపట్టాలని నగర తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు నగరం రాజధాని అతి సమీపంలో ఉండటమే కాకుండా రైలు, రహదారి, వాయు మార్గాలకు అతి సమీపంలో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో హౌజ్ హౌస్ గుంటూరులో ఏర్పాటు చేయాలని తెలిపారు. -
ప్రజాపోరాటాలకు వెనుకాడేది లేదు: భూమా
-
హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల
అన్నవరం : ఎన్నికల హామీలను అమలు చేయని మోసంపై ప్రజల తరఫున నిలదీస్తామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆదివారం ఆయన విశాఖపట్నం వెళుతూ సత్యదేవుని తొలిపాంచా వద్ద సత్యదేవునికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మొన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని హత్య కేసుతో అరెస్టు చేశారని, నిన్న పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథిపై కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులను చేసినా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ నాయకత్వంలో శాసనసభలో నిలదీసి తీరతామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి, కొండపల్లి అప్పారావు, దడాల సతీష్, రాయి శ్రీనివాస్, బీఎస్వీ ప్రసాద్, వెదురుపాక మూర్తి, బొబ్బిలి వెంకన్న, తాటిపాక కృష్ణ తదితరులున్నారు. -
భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
కర్నూలు: వైఎస్ఆర్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 1వ తేదీన అరెస్ట్ అయిన నాగిరెడ్డి ఆనారోగ్యం కారణంగా ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. నాటకీయ పరిణామాల మధ్య భూమా నాగిరెడ్డిని ఈ నెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం(గత నెల 31) టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు. భూమా ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వెంట రాగా భూమా శనివారం స్వయంగా ఎస్పీ రవికృష్ణ వద్ద లొంగిపోయారు. అదే రోజు రాత్రి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం రాత్రి భూమాని స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మంగళవారం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ** -
సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
-
ప్రజా సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలపై ప్రజల తరపున ఎవరైతే పోరాడుతున్నారో వారిని నిర్వీర్యం చేసే విధంగా దొంగ కేసులు పెట్టే స్థాయికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి పోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టిన వారిలో భూమా నాగిరెడ్డి నాలుగో ఎమ్మెల్యే అని చెప్పారు. నంద్యాల పోలీసుల అక్రమ కేసులకు గురై రిమాండ్ ఖైదీగా ఉంటూ ‘నిమ్స్’లో చికిత్స పొందుతున్న పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డిని జగన్ గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి ఆసుపత్రికి వచ్చిన జగన్ కొద్దిసేపు భూమాతో గడిపి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన నిమ్స్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజల తరఫున పోరాడుతున్న తమ ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా(నగరి), సునీల్ (పూతలపట్టు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)పై వరుసగా తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో పట్టణంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యే హోదాలో భూమా నాగిరెడ్డి ప్రస్తావించకుండా అధికారపక్షం వారు అడ్డుకుని గొడవ సృష్టించారని చెప్పారు. ఆ చిన్న గొడవను హత్యాయత్నం వంటి దారుణమైన కేసుగా మలిచారంటే ఎలాంటి పరిస్థితుల్లోకి వ్యవస్థను తీసుకెళుతున్నారో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇదే అంశంపై విలేకరులకు అన్ని విషయాలు చెబుతారని కూతురు లాంటి ఆమె ఆవేదన విన్న తరువాతనైనా బాబుకు బుద్ధి వస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భూమాపై రౌడీ షీటుకు సంబంధించి కోర్టులో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. -
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
-
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
హైదరాబాద్ : అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై కేసులు బనాయిస్తున్నారని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల తరపున పోరాడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి...తాజాగా భూమా నాగిరెడ్డిపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారారో భూమా నాగిరెడ్డి అరెస్ట్ వ్యవహారంతో అర్థం అవుతోందన్నారు. భూమా సహా నలుగురు ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సమస్యలపై భూమా మున్సిపల్ సమావేశంలో మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవ సృష్టించారన్నారు. భూమాపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా అన్యాయంపై తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
భూమా నాగిరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైఎస్ జగన్ ఆరా తీశారు. భూమా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. -
హైదరాబాద్ నిమ్స్‌లో భూమా నాగిరెడ్డి
* ఛాతీలో నొప్పి రావడంతో కర్నూలుకు తరలించిన పోలీసులు * వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్/కర్నూలు: టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ ముఖ్య నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ పాత భవనం ఐసీపీయూ బెడ్ నెంబర్ 6లో అడ్మిట్ చేశా రు. వైద్యులు ఆయన ఛాతీని ఎక్స్‌రే తీశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాం డ్లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు మధ్యాహ్నం 3.25 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గుండె వ్యాధుల చికిత్స విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయిం చారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి వైద్యులతో మాట్లాడారు. సాయంత్రం 6.20 గంటలకు కార్డియాలజీ ఐసీసీయూ విభాగం నుంచి వీల్‌చైర్‌లో బయటికి వచ్చిన భూమానాగిరెడ్డిని అంబులెన్స్‌లో పోలీసు ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు తరలించారు. -
రౌడీషీట్లతో రాక్షస పాలన: జ్యోతుల
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించడం, రౌడీషీట్లు పెట్టడం ఏపీ సీఎం చంద్రబాబు రాక్షసపాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని స్థాపించాలని చూస్తున్నారన్నారు. ఆ ప్రయత్నాన్ని తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కె రోజాపై అక్రమ కేసులు పెట్టి వేధించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచీ ప్రతిపక్షాన్ని నిర్మూలించాలని చూస్తున్నారని జ్యోతుల అన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టారని, దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే ఆర్కె రోజా అడ్డుకోవడమే కాకుండా ఆమెపైనే కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. -
అధికార మదంతో వేధిస్తోంది
టీడీపీపై వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి ధ్వజం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్షం మీద టీడీపీ వేధింపులపై రాబోయే నాలుగున్నరేళ్లలో ప్రణాళికాబద్ధంగా నిరసన తెలియజేద్దామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికార మదంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందన్నారు. కర్నూలు జిల్లాలోనూ భూమా నాగిరెడ్డిపై అనవసరంగా కేసులు బనాయించారన్నారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు నాగిరెడ్డి ప్రయత్నిస్తే అధికార పార్టీ ఆయనపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాయి దావేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ రైతు, మహిళా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న పార్టీ తలపెట్టిన మండలస్థాయి ధర్నాలను విజ యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలపై నిలదీస్తున్నందుకే:ఉమ్మారెడ్డి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపుతో అక్రమ కేసులను బనాయించ డం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని టీడీపీ ప్రభుత్వం... వాటిని నిలదీస్తున్నందుకే వేధిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వేధింపులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా ఇన్చార్జి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
భూమా నాగిరెడ్డి అరెస్టు
రెండు హత్యాయత్నం.. ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు సాక్షి, కర్నూలు: నాటకీయ పరిణామాల మధ్య నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే టీడీపీ కౌన్సిలర్లపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వివరాలివీ.. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్లు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు భూమా ప్రోత్సాహంతోనే జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు భూమాను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం.. రాత్రి ఆయన ఇంటిని తనిఖీ చేయడం జరిగాయి. భూమా ఇంట్లో లేకపోవడంతో.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలంటూ ఎస్పీ హెచ్చరించారు. శనివారం ఉదయం భూమా నాగిరెడ్డి స్వయంగా ఎస్పీ వద్దకు వస్తున్నారని తెలియడంతో పట్టణమంతా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోరుుంది. ఇదే సమయంలో శనివారం కర్నూలులో జరగాల్సిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని రద్దుచేసుకుని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ, భూమా అఖిలప్రియ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు మధ్యాహ్నం నంద్యాలలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న నాగిరెడ్డితో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాలం బాబు నేతృత్వంలో విద్యార్థులు నంద్యాలకు తరలివచ్చారు. వారితో కలిసి నాగిరెడ్డి అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణతో సమావేశమయ్యారు. మీరు సైగ చేయడం వల్లే దాడులు: ఎస్పీ శుక్రవారం జరిగిన సంఘటనలకు మీరు బాధ్యత వహించాల్సిందేనంటూ.. తలుపులు మూయమని వైఎస్సార్ సీపీ శ్రేణులకు మీరు చెప్పడం వల్లే దాడులు జరిగాయని, ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించేలా మీ ప్రవర్తన ఉందంటూ ఎస్పీ రవికృష్ణ వాదించారు. దీన్ని ఎమ్మెల్యే నాగిరెడ్డి ఖండించారు. టీడీపీ కౌన్సిలర్లే తమ దాడులకు పాల్పడ్డారని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యహరించాలని, రెండు వైపులా సమగ్ర విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఎస్పీని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించిన ఎస్పీ ఎట్టకేలకు నాగిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేశామని, అదేవిధంగా కులం పేరుతో దూషించారనే కారణంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. మెడికేర్‌కు భూమా నంద్యాల టౌన్: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని జడ్జి ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. భూమా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని. గుండె దడ కూడా ఉందని డాక్టర్ డేవిడ్‌రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం నివేదిక అందజేసింది. అనంతరం, పోలీసులు ఆయనను జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట హాజరు పరిచారు. వైద్య పరీక్షలను పరిశీలించిన అనంతరం భూమాకు ఈ నెల 16 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అనుమతించారు. తప్పుడు కేసులు బనారుుంచారు: భూమా ‘నా మీద ఈ రోజు 3 కేసులు బనాయించారు. మేం ఎంత చెప్పినా కూడా అన్ని విధాలా ఆలోచించే కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు. నన్ను, వైఎస్సార్ సీపీని ఇబ్బందులు పెట్టేందుకే కేసులు పెట్టారు. మానసికంగా ఒత్తిడికి గురి చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. కేసులు పెట్టినా బాధపడేది లేదు. ప్రజా సంక్షేమానికి ఏ శిక్షకైనా సిద్ధమే’ అని నాగిరెడ్డి అన్నారు. ఎస్పీని కలిసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. -
బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం
హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. శనివారం హైదరాబాద్‌లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయాత్నంలో భాగంగానే భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. మీ తప్పులను వేలేత్తి చూపిన మా పార్టీ వారిపై అక్రమకేసులు బనాయిస్తారా? ఇది రాక్షసపాలన కాక మరేమంటారని వెల్లడించాలని అధికార టీడీపీని డిమాండ్ చేశారు. ఒక విద్యార్థి మృతికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు సిద్దార్ద కారకుడంటూ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా అని జ్యోతుల నెహ్రు సూటిగా ప్రశ్నించారు. అయినా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదని చంద్రబాబును ఉద్దేశించి జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. -
భూమాపై ‘హత్యాయత్నం’ కేసు
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్లో రసాభాస.. ప్రతిపక్షంపై టీడీపీ సర్కారు మరో కక్షసాధింపు చర్య నంద్యాల: ప్రతిపక్ష పార్టీని వేధించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని వేచిచూస్తున్న అధికార టీడీపీ సర్కారు.. అందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకున్న స్వల్ప తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై.. హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకూ సిద్ధపడింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించింది. కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ శుక్రవారం టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు. వారు వెనుక కుర్చీలోకి వెళ్లాలని టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. శివశంకర్ సమాధానం చెబుతుండగానే.. ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్మన్ హెచ్చరించారు. ఇంతలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా శివశంకర్‌ను వెనుక కుర్చీలో కూర్చోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఎజెండాలోని అంశాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసిందని చైర్మన్ ప్రకటించారు. భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే చైర్మన్ మరోసారి సమావేశం ముగిసిందని బెల్ కొట్టడమే కాకుండా.. ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదని టీడీపీ కౌన్సిలర్లను ఆదేశించారు. దీనికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వారితో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. టీడీపీ వర్గీయులు దాడికి దిగటంతో పరిస్థితి కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే భూమా సర్దిచెప్పబోయినా ఫలితంలేకపోయింది. ఘటనలో వైఎస్ఆర్సీపీకి చెందిన మైనార్టీ కౌన్సిలర్లు ముర్తుజా, కరీముల్లా గాయపడ్డారు. టీడీపీకి చెందిన వెంకటసుబ్బయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌లకూ గాయాలయ్యాయి. చైర్మన్, మునిసిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతకుముందు చైర్పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ నంద్యాల చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి భూమాను అరెస్టు చేయడానికి వారెంట్ తీసుకొని పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేనందున ఇంటి వద్దే కాపు కాశారు. హక్కులను కాలరాస్తున్నారు: భూమా శాసనసభ్యుని హక్కులను కాలరాస్తున్న మునిసిపల్ చైర్మన్ దేశం సులోచనపై, అధికారులపై శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. -
భూమా నాగిరెడ్డి ఇంటి వద్ద పోలీసు బలగాలు
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలోని నంద్యాల పురపాలక సమావేశంలో జరిగిన ఘర్షణకు భూమానే ప్రధాన కారణమని టీడీపీ తప్పుడు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. తొలుత ఆ సమావేశంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వావాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఒక పద్దతి ప్రకారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశంలో రసాభసాగా మారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. టీడీపీ కౌన్సిలర్లు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై దాడి చేసినా.. జిల్లాలో టీడీపీ ఆధిపత్య ధోరణి కాస్తా ఘర్షణకు కారణమైంది. అధికార టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సహా ఇద్దరికి గాయాలయ్యాయి. చర్చ లేకుండా తీర్మానాలు ఆమోదిస్తుడడంతో వైఎస్సార్ సీపీ కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. వైఎస్సార్ సీపీ సూచనను చైర్మన్ పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. టీడీపీ నాయకులు కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గన్ మెన్ కూడా గాయపడ్డాడు. అయితే సమావేశంలో జరిగిన ఘర్షణకు భూమా నాగిరెడ్డే కారణమని టీడీపీ తప్పుడు కేసులు బనాయించేందుకు యత్నాలు చేస్తోంది. -
నంద్యాల కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ
-
నంద్యాల కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల కౌన్సిల్ సమావేశం ఘర్షణ చోటు చేసుకుంది. అధికార టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సహా ఇద్దరికి గాయాలయ్యాయి. చర్చ లేకుండా తీర్మానాలు ఆమోదిస్తుడడంతో వైఎస్సార్ సీపీ కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. వైఎస్సార్ సీపీ సూచనను చైర్మన్ పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. టీడీపీ నాయకులు కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గన్ మెన్ కూడా గాయపడ్డాడు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. -
అమ్మ ఆశయాల కోసం పనిచేస్తా:అఖిలప్రియ.
-
అమ్మ ఆశయాల కోసం పనిచేస్తా:అఖిలప్రియ
హైదరాబాద్: తన తల్లి భూమా శోభానాగిరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా అఖిలప్రియ తెలిపారు. తనపై వైఎస్సార్ సీపీతో పాటు, ఆళ్లగడ్డ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు. సోమవారం లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తండ్రి నాగిరెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. అమ్మ ఆశయాలు కోసం పని చేస్తానని ఆమె తెలిపారు. ఆళ్లడగ్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అఖిలప్రియ అన్నారు. ఈ అవకాశం కల్పించిన జగన్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ భూమా నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, శోభా మరణం ఇప్పటికీ బాధగానే ఉందని భర్త నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
ఆక్రమణలు తొలగే వరకు పోరాటం
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ఆక్రమణలు తొలగేవరకు పోరాటం ఆగదని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో గాంధీచౌక్‌లో ప్రజలనుద్దేశించి భూమా ప్రసంగించారు. ప్రజల మేలు కోసం ఎంతవరకైనా పోరాడతానన్నారు. ప్రజా బలంతో తాను, ప్రభుత్వం అండ తో టీడీపీ నాయకులు యుద్ధాయినికి సిద్ధమయ్యారని అంతిమ విజయం తనదేనన్నారు. మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జోక్యం ఎమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని వారికి త్వరలోనే ఎమ్మెల్యే పవరేమిటో చూపిస్తామన్నారు. రోడ్ల విస్తరణ సమస్యను పక్కదారి పట్టించేందుకు కొందరు ఎన్నికల సమయంలో తానిచ్చిన 10వేల ఇళ్ల నిర్మాణాల హామీని తెరమీదికి తెస్తున్నారని అయితే తమ పార్టీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నిర్మిస్తానని చెప్పిన సంగతి వారు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. అయినా పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం సీఎం, పీఎంలను కలుస్తానన్నారు. శిల్పా డెరైక్షన్‌లో పురపాలక సంఘం యాక్షన్ చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు తాము చేసిన మున్సిపల్ తీర్మానాలను వ్యతిరేకిస్తూ అవహేలన చేయడం బాధాకరమన్నారు. శిల్పా, సులోచన, ఆక్రమణ దారులకు తాను వ్యతిరేకిని కాదని వారు అభివృద్ధి విషయంలో వ్యవహరిస్తున్న వివక్షతకు వ్యతిరేకినన్నారు. జేఏసీ సభ్యులతో కలిసి భిక్షాటన చేసి నష్టపరిహారం చెల్లించైనా రహదారుల వెడల్పునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేఏసీ చేస్తున్న పోరాటాన్ని తనతోపాటు స్థానిక ప్రజలు విస్మరించరన్నారు. -
కన్నీటి సంద్రం.. సంగమేశ్వరం
దివంగత ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అస్థికలను సోమవారం కుటుంబ సభ్యులు సప్తనదుల సంగమమైన సంగమేశ్వరంలో కలిపారు. కొత్తపల్లి: సాధారణ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అస్థికలను కుటుంబ సభ్యులు సప్తనదుల సంగమం సంగమేశ్వరంలో కలిపారు. ఈ కార్యక్రమంతో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మాలాభరణి, భీమరతి, భవనాశి నదులు ఒక్కటై ప్రవహించే కృష్ణానదీ తీరం ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిపోయింది. సోమవారం ఉదయాన్నే శోభా నాగిరెడ్డి భర్త, నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి, కూతుళ్లు అఖిల ప్రియారెడ్డి, నాగమౌనిక రెడ్డి, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, సోదరుడు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, సోదరి పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, నాయకులు భూమా నారాయణరెడ్డి, బి.వి.రామిరెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రం చేరుకున్నారు. ముందుగా ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో అర్చకులు విలువింటి విశ్వమూర్తిశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది ఒడ్డున శోభానాగిరెడ్డి చిత్రపటాన్ని ఉంచి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేశారు. అనంతరం మూడు ఇంజిన్ బోట్లలో కృష్ణా నదిలో ప్రయాణిస్తూ వేద పండితులు కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతుల మీదుగా శోభా నాగిరెడ్డి అస్థికలను సప్తనదుల సంగమంలో కలిపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కొలనుభారతి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేశారు. కార్యక్రమంలో శివపురం సర్పంచ్ సంతోషమ్మ, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు చంద్రమౌళి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్కాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
శనగలకు గిట్టుబాటు ధర కల్పించాలి
నంద్యాల: శనగకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, క్వింటాల్ రూ.5 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనగలకు గిట్టుబాటు ధర లేక కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో రైతులు మూడు సంవత్సరాల నుంచి ధాన్యాన్ని నిల్వ ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బ్యాంకుల్లో కుదువకు పెట్టుకున్న సొత్తులు సమయానికి విడిపించుకోలేకపోవడంతో బ్యాంకులు వేలం వేస్తున్నాయన్నారు. ప్రభుత్వం మాత్రం క్వింటాల్ రూ.3100 చొప్పున కొనుగోలు చేయాలని భావిస్తుండటం దారుణమన్నారు. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలను తిరుపతికి కేటాయించడంతో హైదరాబాద్ నుంచి దరఖాస్తులు, డీడీలు తిరుపతికి చేరుకుంటే తప్ప ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు అత్యధికంగా నీటిని విడుదల చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల సీమ జిల్లాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని భూమా డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే శాసన సభ సమావేశాల్లోనైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
