ప్రజల ఆకాంక్షను విస్మరించి తమ స్వార్థం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం.....
టీడీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు
పీలేరు: ప్రజల ఆకాంక్షను విస్మరించి తమ స్వార్థం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి చిత్రాపటాలను మంగళవారం చిత్తూరు జిల్లా పీలేరులో దహనం చేశారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో టీడీపీ దుకాణం మూతపడడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక్కడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కోట్లు, పదవులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన బాబుకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి జిల్లా కార్యదర్శి పూల కుమార్, ఎం. నరేష్, శ్రీనాథ్, ఉదయ్, సాయికుమార్, ఆజాద్, సాదిక్, అస్లాం, మస్తాన్, గణేష్ పాల్గొన్నారు.