క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అక్రమంగాపెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు అయిన నంద్యాల ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. మూడు రోజులుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం వైద్యులు పరీక్షించారు. 1999లో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న భూమా నాగిరెడ్డికి కార్డియాక్ ఎంజైమ్స్ పెరుగుతున్నందున ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.
దీంతో పాటు షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు ఆయనను ఉన్నతస్థాయి సౌకర్యాలున్న వైద్యశాలకు తరలించాలని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తాను రెగ్యులర్‌గా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స చేయించుకుంటున్నానని, తనను అక్కడికి పంపించాలని భూమా నాగిరెడ్డి కోరినట్లు సమాచారం.