నీరుగార్చారు..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టాల్సిన సమావేశం.. నిరాశను మిగిల్చింది. రెండు జిల్లాల పరిధిలోని ప్రాజెక్టులు, సాగునీటి కాలువలు, లక్షలాది ఎకరాల ఆయకట్టుపై చర్చించాల్సిన సమావేశం కేవలం మూడు గంటలే కొనసాగింది. అందులోనూ ఏ విషయాన్ని తేల్చకుండానే ముగిసింది. రెండు జిల్లాల నీటి వాటా ఎంత? ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. కర్నూలు కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు కాలువలకు నీరందలేదని కర్నూలు, కడప జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల తర ఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ తీరును వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అంతేకాని ప్రజలకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామనే ఆలోచన కనిపించలేదు. సాగు నీటి సమస్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి నిలదీస్తుండటంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధానం చెప్పలేక సమావేశం మధ్యలోనే నిష్ర్కమించారు. ఓ అధికారి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి తాను తెలియక మాట్లాడానని క్షమించమని అడగటం ఐఏబీపై అధికారులకు ఉన్న అవగాహనను స్పష్టం చేస్తోందని సభ్యులు చర్చించుకున్నారు. భూమా నాగిరెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు తడబడ్డారు. ఈ సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షత వహించారు. ఇందులో కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, టీడీపీ ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి గైర్హాజరు! రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి సారిగా నిర్వహించిన కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల నీటి పారుదల సలహా మండలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరుకాలేదు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి వస్తారని రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, సాగునీటి సలహా మండలి సభ్యులు, అధికారులు హాజరయ్యారు. అయితే ఉపముఖ్యమంత్రి రాకపోవటంతో వారందరూ నిరుత్సాహానికి గురయ్యారు. రెండు జిల్లాల ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి రాకపోతే తమ గోడు వినేవారెవరని, సమస్యలను తామెవరికి చెప్పుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. గత సమావేశాల్లో చేసిన తీర్మానాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదని, ఈ సమావేశంలో చేసే తీర్మానాలకు కూడా మోక్షం లభిస్తుందని తాము భావించటం లేదని వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన మంత్రి లేనప్పుడు ఈ సమావేశం నిర్వహించడం ఎందుకని భూమా నాగిరెడ్డి ప్రశ్నించటంతో.. కలెక్టర్ విజయమోహన్ జోక్యం చేసుకుని చైర్మన్‌గా తాను ఉన్నానని, సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో సమావేశం కొనసాగింది. ఎక్కడి పనులు అక్కడే.. కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర దిగువకాలువ మొదలు వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్, అనేక ఎత్తిపోతల పథకాలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, రవీంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి.. అధికారులు, అధికారపార్టీ నేతలను నిలదీశారు. ఎల్లెల్సీలోని ఆంధ్రా వాటాకు కన్నడిగులు గండికొడుతున్నారని.. రాజోలి బండ వద్ద ఆనకట్ట ఎత్తు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్లో దీనిపై చర్చించాలని ఎంపీ ఎస్పీవై రెడ్డికి సూచించారు. జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయని పలువురు ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుంకేసుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు 1.2 టీఎంసీలని చెప్పి 1.5 టీఎంసీలను తీసుకెళ్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వరదల నుంచి కర్నూలు ప్రజలను కాపాడేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.244 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులకు ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఫేజ్-1, ఫేజ్-2 రద్దు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిందాల్, ప్రియా సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యాల వైఖరిపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి నిరసన వ్యక్తంచేశారు. వీరికి సభ్యులందరూ సంఘీభావం తెలిపారు. -
దుర్మార్గం
తలుపులు మూసి జెడ్పీ చైర్మన్ ఎన్నిక - అడుగడుగునా అధికార దుర్వినియోగం - ఓడిన ఓటరన్న ఆశయం - ఖూనీ అయిన ప్రజాస్వామ్యం - ఎమ్మెల్యేలని చూడకుండా గెంటేసిన వైనం - కీలుబొమ్మలుగా మారిన అధికారులు - మెజారిటీ వైఎస్సార్సీపీకి పీఠం టీడీపీకి - భూమా ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లా పరిషత్‌లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా టీడీపీ నాయకులు బరితెగించారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కారు. జిల్లా అధికారులూ వీరికి వంతపాడారు. ఫలితంగా శనివారం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకపక్షంగా ముగిసింది. మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకొన్న వైఎస్సార్సీపీకి కాదని టీడీపీ జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోగలింది. ఓటరు ఒక ఆశయంతో తీర్పు ఇస్తే.. మరో ఆశయంతో పచ్చ పార్టీ దుర్మార్గానికి పాల్పడి బలవంతంగా గద్దెనెక్కింది. జిల్లాలో 53 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీకి అత్యధికంగా 30 స్థానాలను ఓటర్లు కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ 20 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 2, ఆర్పీఎస్ ఒక స్థానంలో గెలిచాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఎర చూపి తమ వైపునకు తిప్పుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అధికారుల సహకారం కూడా తీసుకున్నారు. జెడ్పీ సీఈఓ కనుసన్నల్లోనే అంతా.. జెడ్పీ సీఈఓ సూర్యప్రకాషరావు కనుసన్నల్లో శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగింది. జెడ్పీ సమావేశ మందిరంలో బారికేడ్లు కట్టడం నుంచి జెడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకారం వరకు ఆయన అంతా తానై నడిపించారు. జెడ్పీ హాల్లో వైఎస్సార్సీపీకి వేరుగా.. టీడీపీకి వేరుగా సీట్లు ఏర్పాటు చేశారు. మధ్య బ్యారికేడ్లు ఉంచారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిని దగ్గరుండి ‘పచ్చ’ పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకునే విషయంలోనూ ఈయన పాత్ర ఉందని సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేలా ప్రవర్తించటం కూడా అందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పలుమార్లు కలెక్టర్‌ను నిలదీశారు. అధికారులు చేసిన తప్పును ఎత్తిచూపారు. అధికార యంత్రాంగం చేసింది తప్పేనని అర్థం కావటంతో కలెక్టర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ నిరసన తెలియజేస్తున్నా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. పలు ప్రశ్నలకు అధికారులు నీళ్లునమిలారు. భూమా నాగిరెడ్డి పలుమార్లు జీఓ కాపీని చూపించి మాట్లాడుతుంటే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ‘మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాకు అడిగే హక్కు ఉంది. ఎమ్మెల్యేలను తాకే అధికారం పోలీసులకు లేదు. మీరు ఇలా చేయమని ఏ చట్టం చెపుతోంది’ అంటూ పలు ప్రశ్నలు సంధించటంతో కలెక్టర్, జేసీ, సీఈఓలు పక్కనే ఉన్న న్యాయనిపుణులతో మాట్లాడటం కనిపించింది. ‘ఇలా చేయొచ్చని రాత పూర్వకంగా రాసివ్వండి’ అని పలుమార్లు కలెక్టర్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్యలు నిలదీశారు. ఎమ్మెల్యేలు ఓ పక్క నిరసన తెలియజేస్తుంటే.. సీఈఓ మాత్రం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించండి అంటూ కలెక్టర్‌కు చెప్పటం కనిపించింది. పక్కా పథకం ప్రకారమే.. జెడ్పీ చైర్మన్ ఎన్నికను పక్కా పథకం ప్రకారం పూర్తి చేయించారు. అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఇలాగే కొనసాగితే పథకం తిరగబడుతుందని తెలిసి ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. ముందుగా టీడీపీ జెడ్పీటీసీలు కొందరిచేత ప్రమాణం చేయించారు. తాము న్యాయం అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా ప్రమాణం చేయటంపై భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ‘కలెక్టర్ గారూ.. కలెక్టర్ గారూ.. అంటూ గట్టిగా అరిచారు. సమాధానం రాకపోవటం, పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో ‘కలెక్టర్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ వారు ప్రమాణం చేయరని భావించి, జాబితాలో వారి పేర్లను మాత్రం టిక్ చేశారు. ఎవరు టీడీపీ, ఎవరు వైఎస్సార్సీపీ, ఎవరు పార్టీ ఫిరాయించారనే వివరాలను క్షణాల్లో కలెక్టర్‌కు ఇచ్చారు. వారిని మాత్రం పిలవబోమని సూచించారు. సీఈఓ చెప్పిన విధంగానే కలెక్టర్ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుల పేర్లు చదవుకుంటూ వెళ్లారు. వారెవ్వరూ ప్రమాణం చేయలేదని, ఎన్నిక జరక్కుండా చేస్తారని ఎమ్మెల్యేలని చూడకుండా బయటకు ఎత్తుకెళ్లారు. ముందుగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. అదే విధంగా ఆదోని, మంత్రాలయం, డోన్ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజారెడ్డిని ఎత్తుకునేందుకు ప్రయత్నించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సైతం మహిళా పోలీసులచేత ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులను బయటకు పంపేసి తలుపులు మూసివేశారు. పదినిముషాల్లో జెడ్పీ చెర్మైన్, వైస్ చైర్మన్ ఎంపికను పూర్తి చేసి హడావుడిగా వెళ్లిపోయారు. -
శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: శోభానాగిరెడ్డి తనకు భార్య మాత్రమే కాదని మంచి స్నేహితురాలు కూడా అని భూమా నాగిరెడ్డి అన్నారు. దివంగత శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... చాలా బాధతో అసెంబ్లీలో నిలుచున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా కుటుంబాన్ని ఆమె నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. అన్ని విషయాలపై తామిద్దరం మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ప్రతి విషయంపై చర్చించుకున్న తర్వాత తమ దినచర్య మొదలయ్యేదని వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆమె ఎంతో తపించేవారని తెలిపారు. తనను మించి నాయకురాలిగా ఎదిగారని ప్రశంసించారు. శోభ భర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తామిద్దం అసెంబ్లీలో ఉండి జగన్ కు అండదండగా ఉండాలని శోభ ఆలోచించారని, కానీ ఆమె మనమధ్య లేకుండా వెళ్లిపోయారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నాగిరెడ్డి ప్రార్థించారు. -
ఏడాదిలోనే చంద్రబాబుకు ఛీత్కారం
అధికారం కోసం అర్రులు చాచి, సాధ్యాసాధ్యాలను విస్మరించి వాగ్దానాలు గుప్పించిన చంద్రబాబు.. అప్పుడే ‘ఢిల్లీ దయదలిస్తేనే అన్న సన్నాయినొక్కులు నొక్కుతున్నారని వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ విమర్శించింది. ‘కొత్త ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రిగా ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేరని, ఏడాదిలోనే ప్రజల ఛీత్కారానికి గురవుతారని పేర్కొంది.67 స్థానాలతో సత్తా చాటిన పార్టీని ఇతోధికంగా పటిష్టం చేయాలని, ప్రజల తరఫున సమరం సాగించాలని పిలుపునిచ్చింది. సాక్షి, రాజమండ్రి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు పూర్తికాలం పాలించలేరని, ఏడాది తిరక్కుండానే ప్రజలు ఆయన్ను ఛీ కొడతారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నేత, నంద్యాల ఎమ్మెల్యే, జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన త్రిసభ్య కమిటీ నాయకుడు భూమా నాగిరెడ్డి అన్నారు. రాజమండ్రి జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కల్యాణ మండపంలో ఆదివారం రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, రామచంద్రపురం, మండపేట, రంపచోడవరం నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ ‘నాకు ఢిల్లీ ఇస్తేనే.. నేను మీకు చెప్పింది చేస్తా’ అంటున్న చంద్రబాబు స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేనందున అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై దుష్ట రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ‘మనం గ్రామస్థాయిలో క్యాడర్‌ను నిర్మించుకుంటున్న దశలో ఎన్నికలు వచ్చాయి. అయినా 30 ఏళ్లుగా బలమైన క్యాడర్‌తో ఉన్న పార్టీతో ధైర్యంగా పోరాడి 67 స్థానాలు దక్కించుకున్నాం. టీడీపీతో పోలిస్తే కేవలం 78 వేల ఓట్లు మాత్రమే రాష్ట్రంలో తక్కువ పోలయ్యాయి. ఇది పార్టీ సాధించిన నైతిక విజయం’ అన్నారు. చంద్రబాబుకు ఇది చివరి దశ కావడంతో అధికారం కోసం ఎంతటి వాగ్దానాలు చేయడానికైనా వెనుకాడలేదని విమర్శించారు. కార్యకర్తలు తమ పటిమను చాటే సమయం ఇదేనని, బాబు చేసిన వాగ్దానాల్లో వాస్తవికత ఎంతో, జగన్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల్లో నిజాయితీ ఎంతో ప్రజలకు చెప్పాలని కోరారు. ‘గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎత్తి చూపాలి. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. ఓటమితో నైరాశ్యం చెందకుండా పార్టీని ప్రజలతో మమేకం చేయాలి’ అని పిలుపునిచ్చారు. నియోజక వర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీకి గల అనుకూల, ప్రతికూల అంశాలపై ఆరా తీశారు. నియోజక వర్గాల్లో కమిటీ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ, ప్రతి కార్యకర్త అభిప్రాయాన్నీ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ముందు ఉంచుతామన్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో జగన్ రాజమండ్రి వచ్చి అన్ని విషయాలపై చర్చిస్తారని, ఆ సమయంలో కూడా ముఖ్య నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలు తెలపవచ్చని చెప్పారు. బూటకపు వాగ్దానాలకు తెగించిన బాబు కమిటీ సభ్యుడు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కె.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అమలు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోని చంద్రబాబు అధికారం కోసం అసాధ్యమైన వాగ్దానాలు చేశారన్నారు. పేదవాని బలహీనతలను ఓట్లుగా మలుచుకునేందుకు బూటకపు వాగ్దానాలకు తెగించారన్నారు. అయినా తన ముఖం చూసి ఓట్లు వేయరని మోడీ, పవన్ కళ్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని అధికారం సంపాదించారన్నారు. కమిటీ మరో సభ్యుడు, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భావించినా ఎన్నికల వేళ ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితులు అందరి అంచనాలను తారుమారు చేశాయన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీని పటిష్టపరుస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ, బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జీను మహేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, జగ్గంపేట, రంపచోడవరం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. పోరాటాన్ని కొనసాగిస్తాం : ఆకుల త్రిసభ్య కమిటీ సభ్యులు ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమీక్ష చేపట్టారు. అనంతరం రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలపై సమీక్ష జరిపింది. భోజన విరామం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మండపేట నియోజకవర్గంతో ప్రారంభించి, అనంతరం రామచంద్రపురం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుమారు గంట జరిగిన రాజమండ్రి రూరల్ నియోజక వర్గ సమీక్షకు కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో తరలి వచ్చిన కార్యకర్తలు స్థానిక పరిస్థితులను కమిటీకి వివరించారు. ఆకుల మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవక పోయినా అధైర్యపడకుండా ప్రజలతో మమేక మై, పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానికంగా ఉన్న లోటుపాట్లను త్వరగా అధిగమిస్తాన్నారు. అనపర్తి కార్యకర్తల ప్రమాణం అనపర్తి నియోజక వర్గ కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నాయకత్వంలో కార్యకర్లతె రానున్న రోజుల్లో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తామని ప్రమాణం చేశారు. సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో చిన్న చిన్న లోపాలు ఏర్పడినా సాధ్యమైనంతవరకూ అధిగమించే ప్రయత్నం చేశామన్నారు. ఇంకా లోటుపాట్లుంటే అధినాయకత్వం సలహా సూచనల మేరకు గుర్తించి అధిగమిస్తామన్నారు. అధికార పార్టీ తప్పిదాలను ఎత్తిచూపడంలో కార్యకర్తలను ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీని ముందుకు నడిపిస్తానన్నారు. ఎల్లప్పుడూ ప్రజలపక్షమే : జక్కంపూడి గెలుపు, ఓటటములు లెక్కచేయబోమని, తాము ఎప్పుడూ ప్రజల పక్షమేనని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇక ముందూ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు తోడు నీడగా ఉంటామన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తామని, ఏ సమయంలోనైనా అన్ని వర్గాలకూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులను త్రిసభ్య కమిటీకి వివరించారు. ఇక ముందూ జక్కంపూడి నాయకత్వంలో ముందుకు సాగుతామన్నారు. వైఫల్య కారణాలను సూక్ష్మస్థాయిలో తెలుసుకుంటాం : గిరజాల మండపేట నియోజకవర్గ సమీక్షకు కో ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామి నాయుడు నాయకత్వంలో కార్యకర్తలు తరలి వచ్చారు. కమిటీ ముందు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంది. స్థానిక పరిస్థితులను వివరించిన గిరజాల వైఫల్యాలకు కారణాలను సూక్ష్మస్థాయిలో అన్వేషించి, అధిగమిస్తామన్నారు. నియోజక వర్గ ప్రజలు నేటికీ వైఎస్సార్ సీపీని ఆదరిస్తున్నారన్నారు. జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రిపాపారాయుడు స్థానిక పరిస్థితులను వివరించారు. సమన్వయంతోనే విజయం సాధించాం : అనంత రంపచోడవరం నియోజక వర్గంలో నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడమే విజయానికి కారణమని కో ఆర్డినేటర్ ఆనంత ఉదయ భాస్కర్ వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం పార్టీ జిల్లాలో మిగిలిన చోట్ల కన్నా మెరుగైన ఫలితాలు సాధించిన విషయాన్ని కమిటీ ముందుంచారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ తన విజయానికి నేతలు, కార్యకర్తలు పూర్తిగా సహకరించారన్నారు. టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి, విజయానికి కృషి చేసిన కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌కు, ఇతర జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కలిసికట్టుగా బలోపేతం చేస్తాం : ఆదిరెడ్డి చివరగా కమిటీ రాజమండ్రి సిటీ నియోజక వర్గ సమీక్షను చేపట్టింది. సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల నేతలు, పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని నగరంలో బలోపేతం చేస్తామన్నారు. కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు తమ సూచనలను అందజేశారు. -
గెలుపోటములపై నివేదిక
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ గెలుపునకు, బనగానపల్లె నియోజకవర్గంలో ఓటమికి కారణాలను త్రిసభ్య కమిటీ సభ్యులు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి నివేదికను అందజేయాలని నిర్ణయించినట్లు నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి తెలిపారు. రాజమండ్రిలో జరిగే వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన శనివారం ఇక్కడి నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తల అభిప్రాయాలను అసెంబ్లీల వారీగా తాను తెలుసుకున్నానన్నారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఓటు వేయడం వల్ల స్వల్ప మెజార్టీతోనైనా కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించిందని కార్యకర్తలు వివరించారన్నారు. ఒక్క బనగానపల్లెలో మాత్రం స్థానిక కార్యకర్తలు వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారని, ప్రత్యర్థులు దుష్ర్పచారాన్ని ఉద్ధృతంగా చేపట్టి గెలుపొందారని కార్యకర్తలు వివరించినట్లు తెలిపారు. నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, అసెంబ్లీ నియోజకవర్గాలు కేసీ కెనాల్ పరివాహక గ్రామాలు కావడంతో ఒకే రకమైన తీర్పును ప్రజలు అందజేశారన్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్పీవెరైడ్డిపై అనర్హత వేటు పడితే మళ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉండాలని తాను కార్యకర్తలను కోరానన్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుని రికార్డ్ సృష్టించిందని భూమా అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మృతి చెందిన శోభానాగిరెడ్డికి 18వేల మెజార్టీ రావడం అరుదైన సంఘటన అని వివరించారు. -
జగన్‌తోనే ఉంటా: భూమా నాగిరెడ్డి
నంద్యాల/చాగలమర్రి, న్యూస్‌లైన్: తన రాజకీయ జీవితమంతా వైఎస్ జగన్మోహన్రెడ్డితోనేనని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, చాగలమర్రిలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రలోభాలకు లోను చేసి దుష్ట రాజకీయాలకు తెరతీశారన్నారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని.. ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానన్నారు. గిట్టని వారే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన సాగించిన అధికార పార్టీపై తమ పార్టీ పోరాడిందని, ఇకపైనా అదే పంథా కొనసాగిస్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ మారడాన్ని ప్రస్తావించగా.. వైఎస్సార్సీపీపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇంత త్వరగా పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. -
టీడీపీ, బీజేపీలదే విభజన పాపం
ఆ పార్టీలకు ప్రజలే బుద్ధిచెబుతారు శోభానాగిరెడ్డి మృతి బాధించింది ఎన్నికల ప్రచారంలో భూమా నాగిరెడ్డి నంద్యాల రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం టీడీపీ, బీజేపీలదేనని.. విభజనకు సహకరించిన ఆ రెండు పార్టీలకు సీమాంధ్ర ఓటర్లు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నంద్యాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమానాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని చాపిరేవుల, సుబ్బారెడ్డిపాలెం, పొన్నాపురం, భీమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. వైఎస్సార్సీపీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ, బీజేపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని ఆరోపించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట చెబుతూ టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని, ఆ పార్టీకి రెండు కళ్లు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కష్టనష్టాలు భరించి తనను ఓదార్చే శోభానాగిరెడ్డి మృతి బాధించిందని, జీవితంలో ఇంతటి బాధను అనుభవించిన సందర్భం లేదని భూమా అన్నారు. శోభా మృతితో తన బాధ్యతలు పెరిగాయన్నారు. తాను గెలిస్తే గ్రామాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిర్మిస్తానని, సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపడుతానని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట చాపిరేవుల నాయకులు సూర్యచంద్రారెడ్డి, పాపిరెడ్డి, యశోదర్రెడ్డి, రాజు, జీవరత్నం, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, సుబ్బారెడ్డిపాలెం నాయకులు శేషిరెడ్డి, పిచ్చిరెడ్డి, పొన్నాపురం గ్రామ నాయకులు గిరిధర్‌గౌడ్, మనోహర్‌గౌడ్, కుమారిస్వామిగౌడ్, పి.మద్దిలేటి, దుర్గాప్రసాద్, జనార్దన్, నాగేశ్వరరావు, రమణ, భీమవరం గ్రామ నాయకులు రామచంద్రారెడ్డి, శివకుమార్‌రెడ్డి, రాజారెడ్డి, బొజ్జారెడ్డి పాల్గొన్నారు. -
శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దాం
జగన్ సీఎం అయితేనే శోభమ్మ ఆత్మకు శాంతి - ఆళ్లగడ్డలో సంతాప సభ - ఉద్వేగంతో ప్రసంగించిన భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ న్యూస్‌లైన్: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దామని నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ ఘాట్‌లో సోమవారం శోభానాగిరెడ్డి సంతాపసభ వేలాది మంది కార్యకర్తల మధ్య జరిగింది. శోభా నాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి గంట ముందు ప్రకటించడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆమె చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఆత్మశాంతి కోసం అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించారు. అనంతరం సభలో భూమా ఉద్వేగంతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లదని రెండు రోజుల క్రితం తెలిసినప్పుడు నాతో పాటు అభిమానులు ఆందోళన చెందారు. ఆళ్లగడ్డను టీడీపీ ఖాతాలోకి పోనియమని వైస్ జగన్మోహన్రెడ్డికి చెప్పాను. అవసరమైతే ఇండిపెండెంట్‌కు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామనే ధీమా ఉండేది. శోభానాగిరెడ్డి మొండి మనిషి, చనిపోయిన తరువాత కూడా బరిలో నిలిచి తనకు పడే ఓట్లు చెల్లించుకునేలా చేసుకుంది. ఆమెకు ఓటు వేస్తే చెల్లదని చెప్పినపుడు బాధపడిన కార్యకర్తలు ఈసీ ప్రకటనతో ప్రస్తుతం ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని అరుదైన గుర్తింపును శోభానాగిరెడ్డికి దక్కబోతుంది. చనిపోయిన తరువాత లక్ష ఓట్ల మెజార్టీతో వచ్చేలా గిన్నిస్ రికార్డు సాధిం చడానికి కార్యకర్తలు కృషి చేయాలి. చిన్న వయస్సులో తండ్రిని పొగొట్టుకున్నాను. పెరుగుతున్న వయస్సులో ముగ్గురు అన్నలు దూరమైనారు.. కోలుకుంటున్న సమయంలో శోభమ్మను కోల్పోయాను. శోభానాగిరెడ్డి మరణంతో బరువెక్కిన మనస్సును వేలాది కుటుంబాల కోసం నిబ్బరం చేసుకుంటున్నాను. ధైర్యంగా ప్రజల కోసం కుటుంబం మొత్తం వస్తున్నాం.అందరం కలుద్దాం... జగనన్నను సీఎం చేసి.. శోభమ్మ చివరి కోరికను నెరువెరుద్దాం’ అంటూ ప్రసంగించారు. ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతా: శోభానాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని శోభమ్మ ఘాట్‌గా భూమా నాగిరెడ్డి నామకరణం చేశారు. అక్కడ ఆమె జ్ఞాపకాలను భద్రపరిచి ఇల్లు కూడా నిర్మించుకుంటానని తెలిపారు. శోభమ్మ ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాన్నారు. సమావేశంలో మిల్క్ డైయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు అన్సర్, రఘనాథరెడ్డి, నిజాం, శ్రీకాంతరెడ్డి, రాముయాదవ్, బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏమి తొందరొచ్చింది శోభమ్మా... వెళ్లిపోయావు?!
మరచిపోలేనంతగా మరదలిని ప్రేమించిన బావ అతను... బావను అపురూపంగా ఆరాధించిన మరదలు ఆమె... ఇంటికి చిన్నవాళ్లైనా, బాధ్యతల బరువుతో పిన్నవయసులోనే పెద్దరికాన్ని భుజాన వేసుకున్న భార్యాభర్తలు వారు... రాజకీయాల్లోనూ ఒకే మాటగా ఎదిగి, పార్టీలకతీతంగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమమూర్తులు వారు... శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులను రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘కలకాలం హాయిగా కలిసున్నార’న్న కమ్మని కథకు కళ్లెదుటి సాక్ష్యం వారే అనిపించారు. కానీ, ... కాలానికి కన్ను కుట్టింది. ‘ఏ జన్మ లోనూ విడిపోము... మనము’ అని పెళ్లినాట ప్రమాణం చేసుకున్న... భూమా జంటను విధి విడదీసింది. నిన్నటి దాకా జనమే జగమై ఆప్యాయంగా పలకరించిన... ఆ చీరకట్టు చిరునవ్వు మోము ‘శోభమ్మ’ ఇవాళ కనిపించని తీరాలకు తరలిపోయింది. నమ్మశక్యం కాని ఈ నిజాన్ని సహిస్తూ, భరిస్తూ... అందరి వారైన ఆ దంపతులు ఏడాది క్రితం పంచుకున్న తమ అనురాగ క్షణాలను మరోసారి ప్రచురిస్తున్నాం. వారి అనుబంధానికి ఈ కథనాన్ని అంకితమిస్తున్నాం. ‘ఏవేవో పనుల కోసం వి.ఐ.పి లెటర్ ఇవ్వమని విజిటర్స్ వస్తూ ఉంటారు. వారు తెలివిగా మాకు తెలియకుండా ఇద్దరి దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటారు. ఆ లెటర్లు ఆఫీసర్ల దగ్గరకు వెళ్లాక, వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చి ‘ఎవరిది ఓకే చేయమంటారు’ అని ఫోన్ చేస్తే ‘ఆవిడిచ్చిన లెటర్‌కే ఓకే’ చేయండని చెబుతాను’ అని భూమా నాగిరెడ్డి అంటే- ‘ఆయన ఇచ్చిన లెటర్‌కే ఓకే చే యండని నేను చెబుతాను’ అన్నారు శోభా నాగిరెడ్డి. హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో రెండేళ్ళ క్రితం కలిసినప్పుడు ఈ దంపతులు చెప్పిన ఈ ఒక్క మాట చాలు - వారి దాంపత్యజీవితం ఎంత బలమైనదో చెప్పడానికి. నాగిరెడ్డి జన్మస్థలం కొత్తపల్లె, శోభారాణి పుట్టిన ఊరు ఆళ్లగడ్డ. నాగిరెడ్డి మేనత్తే శోభారెడ్డి తల్లి. ఆ విధంగా వీరి బంధానికి బంధుత్వం బలం చేకూర్చింది. నాగిరెడ్డి మాట్లాడుతూ ‘‘చెన్నైలో హోమియోపతి చదివాను. తమ్ముడి కొడుకునని నన్ను మా మేనత్త అచ్చం తల్లిలా ఆప్యాయంగా చూసేవారు. పాఠశాల స్థాయి నుంచీ సెలవులొస్తే చాలు వీరింటికే వెళ్లేవాడిని. అలా చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో ఉన్నట్టు పెరిగాం’’ అన్నారు. శోభ అందుకుంటూ, ‘‘మా పెద్దవాళ్లకు కూడా మా పెళ్లి చేయాలనే ఆలోచ న ఉండేది’’ అని నవ్వుతూ వివరించారు. ఫ్యాక్షన్ వెర్సెస్ ప్రేమ సినిమాల్లో చూపినట్టు ప్రేమికులకు తమ ప్రేమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఓ పెద్ద పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. వీరి ప్రేమకూ ఓ పెద్ద పరీక్ష ఎదురైంది. అది ఫ్యాక్షన్. ‘‘మా రెండు కుటుంబాల బంధం బలపడటానికి నన్ను తన కోడలిని చేసుకోవాలని మామకు ఉండేది. అయితే ఫ్యాక్షన్ కారణంగానే మామ చనిపోవడంతో ఫ్యాక్షన్ అంటే ఏ మాత్రం నచ్చని మా నాన్న నన్ను వీరింటికి కోడలిగా పంపడానికి ఇష్టపడలేదు’’ అని ఆ రోజుల్ని శోభ గుర్తుచేసుకున్నారు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తుం డడంతో భయం పట్టుకున్న ఈ ప్రేమికులు 1986 మే 25న ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కొంతమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు. ‘‘మా నాన్నగారు ఏమీ అనలేదు కానీ ఏడాది పాటు మాట్లాడలేదు’’ అన్నారు శోభ. శ్రీమతి మాటలకు బ్రేక్ వేస్తూ ‘‘ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు’’ - నవ్వుతూ అన్నారు నాగిరెడ్డి. చిన్నతనంలోనే పెద్ద బాధ్యత ఫ్యాక్షన్ గొడవల్లో అన్నలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తర్వాత కుటుంబాన్నీ, వర్గాన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీద పడటం ఉక్కిరిబిక్కిరి చేసిందని ఉద్వేగంతో చెప్పారు నాగిరెడ్డి. ‘‘నేను, శోభ - ఇద్దరం కుటుంబానికి చిన్నవాళ్లమే. కానీ అనుకోకుండా పెద్దవాళ్లమై బాధ్యతలను మోయాల్సి వచ్చింది. కుటుంబంలో పూటకు యాభైకి తక్కువ కాకుండా కంచాలు లేచేవి. మా అన్నపిల్లలు మరీ పసివాళ్లు. వారినీ శోభే సాకింది. కార్యకర్తలు మా కోసం ప్రాణాలు అడ్డుపెట్టేవారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా నేను వెనుకాడేవాణ్ణి కాదు. ఇంటి నుంచి బయటకు వెళ్లానంటే మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ రోజుకు సేఫ్ అనుకునేవాళ్లం. అలాంటి విపత్కర స్థితిలోనూ శోభ బ్యాలెన్స్డ్గా ప్రవర్తించేది. బయట చికాకులెన్నో ఇంటికీ తేక తప్పేది కాదు నాకు. అన్నీ తట్టుకుంటూనే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకునేది. శోభను అర్ధాంగిగా చేసుకోవడం వల్లే, బాధ్యతలన్నీ సవ్యంగా పూర్తి చేయగలిగా’’ అంటూ శ్రీమతి తనకు దన్నుగా నిలిచిన తీరును వివరించారు నాగిరెడ్డి. ‘‘ముందు నుంచీ కుటుంబ పరిస్థితులు తెలియడం ఒక కారణమైతే, ఈయన నాకు అన్నింట్లో స్వేచ్ఛ, సపోర్ట్ ఇవ్వ డంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి’’ అని శోభ చెప్పారు. రాజకీయాల్లో సగభాగం ఉమ్మడి కుటుంబ బాధ్యతను మోస్తూ రాజకీయాల్లోకి వచ్చిన శోభ, ‘‘రాజకీయాల్లోకి రావడం మొదట నాకు ఇష్టం లేదు. పిల్లలు, వారి చదువులు, పెళ్లిళ్లు... (ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నాగిరెడ్డి అన్నల పిల్లలూ వీరితోనే కలిసి పెరిగారు) ఇలా బాధ్యతలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలు అంటే మాటలా? నేను రాలేనని చెప్పాను’’ అని అప్పటి సంగతులు వివరించారు. దానికి, నాగిరెడ్డి అందుకొని, ‘‘నేను ఎం.పీగా ఎన్నికైన తర్వాత ఎం.ఎల్.ఎ సీటు ఖాళీ అయింది. ‘ఆ స్థానంలో ఎవరిని పెట్టినా, డమ్మీగా నిలబెట్టారని ప్రజలనుకుంటారు. పార్టీ కోసం ఈ నిర్ణయం తప్పదు‘ అనడంతో కాదనలేక శోభ ఒప్పుకుంది. అప్పటికీ చాలామంది ఆమె డమ్మీ క్యాండిడేట్ అని అనుకున్నారు. కానీ బెస్ట్ క్యాండిడేట్ అని తర్వాత అందరికీ అర్థమయ్యేలా చేసింది’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో తను ఫెయిర్’’ అని శ్రీమతికి కితాబిచ్చారు నాగిరెడ్డి. ఆ మాటలకు శోభారెడ్డి స్పందిస్తూ - ‘‘రాజకీయాల్లోకి రావడానికి ముందు ప్రజలతో మాట్లాడాలన్నా, మీటింగ్లన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈయన బలవంతం మీద అవన్నీ నేర్చుకోగలిగా. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక్కదాన్నే వెళ్లగలుగుతున్నా. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం పోరాడగలుగుతున్నా. ఏది జరిగినా నా వెనక ఈయన ఉన్నారు అనే ధైర్యమే నాకు భరోసా!’’ అన్నారు. ‘‘ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోవాలి’’ అనుకున్న శోభ తన ‘‘నియోజకవర్గం కోసం మొండిగా చేసే పనులు’’ నాగిరెడ్డికీ నచ్చాయి. ‘‘వచ్చిన ప్రతీ సినిమా చూస్తాం. వీలు దొరికితే విహారయాత్రలకు వెళ్లేవాళ్లం’’ అన్న ఈ దంపతులు - కుటుంబం, రాజకీయం... ఇలా ఎన్ని బాధ్యతలున్నా తమ ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో వ్యక్తిగతంగా మిస్ అయ్యామని ఎప్పుడూ అనిపించలేదన్నారు. కానీ, ఇవాళ శోభమ్మ లేని లోటు నాగిరెడ్డికీ, ఆయన కుటుంబానికీ ఉంటుంది. ‘‘రాజకీయాల్లో శోభ బిజీ అవడంతో ఆమె చేతి వంటను మిస్ అవుతున్నా’’ అన్న నాగిరెడ్డికి ఇవాళ ఆమె ప్రేమస్మృతులే కడుపు నింపాలి. జనానికి మంచి చేయాలని తపించిన శోభ లేకపోవడం ఆమె అభిమానించే - ఆమెను అభిమానించే సామాన్య ప్రజలందరికీ లోటే! కన్నవారికీ, కట్టుకున్నవాడికీ, కోట్లాది ప్రజలకూ తీరని దుఃఖం మిగిల్చి... ఏమి తొందరొచ్చిందమ్మా వెళ్లిపోయావు శోభమ్మా! -
కోడ్ ఉపసంహరణ
ఎన్నికల సంఘం ప్రకటన నేటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు యథాతథం మున్నార్ నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇకమీదట యధావిధిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఈ నెల 17న ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగే మే 16 వరకు నియమావళి అమలులోనే ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషన్, అధికారులతో మంత్రులు సమీక్షలు, సమావేశాలు జరుపుకోవచ్చని, జిల్లా పర్యటనలూ చేపట్టవచ్చని సూచిస్తూ నియమావళిని పాక్షికంగా సడలించింది. తాగు నీటి ఎద్దడి తదితర అత్యవసర సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించింది. అయితే సిబ్బంది బదిలీలు లాంటి వ్యవహారాలకు సంబంధించి ముందుగా ఎన్నికల కమిషన్ అనుమతిని తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులతో మంత్రులు సమావేశాలు నిర్వహించకూడదని షరతు విధించింది. ఎన్నికలు ముగిసి, ఈవీఎంలు స్ట్రాంగ్ రూములలో భద్రంగా ఉన్న నేపథ్యంలో నియమావళి కొనసాగింపు హేతుబద్ధంగా లేదని భావించిన ఎన్నికల కమిషన్, గురువారం నుంచి పూర్తిగా సడలించింది. దరిమిలా శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా సాగనున్నాయి. విశ్రాంతి కోసం కేరళలోని మున్నార్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరిగి వచ్చేశారు. -
స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి
హైదరాబాద: వైఎస్ఆర్ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే ఆమె భర్త భూమా నాగిరెడ్డి కేర్ ఆస్పత్రిలో స్పృహ కోల్పోయారు. వైద్య సిబ్బంది సపర్యలు చేయడంతో ఆయన కోలుకున్నారు. తన భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోక విషాదంలో మునిగిపోయారు. ఇక భూమా దంపతుల ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తల్లి మృతదేహాన్ని చూసి వారు భోరున విలపించారు. తమ తల్లి మరణాన్ని తట్టుకోలేక శోక సంద్రంలో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భూమా శోభానాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బాబు..అవకాశవాది
టీడీపీని ఓడించండి...శిల్పాను నిలదీయండి వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి: భూమా నాగిరెడ్డి నంద్యాల, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు అవకాశవాదని వైఎస్సార్సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి భూమానాగిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. నంద్యాల పట్టణంలోని పీవీనగర్, దళితవాడల్లో శుక్రవారం భూమా నాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విజ్ఞతతో ఓటు వేసి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. టీడీపీకి చెందిన నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని భావిస్తున్నారని భూమా ఆరోపించారు. శిల్పా మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చినప్పుడు .. గత పదేళ్లలో ఏమి చేశావంటూ నిలదీయాలన్నారు. మూడేళ్ల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి అభిమానాన్ని చాటుకోవడానికి పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ఎన్ని కుటుంబ ఇబ్బందులున్నా వదలుకోకూడదన్నారు. తెలుగుదేశం పార్టీని కోమాలోకి పంపితే మరో ఐదేళ్లు జనజీవన స్రవంతిలో ఆ పార్టీ అగుపించదన్నారు. భారత దేశంలో ఏకైక నియంతగా చలామణి అవుతున్న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని ఢీకొన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి తిరుగులేని మెజార్టీని ఇవ్వాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులతో బీజేపీ కుదేలవుతున్నదని ఆరోపించారు. బాబు నిరంతరం తన స్వార్థం కోసం రాజకీయాలు చేస్తారని మరోసారి రుజువు చేశారన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక అమలు సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యంగా ఉందని ప్రజలు నమ్ముతున్నారని భూమా అన్నారు. తనను, ఎంపీ ఎస్పీవెరైడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. ఐదేళ్లు సేవలు చేస్తామని భూమా హామీ ఇచ్చారు. -
పేదల కష్టాలు తీరుస్తా..
నేనేం చేస్తానంటే.. వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డితో న్యూస్‌లైన్ ముఖాముఖి అమలయ్యే హామీలే ఇచ్చాం పదేళ్ల పాలనలో శిల్పా చేసిందేమీ లేదు వైఎస్సార్ పుణ్యంతో నంద్యాలకు నిధులు న్యూస్‌లైన్ : మీ విజయానికి కలిసొచ్చే అంశాలు ఏమిటి? భూమా: మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన ఎన్నికల ప్రణాళిక. అలాగే నేను నంద్యాల ప్రజలకు ఇచ్చిన పది వేల ఇళ్ల నిర్మాణ హామీ. వీటితోపాటు పట్టణంలో ముస్లింలు వైఎస్సార్సీపీపై మొగ్గు చూపుతున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో టీడీపీకి వారు దూరమయ్యారు. నేను, ఎంపీ ఎస్పీవెరైడ్డి సమన్వయంతో పని చేయడం కలిసొచ్చే ప్రధాన అంశంగా భావిస్తున్నాం. పార్టీలోకి ప్రత్యర్థులను ఆహ్వానిస్తున్నాం. నంద్యాల, న్యూస్‌లైన్:భూమా నాగిరెడ్డి... నంద్యాలవాసులకు పరిచయం అక్కరలేని పేరు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈయన మూడు సార్లు వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’తో ముఖాముఖి మాట్లాడారు. పలు అంశాలను వివరించారు. తాను గెలిస్తే పేదల కష్టాలు తీరుస్తానని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానన్నారు. మహిళల కోసం ప్రభుత్వసాయంతో చిన్నతరహా పరిశ్రమలు నిర్మిస్తానన్నారు. గూడు లేని పేదలకు అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. న్యూస్‌లైన్: గతంలో మీరు ఎన్నో ఎన్నికలు చూశారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి? భూమా: ఎన్నికలు అంటే భయపడని వ్యక్తిని నేను. ప్రధానమంత్రి అభ్యర్థి పీవీ నరసింహారావుతో పోటీ పడ్డాను. నమ్మకమైన నాయకున్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ప్రస్తుతం ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయి. అలుపెరగని పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. మా పార్టీకే ఈ ఎన్నికల్లో ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. న్యూస్‌లైన్: నంద్యాలలో పరిస్థితి ఏవిధంగా ఉంది? భూమా: నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని శిల్పామోహన్‌రెడ్డిని ఇక్కడి ప్రజలు రెండు సార్లు గెలిపించారు. ఆయన చేసింది ఏమీ లేదు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భారీ నిధులు మంజూరు చేశారు. దాదాపు రూ.300కోట్లు మంజూరు చేస్తే ఏ ఒక్క పనిని కూడా పూర్తి చేయలేకపోయారు. నంద్యాలను వరద నుంచి విముక్తి కల్పించడానికి రూ.100కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజికి మరో రూ.75కోట్లు మంజూరు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. శిల్పాను నంద్యాల ప్రజలు క్షమించరు. న్యూస్‌లైన్: ఈ పనులను మీరు పూర్తి చేయాలని అనుకుంటున్నారా.? భూమా: కచ్చితంగా పూర్తి చేస్తాను. నంద్యాల ప్రజల మనోగతానికి అనుగుణంగా నిధులను మంజూరు చేయించుకొని పనులను చేపడుతాం. ఆగిపోయిన వరద పనులను పూర్తి చేస్తాం. అండర్‌గ్రౌండ్(యూడీజీ) పనులకు సంబంధించి కొన్ని మార్పులు ఉండవచ్చు. పట్టణంలోని మురుగు నీటిని కుందూకు చేర్చి అక్కడ శుద్ధి నీటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తాం. న్యూస్‌లైన్: ప్రచారం ఎలా చేస్తున్నారు? భూమా: నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులోనూ సైనికుల్లాంటి కార్యకర్తలను ఎంపిక చేసుకోగలిగాం. అలాగే గ్రామాల్లోనే పటిష్టమైన క్యాడర్ ఉంది. నేను నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. వాటిలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. పార్టీని, నన్ను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల గెలుపునకు కృషి చేశా. ఆ తర్వాత నా కోసం, ఎంపీ ఎస్పీవెరైడ్డి కోసం ఓటు అడుగుతున్నా. న్యూస్‌లైన్: నంద్యాలలో ప్రధాన సమస్యలు గుర్తించారా? భూమా: ఎందుకు గుర్తించలేదు. ముస్లింలతో పాటు ఎంతో మంది పేదలు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో నివసిస్తున్నారు. లేస్తే కూర్చొలేరు. కూర్చుంటే లేయలేని పరిస్థితి ఉంది. అంతేగాక పందులతో తీవ్రంగా సతమతమయ్యేవారు. వాటిని పట్టణ శివార్లకు తొలగించాను. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఖాళీ స్థలాల్లో కంప, మురికి కుంటలున్నాయి. ఇప్పటికే ఖాళీ స్థలాల్లో కంపను తొలగించాను. అధికారంలోకి వస్తే మురికి కుంటలను తొలగిస్తాం. న్యూస్‌లైన్: ప్రజల నుంచి మీరేమీ కోరుతున్నారు? భూమా: మభ్యపెట్టే మాటలతో పదేళ్లు మోసపోయారు. ఇంకా మోసపోకూడదని వారిని కోరుతున్నా. వచ్చే నెల 7వ తేదీన నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క ఓటరు వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీని ఇవ్వమని కోరుతున్నా. -
ప్రలోభాలకు లొంగొద్దు
ప్రలోభాలకు లొంగొద్దు నంద్యాల, న్యూస్‌లైన్: ప్రలోభాలకు లొంగొద్దని ఓటర్లకు వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని పద్మావతినగర్‌లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యాలయానికి వైఎస్సార్సీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. నంద్యాల పట్టణాన్ని పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసి మభ్యపెట్టే పథకాలతో వస్తున్న శిల్పా మోహన్ రెడ్డికి ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లును కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని తెలిపారు. తాను 24 గంటలు అభ్యర్థులకు అందుబాటులో ఉంటానని, ఏ క్షణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో గాని, నాయకులతో గాని సంబంధాలు కొనసాగించరాదన్నారు. టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, తన అనుయాయుల చేత రెచ్చగొట్టే పనులు చేయిస్తున్నారని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా 33వ వార్డుతో పాటు మరికొన్ని వార్డులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఏవీఆర్ ప్రసాద్, రాజగోపాల్‌రెడ్డి, లాయర్ మాధవరెడ్డి, గోపీనాథరెడ్డి, డాక్టర్ బాబన్, జయసింహారెడ్డితో పాటు 42వార్డులలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు పాల్గొన్నారు. వైఎస్సార్‌నగర్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తాం..: ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ప్రభుత్వ సహకారంతో పేదలకు అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లను నిర్మించి తీరుతామని వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 38వ వార్డుకు చెందిన కార్యకర్తలతో, నాయకులతో భూమా సమావేశాన్ని నిర్వహించారు. ఎంతో మంది పేదలు ఇళ్లు లేక వైఎస్సార్‌నగర్‌లో అద్దెలకు ఉంటున్నారని వారందరికీ అపార్ట్మెంట్ తరహాలో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామని భూమా హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాకా శివశంకర్యాదవ్ను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. -
కిరణ్, బాబు ముఖం ఎందుకు చాటేస్తున్నారు?
బీఏసీకి డుమ్మాపై శోభానాగిరెడ్డి సూటిప్రశ్న సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ బీఏసీ సమావేశానికి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందా?, లేదా? అనేదానికి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులుతో కలిసి ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘‘బిల్లుపై ఓటింగ్ విషయమై శాసనసభలో అడిగితే బీఏసీలో చెప్పాం కదా అని స్పీకర్ అంటారు. ఇదే విషయమై బీఏసీలో అడిగితే జవాబుండదు. గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం నుంచి వాయిదా తీర్మానం ఇస్తే చేస్తామంటారు. అయితే ప్రభుత్వం తీర్మానం ఇస్తుందా? లేదా? అనేది తనకు సమాచారం లేదంటారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో సీఎం చెప్పరు. బీఏసీ సమావేశానికి ముఖం చాటేసి మోసపూరిత విధానాన్ని అవలంబిస్తున్నారు. చంద్రబాబు కూడా బీఏసీ సమావేశానికి ముఖం చాటేసి పార్టీకి చెందిన ఇరు ప్రాంత నేతలను పంపి రెండు వాదనలు వినిపిస్తున్నారు’’ అని మండిపడ్డారు. రెండు పార్టీలూ రెండు రకాల అభిప్రాయాలు చెబుతూ... సిగ్గులేకుండా తమను విమర్శిస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు: విభజన బిల్లుపై తమ పార్టీ చర్చకు వ్యతిరేకం కాదని, అయితే దానిపై ముందు ఓటింగ్ నిర్వహించాకే చేపట్టాలని మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నామని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు మీడియాపాయింట్లో వేర్వేరుగా మాట్లాడారు. బిల్లుపై కాంగ్రెస్ ఆలోచనలకనుగుణంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. సీఎం కిరణ్ పదవి కాపాడుకునేందుకు నాటకాలాడుతున్నారన్నారు. చర్చలో టీడీపీ తీరుచూస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా బాబు వైఖరేంటో వెల్లడించాక మాట్లాడాలని డిమాండ్ చేశారు. . -
ఫలించిన భూమా వ్యూహం
నంద్యాల, న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో రోజు రోజుకూ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏళ్ల తరబడి టీడీపీ, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసినా పట్టించుకునే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు, గ్రామీణులు వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం నాయకులు, కార్యకర్తలను తన వైపునకు తిప్పుకోవాలనుకున్న ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డికి రాజకీయంగా పెద్ద షాక్ తగిలింది. రాజకీయంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి నాయకులకు పెద్ద పీట వేస్తూ, అసంతృప్తి వర్గాన్ని అవమాన పరుస్తూ ముందుకు సాగారు. అలాంటి వారికి భూమా అండగా నిలిచారు. గ్రామంలో ప్రత్యర్థుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుంటానని హామీనిచ్చారు. దీంతో గ్రామ నాయకులు నాయకులు శివకుమార్‌రెడ్డి, బొజ్జారెడ్డి, పుల్లారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, సర్పంచ్ సూర్యనారాయణ, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, జీవరత్నం తదితరులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఎంపీ ఎస్పీవెరైడ్డిని, భూమానాగిరెడ్డిని గ్రామానికి ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. ఐదు దశాబ్ధాల నుంచి గ్రామంలో ఒకే వర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకుల కనుసన్నల్లో పోలింగ్ జరిగేది. అధికార పార్టీకి అండగా ఉంటూ గ్రామంలో ఇతరులను ఎదగనివ్వకుండా చేస్తుండటంతోనే వైఎస్సార్సీపీలో చేరుతున్నామని శివకుమార్‌రెడ్డి, బొజ్జారెడ్డి తదితరులు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భూమానాగిరెడ్డి, ఎస్పీవెరైడ్డికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఇప్పటి వరకు గ్రామంలో మెజార్టీ వస్తుందని ఆశపడిన శిల్పాకు ఇది పెద్ద దెబ్బ. గ్రామంలో 1600ఓట్లు ఉంటే 1500 ఓట్లు పోలవుతాయి. అందులో 100 నుంచి 200 మధ్యన ఇతర పార్టీల అభ్యర్థులకు పోలయ్యేలా గ్రామ కాంగ్రెస్ నాయకులు వ్యూహం రూపొందించుకున్నారు. వెయ్యి నుంచి 1200మధ్యన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేసేవారు. అయితే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లు ఈ సారి వైఎస్సార్సీపీకి పోలవుతాయని గ్రామ నాయకులు బాహటంగానే పేర్కొంటున్నారు. గ్రామంలో ఏళ్లతరబడి ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు కూలీలు ఎమ్మెల్యే శిల్పాపై ఆగ్రహంతో ఉన్నారు. -
బీసీలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీ జనాభా దృష్ట్యా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఖరారు చేశారు. అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. జిల్లా చరిత్రలో ఓ పార్టీ బీసీ మహిళకు కర్నూలు పార్లమెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. చారిత్రక నిర్ణయానికి వైఎస్ఆర్సీపీ బీజం వేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలతో పాటు బీసీ కులస్తులు, రాజకీయ పరిశీలకులు హర్షిస్తున్నారు. పత్తికొండ నివాసి అయిన బుట్టా నీలకంఠం సతీమణి రేణుక ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం వీరు వ్యాపార నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. కర్నూలు పార్లమెంట్‌లోని ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో చేనేత సామాజిక వర్గీయులు అత్యధికంగా ఉన్నారు. అదేవిధంగా బీసీ జనాభాను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డి పేరును ఖరారు చేయడంతో విమర్శకుల నోళ్లు మూతపడినట్లయింది. ప్రస్తుతం పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా కూడా పని చేస్తున్న భూమా.. గతంలో నంద్యాల ఎంపీగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్రను సొంతం చేసుకున్నారు. తాజాగా నంద్యాలలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరు సాగిస్తూ దూసుకుపోతున్నారు. చెత్తపై సమరం.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బాక్స్ ఏర్పాటు.. కాల్ యువర్ భూమా తదితర కార్యక్రమాలతో జనానికి చేరువవుతున్నారు. అధ్యక్షుడి స్ఫూర్తితో నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ.. కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం పట్ల ప్రజలు కూడా అదే స్థాయిలో ఆకర్షితులవుతుండటం విశేషం. -
వైఎస్ కుటుంబానికి దూరం చేసేందుకు కుట్ర
నంద్యాల, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, తమకూ మధ్య దూరం పెంచేం దుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని వైఎస్సార్సీపీ నేత భూమానాగిరెడ్డి అన్నారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి ’ దినపత్రికలో తమకు వ్యతిరేకంగా ప్రచురితమైన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళ వా రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ కథనంలో ఏమాత్రం వాస్తవమున్నా తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమన్నారు. లేని పక్షంలో రాధాకృష్ణ తన పేపర్, చానల్‌ను మూసుకునేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ నెల 22న ఆ పత్రిక కార్యాలయంలో రాధాకృష్ణను కలుస్తానని, అసత్య కథనంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. వైస్సార్సీపీ తరపున నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకు.. ఎంపీ టికెట్ ఎస్పీవై రెడ్డికి ఖరారైన విషయాన్ని రాధాకృష్ణ తెలుసుకుంటే మంచిదన్నారు. నంద్యాలలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ లో చేరుతుండడంతో ముందుగానే మాట ఇచ్చా నని, అలాగే ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్థాని కంగా రచ్చబండలో పాల్గొనాల్సి ఉండడంతో తాము పార్టీ సమావేశానికి వెళ్లలేక పోయామన్నారు. -
సీమ పౌరుషం ఢిల్లీలో తాకట్టు: భూమా
నంద్యాల: కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీమ పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన విషయంలో సీఎం కిరణ్, చంద్రబాబుల సంయుక్త డ్రామాలు ప్రజల్లో రక్తి కట్టడం లేదన్నారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆ రెండు పార్టీల నాయకుల నోట్లో ప్యాకేజీల విషయం తప్ప మరొకటి రావడం లేదని విమర్శించారు. రాష్ట్రం ఏమైపోతున్నా పట్టించుకోని చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ పడిపోకుండా కాపాడుకోవటమే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఫోబియా పట్టుకుందని.. అందువల్లే ఆయనపై పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం కిరణ్ విభజనకు అనుకూలమని దిగ్విజయ్‌సింగ్ స్వయంగా ప్రకటించినా.. ఆయన మాత్రం తాను సమైక్యవాదినని ప్రకటించుకోవడంలో అర్థం లేదన్నారు. సమావేశంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు. -
జాతీయ రహదారుల దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్భందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నాయకులు సిద్ధమవుతున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, డోన్, కర్నూలు పరిధిలోని జాతీయ రహదారులతో పాటు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లోని రహదారులను సైతం స్తంభింపజేయాలని స్థానిక నేతలు నిర్ణయించారు. ఇందుకోసం రెండు రోజులుగా కార్యకర్తలతో విసృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలతో సోమవారం సంప్రదించారు. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ రహదారులను దిగ్భందించాలని సూచించారు. బుధవారం ఉదయం నుంచి 48 గంటల పాటు ఈ దిగ్బంధాన్ని కొనసాగించాలని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఏపీఎన్జీఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, వ్యాపారులు, రైతులు కలసి రావాలని కోరారు. అదేవిధంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదని.. రైతులు కూడా పంట దిగుబడుల విక్రయాలను మంగళవారం ముగించుకోవడం, లేదా శుక్రవారానికి వాయిదా వేసుకుని ఉద్యమానికి ఊతమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు రహదారుల దిగ్బంధానికి సిద్ధమయ్యారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి నగరంలో వార్డుల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపైన ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను స్తంభింపజేయనున్నారు. అదే విధంగా డోన్ పరిధిలో బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, పాణ్యం గౌరు చరిత, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోనిలో సాయిప్రసాద్‌రెడ్డి, పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఆత్మకూరు పరిధిలో బుడ్డా రాజశేఖరరెడ్డి, బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఆలూరు పరిధిలో గుమ్మనూరు జయరాం, నందికొట్కూరు పరిధిలో ఐజయ్య, బండిజయరాజ్, శివానందరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్భందించనున్నారు. -
సమైక్య శంఖారావాన్ని ఆపలేరు భూమా నాగిరెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభను ఎవరూ ఆపలేరని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. నంద్యాలలోని పద్మావతినగర్‌లో పది రోజు లుగా కొనసాగుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలే దీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ సభకు భారీ ఎత్తున జనం తరలి వస్తారని పోలీస్ నిఘా నివేదికల ద్వారా తెలుసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుమ్మక్కై అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా సభను నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు హామీ ఇస్తున్నా అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పొంతలేని కారణాలతో సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వం పునరాలోచించి 19వ తేదీ సమైక్య శంఖారావానికి అనుమతి ఇవ్వాలన్నారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేసి సదస్సును నిర్వహించి తీరుతామన్నారు. తెలంగాణలోనే సమైక్య వాదులు అధికంగా ఉన్నారని, ఇందుకు బెయిల్‌పై విడుదలైన జననేతకు అక్కడి ప్రజలు నీరాజనం పలకడమే నిదర్శనమన్నారు. జగన్ పేరు వింటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. సమైక్య వాదినని చెప్పుకునే ఆయన సమైక్య శంఖారావం సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బాబు.. రాష్ట్రం కోసం పోరాడు తెలుగు దేశం పార్టీ అధినేత కుట్రలతో రాజకీయాలు మాని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి ఆయన ఇంత వరకు సమైక్యం గురించి ఎందుకు మాట్లాడలేదని భూమా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి తమ మేధస్సును ఉపయోగిస్తారని చెప్పుకునే ఆయన పార్టీని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కోట్ల రూపాయలు కుమ్మరించి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఢిల్లీలో దీక్ష చేపట్టారన్నారు. ఎలాంటి ప్రకటన చేయకుండా తన పరువు తానే తీసుకున్నాడని చెప్పారు. 65 ఏళ్ల వయస్సులో షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఎలా దీక్షను చేశారో అందరికీ అర్థమవుతున్నదన్నారు. అనంతరం దీక్షలో కూర్చొన్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. -
సమైక్య లక్ష్యం..సడలని సంకల్పం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని రగిలిస్తున్నారు. అలాగే ఉద్యమ ఆవశ్యకతపై చైతన్యవంతం చేస్తూ నియోజకవర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో పార్టీ నాయకుడు బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో మందలూరు గ్రామానికి చెందిన రైతులు సమైక్యవాణి వినిపించారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మండల కన్వీనర్ చిన్నవీరన్న ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఆత్మకూరులో ఏరువా రామచంద్రారెడ్డి, డోన్‌లో ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో నల్లమేకలపల్లె వాసులు కూర్చున్నారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్లలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు ఆపబోమని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కౌతాళం మండలం కంబళనూరు క్యాంప్‌నకు చెందిన కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు. అలాగే నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. శాతనకోట గ్రామానికి చెందిన 30 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్ని సమైక్య నినాదాలు చేశారు. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. -
జగన్‌కు మద్దతుగా కర్నూలు జిల్లాలో దీక్షలు
కర్నూలు: వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. డోన్‌లో బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్యాంధ్ర పోరు పాదయాత్ర 2వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె జిల్లావ్యాప్తంగా జరుగుతోంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో శ్రీశైలంలో కుడిగట్టులో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. -
పత్తికొండలో రాజీవ్ యువకిరణాల శిక్షణ కేంద్రంపై దాడి
నంద్యాల పట్టణంలో టీ నోట్‌కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పత్తికొండలోని రాజీవ్ యువకిరణాలు శిక్షణ కేంద్రంపై సమైక్యవాదులు దాడి చేశారు. దాంతో కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. సమైక్య ఉద్యమంలో భాగంగా కోడుమూరులోని ఉపాధ్యాయ జేఏసీ నాయకుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆగ్రహించిన ఉద్యోగులు, సమైక్యవాదులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు.రాష్ట్ర విభజనను నిరసిస్తూ శ్రీశైలం దేవస్థానం ఉద్యోగస్థులు శనివారం శ్రీశైలంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు నగరంలోని జిల్లా వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగస్థులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. -
సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలి
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మల్లా ఉండకుండా పార్టీలకు, పదవులకు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి గురువారం కర్నూలులో డిమాండ్ చేశారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుట్రపూరితంగా వ్యవహారించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని ఆయన ఆరోపించారు. తెలుగుగంగా, కేసీ కెనాల్, ఎస్పార్బీసీలకు నీరు ఎలా ఇస్తారో చెప్పకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కర్నూలులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
చంద్రబాబును ప్రజలు క్షమించరు: భూమా
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25 నుంచి నిర్వహించే బస్సు యాత్రకు ముందు తాను ఏ ప్రాంతానికి అనుకూలమో చంద్రబాబు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణనో, సీమాంధ్రనో తేల్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు యాత్రను అడ్డుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులు, మేధావులతోను సంప్రదింపులు జరుపుతున్నానని బాబు ప్రకటించారని, అయితే లేఖ ఇచ్చే ముందు ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. సమస్య నుంచి తప్పించుకోవడానికే మేధావుల సదస్సులు, బస్సు యాత్రలు చేస్తున్నారని భూమా ఆరోపించారు. -
హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి:భూమా నాగిరెడ్డి
కర్నూలు: రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పెట్టి చూస్తే..ఎక్కువ మంది దేనికి మద్దతు ఇస్తున్నారో తేలిపోతుందని వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. రాజకీయ నేతల తీరుపై మండిపడ్డ భూమన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన జరిగిందని ఒకసారి, జరగలేదని మరొకసారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర రాజకీయ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారి ఓటింగ్ పెడితే ప్రజలు సమైక్యాంధ్రాకే మద్దతిస్తారని తెలిపారు. సమైక్యాంధ్ర మద్దతుగా ఉద్యమం మరింత ఊపందుకుంది. రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ఆందోళన కారులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
రాష్ట్ర విభజనతో చంద్రబాబు కల నెరవేరింది:భూమా నాగిరెడ్డి
-
'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'
కర్నూలు: పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర నేతల ఇళ్లను ముట్టడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి....సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక రాజధాని అడగటం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా అందరూ సిద్ధపడాలని భూమా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఇప్పుడు ధర్నాలు చేయటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. ఎమ్మినూరులో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. -
సమైక్యాంద్రకోరుతూ భూమా నాగిరెడ్డి దీక్ష
-
మొద్దు ప్రభుత్వాన్ని మేల్కొలుపుదాం
నంద్యాల, న్యూస్‌లైన్: రాజకీయాలకు అతీతంగా రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సాగునీటి విషయంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయమై సోమవారం నంద్యాలలోని మున్సిపల్ టౌన్ హాల్లో నేడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ పోరాటం సాగిస్తున్నట్లు చెప్పారు. తన దీక్ష ఒక్క నంద్యాలకే పరిమితం కాదని.. తుంగభద్ర, కృష్ణా జలాలపై ఆధారపడిన ఏ ఒక్క అన్నదాత నష్టపోకూడదన్నదే ధ్యేయమన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే లక్షలాది ఎకరాల భవితవ్యం ఆధారపడి ఉందని.. తెలంగాణ ప్రకటనతో ఆ ప్రాంతాన్ని దాటుకుని నీరు పారాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాలో లక్షలాది రైతుల భవిష్యత్తు అంధకారం కానుందన్నారు. సాగునీటి సమస్యలతో ఈ ప్రాంతం బీడువారే ప్రమాదం ఉన్నా.. ఇక్కడి నాయకులు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల బాగోగులు పట్టవని.. ఎంతసేపు వారు సీట్లను కాపాడుకునేందుకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. వరుణుడు కరుణిస్తే సరేసరి.. లేకపోతే రైతులు ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. అన్నదాతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని.. సాగునీటి విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు పోరాటం సాగిస్తానన్నారు. పంటలపై ఆధారపడే ఎన్నో మిల్లుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందన్నారు. సాగునీటి ఇబ్బందులు తలెత్తితే వీటితో పాటు కార్మికులు కూడా వీధినపడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కూలీలు సైతం ఉపాధి కోల్పోతారన్నారు. ఇప్పటికే వరుస కరువుతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వం నిలువరించలేకపోతోందన్నారు. అలాంటిది సాగునీరు అందకపోతే ఇక అన్నదాతలు ఎలా జీవితంచగలరో నేతలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. విభజన కారణంగా సాగునీటితో పాటు తాగునీటి సమస్యతోనూ ఎన్నో గ్రామాలు విలవిల్లాడాల్సి వస్తుందన్నారు. కర్నూలు పట్టణానికి సుంకేసుల, నంద్యాల పట్టణానికి వెలుగోడు రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా అవుతోందని.. అలాగే తెలుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టుల ద్వారా వందలాది చెరువులను నింపుకోవడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుతోందన్నారు. తెలంగాణతో నీరందకపోతే తాగునీటి కోసం ప్రజలు అల్లాడాల్సిందేనన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు అధిక పరిణామంలో నీటి విడుదల చేయడం సమంజసం కాదన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఇదే విషయమై రాజీనామా అస్త్రాన్ని సంధించి నంద్యాల పార్లమెంట్‌కు నీటి విడుదలను చేయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఇన్‌ఫ్లో కంటే ఔట్‌ఫ్లో అధికంగా ఉంటున్నా నాయకులు నోరు మెదపకపోవడంలో అర్థం లేదన్నారు. దీక్షలో భాగంగా పట్టణంలోని నూనెపల్లె మార్కెట్‌యార్డు నుంచి ప్రభుత్వాసుపత్రి, తహశీల్దార్ కార్యాలయం, టెక్కె మార్కెట్‌యార్డు, శోభా సెంటర్ మీదుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలోని మున్సిపల్ టౌన్‌హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని భూమా వెల్లడించారు. -
బాబు లేఖతోనే తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది : భూమా
-
నంద్యాల ఎన్నికల పరిశీలకుడిగా భూమా నాగిరెడ్డి